Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలు. ఇవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. 

విస్తీర్ణం: 12251 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 241445. (పాడేరు నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గం భగత, తరువాత కొండదొర సామాజిక వర్గం గుర్తింపు పొందింది. మూడవ స్థానంలో వాల్మీకిలు, తరువాత స్థానంలో ఆదివాసీ (పీవీటీజీ)లున్నారు). 

భౌగోళిక పరిస్థితులు: జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాలు ఒడిశా సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు, గెడ్డలపై వంతెనల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. సెల్‌ టవర్ల నిర్మాణంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థ మెరుగుపడుతోంది. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య, ఉద్యాన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పాడేరు
జిల్లా విశాఖపట్నం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 241,445
పురుషులు 117,530
మహిళలు 123,909
గత ఎన్నికల ఫలితాలు
Advertisement