ఆంధ్ర ప్రదేశ్ » మన్యం » పార్వతీపురం

Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: పార్వతీపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. 2007–08 పునర్వ్యవస్తీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలుగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. మున్సిపాలిటీగా పార్వతీపురం కలదు.  గ్రామాలు-219, పంచాయతీలు-89, రెవెన్యూ గ్రామాలు-129 కలవు. 

విస్తీర్ణం: 629.24 (చదరపు కిలోమీటర్లు)

ఓటర్లు: మొత్తం ఓట్లు 193314. (పోలింగ్‌ కేంద్రాలు 233 కలవు. నియోజకవర్గంలో ప్రధానంగా కొప్పులవెలమ, ఎస్సీ కులం ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నియోజకవర్గంలో 60శాతం వరకు కొప్పుల వెలమ కులస్తులే ఉంటారు.)

భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గంలో వరి, చెరకు , మొక్కజొన్న, బొప్పాయి పంటలు అధికంగా కలవు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ సాగునీటి వసతిగా ఉపయోగపడుతుంది. పార్వతీపురం నియోజకవర్గానికి పార్వతీపురం పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఒడిశా రాష్ట్రం ఆనుకొని ఉంది. పంటలపైనే రైతులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పార్వతీపురం
జిల్లా మన్యం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 193,314
పురుషులు 94,236
మహిళలు 99,039
గత ఎన్నికల ఫలితాలు
Advertisement