Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ప్రకతి అందాల నడుమ ఎంతో రమణీయమైనది పోలవరం నియోజకవర్గం. తన సహజ సౌందర్యాన్ని కాపాడుకుంటూ పాపికొండల్లోనే ప్రాణం పోసుకునే ఈ నియోజకవర్గం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టి. నరసాపురం, కొయ్యలగూడెం మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తరవాత ఖమ్మం జిల్లాలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడుతో పాటు భూరుగంపాడులోని నాలుగు పంచాయతీలు కలిశాయి. దీనితో నియోజకవర్గం మొత్తం ఏడు మండలాలు అయ్యాయి.

విస్తీర్ణం: 28.36 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 252657.

భౌగోళిక పరిస్థితులు: పోలవరంలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి -1655 హెక్టార్లు. వరి, మొక్కజొన్న, మినుము ఇక్కడి ప్రధాన పంటలు. ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం. పాపి కొండల శ్రేణికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పోలవరం
జిల్లా పశ్చిమ గోదావరి
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 252,657
పురుషులు 122,262
మహిళలు 130,384
గత ఎన్నికల ఫలితాలు
Advertisement