Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: నియోజకవర్గం 1969లో ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రాజశేఖరెడ్డి హయాంలో కాంగ్రెస్సు పార్టీ విజయం సాదించంది. ఆతరువాత వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాలు కలవు.

విస్తీర్ణం: 61665.41 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 205530. (నియెజకవర్గంలో కాపు, కమ్మ, రాజు అగ్రకులాలుగాఉన్నారు. కొప్పలవెలమ, గౌడ, యాదవులు, తూర్పుకాపు బీసీలలో అధికశాతం మంది ఉన్నారు.)

 

భౌగోళిక పరిస్థితులు: జిల్లాలు పున:ర్విభజనలో  ఉంగుటూరు నియోజకవర్గం పశ్చిమగోదవరి జిలానుంచి ఏలూరు జిల్లాకు వచ్చింది. భౌగోళికంగా మెట్ట, డెల్టా, కొల్లేరు ,అటవీ ప్రాంతం మధ్యలో ఉంది. తూర్పున తాడేపల్లిగూడెం నియోజకవర్గం(పశ్చిమగోదవరి), పడమర దెందులూరునియోజకవర్గం (ఏలూరుజిల్లా), దక్షిణాన ఉండి నియోజకవర్గం (పశ్చిమ గోదావరి జిల్లా), ఉత్తరాన గోపాలపురం నియోజకవర్గం (తూర్పుగోదావరిజిల్లా) ఉంది.

జాతీయరహదారి ఏలూరు గోదావరికాలువ, రైల్లే లైను సమాంతరంగా ఏలూరు తాడేపల్లిగూడెం పట్టణాల మధ్యలో విస్తరించి ఉంది. వరిపంట ఉత్పత్తి ఏలూరుజిల్లాలోనే ఉంగుటూరు మండలంలో ఎక్కువ పండుతుంది. జాతీయ రహాదారిని ఆనుకుని రవాణా సదూపాయం ఉండటంతో చేపలు ఇతర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళతుంటాయి.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు ఉంగుటూరు
జిల్లా పశ్చిమ గోదావరి
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 205,530
పురుషులు 101,347
మహిళలు 104,178
గత ఎన్నికల ఫలితాలు
Advertisement