. | Rasi Phalalu: Daily Horoscope On 12 March 2025 In Telugu | Sakshi
Joy of Pets

కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం..

ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో అనుకూలత. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం.

కార్యజయం. మొండిబాకీలు వసూలవుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.

మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో పనిభారం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి.

పనులు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు అధిక లాభాలు. ఉద్యోగాల్లో పైహోదాలు.

పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో హోదాలు.

కొన్ని పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

ఆప్తులు మరింత దగ్గరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.