‘ఫిషింగ్‌ స్కాం’ గురించి తెలుసా..? | aware about online phishing scam | Sakshi
Joy of Pets

ఆన్‌లైన్‌లో పాస్‌వర్డులు, క్రెడిట్‌ కార్డు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించడమే ‘ఫిషింగ్‌’.

నేరగాళ్లు నమ్మించి ఇ-మెయిల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా కార్డుదారులను సంప్రదిస్తారు.

ఇ-మెయిల్‌ లింక్స్‌పై క్లిక్‌ చేసిన వెంటనే మీ వ్యక్తిగత సమాచారాన్ని అడిగే విండో ఓపెన్‌ అవుతుంది.

సాధ్యమైనంత ఎక్కువగా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా వినియోగదారులను ప్రేరేపిస్తారు.

అందులో బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్‌ కార్డు వివరాలు, పాన్‌కార్డు సమాచారం ఇవ్వాలనేలా ఉంటుంది.

తర్వాత ఆర్థిక మోసాలకు పాల్పడుతారు.

తెలియని వారికి క్రెడిట్‌ కార్డు వివరాలను షేర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అధికారిక ప్రభుత్వ సంస్థలు/ బ్యాంకులు ఇలాంటి మార్గాల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడగవు.

మీకు ఇలాంటి ఇ-మెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ వస్తే క్రెడిట్‌ కార్డు జారీచేసిన సంస్థను సంప్రదించాలి.