ఆరోగ్య బీమా తీసుకునేవారు గమనించాల్సినవి | who take health insurance be aware of some main points | Sakshi
Joy of Pets

వైద్య ఖర్చులకోసం ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు ఆరోగ్య బీమా తీసుకుంటారు.

పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు.

క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో 90 శాతం కంటే ఎక్కువగా ఉండే కంపెనీలను ఎంచుకుంటే ఉత్తమం.

రూమ్‌ రెంట్‌ లిమిట్‌కు సంబంధించిన పరిమితులు ఉండకుండా చూసుకోవాలి.

స్థానికంగా ఎక్కువ క్యాష్‌లెస్‌ ఆసుపత్రులుండేలా జాగ్రత్తపడాలి.

ఎలాంటి కో-పే లేకుండా ప్రీమియం కొంత ఎక్కువైనా మొత్తం డబ్బు బీమా కంపెనీలే చెల్లించే సదుపాయాన్ని ఎంచుకోవాలి.

ఏడాదిలో ఎన్నిసార్లైనా బీమా మొత్తం తిరిగి రిస్టోర్‌ అయ్యే పాలసీని తీసుకుంటే మేలు.

డేకేర్‌ ట్రీట్‌మెంట్‌ అందించే పాలసీలు ఎంచుకోవాలి.

అంబులెన్స్‌ ఛార్జీలు కవర్‌ అవ్వాలి.

ఫ్రిహెల్త్‌ చెకప్‌ సౌలభ్యం ఉండాలి.

డాక్టర్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ ఛార్జీలు అందించాలి.