పదిలక్షల చెట్లతో దుబాయ్‌ మరింత అందంగా.. ఇందులో టెక్నాలజీ కూడా.. | Dubai Plans 40 Miles Green Spine Will Include 10 Lakh Trees | Sakshi
Joy of Pets

దుబాయ్ ల్యాండ్‌స్కేప్‌ను పచ్చని స్వర్గంగా మారుస్తూ 10 లక్షల కంటే ఎక్కువ చెట్లను నాటడమే లక్ష్యంగా ఉర్బ్ (Urb) చర్యలు తీసుకుంటోంది.

జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పెద్ద దుబాయ్ 2040 ప్రణాళికలో భాగంగా గ్రీన్ స్పైన్‌ను రూపొందించాలనే ఆలోచన నుంచి పుట్టినదే ఈ దుబాయ్ ల్యాండ్‌స్కేప్‌.

టెక్నాలజీని ఉపయోగించి 130000 గృహాలకు కావాల్సిన విద్యుత్ అందించడానికి, ఎలక్ట్రిక్ ట్రామ్ సిస్టంను భారీ సోలార్ ప్యానెల్ కలిగిన రోడ్డుతో కలుపుతారు.

గ్రీన్ స్పైన్ దేశంలోని అనేక ప్లేగ్రౌండ్‌లు, అవుట్‌డోర్ ఫిట్‌నెస్ ప్రాంతాలు, ఫుట్‌పాత్‌లు మరియు హై లైన్ -స్టైల్ ఎలివేటెడ్ పార్క్ ప్రాంతాలకు విస్తరిస్తుంది.

గ్రీన్ పాత్‌వేలు, నడుచుకుంటూ వెళ్లే మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌ మొదలైనవన్నీ కూడా చెట్లతో నిండుతాయి. గ్రీన్ స్పైన్ పట్టణ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

ఆరోగ్యకరమైన, మరింత చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడమే కాకుండా, వాహన ప్రయాణ అవసరాన్ని గణనీయంగా తగ్గించడానికి ఉర్బ్ ఈ నిర్ణయం తీసుకుంది.

10 లక్షల మొక్కలలో ఎక్కువ చెట్లు పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసేవి ఉంటాయి. ఇవన్నీ పార్కులు, తోటలు మరియు పట్టణ పొలాలలో విస్తరించి ఉంటాయి.

గ్రీన్ స్పైన్ 64 కి.మీ పొడవు ఉంటుంది, ఇది ప్రధానంగా దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.