ముఖం తెల్లగా అందంగా ఉండాలంటే..! | How to Get Fair Skin Fast Permanently In Natural Way | Sakshi
Joy of Pets

టీ స్పూన్‌ తేనెలో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరం, టేబుల్‌ స్పూన్‌ పాలు కలపాలి.

ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

నిమ్మరసం కారణంగా చర్మం కొద్దిగా మంటగా అనిపిస్తుంది.

ఇక్కడ నిమ్మరసం సహజసిద్ధమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది.

బ్యూటీ పార్లర్లలో కెమికల్‌ బ్లీచ్‌ కంటే ఈ ప్యాక్‌ మేలు.

అలాగే మునగ ఆకు పొడి, తేనె, రోజ్‌ వాటర్‌లతో ప్యాక్‌ సిద్దం చేసుకోవాలి

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పది నిమిషాలు ఉంచాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి.

దీని వల్ల చర్మం మృదుత్వం, కాంతిమంతం అవుతుంది.

మునగ ఆకు పొడి చర్మం ముడతలు తగ్గడానికి బాగా పనిచేస్తుంది.

యవ్వనకాంతిని తీసుకురావడంలో సహాయపడతుంది.

దీంతో మచ్చలు, మొటిమలు, యాక్నె సమస్య తగ్గుతుంది.