ఎల్లోరా గుహల్లో చెక్కిన ఏకరాతి ఆలయం | Kailashnath Temple Ellora Caves | Sakshi
Joy of Pets

ఎల్లోరా గుహల్లో చెక్కిన ఏకరాతి ఆలయమే కైలాసనాథ్‌ ఆలయం.

ఎల్లోరా గుహలను చరణాద్రి కొండల్లో చెక్కారు

సహ్యాద్రి శ్రేణుల్లో ఒక భాగం చరణాద్రి కొండలు. మహారాష్ట్ర, ఔరంగాబాద్‌ జిల్లాలో ఉన్నాయి.

ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు, 13 నుంచి 29 వరకు హిందూ గుహలు, 30 నుంచి వరకు 34 జైన గుహలు. కైలాస్‌నాథ్‌ ఆలయం 16వ గుహలో ఉంది.

ఎల్లోరా గుహలు వందకు పైగా ఉన్నాయి. కానీ పర్యాటకులకు అనుమతి 34 వరకే.

ఇవన్నీ ఒకేసారి చెక్కినవి కాదు. 8, 9,10 శతాబ్దాల్లో చెక్కిన గుహలు.

కైలాస్‌నాథ్‌ గుహాలయాన్ని మాత్రం రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుని కాలంలో క్రీ.శ 756 – 773 మధ్యకాలంలో చెక్కారు.

ఈ ఆలయం పొడవు 164 అడుగులు, వెడల్పు 109 అడుగులు, ఎత్తు 98 అడుగులు.