. | Weekly Horoscope 29th December 2024 In Telugu | Sakshi
Joy of Pets

కొత్త వ్యక్తులతో పరిచయాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు అనూహ్య విజయాలు సాధిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గతం నుంచి వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఊరట కలిగించే సమాచారం రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా ఉండవచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో వైరం. అనారోగ్యం. ఎరుపు, నీలం రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వ్యయప్రయాసలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా లెక్కచేయరు. పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. దూరప్రయాణాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న విధంగా సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి మరింత ఖ్యాతి లభిస్తుంది. వారం« చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

ఆర్థిక పరిస్థితి కొంత అయోయమంగా ఉన్నా అవసరాలు తీరతాయి. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు అధిగమించి విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు వేగవంతంగా కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంట్లో ఒత్తిడులు తగ్గి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో నిర్ణయాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమై ఉపశమనం లభిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

ఆర్థిక విషయాలలో కొంత అసంతృప్తి. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు నెలకొన్నా సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు శ్రమపడి విస్తరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు చికాకు పరుస్తాయి. పారిశ్రామికవేత్తలలో గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. విష్ణుధ్యానం చేయండి.

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువుల రాక మరింత సంతోషం కలిగిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో చికాకులు, వివాదాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి.

కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలను సాధిస్తారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉండి ఊరట చెందుతారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కితేవడంలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సోదరులతో కలిసి శుభకార్యాలపై చర్చిస్తారు. వ్యాపారాలను లాభాలదిశగా నడపడంతో కృతకృత్యులవుతారు. ఉద్యోగస్తులకు విధుల్లో పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో అనారోగ్యం. దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. నలుపు, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ఇతరుల నుండి కూడా సహాయసహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు క్రమశిక్షణతో కొనసాగిస్తారు. అప్పులు చేయకుండా గడిచిపోతుంది. తరచూ ప్రయాణాలు ఉండవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వర్తమానంపై ఒక అంచనాకు వస్తారు. భూములు, ఖరీదైన వాహనాలు కొంటారు. వ్యాపారాలను క్రమేపీ విస్తరిస్తారు. అలాగే, లాభాలు తగినంతగా గడిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. కళారంగం వారు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీలో దాగిన నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి విషయాలు తరచూ గుర్తుకు వస్తాయి. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. మీ ఆత్మవిశ్వాసమే విజయాలు అందిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలపై ఒక అంచనాకు వస్తారు. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఎవరినీ నొప్పించకుండా వ్యవహారాలు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు ఊహించని పెట్టుబడులు సమకూరి కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలకు పదవీయోగం కలుగవచ్చు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు, శివాష్టకం పఠించండి.