#Dinesh Karthik: 'డీకే' ది ఫినిషర్‌.. కేవలం 10 బంతుల్లోనే విధ్వంసం! వీడియో వైర‌ల్‌

Dinesh Karthik guiding RCB to thrilling win against Punjab Kings - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలి విజ‌యం న‌మోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఫినిషర్ అవతారమెత్తాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని ఈ వెట‌ర‌న్ అందించాడు. 

177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. కెప్టెన్ డుప్లెసిస్ కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన గ్రీన్ సైతం   నిరాశ‌ప‌రిచాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ మ‌రో  ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు.

బౌండ‌రీలు వ‌ర్షం కురిపిస్తూ బౌల‌ర్ల‌ను ఒత్త‌డిలోకి నెట్టే ప్ర‌య‌త్నించాడు. పాటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే పాటిదార్ ఎక్కువ స‌మయం పాటు కోహ్లికి స‌పోర్ట్‌గా నిల‌వ‌క‌పోయాడు. హ‌ర్‌ప్రీత్ బ‌రార్ బౌలింగ్‌లో పాటిదార్ ఔట‌య్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన మాక్స్‌వెల్ సైతం హ‌ర్‌ప్రీత్‌కే చిక్కాడు.

మాక్స్‌వెల్ ఔటయ్యే స‌మ‌యానికి ఆర్సీబీ స్కోర్ 12.1 ఓవ‌ర్ల‌లో 103/3. అంటే ఆర్సీబీ విజ‌యానికి 7.5 ఓవ‌ర్ల‌లో 74 ప‌రుగులు కావాలి. కొంచెం క‌ష్ట‌మైన టాస్క్ అయిన‌ప్ప‌టికి కోహ్లి క్రీజులో ఉండ‌డంతో అభిమాన‌లు థీమాగా ఉన్నారు. కోహ్లికి తోడుగా రావ‌త్ క్రీజులోకి వ‌చ్చాడు. రావ‌త్ సింగిల్స్ తీసుకుంటూ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

కోహ్లి వీలుచిక్కిన‌ప్పుడుల్లా బౌండ‌రీలు బాదుతూ ల‌క్ష్యాన్ని కాస్త త‌గ్గించాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ 16 ఓవ‌ర్ వేసిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో వ‌రుస బౌండ‌రీలు బాదిన విరాట్ కోహ్లి.. ఆఖ‌రి బంతికి ఔట‌య్యాడు. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 77 ప‌రుగులు చేసిన విరాట్ నిరాశ‌తో మైదానాన్ని వీడాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా మ‌హిపాల్ లామ్రోర్ వ‌చ్చాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో రావ‌త్ సైతం పెవిలియ‌న్‌కు చేరాడు.

ఈ క్ర‌మంలో  దినేష్ కార్తీక్ వ‌చ్చాడు. కార్తీక్‌ క్రీజులోకి వచ్చిన వెంటనే తన బ్యాట్‌కు పనిచెప్పాడు. సామ్‌ కుర్రాన్‌ వేసిన 17 ఓవర్‌ను ఫోర్‌ బాది కార్తీక్‌ ముగించాడు. ఆ తర్వాత 18 ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓవర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్‌ సిక్స్‌, ఫోరు బాది మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే బాధ్యతను కార్తీక్‌ తీసుకున్నాడు.

ఈ క్రమంలో ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా కార్తీక్‌ చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్‌ బాదిన డికే.. 20 ఓవర్లలో తొలి రెండు బంతులను బౌండరీలగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు.  కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై ఆర్సీబీ అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-04-2024
Apr 07, 2024, 23:09 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్‌...
07-04-2024
Apr 07, 2024, 22:24 IST
ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ పరంగా తడబడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎక్నా...
07-04-2024
Apr 07, 2024, 21:32 IST
ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
07-04-2024
Apr 07, 2024, 19:24 IST
స్టబ్స్‌ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం...
07-04-2024
Apr 07, 2024, 19:00 IST
IPL 2024 GT vs LSG Live Updates: గుజరాత్‌పై లక్నో ఘన విజయం ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వరుసగా...
07-04-2024
Apr 07, 2024, 18:54 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పేసు గుర్రం జస్ప్రీత్‌...
07-04-2024
Apr 07, 2024, 18:46 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ...
07-04-2024
Apr 07, 2024, 18:18 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ​్‌లో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో...
07-04-2024
Apr 07, 2024, 17:46 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ...
07-04-2024
Apr 07, 2024, 17:25 IST
ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌...
07-04-2024
Apr 07, 2024, 17:15 IST
ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. గ‌త రెండు నెల‌ల‌గా ఆట‌కు...
07-04-2024
Apr 07, 2024, 16:08 IST
‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు?...
07-04-2024
Apr 07, 2024, 15:53 IST
ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా...
07-04-2024
Apr 07, 2024, 15:15 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు బ్యాట్‌ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు....
07-04-2024
Apr 07, 2024, 15:02 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా...
07-04-2024
Apr 07, 2024, 13:53 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్‌; 9...
07-04-2024
Apr 07, 2024, 13:17 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో  ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి అజేయ...
07-04-2024
Apr 07, 2024, 13:12 IST
‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో...
07-04-2024
Apr 07, 2024, 12:24 IST
సన్‌రైజర్స్‌ స్టార్‌ స్పిన్నర్‌, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్‌ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు...
07-04-2024
Apr 07, 2024, 11:11 IST
ఐపీఎల్‌-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్‌. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top