IPL 2024 KKR vs RCB: ఆర్సీబీని చిత్తు చేసిన కేకేఆర్‌.. 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

IPL 2024: Kolkata knight riders vs Royal challengers bangalore Live Score Updates And Highlights - Sakshi

IPL 2024 KKR vs RCB Match live Updates:

ఆర్సీబీని చిత్తు చేసిన కేకేఆర్‌..

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 7 వికెట్ల తేడాతో కేకేఆర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌల‌ర్లు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ కేవ‌లం 16.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. సునీల్ న‌రైన్‌(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(39 నాటౌట్‌) అద్బుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు.

14  ఓవ‌ర్ల‌కు కేకేఆర్‌ స్కోర్‌: 150/2
14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. కేకేఆర్ విజ‌యానికి 36 బంతుల్లో 33 ప‌రుగులు కావాలి. క్రీజులో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(42), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(18) ప‌రుగుల‌తో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌.. సాల్ట్ ఔట్‌
ఫిల్ సాల్ట్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 30 ప‌రుగులు చేసిన సాల్ట్‌.. వైశ్యాఖ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 128/2. క్రీజులో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(32), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(12)  ప‌రుగుల‌తో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్‌.. న‌రైన్ ఔట్‌
86 ప‌రుగుల వ‌ద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 47 ప‌రుగులతో దూకుడుగా ఆడిన‌ సునీల్ న‌రైన్‌.. మ‌యాంక్ దాగ‌ర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.  

నరైన్‌ విధ్వంసం..
183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవ‌ర్లు ముగిసే సరికి కేకేఆర్  వికెట్ న‌ష్ట‌పోకుండా 85 ప‌రుగులు చేసింది. క్రీజులో సునీల్ న‌రైన్‌(20 బంతుల్లో 47),  ఫిల్ సాల్ట్‌(29) ప‌రుగుల‌తో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న కేకేఆర్‌.. 
183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవ‌ర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ న‌ష్ట‌పోకుండా 32 ప‌రుగులు చేసింది.

విరాట్ కోహ్లి ఊచకోత.. కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  

59 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 3 సిక్స్‌లతో కార్తీక్ 20 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్ తలా రెండు వికెట్లు సాధించారు.

ఐదో వికెట్ డౌన్‌.. రావ‌త్ ఔట్‌
ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రావత్‌.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఐదో వికెట్ డౌన్‌.. రావ‌త్ ఔట్‌
ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 3 ప‌రుగులు చేసిన అనూజ్‌ రావత్‌.. హర్షిత్‌ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.  18 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 153/5. క్రీజులో విరాట్ కోహ్లి(62),కార్తీక్‌ (1) ప‌రుగుల‌తో ఉన్నారు.

నాలుగో వికెట్ డౌన్‌.. పాటిదార్ ఔట్‌
ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 ప‌రుగులు చేసిన ర‌జిత్ పాటిదార్‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.  15 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 134/3. క్రీజులో విరాట్ కోహ్లి(62),రావ‌త్ (1) ప‌రుగుల‌తో ఉన్నారు.

మూడో వికెట్ డౌన్‌.. మాక్స్‌వెల్ ఔట్‌
గ్లెన్ మాక్స్‌వెల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్లు కోల్పోయింది. 28 ప‌రుగులు చేసిన మాక్స్‌వెల్‌.. న‌రైన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 134/3. క్రీజులో విరాట్ కోహ్లి(62), ర‌జిత్ పాటిదార్‌(1) ప‌రుగుల‌తో ఉన్నారు.

విరాట్ కోహ్లి ఫిప్టీ..
ఆర్సీబీ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 37 బంతుల్లో కోహ్లి త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 13 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌:109/2. 52 ప‌రుగుల‌తో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌.. గ్రీన్ ఔట్‌
82 ప‌రుగుల వ‌ద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 33 ప‌రుగులు చేసిన గ్రీన్‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.
6 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 61/1
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. క్రీజులో గ్రీన్ (24), కోహ్లి(28) ప‌రుగుల‌తో  ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్‌
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌.. హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 30/1. క్రీజులో విరాట్ కోహ్లి(21), గ్రీన్‌(4) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జ‌ట్లు
ఆర్సీబీ
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్(వికెట్ కీప‌ర్‌), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

కేకేఆర్‌
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-04-2024
Apr 07, 2024, 23:09 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్‌...
07-04-2024
Apr 07, 2024, 22:24 IST
ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ పరంగా తడబడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎక్నా...
07-04-2024
Apr 07, 2024, 21:32 IST
ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
07-04-2024
Apr 07, 2024, 19:24 IST
స్టబ్స్‌ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం...
07-04-2024
Apr 07, 2024, 19:00 IST
IPL 2024 GT vs LSG Live Updates: గుజరాత్‌పై లక్నో ఘన విజయం ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వరుసగా...
07-04-2024
Apr 07, 2024, 18:54 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పేసు గుర్రం జస్ప్రీత్‌...
07-04-2024
Apr 07, 2024, 18:46 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ...
07-04-2024
Apr 07, 2024, 18:18 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ​్‌లో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో...
07-04-2024
Apr 07, 2024, 17:46 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ...
07-04-2024
Apr 07, 2024, 17:25 IST
ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌...
07-04-2024
Apr 07, 2024, 17:15 IST
ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. గ‌త రెండు నెల‌ల‌గా ఆట‌కు...
07-04-2024
Apr 07, 2024, 16:08 IST
‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు?...
07-04-2024
Apr 07, 2024, 15:53 IST
ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా...
07-04-2024
Apr 07, 2024, 15:15 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు బ్యాట్‌ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు....
07-04-2024
Apr 07, 2024, 15:02 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా...
07-04-2024
Apr 07, 2024, 13:53 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్‌; 9...
07-04-2024
Apr 07, 2024, 13:17 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో  ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి అజేయ...
07-04-2024
Apr 07, 2024, 13:12 IST
‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో...
07-04-2024
Apr 07, 2024, 12:24 IST
సన్‌రైజర్స్‌ స్టార్‌ స్పిన్నర్‌, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్‌ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు...
07-04-2024
Apr 07, 2024, 11:11 IST
ఐపీఎల్‌-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్‌. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top