Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: నియోజకవర్గంలో చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, గుడిపాల మండలాలున్నాయి. ఇందులో చిత్తూరు రూరల్ మండలం కొత్తగా ఏర్పాటు చేశారు. ఆధునిక చిత్తూరు జిల్లా పూర్వం ఉత్తర ఆర్కాట్ జిల్లా, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మూడు సరిహద్దు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల కలయికతో ఏప్రిల్ 1, 1911న ఏర్పాటైంది. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1952 నుంచి ఎన్నికలు జరిగాయి. రెవెన్యూ గ్రామాలు -89, గ్రామ పంచాయతీలు -94, గ్రామ సచివాలయాలు -26, వార్డు సచివాలయాలు -51 కలవు.

 

విస్తీర్ణం: 391 చ.కి.మీ

ఓటర్లు:  మొత్తం ఓట్లు 201690

భౌగోళిక పరిస్థితులు: చిత్తూరు జిల్లా కేంద్రం, చిత్తూరు నగరపాలక సంస్థ హోదా కలదు. 1947లో భారత స్వాతంత్య్రం తర్వాత, చిత్తూరు పూర్వపు మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. సరిహద్దులు: నియోజకవర్గానికి తూర్పున తిరుపతి జిల్లా, తమిళనాడు రాష్ట్రం, పడమర అన్నమయ్య జిల్లా, కర్ణాటక రాష్ట్రం, ఉత్తరం అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, దక్షిణం తమిళనాడు రాష్ట్రం ఉన్నాయి.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు చిత్తూరు
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 201,690
పురుషులు 98,610
మహిళలు 103,046
గత ఎన్నికల ఫలితాలు
Advertisement