Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

దర్శి అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: 1952కు ముందు బ్రిటీష్‌ పాలనలో దర్శి కౌన్సిల్‌గా ఉంది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు దర్శి నియోజకవర్గం ఏర్పడింది. పూర్వం దర్శనాపురిగా ఉన్న నియోజకవర్గ కేంద్రం దర్శిగా మారింది. 1956లో ఆంధ్రరాష్ట్ర అవతరణ తరువాత రాష్ట్రం విడిపోయి కర్నూలు రాజధాని అయింది.

విస్తీర్ణం: 

ఓటర్లు: మొత్తం ఓట్లు 223901

ప్రస్తుతం నియోజకవర్గంలో 10332 ఓటర్లు పెరిగారు.

ఓసీలు : 91691

బీసీలు : 59532

ఎస్సీలు : 51884

ఎస్టీలు : 5402

భౌగోళిక పరిస్థితులు: దర్శి నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం. ప్రాచీన చరిత్రలో దర్శి నియోజకవర్గానికి ప్రత్యేక స్ధానం ఉంది. గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్థూపం ఉన్నట్లు 1965లో వెలుగు చూసింది. తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం ప్రపంచంలో సారనాథ్‌ స్థూపం తరువాత ఈ స్థూపం అతి పెద్దది.ఈ స్థూపంలో బుద్దుని దంతం ఉంది.

సుమారు 800 సంవత్సరాల పాటు ప్రముఖ బౌద్ద ధార్మిక కేంద్రంగా, బౌద్ద విశ్వ విద్యాలయంగా విరాజిల్లింది. తవ్వకాలలో  బయట్పడిన కొన్ని శిలాఫలకాలు, బంగారు పుష్పాలు, బుద్దుని పన్ను, అని భావిస్తున్న రాతి అస్తికల పేటికను హైదరాబాద్‌లోని మ్యూజియంలో భద్ర పరిచారు. ఇక్కడ బయల్పడిన బౌద్ద స్థూపం 150 అడుగుల ఎత్తున్న కొండపై ఉంది. స్థూపం ఎత్తు 30 అడుగులుకాగా, చుట్టుకొలత 120 అడుగులు ఉంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు దర్శి
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 223,901
పురుషులు 113,079
మహిళలు 110,812
గత ఎన్నికల ఫలితాలు
Advertisement