Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు, మండలాల్లో పంచాయతీలు 94, ఒక నగర పంచాయతీ ఉంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎక్కువ మంది ఆర్మీ ఉద్యోగాలకు వెళ్లి పదవీ విరమణ పొందిన వారు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకే ప్రజాబలం అధికంగా ఉంది.

విస్తీర్ణం: 705 చదరపు కిలోమీటర్లు.

ఓటర్లు: మొత్తం ఓట్లు 242454. రెడ్లు, కాపులు, వైశ్యులు ఇప్పటి వరకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించారు. విజయావకాశాలకు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ముస్లీం ఓటర్లు ఎక్కువగా ప్రభావితం చూపుతాయి.

భౌగోళిక పరిస్థితులు: నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందినది. సాగునీటి ప్రాజెక్టులు లేవు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. పూర్తయితే నియోజకవర్గంలోని రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాలకు నీరు వస్తుంది. రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. వైద్యశాలలు ఉన్నాయి. అటవీశాఖ డివిజన్‌ కార్యాలయం గిద్దలూరులో ఉంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు గిద్దలూరు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 242,454
పురుషులు 123,479
మహిళలు 118,956
గత ఎన్నికల ఫలితాలు
Advertisement