Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: నాటి కనకగిరే నేటి కనిగిరి. నేటి కనిగిరినే నాడు పూర్వీకులు కనకగిరిగా, కనక పట్టణంగా పిలిచేవారు. ఎత్తైన కొండలు అధికంగా ఉండటంతో కనకగిరి కాస్తా కనిగిరిగా మారింది. కనిగిరి అనే పదంలోని 1, 4 అక్షరాలు కలిపితే కరి అవుతుంది. కరి అంటే ఏనుగు, 3, 4 అక్షరాలు కలిపితే గిరి. అంటే కొండ, 1, 2 అక్షరాలు కలిపితే కని. అంటే చూసి, చూశాను అని అర్థం. దీన్ని మొత్తాన్ని క్రోడికరిస్తే ఏనుగులాంటి పెద్ద పెద్ద రాళ్లు ఉన్న కొండను చూశాను అని అర్థం. కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాలు, ఒక కనిగిరి మున్సిపాలిటీ ఉంది. మొత్తం పంచాయతీలు 135.

విస్తీర్ణం: 2,48,217 హెక్టార్లు

ఓటర్లు: మొత్తం ఓట్లు 237256

{కులాల వారీగా వివరాలు:  

రెడ్డి : 50 వేల ఓట్లు

యాదవ : 30 వేల ఓట్లు

మాదిగ : 35 వేల ఓట్లు

మాల : 16 వేల ఓట్లు

ముస్లిం : 19 వేల ఓట్లు

బలిజ (కాపు) : 12 వేల ఓట్లు

కమ్మ : 16 వేల ఓట్లు

వైశ్య : 6 వేల ఓట్లు

రజక : 11 వేలు ఓట్లు

వడ్డేర : 7 వేల ఓట్లు

దూదేకుల (నూర్‌బాషా ముస్లిం): 3 వేల ఓట్లు

ఇతర సామాజిక వర్గాల ఓట్లు 27,795 ఓట్లు సుమారుగా ఉన్నాయి.}

భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గానికి తూర్పున: పొన్నలూరు మండలం, పడమర: బేస్తవారిపేట మండలం, దక్షిణం: ఎస్‌ఆర్‌పురం మండలం, ఉత్తరం: మర్రిపూడి, కొనకనమిట్ల మండలాలతొ పాటు రెవెన్యూ డివిజన్‌ సరిహద్దులు కలవు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు కనిగిరి
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 237,256
పురుషులు 120,100
మహిళలు 117,141
గత ఎన్నికల ఫలితాలు
Advertisement