Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. కుప్పం, శాంతిపురం. రామకుప్పం, గుడుపల్లె. కుప్పం మండలం పంచాయతీలు 29 కలవు. కుప్పం రెవెన్యూ డివిజన్, కుప్పం మున్సిపాలిటీ హోదా కలదు. కుప్పం మూడు రాష్ట్రాల కూడలీ. రెండు సర్కిల్ స్టేషన్లు, నాలుగు పోలీస్ స్టేషన్లు, ఒక అగ్నిమాపక కేంద్రం, అటవీశాఖ కార్యాలయం భద్రత వ్యవస్థ కలదు.

విస్తీర్ణం: 1052 చ. కి మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 223306

భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గానికి తూర్పు, దక్షణం తమిళనాడు సరిహద్దు, పడమర కర్ణాటక సరిహద్దు, ఉత్తరం పలమనేరు నియోజకవర్గం. వరి, వేరుశెనగ, టమాటా, పూలు, కాయకూరలు అధికంగా సాగు చేస్తారు. గుడుపల్లె మండలం మల్లప్ప కొండ, గుడివంక సుబ్రమణ్యం స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. గుడుపల్లె మండలం మల్లప్ప కొండ, గుడివంక సుబ్రమణ్యం స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కుప్పం పట్టణంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం మూడు రాష్ట్రాల ప్రజలు కొలుస్తారు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు కుప్పం
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 223,306
పురుషులు 111,428
మహిళలు 111,860
గత ఎన్నికల ఫలితాలు
Advertisement