Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒంగోలు నగరంతో పాటు, ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒంగోలు ఒక నియోజకవర్గంగా కొనసాగుతూనే ఉంది. 1952, 1955లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1957 నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే ఎన్నికవుతూ వస్తున్నారు.

విస్తీర్ణం:

ఓటర్లు: మొత్తం ఓట్లు 236435

భౌగోళిక పరిస్థితులు: ఒంగోలు నియోజకవర్గానికి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరం మద్దిపాడు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, దక్షిణం టంగుటూరు మండలాలు హద్దులుగా ఉన్నాయి. ఒంగోలుకు వంగల ప్రోలు, వంగవోలు, వంగోలు అనే పేర్లు ఉన్నాయి.

అద్దంకి రెడ్డి రాజుల కాలంలో వంగోలు అనే పేరు చరిత్రలో కనిపిస్తుంది. నగరంలో తొలి మసీదు జామియా మసీదు. సకల దేవతల నిలయంగా సంతపేట వీరాంజనేయస్వామి ఆలయం కలదు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు ఒంగోలు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 236,435
పురుషులు 113,834
మహిళలు 122,560
గత ఎన్నికల ఫలితాలు
Advertisement