Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ఈ నియోజకవర్గంలో పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి, వీకోట మండలాలు కలవు. పలమనేరు మున్సిపాలిటీగా 2004లో రూపాంతరం చెందింది. మొత్తం 287  పోలింగ్ కేంద్రాలు కలవు. 1952లో నియోజకవర్గంగా ఏర్పడిన తొలి ఎన్నికల్లో రామబ్రహ్మం (కాంగ్రెస్) తన సమీప ప్రత్యర్థి ఎస్ఆర్ రెడ్డి (కేఎల్పి)పై విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అమరనాథరెడ్డి పోటీ చేయగా వైఎస్సార్‌సీపీ నుంచి రాజకీయాలకు కొత్త వ్యక్తిగా ఎన్ వెంకటేగౌడ 33 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. రెడ్డి, మాల, మైనారిటీలు, ఆపై బీసీలు ప్రధాన సామాజిక వర్గాలు కలవు.

విస్తీర్ణం: 97 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 267171

భౌగోళిక పరిస్థితులు: పలమనేరుకు తూర్పున చిత్తూరు డివిజన్, పడమర కర్ణాటక, ఉత్తరాన మదనపల్లి డివిజన్, దక్షిణం తమిళనాడు రాష్ట్రాలను కలదు. కీలపట్ల కోనేటిరాయస్వామి ఆలయం, సీఎస్ఐ చర్చి, నాగమంగళం మదరసా ప్రముఖ ఆలయాలను కలిగియుంది. టమాటా, పట్టుగూళ్ళు, చింతపండు, పాలు వ్యాపారంతో ముడిపడి ఉంది. పలమనేరు గంగజాతర, ఆడికత్తిక పండుగలు ప్రత్యేక విశిష్టతలు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పలమనేరు
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 267,171
పురుషులు 132,342
మహిళలు 134,828
గత ఎన్నికల ఫలితాలు
Advertisement