ఆంధ్ర ప్రదేశ్ » ప్రకాశం » సంతనూతలపాడు

Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)లో చీమకుర్తి మున్సిపాలిటీ గ్రేడ్‌–2 (అర్బన్‌)తో పాటు చీమకుర్తి రూరల్‌ మండలం, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలు ఉన్నాయి. మేజర్‌ పంచాయతీగా ఉన్న చీమకుర్తి. అప్పట్లో ఇది ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉండేది.

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్‌ నుంచి బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం (ఎస్సీ)లోకి మారింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ జెండా ఎగరలేదు. ఇటీవల నారా లోకేష్‌ చీమకుర్తికి పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. 

విస్తీర్ణం:

ఓటర్లు: మొత్తం 212514. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కలిపి మొత్తం పోలింగ్‌ బూత్‌లు 257 ఉన్నాయి.

భౌగోళిక పరిస్థితులు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో చీమకుర్తి మండలం రామతీర్థంలో రూ.50 కోట్లతో నిర్మించిన రామతీర్థం రిజర్వాయర్, రూ.600 కోట్ల కోట్లతో మద్దిపాడు మండలం మల్లవరంలో నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లు సంతనూతలపాడు నియోజకవర్గంలోనే ఉన్నాయి. వాటి ద్వారా జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 2 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌ చీమకుర్తి మండలంలోని ఆర్‌.ఎల్‌.పురం పంచాయతీలోనే ఉంది. రామతీర్థం చుట్టూ దాదాపు 3 వేల హెక్టార్లలో గ్రానైట్‌ గనులు విస్తరించి ఉన్నాయి. ఏడాదికి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ రాయిని తీస్తారు. దానిలో సుమారు 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ను చైనా, ఇటలీ, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. దాని ద్వారా ఏడాదికి దాదాపు రూ.3 వేల కోట్ల విలువ కలిగిన లావాదేవీలు జరుగుతాయి.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు సంతనూతలపాడు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 212,514
పురుషులు 104,559
మహిళలు 107,950
గత ఎన్నికల ఫలితాలు
Advertisement