RCB: అభిమానులకు ఆర్సీబీ క్షమాపణ.. డబ్బు తిరిగి ఇచ్చేస్తాం

IPL 2024: RCB Set to refund RCB Unbox Streaming Fees to Fans Why - Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ తమ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌ సందర్భంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.

కాగా ప్రతి ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందు ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌ పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 19న  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ఈవెంట్‌ నిర్వహించింది. విరాట్‌ కోహ్లి సహా ఆర్సీబీ స్టార్లు, వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు.. ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఈ ఈవెంట్‌లో ఆర్సీబీ తమ పేరు, లోగో మార్పులతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. అయితే, ఈ ఈవెంట్‌ను ఆర్సీబీ వెబ్‌సైట్‌, యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించాలంటే రూ. 99 చెల్లించాలని నిబంధన విధించింది. అయినప్పటికీ చాలా మంది అభిమానులు డబ్బు చెల్లించి ఈవెంట్‌ను చూసేందుకు సిద్ధమయ్యారు.

అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్‌
కానీ.. ప్రసారంలో ఇబ్బందులు తలెత్తడంతో తమ అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లు.. ‘‘ఇదేం పద్ధతి’’ అంటూ ఆర్సీబీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో క్షమాపణ కోరుతూ ఆర్సీబీ ప్రకటన విడుదల చేసింది.

మీ డబ్బులు రీఫండ్‌ చేస్తాం
‘‘ప్రియమైన ఆర్సీబీ అభిమానులారా.. పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌కు డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా అంతరాయం కలిగింది.

అందుకే మీ డబ్బులు రీఫండ్‌ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాం. రానున్న ఏడు రోజుల్లో మీ డబ్బు మీ అకౌంట్లకు చేరుతుంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు. తదుపరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఆర్సీబీ గురువారం తెలిపింది. కాగా ఈరోజు(మార్చి 22)న ఐపీఎల్‌-2024 ఎడిషన్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌గైక్వాడ్‌ సారథ్యంలో చెన్నై.. ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందంతో తలపడనుంది.

చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్‌ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-04-2024
Apr 07, 2024, 23:09 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్‌...
07-04-2024
Apr 07, 2024, 22:24 IST
ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ పరంగా తడబడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎక్నా...
07-04-2024
Apr 07, 2024, 21:32 IST
ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
07-04-2024
Apr 07, 2024, 19:24 IST
స్టబ్స్‌ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం...
07-04-2024
Apr 07, 2024, 19:00 IST
IPL 2024 GT vs LSG Live Updates: గుజరాత్‌పై లక్నో ఘన విజయం ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వరుసగా...
07-04-2024
Apr 07, 2024, 18:54 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పేసు గుర్రం జస్ప్రీత్‌...
07-04-2024
Apr 07, 2024, 18:46 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ...
07-04-2024
Apr 07, 2024, 18:18 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ​్‌లో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో...
07-04-2024
Apr 07, 2024, 17:46 IST
ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ...
07-04-2024
Apr 07, 2024, 17:25 IST
ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌...
07-04-2024
Apr 07, 2024, 17:15 IST
ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. గ‌త రెండు నెల‌ల‌గా ఆట‌కు...
07-04-2024
Apr 07, 2024, 16:08 IST
‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు?...
07-04-2024
Apr 07, 2024, 15:53 IST
ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా...
07-04-2024
Apr 07, 2024, 15:15 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు బ్యాట్‌ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు....
07-04-2024
Apr 07, 2024, 15:02 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా...
07-04-2024
Apr 07, 2024, 13:53 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్‌; 9...
07-04-2024
Apr 07, 2024, 13:17 IST
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో  ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి అజేయ...
07-04-2024
Apr 07, 2024, 13:12 IST
‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో...
07-04-2024
Apr 07, 2024, 12:24 IST
సన్‌రైజర్స్‌ స్టార్‌ స్పిన్నర్‌, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్‌ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు...
07-04-2024
Apr 07, 2024, 11:11 IST
ఐపీఎల్‌-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్‌. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top