FactCheck: తిక్కరాతలతో రామోజీ తెలివి బొక్కబోర్లా! 

fact check: Ramoji Rao Eenadu Fake News on property tax in ap - Sakshi

వార్షిక అద్దె లెక్కింపు స్థానే కేపిటల్‌ వేల్యూ పన్ను 

ఎఫ్‌ఆర్‌బీఎం, ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుకు కేంద్రం ఆదేశం.. 11 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిబంధనల అమలు  

ఆస్తి విలువ ఎంత పెరిగినా పన్ను 15 శాతం మించ కూడదన్న ఏపీ ప్రభుత్వం 

375 చ.అ. ఇంటి పన్ను రూ.50 మాత్రమే.. ఖాళీ స్థలాలకు  పన్ను పెంపులేదు 

హద్దులు దాటిన రామోజీ దుష్ప్రచారం

రాష్ట్ర ప్రగతికి నిధులు గాల్లోంచి సృష్టించాలన్నదే రామోజీ మతిచలించిన రాతల పరమార్థంలా కనిపిస్తోంది.   ఏటా పెరిగే ఆస్తుల విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని కేంద్రం చట్టమే తెచ్చి, అమలు చేసి తీరాలన్న నిబంధనను విధించింది. అయినా సరే...పన్ను పెంపు అనేది పేద వర్గాలకు పెనుభారం కారాదని సీఎం  జగన్‌ ప్రభుత్వం పన్ను పెంపు 15 శాతానికి మించకుండా చర్యలు తీసుకుంటే అదేదీ ఈనాడుకు కనిపించదు. నోటికొచ్చిన లెక్కలు గట్టి రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఇళ్లకు పన్ను పెంపు భారం ...అంటూ తప్పుడు రాతలు రాసింది.

నిజానికి 2020 నుంచే అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త పన్ను విధానం అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. తెలంగాణతో సహా పది రాష్ట్రాలు పన్ను పెంపు విధానంలో కేంద్రం చెప్పిందే అమలు చేస్తున్నాయి. తద్భిన్నంగా .. రాష్ట్రంలో సీఎం జగన్‌ పేదల పట్ల కారుణ్యంతో వ్యవహరిస్తున్నారు. పేదలపై పెనుభారం మోపడానికి ఆయన ససేమిరా అంటారు...అందుకే 2021 ఏప్రిల్‌ నుంచి 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు కేవలం రూ.50 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడంలోని జగన్‌ మానవత్వ భావన రామోజీ బుర్ర కెక్కినట్లు లేదు.

లెక్కలేనన్ని తిక్కరాతలతో రాష్ట్రంలో అభివృద్ధికి మోకాలడ్డడానికి ఈ అతి తెలివి వక్రమార్కుడు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఖాళీ స్థలాలపై పన్నే పెంచని ఉదారత జగన్‌ ప్రభుత్వానిది... అంతేకాదు ఒకేసారి పన్ను మొత్తాన్ని చెల్లిస్తున్న వారికి రెండేళ్లుగా వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించడం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరో వరం...ఇదంతా రామోజీకి తెలియదా అంటే తెలుసు..తెలిసినా ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏదో ఒక తప్పుడు కారణాన్ని  వెదుక్కుని వాస్తవాల పునాదులపై అడ్డగోలుగా అబద్ధాల మేడలు కట్టడమే ఈ కుహనా మేధావి లక్ష్యం...

ఈయన తెలివి తెల్లారినట్లే ఉందని చెప్పడమే ఈ ఫ్యాక్ట్‌ చెక్‌ ఉద్దేశం...
సాక్షి, అమరావతి: అబద్ధాలను అచ్చు వేయ­డంలో రామోజీ అందెవేసిన చేయిగా మారి­పోయారు. తెల్లారి లేచిందే తడవుగా ప్రభుత్వంపై ఎలా రాళ్లే­యాలా? అనే దురాలోచన నుంచి ఈనాడు బయట­పడడం లేదు.  ప్రభు­త్వం చేస్తున్న మంచిని ఒక్కరోజూ చెప్పకపోగా, అబ­ద్ధాన్ని నిజమని ప్రజలను నమ్మించేందుకు వాస్తవా­లను కప్పిపుచ్చి అదే అబద్ధాన్ని పదేపదే అచ్చు వేస్తోంది. పన్ను మదింపును పరిగణ­న­లోకి తీసు­కున్న విశాఖ­పట్నం, విజ­య­వాడ, గుంటూరు నగ­రాల్లోని ఇళ్లకు గాలిలో తప్పుడు లెక్కలు వేసి అన్యా­యం జరిగిపోతున్నట్టు గగ్గోలు పెట్టింది.

వాస్తవానికి పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆస్తిపన్ను పెంపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభు­త్వం చట్టం చేసింది. ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పునరీకరణ (రివిజన్‌) చేయాలని సూచించింది. ద్రవ్య లోటును తగ్గించేందుకు ఈ విధానం తప్పని­సరని చెప్పడంతో పాటు 2019లో ‘‘ఫిస్కల్‌ రెస్పా­న్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌’’ (ఎఫ్‌ఆర్‌­బీఎం) చట్టాన్ని తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం సంస్కరణల్లో భాగంగా పట్టణ ఆస్తి పన్ను వార్షిక అద్దె విధానం కాకుండా, ఆస్తుల వార్షిక విలువ ఆధారంగా లెక్కించాలని సూచి­ంచింది.

2020  నుంచి అన్ని రాష్ట్రాలు కొత్త పన్ను విధానం అమలు చేయాలని ఆదేశించింది. అందుకు మున్సిపాలిటీల్లో సబ్‌ రిజి­స్ట్రార్‌ కార్యాలయాల లెక్కల ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఆస్తి మార్కెట్‌ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం విడు­దల చేసింది.  తెలంగాణతో సహా 10 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అదే ఏడాది నుంచి అమలు చేస్తుండగా, ఏపీలో జగన్‌ ప్రభుత్వం మాత్రం 2021 ఏప్రిల్‌లో అమల్లోకి తేవడంతో పాటు 375 చ.అ. లోపు ఇంటికి ఆస్తిపన్ను గరిష్ఠంగా రూ.50 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది నిరుపేదలకు ఎంతో మేలు చేసింది. ఖాళీ స్థలాలపై అసలు పన్ను పెంపే లేదు.  రెండేళ్లుగా మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తున్న వారికి వడ్డీ రాయితీనీn ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించాలన్న కేంద్రం...
కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మున్సి­పాలిటీల్లో ఆస్తి పన్నును ఐదేళ్లకోసారి మదింపు చేసి, తదనుగుణంగా పన్ను పెంచాలి. స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో నివాస ఆస్తులపైన, 2007లో కమర్షియల్‌ ఆస్తుల పన్నును మదింపు చేశారు. తర్వాత పన్ను మదింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గతంలో పన్ను విధింపు ఆస్తి వార్షిక అద్దె ప్రకారం వసూలు చేసేవారు. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్‌ విలువ ప్రకారం పన్ను విధింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది.  ఈ విధానంలో ఆస్తి పన్ను భారీగా పెరిగి ప్రజలకు అధిక భారం పడే ప్రమాదముందని భావించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పన్ను పెంపు గరిష్టంగా 15 శాతం మించరాదని షరతు పెట్టింది. 

ప్రజలపై భారం లేకుండా చూసిన రాష్ట్రం...
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పన్ను నిర్ణ­యించినట్టయితే అది మున్సిపాలిటీల్లోని ప్రజలపై తీవ్ర­మైన ఆర్థిక భారం పడే ఇబ్బంది ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్లాబులను అందుబాటులోకి తెచ్చింది. నివాస ఆస్తులపై స్థానిక మార్కెట్‌ ధర ప్రకారం 0.10 నుంచి 0.50 శాతం, కమర్షియల్‌ ఆస్తులపై 0.02 నుంచి 2 శాతం మధ్య పన్ను ఎంత ఉండాలనే నిర్ణయాధికారం పట్టణ స్థానిక సంస్థల కౌన్సిళ్లకే అప్పగించింది.  ఆస్తి విలువ ఎంత పెరిగినా పన్ను పెంపు 15 శాతం మించరాదని, పేదలు నివసించే 375 చ.అ విస్తీర్ణం గల ఇళ్లకు పన్ను వార్షిక రూ.50 మాత్రమే ఉండాలని అదేశాలు జారీ చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను పెరగని ఆస్తులకు గరిష్టంగా 2 శాతం పెంపు అమలు చేయాలంది. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానంపై అధ్యయనం, ప్రజల అభ్యంతరాలను తీసుకున్న తర్వాతనే అధికారులు పన్ను వసూలు చేపడుతున్నారు. 

పట్టణాభివృద్ధికి ఎల్లో మీడియా వ్యతిరేకం...
పట్టణ స్థానిక సంస్థల్లో ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, అభివృద్ధి పనులకు నిధులు అవసరం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు అధికంగా ఉండేవి.  కేంద్రం 2019లో తెచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంతో యూఎల్బీలు పన్ను ఆదాయాన్ని పెంచు­కుంటేనే సాయం అందుతుంది. ఈ విషయంలో ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన నారా చంద్రబాబుకు, ఆయనకు శిక్షణ ఇచ్చిన రాజగురువు రామోజీకి తెలియంది కాదు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.3950.15 కోట్లు ఉంటే, గతేడాది వసూళ్లు 50 శాతం (రూ.1686.46 కోట్లు) దాటలేదు. మరి స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలో వారికే తెలియాలి.

కేపిటల్‌ వ్యాల్యూ పన్ను విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు..
ఛత్తీస్‌గఢ్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌ 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top