breaking news
Business
-
సెమీకండక్టర్ రంగంలో భారత్: ఏటా 24 బిలియన్ చిప్‌లు
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమోదం తెలిపిన సెమీకండక్టర్ పరిశ్రమల ద్వారా ఏటా 24 బిలియన్ చిప్‌లు దేశీయంగా తయారు కానున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ అదనపు సెక్రటరీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈవో అమితేష్ సిన్హా ప్రకటించారు.ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఒక వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ సహా మొత్తం ఆరు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ''ఈ ఫ్యాబ్ నెలకు 50,000 వేఫర్లను తయారు చేస్తుంది. మిగిలిన ఐదు ప్యాకేజింగ్ యూనిట్లు 24 బిలియన్ చిప్స్‌ను ఏటా ఉత్పత్తి చేస్తాయి. మరిన్ని ప్రతిపాదనలను మదింపు దశలో ఉన్నాయి. కనుక సమీప కాలంలో మరిన్ని ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వనున్నాం''అని సిన్హా తెలిపారు.విధానాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని భరోసానిస్తూ.. సెమీకండక్టర్ రంగంలో భారత్ దీర్ఘకాల మార్కెట్‌గా కొనసాగుతుందన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా కేంద్రం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించడం తెలిసే ఉంటుంది. సరఫరా వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయమైన భాగస్వామిగా పేర్కొన్నారు. -
ఆగస్టు 7న జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ
ముంబై: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 7న ప్రారంభమై 9న ముగిస్తుంది. తొలుత ఇష్యూ సైజ్ రూ.4,000 కోట్లు ఉండగా.., దాన్ని రూ.3,600 కోట్లకు కుదించినట్లు ముసాయిదా పత్రాల్లో వెల్లడైంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఆగస్టు 6న ఉంటుంది. ఇష్యూలో భాగంగా రూ.1,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీలు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు విలువైన షేర్లను విక్రయించనుంది. సమీకరించిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్ నాగూర్‌లో ఇంటిగ్రిటెడ్ సిమెంట్ యూనిట్ నిర్మాణానికి, రూ.520 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఆర్థిక సంవత్సరం 2025లో రూ.163.77 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. నిర్వహణ ద్వారా ఆదాయం రూ.6,028 కోట్ల నుంచి రూ.5,813 కోట్లను దిగివచ్చింది. మొత్తం రుణాలు రూ. 6,166 కోట్లు ఉన్నాయి. ఐపీఓకు ఏఆర్సీఐఎల్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఇండియా) లిమిటెడ్ (ఏఆర్‌సీఐఎల్), ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ఉంటుంది. కావున కంపెనీకీ నిధులేవీ రావు. సంస్థ ప్రమోటార్లు, ఇతర షేర్ హోల్డర్లు ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ 10.54 కోట్ల ఈక్విటీలను ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు. ప్రమోటర్ సంస్థలు అవెన్యూ ఇండియా రిసర్జెన్స్ పీటీఈ లిమిటెడ్ 6.87 కోట్ల ఈక్విటీలు, ఎస్బీఐ 1.94 కోట్ల షేర్లు, ఫెడరల్ బ్యాంక్ 10.35 లక్షలు షేర్లను విక్రయించనున్నాయి. సింగపూర్‌కు చెందిన లాథే ఇన్వెస్ట్మెంట్ పీటీఈ లిమిటెడ్ తన మొత్తం 1.62 కోట్లు(5% వాటాకు సమానం) ఈక్విటీలను విక్రయించనుంది. ఇష్యూకు ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేఎం ఫైనాన్స్‌లు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా, ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైం ఇండియాలు రిజి్రస్టార్‌గా పనిచేయనున్నాయి. -
రెట్టింపు కానున్న అఫర్డబుల్ హౌసింగ్ రుణాలు
ముంబై: అందుబాటు ధరల ఇళ్ల రుణాలు వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెరగనున్నాయి. అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఏహెచ్‌ఎఫ్‌సీ) నిర్వహణలోని ఆస్తులు ప్రస్తుతం రూ.1.4 లక్షల కోట్లుగా ఉంటే, మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల మార్ట్గేజ్ రుణాలు (ఇల్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి) 2025 మార్చి నాటికి రూ.13 లక్షల కోట్లుగా ఉంటే, 2028 మార్చి నాటికి రూ.20 లక్షల కోట్లకు పెరుగుతాయని తెలిపింది. అన్సెక్యూర్డ్ రుణాల్లో సమస్యలు నెలకొనడంతో ప్రత్యామ్నాయ రుణాల మంజూరు పరంగా నియంత్రణలు నెలకొన్నట్టు పేర్కొంది. దీంతో రిటైల్ మోర్ట్గేజ్ రుణాలను బలమైన వృద్ధి నడిపించనున్నట్టు ఇక్రా ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ కో గ్రూప్ హెడ్ ఎం.కార్తీక్ తెలిపారు. సంప్రదాయంగా మార్ట్గేజ్ రుణ విభాగం బలమైన పనితీరు చూపిస్తోందంటూ.. నష్టాలు (రుణ ఎగవేతలు) తక్కువగా ఉండడంతోపాటు రాబడులు మెరుగ్గా ఉంటున్నట్టు వివరించింది. మొత్తం మార్ట్గేజ్ రుణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) మూడింట రెండొంతుల వాటా కలిగి ఉండడం గమనార్హం. ఇక మొత్తం మార్ట్గేజ్ రుణాల్లో అఫర్డ్‌బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఏహెచ్‌ఎఫ్‌సీ) వాటా 11 శాతంగా ఉంది.చిన్న రుణాల్లో ఏహెచ్‌ఎఫ్‌సీలకు అధిక వాటా స్వయం ఉపాధిలోని రుణ గ్రహీతలు తీసుకునే గృహ రుణాల్లో హెచ్‌ఎఫ్‌సీలతో పోల్చి చూస్తే ఏహెచ్ఎఫ్సీలు అధిక వాటా కలిగి ఉన్నట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ మొత్తం రుణాల్లో ఏహెచ్‌ఎఫ్‌సీలకు అధిక వాటా ఉందని.. ఇటీవలి కాలంలో వీటి ఏయూఎం వేగంగా పెరిగినట్టు తెలిపింది. వ్యాపార నమూనా రీత్యా బకాయిలు పెరిగిపోతే వాటి వసూలుకు వీలుగా ఏహెచ్‌ఎఫ్‌సీలకు విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌తోపాటు సిబ్బంది అవసరమని పేర్కొంది. స్థిరమైన కార్యకలాపాలకు తోడు మెరుగైన రుణ విధానాలు అనుసరించాలని సూచించింది. వసూలు కాని మొండి రుణాలు (ఎన్పీఏలు) ఏహెచ్ఎఫ్సీల మొత్తం రుణాల్లో 1.1–1.3 శాతంగానే గత మూడేళ్ల కాలంలో ఉన్నట్టు తెలిపింది. సగటు లోన్ టు వ్యాల్యూ (ఇంటి విలువలో ఇచ్చే రుణం) 55 శాతంగా ఉండడం, రుణాల్లో 40 శాతం సొంత ఇల్లు నిర్మాణం కోసమే ఇస్తుండడంతో రుణ ఆస్తుల నాణ్యత నియంత్రణల్లోనే ఉంటుందని అంచనా వేసింది. రుణ వ్యయాలు తక్కువగా ఉండడంతో ఆస్తులపై రాబడి 3.5–.36 శాతం స్థాయిలో ఉండొచ్చని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ రంగంలో బడా సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానున్న నేపథ్యంలో మార్జిన్ల క్షీణత రిస్క్ ఉంటుందని.. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది. -
జీసీసీల్లో కొలువుల సందడి
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, జేఎల్ఎల్ ఇండియాతో కలిసి ట్యాగ్డ్ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 48 శాతం జీసీసీల్లో హైరింగ్‌ను పెంచుకోవడంపై సానుకూల సెంటిమెంటు నెలకొంది. 19 శాతం సంస్థలు 2024 ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే నియామకాలను కొనసాగించే యోచనలో ఉన్నాయి. ఇటు ఖర్చులు, అటు సమర్ధత మధ్య సమతౌల్యాన్ని పాటించేలా 1–5 ఏళ్ల అనుభవం గల వారిని రిక్రూట్ చేసుకోవడంపై జీసీసీలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. కెరియర్లో పెద్దగా పురోగతి లేకుండా 18–24 నెలల పాటు ఒకే హోదాలో ఉండిపోవడానికి జెనరెషన్ జెడ్ ప్రొఫెషనల్స్ ఇష్టపడకపోతుండటంతో, ఉద్యోగంలో కొనసాగే సగటు వ్యవధి గణనీయంగా తగ్గిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. వివిధ రంగాలవ్యాప్తంగా 100కు పైగా జీసీసీలపై అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. ప్రధాన హబ్‌లలోనే రిక్రూట్మెంట్.. ప్రధాన హబ్‌లుగా ఉంటున్న నగరాల నుంచే ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలని 60 శాతం జీసీసీలు భావిస్తున్నాయి. 29 శాతం సంస్థలు మాత్రం ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల మేళవింపుతో నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. ఇక 13 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి రిక్రూట్ చేసుకోనున్నాయి. కృత్రిమ మేథ (ఏఐ) కారణంగా జీసీసీల్లో నియామకాల ప్రక్రియలో గణనీయంగా మార్పులు వస్తున్నట్లు నివేదిక తెలిపింది. 48 శాతం జీసీసీలు ఏఐ ఆధారిత హైరింగ్ టూల్స్‌ను ఉపయోగించే యోచనలో ఉండగా, ఇప్పటికే 24 శాతం సంస్థలు వివిధ స్థాయుల్లో వాటిని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. -
కార్యాలయ ఉద్యోగులకు డిమాండ్
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూలైలో మెరుగయ్యాయి. ఈ మార్కెట్ 7 శాతం వృద్ధిని చూసినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ అధ్యయన నివేదిక ప్రకటించింది. ముఖ్యంగా నాన్ ఐటీ రంగాల్లో వైట్‌కాలర్ ఉద్యోగ నియామకాలు (శారీరక శ్రమ పెద్దగా అవసరం లేకుండా, సృజనాత్మకతతో చేసే పనులు) జరిగాయి. ఆతిథ్య రంగంలో 26 శాతం, బీమా రంగంలో 22 శాతం, విద్యా రంగంలో 16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 13 శాతం చొప్పున నియామకాలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గతేడాది జూలై నెలతో పోల్చితే ఐటీ రంగంలో నియామకాలు స్థిరంగా ఉన్నాయి. కృత్రిమ మేథ– మెషిన్ లెర్నింగ్ (ఏఐ–ఎంఎల్) నిపుణులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈ విభాగంలో నియామకాలు 41 శాతం పెరిగాయి. ‘‘నాన్ ఐటీ రంగాల్లో బలమైన నియామకాల ధోరణి కనిపించింది. ముఖ్యంగా ఫ్రెషర్ల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆతిథ్యం, బీమా, విద్యా రంగాల నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం ప్రోత్సాహాన్నిస్తోంది’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. నౌకరీ డాట్ కామ్ తన డేటా బేస్ ఆధారంగా ఉద్యోగ నియామకాల తీరుపై ప్రతి నెలా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదికను విడుదల చేస్తుంటుంది. ఫ్రెషర్లకు చాన్స్.. → ఫ్రెషర్ల నియామకాలు జూలైలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగాయి. → 16 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీజనల్ నిపు ణుల నియామకాలు 13% వృద్ధి చెందాయి. → యూనికార్న్ కంపెనీల్లో 23 శాతం, స్టార్టప్‌లలో 10 శాతం చొప్పున అధిక నియామకాలు నమోదయ్యాయి. → పశ్చిమాదిన నియామకాలు గణనీయంగా పెరిగాయి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వ్యాప్తంగా వృద్ధి కనిపించింది. → రాజస్థాన్‌లోనూ ఉదయ్‌పూర్‌లో 12 శాతం, → జోద్‌పూర్‌లో 11 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. → మహారాష్ట్రాలోని కోల్హాపూర్‌లో 21 శాతం అధికంగా ఉద్యోగ నియామకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఔరంగాబాద్, → నాగ్‌పూర్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. → గ్లోబల్ కేపబులిటీ కేంద్రాల్లో (జీసీసీలు) నియామకాలు 5 శాతం పెరిగాయి. → మెట్రోల్లో అత్యధికంగా 18 శాతం నియామకాల వృద్ధితో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. -
పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి ఎస్ఎంఎల్ ఇసుజు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్‌లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్ఎంఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్‌గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందింది. -
యూపీఐలో కొత్త మార్పులు వచ్చేశాయ్..
యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు వచ్చేశాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లలో డిజిటల్ చెల్లింపు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడమే లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అమలు చేస్తున్న ఈ మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పులు రోజువారీ ఉపయోగంలో పలు యూపీఐ ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. అవేంటో ఈ పథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం..ఆటోపే అభ్యర్థనలకు ప్రత్యేక సమయంఇకపై ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు లేదా సిప్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి సేవల కోసం యూపీఐ ఆటోపే అభ్యర్థనలు అర్ధరాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 7:00 గంటల మధ్య మాత్రమే చేసే వీలుంటుంది. పగటిపూట యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఏర్పాటు చేశారు.బ్యాలెన్స్ చెక్ లిమిట్యూపీఐ యాప్‌ల ద్వారా తరచూ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇకపై రోజువారీ పరిమితికి లోబడి ఉంటుంది. పరిమితి బహిరంగంగా పేర్కొనబడనప్పటికీ, చాలా మంది వినియోగదారులు రోజుకు కొన్నిసార్లు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఎటువంటి అంతరాయం కనిపించదు.లావాదేవీ ఫెయిలైతే వెంటనే తెలుస్తుందిపేమెంట్ ఫెయిల్యూర్స్ కు సంబంధించి కీలక అప్ డేట్స్ లో ఇది ఒకటి. ఒక లావాదేవీ విజయవంతమైందా లేదా విఫలమైందా అని యూపీఐ యాప్స్ కొన్ని సెకన్లలోనే ధృవీకరించాలి. ఇది వినియోగదారులు తమ చెల్లింపులను "ప్రాసెసింగ్" గా ఎక్కువ కాలం మార్క్ చేసినప్పుడు తరచుగా ఎదుర్కొనే నిరీక్షణ సమయాలను తగ్గిస్తుంది.బ్యాంకు అకౌంట్ లింక్‌కు కఠిన తనిఖీలుకొత్త బ్యాంకు ఖాతాలను యూపీఐతో అనుసంధానం చేసే విషయంలో భద్రతా నిబంధనలను కఠినతరం చేశారు. లింకింగ్ ప్రక్రియలో వినియోగదారులు తమ బ్యాంకుల నుండి అదనపు ధృవీకరణను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనధికారిక ఖాతా చేర్పులను నిరోధించడానికి దీన్ని అమలు చేస్తున్నారు. -
ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం!
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.నగరంలోనూ అదే పోకడ.. గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది. -
ఒక్క రూపాయికే వీసా.. రెండు రోజులే ఛాన్స్
విదేశాలకు వెళ్తున్న భారతీయులకు వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అట్లిస్ (Atlys) బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు 15 దేశాలకు కేవలం ఒక్క రూపాయికే వీసాలు ఇస్తామని తెలిపింది. 'వన్ వే అవుట్' పేరుతో ప్రకటించిన ఈ పరిమిత కాల ఆఫర్ ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణాలను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.వీసా సంబంధిత ఖర్చులు, తిరస్కరణలు పెద్ద ఆర్థిక భారంగా మారిన తరుణంలో అట్లిస్ రూ.1కే వీసా అందించడం విదేశీ ట్రిప్‌లకు వెళ్లే భారతీయులకు ఇది సువర్ణ అవకాశం. పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతీయ ప్రయాణికులు 2024లో మాత్రమే నాన్-రిఫండబుల్ వీసా ఫీజుల రూపంలో రూ .664 కోట్లకు పైగా నష్టపోయారు. అంతర్జాతీయ ప్రయాణాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని, వీసా దరఖాస్తులతో ముడిపడి ఉన్న ఆర్థిక ఆందోళనను తొలగించాలనుకుంటున్నామని అట్లిస్ సీఈఓ మోహక్ నహ్తా పేర్కొన్నారు.ఆఫర్ వర్తించే దేశాలుయూఏఈ, యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, హాంగ్ కాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతార్, కెన్యా, తైవాన్. ఈ-వీసా దేశాలకు రూ.1 ఆఫర్ అట్లిస్ సర్వీస్ ఫీజు ప్రభుత్వ రుసుము రెండింటినీ కవర్ చేస్తుంది. అయితే వీసా కోసం వ్యక్తిగత హాజరు అవసరమైన యునైటెడ్ స్టేట్స్, కొన్ని సెంజెన్ దేశాలకు (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మొదలైనవి)అట్లిస్ దరఖాస్తు రుసుము మాత్రమే కవర్ అవుతుంది. ఇక దరఖాస్తుదారు ప్రాసెసింగ్ కేంద్రం వద్ద కాన్సులేట్, బయోమెట్రిక్ ఫీజులు వంటి ప్రభుత్వ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్టులను కలిగి ఉండి, కంపెనీ వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే భారతీయ నివాసితులు మాత్రమే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. మీరు ఏజెంట్ లేదా థర్డ్ పార్టీని ఉపయోగిస్తే ఇది వర్తించదు. ఈ ఆఫర్ కింద మీరు ఒక వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఒక్కరికి మాత్రమే రూ.1 వీసా ఆఫర్ వర్తిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటే వారికి రెగ్యులర్ వీసా ఛార్జీలు వర్తిస్తాయి.గ్రూప్, బల్క్ లేదా బిజినెస్ బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. గమ్యస్థాన దేశ నిబంధనలను బట్టి ఫైనాన్షియల్ ప్రూఫ్ లేదా ట్రావెల్ బుకింగ్స్ వంటి ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలి.రాయబార కార్యాలయం డాక్యుమెంట్ నిబంధనలను నిర్ణయిస్తుంది కాబట్టి, మీ పత్రాలు తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉంటే మీ వీసా తిరస్కరించే అవకాశం ఉంటుంది. స్లాట్లను రాయబార కార్యాలయాలు నియంత్రిస్తున్నందున వీసా నియామకాలకు గ్యారంటీ ఉండదు.ఆఫర్ పొందండిలా.. రూ .1 వీసా ఆఫర్ పొందడానికి, అట్లిస్ వెబ్సైట్ (www.atlys.com)లో దరఖాస్తును ఆగస్టు 4 (ఉదయం 6 గంటలకు) నుండి ఆగస్టు 5 (రాత్రి 11:59 గంటలకు) మధ్య పూర్తి చేసి సమర్పించాలి. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆఫర్ ఉంటుంది. ఎవరు ముందుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ వెబ్ సైట్ లో సెల్ఫీ వెరిఫికేషన్ తప్పనిసరి. -
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్‌లో లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్‌లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌పై.. భారత్‌లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్‌లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్‌టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్‌లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్‌టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్‌లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్‌లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్‌లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్‌గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్‌లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్‌గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్ పోగొడితే?
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే.. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవడం కామనే! ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి.. చివరకు బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాక.. తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్ చెబితే? బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం.. అంతేకదా!?మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్ మహారాష్ట్ర పరెల్‌లోని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్‌లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. అన్ని ఈఎంఐలు కట్టేశాక, బ్యాంక్ నుంచి నో– డ్యూస్ సర్టిఫికెట్ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్ అందించాల్సిన సేల్‌డీడ్ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిసయ్యాయని వివరించింది. దీంతో ప్రదీప్ ‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్‌డీడ్ కాపీలు లేకపోవడంతో ఇంటిని విక్రయించలేకపోతున్నానని, పైగా ఈ ఘటనతో మానసిక వేదనకు గురయ్యాయని, విలువైన సమయం వృథా చేసినందుకు బ్యాంక్ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని’ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.పరిహారం సరిపోలేదు.. ప్రదీప్‌కు రూ.60 వేలు నష్ట పరిహారాన్ని బ్యాంకు చెల్లించాలని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగోట్టినందుకు, రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు, మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని వివరించింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్ షెట్టి.. మహారాష్ట్ర స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో స్టేట్ ఫోరం.. పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. 3 నెలల్లోపు కస్టమర్‌కు సర్టిఫైడ్ సేల్‌డీడ్ కాపీని అందించాలని, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఎవరైనా సరే ఇలా చేయండి కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్ శెట్టికే కాదు.. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్‌లు పోగోడితే.. కస్టమర్ పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్ సేల్‌డీడ్ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్‌లదే! ఇందుకోసం స్థానిక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను సంప్రదిస్తే చాలు! ఒకవేళ ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతర కారణాలతో మిస్ అయితే? దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ.. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సేల్ డీడ్ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ సేల్‌డీడ్ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్ రాసివ్వాలి.ఫామ్–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చేసి.. ప్రాపర్టీ జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రిక ప్రకటన జత చేసి సబ్ రిజిస్ట్రార్‌కు అందించాలి. నిర్ణయించబడిన ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. -
ఒక్క నెలలో 98 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ గత జూన్ నెలలో భారత్‌లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్‌లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేసింది.వాట్సాప్‌లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్‌లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. -
ఆటోల ధరలు ఖరారు.. ఎక్కువకు విక్రయించకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: ఆటో రిక్షా ధరలను రవాణాశాఖ ఖరారు చేసింది. ఎల్పీజీ ఆటో రిక్షా ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటో రిక్షా ధరను రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి అలాంటి బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా నియంత్రించింది.ఓఆర్ఆర్ పరిధిలో నడిపేందుకు వీలుగా సుమారు 65 వేల ఆటో పర్మిట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు కాగా, మరో 20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికే సీఎన్జీ లేదా ఎల్పీజీతో నడుస్తున్న సుమారు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు. 20 వేల ఆటోలకు ప్రొసీడింగ్‌లు.. అర్హులైన ఆటోడ్రైవర్లు దరఖాస్తు చేసుకొనేందుకు షోరూమ్‌లలోనే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను పరిశీలించి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రొసీడింగ్‌లు (అనుమతులను) ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఆటోరిక్షాలకు అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి కన్సల్టెంట్లు... ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ప్రొసీడింగ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు తెరలేపారు. షోరూమ్‌లలో ధరలను ఖరారు చేసినట్లుగా ఫైనాన్షియర్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆటోరిక్షా విక్రయాల్లో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. -
ఆన్లైన్లో సెర్చింగ్: త్రీడీ రూపంలో సమాచారం
గతంలో ప్రాపర్టీ కొనాలంటే పెద్ద ప్రహసనమే. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా సులువైపోయింది. ఉన్నత స్థాయి ఉద్యోగులు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రాపర్టీ కొనుగోళ్లకు పెద్దగా టైమ్ వేస్ట్ చేయడం లేదు. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉంది? ఎక్కడ ఏ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి? వసతులు, సౌకర్యాలు తదితర వివరాలను ప్రాపర్టీ పోర్టళ్లు అందిస్తున్నాయి. త్రీడీ రూపంలోనూ సమాచారం అందిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారుల పని సులువైపోయింది. – సాక్షి, సిటీబ్యూరోఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ తెలిపింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. -
అక్కడ అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్: పెరిగిన రెంట్
విద్యా సంస్థలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లలో కిరాయిలు హాట్‌కేక్‌లా మారాయి. – సాక్షి, సిటీబ్యూరోఅమీర్పేట, ఎస్ఆర్నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు 6 నెలల్లో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారెడ్‌పల్లి, అల్వాల్‌లో 20-25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు కిరాయి దారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి, పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10-15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10-15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20-25 వేలకు పైగా ఖర్చు చేస్తే తప్ప దొరకని పరిస్థితి.అడ్వాన్స్‌లు, మెయింటెనెన్స్‌ల భారం..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3-4 నెలలు అడ్వాన్స్‌లను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతోంది. 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
రెండు బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ ఆమోదం
సహకార బ్యాంకింగ్ విభాగంలో ఇటీవల మోసాలకు గురైన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎన్ఐసీబీ)ను సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎస్సీబీ)లో విలీనం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీనం అధికారికంగా 2025 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తేదీ నుంచి అన్ని ఎన్ఐసీబీ శాఖలు సారస్వత్ బ్యాంక్‌లో భాగంగా పనిచేస్తాయి.సారస్వత్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..ఎన్ఐసీబీ డిపాజిటర్లతో సహా ఖాతాదారులను 2025 ఆగస్టు 4 నుంచి సారస్వత్ బ్యాంక్ కస్టమర్లుగా పరిగణిస్తామని తెలిపింది. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పేర్కొంది. ఈ విలీన ప్రక్రియలో భాగంగా ఎన్ఐసీబీ ఆస్తులు, అప్పులన్నింటినీ సారస్వత్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది. డిపాజిట్లు, అడ్వాన్సులతో సహా ఎన్ఐసీబీ బ్యాంకింగ్ కార్యకలాపాలను సారస్వత్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు.ఈ విలీనంతో సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా మారుతుంది. మార్చి 31, 2025 నాటికి మొత్తం వ్యాపారం (డిపాజిట్లు + అడ్వాన్సులు) రూ.91,800 కోట్లుగా ఉంది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ మార్చి 2025 నాటికి మొత్తం రూ.3,500 కోట్ల వ్యాపారం సాగించింది. ఇదీ చదవండి: బీర్ పరిశ్రమలో ఊహించని సమస్య2025 ఫిబ్రవరిలో న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు చెందిన ప్రభాదేవి ప్రధాన కార్యాలయం, గోరేగావ్ శాఖలో ఆర్బీఐ సాధారణ తనిఖీ సమయంలో రూ .122 కోట్ల అవకతవకలను కనుగొంది. ఫిజికల్ క్యాష్, లెడ్జర్ ఎంట్రీల మధ్య వ్యత్యాసాలతో వాల్ట్ల్లోని నగదులో మోసం జరిగినట్లు ధ్రువీకరించింది. -
‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానం
'భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయింది' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలంగా మారింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా?, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ నిజంగా చనిపోయిందా అని తెలుసుకోవడానికి.. అమెరికా సృష్టించిన ఐదు ప్రధానమైన ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ప్రశ్నిస్తే.. ఎలాంటి సమాధానం ఇచ్చాయో ఈ కథనంలో చూసేద్దాం.ప్రశ్న: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందా?చాట్‌జీపీటీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా చనిపోలేదు. ఇది డైనమిక్, ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.గ్రోక్: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని గ్రోక్ పేర్కొంది.జెమిని: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోందని గూగుల్ జెమిని స్పష్టం చేసింది.మెటా ఏఐ: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెప్పింది.కోపైలెట్: భారతదేశ ఆర్ధిక వ్యవస్థ డెడ్ ఎకానమీ కాదు, ఇది పూర్తిగా వ్యతిరేకం అని కోపైలెట్ వెల్లడించింది.ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలుభారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు.ఇండియానే ఆధారం''ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి'' అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. -
గూగుల్ ప్లేలో రియల్ మనీ గేమ్స్
చట్టబద్ధమైన రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) అన్నింటిని భారత్‌లోని తమ ప్లేస్టోర్‌లో అనుమతించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ ప్రతిపాదన చేసింది.ఎంపిక చేసిన నిర్దిష్ట డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (డీఎఫ్ఎస్), రమ్మీ యాప్‌లకు మాత్రమే ప్లేస్టోర్‌లో చోటు కల్పించే ప్రయోగాత్మక ప్రోగ్రాంను నిలిపివేసే విధంగా ఇది ఉండనుంది. మరోవైపు, నైపుణ్యాల ఆధారిత గేమ్స్‌ను ప్రమోట్ చేసేందుకు వీలుగా తమ యాడ్ పాలసీలో కూడా మార్పులు చేసే యోచన ఉన్నట్లు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి గూగుల్ తెలిపింది.మార్కెట్లో పోటీని దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందన్న విన్జో గేమ్స్ ఫిర్యాదుపై సీసీఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో గూగుల్ ఈ మేరకు ప్రతిపాదన చేసింది. దీనిపై ఆగస్టు 20 లోపు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. -
బీర్ పరిశ్రమలో ఊహించని సమస్య
భారతీయ బీర్ పరిశ్రమ ఊహించని సమస్యలతో సతమతం అవుతుంది. దాదాపు రూ.38,000 కోట్లకు పైగా విలువైన ఈ విభాగం బీర్ నింపేందుకు అల్యూమినియం డబ్బాల కొరత ఎదుర్కొంటుంది. బ్రేవరేజ్ సంస్థల అంచనాబట్టి సుమారు 12-13 కోట్ల 500 మిల్లీలీటర్ల డబ్బాల వార్షిక లోటు ఉంది. ఇది మొత్తం డిమాండ్‌లో సుమారు 20% ఉండడం గమనార్హం. ఈ కొరత బీర్ క్యాన్ల లోటును తెలియజేయడంతోపాటు పెరుగుతున్న డిమాండ్, తగినంత దేశీయ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రపంచ సరఫరా పరిమితులు, కొత్త నియంత్రణ ఒత్తిళ్లను హైలైట్ చేస్తుంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే పరిశ్రమ వృద్ధి మందగించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.క్యాన్లకు పెరుగుతున్న డిమాండ్ఒకప్పుడు సీసాల తర్వాత అల్యూమినియం క్యాన్లు సెకండరీ ప్యాకేజింగ్ ఎంపికగా ఉండేవి. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఇవే ప్యాకింగ్‌లో ప్రధానంగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద బీర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్(యూబీఎల్) క్యాన్ల మొత్తం పరిమాణంలో 22% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య ఉత్తర ప్రదేశ్ వంటి అధిక వృద్ధి ఉన్న మార్కెట్లలో 75–80% వరకు పెరిగింది. ఆ రాష్ట్రంలోని ఎక్సైజ్ విధాన మార్పులు క్యాన్లను చౌకగా, వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి.పరిమిత సరఫరా మౌలిక సదుపాయాలుదేశంలో కేవలం మూడు అల్యూమినియం క్యాన్ల తయారీ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అందులో రెండింటిని విదేశీ యాజమాన్యంలోని కాన్ప్యాక్, బాల్ కార్పొరేషన్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. క్యాన్ ఉత్పత్తికి అవసరమైన అల్యూమినియంలో గణనీయమైన భాగం ఇతర దేశాల నుంచే దిగమతి చేసుకుంటున్నారు. ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాల ప్రభావం దీనిపై అధికంగా ఉంది.సాఫ్ట్‌డ్రింక్స్‌లో..నాన్ ఆల్కహాలిక్ విభాగంలో క్యాన్లకు డిమాండ్ పెరగడంతో బీర్ క్యాన్ల కొరత తీవ్రమవుతోంది. కోకాకోలా, పెప్సికో వంటి శీతల పానీయాల దిగ్గజాలు క్యాన్ ఆధారిత ఉత్పత్తులను వేగంగా పెంచుతున్నాయి.రెగ్యులేటరీ నిబంధనలుఏప్రిల్ 2025లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దిగుమతులతో సహా అన్ని అల్యూమినియం డబ్బాలకు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అందులో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను (క్యూసీఓ) అమలు చేస్తుంది. నాణ్యత, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నప్పటికీ తక్షణ డిమాండ్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. బీఐఎస్ సర్టిఫికేషన్‌కు విదేశీ తయారీ ప్లాంట్లను ఫిజికల్‌గా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందులో జాప్యం జరుగుతుంది.ఇండస్ట్రీ ఇబ్బందులుబీఐఎస్ సర్టిఫికేషన్ అమలును ఒక సంవత్సరంపాటు (2026 ఏప్రిల్ వరకు) వాయిదా వేయాలని బ్రేవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రభుత్వాన్ని కోరింది. బీఐఎస్ సర్టిఫికేషన్ అవసరాన్ని దేశీయ ఉత్పత్తిదారులకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పింది. దిగుమతులపై ఆంక్షలు విధించకూడదని తెలిపింది. ఇప్పటికే యూబీఎల్ విభిన్న మార్కెట్లలో క్యాన్ల కొరత ఉందని తెలిపింది. దాంతో గత ఆరు నెలల్లో 1–2 శాతం నష్టాన్ని అంచనా వేసింది.ఇదీ చదవండి: యాపిల్‌లో ఇంజినీర్ కనీస వేతనం ఎంతంటే..ఇప్పుడు ఏం చేయాలి?క్యాన్ల సంక్షోభం మరింత పెరగకుండా నిరోధించడానికి బ్రేవరేజెస్, ఇతర సంస్థలు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని సూచిస్తున్నారు. కొత్త క్యాన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలంటున్నారు. టెక్నాలజీ, వీటి ఏర్పాటుకు మూలధనం కోసం గ్లోబల్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు చేపట్టాలని చెబుతున్నారు. -
టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి "ఆటోపైలట్" డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు ఈ జరిమానా విధించింది.2019లో కీ లార్గోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నైబెల్ బెనవిడెస్ లియోన్ మరణించగా, ఆమె ప్రియుడు డిల్లాన్ అంగులో గాయపడ్డాడు. ఆ సమయంలో 'జార్జ్ మెక్‌గీ' టెస్లా కారు నడుపుతున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ (టెస్లా కార్లలోని ఒక ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టం) ఆన్ చేసి ప్రయాణిస్తున్న సమయంలో.. తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడింది. ఆ సమయంలో వంగి ఫోన్ తీసుకున్న సమయంలో కారు రోడ్దుపై ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు తీర్పునిస్తూ 329 మిలియన్ డాలర్లు పరిగహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా చెల్లించాలని.. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పుపై టెస్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. -
యాపిల్‌లో ఇంజినీర్ కనీస వేతనం ఎంతంటే..
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ విదేశీ ఉద్యోగుల ప్యాకేజీ వివరాలను వెల్లడించింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కు సమర్పించిన వివరాల ప్రకారం వివిధ హోదాల్లో పని చేస్తున్న కంపెనీ ఇంజినీర్ల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి. ఇందులో ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్ట్‌లు.. ఉన్నారు.ఇంజినీరింగ్ ఉద్యోగాలు (వార్షిక మూల వేతనం యూఎస్ డాలర్లలో)సీపీయూ ఇంప్లిమెంటేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 2,64,200టెస్ట్ ఇంజినీర్ డిజైన్: 1,31,352 - 2,93,800డిజైన్ వెరిఫికేషన్: 1,03,164 - 3,12,200ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్: 1,08,160 - 2,64,200ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ / ప్రోగ్రామ్ మేనేజర్: 1,05,550 - 3,01,400ఎఫ్ఈ ఇంజినీరింగ్: 1,25,694 - 3,12,200హార్డ్ వేర్ డెవలప్మెంట్: 1,24,942 - 2,93,800హార్డ్‌వేర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,25,495 - 3,78,700మాడ్యూల్ డిజైన్ ఇంజినీర్: 1,08,796 - 3,29,600ఫిజికల్ డిజైన్ ఇంజినీర్: 1,01,982 - 3,41,200ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజినీర్: 1,22,800 - 2,93,800సిలికాన్ వాలిడేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 3,29,600సిస్టమ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్: 1,03,164 - 3,12,200టూల్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీర్: 1,05,602 - 2,93,800వైర్లెస్ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,28,300 - 3,12,200వైర్లెస్ సిస్టమ్స్ వాలిడేషన్ ఇంజినీర్: 1,26,672 - 3,12,200డేటా ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)డేటా ఇంజినీర్: 1,05,602 - 2,34,700డేటా సైంటిస్ట్: 1,05,550 - 3,22,400మెషీన్ లెర్నింగ్ (జనరల్): 1,26,880 - 3,29,600మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్: 1,43,100 - 3,12,200మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్: 1,14,100 - 3,12,200ఇదీ చదవండి: చెంత ఏఐ ఉందిగా..!సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)ఏఆర్/వీఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్: 1,29,805 - 3,12,200హ్యూమన్ ఇంటర్ఫేస్ డిజైనర్: 1,35,400 - 4,68,500సాఫ్ట్వేర్ డెవలపర్: 1,32,267 - 2,64,200సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్: 1,32,267 - 3,78,700సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ - అప్లికేషన్స్: 1,32,267 - 3,78,700 -
భారీగా పెరిగిన బంగారం ధరలు
ధరలు తగ్గుతున్నాయని సంబరపడేలోపే.. బంగారం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నేడు గరిష్టంగా రూ. 1530 పెరిగిన ధరలు పసిడి ప్రియులను అవాక్కయేలా చేసింది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు (శనివారం) పసిడి రేటు తారాజువ్వలా పైకి లేచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆర్బీఐ కొత్త ప్రతిపాదన
బ్యాంకులు తమ డిజిటల్ ఛానళ్లపై థర్డ్ పార్టీ (ఇతర సంస్థలకు చెందిన) ఉత్పత్తులను ప్రదర్శించరాదంటూ ఆర్బీఐ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, బ్యాంక్ గ్రూపు సబ్సిడరీలు/జేవీలు/అసోసియేట్లకు సైతం ఇది వర్తించనుంది.రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాన్ని బ్యాంక్‌లు అమల్లోకి తీసుకురావాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల లావాదేవీల తీరును అధ్యయనం చేయడం, అసాధారణ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల ఆమోదాన్ని ముందస్తుగా పొందడం వంటివి కొత్త రిస్క్ నిర్వహణ విధానం కింద ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆగస్ట్ 11 వరకు వీటిపై భాగస్వాముల నుంచి సలహా, సూచనలను ఆహ్వానించింది. -
చెంత ఏఐ ఉందిగా..!
కృత్రిమ మేధ సహాయంతో కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసాధారణ పెట్టుబడి వ్యూహాలు ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా అందుకు తగినట్లుగా మారాలని చెప్పారు. అందుకు కృత్రిమ మేధను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. అందుకోసం కంపెనీ అంతర్గతంగా కొన్ని మోడల్స్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు.‘ఉత్పాదకతను పెంచడానికి మనం మరింత సాధించాలని అనుకుంటున్నాను. మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గూగుల్ ప్రస్తుత పనితీరుపై ఆశావహంగా ఉన్నాను’ అని సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల (ఎస్‌డబ్ల్యూఈ) కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొన్ని సాధనాలను వివరించారు. కంపెనీ అవసరాలను తీర్చడానికి కృత్రిమ మేధను మరింత వేగంగా, అత్యవసరంగా కోడింగ్ వర్క్‌ఫ్లోలో అమలు చేయాలని చెప్పారు. దీనిద్వారా పనిలో వేగం పెరుగుతుందన్నారు.ఇదీ చదవండి: మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనంగూగుల్ ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల కోసం టెక్నికల్ ఫౌండేషన్ బృందాలకు నేతృత్వం వహిస్తున్న బ్రియాన్ సలుజో ‘ఏఐ-సావీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఏఐ సావీ గూగుల్.. కోర్సులు, టూల్కిట్లు, ప్రొడక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ సెషన్లను అందించే ఒక అంతర్గత వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో గూగుల్ జెమినీ మోడల్స్‌తో ఇంజినీర్లకు సహాయపడటానికి డీప్ మైండ్‌తో అభివృద్ధి చేసిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
డేట్ ఫిక్స్.. ఇండియాలో టెస్లా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అక్కడే
అమెరికన్ కార్ల దిగ్గజం 'టెస్లా' భారత మార్కెట్లో తమ మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. కాగా ఇప్పుడు మొదటి ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించడానికి సన్నద్ధమైంది. టెస్లా వై కారును ఆవిష్కరించిన తరువాత.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.టెస్లా భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్‌ను ఆగస్టు 4న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారభించనుంది. కొత్త టెస్లా ఛార్జింగ్ హబ్‌లో మొత్తం ఎనిమిది ఛార్జింగ్ యూనిట్లు ఉంటాయి. ఇందులో నాలుగు వీ4 సూపర్చార్జర్లు (DC ఫాస్ట్ ఛార్జర్లు), నాలుగు డెస్టినేషన్ ఛార్జర్లు (AC ఛార్జర్లు).వీ4 సూపర్చార్జర్లు kWhకి రూ.24, డెస్టినేషన్ ఛార్జర్లు kWhకి రూ.14 చొప్పున ఛార్జ్ ఉంటుంది. V4 సూపర్చార్జర్లు మోడల్ Y కి 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల పరిధిని అందించడానికి కావాల్సిన ఛార్జ్ చేయగలదని టెస్లా పేర్కొంది. అంటే టెస్లా వై కారుకు 15 నిముషాలు సూపర్‌చార్జర్ ద్వారా ఛార్జ్ చేస్తే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం& గేట్‌వే ఆఫ్ ఇండియా మధ్య ఐదు ట్రిప్పులు తిరగవచ్చని కంపెనీ వెల్లడించింది.టెస్లా మోడల్ వైభారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనం
కృత్రిమ మేధస్సు(ఏఐ) విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ హంటింగ్ అనూహ్య స్థాయికి చేరుకుంది. ఓపెన్ఏఐ అగ్ర నిపుణులను ఆకర్షించడానికి మెటా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.870 కోట్లు) బోనస్‌ను సైతం ఆఫర్ చేస్తున్న తరుణంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ వైరల్‌గా మారింది. మెటా వంటి పోటీదారుల నుంచి వచ్చే వేతన ఆఫర్లు కంపెనీల సంస్కృతిని నాశనం చేస్తాయని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు.ఇతర కంపెనీలు ఆఫర్ చేసే ఆర్థిక ప్రోత్సాహకాల కంటే ఆంత్రోపిక్ తన మిషన్ పట్ల నిబద్ధతగా వ్యవహరించాలని ఆయన ఉద్యోగులను కోరారు. మెటా అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే తప్పుడు ఆలోచనతో ఉందన్నారు. మెటా తీరు ఇతర కంపెనీల సంస్కృతిని నాశనం చేసేలా ఉందని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు. ఆంత్రోపిక్ ఉద్యోగులకు వేతన ఆఫర్ల కంటే కంపెనీ మిషన్ ప్రధానమని చెప్పారు. మెటా ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల కారణంగా సంస్థాగత సమగ్రతను కాపాడుకుంటూ కీలక ప్రతిభావంతులను నిలుపుకోవడంపై పరిశ్రమలో ఇతర కంపెనీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
ఉజ్వల భవిష్యత్తు కోసం.. ఎల్ఐసీ స్కీమ్: నెలకు రూ.7000 అకౌంట్లోకి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'ఎల్ఐసీ బీమా సఖి యోజన'ను ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటంటే.. మహిళలకు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని అందించడం మాత్రమే కాకుండా.. దీని ద్వారా వారికి సాధికారత కల్పించడం, బీమా అవగాహన.ఎల్ఐసీ బీమా సఖి యోజన గురించిదేశవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా.. ఎల్ఐసీ బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో మహిళలు బీమా సఖీలుగా మారడానికి శిక్షణ ఇస్తారు.ఎల్ఐసీ బీమా సఖి పథకం మహిళలు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సాధికారత వైపు అడుగులు వేయడానికి వీలు కల్పిస్తుంది. బలమైన మహిళలు, బలమైన భవిష్యత్తు అంటూ.. ఎల్ఐసీ ఇండియా ట్వీట్ చేసింది.దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలుకనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.కావలసిన డాక్యుమెంట్స్➤జనన ధ్రువీకరణ పత్రం➤అడ్రస్ ప్రూఫ్➤విద్యా అర్హత సర్టిఫికేట్స్➤లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలుస్టైఫండ్ వివరాలుఎల్ఐసీ బీమా సఖి యోజన పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7000, రెండో ఏడాది రూ.6000, మూడో ఏడాది రూ.5000 ఉంటుంది. అంతే కాకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుప్రస్తుత ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగుల దగ్గర బంధువులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు), పదవీ విరమణ చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.Strong Women, Stronger Futures!LIC's Bima Sakhi scheme helps women build a brighter future, enabling them to take steps towards self-reliance and empowerment.Swawalambi Naari,Khushhali Hamari#LIC #BimaSakhi #WomenEmpowerment pic.twitter.com/cVuY3Xha42— LIC India Forever (@LICIndiaForever) July 17, 2025 -
పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లు
మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించి రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ రూ.6,017 కోట్ల విలువ చేసేవి వెనక్కి తిరిగి రాలేదు. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. 2023 మే 19 నాటికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల వలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 2025 జూలై 31 నాటికి రూ.6,017 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐనాడు చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో 98.31 శాతం వెనక్కి వచ్చినట్లు తెలిపింది. తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ఇష్యూ ఆఫీసుల వద్ద వీటిని మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. తమ వద్దనున్న 2,000 నోట్లను బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్‌కు పోస్ట్ ద్వారా పంపొచ్చు. -
భారత్‌లో యాపిల్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం
జూన్ త్రైమాసికంలో భారత్ సహా ఇరవై నాలుగు మార్కెట్లలో రికార్డు స్థాయిలో ఆదాయాలు సాధించినట్లు అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్లు, మ్యాక్, సర్వీసులు మొదలైన విభాగాలు ఇందుకు దోహదపడినట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ ఐఫోన్ల విక్రయాలు పెరిగాయని, భారత్‌తో పాటు దక్షిణాసియా, బ్రెజిల్‌లాంటి వర్ధమాన మార్కెట్లలో రెండంకెల స్థాయి వృద్ధి నమోదైందని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ‘ఏఐకి అంత సీన్ లేదు’మరోవైపు, అమెరికా టారిఫ్‌ల అంశం తీసుకుంటే 800 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త టారిఫ్లేమీ లేకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 1.1 బిలియన్ డాలర్లకు చేరొచ్చని కుక్ వివరించారు. జూన్ త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 10 శాతం పెరిగి 94.04 బిలియన్ డాలర్లకు, లాభం 9.2 శాతం పెరిగి రూ.23.42 బిలియన్ డాలర్లకు చేరింది. -
భారత వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది. ‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది. టారిఫ్‌ల ప్రభావం అధిగమించొచ్చు.. భారత కంపెనీలపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్‌లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్‌పై 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్‌ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్‌కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్‌ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది. -
టారిఫ్‌ల భారం.. సగమే!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల దాదాపు సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎక్స్‌పోర్ట్స్‌పై సుంకాల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నాయి. టెక్స్టైల్స్/క్లోతింగ్ (10.3 బిలియన్ డాలర్లు), రత్నాభరణాలు (12 బి.డా.), రొయ్యలు (2.24 బి.డా.), లెదర్.. ఫుట్‌వేర్ (1.18 బి.డా.), రసాయనాలు (2.3 బి.డా.), ఎలక్ట్రికల్.. మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) రంగాలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించాయి. అమెరికాకు 5.33 బిలియన్ డాలర్ల విలువైన అపారెల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఒక ఎగుమతిదారు తెలిపారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్ గూడ్స్‌లాంటి సుమారు సగం పైగా పరిశ్రమలు మినహాయింపు కేటగిరీలో ఉన్నందున మిగతా సగం కేటగిరీలపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024–25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) నమోదైంది. ఏపీఐలు, సర్క్యూట్లకు మినహాయింపులు.. ఫినిష్డ్ ఫార్మా ఉత్పత్తులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), అలాగే ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైన్డ్ ఇంధనాలు, బొగ్గు, విద్యుత్‌లాంటి ఎనర్జీ ఉత్పత్తులు, కీలకమైన లోహాలు, ఎల్రక్టానిక్స్.. సెమీకండక్టర్లు మొదలైన వాటికి 25 శాతం టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉంటుందని జీటీఆర్ఐ తెలిపింది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే రవాణాలో ఉన్నవి, ఆగస్టు 7 నాటికల్లా అమెరికాకు చేరేలా ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. టారిఫ్‌ల వల్ల ఫ్యాక్టరీలు మూతబడకుండా నడిపించడానికి, ఉద్యోగులను తీసివేయకుండా ఉండటానికి ఎగుమతిదారులు.. ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఏఈపీసీ చైర్మన్ సు«దీర్ సెఖ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకాలపరమైన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులు కూడా ఇతరత్రా మరిన్ని మార్కెట్లకు విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
యూపీఐ సరికొత్త రికార్డ్
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జూలైలో సరికొత్త రికార్డులకు చేరాయి. 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.20.64 కోట్లతో పోల్చిచే 20 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది మే నెలలో నమోదైన 18.67 బిలియన్ లావాదేవీలు (విలువ రూ.25.14 లక్షల కోట్లు) ఇంతకుముందు వరకు గరిష్ట రికార్డుగా ఉంది. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు 85 శాతంగా ఉన్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులోకి రావడం గమనార్హం. యూపీఐపై కొత్త పరిమితులు యూపీఐ నెట్‌వర్క్‌పై రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్పీసీఐ కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాలోఎంత బ్యాలన్స్ ఉందన్నది రోజులో 50 సార్ల వరకే పరిశీలించుకోగలరు. ఇంతకుముందు ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. యూపీఐ లింక్డ్ అకౌంట్లను సైతం 25 సార్లే చూసుకోగలరు. ఒక మొబైల్ నంబర్‌కు లింక్ అయి, 12 నెలలకు పైగా ఇనాక్టివ్‌గా ఉన్న (కార్యకలాపాలు లేని) యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. -
వాహన విక్రయాలు.. స్లోడౌన్
ముంబై: దేశీయంగా డిమాండ్ స్తబ్దత కొనసాగడంతో జూలైలోనూ వాహన విక్రయాలు నెమ్మదించాయి. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ విక్రయాలు స్వల్పంగా పెరగ్గా.., హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు తగ్గాయి. మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా ఇండియా విక్రయాల్లో రెండంకెలు, ఒక అంకె వృద్ధి నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూలైలో 1,37,776 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది జూలైలో అమ్ముడైన 1,37,463 వాహనాలతో పోలిస్తే స్వల్పంగా 0.22% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 9,960 నుంచి 6,822 యూనిట్లకు తగ్గాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 10% క్షీణించి 43,973 యూనిట్లకు వచ్చి చేరింది. ‘వాహన పరిశ్రమ గత కొన్ని నెలలుగా డిమాండ్ లేమి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పండుగ సీజన్‌పై ఆశావహంగా ఉన్నాం. పూర్తి స్థాయి సరఫరా, నూతన ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాం’ అని హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు మహీంద్రా యుటిలిటీ వాహన సేల్స్ 20% వృద్ధి తో 49,871 యూ నిట్లుగా నమోదైంది. -
బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
దేశీయ మార్కెట్లో 7 సీటర్ కార్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ విభాగంలో కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 15 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 ఉత్తమమైన వాహనాలను గురించి తెలుసుకుందాం..➢రెనాల్ట్ ట్రైబర్: రూ. 6.3 లక్షల నుంచి రూ. 9.17 లక్షలు➢మారుతి ఎర్టిగా: రూ. 9.12 లక్షల నుంచి రూ. 13.41 లక్షలు➢మహీంద్రా బొలెరో: రూ. 9.81 లక్షల నుంచి రూ. 10.93 లక్షలు➢మహీంద్రా బొలెరో నియో: రూ. 9.97 లక్షల నుంచి రూ. 12.18 లక్షలు➢టయోటా రూమియన్: రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు➢కియా కారెన్స్: ప్రారంభ ధర రూ. 11.41 లక్షలు➢కియా క్లావిస్: రూ. 11.50 లక్షల నుంచి రూ. 19.50 లక్షలు➢సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్: రూ. 12.50 లక్షల నుంచి రూ. 14.60 లక్షలు➢మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ప్రారంభ ధర రూ. 13.77 లక్షలు➢మహీంద్రా స్కార్పియో ఎన్: ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
‘దేశం నుంచి పారిపోకుండా’.. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం (ఆగస్ట్1న) సర్క్యులర్ జారీ చేసింది.లుకౌట్ నోటీసులు కంటే ముందు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవులు సహా అన్ని ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లకు దీనిని పంపిస్తుంది. దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అలాంటి నోటీసులు జారీ చేయబడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఈడీ అధికారులు అప్రమత్తం చేస్తారు. రూ.3,000 కోట్ల రుణాలను 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. ఎస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది. -
జులైలో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎస్టీ (GST) వసూళ్లు జూలై 2025లో రూ. 1,95,735 కోట్లు. ఇది జూలై 2024తో (రూ.1,82,075 కోట్లు) పోలిస్తే 7.5% పెరుగుదలను సూచిస్తుంది. వరుసగా ఏడవ నెల రూ.1.8 లక్షల కోట్లకు పైన జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.ఏప్రిల్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి, కానీ మే నెలలో రూ.2.01 లక్షల కోట్లకు తగ్గాయి. జూలైలో నికర దేశీయ ఆదాయం 0.2 శాతం తగ్గింది, నికర మొత్తం వసూళ్లు కేవలం 1.7 శాతం పెరిగి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ట్రంప్ భారతదేశంపై విధించిన అధిక సుంకాలు.. వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల కారణంగా వృద్ధి 0.3 శాతం పాయింట్ల తగ్గుదలను కలిగి ఉంటుందని ఆగస్టు 1న ఆర్థికవేత్తలు గుర్తించారు. భారతదేశానికి కేటాయించిన 25 శాతం సుంకాలు చాలా ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్‌ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్‌బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్‌బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
సరికొత్త బీఎస్ఏ బైకులు ఇవే - వివరాలు
బ్రిటిష్ బ్రాండ్ 'బీఎస్ఏ మోటార్‌సైకిల్స్' తన సరికొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650, బీఎస్ఏ బాంటమ్ 350 లను ఆవిష్కరించింది. 1861 నాటి వారసత్వం కనిపించేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది.బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650కొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 క్లాసిక్ 652సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ద్వారా 45 పీఎస్ పవర్, 55 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 41mm టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్‌తో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇందులో ఉన్నాయి.థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ యెల్లో అనే మూడు రంగులలో లభించే ఈ బైక్.. డ్యూయల్ ఛానల్ ABSతో బ్రెంబో బ్రేక్‌లు, గ్రిప్పీ పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్టీఆర్ టైర్లు, వైర్ స్పోక్ అల్లాయ్ రిమ్ వంటివి పొందుతుంది. 12 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 218 కేజీలు.బీఎస్ఏ బాంటమ్ 350బీఎస్ఏ బాంటమ్ 350 నిజమైన క్లాసిక్‌కు నిదర్శనం.ఇది 334 సీసీ లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్ కలిగి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 7750 rpm వద్ద 29PS పవర్ 6000rpm వద్ద 29.62Nm టార్క్ అందిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.రౌండ్ హెడ్‌లైట్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వంపుతిరిగిన రియర్ ఫెండర్ కలిగిన ఈ బైక్ అవలోన్ గ్రే, ఆక్స్ఫర్డ్ బ్లూ, ఫైర్‌క్రాకర్ రెడ్, బారెల్ బ్లాక్, విక్టర్ యెల్లో వంటి రంగులలో లభిస్తుంది. -
ఇంటికొచ్చి వంట చేస్తాడు.. రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు
ఈరోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కన్నా చిరు వృత్తులు చేసేవారే అధికంగా సంపాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ముంబైకి చెందిన ఆయుషి దోషి అనే న్యాయవాది సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆదాయ అసమానతలు , నైపుణ్యం కలిగిన కార్మికుల నిర్వచనం గురించి విస్తృతమైన చర్చకు దారితీసింది.స్థానికంగా 'మహారాజ్' అని పిలిచే ఆమె ఇంట్లో పనిచేసే వంటమనిషి కార్పొరేట్ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్కో ఇంట్లో ఆయన కేవలం 30 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాడు. ఇందుకు ఒక్కో ఇంటికి రూ.18,000 సంపాదిస్తున్నారు. ఆయన ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని 10-12 ఇళ్లలో పనిచేస్తున్నాడు. అంటే అతని నెలవారీ సంపాదన రూ .1.8 లక్షల నుంచి రూ.2.16 లక్షల మధ్య ఉంటుంది. ఇది చాలా మంది వైట్-కాలర్ నిపుణుల జీతాల కంటే ఎక్కువ.విజయానికి ఒక రెసిపీ! దోషి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో వంటమనిషి సమర్థవంతమైన పని నమూనాను హైలైట్ చేశారు. ‘ఒక్కో ఇంటికి రూ.18,000 తీసుకుంటాడు. రోజూ 10-12 ఫ్లాట్లలో పనిచేస్తాడు. ఒక్కో ఇంటికీ 30 నిమిషాలే కేటాయిస్తాడు. భోజనం, టీలు ఉచితం. సమయానికి పేమెంట్’ అంటూ ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు.అయితే అందరు వంటవాళ్లూ ఇలాగే సంపాదిస్తున్నారని కాదు.. అద్భుతమైన నైపుణ్యం, దశాబ్దానికి పైగా నిర్మించుకున్న పేరు ఆయనకు ఎక్కువ సంపాదనను తెచ్చిపెడుతోంది. మరోవైపు చాలా మంది వంటవాళ్ల సంపాదన రూ.10,000 నుంచి రూ.12,000 మించడం లేదని, వేగం, పరిశుభ్రత, స్థిరత్వానికి పేరుగాంచిన వారు గణనీయంగా ఎక్కువ సంపాదించవచ్చని దోషి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. -
బంపరాఫర్.. ఒక్క రూపాయి రీఛార్జ్‌తో అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అంటూ ట్వీట్ చేసింది.భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.Azadi ka plan at just Rs. 1/- & get true digital freedom with BSNL.With 30 days of unlimited calls, 2GB data/day, 100 SMS/day, and a free SIM. Applicable for new users only.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/L9KoJNVaXG— BSNL India (@BSNLCorporate) July 31, 2025 -
Stock market: భారీ నష్టాలు.. నెత్తురు కక్కిన ఫార్మా షేర్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 585.67 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 81,317.51 -80,495.57 శ్రేణిలో ట్రేడ్ అయింది.ఇక 24,784.15 -24,535.05 రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 203 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,565.35 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ 4.43 నుంచి 2.41 శాతం మధ్య నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.33 శాతం, 1.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్‌లో టాప్‌లో ఉండి 3.33 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లో అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వరుసగా 5.17 శాతం, 4.89 శాతం నష్టపోయాయి. అస్థిరత సూచీ, ఇండియా (విఐఎక్స్) 3.74 శాతం పెరిగి 11.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక సంక్షోభం గురించి, బంగారం & వెండి కొనుగోలు గురించి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల గురించి పలుమార్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ముఖ్యమైన ప్రశ్న అంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.మనం నియంత్రించే రెండు అత్యంత విలువైన ఆస్తులు.. మన సమయం, డబ్బు. వేలాది మంది ప్రజలు సమయాన్ని, డబ్బును తమ బాడీ, మైండ్, స్పిరిట్ కోసం కేటాయిస్తున్నారు. ఇది గొప్ప విషయమే. అయితే 'మీరు మీ సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?' అని తన ఎక్స్ వేదికగా ప్రశ్నింస్తూ.. జాగ్రత్తగా ఉండు అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.At at Ken McElroy’s LIMITLESS Event in Dallas. Thousands of people..great speakers. Priceless. I have leaned a lot….not all of it pleasant. Two most valuable assets we control….our time and our money.Grateful that thousands of people give both their time and their…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 1, 2025 -
సీఈవో రాజీనామా.. కుప్పకూలిన షేర్లు
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 17 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో రూ.819.25 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గిరిష్ కౌస్గీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఈ పతనం చోటుచేసుకుంది. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశ, స్థిరత్వంపై పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగించింది.నాయకత్వ శూన్యం2022 అక్టోబర్‌లో నాలుగేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన గిరీష్ కౌస్గీ 2025 అక్టోబర్ 28న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ తన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయడం వల్ల వారసత్వ ప్రణాళిక, నాయకత్వ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.అయితే కంపెనీ మాత్రం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార దృష్టి, వృద్ధి మార్గం యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇస్తోంది. కొత్త సీఈవో కోసం బోర్డు అనుభవజ్ఞుడైన వ్యక్తిని అన్వేషించడం ప్రారంభించింది.గత పనితీరు అమోఘంకౌస్గీ నాయకత్వంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 200 శాతం వృద్ధి చెందింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లలో అమ్మకాలు 50-రోజుల సగటు కంటే 1,176 శాతం అధికంగా నమోదయ్యాయి. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకాలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి.బలమైన క్యూ1 ఫలితాలుపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జూలై 21న బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం రూ.2,082 కోట్లుగా నివేదించింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.1,980 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.760 కోట్లు.ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ, సీఈవో రాజీనామా, టెక్నికల్ బ్రేక్‌డౌన్ కారణంగా తాత్కాలిక అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేచి చూడాలనే దృక్పథాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సీఈవో ఎవరు అవుతారు, మార్కెట్ భావన ఎలా మారుతుంది అన్నది స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు. -
‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆధార్, యూపీఐ ఆవిష్కరణల్లో కీలకపాత్ర పోషించిన నందన్ నీలేకని భారత్‌లో కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉండబోతుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ భారతదేశ జాబ్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. అందుకు బదులుగా భారీగా సంపదను, అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సాంకేతిక నిపుణులు ఏఐలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంతోపాటు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఈ ధోరణి ఇప్పటికే ప్రపంచ సాంకేతిక పర్యావరణ వ్యవస్థల్లో కనిపిస్తుంది. కానీ భారతదేశం అందుకు భిన్నమైన దృక్పథాన్ని నిర్మించాలి. ప్రపంచ శక్తులతో మనం పోరాడలేం. కానీ మన ప్రభావిత ప్రాంతంలో కోట్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు చేయాలి. ఉద్యోగం పోతుందని భయపడే బదులు నైపుణ్యాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలి’ అని నీలేకని అన్నారు. -
సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!
ఇండియన్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'హోండా మోటార్‌సైకిల్' కంపెనీ కొత్త 'షైన్ 100 డీఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ.74,989 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.హోండా షైన్ 100 డీఎక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో కొత్త గ్రాఫిక్స్, క్రోమ్ యాక్సెంట్స్ వంటి వాటితో పాటు ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. స్టీల్ ఛాసిస్‌పై నిర్మితమైన ఈ బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ఫైవ్ టైప్స్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ల పొందుతుంది. ఇది రెండు చివర్లలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది.పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే కొత్త హోండా షైన్ 100 డీఎక్స్ 98.98 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7500 rpm వద్ద 7.28 Bhp పవర్, 5000 rpm వద్ద 8.04 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. -
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్‌పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్‌లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్‌లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్‌ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్‌పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్‌పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్‌ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్‌లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్‌లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్‌కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో కంటెంట్‌కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్‌లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్‌లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్‌పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్‌లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్‌లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
రక్షాబంధన్‌కు ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొత్త రేట్లుఢిల్లీ: రూ.1,631.50కోల్‌కతా: రూ.1734.50ముంబై: రూ.1582.50చెన్నై: రూ.1789హైదరాబాద్: రూ.1,886.50డొమెస్టిక్ సిలిండర్ ధరలుడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది. -
రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్ బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్‌కు తగిన స్మార్ట్ఫోన్లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.శాంసంగ్ ఎం06 5జీ🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.ఇన్ఫినిక్స్ హాట్ 60🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.🔹హాట్ 60 5జీ ప్లస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.లావా స్టార్మ్ ప్లే🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. -
‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. రాష్ట్రంలోని సన్‌రైజ్ కంపెనీల(ఎమర్జింగ్ పరిశ్రమలు)కు ఇచ్చిన కార్మిక చట్టాన్ని పరిశీలిస్తామని తెలిపారు.‘టీసీఎస్ నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు ప్రభావితం అవుతారు. అకస్మాత్తుగా 12,000 మంది తొలగింపు అంటే చాలా ప్రమాదం. ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అంతకుమించి స్పష్టమైన కారణం కూడా తెలుసుకుంటాను. కార్మిక చట్టాన్ని పరిశీలిస్తాం. సన్ రైజ్ కంపెనీలకు నిత్యం చాలా వెసులుబాట్లు ఇస్తూనే ఉంటాం’ అని మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు.ప్రభుత్వ జోక్యం కోరిన ఎన్ఐటీఈఎస్లేఆఫ్స్కు సంబంధించి వివరణ కోరుతూ టీసీఎస్‌కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కోరింది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్యను 5,000 పెంచింది.ఇదీ చదవండి: క్యాప్ జెమినీలో భారీ నియామకాలుసన్రైజ్ పరిశ్రమలునూతన ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్‌రైజ్ పరిశ్రమలకు(అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీలు) కార్మిక చట్టం మినహాయింపులు ఇస్తోంది. ఇందులో సౌకర్యవంతమైన నియామకాలు, తొలగింపు నిబంధనలున్నాయి. స్టార్టప్‌లు, టెక్ ఆధారిత సంస్థలకు ఈ చట్టం ద్వారా మద్దతు లభిస్తుంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్ టెక్, స్పేస్ టెక్, ఏరోస్పేస్ వంటి విభాగాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. -
క్యాప్ జెమినీలో భారీ నియామకాలు
ఐటీ నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్‌లో ఈ ఏడాది 40,000-45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ తెలిపారు.భారత్‌లో 1.75 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ దేశీయ కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. కంపెనీ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు ఆదా, మరిన్ని అవకాశాలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ధోరణి భారత్‌లో మరింత వ్యాపారాన్ని అందిస్తుంది. సంస్థకు 50కి పైగా కళాశాలలు, క్యాంపస్‌లతో ఒప్పందాలు ఉన్నాయని, ప్రస్తుత సీజన్‌కు సంబంధించి నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త నియామకాలు అభ్యర్థుల కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఈడీ సమన్లుడబ్ల్యుఎన్ఎస్తో విలీనంఇటీవల డబ్ల్యూఎన్ఎస్ కొనుగోలు క్యాప్‌జెమినీకి వ్యూహాత్మకంగా నిలుస్తుందని యార్డీ చెప్పారు. సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ డబ్ల్యూఎన్ఎస్ను నెలకొల్పింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్‌జెమిని సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఈ రెండు కంపెనీలూ భారత్‌లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. -
పసిడి ప్రియులకు వరుస ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి మార్కెట్ సెషన్లో తగ్గిన పసిడి ధరలు ఈరోజు కూడా కాస్త దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ సూచీలు నేలచూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు నష్టపోయి 24,713కు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 ప్లాయింట్లు దిగజారి 81,001 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రిలయన్స్ కమ్యునికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్ గ్రూప్ కంపెనీలపై దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీ, ముంబైల్లో మూడు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు సహా 50 ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మరో 25 మంది కీలక హోదాల్లో ఉన్నవారిని ప్రశ్నించారు. అంతకుముందు అనిల్ అంబానీ కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!‘ఫ్రాడ్’గా వర్గీకరణరిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు కంపెనీలు జులై 26న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈమేరకు దాడులకు సంబంధించిన విషయాలను ధ్రువీకరించాయి. ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు, ఉద్యోగులు లేదా మరే ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని తెలిపాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) సహా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను ఈడీతో పంచుకున్నాయి. అనిల్ అంబానీ, అంబానీల గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)ను ‘ఫ్రాడ్’గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించింది. -
పరిశ్రమలకు తగ్గిన బ్యాంకుల రుణ సాయం
ముంబై: పరిశ్రమలకు బ్యాంకుల రుణ సాయంలో వృద్ధి జూన్ 26తో ముగిసిన పక్షం రోజుల్లో 5.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆహారేతర పరిశ్రమలకు రుణ సాయం 10.2 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 13.8 శాతం వృద్ధి చెందింది. 41 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డేటా ఆధారంగా ఈ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది.‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ స్థిరంగా పెరుగుతోంది. ప్రధాన రంగాల్లో ఇంజనీరింగ్, నిర్మాణం, టెక్స్‌టైల్స్‌కు రుణ వితరణ మెరుగైంది’’అని ఆర్బీఐ తెలిపింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం రుణ సాయం నిదానించింది. 6.8 శాతం వృద్ధికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే పక్షం రోజుల్లో ఈ రంగాలకు రుణ వితరణ 17.4 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా స్పష్టం చేసింది. సేవల రంగానికి రుణ వితరణ 9.6 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 15.1 శాతం వృద్ధితో పోల్చి చూస్తే తగ్గుముఖం పట్టింది. -
జోరుగా గృహ వినియోగం
ముంబై: భారత్‌లో గృహ వినియోగం వచ్చే రెండు నుంచి మూడు త్రైమాసికాల్లో పుంజుకుంటుందని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలపడుతుండడం మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇది కొనుగోలు శక్తిని పెంచుతుందని తెలిపింది. అలాగే మంచి వర్షపాతం అంచనాలు పంటల దిగుబడిపై ఆశలను పెంచుతున్నాయని, మహిళల సామాజిక భద్రతపై ప్రభుత్వాలు 20 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుండడం.. ఇవన్నీ గ్రామీణ వినియోగాన్ని బలోపేతం చేస్తాయని తన నివేదికలో యూబీఎస్ సెక్యూరిటీస్ వివరించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, వ్యక్తిగత ఆదాయపన్నులో మార్పుల ద్వారా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం, రుణాల లభ్యత పెరగడం.. ఇవన్నీ పట్టణ వినియోగాన్ని కుదురుకునేలా చేస్తాయని తెలిపింది. ‘‘గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ.. మొత్తం వాటాలో గ్రామీణ వినియోగం సగానికంటే తక్కువగా ఉన్నందున, గృహ వినియోగం అన్ని రకాలుగా కోలుకుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. గ్రామీణ వినియోగం క్రమంగా బలపడుతున్న కొద్దీ ఎంతలేదన్నా వచ్చే 2–3 త్రైమాసికాల్లో గృహ వినియోగం పుంజుకోవడం మొదలవుతుంది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ భారత ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ తెలిపారు. మాస్ మార్కెట్లో స్తబ్దత గ్రామీణ మార్కెట్లలో చౌక ఉత్పత్తుల వినియోగంలో స్తబ్దత నెలకొనగా, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నట్టు యూబీఎస్ సెక్యూరిటీస్ వెల్లడించింది. గ్రామీణ వేతనాల్లో వృద్ధి (ఆహార ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) ఆరేళ్ల గరిష్ట స్థాయి అయిన 4.5 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 9 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 35 శాతం చొప్పున పెరిగినట్టు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు, డ్యూరబుల్స్ గూడ్స్ ఉత్పత్తి మాత్రం జూన్ త్రైమాసికంలో తగ్గినట్టు తెలిపింది. ఎనిమిదో వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా 2026 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 55 బిలియన్ డాలర్ల చెల్లింపులు మొదలైతే అప్పుడు పట్టణ డిమాండ్ సైతం ఊపందుకుంటుందని అంచనా వేసింది. -
ఈవీ రంగంలో మరిన్ని అవకాశాలపై మీడియాటెక్ కన్ను
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ దిగ్గజం మీడియాటెక్ భారత్‌లో మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని భావిస్తోంది. ఏఐ నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కృత్రిమ మేథను ఉపయోగించుకోవడంపై ఆసక్తి చూపుతుండటమనేది విక్రయాల వృద్ధికి దోహదపడగలదని ఆశిస్తోంది. ఏఐ, కొత్త తరం కనెక్టివిటీ సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతూ ఆటోమోటివ్ రంగంలో మరింతగా కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నట్లు మీడియాటెక్ డైరెక్టర్ రీటా వూ తెలిపారు. ఏఐ వినియోగం, హై–పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యాలకు డిమాండ్, తక్కువ విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడం వంటి అంశాలు పరిశ్రమలో కీలక మార్పులు తెస్తున్నాయని ఆమె తెలిపారు. -
17.9 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.2,80,732 కోట్లుగా నమోదైంది. తొలి త్రైమాసికం చివరికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 17.8 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో 4.4 శాతం మేర ద్రవ్యలోటు (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందన్నది కేంద్రం అంచనా. ప్రభుత్వ వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరమే ద్రవ్యలోటు. జూన్ త్రైమాసికంలో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.9.41 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రూ.5.4 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.3.73 లక్షల కోట్లు పన్నేతర మార్గంలో వచ్చింది. రుణేతర పత్రాల రూపంలో రూ.28,018 కోట్లు సమకూరింది. పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు రూ.3,26,941 కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే రూ.47,439 కోట్లు పెరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ వ్యయం జూన్ క్వార్టర్లో రూ.12.22 లక్ష కోట్లుగా నమోదైంది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో 24.1 శాతానికి సమానం. వ్యయాల్లో రూ.3.86 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే వెళ్లింది. సబ్సిడీలపై రూ.83,554 కోట్లు ఖర్చు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే మూలధన వ్యయాలు 52 శాతం పెరిగాయి. -
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు తప్పుగా దొర్లినవే...
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. భారత్ ఉత్పత్తులపై ఆగస్ట్ 1 నుంచి 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామంటూ ప్రకటించిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అవసరం లేదు. నిర్వీర్యమైన తమ ఆర్థిక వ్యవస్థలను (డెడ్ ఎకానమీస్) అవి పరస్పరం మరింత దిగజార్చుకుంటుండడంపైనే నా దృష్టి అంతా’’అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా స్పందిస్తూ.. భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా దొర్లినట్టుగా పేర్కొంది.ఇండియానే ఆధారం.. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2024 గణాంకాల ప్రకారం భారత్‌లో సగటు వయసు 28.8 సంవత్సరాలు కాగా, అమెరికాలో ఇది 38.5, యూరప్‌లో 42.8 సంవత్సరాలుగా ఉంది. సగటు వయసు, వృద్ధి అవకాశాల పరంగా అభివృద్ది చెందిన దేశాలు మరింత వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు శ్రీవాస్తవ అన్నారు. ఐఎంఎఫ్ ఒక రోజు ముందే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాదికి గాను భారత్ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 6.5 శాతంగా అంచనా వేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్‌కు సంబంధించి మెరుగైన అంచనాలను ప్రకటించడం తెలిసిందే. -
టాటా మోటార్స్ రూ.10,000 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఇటలీ కంపెనీ ఇవెకో గ్రూప్ కొనుగోలు కోసం తీసుకుంటున్న స్వల్పకాలిక రుణాన్ని (బ్రిడ్జ్ ఫైనాన్సింగ్) తీర్చివేసేయడంపై టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1 బిలియన్ యూరోలను (సుమారు రూ. 10,000 కోట్లు) ఈక్విటీగా, మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలుగా సమకూర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. ఇవెకో డీల్ ముగిసిన 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. 3.8 బిలియన్ యూరోలతో (సుమారు రూ. 38,240 కోట్లు) వాణిజ్య వాహనాల కంపెనీ ఇవెకో గ్రూప్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్‌జీ తదితర సంస్థలు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయి.నాలుగో స్థానానికి...: ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇవెకో కూడా కలిస్తే 6 టన్నుల ట్రక్కుల కేటగిరీలో టాటా మోటార్స్ గ్రూప్ మొత్తం అమ్మకాలు వార్షికంగా 2.3 లక్షల యూనిట్ల పైచిలుకు ఉంటుంది. తద్వారా దాదాపు వోల్వో గ్రూప్‌తో సమానంగా నాలుగో స్థానంలో ఉంటుంది. కొనుగోలుకు ముందు ఏటా 1.8 లక్షల యూనిట్లతో టాటా మోటార్స్ గ్రూప్ ఆరో స్థానంలో, 50,000 యూనిట్లతో ఇవెకో 17వ స్థానంలో ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దైమ్లర్ గ్రూప్ (3.5 లక్షల యూనిట్లు), సీఎన్హెచ్టీసీ గ్రూప్ (2.5 లక్షలు), ట్రాటన్ గ్రూప్ (2.4 లక్షల యూనిట్లు) ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి ఇవెకో సంస్థకు అంతర్జాతీయంగా 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
పసిడి డిమాండ్‌కు ధరాఘాతం!
ముంబై: పసిడి ధరలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరడంతో డిమాండ్ (పరిమాణం పరంగా) తగ్గుముఖం పట్టింది. జూన్ త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 134.9 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్ 149.7 టన్నుల కంటే ఇది 10 శాతం తక్కువ. ధరలు రికార్డు స్థాయిలకు చేరడం కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. ధరలు పెరిగిన ఫలితంగా పుత్తడి కొనుగోలుపై భారతీయులు అధికంగా వెచ్చించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. విలువ పరంగా పసిడి డిమాండ్ రూ.1,21,800 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.93,850 కోట్ల కంటే 30% పెరిగింది. బంగారు ఆభరణాల కొనుగోలు డిమాండ్ పరిమాణం పరంగా 17 శాతం తగ్గి 88.8 టన్నులకు పరిమితమైంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 106.5 టన్నులుగా ఉంది. విలువ పరంగా బంగారు ఆభరణాల డిమాండ్ 20 శాతం పెరిగి రూ.80,150 కోట్లకు చేరింది. ధరలు పెరగడం ఫలితంగా ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, అదనంగా ఖర్చు చేయాల్సి రావడం విలువ పెరిగేందుకు దారితీసింది. పెట్టుబడి పరంగా డిమాండ్.. పెట్టుబడి పరంగా బంగారం డిమాండ్ 7 శాతం పెరిగి 46.1 టన్నులుగా జూన్ త్రైమాసికంలో నమోదైంది. విలువ పరంగా చూస్తే డిమాండ్ 54 శాతం పెరిగి రూ.41,650 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలానికి విలువ పెరిగే సాధనంగా బంగారాన్ని చూస్తున్నారనడానికి ఇది నిదర్శమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. బంగారం దిగుమతులు 34 శాతం తగ్గి 102.5 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 150 టన్నులుగా ఉన్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది మరోపక్క, బంగారం రీసైక్లింగ్ (పునర్వినియోగపరిచిన) డిమాండ్ ఒక శాతం పెరిగి 23.1 టన్నులకు చేరుకుంది. 6 నెలల్లో 253 టన్నులు..జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు ఔన్స్‌కు సగటున 3,280 డాలర్లుగా ఉంటే, 10 గ్రాముల ధర భారత్‌లో రూ.90,307 స్థాయిలో ఉన్నట్టు సచిన్ జైన్ తెలిపారు. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యం కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది తొలి 6 నెలల్లో (జనవరి–జూన్) భారత్‌లో బంగారం డిమాండ్ 253 టన్నులుగా ఉండగా, పూర్తి ఏడాదికి 600–700 టన్నుల మధ్య ఉండొచ్చని సచిన్‌జైన్ తెలిపారు. ధరల్లో స్థిరత్వం ఏర్పడితే డిమాండ్ గరిష్ట స్థాయిలో 700 టన్నులకు చేరుకోవచ్చన్నారు. ధరల పెరుగుదల కొనసాగితే డిమాండ్ 600 టన్నులకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు. -
ఎగుమతులకు టారిఫ్‌ల సెగ
భారత ఎగుమతులపై అమెరికా ఎకాయెకిన 25 శాతం టారిఫ్‌లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీనితో అమెరికన్ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలకు కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు కనీసం 25 శాతం ఎగుమతులు తగ్గినా, వాణిజ్య ఆదాయాలపరంగా ఏటా 21.75 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మారకం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్లపరంగా చూస్తే ఎగుమతుల ఆధారిత రంగాలకు చెందిన (టెక్స్టైల్స్, జ్యుయలరీ మొదలైనవి) సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్‌లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ఈ ప్రత్యేక కథనం. – బిజినెస్ డెస్క్రత్నాభరణాలు: రత్నాభరణాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అగ్రరాజ్యానికి ఎగుమతులు సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంటున్నాయని రత్నాభరణాల ఎగుమతుల మండలి జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించడం వల్ల వ్యయా పెరిగిపోవడానికి, ఎగుమతుల్లో జాప్యానికి దారి తీస్తుందని, చిన్న స్థాయి వ్యాపారుల నుంచి భారీ తయారీ సంస్థల వరకు అందరిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పడిపోవడం, ఆర్డర్లు రద్దు కావడం, ఎగుమతిదారుల మార్జిన్లు తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని రిద్ధిసిద్ధి బులియన్స్ (ఆర్‌ఎస్‌బీఎల్) ఎండీ పృథ్వీ రాజ్ కొఠారీ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 2.3 బిలియన్ డాలర్ల విలువ చేసే రొయ్యలను అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసింది. అమెరికాకు మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో ఇది 90 శాతం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎగుమతులు ఉంటుండటంతో తెలుగువారిపైనా ఈ ప్రభావం పడొచ్చని అంచనా. ఈ విభాగంలో మనతో పోలిస్తే టారిఫ్‌లు తక్కువగా ఉన్న ఈక్విడార్తో పోటీ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే, బ్రిట న్‌తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా టారిఫ్‌ల ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఫార్మా.. మెడికల్ డివైజ్‌లు.. చౌక జనరిక్స్ ఔష ధాలకు సంబంధించి అమెరికా అవసరాల్లో దాదాపు 47 శాతాన్ని భారత్ తీరుస్తోంది. టారిఫ్‌లతో ఎగుమతులపై ప్రభావం పడితే భారత ఫార్మా సంస్థల లాభాలు తగ్గుతాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, కొత్త ఔషధాలకు అనుమతులు నిలిచిపోతాయని, అలాగే కొత్త ఆవిష్కరణలపై ఎఫెక్ట్ పడుతుందని భారతీయ మెడికల్ డివైజ్‌ల పరిశ్రమ సమాఖ్య ఏఐఎంఈడీ ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. అయితే, టారిఫ్‌లపరంగా చైనా, భారత్ మధ్య 15–20 శాతం మేర వ్యత్యాసం కొనసాగినంత కాలం మెడికల్ డివైజ్‌ల పరిశ్రమకు కాస్త సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. » గణాంకాల ప్రకారం అమెరికాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. మన ఉత్పత్తులు ఖరీదుగా మారితే అమెరికన్లు మెక్సికోలాంటి దేశాలవైపు మళ్లొచ్చు. దీనితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేకిన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలగవచ్చు.వ్యవసాయ ఉత్పత్తులు.. » అమెరికాకు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. సుంకాలతో భారత్ నుంచి ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయి, అమెరికన్లు దిగుమతులను తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మళ్లొచ్చు. దీనితో రైతులు, ఎగుమతిదార్లపై ప్రభావం పడొచ్చు. ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు.. అమెరికాకు ఈ ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. టారిఫ్‌లతో వల్ల వియత్నాం, బ్రెజిల్‌లాంటి దేశాలు పోటీకి రావడం వల్ల మన దగ్గర ఈ రంగంలోని బడా కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. మొత్తం ఎగుమతుల్లో అయిదో వంతు వాటాతో భారత్‌కు అమెరికా కీలకంగా ఉంటోంది. » భారీగా ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వ్యవసాయం, లెదర్, రత్నాభరణాల్లాంటి పరిశ్రమల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 35 శాతంగా నమోదైంది. టారిఫ్‌లతో ఈ పరిశ్రమలు దెబ్బతింటే, ఉపాధి అవకాశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల పరిశ్రమలో 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా. » గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 87 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 46 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్‌కు సుమారు 41 బిలియన్ డాలర్ల మేర మిగులు ఉంది. అటు సర్వీసులపరంగా చూసినా అమెరికాకు 2023లో 36.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 34 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. భారత్ పక్షాన సుమారు 2.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. అమెరికన్లకూ ’చేదు’ మాత్రే .. అమెరికా టారిఫ్‌లు భారత్‌కి కొంత సమస్యాత్మకమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో వాటి ప్రభావం అమెరికన్లపైనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల, అక్కడ వాటి ధరలు పెరిగిపోయి స్థానికులు మరింతగా వెచ్చించాల్సి వస్తుందని ఫార్మా ఎగుమతి సంస్థల సమాఖ్య ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. భారీ ఎత్తున, నాణ్యమైన ఔషధాలను చౌకగా అందించే ప్రత్యామ్నాయాలను ఇప్పటికిప్పుడు దొరకపుచ్చుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుందని చెప్పారు.ఏయే పరిశ్రమలకు ప్రతికూలం.. టెక్స్టైల్స్/దుస్తులు రత్నాభరణాలు ఫార్మా వాహనాలు, ఆటో విడిభాగాలు ఎల్రక్టానిక్స్/మొబైల్ డివైజ్‌లు ఇంజనీరింగ్ ఉత్పత్తులు/మెటల్స్ సీఫుడ్/అగ్రి ఎగుమతులుటెక్స్టైల్స్..టారిఫ్‌ల వల్ల భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతిదారులపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. మనతో పోలి స్తే వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలపై తక్కువ సుంకాలు ఉండటం వల్ల వాటి నుంచి మరింత పోటీని ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నా రు. ఆర్డర్లు రద్దు కావడం, ధర లు తగ్గించాలంటూ ఒత్తిడి పెరగడంలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబెక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ తెలిపింది. బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశా ల నుంచి పోటీ పెరిగి, చిన్న తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లాంటి ఇతర మార్కెట్లపై కూడా మరింతగా దృష్టి పెట్టాలని భారతీయ టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ చెప్పారు. భారత టెక్స్టైల్స్, దుస్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. 17 బిలియన్ డాలర్ల రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో 5.6 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ దెబ్బతింటే వీరి ఉపాధిపైనా ప్రభావం పడుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు.. టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్, సర్క్యూట్ బోర్డుల్లాంటి ఉత్పత్తుల ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. టారిఫ్‌ల వల్ల చౌకగా లభించే ఎలక్ట్రానిక్స్ విషయంలో మిగతా దేశాలతో భారత్ పోటీ పడే సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు నెమ్మదించవచ్చు. -
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్ఎయిర్టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్‌ను చూడవచ్చు. ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను చేర్చారు. -
ఓఎన్డీసీ, జెమ్ పోర్టల్‌లో పోస్టల్ సర్వీసులు
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌తో అనుసంధానంపై ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తంది. దీనితో పోస్టల్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రాగలవని, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలతో పోస్టల్ విభాగం పోటీపడేందుకు వీలవుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో సమావేశమైన సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు ఈ విషయాలను వివరించారు.ఇండియా పోస్ట్ ఐటీ 2.0 ఫ్రేమ్ వర్క్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. రియల్ టైమ్‌లో ట్రాక్ చేసేందుకు, డిజిటల్ చెల్లింపులు మొదలైన వాటికి ఉపయోగపడేలా ప్లాట్‌ఫాంను కొత్తగా అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. 86వేలకు పైగా పోస్టాఫీసులు కొత్త అప్లికేషన్ ను ఉపయోగిస్తున్నాయని, ఆగస్టు 4 నాటికి, సుమారు 1.65 లక్షల పోస్టాఫీసుల నెట్ వర్క్ మొత్తం కొత్త ప్లాట్ ఫామ్ కు మారుతుందని అధికారులు మంత్రికి తెలియజేశారు. -
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్‌లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్‌లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
కాగ్నిజెంట్‌లో జీతాల పెంపు.. సీఎఫ్‌వో కీలక ప్రకటన
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాధారణంగా ఆగస్టు 1 నుంచి వార్షిక వేతన పెంపును ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలతో కలిసి కాగ్నిజెంట్ వేతన ఇంక్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేతన పెంపును అమలు చేసిన ఏకైక ప్రధాన టైర్-1 ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.స్థూల ఆర్థిక వాతావరణం, దాని చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దలాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలు చేసే వేతన పెంపులో మెజారిటీ ఉద్యోగులను కవర్ చేయాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, కాగ్నిజెంట్ స్థిరమైన హెడ్ కౌంట్ వృద్ధిని నివేదిస్తూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వరుసగా 7,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 343,800 కు చేరుకుంది. అట్రిషన్ గత త్రైమాసికంతో పోలిస్తే 60 బేసిస్ పాయింట్లు తగ్గి పన్నెండు నెలల ప్రాతిపదికన 15.2 శాతానికి తగ్గింది. -
పేటీఎంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు
రాఖీ, జన్మాష్టమి తదితర పండుగల సందర్భంగా ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా విమాన సర్వీసుల్లో 12%, అంతర్జాతీయ రూట్లలో 10%, బస్ బుకింగ్స్‌పై 20 % డిస్కౌంటు పొందవచ్చు.అలాగే యూపీఐ ద్వారా రైలు బుకింగ్స్‌కి పేమెంట్ గేట్‌వే చార్జీలు ఉండవు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ కార్డుదారులు ప్రత్యేక రాయితీలు పొందవచ్చు. పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేసుకుంటే 100% తక్షణ రీఫండ్‌తో, ఉచిత క్యాన్సిలేషన్ అవకాశాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. జూలై 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. -
ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలుటెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలుక్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు గురువారం అస్థిర సెషన్ లో ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,803.27 నుంచి 80,695.15 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 86.70 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 24,768.35 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.70-1.34 శాతం రేంజ్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు 3.61 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.05 శాతం, 0.93 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మార్కెట్ ధోరణులను అధిగమించి ఇమామీ, హిందుస్థాన్ యూనిలీవర్ నేతృత్వంలో 1.44 శాతం లాభాలతో స్థిరపడింది. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,153 షేర్లలో 2,418 రెడ్‌లో, 1,598 గ్రీన్‌లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. -
మోటరోలా కొత్త ఫోన్.. రూ.18వేల లోపే పవర్ఫుల్ మొబైల్
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 17,699గా ఉంటుంది. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంటు పోగా రూ. 16,999కే లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ, 50 ఎంపీ ఓఐఎస్ సోనీ కెమెరా, రెండు రోజుల వరకు సరిపోయే 6720 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అన్ని లెన్స్‌లతో 4కే వీడియో రికార్డింగ్ చేసే వీలుంటుంది.మోటరోలా జీ86 పవర్ స్పెసిఫికేషన్లు🔹మోటరోలా జీ86 పవర్ లో 6.67 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.🔹మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్ 1 సంవత్సరం ఓఎస్ అప్ గ్రేడ్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ సూపర్ జూమ్, ఏఐ ఆటో స్మైల్ క్యాప్చర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో మోటో ఏఐ లభిస్తుంది.🔹ఇందులోని 6,720 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల రన్ టైమ్ తో 2 రోజులకు పైగా పవర్ ను అందిస్తుంది. ఇందులో 33వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు. -
రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!
పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరాస్తులు కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు.ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కాబట్టి పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి.పెట్టుబడి వృద్ధి చెందేలా..పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్‌లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటులో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీంతో ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. -
మరో ఐదేళ్లలో విభిన్న రంగాల్లో ఏఐ పాగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్ ఏఐ పాగా వేసిందని సర్వీస్‌నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.నివేదికలోని అంశాలుకంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.రిటైల్‌లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.టెక్ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.భారత్‌లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్ ముందుంది.13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.ఏఐ రీడిజైన్ చేసిన వర్క్‌ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.సవాళ్లు ఇవే..ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.టెక్ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ -
అమెరికా కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల క్లాస్మేట్
సనత్‌నగర్: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన శైలేష్ జేజురికర్ ప్రముఖ వినియోగ వస్తువుల దిగ్గజ కంపెనీ ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు. పీ అండ్ జీ కంపెనీ అమెరికన్ మల్టినేషనల్ కన్జ్యూమర్ గూడ్స్ కార్పొరేషన్. అమెరికాలోని సిన్సినాటి ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 58 ఏళ్ల శైలేష్ జేజురికర్ ప్రస్తుతం పీ అండ్ జీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2026, జనవరి 1 నుంచి ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఆయన పాఠశాల విద్యాభ్యాసం హెచ్‌పీఎస్‌లో సాగగా.. 1987లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. 1989లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–లక్నోలో ఎంబీఏ పూర్తి చేసి, అదే సంవత్సరం పీ అండ్ జీలో చేరారు. తాజాగా భారతీయ గ్లోబల్ సీఈఓల జాబితాలో శైలేష్ జేజురికర్ (Shailesh Jejurikar) కూడా చేరారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల, డెలాయిట్ కన్సల్టింగ్‌కు చెందిన సౌమ్య చక్రవర్తి, టెస్లాకు చెందిన నాగేందర్ వంటి వారు శేలేష్ క్లాస్మేట్స్. హెచ్‌పీఎస్ 1984 బ్యాచ్‌లో శైలేష్ పాఠశాల హెడ్‌బాయ్‌గా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella), శైలేష్ జేజురికర్లు మంచి స్నేహితులు. గ్లోబల్ సీఈఓల ఫ్యాక్టరీగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిలవడం గర్వకారణమని ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.చదవండి: సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్.. ఎడ్యుకేషన్ ఏంటి? -
ఆసుస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రాజ్ షమానీ
ఆసుస్ ఇండియా ప్రముఖ పాడ్‌కాస్టర్ రాజ్ షమానీని ఎక్స్ఫర్ట్బుక్ సిరీస్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. 18 మిలియన్లకు పైగా వివిధ ప్లాట్ఫామ్ల్లో రాజ్‌కు సబ్స్క్రైబర్లున్నారు. ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ అనే పాడ్‌కాస్ట్ ద్వారా విస్తృతంగా ఫాలోయింగ్‌ను సంపాదించారు. ఆసుస్ ఇండియాలో కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి రాజ్ షమానీ కీలకంగా వ్యవహరిస్తారని కంపెనీ నమ్ముతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ఈ సందర్భంగా ఆసుస్ ఇండియా, శ్రీలంక, నేపాల్ కమర్షియల్ పీసీ, స్మార్ట్‌ఫోన్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాజ్ షమానీని స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ ద్వారా కంపెనీ భారతీయ నిపుణులకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించింది’ అన్నారు. రాజ్ షమానీ మాట్లాడుతూ..‘ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ యువ సృష్టికర్తల కోసం, కంపెనీల వ్యవస్థాపకులు లేదా భవిష్యత్ వ్యాపార నాయకుల కోసం తయారు చేశారు. ఆసుస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది’ అన్నారు. -
‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఏఐ వాడకం అనివార్యం‘కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు. ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యం అవుతుంది. కాబట్టి అందుకు అనువుగా మార్పులకు సిద్ధంగా ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. అంత వేగంగా వచ్చే మార్పులకు సర్దుకుపోయే సమయం ఉండదనేదే ప్రశ్న’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత వేగంగా అమలవుతున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రోబోటిక్ ఆయుధాలు..రాబోయే రోజుల్లో అనేక ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో మాన్యువల్ లేబర్ తీవ్రంగా ప్రభావితం చెందుతుంది. ‘రోబోటిక్ ఆయుధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ అవి అందుబాటులోకి వస్తే, శ్రామిక శక్తిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి’ అని గేట్స్ చెప్పారు.ఏజీఐతో ముప్పు‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) ఆన్లైన్ సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి సంక్లిష్ట పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. ఏజీఐ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాల ద్వారా సర్వీసు అందిస్తాయి. యంత్రాలు తక్కువ ఖర్చుతో మరింత కచ్చితత్వంతో పనులను నిర్వహించగలిగితే మాత్రం అది పెద్ద మార్పు అవుతుంది’ అని గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?కచ్చితమైన డేటాఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ఏఐ పురోగతిలో ఉన్న వేగం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏఐ రీసెర్చ్ టూల్స్‌ను ఉపయోగిస్తాను. అయితే వాటిలోని అంశాలను ధ్రువీకరించేందుకు నిపుణులతో తరచూ తనిఖీ చేస్తాను. విచిత్రంగా వారుకూడా చాలాసార్లు అందులోని అంశాలు నిజమనే చెబుతారు’ అని అన్నారు. -
యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ లావాదేవీల కోసం ప్రస్తుతం ఉన్న పిన్ స్థానంలో బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆధారిత ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఇది అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్(ఫింగర్‌ప్రింట్) లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గమనించాలి.ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేసేందుకు 4 నుంచి 6 అంకెల పిన్ అవసరం. చెల్లింపులు చేసినప్పుడు కచ్చితంగా వినియోగదారులు ఈ పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ పేమెంట్ గేట్‌వేకు సెక్యూరిటీ లేయర్‌గా పనిచేస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం సౌకర్యవంతంగా లేని వ్యక్తులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంటర్ చేయడం అడ్డంకిగా మారుతుంది. దాంతో కొత్త విధానాన్ని ఉపయోగించాలని ఎన్పీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో లేదా ముఖ గుర్తింపు వంటి భౌతిక లక్షణాల ద్వారా యూజర్‌ను ధ్రువీకరించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..ఈ చర్య పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆమోదంతో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయవచ్చని ప్లూటోస్ వన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్టనర్ రోహిత్ మహాజన్ ఎకనామిక్ టైమ్స్‌కు చెప్పారు. ఇది డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి, వీటిని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. అదే సమయంలో బయోమెట్రిక్ వ్యవస్థలు మోసాలను కూడా తగ్గిస్తాయని చెప్పారు. పిన్ ఎంటర్ చేయడంతో పోలిస్తే వినియోగదారుల భౌతిక లక్షణాలు డూప్లికేట్ చేయడం లేదా దొంగిలించడం కష్టమన్నారు. -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు నిన్నటి మార్కెట్ సెషన్లో పెరిగాయి. తిరిగి ఈ రోజు మళ్లీ ధరలు తగ్గాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్‌లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్, ఇండోనేషియా, ఒమన్, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్‌లింక్ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్‌లో నెలవారీ ఇంటర్నెట్ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?స్టార్‌లింక్‌కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్‌ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్‌గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్‌లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్‌లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
200 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:39 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు నష్టపోయి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 ప్లాయింట్లు దిగజారి 81,261 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న యాపిల్ మాత్రం ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాలేదు. కానీ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో యాపిల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.యాపిల్ 2026లోనే ఫోల్డబుల్ ఫోన్‌ను విపణిలోకి తీసుకురాబోతుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. టెక్ విశ్లేషకులు, ఇన్సైడర్ల వివరాల ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్ 2026 ద్వితీయార్ధంలో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత యాపిల్ తన ఉత్పత్తుల్లో చేయనున్న అతిపెద్ద డిజైన్ మార్పు ఇదేనని చెబుతున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌ను పోలిన బుక్ స్టైల్ ఫోల్డింగ్ విధానంలో ఉంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!జేపీ మోర్గాన్ అనలిస్ట్ సమిక్ ఛటర్జీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 5.5 అంగుళాల బాహ్య డిస్ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఫోన్ ధరపై కూడా కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లుగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఇండియాలో సుమారు రూ.1.75 లక్షలుగా ఉండొచ్చని చెబుతున్నారు. -
టారిఫ్‌లతో జీడీపీపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్‌ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ప్రాథమికంగా టారిఫ్‌లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్‌ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్టైల్స్ రంగానికి టారిఫ్‌లు పెను సవాలుగా మారతాయని టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. -
రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనం
ముంబై: భారత్‌పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. -
‘ఫార్చూన్’లో మళ్లీ రిలయన్స్ టాప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) ఫార్చూన్ గ్లోబల్–500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలకు చోటు లభించింది. వీటిలో అయిదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా, నాలుగు ప్రైవేట్ రంగానికి చెందినవి. అన్నింటికన్నా మెరుగ్గా ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 88వ స్థానంలో నిల్చింది. అయితే, 2024లోని 86వ ర్యాంకు నుంచి రెండు స్థానాలు తగ్గింది. అటు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 95వ ర్యాంకులో కొనసాగింది. 22 ఏళ్లుగా ఫార్చూన్ గ్లోబల్ లిస్టులో స్థానం దక్కించుకుంటున్న ఏకైక ప్రైవేట్ రంగ కంపెనీ రిలయన్స్ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రిలయన్స్ స్థూల ఆదాయం 7.1% పెరిగి రూ. 10,71,174 కోట్లకు చేరింది. 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను బట్టి కంపెనీలకు ర్యాంకింగ్ ఉంటుంది. ఐవోసీ డౌన్.. ఎస్బీఐ అప్.. అటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 11 ర్యాంకులు తగ్గి 127వ స్థానానికి పడిపోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 స్థానాలు మెరుగుపడి 163 ర్యాంకును, హెచ్డీఎఫ్సీ 48 స్థానాలు ఎగబాకి 258వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఒక ర్యాంకు తగ్గి 181వ స్థానానికి పరిమితమైంది. ఇక మిగతా వాటిలో టాటా మోటార్స్ (283 ర్యాంకు, 12 స్థానాలు డౌన్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (285 స్థానం, 27 స్థానాల క్షీణత), ఐసీఐసీఐ బ్యాంక్ (464 ర్యాంకు, ఎలాంటి మార్పు లేదు) ఉన్నాయి. -
రెండేళ్లపాటు 6.4 శాతం వృద్ధి
న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ అంచనాలను ప్రకటించింది. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన అంచనాలను ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచడం గమనార్హం. ఈ ఏడాదికి సంబంధించి 0.2 శాతం, వచ్చే ఏడాదికి 0.1 శాతం మేర తాజా అంచనాల్లో ఎగువకు సవరించింది. ఈ మేరకు తన తాజా నివేదికను విడుదల చేసింది. బలమైన వినియోగానికి.. ప్రభుత్వ పెట్టుబడులకు చురుకైన సంస్కరణలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. రానున్న కాలంలో ఈ సానుకూల వృద్ధిని కొనసాగించడం భారత్‌కు ఎంతో కీలకమని ఐఎంఎఫ్ పరిశోధన విభాగం చీఫ్ డెనిజ్ ఇగాన్ పేర్కొన్నారు. వేగంగా ఉపాధి సృష్టి, నైపుణ్యాల కల్పన ద్వారా వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్న కారి్మకులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంతోపాటు.. మౌలిక వసతులు, వాణిజ్య అడ్డంకులను తొలగించడం భారత్ ముందున్న ప్రాధాన్యతలుగా తెలిపారు. మధ్య కాలానికి భారత్ విద్యపై పెట్టుబడులు పెంచడం, భూ సంస్కరణలు చేపట్టడం, సామాజిక భద్రత కల్పించడం, నిబంధనలు, పాలనా యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించడం కూడా కీలకమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధి అంచనాలూ పెంపు వర్ధమాన దేశాల్లో ఆర్థిక వృద్ధి 2025లో 4.1 శాతం, 2026లో 4 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం 2025 సంవత్సరానికి 0.8 శాతం పెంచి 4.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బలమైన పనితీరుకు తోడు, అమెరికాతో టారిఫ్‌లు గణనీయ స్థాయి నుంచి తగ్గడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. 2026లో 4.2 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం స్వల్పంగా పెంచి 2025లో 3 శాతంగా, 2026లో 3.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
విద్యుత్‌కు డిమాండ్ అంతంతే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో వేసవి ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా లేకపోవడంతో విద్యుత్‌కి డిమాండ్ అంతగా ఉండకపోవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేస్తోంది. 2025లో విద్యుత్ వినియోగం 4 శాతం స్థాయిలో పెరగవచ్చని ఒక నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే 2025–26 వ్యవధిలో, దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌కి డిమాండ్ పెరగనున్నప్పటికీ భారత్, చైనాలో మాత్రం ఇది ఓ మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. ఐఈఏ ప్రకారం భారత్‌లో గతేడాది విద్యుత్ వినియోగం 6 శాతం పెరగ్గా ఈసారి 4 శాతం స్థాయిలో ఉండనుంది. అలాగే చైనాలో 2024లో వినియోగం 7 శాతం పెరగ్గా ఈ ఏడాది 5 శాతానికి పరిమితం కానుంది. డిమాండ్ నెమ్మదించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎలక్ట్రిసిటీ వినియోగ వృద్ధిలో ఈ రెండు దేశాల వాటా, గతేడాది తరహాలోనే, 50 శాతానికి పైగా ఉంటుందని ఐఈఏ తెలిపింది. ‘అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల భారత్‌లో పారిశ్రామిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. అలాగే వేసవి తీవ్రత కూడా పెద్దగా లేకపోవడం వల్ల 2024తో పోలిస్తే 2025 ప్రథమార్ధంలో విద్యుత్ వినియోగం 1.4 శాతమే పెరిగింది. వేసవి ముగిసిపోయినందున, ఇక సెప్టెంబర్‌లో డిమాండ్ మెరుగుపడితే, వార్షికంగా సుమారు 4 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చు‘ అని ఐఈఏ తెలిపింది. పరిశ్రమలు, సేవల కార్యకలాపాలు పుంజుకుని, ఏసీల అమ్మకాలు కూడా పెరగడం వల్ల 2026లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ 6.6 శాతం పెరగవచ్చని పేర్కొంది. -
జియో ఫైనాన్షియల్‌కు రూ.15,825 కోట్లు
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్ నుంచి రూ. 15,825 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించనున్నట్లు కంపెనీ వివరించింది. ప్రస్తుతం అంబానీ కుటుంబంతో పాటు వివిధ గ్రూప్ హోల్డింగ్ సంస్థలకు కంపెనీలో 47.12 శాతం వాటాలు ఉన్నాయి. ప్రిఫరెషన్షియల్ ఇష్యూ ద్వారా 54.19 శాతానికి పెరుగుతుంది. ఒక్కొక్కటి రూ. 316.50 రేటు చొప్పున 50 కోట్ల వరకు వారంట్లను కంపెనీ జారీ చేయనుంది. వీటి ముఖ విలువ రూ. 10గా ఉంటుంది. ఇష్యూ అనంతరం ప్రమోటర్ గ్రూప్‌లో భాగమైన సిక్కా పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ వాటా 1.08 శాతం నుంచి 4.65 శాతానికి, జామ్‌నగర్ యుటిలిటీస్ అండ్ పవర్ వాటా 2.02 శాతం నుంచి 5.52 శాతానికి పెరుగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడదీసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధానంగా ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మూలకాలు సహా కీలక ఖనిజాల వెలికితీత, ప్రాసిసెంగ్‌లో రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా పాలుపంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. ఇది క్రిటికల్ ఖనిజాలకు అదనపు విలువను జోడించే వ్యవస్థపరంగా భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొంది. విద్యుత్ వినియోగాన్ని, డివైజ్‌ల పరిమాణాన్ని తగ్గించగలిగే భౌతిక, రసాయనిక స్వభావాలున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి నేడు నిర్మాణ, ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్ తదితర రంగాల్లో కీలకంగా మారినట్లు నివేదిక వివరించింది. గత నాలుగేళ్లుగా భారత్ ఏటా సగటున 3.3 కోట్ల డాలర్ల విలువ చేసే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత ఖనిజాలను దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దిగుమతులు 3.19 కోట్ల డాలర్లకు చేరగా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతులు మరింత అధికంగా 24.9 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. లాంథనం, ల్యూటీషియంలాంటివి రేర్ (అరుదైన) ఎర్త్ మూలకాల కోవకు చెందుతాయి. వాస్తవానికి ఇవి పుష్కలంగా ఉన్నప్పటికీ, వెలికితీత ప్రక్రియ చాలా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో రేర్ ఎర్త్ మూలకాలుగా పరిగణిస్తారు. -
ఎన్ఎస్ఈలో ఇన్వెస్టర్ ఖాతాలు 23 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ఖాతాల సంఖ్య జూలైలో 23 కోట్ల స్థాయిని దాటింది. అకౌంట్ల సంఖ్య ఏప్రిల్‌లో 22 కోట్ల మార్కును దాటగా కేవలం మూడు నెలల్లోనే మరో 1 కోటి అకౌంట్లు జతయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 4 కోట్ల ఖాతాలు (మొత్తం అకౌంట్లలో 17 శాతం) ఉండగా, తర్వాత స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ (2.5 కోట్లు, 11 శాతం వాటా), గుజరాత్ (2 కోట్లకు పైగా, 9 శాతం వాటా), పశ్చిమ బెంగాల్..రాజస్థాన్ (చెరి 1.3 కోట్లు, 6 శాతం వాటా) ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లలో దాదాపు సగ భాగం వాటా ఈ అయిదు రాష్ట్రాలదే ఉంది. టాప్ 10 రాష్ట్రాల వాటా నాలుగింట మూడొంతులు ఉందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. విశిష్ట ఖాతాదారుల సంఖ్య 11.8 కోట్లుగా ఉంది. సాధారణంగా ఒకే ఇన్వెస్టరు పలు బ్రోకరేజీ సంస్థల్లో అకౌంట్లు తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లలో యువత, మొదటిసారిగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్ఎస్ఈ వివరించింది. డిజిటలీకరణ వేగవంతం కావడం, మొబైల్ ఆధారిత ట్రేడింగ్ సొల్యూషన్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడానికి కారణమని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. -
స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 8% అప్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) తొలి త్రైమాసికంలో నెమ్మదించిన దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్ రెండో త్రైమాసికంలో పుంజుకుంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాలు పరిమాణంపరంగా ఎనిమిది శాతం, టోకు అమ్మకాలు విలువపరంగా 18 శాతం పెరిగాయి. అత్యధికంగా ఐఫోన్ 16 టోకు అమ్మకాలు నమోదైనట్లు టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తమ నెలవారీ స్మార్ట్‌ఫోన్స్ ట్రాకర్ నివేదికలో తెలిపింది. కొత్త ఫోన్లను ప్రవేశపెట్టడం, మార్కెటింగ్, వేసవిలో అమ్మకాలు పటిష్టంగా ఉండటం, బ్రాండ్లు భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం సులభతరమైన ఈఐఎంలు, మిడ్–ప్రీమియం సెగ్మెంట్లలో ప్రత్యేక ఆఫర్లు మొదలైన అంశాలు స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరగడానికి దోహదపడినట్లు వివరించింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడటంతో అల్ట్రా ప్రీమియం (రూ. 45,000 పైగా రేటు ఉండే ఫోన్లు) సెగ్మెంట్ వార్షికంగా 37 శాతం వృద్ధి నమోదు చేసినట్లు కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ తెలిపారు. దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్..రెండో త్రైమాసికంలో విలువపరంగాను, సగటు విక్రయ ధరపరంగాను (ఏఎస్పీ) రికార్డు స్థాయి పనితీరు కనపర్చేందుకు అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్ దోహదపడినట్లు వివరించారు.వివో టాప్.. స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు సంబంధించి పరిమాణంపరంగా వివో అగ్రస్థానంలో నిలవగా, విలువపరంగా శాంసంగ్, యాపిల్ అగ్రస్థానంలో ఉన్నట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. పరిమాణం ప్రకారం వివోకి 20 శాతం, శాంసంగ్‌కి 16 శాతం, ఒప్పోకి 13 శాతం, రియల్‌మీకి 10 శాతం, షావోమీకి 8 శాతం వాటా ఉంది. హోల్‌సేల్ అమ్మకాల విలువపరంగా శాంసంగ్, యాపిల్ చెరి 23 శాతం వాటాతో పోటాపోటీగా టాప్‌లో ఉన్నాయి. వివోకి 15 శాతం, ఒప్పోకి 10 శాతం, రియల్‌మీకి 6 శాతం, వన్‌ప్లస్‌కి 4 శాతం వాటా ఉంది. -
ఫ్రీగా ఇచ్చే క్రెడిట్ కార్డులు.. పైకి కనిపించని ఛార్జీలు
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. వీటితో పలు ఇతర సంస్థలూ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు సాధారణంగా వార్షిక రుసుము ఉంటుంది. ఇది కార్డు రకాన్ని, జారీ చేసే బ్యాంకు, సంస్థను బట్టి ఉంటుంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులూ కొన్ని సంస్థలు లేదా బ్యాంకులు ఇస్తున్నాయి. ఉచితమే కదా చాలామంది వీటిని తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ కంటికి కనిపించని కొన్ని ఛార్జీలు వీటికి ఉంటాయి. 'లైఫ్ టైమ్ ఫ్రీ' అయిన క్రెడిట్ కార్డుల విషయంలో దాగిఉన్న ఖర్చులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..అధిక వడ్డీ రేట్లువార్షిక రుసుములు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.విదేశీ లావాదేవీ మార్పిడి రుసుమువార్షిక రుసుము లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలో ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు. . 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు పొందే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఓవర్ లిమిట్ ఫీజుమీరు నగదు ఉపసంహరణను ఎంచుకున్నప్పుడు లేదా క్రెడిట్ లిమిట్ దాటి కార్డును ఉపయోగించినప్పుడు, బ్యాంకు దానిపై ఓవర్ లిమిట్ ఫీజును విధించవచ్చు. ఇది గుర్తుంచుకోవలసిన మరొక అంశం.ఆలస్య చెల్లింపు పెనాల్టీలుకార్డు జీవితకాలం ఉచితం అయినప్పటికీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించనప్పుడు ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. ఇది ఇతర కార్డుల కంటే ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి.ఇనాక్టివిటీ ఫీజులుకొంత మంది కార్డును తరచుగా ఉపయోగించరు. దీనికిగానూ కొన్ని కార్డు ప్రొవైడర్ సంస్థలు రుసుము విధించవచ్చు. మునుపటి సంవత్సరంలో మొత్తం ఖర్చు ఒక పరిమితిని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు కొన్ని కార్డులకు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి.ప్రాసెసింగ్ ఫీజుఇది బ్యాంకులు విధించే సాధారణ రుసుము కానప్పటికీ, ప్రాసెసింగ్ లేదా నిర్వహణ ఖర్చుల కోసమంటూ దీన్ని బ్యాంకులు చేస్తాయి. ఇది మీ కార్డుకు సాధారణంగానే ఉందా లేదా మరీ ఎక్కువగా ఉందా అన్న అన్న విషయాన్ని గమనించాలి. -
ఆగస్టులో బ్యాంకులు.. వరుస సెలవులు
పలు పండుగలు, జాతీయ సెలవులు రావడంతో ఈ ఆగస్టు నెలలో దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. బ్యాంక్ సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, సెలవుల నేపథ్యంలో వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆగస్టులో బ్యాంకు సెలవుల పూర్తి జాబితారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవుదినం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు కేటగిరీల కింద బ్యాంకులు సెలవు దినాలను పాటిస్తాయి. 2025 ఆగస్టులో గుర్తించదగిన మూసివేతలు ఇలా ఉంటాయి.ఆగష్టు 1 బ్యాంకు సెలవు (రాష్ట్రాలను బట్టి మారుతుంది)ఆగస్టు 3 - ఆదివారంఆగస్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ)ఆగస్టు 9 - రెండో శనివారంఆగస్టు 10 - ఆదివారంఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం / పార్శీ నూతన సంవత్సరం (ముంబై, నాగపూర్)ఆగస్టు 16 - కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జోనల్ సెలవుఆగస్టు 17 - ఆదివారంఆగష్టు 23- నాలుగో శనివారంఆగస్టు 24 - ఆదివారంఆగష్టు 25 జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు)ఆగస్టు 31 - ఆదివారంతీజ్, హర్తాలికా, ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ సెలవులు వ్యక్తిగత రాష్ట్రాల్లో వర్తించవచ్చు.ఆన్లైన్ సేవలుబ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఇన్ఫోసిస్ చల్లని కబురు: తొలగించడం కాదు.. చేర్చుకుంటాం
టీసీఎస్ లేఆఫ్‌ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.మొదటి త్రైమాసికంలో 17,000 మందిని (స్థూల నియామకాలు) నియమించుకున్నామని, ఈ ఏడాది ఇంకా 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీస్కిల్లింగ్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ కాస్త ముందంజలో ఉందన్న పరేఖ్.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.పోటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈవో నియామకాలను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరే ఇతర భారతీయ ఐటీ కంపెనీ కూడా ఈ స్థాయిలో లేఆఫ్‌లను ప్రకటించలేదు.ఏఐ ప్రభావంపై..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి పరేఖ్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ లోతైన ఆటోమేషన్, అవగాహనను అందిస్తుంది. అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ అవసరం" అని అన్నారు. ఉద్యోగులు,సాంకేతికత రెండింటి పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిని విస్తరిస్తుందని పేర్కొన్నారు.వేతనాల పెంపుపై..గత ఆర్థిక సంవత్సరం క్యూ4, క్యూ1లకు వేతనాల పెంపును కంపెనీ ఇప్పటికే పూర్తి చేసిందని పరేఖ్ తెలిపారు. "ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయింది. ఎప్పటిలాగే తదుపరి రౌండ్ కోసం సమయాన్ని అంచనా వేయడం ప్రారంభించాం. మా ప్రస్తుత ప్రక్రియకు కట్టుబడి ఉంటాం. సరైన సమయంలో తదుపరి రౌండ్‌ను ప్రకటిస్తాం" అని పరేఖ్ వివరించారు.👉 ఇదీ చదవండి: TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం! -
భారత్‌పై అమెరికా సుంకాల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత మోగించారు. భారత్‌పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ బాంబ్ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ఆట్వీట్‌లో భారత్‌పై టారిఫ్‌తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్‌లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్‌తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
స్టాక్ మార్కెట్లో 10 రోజులు నో ట్రేడింగ్!
దేశంలో స్టాక్ మార్కెట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్‌ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులుఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవంఆగష్టు 27 - వినాయక చవితిఅక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరాఅక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజఅక్టోబర్ 22 - బలిప్రతిపాదనవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్డిసెంబర్ 25 - క్రిస్మస్ -
మార్కెట్ ముగిసిందిలా.. టాప్ గెయినర్స్ ఇవే..
భారత ఈక్విటీలు ఈ రోజు క్యూ1 ఫలితాలతో నడిచాయి. 2025 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన తర్వాత సెన్సెక్స్‌లో ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన నిర్ణయం ఇన్వెస్టర్లను పక్కకు నెట్టి స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు లోనయ్యాయి.సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143.9 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద ముగిసింది. అదేసమయంలో ఎల్అండ్టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ (0.96 శాతం), నిఫ్టీ ఆటో (0.6 శాతం) అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకుల అంచనాలను కొలిచే ఇండియా వీఐఎక్స్ 2.77 శాతం నష్టంతో 11.21 వద్ద ముగిసింది. -
హైదరాబాద్‌లో ఫ్లాట్ల కొనుగోళ్లకు భారీ తాకిడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. -
కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!
భారత్‌లో క్రెడిట్ కార్డు రుణ సంక్షోభం పెరుగుతోంది. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న క్రెడిట్‌కార్డుల బిల్లులు కట్టలేక డిఫాల్ట్‌లు అధికమవుతున్నట్లు తెలిపింది. అన్సెక్యూర్డ్ లోన్ల చెల్లింపులు బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది.సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదికలోని అంశాలు..2025 మార్చి నాటికి 91 నుంచి 360 రోజుల వరకు చెల్లించని క్రెడిట్ కార్డు రుణాలు రూ.33,886 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 44% పెరిగింది.91-180 రోజుల గడువు కార్డు రుణాలు రూ.29,983.6 కోట్లు (2024లో రూ.20,872.6 కోట్ల నుంచి పెరిగింది)గా ఉంది.పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్ (పీఏఆర్) 2024లో 6.9 శాతంగా ఉంది కాస్తా ఇప్పుడు 8.2 శాతానికి పెరిగింది.181-360 రోజులు గడువు ముగిసిన పీఏఆర్ 0.9 శాతం నుంచి 1.1 శాతానికి పెరిగింది.పెరుగుతున్న క్రెడిట్ కార్డు వినియోగం..కొన్నేళ్లుగా డిజిటల్ విస్తరణ, ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ అధికమైంది.డిఫాల్ట్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?ఆకర్షణీయమైన ఆఫర్లు: క్యాష్ బ్యాక్ రివార్డులు, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, నో కాస్ట్ ఈఎంఐలు ఆదాయానికి మించి ఖర్చును ప్రోత్సహిస్తున్నాయి.లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం: క్రెడిట్ కార్డులు స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఇది వినియోగదారులను బారీగా ఖర్చు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.ఆర్థిక నిరక్షరాస్యత: చాలా మంది వినియోగదారులకు బిల్లింగ్ సైకిల్స్, లేట్ పేమెంట్ లేదా కాంపౌండింగ్ వడ్డీ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు.ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికక్రెడిట్ కార్డు ఎన్పీఏలు (నిరర్థక ఆస్తులు) పెరగడంతో బ్యాంకింగ్ వర్గాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరిస్తోంది.అన్ సెక్యూర్డ్ లెండింగ్: క్రెడిట్ కార్డులు స్వభావరీత్యా అధిక రిస్క్ కలిగి ఉంటాయి. ఎందుకంటే తిరిగి చేసే చెల్లింపులపై ఎలాంటి పూచీకత్తు ఉండదు. మొండిబకాయిలు పెరగడం వల్ల బ్యాంకులు నష్టాల్లోకి జారుకుంటున్నాయి.రెగ్యులేటరీ చర్య: 2023లో ఆర్బీఐ క్రెడిట్ కార్డు రుణాలపై రిస్క్ పెంచింది. సంభావ్య నష్టాలను పూడ్చడానికి బ్యాంకులు ఎక్కువ మూలధనాన్ని కేటాయించవలసి వస్తుంది.కఠిన రుణ నిబంధనలు: డిఫాల్ట్‌లు పెరిగేకొద్దీ బ్యాంకులు రుణాలు జారీ చేయడంలో మరింత జాగ్రత్తలు వహించాలి.ఇదీ చదవండి: దేశంలో ఏఐ, ఎడ్‌టెక్‌ల విస్తరణ.. కానీ..వినియోగదారులు చేయాల్సింది..క్రెడిట్ కార్డులను ఆర్థిక సాధనాలుగా పరిగణించాలి. కానీ ఉచితంగా వచ్చే డబ్బుగా భావించకూడదు.అధిక వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి సకాలంలో పూర్తి బకాయిలు చెల్లించాలి.మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం సకాలంలో చెల్లింపులు చేయాలి. అందుకు క్రెడిట్ రిపోర్టులను పర్యవేక్షించాలి.బిల్లింగ్ సైకిల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఆఫర్లు, ఈఎంఐలపై అవగాహన పెంచుకోవాలి. -
దేశంలో ఏఐ, ఎడ్‌టెక్‌ల విస్తరణ.. కానీ..
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) నైపుణ్యాలకు డిమాండ్ ఆమాంతం పెరగడంతో అందుకు తగ్గట్టుగానే మన దేశంలో, రాష్ట్రంలో ఎడ్ టెక్ రంగం క్రమంగా గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఏఐ కేంద్రీకృత కోర్సుల విస్తరణకు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు ఊపందుకుంటున్నాయి. విద్యా రంగంలో, నైపుణ్యాలను పెంచుకునే విషయంలో ఏఐను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ దిశలో ముందుకు సాగుతున్నాయి. ఏఐ, ఎడ్టెక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో ఈ మార్కెట్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వివిధ పరిశ్రమల్లో ఏఐ నైపుణ్యాలకు ఆదరణ పెరగడంతో ఏఐ, ఎంఎల్ సంబంధిత రంగాల్లో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏఐ, ఎడ్‌టెక్‌లకు కేంద్రంగా అనేక సంస్థలు ప్రత్యేక కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ ఏఐ కోర్సు కేటలాగ్లను విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపరంగానూ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, చలనశీలత వంటి రంగాల్లో ఏఐను ఉపయోగించడంపై దృష్టి సారిస్తోంది. ఏఐ విద్యకు ప్రొత్సాహంతోపాటు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏఐ, రొబోటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. పరిశ్రమ సంబంధిత ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అవకాశాలు అందించడానికి సంస్థలు పరిశ్రమలు, టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఉద్యోగాలున్నా నైపుణ్యాల కొరతకృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లర్నింగ్ (ఎంఎల్)లలో ప్రావీణ్య సాధన ఎకో సిస్టమ్ పూర్తిస్థాయిలో ఇంకా మన దేశంలో ఏర్పడలేదని స్మార్ట్ స్టెప్స్ ట్రైనింగ్ అకాడమీ ఫౌండర్ నానబాల లావణ్యకుమార్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ సమయంలో కంపెనీలు, ఉద్యోగులంతా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ, అప్లికేషన్లపైనే దృష్టి పెట్టారని.. కానీ అదే సమయంలో అమెరికా, చైనా మాత్రం జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్ (జీపీటీ)లను తయారు చేసి రేసులో ఎంతో ముందుకెళ్లిపోయాయని చెప్పారు. కానీ భారత్ మాత్రం సంప్రదాయ కోర్సులకే పరిమితమై వెనుకబడిపోయిందన్నారు. ఎట్టకేలకు విశ్వవిద్యాలయాలు అనేక ఏఐ, ఎంఎల్ కోర్సులను ప్రారంభించినప్పటికీ సంక్లిష్టమైన ఈ నైపుణ్యాలను నేర్చుకొనేందుకు అవసరమైన మేర ఫ్యాకల్టీ లేరని లావణ్యకుమార్ అన్నారు. అందుకే గుణాత్మకమైన విద్యను అందించడంలో అధిక శాతం కళాశాలలు, ట్రైనింగ్ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అందుకే మార్కెట్లో డిమాండ్ ఉన్నా కావాల్సిన స్కిల్స్ లేక యువత వెనుకబడుతున్నారని.. ఏఐ ఆధారిత కంపెనీలు సైతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు.ఇదీ చదవండి: మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!కాలేజీల్లో మౌలిక సదుపాయాలేవి?చైనాతో పోలిస్తే భారత్‌లోని ఎడ్టెక్ కంపెనీల సామర్థ్యాలు పూర్తిస్థాయిలో లేవని క్వాలిటీ థాట్ ఫౌండర్, కెరీర్ గైడెన్స్ కోచ్ రమణ భూపతి అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లడం కూడా దీనికి కారణమన్నారు. ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలకు తగ్గట్టుగా ఎడ్టెక్ కంపెనీలు వేగాన్ని పెంచుకోలేకపోవడం, ఏఐ నైపుణ్యాలకు అవసరమైన గణితంలో లోతైన పరిజ్ఞానం విద్యార్థులకు కొరవడటం తదితర కారణాల వల్ల భారత్ కొంత వెనుకబడిందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐను బోధించాలంటే ఒక సరైన కాన్ఫిగరేషన్ (రూ.1.20 లక్షల ధర, గ్రాఫిక్ కార్డ్ తదితరాలతో) ఉన్న కంప్యూటర్ కావాలని.. కానీ మన దేశంలో అలాంటి కంప్యూటర్లు లేని కాలేజీలే 99 శాతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎడ్టెక్ కంపెనీలు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణనిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్‌ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం.గంటపాటు నిర్విరామంగా..ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ.కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం.వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్స్, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది.బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది.మాన్యువల్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది.పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.ఆర్1.. ఒక మైలురాయిఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట. చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్‌ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!రోజువారీ జీవితంలో మమేకం..మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది.కాఫీ మెషీన్‌ను ఆపరేట్ చేస్తుంది.ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది.ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్‌ను చదువుతుంది.మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్గా కూడా మారుస్తుంది.అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతైన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది.ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది. -
బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వీరికి రూ.కోట్ల వేతనాలు.. వారికి కొలువుల కోతలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సిబ్బందిలో 2% మంది(సుమారు 12,000) ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా కంపెనీ సీఈఓ కృతివాసన్ వేతన భత్యాలను కోట్ చేస్తూ పోస్ట్‌లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ లాభదాయకంగా ఉంటూ ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తుండడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సామాజిక మాధ్యమాలు వేదికగా టీసీఎస్ సీఈఓ కృతివాసన్ రూ.26.52 కోట్ల ప్యాకేజీపై తీవ్ర చర్చ సాగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ప్యాకేజీ బేస్ జీతం రూ.1.39 కోట్లు, బెనిఫిట్స్ అండ్ అలవెన్స్‌లు రూ .2.12 కోట్లు, కమిషన్లలో రూ.23 కోట్లుగా ఉన్నాయని కొందరు పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన వేతన భత్యాలపై స్పందించారు.ఇదీ చదవండి: మళ్లీ భాగ్యనగరంలో భూముల వేలం‘బలమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థను నిర్మించడానికి 12,000 మంది ఉద్యోగులను తొలగించాలి. వాస్తవానికి, కంపెనీ చాలా ముఖ్యమైంది. ఉద్యోగులు జీవితాలు ఏమైనా ఫర్వాలేదు’ అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ వేతనాల్లో కోత విధించాలని కొందరు డిమాండ్ చేయగా, మరికొందరు టీసీఎస్ ఛైర్మన్లు ఏడాదికి రూ.150 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు వ్యూహాత్మకమే తప్పా, ఆర్థిక సమస్య కాదని కంపెనీ మద్దతుదారులు అంటున్నారు. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది ప్రతిభను పునర్నిర్మించే చర్యగా చూడాలని తెలిపారు. ఖర్చు ఆదా చేసే చర్య కాదన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు రూ.కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. కానీ ఉద్యోగులకు మాత్రం తమ కొలువుల్లో కోత విధిస్తున్నారు’ అని చెప్పారు. -
మళ్లీ భాగ్యనగరంలో భూముల వేలం
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకంగా మారిన టీజీఐఐసీ మరోమారు అత్యంత విలువైన భూముల వేలానికి సిద్ధమైంది. రాయదుర్గ్, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లోని 66 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని భావిస్తోంది. వేలం విధివిధానాల్లో సహకరించేందుకు సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది.వచ్చే నెల 8 వరకు వేలం కోసం బిడ్లను స్వీకరించి 12న వేలం ప్రక్రియను పూర్తిచేసేలా టీజీఐఐసీ షెడ్యూల్ విడుదల చేసింది. 17 ప్లాట్ల వేలానికి సంబంధించిన అప్సెట్ ధర(మినిమం బేస్ ప్రైస్)ను టీజీఐఐసీ ప్లాట్లవారీగా నిర్ణయించింది. రాయదుర్గ్‌లోని 15ఏ/2, 14ఏ/1 ప్లాట్ల అప్సెట్ ధరను చదరపు గజానికి రూ.1,51,484గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరం ధర రూ.104 కోట్లుగా తేల్చింది. మిగతా ప్లాట్లలో అప్సెట్ ధరను కనిష్టంగా రూ.12.20 కోట్ల నుంచి రూ. 50.10 కోట్లుగా నిర్ణయించింది. ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!మొత్తం 66 ఎకరాలను టీజీఐఐసీ విక్రయించనుండగా వాటిలో 4 ప్లాట్లు రాయదుర్గంలో, మరో 13 ప్లాట్లు ఉస్మాన్‌నగర్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని 2014–23 మధ్య టీజీఐఐసీ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 21 వేల కోట్ల ఆదాయం సమకూర్చినట్లు సమాచారం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 24,866కు చేరింది. సెన్సెక్స్(Sensex) 138 ప్లాయింట్లు పుంజుకుని 81,479 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.75బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.38 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!
మైక్రోసాఫ్ట్ 2025 ప్రారంభం నుంచి వివిధ సందర్భాల్లో తొలగించిన 15,000 మంది ఉద్యోగులను ఉద్దేశించి కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ నాలుగో విడత ఉద్యోగాల కోత సందర్భంగా విడుదల చేసిన అంతర్గత మెమోలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు.‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవి నాపై ఎంతో భారాన్ని మోపుతున్నాయి. మనం కలిసి పనిచేసిన, కలిసి నేర్చుకున్న లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్న వ్యక్తులపై ప్రభావం ఉంటోంది. కంపెనీని విడిచి వెళ్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, గేమింగ్, మిడిల్ మేనేజ్మెంట్తో సహా వివిధ విభాగాలలో ఈ సంవత్సరం మొత్తంగా 15,000 మందిని తొలగించింది. ఇటీవల సత్య చేసిన ప్రకటనతో మరో 9,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’బలమైన ఆర్థిక పనితీరు అయినా..బలమైన ఆర్థిక పనితీరు ఉన్న సమయంలోనూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతలను అనుసరిస్తోంది. కంపెనీ ఇటీవల త్రైమాసిక నికర ఆదాయం 18 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయినా పునర్నిర్మాణం పేరిట కొలువులను తొలగిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో పనితీరు ఆధారిత సమీక్షలతో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. తరువాత మే, జూన్, జులైలో ఇవి పెరుగుతూ వచ్చాయి. ఈ లేఆఫ్స్‌తో గేమింగ్ యూనిట్ భారీగా ప్రభావితం చెందింది. 3,000కి పైగా కొలువుల కోత ఈ ఒక్క విభాగంలోనే ఉంది. ‘ది ఇనిషియేటివ్’ వంటి స్టూడియోలను కంపెనీ మూసివేసింది. ఎక్స్ బాక్స్, పర్ఫెక్ట్ డార్క్ గేమ్‌లను రద్దు చేసుకుంది. -
లెన్స్‌కార్ట్.. ఐపీఓ రూట్
ఓమ్నిచానల్ ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 13.22 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 273 కోట్లు దేశీయంగా సొంత స్టోర్ల ఏర్పాటు(పెట్టుబడి వ్యయాలు)కు, లీజ్, అద్దె, లైసెన్స్ ఒప్పందాల చెల్లింపులకు రూ. 591.5 కోట్లు, టెక్నాలజీపై రూ. 213.4 కోట్లు, బ్రాండ్ మార్కెటింగ్‌పై మరో రూ. 320 కోట్లు చొప్పున వెచ్చించనుంది.2008లో షురూ: దేశీయంగా 2008లో ఏర్పాటైన లెన్స్‌కార్ట్.. 2010లో ఆన్లైన్ ద్వారా బిజినెస్‌కు తెరతీసింది. 2013లో న్యూఢిల్లీలో తొలి రిటైల్ స్టోర్‌ను తెరిచింది. కంపెనీ ఐవేర్ విభాగంలో డిజైనింగ్, తయారీ, బ్రాండింగ్, రిటైలింగ్‌ను చేపడుతోంది. 2025 మార్చికల్లా దేశీయంగా నెలకొలి్పన 2,067 స్టోర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2,723 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’రాజస్తాన్‌లోని భివాడీ, హర్యానాలోని గురుగ్రామ్‌లలో ప్లాంట్లు ఉన్నాయి. జాన్ జాకబ్స్, విన్సెంట్ చేజ్, హూపర్ కిడ్స్ తదితర బ్రాండ్లతో బిజినెస్ నిర్వహిస్తోంది. 2024–25లో నష్టాల నుంచి బయటపడి రూ. 297 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 6,652 కోట్లను తాకింది. -
నాలుగు నెలల కనిష్టానికి రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు క్షీణించి 4 నెలల కనిష్ట స్థాయి 86.91 వద్ద స్థిరపడింది. డాలర్ బలపడటం, క్రూడ్ ధరల అనూహ్య పెరుగుదల, నెలాఖరున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ‘అమెరికా–భారత్‌ల మధ్య ఆగస్టు 1న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమైనా, చర్చలు వాయిదా పడినా దేశీయ కరెన్సీపై అదనపు ఒత్తిడి పడుతుంది. ట్రేడ్ డీల్ కుదిరితే రూపాయి బలపడే వీలుంది. అప్పటిదాకా ఫారెక్స్ ట్రేడర్లు వేచిచూసే ధోరణి ప్రదర్శించవచ్చు’ అని మీరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ విశ్లేషకుడు అనుజ్ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’రూపాయి పతనానికి కారణాలు..1. ఇండియన్ రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర పెరుగుతోంది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
రియల్టీ రంగానికి విరివిగా బ్యాంకు రుణాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగానికి (రియల్టి) బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. ఈ రంగానికి బ్యాంకుల రుణ వితరణ నాలుగేళ్లలో రెట్టింపై 2025 మార్చి నాటికి మొత్తం రూ.35.4 లక్షల కోట్లకు చేరింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ అయిన కొలియర్స్ ఇండియా ప్రకటించింది. ఈ రంగానికి చెందిన టాప్–50 లిస్టెడ్ కంపెనీల లాభం, మార్కెట్ పనితీరును విశ్లేషించినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘‘కరోనా విపత్తు అనంతరం రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక పనితీరు ఎంతో మెరుగుపడింది. ఇతర రంగాల కంటే మెరుగైన పనితీరు చూపించింది. దీంతో ఈ రంగానికి రుణ వితరణలో మంచి పురోగతి నెలకొంది. బ్యాంకుల స్థూల రుణాలు 2021 మార్చి నాటికి రూ.109.5 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి రూ.182.4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకుల రుణ వితణ రెట్టింపైంది. రూ.17.8 లక్షల కోట్ల నుంచి రూ.35.4 లక్షల కోట్లకు పెరిగింది’’అని ఆర్బీఐ డేటా ఆధారంగా కొలియర్స్ ఇండియా తెలిపింది. పెరిగిన విశ్వాసం బ్యాంకుల రుణ వితరణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వాటా 20 శాతానికి చేరిందని.. ఈ రంగం పట్ల బ్యాంకుల్లో విశ్వాసం పెరుగుదలను ఇది సూచిస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘ఎన్నో అస్థిరతలు నెలకొన్న తరుణంలోనూ భారత రియల్ ఎస్టేట్ రంగం బలంగా నిలబడడమే కాకుండా, ద్రవ్యపరమైన క్రమశిక్షణను చూపించింది’’అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజి్ఞక్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలతో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రియల్ఎస్టేట్ రంగంలోనే క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్లు (రేటింగ్ పెంపు) ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. నివాస భవనాలు, వాణిజ్యం, పారిశ్రామిక భవంతులు, గోదాములు, రిటైల్, ఆతిథ్యం వసతుల పరంగా డిమాండ్–సరఫరా మెరుగ్గా ఉండడం రియల్ ఎస్టేట్ రంగ రుణ నాణ్యత పటిష్టంగా ఉండేందుకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. టాప్–50 కంపెనీలు లాభదాయకత, నగదు ప్రవాహం, బ్యాలన్స్ షీటు పరంగా గత ఐదేళ్లలో పనితీరు గణనీయంగా మెరుగైనట్టు పేర్కొంది. టాప్–50లో 62 శాతం కంపెనీల లాభాల మార్జిన్ 2024–25లో గరిష్టానికి చేరినట్టు వివరించింది. -
భారత్ నుంచి 3 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో (2030 నాటికి) తమ గ్లోబల్ కార్యకలాపాల కోసం భారత్ నుంచి కొనుగోళ్లను 3 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు (సుమారు రూ. 25,500 కోట్లు) ఫ్రాన్స్‌కి చెందిన స్పోర్ట్స్ రిటైలింగ్ సంస్థ డెకాథ్లాన్ తెలిపింది. తాము గత 25 ఏళ్లుగా భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నామని, మేకిన్ ఇండియా విజన్‌కి కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రొడక్షన్ హెడ్ ఫ్రెడరిక్ మెర్లివీడ్ తెలిపారు. ప్రస్తుతం తాము అంతర్జాతీయంగా జరిపే కొనుగోళ్ల పరిమాణంలో భారత్ వాటా 8 శాతంగా ఉందని, 2030 నాటికి దీన్ని 15 శాతానికి పెంచుకోనున్నామని చెప్పారు. భారత్‌లో విక్రయాల పరిమాణంలో 70 శాతం వాటా దేశీ సోర్సింగ్‌దే ఉంటోందని, దీన్ని 90 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. నాణ్యత, వేగం, కొత్త ఆవిష్కరణలపరంగా భారత్, తమ గ్లోబల్ తయారీ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోందని ఫ్రెడరిక్ చెప్పారు. డెకాథ్లాన్కి భారత్‌లో ఒక డిజైన్ సెంటర్, 83 సరఫరాదార్లు, 113 తయారీ యూనిట్లు, 55 నగరాల్లో 132 స్టోర్స్ ఉన్నాయి. రిటైల్, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ.933 కోట్లు (100 మిలియన్ యూరోలు) ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెకాథ్లాన్ భారత మార్కెట్లో రూ. 4,000 కోట్ల ఆదాయం, రూ. 197 కోట్ల లాభం ఆర్జించింది. -
ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ పనితీరు స్థిరంగానే కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో దేశీ సరఫరా, డిమాండ్ బలంగా ఉన్నట్టు కార్యకలాపాలను పరిశీలిస్తే తెలుస్తున్నట్టు తన నెలవారీ సమీక్షలో పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్యం పరిధిలోనే ఉండడం, రుతుపవనాల పురోగతి మెరుగ్గా ఉండడంతో దేశీ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలోకి (జూలై–సెప్టెంబర్) బలంగా అడుగుపెట్టినట్టు తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగకపోయినా.. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూఎస్‌లో మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ తన నివేదికలో అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ల పరంగా అనిశ్చితి అదే పనిగా కొనసాగుతుండడం రానున్న త్రైమాసికాల్లో భారత వాణిజ్య పనితీరును ప్రభావితం చేయొచ్చని తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులు, రుణాల్లో వృద్ధి నిదానించడం ఆర్థిక పనితీరు మరింత వేగం పుంజుకోకుండా నియంత్రించొచ్చని అభిప్రాయపడింది. స్థిరమైన ధరల వద్ద ఆర్థిక పనితీరును గమనించినట్టయితే మరింత పటిష్టంగా కనిపిస్తున్నట్టు పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఆర్థిక వ్యవస్థ అనుకున్నట్టు సజావుగానే సాగుతోందని అభివరి్ణంచింది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. నిదానించిన రుణ వితరణ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగానే ఉన్నప్పటికీ రుణ వృద్ధి నిదానించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రుణ గ్రహీతలు ఆచితూచి వ్యవహరించడం లేదంటే రుణ దాతలు రిస్‌్కకు సిద్ధపడకపోవడం కారణమై ఉండొచ్చని పేర్కొంది. తక్కువ వ్యయాల కారణంగా కార్పొరేట్లు బాండ్ల మార్కెట్లో నిధులు సమీకరణకు మొగ్గు చూపిస్తుండడం కూడా రుణ వృద్ధి నిదానించడానికి ఒక కారణమై ఉండొచ్చని తెలిపింది. ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మద్దతుతో కొర్పొరేట్ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావాల్సి ఉందని సూచించింది. -
బ్యాంక్‌లు.. అడ్డదారులు!
ముంబై: కొన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తీవ్రమైన పోటీ ఒత్తిళ్ల మధ్య తాత్కాలిక విజయాల కోసం అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే ఆరోపించారు. తమిళనాడులోని కరూర్‌లో ప్రైవేటు బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లక్ష్యం మంచిదైనప్పుడు దాన్ని సాధించడానికి ఏ పద్ధతి అనుసరించినా మంచిదే’అన్నట్టు సంబంధిత రుణ దాతల యాజమాన్యాలు భావిస్తున్నాయంటూ.. ఆ తరహా విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేస్తాయని హెచ్చరించారు. క్రియేటివ్ అకౌంటింగ్ (నిబంధనల్లో లోపాలను ఆసరాగా చేసుకుని గణాంకాలను సానుకూలంగా పేర్కొంటూ తప్పుదోవ పట్టించడం), నిబంధనలకు కచి్చతంగా కట్టబడకుండా స్వేచ్ఛగా వ్యవహరించడం, అంతర్గతంగా సరైన నియంత్రణలు లేకపోవడం వంటివి కొన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో సాధారణంగా మారిపోయినట్టు చెప్పారు. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తోందని స్వామినాథన్ వివరించారు. నైతిక మార్గంలోనే వృద్ధి ప్రక్రియలను అనుసరించడం అవసరమన్నారు. నమ్మకమైన వ్యవస్థలు, బాధ్యతాయుతమైన నాయకత్వం, స్పందించే సేవలతో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డులు, యాజమాన్యాలపై ఉన్నట్టు గుర్తు చేశారు. ఒక బ్యాంక్‌కు గుర్తింపే పెద్ద ఆస్తి అవుతుందన్నారు. పోటీ పెరిగిపోయి, కస్టమర్ల అంచనాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో కస్టమర్ ప్రాధాన్యంగా సేవలు అందించడం ద్వారానే నమ్మకం, విశ్వసనీయతకు తోడు, దీర్ఘకాలంలో విలువ సమకూర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. నియంత్రణపరమైన అవసరాల కోసమని నంబర్లను పెంచి చూపించడం కాకుండా.. ఆర్థిక వనరులను ఏ విధంగా వినియోగిస్తున్నారన్నది ముఖ్యమని సూచించారు. జవాబుదారీగా నడుచుకోవాలి.. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, కొత్త ప్రాంతాల్లోకి సేవల విస్తరణ పరంగా సరైన స్పష్టత, సమన్వయం, జవాబుదారీతనం అవసరమని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకుంటున్నట్టే, సైబర్ భద్రత, డేటా నిర్వహణపైనా బలమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని సూచించారు. టెక్నాలజీ అంతరాలను వేగంగా పరిష్కరించకుంటే వ్యవస్థాగత బలహీనతకు దారితీస్తుందని హెచ్చరించారు. -
అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అగ్రరాజ్యానికి చైనాకన్నా అధికంగా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో చైనాలో అసెంబుల్ చేసిన ఫోన్ల వాటా గతేడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 61 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే వ్యవధిలో 25 శాతానికి తగ్గింది. అదే సమయంలో భారత్ వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (సుమారు 240 శాతం వృద్ధి) పెరిగింది. క్యూ2లో ఐఫోన్ల ఎగుమతులు వార్షికంగా 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం కాగా, శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి. టాప్ 5 ఫోన్లకు సంబంధించి అమెరికాకు మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13% పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23% క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్యూ2లో తొలిసారి...అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి క్యూ2లో భారత్ తొలిసారిగా అగ్రగామి తయారీ హబ్‌గా నిల్చిందని కెనాలిస్ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యమ్ చౌరాసియా తెలిపారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి వల్ల యాపిల్ తమ సరఫరా వ్యవస్థను భారత్‌కు మళ్లిస్తుండటం ఇందుకు దోహదపడిందని వివరించారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా చెప్పారు. అయితే, ఐఫోన్ 16 సిరీస్, ప్రో మోడల్స్ తయారీని భారత్‌లో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్థాయిలో సరఫరా కోసం యాపిల్ ఇప్పటికీ చైనా తయారీ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వివరించారు. యాపిల్ తరహాలోనే మోటరోలా ఫోన్లకు కూడా ప్రధాన తయారీ హబ్‌గా చైనా నిలుస్తోంది. మరోవైపు, యాపిల్‌తో పోలిస్తే కాస్త తక్కువ పరిమాణమే అయినప్పటికీ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీని శాంసంగ్, మోటరోలా కూడా భారత్‌లోనే ఎక్కువగా చేపడుతున్నాయని చౌరాసియా పేర్కొన్నారు. శాంసంగ్ అత్యధికంగా స్మార్ట్ఫోన్లను వియత్నాంలో ఉత్పత్తి చేస్తోంది. -
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ముంబై: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆర్బీఐ – డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్బీఐ–డీపీఐ) ఈ ఏడాది మార్చి నెలకు 493.22గా నమోదైంది. దీనికి ఆరు నెలల ముందు.. 2024 సెప్టెంబర్‌లో ఈ సూచీ 455.5గా ఉండడం గమనార్హం. అంటే డిజిటల్ చెల్లింపుల్లో 10.7% మేర వృద్ధి నమోదైంది. చెల్లింపుల సదుపాయాలు, సరఫరా వైపు అంశాలు ఆర్బీఐ–డీపీఐ సూచీ బలపడేందుకు దారితీసినట్టు ఆర్బీఐ తెలిపంది.ఐదు అంశాల ఆధారంగా చెల్లింపుల తీరును ఆర్బీఐ మదింపు వేస్తుంటుంది. ఇందులో చెల్లింపులు చేసే వారు (25% వెయిటేజీ), చెల్లింపులు సదుపాయాలు – డిమాండ్ వైపు అంశాలు (10%) పేమెంట్ (Payment) సదుపాయాలు – సరఫరా వైపు అంశాలు (15%), చెల్లింపుల పనితీరు (45%), వినియోగదారుల కేంద్రీకరణ 5% చొప్పున వెయిటేజీ కలిగి ఉన్నాయి.విప్రో ఇన్ఫ్రా నుంచి కొత్త బిజినెస్ న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ సొల్యూషన్లు అందించే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) తాజాగా కొత్త బిజినెస్ విభాగానికి తెరతీసింది. విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగంపై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల(పీసీబీలు) తయారీలో ఉపయోగించే బేస్ మెటీరియల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కర్ణాటకలో కాపర్ క్లాడ్ లామినేట్(సీసీఎల్) తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించింది. దీంతో సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది.చదవండి: టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలుపెగాసిస్టమ్స్ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ సెషన్లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ డెవలపర్లలో 50 శాతం మంది భారత్‌లో ఉన్నారని, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పెగాఇన్నోవేట్ 2025 కార్యక్రమం సందర్భంగా కంపెనీ ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. పెగా ప్రధాన టెక్నాలజీలైన బ్లూప్రింట్, యాప్ డిజైన్‌లాంటి టెక్నాలజీలు తదితర అంశాల గురించి ఈ సెషన్స్‌లో చర్చిస్తారు. ఒక్కో సెషన్లో 50 మంది వరకు పాల్గొనవచ్చని దీపక్ చెప్పారు. -
ఫైనాన్షియల్ మోసాలకు చెక్ పెట్టేలా 5 చర్యలు
డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు అత్యవసర సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సంయుక్తంగా పెట్టుబడిదారుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు పెరుగుతున్నందున, రిటైల్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడి సాధనాలతోపాటు టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యం పెట్టుకున్నాయి. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్ఫ్లుయెన్సర్ ఆధారిత కంటెంట్ పెరిగిపోతుండడంతో ఇన్వెస్టర్లు మోసాల బారిన పడుతున్నారు.గ్యారెంటీడ్ రిటర్న్స్.. ఇన్వెస్టర్ల పెట్టుబడులపై గ్యారెంటీడ్ రిటర్న్స్ అంటూ సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు.డిజిటల్ హైజీన్: ఇన్వెస్టర్లు సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి. అధికారిక ఛానెళ్లలో మధ్యవర్తులను వెరిఫై చేసుకోవాలి. కాదని ప్రత్యేకంగా నేరగాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.పెట్టుబడి సలహాలు: ముఖ్యంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు లేదా ఈమెయిల్స్ లోని తెలియని సోర్స్ నుంచి వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దు. ఉచిత సలహా వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఎవరికివారు నిత్యం ప్రశ్నించుకోవాలి.సెబీ రిజిస్టర్డ్ యాప్‌లు: సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. సదరు యాప్ సెబీ అధికారిక జాబితాలో లేకపోతే దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. ఫిషింగ్, మోసం స్కీమ్‌ల్లో నకిలీ యాప్‌లే సాధనంగా ఉంటాయి.మధ్యవర్తులను వెరిఫై చేయడం: బ్రోకర్లు, సలహాదారులు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల చట్టబద్ధతను ధ్రువీకరించుకోవాలి. అందుకు సెబీ అధికారిక పోర్టలో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలి. ముందస్తు రిపోర్టింగ్ ఇతరులను రక్షించడంలో సహాయపడుతుంది. రెగ్యులేటర్లు వేగంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. -
దేశంలోనే మొదటి క్లౌడ్ ఆధారిత డెస్క్‌టాప్
ఖరీదైన హార్డ్‌వేర్ అవసరం లేకుండా ఏ స్క్రీన్ నైనా పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చే గేమ్ ఛేంజింగ్ సర్వీస్‌ను రిలయన్స్ జియో ‘జియోపీసీ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్‌తో నడిచే క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్ టాప్‌ను జియోపీసీ అంటారు. దీనిద్వారా కేవలం కీబోర్డు, మౌస్ ఉపయోగించి టీవీ లేదా మానిటర్‌ను పర్సనల్ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు.పూర్తిగా క్లౌడ్ మీద ఆధారపది ఇది కంప్యూటింగ్ సర్వీసు అందిస్తుంది. ఇందులో సీపీయూ ఉండదు. అప్గ్రేడ్లు ఉండవు. మెయింటెనెన్స్ ఉండదు. ఈ క్లౌడ్ సర్వీస్ కోసం నెలకు రూ.400 నుంచి ‘పే-యాస్ యూ-గో’ మోడల్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త యూజర్లకు ఒక నెల ఉచిత ట్రయల్ అందిస్తారు. 8 జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఆధారిత టూల్స్ ఇందులో ఉంటాయి. అడోబ్ ఎక్స్ ప్రెస్‌ను ఉచితంగా అందిస్తారు. ఇది ఫైల్ డిజైన్, ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది.లిబ్రే ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్ కోసం), జియో వర్క్ స్పేస్ వంటి ఉత్పాదక అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్లౌడ్‌లో డేటాను సురక్షితంగా స్టోర్ చేసేందుకు వైరస్ అటాక్‌ల నుంచి భద్రత కల్పిస్తారు.ఎవరికి ఉపయోగమంటే..ఆన్లైన్ లెర్నింగ్, కోడింగ్, రీసెర్చ్ కోసం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందస్తు పెట్టుబడి లేకుండా సరసమైన కంప్యూటింగ్ కోసం చిరు వ్యాపారాలకు తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల కోసం వినోదాన్ని అందిస్తుంది. క్లౌడ్ టూల్స్‌తో కంటెంట్ క్రియేటర్లు డిజైన్, ఎడిట్, పబ్లిషింగ్‌ను ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలా సెట్ చేయాలంటే..జియో సెట్ టాప్ బాక్స్ ఆన్ చేయాలి.యాప్స్ విభాగానికి వెళ్లి జియోపీసీ యాప్‌ను లాంచ్ చేయాలి.కీబోర్డ్, మౌస్‌ను ప్లగ్ ఇన్ చేయాలి.జియో నంబర్‌తో రిజిస్టర్ అయి, సైన్ ఇన్ అవ్వాలి. -
టెక్ దిగ్గజాలు.. ఎవరేం చదివారంటే..
టెక్ బిలియనీర్ల ప్రపంచంలో సుందర్ పిచాయ్, ఎలాన్మస్క్లకు ప్రత్యేక స్థానం ఉంది. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ ఇంక్‌కు నాయకత్వం వహిస్తూ, బిలియనీర్ జాబితాలో ఇటీవల చోటు సంపాదించారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ వ్యవస్థాపకుడిగా ఎలాన్‌మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. వీరు సారథ్యం వహిస్తున్న కంపెనీల ఉత్పత్తుల ద్వారా నిత్యం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు వీరి నుంచి అకడమిక్ ప్రమాణాలతోపాటు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది.సుందర్ పిచాయ్చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ టెక్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న జవహర్ విద్యాలయంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. వానవాణి స్కూల్లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలార్జీ ఇంజినీరింగ్ చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి వార్టన్ స్కూల్ ద్వారా ఎంబీఏ చేశారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ల్లో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలాన్ మస్క్దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన ఎలాన్ మస్క్ చిన్న వయసులోనే కంప్యూటింగ్‌పై ఆసక్తి పెంచుకుని 10 ఏళ్లకే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాలోని తప్పనిసరి సైనిక సేవను నివారించడానికి క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరడానికి కెనడా వెళ్లారు. రెండేళ్ల తరువాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరారు. వార్టన్ స్కూల్ నుంచి ఫిజిక్స్, ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. మస్క్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్డీ కోసం కొంతకాలం చేరారు. కాని కొద్ది రోజులే అందుకు కొనసాగారు. -
Divya Deshmukh: అసలైన హీరో మాత్రం ఆమెనే: ఆనంద్ మహీంద్ర
దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh).. భారత చెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం. ఫిడే మహిళల ప్రపంచకప్ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.దూకుడు ప్రదర్శిస్తూనేపందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది. క్లాసిక్ గేమ్స్‌ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్ రౌండ్స్‌లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్‌గా అవతరించింది.అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ఈ నేపథ్యంలో దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ ఇవ్వడం విశేషం.ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్-2025 విజేత దివ్య దేశ్‌ముఖ్. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.అయినా, ప్రతీ గ్రాండ్ మాస్టర్ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్సంగ్ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్ స్టార్లు ఆర్.ప్రజ్ఞానంద, ఆర్.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దివ్య భావోద్వేగంప్రపంచకప్ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు.నేను ఎప్పుడు నార్మ్ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్‌మాస్టర్ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్‌ముఖ్. వీరిద్దరూ డాక్టర్లే!చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’ Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.Through this victory she also achieves Grandmaster status. At the age of 19. And behind the Grandmaster is the caring mother…As always, the unsung hero behind many stars…pic.twitter.com/9AyeBBPbM5— anand mahindra (@anandmahindra) July 28, 2025 -
‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
టెక్ రంగంలో ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందనే భయాలు నెలకొంటున్న తరుణంలో జోహో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. జోహోలో ఇంజినీర్లను ఏఐ భర్తీ చేయగలదా అని కంపెనీ సీఈఓ మణి వెంబును అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని ప్రభావం లేదని సమాధానం చెప్పారు. ఇటీవల ఓ సమావేశంలో వెంబు మాట్లాడారు.‘కృత్రిమ మేధ కారణంగా జోహోలో ఉద్యోగాల్లో కోత లేదు. మీరు ఏఐ వ్యవస్థను ఒక కంటెంట్‌ను సృష్టించమని అడిగితే అది చాలా మెరుగ్గా కంటెంట్‌ను ఇస్తుంది. అయితే కేవలం ఈ ఫీచర్ మా కంపెనీలో ఉద్యోగాలను తొలగించలేదు. ఇప్పటివరకు కృత్రిమ మేధ కారణంగా మేము సిబ్బందిని తగ్గించలేదు. వాస్తవానికి మరికొందరు ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.ఇటీవల బెంగళూరులో జరిగిన జోహోలిక్స్ కార్యక్రమంలో వెంబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జియా అని పిలువబడే కంపెనీ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ భారతదేశపు మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఏఐ అని చెప్పారు. ఇది సాధారణ ప్రజల కోసం ఉద్దేశించింది కానప్పటికీ, ఈ నమూనా వ్యాపారాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. దీన్ని జోహో ఉత్పాదకత, ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలుకృత్రిమ మేధ కంపెనీ వర్క్ ఫ్లోలో భాగమవుతోందని వెంబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు మరింత సహాయపడుతుందని నమ్ముతున్నారు. ‘ఇప్పటివరకు (జోహోలో) మేము కంపెనీలో ఏఐ కచ్చితంగా ఉద్యోగులను భర్తీ చేయడాన్ని చూడలేదు. దానికి బదులుగా ఇది ఉద్యోగులకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక సపోర్ట్ రిప్రజెంటేటివ్ సాధారణంగా రోజుకు 20 టిక్కెట్లను హ్యాండిల్ చేస్తాడనుకోండి.. ఏఐ సాయంతో 25 టిక్కెట్లను నిర్వహించే అవకాశం ఉంది. ఇది 20 శాతం వరకు ఉత్పాదకతను పెంచుతుంది’ అని చెప్పారు. -
టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిలో 2 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. టీసీఎస్ ప్రకటన ఆర్థిక ప్రకంపనలకు(ఎకనామిక్ ఎర్త్‌క్వేక్) కారణమవుతుందన్నారు. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో ప్రభావితం చెందే వారిలో ఎక్కువ మంది మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులు ఉండబోతున్నట్లు సంస్థ తెలిపింది.2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ‘నైపుణ్యాల అసమతుల్యత వల్ల కంపెనీ ఈమేరకు ప్రకటన చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆర్థిక ప్రకంకపనలు సృష్టిస్తుంది’ అని జైరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. టెక్నాలజీ, కృత్రిమ మేధ, మార్కెట్ విస్తరణ, శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ విస్తృత వ్యూహంలో భాగంగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ టారిప్‌లపై కీలక ప్రకటనబాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడాన్ని పరిశీలిస్తుంది. -
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బీఎస్ఎన్ఎల్ టారిప్‌లపై కీలక ప్రకటన
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్‌లను పెంచే యోచన లేదని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతదేశం అంతటా 4జీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ త్వరలో టారిఫ్‌లను పెంచబోతుందనే వాదనలను తోసిపుచ్చుతూ మంత్రి ఈమేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.బీఎస్ఎన్ఎల్ ఎప్పటినుంచో 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల్లో వాడుతున్న పాత చైనీస్ పరికరాలను స్వదేశీ 4జీ మౌలిక సదుపాయాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితి తెలపలేదు. బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలను దశలవారీగా నిలిపివేస్తున్నప్పటికీ, 5జీకి మారే ప్రణాళికలు మాత్రం ప్రస్తుతానికి లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రస్తుతం 4జీ సరిపోతుందని మంత్రి అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4జీ నెట్‌వర్క్‌ను అందించడమే ప్రస్తుత ప్రాధాన్యమని పెమ్మసాని తెలిపారు. ఇతర టెల్కోల్లో 75 శాతం మంది వినియోగదారుల అవసరాలను 4జీ తీరుస్తుందన్నారు. స్వదేశీ 5జీ కోర్, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పుడే ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు.మొబైల్ కస్టమర్ గ్రోత్, ఏఆర్పీయూ, ఫిక్స్డ్ వైర్లెస్ వంటి విభాగాల్లో ప్రతి సర్కిల్‌కు లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఏటా 20-30 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 1,00,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటి ఇంటిగ్రేషన్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని మంత్రి అన్నారు. నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, కానీ బీఎస్ఎన్ఎల్ కేవలం 2–3 ఏళ్లలోనే 90–95% సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.ఇదీ చదవండి: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లుమౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడం, భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పాత్రను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని కేంద్రమంత్రి సింథియా చెప్పారు. కంపెనీ పరివర్తనను ఆయన ప్రశంసించారు. కస్టమర్ అనుభవం, ఆదాయ సృష్టిలో గణనీయమైన మెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లు
బ్యాంక్‌ల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు (కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ వెనక్కి తీసుకోనివి) జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉంటే, రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలోనివి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐలోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ.1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్ల చొప్పున అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఇందులో పొందుపరిచారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేతఅన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు ముందుగా..ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి.రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి.ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలి.ఒకవేళ అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్‌క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది.ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.యూడీఆర్ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. -
మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేత
రష్యన్ కంపెనీలపై యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలు నిలిపివేసింది. దీనితో గతంలోనే పుర్తిగా చెల్లించి, లైసెన్సులను కొనుగోలు చేసినప్పటికీ సొంత డేటా, ఇతరత్రా టూల్స్ మొదలైనవి తమకు అందుబాటులోకి లేకుండా పోయాయని నయారా వెల్లడించింది. ఇలాంటివి చాలా ప్రమాదకర ధోరణులని ఆందోళన వ్యక్తం చేసింది.మైక్రోసాఫ్ట్ ఏకపక్షంగా, హఠాత్తుగా సర్వీసులను నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించింది. సర్వీసులను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నయారా ఎనర్జీపై కూడా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించింది. ఇదీ చదవండి: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!అయితే, ఇవి ఈయూ చట్టాల పరిధిలోకే వస్తాయి తప్ప మైక్రోసాఫ్ట్‌లాంటి అమెరికన్ కంపెనీలకు, భారతీయ సంస్థలకు వర్తించవని నయారా ఎనర్జీ తెలిపింది. రిఫైనింగ్ సామర్థ్యంలో 8 శాతం, రిటైల్ పెట్రోల్ బంకుల నెట్‌వర్క్‌లో ఏడు శాతం వాటాతో భారత ఇంధన భద్రతలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,694కు చేరింది. సెన్సెక్స్(Sensex) 19 ప్లాయింట్లు పుంజుకుని 80,906 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టార్‌లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్‌లింక్ భారత్‌లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్‌కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్‌పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్‌లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
స్పీడ్ తగ్గిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం వృద్ధి జూన్‌లోనూ నిదానించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9 శాతంగా నమోదైంది. వృద్ధి 1.5 శాతానికి పరిమితమైంది. ఇది పది నెలల (2024 ఆగస్ట్ తర్వాత) కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు ఢీలాపడింది. జూన్ చివర్లో వర్షాలు ఈ రంగాల పనితీరును ప్రభావితం చేశాయి. ఈ మేరకు జూన్ నెలకు సంబంధించి ఐఐపీ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన ఐఐపీ రేటును 1.2 శాతం నుంచి 1.9 శాతానికి సవరించినట్టు ఎన్ఎస్వో ప్రకటించింది. → తయారీ రంగంలో ఉత్పత్తి జూన్‌లో 3.9 శాతం పెరిగింది. 2024 జూన్‌లో ఈ రంగంలో ఉత్పత్తి 3.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం. → మైనింగ్‌లో ఉత్పత్తి మైనస్ 8.7 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో 10.3 శాతం వృద్ధి నమోదైంది. → విద్యుదుత్పత్తి సైతం మైనస్ 2.6 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 8.6 శాతం వృద్ధి నమోదైంది. → క్యాపిటల్ గూడ్స్ విభాగంలోనూ వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి 2.9 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 8.8 శాతంగా ఉంది. → కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 0.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది జూన్‌లోనూ మైనస్ ఒక శాతంగా ఉండడం గమనార్హం. → ఇన్ఫ్రా/నిర్మాణ రంగంలో 7.2 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని చూసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)నూ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంది.వర్షాల ప్రభావం.. జూన్ రెండో భాగంలో అధిక వర్షాలు మైనింగ్ ఉత్పత్తి, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. త్రైమాసికం వారీగా చూస్తే వృద్ధి 11 నెలల కనిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొన్నారు. -
ఈ ఐటీకి ఏమైంది..?
2000 సంవత్సరంలో వై2కే, 2017లో క్లౌడ్.. ఇప్పుడు ఏఐ.. ఇలా టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగులకు సరికొత్త సాంకేతికతలు పెను సవాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఉద్యోగ కల్పవృక్షంగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక్కసారిగా ‘కోత’ల గుబులు మొదలైంది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటనతో పరిశ్రమకు షాక్ తగిలింది. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బ, మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల ఆదాయాలకు చిల్లు పడుతోంది. దీంతో వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. పులిమీదపుట్రలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కూడా ఉద్యోగులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. టీసీఎస్ చర్యలు ఆరంభమేనని.. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చనేది విశ్లేషకుల మాట.దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగాల తొలగింపు వార్త అటు ఐటీ రంగాన్నే కాదు.. స్టాక్ మార్కెట్లను సైతం కుదిపేసింది. పరిశ్రమ లీడర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా కంపెనీలు ఎలాంటి చర్యలకు దిగుతాయోనన్న భయమే దీనికి కారణం. వాస్తవానికి ఐటీలో కొత్త ఉద్యోగాలు గత రెండు మూడేళ్లుగా పెద్దగా పెరగడం లేదు. టీసీఎస్‌నే తీసుకుంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.14 లక్షల గరిష్ట స్థాయిని చేరుకుంది. అయితే, 2019–20లో 4.48 లక్షలుగా ఉన్న కంపెనీ సిబ్బంది సంఖ్య తదుపరి మూడేళ్లలో ఏకంగా 1.7 లక్షలు పెరగడం విశేషం. ఆపై క్రమంగా దిగజారుతూనే ఉంది. 2023–24లో 6.01 లక్షలకు పడిపోయింది. 13,249 మంది సిబ్బంది తగ్గిపోయారు. గతేడాది కాస్త పుంజుకుని 6.07 లక్షలకు చేరుకుంది. తాజాగా 2025–26 తొలి త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 5,090 మంది సిబ్బంది జతయ్యారు. అయినప్పటికీ మొత్తం సిబ్బంది సంఖ్య మూడేళ్ల క్రితం నాటి గరిష్ట స్థాయి కిందే కొనసాగుతోంది. ఇక మిగతా కంపెనీల విషయానికొస్తే, టాప్–5 కంపెనీలు కలిపి ఈ ఏడాది క్యూ1లో కేవలం 4,703 ఉద్యోగులను మాత్రమే నికరంగా జత చేసుకున్నాయి. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్ మినహా మిగతా మూడు కంపెనీల్లో సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఐటీ నియామకాల్లో మందగమనాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... టీసీఎస్ ప్రకటించిన 12,000 మంది సిబ్బంది కోతల్లో అత్యధికంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం చూపనుంది. భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా తీర్చిదిద్దడం, టెక్నాలజీలో పెట్టుబడులపై మరింత ఫోకస్ చేయడం, ఏఐ వినియోగం, మార్కెట్ విస్తరణ, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటి విస్తృత వ్యూహాలను కంపెనీ దీనికి కారణంగా చెబుతోంది. అంటే, రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి వ్యూహాల వైపే నడుస్తాయనే సంకేతాలు కనబడుతున్నాయి. ‘ఆర్థిక ఒత్తిళ్లతో పాటు క్లయింట్ల అంచనాలు, అలాగే చురుకైన, ఫలితాల ఆధారిత డెలివరీ విధానాల దిశగా పరిశ్రమలో వస్తున్న మార్పులు వంటి అనేక అంశాలు టీసీఎస్ సిబ్బంది కోత నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థలో రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వ్యాఖ్యానించారుబెంచ్ సిబ్బంది విషయంలో కఠిన పాలసీని కంపెనీలన్నీ అమలు చేస్తుండటాన్ని చూస్తుంటే, సిబ్బంది సేవలను పూర్తిగా సది్వనియోగం చేసుకోవడంపై ఐటీ సంస్థలు దృష్టి పెడుతున్నాయనేందుకు నిదర్శనం. అయితే, టీసీఎస్ మాత్రం ఏఐకి తాజా కోతలకు సంబంధం లేదని చెబుతోంది. కానీ టెక్ పరిశ్రమలో సిబ్బంది నియామకాలను ఏఐ, ఆటోమేషన్ అనేవి మరింత ప్రభావితం చేస్తున్న తరుణంలో టీసీఎస్ నిర్ణయం వెలువడం గమనార్హం. మరోపక్క, ఇటీవలి ఐటీ కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదాయాల్లో ఏమంత పెద్ద పెరుగుదల లేదు. క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యయాల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపడం కూడా నియామకాలపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు... మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌తో సహా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు.. ఇప్పటికే ఉద్యోగుల తగ్గింపు బాట పట్టాయి. ముఖ్యంగా సరికొత్త డిజిటల్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగ విధులు, నైపుణ్యాలను మదింపు చేస్తూ అవసరమైన వారికి శిక్షణ ఇవ్వడం.. లేదంటే వేటు వేయడానికీ వెనుకాడటం లేదు. ‘మన ఐటీ కంపెనీల విషయానికొస్తే.. సమర్థవంతమైన, పనితీరు ఆధారిత సిబ్బంది విధానాల వైపు మార్పునకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి’ అని పాఠక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ ఆసరాతో తక్కువ వ్యయానికి మరిన్ని సేవలు కోరుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సంస్థల సిబ్బంది కోతలకు ఆజ్యం పోస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ ఆధారిత ఐటీ వైపు మారుతోంది. ప్రస్తుత మానవ నైపుణ్యాలతో పోటీ పడే ఏఐ ఏజెంట్లు.. ఇప్పుడున్న కొంత మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ జోరందుకుంటుంది’ అని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు ఫైజల్ కవూసా అభిప్రాయపడ్డారు. ఐటీ డిమాండ్ తగ్గడం, క్లయింట్ల ప్రాధాన్యతలు మారడం వల్ల ఎదురవుతున్న మార్జిన్ ఒత్తిళ్లు.. సిబ్బంది కోతకు దారితీస్తున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు లేకుంటే ఇంటికే... కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకు టీసీఎస్‌తో పాటు దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏఐ, ఆటోమేషన్ బాట పడుతున్నాయి. మార్జిన్లు పెంచుకోవడానికి తక్కువ సిబ్బందితో ఎక్కువ ఫలితాలు పొందాలనేది వాటి తాజా వ్యూహం. ప్రతి కంపెనీలో సిబ్బంది, విధానాలు, టెక్నాలజీ అన్నీ ఏఐ చుట్టూనే తిరుగుతున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ పేర్కొన్నారు. ‘కంపెనీలన్నీ తమ ప్రస్తుత సిబ్బందితో పాటు కొత్తగా తీసుకునే ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్కిల్స్ పెంచుకోకుండా, భవిష్యత్తు విధానానికి అనుగుణంగా లేనివారిపై వేటు తప్పదు. దీర్ఘకాలంలో కంపెనీల్లో అనేక సానుకూల మార్పులతో మాటు కొన్ని ప్రతికూలతలు కూడా తప్పవు’ అని శర్మ అభిప్రాయపడ్డారు.పరిశీలిస్తున్నాం: ఐటీ శాఖ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయంతో తలెత్తే పరిణామాలను కేంద్ర ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్), ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ టీసీఎస్‌కు నోటీసులు ఇవ్వాలని కోరింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహాలయ పక్ష ప్రత్యేక రైలు
హైదరాబాద్: మహాలయ పక్షం సందర్భంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైలు యాత్రను ప్రారంభిస్తోంది. భారత్ గౌరవ్ ట్రైన్లలో భాగంగా ‘మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలును నడపబోతోంది. ఈ రైలు వివరాలను రైల్వే అధికారులు హైదరాబాద్‌లో జూలై 29న ప్రకటించనున్నారు.మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైలు ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించవచ్చు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిధ్పూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారనాసి, గయా క్షేత్రాలు ఉన్నాయి. మహాలయ పక్ష కాలంలో ఈ క్షేత్రాలను దర్శించి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తే స్వర్గగతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. -
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు చేసిన ప్రకటన దేశ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఆవరించింది. కాగా టీసీఎస్ లేఆఫ్‌ల ప్రకటన తరువాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నైపుణ్యం పెంపు, రీస్కిల్లింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయా వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది.ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుంది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులు జతయ్యారు. -
కైనెటిక్ కొత్త స్కూటర్.. తిరిగొచ్చిన మరో ఐకానిక్ బండి
లూనా తర్వాత కైనెటిక్ నుంచి మరో ఐకానిక్ బండి తిరిగి కొత్తగా మార్కెట్లోకి వస్తోంది. కైనెటిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ .1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ డీఎక్స్, డిఎక్స్+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 116 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఈ డీఎక్స్ స్కూటర్‌కు కైనెటిక్ గ్రీన్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని అందిస్తోంది. దీంతోపాటు తొమ్మిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వైట్, బ్లూ, బ్లాక్, సిల్వర్, రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటు ఉంటుంది.జూలై 28 నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుక్కోవాలనుకుంటున్నవారు రూ .1,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2025 అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలను 40,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కైనెటిక్ గ్రీన్ వెల్లడించింది.ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన లూనాతో పాటు కైనెటిక్ తన బ్రాండ్ కింద రెండవ ఐకానిక్ నేమ్ ప్లేట్ ను పునరుద్ధరించింది. భారత్‌కు చెందిన కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్ కు చెందిన హోండా మోటార్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1984 నుండి 2007 మధ్య కైనెటిక్ డీఎక్స్ స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. హోండా ఎన్‌హెచ్ సిరీస్ స్కూటర్ల కింద రూపొందిన ఆ స్కూటర్ 98 సీసీ టూ-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇప్పుడిది ఎలక్ట్రిక్ మోడల్‌గా తిరిగి రోడ్డెక్కుతోంది. -
టాటా కంపెనీకి డిమాండ్ నోటీసు.. రూ.7,800 కోట్లు బాకీ
సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు సుమారు రూ.7,800 కోట్లు చెల్లించాలని కోరుతూ టాటా కమ్యూనికేషన్స్‌కు టెలికాం విభాగం (DoT) షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఇవి 2005-06 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలుగా డిమాండ్ నోటీసులో పేర్కొంది.‘2005-06 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7,827.55 కోట్ల షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసులు భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి జూన్ 30, 2005 నాడు అందాయి’ అని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ లక్ష్మీనారాయణ్ తెలిపారు. ఇందులో ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లైసెన్స్ కింద 2010-11 ఆర్థిక సంవత్సరానికి, ఎన్ఎల్డీ (నేషనల్ లాంగ్ డిస్టెన్స్) లైసెన్స్ కింద 2007, 2010 ఆర్థిక సంవత్సాలకు కంపెనీ క్లెయిమ్ చేసిన మినహాయింపులు రూ .276.68 కోట్లను కూడా పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.అయితే ఐఎల్‌డీ (ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్), ఎన్ఎల్డీ, ఐఎస్పీ లైసెన్సులకు సంబంధించి టాటా కమ్యూనికేషన్స్ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లు సుప్రీంకోర్టు, టెలికాం ట్రిబ్యునల్ టీడీఎస్ఏటీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. పాత టెలికాం లైసెన్స్ విధానం యూఏఎస్ఎల్ కింద ఏజీఆర్‌పై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కంపెనీ అప్పీళ్లను ప్రస్తావించలేదని లక్ష్మీనారాయణ్ తెలిపారు. కాబట్టి తమ లైసెన్సులు యూఏఎస్ఎల్కి భిన్నమని కంపెనీ భావిస్తోందని, స్వతంత్ర న్యాయ అభిప్రాయాల ఆధారంగా తన స్థానాన్ని సమర్థించుకోగలదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్.. స్పెషల్ అపార్చూనిటీస్ ఫండ్ పేరుతో న్యూ ఫంఢ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ప్రకటించింది. ఆగస్ట్ 8తో ముగుస్తుంది. తిరిగి ఆగస్ట్ 21 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా ప్రత్యేక అవకాశాలను చూస్తున్న కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ స్థాయిలో కంపెనీ వ్యాపారాల విభజన, విలీనాలు, కొనుగోళ్లు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, ఏదైనా రంగాల్లో కొత్తగా అవకాశాలు ఏర్పడుతుండడం, నియంత్రణపరమైన మార్పులను అవకాశాలుగా మలుచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది.కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిని మొదటి మూడు నెలల్లో వెనక్కి తీసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ చార్జీ పడుతుంది. ఆ తర్వాత ఉపసంహరణపై ఎలాంటి చార్జీలుండవు. ఈ పథకంలో రిస్క్ ఎక్కువ. నిఫ్టీ 500 టీఆర్ఐ ఈ పథకం పనితీరుకు ప్రామాణికం. అజయ్ ఖండేల్వాల్, అతుల్ మెహ్రా, బాలచంద్ర షిండే, రాకేశ్ శెట్టి, సునీల్ సావంత్ ఫండ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నారు. జెరోధా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఎఫ్‌వోఎఫ్ జెరోధా మ్యూచువల్ ఫండ్ కొత్తగా జెరోదా మల్టీ అస్సెట్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్ ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్‌లు, కమోడిటీ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆగస్ట్ 8న ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఐదు పనిదినాల అనంతరం తిరిగి క్రయ, విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.పోర్ట్‌ఫోలియోకి రిస్క్, అస్థిరతలు తగ్గించడం ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 50–70 శాతం పెట్టుబడులను ఈక్విటీ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. 10–20 శాతం డెట్ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్స్, 20–30 శాతం కమోడిటీ ఈటీఎఫ్‌లకు (బంగారం, వెండి) కేటాయిస్తుంది. పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూసే వారి కోసం ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. -
TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దుఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్‌ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. 👉 వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో -
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ రెడ్‌లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది. -
పెన్షనర్లు.. ట్యాక్స్ ప్లానింగ్
అరవైఏళ్లు, 80 ఏళ్లు దాటిన వారు.. ఇలా వయసు పైబడిన వారికి, అంటే సీనియర్ సిటిజన్లకు బేసిక్ లిమిట్ మారుతుంది. ఇదంతా పాత పద్ధతిలో. కొత్త పద్ధతిలో సీనియారిటీతో సంబంధం లేకుండా అందరికీ ఒకే బేసిక్ లిమిట్. ఈ బేసిక్ లిమిట్లు, శ్లాబులు, రేట్లూ మీకు తెలిసినవే. పెన్షన్‌ని ‘జీతాల’ పరిధిలో పరిగణిస్తారు. పెన్షన్ కూడా ట్యాక్సబుల్ ఆదాయమే. రూ.10,000 పన్ను భారం దాటిన వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం, వృత్తి మీద ఆదాయం లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సినవసరం లేదు.ఆదాయపు పన్ను చట్ట ప్రకారం, జీతాన్ని ఎలా ట్యాక్సబుల్గా భావిస్తారో, అలాగే పెన్షన్లను కూడా భావిస్తారు. చాలా మంది పెన్షన్ మీద మినహాయింపు ఉందనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పెన్షన్ ట్యాక్సబుల్ ఆదాయమే. బేసిక్ లిమిట్ లోపు ఉంటే తప్ప.. పన్ను భారం తప్పించుకోవడం ఉండదు. గవర్నమెంటులో రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ పెన్షన్ మినహాయింపు ఉంది. ముందుగా లెక్కలు కట్టి, ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా కమ్యుటెడ్ పెన్షన్ మార్చుకోవచ్చు. పరమ్‌వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర మొదలైన వాటికి సంబంధించిన పెన్షన్లకు మినహాయింపు ఉంది. విదేశాల్లో సెటిల్ అయిన పెన్షనర్లకు వచ్చే పెన్షన్లను మన దేశంలోని ఆదాయంగా పరిగణిస్తారు. పెన్షన్లలో ఎరియర్స్ అంటే .. బకాయిలు వస్తే, వాటిని పన్ను పరిధిలోకి చేర్చి 89(1) సెక్షన్ కింద రిలీఫ్ పొందవచ్చు. ఈ పెన్షన్‌లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంది.ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయానికొద్దాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, తన పెన్షన్‌ని కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వొచ్చు. ఇలాంటి చెల్లింపులను ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇక్కడ పెన్షన్ అని పేరుంది కానీ, ఇలాంటి పెన్షన్‌ను ‘జీతం’గా భావించరు. ఇతర ఆదాయంగా భావిస్తారు. టీడీఎస్ అంశాలు వర్తించవు. పాత పద్ధతి అయితే రూ.15,000 మినహాయింపు ఇస్తారు. కొత్త పద్ధతి అయితే, రూ.25,000 మినహాయింపు వస్తుంది. సైన్యంలోని ఫ్యామిలీ సభ్యులకు మినహాయింపు పూర్తిగా ఇస్తారు. ఈ విషయానికి సంబంధించి చాలా పరిస్థితులనే పొందుపర్చారు. కానీ విధి నిర్వహణలో ఉండగా, సైన్యంలో చనిపోతే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ మీద మినహాయింపు ఉంటుంది. పెన్షన్, ప్యామిలీ పెన్షన్‌కి సంబంధించి ట్యాక్స్ ప్లానింగ్ విషయాలు..పాత పద్ధతిలో వెళ్తే మంచిదా. కొత్త పద్ధతిలో వెళ్తే మంచిదా అనేది ఆలోచించుకోవాలి.వైద్యానికి సంబంధించిన మినహాయింపులను గత వారం తెలుసుకున్నాం. ఇవి పాత పద్ధతిలో ఉంటాయి. పెన్షనరీ బెనిఫిట్స్ భారీగా వస్తాయి. వాటిని సక్రమంగా, సరిగ్గా, సమగ్రంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయొచ్చు.80సీ డిడక్షన్లు అనవసరం అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వార్ధక్యంలో సేవింగ్ మీద పెద్ద మొత్తాల్ని ‘బ్లాక్’ చేసుకోవడం ఎందుకు. చేతిలో లేదా అందుబాటులో బ్యాంకు బ్యాలెన్సులు ఉంటే మంచిది. ఉదాహరణకు వైద్యంలాంటి ఏ అవసరానికైనా ఉపయోగపడుతుందనేది ఆలోచన.సీనియర్ సిటిజన్లకు ఎన్నో స్కీములు ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆకర్షణీయమైన ప్రైవేట్ వ్యక్తుల చేతిల మోసపోకండి. అయితే, ఎన్నో మంచి ఇన్వెస్ట్మెంట్లు, స్కీములు ఉన్నాయి. కేవలం పాత పద్ధతిలోనే వాటిపై వడ్డీకి మినహాయింపులు ఉన్నాయి. ఎన్నారై సిటిజన్లు 15హెచ్ ఇవ్వకూడదు. కానీ రెసిడెంట్లు ఇవ్వొచ్చు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ రూ. లక్ష దాటితే, టీడీఎస్ వర్తిస్తుంది. ట్యాక్సబుల్ ఇన్‌కం లోపల ఆదాయం ఉంటే, 15హెచ్ ఇస్తే పన్ను రికవరీ చేయరు. బేసిక్ లిమిట్ దాటితే 15హెచ్ ఇవ్వకూడదు.గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఎఫ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ .. వీటన్నింటికీ పూర్తి మినహాయింపు ఉంది. కానీ, అవి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ/ఆదాయంపై మినహాయింపు కొత్త విధానంలో లేదు.75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఉండి, ఒకే ఒక బ్యాంకు అకౌంటులో నుంచి వడ్డీ .. ఈ రెండింటి మీదా పన్ను రికవరీ అయితే, రిటర్ను వేయనక్కర్లేదు.రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పిల్లల చదువు కోసమా, స్వంత వైద్యానికా, ఇల్లు కొనుక్కోవడమా, బంగారం కొనడమా, షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడమా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడమా.. ఇలా ఎన్నో ఆలోచనలు.తన సొంత పెన్షన్, భార్య ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండూ కలిపి తడిసి మోపెడై.. పన్ను భారం చెల్లించే పెన్షనర్లు ఇంకొందరు. ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించడమే ట్యాక్స్ ప్లానింగ్. -
టెస్లా బాటలోనే మరో కంపెనీ
భారత్‌లో టెస్లా అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇండియాలో తన మొదటి షోరూమ్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో ప్రారంభించింది. సూరత్‌లోని పిప్లోడ్‌లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫెసిలిటీ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్, వాహన అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్‌లో విన్‌ఫాస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వీఎఫ్ 6, వీఎఫ్ 7లను ప్రదర్శిస్తుంది.విన్‌ఫాస్ట్ వీఎఫ్ 7, వీఎఫ్ 6 మోడళ్లలో రైట్‌హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌ను మొదటిసారి ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విన్‌ఫాస్ట్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం 2025 జులై 15న అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది. ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ల్లో లేదా అధికారిక వెబ్సైట్ VinFastAuto.in ద్వారా రూ.21,000 పూర్తిగా రీఫండబుల్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుతమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే రోజుల్లో విన్‌ఫాస్ట్ ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఈ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేస్తామని పేర్కొంది. విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ..‘భారతీయ వినియోగదారులకు విన్‌ఫాస్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని చేరువ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాం’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2020లో కేవలం 5,000 యూనిట్ల నుంచి 2024 నాటికి 1,13,000 యూనిట్లకు పుంజుకుంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉండగా, 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? త్వరపడితే బెటర్!
ఉద్యోగులు, ఆదాయ పరిమితులు మించినవారు చాలా మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలని భావిస్తారు. అయితే ఆ ఐటీఆర్‌లను ఫైల్ చేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఇటీవల జులై 31 వరకు ఉండే ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీని ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాబట్టి ముందుగా కింది ధ్రువపత్రాలను సిద్ధం చేసుకొని, వీలైనంత త్వరగా ఐటీఆర్ దాఖలు చేయాలి.ఫారమ్–16వేతనంతోపాటు, టీడీఎస్ వివరాలు ఇందులో ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారిపోతే, పాత–కొత్త యాజమాన్యాల నుంచి ఫారమ్–16ను తప్పకుండా తీసుకోవాలి. ఇందులో పార్ట్–ఏ కింద టీడీఎస్ మినహాయిస్తే ఆ వివరాలు నమోదవుతాయి. పార్ట్–బీ కింద జీతభత్యాలు, మినహాయింపుల క్లెయిమ్ వివరాలు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్, బీమా కంపెనీ నుంచి కమీషన్‌కు సంబంధించి వివరాల కోసం ‘ఫారమ్–16ఏ’ని తీసుకోవాలి.ప్రాపర్టీ లావాదేవీ విలువ (రిజిస్టర్డ్) రూ.50 లక్షలకు మించినప్పుడు టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఫారమ్–16బీ’ని కొనుగోలుదారుడు విక్రయదారుడికి జారీ చేస్తారు. నెలవారీ ఇంటి అద్దె రూ.50,000 మించితే, అప్పుడు సైతం టీడీఎస్ అమలు చేయాలి. కిరాయిదారుడు ఇంటి యజమానికి ‘ఫారమ్–16సీ’ని అందిస్తారు. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఈ వివరాలు ముందుగానే నింపి ఉండడం గమనించొచ్చు. వాటిని సరిపోల్చుకుని, అవసరమైతే అదనపు వివరాలు నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుంది. మూలధన లాభాల రిపోర్ట్షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు వస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నివేదికను బ్రోకర్ల నుంచి, ఫండ్స్ సంస్థల నుంచి తీసుకోవాలి. ఇందులోని వివరాలను ఐటీఆర్‌లో నమోదు చేయడం తప్పనిసరి. క్లియర్ ట్యాక్స్ తదితర సంస్థల ద్వారా రిటర్నులు వేసేట్టు అయితే క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్‌ను అప్లోడ్ చేస్తే ఐటీఆర్ పత్రంలో ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా భర్తీ అవుతాయి. ఏఐఎస్/ఫారమ్–26ఏఎస్‘ఫారమ్–26ఏఎస్’లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. ఏఐఎస్‌లో అద్దె, డివిడెండ్లు, ఆస్తుల అమ్మకాలు ఇలా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ చెల్లింపులు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, జీఎస్టీ టర్నోవర్ వివరాలు ఉంటాయి. ఏఐఎస్నే టీఐఎస్ అని కూడా అంటారు. వీటితోపాటు బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, ఆర్థిక సంస్థలు జారీ చేసే ఇంటరెస్ట్ సర్టీఫికెట్లు, పన్ను మినహాయింపు పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించిన ఆధారాలు (బీమా ప్రీమియం సర్టీఫికెట్, ట్యూషన్ ఫీజులు తదితర) సిద్ధంగా ఉంచుకోవాలి.ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్‌లో రెండో విడత లేఆఫ్స్కొన్ని ముఖ్యమైన గుర్తింపు పత్రాలుపాన్ కార్డ్: ఆదాయ, వ్యయాల రికార్డు కోసం.ఆధార్ కార్డ్: ఈవెరిఫికేషన్ కోసం.పే స్లిప్పులు: ఆదాయ మార్గాలను క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి.ఫారం 16ఏ/బీ/సీ/డీ: వడ్డీ, ఆస్తి అమ్మకం, అద్దె లేదా ప్రొఫెషనల్ ఫీజులపై టీడీఎస్ కోసం.క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్స్: బ్రోకర్లు లేదా మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీసుకోవాలి.అద్దె ఆదాయ వివరాలు: మునిసిపల్ పన్ను రశీదులు, రుణ వడ్డీ ధ్రువీకరణ పత్రాలు.వ్యాపార ఆదాయ రికార్డులు: లాభనష్టాల స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు.వడ్డీ ధ్రువీకరణ పత్రాలు: పొదుపు ఖాతాలు, ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాలు కోసం.అడ్వాన్స్ ట్యాక్స్/సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రిసిప్ట్స్పెట్టుబడి రుజువులుసెక్షన్ 80సీ (ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ట్యూషన్ ఫీజు)సెక్షన్ 80డీ (ఆరోగ్య బీమా)సెక్షన్ 80ఈ (ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ)సెక్షన్ 80జీ (విరాళాలు) -
టెస్లాతో శాంసంగ్ భారీ డీల్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రముఖ కంపెనీతో 16.5 బిలియన్ డాలర్ల(రూ.1.4 లక్షల కోట్లు) విలువైన భారీ చిప్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. 2033 చివరి వరకు కొనసాగే ఈ ఒప్పందం శాంసంగ్ చిప్ ఫౌండ్రీ వ్యాపారానికి ఊతమిస్తుందని నమ్ముతుంది. శాంసంగ్ గ్లోబల్ క్లయింట్‌లో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఏ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారో మాత్రం ధ్రువీకరించలేదు. అయితే ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడుతూ శాంసంగ్ టెస్లాతోనే డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. శాంసంగ్ చిప్ ఫౌండ్రీ విభాగం ఇప్పటికే టెస్లాతో కలిసి పనిచేస్తోందని, ఈ కొత్త డీల్ ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.మార్కెట్లో పెరుగుతున్న పోటీ వల్ల శాంసంగ్ తన తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేంత ఆర్డర్లను ఆకర్షించలేకపోయింది. మెమొరీ చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న ఈ కంపెనీ చిప్ ఫౌండ్రీ వ్యాపారం డిమాండ్, పోటీని తట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఈ కీలక సమయంలో దీర్ఘకాలిక ఒప్పందం రావడం కంపెనీకి కలిసొస్తుందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్‌లో రెండో విడత లేఆఫ్స్తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ(తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ) ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫౌండ్రీ మార్కెట్లో టీఎస్ఎంసీకి 67.6 శాతం వాటా ఉందని పరిశోధన సంస్థ ట్రెండ్ ఫోర్స్ తెలిపింది. శాంసంగ్ షేరు 8.1 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. టెస్లాతో కొత్త ఒప్పందం శాంసంగ్ భవిష్యత్ చిప్ టెక్నాలజీని బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌తో సహా తదుపరి తరం పరికరాలు, అనువర్తనాలకు 2-నానోమీటర్ చిప్‌లు ఎంతో అవసరం అవుతాయి.