breaking news
Economy
-
ఆర్బీఐ కొత్త ప్రతిపాదన
బ్యాంకులు తమ డిజిటల్ ఛానళ్లపై థర్డ్ పార్టీ (ఇతర సంస్థలకు చెందిన) ఉత్పత్తులను ప్రదర్శించరాదంటూ ఆర్బీఐ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, బ్యాంక్ గ్రూపు సబ్సిడరీలు/జేవీలు/అసోసియేట్లకు సైతం ఇది వర్తించనుంది.రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాన్ని బ్యాంక్‌లు అమల్లోకి తీసుకురావాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల లావాదేవీల తీరును అధ్యయనం చేయడం, అసాధారణ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల ఆమోదాన్ని ముందస్తుగా పొందడం వంటివి కొత్త రిస్క్ నిర్వహణ విధానం కింద ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆగస్ట్ 11 వరకు వీటిపై భాగస్వాముల నుంచి సలహా, సూచనలను ఆహ్వానించింది. -
పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లు
మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించి రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ రూ.6,017 కోట్ల విలువ చేసేవి వెనక్కి తిరిగి రాలేదు. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. 2023 మే 19 నాటికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల వలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 2025 జూలై 31 నాటికి రూ.6,017 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐనాడు చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో 98.31 శాతం వెనక్కి వచ్చినట్లు తెలిపింది. తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ఇష్యూ ఆఫీసుల వద్ద వీటిని మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. తమ వద్దనున్న 2,000 నోట్లను బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్‌కు పోస్ట్ ద్వారా పంపొచ్చు. -
భారత వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది. ‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది. టారిఫ్‌ల ప్రభావం అధిగమించొచ్చు.. భారత కంపెనీలపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్‌లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్‌పై 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్‌ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్‌కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్‌ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది. -
టారిఫ్‌ల భారం.. సగమే!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల దాదాపు సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎక్స్‌పోర్ట్స్‌పై సుంకాల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నాయి. టెక్స్టైల్స్/క్లోతింగ్ (10.3 బిలియన్ డాలర్లు), రత్నాభరణాలు (12 బి.డా.), రొయ్యలు (2.24 బి.డా.), లెదర్.. ఫుట్‌వేర్ (1.18 బి.డా.), రసాయనాలు (2.3 బి.డా.), ఎలక్ట్రికల్.. మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) రంగాలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించాయి. అమెరికాకు 5.33 బిలియన్ డాలర్ల విలువైన అపారెల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఒక ఎగుమతిదారు తెలిపారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్ గూడ్స్‌లాంటి సుమారు సగం పైగా పరిశ్రమలు మినహాయింపు కేటగిరీలో ఉన్నందున మిగతా సగం కేటగిరీలపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024–25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) నమోదైంది. ఏపీఐలు, సర్క్యూట్లకు మినహాయింపులు.. ఫినిష్డ్ ఫార్మా ఉత్పత్తులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), అలాగే ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైన్డ్ ఇంధనాలు, బొగ్గు, విద్యుత్‌లాంటి ఎనర్జీ ఉత్పత్తులు, కీలకమైన లోహాలు, ఎల్రక్టానిక్స్.. సెమీకండక్టర్లు మొదలైన వాటికి 25 శాతం టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉంటుందని జీటీఆర్ఐ తెలిపింది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే రవాణాలో ఉన్నవి, ఆగస్టు 7 నాటికల్లా అమెరికాకు చేరేలా ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. టారిఫ్‌ల వల్ల ఫ్యాక్టరీలు మూతబడకుండా నడిపించడానికి, ఉద్యోగులను తీసివేయకుండా ఉండటానికి ఎగుమతిదారులు.. ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఏఈపీసీ చైర్మన్ సు«దీర్ సెఖ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకాలపరమైన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులు కూడా ఇతరత్రా మరిన్ని మార్కెట్లకు విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
యూపీఐ సరికొత్త రికార్డ్
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జూలైలో సరికొత్త రికార్డులకు చేరాయి. 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.20.64 కోట్లతో పోల్చిచే 20 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది మే నెలలో నమోదైన 18.67 బిలియన్ లావాదేవీలు (విలువ రూ.25.14 లక్షల కోట్లు) ఇంతకుముందు వరకు గరిష్ట రికార్డుగా ఉంది. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు 85 శాతంగా ఉన్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులోకి రావడం గమనార్హం. యూపీఐపై కొత్త పరిమితులు యూపీఐ నెట్‌వర్క్‌పై రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్పీసీఐ కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాలోఎంత బ్యాలన్స్ ఉందన్నది రోజులో 50 సార్ల వరకే పరిశీలించుకోగలరు. ఇంతకుముందు ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. యూపీఐ లింక్డ్ అకౌంట్లను సైతం 25 సార్లే చూసుకోగలరు. ఒక మొబైల్ నంబర్‌కు లింక్ అయి, 12 నెలలకు పైగా ఇనాక్టివ్‌గా ఉన్న (కార్యకలాపాలు లేని) యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. -
జులైలో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎస్టీ (GST) వసూళ్లు జూలై 2025లో రూ. 1,95,735 కోట్లు. ఇది జూలై 2024తో (రూ.1,82,075 కోట్లు) పోలిస్తే 7.5% పెరుగుదలను సూచిస్తుంది. వరుసగా ఏడవ నెల రూ.1.8 లక్షల కోట్లకు పైన జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.ఏప్రిల్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి, కానీ మే నెలలో రూ.2.01 లక్షల కోట్లకు తగ్గాయి. జూలైలో నికర దేశీయ ఆదాయం 0.2 శాతం తగ్గింది, నికర మొత్తం వసూళ్లు కేవలం 1.7 శాతం పెరిగి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ట్రంప్ భారతదేశంపై విధించిన అధిక సుంకాలు.. వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల కారణంగా వృద్ధి 0.3 శాతం పాయింట్ల తగ్గుదలను కలిగి ఉంటుందని ఆగస్టు 1న ఆర్థికవేత్తలు గుర్తించారు. భారతదేశానికి కేటాయించిన 25 శాతం సుంకాలు చాలా ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక సంక్షోభం గురించి, బంగారం & వెండి కొనుగోలు గురించి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల గురించి పలుమార్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ముఖ్యమైన ప్రశ్న అంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.మనం నియంత్రించే రెండు అత్యంత విలువైన ఆస్తులు.. మన సమయం, డబ్బు. వేలాది మంది ప్రజలు సమయాన్ని, డబ్బును తమ బాడీ, మైండ్, స్పిరిట్ కోసం కేటాయిస్తున్నారు. ఇది గొప్ప విషయమే. అయితే 'మీరు మీ సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?' అని తన ఎక్స్ వేదికగా ప్రశ్నింస్తూ.. జాగ్రత్తగా ఉండు అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.At at Ken McElroy’s LIMITLESS Event in Dallas. Thousands of people..great speakers. Priceless. I have leaned a lot….not all of it pleasant. Two most valuable assets we control….our time and our money.Grateful that thousands of people give both their time and their…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 1, 2025 -
పరిశ్రమలకు తగ్గిన బ్యాంకుల రుణ సాయం
ముంబై: పరిశ్రమలకు బ్యాంకుల రుణ సాయంలో వృద్ధి జూన్ 26తో ముగిసిన పక్షం రోజుల్లో 5.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆహారేతర పరిశ్రమలకు రుణ సాయం 10.2 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 13.8 శాతం వృద్ధి చెందింది. 41 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డేటా ఆధారంగా ఈ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది.‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ స్థిరంగా పెరుగుతోంది. ప్రధాన రంగాల్లో ఇంజనీరింగ్, నిర్మాణం, టెక్స్‌టైల్స్‌కు రుణ వితరణ మెరుగైంది’’అని ఆర్బీఐ తెలిపింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం రుణ సాయం నిదానించింది. 6.8 శాతం వృద్ధికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే పక్షం రోజుల్లో ఈ రంగాలకు రుణ వితరణ 17.4 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా స్పష్టం చేసింది. సేవల రంగానికి రుణ వితరణ 9.6 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 15.1 శాతం వృద్ధితో పోల్చి చూస్తే తగ్గుముఖం పట్టింది. -
17.9 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.2,80,732 కోట్లుగా నమోదైంది. తొలి త్రైమాసికం చివరికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 17.8 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో 4.4 శాతం మేర ద్రవ్యలోటు (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందన్నది కేంద్రం అంచనా. ప్రభుత్వ వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరమే ద్రవ్యలోటు. జూన్ త్రైమాసికంలో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.9.41 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రూ.5.4 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.3.73 లక్షల కోట్లు పన్నేతర మార్గంలో వచ్చింది. రుణేతర పత్రాల రూపంలో రూ.28,018 కోట్లు సమకూరింది. పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు రూ.3,26,941 కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే రూ.47,439 కోట్లు పెరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ వ్యయం జూన్ క్వార్టర్లో రూ.12.22 లక్ష కోట్లుగా నమోదైంది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో 24.1 శాతానికి సమానం. వ్యయాల్లో రూ.3.86 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే వెళ్లింది. సబ్సిడీలపై రూ.83,554 కోట్లు ఖర్చు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే మూలధన వ్యయాలు 52 శాతం పెరిగాయి. -
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు తప్పుగా దొర్లినవే...
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. భారత్ ఉత్పత్తులపై ఆగస్ట్ 1 నుంచి 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామంటూ ప్రకటించిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అవసరం లేదు. నిర్వీర్యమైన తమ ఆర్థిక వ్యవస్థలను (డెడ్ ఎకానమీస్) అవి పరస్పరం మరింత దిగజార్చుకుంటుండడంపైనే నా దృష్టి అంతా’’అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా స్పందిస్తూ.. భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా దొర్లినట్టుగా పేర్కొంది.ఇండియానే ఆధారం.. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2024 గణాంకాల ప్రకారం భారత్‌లో సగటు వయసు 28.8 సంవత్సరాలు కాగా, అమెరికాలో ఇది 38.5, యూరప్‌లో 42.8 సంవత్సరాలుగా ఉంది. సగటు వయసు, వృద్ధి అవకాశాల పరంగా అభివృద్ది చెందిన దేశాలు మరింత వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు శ్రీవాస్తవ అన్నారు. ఐఎంఎఫ్ ఒక రోజు ముందే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాదికి గాను భారత్ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 6.5 శాతంగా అంచనా వేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్‌కు సంబంధించి మెరుగైన అంచనాలను ప్రకటించడం తెలిసిందే. -
ఎగుమతులకు టారిఫ్‌ల సెగ
భారత ఎగుమతులపై అమెరికా ఎకాయెకిన 25 శాతం టారిఫ్‌లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీనితో అమెరికన్ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలకు కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు కనీసం 25 శాతం ఎగుమతులు తగ్గినా, వాణిజ్య ఆదాయాలపరంగా ఏటా 21.75 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మారకం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్లపరంగా చూస్తే ఎగుమతుల ఆధారిత రంగాలకు చెందిన (టెక్స్టైల్స్, జ్యుయలరీ మొదలైనవి) సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్‌లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ఈ ప్రత్యేక కథనం. – బిజినెస్ డెస్క్రత్నాభరణాలు: రత్నాభరణాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అగ్రరాజ్యానికి ఎగుమతులు సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంటున్నాయని రత్నాభరణాల ఎగుమతుల మండలి జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించడం వల్ల వ్యయా పెరిగిపోవడానికి, ఎగుమతుల్లో జాప్యానికి దారి తీస్తుందని, చిన్న స్థాయి వ్యాపారుల నుంచి భారీ తయారీ సంస్థల వరకు అందరిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పడిపోవడం, ఆర్డర్లు రద్దు కావడం, ఎగుమతిదారుల మార్జిన్లు తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని రిద్ధిసిద్ధి బులియన్స్ (ఆర్‌ఎస్‌బీఎల్) ఎండీ పృథ్వీ రాజ్ కొఠారీ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 2.3 బిలియన్ డాలర్ల విలువ చేసే రొయ్యలను అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసింది. అమెరికాకు మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో ఇది 90 శాతం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎగుమతులు ఉంటుండటంతో తెలుగువారిపైనా ఈ ప్రభావం పడొచ్చని అంచనా. ఈ విభాగంలో మనతో పోలిస్తే టారిఫ్‌లు తక్కువగా ఉన్న ఈక్విడార్తో పోటీ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే, బ్రిట న్‌తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా టారిఫ్‌ల ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఫార్మా.. మెడికల్ డివైజ్‌లు.. చౌక జనరిక్స్ ఔష ధాలకు సంబంధించి అమెరికా అవసరాల్లో దాదాపు 47 శాతాన్ని భారత్ తీరుస్తోంది. టారిఫ్‌లతో ఎగుమతులపై ప్రభావం పడితే భారత ఫార్మా సంస్థల లాభాలు తగ్గుతాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, కొత్త ఔషధాలకు అనుమతులు నిలిచిపోతాయని, అలాగే కొత్త ఆవిష్కరణలపై ఎఫెక్ట్ పడుతుందని భారతీయ మెడికల్ డివైజ్‌ల పరిశ్రమ సమాఖ్య ఏఐఎంఈడీ ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. అయితే, టారిఫ్‌లపరంగా చైనా, భారత్ మధ్య 15–20 శాతం మేర వ్యత్యాసం కొనసాగినంత కాలం మెడికల్ డివైజ్‌ల పరిశ్రమకు కాస్త సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. » గణాంకాల ప్రకారం అమెరికాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. మన ఉత్పత్తులు ఖరీదుగా మారితే అమెరికన్లు మెక్సికోలాంటి దేశాలవైపు మళ్లొచ్చు. దీనితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేకిన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలగవచ్చు.వ్యవసాయ ఉత్పత్తులు.. » అమెరికాకు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. సుంకాలతో భారత్ నుంచి ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయి, అమెరికన్లు దిగుమతులను తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మళ్లొచ్చు. దీనితో రైతులు, ఎగుమతిదార్లపై ప్రభావం పడొచ్చు. ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు.. అమెరికాకు ఈ ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. టారిఫ్‌లతో వల్ల వియత్నాం, బ్రెజిల్‌లాంటి దేశాలు పోటీకి రావడం వల్ల మన దగ్గర ఈ రంగంలోని బడా కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. మొత్తం ఎగుమతుల్లో అయిదో వంతు వాటాతో భారత్‌కు అమెరికా కీలకంగా ఉంటోంది. » భారీగా ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వ్యవసాయం, లెదర్, రత్నాభరణాల్లాంటి పరిశ్రమల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 35 శాతంగా నమోదైంది. టారిఫ్‌లతో ఈ పరిశ్రమలు దెబ్బతింటే, ఉపాధి అవకాశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల పరిశ్రమలో 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా. » గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 87 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 46 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్‌కు సుమారు 41 బిలియన్ డాలర్ల మేర మిగులు ఉంది. అటు సర్వీసులపరంగా చూసినా అమెరికాకు 2023లో 36.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 34 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. భారత్ పక్షాన సుమారు 2.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. అమెరికన్లకూ ’చేదు’ మాత్రే .. అమెరికా టారిఫ్‌లు భారత్‌కి కొంత సమస్యాత్మకమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో వాటి ప్రభావం అమెరికన్లపైనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల, అక్కడ వాటి ధరలు పెరిగిపోయి స్థానికులు మరింతగా వెచ్చించాల్సి వస్తుందని ఫార్మా ఎగుమతి సంస్థల సమాఖ్య ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. భారీ ఎత్తున, నాణ్యమైన ఔషధాలను చౌకగా అందించే ప్రత్యామ్నాయాలను ఇప్పటికిప్పుడు దొరకపుచ్చుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుందని చెప్పారు.ఏయే పరిశ్రమలకు ప్రతికూలం.. టెక్స్టైల్స్/దుస్తులు రత్నాభరణాలు ఫార్మా వాహనాలు, ఆటో విడిభాగాలు ఎల్రక్టానిక్స్/మొబైల్ డివైజ్‌లు ఇంజనీరింగ్ ఉత్పత్తులు/మెటల్స్ సీఫుడ్/అగ్రి ఎగుమతులుటెక్స్టైల్స్..టారిఫ్‌ల వల్ల భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతిదారులపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. మనతో పోలి స్తే వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలపై తక్కువ సుంకాలు ఉండటం వల్ల వాటి నుంచి మరింత పోటీని ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నా రు. ఆర్డర్లు రద్దు కావడం, ధర లు తగ్గించాలంటూ ఒత్తిడి పెరగడంలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబెక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ తెలిపింది. బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశా ల నుంచి పోటీ పెరిగి, చిన్న తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లాంటి ఇతర మార్కెట్లపై కూడా మరింతగా దృష్టి పెట్టాలని భారతీయ టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ చెప్పారు. భారత టెక్స్టైల్స్, దుస్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. 17 బిలియన్ డాలర్ల రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో 5.6 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ దెబ్బతింటే వీరి ఉపాధిపైనా ప్రభావం పడుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు.. టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్, సర్క్యూట్ బోర్డుల్లాంటి ఉత్పత్తుల ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. టారిఫ్‌ల వల్ల చౌకగా లభించే ఎలక్ట్రానిక్స్ విషయంలో మిగతా దేశాలతో భారత్ పోటీ పడే సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు నెమ్మదించవచ్చు. -
టారిఫ్‌లతో జీడీపీపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్‌ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ప్రాథమికంగా టారిఫ్‌లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్‌ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్టైల్స్ రంగానికి టారిఫ్‌లు పెను సవాలుగా మారతాయని టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. -
రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనం
ముంబై: భారత్‌పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. -
రెండేళ్లపాటు 6.4 శాతం వృద్ధి
న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ అంచనాలను ప్రకటించింది. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన అంచనాలను ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచడం గమనార్హం. ఈ ఏడాదికి సంబంధించి 0.2 శాతం, వచ్చే ఏడాదికి 0.1 శాతం మేర తాజా అంచనాల్లో ఎగువకు సవరించింది. ఈ మేరకు తన తాజా నివేదికను విడుదల చేసింది. బలమైన వినియోగానికి.. ప్రభుత్వ పెట్టుబడులకు చురుకైన సంస్కరణలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. రానున్న కాలంలో ఈ సానుకూల వృద్ధిని కొనసాగించడం భారత్‌కు ఎంతో కీలకమని ఐఎంఎఫ్ పరిశోధన విభాగం చీఫ్ డెనిజ్ ఇగాన్ పేర్కొన్నారు. వేగంగా ఉపాధి సృష్టి, నైపుణ్యాల కల్పన ద్వారా వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్న కారి్మకులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంతోపాటు.. మౌలిక వసతులు, వాణిజ్య అడ్డంకులను తొలగించడం భారత్ ముందున్న ప్రాధాన్యతలుగా తెలిపారు. మధ్య కాలానికి భారత్ విద్యపై పెట్టుబడులు పెంచడం, భూ సంస్కరణలు చేపట్టడం, సామాజిక భద్రత కల్పించడం, నిబంధనలు, పాలనా యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించడం కూడా కీలకమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధి అంచనాలూ పెంపు వర్ధమాన దేశాల్లో ఆర్థిక వృద్ధి 2025లో 4.1 శాతం, 2026లో 4 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం 2025 సంవత్సరానికి 0.8 శాతం పెంచి 4.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బలమైన పనితీరుకు తోడు, అమెరికాతో టారిఫ్‌లు గణనీయ స్థాయి నుంచి తగ్గడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. 2026లో 4.2 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం స్వల్పంగా పెంచి 2025లో 3 శాతంగా, 2026లో 3.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
విద్యుత్‌కు డిమాండ్ అంతంతే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో వేసవి ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా లేకపోవడంతో విద్యుత్‌కి డిమాండ్ అంతగా ఉండకపోవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేస్తోంది. 2025లో విద్యుత్ వినియోగం 4 శాతం స్థాయిలో పెరగవచ్చని ఒక నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే 2025–26 వ్యవధిలో, దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌కి డిమాండ్ పెరగనున్నప్పటికీ భారత్, చైనాలో మాత్రం ఇది ఓ మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. ఐఈఏ ప్రకారం భారత్‌లో గతేడాది విద్యుత్ వినియోగం 6 శాతం పెరగ్గా ఈసారి 4 శాతం స్థాయిలో ఉండనుంది. అలాగే చైనాలో 2024లో వినియోగం 7 శాతం పెరగ్గా ఈ ఏడాది 5 శాతానికి పరిమితం కానుంది. డిమాండ్ నెమ్మదించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎలక్ట్రిసిటీ వినియోగ వృద్ధిలో ఈ రెండు దేశాల వాటా, గతేడాది తరహాలోనే, 50 శాతానికి పైగా ఉంటుందని ఐఈఏ తెలిపింది. ‘అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల భారత్‌లో పారిశ్రామిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. అలాగే వేసవి తీవ్రత కూడా పెద్దగా లేకపోవడం వల్ల 2024తో పోలిస్తే 2025 ప్రథమార్ధంలో విద్యుత్ వినియోగం 1.4 శాతమే పెరిగింది. వేసవి ముగిసిపోయినందున, ఇక సెప్టెంబర్‌లో డిమాండ్ మెరుగుపడితే, వార్షికంగా సుమారు 4 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చు‘ అని ఐఈఏ తెలిపింది. పరిశ్రమలు, సేవల కార్యకలాపాలు పుంజుకుని, ఏసీల అమ్మకాలు కూడా పెరగడం వల్ల 2026లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ 6.6 శాతం పెరగవచ్చని పేర్కొంది. -
రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మూలకాలు సహా కీలక ఖనిజాల వెలికితీత, ప్రాసిసెంగ్‌లో రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా పాలుపంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. ఇది క్రిటికల్ ఖనిజాలకు అదనపు విలువను జోడించే వ్యవస్థపరంగా భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొంది. విద్యుత్ వినియోగాన్ని, డివైజ్‌ల పరిమాణాన్ని తగ్గించగలిగే భౌతిక, రసాయనిక స్వభావాలున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి నేడు నిర్మాణ, ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్ తదితర రంగాల్లో కీలకంగా మారినట్లు నివేదిక వివరించింది. గత నాలుగేళ్లుగా భారత్ ఏటా సగటున 3.3 కోట్ల డాలర్ల విలువ చేసే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత ఖనిజాలను దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దిగుమతులు 3.19 కోట్ల డాలర్లకు చేరగా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతులు మరింత అధికంగా 24.9 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. లాంథనం, ల్యూటీషియంలాంటివి రేర్ (అరుదైన) ఎర్త్ మూలకాల కోవకు చెందుతాయి. వాస్తవానికి ఇవి పుష్కలంగా ఉన్నప్పటికీ, వెలికితీత ప్రక్రియ చాలా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో రేర్ ఎర్త్ మూలకాలుగా పరిగణిస్తారు. -
నాలుగు నెలల కనిష్టానికి రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు క్షీణించి 4 నెలల కనిష్ట స్థాయి 86.91 వద్ద స్థిరపడింది. డాలర్ బలపడటం, క్రూడ్ ధరల అనూహ్య పెరుగుదల, నెలాఖరున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ‘అమెరికా–భారత్‌ల మధ్య ఆగస్టు 1న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమైనా, చర్చలు వాయిదా పడినా దేశీయ కరెన్సీపై అదనపు ఒత్తిడి పడుతుంది. ట్రేడ్ డీల్ కుదిరితే రూపాయి బలపడే వీలుంది. అప్పటిదాకా ఫారెక్స్ ట్రేడర్లు వేచిచూసే ధోరణి ప్రదర్శించవచ్చు’ అని మీరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ విశ్లేషకుడు అనుజ్ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’రూపాయి పతనానికి కారణాలు..1. ఇండియన్ రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర పెరుగుతోంది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ పనితీరు స్థిరంగానే కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో దేశీ సరఫరా, డిమాండ్ బలంగా ఉన్నట్టు కార్యకలాపాలను పరిశీలిస్తే తెలుస్తున్నట్టు తన నెలవారీ సమీక్షలో పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్యం పరిధిలోనే ఉండడం, రుతుపవనాల పురోగతి మెరుగ్గా ఉండడంతో దేశీ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలోకి (జూలై–సెప్టెంబర్) బలంగా అడుగుపెట్టినట్టు తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగకపోయినా.. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూఎస్‌లో మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ తన నివేదికలో అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ల పరంగా అనిశ్చితి అదే పనిగా కొనసాగుతుండడం రానున్న త్రైమాసికాల్లో భారత వాణిజ్య పనితీరును ప్రభావితం చేయొచ్చని తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులు, రుణాల్లో వృద్ధి నిదానించడం ఆర్థిక పనితీరు మరింత వేగం పుంజుకోకుండా నియంత్రించొచ్చని అభిప్రాయపడింది. స్థిరమైన ధరల వద్ద ఆర్థిక పనితీరును గమనించినట్టయితే మరింత పటిష్టంగా కనిపిస్తున్నట్టు పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఆర్థిక వ్యవస్థ అనుకున్నట్టు సజావుగానే సాగుతోందని అభివరి్ణంచింది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. నిదానించిన రుణ వితరణ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగానే ఉన్నప్పటికీ రుణ వృద్ధి నిదానించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రుణ గ్రహీతలు ఆచితూచి వ్యవహరించడం లేదంటే రుణ దాతలు రిస్‌్కకు సిద్ధపడకపోవడం కారణమై ఉండొచ్చని పేర్కొంది. తక్కువ వ్యయాల కారణంగా కార్పొరేట్లు బాండ్ల మార్కెట్లో నిధులు సమీకరణకు మొగ్గు చూపిస్తుండడం కూడా రుణ వృద్ధి నిదానించడానికి ఒక కారణమై ఉండొచ్చని తెలిపింది. ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మద్దతుతో కొర్పొరేట్ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావాల్సి ఉందని సూచించింది. -
బ్యాంక్‌లు.. అడ్డదారులు!
ముంబై: కొన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తీవ్రమైన పోటీ ఒత్తిళ్ల మధ్య తాత్కాలిక విజయాల కోసం అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే ఆరోపించారు. తమిళనాడులోని కరూర్‌లో ప్రైవేటు బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లక్ష్యం మంచిదైనప్పుడు దాన్ని సాధించడానికి ఏ పద్ధతి అనుసరించినా మంచిదే’అన్నట్టు సంబంధిత రుణ దాతల యాజమాన్యాలు భావిస్తున్నాయంటూ.. ఆ తరహా విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేస్తాయని హెచ్చరించారు. క్రియేటివ్ అకౌంటింగ్ (నిబంధనల్లో లోపాలను ఆసరాగా చేసుకుని గణాంకాలను సానుకూలంగా పేర్కొంటూ తప్పుదోవ పట్టించడం), నిబంధనలకు కచి్చతంగా కట్టబడకుండా స్వేచ్ఛగా వ్యవహరించడం, అంతర్గతంగా సరైన నియంత్రణలు లేకపోవడం వంటివి కొన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో సాధారణంగా మారిపోయినట్టు చెప్పారు. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తోందని స్వామినాథన్ వివరించారు. నైతిక మార్గంలోనే వృద్ధి ప్రక్రియలను అనుసరించడం అవసరమన్నారు. నమ్మకమైన వ్యవస్థలు, బాధ్యతాయుతమైన నాయకత్వం, స్పందించే సేవలతో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డులు, యాజమాన్యాలపై ఉన్నట్టు గుర్తు చేశారు. ఒక బ్యాంక్‌కు గుర్తింపే పెద్ద ఆస్తి అవుతుందన్నారు. పోటీ పెరిగిపోయి, కస్టమర్ల అంచనాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో కస్టమర్ ప్రాధాన్యంగా సేవలు అందించడం ద్వారానే నమ్మకం, విశ్వసనీయతకు తోడు, దీర్ఘకాలంలో విలువ సమకూర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. నియంత్రణపరమైన అవసరాల కోసమని నంబర్లను పెంచి చూపించడం కాకుండా.. ఆర్థిక వనరులను ఏ విధంగా వినియోగిస్తున్నారన్నది ముఖ్యమని సూచించారు. జవాబుదారీగా నడుచుకోవాలి.. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, కొత్త ప్రాంతాల్లోకి సేవల విస్తరణ పరంగా సరైన స్పష్టత, సమన్వయం, జవాబుదారీతనం అవసరమని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకుంటున్నట్టే, సైబర్ భద్రత, డేటా నిర్వహణపైనా బలమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని సూచించారు. టెక్నాలజీ అంతరాలను వేగంగా పరిష్కరించకుంటే వ్యవస్థాగత బలహీనతకు దారితీస్తుందని హెచ్చరించారు. -
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ముంబై: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆర్బీఐ – డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్బీఐ–డీపీఐ) ఈ ఏడాది మార్చి నెలకు 493.22గా నమోదైంది. దీనికి ఆరు నెలల ముందు.. 2024 సెప్టెంబర్‌లో ఈ సూచీ 455.5గా ఉండడం గమనార్హం. అంటే డిజిటల్ చెల్లింపుల్లో 10.7% మేర వృద్ధి నమోదైంది. చెల్లింపుల సదుపాయాలు, సరఫరా వైపు అంశాలు ఆర్బీఐ–డీపీఐ సూచీ బలపడేందుకు దారితీసినట్టు ఆర్బీఐ తెలిపంది.ఐదు అంశాల ఆధారంగా చెల్లింపుల తీరును ఆర్బీఐ మదింపు వేస్తుంటుంది. ఇందులో చెల్లింపులు చేసే వారు (25% వెయిటేజీ), చెల్లింపులు సదుపాయాలు – డిమాండ్ వైపు అంశాలు (10%) పేమెంట్ (Payment) సదుపాయాలు – సరఫరా వైపు అంశాలు (15%), చెల్లింపుల పనితీరు (45%), వినియోగదారుల కేంద్రీకరణ 5% చొప్పున వెయిటేజీ కలిగి ఉన్నాయి.విప్రో ఇన్ఫ్రా నుంచి కొత్త బిజినెస్ న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ సొల్యూషన్లు అందించే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) తాజాగా కొత్త బిజినెస్ విభాగానికి తెరతీసింది. విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగంపై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల(పీసీబీలు) తయారీలో ఉపయోగించే బేస్ మెటీరియల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కర్ణాటకలో కాపర్ క్లాడ్ లామినేట్(సీసీఎల్) తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించింది. దీంతో సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది.చదవండి: టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలుపెగాసిస్టమ్స్ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ సెషన్లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ డెవలపర్లలో 50 శాతం మంది భారత్‌లో ఉన్నారని, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పెగాఇన్నోవేట్ 2025 కార్యక్రమం సందర్భంగా కంపెనీ ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. పెగా ప్రధాన టెక్నాలజీలైన బ్లూప్రింట్, యాప్ డిజైన్‌లాంటి టెక్నాలజీలు తదితర అంశాల గురించి ఈ సెషన్స్‌లో చర్చిస్తారు. ఒక్కో సెషన్లో 50 మంది వరకు పాల్గొనవచ్చని దీపక్ చెప్పారు. -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లు
బ్యాంక్‌ల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు (కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ వెనక్కి తీసుకోనివి) జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉంటే, రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలోనివి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐలోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ.1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్ల చొప్పున అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఇందులో పొందుపరిచారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేతఅన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు ముందుగా..ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి.రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి.ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలి.ఒకవేళ అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్‌క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది.ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.యూడీఆర్ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. -
స్పీడ్ తగ్గిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం వృద్ధి జూన్‌లోనూ నిదానించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9 శాతంగా నమోదైంది. వృద్ధి 1.5 శాతానికి పరిమితమైంది. ఇది పది నెలల (2024 ఆగస్ట్ తర్వాత) కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు ఢీలాపడింది. జూన్ చివర్లో వర్షాలు ఈ రంగాల పనితీరును ప్రభావితం చేశాయి. ఈ మేరకు జూన్ నెలకు సంబంధించి ఐఐపీ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన ఐఐపీ రేటును 1.2 శాతం నుంచి 1.9 శాతానికి సవరించినట్టు ఎన్ఎస్వో ప్రకటించింది. → తయారీ రంగంలో ఉత్పత్తి జూన్‌లో 3.9 శాతం పెరిగింది. 2024 జూన్‌లో ఈ రంగంలో ఉత్పత్తి 3.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం. → మైనింగ్‌లో ఉత్పత్తి మైనస్ 8.7 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో 10.3 శాతం వృద్ధి నమోదైంది. → విద్యుదుత్పత్తి సైతం మైనస్ 2.6 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 8.6 శాతం వృద్ధి నమోదైంది. → క్యాపిటల్ గూడ్స్ విభాగంలోనూ వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి 2.9 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 8.8 శాతంగా ఉంది. → కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 0.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది జూన్‌లోనూ మైనస్ ఒక శాతంగా ఉండడం గమనార్హం. → ఇన్ఫ్రా/నిర్మాణ రంగంలో 7.2 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని చూసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)నూ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంది.వర్షాల ప్రభావం.. జూన్ రెండో భాగంలో అధిక వర్షాలు మైనింగ్ ఉత్పత్తి, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. త్రైమాసికం వారీగా చూస్తే వృద్ధి 11 నెలల కనిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొన్నారు. -
అధిక వృద్ధి రేటు సాధ్యమే.. ఎలాంటి సవాళ్లు లేవు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.5 శాతానికి పైన వృద్ధిని సాధించే విషయంలో ఎలాంటి సవాళ్లు లేవని ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ ఆశాకిరణంలా కొనసాగుతోందన్నారు. ‘‘నిజానికి మూడింట ఒకవంతుకు పైగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు ఒత్తిళ్లను, అధిక ధరలు, ఆర్థిక మందగమనంతో సతమతం అవుతున్నాయి. కానీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేశీ వినియోగం, దేశీ పెట్టుబడుల ఆధారితంగా నడుస్తోంది. ఎగుమతులపై ఆధారపడడం తక్కువ. కనుక 6.5 శాతం కంటే అధిక వృద్ధి సాధించే విషయంలో నాకు ఎలాంటి సవాళ్లు కనిపించడం లేదు’’అని కుమార్ వివరించారు. ఇదే వేగం కొనసాగుతుందంటూ రానున్న సంవత్సరాల్లో 7–7.5 శాతం వృద్ధి రేటును చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని రేట్ల కోతకు అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. కేవలం ద్రవ్యోల్బణం నియంత్రణ కాకుండా ఇతర స్థూల ఆర్థిక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని నగేష్ కుమార్ బదులిచ్చారు. యూఎస్‌తో ఒప్పందం ప్రయోజనకరమే అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం సాకారమైతే కారి్మక ఆధారిత విస్తృతమైన అమెరికా మార్కెట్లో భారత్‌కు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నగేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మనదగ్గర పెద్ద ఎత్తున కారి్మక వనరులు ఉన్నందున భారత్ పోటీతత్వం పెరుగుతుందన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో అమెరికాకు అవకాశాలు కలి్పంచడం పట్ల భారత్‌కు కొన్ని ఆందోళనలు ఉన్నట్టు ప్రస్తావించారు. -
‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సైనికుల కుటుంబాలకు న్యాయసహాయం అందించనున్నారు. ‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ పేరుతో ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారతీయ సైనికులకు సాయం చేయనున్నారు. సొంత ఊళ్లకు దూరంగా దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, తమ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు స్థానికంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో దేశం కోసం సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న సైనికులు స్వగ్రామాలకు రావడం కష్టంగా మారుతుంది. అలాంటివారికి, తమ కుటుంబ సభ్యులకు న్యాయసేవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ శ్రీనగర్‌లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ సదస్సులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకోవడం సైనికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సాయుధ దళాలు చేసిన త్యాగాలను చూసి తీవ్రంగా చలించిపోయానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థ వారి శ్రేయస్సుకు మరింత ప్రత్యక్షంగా దోహదపడే మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఈ కార్యక్రమం ఉద్దేశం..సైనికులు విధుల్లో ఉన్నప్పుడు అపరిష్కృత ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు, ఇతర చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేలా న్యాయసేవ అందిస్తారు.సైనికులు వృత్తిపరమైన కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోయినా, కోర్టులో కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించడానికి నల్సా రంగంలోకి దిగుతుంది.ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలు దీని పరిధిలోకి వస్తారు.ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రాల్లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.కేసు పురోగతిని పర్యవేక్షించడానికి, సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి వీరు తోడ్పాటు అందిస్తారు. -
యూకే కార్బన్ ట్యాక్స్ విధిస్తే ఎలా?
ఇండియా-బ్రిటన్ దేశాల మధ్య దాదాపు 99% వాణిజ్య వస్తువులపై సుంకాలను నియంత్రించేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేశారు. అయితే భారత ఎగుమతులపై యూకే ప్రతిపాదిత కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం ఎలా ఉండబోతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఏఎం అనేది 2027లో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రవేశపెడుతున్న వాతావరణ సంబంధిత సుంకం. ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై వాటి కర్బన ఉద్గారాల ఆధారంగా పన్ను విధిస్తారు.కార్బన్ పన్నులకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఎఫ్‌టీఏలో చేర్చలేదు. అయితే భవిష్యత్తులో యూకే కార్బన్ లెవీల ఒప్పందం కింద భారతదేశ వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపితే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూకే నుంచి భారత్ దౌత్య హామీని తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సీబీఏఎంను అమలు చేసేందుకు యూకే ప్రస్తుతం సన్నాహక దశలో ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా ప్రభావితం చెందే వస్తువులు కింది విధంగా ఉన్నాయి.అల్యూమినియంసిమెంట్ఎరువులుహైడ్రోజన్స్టీల్ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు దేశీయ వస్తువుల మాదిరిగానే కార్బన్ నిబంధనలకు లోబడి ఉండేలా చూడటం యూకే లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌టీఏలో సీబీఏఎం సంబంధిత నిబంధనలు చేర్చబడనప్పటికీ భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక ‘వెర్బల్ నోట్(అధికారిక దౌత్య హామీ)’ని కుదుర్చుకున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం..‘యూకే సీబీఏఎం భారత ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే, ఎఫ్‌టీఏ కింద మార్కెట్ యాక్సెస్ రాయితీలను హరిస్తే భారత్ తిరిగి సమతుల్యత చర్యలు తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘జీఎస్టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి’
యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.యూపీఐ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ నోటీసులు వస్తుండటంతో, కర్ణాటకలోని చిన్న వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్ష పన్నుల విధానం వల్ల జవాబుదారీతనం, ఆదాయం మరింతగా పెరిగినప్పటికీ, చిన్న ట్రేడర్లపై జరిమానాలు వేయకుండా, వారికి సాధికారత కల్పించినప్పుడే దీర్ఘకాలంలో ఇది విజయవంతం అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది.యూపీఐలాంటి డిజిటల్ లావాదేవీల ఆధారంగా బెంగళూరులోని పలువురు చిన్న ట్రేడర్లు, దుకాణదారులకు అసంబద్ధ స్థాయిలో ట్యాక్స్ నోటీసులు రావడాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశంపై కర్ణాటకలోని చిన్న వ్యాపారులు జూలై 23 నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను తలపెట్టారు.ఇదీ చదవండి: ప్రతి బీమా సంస్థకు ఒక అంబుడ్స్మన్టాప్ 5 రాష్ట్రాల వాటా 50 శాతం..జీఎస్టీ అమలు, మొత్తం చెల్లింపుదారుల్లో టాప్ 5 రాష్ట్రాల వాటా సుమారు 50 శాతంగా ఉంటోందని నివేదిక పేర్కొంది. చెల్లింపుదారుల్లో మహిళల వాటా (ప్రతి అయిదుగురిలో ఒకరు) పెరుగుతోందని వివరించింది. ప్రస్తుతం 1.52 కోట్ల పైగా గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పెద్దవి, సంపన్నమైనవి అయినప్పటికీ, మొత్తం జీఎస్డీపీలో ఆయా రాష్ట్రాల వాటాతో పోలిస్తే క్రియాశీలక జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ల వాటా తక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మొత్తం జీఎస్డీపీలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, గుజరాత్ల వాటా తక్కువే అయినప్పటికీ మొత్తం జీఎస్టీ ట్యాక్స్‌పేయర్లలో ఆయా రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటోంది. -
ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
ఆగష్టు 1వ తేదీ నుంచి యూపీఐ(Unified Payment Interface) యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో.. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారిని చెక్ పెట్టే నిబంధనలు ప్రధానంగా తీసుకొచ్చింది.యూపీఐ పేమెంట్స్ చేసేవారు.. ఇక నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్కు NPCI వీలు కల్పించనుంది. అలాగే.. ఫోన్ నెంబర్ లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూసేలా నిబంధన తీసుకురానుంది. పదే పదే బ్యాలెన్స్ చెక్‌తో ఏర్పడే ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకే ఈ రూల్స్ తెచ్చినట్లు తెలిపింది.ఇక.. ఆటోపే ట్రాన్జాక్షన్ విషయంలోనూ ఓ చిన్న మార్పు చేసింది. UPI AutoPay లావాదేవీలకు నిర్దిష్ట సమయ పరిమితులు (ఫిక్స్డ్ టైం స్లాట్) ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే.. సబ్స్క్రిప్షన్లు, విద్యుత్/నీటి బిల్లులు, ఈఎంఐలాంటి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజులో మొత్తం ఎప్పుడైనా జరగకుండా.. ముందుగా నిర్ణయించిన టైం స్లాట్ ప్రకారం ప్రాసెస్ అవుతాయి.అయితే ట్రాన్జాక్షన్(లావాదేవీల) లిమిట్ విషయంలో యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
రేట్ల కోతను నిర్ణయించేది.. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలే
ముంబై: ద్రవ్యోల్బణం, వృద్ధిపై అంచనాలే భవిష్యత్తు రేట్ల కోతను నిర్ణయిస్తాయే గానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా కాదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. రుణ వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల కోతను చేపట్టినట్టు చెబుతూ.. ఇది అస్సెట్ బబుల్‌కు (ఆస్తుల విలువ అతిగా పెరిగేందుకు) దారితీయదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు రేట్ల కోతకు అదనంగా ఆర్బీఐ చేతిలో అ్రస్తాలున్నట్టు చెప్పారు. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం రెపో రేటు కోతను చేపట్టడం తెలిసిందే. పరపతి విధానం అమలు ఆలస్యంగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ద్రవ్యోల్బణం వంటి కీలక డేటా విషయంలో 12 నెలల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేట్ల కోతపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’అని మల్హోత్రా తెలిపారు. క్యూ4లో ద్రవ్యోల్బణం 4.4 శాతం ఉంటుందన్నది అంచనాలు కాగా, ప్రస్తుత తీరు చూస్తుంటే ఇంకా తగ్గేలా ఉందన్నారు. జూన్ వరకు ఉన్న డేటాను గమనిస్తే బ్యాంకుల రుణ రేట్లు అర శాతం మేర తగ్గాయని.. ఆర్బీఐ నిర్ణయం పూర్తిగా అమలైనట్టు ఇది తెలియజేస్తోందన్నారు. మెరుగైన రుణ వృద్ధి 2024–25లో రుణాల్లో వృద్ధి 12.1 శాతంగా ఉందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. దశాబ్దం సగటు 10 శాతం కంటే అధికమన్నారు. 2025–26లో ఇది 9 శాతంగా ఉండొచ్చన్నారు. వృద్ధికి అనుకూలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు ఉండేలా చూస్తామని పరిశ్రమకు హామీ ఇచ్చారు. వృద్ధికి మద్దతుగా భారీ రేట్ల కోత చేపట్టి ఆర్బీఐ తన సాధనాలను పూర్తిగా వినియోగించేసిందా? అన్న ప్రశ్నకు.. రేట్ల కోతకు అదనంగా మరిన్ని అ్రస్తాలు తమ వద్ద ఉన్నట్టు చెప్పారు. సీఆర్ఆర్ను 3 శాతానికి తగ్గించినప్పటికీ, ఎలాంటి అవసరం ఏర్పడినా ఎదుర్కొనేందుకు తగినన్ని నిధులున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ ఒక శాతమే వినియోగించినట్టు గుర్తు చేశారు. సీఆర్ఆర్ తగ్గింపు కేవలం లిక్విడిటీని పెంచడమే కాకుండా మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గించడం కోసమన్నారు. ఇది అంతిమంగా రుణ వ్యయాలను కూడా తగ్గిస్తుందన్నారు. ఆర్థిక సేవల విస్తృతికి వీలుగా బ్యాంక్ సిబ్బంది ప్రతి వారం 2.7 లక్షల గ్రామ పంచాయితీలను సందర్శిస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామిక గ్రూప్‌లను బ్యాంకింగ్‌లోకి అనుమతించే విషయంలో ఆర్బీఐ ఆందోళనలను ప్రస్తావించగా.. ప్రయోజన వైరుధ్యం రిస్క్ ఉంటుందన్నారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వ్యయాలను ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో రాష్ట్రాలు లేదా వినియోగదారులు చెల్లించాల్సి రావచ్చన్నారు. ఈ వ్యవస్థ సాఫీగా సాగేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. యూకేతో ఒప్పందం భారత్‌కు మేలు బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌కు మేలు చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. తయారీ, సేవల రంగంలో ఎన్నింటికో ప్రయోజనం చేకూరుస్తుందంటూ.. ఇదే తరహా మరిన్ని ఒప్పందాలు అవసరమన్నారు. మరిన్ని దేశాలతో ఒప్పందాలు చర్చల దశలో ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తున్నప్పటికీ.. సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రను కాపాడుతున్నారంటూ యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను అభినందించారు. -
ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్
భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.జీరో-డ్యూటీ యాక్సెస్బాస్మతి, బాస్మతియేతర బియ్యంపండ్లు మరియు కూరగాయలుమసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు. -
ప్రమాణాలను పెంచండి, విశ్వాసాన్ని గెలవండి
న్యూఢిల్లీ: విధానాలను సకాలంలో అమలు చేయడం ద్వారా కొత్త ప్రమాణాలను సృష్టించాలని.. పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆరు నెలల్లోనే కొత్త ఆదాయపన్ను చట్టం ముసాయిదాను రూపొందించడం పట్ల అధికారులను అభినందించారు. ‘‘మంచి విధానాలు ఉండడంతోనే సరిపో దు. సకాలంలో వాటిని అమ లు చేయడమే కీలకం. ఇటీవలి కాలంలో మీరు ఎంతో గొప్ప గా పనిచేశారు. ఈ ప్రమాణాలను మరింత పెంచాల్సిన సమయం వచి్చంది’’అని 166వ ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భగా పేర్కొన్నారు. -
వాణిజ్య యుద్ధాలు తాత్కాలికమే!
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధాలు ఎక్కువ కాలం పాటు కొసాగబోవని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న అనిశ్చితులు వచ్చే కొన్ని నెలల్లో సమసిపోతాయని అంచనా వేశారు. గతం కంటే ఇప్పుడు భారత్–అమెరికా మరింత సన్నిహితంగా మారినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వైపాక్షిక బంధం బలపడినట్టు తెలిపారు. దీనికితోడు భౌగోళికంగా వ్యూహాత్మకమైన స్థితిలో ఉండడంతో ఇతర దేశాలకు లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయమై భారత్–అమెరికా మధ్య విస్తృత సంప్రదింపులు నడుస్తున్న తరుణంలో డెలాయిట్ సీఈవో వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 50–60 శాతం టారిఫ్‌లు కొనసాగడం అసాధ్యమని, అవి దిగొస్తాయని శెట్టి పేర్కొన్నారు. భారత్–అమెరికా తమ సొంత ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాయని.. కనుక ఇవి మధ్యేమార్గానికి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కొన్ని అట్టడుగు వర్గాలు, ఇతర విభాగాలున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడం సవాలుగానే అభివర్ణించారు. సంక్లిష్టమైన అంశాల పరిష్కారం అంత సులభం కాదంటూ.. ఎన్నో దశల చర్చల తర్వాతే ఏకాభిప్రాయం సాధ్యపడుతుందన్నారు. అంతిమంగా కుదిరే ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగిస్తుందని.. రెండు దేశాల మార్కెట్ వాటా పెరుగుతుందన్నారు. జీడీపీ వృద్ధి 6.7 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రోమల్ శెట్టి అంచనా వేశారు. వచ్చే దశాబ్దంన్నర (15 ఏళ్లు) పాటు ఏటా 7–8 శాతం వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ సంక్షోభాలను (కరోనా, భౌగోళిక ఉద్రిక్తతలు) విజయవంతంగా అధిగమించడమే కాకుండా బలమైన వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు.ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. ఈ ఏడాది జపాన్ను అధిగమించి 4.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేయయం ఈ సందర్భంగా గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు వెనుక సేవల రంగం పాత్రను రోమల్శెట్టి ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థకు సేవలే బలమంటూ.. అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ల ప్రభావం ఏమంత ఉండబోదన్నారు.ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయ రంగం పనితీరు మెరుగుపడినట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య పరంగా కొంత ప్రభావం ఉన్నా కానీ, అది తాత్కాలికమేనన్నారు. తలసరి ఆదాయం 2,800 డాలర్ల నుంచి 4,000 డాలర్లకు చేరుకుందంటూ, ఇదే కాలంలో వాస్తవ వినియోగం రెట్టింపైనట్టు చెప్పారు. తయారీ, సెమీకండక్టర్లు క్రమంగా పట్టు సాధిస్తునట్టు తెలిపారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఉండొచ్చన్నారు. 2029–30 నాటికి మంచి స్థితికి చేరుకోవచ్చని అంచనా వేశారు. -
భారత వృద్ధి అంచనాలు కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ప్రకటించాయి. ఏడీబీ 0.20 శాతం మేర, ఇండ్–రా 0.30 శాతం చొప్పున కోత పెట్టాయి. భారత జీడీపీ 2025–26లో 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఏడీబీ లోగడ అంచనా వేయగా.. తాజాగా దీన్ని 6.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. భారత ఎగుమతులు, పెట్టుబడులపై వాణిజ్య అనిశ్చితులు, అమెరికా టారిఫ్‌లు ప్రభావం చూపించొచ్చని పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని తెలిపింది. ‘‘అమెరికా కనీస టారిఫ్‌లు, సంబంధిత విధానపరమైన అనిశ్చితి వల్లే వృద్ధి అంచనాను సవరించాం. దీనికి అదనంగా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నిదానించడం, భారత ఎగుమతులపై అమెరికా అదనపు టారిఫ్‌లు, విధానపరమైన అనిశ్చితులు పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తాయి’’అని ఏడీబీ పేర్కొంది. దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయంటూ.. గ్రామీణ డిమాండ్ పుంజుకోవడంతో దేశీ వినియోగం బలంగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. భారత వృద్ధిని ప్రధానంగా వ్యవసాయం, సేవల రంగాలు నడిపిస్తాయని తెలిపింది. సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు వ్యవసాయ రంగం పనితీరుకు మద్దతుగా నిలుస్తాయని వివరించింది. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.3–6.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే పేర్కొనగా, 6.5 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనాగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం. 2026–27లో 6.7 శాతం.. భారత ప్రభుత్వ ద్రవ్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, అంచనాలకు మించి ఆర్బీఐ డివిడెండ్ రావడంతో ద్రవ్యలోటును క్రమంగా తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉన్నట్టు ఏడీబీ తెలిపింది. 2026–27లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని చేరుకోవచ్చని అంచనా వేసింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు, విధానపరమైన అనిశ్చితి తగ్గుముఖం పట్టడం, పెట్టుబడుల్లో వృద్ధి, ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు అనుకూలించొచ్చని పేర్కొంది. చమురు ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తుందని అభిప్రాయపడింది.6.3 శాతానికి పరిమితం కావొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఇండ్–రా అంచనా వేసింది. 2024 డిసెంబర్ అంచనాల్లో పేర్కొన్న 6.6%తో పోల్చి చూస్తే 0.30% తగ్గించింది. అమెరికా టారిఫ్‌ల పరంగా అనిశ్చితులు నెలకొనడంతోపాటు, పెట్టుబడుల వాతావరణం బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించింది. అన్ని దేశాలపై టారిఫ్‌లను అమెరికా ఏకపక్షంగా పెంచేయడం, పెట్టుబడుల వాతావరణం అంచనాలకు మించి బలహీనంగా ఉండడాన్ని ప్రతికూలతలుగా పేర్కొంది. పరపతి విధానం సరళీకరించడం (రెపో రేట్ల కోత), ద్రవ్యోల్బణం వేగంగా తగ్గుముఖం పట్టడం, సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలను అనుకూలతలుగా ఇండ్–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 3% స్థాయిలో, డాలర్‌తో రూపాయి మారకం 86.9% స్థాయిలో ఉండొచ్చని ఇండ్–రా అంచనా వేసింది. -
‘ఆర్బీఐ రేట్ల కోత మ్యాజిక్ బుల్లెట్ కాదు’
ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు పెట్టుబడులను ఇతోధికం చేసే మ్యాజిక్ బుల్లెట్ కాబోదని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుత తరుణంలో వడ్డీ రేట్లు అధికంగా లేవన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్బీఐ రేట్ల కోత ఫలితమిచ్చేందుకు సమయం పడుతుందన్నారు.ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం మేర రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ఈ రేట్ల తగ్గింపు అంతిమంగా కంపెనీల పెట్టుబడులు పెరిగేందుకు దారితీస్తుందా? అంటూ ఓ మీడియా సంస్థ ఆయన్ను ప్రశ్నించింది. ‘కేవలం వడ్డీ రేట్లతోనే ఇది సాధ్యపడుతుందని నేను అనుకోవడం లేదు. ఒకటికి మించిన అంశాలు ఇందులో పనిచేస్తాయి. మరిన్ని రంగాల్లో పోటీని పెంచాలి. తమ సానుకూలతలను కాపాడుకునేందుకు వీలుగా పెట్టుబడులపై మరింతగా దృష్టి పెట్టే విధంగా పరిశ్రమలను ప్రోత్సహించాలి. మరిన్ని కార్పొరేట్ పెట్టుబడులు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను’అని రాజన్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులు 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ గణంకాల ఆధారంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలుప్రతి ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణం జూన్ నెలలో 2.1 శాతానికి దిగిరావడంతో ఆర్బీఐ మరిన్ని రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రాజన్ నేరుగా బదులివ్వలేదు. ద్రవ్యోల్బణం పరంగా భారత్ సౌకర్యమైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పారిశ్రామిక దేశాలపై అమెరికా టారిఫ్‌ల విధింపు.. అంతిమంగా ఆయా దేశాల్లోకి అమెరికా ఉత్పత్తుల ప్రవేశం ప్రతి ద్రవ్యోల్బణానికి (ధరల పతనానికి) దారితీస్తుందన్నారు. ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం కంటే ప్రధాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నట్టు గుర్తు చేశారు. -
ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పింఛన్లను సవరించే 8వ వేతన సంఘం (సీపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్చలు ప్రారంభించింది. 2026 జనవరి 1 నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది. పీటీఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్రశాఖలతోపాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ధ్రువీకరించారు. కమిషన్‌ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత ఛైర్పర్సన్, సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు.ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.ఇదీ చదవండి: ఆర్‌కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్రకొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.గమనిక: 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరగనుంది. నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ, టీఏ గణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. -
భారత్‌లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని అంచనా. అందులో డెయిరీ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) ఉత్పత్తులపై నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డెయిరీ అనేది లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న సున్నితమైన పరిశ్రమ. కాబట్టి ఈ డీల్ నుంచి పాడి పరిశ్రమను మినహాయించడానికి యూఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్నకు భారత్‌లో అధిక మార్కెట్‌కు అవకాశం ఉన్నందున అమెరికా ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు సమాచారం.వాణిజ్య ఒప్పందం నుంచి డెయిరీ పరిశ్రమను దూరంగా ఉంచాలన్న భారత్ డిమాండ్‌పై అమెరికా కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక సున్నితత్వాన్ని యూఎస్ అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. పాడి పరిశ్రమ కేవలం వాణిజ్య వ్యవహారం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు జీవనాడిగా ఉంటోందని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సబ్సిడీతో విదేశీ పాల ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు యూస్ ప్రయత్నించింది. దాంతో వ్యతిరేకత నెలకొంది. ఈ డీల్ ముందుకెళితే రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దాన్ని నివారించడానికి బీటీఏ నుంచి డెయిరీని మినహాయించడం ఎంతో సహాయపడుతుంది.జన్యుమార్పిడి పంటలుట్రేడ్ డీల్ చర్చల నుంచి డెయిరీకి ఉపశమనం కలగబోతున్నప్పటికీ, అమెరికా తన జన్యుమార్పిడి పంటలను ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్న పంట ఉత్పత్తులను భారత్‌లోకి ప్రవేశపెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. యూఎస్ సోయాబీన్, మొక్కజొన్న ఎగుమతుల్లో ఎక్కువ భాగం జన్యుపరంగా మార్పు చెందినవే. కానీ భారతీయ నిబంధనలు ప్రస్తుతం జీఎం ఆహార పంటల దిగుమతిని నిషేధించాయి. ఇది చర్చల్లో ప్రతిష్టంభనను సృష్టిస్తుంది. కొన్ని పండ్లు, కూరగాయలు, కాయలపై రాయితీ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుత ఫ్రేమవర్క్ కింద జీఎం సోయా లేదా మొక్కజొన్న దిగుమతులను అనుమతించడానికి స్పష్టమైన చట్టపరమైన లేదా లాజిస్టిక్ అవకాశాలు లేవు.చైనా నుంచి డిమాండ్ పడిపోవడంతో..గతంలో అమెరికన్ సోయాబీన్స్, మొక్కజొన్నలను అత్యధికంగా కొనుగోలు చేసిన చైనా నుంచి డిమాండ్ పడిపోవడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ సోయాబీన్ ఎగుమతుల్లో 55 శాతం, మొక్కజొన్న ఎగుమతుల్లో 26 శాతం చైనా వాటా కలిగి ఉంది. పరస్పర టారిఫ్‌ల వల్ల ఆ మార్కెట్ కుంచించుకుపోవడంతో యూఎస్ తన వ్యవసాయ ఎగుమతులను వైవిధ్యపరచాలని చూస్తోంది. దాంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది.పెరుగుతున్న ఎగుమతులుఅమెరికాకు భారత వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నాయి. 2024-25లో ఇవి 6.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశానికి యూఎస్ వ్యవసాయ ఎగుమతులు 2023లో 373 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు మొత్తం 86.51 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా నుంచి దిగుమతులు 45.69 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దాంతో భారత్‌లో మరింత వాణిజ్యం సాగించేందుకు యూఎస్ పావులు కదుపుతోంది.ఇదీ చదవండి: ఉద్యోగిని తొలగించారు సరే.. ఆధారాలేవి?జీఎం పంటలపై వ్యతిరేకతజీఎం పంట దిగుమతులపై భారత్‌లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇరు దేశాల వాణిజ్య చర్చల్లో భాగంగా జీఎం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుండడంపట్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందం ముసుగులో జీఎం సోయాబీన్, మొక్కజొన్నలను భారత్‌లోకి నెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని తెలియజేస్తున్నాయి. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్’ గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 18న అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని శెట్టి తెలిపారు. ఆన్–బోర్డింగ్‌ను సరళతరం చేయడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్‌లాంటి కొత్త ఆవిష్కరణలతో 52 కోట్ల పైగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు. 24/7 డిజిటల్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..కృత్రిమ మేధస్సుతో నడిచే హైపర్-పర్సనలైజ్డ్ ఆఫర్లతో బ్యాంక్ ఓమ్ని-ఛానల్ ఎంగేజ్మెంట్ మోడళ్లను రూపొందిస్తోంది. యోనో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 8.77 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ గుర్తింపు కేవలం ఎస్బీఐకి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు గర్వకారణమని శెట్టి తెలిపారు. -
భారత్‌లోకి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వెల్లువ
కోల్‌కతా: దేశీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్‌లు, ఒడిదుడుకులతో అత్యధిక రాబడులను కోరుకునే ఫ్యామిలీ ఆఫీస్‌లు, కార్పొరేట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ నిపుణులు తెలిపారు. దీనితో ఈ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీల్లాంటివి ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేటగిరీలోకి వస్తాయి. 2025 మార్చి నాటికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లోకి (ఏఐఎఫ్) రూ. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు హామీలు వచి్చనట్లు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్–టైమ్ సభ్యుడు అనంత నారాయణ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.7 లక్షల కోట్లు అధికమని వివరించారు. గత అయిదేళ్లుగా చూస్తే ఏఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ హామీలు, పెట్టుబడులు వార్షికంగా 30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఈ విభాగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000–40,000 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 నాటికి పది రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న అథా గ్రూప్ ప్రెసిడెంట్ విశాల్ విఠ్లానీ తెలిపారు. సంప్రదాయ ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాలతో పోలిస్తే అత్యధికంగా 16–18 శాతం ఈల్డ్‌లు అందిస్తూ, ఏఐఎఫ్‌లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
అమెరికాతో వాణిజ్య చర్చలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్ ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్న వ్యవసాయ రంగం విషయంలో అప్రమ్తతంగా ఉండాలన్నారు. భారత్‌లో ఈ రంగంలో సబ్సిడీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. నియంత్రణల్లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి వచ్చి పడితే అప్పుడు స్థానిక ఉత్పత్తిదారులకు సమస్యలు మొదలవుతాయన్నారు. భారత వృద్ధి 6–7 శాతం స్థాయిలో స్థిరపడిందంటూ.. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ఫలితంగా ఒక శాతం లోపు వృద్ధి ప్రభావితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో భారత్‌కు అనుకూలిస్తుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఉదాహరణకు వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించొచ్చు. దీనివల్ల మన పాలు, పాల పొడి, చీజ్ తదితర ఉత్పత్తులకు అదనపు విలువ తోడవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు’’అని రాజన్ పేర్కొన్నారు. కనుక ఎంతో జాగ్రత్తగా, తెలివిగా చర్చలు నిర్వహించాలంటూ.. భారత అధికారులు ఈ దిశగానే సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్ ప్రస్తుతం అమెరికాలోని చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భారత్ ముందు అవకాశాలు.. తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వాలంటూ అమెరికా ఎప్పటి నుంచో భారత్‌ను డిమాండ్ చేస్తోంది. తాజా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవాలంటూ పట్టుబడుతోంది. కానీ, ఈ విషయంలో భారత్ సుముఖంగా లేకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మంది పాడి, సాగు రంగంపై ఆధారపడి ఉండడంతో కేంద్ర సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడులు, ఎగుమతులకు నష్టం కలిగిస్తాయని రాజన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ ముందు అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పారు. చైనా, ఇతర ఆసియా దేశాలపై అమెరికా విధించిన టారిఫ్‌లు భారత్ కంటే ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించారు. కనుక కొంత వరకు తయారీ అవకాశాలు భారత్‌కు రావొచ్చన్నారు. కానీ, అదే సమయంలో అమెరికాకు భారత్ తయారీ ఎగుమతుల గణనీయంగా లేవంటూ.. భారత్‌పై విధించే టారిఫ్‌లు ఎలాంటివి అయినా కొంత వరకు ప్రభావం చూపించొచ్చన్నారు. భారత్‌పై అమెరికా 26 శాతం అదనపు టారిఫ్‌లను (10 శాతం బేసిక్ సుంకానికి అదనం) విధించగా.. వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఆగస్ట్ 1 వరకు అమలును వాయిదా వేయడం తెలిసిందే. -
అడుగు దూరంలో ట్రేడ్ డీల్
భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అడుగు దూరంలోనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్‌హౌజ్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌తో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. బ్రాడ్ కాస్టర్ రియల్ అమెరికాస్ వాయిస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే వాణిజ్య ఒప్పందాల గురించి అడిగినప్పుడు భారత్‌తో ఒప్పందం త్వరలో కొలిక్కి వస్తుందని తెలిపారు.భారీ సుంకాలు అమల్లోకి రాకముందే ఒక ఒప్పందానికి రావాలనే లక్ష్యంతో భారత్, అమెరికా కొన్ని నెలలుగా తీవ్ర చర్చలు జరుపుతున్నాయి. విస్తృత వాణిజ్య విధానంలో భాగంగా ఏప్రిల్ 2న భారత వస్తువులపై 27 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత జులై 9 వరకు సుంకాలను నిలిపివేయగా, ఆ తర్వాత అమెరికా ఆగస్టు 1 వరకు గడువును పొడిగించింది.యూఎస్‌లో ప్రత్యేక బృందంఈ ఒప్పందంపై చర్చల కోసం భారత ప్రతినిధి బృందం అమెరికాలో ఉందని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. గత నెలలో భారత అధికారుల బృందం మరో దఫా చర్చల కోసం వాషింగ్టన్ పర్యటనను పొడిగించడంతో ఈ ఒప్పందంపై ప్రశ్నలు తలెతుతున్నాయి. అయితే ఈ డీల్‌పై ఇరు పక్షాలు ఆశావహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యూఎస్ ఉత్పత్తులు కొన్ని భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.ఇదీ చదవండి: ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువుఇండోనేషియా తరహాలోనే?ఇండోనేషియాతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం తరహాలోనే భారత్‌తో ఒప్పందం ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే, భారత్ డెడ్ లైన్ల ఆధారంగా మరిన్ని చర్చలు జరపదని, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒప్పందాలను మాత్రమే చేసుకుంటుందని ఆయన ఇటీవల చెప్పారు. ఇప్పటివరకు ద్వైపాక్షిక వాణిజ్యం 190 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సంఖ్యను రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ట్రంప్, మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
వంట నూనెల కంపెనీలకు సవాళ్లు!
ముంబై: వంట నూనెల రిఫైనరీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా వాటి ఆదాయం 2–3 శాతం మేర తగ్గి, రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అమ్మకాలు మాత్రం 2024–25తో పోల్చి చూస్తే 2.8–3 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ మార్జిన్ 0.30–0.50 శాతం వరకు తగ్గి 3.3–3.5 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. మూలధన అవసరాలు, వ్యయాలు తక్కువగా ఉండడం కారణంగా వాటి పరపతి ప్రొఫైల్ స్థిరంగా ఉంటుందని తన నివేదికలో క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మన దేశ వంట నూనెల వినియోగంలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. నూనెల దిగుమతుల్లో 50 శాతం పామాయిల్ కాగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఇతర నూనెల వాటా మిగిలిన 50 శాతంగా ఉంటోంది. సోయాబీన్ మినహా మిగిలిన ప్రధాన వంట నూనెలు అయిన సన్‌ఫ్లవర్, పామాయిల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీల ఆదాయం కొంత క్షీణతను చూడనున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. బయోడీజిల్ తయారీ డిమాండ్ కారణంగా సోయాబీన్ నూనెల ధరలు పెరిగినట్టు తెలిపింది. బ్రాండెడ్ కంపెనీల మార్జిన్లపై అధిక ప్రభావం‘‘ఈ ఏడాది అమ్మకాలు స్థిరంగా 2.8–3% మేర వృద్ధి చెందొచ్చు. 25.5–26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండొచ్చు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి 2.7 శాతం కంటే ఎక్కువే. గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర విభాగాల నుంచి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ జయశ్రీ నందకుమార్ పేర్కొన్నారు. అమ్మకాలు పెరగడం వల్ల ఆదాయ క్షీణత 2–3 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. కంపెనీలు సాధారణంగా 40–50 రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు నిర్వహిస్తుంటాయి కనుక, ధరలు తగ్గడం వాటి మార్జిన్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. నాన్ బ్రాండెడ్ కంపెనీలతో పోలి్చతే బ్రాండెడ్ కంపెనీలు ఎక్కువ ఇన్వెంటరీలు (నిల్వలు) కలిగి ఉంటాయని, కనుక వాటి మార్జిన్లపై ఎక్కవ ప్రభావం పడుతుందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఫలితంగా రవాణా వ్యయాలు అధికమైతే.. అది నూనెల ధరలు ఎగిసేందుకు దారితీయొచ్చని అంచనా వేసింది.చౌక దిగుమతుల నుంచి రక్షణ ముడి నూనెలు, రిఫైనరీ నూనెల (శుద్ధి చేసిన) దిగుమతులపై భిన్నమైన సుంకాలతో పరిశ్రమకు ప్రభుత్వం మద్దతుగా నిలిచినట్టు క్రిసిల్ నివేదిక గుర్తు చేసింది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించగా, అదే సమయంలో రిఫైనరీ నూనెలపై 35.75 శాతం కస్టమ్స్ డ్యూటీని కొనసాగించడాన్ని ప్రస్తావించింది. ఈ చర్య చౌక దిగుమతుల నుంచి దేశీ నూనె రిఫైనరీ సంస్థలకు రక్షణ నివ్వడమే కాకుండా, నూనెల ధరలు 5 శాతం వరకు తగ్గడానికి దారితీసినట్టు తెలిపింది. -
ఎరువుల కోసం రైతన్న పడిగాపులు
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తోంది. దేశంలో అధిక జనాభా జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను విస్తరించడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ఈ ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాల్సి ఉంటుంది. లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.ఆర్థిక పరిమితులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. అడపాదడపా బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం నుంచి ఇలాంటి ప్రాజెక్ట్‌లకు నిధులు వెచ్చించడంలేదు.నిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం.పరిపాలనా, నియంత్రణ అవరోధాలుకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.దిగుమతులపై ఆధారపడటంస్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి.అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ముడిసరుకు సరఫరాలో హెచ్చుతగ్గులుయూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూప్రత్యామ్నాయాలుప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. -
ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిధుల సమీకరణకు తెరతీసింది. షేరుకి రూ.811.05 ఫ్లోర్ ధరలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టింది. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. అయితే ఫ్లోర్ ధరకంటే 5 శాతం డిస్కౌంట్లో క్విప్‌ను పూర్తి చేసే వీలున్నట్లు తెలియజేసింది. షేరు తాజా ధర రూ. 831.55తో పోలిస్తే ఫ్లోర్ ధర సైతం 2.5 శాతం తక్కువకావడం గమనార్హం! వీటికితోడు రుణ సెక్యూరిటీల(బాండ్లు) జారీ ద్వారా మరో రూ. 20,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ ఇన్వెస్టర్లకు బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ.45,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.25,000 కోట్ల సమీకరణకు ఎస్బీఐ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్‌లో బ్యాంక్ వాటాదారులు సైతం ఇందుకు ఆమోదముద్ర వేశారు. కాగా.. ఎస్బీఐ ఇంతక్రితం 2017–18లో క్విప్ ద్వారా రూ. 15,000 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే! భవిష్యత్తులో రుణ వృద్ధికి, మూలధన వ్యయానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.రిలయన్స్ సంస్థలు సైతంరిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు వివిధ మార్గాలలో రూ.9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ.6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది. రిలయన్స్ పవర్ బోర్డు వివిధ మార్గాలలో రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ. 6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది. -
సాఫీగా రేట్ల కోత బదిలీ
న్యూఢిల్లీ: వ్యవస్థలో నగదు లభ్యత పెంపు దిశగా ఆర్బీఐ ఈ ఏడాది ఆరంభం నుంచి తీసుకున్న చర్యలు.. 100 బేసిస్ పాయింట్ల (ఒక శాతం) రేట్ల తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని బ్యాంక్‌లు బదిలీ చేసేందుకు అనుకూలిస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు రూపంలో ఆర్బీఐ రూ.5.6 లక్షల కోట్ల మేర లిక్విడిటీని పెంచినట్టు గుర్తు చేసింది. దీంతో మార్చి నుంచి నగదు లభ్యత మిగులు స్థాయికి చేరినట్టు తెలిపింది. సీఆర్ఆర్ను (నగదు నిల్వల నిష్పత్తి) 100 బేసిస్ పాయింట్లను తగ్గించడం రూపంలో మరో రూ.2.7 లక్షల కోట్ల నగదు దశల వారీగా వ్యవస్థలోకి చేరుతుందని పేర్కొంది. జనవరి నుంచి వ్యవస్థలో లిక్విడిటీని గణనీయంగా పెంచడమే కాకుండా, భవిష్యత్తులోనూ తగినంత లిక్విడిటీని కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం నిధుల పరమైన పరిస్థితులను సులభతరం చేసినట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న మిగులు నిధులు, డిపాజిట్ రేట్లు తగ్గుతుండడం దీన్ని స్పష్టం చేస్తోంది. రుణ వృద్ధి మందగించడంతో ఈ రంగం రుణ/డిపాజిట్ రేషియో పెరుగుదల తిరోగమించడం డిపాజిట్ల పరంగా బ్యాంక్‌లపై ఒత్తిళ్లను తగ్గిస్తుంది’’అని ఫిచ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. నిధుల వ్యయాలు దిగొస్తాయి.. ఈ ఏడాది వడ్డీ రేట్లను ఆర్బీఐ ఒక శాతం వరకు తగ్గించడం తెలిసిందే. ఫిబ్రవరిలో పావు శాతం, ఏప్రిల్‌లోనూ పావు శాతం, జూన్‌లో అరశాతం తగ్గింపు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఫిచ్ రేటింగ్స్ నివేదిక గుర్తు చేసింది. ఈ చర్యలు ఆర్బీఐ లిక్విడిటీ విధానంలో గణనీయమైన మార్పునకు నిదర్శనమని పేర్కొంది. నిధుల పరంగా ఒత్తిళ్లు లేకుండా రుణ వృద్ధికి ఈ చర్యలు మద్దతునిస్తాయని తెలిపింది. ‘‘తగినంత లిక్విడిటీ వల్ల తాజా నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. 2025–26 సంవత్సరంలో బ్యాంకుల మార్జిన్లు 0.30 శాతం తగ్గుతాయన్నది మా అంచనా. 2026–27లో డిపాజిట్లపై వ్యయాలు తగ్గడం ఫలితంగా మార్జిన్ల ఒత్తిళ్లు దిగొస్తాయి. తక్కువ సీఆర్ఆర్ కూడా ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. జూన్ సమీక్షలో ఆర్బీఐ సీఆర్ఆర్ను సైతం ఒక శాతం తగ్గించి 3 శాతం చేయడం గమనార్హం. -
భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీ సులభతరం
న్యూఢిల్లీ: భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీని మరింత సులభతరం చేస్తూ.. యూపీఐ–పేనౌ కిందకు మరో 13 బ్యాంక్‌లను చేర్చినట్టు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ప్రకటించింది. ఈ నెట్వర్క్ పరిధిలోకి మొత్తం 19 భారత బ్యాంక్‌లు చేరినట్టయింది. ‘‘జూలై 17 నుంచి రెండు దేశాల్లోని యూజర్లు మరిన్ని బ్యాంకుల పరిధిలో నిధులను బదిలీని సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవ మరింత సౌకర్యంగా, అందుబాటులోకి వస్తుంది’’అని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి ఎన్ఐపీఎల్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం. ఆర్బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) సంయుక్తంగా యూపీఐ–పేనౌ సేవలను లోగడ ప్రారంభించడం తెలిసిందే. -
వీధి వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఒకప్పటిలాగా పర్సుల్లో క్యాష్ ఉంచుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. అయితే చిరువ్యాపారుల పట్ల ఈ డిజిటల్ లావాదేవీలు శాపంగా మారుతున్నాయి. ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ వ్యవస్థల్లో రికార్డు అవుతుండడంతో రోజువారీ లావాదేవీలను పరిగణలోకి తీసుకుని చిరువ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందుతున్నాయి. గతంలో ఫిజికల్ క్యాష్ ద్వారా వస్తు మార్పిడి జరిగేదికాస్తా డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని వారి చేతిలో జీఎస్టీ నోటీసులు దర్శనమిస్తున్నాయి. దాంతో చేసేదీమీ లేక యూపీఐ చెల్లింపులకు నో చెబుతూ.. కస్టమర్లను క్యాష్ ఇమ్మంటున్నారు.బెంగళూరులో ఈమేరకు చాలా మంది వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. దాంతో యూపీఐ క్యూఆర్ స్కానర్లు పక్కన పడేసి, క్యాష్ ఇవ్వాలని కస్టమర్లను కోరుతున్నారు. చాలా షాపుల ముందు ‘నో యూపీఐ.. ఓన్లీ క్యాష్’ అనే బోర్డులు వెలుస్తున్నాయి. ‘రోజుకు సుమారు రూ.3,000 వ్యాపారం చేసి వచ్చే కొద్దిపాటి లాభంతో జీవిస్తున్నాను. నేను ఇకపై యూపీఐ చెల్లింపును అంగీకరించలేను’ అని హోరమావులోని ఓ దుకాణదారుడు తెలిపాడు.స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు, తోపుడు బండ్లు, కార్నర్ షాపులు సహా అధికారికంగా నమోదు కాని వేలాది చిన్న వ్యాపారాలకు జీఎస్టీ నోటీసులు అందాయని వ్యాపారులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు చెబుతున్నారు. కొందరికి రూ.లక్షల్లో డిమాండ్లు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బెంగళూరు స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినయ్ కె.శ్రీనివాస మాట్లాడుతూ..‘చాలా మంది విక్రేతలు జీఎస్టీ అధికారుల వేధింపులు, పౌర అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని భయపడుతున్నారు. దాంతో చాలామంది ఇప్పటికే కస్టమర్ల నుంచి నగదు కోరుతున్నారు’ అని చెప్పారు. ప్రస్తుత జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం వస్తువులను సరఫరా చేసే వ్యాపారులు తమ వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లకు పరిమితి రూ.20 లక్షలుగా ఉంది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డే దిక్కు!ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ స్పందిస్తూ 2021-22 నుంచి యూపీఐ లావాదేవీల డేటా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే టర్నోవర్ స్థాయులను చేరిన వారికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అటువంటి వ్యాపారులు వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని, పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్‌ను వెల్లడించాలని తెలిపింది. ఇదిలాఉండగా, జీఎస్టీ అధికారులు యాదృచ్ఛిక గణాంకాలను టర్నోవర్‌గా పేర్కొనలేరని కర్ణాటక వాణిజ్య పన్నుల మాజీ అదనపు కమిషనర్ హెచ్డీ అరుణ్ కుమార్ అన్నారు. -
సిటీలో పెరిగిన నిరుద్యోగ రేటు
జూన్‌లో నిరుద్యోగిత (నిరుద్యోగం రేటు) ఫ్లాట్‌గా నమోదైంది. ఈ ఏడాది మే నెలలో మాదిరే జూన్‌లోనూ 5.6 శాతం వద్దే (అన్ని వయసుల వారికి సంబంధించి) కొనసాగింది. ఏప్రిల్‌లో ఉన్న 5.1 శాతం కంటే కొంచెం ఎక్కువ. కానీ, పట్టణాల్లో నిరుద్యోగ రేటు వరుసగా మూడో నెలలోనూ పెరిగింది. జూన్‌లో 7.1 శాతంగా నమోదైంది. ఈ మేరకు పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. పనిచేయగల అర్హతలు ఉండీ, పనిదొరక్క ఖాళీగా ఉన్న వారి గురించి ఈ గణాంకాలు తెలియజేస్తాయి. ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుపట్టణాల్లో అన్ని వయసుల వారికి సంబంధించిన నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. మేలో 6.9 శాతం, ఏప్రిల్‌లో 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. పట్టణాల్లో 15.29 సంవత్సరాల వారిలో నిరుద్యోగ రేటు జూన్‌లో 18.8 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 17.9 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లోనూ 17.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు జూన్‌లో 5.6 శాతానికి తగ్గింది. మేలో ఇది 5.8 శాతంగా ఉంది. 15–29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగిత మే నెలలో 15 శాతంగా ఉంటే, జూన్‌లో 15.3 శాతానికి పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (15 ఏళ్లకు మించిన వారిలో) మే నెలలో ఉన్న 54.8 శాతం నుంచి జూన్‌లో 54.2 శాతానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50.4 శాతం చొప్పున జూన్‌లో నమోదైంది.పురుష కార్మికుల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 78.1 శాతం, పట్టణాల్లో 75 శాతం చొప్పున ఉంది. మే నెలతో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జూన్‌లో 35.2 శాతానికి తగ్గింది.గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల నిరుద్యోగ రేటు పెరగడానికి.. సొంత పనులపై ఆధారపడడం వల్లేనని ఈ సర్వే నివేదిక తెలిపింది. -
ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!
వస్తు ఎగుమతులు జూన్ నెలలో 35.14 బిలియన్ డాలర్లుగా (రూ.2.99 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 2024 జూన్ నెలలోనూ ఎగుమతులు 35.16 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. దిగుమతులు 3.71 శాతం క్షీణించి 53.93 బిలియన్ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 18.78 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పెట్రోలియం ఉత్పత్తులు, వ్రస్తాలు, రత్నాభరణాలు, లెదర్, ముడి ఇనుము, ఆయిల్ సీడ్స్, జీడి పప్పు, దినుసులు, పొగాకు, కాఫీ ఎగుమతులు క్రితం ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే క్షీణించాయి. ఇదే కాలంలో ఇంజినీరింగ్, టీ, బియ్యం, రెడీ మేడ్ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధి నమోదైంది. జూన్ త్రైమాసికంలో వస్తు, సేవల ఎగుమతులు 210 బిలియన్ డాలర్లుగా ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం కంటే 6 శాతం ఎక్కువని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు. ఎగుమతులు–దిగుమతులు జూన్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గి 4.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో 15 శాతానికి పైగా తగ్గి 17.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు జూన్‌లో 47 శాతం పెరిగి 4.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలోనూ ఎగుమతులు 47 శాతం వృద్ధితో 12.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగి 112 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 4 శాతానికి పైగా పెరిగి 179 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్–జూన్ కాలంలో వాణిజ్య లోటు 67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 62 బిలియన్ డాలర్లుగా ఉంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు ముడి చమురు దిగుమతులు 8 శాతం తగ్గి 25.73 బిలియన్ డాలర్లుగా, బంగారం దిగుతులు 26 శాతం తగ్గి 1.9 బిలియన్ డాలర్ల చొప్పున జూన్‌లో నమోదయ్యాయి. జూన్‌లో సేవల ఎగుమతుల విలువ 32.84 బిలియన్ డాలర్లుగా ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 28.67 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవల దిగుమతుల విలువ 15 బిలియన్ డాలర్ల నుంచి 17.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణం
లాభాపేక్ష లేని సంస్థలుగా పని చేయాల్సిన విద్యాసంస్థలు కార్పొరేట్ మాఫియాగా మారి తల్లిదండ్రుల నుంచి భారీగా దన్నుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని యాజమాన్యాలు చెప్పినకాడికి ముట్టజెప్పుతున్నారు. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం కంటే నిశ్శబ్దంగా విద్యా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ప్రైవేట్ విద్య ఆర్థిక సవాలుగా మారిందని, పెరుగుతున్న పాఠశాల ఫీజులతో మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నట్లు విద్యావేత్త, చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కో చిన్నారికి రూ.3.5 లక్షల వరకు..గోయల్ లింక్డ్ఇన్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల్లోని చాలా పాఠశాలల్లో ప్రైమరీ విద్య కోసం సుమారుగా అడ్మిషన్ ఛార్జీలు రూ.35 వేలు, ట్యూషన్ ఫీజు రూ.1.4 లక్షలు, వార్షిక ఛార్జీలు రూ.38 వేలు, రవాణా ఫీజు రూ.44 వేల నుంచి రూ.73 వేలు, పుస్తకాలు, యూనిఫామ్‌లకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు బాదుతున్నారు. అంటే ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.2.5-రూ.3.5 లక్షలు’ అని చెప్పారు.ఫీజుల కోసం ఈఎంఐలు..‘మిడ్ టైర్ స్కూళ్లు కనీసం రూ.లక్ష ఫీజుతో ప్రారంభిస్తున్నాయి. ఎలైట్ స్కూళ్లు ఈజీగా రూ.4 లక్షలతో అడ్మిషన్ మొదలు పెడుతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నాం, కానీ విద్యా ద్రవ్యోల్బణం మధ్యతరగతి పాలిట శాపంగా మారుతోంది. ఫిన్‌టెక్ సంస్థలు ఇప్పుడు పాఠశాల ఫీజుల కోసం ఈఎంఐలను అందిస్తున్నాయి’ అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యామ్నాయం కాదు. అందులోనూ 8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క యూపీలోనే 5వేల పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థుల్లో 70 శాతం మంది పేరాగ్రాఫ్ చదవలేని పరిస్థితులున్నాయి. విద్యుత్ లేని లక్ష పాఠశాలలున్నాయి. మరుగుదొడ్లు లేని 46,000 పాఠశాలలు, తాగునీరు లేని పాఠశాలలు 39,000 ఉన్నాయి. భారతదేశం జీడీపీలో కేవలం 4.6% మాత్రమే విద్యపై ఖర్చు చేస్తుంది. వివిధ కమిటీలు సిఫార్సు చేసిన 6% కంటే ఇది చాలా తక్కువ.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఏం చేయాలంటే..‘చట్టపరంగా లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన ప్రైవేటు పాఠశాలలు వ్యవస్థలోని చాలా లొసుగులను అన్వేషిస్తున్నాయి. డొల్ల కంపెనీల ద్వారా యజమానులు తమ సొంత పాఠశాలలకు ఆస్తులను లీజుకు ఇవ్వడం, అధిక అద్దెలు వసూలు చేయడం, బిల్లును ఫీజుల రూపంలో తల్లిదండ్రులకు పాస్‌ఆన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల నుంచి తప్పించుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు’ అని గోయల్ తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడిని కట్టడి చేయాల్సి ఉంది. కొందరు అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తిపడి తల్లిదండ్రుల నెత్తిన భారం మోపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన పరిస్థితులపై యంత్రాంగం దృష్టి సారించాలి. -
ట్రంప్ టారిఫ్‌లు.. మన ఎగుమతులకు మంచిదే
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు మరింత పోటీతత్వంగా మారినట్టు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ సర్కారు అధిక టారిఫ్‌లు విధించడం మనకు అనుకూలిస్తుందని పేర్కొంది. సంఖ్యా పరంగా, విలువ పరంగా అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నట్టు తెలిపింది. ‘‘30కు గాను 22 విభాగాల్లో భారత పోటీతత్వం పెరగనుంది. ఈ విభాగాల మార్కెట్ పరిమాణం 2,285 బిలియన్ డాలర్లుగా ఉంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఈ విభాగాల్లో అమెరికాకు చైనా, కెనడా, మెక్సికో ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నట్టు తెలిపింది. ఈ దేశాలపై 30 శాతం, 35 శాతం, 25 శాతం చొప్పున అధిక సుంకాల బాదుడుతో భారత ఎగుమతుల పోటీతత్వం పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ తదితర విభాగాల్లో మార్కెట్ వాటా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక 30కు గాను 6 విభాగాల్లో భారత పోటీతత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల్లో వీటి వాటా 32.8 శాతంగా (26.5 బిలియన్ డాలర్లు) ఉంటుందని తెలిపింది. ‘‘ఆరు ఉత్పత్తుల విభాగాల్లో భారత్ 1–3 శాతం మేర అధిక టారిఫ్‌లను ఎదుర్కోనుంది. యూఎస్‌కు భారత ఎగుమతుల్లో 52 శాతం వాటా కలిగిన 78 ఉత్పత్తుల విభాగాల్లో పోటీతత్వం పెరగనుంది. 17 ఉత్పత్తుల విభాగాల్లో ఎలాంటి మార్పు ఉండదు’’అని వివరించింది. ఈ రంగాలకు సానుకూలం.. చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లతో పోల్చి చూస్తే.. భారత మినరల్స్, ఇంధనాలు, వ్రస్తాలు, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, ఫరి్నచర్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రయోజనం చేకూరనున్నట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో విశ్లేషించింది. ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలిచేందుకు, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. లెదర్, ఫుట్‌వేర్, ఫరి్నచర్, హ్యాండిక్రాఫ్ట్స్‌కు సైతం పీఎల్ఐ కింద మద్దతు ఇవ్వాలని పేర్కొంది. అలాగే, విద్యుత్ టారిఫ్‌లను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని వివరించింది. ఐటీ, ఆర్థిక సేవలు, నైపుణ్య సేవలు, విద్యా రంగాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందానికి కృషి చేయాలని సూచించింది. -
ధరలు.. దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహార ధరలు మరింత దిగొచ్చాయి. ఫలితంగా జూన్‌లో వినియోగ ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం/సీపీఐ) 2.1 శాతానికి దిగొచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతం కాగా, గతేడాది జూన్‌లో 5.08 శాతంగా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. చివరిగా 2019 జనవరిలో నమోదైన 1.97 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం గత కనిష్ట స్థాయిగా ఉంది. కూరగాయలు, పప్పులు, మాంసం, చేపలు, ధాన్యాలు, చక్కెర, పాలు, పాల ఉత్పత్తులు, దినుసుల ధరలు దిగిరావడమే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు వచ్చేందుకు సాయపడినట్టు ఎన్ఎస్వో తెలిపింది. ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 1.06 శాతానికి క్షీణించింది. ఈ ఏడాది మే నెలతో పోల్చి చూస్తే 2 శాతం దిగొచ్చింది. మైనస్‌లోకి టోకు ద్రవ్యోల్బణం...జూన్ నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం (టోకు ధరల సూచీ/డబ్ల్యూపీఐ) ఏకంగా ప్రతికూల స్థాయికి పడిపోయింది. మైనస్ 0.13 శాతంగా నమోదైంది. 19 నెలల తర్వాత మళ్లీ ప్రతికూల స్థాయికి చేరింది. ఆహారోత్పత్తులు, మినరల్ ఆయిల్స్, ఇంధనాలు, బేసిక్ మెటల్స్, తయారీ ఉత్పత్తుల వ్యయాలు దిగిరావడం ఇందుకు దారితీసింది. ఈ ఏడాది మే నెలకు టోకు ద్రవ్యోల్బణం 0.39 శాతం కాగా, గతేడాది జూన్ నెలలో 3.43 శాతం చొప్పున ఉంది. -
ఐదేళ్ల ముందే 50 శాతం టార్గెట్ పూర్తి
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ కీలక మైలురాయిని చేరుకుంది. శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాన్ని నిర్దేశించిన ఐదేళ్ల ముందే 50% లక్ష్యాన్ని సాధించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 484.8 గిగావాట్లు. ఇందులో 242.8 గిగావాట్లు గ్రీన్ వనరుల నుంచే వస్తుందన్నారు. దాంతో స్థాపిత సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి నమోదవుతోంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తిని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గ్రీన్ ఎకోసిస్టమ్‌ను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్నాం. దేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.8 గిగావాట్లుగా ఉంది. అందులో శిలాజేతర ఇంధన వనరుల నుంచి 242.8 గిగావాట్లు సమకూరుతుంది’ అని జోషి ఎక్స్‌లో తెలిపారు. 2030 నాటికి భారత్ శిలాజేతర ఇంధన లక్ష్యంలో 50 శాతం ఐదేళ్లు ముందే సాధించింది. -
పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధుల కోసం ఎంతో మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరాకు రూ.2,000 చొప్పున ఈ జులైలోనే విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పీఎం కిసాన్ నిధులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. చివరి 19వ విడతను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియకముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది.త్వరలోనే జూన్ వాయిదాలను ఈ జులైలో విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని, ఈ-కేవైసీని అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. రైతుల చిరునామా కూడా వ్యాలిడేట్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కొందరి చిరునామా, లొకేషన్ రికార్డుల్లో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు. కాబట్టి చిరునామాను అప్డేట్ చేయాలని చెప్పారు.పీఎం కిసాన్ భూమి చిరునామా అప్డేట్ చేయడం ఎలా?1. పీఎం కిసాన్ వెబ్సైట్.. https://pmkisan.gov.inలోకి వెళ్లాలి.2. హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్ కింద ‘స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్’పై క్లిక్ చేయాలి.3. ‘రిజిస్ట్రేషన్ నంబర్’ లేదా ‘ఆధార్ నంబర్’ ఎంటర్ చేయాలి.4. కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.5. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.6. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అందులో ఫిల్ చేయాలి.7. మీ పేరు మీద సాగు భూమి రుజువు పత్రాలను అప్లోడ్ చేయాలి. (పట్టా పుస్తకాలు, భూ రికార్డులు..మొదలైనవి)8. మీరు చేసిన మార్పులను సమీక్షించి ఆన్లైన్లో ఫామ్ సబ్మిట్ చేయాలి.ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ఈ-కేవైసీ, ఫేషియల్ అథెంటికేషన్ అనే మూడు సులువైన మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.పీఎం-కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?https://pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ సందర్శించాలి.‘నో యువర్ స్టేటస్’పై క్లిక్ చేయాలి.మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి.లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: మరో 2,400 మంది ఉద్యోగాలు కట్!పీఎం కిసాన్ స్కీమ్2019లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. తర్వాత పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంగా నిలిచింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో ఏటా రూ.6,000 చొప్పున అందిస్తారు. -
క్యూ1 ఫలితాలే దిక్సూచి
(క్యూ1) ఫలితాలతోపాటు.. ఇటు ఆర్థిక గణాంకాల ఆధారంగా కదిలే వీలుంది. ఈ వారం పలు టెక్ దిగ్గజాల క్యూ1 పనితీరు వెల్లడికానుండగా.. టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... గత వారం చివర్లో డీలా పడిన దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్ బాటలో సాగే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు ఆల్మండ్ గ్లోబల్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ నిపుణులు సిమ్రన్‌జీత్ సింగ్ భాటియా తెలియజేశారు. గత వారం ఐటీ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 పనితీరుతో సీజన్‌కు తెరతీసింది. ఫలితాలు, అంచనాలు నిరాశపరచడంతో వారాంతాన టీసీఎస్సహా ఇతర ఐటీ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ వారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రోతోపాటు.. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్, మెటల్ రంగ బ్లూచిప్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితరాలు క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో మార్కెట్ ఆటుపోట్ల మధ్య ఫలితాల ఆధారంగా కొన్ని కౌంటర్లు వెలుగులో నిలవవచ్చని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ధరల గణాంకాలు.. గత(జూన్) నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(14న) విడుదలకానున్నాయి. మే నెలకు డబ్ల్యూపీఐ 0.39 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో నమోదైన 0.85 శాతంతో పోలిస్తే తగ్గింది. ఈ బాటలో జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం 15న ప్రకటించనుంది. మే నెలలో సీపీఐ 2019 ఫిబ్రవరి తదుపరి కనిష్టంగా 2.82 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో నమోదైన 3.16 శాతంతో పోలిస్తే వెనకడుగు వేసింది. ధరల గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ చేపట్టే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. దీంతో వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దేశీయంగా క్యూ1 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనుండగా.. ధరల గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ట్రేడ్ డీల్‌పై దృష్టి యూఎస్, భారత్ మధ్య ఇటీవల ప్రారంభమైన వాణిజ్య టారిఫ్‌ల చర్చలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా తదితర పలు దేశాల దిగుమతులపై వివిధ స్థాయిల్లో టారిఫ్‌లను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్, భారత్ వాణిజ్య ఒప్పందంతోపాటు.. ఇతర దేశాలతో ట్రంప్ టారిఫ్ చర్చలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ల కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వారం యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా జీడీపీ వివరాలు వెల్లడికానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య టారిఫ్‌ల అనిశి్చతులకుతోడు.. రాజకీయ, భౌగోళిక వివాదాలు కొనసాగుతుండటం సెంటిమెంటును దెబ్బతీయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అభిప్రాయపడ్డారు.సాంకేతికంగా చూస్తే..గత వారం ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కీలకమైన ఇంటర్మీడియెట్ మద్దతులను కోల్పాయాయి. నిజానికి మొదటి మూడు రోజులు స్థిరంగా కదిలినప్పటికీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలు, టారిఫ్‌లపై అనిశి్చతి, ఎఫ్‌పీఐల అమ్మకాలు దెబ్బతీసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంచనా వేసినట్లు నిఫ్టీ బ్రేకవుట్ సాధించి 25,500కు చేరినప్పటికీ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. వారాంతాన 25,150కు క్షీణించింది. దీంతో స్వల్ప కాలంలో 24,800–24,700కు నీరసించే వీలుంది. వెరసి 25,400–25,500 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఇదేవిధంగా సెన్సెక్స్ 82,500కు జారింది. దీంతో 81,500–81,000 స్థాయిలో సపోర్ట్ తీసుకునే అవకాశముంది. 82,800–83,050 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చునని నిపుణలు విశ్లేíÙంచారు.గత వారమిలా.. గత వారం(7–11) దేశీ స్టాక్ మార్కెట్లు తొలి అర్ధభాగంలో బలపడినప్పటికీ చివర్లో డీలా పడ్డాయి. వాణిజ్య టారిఫ్ వివాదాలు, నిరుత్సాహకర టీసీఎస్ ఫలితాలు ప్రభావం చూపాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 932 పాయింట్లు(1.1 శాతం) క్షీణించింది. 82,500 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 311 పాయింట్లు(1.2 శాతం) నీరసించింది. 25,150 వద్ద స్థిరపడింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 10 వరకు 1.34 శాతం తగ్గి రూ.5.63 లక్షల కోట్ల మేర ఉన్నాయి. రిఫండ్లు పెరిగిపోవడమే ఇందుకు కారణం. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్లు కాగా, నాన్ కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. రూ.17,874 కోట్లు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో వసూలైంది. ఈ మొత్తం కలిపి రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. నికర రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు చెల్లించింది) 38 శాతం పెరిగి రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లు చెల్లించకముందు చూస్తే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన రూ.6.44 లక్షల కోట్ల కంటే 3.17 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కేవలం రిఫండ్లు పెరిగిపోవడం నికర ఆదాయం తగ్గడానికి దారితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.25.20 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో కేంద్రం అంచనాలు ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 12.7 శాతం అధికం. ముఖ్యంగా రూ.78,000 కోట్లు సెక్యూరిటీస్ లావాదేవీల రూపంలోనే సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. -
ఇక దేశీయంగా రేర్ మాగ్నెట్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,345 కోట్ల స్కీముపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మాగ్నెట్స్ తయారీ కోసం ఎంపికయ్యే రెండు సంస్థలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఈ విషయాలు వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. రేర్ ఎర్త్ ఆక్సైడ్లను మాగ్నెట్ల కింద మార్చే ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సబ్సిడీలు ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మాగ్నెట్స్ ఎగుమతులపై ప్రధాన సరఫరాదారు అయిన చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్న సంగతి తెలిసిందే. టెలికం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తదితర రంగాల్లో ఉత్పత్తికి ఇవి కీలకంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులకు స్కీము.. పీఎం ఈ–డ్రైవ్ కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలు చేసే వారికి రూ. 9.6 లక్షల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పథకాన్ని కుమారస్వామి ఆవిష్కరించారు. సుమారు 5,600 ట్రక్కులకు వర్తించే ఈ పథకంతో పోర్ట్‌లు, లాజిస్టిక్స్, సిమెంట్, స్టీల్ తదితర పరిశ్రమలు లబ్ధి పొందనున్నాయి. మొత్తం వాహనాల్లో డీజిల్ ట్రక్కుల వాటా 3 శాతమే అయినప్పటికీ రవాణా సంబంధిత గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 42 శాతం వాటా వాటిదే ఉంటోందని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్గారాలను తగ్గించే, పర్యావరణహితమైన సరకు రవాణా విధానాలను అమలు చేసేందుకు ఈ స్కీము దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ పరిమాణం రూ. 10,900 కోట్లు కాగా, ఇందులో ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు. -
గ్రామీణ రంగంలో పెట్టుబడులకు చేయూత
న్యూఢిల్లీ: గ్రామీణ రంగంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే తమ ప్రాధాన్యతని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) ప్రెసిడెంట్ అల్వారో లారియో తెలిపారు. మరే ఇతర రంగంతో పోల్చి చూసినా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా పేదరిక నిర్మూలనకు సాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. 1977లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ, ఆర్థిక సంస్థగా ఏర్పాటైన ఐఎఫ్ఏడీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక, ఆకలి బాధల నిర్మూలన కోసం కృషి చేస్తుంటుంది. గ్రామీణ ప్రాంతాల కోసం దీర్ఘకాలిక రుణాలను సమీకరించడం, తద్వారా దీర్ఘకాల ఫలితాలను సాధించడం ఐఎఫ్ఏడీ ప్రాధాన్యతగా లారియో చెప్పారు. భారత్‌తో 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, ఐఎఫ్ఏడీ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారత్ కూడా ఒకటని గుర్తు చేశారు. అతిపెద్ద రుణ గ్రహీతతోపాటు నిధుల విరాళంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్ ముందు మూడు కీలక ప్రశ్నలు.. ‘‘భారత్ ముందు మూడు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. రైతులకు వ్యవసాయం మరింత లాభదాయకంగా ఎలా మార్చగలం? వాతావరణపరమైన ఎన్నో సవాళ్ల మధ్య ఉత్పాదకతను పెంచడం ఎలా? ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత దిశగా ఎలా ముందుకు వెళ్లాలి?’’అని అల్వారో లారియో ప్రశ్నలు సంధించారు. ఉష్ణోగ్రతలు పెరగడం, అసహజ వర్షపాతం తదతర వాతావరణపరమైన మార్పులు ప్రపంచ ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విధమైన మార్పులు పంట దిగుబడులు, ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో సీజన్‌వారీ నీటి కరువు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కరువు సమస్యలున్నట్టు చెప్పారు. భారత జీడీపీలో వ్యవసాయం 20 శాతం వాటాతో, 42 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించినప్పటికీ.. పేదలను సైతం ఆర్థిక సేవల్లో భాగం చేయడం, చిన్న ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానత కల్పించడం కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
‘ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదు’
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల నుంచి ఆధార్‌ను మినహాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదని చెప్పారు. ప్రభుత్వ సర్వీసులు సులువుగా పొందేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన కుమార్ నకిలీ ఆధార్ కార్డులను తనిఖీ చేసి వాటిని గుర్తించేందుకు యూఐడీఏఐ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆధార్ కార్డులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్నల్ భద్రతా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. జారీ చేసిన అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉందని, యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ త్వరలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను క్యూఆర్ కోడ్‌లో పొందుపరిచిన వాటితో సరిపోల్చుకోవచ్చని చెప్పారు. ఎవరైనా నకిలీ ఆధార్ కార్డు చూపిస్తే దీని ద్వారా సులభంగా చెక్ చేయవచ్చని తెలిపారు.ఫొటోషాప్ లేదా ప్రింటెడ్ టెంప్లెట్లను ఉపయోగించి ప్రజలు నకిలీగా ఆధార్ కార్డులను సృష్టిస్తున్న సందర్భాలున్నాయని కుమార్ వివరించారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందని వెల్లడించారు. ‘ఇప్పటికే ఈ యాప్‌కు డెమో నిర్వహించారు. ఇది పురోగతిలో ఉంది. అంతర్గతంగా దాన్ని చెక్ చేస్తున్నారు. ఈ యాప్ ప్రాథమికంగా ఆధార్ నంబర్ హోల్డర్ సమ్మతితో డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫిజికల్ కాపీలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో మాస్క్డ్ వెర్షన్ కూడా ఉంటుంది’ అన్నారు.ఇదీ చదవండి: అంతా ఫేక్.. నమ్మొద్దు!జూన్ 24న ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జులై 25 నాటికి బిహార్‌లో దాదాపు 8 కోట్ల మంది ఓటర్లలో అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరుల జాబితానే సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రం అంతటా విస్తృతంగా ఉన్న ఆధార్, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులను గుర్తింపు రుజువుగా అంగీకరించకపోవడం వల్ల ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తెలిపారు. -
అంతా ఫేక్.. నమ్మొద్దు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్ గ్రూప్ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్‌గా మారడంతో దుబాయ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.UAE denies lifetime Golden Visa eligibility for Indians, Bangladeshis; dismisses ₹23 lakh reporthttps://t.co/FcxxTHOnpx— Hindustan Times (@htTweets) July 9, 2025ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఓఓ మనోడే..‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా 600 522 222 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది. -
కీలక ఉత్పత్తిపై ట్రంప్ 50 శాతం సుంకం
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ దిగుమతి చేసుకునే కాపర్‌పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం తెలియజేయలేదు.ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్‌కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్‌లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్ కాపర్ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.ఫార్మాపై కూడా..అమెరికా ప్రస్తుతం తన కాపర్ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్‌పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ట్రంప్ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్కాపర్పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్‌లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు. -
దేశాలు పిలుస్తున్నాయ్..
మనలో చాలామంది ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి వారికి కొంత కష్టం కావొచ్చుకానీ, ధనవంతులకు మాత్రం సులువే. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చాలా దేశాలు వాటి సిటిజన్‌షిప్ నియమాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత మొన్నామధ్య ఆ దేశ పౌరసత్వం పొందాలంటే గోల్డ్‌కార్డు వీసా తీసుకోవాలని దాన్ని ప్రదర్శించారు. డబ్బు కడితే చాలా దేశాల పౌరసత్వం కార్డు మీ జేబులో ఉంటుంది. ఈ లిస్ట్‌లో కేవలం యూఎస్‌తోపాటు చాలా దేశాలే ఉన్నాయి. ప్రధానంగా ఏయే దేశాలు తమ పౌరసత్వం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టాయో తెలుసుకుందాం.యూఎస్ఏఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డు వీసాలు ప్రారంభించింది. సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కొత్త గోల్డెన్ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు)తో పొందాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.జన్మతః పౌరసత్వాన్ని గుర్తించరు..ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దాంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చి వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.సింగపూర్ గోల్డెన్ వీసావ్యాపార అవకాశాలు, అధిక జీవన నాణ్యతను కోరుకునే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు సింగపూర్ గమ్యస్థానంగా తోస్తుంది. సింగపూర్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ (జీఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం కల్పిస్తున్నారు. దేశంలో శాశ్వత ఉనికిని చాటుకోవాలనుకునే అల్ట్రా-హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) కోసం ఈ వీసా ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ వీసా ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 9–12 నెలలుగా ఉంటుంది. జీఐపీలో పౌరసత్వం పొందాలంటే కనీసం 10 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ.67 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జీఐపీకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. టెక్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ వంటి ఆమోదించబడిన రంగాల్లో ఒకదానిలో బిజినెస్ చేస్తుండాలి.పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే..గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ కింద పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) హోదా పొందిన రెండేళ్ల తర్వాత, దరఖాస్తుదారులు ప్రత్యేకంగా సింగపూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో కీలకమైన షరతు ఉంది. సింగపూర్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అందువల్ల ఆ దేశ పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాలి.ప్రయోజనాలుసింగపూర్ గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ పెట్టుబడిదారులకు అందించే వీసా ఉంటే 190కి పైగా దేశాలకు ప్రత్యేకంగా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్‌లో గరిష్టంగా 24% వరకు మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి వైద్యం, విద్య, ఉన్నత జీవన ప్రమాణాలకు సింగపూర్ కీలకంగా మారింది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంయూకేయూకేలో ఈ గోల్డ్‌కార్డ్ వీసాను అధికారికంగా ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాగా పిలుస్తారు. పెట్టుబడిదారులను, ప్రతిభావంతులైన ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి యూకే ప్రయత్నాల్లో భాగంగా 2020లో ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఇది యూకేలో వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత శాశ్వత నివాసానికి ఇండెఫినెట్ లీవ్ టు రిమేన్(ఐఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐఎల్ఆర్ ప్రక్రియలో దరఖాస్తుదారులు కనీసం 5 సంవత్సరాలు (ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాపై గడిపిన సమయంతో సహా) యూకేలో నివసించినట్లు రుజువు చేయాలి. ఇతర నివాస, ఆదాయ ప్రమాణాలను చేరుకోవాలి. వ్యాపారంలో కనీసం 50000 పౌండ్లు(రూ.58,29,000) పెట్టుబడి పెట్టాలి.ఈ వీసాకు అర్హతలు..ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆమోదం పొందాలి. యూకే ప్రభుత్వం గుర్తించిన బిజినెస్ ఇంక్యుబేటర్, ఇన్వెస్టర్ ద్వారా ఆమోదం పొందాలి. మీ వ్యాపార ఆలోచన సృజనాత్మకమైనదని, ఆచరణీయమైనదని ఆ ఈ సంస్థ ధ్రువీకరించాలి. దరఖాస్తుదారులు బీ2 స్థాయి ఇంగ్లిష్ (సీఈఎఫ్ఆర్ స్కేల్) కలిగి ఉండాలి. ఇది అప్పర్ ఇంటర్మీడియట్ నైపుణ్యానికి సమానం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు. -
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యురోపియన్ యూనియన్యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలువచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు.2026: 164,850 వర్క్ పర్మిట్లు2027: 166,350 వర్క్ పర్మిట్లు2028: 166,350 వర్క్ పర్మిట్లుసిబ్బంది అవసరమయ్యే రంగాలు..దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.వ్యవసాయంనిర్మాణ రంగంఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)టూరిజంతయారీ రంగంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తో సహా డిజిటల్ సేవల రంగం.పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.ఎందుకు ఇలా చేస్తోందంటే..లేబర్ కొరతఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.జనాభా సంక్షోభంఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్‌లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉంది.ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్ చేయండివీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలుజాబ్ ఆఫర్ లెటర్ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్ పర్మిట్)వీసా దరఖాస్తు ఫారంపాస్పోర్ట్ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్ లేదా స్పాన్సర్ లెటర్ ఉండవచ్చు.హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.ఇటలీలో డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాలుస్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లుమెకానికల్ హెల్పర్లుసేఫ్టీ ఆఫీసర్లుహెల్త్ కేర్: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లుడిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్వేర్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.ఇదీ చదవండి: టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్..బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్‌లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. -
ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తాజాగా 54 పైసలు పతనమైంది. దాంతో 85.94 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 85.53 వద్ద ప్రారంభమైంది. తదుపరి 85.51–86.03 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ కరెన్సీలతో డాలరు బలపడటం, యూఎస్ టారిఫ్‌ల గడువు దగ్గరపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయా దేశాలపై 10% అదనపు డ్యూటీలను విధించనున్నట్లు ప్రకటించడం సైతం రూపాయిపై ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.25 శాతం పుంజుకుని 97.41కు చేరింది. రూపాయి విలువ ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’టారిఫ్‌లు వేయడం రూపాయికి ప్రతికూలంగా మారుతుంది. ఎగుమతులు తగ్గిపోతాయి.కొత్తగా ఇతర దేశాలతో చేసుకునే కాంట్రాక్ట్‌లు రూపాయి విలువకు ఊతం ఇస్తాయి.భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాటి ధరలు పెరగడం నెగిటివ్‌గా ఉంటుంది.ఆర్బీఐ జోక్యం చేసుకొని రూపాయి విలువను స్థిరీకరిస్తుంది.గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది.ట్రంప్ టారిఫ్ వైఖరి మళ్లీ కఠినతరంగా మారితే లేదా భారత్ విస్తృత వాణిజ్య ఉద్రిక్తతల్లోకి వెళితే రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. -
జీఎస్టీ మూడు శ్లాబులకు తగ్గాలి
దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.4–6.7 శాతం మేర వృద్ధి చెందుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ అనిశి్చతుల రిస్క్ నెలకొన్పప్పటికీ, బలమైన దేశీ డిమండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని అభిప్రాయపడ్డారు. సీఐఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెమానీ మీడియాతో మాట్లాడారు.రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, వ్యవస్థలో నగదు లభ్యత పెంచే దిశగా ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఒక శాతం, రెపో రేటును అరశాతం తగ్గిస్తూ ఆర్బీఐ జూన్ మొదట్లో నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. సీఆర్ఆర్ తగ్గించడం వల్ల వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల నిధుల లభ్యత పెరగనుంది. విదేశీ వాణిజ్యపరమైన రిస్క్లున్నాయంటూ.. అవి తటస్థం చెందుతాయని అంచనా వేస్తున్నట్టు మెమానీ చెప్పారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వృద్ధికి ప్రతికూలంగా మారినా దేశీ డిమాండ్ ఆదుకుంటుందన్నారు. జీఎస్టీ మరింత సరళం.. మూడు సులభతర శ్లాబులతో జీఎస్టీని మరింత సులభంగా మార్చాలని మెమానీ కోరారు. నిత్యావసరాలను 5 శాతం రేటు కింద, విలాసవంతమైన, హానికర వస్తువులను 28 శాతం రేటులో, మిగిలిన వస్తువులన్నింటినీ 12–18 శాతం మధ్య ఒక రేటు కిందకు తీసుకురావాలని సూచించారు. 28 శాతం రేటు అమలవుతున్న సిమెంట్ తదితర కొన్నింటిని తక్కువ రేటు కిందకు తీసుకురావాలన్నారు. అలా చేయడం ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్త ఏకాభిప్రాయం అవసరమన్నారు. -
‘జేన్ స్ట్రీట్’ స్కామ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్ సంస్థ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయకుండా గ్రూప్ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్‌లో భాగమైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రూప్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్‌లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్ గ్రూప్ సందేహాస్పద ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్ఎస్ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్ఎస్ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్ గ్రూప్ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్‌పీఐలు, మార్కెట్ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్ గ్రూప్‌ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్ గ్రూప్ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్ గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్ గ్రూప్ ట్రేడింగ్ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్ ఆప్షన్లలో ట్రేడింగ్ ద్వారా జేఎస్ గ్రూప్ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 191 కోట్లు, క్యాష్ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్స్‌లో ట్రేడింగ్ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్ గ్రూప్’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్ గ్రూప్ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్‌ను షార్ట్ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్ షార్ట్ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్‌పై ప్రభావం.. జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలను మార్కెట్ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్ వాల్యూమ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్‌లో జేన్ స్ట్రీట్ లాంటి ట్రేడింగ్ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్–ఆస్క్ స్ప్రెడ్ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్ తెలిపారు. స్టాక్స్ కుదేలు.. జేఎస్ గ్రూప్‌పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్ఈలో నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 11.26%, స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ షేరు 6%, బీఎస్ఈ షేరు 6.42%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్ గ్రూప్‌పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.ఏమిటీ జేన్ స్ట్రీట్.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000లో ట్రేడింగ్ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్లో ఇది భారత్‌లో కార్యకలాపాలు ఆరంభించింది. -
జోరు చూపించిన సేవల రంగం
సేవల రంగం జూన్ నెలలో బలమైన పనితీరు చూపించింది. ఇందుకు నిదర్శనంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజెనెస్ యాక్టివిటీ ఇండెక్స్ పది నెలల గరిష్ట స్థాయిలో 60.4 పాయింట్లకు చేరింది. మే నెలలో ఇది 58.8 పాయింట్ల వద్ద ఉంది. స్థానిక మార్కెట్ నుంచే కాకుండా ఎగుమతి మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు దోహదం చేసింది. వ్యయాలు తగ్గడం మార్జిన్ల విస్తరణకు దోహదం చేసినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.2024 ఆగస్ట్ తర్వాత తొలిసారి కొత్త ఆర్డర్లు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. దేశీ మార్కెట్లో కార్యకలాపాలు పెరగడం, ఎగుమతులు వృద్ధి చెందడం మెరుగైన పనితీరుకు సాయపడ్డాయి. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం, యూఎస్ మా ర్కెట్ల నుంచి డిమాండ్ అధికమైందని భండారీ అంచనా వేశారు. వరుసగా 37వ నెలలోనూ జూన్‌లో ఉపాధి అవకాశాలు పెరిగినట్టు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో వృద్ధి పట్ల 18% సేవల రంగ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. 2022 తర్వాత చూస్తే ఇదే కనిష్ట స్థాయి.ఇదీ చదవండి: ‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’61పాయింట్లకు కాంపోజిట్ ఇండెక్స్తయారీ, సేవల రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 61 పాయింట్లకు పెరిగింది. మే నెలలో ఇది 59.3గా ఉంది. 14 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. -
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్‌ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది. -
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫండ్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సుమారు 22 మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏడాది కాలంలో 37 శాతం వృద్ధితో రూ.48,000 కోట్లకు చేరుకున్నాయి. 2024 మే చివరికి వీటి నిర్వహణ ఆస్తులు రూ.34,971 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోని పథకాలు మంచి పనితీరు చూపించడం ఏయూఎంలో బలమైన వృద్ధికి కారమైనట్టు తెలుస్తోంది. ఈ పథకాలు గత ఏడాది కాలంలో పెట్టుబడులపై 22 శాతం నుంచి 30 శాతం వరకు రాబడులను అందించడం గమనార్హం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న దీర్ఘకాల విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఎస్ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 14 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో ప్రధాన సూచీ సెన్సెక్స్ పెరుగుదల 10 శాతంగానే ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగంలో బీమా, ఫిన్‌టెక్, వెల్త్ మేనేజ్మెంట్, డిజిటల్‌గా రుణాలు అందించే అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనూ ఈ తరహా ఫండ్స్ పెట్టుబడులు పెడుతుండడం ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితంగా మారుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం విస్తరిస్తుండడంతో ఈ విభాగంలో బలమైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలంలో మంచి పెట్టుబడుల అవకాశాలను ఈ రంగం ఆఫర్ చేస్తోంది’’అని వెల్త్ మేనేజర్ అల్ఫాషా పేర్కొన్నారు. -
12 శాతం శ్లాబ్‌ను ఎత్తివేసే యోచనలో జీఎస్టీ?
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను హేతుబద్ధీకరించాలనే వాదనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతంగా ఉన్న శ్లాబ్‌ను పూర్తిగా తొలగించడం అనే కీలక ప్రతిపాదన చర్చలో ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ విధించే వస్తువుల్లో చాలా వరకు సాధారణ పౌరులు దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అధికంగా వినియోగించే ఉత్పత్తులు ఈ శ్లాబ్‌లో ఉన్నాయి. కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రణాళికలో భాగంగా ఈ వస్తువులను తక్కువగా 5% పన్ను పరిధిలో వర్గీకరించాలని యోచిస్తోంది. తుది వినియోగదారులకు ఆయా వస్తువులను చౌకగా అందించాలనే లక్ష్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.ప్రభుత్వం 12% శ్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి ఆయా వస్తువుల్లో కొన్నింటిని ప్రస్తుతం దాని కంటే తక్కువగా ఉన్న 5% శ్లాబ్, కొన్నింటిని ఎక్కువగా 18% శ్లాబులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రొటోకాల్ ప్రకారం మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు 15 రోజుల నోటీసు అవసరం. అయితే ఈ నెలాఖరులో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌కు పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేసే అధికారం ఉంది.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’12 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోని వస్తువుల వివరాలు..ప్రాసెస్డ్ ఫుడ్: పాలు, జున్ను, వెన్న, నెయ్యి, ఫ్రోజెన్ మీట్.డ్రైఫ్రుట్స్, గింజలు: బాదం, పిస్తా, అంజీర, ఖర్జూరంనూనెలు: ఫిష్ ఆయిల్, లానోలిన్, పౌల్ట్రీ కొవ్వు.టెక్స్టైల్, దుస్తులు: రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, సింథటిక్ నూలుఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, కంప్యూటర్ ఉపకరణాలుట్రావెల్ & హాస్పిటాలిటీ: బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం, నాన్ ఏసీ హోటళ్లునిర్మాణ సామగ్రి: సిరామిక్ టైల్స్, శానిటరీ వేర్ -
14 నెలల గరిష్టానికి తయారీ రంగం
తయారీ రంగం జూన్‌లో బలమైన పనితీరు చూపించింది. ఈ రంగంలో పనితీరును తెలియజేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్ నెలలో 58.4 పాయింట్లుగా నమోదైంది. మే నెలలో ఇది 57.6గా ఉంది. డిమాండ్ బలంగా ఉండడంతోపాటు కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం ఉత్పత్తి విస్తరణకు, ఉపాధి కల్పనకు దారితీసినట్టు హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.ఇదీ చదవండి: 11 మంది టాప్ ఎక్స్‌పర్ట్‌లతో మెటా కొత్త ల్యాబ్తయారీ రంగంలో విస్తరణ ఏడాది కాలంలోనే గరిష్టంగా ఉన్నట్టు చెప్పారు. కంపెనీల నిల్వలు తగ్గుతున్నట్టు పేర్కొన్నారు. మార్కెటింగ్ చర్యలకుతోడు, ఎగుమతులు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. బలమైన అమ్మకాలు తయారీ కంపెనీల్లో నియామకాల పెరుగుదలకు దారితీసినట్టు, రికార్డు స్థాయిలో ఉపాధి కల్పనకు దోహదపడినట్టు పేర్కొన్నారు. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగాను, ఆ దిగువన నమోదైతే తగ్గినట్టుగాను పరిగణిస్తారు. -
ఎస్బీఐ కస్టమర్లకు డిజిటల్ దన్ను!
న్యూఢిల్లీ: ఎస్బీఐ గత దశాబ్ద కాలంలో చేపట్టిన డిజిటల్ అభివృద్ధి (పూర్తి స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం) కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి ఎస్బీఐ సేవలు అందించడం ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా చేసే ప్రయాణంలో ఎస్బీఐ ఇకముందూ కొత్త ఆవిష్కరణలతో ప్రజా సాధికారతకు చేయూతనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.‘‘23,000కు పైగా శాఖలు. 78,000 కస్టమర్ సరీ్వస్ పాయింట్లు (సీఎస్పీలు), 64,000 ఏటీఎంలతో ఎస్బీఐ ఎంతో బలమైన స్థానంలో నిలిచింది. ప్రతి భారతీయుడికి అచ్చమైన బ్యాంక్’’అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై సీతారామన్ పోస్ట్ చేశారు. 1.5 కోట్ల మంది రైతులను ఆదుకోవడంలో, 1.3 కోట్ల మంది మహిళా స్వయం సహాయక గ్రూపులకు, పీఎం స్వనిధి కింద 32 లక్షల మంది వీధి వర్తకులకు, 23 లక్షల మంది ఎంఎస్ఎంఈలకు, చేతివృత్తుల వారికి వివిధ పథకాల కింద సహకారం అందించడంలో ఎస్బీఐ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. 15 కోట్ల జన్‌ధన్ ఖాతాలు, 14.65 కోట్ల పీఎం సురక్షా బీమా యోజన, 1.73 కోట్ల అటల్ పెన్షన్ యోజన, 7 కోట్ల పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన లబ్ధిదారులకు ఎస్బీఐ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. 40 లక్షల ఇళ్లకు సౌర కాంతులు 2027 మార్చి నాటికి 40 లక్షల గృహాలకు సౌర వెలుగులు అందించనున్నట్టు 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. సిబ్బంది, టెక్నాలజీ, సదుపాయాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని తెలియజేస్తూ.. తద్వారా కోట్లాది మంది కస్టమర్లకు వేగవంతమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించనున్నట్టు చెప్పారు. కేవలం విస్తరణ దృష్టితో కాకుండా దీర్ఘకాలంలో ప్రతి ఒక్క భాగస్వామికి విలువ చేకూర్చేందుకు, మరింత సమానత్వంతో కూడిన, బలమైన భవిష్యత్ దిశగా దేశం సాధికారత సాధించేందుకు ఎస్బీఐ కృషి చేస్తుందని ప్రకటించారు. రూ.66 లక్షల కోట్ల బ్యాలెన్స్ïÙటు, 52 కోట్లకు పైగా కస్టమర్లతో ఎస్బీఐ.. సుస్థిరత, డిజిటల్ ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధిపై దృష్టితో ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. ఎస్బీఐ 1955 జూలై 1న సేవలు ప్రారంభించడం గమనార్హం. -
జీఎస్టీ వసూళ్లు భళా!
న్యూఢిల్లీ: స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూన్‌లో రూ. 1.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్‌లో నమోదైన రూ. 1,73,813 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం అధికం. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 2.01 లక్షల కోట్లు. ఏప్రిల్‌లో ఇవి రికార్డు స్థాయి గరిష్టమైన రూ. 2.37 లక్షల కోట్లకు ఎగిశాయి. ‘నిబంధనల భారాన్ని తగ్గించి, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపారాల నిర్వహణను గణనీయంగా మెరుగుపర్చేందుకు జీఎస్టీ దోహదపడింది.ఈ ప్రస్థానంలో సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా రాష్ట్రాలను కూడా సమాన భాగస్వాములుగా చేయడంతో పాటు ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన చోదకంగా మారింది‘ అని జీఎస్టీని ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.జూన్ గణాంకాల ప్రకారం .. ⇒ జూన్‌లో దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 4.6 శాతం పెరిగి రూ. 1.38 లక్షల కోట్లకు, దిగుమతులపై రూ. 11.4 శాతం పెరిగి రూ. 45,690 కోట్లకు చేరాయి. ⇒ స్థూల కేంద్ర జీఎస్టీ ఆదాయాలు రూ. 34,558 కోట్లుగా, రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు రూ. 43,268 కోట్లుగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 93,280 కోట్లుగా, సెస్సుల నుంచి ఆదాయం రూ.13,491 కోట్లుగా నమోదయ్యాయి. ⇒ జూన్‌లో మొత్తం రిఫండ్లు 28 శాతం పెరిగి రూ. 25,491 కోట్లకు, నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయి.ఐదేళ్లలో డబుల్...⇒ 2024–25లో రూ.22.08 లక్షల కోట్లు ⇒ 2020–21లో ఇవి రూ.11.37 లక్షల కోట్లే ⇒ 150 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులువస్తు సేవల పన్ను రూపంలో (జీఎస్టీ) ఆదాయం గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో రెట్టింపైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జీఎస్టీ రూపంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదా యం సమకూరింది. అంతకుముందు ఆర్థి క సంవత్సరం (2023–24)లో ఆదాయం రూ.20.18 లక్షల కోట్లతో పోల్చితే 9.4 శాతం పెరిగింది. కాగా, 2017 జూలై 1న తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలో జీఎస్టీ వసూళ్లు రూ.7.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం రూ.11.37 లక్షల కోటత్లో పోల్చితే రెట్టింపైంది.2022–23 సంవత్సరంలో రూ.18.08 లక్షల కోట్లు, 2021–22లో రూ.14.83 లక్షల కోట్ల ఆదాయం వసూలైంది. 2024–25 సంవత్సరంలో నెలవారీ సగటు ఆదాయం రూ.1.84 లక్షల కోట్ల చొప్పున ఉంది. 2023–24లో ఇది 1.68 లక్షల కోట్లుగా ఉంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, 8 వసంతాలను పూ ర్తి చేసుకుంది. ఈ ఎనిమిదేళ్లలో జీఎస్టీ కింద పన్ను చెల్లింపుదారులు 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగారు. 17 రకాల స్థానిక పన్నులు, 13 రకాల సెస్సుల స్థా నంలో 5 రకాల పన్ను శ్లాబులతో జీఎస్టీ ని తీసుకురావడం తెలిసిందే. 2025 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.2.37 లక్షల కోట్లు నెలవారీ అత్యధిక రికార్డుగా ఉంది. -
ఆదుకున్న ఆర్బీఐ భారీ డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 0.8 శాతంగా (రూ.13,163 కోట్లు) ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఆర్బీఐ నుంచి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ రావడం ఇందుకు అనుకూలించింది. డివిడెండ్, ప్రాఫిట్స్ కింద ప్రభుత్వం రూ.2.78 లక్షల కోట్లను అందుకున్నట్టు సీజీఏ తెలిపింది.2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకే చూస్తే ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 11.9 శాతం (రూ.1.86 లక్షల కోట్లు)గా ఉండడం గమనించొచ్చు.ఏప్రిల్, మే నెలలకు కలిపి రూ.3.5 లక్షల కోట్ల పన్నుల రూపంలో, రూ.3.56 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో సమకూరింది. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ రూపంలో రూ.25,224 కోట్లు వచ్చింది. వ్యయాలు రూ.7.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
వస్తు సేవల పన్ను విజయాల పరంపర
భారత్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1, 2017న ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక ఏకీకరణ దిశగా సాహసోపేతమైన అడుగు పడిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల తరువాత 2025లో జీఎస్టీ విధానం దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పారదర్శకతను పెంచడం, వృద్ధిని పెంపొందించేందుకు విలువ ఆధారిత పన్నులు(వ్యాట్) స్థానంలో జీఎస్టీని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి నేటి వరకు జీఎస్టీ సాధించిన కొన్ని విజయాల గురించి తెలుసుకుందాం.ఒకే దేశం, ఒకే పన్నుజీఎస్టీ అమలు ద్వారా 17 వేర్వేరు పన్నులు, 13 సెస్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దాంతో గతంలో రాష్ట్రాల్లో ఉన్న పరోక్ష పన్నుల భారం తొలగిపోయింది. ఈ సమన్వయం ఒక ఉమ్మడి జాతీయ విధానాన్ని సృష్టించింది. లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గించింది. రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసింది.రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 9.4 శాతం పెరిగి చరిత్రాత్మకంగా రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన యంత్రాంగాలు, భారతదేశం క్రమంగా విస్తరిస్తున్న ఆర్థిక కార్యకలాపాల కారణంగా నెలవారీ వసూళ్లు ప్రస్తుతం సగటున రూ.1.84 లక్షల కోట్లుగా ఉంది.ట్యాక్స్ నమోదులో పెంపుఏప్రిల్ 2025 నాటికి జీఎస్టీ 1.51 కోట్లకు పైగా యాక్టివ్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్.. వంటివాటిని పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా దేశాన్ని మరింత పారదర్శక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.డిజిటల్ ఫైలింగ్జీఎస్టీ విధానం పన్ను సమ్మతిని మరింత సులభతరం చేసింది. కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ఎంపీ (క్వార్టర్లీ రిటర్న్స్ విత్ మంత్లీ పేమెంట్) వంటి పథకాలతో రిటర్నులను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా ఈ విధానాల ద్వారా చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎంతో మేలు జరుగుతోంది.సహకార విధానంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నుల వ్యవస్థను నడిపించేలా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు 55కి పైగా సమావేశాలు నిర్వహించింది. ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక సహకారాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేలా వీలు కల్పించింది.ఇదీ చదవండి: అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదలసవాళ్లు లేవా..జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చినప్పటికీ రేట్ల సరళీకరణ, కాంప్లయన్స్ లోపాలను పరిష్కరించడం, ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి సవాళ్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఈ వ్యవస్థ మరింత సమర్థవంతమైన, ఏకీకృత, పారదర్శక పన్ను విధానానికి పునాది వేస్తుంది. -
భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా?
అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఈ వారంలోనే ఖరారు చేసేందుకు భారత్ చొరవ చూపుతోంది. ఈమేరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ డీల్ పూర్తయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికా-ఇండియా మధ్య కుదిరే తొలి కీలక ఒప్పందం అవుతుంది. ఇప్పటికే యూఎస్ చైనాతో వాణిజ్యం ఒప్పందంపై ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇండియా- యూఎస్ మధ్య చర్చలు కీలక దశలో ఉన్నందున భారత సంధానకర్తలు జూన్ 27న ముగిసిన రెండు రోజుల పర్యటనను మరింతకాలం పొడిగించినట్లు తెలుస్తుంది.భారత వస్తువులపై అమెరికా 26% పరస్పర సుంకం విధించనున్న నేపథ్యంలో జులై 9 లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు పక్షాలు చూస్తున్నాయి. ఈ సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్‌లో మొదట ప్రకటించి 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే ఒప్పందంపై అనేక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ కీలకంగా కొన్నింటిపై విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. వ్యవసాయం, జన్యుమార్పిడి (జీఎం) పంటలు, పాల ఉత్పత్తుల్లో మార్కెట్ యాక్సెస్ సహా కొన్ని సున్నితమైన రంగాలపై రాజీపడే ప్రసక్తే లేదని భారత అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘ఇండియాలో సమయం విలువ తెలియని వారే ఎక్కువ’ఈ అంశాలు భారతీయ రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. వీరిలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. భారత్‌కు భారీ నష్టం వాటిల్లే పనులు అధికారులు చేయబోరని, ఈ అంశాల్లో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జన్యుమార్పిడి పంటలు, పశువుల దాణా, పాడి, వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిలో భారత మరింత వెసులుబాటు కల్పించాలని యూఎస్ ఒత్తిడి తెస్తోంది. పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోకెమికల్స్, వైన్లపై సుంకాలను తగ్గించాలని అమెరికా కోరుతోంది.లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు ఉపశమనంమరోవైపు టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, జెమ్స్ అండ్ జువెలరీ, కెమికల్స్, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటి వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకం రాయితీల కోసం భారత్ చర్చలు జరుపుతోంది. ట్రంప్ ప్రకటించిన అదనపు 26% సుంకాల నుంచి పూర్తి మినహాయింపు కోసం భారతదేశం ఒత్తిడి తెస్తోంది. అయినప్పటికీ బేస్‌లైన్ 10% సుంకం అమలులో ఉంది. విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)లో భాగంగా తొలి విడత బహుళ రంగాలను కవర్ చేయాలని భావిస్తున్నారు. మరింత వివరణాత్మక చర్చలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో మధ్యంతర ఒప్పందాన్ని దశలవారీగా రూపొందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పరిశ్రమలు.. నేల చూపు!
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి మే నెలలో 1.2 శాతానికి పరిమితమైంది. 2024 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ముందస్తు వర్షాల రాకతో తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు నిదానించడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. 2024 మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6.3 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి ఐఐపీ వృద్ధి రేటు 2.7 శాతంగా కాగా, దీన్ని 2.6 శాతానికి ఎన్ఎస్వో సవరించింది. → తయారీ రంగంలో వృద్ధి మే నెల 2.6%కి పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో వృద్ధి 5.1%. → మైనింగ్ రంగంలో ఉత్పత్తి మైనస్ 0.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగంలో వృద్ధి 6.6 శాతంగా ఉంది. → విద్యుత్ రంగంలో ఉత్పత్తి మైనస్ 5.8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 13.7 శాతం వృద్ధి నమోదైంది. → క్యాపిటల్ గూడ్స్ రంగంలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. 14.1 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది మే నెలలో వృద్ధి కేవలం 2.6 శాతంగానే ఉంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో పనితీరు మైనస్ 0.7 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 12.6 శాతం వృద్ధిని చూసింది. → కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలోనూ ఉత్పత్తి మైనస్ 2.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 7.6 శాతం వృద్ధి కనిపించింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.7 శాతంగా ఉంది. -
కార్యకలాపాలను విస్తరించి లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. తద్వారా మంచి రాబడులు అందుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల (పీఎస్‌బీలు)కు సంబంధించి సుమారు 15 సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) లేదా పెట్టుబడుల ఉపసంహరణకు రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.సబ్సిడరీలు లేదా జాయింట్ వెంచర్లకు సంబంధించి అవసరమైతే కార్యకలాపాల విస్తరణపై పీఎస్‌బీలు పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ సూచిస్తూ.. సరైన సమయంలో వాటాల విక్రయం ద్వారా లాభాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది. సబ్సిడరీలకు సంబంధించి పరిపాలన, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మెరుగుపరుచుకోవాలని, గొప్ప నిర్వహణ సామ ర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు.. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన ఎస్బీఐ నుంచి భవిష్యత్తులో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువల్ ఫండ్స్), జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ ఐపీవోకు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.509 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఎస్బీఐకి 68.99 వాటా ఉంది. ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్‌లో ఎస్బీఐకి 74 శాతం వాటా ఉంటే, హిటాచీ పేమెంట్ సర్విసెస్‌కు మిగిలిన 26 శాతం వాటా ఉంది.ఎస్బీఐ పేమెంట్ సర్విసెస్ కింద 33.10 లక్షల మంది మర్చంట్ టచ్ పాయింట్లు నమోదై ఉన్నాయి. ఇందులో 13.67 లక్షల పీవోస్ మెషిన్లు కూడా ఉన్నాయి. మరోవైపు కెనరా బ్యాంక్ తన మ్యూచువల్ ఫండ్స్ వ్యాపార జాయింట్ వెంచర్ అయిన కెనరా రొబెకో ఏఎంసీ లిస్టింగ్‌కు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. బీమా జాయింట్ వెంచర్ అయిన కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కూడా లిస్ట్ చేసే ప్రణాళికతో ఉంది. బీమా జేవీలో 14.5 శాతం వాటా విక్రయానికి అనుకూలంగా కెనరా బ్యాంక్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
నికర ఇంధన ఎగుమతిదారుగా భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుతం నికర ఇంధన దిగుమతిదారుగా ఉండగా, వచ్చే ఆరేళ్లలో నికర ఎగుమతిదారుగా అవతరిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా పేర్కొన్నారు. ఇధనాల్, బయోడీజిల్ తదితర బయో ఇంధనాలు, హైడ్రోజన్‌తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ అనుకూల ఇంధనాలకు మారడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, లాజిస్టిక్స్ వ్యయాలు కూడా దిగొస్తాయని మంత్రి చెప్పారు. అదే సమయంలో కొత్త రహదారుల నిర్మాణం వల్ల ఇంధన వ్యయాలు, లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు ఈ ఏడాది చివరికి 9 శాతానికి దిగిరానున్నట్టు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు ఆరు శాతం మేర తగ్గాయన్న ఒక సర్వే ఫలితాలను ప్రస్తావించారు. ‘‘నేడు చైనాలో లాజిస్టిక్స్ వ్యయాలు జీడీపీలో 8 శాతంగా ఉన్నాయి. అమెరికాలో, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉన్నాయి. అదే భారత్‌లో 16 శాతంగా ఉన్నాయి’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభసాటి అయిన బయో ఇంధనాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ.. ఎగుమతులను పెంచుకోవడం కోసం రవాణా వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
‘బ్యాంకులు అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి’
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ అర శాతం తగ్గించడాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని, ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. పీఎస్‌బీల రుణ వృద్ధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో లేదా అంతకు మించిన స్థాయిలో రుణ వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించినట్లు వారు వివరించారు. పీఎస్‌బీల ఆర్థిక పనితీరును సమీక్షించేందుకు ఆయా బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఆర్థిక సమ్మిళితత్వం సాధించేందుకు ప్రభుత్వ పథకాల్లో మరింత మంది కస్టమర్లను చేర్చేందుకు కృషి చేయాలని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనతక్కువ వ్యయాలతో కూడుకున్న డిపాజిట్లను సమీకరించే మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన తదితర పథకాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 12 పీఎస్‌బీల మొత్తం లాభం 26 శాతం వృద్ధి చెంది రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. -
ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన
ఆదాయ పన్ను రిటర్నుల స్క్రూటినీ విషయంలో సహేతుకమైన, నిర్దిష్టమైన ప్రశ్నలు వేయాలని, అసంబద్ధమైన ప్రశ్నలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) సూచించింది. ఈ విషయాల్లో అసెసింగ్ అధికారులను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ప్రాంతీయ హెడ్స్‌కి (ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ – పీసీసీఐటీ) పంపిన లేఖలో సీబీడీటీ చైర్మన్ రవి అగ్రవాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడునోటీసులు, అసెస్మెంట్ ఆర్డర్లు సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత ప్రత్యక్షంగా అసెస్మెంట్ యూనిట్ హెడ్స్ (అడిషనల్ లేదా జాయింట్ కమిషనర్లు) మీదే ఉంటుందని అగ్రవాల్ తెలిపారు. పీసీసీఐటీలు మధ్యమధ్యలో అసెసింగ్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉండాలని, సూచనలను పునరుద్ఘాటిస్తూ ఉండాలని, నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేసేందుకు ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని సీబీడీటీ పేర్కొంది. స్క్రూటినీ, అసెస్మెంట్ ఆర్డర్ల నాణ్యతకు సంబంధించి నెలవారీ అప్డేట్ ఇవ్వాలని సూచించింది. -
పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఆగస్టు నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించే విధానం అందుబాటులోకి రానుంది. డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో లావాదేవీలను నిర్వహించేందుకు ఉపయోగపడే ఐటీ మౌలిక సదుపాయాల కల్పన ఆగస్టు నాటికి అన్ని పోస్టాఫీసుల్లో పూర్తవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఐటీ 2.0 కింద కొత్త సిస్టం పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే కర్ణాటక సర్కిల్లో ప్రారంభమైందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: రెండు మెర్సిడెస్ బెంజ్ జీటీ సిరీస్‌లో స్పోర్ట్స్ కార్లుమైసూర్ హెడ్ ఆఫీస్, బాగల్కోట్ హెడ్ ఆఫీసు మొదలైన ప్రాంతాల్లో క్యూఆర్ ఆధారిత బుకింగ్ సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించాయి. యూపీఐ వ్యవస్థతో పోస్టాఫీసుల ఖాతాలు అనుసంధానం కాకపోవడం వల్ల ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వెసులుబాటు ఉండటం లేదు. గతంలో సేల్ కౌంటర్స్‌లో స్టాటిక్ క్యూఆర్ కోడ్‌ను పోస్టల్ శాఖ ప్రవేశపెట్టినప్పటికీ, పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానాన్ని నిలిపివేసారు. -
క్యూ4లో కరెంట్ ఖాతా మిగులు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25) చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి/క్యూ4) కరెంటు ఖాతా 13.5 బిలియన్ డాలర్ల (రూ.1.15 లక్షల కోట్లు) మిగులులోకి వచ్చినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఇది జీడీపీలో 1.3 శాతానికి సమానం. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంటు ఖాతా 4.6 బిలియన్ డాలర్ల మిగులుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే కరెంటు ఖాతా లోటు 23.3 మిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.6 శాతం) ఉంది. 2023–24లో కరెంటు ఖాతా లోటు 26 బిలియన్ డాలర్లు (జీడీపీలో 0.7 శాతం) కావడం గమనించొచ్చు. వస్తువులకు సంబంధించి వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 59.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 52 బిలియన్ డాలర్లుగానే ఉంది. సేవలకు సంబంధించి నికర మిగులు 53.3 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 42.7 బిలియన్ డాలర్ల మేర ఉంది. బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ క్యూ4లో బిలియన్ డాలర్ల (రూ.8,400 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎఫ్‌డీఐ 10.2 బిలియన్ డాలర్లతో పోలి్చచూస్తే గణనీయంగా తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు క్యూ4 లో నికరంగా 5.9 బిలియన్ డాలర్ల మేర బయటకు వెళ్లిపోయాయి. విదేశీ మారకం నిల్వలు క్యూ4లో 8.8 బిలియన్ డాలర్ల మేర నికరంగా పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ పెరుగుదల 30.8 బిలియన్ డాలర్లుగా ఉంది. విదేశీ రుణం 736 బిలియన్ డాలర్లు ప్రభుత్వ విదేశీ రుణ భారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే 10 శాతం పెరిగి 736.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2024 మార్చి నాటికి ఇది 668.8 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీలో విదేశీ రుణ భారం 18.5 శాతం నుంచి 19.1 శాతానికి పెరిగింది. -
రేట్ల కోతను వేగంగా బదిలీ చేయాలి: ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును ఈ నెల మొదట్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా (0.50 శాతం), దీన్ని వేగంగా రుణ గ్రహీతలకు బదలాయించాలంటూ ఆర్బీఐ బులెటిన్ సూచించింది. బ్యాంక్‌లు వెంటనే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించాలని కోరింది. వాస్తవానికి చాలా బ్యాంక్‌లు ఇప్పటికే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించడం గమనార్హం.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లురుణ రేట్లను వేగంగా బదలాయించడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యంక్‌లు వేగంగా బెంచ్‌మార్క్ లెడింగ్ రేటు ఆధారిత రుణ రేట్లను సవరించాయి కూడా. రెపో రేటుతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని సైతం (సీఆర్ఆర్) అర శాతం మేర తగ్గిస్తూ ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. సీఆర్ఆర్ కోతతో బ్యాంకింగ్ రంగంలోకి రూ.2.5 లక్షల కోట్ల మేర అదనపు నగదు లభ్యత అందుబాటులోకి వచ్చినట్లయింది. -
కీలక ఖనిజాలపై పీఎస్‌యూల కన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల కోసం చేతులు కలపనున్నాయి. తద్వారా మినీరత్న సీపీఎస్ఈ హిందుస్తాన్ కాపర్.. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులకు బిడ్ చేయనుంది. ఇందుకు ఇతర పీఎస్‌యూ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), గెయిల్ (ఇండియా), రైల్వే రంగ సంస్థ రైట్స్‌తో జత కట్టనున్నట్లు హిందుస్తాన్ కాపర్ చైర్మన్, ఎండీ సంజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఐవోసీ, గెయిల్‌తో హిందుస్తాన్ కాపర్ తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. కాపర్ బ్లాకులతోపాటు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులను ప్రభుత్వం వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటన్నిటికీ కంపెనీ బిడ్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో చిలీలో కాపర్సహా ఇతర కీలక ఖనిజాల అన్వేషణ కోసం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే ఈ నెల మొదట్లో రైల్వే రంగ ఇంజినీరింగ్ పీఎస్‌యూ రైట్స్‌తో ఒప్పందానికి తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా దేశ, విదేశీ మార్కెట్ల కోసం సంయుక్తంగా కీలక ఖనిజాల సరఫరా చైన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశ, విదేశాలలో కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టనున్నట్లు వివరించారు. మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సైతం అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కంపెనీ దేశీయంగా రాగి గనుల మైనింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
మైనస్‌లోకి అమెరికా జీడీపీ
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి/క్యూ1) అంచనాలకు మించి క్షీణతను చవిచూసింది. ట్రంప్ గందరగోళ వాణిజ్య విధానాలతో వ్యాపారపరమైన అనిశి్చతులకుతోడు బలహీన వినియోగ డిమాండ్ ప్రభావం చూపించాయి. జీడీపీ మైనస్ 0.5 శాతానికి పడిపోయినట్టు అమెరికా వాణిజ్య శాఖ తన మూడవ, తుది అంచనాలను ప్రకటించింది. ద్వితీయ అంచనాల్లో క్షీణత 0.2 శాతంగానే ఉండొచ్చన్న వాణిజ్య శాఖ అంచనాలను మించి ఆర్థిక వ్యవస్థ కుంగుబాటునకు గురైంది. మూడేళ్లలోనే మొదటిసారి అమెరికా జీడీపీ మైనస్‌లోకి వెళ్లినట్టయింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే కీలకమైన వినియోగదారుల వ్యయం నిదానించినట్టు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం 1.2 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇది 0.5 శాతానికి పరిమితమైంది. 2024 చివరి త్రైమాసికంలోనూ వినియోగం 4 శాతం వృద్ధిని చూసింది. నాలుగేళ్లలోనే ఒక త్రైమాసికం పరంగా ఇది అతి తక్కువ వినియోగం కావడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ట్రంప్ టారిఫ్‌లు సైతం ప్రభావం చూపించాయి. టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందే పెద్ద మొత్తంలో దిగుమతులకు అక్కడి సంస్థలు మొగ్గు చూపించాయి. 2024 చివరి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. -
చైనా ప్రొడక్ట్‌లపై యాంటీ–డంపింగ్ సుంకం
వెల్లువెత్తే చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీ సంస్థల ప్రయోజనాలను కాపాడే దిశగా ఈ నెలలో ఇప్పటివరకు ఆరు చైనా ఉత్పత్తులపై కేంద్రం యాంటీ–డంపింగ్ సుంకం విధించింది. పీఈడీఏ, ఎసిటోనైట్రైల్ (ఫార్మా రంగంలో ఉపయోగిస్తారు), విటమిన్–ఏ పామిటేట్, డెకోర్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.పరిశ్రమల్లో ఉపయోగించే ఈ ముడిసరుకులపై అయిదేళ్ల పాటు సుంకాలు ఉంటాయని వేర్వేరు నోటిఫికేషన్లలో కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ తెలిపింది. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దిగుమతి సుంకాలు ఉత్పత్తిని బట్టి కేజీకి 20.87 డాలర్ల నుంచి టన్నుకు 2,017.9 డాలర్ల వరకు ఉంటాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరింది. చైనాకు ఎగుమతులు 14.5 శాతం క్షీణించి 14.25 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, దిగుమతులు 11.52 శాతం పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. -
టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?
ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం జులై 15 నుంచి టోల్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు సామాజిక మాధ్యమాలు, పలు మీడియా కథనాల్లోవార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలపై ఛార్జీలు వేసే అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు జాతీయ రహదారులపై టోల్ ఫ్రీ సదుపాయం ఎప్పటిలాగే కొనసాగుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేసింది.#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews— NHAI (@NHAI_Official) June 26, 2025ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్ఫాస్టాగ్ ఆధారిత టోల్ ఛార్జీలు ద్విచక్ర వాహనాలకు సైతం అమలు చేస్తారని సోషల్‌మీడియాలో సమాచారం వైరల్‌గా మారింది. దాంతో ఎన్హెచ్ఏఐ ఈమేరకు స్పష్టతనిచ్చింది. మొదట టూవీలర్లపై టోల్ ఛార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన అసత్య వార్తలవల్ల ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందారు. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ విషయంపై ఎటువంటి విధాన మార్పును ఆమోదించలేదని చెప్పారు. ఏ సవరణకైనా అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. అబద్ధపు ప్రచారానలు నమ్మకూడదని తెలిపారు.🚨 Toll Charges for Two-Wheelers from July 15? Here's the Truth! 🛵💸Several social media posts claim that two-wheelers will have to pay tolls on highways starting July 15, 2025.#PIBFactCheck❌This claim is #Fake✅@NHAI_Official has made NO such announcement🛣️There… pic.twitter.com/XFr4NtfxrZ— PIB Fact Check (@PIBFactCheck) June 26, 2025 -
భారత జీడీపీ ఇలా ఉండొచ్చు.. ఇక్రా తాజా అంచనాలు
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ 6.2 శాతం వృద్ధిని సాధిస్తుందన్న గత అంచనాలను రేటింగ్ సంస్థ ఇక్రా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తగినంత వర్షపాతం, చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 70 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ఇరాన్–ఇజ్రాయెల్) పెరగడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు దేశ జీడీపీ వృద్ధి తగ్గేందుకు పొంచి ఉన్న రిస్క్‌లుగా పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేయగా.. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ సైతం ఇదేవిధమైన అంచనాను వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘ఏప్రిల్, మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మిశ్రమ పనితీరు నెలకొంది. వేసవి పంటల ఉత్పాదకత ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ.. 17 వ్యవసాయేతర సంకేతాలకు గాను తొమ్మిదింటిలోనే మెరుగుదల కనిపించింది’’అని ఇక్రా తెలిపింది.మే నెలలోనే రుతుపవనాలు రావడంతో విద్యుత్, మైనింగ్ రంగాల పనితీరు ప్రభావితమైనట్టు పేర్కొంది. పట్టణాల్లో బలంగా వినియోగం ఆదాయపన్ను మినహాయింపులు పెంచడం, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో పట్టణ వినియోగం బలంగా ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. ‘‘సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందన్న సానుకూల అంచనాలు ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2024–25లో 4.6 శాతంగా ఉంటే, 2025–26లో 3.5 శాతానికి పరిమితం అవుతుంది. ఆర్బీఐ ఎంపీసీ అంచనా 3.7 శాతం కంటే ఇంకా తక్కువ’’అని ఇక్రా వివరించింది.వచ్చే ఆగస్ట్‌లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల తగ్గింపునకు అవకాశాల్లేకపోయినప్పటికీ.. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నందున అక్టోబర్ నాటి సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల కోతను చేపట్టొచ్చని అభిప్రాయపడింది. చమురు ధరలు బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే దిగుమతులపై 13–14 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని, ఇది కరెంట్ ఖాతా లోటును జీడీపీలో 0.3 శాతం మేర పెంచుతుందని ఇక్రా తెలిపింది. ఇక్కడి నుంచి చమురు ధరలు స్థిరంగా పెరుగుతూ పోతే అది భారత కంపెనీల లాభదాయకతను ప్రభావితం చేస్తుందని.. జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించేందుకు దారితీయొచ్చని పేర్కొంది. -
పీఎల్ఐ ప్రోత్సాహకాలు... రూ.21,534 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీని ప్రోత్సాహించేందుకు కేంద్రం తలపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 రంగాలకు రూ.21,534 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థ నుంచి సమస్యలు ఏర్పడడంతో.. భారత్‌లో తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని 14 రంగాల కోసం ప్రకటించింది. రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటి వరకు 12 రంగాలకు కలిపి రూ.21,534 కోట్ల ప్రోత్సాహకం విడుదల చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఎల్రక్టానిక్స్ తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఆహార ప్రాసెసింగ్, వైట్ గూడ్స్ (ఏసీలు తదితర), ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెక్స్టైల్స్, డ్రోన్స్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. ఈ తరహా పథకాల పనితీరును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా సమీక్షించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు, ప్రోత్సాహకాలతో తమ పరిధిలో కార్యాచరణ రూపొందించాలని వివిధ శాఖలను కోరారు. 12 లక్షల మందికి ఉపాధి పీఎల్ఐ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా రూ.16.5 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా నమోదు కాగా, 12 లక్షల మందికి పైగా ఈ ఏడాది మార్చి నాటికి ఉపాధి (ప్రత్యక్ష, పరోక్ష) లభించినట్టు పేర్కొంది. ఫార్మా రంగానికి సంబంధించి పీఎల్ఐ పురోగతిని సమీక్షించగా, ఈ రంగంలో రూ.2.66 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా సాధ్యమైనట్టు, ఇందులో రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు మొదటి మూడేళ్లలో నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తించింది. మొత్తం మీద ఫార్మా రంగంలో దేశీయంగా విలువ జోడింపు 2025 మార్చి నాటికి 83.70 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. బల్క్ డ్రగ్ విభాగంలో మన దేశం నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారింది. 2021–22 నాటికి నికర బల్‌్కడ్రగ్ దిగుమతులు రూ.1,930 కోట్లుగా ఉంటే, 2025 మార్చి నాటికి రూ.2,280 కోట్ల నికర ఎగుమతులు పీఎల్ఐ కింద నమోదయ్యాయి. మ్యాన్ మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) టెక్స్టైల్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 5.7 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
భారత వృద్ధి.. అంచనాలు పెరిగాయ్..
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 2025–26 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉండడం, పరపతి విధాన సరళీకరణ (వడ్డీ రేట్ల తగ్గింపు), ఆదాయపన్ను తగ్గింపు, సాధారణ వర్షపాతం అంచనాలను సానుకూలతలుగా పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేసింది.భారత జీడీపీ 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ ఎస్అండ్పీ ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేయగా, అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక అస్థితరల నేపథ్యంలో ఆ తర్వాత 0.20 శాతాన్ని తగ్గిస్తూ, 6.3 శాతానికి సవరించింది. మళ్లీ పూర్వపు వృద్ధి అంచనాలనే ఇప్పుడు ప్రస్తావించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆర్థిక పరిస్థితులపై ఎస్అండ్పీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలతో చమురు ధరలు దీర్ఘకాలం పాటు పెరుగుతూ పోతే అది ఆసియా పసిఫిక్ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.గతేడాది కంటే చమురు ధరలు తక్కువగా ఉండడం భారత్‌కు అనుకూలిస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. ఏడాది క్రితం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరెంట్ ఖాతా నుంచి చేయాల్సిన చెల్లింపులు తగ్గుతాయి. దేశీయంగా ఇంధన ధరల ఒత్తిళ్లూ ఉండవు. ఇంధన ధరలు మోసర్తుగా పెరిగినా కానీ, ద్రవ్యోల్బణంపై ఆహార ధరలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కనుక మొత్తం మీద రూపాయి లేదా ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం ఉండదన్నది మా అంచనా’’అని రాణా వివరించారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్‌కు 69 డాలర్లకు పడిపోవడం తెలిసిందే. స్థానిక డిమాండ్ బలం.. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మెరుగ్గా ఉన్న పరిస్థితుల్లో చమురు ధరలు పెరగకపోవచ్చని ఎస్అండ్పీ పేర్కొంది. స్థానికడిమాండ్ బలంగా ఉన్నందున భారత్ తదితర దేశాల్లో ఆర్థిక వృద్ది నిదానించడాన్ని పరిమితం చేస్తుందని తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పెరగొచ్చని అంచనా వ్యక్తం చేసింది.2024–25లో దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి అన్న ఎస్అండ్పీ అంచనాలు.. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. 2025లో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చని ఈ నివేదిక తెలిపింది. గతేడాది ఇది 4.6 శాతంగా ఉంది. రూపాయి ఈ ఏడాది చివరికి 87.5 స్థాయికి చేరుతుందని పేర్కొంది. -
మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) కూటమి దేశాల్లో ఒమన్ మొదటిసారి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనుంది. 42,000 రియాల్స్ (1,09,000 డాలర్లు-దాదాపు రూ.93 లక్షలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వర్గానికి 5% పన్ను విధించనున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒమన్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ కథనం ప్రచురించింది. ఈ విధానం 2028 నుంచి అమల్లోకి రానుందని అంచనా వేసింది.చమురుకు తగ్గుతున్న డిమాండ్ముడిచమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై దేశం తక్కువగా ఆధారపడటానికి ఈ చర్య దోహదపడుతుందని ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ తెలిపారు. అదే సమయంలో ప్రజా సేవలు, సామాజిక అవసరాలపై వ్యయాన్ని సమర్థంగా నిర్వర్తించవచ్చని చెప్పారు. మొత్తం ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలు ఆదాయంపై పన్ను విధించకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఒమన్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న జీరో ట్యాక్స్ విధానం అధిక ఆదాయం ఉన్న ప్రవాసులను ఆకర్షించడానికి సహాయపడింది. ఒకవేళ ఒమన్ ప్రతిపాదించిన విధానం ఆచరణలోకి వస్తే ప్రవాసుల ధోరణి ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంటుంది.అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మోనికా మాలిక్ ఈ పరిణామాన్ని ఆర్థికంగా కీలకమైనదిగా అభివర్ణించారు. ఒమన్ తన పక్క దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు వీలుగా, రాజీపడకుండా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఇదిలాఉండగా, పొరుగు దేశాల మాదిరిగానే ఒమన్ కూడా సంపద సృష్టించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా డబ్బు సమీకరిస్తోంది.గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో..?సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పడుతుండటంతో ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం చాలా జీసీసీ దేశాలు మెరుగైన ప్రభుత్వ నిధులను కలిగి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్జీసీసీ దేశాలు ఏవంటే..గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అనేది ఆరు మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక కూటమి. అందులోని దేశాలు..బహ్రెయిన్కువైట్ఒమన్ఖతార్సౌదీ అరేబియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)1981లో జీసీసీ స్థాపించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. -
త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు
అమెరికా, ఐరోపా యూనియన్ (ఈయూ)లతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఎంతో వేగవంతంగా, ఫలప్రదంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ఎగుమతుల లక్ష్యాలన్ని చేరుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా, నాలుగు దేశాలతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను మంత్రి ప్రస్తావించారు. యూకేతో చర్చలు ముగిసినట్టు చెప్పారు. మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికే తమ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నిర్వహించిన వాణిజ్య సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.2024–25 ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు రికార్డు స్థాయిలో 825 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. ఇదే కాలంలో అంతర్జాతీయంగా ఎగుమతుల్లో వృద్ధి 4 శాతంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. 2013–14లో ఎగుమతులు 466 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే గణనీయంగా వృద్ధి చెందినట్టు తెలిపారు.ఆవిష్కరణలపై దృష్టి సారించాలి..ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఎగుమతిదారులకు మంత్రి సీతారామన్ పిలుపునిచ్చారు. తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 11 శాతం తగ్గిన సమయంలోనూ భారత్ మెరుగైన పనితీరు చూపించిందన్న యూఎన్‌సీటీఏడీ నివేదికను ప్రస్తావించారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ 991 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని ఆకర్షించగా, అందులో 67 శాతం (668 బిలియన్ డాలర్లు) 2014–2024 మధ్యకాలంలో వచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ మరింత అనుసంధామైనందన్నారు. యాపిల్ ఐఫోన్ భారత కాంట్రాక్టు తయారీదారులు దేశీయంగా 20 శాతం విలువ జోడింపును సాధించినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. భారత వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. భారత్‌లో టారిఫ్‌లు చాలా తక్కువభారత్ను టారిఫ్ కింగ్ అన్న ఆరోపణలను మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ఖండించారు. 2025–26 బడ్జెట్లో మొత్తం టారిఫ్‌లను ఎనిమిదింటికి తగ్గించామని చెబుతూ.. వాస్తవ రేటు ఎంతో తక్కువ అని స్పష్టం చేశారు. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహకంగా టారిఫ్‌ల సంఖ్యను కుదించినట్టు చెప్పారు. భారత్‌ను టారిఫ్ కింగ్‌గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటికి మించిన సందర్భాల్లో వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి ఈ స్పష్టతనిచ్చారు. 2023–24 బడ్జెట్లో ఏడు టారిఫ్‌లను మంత్రి సీతారామన్ తొలగించగా, ఇటీవలి బడ్జెట్లోనూ మరో ఏడు టారిఫ్ రేట్లను ఎత్తివేయడం గమనార్హం. దీంతో భారత సగటు కస్టమ్స్ సుంకం 11.65 శాతం నుంచి 10.66 శాతానికి దిగొచ్చినట్టు మంత్రి తెలిపారు. దక్షిణాసియా దేశాల స్థాయిలోనే ఇది ఉన్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?పన్ను ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలిపన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం, సకాలంలో రిఫండ్లను ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించాలంటూ ఆదాయపన్ను శాఖ అధికారులకు మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ల సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రత్యక్ష హాజరు అవసరం లేని అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాస్పదన పన్ను డిమాండ్లను వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సకాలంలో పరిష్కారం చూపించడం వల్ల వ్యవస్థపై పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసం ఇనుమడిస్తుందన్నారు. -
రూపాయి అయిదేళ్లలో అతిపెద్ద ర్యాలీ
ముంబై: రూపాయి విలువ అయిదు నెలల కనిష్టం నుంచి కోలుకొని రికార్డు స్థాయిలో ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో 73 పైసలు బలపడి 86.05 వద్ద స్థిరపడింది. గడిచిన అయిదేళ్లలో ఒకేరోజు ఈ స్థాయిలో పుంజుకో వడం ఇదే తొలిసారి.పశ్చిమాసియాలో ఉద్రికత్తలు తగ్గొచ్చనే అంచనాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం రూపాయికి కలిసొచ్చిన. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలూ ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో ఏకంగా 87 పైసలు ఎగసి 85.91 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ ప్రకటనతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.50% క్షీణించి 67.05 స్థాయికి దిగివచ్చింది. -
ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అడ్వాన్స్ క్లెయిమ్‌ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలు, పిల్లల పెళ్లిల్లు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరితగతిన ఆర్థిక వెసులుబాటు అందించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన సిబ్బందికి సకాలంలో డబ్బు అందేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.‘కార్మికులకు నిరంతరాయంగా, సకాలంలో ఆర్థికంగా వెసులుబాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల సభ్యులు అవసరమైన సమయాల్లో పెద్ద మొత్తంలో వేగంగా డబ్బు పొందవచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు. ఆటో సెటిల్మెంట్ సదుపాయం కొవిడ్-19 మహమ్మారి కాలం నుంచే అందుబాటులో ఉంది.ఏమిటీ ఆటో సెటిల్మెంట్?క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లోని కొంత భాగాన్ని అడ్వాన్స్‌గా పొందడానికి అనుమతించే విధానం. కొవిడ్ సమయంలో రూ.1లక్ష వరకు ఇలా ఆటో సెటిల్మెంట్కు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చింది. ఇక నుంచి దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్యా ఖర్చులు, ఇంటి రెన్యూవేషన్, పిల్లల పెళ్లి వంటి తక్షణ అవసరాలకు ఇలా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఈ విధానంలో నిధులు మ్యానువల్‌గా కాకుండా ఆటోమేటిక్‌గా అప్రూవ్ అవుతాయి.ఈ సర్వీసు పొందేందుకు చందాదారులు తమ ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ సమాచారం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ పూర్తి ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ పిల్లల వివాహం, విద్య లేదా ఇంటి పునరుద్ధరణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా విత్‌డ్రా చేసేందుకు అనుమతించారు. దీనివల్ల సభ్యులు తమ నిధులను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాప్యం లేకుండా పొందవచ్చు.ఆటో సెటిల్మెంట్ కోసం అర్హతలువైద్య అత్యవసర పరిస్థితులు: చందాదారులు లేదా తమపై ఆధారపడినవారు ఆసుపత్రిలో చేరడం, పెద్ద శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండడం.ఉన్నత విద్య: చందాదారులు లేదా తమ పిల్లల ఉన్న విద్య కోసం.వివాహ ఖర్చులు: చందాదారు పెళ్లి లేదా పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి ఖర్చులకు.ఇంటి పునరుద్ధరణ లేదా నిర్మాణం: ఇల్లు కొనడం లేదా ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మతుల కోసం.ఈపీఎఫ్ స్కీమ్ రూల్స్ 68జే, 68కే, 68బీ ద్వారా పై కేటగిరీలోని అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. చందాదారు క్లెయిమ్ ఈపీఎఫ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్ అవుతుంది. అందుకు సాధారణంగా 72 గంటలు సమయం పడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలుకావాల్సినవి..చందాదారులు తప్పనిసరిగా ఫుల్ కేవైసీని అప్డేట్ చేయాలి. అందుకు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయాలి.యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) యాక్టివ్‌గా ఉండాలి. దాన్ని వెరిఫై చేయాలి. -
ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!
ఆధార్ కార్డులో అప్డేట్స్ చేయాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది. ఆధార్ కార్డులో చిరునామా మార్చాలన్నా, మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలన్నా, పేరు, పుట్టిన తేదీ.. వంటివాటిలో మార్పులు చేయాలన్నా ఇకపై ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీసులు అప్డేట్ చేస్తున్నారు. నేరుగా ఆన్లైన్లోనే నవంబర్ 2025 నుంచి సవరణ సదుపాయాన్ని కల్పించేలా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది.ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల భౌతిక పత్రాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఆధార్ అప్డేట్ కోసం ఆయా కేంద్రాలను సందర్శించే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అప్డేషన్ ప్రక్రియ ఆన్లైన్ సేవల ద్వారా వేగవంతం అవుతుంది. ఈ సర్వీసుల ద్వారా సురక్షితంగా, సులభంగా కొత్త ఆధార్‌ను పొందే వీలుంటుంది. దేశంలోని కొన్ని లక్షల మందికి ఈ సర్వీస్ ఉపయోగకరంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?దరఖాస్తు సమయంలో పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు వంటి ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్‌లో ఉన్న వివరాల ద్వారా యూఐడీఏఐ మీ వివరాలను తనిఖీ చేస్తుంది. పత్రాలను పదేపదే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నియంత్రిస్తుంది. విద్యుత్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను కూడా మీ చిరునామాను ధ్రువీకరించడానికి ఉపయోగించవచ్చు. నవీకరణ ప్రక్రియను ఈ చర్యలు గణనీయంగా క్రమబద్ధీకరిస్తాయి.కొత్త మొబైల్ అప్లికేషన్..క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్‌తో కూడిన కొత్త మొబైల్ అప్లికేషన్‌ను యూఐడీఏఐ త్వరలో విడుదల చేయనుందని చెప్పింది. ఈ అప్డేట్తో ఇకపై మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వినియోగదారులు అవసరమైనప్పుడల్లా సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్ ఆధార్‌ను చూపించవచ్చు. మోసాలను అరికట్టడం, నకిలీ ఆధార్ కార్డుల చలామణిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. -
రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా పెంచుకుంది. జూన్ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్’ వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్ బ్యారెల్స్‌గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్‌గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్‌కు రష్యా ఆఫర్ చేయడం గమనార్హం. సరఫరాపై ప్రభావం పడొచ్చు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రితోలియా తెలిపారు. షిప్ యజమానులు గల్ఫ్ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేసే రిస్క్ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్‌కు చైనా అతిపెద్ద కస్టమర్‌గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్‌కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది. -
అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. యుద్ధం మొదలైన గత శుక్రవారం నాడు (జూన్ 13న) ఒకే రోజున ఏకంగా 11 శాతం ఎగిసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు ఎకాయెకిన 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు పెరిగి, ఆరు నెలల గరిష్టానికి చేరింది. వారం రోజులుగా ఆ గరిష్ట స్థాయిలోనే తిరుగుతోంది.యుద్ధం ఇదే విధంగా కొనసాగి, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ గానీ మూసివేస్తే ముడి చమురు రేట్లు 120–130 డాలర్ల వరకు కూడా ఎగిసే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ అదే జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకూ రెక్కలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రభావం భారతీయ మార్కెట్‌పై పడుతుంది.పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. పర్షియన్ గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ దీని ద్వారా వెళుతుంది. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని చూసింది. ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఐదవ వంతు. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడం గానీ, ఏదైనా అంతరాయం జరిగితే చమురు కొరత తీవ్రమై ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం గుండా వెళ్ళే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అంతరాయాల వల్ల ఈ దేశాలు ఏదైనా ఎక్కువగా ప్రభావితమవుతాయి. -
రత్నాభరణాల ఎగుమతులు డౌన్
రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 16 శాతం తగ్గిపోయాయి. 2,263 మిలియన్ డాలర్ల (19,261 కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది మే నెలలో ఎగుమతులు 2,688 మిలియన్ డాలర్లు (రూ.22,414 కోట్లు)గా ఉన్నట్టు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. అమెరికా టారిఫ్‌ల అనంతరం వీటి ఎగుమతులు తగ్గిపోవడం గమనార్హం. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 35 శాతం తక్కువగా 950 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 12,272 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్డ్ ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఎగుమతులు సైతం 33 శాతం తగ్గి 81 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 17 శాతం పెరిగి 997 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది మే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 851 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలల్లో 17 శాతానికి పైగా క్షీణించి 150 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్ జెమ్‌స్టోన్ ఎగుమతులు ఏప్రిల్–మే నెలల్లో ఒక శాతం తగ్గి 62 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్అమెరికా టారిఫ్‌ల వల్లే..‘అమెరికా టారిఫ్‌ల వల్ల మొత్తం మీద ఎగుమతులు మే నెలలో 16 శాతం వరకు తగ్గాయి. అయినప్పటికీ బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం పెరిగాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం బంగారానికి డిమాండ్‌ను పెంచింది’ అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. -
రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్
అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నడుమ సెంట్రల్ బ్యాంక్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంయ్ మల్హోత్రా తెలిపారు. లిక్విడిటీ పరంగా స్పష్టతకు, వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వీలుగా రుణ వ్యయాలను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్యానెల్ ఈ నెలారంభంలో రెపో, రివర్స్ రెపో రేట్ల కోత నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే. ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో చర్చించి, రికార్డు అయిన వివరాలు (మినిట్స్) విడుదలయ్యాయి. ఐదుగురు సభ్యులు 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేశారు. సౌగత భట్టాచార్య మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. గత కొన్ని నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3 శాతం మేర తగ్గడం (2024 అక్టోబర్‌లో నమోదైన 6.2 శాతం నుంచి 2025 ఏప్రిల్ నెలలో 3.2 శాతానికి), వార్షికంగా ద్రవ్యోల్బణం 3.7 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్లకు అనుకూలంగా గవర్నర్ మల్హోత్రా మొగ్గు చూపించారు. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ సెక్టార్‌పై మస్క్ కన్నుఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అస్థిరమైన రేట్ల కోత కంటే.. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం విధానపరమైన స్పష్టతకు, వేగవంతమైన బదిలీకి వీలు కల్పిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా అభిప్రాయపడ్డారు. తటస్థ విధానానికి సైతం మద్దతు పలికారు. -
విదేశీ ఆదాయం వెల్లడించని వారిపై చర్యలు
న్యూఢిల్లీ: విదేశీ ఆదాయం, ఆస్తులను వెల్లడించని పన్ను చెల్లింపుదారులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 5,483 మంది పన్ను చెల్లింపుదారుల తమకు రూ.29,208 కోట్ల విదేశీ ఆదాయం, మరో రూ.1,090 కోట్ల అదనపు ఆదాయం ఉందంటూ ఆలస్యపు రిటర్నులు దాఖలు చేసినట్టు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నోటీసులకు స్పందించని పన్ను చెల్లింపుదారులపై చట్ట పరిధిలో సరైన చర్యలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తుల మూడింతలు పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు (రూ.37,600 కోట్లు) చేరినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రకటన చారీ చేయడం గమనార్హం. 2024–25 అసెస్మెంట్ సంవత్సరం ఐటీఆర్‌లలో పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన విదేశీ ఆస్తులు, ఆదాయం గణనీయంగా పెరిగిపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ముందుకు వస్తున్నట్టు, తమ ఐటీఆర్‌లను సమీక్షించుకుంటున్నట్టు తెలిపింది. -
ప్రాజెక్ట్ రుణాలకు కొత్త నిబంధనలు
ముంబై: మౌలిక రంగ ప్రాజెక్టులు, మౌలికేతర ప్రాజెక్టులకు బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, ఇతర నియంత్రిత సంస్థలు మంజూరు చేసే రుణాలకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటి ప్రకారం ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాల ప్రారంభించే తేదీ (డీసీసీవో) విషయంలో వెసులుబాటు కల్పించింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు మూడేళ్లు, నాన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రెండేళ్ల పాటు డీసీసీవో పొడిగింపు పరిమితికి అవకాశం ఇచ్చింది. కొత్త మార్గదర్శకాల అమలుకు ప్రాజెక్టులను స్థూలంగా.. డిజైన్, నిర్మాణం, కార్యకలాపాల దశలుగా వర్గీకరించారు. ‘‘నిర్మాణ దశలోని ప్రాజెక్టులకు బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీల రుణ వితరణ గరిష్టంగా రూ.1,500 కోట్లను మించకూడదు. విడిగా ఒక్కో రుణ దాత ఎక్స్పోజర్ ఇందులో 10 శాతానికి తక్కువ కాకుండా ఉండాలి. రూ1,500 కోట్లకు మించిన ప్రాజెక్టు రుణాల్లో ఒక్కో రుణదాత వారీ వాటా కనీసం 5 శాతం లేదా రూ.150 కోట్లు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. రుణాన్ని ఖరారు చేయడానికి ముందే సంబంధిత ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు/ క్లియరెన్స్‌లు వచ్చినట్టు ధ్రువీకరించుకోవాలి. పర్యావరణ, చట్టబద్ధమైన, నియంత్రణ సంస్థల అనుమతులు ఇందులో భాగంగా ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. రుణం మంజూరు చేసిన తర్వాత కూడా బ్యాంక్/ఎన్బీఎఫ్సీ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలి. సంబంధిత ప్రాజెక్టు సమస్యల్లో పడుతుందన్న సంకేతాలు కనిపిస్తే ముందస్తుగానే పరిష్కార ప్రణాళికకు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రుణాలకు సంబంధించి 1.25% ప్రొవిజన్ చేయాల్సి (పక్కన పెట్టడం) ఉంటుంది. వాణిజ్య–నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇది ఒక శాతంగా ఉంటుంది. ఇతర ప్రాజెక్టుల రుణాలకు సైతం ఒక శాతం ప్రొవిజన్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు కార్యకలాపాల దశలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన కేటాయింపులు వరుసగా 1%, 0.75%, 0.40 శాతంగా ఉండనున్నాయి. నిజానికి గతంలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో ప్రాజెక్టు రుణాలకు సంబంధించి.. నిర్మాణ దశలో ఉన్న వాటికి 5 శాతం, కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత ఒక శాతం కేటాయింపులు నిర్వహించాలని ఆర్బీఐ ప్రతిపాదించడం గమనార్హం. -
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడింతలు
న్యూఢిల్లీ/జ్యురిచ్: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నిధులు (డిపాజిట్లు, సెక్యూరిటీలు సహా) మూడింతలకు పైగా పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్‌కు (రూ.37,600 కోట్లు) చేరాయి. 2021 తర్వాత స్వివ్స్ బ్యాంకుల్లో భారత నిధులు గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే కావడం గమనార్హం. 2021లో ఈ మొత్తం 3.83 స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఈ వివరాలను స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) గురువారం విడుదల చేసింది. బ్యాంక్ ఛానళ్లు, ఇతర ఆర్థిక సంస్థల రూపంలో జమ అయిన నిధులు ఇవి. ఇక స్విస్ బ్యాంకుల్లోని భారత క్లయింట్ల ఖాతాల్లోని డిపాజిట్లు 11 శాతం పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.3,675 కోట్లు)గా ఉన్నాయి. మొత్తం నిధుల్లో క్లయింట్ల ఖాతాల్లో ఉన్నవి 10 శాతమేనని తెలుస్తోంది. విడిగా చూస్తే.. 3.02 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఇతర బ్యాంకుల రూపంలో ఉంటే, 346 మిలియన్ల ఫ్రాంక్స్ కస్టమర్లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లో ఉన్నాయి. 41 మిలియన్లు ఫిడూషియరీలు లేదా ట్రస్ట్‌ల రూపంలో, 135 మిలియన్ల ఫ్రాంక్స్ బాండ్లు, ఇతర సెక్యూరిటీల రూపంలో ఉన్నట్టు ఎస్ఎన్బీ వెల్లడించింది. నిజానికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి 1.04 ఫ్రాంక్స్‌గా ఉండడం గమనార్హం. ఆ తర్వాత రెండేళ్లలో ఇవి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, 2026లో స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 6.5 బిలియన్ల ఫ్రాంక్స్ కంటే తక్కువే. బ్యాంకులు అందించిన సమాచారంగా ఎస్ఎన్బీ విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇందులో నల్లధనం వివరాల్లేవు. అలాగే, ఏ సంస్థల పేరు మీద ఖాతాలున్నాయనే వివరాలను కూడా వెల్లడించలేదు. నల్లధనంగా చూడరాదు.. భారతీయులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న ఆస్తులను ‘నల్లధనం’గా పరిగణించకూడదన్నది స్విస్ అధికారుల వాదన. ‘‘పన్ను మోసాలు, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్ మద్దతుగా నిలుస్తుంది. 2018 నుంచి భారతీయుల డిపాజిట్ల వివరాలను ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ మార్గంలో అందజేస్తున్నాం. మొదటిగా 2019లో డేటా బదిలీ చేయగా.. అప్పటి నుంచి ఏటా ఇది కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనుమానం ఉన్న ఖాతాల వివరాలు కూడా అందిస్తూనే ఉన్నాం’’అని స్విస్ అధికారులు తెలిపారు. ఇక స్విస్ బ్యాంకుల్లో మొత్తం విదేశీ క్లయింట్ల నిధులు 2024లో 977 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు తగ్గాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 983 బిలియన్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ఫండ్స్‌లో దేశాల వారీగా చూస్తే భారత్ 48వ స్థానంలో ఉంది. గతేడాది 67వ స్థానం నుంచి పుంజుకుంది. అంతర్జాతీయంగా చూస్తే స్విస్ బ్యాంకుల్లోని విదేశీ క్లయింట్ల నిధుల్లో 222 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూకే నుంచే ఉండడం గమనార్హం. 89 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూఎస్, 68 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ వెస్టిండీస్ క్లయింట్లకు చెందినవి. పాకిస్థాన్ క్లయింట్లకు సంబంధించి 272 మిలియన్ ఫ్రాంక్స్, బంగ్లాదేశ్ క్లయింట్లకు సంబంధించి 589 మిలియన్ ఫ్రాంక్స్ కూడా ఉన్నాయి. -
డిజిటల్ అరెస్ట్‌ల నిరోధానికి పరిష్కారాలు చూడండి
న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్ట్‌లు, ఇతర సైబర్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో వీటికి కళ్లెం వేసేందుకు సరైన పరిష్కారాలతో ముందుకు రావాలని ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో, మారుమూల ప్రాంతాలకూ చెల్లింపుల సేవలను విస్తరించడంలో ఫిన్‌టెక్‌లు పోషించిన పాత్రను ఆమె ప్రశంసించారు. డిజిటల్ పేమెంట్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంట్లోనే ఉన్నవారిని డిజిటల్‌గా అరెస్ట్ చేయకుండా లేదా నైట్ ఆపరేటర్ల ద్వారా డబ్బులు మోసపోకుండా పరిష్కారాలతో ముందుకు రావాలని స్టార్టప్‌లను కోరారు. ప్రజలకు మరింత నష్టం కలిగిస్తున్న డీప్‌ఫేక్ (నకిలీ)ను అతిపెద్ద ముప్పుగా అభివరి్ణంచారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లకు తగిర పరిష్కారాలను కనుగొని, వాటిని అందించే ఫిన్‌టెక్ స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) రుణ సదుపాయాలను విస్తరించాలని ఫిన్‌టెక్‌లను కోరారు. ఫిన్‌టెక్ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల వినియోగ వస్తువులుగా మారాలంటూ.. అవి ఇతర వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలకు సైతం ప్రయోజనం కలిగిస్తాయన్నారు. మన సంస్థలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని చెప్పారు. ‘‘విజయవంతమైన నమూనాలను విదేశాలకు తీసుకెళ్లాలి. అంతర్జాతీయ మార్కెట్లను సొంతం చేసుకోవాలి. మనకు నైపుణ్యాలున్నాయి. పెద్ద మార్కెట్‌తోపాటు రుజువైన పరిష్కారాలూ ఉన్నాయి’’అని మంత్రి వివరించారు. ప్రపంచంలో ప్రస్తుతం రోజువారీ జరుగుతున్న డిజిటల్ల లావాదేవీల్లో సగం భారత్‌లోనే ఉంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దేశ ఫిన్‌టెక్ పరిశ్రమ 2028–29 నాటికి 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఎంతో దూరంలో లేదంటూ.. అవకాశాలకు ఆకాశమే హద్దన్నట్టు మంత్రి చెప్పారు. -
ఇంధన పరివర్తనంలో భారత్‌కు 71వ ర్యాంక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ ర్యాంక్ 71వ స్థానానికి దిగజారింది. గతేడాది భారత్ 63వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇంధన పరివర్తనంలో అంతర్జాతీయంగా 118 దేశాలతో కూడిన జాబితాలో స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ టాప్–5లో ఉన్నాయి. చైనా 12వ స్థానం దక్కించుకోగా, యూఎస్ 17వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 101 ర్యాంక్‌తో సరిపెట్టుకోగా, కాంగో జాబితాలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ వివరాలను ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా, భారత్ మెరుగైన పనితీరు చూపించినట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. ముఖ్యంగా ఇంధనం లభ్యత, పరివర్తనానికి సిద్ధం కావడంలో పురోగతి సాధించినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన పరివర్తనం (సుస్థిర, పర్యావరణ అనుకూల ఇంధనాలు) దశ, దిశలను అంతిమంగా టాప్–5 ఆర్థిక వ్యవస్థలైన చైనా, యూఎస్, ఈయూ, జపాన్, భారత్ నిర్ణయించనున్నట్టు తెలిపింది. ఇంధన లభ్యత, పునరుత్పాదక ఇంధన వనరులు, శుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు, నియంత్రణలు మెరుగుపరిచే దిశగా గడిచిన దశాబ్ద కాలంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినట్టు పేర్కొంది. ఇంధన భద్రతలో యూఎస్ అగ్రగామిగా ఉంటే.. ఇంధన సామర్థ్యం, పెట్టుబడుల పరంగా భారత్ ముందడుగు వేసినట్టు తెలిపింది. 2024లో పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన రంగంలో 2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినప్పటికీ.. అదే ఏడాది 37.8 బిలియన్ టన్నులకు కర్బన ఉద్గారాలు పెరిగినట్టు పేర్కొంది. -
పీఎస్‌యూల డీలిస్టింగ్ సరళతరం
ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా డీలిస్ట్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్ షేర్‌హోల్డింగ్ 90 శాతానికి చేరితేనే డీలిస్టింగ్ విజయవంతమైనట్లవుతుంది. దీని కోసం షేరు కనీస ధరను 60 రోజుల సగటు రేటు, గత 26 వారాల్లో గరిష్ట ధర తదితర అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. అయితే, బుక్ వేల్యూ తక్కువగా ఉన్నా లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గానీ మార్కెట్లో రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధానంతో డీలిస్టింగ్ ప్రక్రియ పీఎస్‌యూలకు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.ఈ నేపథ్యంలోనే 90 శాతం పైగా ప్రభుత్వ వాటాలున్న పీఎస్‌యూల స్వచ్ఛంద డీలిస్టింగ్‌కి సంబంధించి కనీస ధరను లెక్కించే విధానాన్ని, మూడింట రెండొంతుల మంది పబ్లిక్ షేర్హోల్డర్లు ఆమోదం తెలపాలన్న నిబంధనను సడలించాలని సెబీ భావిస్తోంది. మరోవైపు, కేవలం భారతీయ ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పాటించాల్సిన నిబంధనలను సడలించాలని చైర్మన్ తుహిన్ కాంత పాండే సారథ్యంలో జరిగిన రెండో బోర్డు మీటింగ్‌లో నిర్ణయించింది. స్టార్టప్ వ్యవస్థాపకులకు ఊరట..పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలనుకునే అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐపీవో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడానికి కనీసం ఒక్క ఏడాది ముందు కేటాయించిన ఎసాప్స్‌ను (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు) వారు అట్టే పెట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకెళ్లే సమయంలో ఎసాప్స్ సహా ఇతరత్రా షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలేవీ అంకురాల ప్రమోటర్ల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉంటే, వాటిని ఐపీవోకి ముందుగానే విక్రయించాలి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’విదేశాల నుంచి భారత్‌కు తమ ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవాలనుకుంటున్న సంస్థలకు తాజా సడలింపు ఉపయోగపడనుంది. అటు ఎన్ఎస్ఈఎల్ పేమెంట్ సంక్షోభంలో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఎదుర్కొన్న నిర్దిష్ట స్టాక్ బ్రోకర్ల కోసం సెటిల్మెంట్ స్కీమును ప్రవేశపెట్టినట్లు సెబీ తెలిపింది. ఈ స్కీమును ఎంచుకోవడం ద్వారా తమపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు వారికి వీలుంటుంది. ఇక, ఐపీవో పత్రాల ఫైలింగ్‌కు ముందు కీలక మేనేజ్మెంట్ సిబ్బంది, ప్రస్తుత ఉద్యోగులు, డైరెక్టర్లు దగ్గర షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండాలనే ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది. -
వెండి రికార్డుల మోత
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్‌టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది. రూపాయిలో బలహీనత దేశీ మార్కెట్లో బులియన్ ధరలకు మద్దతుగా నిలిచింది’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర పెద్దగా మార్పు లేకుండా 3,400 డాలర్ల స్థాయిలో ఉంది. డాలర్ బలపడడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల పెరుగుదల బంగారం ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. దీనికితోడు బుధవారం యూఎస్ ఫెడ్ సమావేశం నిర్ణయాలు బయటకు రానుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి పాటించినట్టు తెలుస్తోంది. -
భారత ఆటబొమ్మల నాణ్యత భేష్
భారత ఆటబొమ్మల (టాయ్స్) నాణ్యత ప్రమాణాలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ కంటే మెరుగైనవని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సైంటిస్ట్ డైరెక్టర్ (వెస్టర్న్ రీజినల్ ఆఫీస్ ల్యాబరేటరీ) అద్భుత్ సింగ్ తెలిపారు. దేశీ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడంలో ఈ ప్రమాణాలు సాయపడుతున్నట్టు చెప్పారు.టాయ్స్‌కు సంబంధించి భౌతిక, రసాయన, ఎలక్ట్రికల్ భద్రతా ప్రమాణాలను బీఐఎస్ రూపొందించి, అమలు చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఐఎస్వో, ఐఈసీ సంస్థలు నిర్ణయించిన బెంచ్‌మార్క్ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ ప్రమాణాలను బీఐఎస్ అభివృద్ది చేసింది. వీటి ప్రకారం దేశీయంగా తయారీకి, దిగుమతులకు గాను ఏడు రకాల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారత ఆటబొమ్మల అమ్మకాలు పెరిగేందుకు సాయపడినట్టు అద్భుత్ సింగ్ తెలిపారు. పోటీకి అవకాశం..బీఐఎస్ ప్రమాణాలు ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు దిగ్గజ కంపెనీలతో పోటీపడే అవకాశం కల్పించినట్లు ముంబైకి చెందిన జెఫిర్ టాయ్‌మేకర్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఈవో మోయిజ్ గబ్జీవాలా తెలిపారు. ‘బీఐఎస్ ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత (2021 జనవరి 1 నుంచి) మా ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల ఆదాయం సాధించాం. 2025–26లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం’ అని ప్రకటించారు. ఇదీ చదవండి: ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్తమ ఉత్పత్తుల్లోకి వినియోగించే ముడి సరుకుల్లో 99 శాతం దేశీయంగా తయారైనవేనని చెప్పారు. 15 కేటగిరీల్లో 100కు పైగా రకాలతో 1–1.5 లక్షల బొమ్మలను నెలవారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. భారత కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన ఆటబొమ్మలను అందుబాటు ధరలకే ఉత్పత్తి చేయగలుగుతున్నట్టు వివరించారు. బీఐఎస్ సర్టిఫికేషన్ ఉంటే సంబంధిత ఆటబొమ్మల్లో పాదరసం, థాలేట్స్ వంటి విషపూరిత పదార్థాలు లేవని, మింగేందుకు అవకాశం ఉన్న చిన్నపాటి విడిభాగాల్లేవని, పదునైన అంచుల్లేవన్న భరోసానిస్తుందని అద్భుత్ సింగ్ తెలిపారు. గ్లోబ్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం చూస్తే.. 2023–24లో టాయ్స్ ఎగుమతులు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 154 మిలియన్ డాలర్ల నుంచి 152 మిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. -
Fastag: వార్షిక టోల్ పాస్‌ను ప్రకటించిన కేంద్రం
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్ యాక్టివేషన్, రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్‌ను త్వరలో రాజ్‌గార్ యాత్ర యాప్‌తో పాటు ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.Important Announcement 📢 🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపదఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. -
డిజిటల్ ఎకానమీలో భారత్ పవర్‌హౌస్!
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీ వృద్ధి పరుగులు తీస్తుండటంతో భారత్ తిరుగులేని శక్తి (పవర్‌హౌస్)గా ఆవిర్భవించిందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో సుస్థిర ప్రగతికి భద్రత, విశ్వసనీయత అత్యంత కీలకమని, వీటిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా హెడ్‌గా ఇటీవలే ఎంపికైన ప్రీతి.. ఏఐ రంగంలో భారత్ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో గూగుల్ భద్రతా చార్టర్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.ఆన్లైన్ మోసాలు, స్కామ్‌ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడం.. ప్రభుత్వం, కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి వంటి అంశాల్లో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ చార్టర్ ఒక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రీతి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ విషయానికొస్తే మరింత మెరుగైన, వృద్ధిదాయకమైన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు గూగుల్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కాగా, గుత్తాధిపత్యానికి సంబంధించి భారత్‌లో గూగుల్‌పై కేసుల గురించి మాట్లాడుతూ.. గూగుల్ ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. అక్కడి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో నిరంతరం కలిసి పనిచేస్తామని ఆమె తేల్చిచెప్పారు.కొత్త టెక్నాలజీతో సవాళ్లు...ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సృజనాత్మక సామర్థ్యాలను వెలికితీస్తున్నాయని.. అయితే, వాటివల్ల డీప్‌ఫేక్స్ వంటి సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని ప్రీతి అంగీకరించారు. ‘అందుకే మా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే ఏ కంటెంట్‌లో అయినా వాటర్‌మార్క్‌లు ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల యూజర్లు ఈ కంటెంట్‌లో దేనినైనా అప్లోడ్ చేస్తే, వాటిలోని ‘సింథ్ఐడీ’ని ఆయా షేరింగ్ టూల్స్ గుర్తించగలుగుతాయి’ అని వివరించారు. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని, డీప్‌ఫేక్స్ సవాళ్లను ఎదుర్కోవాలంటే పరిశ్రమవ్యాప్తంగా సహకారం అవసరమన్నారు. గూగుల్ సహా ఇతర కంపెనీలన్నీ ఈ కీలక అంశంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు.యూపీఐ.. అద్భుతంభారత్లో డిజిటల్ ఆర్థిక స్వరూపం ఎంతో ప్రత్యేకమైనదని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తమకు తిరుగులేదని నిరూపించిందన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) శరవేగంగా విస్తరించడం దీనికి మచ్చుతునక. గూగుల్ పే వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు అంచనాలను మించి విజయం సాధించాయి. కొన్నేళ్ల క్రితం యూపీఐ ప్రజల దైనందిన జీవితాల్లో ఇలా చొచ్చుకుపోతుందని ఎవరైనా ఊహించారా. ఇప్పుడు దేశంలో ఇదో అద్భుతమైన డిజిటల్ విప్లవంగా మారింది. వందల కోట్ల లావాదేవీలతో యూపీఐ ప్రజల వినియోగం, కొనుగోళ్ల తీరునే సమూలంగా మార్చేసింది’ అని ప్రీతి పేర్కొన్నారు. భారత్ కీలక మార్కెట్...గూగుల్‌కు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా కొనసాగుతోందని.. సమీప భవిష్యత్తులోనే ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరే దిశగా దేశ డిజిటల్ ఎకానమీ పరుగులు తీస్తోందని ప్రీతి పేర్కొన్నారు. అడ్వర్టయిజింగ్, క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ రంగాల్లో గూగుల్‌కు ఉన్న పట్టు, నైపుణ్యాలను భారత్ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు.దేశ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా డిజిటల్ రంగంలో గూగుల్ ఇతోధికంగా సహకారం అందిస్తున్న ‘ఈ కీలకమైన, ఉత్తేజకరమైన తరుణం’లో కంపెనీ ఇండియా హెడ్‌గా కొత్త బాధ్యతలను చేపట్టడం చాలా ఉత్సాహాన్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. గూగుల్ ప్రపంచవ్యాప్త వ్యూహంలో భారత్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుందనడానికి యూట్యూబ్ షార్ట్స్, జీపే తొలుత ఇక్కడే ప్రారంభించడం నిదర్శనమని కూడా గుర్తుచేశారు. -
ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీ
ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో ఈ నెల 27న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. బ్యాంకుల పనితీరుతోపాటు పలు ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల లక్ష్యాలపైనా చర్చ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును అర శాతం తగ్గించిన తర్వాత ఆర్థిక మంత్రి బ్యాంక్‌లతో నిర్వహిస్తున్న మొదటి సమీక్ష కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంజీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.5 శాతానికి తగ్గడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఉత్పాదక రంగాలకు రుణ వితరణ పెంచాలని ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో బ్యాంక్‌లను కోరే అవకాశాలున్నట్టు తెలిపాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల పరంగా పురోగతిని మంత్రి సమీక్షించనున్నట్టు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 26 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. -
అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో..
న్యూఢిల్లీ: వరుసగా రెండు నెలల పాటు సానుకూల వృద్ధిని నమోదు చేసిన వస్తు ఎగుమతులు మే నెలలో స్వల్పంగా క్షీణించాయి. మొత్తం 38.73 బిలియన్ డాలర్ల ఎగుమతులు (రూ.3.29 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడమే ఎగుమతుల విలువ తగ్గడానికి దారితీసినట్టు తెలుస్తోంది. మే నెలలో వాణిజ్య లోటు 21.88 బిలియన్ డాలర్లకు (రూ.1.86 లక్షల కోట్లు) పరిమితమైంది. ఇక మే నెలలో వస్తు దిగుమతులు (Imports) సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 1.7 శాతం తగ్గి 60.61 బిలియన్ డాలర్లుగా (రూ.5.15 లక్షల కోట్లు) ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బంగారం, ముడి చమురు దిగుమతులు క్షీణించడం మొత్తం మీద దిగుమతులు తగ్గేందుకు సానుకూలించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు (ఏప్రిల్–మే) కలిపి చూస్తే వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కంటే 3.11 శాతం అధికంగా 77.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు సైతం 8 శాతం పెరిగి 125.52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 48.33 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరగడం, ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఎగుమతులు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎగుమతుల పరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ ఈ వారంలోనే అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది. సేవల ఎగుమతులు జూమ్ మే నెలో సేవల ఎగుమతులు 33 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 మే నెలలో ఇవి 29.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల దిగుతులు సైతం మే నెలలో 17.14 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 16.88 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.సవాళ్ల మధ్య మెరుగైన పనితీరు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతుల పరంగా భారత్ మెరుగైన పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు. వాణిజ్యానికి సంబంధించి విధానపరమైన అనిశ్చితులు, పలు దేశాల మధ్య ఘర్షణలను ప్రస్తావించారు. బ్రిటన్, ఈయూ, యూఎస్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దిశగా వాణిజ్య శాఖ చురుగ్గా పనిచేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను ఎగుమతిదారులు సర్దుబాటు చేసుకుంటున్నట్టు భారత ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రయ్.. బియ్యం, ఐరన్‌ఓర్, రత్నాభరణాలు, ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఉత్పత్తులు దిగుమతులు క్షీణించడానికి దారితీశాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మే నెలలో 30 శాతం తగ్గి 5.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ముడి చమురు దిగుమతులు 26 శాతం తగ్గి 14.75 బిలియన్ డాలర్లు, బంగారం దిగుమతులు 12.6 శాతం తగ్గి 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తేయాకు, కాఫీ, దినుసులు, రెడీమేడ్ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు సానుకూలంగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు 54 శాతం పెరిగి 45.7 బిలియన్ డాలర్లకు చేరాయి.చదవండి: జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ -
తగ్గిన ఇంధన వాడకం
దేశీయంగా వివిధ ప్రాంతాల్లో ముందుగా వర్షాలు పడుతుండటంతో ఈ నెల(జూన్) తొలి రెండు వారాల్లో ఇంధన వినియోగం మందగించింది. ప్రొవిజనల్ పారిశ్రామిక గణాంకాల ప్రకారం రెండు నెలల పురోగతి తదుపరి డీజిల్ వినియోగం క్షీణించింది. ఈ బాటలో రెండు నెలల వినియోగ వృద్ధి తదుపరి పెట్రోల్‌కు సైతం డిమాండ్ నీరసించింది.జూన్ 1–15 మధ్య పెట్రోల్ డిమాండ్‌లో వృద్ధి 2.3 శాతానికి పరిమితమై 1.4 మిలియన్ టన్నులను తాకింది. దేశీయంగా 90 శాతం మార్కెట్ వాటా కలిగిన మూడు ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థల గణాంకాలివి. మే నెలలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం పుంజుకున్న సంగతి తెలిసిందే. జూన్ తొలి అర్ధభాగంలో డీజిల్ వినియోగం 4.8 శాతం క్షీణించింది. 3.26 మిలియన్ టన్నులకు పరిమితమైంది.ఇదీ చదవండి: రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లుదేశీయంగా అత్యధిక వినియోగమున్న డీజిల్ ఏప్రిల్‌లో 4 శాతం బలపడగా.. మే నెలలో 2 శాతం వృద్ధి నమోదైంది. ఈ నెల తొలి రెండు వారాల్లో పెట్రోల్ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. మే నెల 1–15 మధ్య 1.5 మిలియన్ టన్నుల పెట్రోల్ వినియోగం నమోదైంది. అయితే 2023 జూన్ 1–15తో చూస్తే వినియోగం 7 శాతం ఎగసింది. మరోపక్క ఇదే కాలంలో డీజిల్ డిమాండ్ 5.2 శాతం క్షీణించగా.. వినియోగం మే నెలతో పోలిస్తే 3.1 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరగడానికి వినియోగం ఊతమిచ్చింది. -
ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను రేట్లు ఉన్న దేశాలు
ప్రతి దేశ ఆర్థిక చట్రంలో పన్నులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక విధానాలు, సామాజిక కార్యక్రమాలు, పొరుగు దేశాలతో ఆర్థిక పోటీతత్వాన్ని ఇవి రూపొందిస్తాయి. 2025లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు వివిధ దేశాల్లో గణనీయంగా మారింది. కొన్ని దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ప్రగతిశీల పన్ను నమూనాలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి తక్కువ పన్నులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2025లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఉన్న టాప్ 10 దేశాల వివరాలు కింద తెలుసుకుందాం.భారత్‌లో ఇది గరిష్ఠంగా 30 శాతం ఉంది. -
14 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహారం, కూరగాయలు, ఇంధన ధరల తగ్గుదలతో టోకు ద్రవ్యోల్బణం మరింత కనిష్టానికి దిగొచ్చింది. మే నెలలో టోకు ధరల ఆధారిత సూచీ 0.39 శాతంగా నమోదైంది. ఇది 14 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు టోకు ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉంటే, గతేడాది మే నెలలో 2.74 శాతంగా ఉంది. ఆహార వస్తువుల విభాగంలో 1.56% ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!ఏప్రిల్ నెలలో ఇది మైనస్ 0.86%గా ఉంది. ముఖ్యంగా కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పుల విభాగంలో ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. కూరగాయల్లో అయితే ఏకంగా మైనస్ 21.6% ద్రవ్యోల్బణం నెలకొంది. ఇంధనం, విద్యుత్ విభాగంలోనూ మైనస్ 2.3% ద్రవ్యోల్బణం నమోదైంది. ఏప్రిల్‌లో ఇదే విభాగంలో 2.18% ద్రవ్యోల్బణం ఉండం గమనార్హం. తయారీ వస్తువుల విభాగంలో 2.04% ద్రవ్యోల్బణం నెలకొంది. మే నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయిలో 2.82 శాతానికి దిగిరావడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్ని విభాగాల్లోనూ కనిపించినట్టు ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు. -
దేశీ కంపెనీలకు రేర్ తిప్పలు!
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలను కఠినతరం చేయడంతో భారతీయ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ప్రధానంగా వాహన విడిభాగాల పరిశ్రమను ఈ అనిశ్చితి వెంటాడుతోంది. నేరుగా చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతి కోసం లైసెన్స్‌లకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో దేశీ కంపెనీల దరఖాస్తుల సంఖ్య రెట్టింపైనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. జూన్ మధ్య నాటికి సుమారు 21 కంపెనీలు మీడియం, హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతి పరి్మట్ల కోసం చైనా వాణిజ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగుమతిదారులు కొనుగోలుదారు నుంచి ఎండ్–యూజర్ సరి్టఫికెట్‌ను తీసుకోవడం సహా అధికారిక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ చైనా ఏప్రిల్ 4న ఆదేశాలు చేసిన నేపథ్యంలో వీటి ఎగుమతులకు తీవ్ర అండ్డంకులు నెలకొన్నాయి. ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ మెటీరియల్స్‌ను ఎలాంటి ఆయుధాల ఉత్పత్తిలోనూ ఉపయోగించబోమని హామీ ఇవ్వడంతో పాటు నిర్దిష్ట డిక్లరేషన్లు ఈ సరి్టఫికెట్లో ఉంటాయి. చైనాకు దరఖాస్తు చేసిన కంపెనీల్లో బాష్ ఇండియా, మారెల్లి పవర్‌ట్రెయిన్ ఇండియా, మాహల్ ఎలక్ట్రిక్ డైవŠస్ ఇండియా, టీవీఎస్ మోటార్స్, యూనో ఇండియా తదితర దిగ్గజాలు ఉన్నాయి. విధానపరమైన కారణాలతో గతంలో తిరస్కరణకు గురైన సోనా కామ్స్టర్ తిరిగి దరఖాస్తు చేసుకుంది. చైనా ఆమోదం కోసం వేచి చూస్తోంది. 52 కంపెనీలు... భారతీయ వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్) వివరాల ప్రకారం భారతీయ ఆటోమబైల్ కంపెనీలకు సరఫరా చేయడం కోసం దాదాపు 52 కంపెనీలు పూర్తిగా చైనా మాగ్నెట్లపైనే ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు తమ తాజా పర్మిట్ల కోసం అన్ని లాంఛనాలను పూర్తి చేసి చైనా సరఫరాదారులకు డాక్యుమెంట్లను పంపించాయి. అయితే, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వాటికి ఇంకా తప్పనిసరి ఎగుమతి లైసెన్స్ రాకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క, భారతీయ అధికారులు కూడా చైనాతో చర్చల కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెద్దగా పురోగతి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, యూరోపియన్ సంస్థలు మాత్రం ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకున్నాయి. వాస్తవానికి యూఎస్ సుంకాలకు ప్రతిగా చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్లపై నిబంధనలను కఠినతరం చేయగా.. అమెరికా ప్రభుత్వం వాటి సరఫరా విషయంలో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యూరప్ వాహన విడిభాగాల తయారీ సంస్థలకు కూడా అనుమతులు లభించాయి. భారతీయ కంపెనీలు మాత్రం అనుమతుల కోసం నానాతప్పలు పడుతున్నాయి.ఉత్పత్తికి విఘాతం... వీలైనంత త్వరగా లైసెన్స్‌లు దక్కకపోతే తయారీకి తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన పరిశ్రమ స్థాయితో పోలిస్తే రేర్ ఎర్త్ మాగ్నెట్ల దిగుమతుల విలువ తక్కువే అయినప్పటికీ.. వాటిని ఉపయోగించి తయారు చేసే ఒక్క విడిభాగం లేకపోయినా వాహనాల తయారీ నిలిచిపోతుందని ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. 2024–25లో భారత్ రూ.306 కోట్ల విలువైన 870 టన్నలు రేర్ ఎర్త్ మాగ్నెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం కంపెనీల వద్దనున్న నిల్వలు జూన్ మొదటి నాటికి పూర్తిగా అయిపోతాయని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. -
ఎస్బీఐ ఇంటి రుణం కారు చౌకగా..!
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పెద్ద ఉపశమనాన్ని కలి్పంచింది. ఆర్బీఐ రెపో రేటు 0.50 శాతం తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదలాయించింది. వివిధ రకాల రుణాలపై 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఎస్బీఐ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గించింది. ఈ తగ్గింపు అనంతరం ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 7.75 శాతానికి దిగొచి్చంది. అలాగే, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటును (ఈబీఎల్ఆర్) సైతం 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. సవరించిన రేట్లు జూన్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేట్లలో ఎస్బీఐ ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 8.2 శాతంగా, మూడు నెలల రేటు 8.55 శాతం, ఆరు నెలల రేటు 8.90 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతం, రెండేళ్ల రేటు 9.05 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.10 శాతం చొప్పున ఉన్నాయి. ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్‌లు తమ రుణ రేట్లను సైతం వేగంగా సవరించడం గమనార్హం. ఇప్పుడు ఎస్బీఐ సైతం ఇదే నిర్ణయాన్ని అమలు చేసింది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరును బట్టి ఎస్బీఐ గృహ రుణ రేటు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉండనుంది. డిపాజిట్ రేట్లకూ కోతమరోవైపు వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై రేటును సైతం ఎస్బీఐ తగ్గించింది. రూ.3 కోట్ల వరకు అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 1–2 ఏళ్ల డిపాజిట్లపై రేటు తగ్గింపు అనంతరం 6.50 శాతానికి దిగొచి్చంది. 2–3 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.70 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గింది. 3–5 ఏళ్లలో మెచ్యూరిటీ తీరే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.30 శాతం, 5–10 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.05 శాతానికి తగ్గింది. 444 రోజుల అమృత్ వృష్టి డిపాజిట్‌పై రేటు 6.85 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గింది. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్లపై 50 బేసిస్ పాయింట్లు, 80 ఏళ్లు నిండిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్ల అదనపు రేటు డిపాజిట్లపై లభిస్తుంది. పెద్ద ఊరటే.. రూ.50 లక్షల గృహ రుణం, 8 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే తాజా 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు రూపంలో రుణ గ్రహీతకు రూ.3.70 లక్షలు ఆదా కానుంది. 8 శాతం రేటుపై రేటు సవరణకు ముందు నెలవారీ ఈఎంఐ 41,822 కాగా, సవరణ తర్వాత రూ.40,280కు దిగివస్తుంది. ఈఎంఐ తగ్గించుకోకుండా పూర్వపు మాదిరే చెల్లిస్తూ వెళ్లేట్టు అయితే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే రుణం తీరిపోతుంది. -
హోర్ముజ్ జలసంధి మూసివేత..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఆధ్వర్యంలోని హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే యుద్ధం నేపథ్యంలో దీని గుండా చేసే చమురు సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ జలసంధి ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% రవాణాను సులభతరం చేస్తుంది.ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఈ హోర్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్, కువైట్లకు ఒక ముఖ్యమైన సప్లై కారిడార్‌గా పనిచేస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణలు, ఆర్థిక ఆంక్షలకు గురవుతుంది. దీని గుండా చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే తీవ్రమైన సరఫరా గొలుసు అవరోధాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ముడి చమురు ధరలను పెంచుతుందని చెబుతున్నారు.ముడిచమురు ధరలపై కీలక ప్రభావంసరఫరా అంతరాయాలుఅమెరికా, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్‌కు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆంక్షల వల్ల ప్రపంచ క్రూడ్ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది చమురు ధరలు పెరగడానికి, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటానికి దారితీస్తుంది.మార్కెట్ ఒడిదొడుకులుఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ 10% పైగా పెరగడానికి దారితీశాయి. ఇది దీర్ఘకాలిక సంక్షోభంతో కూడిన మార్కెట్ భయాలను ప్రతిబింబిస్తుంది. పశ్చిమాసియాలో అస్థిరతపై పెట్టుబడిదారులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.పరిశ్రమలపై ప్రభావం..పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పెయింట్స్, కెమికల్స్ పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్‌పై ఆధారపడతాయి. టైర్లు, రబ్బరు తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి. ఏవియేషన్, షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్రష్యాకు అవకాశం..హోర్ముజ్ జలసంధి దిగ్బంధం చేస్తారనే భయాలతో రష్యన్ క్రూడాయిల్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆంక్షల తరువాత ఇప్పటికే రష్యన్ చమురు రాయితీతో లభిస్తుంది. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను పెంచాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ ఇలాగే హోర్ముజ్ జలసంధి గుండా సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ భయాలు సృష్టిస్తే గల్ఫేతర చమురు సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుతుందనే వాదనలున్నాయి.ఇరాన్ బెదిరింపుల వెనుక కారణాలుఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు సమర్థంగా సమాధానం చెబుతామని ఇరాన్ ప్రతిస్పందించింది. అందులో భాగంగా హోర్ముజ్ జలసంధిని నిలిపేయడం దాని వ్యూహాత్మక ఎంపికల్లో ఒకటి. ఈ జలసంధి ముఖ్యమైన చమురు రవాణా మార్గం. ఇది ప్రపంచ ముడి చమురులో 20% రవాణాకు తోడ్పడుతుంది. దీనికి విఘాతం కలిగిస్తే చమురు ధరలు పెరుగుతాయి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇరాన్ చారిత్రాత్మకంగా హోర్ముజ్‌ను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బేరసారాలు సాగించింది. కానీ ఎన్నడూ దాన్ని నిలిపేయలేదు.పూర్తి మూసివేత సాధ్యం అవుతుందా..?ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హోర్ముజ్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ యూకే, ఫ్రెంచ్ మిత్రదేశాలతో కలిసి ఆ జలమార్గంలో గస్తీ నిర్వహిస్తుంది. దీన్ని పూర్తిగా నిలిపేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి. -
చమురు సలసల.. రూపాయి విలవిల
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర నిన్నటి మార్కెట్లో ఒక దశలో 13 శాతం పెరిగి 78 డాలర్లకు చేరింది. 2022 మార్చి తర్వాత ఒకే రోజు చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. నాడు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చమురు ధరలకు ఆజ్యం పోశాయి.తాజాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ చేసిన ప్రకటన ఆందోళనలను మరింత పెంచింది. ఆ తర్వాత కొంత తగ్గి 74.32 డాలర్ల స్థాయికి బ్రెంట్ క్రూడ్ ధరలు దిగొచ్చాయి. బెంచ్‌మార్క్ యూఎస్ క్రూడ్ సైతం 7%కి పైగా పెరిగి 73 డాలర్లకు చేరింది. ధరలు మరింత పెరగొచ్చు.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విస్తృతమైతే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. మోర్గాన్ స్టాన్లీ అయితే 130 డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. చమురు ఉత్పత్తిలో ఇరాన్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే, మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్’పెరిగిన క్రూడ్ ధరలతో కరిగిన రూపాయి క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 59 పైసలు బలహీనపడి 86.11 వద్ద స్థిరపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడితో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం కూడా మన కరెన్సీ ఒత్తిడికి లోనైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో గురువారం ముగింపు(85.52)తో పోలిస్తే ఏకంగా 73 పైసల బలహీనతతో 86.25 వద్ద మొదలైంది. దేశీయ మే ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడం.., ఆర్బీఐ జోక్యంతో రూపాయి కాస్త రికవరీ అయ్యింది. -
ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగం @ రూ. 3,600 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2024లో రూ. 3,600 కోట్ల స్థాయికి చేరింది. 2025లో ఇది మరో 25 శాతం వృద్ధి చెందనుంది. ది గోట్ ఏజెన్సీ, డబ్ల్యూపీపీ మీడియా, కాంటార్ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ తీరుతెన్నులు, వినియోగదారుల ధోరణులను మార్చేందుకు .. బ్రాండ్‌పై విశ్వసనీయతను పెంచుకునేందుకు కంపెనీలు ఏ విధంగా తమ మార్కెటింగ్ వ్యూహాల్లో ఇన్ఫ్లుయెన్సర్లను భాగం చేసుకుంటున్నాయి లాంటి అంశాలను ఇది వివరించింది. దీని ప్రకారం ఈ పరిశ్రమలో ప్రధానంగా ఫాలోయర్ల సంఖ్యపైనే దృష్టి పెట్టే ధోరణిలో మార్పులు వస్తున్నాయి. బ్రాండ్లు ఎక్కువగా కంటెంట్ నాణ్యత, క్రియేటర్ల ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విభాగంలో 85 శాతం బ్రాండ్లు ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికలో కంటెంట్ నాణ్యత ప్రాథమిక ప్రాతిపదికగా ఉంటున్నట్లు వివరించాయి. దీర్ఘకాలిక భాగస్వామ్యానికి మొగ్గు.. నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు బ్రాండ్లు మొగ్గు చూపుతున్నాయి. 72 శాతం బ్రాండ్లు ఇలాంటి భాగస్వామ్యాలను ఎంచుకున్నాయి. కంటెంట్ నియంత్రణ, బ్రాండ్ భద్రత రీత్యా 95 శాతం బ్రాండ్లు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. అయితే, విశిష్టమైన రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇన్ఫ్లుయెన్సర్లకు ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్లాంటి విభాగాల్లో డిమాండ్ ఉంటోంది. సవాళ్లు ఉన్నాయి... → సానుకూలాంశాలు అనేకం ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సవాళ్లు కూడా ఉంటున్నాయి. సరైన ఇన్ఫ్లుయెన్సర్లను దొరకపుచ్చుకోవడం ప్రధాన సవాలుగా ఉంటోంది. 83 శాతం మార్కెటర్లు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు) సెక్టార్లో 95 శాతం సంస్థలు సరైన టాలెంట్‌ను దొరకపుచ్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించాయి. పెట్టుబడులపై రాబడులను (ఆర్వోఐ) లెక్కించేందుకు మార్కెటర్లు ఎక్కువగా ఎంగేజ్మెంట్ రేట్ (39 శాతం), కంటెంట్ నాణ్యత (36 శాతం)కు ప్రాధాన్యత ఇస్తున్నారు. → వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ప్రస్థానంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను ప్రోడక్ట్ డిస్కవరీ కోసం (63 శాతం మంది), సమాచార సేకరణ కోసం (69 శాతం మంది) ఫాలో చేస్తున్నట్లు భారతీయ వినియోగదారులు తెలిపారు. → ఇన్ఫ్లుయెన్సర్లతో చేతులు కలపడంలో విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 70 శాతం బ్రాండ్లు తెలిపాయి. బీఎఫ్ఎస్ఐలో ఇది 77 శాతంగా ఎఫ్ఎంసీజీలో ఇది 76 శాతంగా ఉంది. → నేటి వినియోగదారులు కేవలం ప్రోడక్టుల కొనుగోలుకే కాకుండా, స్టోరీలు, కమ్యూనిటీలు, తాము విశ్వసించే క్రియేటర్లు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇన్ఫ్లుయెన్సర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించే బ్రాండ్లే రాణిస్తాయి. నియంత్రణలు, కంటెంట్‌పై ఫోకస్ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రాండ్లు, క్రియేటర్లు అర్థవంతమైన, దీర్ఘకాలం నిలబడే భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం కీలకంగా నిలుస్తుంది. -
పీఎల్ఐ స్కీములతో పెట్టుబడులకు దన్ను..
ఎలక్ట్రిక్, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాలతో పని చేసే హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) తయారీ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెడితే మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఈ విభాగంపై తయారీ సంస్థలు, సరఫరాదారులు పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేయకపోవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్‘పీఎల్ఐ స్కీమును ప్రకటిస్తే కొత్త పెట్టుబడులు వస్తాయి. తయారీ, ఇంజినీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే హెచ్ఈఎంఎంలను దేశీయంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి‘ అని భారతీయ ఖనిజ పరిశ్రమ సమాఖ్య (ఎఫ్ఐఎంఐ) రూపొందించిన నివేదిక తెలిపింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌తో కలిసి ఎఫ్ఐఎంఐ దీన్ని రూపొందించింది. మైనింగ్ కార్యకలాపాల్లో కీలకమైన హెచ్ఈఎంఎంలు.. కర్బన ఉద్గారాలకు కారకంగా ఉంటున్నందున పర్యావరణహితమైన మెషినరీపై ఆసక్తి ఏర్పడుతోంది. -
సూక్ష్మ రుణాలు 25 శాతం డౌన్
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేసిన రుణాల మొత్తం రూ.1,12,459 కోట్లుగా ఉంది. మొత్తం 2.2 కోట్ల ఖాతాదారులకు ఈ మొత్తం రుణాల రూపంలో అందింది. 2023–24లో ఈ రంగం పంపిణీ చేసిన రుణాల మొత్తంతో పోల్చితే 25 శాతం తగ్గినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) తెలిపింది. 2023–24తో పోల్చితే 2024–25లో ఒక్కో ఖాతావారీ సగటు రుణ పంపిణీ 12.3 శాతం అధికంగా రూ.50,131గా ఉంది. ఎన్బీఎఫ్సీ–ఎఎంఫ్‌ఐ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.57,307 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 36 శాతం ఎక్కువ. ఎన్బీఎఫ్సీ–ఎఎంఫ్‌ఐ సమీకరించిన రుణ నిధుల్లో 78.4 శాతం బ్యాంకుల నుంచి లభించింది. 11.9 శాతం నాన్ బ్యాంకుల నుంచి, 5.1 శాతం ఈసీబీల రూపంలో వచి్చంది. 2025 మార్చితో ముగిసిన చివరి మూడు నెలల కాలంలో ఎంఎఫ్ఐ నిర్వహణ ఆస్తులు (రుణాలు) 2024 మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే 11.9 శాతం తగ్గి రూ.1,47,279 కోట్లుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఎంఎఫ్ఐ పోర్ట్‌ఫోలియోని గమనిస్తే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వాటా 33 శాతంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు 28 శాతం, ఉత్తరాది 17 శాతం, పశ్చిమ భారత్ వాటా 14 శాతం చొప్పున ఉంది. -
ఆహార ధరలు మరింత తగ్గాయ్..!
న్యూఢిల్లీ: ధరలు మరింత దిగొచ్చాయి. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.82 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరిలో 2.57 శాతం తర్వాత తిరిగి కనిష్టానికి దిగి రావడం ఇదే మొదటిసారి. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ/రిటైల్) ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.16 శాతంగా ఉంటే, 2024 మే నెలలో 4.8 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం 0.99 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.69 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ఈ స్థాయికి దిగువనే ఉండడం సానుకూలించే అంశం. ఈ అంచనాల నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటును ఏకంగా అర శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ‘‘పప్పులు, వాటి సంబంధిత ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, ధాన్యం ఉత్పత్తులు, గృహ వినియోగ వస్తువులు, సేవల ద్రవ్యోల్బణం తగ్గడం మే నెలలో ఆహార, రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడింది’’అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. ఆహార ద్రవ్యోల్బణం 2021 అక్టోబర్ తర్వాత కనిష్ట స్థాయిలో నమోదైనట్టు తెలిపింది. పట్టణాల్లో కాస్త ఎక్కువ..: మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.59 శాతానికి పరిమితం అయితే.. పట్టణ ప్రాంతాల్లో ఇది 3.07 శాతంగా ఉంది. ముఖ్యంగా దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. 0.55 శాతంగా ఉంది. కాగా, అత్యధికంగా కేరళలో 6.46 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. -
అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!
అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్ బఫెట్ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్‌లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్ బఫెట్ ఆలోచనలు బ్రూటల్.. కానీ బ్రిలియంట్. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్‌లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు. -
మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం
దేశంలోనే అగ్రగామి బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్‌కు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి సారించింది. ఇందుకు వీలుగా బ్యాంక్ శాఖల స్థాయిలో 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టినట్టు తెలిపింది. పరిశ్రమలోనే దీన్నొక పెద్ద నియామక ప్రక్రియగా పేర్కొంది.ఇదీ చదవండి: జియో బ్లాక్‌రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతిఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాథమిక స్థాయి పరీక్షల అనంతరం ఏప్రిల్ నెలలో ప్రధాన పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. పారదర్శక విధానంలో చివరికి 13,455 అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మందిని బ్యాంక్ నియమించుకోనుండగా.. ఇందులో 13,500 మంది క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు కాగా, మిగిలిన వారు స్థానిక అధికారులుగా పేర్కొన్నారు. -
825 బిలియన్ డాలర్ల ఎగుమతులు
బెర్న్: ప్రపంచ వాణిజ్యం భౌగోళిక రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అయినా భారత్ 2025–26లో 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను (రూ.70.12 లక్షల కోట్లు) సాధిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ పోరు, రెడ్సీ సంక్షోభాలను ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సందర్భాల్లో భారత్ విజేతగా నిలిచినట్టు గుర్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2024–25లో భారత్ 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసినట్టు చెప్పారు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం క్షీణతను చవిచూడనుందని మంత్రి చెప్పారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) మాత్రం 2025–26లో ఎగుమతులు 21 శాతం పెరిగి ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు పెరిగిపోయిన తరుణంలో కొనుగోలుదారులు తమ సోర్సింగ్ (ముడి సరుకుల సమీకరణ)ను వైవిధ్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడం వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హన్ తెలిపారు. ఎఫ్ఐఈవో అంచనా మేరకు 2025–26లో వస్తు ఎగుమతులు 12 శాతం పెరిగి 525–535 బిలియన్ డాలర్లుగా ఉండనున్నాయి. 2024–25లో వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల గుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇవి 20 శాతం పెరిగి 465–475 బిలియన్ డాలర్లకు చేరుకోచ్చన్నది ఎఫ్ఐఈవో అంచనా. ఎఫ్‌టీఏలతో సానుకూలత యూఏఈ, ఆ్రస్టేలియా, ఐరోపా ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) ఎగుమతుల వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో అంచనా వేస్తోంది. ఇందులో ఈఎఫ్‌టీఏతో ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్ పాలనలో కుదిరిన ఎఫ్‌టీఏలు దేశీ సంస్థలకు నష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి గోయల్ అన్నారు. పోటీ దేశాలైన ఆసియా దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, అవి కూడా సమతుల్యంగా లేనట్టు చెప్పారు. ఆయా దేశాలకు భారత్ మార్కెట్ అవకాశాలు కలి్పంచగా, బదులుగా మనకు మంచి అవకాశాలు దక్కలేదన్నారు. మోదీ సర్కారు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలైన ఆ్రస్టేలియా, యూకే, ఈఎఫ్టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. -
రుణ రేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ తన రుణ రేట్లను అరశాతం తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈఈఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. కొత్తగా రుణాలు తీసుకొనేవారితోపా టు, ప్రస్తుత రిటైల్ (గృహ, వాహన, వ్యక్తిగత), ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది. మరోవైపు కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ రేటును 8.75% నుంచి 8.25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఐవోబీ సైతం ఆర్ఎల్ఎల్ఆర్ రేటును 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?
ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మర్చంట్ టర్నోవర్‌తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్‌ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి బదులుగా రూ.3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని కొందరు అధికారులు తెలిపారు.రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80 శాతంగా ఉంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలు ఉన్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది.బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి. -
చిన్న ఎగుమతిదార్లకు కేంద్రం చేయూత
కొత్త మార్కెట్లలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంలో లఘు, చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లకు (ఎంఎస్ఎంఈ) చేయూతనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందుకోసం ప్రత్యేక స్కీమును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా భారతీయ వ్యాపార వర్గాల బృందంతో భేటీ అయిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.‘ఏ ఎంఎస్ఎంఈ అయినా ప్రపంచంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను నమోదు చేయించుకోవడానికి ఖర్చు చేయాల్సి వస్తే, ఆ మొత్తం భారాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ఒక స్కీమును ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. ముఖ్యంగా కొత్త ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, కొత్త ఎగుమతిదార్లకు దీన్ని వర్తింప చేయొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఉండగా, మరిన్ని దేశాలతో కుదుర్చుకునే ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోందని చెప్పారు.ఇదీ చదవండి: చైనా పప్పులేం ఉడకవు..బడ్జెట్లో ప్రకటించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌లో (ఈపీఎం) మంత్రి పేర్కొన్న స్కీము భాగంగా ఉంటుందని అంచనా. దీనితో ఎంఎస్ఎంఈలు..ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభతర రుణ పథకాలు, విదేశాల్లో వేర్‌హౌసింగ్ సదుపాయాలు, అంతర్జాతీయంగా బ్రాండింగ్ మొదలైన 12 అంశాల్లో సదరు సంస్థలకు మద్దతు లభిస్తుంది. 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతుల పరిమాణం 2024–25లో 825 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 40 శాతం పైగా ఉంటోంది. -
భారత్ వృద్ధి 6.3 శాతమే
వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) భారత జీడీపీ 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్న గత అంచనాలను ప్రపంచబ్యాంక్ కొనసాగించింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు భారత ఎగుమతులపై చూపిస్తున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంది. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. 2025–26లో భారత వృద్ధి రేటు 6.7 శాతం ఉండొచ్చని జనవరిలో ప్రపంచబ్యాంక్ అంచనా వేయగా.. అమెరికా టారిఫ్‌లు, అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో దీన్ని 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఏప్రిల్‌లో ప్రకటించింది.ఇప్పుడు మరోసారి ఏప్రిల్ అంచనానే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశి్చతులతో ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి 2.3 శాతానికి క్షీణిస్తుందంటూ తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనా కంటే ఇది అర శాతం తక్కువ. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఆర్థిక వ్యవస్థల వృద్ధి అంచనాల తగ్గింపునకు అంతర్జాతీయ అనిశ్చితులను కారణంగా ప్రపంచబ్యాంక్ ప్రస్తావించింది. ఎగుమతులకు అడ్డంకులు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2025–26 సంవత్సరానికి భారత్ 6.3 శాతంతో వేగవంతమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని అంచనా వేస్తు న్నట్టు ప్రపంచబ్యాంక్ తెలిపింది. అయినప్పటికీ జనవరి అంచనాలతో పోల్చి చూస్తే 0.4% తగ్గించడాన్ని గుర్తు చేసింది. కీలక భాగస్వామ్య దేశాలలో బలహీన కార్యకలాపాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న అవరోధాలతో ఎగుమతులు క్షీణిస్తాయని అంచనా వేసింది. 2024–25లో భారత వృద్ది రేటు మోస్తరు స్థాయికి దిగిరావడాన్ని నివేదికలో ప్రస్తావించింది. ముఖ్యంగా పారిశ్రామికోత్పత్తి క్షీణించినట్టు తెలిపింది. నిర్మాణ రంగం, సేవల రంగంలో కార్యకలాపాలు స్థిరంగా ఉంటే, వ్యవసాయ రంగం బలంగా పుంజుకున్నట్టు గుర్తు చేసింది. 2026–27 అంచనాలూ తగ్గింపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం వృద్ధి సాధించొచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. జనవరి అంచనాలతో పోల్చి చూస్తే 0.2 శాతం తక్కువ. పెట్టుబడుల వృద్ధి కూడా నిదానించొచ్చని పేర్కొంది. మరోవైపు చైనా 2025లో 4.5 శాతం, 2026లో 4 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి 2.3 శాతంవాణిజ్య వివాదాల కారణంగా యూఎస్‌సహా ప్రపంచ వృద్ధి మందగించనున్నట్లు ప్రపంచ బ్యాంక్ తాజాగా పేర్కొంది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వాణిజ్య సుంకాలకు తెరతీసిన నేపథ్యంలో ఆర్థిక పురోభివృద్ధి కుంటుపడనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి ప్రపంచ ఆర్థిక వృద్ధి 2.3 శాతానికి పరిమితంకానున్నట్లు అంచనా వేసింది. ట్రంప్ పేరు ప్రస్తావించని ప్రపంచ బ్యాంక్ వాణిజ్య ప్రతిబంధకాల కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 1.4 శాతం పుంజుకోవచ్చని పేర్కొంది. 2024లో సాధించిన 2.8 శాతం వృద్ధిలో ఇది సగంకాగా.. 2025 జనవరిలో వేసిన 2.3 శాతం అంచనాలను దిగువముఖంగా సవరించింది. ఈ బాటలో ప్రస్తుత ఏడాది(2025) ప్రపంచ వృద్ధి అంచనాలను సైతం 0.4 శాతం కుదించి 2.3 శాతానికి చేర్చింది. 2024లో 2.8 శాతం వృద్ధి నమోదైంది. -
డిజిటల్ చెల్లింపుల జోరు
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా దేశీయంగా డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రూ. 24.77 లక్షల కోట్లు విలువ చేసే 1,830.151 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం యూపీఐ సిస్టంను 46 కోట్ల మంది పైగా వ్యక్తులు, 6.5 కోట్లకు పైగా వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన బుక్‌లెట్‌లో కేంద్రం ఈ విషయాలు తెలిపింది.అత్యంత తక్కువ మొత్తంతో కూడుకున్న లావాదేవీలకు కూడా ప్రస్తుతం ప్రజలు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు, మొత్తం పేమెంట్లలో దాదాపు 50 శాతం వాటా వీటిదే ఉంటున్నట్లు వివరించింది. ఇక నగదు బదిలీ (డీబీటీ) వంటి స్కీములను ప్రస్తావిస్తూ పారదర్శకతను పెంచేందుకు, గవర్నెన్స్ లోపాలను అరికట్టేందుకు ప్రభుత్వం టెక్నాలజీ, డిజిటల్ సాధనాలను సమర్ధవంతంగా ఉపయోగిస్తోందని బుక్లెట్ పేర్కొంది. వివిధ సంక్షేమ పథకాల్లో డీబీటీ, ఆధార్ ధ్రువీకరణను ప్రవేశపెట్టడంతో లక్షల కొద్దీ బోగస్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయిందని, ప్రభుత్వానికి భారీగా ఆదా కావడంతో పాటు ప్రజలకు సకాలంలో ప్రయోజనాలు అందుతున్నాయని వివరించింది. 2015 నుంచి 2023 మార్చి మధ్య కాలంలో డీబీటీ కారణంగా రూ. 3.48 లక్షల కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. గత 11 ఏళ్లలో కోట్లాది మంది ప్రజలకు బ్యాంక్ ఖాతాలు, బీమా వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు వివరించింది. 55.22 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరవగా, పీఎం సురక్షా బీమా యోజన కింద 51 కోట్ల మందికి కవరేజీ దక్కినట్లు బుక్లెట్ తెలిపింది. -
వేగంగా రిఫండ్లు
ముంబై: క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, బీమా, పెన్షన్ నిధులను తిరిగి చెల్లించడాన్ని (రిఫండ్లు) వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థలు, శాఖలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, కేవైసీ ప్రక్రియల క్రమబధ్దికరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 29వ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.సామాన్య పౌరుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అర్హత కలిగిన వారికి రిఫండ్లను వేగంగా ప్రాసెస్ చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆర్బీఐ, సెబీ, ఎంసీఏ, పీఎఫ్ఆర్డీఏ, ఐఆర్డీఏఐ, బ్యాంక్‌లు, పెన్షన్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో దీన్ని చేపట్టాలని కోరారు. ఆర్థిక రంగం అంతటా సులభతర కేవైసీ విధానానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఎస్‌డీసీకి సూచించారు. ఉమ్మడి కేవైసీ నిబంధనలతోపాటు సులభతర, డిజిటల్ కేవైసీ అవసరాన్ని ప్రస్తావించారు. -
రిచ్ మరింత ‘రిచ్’.. పూర్ మరింత ‘పూర్’
ప్రపంచంలోనే యూఎస్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోంది. త్వరలో జపాన్ను సైతం వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంటోందనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. గతంలో ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం దేశంలోని కుబేరుల సంఖ్య ఏడికేడు పెరుగుతోంది. మొత్తం దేశంలో అత్యధిక సంపన్నుల సంఖ్య 1,539కు పైగానే ఉంది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల కంటే ఎక్కువే సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందుతున్నాయి. ఇలా కొద్ది మంది వద్దే రూ.లక్షల కోట్లు పొగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ఆర్థిక అసమానతలుచాలా మంది ఇంటిముందు మురికికాలువ పారుతుంటే టెక్నికల్‌గా ప్రపంచంలోనే టాప్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ దూసుకుపోతుందని చంకలు చరుచుకోవడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద మూలుగుతోంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదంభారత్తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు ఊరట! తులం ఎంతంటే..ఏం చేయాలంటే..భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తుంది. అయితే ఇలా కుబేరుల సంఖ్య పెంచుకుంటూ, వారి సంపదను లెక్కల్లో చూపుతూ ఈ ఘనత సాధించడంలో అర్థం లేదు. సామాజిక శైలి, సమగ్ర జీవన ప్రమాణాల్లో మార్పు వస్తూ సంపద సృష్టించగలితేనే మేలు జరుగుతుంది. ఈమేరకు విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నాలు చేయకపోతే కొందరి చేతిల్లోనే సంపద చేరి దేశంలో సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉంది. -
జపాన్ను వెనక్కి నెడుతున్నామని సంతృప్తి చెందొద్దు
భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నందుకు సంతృప్తి చెందొద్దని.. తలసరి ఆదాయం పరంగా జపాన్‌తో పోల్చి చూస్తే భారత్ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) మాజీ ఎండీ క్లౌడే స్మద్జా వ్యాఖ్యానించారు.ఐఎంఎఫ్ 2025 ఏప్రిల్ డేటా ప్రకారం భారత్‌లో తలసరి ఆదాయం 2,878 డాలర్లు. జపాన్ తలసరి ఆదాయం 33,956 డాలర్లలో పోల్చి చూస్తే కేవలం 8.5 శాతమే కావడం గమనార్హం. భారత్ తలసరి ఆదాయం కంటే జపాన్‌లో తలసరి ఆదాయం 11.8 రెట్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘భారత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరుకోవడం సాధించిన ప్రగతికి సంబంధించి మంచి సంకేతమే. కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలుఆర్థికంగా భారత్ కొత్త స్థానానికి చేరుకోవడం అన్నది.. సంస్కరణలను వేగవంతం చేయడానికి.. అభివృద్ధి ఫలాలు కేవలం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వర్గాలకే పరిమితం కాకుండా పౌరులు అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రేరణ కావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా సాంకేతిక పోటీలో భారత్ కీలకమైన కూడలిలో ఉన్నట్టు తెలియజేస్తూ.. బిగ్ డేటా పరంగా ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్టు స్మద్జా తెలిపారు. ఈ స్థానాన్ని తప్పకుండా కాపాడుకోవడంతోపాటు.. అంతర్జాతీయంగా టెక్నాలజీ, ఆవిష్కరణల్లో అగ్రస్థానానికి చేరుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. -
సంక్లిష్ట చక్రంలో సూక్ష్మ రుణ రంగం
ముంబై: అధిక రుణ భారం, గరిష్ట వడ్డీ రేట్లు, కఠిన వసూళ్ల ప్రక్రియలతో కూడిన సంక్లిష్ట సైకిల్‌తో సూక్ష్మ రుణ రంగం సతమతమవుతోందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్‌రావు అన్నారు. ‘అందరికీ ఆర్థిక సేవలు’ అన్న అంశంపై హెచ్ఎస్బీసీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సూక్ష్మ రుణాలపై అధిక వడ్డీ రేట్లను ప్రధానంగా ప్రస్తావించారు. జనాభాలో మినహాయింపు వర్గాలకు సంఘటిత ఆర్థిక సేవలను అందించడంలో సూక్ష్మ రుణ రంగం విశ్వసనీయ వేదికగా ఉన్నట్టు పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో సూక్ష్మ రుణ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ.. ఈ విషయంలో కొన్ని సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇటవలి త్రైమాసికాల్లో సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లు కొంత మోస్తరు స్థాయికి రావడాన్ని గమనించినట్టు చెప్పారు. అయినప్పటికీ వడ్డీ రేట్లు, మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు తెలిపారు. కొన్ని సంస్థలకు తక్కువ వ్యయాలకే నిధులు లభిస్తున్నప్పటికీ మిగిలిన పరిశ్రమతో పోల్చతే అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక రాబడులను ఇచ్చే సంప్రదాయ వ్యాపారానికి వెలుపలి అవకాశాలపై రుణదాతలు దృష్టి సారించాలని సూచించారు. ప్రక్రియలను మెరుగుపరుచుకోవాలి.. ‘‘సూక్ష్మ రుణ రంగంలో తరచుగా సమస్యలు ఏర్పడడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఒక్కో రుణ గ్రహీత బకాయిల భారం పెరిగింది. దీంతో కొన్ని సందర్భాల్లో కఠిన వసూళ్ల ప్రక్రియలు విషాద పరిణామాలకు దారితీస్తున్నాయి’’అని రాజేశ్వరరావు చెప్పారు. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవడం భాగస్వాములు అందరి ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా అవసరమని పేర్కొన్నారు. రుణ గ్రహీతలు అధికంగా రుణం తీసుకోవడాన్ని నిరోధించేందుకు వీలుగా నియంత్రిత సంస్థలు తమ క్రెడిట్ ఆమోద ప్రక్రియలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే, కఠిన రుణ వసూళ్ల ప్రక్రియలను విడిచి పెట్టాలన్నారు. స్థిరమైన, బాధ్యతాయుత విధానంలో సేవలు అందించాలని సూచించారు. ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని కూడా రాజేశ్వరరావు ప్రస్తావించారు. ఈ విషయంలో నిబంధనలు తీసుకురావాలా? లేదా అన్నదాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
ఆతిథ్య రంగంలో 6–8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ) ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మధ్య వృద్ధి చెందొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగానికి అవుట్‌లుక్‌ను సానుకూలం నుంచి స్థిరత్వానికి తగ్గించింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల పాటు భారత్‌కు విదేశీ పర్యాటకుల రాక స్తుబ్దుగా ఉంటుందని, ఆ తర్వాత నుంచి క్రమంగా పుంజుకోవచ్చని తెలిపింది. ఆతిథ్య రంగానికి దేశీ పర్యాటకం ఇప్పటి వరకు కీలక చోదకంగా ఉండగా, సమీప కాలంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, విమాన సేవల అనుసంధానత మెరుగుపడడం, జనాభా పరంగా సానుకూలత, ఎంఐసీఈ కార్యక్రమాలు పెరగడం, గత కొన్నేళ్లలో కొత్త కన్వెన్షన్ సెంటర్లు అందుబాటులోకి రావడం మధ్యకాలంలో ఆతిథ్య రంగంలో వృద్ధికి సానుకూలిస్తాయని ఇక్రా తెలిపింది. 2025–26లో ఆతిథ్య రంగం ఆదాయాలు, రుణ పరిస్థితులు స్థిరంగా ఉంటాయని పేర్కొంది. సానుకూల అవుట్‌లుక్ అన్నది సమీప కాలం నుంచి మధ్య కాలంలో అప్‌గ్రేడ్‌ను సూచిస్తే.. స్థిరమైన అవుట్‌లుక్ అన్నది సమీప కాలం నుంచి మధ్యకాలంలో మార్పులేమిని సూచిస్తుంది. 72–74 శాతం ఆక్యుపెన్సీ దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో ఆక్యపెన్సీ (గదుల బుకింగ్) 2025–26 సంవత్సరంలో 72–74 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనా. 2023–24లో నమోదైన 70–72 శాతంతో పోల్చితే కాస్త పెరగనుంది. ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు రూ.8,200–8,500 మధ్య ఉండొచ్చని ఇక్రా తెలిపింది. 2024–25లో ఈ ధరలు రూ.8,000–8,200 మధ్య ఉన్నట్టు వెల్లడించింది. కొన్ని హోటళ్లు నవీకరణ చేపట్టడం, సరఫరా పెరగకపోవడంతో ధరలు పెరగనున్నట్టు పేర్కొంది. ‘‘మూడేళ్లపాటు వరుసగా బలమైన డిమాండ్‌ను ఆతిథ్య పరిశ్రమ చూసింది. దేశీ విహార పర్యటనలు, సమావేశాలు, సదస్సులకు (ఎంఐసీఈ) డిమాండ్, వివాహాలు, వ్యాపార పర్యటనలు ఇందుకు అనుకూలించాయి. కానీ, 2025–26లో 6–8 శాతం మేర మోస్తరు వృద్ధికి పరిమితం కావొచ్చు’’అని ఇక్రా లిమిటెడ్ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జితిన్ మక్కర్ తెలిపారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి, మే నెలలో ఉత్తర, పశి్చమ భారత్‌లో అనిశి్చతులు పెరగడంతో ప్రయాణ, ఎంఐసీఈ కార్యక్రమాల రద్దులు పెరిగినట్టు చెప్పారు. ఇటీవలి వారాల్లో డిమాండ్ కోలుకుంటున్నట్టు తెలిపారు. ఆదాయంలో వృద్ధి తక్కువగానే ఉన్నప్పటికీ.. 13 బడా హోటల్ కంపెనీలు 34–36 శాతం మధ్య మార్జిన్లు నమోదు చేయొచ్చని ఇక్రా అంచనా వేసింది. వ్యయ నియంత్రణలు, అస్సెట్ లైట్ (అద్దెకు తీసుకోవడం) నమూనా మార్జిన్లకు మద్దతునిస్తాయని తెలిపింది. -
ప్రభుత్వానికి ఎస్బీఐ భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి(2024–25) షేరుకి రూ. 15.9 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో సంస్థ ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 8,077 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేథ్ సమక్షంలో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డివిడెండ్ చెక్ అందించారు. కాగా.. అంతక్రితం ఏడాదిలో షేరుకి రూ. 13.7 చొప్పున ప్రభుత్వానికి రూ. 6,959 కోట్లకుపైగా డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. గతేడాది ఎస్బీఐ 16 శాతం అధికంగా రూ. 70,901 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు 2023–24లో రూ. 61,077 కోట్ల లాభం సాధించింది. -
ఆర్బీఐ బాటలోనే బ్యాంక్‌లు
ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ తన మార్జినల్ కాస్ట్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచే ఈ సవరణ అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.తాజా తగ్గింపుతో ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేట్లు 8.90 శాతానికి దిగొచ్చాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు సైతం 0.10 శాతం తగ్గి 8.95 శాతానికి పరిమితమైంది. ఆరు నెలలు, ఏడాది కాల ఎంసీఎల్ఆర్ 0.10 శాతం తగ్గి 9.05 శాతంగా ఉంది. రెండు, మూడేళ్ల కాల ఎంసీఎల్ఆర్ 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వరంగ బీవోబీ సైతం రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 0.50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఇదీ చదవండి: ఎఫ్‌పీఐల యూటర్న్ దీంతో ఆర్ఎల్ఎల్ఆర్ 8.15 శాతానికి తగ్గింది. జూన్ 7 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటును అర శాతం తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదిలీ చేసినట్టు బీవోబీ ప్రకటించింది. పీఎన్బీ సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు, ఇది ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో గృహ రుణ రేటు 7.45 శాతం నుంచి ప్రారంభం కానుంది. -
అమెరికా రెట్టింపు సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం: జీటీఆర్ఐ
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో భారతీయ ఎగుమతులు ప్రభావితం అవుతాయని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్(జీటీఆర్ఐ) తెలిపింది. ముఖ్యంగా వాల్యూ యాడెడ్, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. యూఎస్ స్టీల్ పరిశ్రమ మనుగడ దృష్ట్యా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్‌ను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మే 30న ప్రకటించారు. సుంకాల పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి వస్తాయన్నారు ‘‘భారత్‌పై సుంకాల పెంపు పరిణామం ప్రత్యక్షంగా ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. ఈ సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్ ప్రతీకార సుంకాలను విధిస్తుందో లేదో చూడాలి’’ అని జీఆర్‌టీఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో విధించిన ఉక్కు సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను విధించే ఉద్దేశాన్ని సూచిస్తూ భారత్ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ)లో అధికారిక నోటీసు జారీ చేసింది. భారత్ 2024–25లో 4.56 బిలియన్ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిలో 587.5 మిలియన్ డాలర్ల ఇనుము, ఉక్కు, 3.1 బిలియన్ డాలర్లు ఇనుము లేదా ఉక్కు ఉత్పత్తులు, 860 మిలియన్ డాలర్లు అల్యూమినియం సంబంధిత ఉత్పత్తులున్నాయి. ధరల పోటీతత్వం తగ్గుతుంది: ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ భారతీయ స్టీల్ ఎగుమతులైన స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, స్ట్రక్చరల్ స్టీల్ విడిభాగాలు, ఆటోమోటివ్ స్టీల్ భాగాలైన సెమీ ఫినిష్డ్, ఫినిష్ట్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అధ్యక్షుడు ఎస్సీ రాల్హన్ తెలిపారు. అధిక పన్నులు అమెరికా మార్కెట్లో ధరల పోటీతత్వాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ వాణిజ్యం, తయారీ సప్లై చైన్‌ను నిరాశపరుస్తాయన్నారు. -
రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే..
రూ.500 నోట్లు మరోసారి రద్దవుతాయంటూ సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రూ.500 నోటును రద్దు చేస్తారంటూ వచ్చిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు దీనిపై స్పష్టత ఇచ్చింది.2026 మార్చి నుంచి రూ.500 నోట్లను దశలవారీగా రద్దు చేస్తామని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ కావడంతో కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి. క్యాపిటల్ టీవీ అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారానికి గురికావద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ‘రూ.500 నోట్లను రద్దు చేయలేదు. చట్టబద్ధంగానే ఉన్నాయి. వార్తలను నమ్మి.. షేర్ చేసే ముందు అధికారిక సోర్స్‌లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోండి’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.కొత్త రూ.500 నోట్లు ఎప్పుడొచ్చాయంటే..2016 నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 మిమీ x 150 మిమీ కొలతల్లో స్టోన్ గ్రే కలర్ లో ఉంటుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్ కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంటుంది. -
ఈఎంఐ.. ఇంకా తగ్గేనోయ్
అంతటా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరిన్ని చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించింది. ధరలు కాస్త అదుపులో ఉంటున్న నేపథ్యంలో కీలక రెపో రేటులో ఏకంగా అర శాతం కోత పెట్టి 5.5 శాతానికి తగ్గించింది. దీంతో గృహ, వాహన, ఇతరత్రా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అలాగే, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం నుంచి మరికాస్త ఉపశమనం లభించనుంది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెరిగి, ఎకానమీకి బూస్ట్‌లాగా పని చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అటు మార్కెట్లు కూడా జోరుగా పరుగులు తీశాయి. ముంబై: కీలక పాలసీ రేట్ల కోత ఊహిస్తున్నదే అయినా రిజర్వ్ బ్యాంక్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పావు శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తుండగా.. శుక్రవారం ఏకంగా అరశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు 5.5 శాతానికి దిగి వచి్చంది. 2020 మే తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా ఆర్బీఐ పాలసీ రేటును తగ్గించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా కోతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం దీన్ని 100 బేసిస్ పాయింట్ల (ఒక్క శాతం) మేర తగ్గించినట్లయింది. ఇక బ్యాంకులకు నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) 100 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇది 3 శాతానికి చేరింది. ఇప్పటికే మిగులు నిధులున్న బ్యాంకింగ్ వ్యవస్థలోకి దీనితో మరో రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చి చేరనున్నాయి. సీఆర్ఆర్ కోత సెప్టెంబర్–డిసెంబర్ మధ్య నాలుగు విడతలుగా అమల్లోకి వస్తుంది. మరోవైపు, రూ. 2.5 లక్షల లోపు పసిడి రుణాలపై లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి ఆర్బీఐ పెంచింది. బుధవారం నుంచి మూడు రోజులు పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పాలసీ రేటును అర శాతం తగ్గించే ప్రతిపాదనకు అనుకూలంగా అయిదుగురు ఓటేశారు. ‘ఉదార’ విధానం నుంచి ‘తటస్థ’ విధానానికి పాలసీని మారుస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అంటే, రెపో రేటును తగ్గించడానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో వచ్చే డేటాను బట్టి పెంచడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. రెపో తగ్గితే.. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఈ రేటును తగ్గిస్తే దీనితో అనుసంధానమైన ప్రామాణిక రుణ రేట్లు (ఈబీఎల్ఆర్) తగ్గుతాయి. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయిస్తే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం అర శాతం మేర తగ్గుతుంది. అయితే, రేట్ల కోతతో రుణ గ్రహీతలకు భారం తగ్గనున్నప్పటికీ.. డిపాజిట్ రేట్లు కూడా తగ్గడం వల్ల డిపాజిటర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. వృద్ధికి దన్ను.. ఓవైపు ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టి లకి‡్ష్యత స్థాయి కన్నా దిగువకు రావడం, మరోవైపు సర్వత్రా అనిశ్చితి నెలకొని వృద్ధి నెమ్మదించడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్ మల్హోత్రా చెప్పారు. ‘‘వృద్ధికి దోహదపడేలా పాలసీ రేట్లను ఉపయోగించి దేశీయంగా ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం నెలకొంది’’ అని ఆయన తెలిపారు. 7–8 శాతం స్థాయిలో అధిక వృద్ధి ఆకాంక్ష సాధన దిశగా తీసుకున్న చర్యగా మానిటరీ పాలసీని చూడాలని మల్హోత్రా వివరించారు.ఆశ్చర్యపర్చింది.. ఎంపీసీ నిర్ణయం చాలా వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యపర్చింది. ఎకానమీలో అన్ని రంగాలకు, ముఖ్యంగా బ్యాంకింగ్.. ఫైనాన్స్‌కు ఇది కచ్చితంగా సానుకూలాంశం.– సీఎస్ శెట్టి, చైర్మన్, ఎస్బీఐహౌసింగ్ మెరుగవుతుంది.. ఈఎంఐల భారం తగ్గడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుంది. మొద టిసా రి కొనుగోలు చేసే వారు తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది. – శేఖర్ జి.పటేల్, ప్రెసిడెంట్, క్రెడాయ్వృద్ధికి ఊతమిస్తుంది.. లిక్విడిటీ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వినియోగానికి ఊతమిస్తుంది. పెట్టుబడులకూ దోహదపడుతుంది. – రాజీవ్ సబర్వాల్, ఎండీ, టాటా క్యాపిటల్ ఆటో రంగానికి సానుకూలం ‘‘రెపో రేటును తగ్గించడంతో మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తాయి ఆటో పరిశ్రమకు ఇది సానుకూలం. – శైలేష్ చంద్ర, ప్రెసిడెంట్, సియామ్మా పని మేము చేశాం .. ఫిబ్రవరి నుంచి 100 బేసిస్ పాయింట్ల స్థాయిలో వేగంగా రెపో రేటును తగ్గించాం. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును ఉపయోగించి వృద్ధికి ఊతమిచ్చేలా మరిన్ని చర్యలను తీసుకునేందుకు అవకాశాలు ఇక పరిమితంగానే ఉన్నాయి. నా విధులను నిర్వర్తించడాన్ని నేను విశ్వసిస్తాను. మేము మా వంతుగా చేయాల్సింది చేసాం. ఇక మిగతావారు తమ వంతుగా చేయాల్సినది చేస్తారని ఆశిస్తున్నాం. – సంజయ్ మల్హోత్రా, గవర్నర్, ఆర్బీఐ -
వడ్డీరేట్లు తగ్గిస్తే మంచిదే.. మరి నష్టం ఏంటి?
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి తాజాగా 50 బేసిస్ పాయింట్లు రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు మళ్లీ కీలక వడ్డీ రేట్లను కుదించే వీలుంది. ప్రపంచ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహంతక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.పొదుపుపై ప్రభావంమరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!ఏం చేయాలంటే..ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. -
రెపో రేటు తగ్గింపు.. ఈఎంఐ వెంటనే తగ్గుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దాంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి చేర్చారు. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో ఆధారిత రుణాలపై ప్రభావంఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఇలా..ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!డిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 5.5 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) జూన్ 04న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్‌లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారీ తిరిగి మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6 శాతం నుంచి తాజాగా 5.5 శాతానికి చేరింది.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దాంతో ప్రపంచ వృద్ధి, వాణిజ్య అంచనాలను సవరిస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం కేంద్ర బ్యాంకులకు సవాలుగా మారుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యోల్బణ అంచనాలను 3.7 శాతానికి తగ్గిస్తున్నాం. గతంలో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసిన 4 శాతం కంటే ఇది తక్కువే. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం. రూ.2.5లక్షల కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నాం. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి రూ.9.5లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చాం. విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరో 11 నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు2026 ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా వృద్ధి ఇలా..క్యూ1-6.5 శాతంక్యూ2-6.7 శాతంక్యూ3-6.6 శాతంక్యూ4-6.3 శాతం -
మరో పావుశాతం కోత?
ముంబై: కీలక పాలసీ రేట్లపై ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహిస్తున్న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నేడు (శుక్రవారం) నిర్ణయాన్ని ప్రకటించనుంది. జూన్ 6 ఉదయం 10 గం.లకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దీనిపై ప్రకటన చేస్తారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. బుధవారం ప్రారంభమైన మూడు రోజుల సమీక్ష శుక్రవారం ముగుస్తుంది. ఆర్బీఐ నుంచి ముగ్గురు, ప్రభుత్వం నియమించిన మరో ముగ్గురు మొత్తం ఆరుగురు ఎంపీసీలో సభ్యులుగా ఉన్నారు. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో పావు శాతం చొప్పున రెండు విడతలుగా మొత్తం అర శాతం మేర కీలక పాలసీ రేటును (రెపో) తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల వల్ల అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో తాజాగా మూడో విడతలో మరో పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్బీఐ పాలసీ రేటును తగ్గించడంతో చాలా మటుకు బ్యాంకులు కూడా రెపో రేటు ఆధారిత రుణ రేట్లను, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రేటును ఇప్పటికే కొంత తగ్గించాయి. రెపో రేటు తగ్గితే బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది. రియల్టర్ల ఆశలు.. హౌసింగ్‌కి డిమాండ్ పెంచే దిశగా ఆర్బీఐ రెపో రేటును కనీసం మరో పావు శాతమైనా తగ్గించవచ్చని రియల్టర్ల సమాఖ్యలు క్రెడాయ్, నారెడ్కో ఆశిస్తున్నాయి. గత మూడు నెలలుగా హౌసింగ్ డిమాండ్ నెమ్మదించిన నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ తెలిపారు. ఆర్థిక వృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా సహాయకరంగా ఉంటుందని నారెడ్కో ప్రెసిడెంట్ జి. హరిబాబు చెప్పారు. -
సేవల రంగానికి డిమాండ్ దన్ను
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడటంతో దేశీయంగా సేవల రంగం మే నెలలో స్వల్పంగా పెరిగింది. సర్వీసెస్ సెక్టార్ పనితీరును ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్‌లో 58.7 పాయింట్లుగా ఉండగా మే నెలలో 58.8 పాయింట్లుగా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా పటిష్టమైన డిమాండ్ నెలకొనడాన్ని సూచిస్తూ ఏప్రిల్ నుంచి కొత్తగా ఎగుమతులు పుంజుకోవడమనేది మే నెలలో సేవల రంగానికి సానుకూలాంశంగా నిల్చిందని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు. ఇండెక్స్‌కి సంబంధించిన సర్వే ప్రకారం ప్రకటనలు, డిమాండ్, ప్రస్తుత క్లయింట్ల నుంచి మళ్లీ ఆర్డర్లు రావడం వంటివి అంశాలు సర్వీసెస్ సెక్టార్ మెరుగ్గా రాణించేందుకు తోడ్పడ్డాయని భండారీ తెలిపారు. -
ఎఫ్డీ రేట్లు సవరించిన బ్యాంకులు
కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జూన్ 1, 2025 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై సమకూరే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై తమ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను సవరించాయి. ఈ రెండు బ్యాంకులు నిర్దిష్ట కాలపరిమితిపై రేట్లను తగ్గించగా, ఎంపిక చేసిన దీర్ఘకాలిక డిపాజిట్లపై పీఎన్బీ రేట్లను పెంచింది.కెనరా బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుకెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4% నుంచి 7% మధ్య, సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 7.50% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తుంది. వీటిలో జూన్ 1, 2025 నుంచి కొన్ని సవరణలు చేసింది. కెనరా బ్యాంక్ ఏడాది కాలపరిమితికి ఎఫ్డీ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో ఇది 6.85% నుంచి 6.75%కి తగ్గింది. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీ కాలపరిమితికి వడ్డీ రేటును 7% నుంచి 6.75% కు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.పీఎన్బీ ఇలా..పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.3 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి 3.50% నుంచి 6.90% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 7 శాతం వడ్డీని ఆఫర్ చేసేవారు.ఇదీ చదవండి: విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపుఏడాది నుంచి 390 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 390 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.90 శాతానికి సవరించారు. 391 రోజుల నుంచి 505 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి, 506 రోజుల కాలపరిమితిపై 6.70 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గించారు. 507 రోజుల నుంచి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించారు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది.వడ్డీరేట్లు పెంపు వీరికే..సీనియర్ సిటిజన్లకు పీఎన్బీ బ్యాంక్ ఇప్పటివరకు 4% నుంచి 7.40% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సవరించిన తర్వాత 4.30% నుంచి 7.70% వరకు వడ్డీ ఇస్తుంది. -
రష్యా చమురు దిగుమతులు జూమ్
న్యూఢిల్లీ: దేశీయంగా రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు గత నెలలో భారీగా పెరిగాయి. వెరసి మే నెలలో రోజుకి 1.96 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)ను తాకాయి. ఇది 10 నెలల గరిష్టంకాగా.. ప్రపంచ ప్రామాణిక ధరలకంటే తక్కువలో చమురు లభించడం ఇందుకు సహకరించినట్లు గణాంకాల సంస్థ కెప్లర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం, దిగుమతులకు మూడో ర్యాంకులో నిలిచే భారత్ విదేశాల నుంచి 5.1 మిలియన్ బ్యారళ్ల చమురును కొనుగోలు చేసింది. ముడిచమురును శుద్ధి చేయడం ద్వారా రిఫైనరీలు పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల తయారీని చేపట్టే సంగతి తెలిసిందే.భారత్ కొనుగోలు చేసిన చమురులో రష్యా 38 శాతం వాటా ఆక్రమిస్తోంది. రోజుకి 1.2 మిలియన్ బ్యారళ్ల సరఫరా ద్వారా ఇరాక్ రెండో పెద్ద సరఫరాదారుగా నిలిచింది. ఈ బాటలో భారత్‌కు 6,15,000 బీపీడీ చమురును సౌదీ అరేబియా ఎగుమతి చేయగా.. యూఏఈ 14,90,000 బీపీడీ అందించింది. యూఎస్ నుంచి 2,80,000 బీపీడీ చమురును అందుకుంది. గత నెలలో భారత్ చమురు దిగుమతుల ప్రొఫైల్ ధరల ఆధారంగా విభిన్న ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు కెప్లర్ వివరించింది. నిజానికి మధ్యప్రాచ్యం నుంచి భారత్ అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తుంటుంది. -
ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం.. పాక్ బడ్జెట్‌పై గందరగోళం!
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో పాకిస్థాన్ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్ బడ్జెట్‌ను జూన్ 10కి వాయిదా వేశారు.పాక్ ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్ డాలర్ల అప్పును ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో విభేదాలు తలెత్తడంతో జూన్ 2న విడుదల కావాల్సిన బడ్జెట్‌ను పాకిస్థాన్ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (పీఎస్‌డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి). -
వచ్చే ఐదేళ్లలో 50 ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు
దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసి మొత్తం ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను 212కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) వార్షిక సమావేశంలో ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఈ విస్తరణలో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.దేశం అంతటా ప్రజలకు మరింత చౌకగా, అందుబాటు ప్రాంతాల్లో విమానప్రయాణం చేసేలా ఉడాన్ పథకం సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 619 కొత్త మార్గాలను నెట్‌వర్క్‌లో జోడించింది. ఇది చిన్న పట్టణాలు, నగరాలకు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పొందేందుకు దోహదపడుతుంది. విమానాశ్రయాల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపుప్యాసింజర్ కనెక్టివిటీకి మించి భారత్ గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) హబ్‌గా కూడా నిలదొక్కుకుంటోంది. 2031 నాటికి ఎంఆర్ఓ విభాగం 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి సౌకర్యాలను సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు విదేశీ మరమ్మతు సేవలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. -
15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు
ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో రిటైల్ స్థాయిలో వంట నూనెల ధరలు 5-6 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో దాదాపు 17 శాతం పెరిగిన వంట నూనె ధరలు ఎట్టకేలకు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఇది సింగిల్ డిజిట్‌కు చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఇమామి అగ్రోటెక్ డైరెక్టర్, సీఈవో సుధాకర్ రావు దేశాయ్ తెలిపారు.తగ్గిన సుంకాల వల్ల కలిగే ప్రయోజనం మరో 15 రోజుల్లో రిటైల్ ధరల్లో ప్రతిఫలిస్తుందని భావిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లు ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ధరల దిద్దుబాటు కేవలం దిగుమతి చేసుకునే నూనెలకే పరిమితం కాదని దేశాయ్ తెలిపారు. దిగుమతులపై ఆధారపడని ఆవనూనె కూడా వంటనూనెలపై కూడా 3-4 శాతం తగ్గుదలను చూడవచ్చని అన్నారు.ఇదీ చదవండి: 300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్ముడి వంట నూనె, రిఫైన్డ్ ఆయిల్ సుంకాల మధ్య వ్యత్యాసం 12.5 శాతం నుంచి 22.5 శాతానికి పెరగడం వల్ల కంపెనీలు ముడినూనెను దిగుమతి చేసుకుని దేశీయంగా శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకుంది. అయితే తాజాగా 10 శాతం సుంకం తగ్గింపు నిర్ణయం ఈ విభాగంలోని వ్యాపారాలకు బూస్ట్‌గా నిలుస్తుందని హల్దర్ వెంచర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేశవ్ కుమార్ హల్దర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ వంటి దిగుమతి చేసుకున్న వంట నూనెల దేశీయ రిటైల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే రైస్ బ్రాన్, ఆవనూనె వంటి నూనెలకు కూడా ఈ తగ్గుదల వర్తించే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మరోసారి తగ్గించేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆర్బీఐ వ్యవస్థలో లిక్విడిటీని పెంచింది. ఈసారి జూన్ 6న జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కట్ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నివేదికలో తెలిపింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తోంది.నివేదికలో ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం మిగులు లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థలు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఓకేజూన్ పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు 100 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిబంధనలమేరకే ఉన్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు ఉంటాయని అంచనా వేయడంతో పంటల దిగుబడి, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలను ఉటంకిస్తూ ఎస్బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ అంచనాను 3.5 శాతానికి తగ్గించింది. ఆర్థిక పనితీరు పరంగా చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ 7.4%కు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8.4% నుంచి తగ్గింది.