breaking news
Medak
-
చినుకు పడితే.. వణుకే!
రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణ ంలో మోస్తారు వర్షం కురిసిందంటే చాలు ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. ఏకంగా అక్కల బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశిస్తుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో గతంలో ఎప్పుడో నిర్మించిన రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై యథేచ్ఛగా వదర నీరు రోడ్డుపై పారుతుంది. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు భయం, భయంగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారి జలమయం ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట ప్రధాన రహదారిపై పెద్దఎత్తున వరద నీరు ప్రవహించింది. రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై కింద పడిన సంఘటనలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించినా, మళ్లీ వర్షం కురవడంతో రోడ్డుపై ఇసుక చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నిలిచి ప్రయాణాలకు ఆటంకంగా మారుతుంది. డివైడర్ నిర్మించిన అధికారులు రోడ్డు మరమ్మతుల విషయమై పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అలాగే మోస్తారు వర్షం కురిసినా పట్టణంలోని 11వ వార్డు అక్కల బస్తీలో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఏటా తమకు ఈ ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దఎత్తున వరద నీరు ఇళ్లలోకి చేరిందని, ఇళ్లలో ఉన్న దుస్తులు, నిత్యావవసర సరుకులు సైతం తడిసిపోయాయని వాపోయారు. పేటలో ముంపు ముప్పు తప్పేనా..? శాశ్వత చర్యలకు పడని ముందడుగు ఇళ్లలోకి చేరుతున్న వర్షం నీరు పట్టించుకోని అధికారులు ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు చర్యలు చేపడుతున్నాం వర్షాలు పడితే రహదారులపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాం. ఇటీవల తారు రోడ్డుపై భారీ వర్షం మూలంగా ఇసుక మేట వేయగా, పూర్తిగా తొలగించాం. అక్కల గల్లీలో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
జనహితకు జేజేలు
వట్పల్లి(అందోల్): కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కదంతొక్కారు. ఆందోల్ మండలంలోని సంగుపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. మంత్రులు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్న ఈ పాదయాత్రలో ఆద్యంతం కార్యకర్తలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్ర సందర్భంగా ‘జై కాంగ్రెస్ .. జై సోనియా, జై రాహుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి పొడవునా వారి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భారీ సైజుల్లో ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రజాహితమే మా ధ్యేయం: దామోదర ప్రజాహితమే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జోగిపేటలోని హనుమాన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సోనియా గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం: పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమకు అప్పగించిందని విమర్శించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుల ఇళ్లల్లో పండగ వాతావరణం కల్పించిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ అందించామని, రేషన్‌కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: వివేక్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో వివరించాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో డబుల్బెడ్రూంలు అందజేయలేదని కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క వాగ్దానాన్ని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పాదయాత్రకు అనూహ్య స్పందన ఆద్యంతం ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. దారిపొడవునా హోరెత్తిన నినాదాలు -
నిబంధనలు తప్పనిసరి
చిలప్‌చెడ్(నర్సాపూర్): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, లేకపోతే బిల్లులు రావని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం చౌహాన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. చిలప్‌చెడ్‌లో 54 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 15 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన పలువురికి రెండు విడతల బిల్లులు సైతం వచ్చాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించకపోతే మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించేవారికి సైతం అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం చేగుంట(తూప్రాన్): పాలిటెక్నిక్‌లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని 11 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 135 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. చేగుంట పాలిటెక్నిక్‌లో 9 పోస్టులు ఖాళీగా ఉండగా, టెక్నికల్ పోస్టులకు ఎంటెక్, నాన్ టెక్నికల్ పోస్టులకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ మెదక్ కలెక్టరేట్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్‌లో నిర్వహించిన విద్యార్థి అధ్యయన యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 5 వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా నర్సాపూర్‌లోని పీజీ కళాశాలకు సొంత భవనం, మెదక్‌కు ఇంజనీరింగ్, పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తూప్రాన్, పెద్దశంకరంపేటలలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు తక్షణమే పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నవీన్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హెచ్‌పీఎస్‌లో ఖాళీ సీట్లు మెదక్ కలెక్టరేట్: రామంతాపూర్, బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు విజయలక్ష్మి, నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఎస్సీ విద్యార్థులకు ఒక సీటు ఖాళీగా ఉండగా, ఎస్టీ విద్యార్థులకు ఆరు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు కలెక్టరేట్లోని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కార్యాలయాల్లో లభిస్తాయని సూచించారు. నానో యూరియాతో అధిక దిగుబడి కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు నానో ద్రవరూప ఎరువులు వాడటం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని డీఏఓ దేవ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని తునికి వద్దగా రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు నానో ఎరువులను తరలించడం సైతం సులభంగా ఉంటుందని చెప్పారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ పంట మార్పిడి చేయాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజ్‌నారాయణ, కోరామండల్ ప్రతినిధి రోషన్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్‌రెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మాకొద్దు.. జీపీఓ!
పాత సర్వీస్ పోతుందని.. గత ప్రభుత్వం రెవెన్యూశాఖ నుంచి 562 మంది వీఆర్ఓలను తప్పించి వివిధ శాఖల్లోకి పంపింది. అయితే పని చేసిన సర్వీస్‌ను ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలో కలపాలని అప్పట్లో వీఆర్ఓలు, వీఆర్ఏలు ఆందోళన చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఐదేళ్లుగా కోర్టులో కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం మళ్లీ ఈ శాఖను వదిలి గ్రామ పాలనాధికారి (జీపీఓ)గా చేరితే పాత సర్వీస్ పోతుందని, ఇప్పటికే రెవెన్యూలో ఒక్కొక్కరం రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తించామని, ఆ సర్వీస్ పోతే తీరని నష్టం జరుగుతుందని, అందుకే జీపీఓగా రావడానికి ఇష్టపడటం లేదని పలువురు వీఆర్ఓలు పేర్కొన్నారు. ● పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల అనాసక్తి ● రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా స్పందన కరువు ● పరీక్షకు హాజరైంది కేవలం142 మంది మాత్రమే మెదక్‌జోన్: గ్రామ పాలన అధికారి (జీపీఓ)గా పనిచేసేందుకు పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలు అనాసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా వెనుకంజ వేశారు. జీపీఓలుగా చేరితే పాత సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోకపోవటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఫలితంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 392 రెవెన్యూ గ్రామాలు జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయతీలు ఉండగా, 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో 562 మంది వీఆర్ఓలుగా జిల్లాలో విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏలను తొలగించి వారిని వివిధ శాఖల్లోకి పంపింది. 2023లో అధికారంలోకి వచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు పూర్వవైభవం తెస్తామని, గ్రామానికో జీపీఓను నియమించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొంది. గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వారు తిరిగి రావాలని కోరింది. అందుకోసం రెండుసార్లు రాత పరీక్షలు నిర్వహించింది. అయితే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటిసారి జిల్లావ్యాప్తంగా 104 మంది దరఖాస్తు చేసినా, పరీక్షకు 79 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో ఉత్తీర్ణత సాధించింది 47 మంది మాత్రమే. రెండోసారి జూలై 27న పరీక్ష నిర్వహించగా, 73 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష రాసింది మాత్రం 63 మంది మాత్రమే. ఈ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. గతంలో జిల్లాలో సుమారు 562 మంది వీఆర్ఓలుగా విధులు నిర్వర్తించారు. వారు ప్రస్తుతం జీపీఓలుగా రావటానికి ఆసక్తి చూపటం లేదు. -
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
కలెక్టర్ రాహుల్రాజ్వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్)/నర్సాపూర్: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ఆయా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 9,964 కుటుంబాలకు నూతన రేషన్‌కార్డులు అందజేశామని తెలిపారు.మహిళా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌కార్డు ప్రతి కుటుంబానికి అవసరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికమని, దానిని దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా మండలంలో విద్యార్థులకు రవాణా వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. నిబంధనలు పెట్టకుండా అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేటలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో కాటేజీలను పరిశీలించారు. నెలాఖరులోగా పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
కార్పొరేట్‌కు దీటుగా సంక్షేమ హాస్టళ్లు
పాపన్నపేట(మెదక్): సంక్షేమ హాస్టళ్లు కార్పొరేట్‌కు దీటుగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన కొత్తపల్లి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మమేకమై వారి సా మ ర్థ్యాలను పరిశీలించారు. వసతి సౌకర్యా లు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచిగా చదువుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. -
నాణ్యమైన బోధన అందించాలి
డీఈఓ రాధాకిషన్చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని మడూర్ జెడ్పీ పాఠశాలలో తెలుగు పండిత్‌లకు నిర్వహించిన కాంప్లెక్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధన విషయంలో నైపుణ్యతను చాటి చెప్పాలన్నారు. తెలుగు ఉపాధ్యాయులకు ఉన్న ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలన్నారు. పాఠ్యంశాలతో పాటు నీతి, ప్రేరణ కల్గించే కథలను విద్యార్థులకు చెప్పాలన్నారు. ప్రభుత్వం అందించిన డిజిటల్ బోర్డును ఉపయోగించుకోవా లని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రతిభను పరిశీలించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక తో ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట కాంప్లెక్స్ హెచ్ఎం రవీందర్‌రెడ్డి ఉన్నారు. -
అవగాహన, అప్రమత్తతే కీలకం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌కు సైబర్ క్రైం, నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి కేసును సీరియస్‌గా తీసుకొని బాధితులకు తక్షణ న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సైబర్ వారియర్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్‌లో సంప్రదిస్తే డబ్బులను తిరిగి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు పూర్తి అవగాహన, అప్రమత్తతతో ఉండాలని సూచించారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ నుంచి వచ్చిన టీషర్ట్స్‌ను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్సీ మహేందర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాదయాత్రను విజయవంతం చేద్దాం
నర్సాపూర్: పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సంయుక్తంగా చేపడుతున్న పాదయాత్ర శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కాగా జిల్లాలోని అన్ని మండలాల నాయకులతో పాటు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి తన రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు మల్లేశ్, మహేశ్‌రెడ్డి, లలిత, శ్రీనివాస్‌గుప్తా, రిజ్వాన్, అశోక్, వినోద తదితరులు పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ నెల రోజుల వ్యవధిలో జిల్లాలో అన్నిశాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగిందని తెలిపారు. 140 మంది పిల్లలను రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. జిల్లాలో హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులు, సంరక్షణ గృహాలకు చేర్చి యజమానులపై తగిన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 140 మంది బాలలను రక్షించి 90 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
డెమో ద్వారా గెస్ట్ టీచర్ల ఎంపిక
కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో గెస్ట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లను డెమో క్లాస్‌ల ద్వారా ఎంపిక చేస్తున్నట్లు ఆర్సీఓ గౌతంకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకున్న గెస్ట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నిర్వహిస్తున్న డెమో క్లాస్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ఎంజేపీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను గెస్ట్ ఉపాధ్యాయులుతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డెమో నిర్వహించి ఉత్తమ బోధన, ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ హరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంజేపీ ఉమ్మడి జిల్లా ఆర్సీఓ గౌతంకుమార్‌రెడ్డి -
లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన
నర్సాపూర్ రూరల్: లింగ వివక్షతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని చిన్నచింతకుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు (జెండర్) లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే లింగ వివక్షత లేకుండా పోతుందన్నారు. ప్రస్తుత పిల్లలకు కుటుంబ పెద్దలను గౌరవించడం, అన్యోన్యంగా ఉండే విధానాన్ని అలవర్చాలని సూచించారు. కార్యక్రమంలో జెండర్ సెంట్రల్ టీం సభ్యులు నసీం, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సరస్వతి, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ల సరిత, లింగంగౌడ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి
డీఈఓ రాధాకిషన్ వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థనా సమయానికి ముందే పాఠశాలకు చేరుకొని పరిసరాలు పరిశీలించారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న ఎంఈఓ యాదగిరిని సత్కరించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్య నభ్యసించాలని సూచించారు. పాఠ్యాంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే వెంటనే సంబంధిత ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకోవాలన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు వస్తుందనడానికి ఎంఈఓ యాదగిరి నిదర్శనమన్నారు. అటాంటి వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని సూచించా రు. కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కార్డులు సరే.. షాపులేవీ?
ప్రభుత్వం నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దుకాణాలు కూడా పెంచాలని కోరుతున్నారు. కొన్నిచోట్ల పరిమితికి మించి కార్డుదారులు ఉండటం, మరికొన్ని చోట్ల బియ్యం తెచ్చుకోవడానికి దూర భారంతో నెల నెలా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. – పెద్దశంకరంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా 2,16,614 ఆహారభద్రత కార్డులు ఉండగా, ఇటీవల కొత్తగా మరో 9,964 కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 469 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటివరకు 520 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు. పలు మండలాల పరిధిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదాంలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో 11 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఆహారభద్రత కార్డులను ప్రభుత్వం అందజేస్తుండగా, వీరికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు రేషన్ దుకాణాల్లో సహాయకులు లేకుండానే డీలర్లు బియ్యం అందజేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు రేషన్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డులకు అనుగుణంగా మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దుకాణాల సంఖ్య పెరిగితే ప్రజలకు ఇబ్బందులు దూరం కావడంతో పాటు సమయం సైతం ఆదా అవుతుంది. కొత్త జీపీల్లో తప్పని తిప్పలు జిల్లాలో నూతన పంచాయతీలను ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. కానీ ఆయా గ్రామాల్లో నూతన రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయలేదు. పలు తండాలను పంచాయతీలుగా మార్చింది. కానీ అక్కడ సైతం నూతన షాపులకు మోక్షం కలగలేదు. దీంతో ప్రజలు కిలోమీటర్లు ప్రయాణించి రేషన్ దుకాణాల నుంచి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నూతన రేషన్ కార్డులతో పాటు ప్రతీ పంచాయతీ పరిధిలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆదేశాలు రావాల్సి ఉంది ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 11 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఈ విషయం నివేదించాం. ఆర్డీఓ, ఇతరశాఖల అధికారుల సహకారంతో నూ తన రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – నిత్యానందం, జిల్లా పౌరసరఫరాల అధికారి జిల్లా వివరాలు గ్రామ పంచాయతీలు 469 రేషన్ దుకాణాలు 520 ఆహారభద్రత కార్డులు 2,16,614 కొత్తగా మంజూరైనవి 9,964 అంత్యోదయ 13,909 అన్నపూర్ణ 75జిల్లాలో వేధిస్తున్న రేషన్ షాపుల కొరత కొత్త పంచాయతీల్లో ఏర్పాటుకు కలగని మోక్షం దూరభారంతో నెల నెలా అవస్థలు కొత్తగా 9,964 కార్డులు మంజూరు -
ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన బోధన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి కౌడిపల్లి(నర్సాపూర్)/శివ్వంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. గురువారం కౌడిపల్లికి చెందిన పోల నవీన్ రూ. 59 వేలతో ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కిచెన్‌షెడ్ నిర్మించగా ప్రారంభించి మాట్లాడారు. యువత సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో నీటి సమస్యను తీర్చేందుకు బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మనఊరు– మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు తీర్చిందన్నా రు. ప్రస్తుత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో హెచ్ఎం లలితాదేవి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, నాయకులు మన్సూర్, మహిపాల్‌రెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతరం శివ్వంపేట మండల పరిధి ఉసిరికపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించిన అంబేద్కర్ అందరివాడని కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. -
బాల్య వివాహాలు జరిపిస్తే చర్యలు
వెల్దుర్తి(తూప్రాన్): బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి హెచ్చరించారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో గురువారం ఓ మైనర్ బాలిక నిశ్చితార్థ వేడుకలను పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు చిట్టోజిపల్లికి చెందిన ఓ యువకుడితో కుటుంబసభ్యులు ఇటీవల పెళ్లి సంబంధం నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి, వెల్దుర్తి పోలీసులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలతో సంఘటనా స్థలానికి చేరుకొని నిశ్చితార్థ వేడుకలను అడ్డుకున్నారు. మైనర్ బాలికలకు వివాహం జరిపించడం వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి జరిపిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని బాలిక తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీని తీసుకున్నారు. -
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్‌లో నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి పిల్లర్లు అవసరం లేద న్నారు. 600 గజాలలోపు మాత్రమే కట్టుకునేలా చూడాలని హౌసింగ్ అధికారులను అదేశించారు. అనంతరం గడిపెద్దాపూర్‌లో ఫర్టిలైజర్ షాపు, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వసతులు, రోగు లకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఇదిలాఉండగా గ్రామంలో క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని యువకులు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని అల్లాదుర్గం తహసీల్దార్‌ను కలెక్టర్ అదేశించారు. అలాగే ముస్లాపూర్ పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్ సక్రమంగా విధులకు రావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండటంపై కార్యదర్శిపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని అదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఓ సుధాకర్, ఎంపీఓ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
బల్దియా బరి.. నేతల గురి
రామాయంపేట(మెదక్): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయా పార్టీల్లో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ, తమ వార్డుల్లో పట్టు సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఫలానా వార్డు నుంచి తాము పోటీలో ఉంటామని నాయకులు తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాగైనా బల్దియాల్లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ సైతం పట్టు నిలుపుకోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, తూప్రాన్‌లో 16, నర్సాపూర్ 15, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతో మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు జరిపేందుకు ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత జనవరిలో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా, ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పాలకవర్గం ఉన్నప్పుడు, వార్డుల్లో నెలకొన్న సమస్యలు ఎంతో కొంత పరిష్కారమయ్యేవి. ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఏ పని సరిగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. -
విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. బుధవారం మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సత్వర పరిష్కారం చూపించాలన్నారు. బాగా పనిచేసే సిబ్బందికి రివార్డ్, అవార్డ్స్, గుర్తింపు ఉంటుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, క్రమశిక్షణ సమయపాలన పాటించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. కష్టపడి పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. అనంతరం స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు, పట్టణంలో నేరాలు, డయల్ 100, బీట్ సిస్టం, పెట్రోలింగ్‌పై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమా ర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, పట్టణ సీఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
ఖాళీ సీట్ల భర్తీకి నేడు స్పాట్ కౌన్సెలింగ్
రామాయంపేట(మెదక్): గురుకుల కళాశాలల్లో ఖాళీల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకులాల జోనల్ అధికారిణి ప్రత్యూష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జోన్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను ఆయా కళాశాలల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలో ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు.సరిపడా యూరియా నిల్వలుచేగుంట(తూప్రాన్): జిల్లాలో 3,343 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ అన్నారు. బుధవారం చేగుంటలోని పలు ఎరువుల దుకాణాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోతాదుకు మించి యూరియా వాడకూడదని రైతులకు సూచించారు. పంట కాలంలో రెండు పర్యాయాలు నానో యూరియా వాడాలని సూచించారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, ప్రైవేటు ఎరువులు మందులు బలవంతంగా విక్రయించాలని ప్రయత్నం చేస్తే రైతులు మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమ ంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, రైతులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి నర్సాపూర్: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో పర్యటించారు. కాలనీలో మురికి కాలువలు, తాగు నీటి సమస్య, పారిశుద్ధ్యం పనులు సరిగా లేవని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈమేరకు కమిషనర్ స్పందిస్తూ త్వరలో ఆయా సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. 17 అడుగులకు చేరిన పోచారం నీటిమట్టం హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పోచమ్మరాళ్ శివారులో ఉన్న పోచారం డ్యామ్‌కు నీటిమట్టం పెరిగింది. కొన్ని రోజులుగా ఎగువన ఉన్న కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువు, కుంటల నుంచి భారీగా నీరు చేరుతుంది. బుధవారం నాటికి డ్యామ్‌లో 17 ఫీట్ల నీరు చేరింది. మరో మూడున్నర ఫీట్లు చేరితే డ్యామ్ పొంగిపొర్లనుంది. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం హవేళిఘణాపూర్(మెదక్): బీజేపీతోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. బుధవారం పీఎంశ్రీ పథకం కింద మండలంలోని కూచన్‌పల్లి జెడ్పీ పాఠశాలను ఎంపిక చేసి వసతుల కల్పనకు కేంద్రం కృషి చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ రఘునందన్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేసిందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీపాల్, ఎంఎల్ఎన్ రెడ్డి, నవీనచారి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం
పాపన్నపేట(మెదక్)/హవేళిఘణాపూర్: జిల్లాలో కొత్తగా 9,964 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, వీటి ద్వారా 44,694 మందికి లబ్ధి చేకూరినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చిత్రియాల్‌లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో ఆరీఓ్డ రమాదేవి, తహసీల్దార్ సతీశ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్‌నాయక్, మండల నాయకులు ప్రశాంత్‌రెడ్డి, మోహన్, సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి రైతు వేదికలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు ఉత్తమ విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
ఫలించిన పోరాటం
మెదక్‌జోన్: 2003 డీఎస్సీ టీచర్ల రెండు దశాబ్ధాల పోరాటం ఫలించింది. పాత పెన్షన్ వర్తింపచేయాలని హైకోర్టు తీర్పునివ్వడంతో సంబుర పడుతున్నారు. 2003లో డీఎస్సీలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 800పై చిలుకు అభ్యర్థులు ఎంపికయ్యారు. కానీ అప్పట్లో కామన్ సర్వీస్ రూల్స్‌కు సంబంధించి గవర్నమెంట్, లోకల్‌బాడీ స్కూల్స్ ఒకే గొడుగు కిందకు తేవాలంటూ కోర్టులో కేసు నడవడంతో ప్రభుత్వం 2005 నవంబర్‌లో వీరికి అపాయింట్మెంట్ ఇచ్చింది. కాగా 2004లో అప్పటి ప్రభుత్వం పాత పెన్షన్ విధానం రద్దు చేసి నూతన పెన్షన్ విధానం అమలు చేసింది. ఈ నేపథ్యంలో 2005లో ఉద్యోగంలో చేరిన వారు కొత్త పెన్షన్ కిందకు వస్తారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2003 డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. తమకు న్యాయబద్దంగా పాతపెన్షన్ అమలు చేయాలని కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా హైకోర్టులో ఈ కేసు కొనసాగింది. చివరగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పునివ్వటంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం ఉమ్మడి జిల్లాలో 800 పైచిలుకు మందికి మేలు -
సిగాచీకి ప్రొహిబిటెడ్ ఆర్డర్
ప్రాణాలు పోయాక ఆర్డరిచ్చిన పరిశ్రమల శాఖసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ ప్రమాదం జరిగాక ఫ్యాక్టరీల శాఖ మేల్కొంది. ఈ పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి 54 మంది కార్మికుల ప్రాణా లు పోయాక ఫ్యాక్టరీల శాఖ అధికారులు ఇప్పుడు ఆ యాజమాన్యానికి ప్రోహిబిటెడ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ఈ పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమా ణాలు పాటించకపోవడంతో ప్రమా దం జరిగిందని, నిబంధనల ప్రకారం ఇక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు జరగలేదని, తిరిగి తాము అనుమతిచ్చేంత వరకు ఇందులో ఉత్పత్తి చేయవద్దని ఈ ఆర్డర్లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పరిశీలించాల్సిన ఈశాఖ అధికారులు ప్రమాదం జరగకముందు ఎందుకు స్పందించలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలేవి? ప్రమాదం జరిగిన నెల రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులైన ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై శాఖ పరమైన విచారణ కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిశ్రమను ఇప్పటివరకు తనిఖీలు చేసిన అధికారులు భద్రతా లోపాలను గుర్తించారా? గుర్తిస్తే వాటిని సరిచేయాలని పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులిచ్చారా? సరి చేయకుండా నిర్లక్ష్యం చేసిన పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రమాదం జరిగే వరకు ఎందుకు ఉపేక్షించారు? వంటి అంశాలపై ఆ శాఖ ఇప్పటికీ వెల్లడించడం లేదు. నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత ఏది? ప్రమాదం జరిగిన వెంటనే సీఎస్ఐఆర్–ఐఐసీటీ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నలుగురు నిపుణుల బృందాన్ని నియమించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిందా? ఇవ్వలేదా? అనేది తేలలేదు. ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
సీజనల్‌పై అప్రమత్తంగా ఉండాలి
టేక్మాల్(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లుపేటలో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించే ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట ప్రోగాం ఆఫీసర్స్ హరిప్రసాద్, నవ్య, వైద్యురాలు హర్షిత తదితరులు ఉన్నారు. డీఎంహెచ్ఓ శ్రీరామ్ -
అమృత్.. ఆలస్యం
● మెదక్ బల్దియాలో ప్రారంభం కాని పనులు ● రామాయంపేట, తూప్రాన్లోకొనసాగుతున్న పనులు ● నర్సాపూర్‌లో అర్థ్ధాంతరంగా ఆగిన వైనం ● తాగునీటికి తప్పని తిప్పలుమెదక్జోన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అధికారుల పరిస్థితి. మున్సిపాలిటీల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది అమృత్ (అటల్ మిషన్) పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. కానీ, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఆయా బల్దియాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. రూ. 58 కోట్లు మంజూరు జిల్లాలో మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలున్నాయి. మున్సిపాలిటీల ప రిధిలోని ప్రజలకు శుద్ధజలాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో నాలుగు మున్సిపాలిటీలకు రూ. 58 కోట్లు మంజూరు చేసింది. ఇందులో అతిపెద్ద మున్సిపాలిటీ మెదక్ బల్దియాకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా 31 లక్షల లీటర్ల సామర్థ్యంతో 6 ట్యాంకులు, 48.83 కిలోమీటర్ల పైపులైన్లు, పలు ట్యాంకుల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఫలితంగా బల్దియాలో నిత్యం ఏదోఒక చోట తాగునీటి సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.12 కోట్లు మంజూరు కాగా, రెండు ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ అందులో ఒకటి 7.50 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మరో ట్యాంకు 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు పనులను ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలంలో ప్రారంభించగా సదరు భూమి యజమాని పనులను నిలిపివేయించాడు. రామాయంపేట మున్సిపాలిటీకి రూ.7 కోట్లు, తూప్రాన్ మున్సిపాలిటీకి రూ.9 కోట్లు మంజూరు కాగా, పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అమలెప్పుడో మరి! శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం కోట్లాది నిధులు మంజూరైనా అవి వృథాగా మగ్గిపోతున్నాయి. ఈ నిధులతో తాగునీటి ట్యాంకుల నిర్మాణాలతో పాటు పైపులైన్లు వేసి వాటికి ఎలకి్ట్రక్ వైర్లను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. దీంతో పైపులైన్ల లీకేజీలు ఏర్పడినా, లేక నీరు తక్కువగా వస్తున్నా పైపులైన్లకు అనుసంధానం చేసిన వైర్ద్వారా తెలిసిపోతుంది.త్వరలో పనులు ప్రారంభం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, ఇప్పటికే మూడింటిలో పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ మున్సిపాలిటీలో మరో వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం. – మహేశ్‌బాబు, ఈఈ పబ్లిక్ హెల్త్, మెదక్ -
రైల్వేలైన్ విస్తరణ !
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025● త్వరలో ప్రారంభం కానున్న పనులు ● జిల్లా వాసులకు తీరనున్న కష్టాలురామాయంపేట(మెదక్): మేడ్చల్– ముథ్కేడ్ మధ్య రైల్వేలైన్ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ఈమే రకు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజె క్టు పూర్తయితే జిల్లా వాసుల కు వెసులుబాటు కలగనుంది. గంటల తరబడి రైళ్ల కోసం, క్రాసింగ్‌ల వద్ద వేచి ఉండే పరిస్థితికి చెల్లుబాటు కానుంది. ఇది ముథ్కేడ్, డోన్ డబ్లింగ్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది. ఇందుకు సంబంధించి 418 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం రూ. 4,686 కోట్ల అంచనాతో నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్‌తో ప్రయాణికులు ఇబ్బందులపాలవుతున్నారు. రెండు వరుసల లేన్కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి విన్నవించగా, ఎట్టకేలకే గతేడాది కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పటికే మేడ్చల్ వరకు రెండో లేన్ నిర్మాణం పూర్తయింది. మరో వైపు నిజామాబాద్ నుంచి పుణ్యక్షేత్రమైన బాసర వరకు డబ్లింగ్ లేన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బాసర గోదావరి నదిపై భారీస్థాయిలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. రెండేళ్ల లోపు రెండో లేన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మనోహరాబాద్, వడియారం, పాలాట పోతారం, మీర్జాపల్లి, బ్రాహ్మణపల్లి, శ్రీనివాసనగర్, మాసాయిపేట, అక్కన్నపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. జిల్లా పరిధిలో 41 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ విస్తరించి ఉంది. 2006లో ఈలైన్ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజుకు మారింది. మూడేళ్ల క్రితం అక్కన్నపేట నుంచి మెదక్, మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు నూతనంగా రైల్వేలైన్ నిర్మించారు. దీంతో అక్కన్నపేట, మనోహరాబాద్ స్టేషన్లు జంక్షన్లుగా మారాయి. రెండో లేన్ నిర్మాణం పూర్తయితే జిల్లా పరిధిలో ఉన్న స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. గతంలో ఎప్పుడో నిర్మించిన పలు స్టేషన్ల భవనాలు చాలా వరకు పాక్షికంగా శిథిలమయ్యాయి. వీటి స్థానంలో కొత్త భవనాలు, ప్లాట్‌ఫాంలు, అదనపు సదుపాయాలు కల్పించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ నుంచి ముథ్కేడ్ వరకు రైల్వేలైన్‌ను పూర్థిస్థాయిలో విద్యుదీకరించారు. ఇదే విషయమై రైల్వేశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మేడ్చల్ నుంచి ముథ్కేడ్ వరకు రెండో లేన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సర్వే గతంలోనే పూర్తి కాగా, ప్యాకేజీల వారీగా ప్రాధాన్యత క్రమంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్, బాసర మధ్య డబ్లింగ్ లేన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఆటలు ఆడుతున్న విద్యార్థినులున్యూస్రీల్మారనున్న స్టేషన్ల రూపురేఖలు -
ప్రభుత్వంపై దుష్ప్రచారం
చిన్నశంకరంపేట(మెదక్): బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాకు వెళ్తూ మంగళవారం నార్సింగి మండలం జప్తిశివనూర్లోని మాజీమంత్రి షబ్బీర్‌అలీ గెస్ట్‌హౌస్‌లో ఆగిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలతో కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతున్నాయన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కవడంతోనే బీఆర్ఎస్కు ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నది నిజం కాకపోతే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మంత్రి వెంట మాజీమంత్రి షబ్బీర్‌అలీ, కామారెడ్డి, బిక్కనూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క ధ్వజం -
తరుణోపాయం
ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లకు రుణం●● ఆ నిధులతో రోడ్లు వేయించాలని నిర్ణయం ● రోడ్ల అభివృద్ధికి సరికొత్త టెండరు విధానం ● హెచ్ఏఎం తొలి విడతలో పలు ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల ఎంపిక సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రోడ్ల అభివృద్ధి పనులు చేసేందుకు ఆయా ఇంజనీరింగ్ శాఖలు నూతన టెండరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం రోడ్ల పనులకు టెండరు నోటిఫికేషన్ జారీ చేసి..తక్కువకు బిడ్ వేసిన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ చేసి పనులు చేయించేవారు. పనులు పూర్తయ్యాక బిల్లులు చెల్లించడం ప్రస్తుతం ఉన్న విధానం. అయితే ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. రోడ్లు భవనాల శాఖలో ఒక్కో పనికి గతంలో పది పర్యాయాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా ఒక్క కాంట్రాక్టర్ కూడా బిడ్ వేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసేందుకు సాహసించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా హెచ్ఏఎం (హైబ్రీడ్ అన్యూటీ మోడ్) అనే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానం ప్రకారం కాంట్రాక్టర్లకు ఆయా రోడ్డు పనుల అంచనా వ్యయంలో 60% మొత్తానికి ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. మిగిలిన 40% మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చి కాంట్రాక్టరుతో పనులు చేయించాలని నిర్ణయించింది.26 ఆర్అండ్బీ రోడ్లకు రూ.523 కోట్లు నూతన విధానం హెచ్ఏఎం మొదటి విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 26 రోడ్లను ఎంపిక చేశారు. మొత్తం 387 కి.మీల పొడవున్న ఈ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.523 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సిద్దిపేట జిల్లాకు 25 రోడ్లను ఎంపికయ్యాయి. రూ.379 కోట్లతో 289 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాకు సంబంధించి సుమారు 18 రోడ్లు ఎంపికై నట్లు సమాచారం. ఎంపిక చేసిన రోడ్లలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులు, అలాగే మండల కేంద్రం నుంచి నేషనల్ హైవే వరకు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి ఉన్న రోడ్లు, అలాగే మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ఉన్న రహదారులను ఎంపిక చేసినట్లు ఆర్అండ్బీ పర్యవేక్షక ఇంజనీర్ వసంత్‌నాయక్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ రోడ్లు సైతం ఈ నూతన టెండరు విధానంతో పంచాయతీ రాజ్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం 105 రోడ్లను ఎంపిక చేశారు. 343 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. 15 సంవత్సరాల నిర్వహణ బాధ్యతలు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 30 నెలల్లో పనులు పూర్తి చేయాలి. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లకే ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. మొత్తం 15 సంవత్సరాల వరకు ఈ నిర్వహణ సదరు కాంట్రాక్టరే చూసుకోవాలి. రోడ్డు వేసిన ఏడేళ్లకు ఒకసారి బీటీ రెన్యూవల్ చేయాలి. అలాగే 14వ సంవత్సరంలో మరోసారి బీటీ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. -
పింఛన్ కోసం బారులు
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు బారులు తీరారు. సోమవారం నుంచి పింఛన్ పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసుకు చేరుకున్నారు. గతంలో బయోమెట్రిక్ రాని వృద్ధులకు గ్రామ కార్యదర్శి బయోమెట్రిక్‌తో పింఛన్ డబ్బులు వారి ఇంటికి వెళ్లి అందించేవారు. తాజాగా బయోమెట్రిక్రాని వారికి ముఖాన్ని స్కాన్ చేస్తుండటంతో వృద్ధులు కూడా పెన్షన్ తీసుకునేందుకు బారులు తీరారు. చిన్నశంకరంపేట(మెదక్): -
హస్తం హవా కొనసాగాలి
ఉమ్మడి జిల్లా నేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో హస్తం హవా కొనసాగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, టీపీసీసీ మెదక్ ఇన్చార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులతో హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన గుర్తింపునివ్వాలని చెప్పారు. కష్టకాలంలో జెండా మోసిన వారితో, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సమావేశానికి సంగారెడ్డి నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.మహిళా సంఘాలకు రూ.20లక్షల రుణాలు డీసీసీబీ మేనేజర్ కిషన్ పాపన్నపేట(మెదక్): మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందజేసినట్లు డీసీసీబీ మేనేజర్ కిషన్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు స్వదేశి, విదేశి విద్య, వాహన, రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. లాకర్ సదుపాయం కూడా ఉందన్నారు. వన దుర్గమ్మ సేవలోఆర్టీఐ కార్యదర్శులు పాపన్నపేట(మెదక్): సమాచార హక్కు చట్టం కార్యదర్శులు మంగళవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీఐ కార్యదర్శి రాములు, డిప్యుటీ కార్యదర్శి ప్రమీల, సభ్యులు ఉదయం ఏడుపాయలకు రాగా వారికి సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు శంకరశర్మ,పార్థివ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆర్టీఐ అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలిగిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ మెదక్ కలెక్టరేట్: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014కు పూర్వం సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో గిరిజనులకు 6% లభించే రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10% పెరిగినట్లు తెలిపారు. రాష్ట్ర గిరిజన జనాభాలో 70% మైదాన ప్రాంతాలైన మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్‌లో గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు. ఓడీఎఫ్లోవర్క్లోడ్ సమస్య తీర్చాలి కంది(సంగారెడ్డి): ఎద్దు మైలారం అయిద కర్మగారం(ఓడీఎఫ్)లో వర్క్‌లోడ్ సమస్యను తీ ర్చాలని బీఎంఎస్, ఓఎఫ్‌ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓడీఎఫ్‌లో వర్క్‌లోడ్ లేక ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు భూమి, రైల్వే, సోలా ర్ తదితర సౌకర్యాలు ఓడీఎఫ్‌లో ఉన్నాయని తెలిపారు. ఓడీఎఫ్‌కు బీఎంపీ 3 వర్షన్ వర్క్‌లోడ్ కల్పించాలన్నారు. సీనియర్ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నందునా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. -
పారదర్శకతతో పనిచేయాలి
మెదక్‌జోన్: ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరసమాచార అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. సమాచార కమిషనర్లు, పీవీ శ్రీనివాస్, బోరెడ్డి, అయోధ్యరెడ్డి, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్‌లతో కలిసి ఆయన మంగళవారం మెదక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 29 ప్రభుత్వ శాఖల్లో 15 శాఖలలో ఎటువంటి కేసులు లేకపోవడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. గత పదేళ్ల కాలంలో సమాచార కమిషన్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హక్కు చట్టం కమిషన్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్‌చార్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు పలు ఆదేశాలిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలు అడిగిన వెంటనే సమాచారం అందించాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
చిలప్‌చెడ్(నర్సాపూర్): అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మళ్లీ రగడ రాజుకుంది. మంగళవారం చిలప్‌చెడ్ రైతువేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి, గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్ హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు సైతం జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం పరస్పర నినాదాలతో హోరెత్తింది. అధికార కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. వైరి వర్గాలు మొహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్‌కు ఎమ్మెల్యే కౌంటర్ రేషన్‌కార్డుల అనంతరం జరిగిన సభలో కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 9,941 రేషన్ కార్డులు పంపిణీ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించిదని వివరించారు. అలాగే రుణమాఫీ, బోనస్ ఇలా అనేక పథకాల గురించి వివరించారు. కలెక్టర్ వాదనను ఎమ్మెల్యే సునీతారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. రేషన్ కార్డులు తీసుకునేందుకు కనీసం 10 మంది లబ్ధిదారులు సైతం లేరని ఎద్దేవా చేశారు. కలెక్టర్ తెలిపిన సంక్షేమ పథకాల్లో 60 శాతం కూడా రుణమాఫీ జరగలేదని, రైతులకు మరో రెండు రైతుభరోసాలు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. సన్నాలకు బోనస్ లేదని, ఎరువుల కొరత ఎక్కువైందన్నారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని ఏ అధికారైనా, నాయకుడైనా ప్రజల కోసమే పనిచేయాలని చురకలంటించారు. పీఎం, ఎంపీల చిత్రపటాలకు పాలాభిషేకం నర్సాపూర్ రూరల్ : మండలంలోని నాగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం గిరిజన హాస్టల్ మంజూరు చేసినందుకు మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ బీజేపీ నాయకులతో కలిసి పీఎం మోదీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రసాభాసగా రేషన్‌కార్డుల పంపిణీ హోరెత్తిన నినాదాలు.. ఉద్రిక్తత ఇది ప్రజా కార్యక్రమం : ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి నర్సాపూర్ రూరల్: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గిరిజన విద్యార్థులకు సూచించారు. మంగళవారం నర్సాపూర్ మండలం నాగులపల్లి (బంజారా నగర్) జెడ్పీహెచ్ స్కూల్‌కు రూ 3.50 కోట్ల నిధులతో నిర్మించబోతున్న హాస్టల్ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు కేంద్రమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సునీతా రెడ్డి మాట్లాడుతూ.. రుస్తుంపేట శివారులో అసంపూర్తిగా వదిలేసిన గిరిజన బాలికల హాస్టల్ భవనం పూర్తి చేసేందుకు రూ.4 కోట్లు, నర్సాపూర్ నుంచి రుస్తుంపేట, నాగులపల్లి మీదుగా సికిందాలపూర్ రీ బీటింగ్ కోసం రూ 5.70 కోటు, మూసాపేట్ నుంచి దౌల్తాబాద్ వరకు రూ.కోటి, తుజాల్ పూర్, ఖాజీపేట్ రోడ్డుకు రూ .80 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. -
ఆర్టీసీ అదిరే టూర్
దర్శనీయ స్థలాలకు ప్రత్యేక ప్యాకేజీ●● నేటి నుంచి ప్రయాణం ● జిల్లా నుంచి ఆరు క్షేత్రాలకు..మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు విహార యాత్రలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలపైనే ఆసక్తి చూపుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ తన వ్యూహం మార్చింది. ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు.. సంస్థ ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. విహార యాత్రలకు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు లేక పోవడంతో చాలా మంది ప్రజలు రెండు, మూడు బస్సుల్లో ప్రయాణించి ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుణ్యక్షేత్రాలకు టూర్ బస్సులను సిద్ధం చేసి నడిపిస్తోంది. ఫలితంగా అటు ఆర్టీసీకి ఆదాయం పెరగడంతోపాటు పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి సౌకర్యం కలిసొస్తుంది. జిల్లా నుంచి ప్రత్యేకంగా.. జిల్లాలోని ప్రజలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్టీసీ మంచి అవకాశం కల్పిస్తుంది. దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికోసం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా టూరు బస్సులు నడిపించేందుకు సంస్థ సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రజల నుంచి బుకింగ్‌లు స్వీకరిస్తుంది. ఈనెల 30న మెదక్ ఆర్టీసీ డిపో నుంచి ఆరు పుణ్యక్షేత్రాలకు టూర్ బస్సు బయల్దేరనుంది. ఇందుకోసం బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్టీసీ సంస్థ తన ఆదాయ మా ర్గాల అన్వేషణలో భాగంగా ఈ టూర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత కొన్ని పుణ్యక్షేత్రాలకు నాలుగు బస్సులు వెళ్లివచ్చాయి. టూర్ బస్సు వెళ్లే పుణ్యక్షేత్రాలు సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వరస్వామి ఆలయం, రేజింత్లోని సిద్ధ వినాయక ఆలయం, బీదర్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గానుగాపూర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం నుంచి పండరిపూర్ రాత్రి అక్కడే ఉండి ఈనెల 31న రెండో రోజు ఉదయం పండరిపురిలో గల శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం, తుల్జాపూర్‌లోని తుల్జావాని మాత దర్శనం చేయిస్తారు. అనంతరం తిరిగి రాత్రి బయలుదేరి మెదక్‌కు చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు ఒకరికి రూ.1700, పిల్లలకు రూ.1000 చార్జీ ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు టిఫిన్, భోజనం, దర్శన టికెట్ ఖర్చులు ఎవరికి వారు భరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఐదు టూర్లు మెదక్ ఆర్టీసీ డిపో నుండి మొత్తం ఐదు ట్రిప్పులు టూర్ వెళ్లి వచ్చాయి. అందులో యాదగిరిగుట్టకు నాలుగు బస్సులు, ఆరుణాచలంకు ఒక బస్సు వెళ్లి వచ్చింది. ఒక్కో బస్సులో 55 ప్రయాణికులను తీసుకెళుతారు.ఆదరణ బాగుంది ఆర్టీసీ నడిపిస్తున్న పుణ్యక్షేత్రాల టూర్ బస్సులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒకే రోజు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. జిల్లా నుంచి ఫుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు ఆర్టీసీ సూచించిన నంబర్లకు, స్థానిక బస్సు డిపోలో సంప్రదించాలి. సురేఖ, ఆర్టీసీ డిపో మేనేజర్, మెదక్ -
చిన్నారులకు పాలు, అల్పాహారం!
అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు మరింత బలవర్ధకమైన ఆహారం ఇచ్చే విషయమై మాతా, శిశు సంక్షేమశాఖ కసరత్తు చేస్తుంది. వారిలో రక్తహీనత, పోషకాహార లోపం తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వారికి ఇస్తున్న పోషకాహారానికి తోడు ఉదయం పాలు, అల్పాహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 20,244 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. – రామాయంపేట(మెదక్) జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలుండగా, 5,0030 మంది విద్యార్థులున్నాయి. వీరిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 29,786 మంది ఉండగా, వీరికి టీహెచ్ఆర్ (టేక్ హోం రేషన్) కింద నెలకు 16 కోడిగుడ్లతో పాటు రెండున్నర కిలోల బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నారు. మిగితా 20,244 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డుతో పాటు ఒక పూట పౌష్టికాహారం అందజేస్తున్నారు. వారు ఇళ్లకు వెళ్లిన తర్వాత సరైన అహారం తీసుకోకపోవడంతో చాలా మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో ఎదుగుదలను అంచనా వేయడానికి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల కొలతలు తీస్తున్నారు. కేంద్రాల్లోని చిన్నారుల వయసుకు, ఎత్తుకు తగిన బరువు లేరని, పోషకాహార లోపం తలెత్తినట్లు సర్వేలో తేలింది. ఈలోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కొత్త మెనూ ప్రకారం కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వస్తే మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారానికి తోడు ఉదయం అల్పాహారంగా ఉప్మా, వంద మి.లీ. పాలు ఇవ్వనున్నారు. దీంతో చిన్నారుల్లో పోషకాహార లోపం అధిగమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మెనూ అమలైతే వారిలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది. రక్త హీనతను నివారించడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడనుంది. అంగన్వాడీలో ఉదయం అందించేలా చర్యలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో 20,244 మందికి లబ్ధిజిల్లా వివరాలు అంగన్వాడీ కేంద్రాలు 1,076 విద్యార్థుల సంఖ్య 50,030 ఏడు నుంచి మూడేళ్ల్లలోపు పిల్లలు 29,786 మూడు నుంచి ఆరేళ్లలోపు వారు 20,244అదనంగా అల్పాహారం మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు అంగన్వాడీ చిన్నారులకు ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారానికి తోడు అదనంగా అల్పాహారం ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది అమలైతే పిల్లలకు వరం. ఒక్కో విద్యార్థికి వంద మి.లీ. పాలు, ఉప్మా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. – హైమావతి, జిల్లా సంక్షేమాధికారిణి -
పక్షవాతంలో బాధపడుతున్నా..
నాది ఖమ్మం జిల్లా భద్రాచలం. పిల్లలు, కుటుంబం అక్కడే ఉంటున్నారు. సుమారు 400 కి.మీ నుంచి కొడుపాకకు ప్రమోషన్‌పై వచ్చా. 5 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నా. మనిషి తోడు లేనిదే ఉండలేను. ఎల్లప్పుడు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. పని మనిషి సహాయంతో జీవితం కొనసాగిస్తున్నాను. నెలకు రూ. 20 వేలు ఖర్చు చేసి మెదక్ నుంచి కారులో కొడుపాకకు వెళ్లి వస్తుంటాను. ప్రమోషన్లు ఇచ్చే ముందు జీరో సర్వీసు పెట్టి, బదిలీలు నిర్వహించాలి. – ఆరోగ్యం, జీహెచ్ఎం, కొడుపాక ఉన్నత పాఠశాల -
మహా గర్జనకు తరలిరండి
మెదక్ మున్సిపాలిటీ: దివ్యాంగుల సమస్యలపై ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మహా గర్జన సభను విజయవంతం చేయా లని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహాక సభకు హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల మే నిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదన్నారు. దీంతో దివ్యాంగులు రూ. 20,000 కోట్లు నష్టపోయారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేసిన డబ్బు లు దివ్యాంగులకు సంబంధించినవేనని అన్నారు. పేద వర్గాల డబ్బులు దోచి భూమి ఉన్నవర్గాలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడని విమర్శించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా ఇన్చార్జి దండు శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి విజయ్, సైదులు, చెట్లపల్లి యాదగిరి, మురళి పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణమెదక్ కలెక్టరేట్: అర్జీలను పరిష్కరించడంలో వివిధశాఖల అధికారులు బాధ్యతాయుతంగా పని చేయా లని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వా రం వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పుడు ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. మొత్తం 120 అర్జీలు రాగా, అందులో 50 భూ సమ స్యలపైనే రావడం విశేషం. వీటితో పాటు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ త్వరతిగతిన పరిష్కారం చూపి ప్రజలకు జవాబు చెప్పాలని ఆదేశించారు. మెదక్ మండల పరిధిలోని రాయిన్‌పల్లి శివారులో 365 ఎకరాల వ్యవసాయ భూములను కొంతమంది కబ్జా చేసినట్లు బుడగ జంగాల కుటుంబాలు ఫిర్యాదు చేశారు. అలాగే చేగుంటకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తమకు ఉచిత ఇసుకకు అనుమతి ఇప్పించాలని కోరారు. గత డిసెంబర్ నుంచి బిల్లులు రావడం లేదని, వెంటనే మంజూరు చేయించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య పాల్గొన్నారు.పదేళ్లుగా తిరుగుతున్నా.. మూడెకరాల భూమికి పట్టాదార్ పాస్‌పుస్తకం కోసం పదేళ్లుగా తిరుగుతున్నా. ధరణి వచ్చినప్పుడు కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చారు. కానీ మాకు రాలేదు. ఇప్పటికీ కాస్తులోనే ఉన్నాం. నాటి నుంచి నేటి వరకు కలెక్టర్లకు ఫిర్యాదులు అందజేస్తున్నా.. పరిష్కారం చూపడం లేదు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్లోనే బైఠాయిస్తా. – లక్ష్మి, చేగుంట మండలం చందంపేట -
సమస్యలపై నేరుగా సంప్రదించండి
నారాయణఖేడ్: సమస్యలపై ఖేడ్ డివిజన్ పరిధిలోని ప్రజలు తనను నేరుగా సంప్రదించి పరిష్కరించుకోవాలని, వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేయవచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూ చించారు. ఖేడ్ ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించి విలేకరులతో మాట్లాడారు. తాను వికారాబాద్‌లో శిక్షణపొందగా, శిక్షణలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల సమస్యలను పరిశీలించానని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంతానికి సబ్ కలెక్టర్‌గా నియామకమై అభివృద్ధికి పాటుపడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ పరిధిలోని సమస్యలు, ప్ర జల అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పిల్లల డ్రాపౌట్లు లేకుండా చూస్తామన్నారు. ప్రాంత అవసరాలు, సమస్యలపై ఆధ్యయనం చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతిని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆర్డీఓ అశోకచక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఆర్డీఓ కార్యాలయ అధికారులు, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, వివిధపార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు సన్మానించారు. ప్రజలకు ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సూచన బాధ్యతల స్వీకరణ -
సమస్యల పరిష్కారానికి చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొని ప్రజల నుంచి 18 వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రజావాణి నిర్వహించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.అదనపు ఎస్పీ మహేందర్ -
రూ. 5 లక్షలు సరిపోతాయా?
● ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర బృందం ఆరా ● పెద్దకంజర్లలో పర్యటనపటాన్చెరు టౌన్: మండలంలోని పెద్దకంజర్ల గ్రామంలో సోమవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్్ (ఎన్ఆర్ఎల్ఎం) బృందం పర్యటించింది. సభ్యులు సృజన్, సయ్యద్ అలీ నేతృత్వంలోని బృందం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, జాబ్ కార్డులు.. తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ఎన్ని రోజులు పని ఇచ్చారనేది రాసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 44 దరఖాస్తులకు ఆమోదం వచ్చిందని ఎంపీడీఓ యాదగిరి వారికి వివరించారు. వారిలో 16 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని హౌసింగ్ ఏఈ నందిని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు సరిపోతాయా.? అని బృందం సభ్యుడు సృజన్ ప్రశ్నించారు. సరిపోవని, లబ్ధిదారులకు సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ ద్వారా రూ. లక్ష రుణం అందేలా చూస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు తెలిపారని అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర బృందం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. కార్యక్రమలో పంచాయితీరాజ్ ఏఈ సంపత్, ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ సంతోష్ పాల్గొన్నారు. -
బాధితులకు పునరావాసం కల్పించండి
సంగారెడ్డి జోన్: భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ప్రాంతంలో ఎంఎంటీఎస్ రైల్వేలైన్ నిర్మాణం నేపథ్యంలో నివాస గృహాలు కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కార్పొరేటర్ సింధుతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన సుమారు 218 కుటుంబాలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా, ఈ ప్రాంతంలోని 218 కుటుంబాలకు మాత్రం ఇప్పటికీ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నా రు. సోమవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన పారిశ్రామిక యూనియన్ల నాయకత్వ స్థాయి ట్రేడ్ యూనియన్ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వం కార్మి కుల సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఊ డిగం చేస్తుందన్నారు. నిత్యావసర ధరలు పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. రాష్ట్రంలో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచటం, మహిళలతో రాత్రివేళ పనిచేయించే అవకాశం కల్పించటం వంటివి లేబర్ కోడ్ అమలులో భాగమేనని వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అ ధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు, నాయకులు రాజయ్య, మాణిక్యం, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం జహీరాబాద్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి అన్నారు. సోమవారం మండలంలోని బూచనెల్లిలో గల మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతో పాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు దోహదపడుతుందన్నారు. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించడానికి చట్టాలు తోడ్పడతాయని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు నర్సాపూర్ రూరల్: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్‌సింగ్ రైతులకు సూ చించారు. సోమవారం మండలంలోని అచ్చంపేటలో ఓ రైతు పొలంలో లీఫ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో రైతులు తమ భూముల్లో ఆయిల్‌పామ్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లీఫ్ ఫాం రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణ, ఏఈఓ దుర్గాప్రసాద్, ఇతర అధికారులు రైతులు పాల్గొన్నారు. -
రాక పోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రమైన చేగుంటలోని మెదక్ రోడ్డులో రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆదివారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులతోపాటు ఆర్బీ అధికారులతో ఎంపీ మాట్లాడుతూ...రైల్వే గేటు మీదుగా ప్రతీరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఈదారిలో వాహనాల రాకలపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2న ఆర్వోబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్ ఇంజనీర్ సాంబశివరావు, ఏఈ నమ్రియాల్ ఆర్ అండ్ బీ సర్దార్‌సింగ్, బీజేపీ నాయకులు గోవింద్, ఎల్లారెడ్డి, భూపాల్, పలు గ్రామాల బీజేపీ నాయకులు ఉన్నారు.రైల్వే గేటు పరిశీలించిన ఎంపీ రఘునందన్ -
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులో పూర్తిగా విఫలమైందని, వాటిని చిత్తశుద్ధితో నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య డిమాండ్ చేశారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్లో ఆదివారం జరిగిన సీపీఎం పార్టీ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆగష్టు, సెప్టెంబర్ నెలలో ప్రజల సమస్యలపై గ్రామాలు, పట్టణాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెదక్‌లో ఆగష్టు 4 నుంచి 13 వరకు సర్వేలు నిర్వహిస్తామని చెప్పారు. సర్వేలలో వచ్చిన సమస్యలపై ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్రలు చేస్తుందని వెంటనే అటువంటి ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య -
వన దుర్గమ్మా.. కరుణించమ్మా
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మా.. మము బ్రోవమ్మా అంటూ వేలాది మంది భక్తులు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయం వద్ద రద్దీ నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి బోనాలు తీసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. దూప్‌సింగ్ తండా బ్రిడ్జిని సందర్శించిన అదనపు కలెక్టర్హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని వాడి పంచాయతీ పరిధి దూప్‌సింగ్ తండా వద్ద శనివారం వరకూ పొంగిపొర్లిన బ్రిడ్జి వద్ద వరద ఉధృతి తగ్గడంతో జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తండావాసులతో మాట్లాడారు. వరద సమయంలో ప్రజలు అటువైపు వెళ్లకూడదని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఓపెన్స్కూల్కు దరఖాస్తు చేసుకోవాలిపెద్దశంకరంపేట(మెదక్): ఓపెన్స్కూల్లో ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని మండల ఓపెన్‌స్కూల్ కో ఆర్డినేటర్ విఠల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎస్సెస్సీ, ఇంటర్లో చేరే అభ్యర్థులు మీసేవ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మోదీ విధానాలపై పోరాడాలిఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్లో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు మద్దతుగా లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు నిరంతరం పోరాడతామన్నారు. కార్మికులు నిరంతరం పనిచేస్తున్న పని భద్రత ప్రదేశాల్లో భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మికుల దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. -
ఖేడ్.. ఇక పాలన దౌడ్
నారాయణఖేడ్: మారుమూల ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, ప్రజా సమస్యల తక్షణ పరి ష్కారమే లక్ష్యంగా ప్ర భుత్వం రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లను సబ్ కలెక్టర్ కార్యాలయాలుగా మారుస్తూ సబ్ కలెక్టర్లను నియమించింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి 2023వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఉమా హారతిని కేటాయించారు. రాష్ట్రంలో భైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్‌కు అభిజ్ఞాన్ మాల్వియా, ఖమ్మం జిల్లా కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాళ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌ను నియమించారు. ఖేడ్‌కు కేటాయించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖేడ్‌కు పూర్వ వైభవం! ఖేడ్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకు ముందు కర్ణాటకలో, నిజాం పాలన కింద కొనసాగింది. నాడే డివిజన్ కేంద్రంగా కొనసాగిన ఖేడ్ వికారాబాద్పాయగా సాగింది. అప్పట్లో పన్నులను వసూలు చేసి వికారాబాద్‌కు పన్నులు చెల్లింపులు జరిపేది. బీదర్ జిల్లాతో సత్సంబంధాలు కొనసాగేవి. అప్పట్లో వస్తువుల క్రయ, విక్రయాలు, బంధుత్వాలు చాలావరకు కర్ణాటకతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండటంతో సరిహద్దు గ్రామాలతోపాటు మెజార్టీ మండలాల్లో కన్నడ, మరాఠీ భాషలను మాతృభాష తరహాలోనే మాట్లాడతారు. ఉమ్మడి రాష్ట్రాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కలిశాక ఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి పరిమితమైంది. 2016లో రెవెన్యూ డివిజన్‌గా.. ఖేడ్‌లో ఉప ఎన్నికల సందర్భంగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాంత ప్రజలు, విద్యార్థుల కోరిక మేరకు 11 అక్టోబర్ 2016న ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. అప్పటినుంచి పరిపాలన కొనసాగుతుంది. అంతకుముందు సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలో ఉండటంతో ఏ చిన్న పనికై నా జిల్లా కేంద్రం సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే ఆర్డీఓ ఉండటంతో చాలా పనులు చేసుకోవడం, డివిజన్ స్థాయి అధికారి ఉండటంతో తనిఖీలు, ప్రజా సమస్యలు కొంత పరిష్కారం అయ్యేవి.సబ్ కలెక్టర్ నియామకంతో మేలు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం సులువు అధికారులు, ప్రజల మధ్య సమన్వయం ప్రజావాణి ఇక్కడే.. నేరుగా సమస్యపై ఫిర్యాదు నేడు సబ్ కలెక్టర్‌గా ఉమా హారతి బాధ్యతల స్వీకరణసబ్ కల్టెర్ హోదాతో.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఖేడ్‌లో సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ఉండటంతో ప్రజా సమస్యలు తక్షణం పరిష్కారం కాగలవు. జిల్లా కేంద్రానికి ఖేడ్ 85కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజావాణి, ఇతర సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతూ వెళ్తుంటారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు జిల్లా కేంద్రానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ప్రజావాణితోపాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, ఆయా విభాగాల సమస్యలన్నింటినీ సబ్ కలెక్టర్ హోదాలో అధికారి ఇక్కడే పరిష్కరించే వీలుంది. ఏ సమస్యనైనా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలు సబ్ కలెక్టర్‌కు కలుగనుంది. దీంతో ప్రజలు నేరుగా సమస్యలు వివరించి పరిష్కరించుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం ఖేడ్ ప్రజలకు వరంలా మారనుంది. ఆరు మండలాలతో ఖేడ్ డివిజన్ కొనసాగుతుంది. అన్ని మండలాల ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, అధికారులకు సబ్ కలెక్టర్ అనుసంధాన కర్తగా ఆయా విభాగాలకు పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
ఉల్లాసంగా హాఫ్ మారథాన్ ● రంగనాయక సాగర్ జనసంద్రంచిన్నకోడూరు(సిద్దిపేట): హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట జనసంద్రంగా మారింది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఇందుకు సపోర్టింగ్ స్పాన్సర్‌గా సాక్షి మీడియా వ్యవహరించింది. 5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన వారు ఆసక్తిగా పాల్గొన్నారు. రన్నర్స్, యువత, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా పరిగెత్తారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగులో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. సాక్షి డాట్ గేమ్స్ అదుర్స్.. రంగనాయక సాగర్‌పై జరిగిన హాఫ్ మారథాన్‌లో సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాక్షి డాట్ గేమ్స్ ఆకట్టుకున్నాయి. రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సాక్షి విత్ సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. సాక్షి డాట్ గేమ్‌లో మొదటి ముగ్గురి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీ రఘునందన్‌రావుతో పాటు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, పలువురు ప్రముఖులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు తదితరులు సాక్షి సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు పాల్గొన్నారు. వ్యాయామం తప్పనిసరి.. డయాబెటిక్ ఇండియాను హెల్త్ ఇండియాగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ప్రస్తుతం మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్న మార్గం వాకింగ్ అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. ఆరోగ్యవంతంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమన్నారు. 50 మారథాన్లలో పాల్గొన్నా ఇప్పటి వరకు 50 మారథాన్లలో పాలొని సత్తాచాటాను. ఢిల్లీ, ముంబై, చైన్నె, గుజరాత్, వైజాగ్, హైదరాబాద్‌లలో జరిగిన మారథాన్లలో పాల్గొన్నా. గత ఏడాది సిద్దిపేటో మొదటి స్థానంలో నిలిచాను. ఈ సారి 21కే లో రెండో స్థానం సాధించాను. – రమేశ్ చంద్ర, నాగర్‌కర్నూల్ -
బీసీలకే 42% రిజర్వేషన్లు ఇవ్వాలి
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో ముస్లింలకు పది శాతం ఇవ్వడమెందుకని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తే బీసీలను మోసం చేయడమేనని వారన్నారు. 42% రిజర్వేషన్లను బీసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, మొదటగా రాష్ట్ర మంత్రి మండలిలో బీసీల సంఖ్యను పెంచాలని మురళీయాదవ్, రమేశ్‌గౌడ్‌లు డిమాండ్ చేశారు. కాగా, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందున గ్రామ పంచాయితీల పాలక కమిటీలు లేక కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా పోతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలు పెట్టనందున నిధులు రావడం లేదని, సీఎం పరోక్షంగా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు సురేశ్, రాజేందర్, రమణరావు, నగేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా ఉందయా..
మెదక్‌జోన్: రాష్ట్రంలోని అనేక జిల్లాలో యూరియా కోసం షాపుల ముందు క్యూలైన్లు కడుతున్నారు. ఆధార్‌కార్డులు, భూమి పట్టాపాస్ పుస్తకాలు పట్టు కుని వెళ్తున్నారు. కానీ మెతుకు సీమలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎక్కడాలేదు. యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి సాగు 3.05 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా మిగతా 45 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. కాగా, ఇప్పటివరకు జిల్లాలో అన్నిరకాల పంటలు 1,38,783 ఎకరాల్లో సాగయ్యాయి. వాటిలో పత్తిసాగు 35వేల ఎకరాలు సాగు కాగా మొక్కజొన్న 2,500 కందులు 1,500 ఎకరాలతో పాటు కూరగాయలు, జొన్నలు, రాగులు ఇతర పంటలు మరో 6 వేల ఎకరాల్లో సాగయ్యాయి. మిగతా 93,783 ఎకరాల్లో వరి సాగైంది. కాగా, అన్ని రకాల పంటలకు కలిసి యూ రియా సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 3,900 ఎంటీఎస్ నిల్వలు ఇప్పటికే జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు 10 వేల మెట్రిక్‌టన్నుల (ఎంటీఎస్) యూరియాను రైతులు వినియోగించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 37 పీఏసీఎస్‌లలో 1,400 ఎంటీఎస్ నిల్వలు ఉండగా ప్రైవేట్ డీలర్స్ వద్ద 905 ఎంటీఎస్, మార్కెఫెడ్శాఖ అధీనంలో 1,595 ఎంటీఎస్ యూరియా నిల్వలున్నాయి. ఇంకా జిల్లాకు 11,700 ఎంటీఎస్‌ల యూరియా అవసరం ఉంటుందని, విడతలవారీగా అవసరం మేరకు తెప్పిస్తామని సంబంధిత ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 3,900 ఎంటీఎస్‌ల నిల్వలు మరో 11,700 ఎంటీఎస్ అవసరం వదంతులు నమ్మొద్దంటున్న అధికారులువదంతులు నమ్మొద్దు యూరియా కొరత ఉందని కొంత మంది పనికట్టుకుని చేసే వదంతుల్ని రైతులెవరూ నమ్మొదు. యూరియా అవసరమైతే పీఏసీఎస్‌లలో, ప్రైవేట్ డీలర్లవద్ద, మార్కెఫెడ్లలో సరిపడా ఉంది తీసుకోవచ్చు. తప్పుడు మాటలు నమ్మి యూరియా దొరుకుతుందో లేదోనని అవసరం కన్నా ఎక్కువగా కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ ఉంచకండి. అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మెదక్అవసరం ఇలా... కాగా యూరియా ఎకరం వరికి 2–3 బస్తాలు అవసరం ఉంటుంది. అలాగే మొక్క జొన్నకు, 3 బస్తాలు, కూరగాయలకు, పత్తికి మాత్రం 2 బస్తాల చొప్పున అవసరం అవుతుంది. ఇందులో వరికి రెండు సార్లు చల్లుతారు. నాట్లు వేసిన 15–20 రోజుల వ్యవధిలో ఒక్కసారి చల్లాలి. పొలంలో కలుపు తీశాక 45 రోజుల వ్యవధిలో మరోసారి చల్లాల్సి ఉంటుంది. అలాగే మొక్కజొన్న కాస్త పెరిగాక ఒక్కసారి అనంతరం గింజదశలో మరోసారి వేయాల్సి ఉంటుంది. కూరగాయలు, ఇతర పంటలకు సైతం రెండు సార్లు యూరియా వేయాల్సి ఉంటుంది. యూరియా వేస్తేనే పంట ఎదుగుదల ఉంటుంది. అందుకే యూరియాకు అంతటి ప్రత్యేకత ఉంటుంది. -
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రామ పాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాన్ని ఆర్టీఓ రమాదేవి, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ప్రిన్సిపాల్ హుస్సేన్, ల్యాండ్ సర్వే ఏడీ, పోలీసు అధికారులతో కలిసి డీఆర్ఓ భుజంగరావు సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ...ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 73 మంది అభ్యర్థులకు గాను, 63 మంది హాజరైనట్లు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన పరీక్షకు 113మంది అభ్యర్థులకు గాను 105మంది హాజరు కాగా మరో 8 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే పరీక్షను పోలీసు బందోబస్తు మధ్య కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. అనంతరం పరీక్ష మెటీరియల్‌ను హైదరాబాద్‌లోని జేఎన్టీయూకు తరలించినట్లు తెలిపారు.డీఆర్ఓ భుజంగరావు -
రంగనాయక సాగర్‌పై ఉత్సాహంగా హాఫ్ మారథాన్.. భారీగా పాల్గొన్న అథ్లెట్లు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫ్ మారథాన్‌ను ఆదివారం నిర్వహించారు. సపోర్టింగ్ స్పాన్సర్‌గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహరించింది. రన్నర్స్, యువత ప్రజలు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. 5k,10 k, 21 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. రన్ చేసిన వారికి మెడల్స్‌ను అందజేశారు.200 మందికి పైగా..2023 మార్చి 8న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పరుగెత్తుతూ.. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఈ సంఘంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ వృత్తులు, వయసుల వారున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 100 మంది మారథాన్ స్థాయికి ఎదిగారు.3100 మంది నమోదు..సిద్దిపేట వేదికగా హాఫ్ మారథాన్ నిర్వహణకు రెండు నెలలుగా కసరత్తు చేశారు. 40 మందితో కార్వనిర్వాహక కమిటీ ఏర్పాటైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రెండు నెలల కిందట ఆన్లైన్లో నమోదు ప్రారంభించారు. 5K, 10K, 21K విభాగాల్లో పోటీలు జరుగుతాయి. హాఫ్ మారథాన్‌లో 300 మంది, 10 కి.మీ. విభాగంలో 250 మంది, 5 కి.మీ. విభాగంలో 2550 మంది నమోదు చేసుకున్నారు.ఓసారి తెలుసుకుందాం..మారథాన్ అంటే 42.195 కి.మీ. మేర, హాఫ్ మారథాన్ అంటే 21.975 కి.మీ. మేర పరుగెత్తాలి. నడకతో మొదలెట్టి పరుగు వరకు.. ఏ దశలోనైనా చేరవచ్చు. విజయానికి సమయం నిర్దేశిస్తారు. పరుగెత్తే వారిని మారథాన్ రన్నర్స్‌గా పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 0.01 శాతం మాత్రమే మారథాన్ రన్నర్స్ ఉన్నారు. -
లాభాలు పంచడం అభినందనీయం
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్పాపన్నపేట(మెదక్): రైతులకు లాభాలు పంచి కొత్తపల్లి రైతు సహకార సంఘం ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలిచిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవెందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్‌తో కలసి కొత్తపల్లి సొసైటీని పరిశీలించారు. సొసైటీ రైతులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023–24, 25 సంవత్సరాలకు సంబంధించి సొసైటీకి వచ్చిన లాభాల్లో 10 శాతం రైతులకు పంచడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర సొసైటీలు కూడా ఈ మార్గం అనుసరించాలని కోరారు. సొసైటీ పరిధిలో డీజిల్, పెట్రోల్ బంకు, ఫర్టిలైజర్ షాపు, గోదాం, రైస్‌మిల్లు, వాటర్ ప్లాంటు తదితర సేవలతో రైతులకు అకనే రకాలుగా ఉపయోగ పడుతుందన్నారు. సొసైటీ పరిధిలో గానుగ ఏర్పాటు చేస్తే, మంచి నూనె అందించవచ్చన్నారు. డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పంటరుణం కాకుండా, ఎల్టీ లోన్లు మంజూరు చేస్తే బాగుంటుందని సూచించారు. చైర్మన్ రమేష్ మాట్లాడుతూ..పెట్రోల్ బంకులో సీఎన్జీ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఇఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ముందు జాగ్రత్త తప్పనిసరి
రామాయంపేట(మెదక్): జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ శుక్రవారం మండలంలోని సుతారిపల్లిలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామంలో తిరుగుతూ పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న జ్వర సర్వేను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి హరిప్రసాద్, ప్రగతి ధర్మారం మెడికల్ ఆఫీసర్ హరిప్రియ, సిబ్బంది ఉన్నారు. -
రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంకలెక్టర్ రాహుల్రాజ్ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కౌడిపల్లి రైతు వేదికలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన వారికీ, వందశాతం రుణమాఫీతో పాటు, సాగు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9900 రేషన్ కార్డుల పంపిణీ చేశామన్నారు. అనంతరం ఆయన కౌడిపల్లిలోని ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, డీఎల్పీఓ సాయిబాబా, డీఎస్ఓ సత్యానంద్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, హెచ్ఎం లలితాదేవి తదితరులు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందాలి కొల్చారం(నర్సాపూర్): సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషన్‌కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గుర్తింపుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 6 లక్షల 80 వేల రేషన్ కార్డులను ఇచ్చామని గుర్తు చేశారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం మంచిదే అయినప్పటికీ, అదనపు బస్సులు నడపకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9961 మందికి కొత్త రేషన్ కార్డులు, 31వేల అదనపు సభ్యులను రేషన్ కార్డులో చేర్చామన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ నిత్యానంద, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, యువత అధ్యక్షుడు సంతోష్ రావు పాల్గొన్నారు. కొల్చారం(నర్సాపూర్): వానాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు.ప్రతి ఇంట్లో జ్వర సర్వే తప్పనిసరిగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
సంఘటితమైతేనే సమస్యలు పరిష్కారం
మెదక్‌జోన్: సమస్యల సాధన కోసం ఉద్యోగులు సంఘటితం కావాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్లో సహకార శాఖ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశఃలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ వ్యవస్థ ప్రమాదంలో ఉందని, నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. ఉద్యోగులకు రాజ్యాంగపరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘటితం కావాలన్నారు. జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్‌తో కలిసి వారికి నిమాయక పత్రాలు అందజేశారు. అంతకుముందు సహకార శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సహకార శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించామన్నారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిర్మల రాజకుమారి, సహకార శాఖ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రాజవర్ధన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్, డీసీఓ కరుణాకర్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షుడు శేషాచారి పాల్గొన్నారు. కాగా, సహకారం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామాగౌడ్, ఉపాధ్యక్షులుగా బట్టి రాధాకృష్ణ, శ్రీకాంత్, పూర్ణచందర్, కార్యదర్శిగా సంగమేశ్వర్, కోశాధికారిగా యాకూబ్ అలీ, సంయుక్త కార్యదర్శిగా భరత్ కృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా మోహన్ కార్యవర్గ సభ్యులుగా దినేష్ కుమార్, శివకుమార్, సత్యనారాయణలు ఎన్నికయ్యారు. -
పారిశుద్ధ్య లోపం
పల్లెలకు వైరల్ ఫీవర్ పట్టుకుంది. మూడు రోజులకు పైగా వానలు ‘ముసురు’కోవడంతో జ్వరాలతో పల్లెవాసులు దవాఖానాలకు పరుగులు పెడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సహజంగా వానాకాలంలో దోమల బెడద, తాగునీటి కలుషితం అధికంగానే ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి మూడింతలు జ్వర పీడితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏ పల్లెలో చూసినా మంచం పట్టిన వారే అధికం. – మెదక్‌జోన్ జిల్లా వ్యాప్తంగా 21 మండలాలు.. 492 గ్రామాలు.. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 7.24 లక్షల పైచిలుకు మంది జనాభా ఉన్నారు. 19 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఒకటి జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఒకటి మాతాశిశు ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 2, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2 చొప్పున ఉన్నాయి. వానాకాలం ప్రారంభం జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 8,251 జ్వరాలు, 3 డెంగీ, 21కి పైగా టైఫాయిడ్ జ్వరాలు నమోదయ్యాయి. గతేడాది జులై నెలాఖరు వరకు కేవలం 2,871 జ్వరాలు మాత్రమే నమోదు అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది 5,380 మంది అధికంగా జ్వరం పీడితులు ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం ‘పల్లె పాలన’ లేకపోవటమే. సర్పంచ్ల పదవీకాలం ముగిసి 18 నెలలు కావొస్తుండటంతో పంచాయతీల నిర్వహణ భారం పంచాయితీ సెక్రటరీలపై పడింది. ముందస్తు చర్యలు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 560 మంది ఆశవర్కర్లు ఉండగా వారితో నిత్యం వ్యాధుల సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో ఆశవర్కర్ ప్రతిరోజు 20 ఇళ్ల చొప్పున తిరిగి వ్యాధుల బారిన పడిన వారి వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ఏఎన్ఎంకు అందించనున్నారు. ఒక వేళ ఏ ఇంట్లో నైనా సాధారణ జ్వరం ఉంటే అక్కడే మందుగోళీలు ఇస్తున్నారు. లేక టైఫాయిడ్, డెంగీ, మలేరియా లాంటి లక్షణాలు ఉంటే మండల మెడికల్ అధికారి దృష్టికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. జ్వరాలను ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. 513 క్యాంపుల ఏర్పాటు ఈసారి జ్వరాల తీవ్రత అధికంగా ఉండటంతో వైద్య సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 513 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అలాగే వ్యాధులకు కారణం అయ్యే స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంచం పట్టిన పల్లెలు ముసురుకున్న సీజనల్ వ్యాధులు జిల్లాలో 8వేల పైచిలుకు జ్వర పీడితులు 3 డెంగీ, 20కిపైగా టైఫాయిడ్ కేసులు పరిశుభ్రత తప్పనిసరి సీజన్వ్యాధుల నివారణకు వ్యక్తిగతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించాలి. కొబ్బరి చిప్పలు, పాతటైర్లలో నీరు నిలువ ఉండరాదు. నీటిగుంటలను పూడ్చివేయాలి, పెద్ద గుంతలు ఉంటే వాటిలో దోమల లార్వా పెరగకుండా ఆయిల్‌బాల్స్ వేసి దోమల నివారణ చేపట్టాలి. – శ్రీరాం, డీఎంహెచ్ఓ మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల విజృంభనకు ప్రధాన కారణం గ్రామాల్లో పారిశుద్ధ్య లోపించడమే కారణమని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధులు లేక పోవటంతో పంచాయతీ కార్యదర్శులే సొంతంగా డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్య నిర్వాహణ చేపడుతున్నారు. నిత్యం సేకరించాల్సిన చెత్తను కొన్ని గ్రామాల్లో రెండు, మూడు రోజులకోసారి తొలగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో వారంరోజులకోసారి తీస్తుండటంతో ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు అధికమవుతున్నాయి. -
అప్రమత్తంగా ఉండండి
వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (93919 42254) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈత మొక్కలునాటిన ఎకై ్సజ్ అధికారులు పాపన్నపేట(మెదక్): వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని గాంధారిపల్లిలో ఎకై ్సజ్ అధికారులు ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వర్రావు మాట్లాడుతూ చెట్లతోనే మానవ మనుగడ అన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు నిచ్చారు. వర్షాకాలం మొక్కలు నాటేందుకు అనువైన కాలమన్నారు. ఈత మొక్కలు గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలోఎస్సై మాన్సింగ్, కానిస్టేబుళ్లు, గీత కార్మికులు పాల్గొన్నారు. ఈ పాస్ విధానంతోనే ఎరువుల విక్రయం జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ చిన్నశంకరంపేట(మెదక్): రైతులకు ఎరువులను తప్పని సరిగా ఈ పాస్ విధానం ద్వారా ఆధార్ నమోదుతోనే విక్రయాలు చేయాలని లేదా ఫర్టిలైజర్ దుకాణదారులపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించిన, అక్రమంగా యూరియాను తరలించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్దుబాటును సరిదిద్దండి పీఆర్టీయూ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా శాసీ్త్రయంగా నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యానాయక్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ రాధాకిషన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమున్న చోట సబ్జెక్టులు, కాంప్లెక్స్‌ల వారీగా మండల, జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాలని సూచించారు. అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలలను ప్రాధాన్యత క్రమంలో సర్దుబాటు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను, ఉన్నత పాఠశాలలో ఎస్జీటీలను సర్దుబాటు చేశారు. దానిని పునఃపరిశీలించాలని కోరారు. సీనియర్ ఉపాధ్యాయులు సర్దుబాటుకు వెళ్లేందుకు సుముఖంగా ఉంటే అవకాశం కల్పించాలన్నారు. సర్దుబాటు విషయంలో కొంతమందికి అన్యాయం జరిగిందన్నారు. ఓపెన్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో సప్లిమెంటరీ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల అయ్యిందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన వారు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 5వరకు, రూ.50 అపరాధ రుసుముతో 15వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ వెంకటస్వామి (8008403635)ని సంప్రదించాలన్నారు. -
ఖేడ్ అభివృద్ధికి రూ. 60 కోట్లు విడుదల
నారాయణఖేడ్: నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి పనుల కోసం రూ. 60 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ. 280 కోట్లు త్వరలో మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీఐ నిర్మాణం కోసం రూ. 45 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. మోర్గి వద్ద గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిన వంతెన నాసిరకంగా నిర్మించడంతో దాన్ని తొలగించి జాతీయ రహదారుల నాణ్యతతో కొత్త వంతెన కోసం రూ. 6.50 కోట్లు, నమ్లిమెట్– పోతన్‌పల్లి మధ్య వంతెన కోసం రూ.1.40 కోట్లు పీఎంజీఎస్‌వై కింద మంజూరైనట్లు తెలిపారు. ఖేడ్– కరస్‌గుత్తి, ఖేడ్– రాయిపల్లి రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. హ్యామ్ ద్వారా రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ప్రధాన రోడ్లు, ప్రధాన రోడ్ల నుంచి గ్రామాలు, తండాలకు రోడ్ల కోసం రూ. 280 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, త్వరలో మంజూరు కానున్నాయన్నారు. నిధులు మంజూరైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ పాటిల్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ దారం శంకర్, ముఖ్యనాయకులు పండరిరెడ్డి, అవుటి శంకర్, దత్తుగౌడ్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
వెల్దుర్తి(తూప్రాన్): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వే యడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం సాయంత్రం వెల్దుర్తి పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రం, ప్రాథమిక ఆస్పత్రి, బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడగగా, వారు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ బోర్డు నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన బాగుందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. వానాకాలం సీజన్‌కు సరిపడా జిల్లాలో యూరియా అందుబాటులో ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, యూరియాను పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులు ఈ నెల చివరిలోపు ప్రారంభించాలని, లేని పక్షంలో వారి పేరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎంఈఓ యాదగిరి, ఏఓ ఝాన్సీ తదితరులు ఉన్నారు. 29న సమాచార కమిషనర్ల రాక మెదక్ కలెక్టరేట్: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. గురువారం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసఫ్ అలీ ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 29న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమా చార కమిషనర్లు జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. జిల్లాలో ఆర్టీఐ పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, రమాదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ -
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
జోగిపేట(అందోల్): ఆందోలు మండలంలోని పో తిరెడ్డిపల్లి శివారులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం అందోలు వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మరో ఏడాదిలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఫోర్‌లేన్ రోడ్డు పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఈఈ రవీందర్‌ను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్మించిన రెండు బస్టాప్‌లను పరిశీలించారు. అందోలు ప్రధాన రహదారి వద్ద ఉన్న బురుజు క్రాసింగ్ వద్ద ఇళ్ల తొలగింపుపై ఆర్డీఓ పాండుతో మాట్లాడారు. రోడ్డు విస్తరణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, మంత్రి కూతురు త్రిష, మాజీ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, హరికృష్ణాగౌడ్, మునిపల్లి ఎంపీపీ మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్ ఖాలేద్, మైనార్టీ నాయకుడు చోటూ ఖాన్‌లతో పలువురు పాల్గొన్నారు. త్వరగా ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలి వట్పల్లి(అందోల్): ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం వట్పల్లిలో చేపడుతున్న 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అవసరమైన చోట పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తామని పేర్కొ న్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌జ్యోషి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్‌గౌడ్, వెంకట్‌పాటిల్, ఏఎంసీ డైరెక్టర్ దిగంబర్‌రావు, మాజీ ఎంపీటీసీ నర్సింలు, సుధాకర్‌తో పాటు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల ప్రగతి
కేక్ కట్ చేస్తున్న పద్మారెడ్డి, నాయకులు రామాయంపేట(మెదక్): బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రామాయంపేట పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మాట్లాడారు. రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన కేటీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మంత్రిగా ఎన్నో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నా రు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పార్టీ యూత్ విభాగం మండలాధ్యక్షుడు జలంధర్, మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
రింగ్ రైలు కూత
ఉమ్మడి జిల్లాలో 120 కి.మీ. విస్తరణహైదరాబాద్ ఔటర్ రింగు రైలుకు అలైన్మెంట్ ఖరారు కావడం.. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి మరో కీలక అడుగుగా మారింది. ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా 392కిలోమీటర్ల మేర ఈ అలైన్మెంట్ ఉండగా.. ఇందులో ఉమ్మడి జిల్లాలోనే 120కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు ఈ ప్రాంతం సమీపంలో ఉండటం వల్ల భారీ ప్రయోజనాలు చేకూరి బహుముఖ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. – గజ్వేల్ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్మెంట్ ఖరారైంది. ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల మాత్రం 11కిలోమీటర్ల దూరంలో అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు జరిగే ప్రయోజనంపై జిల్లావాసుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఔటర్ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్ఓఆర్(రైల్ ఓవర్ రైల్) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్ఓఆర్ గజ్వేల్‌లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. జగదేవ్‌పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా ఈ రింగు రైలు విస్తరించే అవకాశాలున్నాయి. గజ్వేల్ స్టేషన్ కీలకం! రింగు రైలు ప్రాజెక్ట్‌లో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌పై ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైనన్ నిర్మాణం జరుగుతుండగా.. రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ లైన్ వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ప్రస్తుతం సిద్దిపేట వర కు ప్రస్తుతం రైలు కూడా నడుస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రింగు రైలు ప్రాజెక్ట్ నేపథ్యంలో గజ్వేల్ స్టేషన్ ఈ లైన్‌తో అనుసంధానం కానుంది. దీని ద్వారా నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ స్టేషన్ ప్రత్యామ్నాయంగా మారడానికి అడుగులు పడనున్నాయి. ఈనేపథ్యంలో కొన్ని ప్రధానమైన రైళ్లు ఇక్కడి నుంచే నడిచే అవకాశాలున్నాయి. గజ్వేల్ నుంచి వెళ్తున్న ట్రిపుల్ఆర్ పక్కనే నిర్మించిన ఈ రైల్వేస్టేషన్.. యథాతథంగా రింగు రైలుకు కూడా అనుసంధానం కానుంది. మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు అభివృద్ధికి దోహదం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో రూ.996 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు (బహుళవిధ సరుకు రవాణ సేవల సముదాయం) అభివృద్ధికి ఈ రింగు రైలు ప్రాజెక్ట్‌తో బాటల పడనున్నాయి. ఈ లైన్‌తో లాజిస్టిక్ అనుసంధానమయ్యే అవకాశాలుండటం వల్ల ఇక్కడి నుంచి సరుకు రవాణా సేవలు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించరించుకునే అవకాశం కలగనుంది. ఇదే కాదు.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో రైలు రవాణా ఆధారిత అభివృద్ధి వేగవంతం కానుంది. మహా నగరానికి పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు రవాణా వ్యవస్థ ఏర్పడనుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశాలున్నాయి. కీలకంగా మారనున్న గజ్వేల్ రైల్వేస్టేషన్ హైదరాబాద్ స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా విస్తరించే అవకాశం ‘మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్’ అభివృద్ధికి మార్గం -
బీడుగా ఆయకట్టు
జిల్లాలో చినుకులే.. భారీ వర్షం లేదు ● నిండని చెరువులు, కుంటలు, వాగులు ● ఆందోళనలో అన్నదాతలు ● బోరుబావుల కింద కొనసాగుతున్న వరినాట్లుతూప్రాన్: వాతావరణ శాఖ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ప్రకటనలు చేస్తున్నా.. వరుణ దేవుడు మాత్రం కరుణించడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు చినుకులే తప్ప.. భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. జలకల లేక చెరువులు వెలవెలబోతున్నాయి. వాటి కింద ఆయకట్టు బీడుగా మారింది. బోర్లలో నీరున్న రైతులు ముందస్తుగా తుకాలు పోసుకున్నారు. గొలుసుకట్టు చెరువులపై ఆధారపడి సాగు చేస్తున్న వారు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,327 చెరువులు జిల్లాలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతు లు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. కానీ చెరు వు లు, కుంటలు నిండకపోవడంతో సాగుకు సరిపడా నీరు లేక అయోమయంలో పడ్డారు. వాన లు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండితేనే వరి నాట్లు వేసే పరిస్థితి నెలకొంది. గతేడాది జూలైలో జిల్లాలోని చెరువుల్లో జలకళ కనిపించగా, ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో ఒక్క చెరువు కూడా నిండిన దాఖలాలు లేవు. మెట్ట పంటల సాగుకు మాత్రం వాతావరణ పరిస్థితులు కొంత మేర అనుకూలంగా ఉండగా.. వరి పండించే రైతులకు వరుణదేవుడు నిరాశే మిగిల్చాడు. జిల్లాలో వరి సాగు అంచనా 3 లక్షల ఎకరాలు వరకు ఉండగా, ప్రస్తుతం ఇప్పటివరకు సుమారు 74 వేల ఎకరాల్లో మాత్రమే సాగు అయినట్లు జిల్లా వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఈసమయంలో 249.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది 185.9 ఎంఎంగా నమోదైంది. జిల్లాలో 2,327 చెరువులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చెరువుల్లోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. కేవలం బోరుబావుల వద్దే రైతులు వరి సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా బోరుబావులు, హల్దీవాగు పరివాహ ప్రాంత రైతులు వరి నాట్లు వేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఆగస్టులోనైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తే తమ పంటలు పండుతాయన్న ఆశతో రైతులు ఉన్నారు.జిల్లాలో పంటల సాగు వివరాలు వరి 74 వేలు (సమారు) జొన్నలు 33కంది 590 మొక్కజొన్న 1,371 పత్తి 33,800 పెసర్లు 619 మినుములు 853 స్వీట్‌కాన్ 193 పామాయిల్ 900 కూరగాయలు 628 (ఎకరాల్లో) రైతులు ఆందోళన చెందొద్దు ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న వారు ఆగస్టులో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంట సాగు చేసుకోవచ్చు. ఆపై వర్షాలు పడితే ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే బోరుబావుల వద్ద వరి నాట్లు వేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. కనుక వరి రైతులు ఆందోళన చెందొద్దు. – దేవకుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
పీఆర్సీ అమలు చేయాలి: టీపీటీఎఫ్
మెదక్‌జోన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వకుండా జాప్యం చేస్తుందని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం మెదక్ తహసీల్దార్‌కు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, అన్నిరకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, జీఓ 25ను సవరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు యా దగిరి, శ్రీనివాస్‌రెడ్డి, నాచారం శేఖర్, సురేందర్, నాగరాజు, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు. -
వసతిగృహాల్లో మెనూ పాటించాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ని ర్వహించిన ప్రభుత్వ వసతి గృహాల సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు అందించాలని సూచించారు. అధికారులు స్థానికంగా ఉండాలని, విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు కల్గిస్తే సహించేది లేదన్నారు. సమస్యలుంటే చెప్పాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన కాస్మొటిక్ చార్జీలు విద్యార్థులకు రాకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ఎంఈఓలు బుచ్చానాయక్, తారాసింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల జిల్లా అధికారులు గంగాకిషన్, నీలిమ, పద్మజ, అమరజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హత్నూర మండలానికి చెందిన పలువురికి ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. -
మహిళా సాధికారతకు పెద్దపీట
సంగారెడ్డి: స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం పుల్కల్ మండలం సింగూరు చౌరస్తాలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన అందోల్ నియోజకవర్గ మహిళా శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ బంక్‌లు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజూ 5 నుంచి 6 లక్షల టర్నోవర్ సాధించడంతో పాటు 16 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పెట్రోల్ బంక్ ద్వారా ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. అలాగే మహిళా క్యాబ్ డ్రైవర్లుగా 50 మంది మహిళలకు శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు. వీరందరికీ త్వరలో రాయితీపై కార్లు ఇప్పించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు వ్యవసాయ రంగంలో పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్ వినియోగంపై మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని 9 మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీ రుణాల చెక్కులను అందజేశారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల మాట్లాడుతూ.. మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అలాగే అర్హులకు కొత్త రేషన్‌కార్డులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, ఆర్డీఓ పాండు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
అర్హులందరికీ రేషన్‌కార్డులు
పెద్దశంకరంపేట(మెదక్)/హవేళిఘణాపూర్/మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి రేషన్‌కార్డు అందజేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 9,960 నూతన రేషన్‌కార్డులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, మార్పులు, చేర్పులకు ప్రభు త్వం అవకాశం కల్పించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చి న తర్వాత ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే హవేళిఘణాపూర్ మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలు, మందులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కూచన్‌పల్లి రైతు వేదికలో భూసార పరీక్షలు ఫలితాల ద్వారా రసాయన ఎరువులు వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి మెదక్ మున్సిపాలిటీ: మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మహాలక్ష్మి పథకంపై బుధవారం మెదక్ ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2.72 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం వల్ల రూ. 81.04 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. జిల్లా పరిధిలో కొత్తగా 8 బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అనంతరం వ్యాస రచన పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
జిల్లాలో ఎరువుల కొరత లేదు
చిన్నశంకరంపేట(మెదక్): జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లిలోని ఎరువుల దుకాణాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే సూరారం శివారులోని కోళ్ల పరిశ్రమను పరిశీలించి దాణాకు ఉపయోగిస్తున్న రసాయనాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో యూరియాను నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్ఐ రాజు, ఏఈఓ నాగేందర్ తదితరులు ఉన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
సింగూరు నీటిని విడుదల చేయండి
పాపన్నపేట(మెదక్): సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు సాగు నీరు వెంటనే విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై సు మారు 53 రోజులు కావొస్తున్నా, ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన వర్షాలు కురువలేదన్నారు. దీంతో ఘనపురం ఆయకట్టు రైతాంగం వేసిన వరి తుకాలు ముదిరి పోతున్నాయని వివరించారు. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు వాటాగా రావాల్సిన 4.06 టీఎంసీలపై ఇక్కడి రైతాంగానికి పూర్తి హక్కు ఉందన్నారు. ప్రస్తుతం సింగూరులో 18.6 టీఎంసీలకుపైగా నీరు ఉన్నందున, వెంటనే 0.5 టీంఎసీల నీటిని విడుదల చేయాలని కోరారు.కుక్కల దాడిపై విచారణశివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రూప్ల తండాలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతిచెందిన విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం పీహెచ్సీ, పశువైవెద్య సిబ్బంది తండాలో విచారణ చేపట్టారు. ఐదేళ్ల లోపు పిల్లలు కుక్కల దాడిలో చనిపోతే చైల్డ్ డెత్ ఆడిటింగ్ నిర్వహించనట్లు పీహెచ్సీ వైద్యురాలు సాయిసౌమ్య చెప్పారు. తండావాసులతో మాట్లాడి దాడి వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు, తండావాసులు కోరారు.ఐటీఐలో ప్రవేశాలుమెదక్ కలెక్టరేట్: మెదక్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఎలక్ట్రీషియన్ (8), ఫిట్టర్ (6), డ్రాఫ్ట్‌మెన్ సివిల్ (12), మెకానిక్ డీజిల్ (12), కోఫా (33) సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్ అందిస్తున్నట్లు వివరించారు.మహిళల సంక్షేమమే లక్ష్యంసంగారెడ్డిటౌన్: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల అన్నారు. బుధవారం సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. అనంతరం మహిళలను సత్కరించి, వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం విజయ్‌కుమార్, డిపో మేనేజర్ ఉపేందర్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కేతకీ హుండీ ఆదాయం.. రూ. 29,79,750ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయ హుండీని బుధవారం రాజరాజేశ్వర సేవా సమి తి సభ్యులు లెక్కించారు. వివిధ ప్రాంతాల భక్తులు నగదు రూపంలో సమర్పించిన ఆదాయాన్ని లెక్కించగా రూ. 29,79,750 వచ్చిన ట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈఓ శివరుద్రప్ప, పర్యవేక్షకుడు శశిధర్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
పక్కదారి!
సబ్సిడీ యూరియాకొన్ని పరిశ్రమల్లో గుట్టుగా సాగుతున్న అక్రమ వినియోగంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ అవసరాలకు వినియోగించే సబ్సిడీ యూరియా పక్కదారి పడుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్ గ్రేడ్ (కమర్షల్) యూరియా వాడాలి. కానీ దాని స్థానంలో తక్కువ ధరకు సబ్సిడీపై లభిస్తున్న వ్యవసాయ యూరియాను అక్రమంగా ముడిసరుకుగా వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బొల్లారం, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమల్లో ఇలా వ్యవసాయ యూరియాను ముడిసరుకుగా వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ అక్రమ వాడకం కొనసాగుతుండగా.. ప్రస్తుతం యూరియా కొరత నేపథ్యంలో ఈ వ్యవహరం తెరపైకి వస్తోంది. రైతుల ఇబ్బందులు యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు బస్తాల కోసం రోజంతా క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చెప్పులు, పాస్‌పుస్తకాలను లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు వినియోగించాల్సిన యూరి యా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయేతర అవసరాలకు ఇలా.. యూరియాను ఒక్క వ్యవసాయ అవసరాలతో పాటు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తారు. ఇందులో 46 శాతం నైట్రోజన్ ఉంటుంది. చిన్న చిన్న మిశ్రమాలు కలిపితే వివిధ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరుకుగా మారుతుంది. ప్రధానంగా రసాయన పరిశ్రమలు, లూబ్రికేంట్స్, ప్లాస్టిక్, రెసిన్స్, అతుక్కునే పదార్థాలు, క్రీములు, లోషన్లు, రబ్బరు వంటి పరిశ్రమలకు యూరియాను ఓ ముడిసరుకుగా వాడుతుంటారు. పెయింట్, రబ్బరు, టాయిలెట్ క్లీనర్లు, శుభ్రపరిచే యంత్రాలు వంటి వాటి తయారీకి కూడా ఈ యూరియా వినియోగం ఉంటుంది. టెక్నికల్ గ్రేడ్ యూరియాకు ఎక్కువ రేటు.. రైతులకు సరఫరా చేస్తున్న యూరియా ఎరువులపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీలు భరిస్తుంది. 50 కిలోల బస్తాకు రైతుకు రూ. 266 చొప్పున విక్రయిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు వినియోగించే యూరియాను టెక్నికల్ గ్రేడ్ యూరియా అని పిలుస్తారు. దీని ధర బస్తాకు రూ. 1,500 నుంచి రూ. రెండు వేల వరకు ఉంటుంది. వ్యవసాయానికి వాడాల్సిన యూరియా తక్కువ ధరకు లభిస్తుండటంతో కొన్ని పరిశ్రమలు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ గ్రేడ్ స్థానంలో వ్యవసాయ యూరియా వాడకం? కొరత నేపథ్యంలో తెరపైకి వస్తున్న దందా.. అధికారుల కనుసన్నల్లోనే..? అధికారులు, డీలర్ల కనుసన్నల్లోనే ఈ వ్యవహా రం నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాకు ఎరువులు సరఫరా చేసే రైల్వే రేక్‌పాయింట్ల నుంచే నేరుగా ఈ పరిశ్రమలకు లారీల్లో యూ రియాను డంప్ చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ పలుకుడి ఉన్న ఓ స్థానిక నాయకుడు ఈ దందాను వెనుకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కొందరు డీ లర్ల గోదాములకు డెలివరీ చేస్తున్నట్లు, వే బిల్లులతో వారానికి రెండు, మూడు లారీలు ఈ పరిశ్రమల్లో యూరియా అక్రమంగా డంప్ అవుతున్నట్లు తెలుస్తోంది.దొరికితేనే దొంగలు.. జిల్లాలో పలు పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకున్న అనుమతులు ఒకటి ఉంటే.. అందులో తయారయ్యే ఉత్పత్తులు మరొకటి ఉంటున్నాయి. ఇలా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో నకిలీ పాలను తయారు చేస్తున్న వ్యవహరం గతంలో పోలీసుల దాడుల్లో తేటతెల్లమైంది. ఈ పాల తయారీకి కూడా యూరియాను వాడుతున్నట్లు గుర్తించారు. అనుమతి ఒక ఉత్పత్తికి తీసుకొని.. మరో ఉత్పత్తులను తయారు చేస్తున్న కొన్ని పరిశ్రమలు.. ఇలా ముడి పదార్థాల తయారీకి సబ్సిడీ ముడి సరుకులను వాడటానికి ఏమాత్రం వెనుకాడరనే ఆరోపణలు ఉన్నాయి. -
హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ వేదికగా కొనసాగుతున్న ప్రీ సుబ్రతో జాతీయ ఫుట్‌బాల్ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. టోర్నీలో రెండోరోజు మంగళవారం షిల్లాంగ్, పాట్నా రీజియన్లు ఆధిపత్యం ప్రదర్శించాయి. అండర్–17, అండర్–15 రెండు విభాగాల్లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. తుదిపోరులో సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నారు. రెండోరోజు విజేత జట్లు అండర్–15 విభాగం నుంచి పట్నా, షిల్లాంగ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాయి. లీగ్ మ్యాచ్‌లలో షిల్లాంగ్ జట్టు పూణె జట్టును 9–0, చండీఘర్ జట్టును 5–0 గోల్స్‌తో చిత్తుచేసింది. చండీఘర్ జట్టు 3–0తో జైపూర్‌ను, లక్నో జట్టు 2–0 గోల్స్‌తో పాట్నాను, భోపాల్ జట్టు 2–1తో హైదరాబాద్‌ను ఓడించాయి. భోపాల్, లక్నో జట్ల మధ్య 2–2 గోల్స్‌తో మ్యాచ్ టై అయింది. అదే ఒరవడిలో జైపూర్, పూణె జట్ల మధ్య మ్యాచ్ కూడా 0–0 గోల్స్‌తో టై అయింది. సెమీఫైనల్లో పాట్నా 4–0 గోల్స్‌తో లక్నోను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా, మరో సెమీఫైనల్లో షిల్లాంగ్ 4–1 గోల్స్‌తో లక్నోను ఓడించి ఫైనల్‌కు చేరింది. అండర్–17 విభాగంలో.. అండర్–17 విభాగంలోనూ షిల్లాంగ్, పాట్నా జట్లే ఫైనల్‌కు చేరాయి. రెండోరోజు లీగ్ మ్యాచ్‌లలో పాట్నా 9–0 గోల్స్‌తో జైపూర్‌ను, 2–0 గోల్స్‌తో చండీఘర్‌ను ఓడించింది. షిల్లాంగ్ 6–0 గోల్స్‌తో హైదరాబాద్‌ను, చండీఘర్ 7–1 గోల్స్‌తో భోపాల్‌ను ఓటమిపాల్జేశాయి. లక్నో 3–1 గోల్స్‌తో పూణెను, భోపాల్ 1–0 తో జైపూర్‌ను ఓడించాయి. సెమీఫైనల్స్‌లో షిల్లాంగ్ 3–1 గోల్స్‌తో చండీఘర్‌ను, రెండో సెమీఫైనల్లో పాట్నా, లక్నో మ్యాచ్ టై కాగా పెనాల్టీ షూటవుట్ ద్వారా 4–2 గోల్స్‌తో పాట్నా ఫైనల్‌కు చేరింది. ఫైనల్స్‌లో షిల్లాంగ్, పాట్నా తలపడనున్నాయి. -
కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్ట్
● అందుబాటులో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా ● కలెక్టర్ రాహుల్రాజ్శివ్వంపేట(నర్సాపూర్): జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. శివ్వంపేటలోని పీఏసీఎస్ కేంద్రంలోని యూరియా స్టాక్‌ని మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న యూరియా రికార్డులో నమోదు చేసిన దాంట్లో వ్యత్యాసమున్నట్లు గుర్తించి సిబ్బందిని తీవ్రంగా మందలించారు. హమాలి సంచికి రూ.10 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ప్రస్తుత సీజన్‌కు సంబంధించి యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని ఎవరైనా యూరియా అందుబాటులో లేనట్లు తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీరోజు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌శాఖ సిబ్బంది ఎరువుల పంపిణీని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. పంపిణీలో ఎదైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రతీ దుకాణం వద్ద యూరియాకు సంబంధించి స్టాక్ బోర్డు తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి, ఏఓ లావణ్య, సీఈఓ మధు, తదితరులున్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు నర్సాపూర్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయం ను ఆయన తనిఖీ చేసి పలు రికార్డులు పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు గుర్తించి ఆయిల్స్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయాలని, తడి పొడి చెత్త వేరు చేసి సేకరించాలని ఆదేశించారు. ఆయన వెంట వ్యవసాయ సహకార సంఘం సీఈఓ మధు ఉన్నారు. కాగా స్థానిక మున్సిపాలిటీలో చేపడుతున్న కార్యక్రమాలను కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. -
ఎదురు చూపులు బోనస్
ధాన్యం విక్రయించి రెండు నెలలు● జిల్లావ్యాప్తంగా 6.27 లక్షల క్వింటాళ్ల సన్నాలు విక్రయం ● రూ.31.37 కోట్ల బకాయిలు రెండు ఎకరాల్లో సన్నాల సాగు నాకు ఉన్న 2 ఎకరాలలో సన్నాలను సాగు చేశాను. ఎకరాకు 18 క్వింటాళ్ల చొప్పున రెండు ఎకరాలకు 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.16 వేలు రావాల్సి ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, రైతుమెదక్జోన్: సన్నధాన్యం విక్రయించి రెండు నెలలు గడిచినా వాటికి ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ డబ్బులు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రబీసీజన్‌లో 2,75,601 ఎకరాల్లో వరిసాగు చేయగా 31,373 ఎకరాల్లో 14,966 మంది రైతులు సన్నాలు సాగుచేశారు. ఇందుకు సంబంధించి ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున 6,27,474 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్డబ్బులు రూ.31.37 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. కాగా యాసంగి ముగిసి ఇప్పటికి రెండు నెలలు గడిచిపోతుండటంతో బోనస్ డబ్బుల ఊసే ప్రభుత్వం ఎత్తకపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సన్నాలకు పెట్టుబడి అధికం దొడ్డురకం వరిసాగుతో పోల్చితే సన్నాలకు పెట్టుబడితో పాటు నీటితడులు సైతం అధికంగా అవసరం ఉంటుంది. అంతే కాకుండా సన్నాలకు తెగుళ్లు సైతంఅధికంగా ఆశించటంతో పాటు సన్నవరి దొడ్డుదాని కన్నా 15 రోజులు ఆలస్యంగా పంట చేతికందుతుంది. దొడ్డురకం దిగుబడి ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్విటాళ్ల వరకు వస్తే సన్నధాన్యం ఎకరాకు 20 క్వింటాళ్లు మించి దిగుబడి రాదు. దొడ్డురకానికి ఒకటిలేదా రెండుసార్లు తెగుళ్లకు మందులు పిచికారీ చేస్తే సన్నాలకు 3–4 సార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. రసాయన మందులను సైతం అధికంగా వాడాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా దొడ్డురకం వరిసాగుకు ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.15 వేల పెట్టుబడి అయితే సన్నాలకు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. బోనస్ డబ్బులు వస్తాయనే ఆశతో కొంత రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపితే డబ్బులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.విత్తన కంపెనీలదీ అదేతీరు జిల్లాలో పుట్టగొడుగుల్లా పలురకాల విత్తన కంపెనీలు వస్తున్నాయి. మా కంపెనీ విత్తనం సాగు చేస్తే ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ రైతుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని గత రబీలో సీజన్లో జిల్లాలో 6,678 ఎకరాలలో పలు కంపెనీలు విత్తన సీడ్స్‌ను సాగుచేయించారు. కాగా, యాసంగి సీజన్ ముగిసి రెండు మాసాలు గడిపోయింది. ఇప్పటికి 3 వేల ఎకరాలకు సంబంధించిన డబ్బులు మాత్రమే రైతులకు ఇవ్వగా ఇంకా 3,678 ఎకరాలకు సంబంధించిన డబ్బులు రైతులకు రావాల్సి ఉంది. దీంతో డబ్బులు ఎప్పుడిస్తారంటూ ఆందోళన చెందుతున్నారు.మూడెకరాల్లో విత్తన సాగుచేశాను విత్తనాలు సాగు చేస్తె ఎకరాకు రూ.80 వేల చొప్పున ఇస్తామని ఓ విత్తన కంపెనీకి చెందిన వ్యక్తి చెబితే మూడెకరాల్లో విత్తన సాగు చేశాను. పంట చేతికంది 2 మాసాలు గడిచి పోయింది. ఇప్పటికీ సదరు కంపెనీ డబ్బులు ఇవ్వలేదు. – పోచయ్య, రైతు, చందాపూర్ -
రైతన్న కన్నీళ్లు
ఘనపురం ప్రాజెక్టుఘనపూర్ రైతన్నల గోస మంజీర నదిపై 1905లో తొలిసారి ఘనపురం ప్రాజెక్టు, 1923లో నిజాంసాగర్ ఏర్పాటైంది. అనంతరం 1989లో సింగూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. సింగూరు నిల్వ నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు. సింగూరు నిర్మాణం తర్వాత ఘనపురం ప్రాజెక్టుకు ఏటా 4 టీఎంసీలు, నిజాంసాగర్‌కు7, త్రాగునీటికి 4 ,డెడ్‌స్టోరేజీ 8, ఆవిరిగా మారేది 7 టీఎంసీలుగా నిర్థారించారు. అయితే ఘనపురం ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు వదలాలన్నా ప్రతి యేడు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత, అలాంటి జీఓలు లేకుండానే అవసరానికనుగుణంగా నీళ్లు వదిలేవారు. 2017లో 16.5 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు ఉంటేనే, దిగువకు వ్యవసాయ అవసరాల కోసం నీరు వదలాలని పేర్కొన్నారు. సింగూరు కాల్వలకు విడుదల చేసి.. సింగూరులో ప్రస్తుతం 18.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఘనపురం ప్రాజెక్టుకు సాగు నీరు వదలాలని, వారం రోజుల క్రితం పాపన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లా మంత్రికి టేక్మాల్‌లో విజ్ఞప్తి చేశారు. అయితే త్రాగునీటిని దృష్టిలో పెట్టుకుని నీరు విడుదల చేయడం కష్టమేనని మంత్రి అన్నట్లు తెలిసింది. కాగా రెండు రోజుల వ్యవధిలో సింగూరు ప్రాజెక్టు నుంచి ఎత్తి పోతల పథకం ద్వారా ఎడమ కాల్వలోకి నీరు వదలడంపై ఘనపురం రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా కనీసం 0.3 టీఎంసీల చొప్పున 1 టీఎంసీ నీరు విడుదల చేసినా వరి నాట్లు వేసుకుంటామని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ఆనకట్టకింద నార్లు ముదిరిపోతున్నాయని వాపోతున్నారు. ఇదే విషయమై ఈ నెల 14 నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలసి సింగూరు నీరు విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు.ఘనపురం రైతులకు తప్పని పోరాటాలు జాడలేని వానలు.. ముదురుతున్న వరి నార్లు సింగూరులో 18.6 టీఎంసీల నీరు కనీసం ఒక టీఎంసీ నీరు విడిచినా యాసంగి గట్టెక్కుతామంటున్న రైతులు గుది బండగా మారిన 16.5 టీఎంసీల జీవోమడుగు నీళ్లున్నప్పుడు కూడా వదిలారు 2004లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సింగూరు ప్రాజెక్టులో 6.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పుడు కూడా ఘనపురం పంటలకోసం నీళ్లు వదిలారు. జూన్ రెండో వారంలో 0.3 టీఎంసీల నీరు వదిలి ఘనపురం ప్రాజెక్టు క్రింద ఉన్న వరి తుకాలకు నీరు అందించారు. ఇప్పుడు వరి తుకాలు ముదిరిపోతున్నాయి. వెంటనే నీరు వదిలి రైతులను రక్షించాలి. – సత్తయ్య, రైతు, పైతర -
సీఎస్ఐ మోడరేటర్‌గా రూబెన్‌మార్క్
మెదక్‌జోన్: మెదక్ చర్చి ఇన్చార్జి బిషప్‌గా కొనసాగుతున్న రెవరెండ్ డాక్టర్ రూబెన్ మార్క్ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సినాడ్)కు మోడరేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ నెల 21న చైన్నెలో సీఎస్ఐ మోడరేటర్ పదవికోసం నిర్వహించిన ఎన్నికల్లో కేరళ చర్చికి చెందిన రెవరెండ్ బిషప్ నిత్యానంద శర్మపై 77 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సీఎస్ఐ మోడరేటర్‌గా ఎన్నికకావటంతో రూబెన్మార్క్ను మెదక్ చర్చి సంఘ బాధ్యులు గంట సంపత్, సంజయ్, ప్రభాకర్, సుశీల్, సూరజ్ తదితరులు చైన్నెలో ఘనంగా సన్మానించారు. కాగా, ఎస్ఐ మోడరేటర్‌గా ఎన్నికై న రూబెన్‌మార్క్ ఈ నెల 24న మెదక్ చర్చికి రానున్నారు. అనంతరం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారని చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి శాంతయ్య మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.రైతులకు అన్యాయం: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిపెద్ద శంకరంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేటలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎంతోమంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు..ఆస్పత్రి తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓరామాయంపేట(మెదక్): పట్టణంలోని గణపతి ఆయుర్వేదిక్ క్లినిక్‌ను మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆస్పత్రికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతోపాటు అనుమతులు లేని ఆయుర్వేద మందులను గుర్తించారు. జిల్లా వైద్యాధికారికి నివేదిక అందజేస్తామని ప్రగతిధర్మారం ఆస్పత్రి డాక్టర్ హరిప్రియ తెలిపారు. కాగా, ఎలాంటి అనుమతులు లేకపోయినా పైల్స్ ఆపరేషన్ చేసి తమను ఇబ్బందులపాలు చేసిన వైద్యుడు ప్రదీప్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సదరు క్లినిక్‌పై నార్సింగికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు, వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అధిక ధరలకు అమ్మితే చర్యలేనర్సాపూర్: ఎరువులను ఎవరైనా అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి హెచ్చరించారు. ఏఓ దీపికతో కలిసి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలు మంగళవారం ఆమె తనిఖీ చేసి పలు రికార్డులు, స్టాకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రిజిష్టర్లలో ప్రతీరోజు స్టాకు నమోదు చేయడంతోపాటు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో రిపోర్టులు అందచేయాలన్నారు. రైతులందరు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. మండలంలో ఇప్పటివరకు 6,925మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
డ్రోన్.. పిచికారీలో సహాయకారి
జిల్లాలో తొలిసారి పంటలకు ఎరువులను డ్రోన్‌తో పిచికారీ చేశారు. రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో మంగళవారం ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో వరిపంటపై నానో యూరియాను పిచికారీ చేసి దానిపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతులే స్వయంగా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యానికి గురవుతారని, డ్రోన్ సేవలతో ఈ సమస్యలు ఉత్పన్నం కావని వ్యవసాయాధికారులు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, సహాకార సంఘం డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. –రామాయంపేట(మెదక్): -
రూ.9 వేల కోట్లతో సన్నబియ్యం
చేగుంట(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకోసం 9వేయిల కోట్లతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. చేగుంట బోనాల ఉత్సవాల సందర్భంగా మంగళవారం మహంకాళీ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా రూ.12 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించినట్లు వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.32 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్లను ప్రాజెక్టుకు కేటాయించగా రీఇంజనీరింగ్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వందకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్, స్థానిక నాయకులు సండ్రుగు శ్రీకాంత్, నవీన్ తదితరులున్నారు.జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి -
క్రీడాకారులకు బహుమతుల ప్రదానం
మెదక్ కలెక్టరేట్: ఫుట్‌బాల్ క్రీడలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పోటీపడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా అధికారులు మంగళవారం బహుమతుల ప్రదానంతోపాటు సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లాలోని నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన సహస్ర రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. విద్యాశాఖ ఏఏంవో సుదర్శనం, జిల్లా స్పోర్ట్స్సెక్రెటరీ నాగరాజు, కోచ్ భాగ్య, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ఆఫీసర్లు ఆమెను అభినందిస్తూ జ్ఞాపికను అందజేశారు. క్రీడల్లో రాణించి జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఫుట్‌బాల్ క్రీడలో నైపుణ్యంతో మరింత రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు, కోచ్‌లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. -
శునకం.. ఇక కంట్రోల్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ● ఏబీసీ కేంద్రాలకు కుక్కల తరలింపు ● జిల్లాలో ఇప్పటికే 2,810 వాటికి పూర్తి ● మిగతా వాటికి కు.ని. చేసేందుకు చర్యలుజిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ కనిపించిన వారిపైన దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, మహిళలైతే మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శివ్వంపేట మండలం రూప్లా తండాలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చాయి. కాగా వీటిని అరికట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. కుక్కల సంతానోత్పత్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. – రామాయంపేట(మెదక్) జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల పరిధిలో శునకాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇవి తరచూ ప్రజలు, పశువులపై దాడులకు దిగుతూ భయాందోళన సృష్టిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభు త్వం వీటి నియంత్రణపై దృష్టి సారించింది. శస్త్ర చికిత్స ద్వారా వాటి సంతానోత్పత్తిని నియంత్రించే విషయమై మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో గతేడాది ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రం ఏర్పాటు చేసింది. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. మెదక్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల పరిధిలోని వీధి కుక్కలకు మెదక్ కేంద్రంలో, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గల శునకాలకు హైదరాబాద్‌లోని బ్లూకాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రంలో శస్త్ర చికిత్స నిర్వ హిస్తున్నారు. ప్రతి రోజు కనీసం 20 శునకాలకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో పట్టుకున్న కుక్కలను వాహనంలో మెదక్ తరలించి, కేంద్రంలోని ప్రత్యేకంగా నిర్మించిన బోనులో ఒక రోజు ఉంచుతున్నారు. ఎలాంటి వ్యాధులు లే వని నిర్ధారించుకున్న అనంతరం శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత నాలుగైదు రోజులు పర్యవేక్షణలో ఉంచిన అనంతరం యాంటీ రేబిస్, నట్ట ల నివారణ, వ్యాక్సిన్, నొప్పి నివారణ మందులు, తగిన ఆహారం అందజేస్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వాటిని ఎక్కడి నుంచి పట్టుకెళ్లారో అక్కడే మళ్లీ విడిచిపెడుతున్నారు. జిల్లా పరిధిలోని నా లుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 5,000 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సుమారు 2,810కు పైగా శునకాలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఏజెన్సీ బాధ్యులు తెలిపారు. మున్సిపాలిటీ వీధి కుక్కల సంఖ్య శస్త్రచికిత్స మెదక్ 2,400 1,500 నర్సాపూర్ 1,050 750 రామాయంపేట 970 260 తూప్రాన్ 650 300 నియంత్రణకు మేలైన పద్ధతి వీధి కుక్కలకు శస్త్రచికిత్స చేసి సంతానాన్ని నియంత్రించడం మేలైన పద్ధతి. వార్డుల్లో శునకాల బెడద ఉన్నచోట నుంచి వాటిని పట్టుకెళ్లి ఆపరేషన్లు నిర్వహించిన అనంతరం మళ్లీ అక్కడే వదిలి వెళ్తారు. దీంతో చాలా వరకు కుక్కల బెడద తగ్గుతుంది. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేటతూప్రాన్: వీధి కుక్కల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. మరో 20 మంది సైతం గాయపడ్డారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి. మూడేళ్ల బాలుడు అనిరుద్, ఎనిమిదేళ్ల రుతిక్పై విరుచుకుపడ్డాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గా యాలు కాగా, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా కుక్కల దాడిలో మరో 20 మంది గాయపడ్డారు. వీరు ప్రభు త్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పోందుతున్నారు. శివ్వంపేట మండలంలో జరిగిన ఘటన మరవక ముందే ఇలా చిన్నారు లపై కుక్కల దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. గాయపడిన చిన్నారి అనిరుధ్గుర్తింపునకు చెవి కత్తిరింపు శస్త్ర చికిత్స చేసిన శునకాలను గుర్తించడానికి వీలుగా వాటి చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరిస్తున్నారు. కొత్త స్థలాల్లో వాటిని వదిలితే ఇతన శునకాలు దాడి చేసే ప్రమాదం ఉండటంతో అవి కోలుకున్న అనంతరమే విడిచిపెడుతున్నారు. ఆపరేషన్ అనంతరం వాటిలో సాధ్యమైనంత మేర కోపం తగ్గుతుందని, సంతాన వృద్ధి ఆగిపోతుందని వెటర్నరీ డాక్టర్ ఒకరు తెలిపారు. ఇద్దరు చిన్నారులపై కుక్కల దాడి మరో 20 మందికి గాయాలు -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్‌జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధించేందుకు అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. కామర్స్ 1, కంప్యూటర్ సైన్స్ 4, ఇంగ్లీష్ 3, హిందీ 1, పొలిటికల్ సైన్స్ 1, తెలుగు 3, జీవాలజీ 1 చొప్పున మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నల్లపోచమ్మను దర్శించుకున్న న్యాయమూర్తి కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మను నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఆలయానికి న్యాయమూర్తి రావడంతో ఈఓ రంగారావు, ఆలయ పూజారులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రంజిత్‌రెడ్డి, కోర్ట్ పీసీలు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యం: కలెక్టర్ కొల్చారం(నర్సాపూర్): వసతి గృహ సంక్షేమాధికారులు అప్రమత్తంగా ఉండి, విద్యా ప్రమా ణాల మెరుగే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టోర్ రూం, మరుగుదొడ్ల నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారుచేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని, కొత్తగా చేరే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని వార్డెన్ ఉమకు సూచించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా దృష్టి పెట్టాలన్నారు. వసతి గృహంలో ప్రతినెల వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. కొండపోచమ్మ అభివృద్ధికి కృషిజగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. భక్తుల కోసం మంచి నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చైర్పర్సన్ అనుగీత, ఈఓ రవికుమార్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఆదివారం చర్లఅంకిరెడ్డిపల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు కలిశారు. మంత్రిని సన్మానించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి, తదితర అంశాలను మంత్రికి వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివరించారు. -
ముందుకు సాగని ఎవుసం
● జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల అంచనా ● ఇప్పటివరకు సాగైంది 66 వేలే.. ● అందులో వర్షాధార పంటలు 39 వేలు మెదక్‌జోన్: అదును దాటుతున్నా ఎవుసం ము ందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగు నీరందక ఆలస్యమవుతోంది. ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 66 వేల ఎకరాలు మాత్రమే రైతులు సా గు చేశారు. ఈ లెక్కన కేవలం 18 శాతం పంటలు మాత్రమే సాగయ్యాయి. వరి 27 వేల ఎకరాలకే పరిమితం వ్యవసాయశాఖ అధికారుల అంచనా ప్రకారం ఈఏడాది జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు 3,50,164 ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. ఇందులో సింహభాగం వరి 3.05 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు వరి కేవలం 27 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అది కూడా బోరుబావుల కిందే. మిగితా 39 వేల ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుములు, స్వీట్‌కార్న్ లాంటి ఆరుతడి పంటలను వర్షాధారంగా రైతులు సాగు చేశారు. గతేడాది జూలై నెలాఖరు వరకు సుమారు 2 లక్షలపై చిలుకు ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. లోటు వర్షపాతం నమోదు జూన్ 1 నుంచి జూలై 20 వరకు జిల్లాలో 241.8 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 185.6 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటివరకు 56.2 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదు అయింది. ముదురుతున్న వరినార్లు రైతులు జూన్ మొదటివారంలో నారుమ ళ్లు పోస్తారు. అప్పటినుంచి 25 రోజుల్లో వరినాటు వేస్తేనే అధిక దిగుబడి వస్తుంది. అంటే జూలై మొదటి వారం వరకు వరి నాట్లు పూర్తి కావాలి. కానీ జూలై మూడో వారం పూర్తి కావొస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 18 శాతం సాగు పూర్తయింది. నారు ముదిరితే దిగుబడి ఆశించిన మేర దిగుబడి రాదు. కాగా ఆగస్టు 15వ తేదీ వరకు వరి నాట్లు వేసుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కరుగుతున్న కార్తెలు !కార్తెలు కరిగిపోతున్నా జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవటం లేదు. ఇప్పటివరకు చెరువు, కుంటల్లోకి నీరు చేరలేదు. కేవలం బోరుబావుల ఆధారంగా రైతులు పంటలను సాగు చేశారు. వర్షాలు ఆశించిన మేర కురిస్తే చెరువు, కుంటల్లోకి నీరు చేరి ఆయకట్టు భూముల్లో రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తారు. అంతేకాకుండా భూగర్భజలాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. -
‘ఫుట్‌బాల్’ సంగ్రామం
ముస్తాబైన నవోదయం ● నేటి నుంచి మూడు రోజులపాటు పోటీలు ● జాతీయస్థాయి మెగాటోర్నీకి వర్గల్ సర్వ సన్నద్ధం ● సత్తాచాటనున్న వివిధ రాష్ట్రాల నవోదయ క్రీడాకారులు వర్గల్(గజ్వేల్): పరుగులో చిరుత వేగం.. ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ బంతిని కాళ్ల మధ్య గింగిర్లు తీయిస్తూ.. గోల్ పోస్టు వైపు దూసుకెళ్తూ.. పెనాల్టీ కార్నర్లు.. పెనాల్టీ షూటవుట్లు.. అరుప లు, కేరింతలతో క్రీడాకారులు మూడురోజులపాటు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు. ఇందుకు వర్గల్ నవోదయ వేదికకానుంది. జాతీయ ఫుట్‌బాల్ సంగ్రామానికి వర్గల్ నవోదయ సర్వసన్నద్ధమైంది. అత్యుత్తమ విద్యతోపాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న స్థానిక నవోదయ వేదికగా సోమవారం నుంచి 3 రోజుల పాటు జరిగే టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో.. దేశంలోని అన్ని నవోదయ విద్యాలయాల ఫుట్ బాల్ జట్ల క్రీడాకారులు ఆయా ప్రాంత రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. 8 రీజియన్ల నుంచి అండర్–15 విభాగంలో ఒక జట్టు, అండర్–17 విభాగంలో మరో జట్టుగా మొత్తం 16 జట్లు టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్–ఏ, గ్రూప్–బీ గా జట్లను విభజించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. టోర్నీలో విజేత జట్లు నవోదయ విద్యాలయాలన్నిటికి (నవోదయ ఒక రాష్ట్రంగా) ప్రాతినిధ్యంగా ‘ప్రీ–సుబ్రతో’ జాతీయ టోర్నీకి ఎంపికవుతారు. టోర్నీ కోసం వివిధ ప్రాంతాల నుంచి మొ త్తం 253 మంది క్రీడాకారులు, 32 మంది ఎస్కార్ట్ టీచర్లు వర్గల్‌కు చేరుకున్నారు. సందడిగా రిహార్సల్స్ క్రీడాకారులు, ఎస్కార్ట్ టీచర్లతో వర్గల్ నవోదయ సందడిగా మారింది. స్టేడియంలో మార్చ్ఫాస్ట్, ఓ త్ టేకింగ్, తదితర రిహార్సల్స్ కొనసాగాయి. ప్రిన్సిపాల్ రాజేందర్ పర్యవేక్షణలో నవోదయ యంత్రాంగం తగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
సకాలంలో సీఎంఆర్ అప్పగించాలి
– గన్నె తిరుపతి రెడ్డి, దుబ్బాక / రాంచర్ల వేణుగోపాల్ రెడ్డి, దుబ్బాకటౌన్ కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్: రైస్ మిల్లర్లు సకాలంలో తమ సీఎంఆర్ డెలివరీ చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ అబ్దుల్ నిసార్తో కలిసి సాయికృష్ణ రైస్‌మిల్లును పరిశీలించారు. బకాయి పడిన బియ్యం సకాలంలో ప్రభుత్వానికి అందజేయాలని యజమానులకు సూచించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2023–24 రబీ సీజన్లో ప్రభుత్వం జిల్లాలోని 67 రైస్ మిల్లులకు రెండు లక్షల 52వేల 13 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించిందని చెప్పారు. ఇంకా 5,965 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రైస్ మిల్లర్లు తమ లక్ష్యాలకు అనుగుణంగా ఈనెల 27లోపు బకాయి ఉన్న బియ్యం ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. సీఎంఆర్ సకాలంలో ఇవ్వని రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రైస్‌మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు సమన్వయంతో సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు.8లో -
938 పశువుల పాకలు మంజూరు
● డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు తూప్రాన్/మనోహరాబాద్: జిల్లావ్యాప్తంగా రైతులకు 938 పశువుల పాకలు మంజూరైనట్లు డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల్లో నిత్యం రెండు దఫాలుగా ఎన్ఎంఎంఎస్ ద్వారా హాజరుశాతం నమోదు చేయాలని సూచించారు. అలాగే వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. మండలానికి 75 వేల మొక్కల టార్గెట్ ఉందన్నారు. అలాగే మనోహరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఎన్ఆర్జీఎస్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీఓలు సతీశ్, రవీందర్, ఏపీఓ సంతోశ్, పంచాయతీ కార్యదర్శులు, పీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
రంగు మారిన తాగు నీరు
రామాయంపేట/నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలం కే వెంకటాపూర్ తండాలో తాగు నీరు కలుషితమవుతుంది. అయితే తండాకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నా, అవి తాగితే జలుబు చేస్తుందనే అనుమానంతో వారు బోరు నీటిపై ఆధారపడుతున్నారు. తండాకు దూరంగా ఉన్న బోరు నుంచి ట్యాంకుకు నీరు సరఫరా అవుతుంది. కాగా సదరు బోరు వ్యవసాయ భూమిలో ఉండటంతో రాత్రి కురిసిన వర్షానికి బోరు చుట్టూ నిలిచిన కలుషిత నీరు లోనికి వెలుతుంది. ఈ నీటినే ట్యాంకులోకి సరఫరా చేస్తుండగా, వాటిని గిరిజనులు తాగుతున్నారు. తండాకు ప్రతిరోజూ సరఫరా అవుతున్న భగీరథ నీటిని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈవిషయమై భగీరథ ఏఈ భిక్షపతిని వివరణ కోరగా.. స్వచ్ఛమైన భగీరథ నీటినే తాగాలని తాము పలుమార్లు చెప్పినా, గిరిజనులు వినడం లేదన్నారు. కలుషితమవుతున్న ట్యాంకు నీరు తాగితే వ్యాధుల భారిన పడే అవకాశం ఉందనిపేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లోకి పంజా విజయకుమార్
రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయకుమార్ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈమేరకు హైదరాబాద్‌లోని పంజా విజయకుమార్ ఇంటికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆయనతో చర్చించి పార్టీలో కి ఆహ్వానించారు. అనంతరం కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ర్యాగింగ్ భూతాన్ని తరిమేద్దాం నర్సాపూర్ రూరల్: ర్యాగింగ్ భూతాన్ని తరిమేద్దామని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి హేమలత సూచించారు. శనివారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆమె మాట్లాడుతూ.. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేఽ దించే సంస్కృతి విద్యాలయాల్లో మితిమీరి పోతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ అదెప్ప, యాంటీ ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ సమీరా, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్, అధ్యాపకులు శ్రీనివాస్, రమేష్, రవి, ఆరిఫ్, హేమంత్ పాల్గొన్నారు. -
పెట్టుబడిదారులకు మోదీ వత్తాసు
● సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశ ప్రజలకు ప్రమాదం నెలకొంటుందని, పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు అన్నారు. శనివారం మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్మికవర్గాన్ని బానిసలను చేయడం కోసమే మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని మండిపడ్డారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేశాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 7, 9 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్ని పార్టీలున్నా కార్మిక వర్గానికి సీఐటీయూ జెండాయే అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శిగా మల్లేశం ఎన్నికయ్యారు. -
భారీ వర్షం.. రోడ్లు జలమయం
రామాయంపేట పట్టణంలో శుక్రవారం రాత్రి, శనివారం భారీ వర్షం కురిసింది. రాత్రి ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై వరద నీరు పోటెత్తి వీధులు జలమయం అయ్యాయి. అక్కలగల్లీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు. సిద్దిపేట, కామారెడ్డి వైపు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే నర్సాపూర్‌లో భారీ వర్షం కురిసింది. విఘ్నేశ్వర కాలనీలోని రోడ్డుపై నుంచి వర్షం నీరు పారడంతో కాలనీవాసులు ఇబ్బందుల పాలయ్యారు. – రామాయంపేట(మెదక్)/నర్సాపూర్ -
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
ఎడారిలా.. మంజీరా వానాకాలం ప్రారంభమై నెలన్నర గడిచిపోతున్నా భారీ వర్షాలు కురవకపోవడంతో మండలంలో ఎక్కడ చూసిన నీటి వనరులు ఖాళీగా కనిపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు దిగువ భాగంలోని ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల కాకపోవడంతో సమీప మంజీరా పరివాహ క గ్రామాల్లో పంటల సాగుకు రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. నదిలో నీరు ప్రవహించక ఎడారిలా కనిపిస్తుంది. కొల్చారం(నర్సాపూర్): న్యూస్‌రీల్ -
శాకాంబరిగా సరస్వతీ మాత
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చిన్న గొట్టిముక్ల అటవీ ప్రాంతంలో వెలిసిన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం ఆఖరి శనివారం కావడంతో సత్యనారాయణస్వామి మండపంలో కొలువైన సరస్వతీ మాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివి ధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ప్రధాన అర్చకులు దేవాదత్తశర్మ, ప్రభుశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుపాపన్నపేట/హవేళిఘణాపూర్(మెదక్): అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు హామీ ఇచ్చారు. శనివారం మండల పరిధిలోని అర్కెల గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేసి మా ట్లాడారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు స్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండలాధ్యక్షుడు గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరశురామ్‌గౌడ్, మండల అధ్యక్షులు శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రజావాణి వాయిదా
మెదక్ కలెక్టరేట్: ఈనెల 21 సోమవారం బోనాల పండగ సందర్భంగా కలెక్టరేట్లో ని ర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 సోమ వారం యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలి వెల్దుర్తి(తూప్రాన్): చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించడంతో పాటు వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల కేంద్రం వెల్దుర్తిలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు అంగడిపేట కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ యాదగిరితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థుల స్థితిగతులు, కార్యా లయంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని, ప్రైవేట్ విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం ఎంఈఓలు పంపిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య పాల్గొన్నారు. సాగు నీరు విడుదల చేయండి నర్సాపూర్: సింగూరు, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి సాగు నీరు విడుదల చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని కార్యా లయంలో మంత్రిని కలిసి సాగు నీటి సమస్యలను వివరించినట్లు చెప్పారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీవాగు ద్వారా వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం మండలాలకు.. సింగూరు రిజర్వాయర్ నుంచి కొల్చారం మండలంలోని సాగు భూములకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి మెదక్‌జోన్: బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ అన్నారు. మెదక్‌కు రింగ్‌రోడ్డుతో పాటు మెదక్, వయా నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్డు మంజూరు చేసినందున శనివారం ప్రధాని మోదీతో పాటు ఎంపీ రఘునందన్‌రావు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈసందర్భంగా మల్లేశంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మెదక్ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. కార్యక్ర మంలో నాయకులు గడ్డం శ్రీనివాస్, నాయిని ప్రసాద్, బక్కవారి శివ, బెండ వీణ తదితరులు పాల్గొన్నారు. మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి కేజీబీవీలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మొదటి సంవత్సరం తెలుగు మీడియం కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 22న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్ఓ ఫాతిమా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి, అర్హత గల వారు పదో తరగతి మార్కుల జాబితా, కు ల, ఆధార్ కార్డు, ఇతర అవసరమైన పత్రాల తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. -
5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడు
దుబ్బాక/దుబ్బాకటౌన్: రెక్కాడితే గాని డొక్కాడని పేద, వ్యవసాయ ,కూలీ కుటుంబాల పిల్లలు వీరూ..అయితేనేం చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ఓ వైపు తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం, కూలి పనులు చేస్తూనే కష్టపడి చదువుకొని ఎస్ఐలుగా జాబ్‌లు సాధించారు. 21 నెలలు వివిధ అంశాలపై శిక్షణ తీసుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ స్టేషన్లలో బాధ్యతలు తీసుకున్న యువ ఎస్ఐలు, వారి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల కష్టం, తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం. తండ్రి టైలరింగ్.. కొడుకు ఎస్ఐదుబ్బాక పట్టణానికి చెందిన ఐరేని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీ దంపతుల కుమారుడు భార్గవ్ గౌడ్. నా తండ్రి టైలరింగ్ చేస్తూ కుటంబాన్ని పోషించాడు. గతంలో అస్సాం రైఫిల్‌మెన్‌గా, సీఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. ఆర్మీ అధికారి కావాలని కష్టపడి చదివాను. పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎస్ఐ పరీక్షకు సిద్ధమై జాబ్ సాధించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎస్ఐగా సేవలందిస్తున్నా. ఇటు ఎస్ఐగా పనిచేస్తూనే నాకు సమయం దొరికినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ ఆర్మీ పరీక్షకు సన్నద్ధమవుతున్నా. – భార్గవ్, నాగిరెడ్డి పేట ఎస్ఐఅమ్మ కూరగాయలు విక్రయించి..మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్. నాన్న గతంలో మృతి చెందాడు. అమ్మ కూరగాయలు విక్రయిస్తూ ముగ్గురు ఆడపిల్లలను చదివించింది. ఇద్దరు అక్కలు ఉద్యోగాలు సాధించారు. నా విద్యాభ్యాసం కరీంనగర్‌లోనే పూర్తి చేశా. నేను కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి ఎస్ఐ జాబ్ కోసం కష్టపడ్డా. మా అమ్మ కష్టానికి ఈ ఎస్ఐ ఉద్యోగంతో ప్రతిఫలం దక్కింది.– బోయిని సౌజన్య, బెజ్జంకి ఎస్ఐఅమ్మ కష్టానికి ప్రతిఫలం మాది కరీంనగర్ టౌన్. నాన్న మల్లేశం, అమ్మ లీలా. నాన్న ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం అమ్మపై పడింది. నాకు ఒక తమ్ముడు, అక్క ఉన్నారు. మా ముగ్గురిని అమ్మ చిన్న ఉద్యోగం చేస్తూ చదివించింది. నేను బీటెక్ చదువుతూనే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవాన్ని. బీటెక్ పూర్తి కాగానే పోలీస్ శాఖ నోటిఫికేషిన్ రాగానే కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. – ప్రశాంత్, అక్కన్నపేట, ఎస్ఐ4 ఏళ్ల పాప ఉన్నా.. గురి తప్పలేదు పెళ్లయితే అమ్మాయిలు ఏం సాధించలేరు, ఇంటికే పరిమితం అంటుంటారు. కానీ భర్త, కుటుంబం ప్రోత్సహిస్తే ఏదైనా సాధించవచ్చు. నాకు 6 సంతవ్సరాల పాప ఉంది. మాది కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామం. నాన్న వివేకానందరెడ్డి హోంగార్డ్, అమ్మ శారద టైలరింగ్ చేసేది. భర్త సుమంత్, తమ్ముడు సంతోష్ ప్రోత్సహించారు. నా ట్రైనింగ్ సమయంలో పాపకు నాలుగేళ్లు. నా భర్త పాపను చూసుకునేవాడు. – సుచిత, ఎస్ఐతండాలో తళుక్కుమన్న నరేశ్..తండా ప్రజలు వ్యవసాయానికే పరిమితం ఏం సాధించలేరనేది ఒక్కప్పటి మాట. ఆ మాట మూగపోయేలా అనుకున్న లక్ష్యం కోసం ఎంతో కష్టపడ్డాను. మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామం. నాన్న లాల్‌బహదూర్, అమ్మ హంసీ. వ్యవసాయం చేసేవారు. నేను ఉన్నత స్థానంలో ఉండాలనేది నా తల్లిదండ్రుల కోరిక. 22ఏళ్లకే ఉద్యోగం సాధించా. ఎస్ఐ జాబ్ వచ్చినప్పుడు వాళ్ల కళ్లలో ఆనందం, మాటల్లో చెప్పలేనిది. – మాలోత్ నరేష్ ఎస్ఐతల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు.. కూతురు ఎస్ఐ దుబ్బాక మండలం చీకోడ్ గ్రామానికి చెందిన నందిరి రాజయ్య, సత్తవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె జ్యోతి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జ్యోతిని చదివించారు. తల్లిదండ్రులకు గౌరవం దక్కేలా..జ్యోతి ఎస్ఐ జాబ్ సాధించి ఔరా అనిపించింది. కాగా దుబ్బాక మండలంలో 2వ మహిళా ఎస్ఐగా జాబ్ సాధించిన ఘనత జ్యోతికే దక్కింది. – జ్యోతి, ఎస్ఐ5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడుమాది కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పోతారెడ్డి పల్లి స్కూల్ తండా. నాన్న లక్ష్మణ్, అమ్మ, జమునా వ్యవసాయం చేసేవారు. తండాలో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచి ఎస్ఐ అవ్వాలన్న లక్ష్యంతో చదివాను. నాకు 5 గురు అక్కాచెల్లెల్లు. ఎస్ఐ పరీక్షకు సన్నద్ధమవుతూనే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినా పోస్టింగ్ తీసుకోలేదు. కష్టపడితే సాధించలేనిదంటూ.. ఏమి లేదు. ఇదే యువతకు ఇచ్చే సందేశం. – హలావత్ అరవింద్ కుమార్, ఎస్ఐ కీర్తిని గడించేలా.. కామారెడ్డి జిల్లా బిర్కూర్ గ్రామం మాది. అమ్మ భారతి, నాన్న నాగరాజు వ్యవసాయం చేçస్తూ నన్ను చదివించారు. నేను వరంగల్‌లో బీటెక్ పూర్తి చేశా. పోలీస్ అవ్వాలన్నది నా కోరిక. దాని కోసం పడిన కష్టం వర్ణణాతీతం. తల్లిదండ్రుల కీర్తిని పెంచేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తా. – కరీన కీర్తిరాజ్, దుబ్బాక, ఎస్ఐకానిస్టేబుల్ టూ..ఎస్ఐ మాది కరీంనగర్ జిల్లా గుంటూర్పల్లి. అమ్మ తాహేర బేగం, నాన్న షేక్ అహ్మద్. నాన్న వ్యాపారం చేస్తూ చదివించాడు. నేను 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికై విధులు నిర్వహించా. 2023 ఎస్ఐ నోటిఫికేషన్లో కష్టపడి చదివి ఎస్ఐగా ఎంపికయ్యాను. చిన్నకోడూర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించా. – సైఫ్ అలీ, చిన్నకోడూర్ ఎస్ఐతండ్రి కష్టమే నన్ను ఎస్ఐని చేసింది మాది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్. అమ్మానాన్నలు కుంచెం రాజేశ్వరి, కనకయ్య. సోదరి, సోదరుడు ఉన్నారు. తన కష్టం పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు కష్టానికి వెనుకాడకుండా చదివించారు. ఎస్ఐగా ఎంపికయ్యాను అని తెలియగానే నా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. – మానస, రాయపోల్ ఎస్ఐ ఎస్ఐ ఉద్యోగంపై ఇష్టంతో.. 2018లో కానిస్టేబుల్‌కి ఎంపికైనా ఎస్ఐ పోస్టుపై ఇష్టంతో వెళ్లలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయడానికి ఎస్ఐగా ఎంపికై దౌల్తాబాద్‌లో సేవలు అందిస్తున్నాను. కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామానికి చెందిన అరుణ్ కుమార్‌కి నలుగురు అన్నదమ్ములు. నాన్న చంద్రయ్య, అమ్మ కాంతమ్మ వ్యవసాయం చేసేవారు. ఎస్ఐ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడంతో సంతోషంగా ఉంది. – గంగాధర అరుణ్‌కుమార్, దౌల్తాబాద్, ఎస్ఐమొదటి ప్రయత్నంలోనే.. మాది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం సిరి బీబీపేట గ్రామం. నాన్న భీమరి పోచయ్య 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమ్మ మంజుల వ్యవసాయం చేస్తూ తమ్ముడిని, మా ముగ్గురు అక్క చెల్లెళ్లను పోషించింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదు. మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగం సాధించాను. నా ఉద్యోగ ప్రయత్నానికి మేనమామ దేషెట్టి లింగం సపోర్టు చేశాడు. – సృజన, ఎస్ఐ తండ్రి కూలీ..మాది కరీంనగర్. నాన్న వెంకన్న, అమ్మ కనకమ్మ ఇద్దరు కూలీపని చేసేవారు. నేను బీటెక్ పూర్తి చేశాను. నన్ను చదివించేందుకు అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకోవడం స్వయంగా చూసిన. నా కుటుంబ నేపథ్యాన్ని సవాల్‌గా తీసుకొని పట్టుబట్టి ఎస్ఐ ఉద్యోగం సాధించాను. – నవీన్,ఎస్ఐ చేర్యాల -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పెద్దశంకరంపేట(మెదక్): త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని, ఆదిశగా కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా పనిచేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మోడల్ స్కూల్‌ను సందర్శించి ప్ర హరీ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. కేజీబీవీ విద్యాలయంలో అదనపు గదులు, టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలో విద్యాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, నాయకులు మధు, నారాగౌడ్, ఆర్ఎన్. సంతోష్ పాల్గొన్నారు. -
నిలిచిన పనులపై దృష్టి సారించండి
మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలతమనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గ్రామాల్లో నిలిచిపోయిన పనులపై దృష్టి సారించాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత హితవు పలికారు. శుక్రవారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి వివేక్ కేసీఆర్‌పై విమర్శలు చేశారన్నారు. కేసీఆర్ గ్రామాలు, జిల్లాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ప్రతి మండలంలో ఆగిపోయిన సమీకృత భవనాలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించాలని, గ్రామ అవసరాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు శేఖర్‌గౌడ్, భిక్షపతి, వెంకటేష్‌గౌడ్, రతన్‌లాల్, షఫీయోద్దీన్, శ్రీనివాస్, ఇర్ఫాన్‌ఖాన్, సాయికుమార్‌గౌడ్, నరేందర్‌గౌడ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్‌కుమార్‌కుమతి భ్రమించింది
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్ మున్సిపాలిటీ: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజాలు లేవన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే పీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ మెప్పు కోసం స్థాయిని దిగజార్చుకొని మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవని మహేశ్‌కుమార్ ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా నాయకులను తిట్టడంపై ఉన్న శ్రద్ధ, రైతులకు యూరియా అందించడంలో చూపి ంచాలన్నారు. అసెంబ్లీ పెట్టండి చర్చకు సిద్ధం అని హరీశ్‌రావు రోజూ చెబుతున్నా కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగూరు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
కల్లు కాదు.. కాలకూటం
మత్తులో చిత్తవుతున్న బతుకులు ● పీల్చి పిప్పి చేస్తున్న అల్ఫాజోలం ● జిల్లాలో 163 టీసీఎస్‌లు..303 టీఎఫ్టీలు ● అనధికారిక దుకాణాలు అనేకం‘పాపన్నపేట మండలం చీకోడ్ గ్రామానికి చెందిన వృద్ధుడు లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి కల్లు తాగే అలవాటు ఉంది. ఇటీవల అనారోగ్యానికి గురి కాగా ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు కల్లు తాగొద్దని సూచించారు. అయితే కల్లు తాగకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనయ్యాడు. ఆ వ్యధ భరించలేక రెండు వారాల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.’ పాపన్నపేట(మెదక్): కల్తీ కల్లు అమాయకుల పాలిట కాలకూట విషంగా మారు తోంది. రసాయనాలతో తయారు చేసే కృత్రిమ కల్లు మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. అల్ఫాజోలం లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థంతో తయారైన కల్లు తాగిన వ్యక్తులు వ్యసన పరులుగా మారుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మామూళ్ల మ త్తులో జోగుతున్న ఎకై ్సజ్ అధికారులకు చీమ కుట్టినట్లు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితేనే కేసులు నమో దు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో 163 టీసీఎస్‌లు, 303 టీఎఫ్టీలు ఉండగా, అనధికారిక దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి. పల్లె పల్లెన, గల్లీ గల్లీలో కల్లు దుకాణాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఆటోలో కల్లు పెట్టెలు పెట్టుకొని కొన్ని గ్రామాల్లో ఆటోలో కల్లు పెట్టెలు పెట్టుకొని ‘కల్లుచ్చొందమ్మా.. కల్లు అంటు’ వీధి వీధి తిరుగుతూ కల్తీ కల్లు విక్రయిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు అటు వైపు తొంగి చూసిన పాపాన పోవడం లేదు. తయారీ ఇలా.. జిల్లాలో ఈత, తాటి వనాలు ఉ న్నా, దుకాణదారులు కల్తీ కల్లునే విక్రయిస్తున్నారు. మత్తు కోసం ఎక్కువగా అల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్, డైజోఫాం వాడుతున్నారు. చిక్కదనం, తెలుపు రంగు కోసం వైట్ పేస్ట్, రుచి కోసం చక్రీన్, నురగ రావడానికి కఫ్ పౌడర్ లాంటివి వాడుతున్నారు. ఈ మధ్య తక్కువ ఖర్చుతో మత్తు రావడానికి యాంటీ సైకోటిక్ డ్రగ్ వాడుతున్నారన్న అనుమానాలు పలు చోట్ల వ్యక్తమవుతున్నాయి. విరివిగా వాడుతున్న అల్ఫాజోలం కిలోకు రూ. 10 నుంచి రూ. 15 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. 10 గ్రాముల అల్ఫాజోలంతో సుమారు 1,200 కల్లు సీసాలను తయారు చేస్తున్నారు. పాపన్నపేట మండల శివారులోని ఓ దుకాణంలో రూ. 10కి ఎర్ర సీస, రూ. 15కు పచ్చ సీస, రూ. 30కి ప్లాస్టిక్ బాటిళ్లు (ఫీజ్‌లో పెట్టినవి) అమ్ముతున్నారు. ఇక్కడ మత్తు ఎక్కువగా ఉండటంతో యువకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్లు తెలుస్తుంది. మెదక్, చిన్నశంకరంపేట, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు కేంద్రంగా కొంత మంది దళారులు అల్ఫాజోలం దందా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో మెదక్‌కు చెందిన కొంత మంది యువకులు పాశమైలారం ప్రాంతంతో లాక్ అవుట్ అయిన ఓ ఫ్యాక్టరీని లీజుకు తీసుకొని, అందులో అల్ఫాజోలం తయారు చేశారనే ఆరోపణలున్నాయి. అలాగే మహారాష్ట్ర ఉమర్గ, ఖరాద్లోని పరిశ్రమల్లో సైతం ఇది తయారు చేస్తున్నట్లు సమాచారం. పూణె నుంచి కొంతమంది జహీరాబాద్, సంగారెడ్డి, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. మామూళ్ల ‘మత్తు’లో ఎకై ్సజ్‌శాఖ అధికారుల అండతోనే కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నెలకు సుమారు రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు ఎకై ్సజ్ అధికారులకు ముట్టజెప్పక తప్పదని కొంతమంది కల్లు దుకాణదారులు చెప్పడం గమనార్హం. స్టేషన్ స్థాయి అధికారులకు నెలకు రూ. 6 వేలు, సర్కిల్‌స్థాయి అధికారులకు రూ. 6 వేలు, జిల్లాస్థాయి వారికి ఆరు నెలలకు రూ.10 వేలు, స్పెషల్ పార్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులకు 6 నెలలకు రూ. 25 వేల వరకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తమకు వచ్చిన ఆదాయంలో సింహభాగం మామూళ్లకే కరిగి పోతుందనివాపోయారు. కల్తీ కల్లుకు కరిగిపోతున్న జీవితాలు ●● తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన పాండు (43) పదేళ్లుగా పాపన్నపేటలో నివాసం ఉంటున్నాడు. కల్తీ కల్లుకు అలవాటుపడిన ఇత డు పండగ కోసం తమిళనాడు వెళ్లాడు. అక్కడ కల్లు దొరకక పిచ్చి, పిచ్చిగా ప్రవర్తించాడు. కుటుంబీకులు దయ్యం పట్టిందని అనుమానించి భూత వైద్యుడికి చూపెట్టారు. ఈలోగా పరిస్థితి విషమించి అక్కడే మరణించాడు. ● అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లిన పలువురు, కల్లు లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ చికిత్స సైతం తీసుకోకుండా వెనక్కివచ్చారు. ఈ విషయమై అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా కల్తీ కల్లును అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశామన్నారు. ఎక్కడ కల్తీ కల్లు విక్రయాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఆ దుకాణాలపై కేసులు పెట్టండి కల్తీ కల్లు విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేయాలి. ఎకై ్సజ్ అధికారులు అన్ని దుకాణాలపై దాడులు చేసి గీత కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వం గీత కార్మికుల ఉపాధినిదృష్టిలో పెట్టుకోవాలి. – నరేందర్‌గౌడ్, పాపన్నపేట గౌడ సంఘం నాయకుడు -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్రాజ్చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వందశాతం తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూస్తే ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా మేం చూసుకుంటామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులకు పాఠాలను బోధించి వారి ప్రతిభను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన, గుణాత్మక విద్యను అందిస్తున్నామన్నారు. అనంతరం నార్సింగి మండలంలోని వల్లూర్‌లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తి అయిన వెంటనే బిల్లులు అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో కలియ తిరిగి ప్రైడే డ్రైడే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. మురికి నీరు, నిల్వ నీరు దోమల పెరుగుదలకు కారణమన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఆనంద్, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి ఉన్నారు. -
42శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుమెదక్జోన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్రం ఒప్పుకోవడం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టబద్దతలో భాగంగా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఎలా కట్టబెడతారన్నారు. అలాంటప్పుడు అసలైన బీసీలకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి బీసీ నేతనే సీఎం చేయాలన్నారు. తెలంగాణలో పాలన పక్కన పెట్టిన సీఎం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని, మోదీ సారథ్యంలో అవినీతి రహిత పాలన సాగుతుందన్నారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు బీజేపీ అభ్యర్థులే గెలవాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సింగూరు ఆయకట్టు కింద బీడు భూములకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మెదక్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కష్టపడే కార్యకర్తను బీజేపీ గుర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ప్రసాద్, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, నందారెడ్డి, బక్కవారి శివ, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలో తీవ్ర నీటి ఎద్దడి
మూడు రోజులుగా స్నానం చేయని విద్యార్థినులురామాయంపేట(మెదక్): రామాయంపేట కేజీబీవీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో మూడు రోజు లుగా స్నానాలు చేయలేదని విద్యార్థినులు వాపోయారు. నీరు లేకపోవడంతో మూత్ర శాలలు, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం ఒకే భవనంలో రామాయంపేట, నిజాంపేట కేజీబీవీ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో మొత్తం 330 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నీటి ఎద్దడి విషయం తెలుసుకొని తహసీల్దార్ రజనికుమారి శుక్రవారం స్కూల్‌ను సందర్శించారు. నీటి ఎద్దడితో తాము ఇబ్బంది పడుతున్నామని, మూడు రోజులుగా స్నానాలు చేయలేదని విద్యార్థినులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా తహసీల్దార్ టీచర్లతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండటంతో భగీరథ నీరు సరిపోవడం లేదని, సమస్య పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
పచ్చదనం పక్కాగా చేపడదాం
● హుస్నాబాద్ మున్సిపాలిటీముందువరుసలో నిలవాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: పచ్చదనం, పరిశుభ్రతలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ మున్సిపాలిటీ నంబర్ వన్‌గా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ఆరపల్లె చౌరస్తాలో త్రిశూలం వాటర్ ఫౌంటేన్‌ను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్, జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించడంపై అధికారులను అభినందించారు. రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, నాలాల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ● హామీల అమలుకు నిరంతరం శ్రమిస్తున్నాం ● మహిళాశక్తి సంబరాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్‌జోన్/నర్సాపూర్: తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో మహిళలను భాగస్వాములను చేస్తూ, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహిస్తున్నామని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేస్తూ, ఆమె పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నామని, నర్సాపూర్‌లో ప్రభుత్వ భూమి కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలు పొందిన మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లించాలని సూచించారు. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు మెప్మా పథకం కింద రూ. 2.55 కోట్ల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే వెల్దుర్తి మండలంలోని నాగ్సాన్పల్లి, హకీంపేట రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆయా సొసైటీల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వివేక్‌కు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, నాయకులు తదితరులు స్వాగతం పలికి సన్మానించారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంబరాలకు మంత్రి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసిపెట్టిందని, అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు, మహిళలకు ప్రధాని మోదీ అమలు చేసిన 33 శాతం రిజర్వేషన్లను రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేయా ల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో మెదక్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని, 18 నెలల్లోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు కారు నడపటం రావాలని, మహిళలు డ్రైవింగ్ నేర్చుకునేందుకు తానూ కా రును బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆ కారును డీఆర్డీఓకు అప్పగిస్తానని తెలిపారు.మెదక్ కలెక్టరేట్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని, ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మెగా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల ప్రగతి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో విద్యా, వైద్యంతో పాటు సంక్షేమం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అధికారులు మరింత సమష్టిగా కృషి చేయాలని సూచించారు. -
చెత్త కదలదు.. మురుగు పోదు
● అధ్వానంగా పేట మున్సిపాలిటీ ● అపహాస్యమవుతున్న వంద రోజుల ప్రణాళిక ● ఇబ్బంది పడుతున్న ప్రజలు మున్సిపాలిటీ వివరాలు జనాభా (సుమారు) 25,000 పారిశుద్ధ్య కార్మికులు 37 ఇతర సిబ్బంది 23 చెత్త సేకరణ ట్రాక్టర్లు 3 ఆటోలు 3 ప్రతి రోజు సేకరిస్తున్న చెత్త 8 మెట్రిక్ టన్నులు పేరుకుపోయిన చెత్త కుప్పలు.. వీధుల్లో పారుతున్న మురుగు నీరు.. దోమల స్వైర విహారం.. వెరసి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంద రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినా రామాయంపేట మున్సిపాలిటీలో పరిస్థితులు అధ్వానంగా మారాయి. నిధుల కొరతతో అధికారులు నామమాత్రంగా పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. – రామాయంపేట(మెదక్) రామాయంపేట మేజర్ పంచాయతీ 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పట్టణంలో సుమారుగా 25 వేల పైచిలుకు జనాభా ఉంటుంది. కాగా ప్రతి రోజు సుమారు ఏడు నుంచి ఎనిమిది మెట్రిక్ టన్నుల మేర చెత్త సేకరణ జరుగుతోంది. 37 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నా, పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు కొనసాగడంలేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ఆరుబయట పోస్తున్న చెత్తా చెదారంతో పరిసరాలు కలుషితమై మురుగుకూపంగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో పాటు పట్టణంలోని మురుగునీరు నేరుగా మల్లెచెరువులో కలుస్తుండటంతో చెరువులోని నీరు పూర్తిగా కలుషితమైంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా పారిశుద్ధ్యం విషయమై ఎలాంటి మార్పు లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీకాలనీ, గుల్పర్తి, కోమటిపల్లిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఐదో వార్డులో పెట్రోల్ బంక్ వెనుకభాగంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీటితో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. దోమల నివారణకు మురికి కాలువల్లో క్రిమి సంహారక మందు పిచికారీ, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు సక్రమంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక పనులు కొనసాగుతున్నాయి మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేస్తున్నాం. ఈమేరకు పట్టణం, శివారు గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మురుగు కాలువల్లో ఫాగింగ్, క్రిమి సంహారక మందు పిచికారీ చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
షరా మామూలే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మా రాయి. అవినీతి నిరోధకశాఖ అధికారులు అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటికీ ఈ శాఖలో కొందరు అధికారుల వసూళ్ల దందా మాత్రం ఆగడం లేదు. ముడుపులు ముట్టజెప్పనిదే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది. 10 నెలల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల కట్టలను కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం రేపింది. తాజాగా గురువారం సదాశివపేట ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదు పట్టుబడగా, కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పట్టుబడ్డారు. రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు.. ఆయా స్థిరాస్తి విలువను బట్టి ఒక్కో డాక్యుమెంట్‌కు కనీసం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల చొప్పున ముడుపులు పుచ్చుకోవడం ఈ కార్యాలయాల్లో పరిపాటిగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్ఆర్ఓ) ఉన్నాయి. అత్యధికంగా పటాన్చెరు జాయింట్ –1, జాయింట్–2, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ తదితర ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఒక్కో కార్యాలయంలో సగటు న 30 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఏదైనా ముహూర్తం, మంచి రోజులు ఉన్న రోజుల్లో ఈ కార్యాలయా ల్లో వందకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో కార్యాలయంలో రోజుకు కనీసం 50 డాక్యుమెంట్లకు రూ. 2.50 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ముడుపులు చేతులు మారుతున్నాయి. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువ ఉన్న రోజుల్లో కొన్ని కార్యాలయాల్లో రూ.ఐదు లక్షలకు మించి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లే కీలకం.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు కొందరు డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లకూడదు. కానీ వీరు ఏకంగా ఎస్ఆర్ఓల క్యాబిన్లలోకే దర్జాగా చొచ్చుకుని పోయి..పక్కనుంచి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండటం పరిపాటైపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం వంటి సంస్కరణలు ప్రభుత్వం తెస్తున్నప్పటికీ ఈ కార్యాలయాల్లో అక్రమాలు మాత్రం ఆగకపోవడం గమనార్హం.వివాదాస్పద డాక్యుమెంట్లతో కాసుల పంట వివాదాస్పదమైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.లక్ష చొప్పున ముడుపులు పుచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. లింకు డాక్యుమెంట్లు లేని స్థిరాస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న నివాస స్థలాలు, ఒకే భూమిలో రెండుసార్లు లేఅవుట్ చేసిన ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు, ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లు ఇలా వివిధ రకాల వివాదాస్పద డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.అవినీతికి నిలయాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్లు నిత్యం రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు ఏసీబీ సోదాలు చేస్తున్నా ఆగని దందా -
మెదక్‌కు నిధుల వరద
మెదక్‌జోన్: మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని, ఇక్కడి నుంచి గెలుపొంది ప్రధాని అ య్యారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి జిల్లా అభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. మెదక్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఏడుపాయల అమ్మవారి ఆలయాలకు సీఎం రేవంత్‌రెడ్డి కోట్లాది రూపాయల నిధులిచ్చారన్నారు. కేసీఆర్ ఏనాడైనా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారా..? అని ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, అభివృద్ధిలో మెదక్‌ను అగ్రగామిలో నిలబెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. చర్చి, ఏడుపాయలకు నిధులిచ్చింది కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి శూన్యం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ -
స్వచ్ఛతపై కేంద్ర బృందం ఆరా
పాపన్నపేట(మెదక్): గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమం పరిశీలించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కేంద్ర బృందం సభ్యులు సుమలత, రాణి గురువారం కొడుపాక, చిత్రియాల్ గ్రా మాల్లో పర్యటించారు. ఈసందర్భంగా పాఠశాలలు, అంగన్వాడీ, మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డ్ నిర్వహణ, ఇంకుడు గుంతలు తదితర వాటిని పరిశీలించారు. పథకాల అమలు తీరును గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మిన్పూర్, అర్కెల గ్రామల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణువర్ధన్, ఇన్చార్జి ఎంపీఓ పరమేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు బాబునాయక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
దోషులను కఠినంగా శిక్షించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కొల్చారం(నర్సాపూర్): దళిత నాయకుడు అనిల్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్‌శాఖను ఆదేశించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గురువారం పైతర గ్రామంలో అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న అనిల్‌ను హత్య చేయడం బాధాకరమన్నారు. హత్య చేసిన వారిపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. అనిల్ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని, అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ మహ్మద్‌గౌస్, డీబీఎస్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, దళిత నాయకుడు బాబు తదితరులు ఉన్నారు. -
అటవీ భూమి కబ్జా
రామాయంపేట(మెదక్): ఐదెకరాల మేర అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఆశాఖ అధికారులు సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పర్వతాపూర్ పంచాయతీ పరిధిలో బాపనయ్య తండాకు చెందిన కొందరు తండాను ఆనుకొని ఉన్న అటవీ భూమిపై కన్నేశారు. రాత్రి సమయంలో ట్రాక్టర్లు, జేసీబీలతో చెట్లను తొలగించి సదరు భూమిని చదును చేశారు. సమాచారం అందుకున్న మెదక్ అటవీశాఖ రేంజ్ అధికారి మనోజ్‌కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి ఖుద్బొద్దీన్ తమ సిబ్బందితో వెళ్లి కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. చెట్లను తొలగించి అటవీ భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారితోనే మళ్లీ మొక్కలు నాటిస్తామని చెప్పారు. కాగా అటవీశాఖ అధికారులు ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకొని మెదక్ తరలిస్తుండగా, గిరిజనులు కొందరు అడ్డుకున్నారు. దీంతో వారిని సముదాయించారు. ఎవరైనా అక్రమంగా అటవీ భూములు కబ్జా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్)/రామాయంపేట: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ శ్రీరాం అన్నారు. బుధవారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ప్రజలకు వివరించాలని సూ చించారు. ఆశావర్కర్లు, సిబ్బంది గ్రామాల్లో సందర్శించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సంబంధిత వివరాలను సేకరించాలన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నవ్య, మెడికల్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అలాగే రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పీఆర్టీయూ టీఎస్ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యానాయక్ అన్నారు. బుధవారం మెదక్ మండల పరిధిలోని మాచవరం, మంభోజిపల్లి, రాజుపల్లి, మక్తభూపతిపూర్ తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్టీయూ టీఎస్ ముందు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు శ్రీనివాస్, గోపిచంద్, సత్యనా రాయణరెడ్డి, మల్లారెడ్డి, సతీశ్‌రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 19న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు మెదక్‌జోన్: ఈనెల 19వ తేదీన జిల్లాస్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీ లు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు బాల, బాలికలకు అవకాశం ఉంటుందన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వచ్చేనెల 3, 4వ తేదీలలో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కాగా ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణపత్రం తీసుకురావాలని సూచించారు. -
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
డీఏఓ దేవ్కుమార్టేక్మాల్(మెదక్): నీటి వనరులున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పల్వంచ గ్రామంలో పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిపామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. మిగితా పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్ సాగు వల్ల అధిక లాభాలు ఉంటాయన్నారు. ఈ ఏడాది మాత్రమే ఆయిల్‌పాం పంటకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే టేక్మాల్ రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లకు ఈ–పాస్ మిషన్లను అందించారు. ఇందులో పెద్దశంకరంపేట ఏడీఏ రాంప్రసాద్, టెక్నికల్ ఏడీఏ వినయ్‌కుమార్, ఏఓ వందన, ఆయిల్‌పామ్ టెక్నికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులు ఏకాగ్రతతో చదివినప్పుడే మంచి భవిష్యత్తును పొందగలరని రాష్ట్ర మోడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మో డల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ద్వితీయ సంవత్సరం సీఈసీ విద్యార్థులతో మాట్లాడారు. బైపీసీ, ఎంపీసీ గ్రూపులను మించి మంచి భవిష్యత్తును సీఈసీ ద్వారా పొందవచ్చన్నారు. గ్రూప్–1 ఉద్యోగాలను ఎక్కువగా సీఈసీ విద్యార్థులే సాధిస్తున్నారన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎంఓ రవికుమార్ ఉన్నారు.మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి -
పాఠశాలకు డుమ్మా కొట్టొద్దు
కలెక్టర్ రాహుల్రాజ్కొల్చారం(నర్సాపూర్): విద్యార్థుల బంగారు భవిష్యత్తు విద్యతోనే సాధ్యమని, పాఠశాలకు డుమ్మా కొట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని దేశ్యా తండా ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో హాజరు పట్టికను పరిశీలించారు. రెండు, మూడు రోజులుగా పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులతో ఆరా తీశారు. పాఠశాల కు రాని విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన కలెక్టర్ తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులను పాఠశాలకు పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులను విద్యాశాఖ కల్పిస్తుందన్నారు. పిల్లలను ఇతర పనులకు తీసుకెళ్లకూడదన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయంలో తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు చర్చించాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్ఎం ఏగొండ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. -
కంకర పరిచి.. రోడ్డు మరిచి
నాలుగు జిల్లాలతో అనుసంధానమైన ప్రధాన రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నరగా కంకర పరిచి వదిలేయడంతో రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. – రామాయంపేట/నిజాంపేట(మెదక్) నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుంచి నందగోకుల్, నస్కల్ మీదుగా రాంపూర్, నిజాంపేట వరకు 18 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో నిర్మించిన తారురోడ్డు పూర్తిగా శిథిలం కావడంతో కొత్త రోడ్డు నిర్మాణానికి గతంలో రూ. 12.20 కోట్లు మంజూరయ్యాయి. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డుపై కంకరపరిచి వదిలేశారు. దీంతో గత ఏడాదిన్నర కాలంగా కంకర రోడ్డుపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. పలువురు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. వాహనాలకు సైతం తరచూ రిపేర్లు రావడం నిత్యకృత్యంగా మారింది. ఈ రహదారి కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అనుసంధానం కావడంతో జిల్లావాసులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన ప్రయాణికులు తరచూ ప్రయాణిస్తుంటారు. నెలల తరబడి కంకర పరిచిన రోడ్డుపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో నస్కల్ గ్రామస్తులు తారు రోడ్డు పనులు ప్రారంభించాలని పలుమార్లు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చొరవ తీసుకొని సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చొరవ చూపారు. కాగా కాంట్రాక్టర్ నిజాంపేట నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల మేర.. నస్కల్ వరకు మాత్రమే తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వదిలేశాడు. నస్కల్ గ్రామస్తులకు ఊరట లభించినా, చల్మెడ, రాంపూర్, నందగోకుల్ గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. పనులు ప్రారంభించేలా చర్యలు నిజాంపేట నుంచి రాంపూర్, నస్కల్, నందగోకుల్, చల్మెడ మీదుగా కమాన్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి గతంలో రూ. 12.20 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కంకర తొక్కించి పనులు ఆపివేయగా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జోక్యం చేసుకోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయింది. మిగితా పనిని త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – సర్ధార్‌సింగ్, ఈఈ, రోడ్డు భవనాల శాఖ అసంపూర్తిగా నాలుగు జిల్లాల అనుసంధాన రహదారి 18 కిలోమీటర్లకు కేవలం నాలుగు కిలోమీటర్లే పూర్తి ఏడాదిన్నరగా వాహనదారుల అవస్థలు -
సర్కారు కాలేజీల్లో సార్లు లేరు
● వేధిస్తున్న లెక్చరర్ల కొరత ● జిల్లావ్యాప్తంగా 28 ఖాళీలు ● సరైన బోధన లేక పడిపోతున్న ఉత్తీర్ణత శాతం త్వరలో గెస్ట్ ఫ్యాకల్టీ కాలేజీల్లో 12 మంది లెక్చరర్ల కొరత ఉంది. త్వరలో గెస్ట్ ఫ్యాకల్టీని ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. జిల్లాలో 16 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లెక్చరర్ల ద్వారా విద్యార్థులకు వ్యాయామం నేర్పిస్తున్నాం. – మాధవి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మెదక్‌జోన్: నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభు త్వ కాలేజీల్లో అధ్యాపకులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో బోధన, బోధనేతర సి బ్బంది కొరతతో నిరుపేద విద్యార్థుల చదువులు ము ందుకు సాగటం లేదు. ఫలితంగా ఏటా ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థాయికే పరిమితం అవుతోంది. 16 కాలేజీలు.. 5,417 మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ కళాశాలలు ఉండగా, వాటిలో 5,417 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 3,031 మంది విద్యార్థులుండగా వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2,386 మంది ఉన్నారు. కాగా, 16 కాలేజీల్లో మొత్తంగా పలు రకాల సబ్జెక్టులకు సంబంధించి 12 మంది లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, కళాశాలకో వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) చొప్పున 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో బోధించే గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం గతేడాది క్రమబద్ధీకరించడంతో వారు విధులు నిర్వర్తించే చోటనే పర్మనెంట్ అయ్యారు. దీంతో కొంతమేర ఖాళీల కొరత తీరినప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం అధ్యాపకుల కొరత సమస్య తీరలేదు. సబ్జెక్టుల వారీగా లెక్చరర్లు లేకపోవటంతో విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో ఏటా ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికై నా ఇంటర్ విద్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఖాళీల కొరతను వెంటనే భర్తీ చేసి పేద విద్యార్థుల భవిష్యత్తును చక్కబెట్టాల్సిన బాధ్యత ఉందని పలువురు కోరుతున్నారు. ఏటా ఫలితాల్లో వెనకబాటే.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెదక్ జిల్లా ప్రతీఏటా వెనకబడుతోంది. 2023, 2024 సంవత్సరాల్లో అట్టడుగు స్థానంలో నిలవగా ఈ ఏడారి సైతం ఫస్టియర్ ఫలితాల్లో చివరిస్థానం (33వ స్థానం)కు పరిమితమైంది. సెకండియర్‌లో మాత్రం 29వ స్థానంలో నిలిచింది. -
బీజేపీకి పంజా గుడ్‌బై
రామాయంపేట/నిజాంపేట(మెదక్): జిల్లాలో బీజేపీకి బిగ్‌షాక్ తగిలింది. ఆపార్టీ మెదక్ నియో జకవర్గ ఇన్చార్జి పంజా విజయకుమార్ బుధవారం రాజీనామా చేశారు. మొదట్లో బీఆర్ఎస్ నుంచి నిజాంపేట జెడ్పీటీసీగా గెలుపొందిన ఆయన, ఆపార్టీలో ఇమడలేక గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. పార్టీలో బీసీ నాయకుల సహకారంలో ఈటల రాజేందర్ అనుచరుడిగా ముద్రపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో రఽఘునందన్‌రావు గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశారు. అనతికాలంలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా ‘పంజా’ సాక్షితో మాట్లాడారు. పార్టీలో బీసీలకు సరైన న్యాయం జరగడం లేదని, నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తాను సొంత డబ్బులు ఖర్చుపెట్టి పార్టీని ముందుకు నడిపించానని పేర్కొన్నారు. పార్టీ సిద్దాంతం కేవలం మాటలకే పరిమితమైందని, పార్టీలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం బీసీలకు కాకుండా అగ్రవర్ణాలకే ఇచ్చారని, పార్టీలో సమన్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల శ్రేయస్సును అధిష్టానం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పంజా పార్టీని వీడటానికి వారం రోజుల ముందు నుంచి కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. ఈమేరకు ఆయన పలుమార్లు ఎమ్మెల్యేను కలిసినట్లు తెలిసింది. రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారైనట్లు తెలిసింది. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణ త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న విజయకుమార్? -
సర్కార్ బడుల్లో సంగీత పాఠాలు
సర్కార్ బడికి సహకారమివ్వండిపాపన్నపేట(మెదక్): ఆట పాటలతో చదువు నేర్పుతూ విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడానికి సర్కార్ బడుల్లో ఇక నుంచి సంగీత పాఠాలు నేర్పనున్నారు. పీఎంశ్రీ స్కూళ్ల నుంచి జిల్లాలో 13 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులోమోడల్ స్కూళ్లు,టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి.మ్యూజిక్ విద్యలో భాగంగా విద్యార్థులను తబలా,హర్మోనియం,మృదంగం,వయోలిన్ తదితర వాయిద్య కళాకారులుగా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ టెక్నాలజి సర్వీసెస్ లిమిటెడ్ అధ్వర్యంలో టెండర్లు నిర్వహించి ఒక్కో పాఠశాలకు సుమారు రూ.91,500 విలువ చేసే వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు.ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆసక్తి గల విద్యార్థులకు సంగీత పాఠ్యాంశాలు నేర్పనున్నారు. ఇందుకు గాను వారానికి ఒక క్లాసు నిర్వహిస్తారు. ప్రణాళిక బాగానే ఉన్నా శిక్షకుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 13 పాఠశాలల్లో మ్యూజిక్ పాఠాలు జిల్లాలో మొత్తం 31 పాఠశాలలు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ)కింద ఎంపికయ్యాయి.వాటిలో టీఎస్ఎంఎస్ శంకరంపేట, రేగోడ్,కోమట్‌పల్లి,జక్కపల్లి,టీఎస్ఆర్ఇఐఎస్ మెదక్ (వార్డ్ నంబర్ 1)మెదక్ బాలురు,జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి, పాపన్నపేట, బూరుగుపల్లి, మక్తభూపతిపూర్,శివ్వంపేట,చందాయిపేట, కాళ్లకళ్ ఉన్నాయి. వాయిద్య శిక్షకులు ఎలా! వాయిద్య పాఠాలు నేర్పేందుకు శిక్షకులు ఎలా అనే సమస్య అందరినీ పట్టి వేధిస్తోంది. బాలభవన్ నుంచి శిక్షకులను నియమించుకోవాలని అధికారులు సూచించారు. కానీ, మెదక్ జిల్లా లో అలాంటి బాల భవన్లేదు. దీంతో వారిని ఎలా నియమించుకోవాలని హెచ్ఎంలు ఆలోచనలో పడ్డారు.అయితే నాలుగు పరికరాలను ఒక్కరే బోధించే శిక్షకులు అరుదుగా ఉంటారు.ఒక్కో వాయిద్యానికి ఒక్కో నిపుణుడిని ఎంపిక చేయడం ఆర్థికంగా భారమే. శిక్షకులకు నెలకు రూ.10 వేల గౌరవ భృతి చెల్లించే అవకాఽశం ఉంది.ఇప్పటికే పాఠశాలలకు వాయిద్య పరికరాలు వచ్చాయి. ఈ నెలాఖరుకు శిక్షకులను ఎంపిక చేసి, వచ్చే నెల మొదటి తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతాం బట్టీ చదువులకు స్వస్థి చెప్పి,ఆట పాటలతో ఆకట్టుకునేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతాం.అందులో భాగమే ప్రతీరోజు ఆటలు,సంగీత శిక్షణ,ఒత్తిడి లేని చదువులు. రాను రాను సర్కార్ బడుల రూపు రేఖలు మారిపోతున్నాయి. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.ఆసక్తి గల సంగీత ప్రావీణ్యులు ఉంటే సంబంధిత హెచ్ఎంలను సంప్రదించాలి.బాలభవన్,బాలబడి సహాకారంతో శిక్షకులను నియమిస్తాం. –రాధాకిషన్, డిఈఓ, మెదక్ పాపన్నపేట(మెదక్): సర్కారు బడికి దాతలు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని డీఈఓ రాధాకిషన్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న మన్నె ఉపేందర్ తన తరఫున విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బ్యాగ్స్, షూలు, పుస్తకాలు, పెన్నులు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ...ప్రభుత్వ బడి మన అందరిదిగా భావించి దాని అభివృద్ధికి కృషిచేయాలన్నారు. పాపన్నపేట పాఠశాల పూర్వ విద్యార్థి ఉపేందర్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్యానల్ టీంలో సభ్యుడిగా పని చేసి,ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తను చదువుకున్న బడిని మరిచిపోలేదని కొనియాడారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ మంగ నర్సింలు రూపొందించిన పాఠ్య ప్రణాళికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, హెచ్ఎంలు మహేశ్వర్, శ్రీనివాస్ రావు, టీచర్లు అంజాగౌడ్, నాగరాజు, వెంకట్ రాంరెడ్డి ఉన్నారు. డీఈఓ రాధాకిషన్పీఎంశ్రీ స్కూళ్లకు మహర్దశ జిల్లాలో 13 పాఠశాలల ఎంపిక వాయిద్య పరికరాలకు రూ.91.5 వేలు పరికరాలు సరే..శిక్షకులు ఎలా..! నెలకు రూ.10 వేలు ఇచ్చే యోచనలో సర్కార్ -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కలెక్టర్ రాహుల్ రాజ్ చేగుంట(తూప్రాన్): ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. మండలంలోని పులిమామిడితోపాటు బోనాల గ్రామాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇళ్ల నిర్మాణం దశలను బట్టి ప్రభుత్వం డబ్బులను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో 9వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 5వేల ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లోని పలు వీధులలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచనలు చేశారు. పాఠశాలల్లో సందర్శించి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డితోపాటు పలు శాఖల అధికారులు ఉపాధ్యాయులున్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి జేడ్పీ సీఈఓ ఎల్లయ్య తూప్రాన్: ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని జేడ్పీ సీఈఓ, మండల ప్రత్యేకాధికారి ఎల్లయ్య పేర్కొన్నారు. మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అడవులు పెంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీశ్, తహసీల్దార్ శ్రీనివాస్, అటవీశాఖ అధికారి ప్రకాశ్, ఏపీఓ సంతోశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మెప్మా పీడీ హన్మంతరెడ్డి రామాయంపేట(మెదక్): మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులనుంచి తీసుకుంటున్న రుణాలను సద్వినియోగపర్చుకుని అభివృద్ధి చెందాలని మెప్మా పీడీ హన్మంతరెడ్డి సూచించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వీధి విక్రయదారుల వ్యాపార మేళా (స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్), స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళాను మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే సభ్యులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన కమిషనర్‌తో కలిసి మహిళా సంఘాలు, వీధి వ్యాపారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మెప్మా మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మెదక్ ఆర్సీఓ గౌతంకుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, సోషల్, గణితం, హిందీ సబ్జెక్టులను బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, పీజీ చేసి 50% మార్కులు తగ్గకుండా ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఈ నెల 19న సంగారెడ్డిలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441250450ను సంప్రదించాలన్నారు. -
స్వచ్ఛతకు నిధులు
కేటాయింపు ఇలా.. మున్సిపాలిటీ నిధులు (రూ.లలో) అమీన్పూర్ 7,17,141 అందోల్–జోగిపేట 4,26,848 బొల్లారం 42,76,373 చేర్యాల 3,65,174 దుబ్బాక 5,49,240 గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 66,26,784 హుస్నాబాద్ 4,33,385 మెదక్ 8,12,730 నర్సాపూర్ 3,79,634 రామాయంపేట 3,59,549 సదాశివపేట 6,96,026 సంగారెడ్డి 22,29,523 సిద్దిపేట 1,19,70,573 తెల్లాపూర్ 45,56,296 తూప్రాన్ 24,13,867 జహీరాబాద్ 12,05,599 నారాయణఖేడ్ 3,65,934 పట్టణాల్లో స్వచ్ఛత వెల్లివిరియనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిధులను కేటాయించారు. పలు మున్సిపాలిటీలు నిధులు లేక నిర్వహణకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలకు రూ.3.83కోట్లు మంజూరు చేసింది. – సాక్షి, సిద్దిపేట పట్టణాలకు ప్రతీ ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకులను కేటాయిస్తుంది. వివిధ కేటగిరిలలో ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ అవార్డులను ప్రకటిస్తుంది. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాలకు అత్యధికంగా అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2021లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ 2026 అక్టోబర్ వరకు కొనసాగ నుంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం పట్టణాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.3,83,84,676 నిధులు మంజూరు చేశారు. ఆయా పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీకి, అత్యల్పంగా రామాయంపేట మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయి. వీటి నిర్వహణకు.. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను ఘన వ్యర్థాల నిర్వహణ, సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు, విజ్ఞానం, కమ్యూనికేషన్, ప్రజారోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా వెచ్చించనున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు, బయో మైనింగ్ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని ఆదేశించారు. సౌకర్యాలు ఇక మెరుగు మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల ద్వారా దాదాపు అన్ని కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతోంది. అయితే ఆదాయం తక్కువగా వస్తుండటంతో కార్యాలయ భవనాల, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులు మంజూరైన తరుణంలో మున్సిపాలిటీలలో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. ‘స్వచ్ఛత’లో మెరుగైన ర్యాంక్ సాధిస్తాం స్వచ్ఛభారత్ నిధులను మున్సిపల్ పరిధిలో నిర్వహించే స్వచ్ఛత కార్యక్రమాలకు వినియోగిస్తాం. డీఆర్సీ సెంటర్, డంపింగ్ యార్డు అభివృద్ధి, టాయిలెట్స్ నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అందరి సమష్టి కృషితో స్వచ్ఛభారత్ మిషన్‌లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. సీడీఎంఏ అనుమతితో నిధులు వినియోగిస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్ -
పుట్టెడు దుఃఖం మిగిల్చి..
పుట్టిన రోజుకు ముందేకొల్చారం(నర్సాపూర్): కాంగ్రెస్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్‌లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనూహ్య రీతిలో దుండగులు వెంటాడి వేటాడి కాల్పులు జరిపి అనిల్‌ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అనిల్ పుట్టిన రోజు ఉండటం.. ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. దేవుడా.. ‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?.. దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కదిలించింది. బర్త్‌డే వేడుకలు చేసుకుందాం..అందరం కలుసుకుందాం అని చెప్పిన అనిల్‌ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలు కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. పదిమందికి సహాయం చేసే గుణం తప్ప మా అన్న ఎవరికీ చెడు చేయలేదని, శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్ సోదరుడు నవీన్ విలపిస్తున్నాడు. పోలీస్ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విషాదఛాయలు అనిల్ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు మాత్రం తను మా కుమారుడు ఎవరికి హాని తలపెట్టింది లేదని, కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ విలపిస్తున్నారు. అనిల్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడిన 15 నిమిషాలకే.. ఫోన్లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త అందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్పల్లి మెట్రోస్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్‌కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందని వివరించారు. -
కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘానికి అవార్డు
పాపన్నపేట(మెదక్): సొసైటీ సభ్యులకు మెరుగైన ఆర్థిక వినిమయ సేవలు అందించి లాభాల్లో రెతులకు 10% డివిడెంట్ పంచిన కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ త్యార్ల రమేశ్‌కు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సహకార శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, నాబార్డ్ జీఎం ఉదయ్‌భాస్కర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. నాబార్డ్ ఆధ్వర్యంలో మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘాన్ని ఎంపిక చేశారు. సొసైటీకి వచ్చిన లాభాల్లో సుమారు రూ.17.50 లక్షలను సభ్య రైతులకు 10% చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. రైతులకు రుణాల పంపిణీ, వాటి రికవరీ, పెట్రోల్, డీజీల్ బంకుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఫర్టిలైజర్ సేవలు తదితర విభాగాల్లో సొసైటీ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేసినట్లు చైర్మన్ రమేశ్ తెలిపారు. -
ఆయిల్‌పామ్ లక్ష్యం 2,500ఎకరాలు
రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ సునీతకౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు 2,500 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు రాష్ట్ర ఉద్యానశాఖ జేడీ సునీత వెల్లడించారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో టమాటా రైతు మహిపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కాకర, బీర కూరగాలయ పంటను, ముట్రాజ్‌పల్లి ఆయిల్‌పామ్ సాగును జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్‌తో కలిసి మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటివరకు 1,739 రైతులు ఆయిల్ పామ్ సాగు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 930మంది రైతువాటాగా మొక్కలకు డబ్బులు కూడా చెల్లించారని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఒక్కసారి మొక్క నాటితే నాల్గవ ఏట నుంచి పంట కోతకు వస్తుందన్నారు. ఏడాదికి ఎకరాకు రూ 1.40లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. నాలుగేళ్లపాటు అంతర పంటగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కూరగాయల పంటలకు సైతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఎకరా పందిరి సాగుకు రూ.1లక్ష సబ్సిడీ వస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీహెచ్ఓ ప్రతాప్‌సింగ్, హార్టికల్చర్ అధికారి సంతోష్, రైతు మహిపాల్‌రెడ్డి, మౌనిక రైతులు కొర్రశ్రీను పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సునీత తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.3.83 కోట్లు ● 16 మున్సిపాలిటీలకు కేటాయింపు ● అత్యధికంగా సిద్దిపేటకు.. అత్యల్పంగా రామాయంపేటకు ● మెరుగుపడనున్న పట్టణాలు -
ఒకేరోజు ముగ్గురు అధికారులు బాధ్యతల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం ఒకేరోజు ముగ్గురు అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారిగా ఇక్కడ పనిచేసిన గోవింద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి వినయ్‌కుమార్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆత్మ నాగర్ కర్నూల్నందు పని చేస్తున్న దేవ్‌కుమార్ బదిలీపై వచ్చి నూతన వ్యవసాయ అధికారిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే సంగారెడ్డి జిల్లా మెప్మాపీడీగా పనిచేస్తున్న గీత బదిలీపై వచ్చి మెదక్ జెడ్పీడీప్యూటీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు జిల్లా మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా నితిన్ కబ్రా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన ముగ్గురు అధికారులు కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆయన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. -
రచ్చకెక్కొద్దు..
● విభేదాలొస్తే అంతర్గతంగా చర్చించుకోవాలి ● అవసరమైతే పీసీసీ దృష్టికి తీసుకురండి ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పొన్నం సూచన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నీలం మధు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు రాజిరెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు. -
బాలికలు ఉన్నతంగా చదువుకోవాలి
అదనపు కలెక్టర్ నగేశ్ చేగుంట(తూప్రాన్): బాలికలు ఉన్నతంగా చదువుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని రెడ్డిపల్లి కాలనీ కేజీబీవీని డీఈఓ రాధాకిషన్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారంతో పాటు వసతుల కల్పనపై ఆరా తీశారు. నూతనంగా ఏర్పాటైన నార్సింగి కేజీబీవీ విద్యార్థినులు సైతం రెడ్డిపల్లి కాలనీలోనే చదువుకుంటున్నారని, వసతులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు వివరించారు. త్వరలోనే తగిన గదులను పరిశీలించి నార్సింగి మండల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేస్తానని డీఈఓ హామీ ఇచ్చారు. వారి వెంట ఎంఈఓ నీరజ, పాఠశాల ఎస్ఓ శ్రీవాణి, సిబ్బంది ఉన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్ననే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఇందిర మహిళాశక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా పలు మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీకి సంబంధించి రూ. 2,87,82,000 చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దివంగత వైఎస్సార్ మ హిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని, తర్వాత బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులు ముందుకు వస్తే రెండు బస్సులు, పెట్రోల్‌బంక్‌లు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలోని వెంకటాపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. రూ. 3.86 కోట్లతో అర్బన్ పార్కుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎఫ్ఓ శ్రీధర్‌రావు, రేంజ్ అధికారిణి అనురాధ, సిబ్బందితో కలిసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిరిజా షెట్కార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఐకేపీ పీడీ జ్యోతి, డీపీఎం సుధాకర్, ఏపీఎంలు వంశీకృష్ణ, సాయిలు, అనంతయ్య, కుమార్, శేఖర్, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు, నాయ కులు త దితరులు పాల్గొన్నారు. -
18న జిల్లాకు బీజేపీ చీఫ్ రాక
నర్సాపూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎంపీ రఘునందన్‌రావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మొదటి సారి జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● ప్రజావాణిలో 66 వినతుల స్వీకరణ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి కలెక్టరేట్లో వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఒకే సమస్యపై పలుమార్లు వినతిని సమర్పించకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాగానే తీసుకున్న నిర్ణయాన్ని సదరు ఫిర్యాదుదారుడికి సమాచారం చేరవేయాలన్నారు. లేనిచో మళ్లీ అదే సమస్యపైన వినతి సమర్పించేందుకు గ్రీవెన్స్‌కు ప్రజలు రావాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇదిలాఉండగా ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలను 66 అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావుతో పాటు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. త్వరగా భూ సమస్యలు పరిష్కరించాలి చిలప్‌చెడ్(నర్సాపూర్): జిల్లావ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, ఎరువుల ధరల గురించి ఆరా తీశారు. జిల్లాలో సుమారు 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు యూరియా సరిపోకపోతే, ఇంకా తెప్పిస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలో వచ్చిన రెవెన్యూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని కేజీబీవీలు, రెసిడెన్షియల్, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్ల పంపిణీపై ప్రభుత్వం జీఓ విడుదల చేసినట్లు తెలిపారు. కోడిగుడ్ల సరఫరా ప్రక్రియ ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం మెదక్ నుంచి బదిలీపై వెళ్తున్న లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. -
పరిశ్రమలు నిబంధనలు పాటించాలి
పటాన్చెరు టౌన్: అగ్ని ప్రమాదాల పట్ల పారిశ్రామికవేత్తలంతా అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి పరిశ్రమలో రక్షణ పరికరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. సోమ వారం పాశమైలారం ఐలా ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా కొన్ని పరిశ్రమల్లో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు లేవని, పలు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్న కెమికల్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నిపుణులైన కార్మికులను నియమించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో అగ్నిమాపకశాఖ సమర్థవంతంగా పనిచేసి ఎక్కువ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కృషి చేయడం హర్షించ తగిన విషయమన్నారు. కాగా సిగాచీ పరిశ్రమ ఘోర ప్రమాదం నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలని, అగ్ని ప్రమాదాల విషయంలో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి -
సింగూరు నీరు విడుదల చేయండి
మెదక్ కలెక్టరేట్: సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను పట్టించుకున్న పాపానపోవడం లేదని విమర్శించారు. సింగూరులో నీరు ఉన్నప్పటికీ ఘనపూర్ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీలు వాటాగా రావాల్సినవి విడుదల చేయడం లేదని మండిపడ్డారు. గతం ప్రభుత్వంలో సమయానికి నీరు వదిలామని గుర్తుచేశారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించండం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, లావణ్య రెడ్డి, ఇతర నాయకులు ఆంజనేయులు, లింగారెడ్డి, జుబేర్, జీవన్‌రావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన -
45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో 44 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మదినగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన తుడు తరపాడు (45) సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈసందర్భంగా అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేసి, అంబులె న్స్ ఏర్పాటు చేసి స్వస్థలానికి పంపించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందారని, వివిధ ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణఖేడ్: నిజాంపేట్ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మిని బాలికల గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తించేందుకు కుక్, ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోగా గురుకులంలో సమర్పించాలని తెలిపారు. టెన్త్ విద్యార్హత అని, రూ. 9,750 వేతనం చెల్లిస్తామన్నారు. ఇతర వివరాలకు 7981090652 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర జోగిపేట(అందోల్): ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు. సోమవారం జోగిపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 7,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, సన్నీ దినేష్, మహేష్, శ్రీలత, దీపిక, చోటు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏడు మండలాలు.. 2,508 రేషన్ కార్డులు నర్సాపూర్: నియోజకవర్గంలోని ఏడు మండలాలకు 2,508 కొత్త రేషన్‌కార్డులు వచ్చాయని ఆర్డీఓ మహిపాల్ సోమవారం తెలిపారు. వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని చె ప్పారు. నర్సాపూర్ మండలానికి 354, శివ్వంపేటకు 428, కౌడిపల్లికి 615, కొల్చారానికి 384, మాసాయిపేటకు 249, వెల్దుర్తికి 385, చిలప్‌చెడ్ మండలానికి 93 రేషన్‌కార్డులు మంజూరైనట్లు వివరించారు. ఉపాధ్యాయులకు అవగాహ న శివ్వంపేట(నర్సాపూర్): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు అవగాహన పెంచుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేటలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లపై 12 పాఠశాలలకు సంబంధించి 36 మంది ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 25 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ఆయా పాఠశాలల్లో రూ. 10 లక్షల విలువ గల రోబోటిక్స్‌తో పాటు అధునాతన ప్రయోగ పరికరాలను అందజేసిందన్నారు. సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చనాయక్, గెజిటెడ్ హెచ్ఎం, కోర్స్ కోఆర్డినేటర్ బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు కట్టలేం!
మెదక్‌జోన్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు భారంగా మారింది. ముడి సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని, ఇందుకు అవసరమైన రవాణా ఖర్చులను మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు ఇసుక తెప్పించకపోవటంతో బయట మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 4 వేలు చెల్లించి లబ్ధిదారులు కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఇసుకకే రూ. 30 నుంచి రూ. 40 వేలు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు పోనూ పేదలపై మరో రూ. లక్షకుపైగా భారం అదనంగా పడనుంది. మొదటి విడతలో 9 వేల ఇళ్లు మంజూరు జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొ ప్పున జిల్లాకు 7 వేల ఇళ్లు మంజూరు కావాల్సి ఉంది. ఇవి కాకుండా జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, ఆందోల్, నారాయణఖేడ్, నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలు ఉండటంతో జిల్లాకు మొదటి విడతలో 9 వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 5 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, అందులో 360 ఇళ్ల బేస్మెంట్ పూర్తి అయింది. వారికి రూ. లక్ష చొప్పున బిల్లులు అందించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మేర నిర్మించుకోవాలి. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున, నాలుగు విడతల్లో డబ్బు లను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో సిమెంట్ బస్తా ధర రూ. 360 కానీ ఇంటి నిర్మాణానికి వినియోగించే సిమెంట్, ఇసుకతో పాటు అన్నింటి ధరలు బయట మార్కెట్లో పెరిగాయి. ఇందులో ప్రధానంగా ఇంటి నిర్మాణానికి 150 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం రూ. 42 వేలను ధరల పట్టికలో చూపించా రు. ఈ లెక్కన ఒక్కో బస్తా సిమెంట్‌కు ప్రభుత్వం రూ. 280 చొప్పున చెల్లిస్తోంది. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఒక్కో బస్తా సిమెంట్ ధర రూ. 360 ఉంది. ఈ లెక్కన 150 బస్తాలకు రూ. 54 వేలు అవుతుంది. అంటే కేవలం సిమెంట్‌కు రూ. 12 వేలు అదనంగా లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణం మొత్తానికి 8 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుందని, ఇసుకను లబ్ధిదారుడికి ఉచితంగా అందిస్తామని, రవాణా ఖర్చులు రూ. 8 వేలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇసుకను తెప్పించిది లేదు, ఉచితంగా ఇచ్చింది లేదు. ఫలితంగా లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 4 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన రూ. 32 వేలు అదనంగా ఖర్చవుతోంది. అలాగే స్టీల్, కంకర, ఇటుకలు, ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సా మగ్రి ప్రభుత్వం ఇచ్చే ధరతో పోలిస్తే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అందుకే ఇళ్లు మంజూరైనా కొంతమంది పేదలు ఇళ్ల నిర్మాణాలను ప్రా రంభించడం లేదు. ఇప్పటికై నా అధికారులు ఉచితంగా ఇస్తామన్న ఇసుకను త్వరగా తెప్పించి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది.పెరిగిన నిర్మాణ వ్యయం జాడలేని ఉచిత ఇసుక ప్రభుత్వం ఇచ్చేది రూ. 5 లక్షలు లబ్ధిదారులపై అదనపు భారం -
కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, మెదక్ జిల్లా: కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి తన కారులో ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అనిల్‌కు ఛాతీలో బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
డబుల్ బెడ్రూంల తాళాలు ఇవ్వండి
జహీరాబాద్ టౌన్: హోతి(కె) వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో డబుల్బెడ్రూం కాల నీకి తరలివచ్చారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను ఎందుకు అప్పగించడం లేద ని, 12 తేదీన ఇళ్ల తాళాలు ఇస్తామని చెప్పి ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. తాళాలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ ఆందోళన కారులతో మాట్లాడారు. రెండవ శనివారం ఇళ్ల కేటాయింపు వాయిదా పడిందని, మరో రోజు అప్పగిస్తారని నచ్చజెప్పారు. అక్కడి నుంచి లబ్ధిదారులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభు త్వం హోతి(కె) వద్ద పేదల కోసం 660 ఇళ్లను కట్టించగా అధికారులు డ్రా ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారని చెప్పారు. -
చెరువులు నింపని వాన
ముఖం చాటేసిన వరుణుడు ● ముందుకు సాగని వ్యవసాయ పనులు ● ఆందోళనలో అన్నదాతలు ● బోర్ల కింద జోరుగా సాగు..జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మండలం వర్షపాతం మి.మీ కొల్చారం 193.0 పెద్దశంకరంపేట 151.9 రేగోడ్ 161.7 అల్లాదుర్గం 159.4 టేక్మాల్ 145.7 పాపన్నపేట 135.6 హవేళిఘణాపూర్ 175.1 రామాయంపేట 172.3 నిజాంపేట 174.2 చేగుంట 164.1 నార్సింగి 129.8 చిన్నశంకరంపేట 152.9 మెదక్ 168.7 చిలప్‌చెడ్ 113.7 కౌడిపల్లి 107.6 నర్సాపూర్ 108.1 శివ్వంపేట 131.2 వెల్దుర్తి 145.7 తూప్రాన్ 152.0 మాసాయిపేట 92.7 మనోహరాబాద్ 53.9వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. అడపాదడపా కురుస్తున్న వానలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నా.. మరోవైపు ఆందోళన తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు చెరువులు, కుంటల్లో నీరు చేరేంత వర్షాలు పడలేదు. మేలో కురిసిన వర్షాలతోనే ప్రస్తుతం రైతులు బోర్ల కింద సాగు చేస్తున్నారు. – మెదక్ కలెక్టరేట్ జిల్లాలో గతేడాది ఈ సమయానికి 171 మి.మీ వర్షం కురవగా, ఈఏడాది ఇప్పటివరకు 142.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ ఎక్కడా చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. కాగా మేలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో బోర్లలో నీటి ఊటలు పెరిగాయి. వాటిపై ఆధారపడిన రైతులు ప్రస్తుతం వరి సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, వర్షాలపై ఆధారపడిన వారు దుక్కులు దున్ని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారం రోజుల క్రితం వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో పడలేదని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసేంత నీరు రాలేదని చెబుతున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు 142.3 మి.మీ వర్షం పడింది. అది కూడా భారీగా కాకుండా విడతల వారీగా కురిసింది. ఇదే సమయంలో ఎండలు మండుతుండటంతో ఎక్కడికక్కడే వర్షం నీరు ఆవిరైపోతుంది. దీంతో జిల్లాలోని ఒక్క చెరువు, కుంట పూర్తిస్థాయిలో నిండలేదు. కాగా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు కొల్చారం మండలంలో అత్యధికంగా 193 మి.మీ వర్షం కురవగా, మనోహరాబాద్ మండలంలో అత్యల్పంగా 53 మి.మీ కురిసింది. మొత్తం 2,694 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండలేదు. జిల్లాలో పంటల సాగు ఇలా.. జిల్లాలో వరి సాగు అంచనా 3,05,100 ఉండగా, ఇప్పటివరకు 7 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. మరో 11 వేల ఎకరాలకు రైతులు నారుపోసి నాటు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆరుతడి పంట అయిన పత్తి అంచనా 37,200 కాగా, ఇప్పటివరకు 33 వేల ఎకరాల్లో సాగు చేశారు. అలాగే మొక్కజొన్న 2,640 ఎకరాల అంచనా ఉండగా, ఇప్పటివరకు కేవలం 600 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.వరి నారు పెరుగుతుంది చెరువు, కుంటలు వెలవెలబోతున్నాయి. బోర్లున్న రైతులు నాట్లు వేసుకుంటున్నారు. దుక్కులు దున్ని వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం. వర్షం పడితేనే నాట్లు సాగుతాయి. వరి నారు కూడా పెరుగుతుంది. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల నుంచి నీరు కూడా రావడం లేదు. – గజ్జెల బాలపోచయ్య, మద్దుల్వాయి -
అన్నిరంగాల్లో అభివృద్ధి: దామోదర
సంగారెడ్డిజోన్: ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శని వారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, భూ భారతి, రైతు రుణ మాఫీ, రైతు బీమాను అమలు చేయడంతో పాటు పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, సన్నబియ్యం, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు రూ. 500 బోనస్ అమలు చేస్తున్నామని వివరించారు. ప్ర జా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఆందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సిలారపు త్రిష, పీసీసీ సభ్యుడు కిషన్, ఏఎంసీ చైర్మన్లు సుధాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, కచూర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దిగంబరరావు, శేషారెడ్డి, రమేష్, నిమ్మ రమేష్ పాల్గొన్నారు. -
బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తి పీఠాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి నీలిమ దర్శించుకున్నారు. ఈసందర్భంగా వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. శక్తిపీఠం విశిష్టత, నిర్మాణం గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో పబ్బ రమేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. శనివారం పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో బీసీ వర్గాల్లో ఆనందం నెలకొందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాయకల్ప పురస్కారానికి ఖేడ్ ఆస్పత్రి ఎంపిక నారాయణఖేడ్: 2024– 25 సంవత్సరానికి ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిని కాయకల్ప పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ శనివారం తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న నాణ్యమైన ఆరోగ్యసేవలు, పరిశుభ్రత తదితర వాటికి సంబంధించి ఈ పురస్కారానికి ఎంపికై నట్లు చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మద్దతు, ఎంపీ సురేష్ షెట్కార్ సహకారం, సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. విద్యార్థులు కష్టపడి చదవాలి పటాన్చెరు టౌన్: విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవిందరావు అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడలో ఐఐటీ చుక్కా రామయ్య ఇష్టా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తారు, చనిపోయినప్పుడు నలుగురు మోస్తారు. ఈ మధ్యలో మనం ఏదో చేయాలనే తపన ఏర్పడాలన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంటర్ దశలోనే మంచి గోల్ పెట్టుకొని కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఏడాది పాటుసీపీఐ వందేళ్ల ఉత్సవాలుహుస్నాబాద్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపెడుతూ జిమ్మిక్కుల పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు సహజ వనరులను కొల్లగొడుతూ లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరస్తులైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత మోదీ వంటి దొంగలకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పరిగి ఎమ్మెల్యే, జిల్లా సంస్థాగతఎన్నికల ఇన్చార్జి రాంమోహన్‌రెడ్డి నారాయణఖేడ్: అతిత్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్చార్జి రాంమోహన్‌రెడ్డి సూచించారు. ఖేడ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందుతున్న విషయాలను సమగ్రంగా వివరించారు. జనాభా దమాషా ప్రకారం బీసీలకు సమానా వాటా దక్కాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం జరుగుతోందన్నారు. టీపీసీసీ సభ్యు లు శంకరయ్యస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనంద్ స్వరూప్ షెట్కార్, వినోద్‌పాటిల్, మాజీ ఎంపీపీ, జెడ్పీసీటీలు, ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి మహిళా సంఘాల బస్సులు
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు రంగాలలో అవకాశాలు కల్పిస్తుండగా, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. జిల్లాకు 20 బస్సులు కేటాయించే అవకాశం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, మిల్క్పార్లర్లు, మహిళా పెట్రోల్ బంక్, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టడంతో పాటు వివిధ రకాలు యూనిట్లు ప్రవేశపెట్టింది. ఈక్రమంలో మహిళా శక్తి పథకం ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు 20 బస్సుల వరకు అప్పగించే అవకాశం ఉంది. మరింత ఆదాయం జిల్లాలో ఉన్న మండల మహిళా సమాఖ్య సభ్యులతో అద్దె బస్సులు ఇవ్వనున్నారు. రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ఉండటంతో పాటు వివిధ రకాల అర్హతలను పరిశీలించి సంఘాలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గ్రాంట్ ద్వారా రూ. 30 లక్షలు, సమాఖ్య సభ్యులతో రూ. 6 లక్షలు ఇప్పించి బస్సులను కొనుగోలు చేయనుంది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. సంస్థ ప్రతి నెల సంబంధిత సభ్యులకు నెలకు సుమారు రూ. 70 వేలు చెల్లించనుంది. దీంతో సుమారు రూ. 14 లక్షల ఆదాయం సమకూరనుంది. ఫలితంగా మహిళలకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.జిల్లా వివరాలు జిలా మహిళా సమాఖ్య 1 మండల మహిళా సమాఖ్యలు 25 గ్రామ మహిళా సమాఖ్యలు 695 మహిళా గ్రూపులు 18,488 గ్రూపులలోని మహిళా సభ్యులు 1,91,455 -
పెరగనున్న బీసీ పాలకులు
42 శాతం రిజర్వేషన్ అమలైతే 206 మందికి అవకాశం మెదక్‌జోన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఇది అమలైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలకు అధిక మొత్తంలో రాజ్యాధికారం దక్కనుంది. జిల్లాలో 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు ఉండగా, గత ప్రభుత్వం కొత్తగా 23 పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 492కు చేరుకుంది. అలాగే అప్పట్లో వార్డులు 4,086 ఉండగా, కొత్తగా 134 వార్డులను కొత్తగా ఏర్పాటు చేయటంతో వాటి సంఖ్య 4,220కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌లు ఎస్టీలకు 80, ఎస్సీలకు 66, బీసీలకు 120 కాగా, ఇతరులు 203 మంది ఉన్నారు. కాగా ఈ రిజర్వేషన్లో సుమారు సగం మంది మహిళలు కాగా, మిగితా సగం మంది పురుషులు ఉన్నారు. మండల, జిల్లా పరిషత్‌లోనూ .. గతంలో జిల్లావ్యాప్తంగా 189 ఎంపీటీసీలు ఉండగా, అప్పటి 22 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 41 సీట్లు లభించాయి. కాగా ఇటీవల ఒక ఎంపీటీసీ స్థానం పెరగటంతో ఆ సంఖ్య 190కి చేరుకుంది. ఈ లెక్కప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలైతే బీసీలకు 79 సీట్లు దక్కనున్నాయి. అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు గతంలో 20 చొప్పున ఉండగా, నూతనంగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయటంతో ఎంపీపీలు 21, జెడ్పీటీసీ స్థానాలు 21కి చేరుకున్నాయి. కాగా నూతన రిజర్వేషన్ అమలైతే బీసీలకు 8 సీట్ల చొప్పున పాలనాపరమైనా స్థానం కై వసం కానుంది.బీసీ రిజర్వేషన్ అమలైతే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలైతే, ప్రస్తుతం జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు గానూ ఎస్సీ, ఎస్టీలకు అప్పటి రిజర్వేషన్ అమలు కాగా, ఇతరుల రిజర్వేషన్లో కోతపడి బీసీలకు 206 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే ఎస్సీలకు 66, ఎస్టీలకు 80, మిగితా 140 సీట్లలో ఇతరులు, (ఓసీలకు) అవకాశం ఉంటుంది. అలాగే వార్డు మెంబర్లకు సైతం ఇదే తరహా రిజర్వేషన్లు వర్తించనుంది. -
పురభివృది్ధకి నిధులు!
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ. 60 కోట్లు ● ప్రతిపాదనలు పంపిన అధికారులు ● త్వరలో విడుదల చేయనున్న ప్రభుత్వంరామాయంపేట(మెదక్): పట్టణాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ పని చేయాలన్నా నిధుల కొరతతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మన్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికే అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా నిధుల మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం పట్టణాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించింది. ఈ మేరకు త్వరలో నిధులు మంజూరు చేయడానికి కసరత్తు చేస్తుంది. కాగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించిన అధికారులు జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 60 కోట్లు మంజూరు చేయాలని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పేరుకుపోయిన సమస్యలు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో పేరుకుపోయిన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై రోడ్లపై మురుగు నీరు పారుతుంది. ఇళ్ల మధ్య నిలిచిన మురుగుతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. కొన్నిచోట్ల మురుగు కాలువల్లో నుంచి వేసిన పైపులైన్లతో తాగు నీరు కలుషితమవుతోంది. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రహదార్లను ఆనుకొని ఉన్న పెంటకుప్పలతో దుర్వాసన వెదజల్లుతుంది. ఫలితంగా దోమల బాధ పెరిగిపోయింది. రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పాలకవర్గాల హయాంలోనే.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగియముందే ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి ఆమోదం తెలిపాయి. ప్రధానంగా రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు, ఇతర సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల నిర్వహణనకు త్వరలో నిధులు మంజూరు కానున్నాయి.ప్రతిపాదనలు పంపాం మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తాము ప్రతిపాదనలు పంపాం. మంజూరయ్యే నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువలతో పాటు ఇతర ప్రాధాన్యత గల పనులకు సంబంధించి నిర్మాణాలు చేపడుతాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేట -
ఎంసీహెచ్‌లో సంపూర్ణ వైద్య సేవలు
కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవజాత శిశువుల ప్రత్యేక విభాగాన్ని పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో జూన్‌లో 350 ప్రసవాలు నిర్వహించారన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించి 50 మేజర్ సర్జరీలు జరగటం హర్షణీయం అన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో గర్భిణులను ఎప్పటికప్పుడు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు పరిశీలించి ఎంసీహెచ్‌కు తరలించి ప్రసవాలతో పాటు వైద్యం అందిస్తున్నారన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టళ్ల మరమ్మతులకు రూ. 2.21 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. -
అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● జిల్లాలో 41 మంది పిల్లలు, 8 కేసులు మెదక్ మున్సిపాలిటీ: బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్‌లో 41 మంది పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపా ర సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గు ర్తించి వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షణ గృహాలకు తరలించి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులుగా కర్షకులుగా కొనసాగరాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా లో 8 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మధుసూదన్ గౌడ్, సీడీపీఓ కరుణ శ్రీ, చైల్డ్వెల్ఫేర్ అధికారి ఉప్ప లయ్య, ఇతర అధికారులు, ఆపరేషన్ ముస్కాన్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (చిన్ననాటి విద్య)పై గురువారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశానికి తెలంగాణ నుంచి మహిళా శిశు సంక్షే మ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని పేర్కొన్నా రు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతు న్న నూతన కార్యక్రమాలు, పిల్లలకు ప్రైమరీ శిక్షణ, కొత్త యూనిఫాంలు అందించడం, ఇతర పోషణ, శిక్షణకు సంబంధించిన కార్యక్రమా లను సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పంచుకున్నానని తెలిపారు. పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు మూల విరాట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహానికి అర్చన నిర్వహించి పల్లకీ సేవ ప్రారంభించారు. ఆలయం నుంచి గోకుల్షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వన దుర్గమ్మకు పల్లకీ సేవ -
వైభవంగా గురుపౌర్ణమి
జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే సాయిబాబాను దర్శించుకోవడానికి ఆలయాలకు పోటెత్తారు. దీంతో ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పాఠశాలల్లో వ్యాసమహర్షి జయంతిని నిర్వహించారు. విద్యార్థులు గురువులను సన్మానించారు. కొల్చారం మండలంలోని రంగంపేట ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలకు ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, నాయకులు తదితరులు ఉన్నారు. – వెల్దుర్తి(తూప్రాన్)/కొల్చారం (నర్సాపూర్) -
బడికి డుమ్మా కుదరిదిక
ఇక టీచర్లకూ ముఖ గుర్తింపు హాజరు ●ప్రధానోపాధ్యాయుడి వద్ద మొబైల్ యాప్ ●ప్రభుత్వ పచ్చజెండాకు ఎదురుచూపులు ●జిల్లాలో 3,551 టీచర్లు సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది. – పాపన్నపేట(మెదక్) జిల్లాలో 118 గెజిటెడ్ హెచ్ఎంలు, 89 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, 1,700 మంది ఎస్జీటీలు, 1,595 స్కూల్ అసిస్టెంట్లు, 37 లాంగ్వేజ్ పండిత్‌లు, 10 మంది పీఈటీలు, ఇద్దరు ఒకేషనల్ టీచర్లు కలిసి మొత్తం 3,551 మంది పని చేస్తున్నారు. సుమారు 83 వేల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారు. గతేడాది 90 శాతం హాజరు లక్ష్యంగా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐతో ఎఫ్ఆర్ఎస్ కృత్రిమ మేధ సాంకేతికతతో పని చేసే ఈ యాప్‌ను 2023లో రూపొందించారు. టీచర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపడం ద్వారా హాజరు నమోదు అవుతుంది. ఒకేసారి 15 నుంచి 20 మంది హాజరు తీసుకోవచ్చు. వాస్తవ విద్యార్థుల సంఖ్యతో మధ్యాహ్న భోజన వినియోగాన్ని ఖచ్చితంగా చూపడంతో పాటు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చు. ఉన్నతాధికారులకు కూడా విద్యార్థుల హాజరు శాతం తెలిసిపోతుంది. అలాగే టీచర్లకు కూడా సత్ఫలితాలు వస్తాయన్న భావనతో అధికారులు ఈ విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పైలట్ జిల్లాలో సత్ఫలితాలు ప్రధానోపాధ్యాయుడి మొబైల్లో ఫేషియల్ రికగ్ని షన్ యాప్‌ను ఉంచుతారు. టీచర్ పాఠశాల ఆవరణలో ఉండి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖాధికారితో పాటు పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు అనుసంధానం చేస్తా రు. సాంకేతికత ఆధారపడిన ఈ విధానం ద్వా రా, టీచర్ ఎన్ని గంటలకు పాఠశాలకు వచ్చాడు, ఎప్పుడు వెళ్లాడు అనే అంఽశాన్ని పరిశీలించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం ప్రవేశపెట్టడం ద్వారా టీచర్ల హాజరుశాతం, సమయపాలనలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సమయపాలన మెరుగు ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. దీంతో సమయపాలన మెరుగవుతుంది. టీచర్లలో జవాబుదారి తనం పెరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు వచ్చాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రకటించిన న్యాస్ ఫలితాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. – పంతుల రాజు, ఉపాధ్యాయ సంఘం నాయకుడు -
బీఎల్ఓల పాత్ర కీలకం
నిజాంపేట(మెదక్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): ఎన్నికల నిర్వహణలో బీఎల్ఓల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నా రు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం జరిగిన బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయమై అవగాహన కల్పించారు. అలాగే చిలప్‌చెడ్ రైతు వేదికలో బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓ మహిపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ సహదేవ్, శిక్షకులు శ్రీనివాస్, కొండల్, శివశంకర్, ఆర్ఐలు సునీల్, వెంకటేశ్వర్, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
కార్మికుల శ్రేయస్సు పట్టని ప్రభుత్వాలు
మెదక్ కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై భారం వేస్తూ.. పెట్టుబడిదారులకు మేలు చేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులపై భారం వేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈఏడా ది డిసెంబర్ 7, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 19న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం మెదక్‌లో ఉంటుందన్నారు. సమావేశంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, కార్యదర్శి మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, నాగరాజు, సహాయ కార్యదర్శి గౌరయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
చేగుంట(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ అన్నా రు. గురువారం చేగుంటలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించినప్పటికీ వ్యవసాయ రుణాలు తగ్గిపోయాయన్నారు. రైతుభరోసా వంటి పథకాలకు డబ్బులు ఎక్కువ కేటాయించడం లేదన్నారు. అమెరికాలో రైతులకు 61 వేల డాలర్లు రాయితీ ఇస్తే భారత్‌లో కేవలం 282 డాలర్లు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, కర్నాటకలో అగ్రి టూరిజం పేరుతో 20 వేల ఎకరాలను బడా బాబులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లక్ష్మీనర్సయ్య, భాస్కర్, సాయి, దివాకర్, రమేశ్, స్వామి, బాలరాజు, అంజయ్యతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
కొల్చారం(నర్సాపూర్)/హవేళిఘణాపూర్(మెదక్): ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లిలో పలు దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, లైసెన్స్‌లను పరిశీలించారు. గడువు తీరిన విత్త నాలు, పురుగుల మందులను రైతులకు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు దుకాణం నుంచి కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. ఏఓ, ఏఈఓలు తరచుగా దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ శ్వేతకుమారి, ఏఈఓ నిరోషా ఉన్నారు. అనంతరం హవేళిఘణాపూర్ రైతు వేదికలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నానో ఫెర్టిలైజర్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సబ్‌స్టేషన్ మంజూరు చేయాలి’ మెదక్‌జోన్: పట్టణంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నందున జిల్లా కేంద్రానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 25 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు గురువారం లేఖ రాశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో పట్టణ విస్తీర్ణం బాగా పెరిగినందున, ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్‌తో సమస్యలు వస్తున్నాయని, సబ్‌స్టేషన్ మంజూరు చేసి సమస్యలు తీర్చాలని లేఖలో కోరారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన బోధన శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియెట్ ప్రత్యేక అధికారి కిషన్ అన్నారు. గురువారం శివ్వంపేటలోని జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కాలేజీ స్థితిగతులు, విద్యార్థుల ప్రవేశాలు, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే శివ్వంపేట జూని యర్ కాలేజీకి సంబంధించి సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ప్రతిభ కలిగిన అధ్యాపకులచే బోధన అందిస్తామని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాల్సిన అవసనరం ఉందన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. బీఆర్ఎస్ నేతలకు అహంకారం మెదక్ మున్సిపాలిటీ: మెదక్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావును కలిసి ఫి ర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. జిల్లా ప్రజలను కేటీఆర్ గాడిదలతో పోల్చడం సరికాదన్నా రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీనివాస్‌చౌదరి, బొజ్జ పవన్, లక్కర్ శ్రీనివాస్ ఆంజనేయులుగౌడ్, ముత్యంగౌడ్, గంగాధర్, రాగి అశోక్, లల్లూ, లక్ష్మీనారాయణ, దుర్గప్రసాద్, మహేందర్‌రెడ్డి, శంకర్, లింగం, శ్రీకాంత్, కృష్ణ, రమేష్ గౌడ్, బానీ తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
నర్సాపూర్/వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): కల్తీ కల్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫా హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులుగా సర్కిల్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టామ ని వివరించారు. చిలప్‌చెడ్ మండలంలోని రహీంగూ డ తండాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా కొనసాగుతున్న కల్లు దుకాణంలో తనిఖీలు చేసి కల్లును పారపోసి కేసు నమోదు చేశామన్నారు. కల్లు దుకాణం నిర్వాహకుడు తమను చూసి పారిపోయాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. పలు కల్లు దుకాణాల నుంచి షాంపిల్స్ సేకరించామని, వాటిని లేబొరేటరీకి పంపుతామన్నారు. వైన్ షాపులలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎకై ్సజ్ ఎస్ఐ రాఘవేందర్రావు, చిలప్‌చెడ్ ఎస్ఐ నర్సింలుతో పాటు సిబ్బంది ఉన్నారు. అలాగే వెల్దుర్తి మండలంలోని పలు కల్లు దుకాణాలను రామాయంపేట ఎకై ్సజ్ సీఐ నరేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కల్లు డిపోలను పోలీసులు తనిఖీ చేశారు.