breaking news
Vintalu Visheshalu
-
జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..
వంటవాళ్ల జీతం మహా అయితే ఎంతో ఉంటుంది అనుకుంటాం. పైగా అది చాలా శారీరక శ్రమ ఓర్చి చేయాల్సిన పని కూడా. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వంటవాడి జీతం గురించి తెలిస్తే..ఇంకెప్పుడూ అంత తక్కువ అంచనా వేయరు. చిన్న చితకా పనులు చేసేవాళ్లు కూడా తెలివిగా స్మార్ట్‌గా చేయగలరు అనే ప్రూవ్ చేస్తున్నారు. ఒకరకంగా వారి పనే బెటర్‌గా ఉంది అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి వ్యక్తి ఈ ముంబై వంటవాడు. కేవలం అరగంట పనికి నెలకు రూ. 18 వేలు వరకు ఛార్జ్ చేస్తాడట. అంతలా.. ఎవరూ ఇస్తారు అనుకోకండి. ఎందుకంటే ముంబైకి చెందిన న్యాయవాది ఆయుషి దోషి నెట్టింట ఈ విషయాన్ని షేర్ చేయడంతో పెనుదూమారం రేపి చర్చలకు దారితీసింది. తన వంట వాడిని మహారాజ్‌గా సంభోదిస్తూ అతడి పనితీరు సంపాదన తీరుగురించి పోస్ట్‌లో వెల్లడించారు. దాంతో నెటిజన్లంతా అదంతా అబద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వంటవాడు కార్పొరేట్ ఉద్యోగిలా సంపాదిస్తాడని. జస్ట్ అరగంట పనికి నెలకు రూ. 18 వేలు జీతం తీసుకుంటాడని, అలా రోజుకు పది నుంచి 12 ఇళ్లల్లో పనిచేస్తాడని చెప్పుకొచ్చారు. దాంతో నెటిజన్లు ఆమె చెప్పినదాంట్లో పూర్తి నిజం లేదని మండిపడడారు. నిజంగా అతడు అరగంటలో వంట చేసేయగలడా..? ఏమైనా ఏఐ ఉపయోగిస్తున్నాడా ఏంటీ.. అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఆ కామెంట్లకు బదులిస్తూ న్యాయవాది ఈ విధంగా పోస్ట్‌లో పేర్కొన్నారు. ముంబై ప్రజలరా నేను చెప్పింది వాస్తవమే. ఖరీదైన మెట్రో నగరాల్లో మహమహారాజులు వసూలు చేసేది ఈ రేంజ్‌లోనే ఉంటుంది. "అదే వంటవాడు 12 మంది ఉన్న కుటుంబానికి రూ. 2.5 వేలు దాకా వసూలు చేస్తాడు. అయితే మీప్రాంతాల్లో ఇంకా అంత తక్కువ జీతానికే వంటవాళ్లు పనిచేసినంతా మాత్రాన అన్నిచోట్ల అలానే ఉంటుందని అనుకోవద్దు. ఖరీదైన నగరాలో జీవితానుభవం ఇలానే ఉంటుంది. ముఖ్యంగా జీవన వ్యయాల్లో వ్యత్యాసాలు ఉంటాయనే విషయం మరిచపోవద్దు అనినొక్కి మరి పోస్ట్‌లో వెల్లడించింది". న్యాయవాది ఆయుషిMy Maharaj (Cook)•Charges ₹18k per house•Max 30 mins per house•10–12 houses daily•Free food & free chai everywhere•Gets paid on time or leaves without a goodbye 😭Meanwhile I’m out here saying “gentle reminder” with trembling hands with minimum salary.🙂— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) July 29, 2025 (చదవండి: లైట్హౌసింగ్ పేరెంటింగ్ అంటే..? పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దగలదా..?) -
పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!
అధికారులు తమ కింద పనిచేసే ఉద్యోగులను మాములుగా సతాయించారు. ఉద్యోగ ధర్మానికి సంబంధించిన పనులు తప్పించి..ఇబ్బందిపెట్టేలా అర్థం పర్థం లేని పనులు అప్పగించి బాధపెడుతుంటారు. పై అధికారి అనో లేక ఉద్యోగపోతుందనే భయంతోనో నోరు మెదపకుండా తలాడిస్తూ చేస్తుంటారు పాపం. కింది స్థాయి సిబ్బంది కూడా మనలాంటి సాటి మనుషులే కదా అని కూడా భావించరు కొందరు అధికారులు. అలాంటి వింత ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. నెటిజన్లు సైతం ఇంకా ఇలానా అంటూ మండిపడుతున్నారు. ఆగ్రాలో జూలై 30న సాయంత్రం హోంగార్డులు రోజులానే విధుల్లోకి రాగా..పోలీస్ లైన్ కాంపౌండ్‌లో పార్క్ చేసిన కార్లపై నిఘా ఉంచాలేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా పై అధికారి విచిత్రమైన డ్యూటీని అప్పగించడంతో కంగుతిన్నారు వారంతా. తమ డ్యూటీ ఆ రోజు ఒక పిల్లికి కాపల కాయడం. అది ఓ ట్రాఫిక్ ఎస్పీకి చెందిన పిల్లి. ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకోమని వాళ్లను ఆదేశించారు.ఏ జంతువు దానిపై దాడి చేయకుండా చూడటమే కాకుండా దానికి రాత్రిపూట పాలు, రొట్టే వంటివి ఇవ్వాల్సిందిగా చెప్పారట. ఒకవేళ ఆ పిల్లికి హాని కలిగేలా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారట ఆ అధికారి. దీంతో నిర్ఘాంతపోయారు హోంగార్డులు. ఈ విషయాన్ని ఒక హోంగార్డు తన డ్యూటీ ముగిసిన తదనంతరం సోష్లో మీడియాలో తన గోడును వెల్లబోసుకున్నారు. పైగా ఆ పోస్ట్‌కి ఈ రోజు మా డ్యూటీ పిల్లికి కాపల. దానికేదైనా జరిగితే మాపై కఠిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని క్యాప్షన్‌ని కూడా జోడించి మరి తన బాధను వెల్లడించాడు ఆ హోంగార్డు. ఈ విషయం క్షణాల్లో వైరల్ అవ్వడంతో.స్వాతంత్ర భారతవనిలో ఇంకా ఇలాంటివి ఉన్నాయా అంటూ మానవ హక్కుల కార్యకర్లు ఒక్కసారిగా మడిపడ్డారు. అటు నెటిజన్లు కూడా పోలీసుల విధుల గురించి సైటర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నెట్టింట ఈ విషయం తారస్థాయిలో ఆగ్రహోజ్వాలాలు రెకెత్తించగా..వెంటనే మరోపోస్ట్‌లో అతి వీధిపిల్లి అని ఎవ్వరిది కాదని అధికారిక పోస్ట్‌లో వివరణ ఇవ్వడం గమనార్హం. (చదవండి: బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్‌కి షాకవ్వాల్సిందే..! వీడియో వైరల్) -
బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్‌కి షాకవ్వాల్సిందే..!
చిన్నారులు కూడా చిరుప్రాయంలోనే చిచ్చిర పిడుగుల్లా తమ ప్రతిభను చాటుకుని శెభాష్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో చూశాం. కానీ ఇలా అగ్గితో అవలీలగా ఆడుకునే చిన్నారిని చూసుండరు. ఏ మాత్రం బెరుకులేకుండా చేస్తున్న ఆ ఫైర్ విన్యాసం కళ్లు ఆర్పడమే మర్చిపోయేంతలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ డేరింగ్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.తమిళనాడుకు చెందిన ఆరవ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు.. నిప్పుతో ఆడే ఒక రకమైన యుద్ధకళతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆరవ్ రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ కూడా. ఆ బాలుడు తమిళనాడుకి చెందిన పురాతన ఆయుధ ఆధారిత యుద్ధ కళ అయిన 'సిలంబం'ని అలవోకగా చేసి అలరించాడు. ఇది ఇరువైపులో అగ్నితో జ్వలిస్తున్న కర్రతో ఒక విధమైన విన్యాసంలా ప్రదర్శిస్తారు. ఎంతో శిక్షణ ఉంటేనే గానీ ఇంతలా డేర్‌గా చేయడం కష్టం. చాలా కేర్‌ఫుల్‌గా చేయాల్సిన ప్రాచీన యుద్ధ కళ ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. కానీ ఈ బుడతడు ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఆ కళకే వన్నెతెచ్చేలా అత్యంత అద్భుతంగా ప్రదర్శించాడు. దీన్నిచూసిన నెటిజన్లు సిలంబం కళకే గర్వ కారణం అంటూ ప్రశంసించారు. ఆ వీడియోలో ఆరవ్ ప్రదర్శన సమయంలో కాలిపోతున్నట్లుగా కనిపించినా.. ఎక్కడ ఆగకుండా చేస్తున్న తీరు చూపరులను కట్టిపడేస్తుంది. చిన్న వయసులోనే ఇంత డేరింగా అని ఆశ్చర్యంకలుతుంది. ఇక ఆ వీడియోలో కూడా ఎవరూ దీన్ని ట్రై చేయొద్దు. తాము నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఇచ్చాం అంటూ ఒక హచ్చరిక సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. కనుమరుగవుతున్న మన ప్రాచీన కళలు ఈ విధంగానైనా ప్రస్తుత జనరేషన్ తెలుకునే అవకావశం దొరికింది అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Aarav AJ (@aarav_aj_official) (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
నవ్వుకు 16.5 కోట్ల ఇన్సూరెన్స్!
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది మన సామెత. ‘నోరు ఆరోగ్యంగా ఉంటేనే నా కెరీర్ బాగుంటుంది. భవిష్యత్ బాగుంటుంది’ అనేది బ్రిటిష్ నటి, గాయని సింథియా ఎరివో మాట. ‘నవ్వే నా ఆస్తి.. నా గొంతే నా ఐశ్వర్యం’ అంటున్న సింథియా సుమారు 16.5 కోట్లకు తన గొంతును బీమా చేయించింది. మౌత్‌వాష్ బ్రాండ్ ‘లిస్టెరిన్’ ‘వాష్ యువర్ మౌత్’ క్యాంపెయిన్‌కు ఆమె ప్రచారకర్తగా ఉంది.‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా అందమైన నవ్వు, శక్తిమంతమైన స్వరం నా గుర్తింపు’ అని చెప్పే సింథియా దంత శుభ్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వేదిక ఎక్కినప్పుడల్లా బ్రష్ చేసుకుంటుంది. నోటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు చెబుతుంది.శరీర భాగాలకు బీమా చేయించడం కొత్తేమీ, వింతేమీ కాదు. కాళ్లు, వీపు, స్వరపేటిక, నాలుక...ఇలా రకరకాల శరీర భాగాలకు బీమా చేసుకున్నవారు హాలీవుడ్లో చాలామందే ఉన్నారు. అక్కడ ఇదొక ట్రెండ్‌గా కొనసాగుతోంది. (చదవండి: నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్‌గా నటి దీప్తి సాధ్వానీ) -
'ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..
ఎన్నో ప్రేమకథలు గురించి విని ఉండి ఉంటారు. ఇలాంటి వెరైటీ లవ్‌స్టోరీ మాత్రం విని ఉండరు. ఎవ్వరైన నచ్చిన అమ్మాయి/అబ్బాయికి ఓకే చెప్పేందుకు ట్రై చేయడం, నిరీక్షించడం కామన్. కానీ మరి ఇన్నిసార్లు మాత్రం ప్రపోజ్ చెయ్యరు. ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే.. గుండెపగిలిపోయినంతగా బాధపడతారు ప్రేమికులు. ఆ తర్వాత రాను.. రాను.. లైట్ అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ఇలాంటి ప్రేమికుడు కాదు. తన ప్రియురాలు చేత ఓకే చెప్పించేంత వరకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేశాడో వింటే నోరెళ్లబెడతారు. ఇంతలానా బాస్ అంటారు.ఏడేళ్ల ప్రణయ ప్రేమకథ ఇది. ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫెయిలైతే ట్రై చేసినట్లుగా లవ్ ఎగ్జామ్ రాశాడు మనోడు. యూఎస్‌కు చెందిన 36 ఏళ్ల ల్యూక్ వింట్రిప్ తన స్నేహితురాలు సారాను 2018లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమె అస్సలు అతడి లవ్‌ని అంగీకరించలేదట. అలా అని అక్కడితో వదిలేయలేదు ల్యూక్. ఆమె ఓకే అనేంత వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏదో రెండు, మూడు, ఐదు సార్లు కాదు ఏకంగా 42 సార్లు ల్యూక్ ప్రపోజల్‌ని స్నేహితురాలు రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలో ఈసారి కాకపోయినా..మరోసారి అయినా తన దేవత అంగీకరించపోతుందా అని ఆశగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ల్యూక్. ఏమైతేనేం..43సారి తన స్నేహితురాలు సారా చేత 'యస్' అనిపించుకున్నాడు. ఈ ఏడాది(2025)కి తన అమర ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకొచ్చాడు. చెప్పాలంటే అతడిలా ఏ లవర్ అన్నిసార్లు ప్రపోజ్ చేసి ఉండడు. నిజంగా అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డులకి ఎక్కాల్సిందే ఈ విషయంలో. అతడి భాగస్వామి సారా కూడా అలానే అంటూ అతడిని ఆటపట్టిస్తోందామె. అయితే సారా కూడా ల్యూక్ని తొలిచూపులోనే ప్రేమించింది కానీ ఆమెకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో వెంటనే అంగీకరించలేకపోయింది. అదీగాక విడాకులు తీసుకుని ఉండటంతో మరొసారి వైవాహిక బంధం అనగానే ఆమెకు ఒక విధమైన భయం, ఆందోళన వెంటాడంతో ల్యూక్ ప్రేమను అంగీకరించలేకపోయిందట. ఏదిఏమైతేనేం తన ప్రియురాలి మనసు కరిగేలా చేసి తన ప్రేమను గెలుపించుకున్నాడు ల్యూక్. ఇక్కడ సారా తన పిల్లలు, బంధువులు అంగీకరించాక..ఎలాంటి సమస్యలు ఉండవని నిర్థారించుకున్నాక..అతడికి ఓకే చెప్పిందట. అంతేకాదండోయ్ ల్యూక్ తన ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేసేవాడట. దాని కోసం అతడు పడిన పాట్లు అన్ని ఇన్నీ కావట కూడా. ఇక 43వ సారి టైం కీపింగ్ నావిగేషన్ గ్రీన్విచ్కు తీసుకెళ్లి మరీ ప్రపోజ్ చేశాడట ప్రియురాలు సారాకు. "ఈ ప్రదేశం టైంకి సంబంధించిన ప్రపంచ కేంద్రం అయితే ..నువ్వు నా ప్రపంచానికి కేంద్రానివి, అందుకే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా" అంటూ భావోద్వేగంగా ప్రియురాలికి ప్రపోజ్ చేశాడట. అతడి మాటలకు ఉప్పొంగిన కన్నీళ్లతో అంగీకరించా అంటూ తన ప్రేమకథను గుర్తుచేసుకుంది సారా. అతడి ఓపికకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే, నిజంగా అతడు గొప్ప ప్రేమికుడు అంటూ ప్రియుడు ల్యూక్‌పై ప్రశంసల వర్షం కురిపించేసింది సారా.(చదవండి: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
ఎంత గ్రాండ్‌మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే..!
చెస్ గురించి పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా ఇప్పుడు సుపరిచిత పేరు... దివ్యా దేశ్‌ముఖ్. ప్రపంచం మెచ్చిన అపూర్వ విజయం తరువాత తన తల్లిని కౌగిలించుకొని భావోద్వేగానికి గురువుతున్న దివ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లి అంటే ఎంతోమంది స్టార్ల వెనుక ఉన్న అన్సంగ్ హీరో’ అని దివ్య తల్లి గురించి ప్రశంసిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర. ‘ఎంత గ్రాండ్‌మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే’ అన్నారు నెటిజనులు. తల్లులు పిల్లల గురించి ఎన్నో కలలు కంటారు. వారి కలలను తమ కలలుగా భావిస్తారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. పిల్లల కంటే ఎక్కువగా వారి విజయాలకు సంతోషంతో ఉప్పొంగిపోతారు. అందుకే...అమ్మలు అన్సంగ్ హీరోలు. ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ గెలుచుకున్న తరువాత ‘ఎవరీ దివ్య దేశ్‌ముఖ్?’ అనే ఆసక్తి చాలామందిలో మొదలైంది. చాలా చిన్న వయసు నుంచే చెస్ ఆడడం మొదలుపెట్టిన దివ్య చెస్‌లోనే కాదు చదువులోనూ ‘శభాష్’ అనిపించుకునేది. ‘అయిదేళ్ల వయసు నుంచే చెస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది దివ్య. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్న దివ్యకు కామ్గర్ల్గా పేరు. జయాపజయాలలో ఒకేరకంగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఓడిపోయిన సందర్భంలోనూ ఆమె కళ్లలో బాధ కనిపించేది కాదు. టోర్నమెంట్ గెలచినప్పుడు ట్రోఫీతో నా దగ్గరకు వచ్చేది. తాను సాధించిన విజయం గురించి ఎంతోమాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చాలా తక్కువగా మాట్లాడేది. తనకు ఇష్టమైన ఆట, చదువును రెండిటినీ విజయవంతంగా సమన్వయం చేసుకునేది. నాగ్‌పూర్ కాకుండా వేరే చోట చెస్ పోటీలు జరిగినప్పుడు పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లేది. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది నాగ్‌పూర్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ అంజు భూటాని.Divya’s hug to her mom says everything ❤️#FIDEWorldCup @DivyaDeshmukh05 pic.twitter.com/jeOa6CjNc1— International Chess Federation (@FIDE_chess) July 28, 2025 (చదవండి: రికార్డు బ్రేకింగ్ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..) -
వామ్మో.. బామ్మో: భారీ కోబ్రానే షేక్ చేసింది
సాధారణంగా పాము అన్న పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. మరికొంత మంది దాన్ని చంపేదాకా నిద్రపోరు. కానీ 70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం చూస్తే..వామ్మో..బామ్మో.. అంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పూణేలోని ముల్షి తాలూకాలోని అంబోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతల సుతార్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పామును మెడకు చుట్టుకుని నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.ఏం జరిగిందంటేచుట్టు పక్కల వాతావరణం కారణంగా ఇంట్లోకి భారీ పాము (కోబ్రా) వచ్చింది. ఈ పామును చూడగానే ఇంట్లో వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు. కానీ బామ్మ ఏమాత్రం భయపడలేదు. దాన్ని భయపెట్టి, చంపేందుకు ప్రయత్నించలేదు. పైగా దాన్ని కాపాడింది. అదీ వట్టి చేతులతోనే, చాకచక్యంగా నక్కి ఉన్న పామును పట్టుకుంది. అయితే ఆ పాము అంత ఈజీగా ఏమీ లొంగలేదు. అయినా సరే నిర్భయంగా, అత్యంత సాహసంతో దాన్ని దొరకబుచ్చుకుని పామును పట్టుకుని మెడలో వేసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో అక్కడున్న వారు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వారికి ఫోజులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: 100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్‌డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!ఈ పామును స్థానికంగా ధమన్ అని పిలుస్తారట. దీనివల్ల మనుషులకు ఎలాంటి హాని లేదు. పైగాఎలుకల నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతుంది. భారతదేశం సహా ఆగ్నేయాసియా అడవులలో కనిపించే కింగ్ కోబ్రా దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయి.అయితే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. వాటిని చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తమకు హాని కలుగుతుందని భయపడనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగని పాము కనిపించగానే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఎక్కడ ఎలా పట్టుకోవాలనే ఒడుపు, విజ్ఞానం తెలియాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా పాము, ఇతర ప్రమాదకరమైనవి కనిపించినపుడు వన్యప్రాణ సంరక్షణ అధికారులకు సమాచారం అందివ్వాలి.ఇదీ చదవండి: HealthTip ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ ! -
12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!
నచ్చిన రంగంలో రాణించాలని ఎంతో ప్రయాసపడతారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని డ్రీమ్ సాధించుకుందామనే తరుణంలో ఊహకందని మలుపు తీసుకుంటుంది జీవితం. అనుకోని ఆ యూటర్న్‌ని జీర్ణించుకోలేక సతమతమవుతారు చాలామంది. కానీ కొందరు జీవితంలో ఇలాంటివి భాగమే అని సానుకూల దృక్పథంతో ఆ అవాంతరం లేదా ఆపదను జయించి అనుకున్న కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి గాథే ఈ యువకుడి కథ. అతడి స్టోరీ ఆద్యంతం ఆసక్తికరంగానూ..స్పూర్తిదాయకంగానూ ఉంటుంది. అతడే పరాస్ బజాజ్. 12వ తరగతికే చదవుకి స్వస్తి పలికాడు. చదవు కంటే ఫిటెనెస్ పట్ల పరాస్కి మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే చదువుని మధ్యలోనే ఆపేసి ఢిల్లీలోని ఫిట్నెస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఫిట్నెస్ అంటే.. శారీరక పరివర్తన మాత్రమే కాదు, క్రమశిక్షణతో బాధ్యతగా మెలిగేలా చేసే ఒక ప్రక్రియ అని పరాస్ గుర్తిస్తాడు. తాను సరైన రంగాన్ని ఎంచుకున్నానని భావించి కొద్దికాలంలోనే దానిపై మంచి పట్టు సాధించి..ఇతరుల ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో సాయం అదించే స్థాయికి చేరుకున్నాడు. అలా అతడు ఆ ఫిట్నెస్ రంగంలో అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతో ప్రభుత్వ స్టార్టప్ కింద రుణం తీసుకుని మరీ ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో సొంతంగా జిమ్‌ను ప్రారంభించాడు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో జీవితం ఊహించని విధంగా సవాలు విసిరింది. ఇలా సొంతంగా జిమ్ ప్రారంభించాడో లేదో జస్ట్ రెండు నెలలకే కేన్సర్ బారినపడ్డాడు. ఆ తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సల కారణంగా..అప్పటి దాక మంచి ఫిట్‌గా ఉండే అతడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జుట్టు ఊడిపోయింది, మజిల్స్ తగ్గిపోయాయి, ఆఖరికి ఒంట్లో శక్తి కూడా సన్నగిల్లినట్టుగా రోజువారి పనులు చేయలేనంత బలహీనమైన దయనీయ స్థితికి వచ్చేశాడు. ఏదిఏమైతేనేం కఠినమైన శస్త్రచికిత్సలతో ఏప్రిల్ 30,2024న కేన్సర్‌ని జయించాడు. అది అతడిలో ఏ మూలనో దాగి ఉన్న ఆశకు కొత్త ఊపిరిని పోసింది. కేవలం శస్త్ర చికిత్స చేయించుకున్న ఒకటిన్నర నెలకే జిమ్‌కి తిరిగి వచ్చి..తనను తాను మరింత స్ట్రాంగ్ మెన్‌గా మార్చుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే బాడీ బిల్డింగ్‌పై ఫోకస్ పెట్టి వివిధ విభాగాలలో బరువులను ఎత్తడంపై కసరత్తులు చేశాడు. అలా 220 కిలోల బరువుని ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ కేన్సర్ తన శరీరంపై గాయంలా కాకుండా..మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే గుర్తుగా మలచాలన్నా.. ఆలోచన ఈ విజయానికి దారితీసింది. అంతేగాదు తనలా ఇలా చిన్నవయసులోనే కేన్సర్‌తో బారినపడుతున్న వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సగర్వంగా తెలిపాడు. అదీగాక తాను వెనుదిరిగి చూసుకున్నప్పడల్లా..తన ఒంటిపై మిగిలిని కేన్సర్ గుర్తులు తనను మరింత బలవంతుడిగా మార్చిందే తప్ప..తన కలను దూరం చేయలేకపోయిందని అంటాడు పరాస్. ఈ కష్ట సమయం తనకు ఓ గుణ పాఠాన్నినేర్పందని చెబుతున్నాడు. ప్రతిదీ మార్చగలమనే సంకల్పం బలంగా ఉంటే దేన్నైనా సులభంగా ఉన్నతికి మార్గంగా మార్చుకోవచ్చని అంటాడు పరాస్. నెటిజన్లు సైతం అతడి సంకల్పానికి ఫిదా అయ్యి, అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్‌తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..) -
100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్‌డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రెండవ ప్రపంచ యుద్దంలోని పాల్గొన్న హెరాల్డ్ టెరెన్స్ (Harold Terens) ఈ ఏడాది ఆగస్టుకి 103 ఏట అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా పెంటగాన్‌లో తన బార్ మిట్జ్వా (Bar Mitzvah)ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తద్వారా 13 ఏళ్ల నాటి డ్రీమ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అసలేంటీ బార్ మిట్జ్వా? అతని కోరిక ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.తన 102వ పుట్టిన రోజు సందర్భంగా తాతగారు ఈవిషయాన్ని ప్రకటించారు. యుక్త వయస్సులో స్వీకరించాలని కలలుగన్న బార్ మిట్జ్వా (యూదుల ఆచారం)ను తన తదుపరి పుట్టినరోజు సందర్భంగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. యూదు మతాన్ని అనుసరించే తల్లి పోలాండ్‌కు చెందిన వారు కాగా, రష్యాకు చెందిన చెండికి మతాలంటే ఇష్టం ఉండదు. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టాడుహెరాల్డ్ టెరెన్స్. బార్ మిట్జ్వా అంటే ?బార్ మిట్జ్వా అనేది యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 13 ఏళ్ల వయసు వచ్చిన యూదు బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని బార్మిట్జ్వా అంటారు. ‘మిట్జ్వోట్’ అంటే ‘మత ఆజ్ఞలు’ అని, ‘బార్’ అనే హీబ్రూ అంటే ‘కుమారుడు’ అని అర్థం. సాధారణంగా బార్ మిట్జ్వా వేడుకలో బాలుడు సినగాగ్‌లో తోరా (యూదు మత గ్రంథం) నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హాఫ్తారా పఠిస్తారు. ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా బార్మిట్జ్వా స్వీకరించాలని భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే హెరాల్డ్ సోదరుడు తల్లి మతవిశ్వాసాలను అనుసరిస్తూ యుక్త వయస్సులోనే బార్ మిట్జ్వాను స్వీకరించారు. తల్లి తండ్రుల విశ్వాసాల కారణంగా అప్పుడు నెరవేర్చుకోలేకపోయిన కలను,ఇన్నాళ్ల తర్వాత తన 103 ఏట బార్ మిట్జ్వా పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 6న వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పెంటగాన్ (Pentagon)లో అతడి బార్ మిట్జ్వా జరగనుంది.ఇంకో విశేషం ఏమిటంటేగత ఏడాది 100 ఏళ్ల వయసులో 97 ఏళ్ల జీన్ స్వెర్లిన్ను వివాహం చేసుకుని ఈయన వార్తల్లో నిలిచాడు. నార్మాండీలో జరిగిన వివాహం, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. నీ లైఫ్‌లో అదే మధురమైందన్నాడు. లైఫ్ ఒక అందమైన కథ లాంటిది. తన జీవితాన్ని పూర్తిగా జీవించాలీ అంటే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటే చాలు తిరుగు ఉండదు. కనీసం పదేళ్లు ఆయువు జోడించుకున్నట్టే అంటారాయన. ఒత్తిడి లేని జీవితం నంబర్ వన్ అయితే, రెండోది 90 శాతం అదృష్టం అంటూ తన లైఫ్ రహస్యాన్ని పంచుకున్నాడు.అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా టెరెన్స్ చాలా సార్లు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఇరాన్లో ఒక రహస్య మిషన్‌లో ఒకసారి, లండన్ పబ్‌లో జర్మన్ రాకెట్ నుండి తప్పించుకున్నాడట. తన జీవితం "ఒక పెద్ద అద్భుత కథ" అని అతను పేర్కొన్నాడు మరియు తన జీవితాన్ని పూర్తిగా జీవించాలని అనుకున్నాడు. "ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మీరు నేర్చుకోగలిగితే, మీరు చాలా దూరం వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు మీ జీవితానికి కనీసం 10 సంవత్సరాలు జోడిస్తారు. కాబట్టి అది నంబర్ వన్. మరియు 90% అదృష్టం," అని అతను చెప్పాడు, సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితానికి తన రహస్యాన్ని పంచుకున్నాడు. కాగా హెరాల్డ్ టెరెన్స్ 1942లో US ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు . P-47 థండర్‌బోల్ట్ ఫైటర్ స్క్వాడ్రన్‌కు రేడియో రిపేర్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. 1944లో D-డే నాడు, అతను ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చే విమానాలను మరమ్మతు చేయడంలో సహాయం చేశాడు. ఆ తరువాత నార్మాండీ నుండి విముక్తి పొందిన యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్‌కు రవాణా చేయడంలో సహాయం చేశాడు. జూన్ 2024లో, నాజీ ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన 80వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరించింది. -
చరిత్ర సృష్టించిన కుట్ర కేసు!
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్‌లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవ కారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి కొందరు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), తరిమెల నాగిరెడ్డి (టీఎన్) తదితరులు ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని కారణంగా అరెస్టు కాలేదు. సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్ర కేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్ర కేసు’. అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్ర కేసు’గా బహుళ ప్రచారం పొందింది. దీనికి ముఖ్య కారణం వీరిపై పెట్టిన కేసును డీవీ, టీఎన్లు స్వయంగా వాదించి సంచలనం సృష్టించడం. 1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనంలో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవ కారుల వ్యూహం – ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ‘తక్షణ కార్యక్రమం’ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి వీరు కుట్ర పన్నినట్లు పేర్కొంది. 1970 జూన్‌లో ఈ కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో– డీవీ, టీఎన్లు ఈ ‘తక్షణ కార్యక్రమా’న్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసి కూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవసంప్రదాయాలకు పట్టం కట్టారు. కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు కూడా ఈ శిక్షలను నిర్ధారించింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిష¯Œ ్సపై జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో డీవీ, టీఎన్లతో సహా కుట్రకేసులో ఉన్న ముఖ్య నాయకులంతా రహస్య జీవితానికి వెళ్లిపోయారు.డీవీ, టీఎన్ ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్మెంట్ను కేసులో ఉన్న అందరి తరఫున తయారుచేసి, విచారణ సందర్భంగా డీవీ వివరించారు. ఈ ప్రకటన ‘డీవీ స్టేట్మెంట్’గా ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టీఎన్ ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమా’నికి అన్వయించి రాసి... స్టేట్మెంట్ రూపంలో కోర్టులో రెండు గంట లపాటు ఎంతో శక్తిమంతంగా వివరించారు.డీవీ, టీఎన్ కోర్టును తమ రాజకీయాల ప్రచార వేదికగా చేసుకున్న ఫలితంగా ఈ స్టేట్మెంట్లు కొత్త ఒరవడిని సృష్టించాయి. వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో ముఖ్యమైనవి: ‘సాయుధ పోరాటాలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో భూసంస్కరణలు అమలు జరగటం అసంభవం’, ‘వర్గపోరాటం, ప్రజల సాయుధ విప్లవం ద్వారా పాలకవర్గాన్ని కూలదోయటం తప్పనిసరిగా జరుగుతాయి’, ‘కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం’, ‘మా విప్లవ పంథా రివిజనిస్టుల పార్లమెంటరీ పంథాకు పూర్తిగా భిన్నమైనది, మా పం«థాను గురించి మా తక్షణ కార్యక్రమంలో ప్రకటించాం.’ ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో... వాటిని అంగీకరిస్తూ కోర్టులో స్టేట్మెంట్లు ఇచ్చి విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచారు వీరు. డీవీ 1984 జూలై 12న చనిపోగా, టీఎన్ ఎమర్జెన్సీకాలంలో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో 1976 జూలై 28న చనిపోయారు. అలా వీరు జూలై మాసంలోనే అమరులవ్వడం యాదృచ్ఛికమే అయినా ఆసక్తిదాయకం. వారికి విప్లవాభివందనాలు.– ముప్పాళ్ళ భార్గవ శ్రీ సీపీఐ ఎంఎల్ నాయకులు(రేపు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వర్ధంతి) -
ప్రపంచంలోని సహజసిద్ధమైన అద్భుతాలేవో తెలుసా?
హలో పిల్లలూం. మనకు ప్రపంచ వింతలంటే ఠక్కున గుర్తొచ్చేవి – ది గ్రే వాల్ ఆఫ్ చైనా, పెట్రా, క్రైస్ట్ ది రిడీమర్, మచ్చు పిచ్చు, చిచెన్ ఇట్జా, రోమన్ కొలోసియం, మనందరికీ ఇష్టమైన తాజ్ మహల్. ఈ ఏడు వింతలు తప్ప మరొకటి జ్ఞప్తికి రావు. ఇవి ఎంతో అందమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, కట్టడాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మాతలు. మనకంటే ముందు జీవించిన మన పితరులు వివిధ కాలాలలో, విభిన్న సందర్భాలలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి. కానీ ఈరోజు మనం, మానవ ప్రమేయం లేకుండా ప్రకతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏడు సహజసిద్ధమైన అద్భుతాలు (seven natural wonders of the World)1. గ్రాండ్ కాన్యన్ (Grand Canyon)అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనాలో ఉంది. కొలరాడో నది సష్టించిన ఈ కాన్యన్ దాదాపు 446 కిలోమీటర్ల ΄÷డవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.6 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.2. గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef ) ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది 2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసం.3. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ (Amazon Rainforest)దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ‘‘ప్రపంచ ఊపిరితిత్తులు’’ గా పిలువబడుతుంది. ఇది అమెజాన్ నది చుట్టూ విస్తరించి ఉండటంతోపాటు భూమ్మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జాతుల జంతుజాలం, వక్షజాలానికి నిలయం.4. విక్టోరియా జలపాతం (Victoria Falls) ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే సరిహద్దులో ఉన్న ఈ జల΄ాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లయితే, ఎత్తు 108 మీటర్లు.5. ఆరోరా బోరియాలిస్ (Aurora Borealis Northern Lights)ఉత్తర ధ్రువ ప్రాంతాలలో (నార్వే, స్వీడన్, ఫిన్లాండ్) కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దశ్యం సౌర కణాలు భూమి వాతావరణంతో సంకర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది. ఈ దశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకతి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ లా ఉంటాయి.6.పారిసెలో రాక్ (Paricutin Volcano)మెక్సికోలోని ఈ అగ్నిపర్వతం 1943లో ఒక రైతు భూమిలో ఏర్పడింది. ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే 424 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణింపబడుతుంది.7. మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest, Mount in Asia )ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాలలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపుతుంటారు. -
చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్‌కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్‌ను వెదుక్కున్నాడు.కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్‌కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్‌కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంఅదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు. -
ఇదో నిజాయితీ పెట్టె కథ!
పిల్లలకు మనం చిన్నప్పుడు ఏది మంచిదని చెబితే దాన్నే పాటిస్తారు. విలువలు నేర్పితే మంచి పౌరులుగా ఎదగి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్ద సామెత చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన నిజాయితీ పెట్టె ద్వారా పిల్లలు నిజాయితీగా, నైతిక విలువలతో మసలుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల బడిలో ఓ నిజాయితీ పెట్టె ఉంది. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, రేజర్లు, చాక్లెట్లు, నోట్‌బుక్స్ ఉంటాయి. అవరసమైన పిల్లలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని దానిపై నిర్ణయించిన ధర చెల్లించాలి. నిజాయితీతోపాటు లెక్కలు వస్తాయి ఈ పెట్టె కారణంగా చిన్నప్పటి నుంచే పిల్లలు విలువలతో పాటు లెక్కలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడింది. బడిలో చోరీ చేయాల్సిన పని లేకుండా పోయింది. వారు కొనుక్కున్న వస్తువులకు ఎంత డబ్బు చెల్లించాలి, ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలింది అనే విషయం వారు అనుభవంతో తెలుసుకుంటారు. తద్వారా నిజ జీవితంలోనూ అవసరమై లెక్కలు నేర్చుకుంటున్నారు. పెట్టెలోని వస్తువులను డబ్బు లేకున్నా పొంది ఆపై ఉన్నప్పుడు డబ్బు కట్టవచ్చు. దీంతో లావాదేవీలు నీతిగా ఉండాలనే తలంపు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడుతోంది.టీచర్ విన్నూత్న ఆలోచనతో సాకారం ఇదే బడికి చెందిన తులసీనాథం నాయుడు అనే టీచర్ రూ.2 వేలు పెట్టి పిల్లలకు అవరసమైన వస్తువులను ఈ పెట్టెలో పెట్టారు. ఆపై ఇందులోని అవసరమైన వస్తువులను పిల్లలు కొనడం మొదలు పెట్టారు. ఇలా నెలంతా వసూలైన మొత్తంతో ఆ టీచర్ మళ్లీ వస్తువులను బాక్సులో నింపడం చేస్తున్నారు.పరాయి సొమ్ము పామువంటిదని తెలిసింది మా స్కూల్లో నిజాయితీ పెట్టె ఉంది. మాకు అవరసమైన వస్తువులను తీసుకుని నిర్ణయించిన ధర మేరకు డబ్బును సార్‌కు ఇస్తున్నాం. దీంతో బడిలో ఎలాంటి చోరీలు లేకుండాపోయాయి. మాకు లెక్కలు బాగా అర్థమవుతున్నాయి. పరుల సొమ్ము పాము వంటిందని బాగా తెలిసింది. డబ్బులు లేకున్నా కావాల్సిన వస్తువులను పెట్టెలో తీసుకుని ఆపై డబ్బును ఇవ్వడం కూడా నిజాయితీనే కదా అనే విషయం అర్థమైంది. – భానుప్రియ, నాలుగో తరగతి విద్యార్థినిమొక్కై వంగనిది మానై వంగునా.. చిన్నప్పటి నుంచి పిల్లలకు మానవ విలువలు, నీతి, నిజాయితీ గురించి చెబితే పెద్దయ్యాక కూడా అలాగే నడుస్తారు. నేను తొలుత ఇదే మండలంలోని కంచిరెడ్డిపల్లి బడిలో నిజాయితీ పెట్టెను ఏర్పాటుచేశాను. పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో నేను ఏ బడికి వెళ్లినా అక్కడ నిజాయితీ పెట్టెను పెడుతున్నా. తద్వారా పిల్లల్లో నిజాయితీ, మంచితనం అలవాటుగా మారింది. పెద్దలు చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా.. – తులసీనాథం నాయుడు, టీచర్ -
ఆహా..లిక్విడ్ లడ్డు..!
ఎవరి టేస్ట్ వారికి ఆనందం. అలాంటి ఆనందమే ప్రయోగాలకు వేదికై కొత్త ఆవిష్కరణకు దారి తీస్తుంది. ఒక యువకుడు తయారు చేసిన ‘లిక్విడ్ లడ్డు’ వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొడుతూ నోరూరిస్తోంది.‘లొట్టలు వేయనక్కర్లేదు. మీరు కూడా ఎంచక్కా ఇలా తయారు చేసుకోవచ్చు’ అని వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించాడు లిక్విడ్ లడ్డు సృష్టికర్త.ఈ లిక్విడ్ లడ్డు వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి, ‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి!’ అనే డైలాగు మనకు తెలిసిందే కదా. ఎవరూ చేయనిది కొత్త వంటలెలా పుడతాయి! అందుకే....ఈ లిక్విడ్ లడ్డు సృష్టికర్తకు ‘వెరీ గుడ్’ అని ప్రశంసలు వచ్చాయి. View this post on Instagram A post shared by Saransh Goila (@saranshgoila) (చదవండి: నేచురల్ హెయిర్ జెల్..! జుట్టు పెరగడమే కాదు..హెల్దీ కూడా..) -
ఏనుగులంటే ప్రాణం : కానీ మల్టీ మిలియనీర్ని ఏనుగే తొక్కేసింది!
ఆస్ట్రేలియన్ జూకీపర్, సంరక్షకుడు స్టీవ్ ఇర్విన్ స్టింగ్రే చేతిలో మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసేలా మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా పర్యావరణ పర్యాటక రంగంలో పేరు గాంచిన మల్టీ మిలియనీర్ సీఈవో, ఎకోటూరిజం వ్యాపారవేత్త ఎఫ్‌సీ క్రిస్టియన్ కాన్రాడీ(39) తన సొంత జూలోనే ఏనుగు దాడిలో దుర్మరణం పాలైన ఘటన వన్యప్రాణి ప్రేమికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. జనసాంద్రత ఉన్న ప్రాంతం నుండి ఏనుగులను తరలించడానికి ప్రయత్నిస్తుండగా జూలై 22న ఉదయం 8 గంటలకు గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.దక్షిణాఫ్రికాలోని టాప్ రిజర్వ్‌లలో ఏనుగు అతనిపై దారుణంగా దాడిచేసి తొక్కి చంపింది. ది డైలీ మెయిల్ ప్రకారం.. కాన్రాడీ పర్యాటక లాడ్జీల నుండి ఏనుగుల గుంపును దూరంగా నడిపించడానికి ప్రయత్నించినప్పుడు జరిగింది. ఏనుగు తన దంతాలతో కాన్రాడీని పొడిచి, పలు మార్లు తొక్కడంతో, సమీపంలోని రేంజర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయారు. గోండ్వానా గేమ్ రిజర్వ్ మిస్టర్ కాన్రాడీ మృతిపై సంతాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని ప్రముఖ గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్‌లో జరిగిన విషాద ఘటన ఎకోటూరిజం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గేమ్ రిజర్వ్‌లలో భద్రతా ప్రోటోకాల్‌ల గురించి చర్చకు దారితీసింది.కేలిక్స్ గ్రూప్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ యజమానికి కాన్రాడీకి ఏనుగులు, ప్రకృతి అంటే చాలా ప్రేమ అట. వాటిని ఫోటో తీయడానికి ఇక్కడకు తరచూ వచ్చేవారని సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఎంత ప్రేమ అయినా కానీ అడవిలో ఉన్నాయనేది ఎప్పటికీ మర్చిపోకూడదంటూ ఆయన అకాలం మరణంపై సంతాపం ప్రకటించారు. కాన్రాడీకి జంతుశాస్త్రం, జంతు అధ్యయనాలు, వాణిజ్యం, మార్కెటింగ్‌లో ఆనర్స్ డిగ్రీలు కూడా ఉన్నాయి. ముగ్గురు బిడ్డలకు తండ్రి.Francois Christiaan Conradie, 39, CEO of Gondwana Private Game Reserve, killed by elephant on July 22 at 8 AM. Visionary conservationist, husband, father of three. Family seeks privacy in the meantime. pic.twitter.com/vxMIENplav— Inside Out News (@InsideOutNews_) July 24, 2025చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్ పాపులర్ ఫైవ్‌స్టార్ సఫారీ లాడ్జి. ఆఫ్రికాలోని ప్రసిద్ధ "బిగ్ ఫైవ్" సింహం, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, బఫెలోలను దగ్గరగా చూడాలనుకునే పర్యాటకులకు ఇది ఫేవరెట్ డిస్టినేషన్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, ఫోటోగ్రాఫర్లు, వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడకు వస్తుంటారు. మరోవైపు గోండ్వానా రిజర్వ్‌లో గత ఏడాది కూడా బోనీ అనే 36 ఏళ్ల ఉద్యోగి ఒకరు ఏనుగుల దాడిలో మృతి చెందారు. ఈ వరుస ఘటనలు గేమ్ రిజర్వ్‌లలో సిబ్బంది, పర్యాటకుల భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఎఫ్‌సీ కాన్రాడీ మరణం వన్యప్రాంతాల్లో పనిచేసే వారికీ, పర్యాటకులకూ ఒక హెచ్చరిక అని, తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం -
10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం
స్వీడన్లో కనీవినీ ఎరుగని వింత చోటు చేసుకుంది. ఏమీ జరిగిందో అర్థం చేసుకునే లోపే ఈ వింత వారిని ఆందోళనలోకి నెట్టేసింది. 10 నెలల పాపను ఎప్పుడూ తండ్రి ఛాతీపై పడుకోబెట్టుకునేవాడు. ఈలోకంలో అందరి తండ్రుల్లాగానే అతను కూడా తన ప్రతిరూపాన్ని చూసి మురిసి పోయేవాడు. కానీ అనుకోని వింత వారిని షాక్‌లో ముంచేసింది. ఈ అసాధారణ వైద్య సంఘటన ఆన్లైన్లో , ఆరోగ్య సంరక్షణ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారి తీసింది.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, స్వీడన్లో నివసించే ఈ పాప తండ్రి పది నెలల ఫీమేల్ బేబీని స్కిన్ టూ స్కిన్ టచ్ చేసేలా పడుకోబెట్టుకునేవాడు. అయితే ఆ పాపకు "మైక్రోపెనిస్" పెరగడం సంచలనం రేపింది. పాప తండ్రి రెగ్యులర్ టెస్టోస్టెరాన్ జెల్‌ను పూసుకునేవాడట. ఈ అలవాటు కారణంగానే పాప "మైక్రోపెనిస్" అభివృద్ధి చెందిందట. అయితే అది నిజమైన "మైక్రోపెనిస్" కాదని అభివృద్ధి చెందని పురుష జననేంద్రియాలను అలా పిలుస్తారని చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రమాదాల గురించి తెలియకుండా, తండ్రి ఎక్కవగా తన బేబీని ఛాతీపై పట్టుకోబెట్టుకోవడం వల్ల అనుకోకుండా తన కుమార్తె టెస్టోస్టెరాన్ అధిక స్థాయిలోకి బహిర్గతమైందని అదీ ఈ పరిణామానికి దారి తీసిందని అంటున్నారు. చర్మం నుండి చర్మానికి సంపర్కం ద్వారా ప్రమాదవశాత్తు హార్మోన్ బహిర్గతమయ్యే ప్రమాదాలను ఈ కేసు మరో నిదర్శనమన్నారు. ఇలాంటి అర డజను కేసులను ఎదుర్కొన్నట్లు ఒక స్వీడిష్ వైద్యుడు చెప్పడం గమనార్హం.ఊరట ఏంటంటేపాపలోని క్లిటోరిస్ చిన్న పురుషాంగంలా పొడుచుకు రావడాన్ని గ్రహించి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. రక్త పరీక్షల ద్వారా అసలు విషయాన్ని గమనించారు. అదృష్టవశాత్తూ, తండ్రి జెల్ వాడటం మానేసిన తర్వాత అది దానంతటకు అదే కుంచించుకుపోవడం ఊరట నిచ్చింది.ఇదీ చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!టెస్టోస్టెరాన్ జెల్‌ను సాధారణంగా హైపోగోనాడిజం ఉన్న పురుషులకు ప్రిస్ర్కైబ్ చేస్తారట. ఈ పరిస్థితిలో శరీరం తగినంత సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయదు. ఈ పరిస్థితి ఏ వయసు వారైనా పురుషులను ప్రభావితం చేయవచ్చు, కానీ అధ్యయనాలు 45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 40శాతం , 80 ఏళ్లలో సగం మంది పురుషులలో వైద్యపరంగా తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఔషధం సెక్స్ డ్రైవ్ లోపాలు, అంగస్తంభన, అలసట, మానసిక స్థితిలో మార్పులు మరియు కండరాల నష్టం వంటి అనేక లక్షణాలకు దారితీస్తుంది.చదవండి: ప్రధానిని సైతం నవ్వించిన మీమ్ ఆర్టిస్ట్ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్ దిగ్భ్రాంతికొన్ని కారణాలతో తీసుకునే టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్ల చికిత్సలు ఎంత శక్తివంతమైనవో, ఇతర హార్మోన్లను ఎలా ప్రభావితం చేస్తోయో సాధారణ ప్రజలకు అర్థం కావని సహల్గ్రెన్స్కా యూనివర్సిటీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ ప్రొఫెసర్ జోవన్నా డాల్గ్రెన్ అన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని గుర్తు చేసుకున్నారు. గతంలో ఒక కేసులో 10 ఏళ్ల బాలుడు తన తల్లి ఉపయోగిస్తున్న ఈస్ట్రోజెన్ క్రీమ్ కారణంగా ఆ బాలుడిలో బ్రెస్ట్ పెరిగిందని చెప్పారు. -
ప్రధానిని సైతం నవ్వించిన మీమ్ ఆర్టిస్ట్ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్ దిగ్భ్రాంతి
ఒడిషాకు చెందిన ప్రముఖ ఫోటోషాప్ కళాకారుడు, మీమ్స్ సృష్టికర్త కృష్ణ (Atheist krishna) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న (జూలై 23)న కన్నుమూశారు. దీంతో పలవురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులో అకాల మరణం అంటూ అభిమానులు నివాళులర్పించారు.కృష్ణ అసలు పేరు రాధాకృష్ణ పంగా. మీమ్స్ , ఫోటోషాప్ ఫోటోలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ ఫోటోలతో పాటు, పాత, దెబ్బతిన్న ఫోటోలను పునరుద్ధరించడంలో కూడా ప్రసిద్ధి చెందాడు. కృష్ణ నైపుణ్యం అనేకమంది సెలబ్రిటీల ప్రశంసలందుకుంది. ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దృష్టిని ఆకర్షించి, వారి ప్రశంసలను కూడా దక్కించుకున్నారు.Woke up to the terrible news of @Atheist_Krishna passing away. He was one of the kindest people I met on this platform. On 10th July, he told me he was unwell and needs to be operated. He caught pneumonia. At that time, he said “it would be a miracle if I survive this.” I… pic.twitter.com/Fmo6AJFZhW— tere naina (@nainaverse) July 23, 2025అనారోగ్యంతో బాధపడుతూ జూలై ప్రారంభంలో ఆస్పత్రిలో చేరాడు. అయితే ఊరిపితిత్తుల్లోకి నీరు చేరడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కానీ దురదృష్టవశాత్తు న్యుమోనియా సోకడంతో పరిస్థితి క్షీణించి కన్నుమూశాడు ఈ వార్త తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!కాగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై నృత్యం చేస్తున్న స్పూఫ్ వీడియోను క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై స్వయంగా మోదీ స్పందించారు. మోదీ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఈ ఆర్టిస్ట్ వీడియోను పోస్ట్ చేసి మరీ ప్రశంసించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..! Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R— Narendra Modi (@narendramodi) May 6, 2024 -
ఇందుగలరందులేరను...భారతీయుల సంఖ్యలో టాప్ 10 దేశాలు ఇవే
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఉంది. అది టొరంటోలోని ఓ మూలగా ఉన్న కిరాణా దుకాణంలో కనిపిస్తుంది, బెర్లిన్ లోని ఒక టెక్ సంస్థకు గుండెకాయగా మారుతుంది. సందడిగా ఉండే దుబాయ్ మెట్రోలో లేదా న్యూయార్క్ టైమ్స్ బైలైన్ లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే..భారతీయ పౌరులు నివసించాలని నిర్ణయించుకునే దేశంలో సులభంగా కలిసిపోతారు.నేడు, గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జన్మస్థలం వెలుపల నివసిస్తున్నారు. ప్రపంచంలోని 281 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులలో, భారతీయులు అతిపెద్ద సింగిల్ గ్రూపుగా ఏర్పడ్డారు, దాదాపు 18 మిలియన్ల మంది భారతదేశంలో జన్మించి ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నారని తాజా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన వారిని కూడా చేరిస్తే ఆ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుంది.అగ్రరాజ్యం...అగ్రస్థానంలో..టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విపరీతమైన అవకాశాల కారణంగా దాదాపు 5.4 మిలియన్లకు పైగా భారతీయులతో, మనవాళ్లను ఆకర్షించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇంకా, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలంగా ఉండే పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు కూడా దీనికి దోహదం చేశాయి. ఎడిసన్ (ఎన్జె), జాక్సన్ హైట్స్ (ఎన్వై), ఆర్టీసియా (సిఎ) వంటి ప్రాంతాలను తరచుగా ‘లిటిల్ ఇండియాస్‘ అని పిలుస్తారు ఇవి వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు సాంస్కృతిక కేంద్రాలతో నిండి ఉంటాయి.70 శాతం శ్రామిక శక్తి మనదే..3.57 మిలియన్ల మంది భారతీయులతో యుఎఇ రెండో అతిపెద్ద భారతీయ నివాస దేశం. నిర్మాణం, ఆతిథ్యం,ఆర్థిక రంగాలలో పన్ను రహిత జీతాలు బ్లూ, వైట్ కాలర్ కార్మికులను ఆకర్షిస్తాయి; దుబాయ్ శ్రామిక శక్తిలో 70 శాతానికి పైగా భారతీయులే కావడం గమనార్హం.మేలు కలయిక...మలేషియానేడు, మన దేశస్థులు మలేషియా మొత్తం జనాభాలో 9% మంది భారతీయులే ఉన్నారు. దాదాపుగా 2.75మిలయన్ల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారని అంచనా. తమిళం, మళయాళం, తెలుగు, పంజాబీ భాషలు మాట్లేడేవారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరే కాకుండా ఇండియన్ ఎక్స్‌పాట్స్ (అక్కడ స్థిరపడనివారు) సైతం 2.25లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. ఇండియన్స్ కేరాఫ్...కెనడాకెనడాలో దాదాపు 2.88 మిలియన్ల భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు. టొరంటో (700,000 కంటే ఎక్కువ మంది భారతీయులు) వాంకోవర్ వంటి ప్రధాన కేంద్రాలు పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు బాలీవుడ్ చలనచిత్రోత్సవాలను సైతం ఇక్కడ నిర్వహిస్తు న్నారు.3వేల వ్యాపారాలు మనవే...సౌదీ అరేబియాసౌదీ అరేబియాలో దాదాపు 2.46 మిలియన్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు, ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2023–24లో ఈ సంఖ్య 200,000 పెరిగింది, ఇది నిర్మాణం, మౌలిక సదుపాయాలు సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో డిమాండ్‌లో పదునైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, భారతీయ వ్యాపారాల ఉనికి విస్తరించింది, ఇప్పుడు 3,000 కంటే ఎక్కువ నమోదిత భారతీయ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి, ఇది రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.స్టడీస్‌కి స్టార్ డమ్...యునైటెడ్ కింగ్ డమ్భారతీయ సంతతికి చెందిన 1.86 మిలియన్ల మందికి నిలయంగా ఉన్న యుకె 40 శాతం కంటే ఎక్కువ మంది లండన్ బారోగ్స్, లీసెస్టర్ బర్మింగ్హామ్లలో నివసిస్తున్నారు, చిన్నపాటి వ్యాపారాలు ఫైనాన్స్, వైద్య రంగాలలో ఉన్న నిపుణులు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆజ్యం పోస్తున్నారు. భారతీయ విద్యార్థులు (సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ మంది) టైర్ 4 వీసాలపై అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు హాజరవుతారు.మన వ్యాపార ఆధిపత్యం దక్షిణాఫ్రికాదక్షిణాఫ్రికాలో దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 19వ శతాబ్దపు నాటల్ చెరకు తోటలకు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు. ఆధునిక వలసదారులలో ఇంగ్లీష్ మీడియం విద్య కేప్ టౌన్‌లోని అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కేంద్రాల ద్వారా ఆకర్షించబడిన వైద్యులు ఐటీ నిపుణులు ఉన్నారు. డర్బన్ లోని స్థానిక రిటైల్ బిజినెస్‌లో భారతీయ యాజమాన్యంలోని వ్యాపారాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, అయితే తమిళ గుజరాతీ భాషా విద్య కోసం వార్షిక బడ్జెట్లు 10 మిలియన్లకు మించింది.ఉమ్మడి చరిత్రతో...శ్రీలంకశ్రీలంక లో 1.61 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు ఇది టీ, పర్యాటక ఐటీ రంగాలలో ఆధునిక కాంట్రాక్ట్ ఉద్యోగులను మిళితం చేస్తుంది. ఉమ్మడి తమిళ సింహళ సాంస్కృతిక చరిత్ర కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి సజావుగా మారడానికి సహాయపడుతుంది. మరోవైపు, కొలంబోలో అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్ జోన్ భారతీయ ఫిన్‌టెక్ నిపుణులను ఆకర్షిస్తుంది.జనాభాలో 20శాతం.. కువైట్కువైట్లో దాదాపు 995,000 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాని జనాభాలో 20 శాతానికి పైగా మనమే ఉన్నాం అన్నమాట. మనవాళ్లలో అత్యధికులు అక్కడ చమురు క్షేత్రాలు, నిర్మాణం, ఆసుపత్రులు గృహ రంగాలలో పనిచేస్తున్నారు.దీపావళికి ‘దియా’...ఆస్ట్రేలియాఆస్ట్రేలియాలో 976,000 మంది భారతీయులు ఉన్నారు. అర్హతలు ఆంగ్ల నైపుణ్యానికి విలువనిచ్చే పాయింట్ల ఆధారిత నైపుణ్య వలస కార్యక్రమం కింద ఇక్కడ వీరు అభివృద్ధి చెందుతున్నారు. ఏటా 120,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ ఐటీలలో చేరుతున్నారు, ట్యూషన్ ఫీజుగా 5 బిలియన్లను అందిస్తున్నారు. మెల్బోర్న్ సిడ్నీ వంటి నగరాల్లో భారతీయ వాణిజ్య మండలులు, యోగా స్టూడియోలు కనిపిస్తాయి. ఇక దీవాళి స్ట్రీట్ ఫెయిర్స్ సైతం అక్కడ .చురుకుగా జరుగుతున్నాయి. -
హ్యాట్సాప్ ఐపీఎస్ ఆఫీసర్..! 88 ఏళ్ల వయసులో వీధుల్లో..
కొందరు ఒక మంచి పనికి పూనుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అది తన హోదా కంటే కాస్త దిగి చేయాల్సిందే అయినా వెనుకడుగు వేయరు. అంతేగాదు వృత్తి విరమణను కూడా పక్కనపెట్టి సేవకు విరామం ఉండదనే కొత్త అర్థం చెబుతారు. అలాంటి వ్యక్తి ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్..ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆయన విశాల హృదయానికి ఫిదా అయ్యి అతడి గురించి నెటింట షేర్ చేశారు. మరి ఆ వ్యక్తి ఎవరంటే..అతడిని పరిశుభ్రతకు మారుపేరు, స్వచ్ఛ భారత్ ముఖచిత్రంగా పేర్కొనవచ్చు. అతడే చండీగఢ్‌లోని 88 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ. ఆయన 1964 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పదవీ విరమణ చేసినా..ప్రజా సేవకు మాత్రం ఉండదనే కొత్త అర్థం ఇచ్చేలా ఓ మంచి పనికి ఉప్రక్రమించాడు సిద్ధూ. స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో చండీగఢ్ ర్యాంక్ చాలా తక్కువకు పడిపోయిందని, తానే ఆ పనికి పూనుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం అధికారులకు ఫిర్యాదు చేయడం కంటే..మార్పు మన నుంచి మొదలైతే అది నిశబ్ధంగా అధికారులను ప్రేరేపించేలా ప్రతిధ్వని చేస్తుందని విశ్వసించాడు ఈ రిటైర్డ్ ఆఫీసర్ సిద్ధూ. ఆ నేపథ్యంలోనే ఆయన తన రోజుని వీధుల్లో చెత్తను తీయడంతో ప్రారంభిస్తాడు. ఉదయం ఆరుగంటలకు చండీగఢ్ సెక్టార్ 49 వీధుల్లో ఓ బండిపై చెత్తను ఆయనే స్వయంగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు. వయసు రీత్యా ఆయన ఈ వయస్సులో అంతలా కష్టపడాల్సిన పని కాదు. పైగా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసి వదిలేయొచ్చు కానీ అవేమి చేయలేదు సిద్ధూ. తానే చర్య తీసుకోవాలని సంకల్పించి ఇలా చెత్తని సేకరిస్తున్నాడు ఆయన. గుర్తింపు, వయసుతో సంబంధం లేకుండా నిరంతరం స్వచ్ఛ భారతే తన లక్ష్యం అన్నట్లుగా వీధుల్లో చెత్తను తీస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారాయన. స్వచ్ఛ భారత్ స్పూర్తికి నిదర్శనంలా నిలిచాడు. అతడి అంకిత భావం, సమాజం పట్ల అతడి వైఖరి నెటిజన్లను సైతం ఫిదా చేసింది. అంతటి అత్యున్నత హోదాలో పనిచేసి కూడా ఎలాంటి డాబు దర్పం చూపకుండా సాదాసీదా వ్యక్తిలా చెత్త సేకరించడం అంటే అంత ఈజీకాదంటూ ఆ ఐపీఎస్ ఆఫీసర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: Dr Megha Saxena: డాక్టర్... ట్రీట్మెంట్..! కార్చిచ్చుకి సమూలంగా చెక్..) -
56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! ఈ పెద్దాళ్లు కాస్తా..
పెళ్లి, పిల్లలు, కెరీర్ సెటిల్మెంట్తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు అందరు. కాసేపు మన బాల్యపు స్మృతుల్లోకి వెళ్దామన్నా..ఆలోచన కూడా రాదు. కానీ ఒక్కసారి నాటి స్నేహితులను, నాటి చిలిపి పనులు గుర్తొస్తేనే..కళ్ల నుంచి నీళ్లు అప్రయత్నంగా జాలువారతాయి. ఆ స్వీట్‌మెమొరీస్ ఎవ్వరికుండవు చెప్పండి. కాకపోతే..ఉరుకుల పరుగుల జీవన విధానంలో కాసేపు ఆగి వెనక్కి చూసే అవకాశం చిక్కకపోవడమే తప్ప. నాటి స్నేహితులను కలిసినా..టచ్‌లో ఉన్నా..కళ్లముందు ఆ మధుర జ్ఞాపకాలు మెదిలాడుతూనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే అలాంటి భావోద్వేగపు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు ఈ ఐదుగురు ఆంటీలు.ఒక మహిళ తన నలుగురు స్నేహితులతో కలసి తాము చదువుకున్న పాఠశాల కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ MAMCని సందర్శిస్తారు. అదికూడా దాదాపు 40 ఏళ్ల అనంతరం తమ చిన్ని నాటి జ్ఞాపకాలను వెదుకుతూ..వచ్చారు ఆ ఐదుగురు 50 ఏళ్ల మహిళలు. ఆ పాఠశాల ఆవరణం, తరగతి గదులు చూస్తూ..నాటి మధుర స్మృతుల్లోకి జారిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఐదుగురు ఆంటీల్లో ఒకామె తాము సరిగ్గా 40 ఏళ్ల తర్వాత మా స్వీట్‌మెమొరీస్ వెతుక్కుంటూ ఈ స్కూల్‌కి వచ్చాం. తాము 56 ఏళ్ల చిన్నారులమని నవ్వుతూ చెబుతున్నారు ఆ వీడియోలో. ఇక్కడ మా కలలు కనిపిస్తాయి. మేం చేసిన చిలిపి అల్లర్లు గుర్తుకొస్తాయి. ఈ పాఠశాల కలియ తిరుగుతుంటే..మా కాలు తడబడదు..భావోద్వేగంతో ఉబ్బితబ్బిబవుతుందంటున్నారు వారంతా. ఆ మహళలంతా చీరలు ధరించి అలనాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఆ పాఠశాల చుట్టూ కలియతిరిగారు. తాము ఆ పాఠశాలో 1987 బ్యాచ్‌కి చెందినవాళ్లమని చెప్పుకొచ్చారు కూడా. ఈ మధురానుభూతి వెలకట్టలేనిది, మాటలకందనిది అంటున్నారు ఆ మహిళా స్నేహితులు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక అంతా తమ బాల్యపు స్మతుల్లోకి వెళ్లిపోయారు. ఎవ్వరికైనా.. స్కూల్ చదువు ఓ అద్భుత వరం..అది ఎవ్వరికైనా మధురానుభూతులను పంచే గొప్ప భావోద్వేగపు అనుభూతి కదా..!. View this post on Instagram A post shared by Kakali Biswas (@phoenix_stories) (చదవండి: ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు! ఈ జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు) -
కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!
త్రేతాయుగంలో సతీ సుమతీ అనే మహా పతివ్రత గురించి వినే ఉంటారు. సుమతీ భర్త కౌశికుడు. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య సుమతీ అంత శాంతమూర్తి. కౌశికుడు కుష్టురోగంతో బాధపడుతున్నప్పటికీ, సుమతీ అతనిని విడవకుండా సేవ చేస్తుంది. ఒకానొక సందర్భంలో.. ఆమె భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్తుండగా.. మాండవ్య ముని శాపం వల్ల సూర్యోదయానికి ముందే అతని శరీరం వెయ్యి ముక్కలుగా మారుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు సుమతీ తన పతివ్రత్య శక్తితో సూర్యోదయాన్ని ఆపివేస్తుంది. తద్వారా భర్త ప్రాణాలు కాపాడుతుంది. చివరికి దేవతలు ఆమెను అభ్యర్థించి, కౌశికుడిని ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఆ సతీ సుమతీది త్రేతాయుగం అయితే మనం చెప్పుకోబోయే ఈ సతీ సుమతిది కలియుగం.ఆమె భర్త దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠురోగంతో బాధపడుతున్న అతనిని చూసి, నేటి సుమతీ చేస్తున్న సేవలు, చూపిస్తున్న నిబద్ధత అంతా ఇంతా కాదు. ప్రస్తుతం భర్తను వీపుమీద మోసుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని చూస్తున్న నెటిజన్లు.. ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..ఆ మహాసాధ్వి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారుఘజియాబాద్లోని మోడీనగర్‌లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్‌యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..) -
సంగీత సంబరం..!
శ్రావ్యమైన సంగీతానికి చెవి కోసుకునే స్వరాభిమానులకు సరైన వేదిక– జపాన్‌లో జరిగే ‘ఫుజీ రాక్ ఫెస్టివల్!’ ఈ వేడుక జపాన్‌లోని నిగాటా ప్రిఫెక్చర్లో ఉన్న నేబా స్కీ రిసార్ట్‌లో ప్రతి ఏటా జూలై నెల చివరి వారంలో మూడురోజుల పాటు జరుగుతుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఈ సంగీత సంబరం జరగనుంది. ఈ వేడుక తొలిసారిగా 1997లో ప్రారంభమైంది. పచ్చని పర్వతాల నడుమ, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రత్యేకంగా సాగుతుంది.ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్, హిప్–హాప్, జానపద శైలులలో సంగీతం శ్రోతలకు వీనులవిందు చేస్తుంది. గ్రీన్ స్టేజ్, వైట్ స్టేజ్, రెడ్ మార్క్ వంటి అనేక వేదికలపై జరిగే ప్రదర్శనలు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తాయి. సంగీత ప్రదర్శనలతో పాటు, స్థానిక కళా ప్రదర్శనలు, ఇతర వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను మరింతగా ఉత్సాహపరుస్తాయి.ఫుజీ రాక్ ఫెస్టివల్ కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాదు, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యమిస్తుంది. ఈ వేడుకల నిర్వాహకులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం వంటి అనేక పర్యావరణ అనుకూల కార్యక్రమాలను చేపడతారు. ‘ప్రకృతితో కలసి ఉందాం’ అనే నినాదంతోనే ఈ వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది. (చదవండి: రాజుగారి 'కలా'ఖండం..! మదిలో మెదిలి, రూపుదిద్దుకున్న కోట) -
రాజుగారి 'కలా'ఖండం..!
ఒక రాజు కల ఏకంగా కళాఖండమైంది. కాని, ఆ కల తీరకుండానే రాజు కథ ముగిసింది. జర్మనీలోని బవేరియా పర్వత శ్రేణుల మధ్య న్యూష్వాన్ స్టీన్ కోట– నిర్మాణం, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎందరో మనసులను దోచేస్తుంది. ‘లూడ్విగ్ 2’ అనే రాజు 19వ శతాబ్దంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధతో, ఇష్టంతో ఈ కోటను కట్టించుకున్నాడు. ‘లూడ్విగ్ 2’ – నాటి జర్మన్ సంగీత స్వరకర్తగా పేరున్న రిచర్డ్ వాగ్నర్ అభిమాని కావడంతో, వాగ్నర్ ప్రేరణతోనే ఈ కోటను కట్టించాడు. సింహాసనం దగ్గర నుంచి గానకచేరీ గది వరకు ప్రతి గదినీ అత్యంత కళాత్మకంగా రూపొందించారు. అయితే, ఈ కోట నిర్మాణం పూర్తికాకుండానే అనుమానాస్పద పరిస్థితుల్లో ‘లూడ్విగ్ 2’ మరణించాడు. ఆయనను మానసిక రోగిగా ప్రకటించి, రాజ్యాన్ని త్యజించమని బలవంతం చేసిన కొద్ది రోజులకే ఆయన, ఆయన వైద్యుడు సమీపంలోని స్టాంబెర్గర్ సరస్సులో శవాలుగా దొరికారు. ఇది ఆత్మహత్యగా ప్రచారం చేసినా, అంతశ్శత్రువులే రాజును హత్య చేశారని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు. విధి ఆడిన వింత నాటకంలో ‘లూడ్విగ్ 2’ కల చెదిరింది. అతడి మదిలో మెదిలి, రూపుదిద్దుకున్న కోట మాత్రం ప్రపంచానికి ఒక కళాఖండంగా మిగిలింది.(చదవండి: ధోతికట్టు..అదిరేట్టు..! నాడు గౌరవం..ఇవాళ ట్రెండీ స్టైల్..) -
సముద్రం లోపల అద్భుతమైన జలపాతం
పిల్లలూ...మనకు జలపాతాలు ఎక్కడ కనిపిస్తాయి? పెద్ద పెద్ద పర్వతాల నుండి జాలు వారుతూనో, చిన్నపాటి మెరక నుండి పల్లానికి దిగుతూనో దర్శనమిస్తాయి. కానీ మీరెప్పుడైనా సముద్రం లోపల వాటర్ ఫాల్‌ని చూశారా? అదెలా... అసాధ్యం కదా అనుకుంటున్నారా? ప్రకృతికి అన్నీ సాధ్యమే! మారిషన్ (Mauritius) ద్వీపంలోని మోర్న్ బ్రాబాంట్ప్రాంతపు సముద్రంలో ఏర్పడే ఒక అద్భుతమైన సహజ దృశ్యమే ఈ సముద్రపు జలపాతం. ఇది నీటి ఉపరితలంపై కనిపించే సాధారణ జలపాతం కాదు. సముద్ర గర్భంలో జరిగే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రక్రియ.ఎలా ఏర్పడుతుంది?ఇది సముద్రం లోపల ఉన్న భౌగోళిక నిర్మాణం మరియు నీటి సాంద్రతలో తేడాల వల్ల ఏర్పడుతుంది. మారిషస్ వద్ద, సముద్ర భాగంలో ఒక పెద్ద షెల్ఫ్ (కొండ లాంటి నిర్మాణం) ఉంది. సముద్రపు నీరు ఒక్కసారిగా కొండవద్దకు చేరుకొని ఆ కొండ తాలూకా లోతైన గర్భంలోకి దిగుతుంది. ఈ షెల్ఫ్ మీదుగా సముద్ర ధారలు, ఇసుక లోతైన సముద్రంలోకి జారి΄ోతాయి. ఈ ప్రవాహం ఒక జలపాతం లాంటి దృశ్యాన్ని సృష్టిస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ (దృష్టి భ్రమ) గా పరిగణించినప్పటికీ పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్ని చూసేందుకు వివిధ దేశాల నుండి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దృశ్యాన్ని మరింతగా అనుభూతి చెందేందుకు సముద్రం మీదుగా హెలికాప్టర్ రైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! -
ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..!
ఆ మూగజీవి స్కూల్‌కి ఎందుకొచ్చిందో గానీ..అక్కడున్న పిల్లల వద్ద అది కూడా ఓ పసిపాపాయిలా కూర్చొని ఉండటం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ అదిచేసే పని చూస్తే..కళ్లార్పడమే మరిచి ఆ శునకాన్నే చూస్తుండిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అందమైన కుక్క పాఠశాల తరగతి గదిలో పిల్లల తోపాటుగా కూర్చొని ఉంటుంది. చాలా అమాయకంగా అందర్ని చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్‌లో పిల్లలంతా డ్రాయింగ్ వేయడంలో మునిగిపోతే..ఈ కుక్క కూడా వేయాలనుకుందో ఏమో గానీ ఒక కాలుపైకిత్తి తనకు సమీపంలో ఉన్న పిల్లవాడి చేతిని తాకుతుంది. నేనే రంగులు వేస్తా అన్నట్లుగా అతడి చేతిలో తన కాలుని పైకెత్తి పెడుతుంది. ఆ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది. అయితే ఆ పిల్లవాడు చేతిని వదిలించుకని తన పనిలో తాను నిమగ్నమవుతుండగా మరోసారి అడుగుతున్నట్లుగా కాలుతో కదుపుతుంది. అయితే ఆ చిన్నారి కూడా నీ వల్ల కాదులే అన్నట్లుగా తన పని తాను చేసుకుంటున్న ఆ నిశిబ్ధ సంభాషణకు ఎలాంటి వారి మనసైనా ఇట్టే కరిగిపోతుంది. పాపం అది మాత్రం ఎవ్వరైనా నాకు కొంచెం డ్రాయింగ్ వేసే పేపర్ ఇవ్వరూ..అన్నట్లుగా చూస్తున్న దాని చూపు భలే నవ్వుతెప్పిస్తోంది .నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మూడు మిలయన్లకు పైగా వ్యైస్ నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు యూనిఫాం ఏది.. ? వేసుకుని వచ్చి ఉంటే నీకు డ్రాయింగ్ వేసే పేపర్ ఇచ్చేవారు అంటూ ఆ క్యూట్ కుక్కని ఉద్దేశిస్తూ.. కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Helpbezubaans (@helpbezubaans) (చదవండి: ఎంఆర్ఐ స్కానింగ్ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..) -
జస్ట్ 15 నిమిషాల జర్నీలో అద్భుత జీవిత పాఠం..! డబుల్ ఎంఏ, ఏడు భాషలు..
మనకే అన్ని తెలుసు. మనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని తెగ పొంగిపోతుంటాం. కానీ కాసేపు సరదాగా బయటకు వెళ్లగానే ఆ కొద్ది నిమిషాల్లో మనకు పరిచయమై అపరిచివ్యక్తులు చాలా విషయాలను నేర్పిస్తారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురవ్వుతుంది. కానీ ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తి మాత్రం ఎదురయ్యి ఉండడు. ఈ యువకుడికి ఎదురైన అనుభవం వింటే..మనకు తెలియని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయని అంగీకరించకుండ ఉండలేరు. ఇంతకీ ఏం జరిగిందంటే..హైదరాబాద్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ అభినవ్ మైలవరపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసుఉన్నారు. తన స్నేహితులతో కలిసి బెంగళూరులోని డీమార్ట్ షాప్‌కి వెళ్లి బాగా అలసిపోయి తిరిగి వచ్చి ఓ ఆటో ఎక్కి వస్తుండగా ఓ మంచి అనుభవం ఎదురైందంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అప్పటిదాక ఉన్న మా అలసట మొత్తం ఉఫ్ మని ఎగిరిపోయూలా గొప్ప అనుభూతిని పంచాడు ఆ ఆటో డ్రైవర్ తనకెదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఆ రోజుఆటోలో వెళ్తూ సరదాగా ఆ డ్రైవర్‌తో మాటలు కలిపినట్లు తెలిపాడు. "అతడు కూడా సరదాగా మాట్లాడుతూ..వాళ్లకో సవాలు విసిరాడు. కంప్యూటర్ అనే పదం ఫుల్ ఫామ్ చెప్పమని అడిగాడు. ఒకవేళ దానికి సమాధానం చెబితే గనుక తాను తమ వద్ద నుంచి ఈ జర్నీకి అయ్యే డబ్బులు కూడా ఛార్జ్ చెయ్యనని అంటాడు. అయితే ఆ డ్రైవర్‌కి తెలుసు తాము కచ్చితంగా సమాధానం ఇవ్వలేమని అంటున్నాడు అభినవ్. చివరికి ఆ డ్రైవరే కంప్యూటర్ అంటే: వాణిజ్యం, విద్య మరియు పరిశోధన కోసం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించే సాధారణ యంత్రం ((COMPUTER)Commonly Operated Machine Purposely Used for Trade, Education and Research) అని చెబుతాడు. తాను 1976 ఆ టైంలో చదువుకున్నానని, అప్పడు అంతా కంప్యూటర్లు వస్తాయనేవారు..కానీ ఇప్పడంతా ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు ఆ డ్రైవర్. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ పితామహుడు ఎవ్వరని ప్రశ్నించడమే గాక ఆ భాష చరిత్ర గురించి వివరిస్తూ..తన గురించి చెప్పుకొచ్చాడు. తాను డబల్ ఎంఏ చేశానని, ఒక ఇంగ్లీష్, మరొకటి పొలిటికల్ సైన్స్లోనని చేసినట్లు తెలిపాడు. సడెన్‌గా పెళ్లి ఫిక్స్ చేయడం, తర్వాత పిల్లలు, బాధ్యతలు వల్ల చదువు కొనసాగించలేకపోయానని అన్నాడు. తాను కూడా ఐఏఎస్‌కి ప్రిపరయ్యే వాడినని చెప్పుకొచ్చాడు. తాను పలు ఎంఎన్సీ కంపెనీల్లో అధిక వేతనానికి పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇచ్చే జీతానికి తగ్గట్టుగా అక్కడ కార్పొరేట్ అధికారులు మనల్ని ఎలా పనులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారో కూడా చెప్పాడు. అప్పటి దాక షాపింగ్‌తో అలసిన వాళ్లకి ఆ డ్రైవర్ మనోగతం జీవితంపై స్పష్టత వచ్చేలా కళ్లు తెరిపించి ఓ గొప్ప పాఠాన్ని వివరించినట్లుగా అనిపించింది. అంతేగాదు ఆ ఆటోలో ప్రయాణించిన 15 నిమిషాల జర్నీ జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతినిచ్చింది అని వీడియోలో చెప్పుకొచ్చాడు అభినవ్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Abhinav Mylavarapu (@abhinav.mylavarapu) (చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!) -
పరిస్థితులు ఎలా ఉన్నా.. వదులుకోకపోవడం అంటే ఇదే..!
టాలెంట్ ఉన్నోడు దునియానే ఏలతాడు అంటారు. అయితే ఒక్కోసారి ఆ టాలెంట్‌ని ప్రదర్శించే అవకాశం రాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, వచ్చిపడే కష్టాలు ఆ నైపుణ్యం మొత్తాన్ని అణిచేస్తుంటుంది. అలా తమ కళ బయట ప్రపంచానికి చూపించలేక కనుమరుగైన వారెందరో ఉన్నారు కూడా. అలాంటి కథే ఈ సెక్యూరిటీ గార్డుది. పరిస్థితులు ఎంతలా తన టాలెంట్‌ని తొక్కేస్తున్నా..కళను వదులుకోకుండా..వీలుచిక్కినప్పుడల్లా సానపెట్టుకుంటూ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంటపడ్డాడు. ప్రపంచానికి తన నైపుణ్యం తెలియజేసే అవకాశం అందిపుచ్చుకున్నాడు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక సెక్యూరిటీ గార్డు స్టోరీ ఇది. అతడి కథ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అతను అసాధారణమైన చిత్రకారుడు. తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి తనకు నచ్చిన అభిరుచిని పక్కనపెట్టాల్సి వచ్చింది. ఒకప్పుడూ పూర్తి సమయం కళకే వెచ్చించిన వ్యక్తి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్రియేటివిటీ కెరీర్‌ని వదులుకోవాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితులు దృష్ట్యా సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేయక తప్పలేదు. అయితే పెన్సిల్ లేదా పెన్ను పట్టాడంటే..అతడి చేతి నుంచి అద్భుతమైన చిత్రం జాలు వారాల్సిందే. అయితే ఆ సెక్యూరిటీ గార్డు విధులు నిర్వర్తిస్తూ కూడా తన పెయింటింగ్ హాబీని వదులుకోలేదు. వీలుచిక్కినప్పుడల్లా అద్భుతమైన చిత్రాలను గీస్తుంటాడు. పైగా పిల్లలకు మంచి మంచి మెళుకువలు నేర్పిస్తాడు కూడా. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరాధన ఛటర్జీ షేర్ చేయడంతో ఒక్కసారిగా అతడి కథ వెలుగులోకి వచ్చింది. అతడి టాలెంట్‌కి ఫిదా అయ్యి ఎందరో అతడికి సాయం అందించడానికి ముందుకు రావడమే కాదు..గ్యాలరీ ప్రదర్శన కోసం అతడితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. పరిస్థితులు ఎలా ఉన్నా కళను వదులుకోని వాడికి ఎన్నటికీ అన్యాయమైపోడు..ఏదో ఒక రోజు ప్రపంచానికి తెలిసేలా గెలుపు పిలుపు తడుతుంది అంటే ఇది కదూ..!. View this post on Instagram A post shared by Aradhana Chatterjee (@storiesbyaradhana) (చదవండి: మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!) -
మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!
గతంలో ఎన్నో గాంధీజీకి సంబంధించిన వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికి ఆ మహాత్ముడి ఔన్యత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. ఆ విశిష్ట వ్యక్తి ఎప్పటికీ అపురూపమే, ఆయనకు సంబంధించినది ఏదైనా..వెల కట్ట లేనంత గొప్పది అని చెప్పకనే చెబుతున్న ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరోకటి చోటుచేసుకుంది. గొప్ప గొప్ప కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఆయన చిత్రాలను ఎన్నో చూశాం. కానీ ఈ పెయింటింగ్ మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనది. పైగా వేలంలో ఎంత పలికిందో వింటే విస్తుపోతారు.బ్రిటిష్ కళాకారిని క్లేర్ లైటన్ మహాత్మా గాంధీ ఆయిల్ పెయింటింగ్ రూపొందించారు. ఈ పెయింటింగ్ దాదాపు మూడు సార్లు రూ. 58 లక్షల నుంచి 81 లక్షలకు అమ్ముడైంది. పైగా ఇది ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆన్లైన్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడైన పోర్ట్రెయిట్గా పేరుగాంచింది. 1989లో ఆమె మరణించేంత వరకు ఈ చిత్రపటం ఆమె పేయింటింగ్ కలెక్షన్లలోనే ఉంది. ఆ తర్వాత ఆమె కుటుంబం ద్వారా ఇది అమ్మకానికి వచ్చిందట. తొలిసారిగా 1974లో గ్యాలరీ ప్రదర్శనలో ఉంచినప్పుడు..ఒక అపరిచిత వ్యక్తి ఈ చిత్రపటంపై కత్తితో దాడి చేశారట. అతడు ఒక హిందూ మితవాద తీవ్రవాదిగా ఆ కళాకారిణి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ పెయింటింగ్ ప్రత్యేకత..గాంధీజిని ప్రత్యక్ష్యంగా చూస్తూ.. గీసిన ఆయిల్ పెయింటింగ్ ఇది. 1931లో లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైనప్పుడు బ్రిటిష్-అమెరికన్ కళాకారిణి క్లేర్ లైటన్ రూపొందించారట. ఆమెకు గాంధీజిని ఒక రాజకీయ జర్నలిస్ట్ హెన్రీ నోయెల్ బ్రెయిల్స్‌ఫోర్డ్ పరిచయం చేశారట. దాంతో లైటన్ లండన్ కార్యాలయానికి వచ్చి అనేక రోజులు ఉదయాన్నే గాంధీజీని చూస్తూ చిత్రించేవారట. చెప్పాలంటే చాలా సందర్భాలలో గాంధీజీతో స్వయంగా కూర్చొని గీసే అరుదైన అవకాశ ఆ కళాకారిణి లైటన్కి లభించిందట. ఆ తర్వాత ఆ చిత్రాన్ని 1931 నవంబర్‌లో లండన్‌లోని సాక్విల్లే స్ట్రీట్‌లోని అల్బానీ గ్యాలరీస్‌లో ప్రదర్శించారట. ఆ ప్రదర్శనకు హాజరైన ఆమె స్నేహితురాలు జర్నలిస్ట్ వినిఫ్రెడ్ హోల్ట్‌బై ట్రేడ్ యూనియన్ ప్రచురణ 'ది స్కూల్మిస్ట్రెస్' పుస్తకంలో వివరించారు.ఆ పెయింటింగ్ వెనుక భాగంలో గాంధీ వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ లేఖ కూడా ఉంటుందట. ఆయన అచ్చం గాంధీ మూర్తిత్వాన్నే దింపేలా గీశారంటూ అభినందించడమే గాక, గాంధీజీ కూడా అందుకు ధన్యావాదాలు పేర్కొన్నట్లు తెలిపారు లేఖలో. గాంధీ చిత్రపటం రూపొందించడానికి ప్రతి ఉదయం మాతో గడిపినందుకు చాలా సంతోషంగా ఉందని లేఖలో రాసుకొచ్చారు. అలా ఎన్నో చిరస్మృతులకు నిలయమైన ఆ పెయింటింగ్ తమకు వారసత్వంగా వచ్చిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరణాంతవరకు ఆమె అధీనంలోనే ఉండేదని తెలిపారు. అంతేగాదు మహాత్మాగాంధీ కూర్చొని ఉన్న ఏకైక ఆయిల్ పెయింటింగ్ కూడా ఇదేనట.ఇటీవల లండన్ బోన్హామ్స్ నిర్వహించిన వేలంలో ఆశ్చర్యకరంగా రూ.1.7 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. ఇది ఒకరకంగా సుదీర్ఘ ప్రాంతం ప్రజలతో గాంధీకి ఉన్న అత్యంత శక్తిమంతమైన సంబంధాన్ని తేటతెల్లం చేసింది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అపూర్వమైన ఘట్టమని వేలం నిర్వాహకులు పేర్కొనడం విశేషం.(చదవండి: తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..) -
ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రేమకథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు అమేయా డబ్లీని ఈ లవ్‌బర్డ్స్ ప్రేమ, ప్రపోజల్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గురించి కొన్ని విషయాలను తాజాగా వివరించారు. ఆనంద్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు, ఆనంద్ ఇషాకు మహాబలేశ్వరంలో ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని అమేయా ఇలా వివరించారు. అజయ్ భాయ్ పిరమల్, స్వాతి జీ పిరమల్ చాలా సంవత్సరాల నుండి తెలుసు. "రేపు మీరు మహాబలేశ్వర్ రావాలి అని రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసారు. కొంతమంది అతిథులు సాయంత్రం మా ఫామ్‌హౌస్‌లో ఉంటారు. వారికోసం బ్రీఫ్ 'డాన్సింగ్ అండర్ ది స్టార్స్',అనే థీమ్‌పై ఒక కచేరీ చేయాలి’ అని అడిగారు. ఉదయం సాఫ్ట్ మ్యూజిక్ ,మధ్యాహ్నం ఎనర్జిటిక్ నంబర్లను ప్లే చేయమన్నారు. మరుసటి రోజు, స్వాతి జీ కూడా కాల్చేశారు. కోకిలా ఆంటీ, ముఖేష్ భాయ్, నీతా భాబీ , మిగతా అందరూ ఇంటికి వస్తున్నారని చెప్పారు. ఇది గుజరాతీ ,మార్వాడీ కుటుంబాల కలయిక కాబట్టి, బాలీవుడ్ కూడా పాటలు కూడా ఉండొచ్చుఘూమర్ లాగా అన్నారు. అన్నట్టు, వాళ్లు బాలీవుడ్ అభిమానులు, షారుఖ్ ఖాన్ వాళ్ల ఫ్యావరెట్ హీరో’’ అని చెప్పారని తెలిపాడు.సింగర్ : అమేయ డబ్లీకానీ ఈ వేడుకు ఆనంద్, ఇషాల ప్రపోజల్గురించి తెలియదనీ, వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని లేదా వివాహం చేసుకోబోతున్నారని చెప్పలేదు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజు,ఆనంద్, ఇషా ఒక ఆలయంలో ప్రపోజ్ చేశారని అమేయా గుర్తు చేసుకున్నాడు. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ 2016 నుంచి డేటింగ్లో ఉండి రెండేళ్ల తరువాత 2018లో వివాహం చేసుకున్నారు.ఇషా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె. 2022లో వీరికి కవలలు పుట్టారు. ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇషా రిలయన్స్ జియో , రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియడ్ని పెళ్లాడింది! -
అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియుడ్ని పెళ్లాడింది!
25 ఏళ్ల అవిభక్త కవలల్లో ఒకరైన కార్మెన్ ఆండ్రేడ్ (Carmen Andrade )న చిరకాల ప్రియుడు డేనియల్ (Daniel McCormack, 28)ని వివాహ మాడింది. గత ఏడాది అక్టోబర్‌లో తామిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టామని వెల్లడించిఅభిమానులను ఆశ్చర్చపరిచారు. తన ప్రియుడు డేనియల్ మెక్కార్మాక్ను అక్టోబర్ 2024లో వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారాకార్మెన్ వెల్లడించింది. ఇరు కుటుంబాల సమక్షంలోవివాహం చేసుకున్నారు.డైలీ మెయిల్ ప్రకారం, డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్న ఈ జంట నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. తరువాత కనెక్టికట్‌లో న్యూ మిల్‌ఫోర్డ్‌లోని లవర్స్ లీప్ బ్రిడ్జ్‌లో ఉంగరాలు మార్చుకున్నారు. ‘ఓవర్‌డ్యూ అప్డేట్' అంటూ తమ పెళ్లి కబురును అందించింది కార్మెన్. View this post on Instagram A post shared by Daily Mail (@dailymail)పెళ్లి దుస్తుల్లో ఒక వీడియోను షేర్ చేసింది కార్మెన్ కొత్త వధువు తన షేర్ వీడియోలో వెడ్డింగ్ రింగ్‌ను చూపించింది, అలాగే ఇపుడు నేను భర్తని అంటూ వరుడు-డేనియల్ కూడా ఈ వీడియోలో జతయ్యాడు. నల్లటి టక్సేడో ధరించిన డేనియల్‌తో పోజులివ్వగా వధువు కార్మెన్ సాంప్రదాయ తెల్లటి వివాహ దుస్తులకు బదులుగా గ్రీన్ గౌను ధరించింది. తనకు తెల్లని దుస్తులు నచ్చవని తెలిపింది. నాకు పెళ్లికాలేదుఅయితే మరో కవల లుపిటా తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. “ఎందుకంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు,” అని ఆమె ప్రకటించింది. మరోవైపు ‘అమెరికాకు ఇష్టమైన జంట’ పోటీలో ఈ జంట కూడా ముందు వరుసలో ఉన్నారని, ప్రస్తుతం వారు 9వ స్థానంలో ఉన్నారని డైలీ మెయిల్ తెలిపింది. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా కార్మెన్ ఆండ్రేడ్, లుపిటా సోదరీమణులు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఇద్దరికీ వారి యూట్యూబ్ , టిక్‌టాక్ హ్యాండిల్స్‌లో మంచా ఫాలోయింగ్ ఉంది. ఈ కవలలు మెక్సికోలో జన్మించారు. ఎవరి గుండెవారిదే, ఊపిరితిత్తులు ఇద్దరికీ వేర్వేరుగా ఉన్నాయి. వారి అవయవాలు ఛాతీ నుండి కటి వరకు కలిసి ఉంటాయి. భావోద్వేగాల పరంగా ఇద్దరు భిన్నంగా ఉంటారు. ఇద్దరు సోదరీమణులకు ఎండోమెట్రియోసిస్ ఉంది, కానీ హార్మోన్ బ్లాకర్లు తీసుకుంటారట, ఫలితంగా, గర్భం దాల్చడం అసంభవమని కార్మెన్ గతంలో వెల్లడించింది. ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
సోషల్ ట్రెండ్స్..! జంతుప్రేమికులు ఇష్టపడేలా..
మొన్న గిబ్లీ ఆర్ట్.. నిన్న బేబీ పాడ్‌కాస్ట్.. నేడు ‘యానిమల్ వ్లాగ్’, అవెంజర్స్, హల్క్ విడియోస్.. ఇలా సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐ ట్రెండింగ్ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్‌కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్ ట్రావెలింగ్‌తో చేసే వ్లాగ్ వీడియోస్ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. సోషల్ మీడియాలోని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లతో పాటు అన్ని యాప్‌లలో యానిమల్ వ్లాగ్, అవెంజర్, హల్క్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్‌జీపీటీ యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్ వ్లాగ్‌గా మార్చేస్తున్నారు. (చదవండి: చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..) -
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ
‘‘బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు" వీరి నిజ జీవిత ప్రేమగాథ ఇది సోషల్ మీడియా ద్వారా మొదలై, సరిహద్దులు దాటిన ప్రేమగా నిలిచింది. తొలి చూపులోనే ఏదో తెలియని ఆకర్షణ, సప్త సముద్రాల అవల ఉన్నా చేరువ కావాలనుకున్నారు. నా ప్రతి శ్వాసవి నువ్వే..అన్నట్టు ఊసులాడుకున్నారు. కట్ చేస్తే.. ఇదే అందమైన ప్రేమకథగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదండి ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన పోస్ట్ ప్రకారం సోషల్ మీడియా ద్వారానే లవ్‌బర్డ్స్ బెంగళూరుకు అబ్బాయి, అమెరికా అమ్మాయి పరిచయం, ప్రేమకు దారితీసింది.. ప్రతీక్షణం టచ్‌లో ఉన్నారు ఒకరి అభిప్రాయాలను పంచుకున్నారు. వీడియో కాల్స్ వర్చ్యవల్ డిన్నర్స్. ఇక విడిగాబతకలేమని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చేసింది. ఆఅబ్బాయి పేరే దీపక్. అమ్మాయిపేరు హన్నా. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆర్టిస్ట్ దీపక్ 2023, ఏప్రిల్‌లో ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళినప్పుడు హన్నా అమ్మాయిని చూశాడు. తొలిచూపులోనే హన్నాపై ఇష్టం పెంచుకున్నాడు. మొత్తం మీద ధైర్యం చేసి మాటకలిపాడు. ముంబైలో ఆ కాసేపటి పరిచయంతో ఆశ్చర్యంగా ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. తమ స్నేహం కేవలం ఆకర్షణ కాదు అంతకుమించి అని దీపక్ ఫిక్స్ అయిపోయాడు. మనుషులు దూరమైనా..మనసులు దగ్గరే!ఇంతలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా, వారి కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగలేదు. రోజువారీ సందేశాలు, తరచు కాల్స్, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేశాయి. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తన భావాలతో కూడిన భావోద్వేగ పెయింటింగ్‌ను అందించాడు. అంతే ఆమె కూడా ఫిదా అయిపోయింది.కానీ హన్నా అమెరికాకు వెళ్లిపోయింది. ఆ దూరం వారిద్దరి మధ్యా ప్రేమ మరింతపెరిగింది. చివరికి దీపక్ తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. హన్నా ఫోటో చూడగానే తల్లి తక్షణమేఅంగీకరించింది. అటు హన్నా కూడా తన ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ పరస్పరం అంగీకరించారు.ఒక సంవత్సరం తర్వాతఫిబ్రవరి 2024లో తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చింది హెన్నా. విమానాశ్రయంలో ఆత్మీయంగా హెన్నాను ఆలింగనం చేసుకున్న క్షణం ఇక విడిచి ఉండటం కష్టమని నిర్ణయించు కున్నారు. ఆ హగే వారి జీవితంలో కీలక నిర్ణయానికి నాంది పలికింది. అదే ఏడాది జూలై 26న అందమైన ఎర్రచీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైంది హన్నా. సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ అపురూపంగా పెళ్లి చేసుకున్నారు.జీవితంలో మొదలైన అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒకరి ప్రపంచంలో ఒకరిగా మారిపోయారు. దీపక్ తల్లి హన్నాకు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంటే, హన్నా పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది. ఈ ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాలను కలయిక. వీరి అందమైన లవ్‌స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమ పెళ్లికి దేశం, ప్రాంతం, భాషా ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించారు. దీపక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 93 వేలకు పైగా అనుచరులు ఉన్నారు. -
ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!
భూమిపై అంగరంగ వైభవోపేతంగా వివాహాలు చేసుకోవడం చూశాం. ఇంకాస్త ముందుకెళ్తే..కొందరూ నీటి అడుగున వివాహం చేసుకున్న తంతును కూడా చూశాం. కానీ ఈ దంపతులు ఆకాశంలోనే మా పెళ్లి జరగాలని ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాహ్ ఏం వెడ్డింగ్ రా ఇది అని అంతా అనుకునేలా అంగరంగ వైభవంగా జరిగింది.ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్సర్ సామ్ చుయ్ తన పెళ్లి వేలాది అడుగుల ఎత్తులో ఆకాశంలో జరగాలని కోరుకున్నాడు. అందుకోసం అని ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం (FJR)లో చార్టర్డ్ బోయింగ్ 747-400 విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఎంచక్కా తన భార్య ఫియోనా, కొందరు దగ్గరి బంధువుతో కలసి విమానం ఎక్కి ఒమెన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించారు. ఆ విమానంలో ముఖ్యమైన అతిథుల సమక్షంలో చుయ్ తన కాబోయే భార్య ఫియోనాని పరిణయమాడాడు. వాళ్లంతా ఆ జంటను అభినందిస్తూ..చుట్టూ చేరి ఆడుతూ, నృత్యం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆకాశమే హద్దుగా పెళ్లి చేసుకున్న ఈ జంట మరో నింగిని తలపించేలా తెల్లటి దుస్తులే ధరించడం విశేషం. ఈ వివాహ వేడుక మా జీవితాల్లో అత్యుత్తమమైన రోజుగా అభివర్ణిస్తూ..అందుకు సంబంధించిన వీడియోకి "మా ప్రేమ గాలిలో ఉంది. మా 747 స్కై వెడ్డింగ్ ఫ్లైట్‌కు స్వాగతం. మా ఇద్దరికి జీవితకాల జ్ఞాపకాలు" అనే క్యాప్షన్‌ని జత చేస్తూ నెట్టింట షేర్ చేశారు. కాగా సింగపూర్ ఎయిర్‌లైన్‌కి సంబంధించిన ఈ బోయింగ్ 747 విమానం జూలై 12, 2025న ఒమన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించి, రాత్రి 8 గంటలకు ఫుజైరాకు తిరిగి వచ్చింది. View this post on Instagram A post shared by Sam Chui (@samchui) (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత
ఆ బడి రాజుల పాలన చూసింది. స్వాతంత్య్ర సంగ్రామ నినాదాలు విన్నది. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన సందర్భానికి సాక్షిగా నిలిచింది. ప్రజాస్వామ్య యుగంలో తొలిసారి ఓటరుగా మారిన మందస వాసులకు వేదికనిచ్చింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేలాది మంది మేధావులకు పురుడు పోసింది. 125 ఏళ్లుగా విజ్ఞాన కాంతులు వెదజల్లుతూనే ఉంది. మందసలోని శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాల వైభవమిది. మందస రాజుల సుందర స్వప్నంగా ప్రారంభమైన పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్ప బలంతో పూర్వ వైభవం సాధించింది. మందస: మందసలోని ఎస్‌ఆర్‌ఎస్‌ఎం జెడ్పీ ఉన్న త పాఠశాల 125 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతోంది. జమీందారుల పాలనలో పురుడు పోసుకున్న ఈ బడి ఈనాటికీ పచ్చగా విరాజిల్లుతోంది. 1901 మే 16న ఆనాటి గంజాం కలెక్టర్ హెచ్డీ టేలర్, మందస జమీందారు వాసుదేవ రాజమణిదేవ్ ఈ పాఠశాలకు పునాది వేశారు. నాటి శిలాఫలకం నేటికీ ఈ బడిలో భద్రంగా ఉంది. వాసుదేవ రాజమణిదేవ్ తర్వాత శ్రీనివాస రాజమణి దేవ్ పాలన సాగించా రు. ఆయన 30 ఏళ్ల పాటు ఈ బడిని బ్రిటిష్ పరం కాకుండా కాపాడారు. 1930లో ఆయన చనిపోయాక.. 1932 సెపె్టంబర్ 21న స్కూల్‌ను ప్రభుత్వ పాఠశాలగా గుర్తించి శ్రీ రాజా స్కూలును శ్రీ రాజా శ్రీనివాస రాజమణిదేవ్ మెమోరియల్ బోర్డు హైసూ్కల్‌గా మార్చారు. నాటి గంజాం జిల్లాలో ఇది రెండో హైస్కూల్ కావడం విశేషం. ఎన్నెన్నో అనుభవాలు.. వందేళ్లకుపైబడిన ప్రస్థానంలో మందస హౌస్కూల్ ఎన్నో అనుభవాలు మిగిల్చింది. ప్రధానంగా ఈ పాఠశాల ముందరి భవనం ఓ జ్ఞాపికగా మారింది. వందలాది తుఫాన్లను తట్టుకుని ఈ భవనం నిలబడింది. రాజులు కట్టించిన భవంతుల్లో ఇది మాత్ర మే మిగిలింది. ఇక్కడ చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మండల వ్యాప్తంగా దశాబ్దాల పాటు ఈ పాఠశాల పెద్ద దిక్కుగా ఉండేది. బడి వదిలితే సాయంత్రం పూట మందస పట్టణమంతా కళకళలాడేది. పూర్వ విద్యార్థుల ఔదార్యం కాలక్రమేణా పెంకులు ఊడిపోయిన దశలో ఐకానిక్ భవనం అందవిహీనంగా మారడం పూర్వ విద్యార్థులను కలిచివేసింది. ఎంతో వైభవం కలిగిన ఈ భవనాన్ని ఆ దశలో చూసి విద్యార్థుల గుండెలు చివుక్కుమన్నాయి. అంతే.. అంతా కలిశారు. ప్రభుత్వ సాయం కోరకుండా, అధికారుల కోసం ఎదురు చూడకుండా ఎవరికి తోచినంత డబ్బు వారు విరాళాల రూపంలో పోగు చేసుకున్నారు. బ్యాచ్‌ల వారీ గా పోటీ పడి మరీ స్కూలు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి వారో వా ట్సాప్ వేదికగా ఒక్కటయ్యారు. దాదాపు రూ.27 లక్షలు సేకరించి ఐకానిక్ భవనానికి మళ్లీ కొత్త ఊపిరి పోశారు. అ‘పూర్వ’ సమ్మేళనానికి సై.. భవన పునరి్నర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 19, 20 తేదీల్లో భవనాన్ని పునఃప్రారంభిస్తూ 125 ఏళ్ల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ చేయడం మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత పాఠశా ల భవనాన్ని 19వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని, మరుసటి రోజు ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. -
వృత్తి పోలీసు.. హాబీ మాత్రం: ఇంట్రస్టింగ్ స్టోరీ
డిచ్పల్లి: అతడి వృత్తి పోలీసు.. ప్రవృత్తి వివిధ దేశాల నాణేలు.. కరెన్సీ, స్టాంపుల సేకరణ. ఈ సేకరణలో అతడి భార్య సహకారం ఎంతో ఉంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో గుట్ట గంగాధర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గంగాధర్ భార్య త్రివేణి గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇద్దరికీ స్టాంపులు, నాణేలు, కరెన్సీల సేకరణ అంటే ఇష్టం. ఈ దంపతుల కుటుంబ సభ్యులలో పలువురు విదేశాలకు వలస వెళ్లారు. వారి ద్వారా అక్కడి దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. అలాగే స్నేహితులు, తెలిసిన వారి ద్వారా వివిధ దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. ఇలా 2003 నుంచి 23 దేశాల నాణేలు, కరెన్సీతో పాటు 25 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. సేకరించిన నాణేలలో కాకతీయుల కాలంతో పాటు 1939 సంవత్సరం నిజాం కాలం నాటి నాణేలు, రూపాయలు ఉన్నాయి. వీరు సేకరించిన నాణేలు, కరెన్సీలలో భారతదేశంతో పాటు యూఎస్ఏ, యూకే, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, జోర్డాన్, టర్కీ, ఇటలీ, పొలాండ్, ఫిలిఫ్సీన్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇండోనే షియా, ఖతర్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందినవి ఉన్నాయి. ఇదీ చదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!స్టాంపులలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, టర్కీ, మాల్టా, సింగపూర్, ఈజిఫ్ట్, ఫిలిఫ్పిన్స్, ఇటలీ తదితర దేశాలవి ఉన్నాయి. వీటి సేకరణ కోసం గంగాధర్ దంపతులు చాలా మంది వ్యక్తులను కలిశారు. పోలీసు ఉద్యోగం రాకముందు గంగాధర్ కూడా ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు. అప్పుడే ఆయనకు ఈ సేకరణపై ఇష్టం ఏర్పడింది. గత చరిత్ర, పాలకుల వైభవాలకు గుర్తు అయిన కాకతీయ, నిజాం కాలం నాటి నాణేల సేకరణతో మొదలు పెట్టాడు. ప్రస్తుతం తమ ఇంటికి ట్యూషన్‌కు వచ్చే బాల, బాలికలకు వీటి గురించి వివరిస్తారు. -
బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు
విజయనగరం అర్బన్ బొబ్బిలి: ఇప్పటికే దేశ విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణ (Bobbili Veena) కు మరో అరుదైన గుర్తింపు లభించింది. వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద బొబ్బిలి వీణ బహుమతికి ఎంపికైంది. ఓడీఓపీ అవార్డుకు రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా మన బొబ్బిలికి చెందిన నమూ నా వీణ ఎంపిక కావడం జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త ఢిల్లీ ప్రగతి మైదానంలో భారత్ మండపంలో సోమ వారం జరిగే కార్యక్రమంలో ఓడీఓపీ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు బొబ్బిలి వీణకు దేశ విదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. బొబ్బిలి వీణ అని విస్తృతంగా పిలువబడే బొబ్బి లి నుంచి వచ్చిన సాంప్రదాయ ’సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే సరస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణను బహుమతిగా జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఈ వీణను చూసి ముచ్చటపడ్డారు. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి, బాడంగి మండలం వాడాడ వీణల తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. వీణల తయారీ ఒక అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాల్లో దాదాపు 300 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వీణల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వీటి తయారీకి పనస మరియు సంపంగి కలప, చెక్కకు ఉపయోగిస్తారు. వీణల తయారీకి కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఓడీఓపీ కింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు. -
గామా నైఫ్‌తో రేడియో సర్జరీ
యురేనియం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక శక్తి గల పదార్థం రేడియం. ఈ రెండు పదార్థాలు అప్రయత్నంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఉంటాయి. వీటిలో గామా కిరణాలు ఎక్కువ శక్తి కల్గి ఉంటాయి. ఈ మూలకాల ధర చాలా ఎక్కువ. 1935లో ఎర్నెస్ట్ లారెన్స్ కృత్రిమ రేడియో ధార్మిక పదార్థం రేడియో సోడియాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇటువంటి రేడియో ధార్మిక పదార్థాలు వెయ్యికి పైగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ గామా కిరణ జనకాలే.ఈ విశాల విశ్వంలో నక్షత్రాల విస్పోటనం వల్ల గామా కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి భూమిని చేరకుండా ఆకాశంలో ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఈ గామా కిరణాలు భూమిని జేరి మనిషి మీద పడితే అవి పడే డోసును బట్టి మనిషి రకరకాల ఆపదలకు గురవుతాడు.ఎక్స్ కిరణాలకన్నా గామా కిరణాలకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ. సులువుగా ఈ కిరణాలు ఎదిగే మొక్కల అంతర్భాగంలోకీ, జంతువుల ధాతువుల్లోకీ దూసుకుపోగలవు. గామా కిరణాలు మొక్కల మీద పడితే అవి వేగంగా ఎదుగుతాయి, దిగుబడి పెరుగుతుంది. పొలాల్లో పంట లను నాశనం చేసే ఎలుకలు ఈ కిరణాల ధాటికి మరణిస్తాయి. మొక్కలకు వచ్చే చీడ, పీడ, పురుగులు, తెగుళ్లు ఈ గామా కిరణాల తాకిడికి దరిజేరవు. మనిషి తట్టుకోలేని ఈ కిరణాలను ధాన్యం తట్టుకోగలదు. పంట పొలాలపై ఈ కిరణాలు పడటం వల్ల పంట కాల వ్యవధి తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది. పంట నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. ఇంకా ప్రయోగ దశలోఉన్న ఈ విధానం రైతులకు అందుబాటులోకి రావాల్సి ఉంది.మెదడు లోని కణితులు, గాయాలు, ధమనుల వైఫల్యాలు, ట్రెజిమినల్, న్యూరల్జియా, ఇతర పరిస్థితులకు చికిత్స చేయడంలో ‘గామా నైఫ్’ అనే పరికరం సహాయ పడుతుంది. ఇది కోబాల్ట్ –60 రేడియేషన్ మూలాల నుండి వచ్చే గామా కిరణాలను ప్రత్యేకమైన పద్ధతిలో కేంద్రీకరించి నిర్దిష్ట ప్రాంతాలకు పంపడంలో సహకరిస్తుంది. దీని సహాయంతో కచ్చితమైన మోతాదులు వైద్యుడు పంపగల్గుతాడు. రోగికి సమస్య ఉన్న స్థానం, గాయం రకం, ప్రక్రియ సమయంలో రోగి సాధారణ ఆరోగ్యం, ఇతర కారకాలపై గామా నైఫ్ విజయం ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇది మెదడులోని సమస్యలను సరి చేయగల ఒక సాంకేతికత. చికిత్సలో భాగంగా రోగి తల కదలకుండా ఒక ఫ్రేమ్ కట్టి గామా కిర ణాలు ఎక్కడ పడాలో పర్యవేక్షిస్తారు. రోగికి నొప్పి లేకుండా, మెలకువగా ఉండగానే కొన్ని గంటల్లో ఈ చికిత్స పూర్తి అవుతుంది. శరీరంపై ఎటువంటి కోతలు ఉండవు.గామా కిరణాలు ప్రభావిత ప్రాంతాలకు అధిక మోతాదులోనే వెడతాయి. చుట్టుపక్కల కణజాలానికి తక్కువ హాని మాత్రమే జరుగుతుంది. ఈ చికిత్స వైద్యుడు మాత్రమే నిర్వహించాలి. రోగులు ఈ చికిత్స పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఈ చికిత్స అనంతరం కొంతమందికి కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. తల నొప్పి, వికారం, వాంతులు, తిమ్మిర్లు, చుట్టుపక్కల జుట్టు రాలిపోవడం, బలహీనత, దృష్టి సమస్యలు రావచ్చు. ప్రతి సమస్యకు వైద్యుని సలహా మేర మందులు వాడితే పరిష్కారం లభిస్తుంది.-డా. సీ. వీ. సర్వేశ్వర శర్మ కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు -
‘ఎవరెస్ట్’ పేరు వెనుక ఉన్న కథ తెలుసా?
పిల్లలూ.... మనందరికీ ఎవరెస్టు శిఖరం తెలుసు. హిమాలయాల్లో అన్నింటి కంటే ఎత్తయిన శిఖరం, ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్. కాని అది ఒక వ్యక్తి పేరు. ఎత్తయిన శిఖరానికి తన పేరు పెట్టేంత గొప్పవాడైన ఎవరెస్ట్ ప్రముఖ బ్రిటిష్ సర్వేయర్, జియోడెసిస్ట్, జియోగ్రాఫర్, రాయల్ సొసైటీ సభ్యుడు (George Everest)ఎవరెస్ట్ 1790 జూలై 4 న గ్వెర్న్ వేల్ లో జన్మించాడు. ఆయన ఇంగ్లాండులోని మిలిటరీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి చేరుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో 1806లో చేరాడు. ఏడు సంవత్సరాలు బెంగాలులో పనిచేశాడు. జావా సర్వే పనిలో 1814 నుండి 1816 వరకు పని చేశాడు. తర్వాత అతను భారత దేశ గ్రేట్ త్రికోణమితి సర్వే Great Trigonometrical విలియం లాంబ్టన్కు సహాయకుడిగా నియమించబడ్డాడు. భారతదేశపు అత్యంత చివరి దక్షిణ బిందువు కేప్ కొమరిన్ నుండి నే΄ాల్ వరకు దాదాపు 2,400 కిలోమీటర్ల (1,500 మైళ్ళు) దూరంలో ఉన్న మెరిడియన్ ఆర్క్ (Meridian Arc)ను సర్వే చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఎవరెస్ట్. ఆయన తన కాలంలోని అత్యంత ఖచ్చితమైన సర్వే పరికరాలను ప్రవేశపెట్టి సర్వే పని ఖచ్చితత్వాన్ని పెంచాడు. 1865లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఎవరెస్ట్ గౌరవార్థం శిఖరం పేరును ఎవరెస్ట్ గా మార్చింది. ఆ పర్వతానికి చాలా స్థానిక పేర్లు ఉన్నందున కన్ఫ్యూజన్ లేకుండా ఎవరెస్ట్ పేరును ప్రతి΄ాదించింది. అలా ఎవరెస్ట్ పర్వతానికి ఎవరెస్ట్ పేరు స్థిరపడింది.ఆయన పేరే ‘ఎవరెస్టు’కు పెట్టారు -
యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు! -
భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ మలేషియాలోని ఒక భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. ఆశీర్వాదం నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, అనుచితంగా తాకాడని ఆరోపించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన గత నెలలో మలేషియాలోని సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో జరిగింది. దీంతో నెట్టింట ఎవరీమె అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ లిషల్లిని కనారన్ తెలుసుకుందామాం.లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేతగా నిలిచింది. ఆమె టీవీ నటి, మోడల్. మలేషియాలోని సెలంగోర్కు చెందిన లిషల్లిని యూనివర్సిటీ తుంకు అబ్దుల్ రెహమాన్ (UTAR)లో ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాలేజీ విద్యార్థినిగా ఉన్నపుడే మిస్ గ్రాండ్ సెలంగోర్ 2020 టైటిల్ గెలుచుకుందిట. ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత, లిషా పేదరికం , పిల్లల విద్య కోసం పనిచేయాలని భావించింది. అలాగే 2023లో విడుదలైన మలేషియా టీవీ సిరీస్ జీయుమ్ నీయుమ్లో కనిపించింది. స్థానిక ప్లాట్‌ఫామ్ ఆస్ట్రో విన్మీన్లో ప్రసారం అవుతున్న థిగిల్ అనే వెబ్ షోలో కనిపించింది. లిషల్లినికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారుపూజారిపై ఆమె ఆరోపణలు తన తల్లి ఇండియాలో ఉండటంతో జూన్ 21న సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని లిషల్లిని చెప్పింది. ఆలయ ఆచారాలు తనకు తెలియకపోవడంతో, తాను పూర్తిగా పూజారిని నమ్మినట్టు పేర్కొంది. "నేను వీటన్నింటికీ కొత్త. ఆచారాల గురించి పెద్దగా తెలియదు తన వేధింపుల పర్వాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. "ఆ రోజు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆశీర్వాదం కోసం తన ప్రైవేట్ రూంకు పిలిచిన పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం, రక్షణ దారం అంటూ నీటిని తనపై పోశాడని వెల్లడించింది. తనను బట్టలు విప్పమని చెప్పాడని, పైగా తన మంచి కోసమే ఇదంతా చేస్తున్నాఅన్నాడని ఆమె చెప్పింది. అంతేకాదు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించినందుకు పూజారి తనను దూషించాడని కూడా వెల్లడించింది. దీంతో తాను స్తంభించి పోయాననీ, ఏం జరుగుతుందో అర్థం కాలేదని వాపోయింది. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వెల్లడించింది. మరోవైపు నిందితుడు పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అలాంటి ఇలాంటి ప్రేమకథ కాదు..!
ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. 70 ఏళ్లు పైబడ్డాక ప్రేమ అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ వృద్ధ జట ఆ వయసులో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ప్రేమకు వయసు అడ్డంకికాదు అంటే ఇదే అంటూ ఆ వృద్ధ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని త్రిశూర్‌లో చోటుచేసుకుంది. వారే విజయరాఘవన్(79), సులోచన(75). ఈ ఇద్దరి నడుమ ప్రేమ ప్రభుత్వం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిగురించింది. విజయ రాఘవన్ ఈ ఆశ్రమంలోకి 2019లో రాగా, సులోచన 2024లో వచ్చారు. ఇరువు వృద్ధాశ్రమ కారిడార్‌లో కలుసుకుని మాట్లాడుకునే వారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కేంత వకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆనందకర వేడుక కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు, నగర మేయర్ ఎం.కె. వర్గీస్ సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. ఆ దంపతులు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఫిదా అవుతూ..నిజమైన ప్రేమకు వయోభేదం ఉండదు..అది అవుధులు లేనిది అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..! ఏకంగా ప్రధాని మోదీ..) -
ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్
బాలీవుడ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఒక ఐకానిక్ స్టూడియో శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్ (Filmistan Studios) ఇపుడిక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారబోతోంది. దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత. ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్‌ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు. అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తోంది. 2026లో షురూ కానున్నఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్మెంట్లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్ఇన్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు రోడ్డున పడతారని వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని పేర్కొంది. ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ అసోసియేషన్ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
‘వత్సల’ ఇక లేదు : కన్నీటి సంద్రంలో వన్య ప్రేమికులు, సీఎం సంతాపం
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు వత్సల ఇకలేదు. 100 సంవత్సరాలకు జీవించిన ఆడ ఏనుడు వత్సల. పన్నా టైగర్ రిజర్వ్ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వత్సల హినౌటా ఎలిఫెంట్ క్యాంప్ సమీపంలో బుధవారం తుది శ్వాస విడిచింది. అటవీ కాలువ దగ్గర పడిపోయిన వత్సలను గమనించిన అటవీ సిబ్బంది, పశువైద్యులు తక్షణమే వైద్య సాయం అందించినప్పటికీ ఏనుగు ఫలితం లేకపోయింది. వయోభారంతో ఇప్పటికే బాధపడుతున్న వత్సల కన్నమూసిందని అధికారులు ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. వత్సల చనిపోలేదు - అది అడవితో ఐక్యమైంది అంటూ పలువురు వన్య ప్రేమికులు, అటవీశాఖ అధికారులు దానికి నివాళులర్పించారు. వత్సల మరణం ఒక జంతువును కోల్పోవడం కంటే ఎక్కువ. ఇది ఒక శతాబ్దం పాటు కాపలాగా ఉన్న చెట్టు కూలిపోవడం లాంటిదని సంతాపం తెలిపారు.వత్సల మరణం గురించి వార్త తెలియగానే పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది, సమీప గ్రామాల స్థానికులు, దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికులు దుఃఖం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయంలో వత్సల మృతదేహాన్ని హినౌటాలో దహనం చేశారు. ఒకప్పుడు రాణిలా తిరుగాడిన ప్రదేశంలో ఇప్పుడిక దాని జ్ఞాపకాలే మిగిలాయి. సోషల్ మీడియాలో RIP Vatsala హ్యాష్ట్యాగ్వైరల్గా మారింది. ఇదీ చదవండి : Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! కేరళ- మధ్యప్రదేశ్కేరళలోని నిలంబూర్ ఫారెస్ట్ డివిజన్లోని కేరళలోని దట్టమైన నీలాంబూర్ అడవిలో జన్మించిన వత్సల తొలుత అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తూ, దుంగల కంటే చాలా బరువైన భారాన్ని మోస్తూ గడిపింది. 50 ఏళ్లు నిండిన వయసులో 1972లో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ఆ తర్వాత 1993లో బోరి నుంచి పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అలా అప్పటి నుంచి పన్నా అభయారణ్యమే వత్సలకు నిలయంగా మారింది.Bidding a heartfelt farewell to #Vatsala, the world’s oldest known Asiatic elephant at 109 years, who passed away in Madhya Pradesh’s Panna Tiger Reserve. A gentle matriarch, Vatsala was a beloved guardian of her herd and was the soul of the reserve. She will be missed. pic.twitter.com/IrjZA32zIT— Parimal Nathwani (@mpparimal) July 9, 2025 ‘‘వత్సల మాకు గర్వకారణం" అని ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచిత టిర్కీ చెప్పారు. "మందను గౌరవంగా నడిపించింది. ప్రసవాల సమయంలో, అనుభవజ్ఞురాలైన మంత్రసానిలా దగ్గరుండి సాయం చేసింది. బలాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. వత్సల పెద్దది మాత్రమే కాదు - ఆమె మా ఏనుగు కుటుంబానికి ఆత్మ." పెద్ద ఆడ ఏనుగుగా,సహజంగా మందను నడిపించింది, పిల్ల ఏనుగులను పోషించింది అన్నారు.ఇదీ చదవండి: ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్ వత్సల మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “వత్సల రాష్ట్ర ప్రజలకు ఒక భావోద్వేగంగా మారింది. పలు తరాలకు స్నేహితురాలిగా, పిల్ల ఏనుగులకు అమ్మమ్మగా అభయారణ్యంలో ఎంతో ప్రేమగా మెలిగింది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వత్సల మరణం పన్నా టైగర్ రిజర్వ్‌కి తీరని లోటనిప్రముఖ పర్యావరణవేత్త రాజేష్ దీక్షిత్ సంతాపం తెలిపారు.2003 -2008లో, రామ్ బహదూర్ అనే మగ ఏనుగు చేసిన రెండు హింసాత్మక దాడుల నుండి వత్సల సురక్షితంగా బయటపడింది. ప్రేగులను చీల్చి,లోతైన గాయా లైన రెండు సందర్భాల్లో, ఆమె వీపును కుట్టినది వన్యప్రాణి పశువైద్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గుప్తా - 2003లో 200 కుట్లు, తొమ్మిది నెలల చికిత్సచేశారు. అయినా వత్సల ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. 2020లో, వత్సల కంటిశుక్లం కారణంగా పూర్తిగా అంధురాలైంది. అయినప్పటికీ, ఆమె అటవీ బాటలలో నడవడం కొనసాగించింది. జీర్ణ సమస్యలు, పూర్తి అంధత్వంతో కారణంగా దానికి వైద్యులు గంజి తినిపించేవారు. 1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఆమె ఖచ్చితమైన వయస్సు అధికారికంగా నిర్ధారించబడలేదు, అయినప్పటికీ, ఆమె పక్కన నడిచిన వారికి, గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. ఆమె గడిపిన జీవితం - మరియు ఆమె తాకిన జీవితాలు ముఖ్యమైనవి.1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చూసినప్పటికీ, వయస్సు అధికారికంగా నిర్ధారణ లేని కారణంగా అది మిస్ అయింది. అయితేనేం.. వత్సలకు గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. గడిపిన జీవితం చాలా ముఖ్యమైంది అంటూ కొనియాడారు అటవీ అధికారులు. -
థాంక్యూ నాన్నా..! మాజీ మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం ..
కొన్ని అరుదైన ఘటనలు కోటిలో ఇద్దరో ఒక్కరో తల్లిదండ్రులుకే అలాంటి అదృష్టం దక్కుతుంది. మనం పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మన పిల్లల చేత అందరూ గౌరవమన్ననలను అదుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ అనుకోకుండా పిల్లల ఉద్యోగ బాధ్యతల నడుమే మన తల్లిదండ్రులనే కలిసి అవకాశం లభిస్తే..ఆ ఆనందమే వేరు. పైగా సగర్వంగా వాళ్ల గురించి మనం చెబుతుంటే ఆ మాటలు వింటున్నా..లేదా ఆ అత్యున్న హోదాలో మనల్ని చూసినా..మన తల్లిందండ్రుల కళ్లల్లో ఉప్పొంగే ఆ ఆనంద క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేం. అలాంటి ఆనంద క్షణాలే ఓ మాజీ మంత్రికి దక్కాయి. నెట్టింట ఆ విషయం తెగ వైరల్ అవ్వడమే గాక కొందరికే దక్కుతుంది ఇలాంటి అదృష్టం అని అంతా కొనియాడుతున్నారు ఆ తండ్రి కూతుళ్లను. అసలేం జరిగిందంటే..చెన్నై నుంచి గోవాకు వెళ్తున్న గోవా మాజీ మంత్రి దీపక్ ధవళికర్కు అరుదైన స్వాగతం లభించింది. ఊహించని విధంగా తాను ప్రయాణించే విమానంలోనే కూతురు గౌరీ ధవళికర్ పైలట్‌గా ఉన్నారు. అది తెలుసుకున్న కూతురు గౌరీ ధవళికర్ వెంటనే ఆమె సాధారణ ప్రయాణికులను స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడుతూ..వారిలో తండ్రి కూడా ఉన్నారంటూ పరిచయం చేయడమే గాక ఈ విమాన జర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది అని ఉద్వేగంగా చెబుతుంది. "ఈ రోజు నేనే నా తండ్రితో కలిసి ఈ విమానంల ప్రయాణిస్తున్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన్ను గోవాలోని మా ఇంటికి పైలట్‌గా నేను తీసుకువెళ్తున్నా. నా తండ్రే ఇప్పుడు ప్రయాణికుడు అని ఆనందంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు." పైలట్ గౌరీ ధవళికర్. ఇలా ఆమె మాటలు పూర్తి అయ్యేలోపే.. ప్రయాణకులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు ఆ తండ్రి కూతుళ్లని. అంతేగాదు ఆ విమానంలోని ప్రయాణికులందరి సమక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. నా కలలన్నింటిన నిజంచేసేలా ఈ మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు అని చాలా భావోద్వేగంగా చెప్పారు. ఎవరీ దీపక్ ధవళికర్..గోవాలోని ప్రియోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ ధవలికర్ 2012 నుంచి 2016 వరకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని అధికార గోవా ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 1961లో పోర్చుగీస్ వలస పాలన ముగిసిన తర్వాత గోవాలో తొలి పాలక పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)కి ఆయన ప్రస్తుత చీఫ్. ఇక ఆయన సోదరుడు సుదిన్ ధవలికర్ మార్కైమ్ ఆ నియోజకవర్గం నుంచే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే గోవా మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. View this post on Instagram A post shared by Prudent Media Official (@prudentmediagoa) (చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..) -
ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..
క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్బెంచ్లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్బెంచ్లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి. సెకండరీ హయ్యర్స్కూల్కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఎందుకు?ఆ సినిమా కథ ఏమిటి?కె.ఆర్.నారాయణన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్ సి సెక్షన్లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్’. శ్రీకుట్టన్ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లంతా అల్లరి గ్యాంగ్ అని క్లాస్‌లో ఫ్రంట్ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్ స్కూల్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.1996లో కేంద్రం చెప్పినా...క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. (చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు! ) -
పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!
వధూవరులు లేని పెళ్లి గురించి విన్నారా? అసలు అలాంటి పెళ్లి అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా!సూటిగా మ్యాటర్‌లోకి వస్తే... ‘ఫేక్ వెడ్డింగ్’ అనేది యువతరంలో ఒక ట్రెండ్‌గా మారింది. మెట్రో సిటీస్‌లో ఎక్కువగా జరిగే ఈ ఉత్తుత్తి వివాహ వేడుకల్లో బ్యాండ్ బాజాలు ఉంటాయి. అతిథులు ఉంటారు. ఘన స్వాగతాలు ఉంటాయి. దండలు మార్చుకోవడాలు (మాక్) ఉంటాయి. పురోహితుడి వేదమంత్రాలు ఉంటాయి.అయితే వధూవరులు మాత్రం ఉండరు.ఢిల్లీ, బెంగళూరు, పుణేలలో ఈ ట్రెండ్ ఊపు అందుకుంటుంది. కాలేజి క్యాంపస్‌లలో, రూఫ్‌టాప్ బార్లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఫేక్ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవు. అయిదు వందల నుంచి మూడు వేల వరకు ప్రవేశ రుసుము ఉంటుంది.సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే ఈ లోకల్ ట్రెండ్ కాస్త దేశ సరిహద్దులు దాటింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్‌పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆహా’ అని కొందరు ఆకాశానికి ఎత్తుతుండగా...‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. -
ఎగిరే ఉడుతను చూశారా?
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ పారికలలో అరుదైన ఉడుత మంగళవారం దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన పాంగి చందు అనే రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో ఉడుత ఎగురుతూ అటూ ఇటూ సంచరిస్తూ పొలంలో సందడి చేసింది. ఆ దృశ్యాన్ని చూస్తుండగానే ఒక్కసారిగా గాల్లోంచి కింద పడిపోయిందని, దగ్గరకెళ్లి చూస్తే ప్రాణం లేదని చందు తెలిపాడు. విశాలమైన రెక్కలు, పొడవాటి తోకతో చూడటానికి గబ్బిలంలా ఉందని, మునుపెన్నడూ ఇలాంటి రెక్కలున్న ఉడుత (Flying Squirrel) తారసపడలేదని రైతు తెలిపాడు. శివుడ్ని దర్శించుకున్న వానరంపార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శ్రీసర్వమంగళాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోని శివుడిని మంగళవారం ఓ వానరం దర్శించుకుని తన భక్తిని చాటుకుంది. దీన్ని గమనించిన భక్తులు తమ సెల్ఫోన్లలో ఆ సన్నివేశాన్ని బంధించారు. ఆ వానరం (Monkey) శివలింగం వద్ద కొంత సమయం గడిపి అక్కడ ఉన్న ప్రసాదం స్వీకరించడాన్ని చూసిన భక్తులు పులకించారు.కలియుగంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయని, ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశులు ఏదో రూపంలో తమ భక్తిని ప్రదర్శిస్తుంటాయని శ్రీవిద్యా సర్వమంగళా పీఠాధిపతి మురపాక కాళీదాసుశర్మ యాజీ తెలిపారు. చదవండి: ఉడుతలు కూడా పగబడతాయా? -
ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్‌గా..
పాముల్లో రాజు..కాటేసిందో అంతే మటాష్ అంత భయంకరమైన పాయిజినస్ పాము కింగ్ కోబ్రా. దాన్ని చూస్తేనే భయం. అవి చాలా భయంకరమైన కారడవుల్లో ఉంటాయని విన్నాం, పలు వీడియోల్లో చూశాం. కానీ రియల్‌గా దాని సైజు ఎంత ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..వామ్మో అని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ అందుకు సంబంధించిన 11 సెకన్ల క్లిప్‌ని నెట్టింట షేర్ చేశారు. అందులో ఒక వ్యక్తి చాలా నిర్భయంగా భారీ కింగ్ కోబ్రాని ఉత్తిచేతులతో పట్టుకుని నిలబడినట్లు కనిపిస్తుంది. ఆ భారీ కింగ్ కోబ్రాని పట్టుకున్నానన్న భయం, బెరుకు లేకుండా చాలా ప్రశాంతంగా పట్టుకుని నిల్చున్న తీరు చూస్తే..వామ్మో ఏం గుండె రా నీది అని అనిపించక మానదు. ఈ వీడియోకి పర్వీన్ ఈ పాములు భారతదేశంలో ఎక్కడుంటాయో తెలుసా అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!.(చదవండి: చీర ధరించడం బాగానే ఉంది..! కానీ ఇలానా..?: వీడియో వైరల్) -
చీర ధరించడం బాగానే ఉంది..! కానీ ఇలానా..?
ఏదైనా సవ్యంగా చేస్తే అందరికీ నచ్చుతుంది, పైగా ప్రశంసలు అందుకుంటారు. అందులోనూ విలువలు, సంస్కృతుల జోలికి వెళ్లకూడదు. వాటిపై అవగాహన ఏర్పరుచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే..విమర్శలు, చివాట్లు తప్పవు. ఇక్కడొక రష్యాన్ అమ్మాయి అలాంటి పనిచేసే విమర్శలపాలైంది. రష్యన్ మహిళ మోనికా కబీర్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టర్కీలో బాగా రద్దీగా ఉండే రహదారిపై అందరూ చూస్తుండగానే చీర మార్చుకుంటుంది. అయితే కొందరూ ఆమె ఏం చేస్తుందని ఆతృతగా చూడగా. మరికొందరూ ఫన్నీగా జోక్‌లు వేసుకుంటూ ఆటపట్టిస్తున్నట్లుగా చూశారు. ఆమె అలా బహిరంగంగానే చీర కట్టుకోవడాన్ని పబ్లిక్ షోలాగా ప్రదర్శించడం తట్టుకోలేక ఓ సెక్యూరిటీ గార్డు వచ్చి ఇది మంచి పద్ధతి కాదని, బహిరంగ ప్రదేశాల్లో సరైన కాదని ఆమెకు హితవు పలుకుతాడు. ఆ మహిళ ఈ వీడియోకి 'నమస్తే టర్కీ' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేసింది. చక్కగా ఎర్రటి చీరలో అందంగా కనిపించినప్పటికీ..ఆమె మసులకున్న తీరు నెటిజన్లకు ఆగ్రహాం తెప్పించింది. చీర ధరించాలనుకోవడం వరకు కరెక్టే..కానీ ఇలా చేయడం పద్ధతి కాదు.భారతీయతకు చిహ్నమైన చీరను, దాని సంస్కృతిని అవమానిస్తున్నట్లుగా ఉంది నీ ప్రవర్తన అని మండిపడుతూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. ఇక ఈ ఇన్ఫుయెన్సర్ స్వతహాగా ఢాకా నివాసి అని, ఇటీవలే టర్కీ సందర్మించనప్పడూ ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Monica Kabir (@monica_kabir_) (చదవండి: అక్కడ అంతటి గౌరవమా..! భారత సంతతి మహిళ అనుభవం) -
ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్ కోబ్రానే..
మనం సాదాసీదాగా చూసే పాములు వాటి తీరుతెన్నులపై ఓ అవగాహన ఉంటుంది. అదే భారీ కింగ్ కోబ్రా.. ఎంత చురుగ్గా కదులుతుందో తెలిసిందే. కనిపిస్తేనే హడలిపోయి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఆ కోబ్రానే ఓ అటవీ అధికారిణి ఏ మ్రాతం భయం, బెరుకు లేకుండా పట్టుకున్న విధానం చూస్తే..వామ్మో అనిపిస్తుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేయడంతో నెట్టింట ఈ ఘటన వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పరత్తిపల్లి రేంజ్‌కు చెందిన అధికారి జీఎస్ రోష్ని ఒక చిన్న కాలువ ప్రవాహం వద్ద భారీ కింగ్ కోబ్రా సంచరించడాన్ని చూశారు. వెంటనే పాములను పట్టే స్టిక్‌ని ఉపయోగించి ఆ కోబ్రాని పట్టే ప్రయత్నం చేశారు. ఆ కోబ్రా దగ్గర దగ్గర 16 అడుగుల భారీ పాము అది. అత్యంత విషపూరితమైన ఈ పాముని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆమె చాలా చాకచక్యంగా పట్టుకుని ఒక సంచిలో బంధించి మనుషుల సంచరానికి దూరంగా ఒక అటవీ ప్రదేశంలో వదిలేశారు. కేరళ అటవీ అధికారిణి రోష్ని ఇప్పటి వరకు సుమారు 800పైనే పాములను పట్టుకున్నారట. కానీ రోష్నికి ఇలా కింగ్ కోబ్రాను పట్టుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని ఆ ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్‌లో పేర్కొన్నారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నందా. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె అంకితభావానికి ప్రశంసిస్తూ..ఐఏఎస్ ఆఫీసర్లకు అటవీ అధికారులు ఏ మాత్రం తీసిపోరని, వారికంటే ఎక్కువ గౌరవాన్ని పొందేందుకు అర్హులని పోస్టుల పెట్టారు. My salutations to the green queens & the bravery shown by them in wild🙏Beat FO G S Roshni, part of Rapid Response Team of Kerala FD rescuing a 16 feet king cobra.This was the 1st time she was tackling a king cobra though she is credited to have rescued more than 800 snakes… pic.twitter.com/E0a8JGqO4c— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 7, 2025 (చదవండి: ట్రెండ్ 'షేరెంటింగ్'! పిల్లల ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారా..?) -
షాకింగ్.. హైదరాబాద్‌లో రోజుకి 8 వేల టన్నుల వ్యర్థాలు!
హైదరాబాద్ ఒక అందమైన నగరం.. ఆధునిక జీవనశైలి, అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ సంస్థలు, సినిమాలు మొదలు క్రీడల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది భాగ్యనగరం.. వెరసి టాప్ వరల్డ్ సీటీస్లో స్థానం సంపాదించుకుంది. ఐతే ఇదంతా నగరానికి ఒక వైపు మాత్రమే.. మరోవైపు నగరం ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చిక్కుకుపోతోంది. ఆధునిక జీవనశైలిపై వ్యామోహంతో పాటు సౌలభ్యం కోసం ప్లాస్టిక్‌పై అతిగా ఆధారపడే మోడ్రన్ కల్చర్ నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల సుడిగుండంలోకి తోసేస్తుంది. ఇది కేవలం నగర పరిశుభ్రత సమస్య మాత్రమే కాదు.. నగరవాసుల ఆరోగ్యం, జీవవైవిధ్యం, జల వనరుల భద్రత పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి పలు పరిశోధనల అత్యవసర హెచ్చరిక. ప్లాస్టిక్ నియంత్రించకపోతే మనం మన నగరంలోనే శ్వాస తీసుకోడానికి ప్రాణం ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఇది కేవలం భవిష్యత్తు హెచ్చరిక కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో ప్రతి రోజూ 8,000 టన్నుల వ్యర్థాలు ప్రతిరోజూ హైదరాబాద్ నగరం సుమారు 8,000 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని అంచనా. ఈ వ్యర్థాల్లో 14 శాతం పైగా ప్లాస్టిక్ ఉండటం శోచనీయం. అంటే రోజుకు సుమారు 1,120 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు. ఈ ఏడాది ముగింపునాటికి ఇది 9,000 టన్నులకు చేరనుందని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే రోజుకు 495 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చే ప్రమాదం ఉందని ఐసీఎల్ఈఐ– దక్షణాసియా సూచించింది. ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ అంతర్భాగమవుతుండగా, దాని ప్రభావాలు బయటి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. జీవరాశులకు పెనుముప్పు.. హుసేన్ సాగర్, దుర్గం చెరువు వంటి నగర సరస్సులు ఇప్పుడు సింగిల్–యూజ్ ప్లాస్టిక్‌తో నిండిపోయాయి. ఇందులో సుమారు 70 శాతం వ్యర్థాలు ప్లాస్టిక్ ఉండటం విషాదకర పరిణామం. దీంతో సరస్సుల ఇన్లెట్లు, అవుట్లెట్లు పూర్తిగా ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయి. నీటి ప్రవాహం ఆగిపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, చేపల మరణం, గాలి, నీరు రసాయనాలతో కలుషితమవ్వడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చేపలు, తాబేళ్లు, సరీసృపాలు, క్షీరదాలతో పాటు ఇతర చిన్న కీటకాల వినాశనానికి దారితీస్తోంది. జీవవైవిధ్యంపై పెను ప్రభావం.. వానాకాలం వచి్చందంటే సరస్సుల దగ్గర ఎగ్రెట్లు, హెరాన్లు, కార్మోరెంట్లు వంటి పక్షులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు ఆ జీవుల మనుగడకు పెను ప్రమాదంగా మారాయి. ఆహారంతో పాటు జీర్ణాశయంలోకి చేరి అరగించలేక మృత్యువాత పడుతున్నాయి. కొన్ని పక్షులు గూళ్లు నిర్మించేందుకు ప్లాస్టిక్ వినియోగించడంతో ఆ గూటిలోని పిల్ల పక్షులు ఈ వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు నగరంలోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్, మాదాపూర్ వాకింగ్ ట్రాక్‌ల వద్ద ప్లాస్టిక్ మింగిన పెంపుడు కుక్కలు, పిల్లుల గ్యాస్ట్రో బ్లాకేజ్, ఊపిరితిత్తుల ఇబ్బందులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది నివాసితులు స్వయంగా క్లీనప్ డ్రైవ్స్ నిర్వహించాల్సి వస్తోంది.మానవ దేహాల్లో నానో ప్లాస్టిక్.. నగరవాసులకు పెట్ బాటిళ్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ‘సేఫ్’ అనిపించవచ్చు. కానీ, వాటి నుంచి వెలువడే పాలీకార్బొనేట్స్, బిస్ఫినాల్ ఏ, యాంటిమోనీ వంటి రసాయనాలు మన హార్మోన్లను దెబ్బతీస్తాయి. పిల్లల ఎదుగుదలకు అడ్డుపడతాయని ఐఐటీఆర్, సీడీఎస్సీఓ, ఎన్‌టీహెచ్ వంటి పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాకుండా నగరవాసుల శవ పరీక్షల్లో నానోప్లాస్టిక్.. మెదడు, కాలేయం, మూత్రపిండాల్లో కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నానోప్లాస్టిక్ పరిమాణం మెదడులో సగటున 171 నానోమీటర్ల వరకూ ఉండడం పరిశోధకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటివి మానవ కణజాలాలను దాటి మన శరీర వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏం చేయాలి? హైదరాబాద్ నగర వాసులు ప్లాస్టిక్‌ను తిరస్కరించడం ఒక ప్యాషన్‌గా, బాధ్యతగా మార్చుకోవాలి. మట్టితో, కర్రతో, దారంతో చేసిన సహజ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. జీహెచ్ఎంసీ విధించే సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్లాస్టిక్ బహిష్కరణ కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పెంపొందించాలి. ప్రతి ప్రాంతంలో స్థానికులు వారం వారం లేక్ క్లీనప్ డ్రైవ్స్ చేపట్టాలి. దైనందిన జీవితంలో ప్యాకేజింగ్ ఉత్పత్తులను నివారించాలి. ప్లాస్టిక్ సంచులను, బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలి. ఇదీ చదవండి : జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది -
చాక్లెట్ డే : చాక్లెట్‌తో ఆరోగ్యం, ఇంట్రస్టింగ్ ఫాక్ట్స్
World Chocolate Day 2025: ప్రతీ సంవత్సరం జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం కోసం ఎదురు చూస్తారు. చిన్న చాక్లెట్ బార్ నుండి ఫ్యాన్సీ డెజర్ట్‌ల వరకు ప్రతి రూపంలో చాక్లెట్‌ను ఆస్వాదించాలని ఆరాట పడతారు. 1550, జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారయిందట. దీనికి గుర్తుగానే తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తోంది. అయితే చాక్లెట్ దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కో రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని మీకు తెలుసా?చాక్లెట్ దినోత్సవం తేదీ దేశాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికాలోనే కోకో వంటి సంస్థల రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశమైన ఘనాలో ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటారు. అలాగే లాట్వియాలో జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్, జూలై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి దినోత్సవాలు జరుపుకుంటారు.చాక్లెట్ ఒక ఎమోషన్యూరోపియన్లు అమెరికాను కనుగొన్న తర్వాత, చాక్లెట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సందర్భంలోనే ఒక ఎమోషన్లాగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహంలేదు. ప్రతిరోజూ ఆనందించే ఒక స్వీట్ నథింగ్‌గా ఆదరణ పొందింది.మెదడు పనితీరును మెరుగు పరచడంతోపాటు, చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలున్నాయి. చాక్లెట్లో అధిక కొవ్వు , చక్కెర కంటెంట్ ఉండటం వల్ల చాలా ఒత్తిడికి చెక్ చెబుతుందట. గుండె జబ్బులు , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు తెలిపాయి.చాక్లెట్లో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, చాక్లెట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదని ,జ్ఞాపకశక్తి క్షీణతను నిరోధించవచ్చని సూచించాయి . అయితే మరింత అధ్యయనం జరగాల్సి ఉందని స్పష్టం చేశాయి.డార్క్ చాక్లెట్కొకోవా కంటెంట్ ఎక్కువగా ఉన్న డార్క్ చాక్లెట్ సాధారణంగా తక్కువ చక్కెర కంటెంట్ , అధిక యాంటీఆక్సిడెంట్ స్థాయిల కారణంగా ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా ఫ్లేవనాల్స్, ఇది హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. చర్మ రక్షణను కూడా అందిస్తుంది. వయస్సు సంబంధిత మతిమరుపునుంచి రక్షణ కల్పింస్తుంది.నోట్: చాక్లెట్ తినడం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది మొటిమలు, ఊబకాయం,మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ , హైపర్‌టెన్షన్ ఉన్నవారు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతారు. చాక్లెట్లో పెద్ద సంఖ్యలో కేలరీలు ఉంటాయి, కనుక బరువు తగ్గాలని కోరుకునే వారు చాక్లెట్‌ను మితంగా మాత్రమే తినాలి. -
అప్పుడు ఆశ్చర్యపరిచాయి.. ఇప్పుడు అలవాటుగా మారింది..!
మన దేశంలో జీవించడమే మంచిది ఇక్కడే హాయిగా ఉంటుందని పలువురు విదేశీయలు భారతదేశాన్ని మెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక విదేశీయురాలు తన పిల్లలను ఇక్కడే పెంచుతానని చెప్పగా, మరొకరు ఇక్కడ జీవిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ విదేశీ మహిళ ఏకంగా మన భారతీయుల అలవాట్లు నచ్చాయి, వాటికి అలవాటు పడిపోయాను అని చెబుతుండటం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ వైరల్ మారింది. మరి ఇంతకీ ఆమె అనుసరిస్తున్న భారతీయ అలవాట్లు ఏంటంటే..బెంగళూరులో నివశిస్తున్న కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా అనే రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల గురించి షేర్ చేసుకుంది. మొదట్లో ఆ అలవాట్లు చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో భాగమైపోయానని చెప్పుకొచ్చింది. పైగా వాటిని తాను కూడా పాటిస్తున్నానని చెప్పడం విశేషం. అందుకు సంబంధించిన మొత్తం ఎనిమిది అలవాట్లను లిస్ట్ ఔట్ చేసింది. అవేంటో వరసగా చూద్దామా..! ఈ అలవాట్లు వింతగా ఉన్నప్పటికీ, తన దినచర్యలో భాగమై కొండంతా సంతోషాన్ని మద్దతుని ఇస్తున్నాయని అంటోంది యులియా. ఇంతకీ అవేంటంటే..అత్తమామలతో జీవించడం: ఇంటిని తాను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదొక వరంలా భావిస్తోందామెచేతులతో తినడం: ఇది ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఉందంటోంది. పైగా ఇలా తింటేనే ఆహారం రుచిగా అనిపిస్తోందట. కొంచెం ఆలస్యమైనా పట్టించుకోను: ఎవరైనా వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా..అందుకు తగ్గట్టుగా తాను ఇతర పనులు ప్లాన్ చేసుకుంటోందట, సమస్యగా ఫీల్ కాలేదట. ఎక్కువ మంది పనిమనుషులు ఉండటం: ఇది చూడటానికి వింతగా అనిపించినా..ఇదేరాను రాను సౌకర్యవంతంగా, స్మార్ట్‌గా అనిపిస్తోందిచర్చలు: భారతదేశం నుంచి నేర్చుకున్నది ఇదే. దీన్ని సూపర్ పవర్‌గా అభివర్ణించింది.మసాలా చాయ్ తాగడం: ఈ టీ తనకెంతో మనశ్శాంతినిస్తుందట. దీన్ని ఆమె మంగోలియన్ చాయ్‌తో పోల్చారామె. ప్రేమ విలువ: భారతీయ జీవితం సినిమాలు , సంభాషణలు, ప్రేమ చుట్టూ తిరుగుతాయని చెప్పుకొచ్చింది. బహుళ భాషలు మాట్లాడటం: ఇక్కడ ఉండే బహుళ భాషలు నచ్చాయట. అలాగే త్వరలో హిందీ నేర్చుకోవాలని భావిస్తోందట.భారతీయ జీవితంలో ప్రేమ చాలా గాఢంగా ఉంటుందని, సినిమాల్లో లేదా రోజువారీ సంభాషణలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అందువల్ల ఇక్కడ ప్రతీది అద్భుతంగా ఉంటుంది. యులియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు.. భారతదేశ రియల్ స్ఫూర్తిని తెలుసుకున్నారు, స్వీకరించారు కూడా. అలాగే అత్తమామలతో కలిసి ఉండటంపై మీ అభిప్రాయం అత్యంత హర్షాతిరేకంగా ఉందంటూ యులియాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: పేరెంట్స్ త్యాగాలకు ఫలితం ఏంటో చూపిస్తున్నా..! కుమారుడి భావోద్వేగం..) -
ప్రతి బిడ్డ కల ఇది..! వీడియో వైరల్
తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్లు కోరుకున్న చదువు అందుకోవాలని ఆస్తిపాస్తులను అన్నింటిని అమ్మి, అప్పుల్లో కూరుకుపోడవడానికి కూడా సిద్ధపడతారు. అయితే పిల్లలు మంచి పొజిషన్లో సెటిల్ అయ్యాక తమ తల్లిదండ్రుల చేసిన త్యాగాలను మరవకుండా..వారిని మంచిగా చూసుకుంటే అదే పదివేలు వారికి. ఇక్కడ అలానే ఓ కుమారుడు తన తల్లిదండ్రుల త్యాగాలకు సరైన ఫలితం దక్కాలని ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. బంధాల విలులకు సరైన నిర్వచనం ఇది కదా అనిపిస్తుంది. అమిత్ కశ్యప్ అనే టెకీ తన తల్లిందడ్రులను విమానంలో లాస్ వేగాస్ తీసుకువచ్చాడు. ఎన్నడు తమ ఊరు నుంచి బయటకు రానివారు తొలిసారి కొడుకుతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. ఆ వృద్ధ తల్లిదండ్రులు విమానం కిటికీలోంచి చూస్తున్న దృశ్యాలు, వాళ్ల ముఖకవళికలను ఓ వీడియోల రికార్డు చేసి మరి షేర్ చేసుకున్నారు కశ్యప్. అలాగే లాస్ వేగాస్‌లో అడుపెట్టాక ఓ కారులో ఇరువురు రద్దీగా ఉండే వీధులు, జీవన విధానం తిలకిస్తున్న దృశ్యాలు వంటివి వీడియోలో కనిపిస్తాయి. అంతేగాదు పోస్ట్‌లో తన తల్లిదండ్రులు ఎప్పుడు ఊరి విడిచిపెట్టలేదని, అయితే పెద్ద పెద్ద కలలు కంటున్న కొడుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నారు. దాని ఫలితం వారికి అందించాలనే ఇలా చేశా అని రాసుకొచ్చారు. అంతలా మనకోసం అన్నింటిని వదులుకున్న మన తల్లిందండ్రులకు నిశబ్దంగా వారు ఊహించనిది ఇవ్వాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. నెటిజన్లు కూడా ఇది ప్రతిబిడ్డ కల అని, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@realamitkashyap) (చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..) -
ఇలాంటి ఉడుతను ఎపుడూ చూసి ఉండరు.. పగబట్టిందా?
మన చుట్టూ ఉంటూ మనతో పాటు జీవాల్లో కుక్కలు, పిల్లలు, ఆవు, గేదె, ఎద్దు, మేకలు గొర్రెలు, ఇతర పక్షులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మన ఇంటిపెరటిలో, మొక్కల్లో ఎపుడూ చెంగు చెంగున తిరిగే బుల్లి ప్రాణి గురించి మనం ఇపుడు మాట్లాడుకోబోతున్నాం. అదేనండి... శ్రీరాముడి చేతిముద్రను వీపు మోస్తూ తిరిగే ఉడుత. దీనికి సంబంధిచి ఒక వీడియో ఒకటి నెట్టింట సందడిగామారింది.ఉడుతలు కూడా పగబడతాయా అన్నట్టు ఉన్న వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ వీకెండ్ మూడ్‌లో సరదాగా మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేసేయండి. అయితే.. ఉడుతను తిట్టుకోకండి.. పాపం. బుజ్జి ఉడుత నవ్వుకోండి. ఎందుకంటే ఈ వీడియో ముందు కుక్క అక్కడ తిరుగుతున్న ఉడుతపై ఎగబడింది. దాంతో ఉడుతు ఏమనుకుందో ఏమోగానీ, అక్కడున్న మనిషిపై ఒక్కసారిగా దూకి నానా హంగామా చేసింది. ఆ తరువాత వదల బొమ్మాళి అన్నట్టు కుక్కను కాసేపు కంగారు పెట్టింది. డోర్ బెల్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో దాదాప 12 మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకుంది అదంతా భయపడేతప్ప, ఉడుత తప్పేమీ లేదంటున్నారు నెటిజన్లు.Doorbell camera catches man getting attacked by a squirrel. Have you ever seen a squirrel like this? pic.twitter.com/l2eISJYdQC— AmericanPapaBear (@AmericaPapaBear) July 2, 2025 > ప్రకృతిలో చాలా ప్రాణులు మనతోపాటు జీవనం సాగిస్తుంటాయి.కొన్ని మనకు కనిపించనంత సూక్ష్మంతో ప్రకృతిలో మమేకమై ఉంటాయి. మరికొన్ని మనతోపాటే, మన చుట్టూనే ఉంటాయి.మనతో స్నేహంగా ఉంటాయి. మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. పర్యావరణ సమతుల్యతో తమవంతు పాత్ర వహిస్తుంటాయి. సాధారణంగా మనుషులు తప్ప ఏ ప్రాణీ అకారణంగా ఎవరిమీదా దాడి చేయదు. ఆహారం కోసం, తమకు హాని కలుగుతుందని భావించినపుడు, తమ మీద దాడి చేస్తున్నారని భయపడినపుడు మాత్రమే మనుషులను మీదికి ఎగబడతాయి. ఇందులో పాములకు కూడా మినహింపేమీ కాదు. నిజానికి పాములు చాలా పిరికివట. -
భగీరథ పగిలింది..బావి నిండింది
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో మండలంలోని లక్ష్మీపూర్‌లో చొప్పదండి రాజంకు చెందిన వ్యవసాయ బావి వరదతో పొటెత్తి పొంగిపొర్లింది. రూ.2 లక్షలు వెచ్చించి తవ్వించుకున్న బావి భగీరథ నీటితో దెబ్బతిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై మిషన్ భగీరథ గ్రిడ్ ఇన్చార్జ్ ప్రశాంత్‌ను వివరణ కోరగా తాము పైపులైన్ వేసిన కింద నుంచి బావిని తవ్వడంతో పైపులైన్ దెబ్బతిని లీకేజీకి కారణమైందన్నారు. – కడెం వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకోవడం సహజమే. అయితే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతను తెలియజేస్తోంది. ఇరువైపులా ఉన్న కొండల నడుమ సాగవుతున్న వివిధ రకాల పంటలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!
సోషల్‌మీడియాలో తరచుగా ఆసక్తికర కథనాలు, విశేషాలను పంచుకునే పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ఒక ఆసక్తికర కథనాన్ని షేర్ చేశారు. యువపారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తినిచ్చేలా మైగేట్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ స్ఫూర్తిదాయకమైన కథను ఆయన పంచుకున్నారుసెక్యూరిటీ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ మైగేట్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సక్సెస్ స్టోరీని హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా సక్సెస్ ఎవరికీ అంతఈజీగా రాదు.. దానికి వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఒకపుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి ఇపుడు , కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ ఫౌండర్‌గా సీఈవోగా ఎదిగిన తీరును ఆయన వివరించారు.In 2016, IIT grad & ex-Goldman exec Abhishek Kumar became a security guard working 14-hour shifts.That experience of understanding pain points led to his creating MyGate: now in 25,000+ communities, 100M+ check-ins/month.Moral: To build for others, first walk in their shoes. pic.twitter.com/7UZSScpRaD— Harsh Goenka (@hvgoenka) July 3, 2025 r> IIT గ్రాడ్యుయేట్ , మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన కుమార్ ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా 14 గంటల షిఫ్టులు పనిచేశారని గోయెంకా వెల్లడించారు. ఆ కష్టాలు,కన్నీళ్లు, ఆఅనుభవమే తరువాత ‘మైగేట్’ పునాదిగా మారిందని హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ఏదైనా ఒక పనిచేపట్టాలంటే ముందు దానిలోని లోతుపాతులను అర్థం చేసుకోవాలన్నారు. ఎవరీ అభిషేక్ కుమార్ :సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన తర్వాత ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యారు. అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి మరియు శ్రేయాన్స్ దాగా కలిసి 2016లో మైగేట్ను ప్రారంభించారు. 2022లో, అర్బన్ కంపెనీ - అకో సంయుక్తంగా నిర్వహించిన నిధుల రౌండ్లో మైగేట్ రూ. 100 కోట్లు సేకరించింది.2024 ఏప్రిల్‌లో మైగేట్ CEOగా నియమితులయ్యారు, విజయ్ అరిసెట్టి బోర్డు ఛైర్మన్‌గా మారారు. మైగేట్ అనేది గేటెడ్ కమ్యూనిటీలకు సెక్యూరిటీ కమ్యూనికేషన్, హౌస్ కీపింగ్, ఇతర రోజువారీ సేవలను అందిస్తుంది. భారతదేశంలోని 25 వేల హౌసింగ్ సొసైటీలలో ఇప్పుడు 40 లక్షలకు పైగా జనం మైగేట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా చెక్-ఇన్లను సులభతరం చేస్తుంది.డిజిటల్ హోమ్ సెక్యూరిటీని అందించే స్మార్ట్ డోర్ లాక్‌ల శ్రేణి మైగేట్ లాక్స్ ద్వారా మైగేట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఆదాయం అంతుకుముందు ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.77 కోట్ల నుండి రూ.109 కోట్లకు పెరిగింది. 2025 ఏడాది గాను రూ. 165 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పంచుకుంది. \2016లో అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి , శ్రేయాన్స్ డాగా స్థాపించిన మైగేట్, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులకు ఏకీకృత యాప్ ద్వారా సందర్శకుల యాక్సెస్, భద్రత, నిర్వహణ,నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు బీమాసర్వీసులను అందించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి లైసెన్స్‌ను కూడా పొందింది.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా -
వాట్ ఏ టైమింగ్..? ఓ పక్క గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ మరోవైపు..
ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేసి మరి ప్రపోజ్ చేస్తుంటారు. ఎలాంటి డిస్టబెన్స్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మరి అందుకోసం ప్లాన్ చేసుకుంటారు. కాస్త ధనవంతులైతే..వారి రేంజ్‌కి తగ్గట్లుగా ఏ ఫ్లైట్ లేదా అత్యుద్భుతమైన పర్యాటక ప్రదేశంలోనో ప్లాన్ చేస్తారు. కానీ ఈ జంట ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకుందో చూస్తే నోరెళ్లబెడతారు. అమెరికాకు చెందిన బ్రైస్ షెల్టన్, పైజ్ బెర్డోమాస్లకు ప్రకృతి వైపరిత్యాలను నిలయమైన ప్రదేశాలంటే అమితా ఆసక్తి. ఆ ఇష్టంతోనే విభిన్న వాతావరణ ప్రాంతాలున్న చోటులను అన్వేషిస్తూ టూర్లు చుట్టొస్తారిద్దరు. ఇద్దరు అభిరుచులు ఒక్కటే. మంచి స్నేహితులు కూడా. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఓ మంచి టైంలో తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్కు ఆ విషయం తెలిపేలా ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.అందుకోసం 18 వారాలుగా నిరీక్షించి మరీ షెల్టన్ తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్ని సౌత్ డకోటాకు తీసుకువస్తాడు. అక్కడ షెల్టన్ సరిగ్గా ప్రపోజ్ చేస్తుండగా..తను కోరుకున్నట్లుగా హఠాత్తుగా టోర్నోడో వస్తుంది. పైగా ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు షెల్టన్. అలాంటి భయంకర ప్రకృతి వైపరిత్యం టైంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా..కానీ సరిగ్గా ఆ టైంకి ఇలా జరుగుతుందా లేదా అని చాలా భయపడ్డానని చెబుతున్నాడు షెల్టన్. ఇక్కడ షెల్టన్ చెప్పే సమయానికే ఆ టోర్నడో(సుడిగాలి) వారిని సమీపించేస్తోంది కూడా. కానీ ప్రేమకు అవేమి కనిపించవు అన్నట్లుగా మునిగిపోయారు ఇద్దరు. అతడి గర్ల్‌ప్రెండ్ సైతం ఈ సర్‌ప్రైజ్‌కి ఆశ్చర్యంతో ఉబితబ్బిబైంది.How on earth could this day ever be topped. Experienced this in South Dakota with the love of my life and now FIANCE as he proposed in the most epic way imaginable. Cannot wait to spend the rest of my life with you @BryceShelton01 ❤️😭 pic.twitter.com/YwaaLF9tMm— Paige Berdomas🌪 (@tornadopaigeyy) June 29, 2025 (చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!) -
అవును మేమిద్దరమూ విడిపోతున్నాం.. కానీ!
ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంటర్టైనర్లు ఫ్యాన్స్‌కు చేదు వార్త చెప్పారు. ఇకపై తాము విడిపోతున్నామని ప్రకటించారు సురభి-సమృద్ధి మెహ్రా (Surabhi and Samriddhi) "చింకి-మింకి" (Chinki-Minki) గా పాపులర్ అయిన ఈ బ్యూటిఫుల్ ట్విన్స్ వృత్తిపరంగా తమ దారులు వేరు అంటూ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఊహించని ఈ ప్రకటనకు ఫ్యాన్స్షాక్ అయ్యారు. దీంతో ఈ పోస్ట్ సంచలనంగా మారింది.@surabhi.samriddhiలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇన్నేళ్లుగా తమను ఆదరించి అచంచలమైన ప్రేమను పంచిన అభిమానులకు మెహ్రా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. కెరీర్లు వేర్వేరు మార్గాల్లో వెళుతున్నప్పటికీ, సోదరీమణులుగా వారి బంధం చెక్కుచెదరకుండా ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణంలో తమకు తోడుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Chinki Minki♥️ (@surabhi.samriddhi)తొలుత సురభి - సమృద్ధి ద్వయం ఆకర్షణీయమైన, ఫన్నీ షార్ట్-ఫామ్ వీడియోలదో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. సహజ ఆకర్షణ .కెమిస్ట్రీ త్వరగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ది కపిల్ శర్మ షోలో కామెట్ స్కిట్లకు పాపులర్ అయిన ఈ సోదరీమణులు ఎంతో మందిఅభిమానులను సంపాదించుకున్నారు. వారి కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూంత అభిమానాన్ని చూరగొన్నారు.ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ఈ ప్రకటనపై నెటిజనులు, అభిమానులు మిశ్రంగా స్పందించారు. అయితే “చింకి-మింకి” యుగం ముగియ వచ్చు, కానీ తమ వ్యక్తిగత ప్రయాణాల ప్రారంభం కొత్త వినోదాన్ని ఉత్సాహాన్నిస్తుందని అందరూ ఇలాగే ఆదరించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం వృత్తిపరంగానే ఈ మార్పు అని ప్రకటించడంతో అభిమానులు శాంతించారు. సోలో మార్గాలను అన్వేషించాలనే సురభి-సమృద్ధి నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే దీంతో వీళ్లిద్దరూ విడి విడిగా ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?! -
క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్‌హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్‌గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు. -
హ్యాట్సాప్ బామ్మ.. ఆ వయసులో ఎంతటి స్థైర్యం..!
మన పర్యావరణం కోసం ఓ విదేశీయురాలు ఎంతలా తపిస్తుందో తెలిస్తే విస్తుపోతారు. మన దేశంలో కూడా ఎందరో పర్యావరణ ప్రేమికులు, సామాజకి వేత్తలు అందుకోసం కృషి చేస్తున్నారు. వారంత తమ గడ్డపై నడుంబిడిస్తే..ఆ విదేశీయురాలు మన దేశంలోని ఒక సరస్సు కోసం ఐదేళ్లుగా కష్టబడుతోంది. ఆ సరస్సు అందాలను బావితరాలకు తెలిసేలా చేయాలని తన సేవను కొనసాగిస్తుంది. ఎవరామె అంటే..68 ఏళ్ల ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్మాన్ అనే డచ్ మహిళ కశ్మీర్ పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటిరిగా కృషి చేస్తోంది. ప్రకృతిపై ఉన్న ప్రేమే ఆ బామ్మను శ్రీనగర్‌లోని దాల్ సరస్సు అందాలను కాపాడేందు పురిగొల్పింది. అంతేగాదు రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆ సేవకే అంకితం చేశారు. నిజానికి ఆమె కశ్మీర్‌తో అనుబంధం ఎల ఏర్పడిందంటే..సుమారు 25 ఏళ్ల క్రితం తొలిసారిగా కాశ్మీర్ లోయను సందర్శించినప్పుడు ప్రారంభమైందట. దాని చుట్టు ఉన్న ప్రకృతి రమణీయతకు ఆకర్షితురాలైంది. అది ఎంతలా అంటే ఆ కాశ్మీర్‌లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నంతగా ప్రేమను పెంచుకుంది. అలా ఇక్కడే ఉండి ఈ ఐకానిక్ సరస్సు వైభవాన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అంతేగాదు ఆమె ఆ సరస్సు నుంచి బాటిళ్లను, చెత్తను తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా.ఆ వీడియోలో ఎల్లిస్ మన స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉండేలా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చింది. ఆ వీడియోని చూసిని నెటిజన్లు ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ.. నిజంగా ఆ బామ్మ చాల గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ సైక్లిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు శ్రీనగర్ వీధుల గుండా వెళ్తూ..పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తోందామె. స్థానికులు, పర్యావరణ వేత్తులు ఆ బామ్మ సేవనిరతికి మంత్ర ముగ్దులవుతున్నారు. ఎంత ధైర్యవంతమైన మహిళ, ఈ వయసులో ఆమె అభిరుచి, లక్ష్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమె మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. Kudos to Dutch national Ellis Hubertina Spaanderman for her selfless efforts in cleaning Srinagar's Dal Lake for past 5 years. This dedication serves as an inspiration to preserve Kashmir's natural beauty. Let's join hands to keep our paradise clean & pristine. @ddprsrinagar pic.twitter.com/YINLbm3X1z— Kashmir Rights Forum🍁 (@kashmir_right) June 29, 2025 (చదవండి: Zohran Mamdani: 'చేత్తో తినడ'మే ఆరోగ్యానికి మంచిది..! పరిశోధనలు సైతం..) -
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లైన్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు. ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోందిఆ విజ్ఞానంతోనే.. ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్‌కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్‌పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలసచదవండి: బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు -
హెలికాప్టర్ నుంచి రూ. 4 లక్షలు పైనే డబ్బుల వర్షం..!
కొందరు సాయం, దాతృత్వం వంటి పదాలకు కొత్త అర్థాలు ఇస్తారు. అది దానం చేసినట్లు మనల్ని అవమానిస్తున్నట్లు కూడా అర్థం కాదు. చూడటానికి తమ డాబు దర్పం చూపించుకోవడానికి చేసిన దానదర్శంలా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి తన తన అంత్యక్రియల తంతులో వేలాదిగా డబ్బు పేద ప్రజలకు పంచాలనేది అతడి కోరికి. అతన ఆలోచన బాగానే ఉన్నా ఇచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన చిర్రెత్తుకొస్తుంది. ఇదేం దాతృత్వం రా బాబు అని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.డెట్రాయిట్‌కి చెందిన 58 ఏళ్ల డారెల్ ప్లాంట్ థామస్ తన అంత్యక్రియల సమయంలో పేద ప్రజలకు ఎంతో కొంత డబ్బు సాయం చేయాలనేది అతడి కోరిక. సమాజం తనను చిరకాలం గుర్తించుకునేలా తన దానం ఉండాలని ఆశించాడు. ఆయన గత నెల జూన్ 27న తుదిశ్వాస విడిచారు. దాంతో అతడి కొడుకులు డేరెల్, జోంటే ఇద్దరు తండ్రి కోరకి మేరకు హెలికాప్టర్ ఏర్పాటు చేసి మరీ గులాబి రేకుల తోపాటు సుమారు రూ. 4 లక్షల పైన నగదును ఆకాశం నుంచి వర్షంలా కురిపించారు. దాంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడి ప్రజజీవనం స్థబించిపోయింది. అంతేగాదు ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ నగదు, గులాబి పూరేకులు పడిన రహదారిని మొత్తం మూసేశారు కూడా. రోడ్లపైనే పాదాచారులు, వాహనదారులు గులాబి రేకుల తోపాటు పడుతున్న నగదును తీసుకోవడానికి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఇలా ఒకవైపు రహదారిని మొత్తం మూసేసింది. అయితే అధికారులు గులాబి రేకులు మాత్రమే అనుకున్నారట..ఇలా డబ్బుల వర్షం కురిసినట్లు తెలియదని చెబుతుండటం గమనార్హం. అయితే పోలీసులు ఆ డబ్బులను ఏమి స్వాధీనం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ పలువురు మాత్రం ఇది దాతృత్వంలా లేదని. ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. అలాగే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. Detroit man has a helicopter drop money from the sky as his last wish.58-year-old car wash owner Darrell "Plant" Thomas passed away in June and wanted to give his community one final gift.On the day of his funeral, Thomas' sons Darell and Jonte organized a helicopter to drop… pic.twitter.com/ZOhM5gFXJE— Collin Rugg (@CollinRugg) July 1, 2025 (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ మరో ఘనత
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తన మొదటి మిషన్‌ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్‌గా, ఎక్స్‌పెడిషన్ 75వ సభ్యుడిగా2026 జూన్‌లో జరిగే చారిత్రాత్మకమైన రోస్కోస్మోస్ సోయుజ్ MS-29 అంతరిక్ష యాత్రలో భాగం కానున్నారు. భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో పనిచుస్తున్న కారణంగా నాసా 2026లో అంతరిక్ష యాత్రకు వ్యోమగామి అనిల్ మీనన్‌ను ఎంపిక చేసింది. సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తదుపరి భారతీయ-అమెరికన్ అనిల్ మీనన్ కావడం విశేషం. అనిల్‌తోపాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్ ,అన్నా కికినా (Pyotr Dubrov and Anna Kikina)కూడా ఈ ప్రయాణంలో పాలు పంచుకుంటారు. ఈ ముగ్గురూ కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి బయలుదేరి, కక్ష్యలో తిరిగే ప్రయోగశాలలో దాదాపు ఎనిమిది నెలలు గడుపుతారు. జూన్ 2026 లో ప్రయోగించనున్న తన ఎక్స్‌పెడిషన్ 75 అంతరిక్ష మిషన్‌లో మీనన్ పాల్గొంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో తెలిపింది.చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నాసాలో ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మీనన్ ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియా పొలిస్ (మిన్నెసోటా)లో. 1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీని, పట్టా పుచ్చుకున్నారు. 2021లో అంతరిక్ష సంస్థ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 3 సంవత్సరాల కఠినమైన శిక్షణ తర్వాత, 23 వ వ్యోమగామి పట్టభద్రుడయ్యాడు. నాసా ఫ్లయిట్ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు .ISSలో సోయుజ్ మిషన్లు సోయుజ్ 39 - సోయుజ్ 43 లకు డిప్యూటీ క్రూ సర్జన్‌గా, సోయుజ్ 52 కోసం ప్రైమ్ క్రూ సర్జన్‌గా పనిచేశారు. ఈ యాత్రలో, అనిల్ మీనన్ "భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు మానవులను సిద్ధం చేసేలా, మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా శాస్త్రీయ పరిశోధనలు, టెక్నాలజీ ఆవిష్కరణను నిర్వహిస్తారని నాసా వివరించింది.ఇదీ చదవండి: ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్! -
ఆ ప్రమాదం : వాళ్ల ప్రేమకు పునర్జన్మ!
సురేశ్, సమీర (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే అమ్మాయి వాళ్ల పెద్దలు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. కలిసే బతుకుదామని నిర్ణయించు కున్నారు. పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అమ్మాయి నిర్ణీత స్థలానికి రాగానే అప్పటికే అక్కడ టూ వీలర్ మీద వెయిట్ చేస్తున్న సురేశ్... సమీరను పికప్ చేసుకున్నాడు. అసలే యాంగై్జటీ. తమను వెతికేవారికి దొరక్కూడదనే టెన్షన్. ఆ యాంగై్జటీ, టెన్షన్లతో బండి వేగంగా నడిపాడు. ఫలితం... బండి బోల్తా కొట్టి యాక్సిడెంట్ అయ్యింది. వెంబడిస్తున్న సమీర తరఫు బంధువులకు అమ్మాయి చిన్న చిన్న దెబ్బలతో సేఫ్‌గానే దక్కింది. కానీ... సురేశ్ తల బద్దలైంది. అచ్చం అతడి ప్రేమలా! సురేశ్ మెదడు బయటకు వచ్చింది. ఛాతీ ఎముకలూ విరిగాయి. పొట్టలోకి నీరు వచ్చింది. ఇలా మెడికల్‌కు సంబంధించిన మల్టీ డిసిప్లినరీ సమస్యలెన్నో వచ్చాయి. ఆ స్థితిలో తీసుకువచ్చిన సురేశ్‌కు చికిత్సలు చాలా జాగ్రత్తగా అందించాల్సి వచ్చింది. తల తాలూకు చిన్న చిన్న ముక్కలు కొన్ని (మరీ లోతుగా కాకపోయినా) మెదడులోనూ ఇరుక్కున్నాయి. మెదడులోకి లోతైన గాయాలు కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి.అత్యంత సునిశితమైన చికిత్సలూ, గాజుబొమ్మలా చూసుకున్న జాగ్రత్తల తర్వాత ఎట్టకేలకు సురేశ్ కోలుకున్నాడు. ఈలోపు... వాళ్ల ప్రేమకథలో ఓ ట్విస్ట్. అతడి యాక్సిడెంట్ వృత్తాంతం వాళ్ల క్లోజ్ క్లోజ్ సర్కిల్స్‌లో వ్యాపించడంతో అతడికి సంబంధాలేమీ రాలేదు. అటువైపు ఆ అమ్మాయి పరిస్థితీ అంతే. బద్దలైన తల తాలూకు చిన్న చిన్న ముక్కల్నీ పేర్చి అతికిస్తే అవే మెల్లగా అమరాయి కదా... అచ్చం అలాగే పెద్దలు బద్దలు చేయాలనుకున్న వాళ్ల ప్రేమ కూడా చక్కగా కుదిరింది. వెరసి పెళ్లీ జరిగింది. తన కాళ్ల మీద నిలబడ్డ సురేశ్ ఇప్పుడు ఓ మంచి రెస్టారెంట్ నడుపుతున్నాడు. వాళ్లిద్దర్నీ చూసినప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. డాక్టర్ ఎస్. రమేశ్ సీనియర్ న్యూరో సర్జన్, మినిమల్ యాక్సెస్ బ్రెయిన్ – స్పైన్ సర్జన్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్యాసీన్ -
ఐఏఎస్ కల : మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!
ఎలాగైనా యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించాలనే తపనతో చదువుతున్నాడు మిస్టర్ రంజిత్ (పేరు మార్చాం). అతడు నరాలు తెగే ఏకాగ్రతతో చదువుతుంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) అనే సమస్య అతడి నరాలను దెబ్బతీసింది. జీబీఎస్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత వస్తుందిది. ఇందులో నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపైన ఉండే ‘మైలీన్’ అనే పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ వెలువడి... అవి తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక సొంత అవయవాలు అచేతనమవుతాయి. అందునా ఈసారి రంజిత్‌కు వచ్చిన వ్యాధి మామూలు జీబీఎస్ కాదు. జీబీఎస్ వచ్చేవాళ్లలోనూ ప్రతి 1000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన, అత్యంత తీవ్రమైన గులియన్ బ్యారీ సిండ్రోమ్ (Guillain-Barré syndrome (GBS) రకమిది. నరాల కూడలి (నోడల్) ప్రదేశాల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘నోడోపతి’ అంటారు. అది ఎంతటి తీవ్రమైనదంటే... సాధారణంగా కాళ్ల నుంచి పైకి చచ్చుబడిపోయేలా చేసే ఆ వ్యాధి... ఇతడిలో మాత్రం దేహమంతా అచేతనమయ్యేలా చేసింది. ఊపిరి తీసుకునేందుకు సహాయపడే కండరాలు అచేతనమైపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణం పోతుంది కదా. అలాంటిది అతడి కంటికి సంబంధించిన కండరాల్లో కొంత మినహాయించి మిగతా దేహమంతా కదలిక లేకుండా పోయింది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ అతడిని దెబ్బతీసిందేమో కానీ పరిస్థితులు అతడి సంకల్ప బలాన్ని ఏమాత్రమూ దెబ్బతీయలేకపోయాయి. సొంత కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డ తీరు అసామాన్యం, అనితరసాధ్యం, నిరుపమానం, నిరంతర స్ఫూర్తి. సొంత సోదరి కూడా ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతుండటంతో ఆమె అతడిలో మోటివేషన్ నింపుతూ ఉంది. అతడి పరిస్థితికి అతడిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐవీఐజీ అనే తరహా ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సి ఉంది. ఇది బాగా ఖరీదైన చికిత్స. అతడిది కేవలం ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. దాంతో అతడి మనోబలాన్ని పెంచేందుకూ, అతడిలో స్ఫూర్తి రగిలించేందుకూ మేం డాక్టర్లం కూడా అతడికి ఆర్థికంగా కొంత సహాయం (క్రౌడ్ ఫండింగ్) చేశాం. ఆసుపత్రి కూడా తనవంతు అండదండలందించింది. అన్నివైపుల నుంచి అందుతున్న సహకారాలతో అతడు రెండునెలల పాటు ఐసీయూలో వ్యాధితో పోరాడాడు. ఈలోపు మరో రెండుసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి అతడిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్లింది. దాంతో అతడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉండేలా చేశాం. అతడికి అందే ఆహారాలు బలవర్థకంగా ఉండేలా చూశాం. రిటుక్సిమాబ్ అనే ఇమ్యూన్ సపోర్ట్ మందులిచ్చాం. ఇలా అనేక ప్రయత్నాలు చేసి అతడిని కాపాడాం. రెండు నెలల పాటు అతడి నరాలకు ఏ ఆహారమూ అందకపోవడంతో, అవి రెండునెలల పాటూ ఏ పనీ చేయకపోవడంతో... ఆ తర్వాత ఎంతో బలహీనపడి శక్తిపుంజుకునేందుకు ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో అతడెంతో కష్టపడి బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు. చదవండి: బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్స్పైర్ చేసిన ఇంట్రస్టింగ్ కథనంఈ ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది పరీక్ష రాద్దువుగానీ అంటే... ‘‘లేదు సర్... మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా పరీక్ష రాయాల్సిందే. అది కుదరకపోతే నేను చెబుతుంటే ఎవరైనా స్క్రైబ్‌ను పెట్టుకునైనా సరే’’ అన్నాడా అబ్బాయి. మేం ఒక టీమ్‌గా పనిచేసే డాక్టర్లమంతా కలిసి, మా శక్తియుక్తులన్నీ వెచ్చించి, సంయుక్తంగా అతడిని మృత్యుదేవత ఒడిలోంచి బలవంతంగా వెనక్కుతీసుకొచ్చామంటే అది అతిశయోక్తి కాదు. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోక్రిటికల్ కేర్‌లో పనిచేసే మేము రోజులోని 24 గంటలూ క్రిటికల్ కేసుల్నే చూస్తాం. ఇటీవలే మేం ఒక డబుల్ ట్విన్స్ కడుపులో ఉన్న మహిళను రక్షించాం. అత్యంత సంక్లిష్టమైన టీబీ ఇన్ఫెక్షన్లూ, చాలా అరుదుగా కనిపించే మెనింజైటిస్ విత్ టీటీపీ అనే కేసులూ చూశాం. కానీ ఇలా చదువుకోసం తాపత్రయపడే ఓ చురుకైన కుర్రాణ్ణి మేమంతా ఓ టీమ్‌గా రక్షించిన ఉదంతం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది.డాక్టర్ హర్ష్ ఖండేలియా సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్-యాసీన్ -
కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే చేశాడో తండ్రి. తన కళ్లముందే బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి ఒక పాప పొరపాటున జారి పడబోయింది. ఇది చూసిన తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల షిప్లో గడిపిన తరువాత ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు తిరిగి వస్తోంది. చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ ప్రయాణికులుఎంజాయ్ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో ఓడ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్ ద్వారా తండ్రీ కూతుళ్లను రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ సిబ్బంది తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.The ship was heading back to South Florida when the intense rescue was made."The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O— Collin Rugg (@CollinRugg) June 30, 2025మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్ తమ సిబ్బంది స్పందించిన తీరు, ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్గ్లేడ్స్కు తిరిగి వచ్చింది.ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు -
5 వేల కిలోమీటర్ల దూరం నుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు
చైనా వైద్యులు వైద్యచరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి సాధించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 5,000 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ రోబోటిక్ ఆపరేషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. టిబెట్‌లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది.Apstar-6D ఉపగ్రహం ద్వారా 68 ఏళ్ల కాలేయ కేన్సర్ రోగి, 56 ఏళ్ల హెపాటిక్ హెమాంగియోమాకు ఈ రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కేవలం 125 నిమిషాల్లో బ్లడ్ లాస్ లేకుండా చేయడమే కాదు, 24 గంటల్లో రోగులు పూర్తిగా కోలుకోవడం విశేషం. ఉపగ్రహ శస్త్రచికిత్స, సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది: 632 ms జాప్యంలో కూడా రోబోటిక్ హ్యాండ్ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా న్యూరాల్ నెట్‌వర్క్‌ను వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్‌కు మారే ద్వంద్వ-లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్‌ను కొనసాగిస్తూనే, డేటా లోడ్‌ను 62శాతం తగ్గించేందుకు డైనమిక్ బ్యాండ్‌విడ్త్ కేటాయింపును వాడింది.ఇదీ చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్రిమోట్,విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అధునాతన శస్త్రచికిత్స సేవలు అందించడంలో ఇది కీలక మలుపు అని ప్రొఫెసర్ లియూ చెప్పారు. ముఖ్యంగా వైద్యులు సకాలంలో చేరుకోలేని వార్ జోన్స్, ప్రకృతి వైపరీత్యాలలో క్లిష్టమైన రెస్క్యూ మిషన్లకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. చైనా ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతో చేసే ఆపరేషన్ల మోడల్‌ను విస్తృత జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో చేర్చాలని యోచిస్తోంది. ఇది అంతరిక్ష ఆధారిత వైద్యం విషయంలో కొత్త యుగానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు.చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు -
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్‌తో టచ్‌లో ఉంటూ, అనేక గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...
ఎన్నో విలాసవంతమైన భవనాలను చూసి ఉంటారు. ానీకానీ ఇలాంటి విలాసవంతమైన ఇంటిని మాత్రం చూసుండరు. మహా అయితే ఇన్ని అంతస్థుల భవనం, కట్టిపడేసే లగ్జరీయస్ ఫర్నీచర్లు తదితర విశేషాలతో ఉన్న బంగ్లాలనే ూచూశాం. కానీ ఈ ఇల్లు వాటన్నింటిని తలదన్నేలా అత్యంత విలాసవంతంగా అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఆ ఇంటిని తిలకిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. కంటెంట్ క్రియేటర్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక విలాసవంతమైన బంగారంతో అలకరించి ఉన్న లగ్జరీయస్ ఇంటిని సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ ఇంటి లోపల ఫర్నిచర్ నుంచి ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డుల వరకు ప్రతీది స్వచ్ఛమైన బంగారంలా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసినవే అట. కంటెంట్ క్రియేటర్ సరస్వత్ అంతటి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ భవనంలో మొత్తం పది బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో గోశాల నుంచి మొదలై.. ఎంట్రన్స్‌లో 1936 వింటేజ్ మెర్సిడెస్ కారు నుంచి పలు విలాసవంతమైన కార్ల సేకరణ కనిపిస్తుంది. అంతేగాదు ఆ ధనవంతుడి సక్సెస్ జర్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమ కుటుంబంలో మొత్తం 20 మంది సభ్యులం ఉండేవాళ్లమని, అందరికీ ఒకే ఒక పెట్రోల్ బంక్ ఆధామని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆ ధనవంతుడికి అర్థమైపోయిందట ఏదోరకంగా కష్టపడకపోతే తన మనుగడ ప్రశ్నార్థకమై పోతుందని. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంట్రాక్టర్షిప్లోకి ప్రవేశించారట. అలా ప్రభుత్వ రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మించే తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 300 గదుల హోటల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, అందుకు సంబంధించిన వీడియోకి "భారతదేశంలోని ఇండోర్‌లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు" అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు కంటెంట్ క్రియేటర్ సరస్వత్. నెటిజన్లు అంతటి విలాసవంతమైన ఇంటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరూ లక్ష్మీపుత్రుడు, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) (చదవండి: 'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
‘పెద్దొరిసి’ కేరాఫ్ వెంకటాపురం, రేటెంతో తెలిస్తే షాకవుతారు
కొత్తూరు: పెద్దొరిసి.. ఇదో రకం జాతికోడి. పందేలకు వినియోగించే అరుదైన రకాల్లో ఇదీ ఒకటి. కొత్తూరు మండలం వెంకటాపురం ఇప్పుడు ఈ తరహా కోళ్లకు కేరాఫ్‌గా మారింది. గ్రామానికి చెందిన గండికోట త్రినాథరావు సుమారు 100 జాతికోళ్లను పెంచుతున్నారు. వీటిని పెంచడం ఆషామాషీ కాదు. పశువైద్యుల పర్యవేక్షణలో ఈ కోళ్లను త్రినాథరావు పెంచుతున్నారు.పగలంతా తోటల్లో ఉంచుతూ సాయంత్రానికి షెడ్ వద్ద కు చేరుస్తారు. నాటుకోళ్లలో అరుదైన ఈ రకానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రుచి అమోఘం కావడంతో గోదావరి జిల్లాలకు చెందిన వారు అడ్రస్ కనుక్కుని మరీ ఇక్కడకు వచ్చి కోళ్లను కొంటుంటారు. చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమేకోడి బరువు, సైజ్‌ను బట్టి రెండు వేలు నుంచి రూ. 20 వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భాల్లో గోదావరి జిల్లాలతో పాటు పొలకొండ మండలంతో పాటు ఒడిశా నుంచి వస్తుంటారు. గుడ్లను ఇక్కడే పొదిగిస్తుంటామని, ఇతర ప్రాంతాలను నుంచి పిల్లలకు తీసుకురావడం లేదని పెంపకందారు చెబుతున్నారు. ఈ కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు -
'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..
చార్లీ 777 అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. దర్శకుడు కిరణ్‌రాజ్ కె తీసిన ఈ మూవీ టైటిల్ లీడ్ రోల్లో చార్లీగా లాబ్రాడర్ కుక్క, హీరోగా రక్షిత్ శెట్టి, నటి సంగీత శృంగేరి తదితరులు నటించారు. ఈ సినిమాలో కొన్ని రోజుల్లో దూరమైపోతున్న ఆ కుక్క డ్రీమ్‌ని నెరవేర్చి, దాని జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలని కోరికతో హీరో రక్షిత్ శెట్టి బైక్‌పై దాన్ని కూర్చోబెట్టుకుని టూర్లు చుట్టివస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలు సైలెంట్‌గా సాగే ఈ మూవీలో హైలెట్‌గా ఉంటాయి. అచ్చం అలాంటి కథే ఈ బిహార్ వ్యక్తిది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి సైకిల్‌పై తన పెంపుడు కుక్కతో టూర్లు చుట్టొచ్చాడు. అలా ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే విస్తుపోతారు. బిహార్‌కి చెందిన సోను అనే వ్యక్తి, తాను కాపాడిన చార్లీ అనే కుక్కతో భారతదేశం అంతటా సుమారు 12,000 కి.మీ.ల దూరం పైనే పర్యటించాడు. ఒక ప్రమాదంలో గాయపడిన ఆ కుక్కతో అనుకోకుండా అటాచ్మెంట్ పెరిగిపోయింద ఇద్దరికి. అది అతడు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుసరించడంతో ఇలా ఆ కుక్కతో కలిసి ట్రావెల్ చేసినట్లుగా తెలిపాడు. అంతేగాదు అతడు తన ఇంటిని వదిలి ఇప్పటికీ దాదాపు 11 నెలలు పైనే అయ్యిందట. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ మార్గంలో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని అంతకుమునుపే పోస్ట్ చేసినప్పటికీ అందులో ఆడియో సరిగా లేకపోవడంతో మరోసారి రీపోస్ట్ చేశాడు సోను. దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా..ఆ కుక్క నిజంగా చాలా అదృష్టవంతురాలు..ఏ కుక్కకి దక్కని అద్భుత అవకాశం లభించింది. బ్రో మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమకి ఫిదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sonu and Charlie 🐶( Bihar 🚴) (@safarmeinrahi) (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..) -
International Asteroid Day: గ్రహశకలం నేలను ఢీ కొంటే..!
ఆస్టరాయిడ్స్ (Asteroids)అంటే గ్రహ శకలాలు. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవలయాకార కక్ష్యలో తిరుగుతుంటాయి. గురు గ్రహానికీ, అంగారక గ్రహానికీ మధ్యగల మండ లంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 2016 డిసెంబర్లో ప్రతి ఏడాదీ జూన్ 30వ తేదీని అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం (International Asteroid Day ) గా జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది 1908 జూన్ 30న రష్యాలోని సైబీ రియా ప్రాంతంలో ఉన్న తుంగస్కా నదిపై జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకునే వార్షికోత్సవంగా చెప్ప వచ్చు. ఈ నదిపై ఓ గ్రహశకలం పేలిపోయింది. పెద్ద ్రVýæహశకలం ఒకటి గంటకు 53,913 కిలోమీటర్ల వేగంతో వాతావరణాన్ని ఢీకొట్టింది. ఈ గ్రహశకలం వాతావరణంలో ప్రవేశించడం వలన ఏర్పడిన ‘రాతి విస్ఫోటనం’ ధర్మో న్యూక్లియర్’ పేలుడు అని గమనించారు. ఈ పేలుడు వలన విస్తారమైన అటవీ ప్రాంతంలోని చెట్లన్నీ కూలి పోయాయి. ఈ పేలుడులో విడుదలైన శక్తి 1,000 హిరోషిమా అణుబాంబు లకు సమానం. అయినా అక్కడ ఎటు వంటి బిలం ఏర్పడలేదు. అంటే గ్రహ శకలం భూమిని ఢీకొట్టకుండా వాతావరణంలో పేలి పోయిందన్నమాట. ఈ సమయంలో ప్రకాశవంత మైన కాంతి, పెద ్దశబ్దాలు, భూప్రకంపనలు పశ్చిమ ఐరోపా వరకు నమోదు అయ్యాయి. ‘గ్రహశకలాలు – అవి భూమి చరిత్రలో, భవి ష్యత్తులో పోషించే పాత్ర, దానిపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టడం’ ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం. అంటే ఈ రోజున గ్రహ శకలాల ద్వారా సంభ వించే ప్రమాదాల గురించి అవగాహన పెరిగేందుకు ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, ప్రదర్శనలు జరుపు తారు. గ్రహ శకలాల వల్ల కలిగే ప్రమాదాల నుండి భూమిని రక్షించుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. ఏటా దాదాపు 17,000 గ్రహశకలాలు భూమి వైపు పడతాయని ఒక అంచనా. ఇవి వాతావరణంలో ప్రవేశించిన తరువాత చిన్న కణాలు లేదా దుమ్ముగా మారి పోతాయి. అందువల్ల అవి మనకు కన్పించవు. అను దినం 44,000 కిలోల గ్రహశకలాల పదార్థం భూమిపై పడుతుందని ఒక అంచనా. గ్రహశకలం నేల వైపు పడేటప్పుడు ముందుగా అది వాతావరణంలోకి వస్తుంది. వాతావరణంతో కలిగే ఘర్షణ వల్లఈ రాతి ముక్క బాగా వేడెక్కుతుంది. చివరకు అది కాలిపోయి ఆవిరిగా మారుతుంది.ఈ క్రమంలో ఆకాశంలో ప్రకాశవంతమైన గీత కన్పిస్తుంది. మన వాతా వరణం చాలా గ్రహశకలాలను ఇలా నాశనం చేస్తుంది కాబట్టి దాదాపు 95 శాతం ఈ రాతి ముక్కలు భూమిని చేరవు. ఈ విధంగా వాతావరణం గ్రహశకలాల బారి నుండి భూమిని కాపాడుతోంది. గ్రహశకలం భూమిని తాకితే వాతావరణంలో దుమ్ము, పొగ పెరుగుతాయి. వీటివల్ల ఆ ప్రాంతంలో సూర్యరశ్మి చేరక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఫలితంగా అనేక జీవులు మరణిస్తాయి. ఒక అపార్టుమెంటు పరిమా ణంలో ఉన్న గ్రహశకలం భూమిని తాకితే ఒక చిన్న నగరం నాశనం అయిపోతుంది. – డా. సి.వి. సర్వేశ్వర శర్మ ,పాపులర్ సైన్స్ రచయిత -
32 వేల ఏళ్ల నాటి మొక్క పుష్పించింది..!
మంచుయుగం నాటి పురాతన పుష్పం ముప్పయిరెండు వేల ఏళ్ల తర్వాత పునరుత్థానం పొందింది. ఏనాడో అంతరించిపోయిన ఈ పురాపుష్పానికి రష్యన్ శాస్త్రవేత్తలు పునర్జీవం కల్పించారు. ‘సైలిని స్టెనోఫిలా’ అనే ఈ పువ్వు దాదాపు ముప్పయిరెండు వేల ఏళ్ల కిందట పూసేదట! సైబీరియా మంచు ఎడారుల్లో పరిశోధనలు జరుపుతున్న రష్యన్ శాస్త్రవేత్తలకు ఈ పూల మొక్కకు చెందిన విత్తనాలు ఒక ఉడుత బొరియలో దొరికాయి. వీటిని ల్యాబొరేటరీలో మొలకెత్తించడానికి వారు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. మొత్తం విత్తనాలన్నీ మొలకెత్తాయి. మొలకలు మొక్కలుగా ఎదిగి, చక్కగా పూలు పూశాయి. వేల ఏళ్ల కిందట కాలగర్భంలో కలిసిపోయిన విత్తనాలు బయటపడటం, వాటి నుంచి మొక్కలను మొలకెత్తించడం చరిత్రలో ఇదే మొదటిసారి. రష్యన్ శాస్త్రవేత్తలు 2012లో చేసిన ప్రయోగం సఫలం కావడంతో ‘సైలిని స్టెనోఫిలా’ పూల మొక్కలు ఇప్పుడు చాలా ఇళ్లల్లోని కుండీల్లోకి చేరాయి. (చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
ఫీజు అడగని వైద్యుడు గురించి తెలుసా?
తెలుగునేలపై జన్మించి స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకున్నవారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు చెలికాని వెంకట రామారావు (Chelikani Venkata Rama Rao)మానవత, నిజాయతీ, వినమ్రత, నిబద్ధత వంటి విశిష్ట లక్షణాలతో ఆయన అన్ని తరాలకూ స్ఫూర్తిగా నిలిచారు. రామారావు జులై 15, 1901లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొందెవరంలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మొదటి నుంచీ సంఘసంస్కరణోద్యమాలు, విప్లవోద్యమాలకు నెలవు. దీంతో చిన్ననాటి నుంచే ఆ వాతావరణంలో పెరిగారు రామారావు పాఠశాల జీవితంలోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపారు. దేశం పరాయిపాలనలో మగ్గిపోతుంటే తాను చదువుకోవడం ద్రోహమని భావించి చదువుకు స్వస్తి పలికారు. జాతీయ ఉద్యమంలో చేరి 1922లో మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను 1934లో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం వైద్యుడిగా ప్రాక్టీసలు ప్రారంభించి పేదలకు సేవలందించారు. వారి నుంచి డబ్బులు తీసుకోకుండా, ఖర్చుల కోసం వారికే కొంత డబ్బు ఇచ్చి పంపేవారు. 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా కాకినాడ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేశారు. అనారోగ్యం కారణంగా ప్రచారంలో పాల్గొనకపోయినా జనం ఆయన్నే గెలిపించి తొలి లోక్‌సభకు పంపించారు. 84 సంవత్సరాలు జీవించిన రామారావు సెప్టెంబరు 25, 1985న మరణించారు. ఇదీ చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? -
రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ ఆయన విమర్శించారు. ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్ చేశారు.Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs— Harsh Goenka (@hvgoenka) June 26, 2025 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026 ఇటీవల ప్రదర్శించింది. వీటి డిజైన్ అచ్చం మన షోలాపూర్ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి. కానీ వాటి ధరే 1.2 లక్షలు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.అటు బిలియనీర్ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్ చేస్తూ, ఇవి భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మన చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం! అంటూ గోయెంకా రాసుకొచ్చారు.ఈ హై-ఎండ్ ఫ్యాషన్ చప్పల్స్ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్‌తో రూపొందించినట్టు ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో షోలాపూర్ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు విస్తుపోయిన సంగతి తెలిసిందే. -
రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ కేవలం తన పాటల ద్వారా మాత్రమే కాదు, తన గొప్పమనసుతో అందరి మనసులను దోచుకున్నాడు. సెలబ్రిటీలు అనేక వ్యాపారాలకు, ఎండార్స్మెంట్లతో కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో తన రెస్టారెంట్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 40 రూపాయలకే కమ్మటి భోజనం అందిస్తున్నాడు. ఎక్కడ? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? తెలుసుకుందామాపశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని తన స్వస్థలం జియాగంజ్‌లో హెషెల్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు అరిజిత్ సింగ్. కుటుంబ వ్యాపారంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ రెస్టారెంట్ చాలా తక్కువ ధరకు, కేవలం రూ. 40కి ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాడు. తద్వారా మధురమైన గానంతోపాటు సామాజిక సేవతో మరోసారి ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్ కొత్తదేమీ కాదు. కుటుంబ వ్యాపారంలో భాగంగా గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించడ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త ధరలను ప్రకటించినట్టు తెలుస్తోంది.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్‌ను గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ నిర్వహిస్తున్నారు.ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వ్యాపారంలో భాగం. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించం కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందట.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు అరిజిత్ సింగ్ ఒకడు. అతని కచేరీకోసం ప్రేక్షకులు డిమాండ్ బాగా ఉంటుంది. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్‌వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.అయితే కోట్ల రూపాయలు ఆర్జించే గాయకుడు అరిజిత్ సింగ్ లాంటి వారికి ఛారిటబుల్ ఫుడ్ ఆర్గనైజేషన్‌ను నడపడం పెద్ద విషయం కానప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఈ వార్త నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ పూర్తి భోజనం విద్యార్థులకు మాత్రమేనని అందరికీ కాదని పేర్కొంటున్నారు. 'ఫర్ ఎ చేంజ్' అనే సంస్థ మరో పోస్ట్‌లో, ఈ రెస్టారెంట్ సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందని తెలిపింది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, విద్యార్థులకు డిస్కౌంట్లను కూడా అందిస్తుందని, ఇది అరిజిత్ సమాజ సేవపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొపడం గమనార్హం.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే పాపులర్ గాయకుల్లో ఒకరు అరిజిత్ సింగ్. అతని కచేరీలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్‌వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా. -
62 కిలోలు తగ్గాడు : నీళ్లు, టీ, ఫన్నీ అండ్ హెవీ కార్డియో ఇవే సీక్రెట్స్
ఒకపుడు బాన పొట్టతో, భారీ బరువుతో ఉన్న యువకుడు పట్టుదలతో తన శరీర బరువును తగ్గించుకున్నాడు. కండలు తిరిగే శరీరంతో చూడముచ్చటగా తయారయ్యాడు. 140 కిలోల నుండి 78 కిలోల బరువుకు చేరాడు. అయితే ఇది అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఠినమైన ఆహారం , క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్తా మారానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించాడు.ఇన్స్టాగ్రామ్ యూజర్ పువి 2023 నవంబరులో తన వెయిట్‌లాస్ జర్నీని షేర్ చేశాడు. ప్రధానంగా 'హై-కార్బ్ డైట్' పూర్తిగా పక్కన బెట్టి, ప్రొటీన్డ్ ఆహారం, ధారాళంగా నీరు తాగడం ద్వారా 62 కిలోలు తగ్గిన తరువాత, తన దేహం కండలతో కనిపించిందని చెప్పాడు. 'కార్బోనేటేడ్ డ్రింక్స్ చెత్త'ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ,చక్కెరలను పూర్తిగా తగ్గించేశాడు. కూల్ డ్రింక్‌లు, చక్కెర కార్బోనేటేడ్ డ్రింక్‌లకు బై బై చెప్పేశాడు. అవి చెత్త తప్ప వాటిల్లో ఏమీలేదంటాడు పువి. పుష్కలంగా నీళ్లు, అప్పుడప్పుడు టీకి మాత్రమే పరిమితమయ్యాడు. చాలా రోజులు కూరగాయలు, చాలా సింపుల్‌గా మసాలా దినుసులతో ఉడికించిన చికెన్ తినేవాడు. View this post on Instagram A post shared by 🅿️uvi (npuvi96) (@transformwithpuvi) 'ట్రెడ్మిల్ కాదు కానీ ఫన్ కార్డియో'బరువును తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రొటీన్ ఫుడ్‌పై దృష్టిపెట్టాడు. వారానికి 4 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్‌తోపాటు, చేయ గలిగినంత కార్డియో(ట్రెడ్మిల్ కాదు) ఫన్ కార్డియో చేసేవాడు. హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) ఇలా ప్రతీదీ ఆస్వాదిస్తూ వెయిట్‌లాస్ జర్నీని కొనసాగించాడు. లావుగా ఉన్నానని నా బాడీని, జీవితాన్ని ద్వేషించ లేదు, కానీ ఫిట్‌గా మారాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమి తిన్నా, ఎంజాయ్ చేస్తూ, ఉపయోగపడేలా తినాలి అంతే అంటాడు పువి. నోట్: బరువు తగ్గాలనే కోరికతో పాటు,దానికి తగిన ప్లాన్, ఆహార అలవాట్లు ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీవ్రంగా జిమ్ చేయాలంటే నిపుణుడైన శిక్షకుడి ఆధ్వర్యంలోనే చేయాలి. దీనికంటే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో విశ్లేషించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. -
Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’
భారత వ్యోమగామి 39 ఏళ్ల భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ఎగిసిన కొన్ని గంటల తర్వాత , కక్ష్య నుండి తన తొలి వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. గాల్లోకి పంపినప్పుడు గొప్పగా అనిపించలేదు అంటూనే అంతరిక్షంలో తన ఫీలింగ్‌ను పంచుకున్నారు. "అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. వావ్, ఎంత ఆనందం.. అద్భుతమైన ప్రయాణం. లాంచ్‌ప్యాడ్‌లోని క్యాప్సూల్‌లో ఇప్పుడిప్పుడే నడక నేర్చిన చిన్నారిలా ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా..ఎలా కదలాలో, ఎలా తినాలో.. ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుంటున్నా’ అంటూ శుభాన్షు తన అనుభవాలను సందేశంలో పంచుకున్నారు. అలాగే స్పేస్‌క్రాఫ్ట్‌లో తన మొదటి గంటల్లో, జీరో గ్రావిటీకి అలవాటు పడుతూ, తన అనుభవం గురించి మాట్లాడారు. నిన్నటి నుండి చాలా నిద్రపోతూనే ఉన్నానట అంటూ చెప్పుకొచ్చారు.చదవండి: డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్కాగా భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తరువాత తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా శుభాన్షు కావడం విశేషం.మాజీ నాసా వ్యోమగామి , గత మూడు మిషన్లలో అనుభవజ్ఞుడైన కమాండర్ పెగ్గీ విట్సన్ , మిషన్ నిపుణులు హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీలతో పాటు యాక్స్-4 మిషన్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములలో శుక్లా ఒకరు.చదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే! -
డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా (Anam Mirza) ఇక ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. అందరూ డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంపై తెగ మురిసిపోతోంటే...అదిమానేసి డబ్బు ఎలా ఆదా చేశానో తెలుపుతూ ఇన్‌స్టాలో ఒకపోస్ట్ పెట్టింది. అదెలాగో తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. పదండి మరి అదేంటో చూద్దాం.అనమ్ మీర్జా సోషల్ మీడియాలో ఇపుడు ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే డబ్బులు ఏలా ఆదా చేయాలో యూత్‌కి ఒక సీక్రెట్ మంత్రాను షేర్ చేసింది. యూపీఐ (UPI) యాప్స్ వాడటం పూర్తిగా ఆపివేసానని, రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడానికి తన ఫోన్ నుండి Google Payని కూడా డిలీట్ చేశానని వీడియోలో వివరించింది. QR కోడ్లను స్కాన్ చేయకుండా లేదా తక్షణ చెల్లింపులు చేయకుండా తనను తాను కట్టడి చేసుకున్నానని, తద్వారా బోలోడంత ఆదా చేశానని చెప్పుకొచ్చింది. ఫలితంగా తన డబ్బు ఎక్కడికి వెళుతుందో తనకు బాగా తెలిసిందని అనమ్ చెప్పింది. తన సిరీస్ లిటిల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్ ఎపిసోడ్ 4లో ఈ వీడియోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Anam Mirza (@anammirzaaa) మొదట్లో ఈ నిర్ణయానికి సర్దుబాటు చేసుకోవడం కష్టమనిపించింది. స్నేహితులను కాఫీ కొనమని కూడా అడగాల్సి వచ్చింది కానీ కాలక్రమేణా, ఆ మార్పుకు అలవాటు పడ్డానని, ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉందని వెల్లడించింది. ఇదీ చదవండి: నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్గాఇది చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అనమ్పై ప్రశంసలు కురిపించారు. "ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది" అని ఒకరు, "ఈ కాలంలో నిజంగా గొప్ప మార్పు" అని మరొకరు, తాము కూడా ప్రయత్నించి, డబ్బు పొదుపు చేస్తామని వ్యాఖ్యానించారు.అయితే "మీరు ఇప్పటికే ధనవంతులు కాబట్టి ఇది మీకు సరిపోతుంది. మా లాంటి మధ్యతరగతి ప్రజలకు UPI ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అర్థం చేసుకోగలరు. అనవసరమైన ఖర్చులు చేసే ముందు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే కానీ దానికోసం UPI ఖాతాను తొలగించడం సరైంది కాదంటూ మరో యూజర్ పెదవి విరవడం గమనార్హం. (మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!) -
చెయ్యెత్తి మొక్కేలా షిరిడీ సాయిబాబా! అంతేనా..!
అతడు మలిచిన శిల్పాలు జీవం పోసుకున్నాయా అన్నట్లు కనిపిస్తాయి.. కాస్త దూరం నుంచి చూస్తే అరె అక్కడ ఎవరో ఉన్నారు అనే భావన కలుగుతుంది. చేతితో తాకి చూస్తే తప్ప శిల్పం అని తెలుసుకోలేం.. మనతో లేని వారు మనమధ్యే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. శిల్పం తయారు చేస్తున్నంత సేపు అతడు తపస్సులో ఉన్నాడా అనిపిస్తుంటుంది. అతడి పేరే రాజేష్ – విజయనగర్‌కాలనీ నగరంలో పుట్టిపెరిగిన అతడు 1993లో మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదివాడు. ఆ సమయం నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు. 2021లో అతడు రూపొందించిన సాయిబాబా విగ్రహాన్ని మహారాష్ట్రలోని షిరిడీ సంస్థాన్‌కు అందజేయగా అక్కడ ధ్యాన మందిరంలో ఆ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సజీవ శిల్పాన్ని చూసి అబ్బురపడ్డ పలువురు మరో ఐదు విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్ ఇవ్వగా ఆయన మొదటి వారంలోనే విగ్రహాలను తయారు చేసి షిరిడీ సంస్థాన్‌కు అందజేశారు. అతడి చేతులమీదుగా దివంగత జి.పుల్లారెడ్డి దంపతులు, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు, మైకెల్ జాక్సన్, రాఘవేంద్రస్వామి, చంద్రశేఖర సరస్వతిజీ, సంత్‌సేవాలాల్ విగ్రహాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర టూరిజం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎం తదితర సంస్థలకు రాజేష్ ప్రస్తుతం పెయింటింగ్, శిల్పాలు వారి ఆర్డర్ మేరకు తయారు చేసి ఇస్తున్నారు. -
నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్‌గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్‌గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్‌కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. -
ఏఐ వింతలు: చనిపోయినవారితో జూమ్ కాల్, మాటామంతీ
అబ్బు: ఏరా సుబ్బూ... ఎలా ఉన్నావు?సుబ్బు: నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటానురా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే...అబ్బు: అది సరే. భూలోక విశేషాలు ఏంటీ? కొత్త బైక్ కొన్నావా? ఇంకా ఆ డొక్కు బైకే వాడుతున్నావా(నవ్వు)గమనిక: అబ్బు రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుబ్బు తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.మరి వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారు?అదంతా ‘గ్రీఫ్‌బాట్స్’ మహిమ!‘గ్రీఫ్‌బాట్స్’ (Griefbots) లేదా ‘డెట్బాట్స్’ (deadbots) అనే ఏఐ(AI) స్టార్టప్‌లు చనిపోయిన వ్యక్తి ప్రతిరూపాన్ని సృష్టించడమే కాదు వారితో మాట్లాడిస్తాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లు చనిపోయిన వారి మాటతీరు, హావభావాలను అచ్చంగా అనుకరిస్తాయి. ప్రాజెక్ట్ డిసెంబర్, స్టోరీ ఫైల్, అండ్ యూ, వోన్లీ వర్చువల్... మొదలైన స్టార్టప్‌లు చనిపోయిన జీవిత భాగస్వామి, ఫ్రెండ్, బం«ధువు... ఇలా ఎంతోమంది ఏఐ అవతార్లతో మాట్లాడించే టూల్స్‌పై దృష్టి పెట్టాయి. దీనికోసం ప్రైవేట్ డాటాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నాయి. (Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!)జస్టిన్ హారిసన్ స్టార్టప్ ‘అండ్ యూ’ యూజర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్టార్టప్ సృష్టించిన ఏఐ–పవర్డ్ ఆడియో వెర్షన్స్ ద్వారా చని΄ోయిన వారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు (అంటే... అవతలి వ్యక్తి గొంతు అచ్చం చనిపోయిన వ్యక్తి గొంతును ΄ోలి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడతారు!)‘అమ్మా, నాన్న లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వారిచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడేవి... ఇలా చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకొని బాధ పడేవారు బోలెడు మంది ఉంటారు. అలాంటి వారికి మేము సృష్టించిన సాంకేతికత ఎంతో ఊరట ఇస్తుంది’ అంటున్నాడు జస్టిన్ హరిసన్.చనిపోయిన వారితో ‘జూమ్ కాల్’లాంటి సంభాషణలు చేయడానికి వీలు కల్పించే సాంకేతికతను యూజర్లకు అందిస్తోంది ‘స్టోరీ ఫైల్’ స్టార్టప్. కీర్తిశేషుల ఏఐ అవతార్లు కొందరికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఆత్మీయులకు ఊరట ఇస్తున్నప్పటికీ ‘గ్రీఫ్‌బాట్స్’ స్టార్టప్‌లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
52 ఏళ్లుగా కడుపులోనే టూత్ బ్రెష్..!ఐతే సడెన్‌గా..
అనుకోకుండా ఏదైనా వస్తువుని పొరపాటున మింగితే అప్పటికీ ఎలాంటి సమస్య తలెత్తదు కొందరికి. కానీ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడూ లేదా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడూ..ఆ వస్తువు ప్రాణాంతకంగా మారిపోతుంది అందుకు నిదర్శనమే ఈ ఘటన. అసలేం జరిగిందంటే..ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. యంగ్ అనే 64 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఇది గ్యాస్ నొప్పా లేక మరేదైనా అని క్షుణ్ణంగా పరిశోధించినా.. సమస్య ఏంటన్నది తేలలేదు. దీంతో అతడి జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా.. ? అని వైద్య పరీక్షలు చేస్తుండగా చిన్న పేగుల్లో ఒక వస్తువుని చూసి అవాక్కయ్యారు వైద్యులు. దాన్ని క్లియర్‌గా స్కాన్ చేయగా టూత్ బ్రష్ అని తేలింది. ఆ విషయమై సదరు పేషెంట్ యంగ్‌ని వైద్యులు ప్రశ్నించారు. అతడు తానెప్పుడో చిన్నతనంలో టూత్ బ్రెష్ మింగేసిన విషయం గుర్తు తెచ్చకున్నాడు. సుమారు 12 ఏళ్ల వయసులో టూత్ బ్రష్‌ని మింగేశానని, అయితే తల్లిదండ్రులు తిడతారని ఆ విషయం వారికి చెప్పలేదని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యంగ్. అది విని వైద్యులే కంగుతిన్నారు. ఏంటీ 52 ఏళ్లుగా కడుపులోనే ఈ టూత్ బ్రష్ ఉండిపోయిందా.. ? అని ఆశ్చర్యపోయారు వైద్యులు. నిజానికి టూత్ బ్రష్ పేగుల్లోకి చేరి తిరుగుతూ కణజాలాన్ని పంక్చర్ చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. అలా జరిగితే పేగుల్లో చిల్లులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కానీ ఇక్కడ యంగ్ విషయంలో అదృష్టవశాత్తు టూత్ బ్రష్ పేగు వంపులో చిక్కుకుపోయి..దశాబ్దాలుగా అక్కడే ఉండిపోయిందన్నారు వైద్యులు. అయితే ఇది ఇప్పుడు పేగుల్లో కదలడం మొదలవ్వడంతోనే.. యంగ్ విపరీతమైన కడుపునొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అయితే వైద్యులు చాలా గంటలు శ్రమించి ఆ టూత్ బ్రష్‌ని విజయవంతంగా కడుపులోంచి వేరు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఐదు దశాబ్దాలుగా టూత్బ్రష్తోనే జీవించాడా వ్యక్తి.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎటువంటి హాని కలిగించకపోవడం అనేది నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!) -
భారత్‌లో బిందాస్‌గా బతకొచ్చు..! అమెరికా మహిళ ప్రశంసల జల్లు
భారతదేశంపై చాలామంది విదేశీయులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇక్కడకు సరదాగా పర్యాటనకు వచ్చి మన భారతావనిపై మనసు పారేసుకోవడం విశేషం. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వమే మమ్మల్ని కట్టిపడేస్తోందంటూ..నచ్చిన విషయాలను చెబుతున్నారు. అలానే ఒక అమెరికా మహిళ భారత్‌పై మాములుగా పొగడ్తల జల్లు కురిపించడం లేదు. ఆమె ఇలా ప్రశంసించడం మొదటిసారి కాకపోయినా..ఈసారి మాత్రం భారత్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగక మానదు.అమెరికాలో లైఫ్ సౌకర్యవంతంగా ఉన్నా..భారతదేశంలోనే అంతకుమించిన జీవితాన్ని గడపగలమని అంటోంది క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ. ఆమె భారత్‌కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్‌లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్‌నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్‌ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా..పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను చూశానని అన్నారామె. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. ఎప్పటికీ తాను ఒకేలా ఉండకపోయినప్పటికీ..ఇక్కడి లైఫే నచ్చిందని పోస్ట్‌లో పేర్కొంటూ..మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని కూడా జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో ఫిషర్ హోలీ పండుగను జరుపుకుంటూ..తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఇలా స్పందించారు. భారతీయురాలిగా నా దేశాన్ని చాలా మిస్ అవుతున్నా..అని యూరప్‌లో నివశిస్తున్న ఒక భారతీయురాలు, మరొకరు..మేము త్వరలో భారత్‌కి వచ్చేస్తున్నాం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?
కాకులు దూరని కారడవులు చీము దూరని చిట్టడవులు గురించి విన్నాం కానీ..భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి ఎపుడైనా విన్నారా? అవును ఈ భూ ప్రపంచంలో పాములు, దోమలు లేని దేశం ఒకటి ఉంది. కనీసం జూలో చూద్దామన్ని కూడా కనిపించవు. అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు అక్కడ మనుగడ సాగించలేకపోయాయి. మరి భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా? అమెరికా, చైనా, జపాన్, టర్కీ, రష్యానో అనుకుంటున్నారా? కానే కాదు. పదండి తెలుసుకుందాం.ప్రపంచంలో 3,900 కంటే ఎక్కువ రకాల పాములు ఉన్నాయి మరియు భారతదేశంలో 300 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం విషపూరితం కానివే. దాదాపు 60 విషపూరిత మైనవి. కొన్ని పాములు కరిస్తే ప్రాణాపాయం కూడా. కొన్ని నివేదికల ప్రకారం, ఏ సమయంలోనైనా 110 ట్రిలియన్ దోమలు సజీవంగా ఉన్నాయని అంచనా.ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశంభారతదేశంలో, కేరళ తీరప్రాంతాలు మొదలు ఢిల్లీ, ముంబై వంటి సందడిగా ఉండే నగరాల వరకు, చల్లగా ఉండే హిమాచల్, కాశ్మీర్లో కూడా దోమలు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం ఐస్లాండ్. పాములు,ఇతర సరీసృపాలు లేకపోవడానికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి "పాములు లేని దేశం" అనే మరో పేరు కూడా వచ్చింది. అంతేకాదు అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు , దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు మాత్రం ఇక్కడ జీవించలేవు. ఐస్లాండ్లో వేగంగా మారుతున్న వాతావరణం, ఎక్కువశీతల వాతావరణం దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాతావరణం దోమల గుడ్ల అభివృద్ధి ,పొదగడానికి ఆటంకం కలిగిస్తుందట. అందుకే దోమలు, పాములు లేని ప్రశాంతమైన, శుభ్రమైన, చల్లగా ఉండే దేశం ఐస్లాండ్.ఎందుకు లేవంటేదోమలు సాధారణంగా మురుగు నీరు, నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. దోమల గుడ్లు దోమలగా మారడానికి స్థిరమైన ఉష్ణోగ్రతలు కూడా అవసరం. అయితే, ఐస్లాండ్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఐస్లాండ్ సహజ పారుదల , వేగంగా కదిలే నీటి వ్యవస్థల కారణంగా, దోమల పెంపకానికి అవసరమైన నిలిచిపోయిన నీరు, దోమల పునరుత్పత్తికి అనుమతించేంత కాలం ఉండదు.ఇక్కడి జనసాంద్రత, తక్కువ ఉష్ణోగ్రతలు దోమల గుడ్లు లేదా లార్వాల కనుగుణంగా ఉండవు. దీని వలన దోమలు వృద్ధి చెందడం కష్టమవుతుంది. దోమలు తక్కువగా ఉండటానికి ఇతర కారణాలు:కొన్ని అధ్యయనాల ప్రకారం, ఐస్లాండ్లోని భూమిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది దోమల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే, ఐస్లాండ్లో దోమల సహజ శత్రువులు కూడా ఉన్నాయి, ఇవి వాటి జనాభాను నియంత్రిస్తాయి ఇస్లాండ్లో దోమల్ని పోలిన కీటకాలుంటాయి. కానీ ఇవి కట్టవు, వ్యాధులను వ్యాప్తి చేయవు. అలాగే పాములు నివసించలేని చల్లని దేశం ఐస్లాండ్. ఐస్ లాండ్ పేరుకు తగ్గట్టే.. చల్లటి మంచు ప్రదేశంలో వాతావరణం పాముల మనుగడకు ఏమాత్రం అనువుగా ఉండదు.ఈ మంచు ప్రాంతంలో పాములు ఏమాత్రం జీవించలేవు. చుట్టూ నీటితో నిండి ఉండటం కూడా ఒక కారణం. పాములు మహా సముద్రాలను దాటవు. దోమలు అంత దూరం ఎగరవు. అందుకే ఐర్లాండ్‌లో కూడా దోమలు కనిపించ వని చెబుతారు. ఇదీ చదవండి: నేచురల్ బ్యూటీ లుక్ : సీక్రెట్ షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కాగా ప్రపంచంలో పాములు లేని ఐర్లాండ్, దేశం న్యూజిలాండ్ , గ్రీన్లాండ్, అలాస్కా లాంటి ప్రాంతాల్లో కూడా పాములు కనిపించవు. అక్కడి వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. -
గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..
రోజూ ట్రాఫిక్‌లో గంటసేపు వేచి ఉండి, రెండు సార్లు హారన్ కొట్టి, మూడోసారి ఆరెంజ్ లైట్లో బ్రేక్ వేసి, చివరికి కాళ్లు బైక్ పెడల్స్‌పై కంటే నేలపైనే పెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రయాణ కష్టాలన్నింటికీ ఓ సింపుల్ జెట్ ఇంజిన్ పరిష్కారం చూపుతోంది. ఇది ‘హోవర్ బైక్’. పోలండ్‌కు చెందిన ‘వోలోనాట్’ అనే సంస్థ, అచ్చం ‘స్టార్ వార్స్’ సినిమాలో స్కైవాకర్ వాడిన స్పీడర్ బైక్ మాదిరిగా, చక్రాలు లేకుండా, ప్రొపెల్లర్లు లేకుండా, గాల్లో తేలిపోయేలా ఈ బైక్‌ను రూపొందించింది. గంటకు 200 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లే ఈ హోవర్ బైక్ స్టార్ట్ చేసిన క్షణమే, నేలను తాకకుండా నేరుగా గాల్లోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఇంకా అసలు మజా ఏంటంటే.. దీనికి స్టీరింగ్ ఎలా ఉందో? బ్రేకులు ఎక్కడ పెడతారో? ధర ఎంతవుతుందో? ఇవన్నీ ఇంకా మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ట్రయల్ రైడ్‌లో మాత్రమే కనిపించింది. కాని, ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే, ఇక మన ట్రాఫిక్ పోలీసులు గాలిలో ఎగిరే ఈ బైక్‌ల వెంబడి డ్రోన్లు పంపించి ఫైన్ వేయాల్సిన రోజులు వస్తాయేమో! (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..) -
అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.అదొక థీమ్ పార్కు. ఇంగ్లండ్‌లోని చెసింగ్టన్ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్’. ఈ థీమ్ పార్కులో కూడా మిగిలిన థీమ్ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్స్టార్ సఫారీ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.ఈ హోటల్లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్ గదుల కారిడార్‌లో ప్రతి సాయంత్రం క్రిస్మస్ బ్యాండ్ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్ వేషధారులు పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్లో నిత్యక్రిస్మస్ గదులను బుక్ చేసుకుంటే, ఉచితంగా థీమ్‌పార్కు టికెట్లు ఇస్తారు. (చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..) -
తేనెటీగల డాన్సింగ్ సీక్రెట్ : నోబెల్ బహుమతి కూడా
పిల్లలూ, మనం మన స్నేహితులను మనతో ఆడుకోవడానికి మనం ఎలా పిలుస్తాం? మాటలతోనో, సైగలతోనో పిలుస్తాం కదా! మరి తేనెటీగలు (HoneyBees) వాటి తోటి ఫ్రెండ్స్ ని పిలవాలంటే ఎలా పిలుస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదా! అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగలు పువ్వుల ద్వారా తేనెని సేకరిస్తాయి అని మనందరికి తెలుసు. అయితే, అన్ని తేనెటీగలు మాకుమ్మడిగా పువ్వులను వెతకడానికి వెళ్ళవు. ముందుగా స్కౌట్ బీ లేదా కార్మికటీగ వెళ్ళి తేనెకు అనుకూలమైన పువ్వులను కనుగొంటుంది. ఆ తరువాత తేనెపట్టులోకి తిరిగివచ్చి, తన సహచర తేనెటీగల ముందు ఒక వత్తాకారంలో తిరుగుతూ, ఆ తర్వాత నడుము కదిలిస్తూ నృత్యం చేస్తుంది. దీనిని ‘వాగ్గిల్ డ్యాన్స్‘ (Waggle Dance) అని అంటారు. ఈ డాన్స్ ద్వారాటీగ తన శరీరాన్ని సూర్యుని దిశకు సంబంధించి ఏ కోణంలో కదిలిస్తుందో, అది పుష్పాలు ఉన్న దిశను సూచిస్తుంది. ఈ విధంగా, ఒకే నృత్యంతో దూరం, దిశ, మరియు కొన్నిసార్లు పుష్పాల నాణ్యత కూడా తెలియజేస్తాయి. ఈ డ్యాన్స్‌ను 1940లలో ఆస్ట్రియన్ శాస్త్రవేత్త కార్ల్ వాన్ ఫ్రిష్ అధ్యయనం చేసి, దాని రహస్యాలను వెల్లడించారు, దీనికిగాను అతనికి నోబెల్ బహుమతి కూడా లభించింది.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు -
రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు
భువనేశ్వర్: అదృష్టవశాత్తూ, దిఘా నదీముఖద్వారంలోకి అడుగుపెట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే 29 అరుదైన ,అత్యంత విలువైన 'తెలియా భోలా' చేపలను పట్టుకుని మిలియనీర్ అయ్యాడు.వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్ ట్రాలరు నుంచి పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకేసారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది. దెబ్బకి లక్షాధికారి అయిపోయాడు.#WATCH | Balasore: Fisherman catches 29 Telia Bhola fish, sells for Rs 33 lakh and becomes a millionaire overnight.#Odisha pic.twitter.com/vr6TQUncrd— Kalinga TV (@Kalingatv) June 19, 2025 ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..! -
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్‌లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్‌లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు. -
కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ జెండాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 సందర్భంగా కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ పెట్ ఇండియా జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జెండా ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో చోటుదక్కించుకుంది. రీసైకిల్డ్ మెటీరియల్ వినూత్న ఆవిష్కరణ కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకుంది. ఈ మేరకు కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా మాట్లాడుతూ.."ఈ ఆవిష్కరణకు సహకరించిన ‘గో రివైజ్’, ఐసీసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రీసైక్లింగ్ వ్యర్థాలను విలువైన వనరులుగా ఎలా మార్చవచ్చో చెప్పేందుకు ఈ జెండా నిదర్శనం. ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు అనేది మా పురురోగతని పునరుద్ఘాటించేలా గర్వపడే క్షణం". అని అన్నారు. ఇక గో రివైజ్ వ్యవస్థాపకుడు యష్ శర్మ ఇది పర్యావరణ బాధ్యతపై శక్తిమంతమైన స్ప్రుహని అందిస్తోంది. కాగా, కోకాకోలా ఇండియా మైదాన్ సాఫ్ ప్రచారంలో భాగంగా ఈ జెండాను ఇలా వినూత్నంగా రూపొందించారు. దీన్ని 11వేల పోస్ట్-కన్స్యూమర్ PET బాటిళ్లతో రూపొందించారు. ఈ జెండాని భారత్‌లో ఆడే ప్రతి ప్రపంచకప్ మ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలో సగర్వంగా ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. అంతేగాదు అక్టోబర్ 5, 2023 ప్రారంభమైన ఈ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్.. నవంబర్ 19 వరకు మొత్తం 19 స్టేడియంలలో సుమారు వెయ్యిమందికి పైగా వాలంటీర్లు రీసైకిల్డ్ పెట్ బాటిళ్లతో తయారు చేసిన సేఫ్టి జాకెట్లను ధరించి, ప్రేక్షకులకు స్టేడియంను క్లీన్‌గా చూసుకోవడంపై అవగాహన కల్పించడం విశేషం.(చదవండి: ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్..! ఎవ్వరైనా ఫిదా అవ్సాల్సిందే) -
బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్‌కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!) -
నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!
ఆర్థికంగా వెనకబడిని వారికి ఉన్నత చదువులు అందని ద్రాక్షలాంటివే. చదవగలిగే ప్రతిభ ఉన్న..అందుకు తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం కరువైతే..వారి ప్రతిభ అడుగంటిపోతుంది. పైగా దేశం గొప్ప మేధావులను కోల్పోతుంది కూడా. ఆ ఉద్దేశ్యంతో వెనుబడిన వర్గాల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో చదువుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలా ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఈ మూగ్గురు అమ్మాయిలు ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షల్లో సత్తా చాటారు. అంతేగాదు సర్కారు చదువు సత్తా ఏంటో తెలిసేలా చేశారు. యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ మారిహాన్ గ్రామంలోని ప్రభుత్వ సర్వోదయ విద్యాలయానికి చెందిన మొత్తం 12 మంది బాలికలు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హాజరైన బాలికల్లో దాదాపు సగానికి పైగా అందరు వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యూపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఘనత ఇది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఏర్పాటైన సర్వోదయలో బాలికలు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో వారంత ఆరు నుంచి 12 తరగతులు వరకు చదువుకుంటారు. అక్కడే రెడిడెన్షియల్ స్కూల్లో ఈ ఏడాది జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ కూడా పోందారుద. వారిలో వ్యవసాయ కూలీ కూతురు ప్రిన్సీ, రైతు కూతురు పూజ రంజన్, సైకిల్ సీట్ కవర్లు అమ్మే దుకాణందారుడు కూతురు కౌశాంబి శ్వేత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారి వచ్చిన నేపథ్యం దృష్ట్యా డాక్టర్ కావలనే కోరిక మసకబారిపోతుందనే అనుకున్నారు. అందులోనూ ప్రభుత్వ పాఠశాల చదవే తాము ఈ నీట్ ఎగ్జామ్ లాంటి వాటి కోసం కోచింగ్ తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి డాక్టర్ కావడం అనేది ఓ కలేనేమో అనుకున్నారు ఆ అమ్మాయిలు. వారి అదృష్టమో లేక వరమో గానీ నవోదయ పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ అయిన టాటా AIG, మాజీ నవోదయ ఫౌండేషన్ మద్దతుతో వారు ఉంటున్న మారిహాన్ గ్రామంలోనే నీట్ కోచింగ్ 2024 చిన్నగా ప్రారంభమైంది. అది వారికి వరమైన ఆ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యిందుకు తోడ్పడింది. ఆ చిన్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామ్‌లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులై తమ కలను సాకారం చేసుకున్నారు. ఆ స్వచ్ఛంధ సంస్థలో సుమారు 39 అడ్మిషన్ పోందగా వారిలో 25 మంది నీట్కి, మిగతా 14 మంది జేఈఈకి ప్రిపేరయ్యారు. అయితే ఆ నీట్ ఎగ్జామ్‌కి హాజరైన 25 మందిలో 12 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. దీన్ని మిగతా సర్వోదయ విద్యాలయాల్లో కూడా అందించి.. వెనుబడిన వర్గాల పిల్లలందరూ ఇలాంటి ఉన్నత చదవులు చదువుకుని తమ కలను సాకారం చేసుకునేలా చేయడమే తమ ధ్యేయం అని మారిహాన్ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కుమార్ ప్రశాంత్ అన్నారు. (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!) -
World Crocodile Day 2025 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్, అలరించిన సాండ్ క్రొకోడైల్స్
World Crocodile Day ను ప్రతీ ఏడాది జూన్ 17న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 2017లో జరుపుకున్నారు. మొసలి పరిశోధన కూటమి దీన్ని మొదలు పెట్టింది., ది బెలిజ్ జూ & ట్రాపికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాయి. ప్రాముఖ్యత:అనేక నదులు , చిత్తడి ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలో మాంసాహారాలుమొసళ్లు. నీరు , భూమి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మాంసాహారులుమొసళ్ళు సహాయపడతాయి.మొసళ్ళు అంతరించిపోతే, ఆహార గొలుసు తీవ్రంగా ప్రభావితమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొసళ్ళ గురించి ఆసక్తికరమైన విషయాలు: ప్రపంచంలో దాదాపు 23 జాతుల మొసళ్ళు ఉన్నాయి.ఉప్పునీటి మొసలి ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపాలు - ఇది 7 మీటర్ల పొడవు ,1000 కిలోల వరకు బరువు ఉంటుంది.గుడ్లు పెట్టడం ద్వారా జాతిని వృద్ధి చేస్తాయి.భారతదేశంలో మొసళ్ల స్థితి:భారతదేశంలో మూడు ప్రధాన జాతులు కనిపిస్తాయి:మగ్గర్ లేదా మార్ష్ మొసలిఉప్పునీటి మొసలిఘరియల్ఘరియల్ను IUCN తీవ్రంగా ప్రమాదంలో ఉన్నట్లు ప్రకటించింది.భారతదేశంలో 1975లో "మొసలి సంరక్షణ ప్రాజెక్ట్" ప్రారంబించారు.దీని ఫలితంగా ఒడిశాలోని భితార్కనికా వంటి ప్రాంతాలలో వాటి సంఖ్య భారీగా పెరిగింది.పరిరక్షణ సవాళ్లు: నదీ తీరాలు అక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో వీటి ఉనికి ప్రమాదంలో పడింది. మొసళ్లు అంతరించిపోవడంలో వేట(చర్మం, మాంసం, మందుల కోసం) అనేది మరో ప్రధాన కారణం. చేపల వేటలో చిక్కుకోవడం వల్ల మరి కొన్నిమరణాలు సంభవిస్తున్నాయి. ఆకర్షించిన సైకత మొసళ్లు రాష్ట్రంలో మొసళ్ల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రాజెక్టు క్రోకోడైల్ ఇన్ ఒడిశా’ కార్యక్రమం చేపట్టి మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తయింది. మరోవైపు ప్రపంచ మొసళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత మొసళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. -
ఆ తాతకు భార్య అంటే ఎంత ప్రేమ..! వీడియో వైరల్
దాంపత్యం అనే పదానికి ప్రస్తుతం విలువ లేకుండా పోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధ జంట భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచి ఎందరికో కనువిప్పుకలిగించారు. మలిసంధ్యలో ఉన్న ఆ దంపతులు మధ్య అనురాగానికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్‌లో సాంప్రదాయ తెల్లటి ధోతి కుర్తా టోపి ధరించి 93 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఒక ఆభరణాల దుకాణం వద్దకు వచ్చాడు. సిబ్బంది అతడి ఆహార్యాన్ని చూసి ఏదో డబ్బు సాయం అడగడానికి వచ్చాడేమో అనుకున్నారు. అయితే అతడు తన భార్య కోసం మంగళసూత్రం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు చెప్పడంతో దుకాణ యజామని ఆశ్చర్యపోయాడు. అతడిని సాదరంగా ఆహ్వానించి తనకు నచ్చిన మంగళ సూత్రాన్ని అతి తక్కువ ధరకే ఇచ్చి పెద్దమనసు చాటుకున్నాడు ఆ ఆభరణాల యజమాని. ఆ వృద్ధుడికి తన భార్యపై ఉన్న ప్రేమ అనురాగానికి వెలకట్టకూడదనే ఇలా చేశానంటూ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. నిజానికి ఆ వృద్ధుడు ఆ మంగళ సూత్రం కోసం దుకాణం యజమానికి రూ. 1,120 ఇచ్చాడు. అయితే తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఆ వృద్ధుడి తాపత్రయం ఆ దుకాణం యజామనిని మంత్రముగ్దుడిని చేసింది. దాంతో ఆ యజమాని కేవలం రూ.20లకే ఆ ఆభరణాన్ని ఆ దంపతలుకు ఇచ్చేశాడు. కాగా, ఆ వృద్ధ దంపతుల పేర్లు నివృత్తి షిండే, శాంతబాయిలు. ఆ జంట జల్నా జిల్లా, అంభోరా జహాగీర్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అక్కడి స్థానికుల సమాచారం ప్రకారం..ఇద్దరు ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి వేడుక కోసం కాలినడకన పంఢర్‌పూర్‌కు తీర్థయాత్ర చేస్తున్నారట. అలాగే ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడట. అయితే ఆ వృద్ధ దంపతులు అతడిపై ఆధారపడకుండా జీవిస్తాని, తరుచుగా తీర్థయాత్రలు చేస్తుంటారని చెబుతున్నారు గ్రామస్థులు. నెటిజన్లు సైతం వారి మధ్య ఉన్న అనురాగానికి ఫిదా అవ్వుతూ.. మలిసంధ్యాలో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Gopika Jewellery Sambhajinagar (@gopika_jewellery_sambhajinagar) (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!) -
ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..
పిల్లల కోసం ఎన్నో జంటలు పరితపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం, సరైన జీవన విధానం లేక పల జంటలు వంధ్యత్వంతో బాధపడతున్న తీరు వర్ణనాతీతం. ఇక ఐవీఎప్ వంటి సంతానసాఫల్యత విధానాలను ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరికి ఇవికూడా వర్కౌట్ కాక, మానసికంగా, శారీరకంగా పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. దాంతో అలాంటి జంటలు ఇక సరోగసి ద్వారా పిల్లలను పొందే ప్రయత్నం చేస్తుంటారు. అలానే ఇక్కడొక జంట ప్రయత్నించింది. వారు ఒకలా తలిస్తే భగవంతుడు మరోలా దీవించాడు. ఏం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన రోహన్, కేట్ సిల్వాల జంట పిలల్లు లేక అల్లాడిపోయారు. ఆఖరికి ఐవీఎఫ్‌ని ఆశ్రయించిన ఫలితం శూన్యం. దాదాపు 20 సార్లు ఐవీఎఫ్ విధానంలో పెయిల్యూర్సేనే చవిచూసి విసగిపోయి సరోగసికి వెళ్లారు. సరిగ్గా ఆ తరుణంలో ఆ జంట బాధను చూసి దేవుడికే జాలి కలిగిందో ఏమో అనూహ్యంగా కేట్ సహజ పద్ధతిలో గర్భవతి అయ్యింది. అది కూడా 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అవ్వడం విశేషం. మరోవైపు సరోగసి ప్రయత్నం కూడా సఫలమైంది. అయితే ఆ దంపతులు ఎదుర్కొన్న ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ దృష్ట్యా రెండు గర్భాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ మహిళ కేట్ మందుగా బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత సరోగసి మదర్ అవా నాలుగు నెలలకు పండండి బిడ్డను ప్రసవించింది. అలా ఆ జంట 'అరుదైన ట్విబ్లింగ్స్'ని స్వాగతించారు. అంతేగాదు వారి పిల్లల జనన అంతరం గురించి చెబుతుంటే బంధువులు, స్నేహితులు అంతా విస్తుపోతున్నారని ఆనందంగా చెబుతోంది ఈ జంట. అంతేగాదు మా ఇద్దరి పిల్లలను చూసిన వారు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వారి జననగాథ విని వావ్..వాట్ ఏ మిరాకిల్ అంటూ మమల్ని అభినందిస్తుంటారని చెబుతున్నారు ఈ దంపతులు. చూడటానికి తమ పిల్లలు నిజమైన కలవలల్లా కనిపిస్తారని కానీ వారు వయసు అంతరం విని షాకవ్వుతారని చెబుతున్నారు. ఇలా నాలుగు నెలలు తేడాతో పుట్టిన కవలలను "కాలిఫోర్నియన్ కవలలు" అని పిలుస్తారట. -
Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు
Air India plane crash అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు. సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్ సహాయాన్ని ప్రకటించారు..కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డా. షంషీర్ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.They were future frontline heroes.Manav, Aaryan, Rakesh, and Jaiprakash were preparing to save lives, not lose their own. The AI171 crash took them from us. Pledging ₹6 crore to support their families and others affected.#AirIndia171 #AI171 #BJMedicalCollege pic.twitter.com/Jh0vivpstJ— Dr. Shamsheer Vayalil (@drshamsheervp) June 16, 2025ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్‌తో ముప్పే..!డాక్టర్ వార్నింగ్కాగా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతుల్య హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది. -
Shubhanshu Shukla: ఆహా... అంతరిక్షంలో గాజర్ హల్వా
శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు సంబంధించిన ఆసక్తి శాస్త్రీయ విషయాలకే పరిమితం కాలేదు.‘అక్కడ ఏంతింటారు?’ లాంటివి కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు.శుక్లా తనతో పాటు భారతీయ రుచులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నాడు.‘ఇస్రో’ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు, గాజర్ హల్వా తీసుకువెళతాడు. ఈ వంటకాలను మొదట భారతదేశ గగన్‌యాన్ మిషన్ కోసం తయారుచేశారు. వాటిని ఇప్పుడు ‘యాక్సియం–4’ మిషన్ కోసం ఉపయోగించనున్నారు.అంతరిక్ష పరిస్థితులను తట్టుకునేలా, మై క్రో గ్రావిటీలో తినడానికి తేలికగా, సురక్షితంగా, తాజాగా ఉండేలా ఈ ఆహారపదార్థాలను తయారుచేశారు. భారతీయ వంటకాలను ‘యాక్సియం–4’ మిషన్ కోసం ఆమోదించడం అంత తేలికగా జరగలేదు.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?‘భారతీయ వంటకాలలో మసాలాలు అధికంగా ఉన్నందున వాటిని తీసుకువెళ్లడానికి అనుమతి లభించడం కష్టం అయింది. చివరకు కొన్ని రకాల ఆహారపదార్థాలను అనుమతించారు. తన వెంట తీసుకువెళుతున్న భారతీయ వంటకాలను తోటి వారికి రుచి చూపించాలని శుభాంశు ఉత్సాహంగా ఉన్నాడు’ అంటుంది లక్నోలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శుక్లా సోదరి సుచి శుక్లా. -
ఆ కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..!
ఇటీవల కాలంలో బ్రూణ హత్యలు ప్రభలంగా జరుతున్నాయి. ఆడపిల్ల అనగానే ఎక్కడలేని అక్కసు చూపిస్తూ..భూమ్మీద పడకుండానే చూస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఎంతలా ఐఏ వంటి సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఆడపిల్ల అనే విషయంలో వివక్ష మాత్రం ఉంటూనే ఉంది. ఎందుకనో గానీ మగబిడ్డ అనగానే సంబరాలు చేసుకోగలిగినంతగా ఆడపిల్ల పుట్టింది అనంగానే ఆ ఊసే రాదు. పైగా ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చేస్తుంది కొందరికి. కానీ ఇక్కడ అలాంటి వాటన్నింటికి భిన్నంగా ఓ ఆడశిశువుకు మహారాణి రేంజ్లో స్వాగతం పలికి అందర్నీ ఆశ్చర్యపరించింది ఓ కుటుంబం. ఈ ఘటన ఆడపిల్లలు ఎన్నటికీ మహారాణులు..వాళ్లు నట్టింట తిరుగాడితే..మహాలక్ష్మీ ఇంటికి వచ్చినంత వేడుక అనే చాటిచెప్పేలా ఈ కుటుంబం సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ కుటుంబం తమ ఇంటిలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన తొలి ఆడ శిశువు జననం అని ఎంతలా గ్రాండ్‌గా స్వాగతం పలికారో చూస్తే..రెండు కళ్లు చాలవు. ఓ వీఐపీ మాదిరికి భారీ వాహనాల కాన్వాయితో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి వద్ద పింక్ కలర్ బెలూన్లు, అందమైన పూలతో ఆ చిట్టిపాపాయికి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ వీడియోకి మా కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా కూమార్తెను స్వాగతించడంలో ఓ గర్వం, మాటల్లో చెప్పలేని ఆనందం ఆ కుంటుంబంలో ప్రతిబించిందని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Chahat Rawal (@dr.chahatrawal) (చదవండి: ఆ తండ్రి ప్రాణం నిలుపుతుంటే..కుమార్తె ప్రాణం పోస్తోంది..) -
మూడు సంస్థానాలు.. 46 జాగీర్లు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్ర పుటల్లో అనేక పేజీలు లిఖించుకుంది. కాకతీయుల పాలన తరువాత కూడా ఇందూరు సీమలో పలువురు సంస్థానాదీశులు, జాగీర్దార్లు తమదైన ముద్ర వేశారు. ఇందులో కీలకమైన దోమకొండ సంస్థానం, సిర్నాపల్లి సంస్థానానికి చెందిన కోటలు ఆకట్టుకుంటున్నాయి. కౌలాస్ కోటను మాత్రం సందర్శకులు వచ్చేలా అభివృద్ధి చేయకపోవడం గమనార్హం.దోమకొండ సంస్థానం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ సంస్థానం (Domakonda Samsthanam) మూలస్థానం భిక్కనూరు. ఈ సంస్థానం కేంద్రం కొంతకాలం రామారెడ్డి, కామారెడ్డిల్లో ఉండేది. చివరకు దోమకొండ కేంద్రంగా స్థిరపడింది. ఈ సంస్థానాధీశులు మొదట కుతుబ్‌షాహీలు, తరువాత అసఫ్‌జాహీలకు సామంతులుగా ఉన్నారు. కామినేని వంశస్తుడైన కామినేడు దీనికి మూలపురుషుడు. కామిరెడ్డి, కామినేని చౌదరిగా పేరుపొందాడు. కామిరెడ్డి కుమారుడు కాచారెడ్డి, కాచారెడ్డి కుమారుడు రాజన్న చౌదరి, రాజన్నచౌదరి కుమారుడు రాజేశ్వరరావు, ఈయన కుమారుడు పెద్ద రాజేశ్వరరావు, తరువాత రాజేశ్వరరావు సోదరుడు అన్నారెడ్డి, అన్నారెడ్డి తరువాత ఇతని కుమారుడు ఉమాపతిరావు, తరువాత ఇతని కుమారులు రామచంద్రరావు, సోమేశ్వరరావు, తరువాత సోమేశ్వరరావు కుమారుడు రెండో ఉమాపతిరావు, తరువాత ఇతని కుమారుడు రాజేశ్వరరావు, అనంతరం ఈయన కుమారుడు రాజా సోమేశ్వరరావు పాలించారు. 300 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా దోమకొండ సంస్థనాదీశులు పాలన చేశారు.కౌలాస్ సంస్థానం.. కాకతీయుల తరువాత కొద్దికాలం పాటు ఈ ప్రాంతం విజయనగర రాజుల పాలనలో ఉండేది. కుతుబ్‌షాహీల తరువాత, అసఫ్‌జాహీల పాలనలో ఉండేది. అయితే రాజస్తాన్ రాజపుత్ర వంశానికి చెందిన గోపాల్‌సింగ్ గౌర్ దక్కనుకు వచ్చి నిజాం సైన్యంలో అధిపతిగా చేరాడు. మహారాష్ట్ర సైన్యంతో వీరోచిత పోరాటం చేయడంతో ఇతనికి నిజాం కౌలాస్ కోటను అప్పగించాడు. ఇతని తరువాత రాజా పదంసింగ్ గౌర్, రాజాకున్వర్ నరేందర్‌సింగ్ గౌర్, రాజాకున్వర్ నైన్‌సింగ్ గౌర్, రాజాకున్వర్ దీప్‌సింగ్ గౌర్ పాలించారు. రాజాకున్వర్ దీప్‌సింగ్ గౌర్ ద్వారా అనేక పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తరువాత దుర్జన్‌సింగ్, జగత్సింగ్, శివసదన్ సింగ్ పాలించారు. శివసదన్‌సింగ్ ఆరుగురు కుమారుల్లో ఒకరైన అజిత్‌కుమార్ సింగ్ భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసి, తరువాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎన్సీసీ అధికారిగా అనేకమంది అధికారులను తీర్చిదిద్దారు.భూమి ధారాదత్తం రాజుల సేవలో పాలు పంచుకున్నందుకు, యుద్ధాలలో పాల్గొన్నందుకు, ఆపద సమయాల్లో ఆదుకున్నందుకు, ఇతర కారణాలతో, రాజులు కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేశారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారు సంస్థానాదీశులు, జాగీర్దార్లు, జమీన్దారులు, మాషుదార్లు, ముననబ్‌దార్లుగా పిలవబడ్డారు. సంస్థానాలు అంటే చాలా మొత్తంలో ఎక్కువ గ్రామాలు ఏలుబడి కలిగిన అధికారం అని, సంస్థానాదీశులు అంటే ఆ ప్రాంతానికి అధికారులని అర్థం. నిజామాబాద్ జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాలతో పాటు 46 జాగీరులు ఉండేవి.చదవండి: కాశీ తర్వాత కందూరే!సిర్నాపల్లి సంస్థానం.. ఇందూరు జిల్లాలో సిర్నాపల్లి సంస్థానం (Sirnapalli Samsthanam) ప్రత్యేకమైనది. దీని సంస్థానాదీశుడు చెన్నారెడ్డి. తరువాత ఆయన కుమారుడు రఘుపతిరెడ్డి, చెన్నారెడ్డి, రాంరెడ్డి, రఘునాథరెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, చెన్నారెడ్డి వరుసగా వంశపారంపర్యంగా పాలించారు. చెన్నారెడ్డి మరణంతో ఆయన భార్య రాణి ఉషమ్మ 1203లో అధికారం చేపట్టింది. ఆమె తరువాత రాజారామ్ పాలించారు. తరువాత రాజారామ్ మరణంతో ఆయన భార్య జానకీబాయి సంస్థానాదీశురాలయ్యారు. తరువాత ఈమె కుమారుడు రఘుపతిరెడ్డి, తరువాత ఆయన కుమారుడు ప్రతాపరెడ్డి పాలించారు. 1294లో ప్రతాపరెడ్డి మరణంతో ఆయన భార్య శీలం జానకీబాయి బాధ్యతలు చేపట్టింది. శీలం జానకీబాయి ఆధ్వర్యంలో అనేక చెరువులు తవ్వించారు. చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించారు. ఇప్పటికీ ఈమె తవ్వించిన చెరువులు నీటితో నిండి సాగుకు ఉపయోగపడుతున్నాయి. నిజామాబాద్ నగరంలో గంజ్ స్తంభాన్ని నిర్మించారు. జానకీబాయి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. జానకీబాయికి సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడు రఘుపతిరెడ్డిని దత్తత తీసుకుని రాణి మంగమ్మతో వివాహం జరిపించగా.. రెండేళ్లకే రఘుపతిరెడ్డి మరణించాడు. దీంతో రాణి మంగమ్మ శీలం రామలింగారెడ్డిని దత్తత తీసుకున్నారు. జానకీబాయి మరణానంతరం రామలింగారెడ్డి అధికారం చేపట్టి, వనపర్తి సంస్థానాదీశుడైన రెండో రాజారామేశ్వరరావు కుమార్తె జానకమ్మను వివాహం చేసుకున్నాడు. తరువాత రామలింగారెడ్డి కుమారుడు రాంభూపాల్ సంస్థానాదీశుడయ్యాడు. నిజాం రాజ్యం పతనమయ్యాక రాంభూపాల్ ఐఏఎస్ ఉత్తీర్ణుడై కలెక్టరుగా పనిచేశాడు. రాంభూపాల్ ఇద్దరు కుమారులు ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడ్డారు. కుమార్తె అనురాధరెడ్డి మాత్రం చరిత్ర పరిశోధన, సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. -
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్‌లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?) -
41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే!
ఆధునిక కాలంలో బరువును తగ్గించుకోవడం కాదు.. వయసును తగ్గించుకోవడం ట్రెండ్‌గా మారింది. ఈ విషయంలో లండన్‌కు చెందిన 41 ఏళ్ల వైద్యుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తన అసలు వయసుతో తెలిస్తే జీవసంబంధమైన వయస్సు 24 సంవత్సరాలు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. పదండి మరి ఆ వివరాలుతెలుసుకుందాం.మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్, ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన వయసును తగ్గించుకోవడంలో విజయవంతమయ్యాడు. తాజాగా లండన్‌కు చెందిన Hum2n longevity క్లినిక్ వ్యవస్థాపకుడు 41 ఏళ్ల డాక్టర్ ఎనాయత్ తన క్రోనోలాజికల్ ఏజ్ కంటే బయో ఏజ్ 24 సంవత్సరాలని ప్రకటించుకున్నాడు. 18 నెలల క్రితం తీసుకున్న పరీక్షల ఆధారంగా తన వయస్సు 17 సంవత్సరాలు తగ్గిందని తెలిపాడు. ఇందుకోసం డాక్టర్ ఎనాయత్ ఏడేళ్లుగా ఔరా రింగ్, హూప్ స్ట్రాప్ వంటి పరికరాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, మూత్రం, మైక్రోబయోమ్ పరీక్షలతో పాటు తన ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించుకున్నాడు. ఫలితాల ఆధారంగా అతను సప్లిమెంట్లతో సహా ఆయుష్సును పెంచే జీవన శైలిని పాటించాడు. ప్రధాంగా బీకాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వంటి సప్లిమెంట్లు తన బయో ఏజ్‌ను తగ్గించాయని చెప్పడం గమనార్హం. "ఈ సప్లిమెంట్లు నా జీవసంబంధమైన వయస్సు వెనక్కి మళ్లడానికి మద్దతు ఇచ్చాయని బిజినెస్ ఇన్సైడర్తో అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..విటమిన్ బి కాంప్లెక్స్మిథైలేషన్ జన్యు లోపం కారణంగా హోమోసిస్టీన్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇవి ఈ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా, డైటీషియన్లు ఆహారం ద్వారా పోషకాలను పొందాలని, కొన్ని పోషకమైన ఆహారాలు లోపం లేదా తీసుకోలేక పోవడం వంటి సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు ,ఆకుకూరలు వంటి బి విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.అయితే బీవిటమిన్లు మెరుగైన మానసిక స్థితి, చిత్తవైకల్య నివారణకు అనుసంధానించబడి ఉండవచ్చు, కానీ ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరంఅంటున్నారు నిపుణులు."మిథైలేషన్-సంబంధిత జన్యు లోపం లేకుండా కూడా, ముఖ్యంగా అధిక ఒత్తిడి, పేలవమైన నిద్ర లేదా ఇంటెన్సివ్ శిక్షణ కాలంలో మిథైలేటెడ్ బి కాంప్లెక్స్ తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ పరిశీలిస్తాను, ఎందుకంటే ఇవి బి విటమిన్ల డిమాండ్‌ను పెంచుతాయి" అని డాక్టర్ ఎనాయత్ అన్నారు.మెగ్నీషియండాక్టర్ ఎనాయత్ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నందున మెగ్నీషియం బిస్గ్లైసినేట్ తీసుకుంటాడు. మెరుగైన శోషణ కోసం, దాని స్థాయిలను పెంచడానికి సహాయ పడేలా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. చిక్కుళ్ళు, ఆకుకూరల్లో ఇది లభిస్తుంది.మెగ్నీషియం తీసుకోవడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని, నిద్రను మెరుగు పరుస్తుందని, తద్వారా తాను చాలా సులభంగా నిద్రపోతానని డాక్టర్ ఎకాయత్ చెప్పారు.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు డాక్టర్ ఎనాయత్ ప్రతిరోజూ ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకుంటాడు. చేపలు, వాల్నట్లు, చియా విత్తనాలలో లభించే ఒమేగా-3లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. వాపును, రక్తపోటును తగ్గిస్తాయి. కొవ్వు చేపలను వారానికొకసారి తినడం హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షించడానికి నిరూపించబడినప్పటికీ, సప్లిమెంట్ రూపం ప్రయోజనాలు అంత స్పష్టంగా లేవు. అయితే, కొన్ని పరిశోధనలు ఒమేగా-3 సప్లిమెంట్లు యాంటీ-ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనంలో ఒమేగా-3లు రోజూ తీసుకున్న పాల్గొనేవారు తక్కువ జీవసంబంధమైన వయస్సు తగ్గినట్టు గుర్తించారు. నోట్: ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే పోషకమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ బయోలాజికల్ ఏజ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసేటపుడు నిపుణుల పర్యవేక్షణచాలా అవసరం అని గుర్తించాలి. -
Latte లాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. ఏమిటీ ‘ చిత్రం’
పొగలు కక్కే కాఫీ కావాలని అడిగేవారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కళ కళ లాడే కాఫీ కావాలని అడిగేవారు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. శతాబ్దాలుగా పానీయాల ప్రియుల్ని అలరిస్తున్న కాఫీ ఇప్పుడు కళాభిమానులనూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కళ కూడా శతాబ్దాల నాటిదేనని ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాల్లో 17వ శతాబ్దం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. చల్లని సాయంత్రాల్లో చేతికి అందే ఒక కప్పు కాఫీ మనల్ని రీఛార్జ్ చేస్తుంది. అదే కాఫీ నగరంలోని కొందరి చేతుల్లో నుంచి అద్భుత కళలను ఆవిష్కరిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో Latte Coffe చిత్రకారులు కాఫీపొడి, డికాక్షన్ వగైరాలతో పోట్రెయిట్స్, వన్యప్రాణుల చిత్రాలు, ల్యాండ్ స్కేప్‌లు, ఆబ్స్ట్రాక్ట్స్.. సృష్టిస్తున్నారు. ఆర్గానిక్ కలర్ ఉపయోగించడం కాఫీ ఆర్ట్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ సేంద్రీయ లేత, ముదురు బ్రౌన్ కలర్ ఆధారిత షేడ్స్ నుంచి పుట్టే చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కాఫీని రంగులా మార్చుకుని బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి చిత్రాలు గీస్తారు. ఇవి వైవిధ్యంగా, అనేక సంవత్సరాల పాటు నిలిచిపోయేలా ఉంటాయి. సోషల్ మీడియా ప్రచారం.. మన దేశంలో ఈ కళ కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా బాగా విస్తరిస్తోంది. యువ కళాకారులు తమ ఇన్‌స్టా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కాఫీ ఆర్ట్ ప్రదర్శిస్తూ ప్రాచుర్యం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో.. కాఫీతో పోట్రెయిట్స్ ఆవిష్కరించడం ద్వారా తమిళనాడుకు చెందిన ధనంజయన్ కాఫీ ఆర్ట్ ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలను రూపుదిద్దుతూ కర్ణాటక వాసి కవిత దివాకర్, అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా పటేల్ తన వీడియోల ద్వారా కాఫీ ఆర్ట్‌కు చిరునామాగా మారారు. నేను ఆర్కిటెక్ట్‌ని. డిగ్రీ మొదటి రోజుల్లో కొన్ని ప్రాథమిక చిత్రకళల పాఠాలు మాత్రమే నేర్పించేవారు. కానీ చిత్రకళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఎప్పటి నుంచో కాఫీ ప్రియురాలిని. ఒక ఆర్కిటెక్ట్‌గా నన్ను నన్నుగా గుర్తు చేసే రంగు నలుపు. ఒకే ఒక్క రంగుతో అలసిపోకుండా ప్రయాణం కొనసాగించడం పెద్ద సవాలు అనిపించి ఇంకో కలర్‌గా కాఫీని ఎంచుకున్నా. ఇది వాటర్ బేస్డ్ కావడం, నాకు వాటర్ కలర్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉండడం బెస్ట్ ఛాయిస్ అయ్యింది. పెయింటింగ్ వేస్తున్నప్పుడు గుబాళించే కాఫీ పరిమళం, అది అందించే ఆశక్తి, ఆ ఉల్లాసం..అద్భుతం. ప్రారంభంలో నేను సాధారణ కాఫీ పెయింటింగ్‌తో మొదలుపెట్టాను. చిన్న చిన్న హైలైట్ కోసం వాటర్ కలర్స్ కూడా కాఫీ పెయింటింగ్స్‌కి జోడించా. ఇటీవల పెయింటింగ్స్‌కి కాఫీతో బ్యాక్‌గ్రౌండ్ వేస్తూ, ఆపై వేరే రంగులతో పెయింట్ చేస్తున్నా. దీని వల్ల వింటేజ్ లుక్ వస్తుంది. ఈ ప్రయాణంలో హ్యారీ పోటర్ నేపథ్యంలో వేసిన పెయింటింగ్ చూసి హ్యారీ పోటర్ టీం నన్ను అభినందించింది. అంతేకాకుండా ఆ వీడియోను వారి అధికారిక ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. – జ్యోత్స్న మైథిలీ రెడ్డి, కాఫీ ఆర్టిస్ట్ నగరంలోనూ సందడి.. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్ట్ హౌస్ ప్రత్యేకంగా కాఫీ ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆర్ట్ స్టూడియోగా పేరొందింది. అలాగే నల్లగండ్లలోని కవి ఆర్ట్ స్టూడియో, గచి్చ»ౌలిలోని థర్డ్ వేవ్ కేఫ్, జూబ్లీహిల్స్‌లోని మాక్రో బ్రూ వరల్డ్ కాఫీ బార్, బంజారాహిల్స్‌లోని లాట్టే ఆర్ట్ కెఫేలో కాఫీ ఆర్ట్ వర్క్‌షాప్‌ల నిర్వహించడంతో పాటు కాఫీతో తయారు చేసిన పెయింటింగ్‌లను కూడా ప్రదర్శిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని లైజురే ఆర్ట్ కేఫ్ కాన్వాస్, క్రేవింగ్స్, కెఫైన్ కాన్సెప్‌్టతో అతిథులను ఆకట్టుకుంటోంది. ఫిల్మ్ నగర్‌లోని బాగ్ బీన్స్ కాఫీ అండ్ ఆర్ట్‌లో కాఫీ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయంలాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. కాఫీని రంగుగా వినియోగించే ఆర్ట్ ఒకెత్తయితే, కాఫీ కప్పులో భిన్న రూపాలు చిత్రించే కళను లాట్టే ఆర్ట్‌గా పేర్కొంటారు. ఇది చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే దీన్ని గతంలో కాఫీ షాప్స్‌లో పనిచేసే సిబ్బంది, కాఫీ మేకర్స్ ఎక్కువగా సాధన చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో దీనిపై నగర యువత కూడా ఆసక్తి చూపుతోంది. దీంతో కాఫీ ఆర్ట్ అంత కాకపోయినా అడపాదడపా లాట్టే ఆర్ట్ వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. నగరానికి చెందిన యువ చిత్రకారుడు సాయి అఖిల్ గౌడ్, రాధాకృష్ణ వంటివారు ఈ లాట్టే ఆర్ట్‌కు పేరొందారు. మరింత చేరువగా... దాదాపు నగరంలో పేరున్న కేఫ్స్ అన్నీ చిత్రకళకు పెద్ద పీట వేస్తున్న పరిస్థితులు, అలాగే తరచూ జరుగుతున్న కాఫీ ఫెస్టివల్స్ వంటి ఈవెంట్స్ వల్ల నగరవాసులకు కాఫీ ఆర్ట్ మరింత చేరువ అవుతోంది. విభిన్న రకాలుగా యువతలో క్రియేటివిటీకి వేదికవుతోన్న ఈ కాఫీ ఆర్ట్ ప్రపంచస్థాయి కాఫీ ఆర్టిస్టులను నగరానికి అందించినా ఆశ్చర్యం లేదు. (పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!) -
Dr. Velaga Venkatappaiah గ్రంథాలయ గాంధీ
జీవితాన్ని గ్రంథాలయోద్యమానికి ధారపోసిన గ్రంథాలయ సారథి, పుస్తక సంపాదకుడు, బాలసాహితీవేత్త, ఎందరో బాల సాహితీవేత్తలను ప్రోత్సహించి, వారు పుస్తకాలు రాసే అవకాశం కల్పించిన సహృదయుడు, ‘గ్రంథాలయ గాంధీ’ వెలగా వెంకటప్పయ్య (Dr. Velaga Venkatappaiah) గ్రంథాలయ గాంధీ . జూన్ 12వ తేదీన వీరివర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో ఆయనకాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలు యువతకు తెలియవల సిన అవసరం ఎంతైనా ఉంది. 1932లో తెనాలి ఐతానగర్లో జన్మించారు. గ్రంథాలయంలో చిరుద్యోగిగా జీవితం ఆరంభించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పొందిగ్రంథాలయ శాఖలో వివిధ పదవులు నిర్వహించారు. 17 ఏళ్ల వయస్సులోనే 1949లో ‘బంగారు బొమ్మ’ పేరుతో బాలల కథల సంపుటిని ప్రచురించి పిల్లలకు అందించారు. పిల్లల కోసం 1958లో ‘టెలిఫోన్’, 1959లో ‘రేడియో’, 1962లో ‘కాగితం కథ’ వంటి పుస్తకాలు రాశారు. 30 వేల తెలుగు సామెతలు, వేయి తెలుగు బాలల జానపద గేయాలు, 3 వేల పొడుపు కథలు, 15 వేల జాతీయాలు సేకరించి ప్రచురించారు. 2013లో ‘అందరూ మహానుభావులే’ పేరుతో 1024 పేజీలతో అన్ని రంగాల ప్రముఖుల పరిచయాలతో కూడిన బృహత్తరగ్రంథానికి సంపాదకత్వం వహించారు. 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాలసాహిత్య కథల సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించారు. గ్రంథాలయ విజ్ఞానంలో ఆయన తాకని అంశం లేదు. వందకు పైగా పుస్తకాలు, ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞానానికి సంబంధించి రాసినగ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. వీరు కాకతీయ విశ్వవిద్యాలయా నికి సర్టిఫికెట్ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. 1990లో ఉద్యోగ విరమణ చేసి రచనా వ్యాసంగంలోనే నిమగ్నమయ్యారు. 2013లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని గ్రంథా లయ రంగం నుండి అందుకున్న తొలి వ్యక్తి డా‘‘ వెలగా. జీవిత కాలాన్ని గ్రంథాలయ ఉద్యమాలు, బాల సాహిత్యం కోసం అంకితం చేసిన వెలగా వెంకటప్పయ్య తన 82వ ఏట 2014 డిసెంబర్ 29న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సేవలు చిరస్మరణీయాలు.– షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి(రేపు తెనాలిలో డా‘‘ వెలగా వెంకటప్పయ్య కాంస్య విగ్రహ ప్రతిష్ఠ) -
అవార్డులే అవార్డులు : శశిధర్..ట్రెండ్ సెట్టర్
నగరంలోని ఓల్డ్ డెయిరీ ఫారానికి చెందిన శశిధర్ పైడిరాజు పాండ్రాడ చిన్నతనం నుంచే ఫ్యాషన్, సంప్రదాయ నృత్య ప్రదర్శనల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. పాఠశాలలో సంప్రదాయ నృత్యానికి ప్రోత్సాహం లభించగా, ఇంట్లో అతని సోదరుడు ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచాడు. అన్నయ్య తెచ్చిన విభిన్న రకాల దుస్తులను శశిధర్ ధరించి అందరినీ ఆకర్షించేవాడు. అలాగే పాఠశాల కార్యక్రమాల్లో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. అవార్డులే అవార్డులు ఇటీవల దుబాయ్‌లోని పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఎస్కేఎస్ అకాడమీ నుంచి ఎనిమిది మంది నృత్య కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో శశిధర్ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యానికి ‘యువ ప్రతిభ పురస్కారం’లభించింది. అలాగే శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నుంచి ‘జాతీయ మహా స్వర్ణ నంది అవార్డు’ను అందుకున్నాడు. 2024లో ‘యాక్టివ్ ఉగాది పురస్కారం’ కూడా శశిధర్‌కు లభించింది. ఒకవైపు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ర్యాంప్‌పై హొయలొలికిస్తూ, మరోవైపు శాస్త్రీయ నృత్య వేదికపై అభినయంతో అబ్బురపరుస్తూ.. ఇలా రెండు విభిన్న రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు నగరానికి చెందిన 26 ఏళ్ల శశిధర్. చిన్ననాటి అభిరుచులను వదలకుండా వాటినే తన కెరీర్‌గా మలచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ‘యువ ప్రతిభ పురస్కారం’ అందుకోవడమే ఇందుకు నిదర్శనం.ఫ్యాషన్ రంగంలోకి అడుగులుడిగ్రీ చదువుతున్న సమయంలో శశిధర్ కొన్ని కారణాలతో సంప్రదాయ నృత్యాన్ని కొంతకాలం పక్కన పెట్టాడు. ఆ సమయంలో తన దృష్టిని పూర్తిగా ఫ్యాషన్‌పై కేంద్రీకరించాడు. డిగ్రీ స్థాయిలో జరిగిన ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు జరిగిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2018 లో ‘ఉత్తమ ఆకర్షణీయమైన కళ్లు’అవార్డును గెలుచుకున్నాడు.మిస్టర్ కొచ్చి 2021 విజేత చదువు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫ్యాషన్ రంగంపై శశిధర్ దృష్టి సారించాడు.2021లో కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ పోటీల్లో ‘మిస్టర్ కొచ్చి 2021’విజేతగా నిలిచాడు. ఆ తర్వాత, ఆంధ్ర ఫ్యాషన్ వీక్ సీజన్ 1 లో ‘ఉత్తమ యువ డిజైనర్ అవార్డు 2024’, విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో ‘ఉత్తమ స్మైల్ అవార్డు 2024’ను సొంతం చేసుకున్నాడు.నాట్యకళకు తిరిగి ప్రాణం పోసిన వేళ..చదువుపై దృష్టి సారించే క్రమంలో చిన్నప్పుడు నేర్చుకున్న శాస్త్రీయ నృత్యానికి దూరమైనా.. దానిపై మమకారం చావలేదు. 2024లో ఓ అవార్డు కార్యక్రమంలో శశిధర్ మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి అంటే తనకెంత ఇష్టమో చెప్పిన మాటలు తన జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. ఆ మాటలు విన్న ఎస్కేఎస్ అకాడమీకి చెందిన పక్కి అరుణ్ కుమార్ సాయి.. శశిధర్‌ను కలిసి తన నృత్య ప్రతిభను ప్రదర్శించమని కోరారు. అతనిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఏళ్ల క్రితం ఆగిపోయిన నాట్య ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది. గురువు అరుణ్ శిక్షణలో రాటుదేలిన శశిధర్.. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటాడు. యువతకు మార్గదర్శిగా ‘జేఆర్డీ ఫ్యాషన్స్’ తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. అమ్మ ప్రోత్సాహంతోనే.. మోడల్‌గా, నృత్య కళాకారుడిగా రాణించడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. పాఠశాల రోజుల్లో వివిధ రకాల ప్రదర్శనల్లో నన్ను పాల్గొనేలా ప్రోత్సహించింది. ఫ్యాషన్ రంగంలోకి వెళ్తానంటే సపోర్ట్ చేసింది. నృత్యం ఇక నా జీవితంలో ఉండదు అనుకునే సమయంలో మా గురువు పక్కి అరుణ్ కుమార్ సాయి ప్రోత్సాహం మరువలేనిది. ఈ రెండు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని నిరంతరం పట్టుదలతో శ్రమిస్తున్నా.. – శశిధర్ పైడిరాజు పాండ్రాడ -
దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనం
నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్లోని రిజ్క్స్మ్యూజియంలో దాదాపు 200 ఏళ్ల నాటి, మంచి కండిషన్లో ఉన్న కండోమ్ (Condome) ను ప్రదర్శనకు ఉంచారు. ఈ కండోమ్‌ను గొర్రె అపెండిక్స్ (పేగు)తో తయారు చేసినట్టు భావిస్తున్నారు. దీనిపై ఉన్న ఒక పెయింటింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక నన్, ముగ్గురు మతాధికారులు ఉన్న ఈ పెయింటింగ్‌ను "లగ్జరీ సావనీర్"గా పేర్కొంటూ వేలానికి ఉంచారు. అంతేకాదు ఈ మ్యూజియం కళా సేకరణలో ఉంచిన తొలి గర్భనిరోధక సాధకం ఇదేనట.1830 నాటి ఈ కండోమ్, 19వ శతాబ్దపు వ్యభిచారం , లైంగికతపై జరిగే ప్రదర్శనలో భాగమని మ్యూజియం నిర్వాహకులు వె ల్లడించారు. ఇంకా ఈ డచ్ మ్యూజియంలో దాదాపు 7,50,000 వరకు ప్రింట్లు, డ్రాయింగ్లు, ఫోటోలు కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ఉన్నాయి."అక్కడ, అది నా ఎంపిక' అని అర్థం వచ్చే ‘వోయిలా మోన్ చోయిక్స్’( ఇది నా చాయిస్) అనే శాసనం బ్రహ్మచర్యం , గ్రీకు పురాణాల నుండి పారిస్ తీర్పు రెండింటికీ అనుకరణగా ఉందని మ్యూజియం తెలిపింది.చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..చూసేందుకు ఎగబడుతున్న జనంఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచీ, మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని రిజ్క్స్మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ తెలిపారు. స్పందన అద్భుతంగా ఉందన్నారు. అయితే మొదటిసారి వేలంలో మొదటిసారి ఈ కండోమ్‌ను ఉంచినపుడు తాను, తన సహద్యోగి నవ్వుకున్నామని ఆమె గుర్తు చేసుకున్నారు. 2024లో జరిగిన ఒక వేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసిందట. ఆ తర్వాత వారు దాన్ని అతినీలలోహిత (UV) కాంతిలో పరీక్షించారు. అలా ఆ కండోమ్‌ను ఎవరూ ఉపయోగించ లేదని భావిస్తున్నామన్నారు. 2025 నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుంది. -
ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్‌గా రికార్డ్!
పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్‌పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్‌పేపర్ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్‌గా వ్యవహరించేది ఎడిటర్. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్‌గా స్థానం పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్ ఎడిటర్‌గా మారి రికార్డు సృష్టించింది.ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్...ఎనిమిదేళ్లకే ’ఇట్ గర్ల్ మ్యాగజన్’ (It Girl Magazine) అనే మ్యాగ్జైన్ కి ఎడిటర్‌గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్జైన్ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్‌గా మారింది. మ్యాగ్జైన్లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్జైన్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంమ్యాగ్జైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ని రోక్సాన్ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్‌టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్‌లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్జైన్ పనులు చేస్తూనే, పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్ -
పాటనుకుంటివా.. ఫైర్ ఇంజన్లు..!
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశా (Odisha) 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు (wildfires) ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలుపాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్‌ధేరే అన్నారు.ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలుపాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారంఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్‌ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో కాపాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.సాంస్కృతిక పునరుద్ధరణసంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. ‘గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం’ అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు ‘సంకీర్తన మండలి’ అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంఉపాధి గీతాలురాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. ‘కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది‘ అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు. చదవండి: మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?కేతకి నాయక్‌కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది. ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు. ఇదీ చదవండి: Food Safety ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు -
Vijay Mallya లగ్జరీ విల్లాను కొన్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2025 (IPL2025)లో ఆర్సీబీ (RCB) టైటిల్ గెల్చుకున్న తరువాత మాల్యా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. 2008లో ఆర్సీబీ జట్టును స్థాపించిన ఇన్నాళ్లకు ట్రోఫీని గెల్చుకోవడం మాల్యాకు నిజంగా సంతోషకరమైన క్షణమే. అందుకే జట్టుపై ప్రశంసలు కురిపించాడు. 18 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం, సోషల్ మీడియా వేదికగా విజయ్ మాల్యా పోస్ట్ తరువాత నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గోవాలోని విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విల్లాని ఎవరు కొన్నారు? అనేది చర్చ నీయాంశంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆర్సీబీతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు. గోవాలోని ఐజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విల్లా విలాసాలకు పెట్టింది పేరు. ఈ విల్లాలో విలాసవంతమైన పార్టీలను నిర్వహించేవాడు. గ్లామర్ ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యేవారు. ఉత్తర గోవాలోని ఉన్నత స్థాయి కాండోలిమ్ బీచ్ గ్రామంలో 12,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిలో కృత్రిమ చెరువులు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్-ఎయిర్ డ్యాన్స్ ఫ్లోర్లు, పచ్చని తోటలు లాంటి హంగులెన్నో ఉన్నాయి.మాల్యా వేలకోట్ల ఏగవేత కేసులో 2016లో, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు, బ్యాంకుల రుణాల చెల్లింపు ప్రక్రియలో భాగంగా దీన్ని బ్యాంకుల కన్సార్షియం వేలానికి పెట్టింది. ఖరీదైన కింగ్ ఫిషర్ విల్లాను ఎస్బీఐ బ్యాంకు ఎన్నిసార్లు వేలానికి పెట్టినా ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. . ఆన్లైన్ ఆక్షన్‌లో ఎవ్వరూ దీనిని సొంతం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు 2017లో ఈ విల్లాను బాలీవుడ్ దంపతులు సచిన్ జోషి ,ఊర్వశి శర్మ రూ. 73.01 కోట్లకు కొనుగోలు చేశారు. తరువాత ఈ విల్లా పేరును కింగ్స్ మాన్షన్‌గా మార్చాడుచదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంకింగ్ఫిషర్ విల్లా- కింగ్స్మాన్షన్విజయ్ మాల్యా లాగే, సచిన్ జోషి కూడామద్యం తయారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు, దీని ఉత్పత్తులలో 'కింగ్స్ బీర్' కూడా ఉంది. కింగ్స్ బీర్ బ్రాండ్ కనెక్షన్ కారణంగా ఈ పేరు పెట్టినట్టు గతంలో ఒక సందర్బంలో వెల్లడించాడు సచిన్.చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?ఎవరీ సచిన్ జోషి ప్రముఖ వ్యాపారవేత్త జగదీష్ మోహన్ లాల్ జోషి కుమారుడు సచిన్ జోషి. తండ్రి స్థాపించిన జేఎంజే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి అధిపతివున్నాడు. సచిన్ కేవలం వ్యాపారవేత్త మాత్రమేకాదు హీరో కూడా. క్రీడలంటే ఆసక్తి. 2002లో 'మౌనమేలనోయి..' అనే సినిమాతో టాలీవుడ్ ద్వారా నటుడిగా సినీపరిశ్రమకి పరిచయమైన సచిన్ 2011లో అజాన్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ముంబై మిర్రర్, జాక్‌పాట్ చిత్రాలతోపాటు తెలుగు చిత్రాలలో కూడా నటించినా పెద్దగా కలిసి రాలేదు. 2021లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. ఈ మాజీ నటి ఊర్వశి శర్మను వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు. -
రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్‌మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్‌లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
World Environment Day 2025: పర్యావరణాన్ని కాపాడాలి!
మన చుట్టూ ఉన్న సహజ, మానవ నిర్మిత అంశాలన్నీ కలిపి ఒక జీవి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే వాతా వరణమే పర్యావ రణం. నేల, నీరు, గాలి మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకాలు. ఈ మూడూ ఇప్పుడు కలుషితం అవుతూ ఉండడం భూమి మీద ఉన్న సకల జీవరాశికీ ప్రాణసంకటం అయ్యింది. పర్యావరణంలోకి విడుదల అవు తున్న ఇతర కాలుష్య కారకాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణ వ్యవస్థల్ని మరింతగా ధ్వంసం చేస్తున్నాయి. ప్లాస్టిక్ కాలు ష్యాన్ని సమర్థంగా ఎదు ర్కోడానికి ప్రపంచ దేశా లన్నీ ‘ప్లాస్టిక్ కాలు ష్యాన్ని ఎదుర్కొందాం’ అనే నినాదంతో 2025 సంవత్సరపు పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకోవాలని ఐక్య రాజ్య సమితి కోరింది. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ చేరడంవల్ల వాతావరణం వేడెక్కి దాని ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. వేడి వాతావరణంలో కాలుష్య కారకాలు, పుప్పొడిరేణువుల సంచారం బాగా పెరుగుతుంది. కాలుష్యం పెరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కంటి జబ్బులు కూడా వస్తున్నాయి. ఈ వేడికి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఉప్పె నలు వస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థలో మరొక సమస్య ఆమ్లవర్షాలు. నేల మీద విడు దలై ఆకాశాన్ని చేరుతున్న కలుషిత గాలుల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఉన్నాయి. ఇవి వర్షపు జల్లులతో కలసి ఆమ్లవర్షాలుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు నేలపై పడేసరికి ఆ నేలలు సేద్యానికి యోగ్యం కాకుండా పోతున్నాయి. కప్ప వంటి ఉభయచరాలు చిన్న చిన్న గుంటల్లో గుడ్లు పెడతాయి. అక్కడికి ఆమ్లవర్షం చేరితే గుడ్లు నాశనమై పిల్లలు పుట్టవు. నీటిలో నివసించే చేపలు, రకరకాల కీటకాలు, ఈ ఆమ్లవర్షాలకు బతక లేవు. ఈ వర్షం ఆహారపు గొలుసును తునా తునకలు చేస్తుంది. రవాణా కోసం మోటారు సైకిళ్ళకు బదు లుగా ప్రజారవాణా సదుపాయాన్ని వినియో గించుకోవాలి. నడక, సైకిళ్ల వాడకం మంచిది. రక్షిత నీటి సరఫరాకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. దోమలను నియంత్రించే విధానాలపై దృష్టి పెట్టాలి. నీరు పారే ప్రాంతాలలో ఎటు వంటి మలినాలు లేకుండా చూడాలి. ఇదీ చదవండి: చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్పర్యావరణంలోకి చేరే వ్యర్థా లలో అధిక భాగం ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలే! ఏటా విడుదల వుతున్న ప్లాస్టిక్ వ్యర్థా లలో 46 శాతం వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తుంటే, దాదాపు 23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సము ద్రాలు, నదులను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ పదార్థాలు నేలలో కలసిపోవు. నేలను నాశనం చేస్తాయి. సాధ్యమైనంతవరకు రీసై కిల్ చేయడానికి వీలున్న ప్లాస్టిక్ వస్తువు లనే వాడాలి. అలా కానివాటి వాడకాన్ని నిషేధించాలి. ఇప్పుడు శబ్దకాలుష్యం ఎక్కువ అయ్యింది. ఈ కాలుష్యాన్ని హరించేందుకు చెట్ల పెంపకం చేపట్టాలి. రైతులు పంటల దిగుబడి పెరిగేందుకు కృత్రిమ రసాయ నాలను ఎరువులుగా వాడే బదులు సేంద్రియ ఎరువులు వాడాలి. మరుగుదొడ్ల వాడకం పెరగాలి. డా. సి.వి. సర్వేశ్వర శర్మపాపులర్ సైన్స్ రచయిత(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) -
కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!
ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్‌పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్లో తన కలను సాకారం చేసుకున్నాడు. విచిత్రంగా విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నిజంగా ఒక గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!. View this post on Instagram A post shared by DelhiPolice (@delhi.police_official) (చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం) -
టాలెంట్ ఉండాలే గానీ.. అమెరికన్ కంపెనీలో రూ.1.45కోట్ల వేతనం
బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కారు బంగ్లా కొనుక్కోవాలి. ఇలాంటి కలలు చాలా మంది విద్యార్థులు కంటారు. కానీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అదృష్టాన్ని దక్కించుకుంటారు. పట్టుదల, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. దీనికి నిడుమోలు లక్ష్మీ నారాయణరావు దానికి ఒక ఉదాహరణ. అమెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్‌లో రూ. 1.45 కోట్ల వార్షిక వేతనంలో అద్భుతమైన ప్లేస్మెంట్ ఆఫర్‌ను అందుకున్నాడు. తద్వారా కన్న తల్లిదండ్రులకు, కన్న ఊరికి గర్వకారణంగా నిలిచాడు. చదువుకున్న సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు.రూ. 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవాడు నిడుమోలు లక్ష్మీ నారాయణ రావు. తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT)లో 2021-2025 బ్యాచ్‌కు చెందినకంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అద్భుతమైన ప్రతిభతో ప్రొఫెసర్లు, కంపెనీలను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.ఇదీ చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీమలుపు తిప్పిన ఇంటర్న్షిప్తన చదువులో భాగంగా లక్ష్మీ నారాయణ రావు అమెరికన్ కంపెనీ రుబ్రిక్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కోసం చేరారు. అదే అతని జీవితంలో మైలు రాయిగా నిలిచింది. రావు అసాధారణ పనితీరు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రూ 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ వెదుక్కుంటూ వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాడు.. త్వరలోనే బెంగళూరులో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. రావుకు చిన్నప్పటి నుంచీ ఐటీ, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ (AIML)కి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ ఇన్స్‌స్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిBIT మెస్రా యాజమాన్యం నిడుమోలు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.తమ సంస్థకు చెందిన విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని అందుకోవడం ఇదే తొలిసారంటూ రావును అభినందించింది. గతంలో, గరిష్ట ప్యాకేజీ సంవత్సరానికి రూ. 52 లక్షలుగా నమోదైందని BIT మెస్రా ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు. -
వాట్ ఏ టాలెంట్ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం..
మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అతను. కూమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా వారింది. ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్పాట చిట్టియాన్ కలైయాన్ పాటకు డ్యాన్స్ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో. ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ablu Rajesh Kumar (@ablurajesh_) (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..
గురువు అనే పదానికి అసలైన అర్థం ఈ మాస్టారు. పిల్లలకు పాఠాలను చెప్పడం కోసం..ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారో తెలిస్తే కంగుతింటారు. అలా ఏకంగా 20 ఏళ్ల నుంచి చాలా శ్రమ ఓర్చి.. తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పైగా ఆయన డ్యూటీ పరంగా చాలా సిన్సియర్, ఏ రోజు లేటుగా వచ్చిన దాఖాలాలు కూడా లేవు. అలాంటి గొప్ప మాస్టార్ని పొందిన ఆ విద్యార్థులు కూడా ఎంతో అదృష్టవంతులు కదూ..!.ఆ మాస్టార్ పేరు అబ్దుల్ మాలిక్. కేరళకు చెందని ఆయన మల్లాపురంలోని పదింజత్మురిలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్లో లెక్కల మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఆ స్కూల్‌ని చేరాలంటే.. ప్రతిరోజూ సాహసం చేయాల్సిందే. నడుంకి ఓ ట్యూబ్ తగిలించుకుని నది ఈదుకుంటూ వెళ్లి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తుంటారు. ఇలా ట్యూబ్ తగిలించుకోవడంతో అక్కడి స్థానికులంతా ఆయన్ను ముద్దుగా ‘ట్యూబ్ మాస్టర్’ అనిపిలుస్తుంటారు. అయితే ఇలా నదిలో ఈదుకుంటూ వెళ్తున్నప్పుడూ.. కాలానుగుణంగా వచ్చే భారీ వర్షాలు, పాములు వంటి ఇతర భయంకరమైన సరీసృపాలు తదితర సవాళ్లు చాలానే ఎదుర్కొంటుంటారాయన. అయినా అవేమి ఆయన్ను తన విద్యార్థుల దగ్గరకు వెళ్లనీయకుండా ఆపలేకపోయాయి. ఇంత ఇబ్బంది పడి వెళ్లటం అవసరమా అని ఆయన ఏనాడు అనుకోకపోవడం విశేషం. ఇలానే ఎందుకంటే..మాలిక్‌కి ఇలా నదిలో ఈదుకుంటూ కాకుండా మరొక మార్గం ఉంది. కానీ మరింత వ్యయప్రయాసలతో కూడినది. ఎందుకుంటే సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ స్కూల్‌కి చేరుకోవాలంటే మూడు బస్సులు మారాల్సిందే. పైగా మూడుగంటలకు పైగా జర్నీ చేయాలి. దాంతో మాలిక్ ఇలా నదిలో ఈదుకుంటూ స్కూల్‌కి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పడవల సాయంతో వెళ్దామంటే.. ఆ నది నీటి ఉద్ధృతిలోని హెచ్చు తగ్గుల రీత్యా అది అస్సలు సాధ్యం కానీ పని అంటున్నారు మాలిక్. ఇక ఆయన క్లాస్‌లు ఉదయం 10.30తో మొదలవ్వుతాయి. ఆయన గణితాన్ని బోధించడం తోపాటు పర్యావరణం గురించి తెలుసుకునేలా ఆయన రోజు ఈతకొట్టి వచ్చే నది వద్దకు కూడా విద్యార్థులను తీసుకువెళ్తారు మాలిక్. ప్రకృతిని కాపాడుకోవడం దాన్ని గౌరవించడం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా తీసుకువెళ్తుంటానని చెబుతున్నారు మాలిక్. కాగా, 2013 నుంచి ఆ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు మాలిక్. అలా ఈ ఏడాది 2025 పూర్తి అయ్యే నాటికి.. ఆయన ఆ స్కూల్‌కి వెళ్లి తిరిగి రావడానికి.. దాదాపు 700 కిలోమీటర్లక పైనే ఈత కొట్టినట్లు అంచనా.!. నిజంగా ఈ మాస్టారు మాములు గ్రేట్ కాదు కదా..!. (చదవండి: పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..! ఆ ఎవర్గ్రీన్ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే..) -
పులిలా కనిపించే పిల్లి..!
ఈ పిల్లి వాక్ చేస్తే ఫర్నిచర్ వణుకుతుంది. ఓరకంట ఒక్క చూపు చూస్తే మొరుగుతున్న కుక్కలు కూడా గప్‌చిప్‌గా నోరు మూసుకుంటాయి. అది పిల్లి కాదు, పులి అని అనుకుంటున్నారా? కానేకాదు, నిజంగానే అది పిల్లే, పేరు జ్యూస్. చూడ్డానికి పెద్దపులిలాగా కనిపిస్తుంది. పదమూడు కిలోల బరువు, నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవుతో ఎదుగుతున్న పులిపిల్లలా ఉంటుంది. దానికున్న భారీ ఆకారమే జ్యూస్‌ను తమ వీథిలోని పెంపుడు జంతువులకు డాన్‌గా మార్చేసింది. ఆహారం కూడా దాని సైజుకు తగ్గట్టుగానే రోజుకు రెండు కిలోల మాంసం, టాప్ బ్రాండ్ ట్రీ ట్స్‌తో స్పెషల్ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ మామూలుగా ఉండదు. జ్యూస్ నిద్రపోయే వీడియోకు కూడా మిలియన్స్‌లో లైక్స్ వస్తాయి. జ్యూస్ గురించి దాని యజమానురాలు డానియేలా మాట్లాడుతూ ‘నాకు ఇది చిన్న పిల్లికూనగా వీథిలో దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంటే, రోజు రోజూకు భారీగా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా మారుతుందని అసలు అనుకోలేదు. మీరెవరైనా ఇకపై పిల్లిని పెంచుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి.’ అని చెప్పింది. (చదవండి: ఈ సాలీడు టాలెంట్‌కి సాటిలేరెవ్వరూ..! కటౌట్‌తో పనిలేదు బ్రదర్..) -
ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!
మయాన్మార్‌లోని బాగన్ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగన్ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం, వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. 11 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బర్మీస్ నిర్మాణ కళకు అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి.విస్తారమైన మైదానంలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయాల దృశ్యం గొప్ప అనుభూతినిస్తుంది. సంధ్యవేళలో బంగారుకాంతితో మెరిసే ఈ నిర్మాణాలు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదగాన్ పగోడా, థాబ్యిన్యు టెంపుల్ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి.బాగన్ అందాలను ఆస్వాదించడానికి ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ భలేగా ఉంటుంది. ఆ రైడ్‌తో ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోని విశాలమైన ఆలయాల దృశ్యాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం కలిగిస్తుందంటారు పర్యాటకులు. కాలక్రమేణా ఇక్కడ కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ, బాగన్ చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది చరిత్ర, సంస్కృతిని ప్రేమించే వారు, తప్పక చూడవలసిన ప్రదేశం. (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్‌కే అందని మిస్టరీ..!) -
బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్
భారత దేశ పర్యటనకు వచ్చిన అమెరికన్ యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోల్‌కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్ పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని వేరే హోటల్‌కు తీసుకెళ్లి, ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలని చూశాడు. దీంతోతనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్ తన యూట్యూబ్ (Youtube) ఛానల్లో అప్లోడ్ చేయగా ఇది వైరల్‌గా మారింది.ఆనందనగరం కోల్‌కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది.అమెరికన్ వ్లాగర్ డస్టిన్ అనే కోల్‌కతా దర్శించేందుకు వచ్చాడు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్‌లోని గ్రేట్ వెస్టర్న్ హోటల్‌కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ ని బుక్ చేసుకున్నాడు. ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే డ్రైవర్ దారి మళ్లించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్‌కి తీసుకెళ్లాడు. పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు. అసలు చార్జీరూ.700 బదులుగా రూ.900 డిమాండ్ చేశాడు.ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఇక్కడితో అయిపోలేదు....మరో వ్యక్తి (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి) కల్పించుకొని డస్టిన్ను బెదరించడం మొదలు పెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయ్.ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తానంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా రూ. 1000 డిమాండ్ చేశాడురెండోవాడు. ఆ తరువాత వారు డస్టిన్కోసం మరో టాక్సీని బుక్ చేశారు. అయితే ఈ సారి "పార్కింగ్ , పెట్రోల్" కోసం అదనంగా రూ. 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం చార్జీ రూ. 800కి పెరిగింది. ఇందదులో కొత్త డ్రైవర్‌కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ డస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్‌పై తనకున్న అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశమంటూ పేర్కొన్నాడు. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు అని ఒకరు, మ“నేను వీడియో లింక్‌తో కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశా,లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను’’ అని మరొకరు కమెంట్చేశారు. ఆ బెంగాలీ వాలా చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని, సారీ అంమూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బిధన్నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. -
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్ థాపర్ (Valmik Thapar) ఇకలేరు. టైగర్ మ్యాన్‌గా ప్రసిద్ది చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్‌తో కలిసి పనిచేశారు. Valmik Thapar, a legendary figure in the world of conservation over the past four decades - especially tigers - has just passed away. It is a great loss. Today's Ranthambore, particularly, is a testimony to his deep commitment and indefatigable zeal. He was uncommonly… pic.twitter.com/6TP60wMleo— Jairam Ramesh (@Jairam_Ramesh) May 31, 2025వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (1997) టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలునురచించారు. ఇంకా ఆయన సహనిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలుయ చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997) బాగా పాపులర్. 2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు వాల్మీక్ థాపర్ఎవరీ వాల్మీక్ థాపర్వాల్మీక్ థాపర్ బొంబాయిలో రాజ్-రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్‌ను వివాహం చేసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మిక్ థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు, యు మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రస్తుతం రణతంబోర్ థాపర్ అభివృద్దికి ఆయన అవిశ్రాంత అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. ఇంకా పలువురు పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెలిబుచ్చారు.Rest in Peace, Valmik Thapar, the international voice of Indian tigers for many many years.As a tribute to him, do read the many books he penned on tigers: ‘Tiger Fire’, ‘Living with Tigers’ and others. pic.twitter.com/SJJzZeELYn— Neha Sinha (@nehaa_sinha) May 31, 2025ఫియర్లెస్ టైగర్ ఛాంపియన్ అంటూ పరిరక్షణ జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వాల్మీక్ థాపర్ మృతిపై నివాళి అర్పించారు. తనకోసం తాను మాట్లాడలేని ఒక మూగ జీవికి స్వరాన్చిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం నిలిచిపోతారన్నారు. -
కొత్త పుస్తకాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి?
పుస్తకాలు మన జీవితంలో స్నేహితుల లాంటివి. అవి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా అనేక కథలు, కవితలతో మనల్ని వినోదపరుస్తాయి. అయితే మీరెప్పుడైన కొత్త పుస్తకం తెరిచి చదివారా? పుస్తకం తెరిచినప్పుడు వచ్చే ఆ ప్రత్యేకమైన వాసనను ఎప్పుడైనా గమనించారా? ఈ వాసన పుస్తకాలను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే ఆ వాసనకు గల శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పుస్తకాలు కాగితాలతో తయారవుతాయి. కాగితాలు చెట్లనుండి తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అలా తయారు చేసేటప్పుడు లిగ్నిన్ అనే రసాయనాన్ని ఉపయోగించడం వలన చెక్క వంటి ఒక వాసన ఏర్పడుతుంది. ఇంకొక కారణం, పుస్తకంలోని అక్షరాలు, చిత్రాలు ముద్రించడానికి ఉపయోగించే సిరాలో రసాయనాలు ఉంటాయి. ఈ సిరా కొత్తగా ముద్రించినప్పుడు ఒక సుగంధం లాంటి వాసనను వెదజల్లుతుంది. ఇది కొంచెం రబ్బరు లేదా రంగుల వాసనలా ఉంటుంది. మరొక కారణం పుస్తకం యొక్క పేజీలను కలిపి బైండ్ చేయడానికి గ్లూ ఉపయోగిస్తారు. ఈ గ్లూ కూడా తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఒక ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతుంది. చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా! చివరగా, పుస్తకాలు ముద్రించే యంత్రాలు, కాగితం లేదా కవర్‌పై ఉపయోగించే రసాయనాలు కూడా ఈ వాసనకు కారణమవుతాయి. కొత్తగా ముద్రించిన పుస్తకం తెరిచినప్పుడు ఈ రసాయనాలు గాలిలో కలిసి ఆ వాసనను ఇస్తాయి! ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్ -
కృష్ణుడి వెన్నబంతి: సైన్స్‌కే అందని మిస్టరీ..!
భారతదేశం సహజమైన అద్భుతాలకు నెలవు. ఈ నేలపై ఎన్నో ఆద్యాత్మికతకు సంబంధించి..సైన్సుకే అందని మిస్టరీలు దాగున్నాయ. అలాంటి వాటిలో ఒకటి..కృష్ణుడి బటర్‌బాల్‌గా పిలిచే వెన్నబంతి. ఇదెక్కడ ఉంది..?. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దామా..!.తమిళనాడు రాష్ట్రం అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్థి. ఆ దేవాలయ శిల్పకళా సంపద పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆ రాష్ట్రానికి హృదయంగా పిలిచి మహాబలిపురం పురాతన శిల్పకళ, రాతి గుహలు, ఏకశిల నిర్మాణాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం. అక్కడ అన్నింట్లకంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కృష్ణుడి బటర్‌బాల్. ఇది మేథావులకు, శాస్త్రవేత్తలకు ఓ పట్టాన అర్థం కానీ చిక్కుప్రశ్నలా మిగిలింది. ఎందుకంటే..యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ బండరాయిలాంటి వెన్నముద్ద 45 డిగ్రీల నిటారు కొండ వాలుపై ఉండటం విశేషం. పైగా ఇది 250 టన్నుల భారీ బండరాయి. అయినా అంత వాలులో ఏదో గమ్ లేదా ఆయస్కాంత మాదిరిగా అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. గత 12 వందల ఏళ్లల్లో ఒక్క ఇంచు దాని ప్రదేశం నుంచి కదలకపోడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. చెప్పాలంటే అక్కడ గురుత్వాకర్షణ పనిచేస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అంత భారీ బండరాయి ఏటావాలుగా ఉన్నవైపు నుంచి అమాంతం పడిపోతుంది. కానీ ఇది మాత్రం ఏదో మ్యాజిక్ చేసినట్లుగా నిలబడి ఉంటుంది. పౌరాణిక ప్రాముఖ్యత..ఈ భారీ గ్రానైట్ రాయి గణేష్ రథం సమీపంలోని ఒక చిన్న కొండ వాలుపై ఉంది. ఇది సుమారు ఆరు మీటర్ల ఎత్తు, ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం..కృష్ణుడికి ఇష్టమైన వెన్న ముద్ద ఆకృతిలో ఉంటుంది ఈ శిల. అందుకే దీనికి కృష్నుడి బటర్ బాల్ లేదా వెన్నబంతి అనే పేరొచ్చింది. ఎందరో కదిలించాలని చూసి పరాజితులయ్యారు..పల్లవ రాజు నరసింహవర్మన్ I ఏనుగులతో ఈ గ్రానైట్ బండరాయిని తరలించడానికి ప్రయత్నించాడు. ఒక్క ఇంచు కూడా కదపలేక విఫలమయ్యాడు. అలాగే 1908లో, మద్రాస్ గవర్నర్ ఆర్థర్ లాలీ కొండ నుంచి రాతిని తొలగించేందుకు ప్రయత్నించాడు. ఆయన 42 టన్నులను అవలీలగా లాగే ఏడు ఏనుగులను తీసుకొచ్చాడు, కానీ ఫలితం శూన్యం దాగున్న సైన్స్..కృష్ణుడి బటర్ బాల్ అనేది ఎక్స్ఫోలియేషన్కి సంబంధించిన అరుదైన భౌగోళిక సంఘటనగా శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా గాలి, అగ్ని, నీరు తదితరాలేవి దాన్ని కదలించడం లేదా గాట్లు పడటం వంటివి చేయలేకపోయాయి. ఇది గ్నిస్ అనే ప్రత్యేకమైన గ్రానైట్‌తో నిర్మితమైనదని, అందువల్ల ఏది దీని ఆకారాన్ని పాడు చేయలేనంత దృఢంగా ఉంటుందని వెల్లడించారు. శిల ఆకారం, కొండ వాలు మధ్య సహజ ఆకర్షణ అది పడిపోకుండా ప్రత్యేకంగా ఉండటానికి దోహదం చేసిందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కృష్ణుడి వెన్నబంతిని తప్పక సందర్శంచండి మరీ..!.(చదవండి: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై జైశంకర్ మాట) -
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్‌లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఒక ముద్దు, ఓ పాట..అద్భుతమే చేశాయ్..!
భార్య అందం తగ్గిందని వదిలేసే ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో.. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా..? అని విస్తుపోతారు. ఎందుకంటే..భార్య మంచానికే పరిమితమైతే..వదిలేసే భర్తలెందరో ఉన్నారు ఈ సమాజంలో. అంతేగాదు తన అవసరాలన్నీ తీరిస్తేనే..భార్య. లేదంటే అనవసరం అనే మగవాళ్లనే చూశాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అనారోగ్యంతో పోరాడుతుందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా..తాను చేయగలిగంతా చేసి కాపాడుకునే యత్నం చేశాడు. అయినా విధి కన్నెర్రజేసి భార్య కోమాలోకి వెళ్లిపోయేలా చేసినా..ఆశను వదులుకోలేదు. బతికి బట్టగలిగేలా చేసుకున్నాడు. భర్త అంటే ఇలా ఉండాలి అని అంతా కుళ్లుకునేలా నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు.అతడే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్. తన భార్య యే మెయిడీ ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతున్నా..ఆమె చేయిని వదలలేదు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటిపాపలా కాచుకున్నాడు. అయితే ఆ కేన్సర్..డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విజృభించి భార్యను కోమాలోకి వెళ్లిపోయిలా చేసింది. డాక్టర్లు సైతం చేతులెత్తేసిన వేళ కూడా.. తన ప్రేమతోనే భార్యను బతికించుకోవాలనుకున్న ఓ గొప్ప భర్త స్టోరీ ఇది.ఇక డెంగ్, మెయిడీల ప్రేమ కథ 2016లో ఓ స్నేహితుడిలో వివాహంలో ప్రారంభమైంది. ఇక్కడ మెయిడీ తీవ్ర బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆ విషయం తెలిసినప్పటికీ..ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడుడెంగ్. మెయిడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు. అయితే మెయిడీ తనెంతో కాలం బతకననే ఉద్దేశ్యంతో అతడి ప్రేమను అంగీకరించలేదు. కానీ డెంగ్ తనని ఎట్టి పరిస్థితిలో వదిలేయనని, అన్ని విధాల చేదోడువాదోడుగా ఉంటూ చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలా వారిద్దరూ 2019లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి 2021లో హన్హాన్ అనే కుమార్తె జన్మించింది. ఆ ఒక్క ఏడాది తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించటం ప్రారంభమైంది. కోమాలో చేరువైపోయే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో మెయిడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని..లాభం లేదని భర్త డెంగ్కి చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు రూ. 2 కోట్లుపైనే ఖర్చేపెట్టేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకుపూర్తిగా కోమాలోకి వెళ్లిపోయింది మెయిడీ. అయితే డెంగ్ ఆశను వదులుకోవడానికి ఇష్టపడలేదు. మెయిడీని ఇంటికి తీసుకువచ్చి..కుటుంబసభ్యులతో వీడ్కోలు మాదిరిగా పలుకుతూ..తన కుమార్తెతో కలి మెయిడీ బుగ్గపై ప్రేమగా ముద్దుపెట్టారు.అంతేగాదు ఆ అపురూపమైన భావోద్వేగా దృశ్యాన్ని క్లిక్‌మనిపించి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతే నెట్టింట డెంగ్కి భావోద్వేగ మద్ధతు తోపాటు భారీగా విరాళలు వచ్చాయి. ఆ సాయంతో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. అంతే జస్ట్ మూడు నెలల్లో మెయిడీ కోలుకోవడం..మళ్లీ యథావిధిగా మాట్లాడటం ప్రారంభించింది. అంతేగాదు ఆ మూడు నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి..ఆమెకు పూర్తికాల సంరక్షకుడిగా కంటికి రెప్పలా కాచుకున్నాడు. అంతేగాదు స్ప్రుహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ..డ్యాన్స్ చేస్తూ..ఉత్సాహాం నింపేవాడు. దాంతో త్వరితకాలంలోనే మెయిడీ ఏదో మిరాకిల్ చేసినట్లుగా కోలుకోవడమే గాక ఎవరీ సాయం లేకుండా నడిచేలా ఆరోగ్యవంతంగా కోలుకుంది. ఇప్పుడామె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడపటం విశేషం. చివరగా డెంగ్ మాట్లాడుతూ.."ఆమె మమ్మల్ని వదిలివెళ్లడం నాకస్సలు ఇష్టం లేదు. ఎలాగైన బతికించుకోవాలన్న తపన, ఆమెపై ఉన్న అచంచలమైన ప్రేమ తదితరాలతోనే తన భార్యను తిరిగి దక్కించుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు." డెంగ్. అంతేగాదు భారతీయ వివాహ వ్యవస్థలో ఉండే 'నాతి చరామీ' అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ చైనా భర్త డెంగ్ -
‘గేట్ వే-మాండ్వా’ లాంచీల నిలిపివేత , జేజే ఆసుపత్రిలోకి నీరు
గేట్ వే ఆఫ్ ఇండియా–మాండ్వాల మధ్య సోమవారం నుంచి లాంచి సేవలను నిలిపివేశారు. మారిటైం బోర్డు ఆదేశాల మేరకు లాంచి యజమానులు సేవలు నిలిపివేశారు. దీంతో నిత్యం ఈ మార్గంలో లాంచీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకనుంచి ఎక్కువ చార్జీలు చెల్లించి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. లాంచీ సేవలు మళ్లీ సెప్టెంబరు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని లాంచీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ మహాడ్కర్ తెలిపారు. ముంబై పరిసరా ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు పక్షం రోజుల ముందే వర్షాలు ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 26వ తేదీ నుంచి లాంచి సేవలు నిలిపివేయాలని మారిటైం బోర్డు నిర్ణయించింది. ఏటా వర్షా కాలంలో జూన్ ఒకటో తేదీ నుంచి లాంచీ సేవలు నిలిపివేస్తారు. కానీ ఈసారి వర్షాలు తొందరగా ప్రారంభం కావడంతో వారం రోజుల సర్వీసులను నిలిపివేశారు. రోరో సేవల కొనసాగింపు... ముంబైకి సమీపంలో ఉన్న వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అలీబాగ్ ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ 90 శాతం పర్యాటకులు లాంచీలను ఆశ్రయిస్తారు. రోడ్డు మార్గం కంటే సముద్ర మార్గం ద్వారా అలీబాగ్‌కు చేరుకోవడం చాలా సులభం. బస్సు చార్జీలతో పోలిస్తే లాంచీ చార్జీలు చాలా తక్కువ. గేట్ వే ఆప్ ఇండియా–మాండ్వా మ«ధ్య ప్రతీరోజు 40–50 లాంచీలు నడుపుతారు. వర్షాకాలంలో సముద్రంలో అలలు ఉవ్వేత్తున ఎగిసిపడతాయి. ముఖ్యంగా హై టైడ్ కారణంగా లాంచీలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈసారి ముందుగానే వర్షాలు మొదలుకావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకముందే లాంచీ సర్వీసులను నిలిపివేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే భావుచా ధక్క–మాండ్వా మధ్య రోల్ ఆన్–రోల్ ఆఫ్ (రోరో) సేవలు కొనసాగుతాయని మారిటైం బోర్డు తెలిపింది. ఉపాధి..ఆదాయానికి గండి.... గేట్ వే–మాండ్వా మధ్య పీఎన్పీ, మాల్దార్, అజంత, అపోలే కంపెనీల లాంచీలు సేవలందిస్తున్నాయి. దాదాపు మూడు నెలలకుపైగా లాంచిసేవలు నిలిచిపోనుండటంతో వీటి యజమానులు, అక్కడి హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల యజమానుల ఆదాయానికి గండిపడనుంది. ముంబై నుంచి బయలుదేరే పర్యాటకులతోపాటు అలీబాగ్ నుంచి ముంబైకి వచ్చే వ్యాపారులు, ఉడ్యోగుల రాకపోకలు కూడా నిలిచిపోతాయి. ఇకనుంచి వీరంతా రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది వ్యయ, ప్రయాసలతో కూడున్నదైనప్పటికీ తప్పదని అధికారులు అంటున్నారు. కేఈఎం, జేజే ఆసుపత్రుల్లోకి వరదనీరు మోకాల్లోతులో నీటిలో ఆసుపత్రుల ప్రధాన భవనాలు, పరిసరాలు వరదనీటిలోనే రోగుల క్యూ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. వర్షాల కారణంగా కేఈఎం, జె.జె. ఆసుపత్రులు నీట మునిగాయి. పరేల్‌లోని కేఈఎం ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం , పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) వద్ద అలాగే కొన్ని రోగుల గదుల వెలుపల భా రీగా నీరు నిలిచిపోయింది. టాటా ఆసుపత్రి, కేఈఎం ఆసుపత్రి, వార్డు 4ఏ వరండాల్లో నీరు చేరింది. నీటి పంపులతో వెంటనే నీటిని తొల గించినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ జోషి తెలిపారు. ఇక జె.జె. ఆసుపత్రిలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ప్రధాన భవనం వెలుపల, అలాగే ఆసుపత్రి నివాస భవనాల పరిసరాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కోసం వచ్చిన రోగులు నీటిలోనే నిలబడాల్సి వచ్చింది. అవుట్ పేషెంట్ భవనం నుంచి ప్రధాన భవనానికి వెళ్లే రోగులు పూర్తిగా నీటిలోనే నడవాల్సి వచి్చంది. జె.జె. ఆసుపత్రి సమీ పంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతం, ప్రజా పనుల విభాగం ఆవరణలోనూ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అ యితే గత సంవత్సరం లాగా ఆసుపత్రి భవనం ఈసారి పూర్తిగా నీటమునగలేదని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని జె.జె. ఆసుపత్రి డీన్ డాక్టర్ అజయ్ భండార్వర్ తెలిపారు. -
Kannaram 120 ఏళ్ల కన్నారం.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
విద్యానగర్(కరీంనగర్): నాటి అలిపిరాల నుంచి నేటి కరీంనగర్ వరకు శాతవాహనుల నుంచి కాకతీయల వరకు ఎందరో ఏలిన గడ్డ ఇది. ఎలగందుల కేంద్రంగా నిజాంల పాలన, ఉగ్గుపాలతో ఉద్యమాలను రంగరించిన వీరమాతలు, ఉరకలేత్తే చైతన్య సమరయోధుల గర్జన, చాళక్యుల కాలం నుంచి జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేకస్థానాన్ని నిలుపుకుంది. ఎలగందల్ జిల్లా అవల్ తాలుకుదార్ గోవింద్ నాయక్ కరీంనగర్లో 1918లో క్లాక్ టవర్ నిర్మించారు. 1935లో నిజాంపాలన రజతోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న నిజాం ప్రభువులకు స్వాగతం పలికేందుకు షేక్‌ఖాన్ స్వాగత ద్వారంగా కమాన్ నిర్మించారు. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!1905కు ముందే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కాగా.. ప్రస్తుతం కరీంనగర్ రూరల్స్టేషన్గా కొనసాగుతోంది. 1920లో మానేరు నదిపై రాతి వంతెన నిర్మాణం జరిగింది. 1958లో ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. 1956లో వేంకటేశ్వర ఆలయం దగ్గర తొలివాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. 1956లో ప్రస్తుత మల్టీఫ్లెక్స్స్థానంలో పాతబస్‌స్టేషన్ ఉండేది. 1960 తర్వాత గాంధీ సెంటీనరీ మ్యూజియం, 1956 ఎస్సారార్, 1969లో సైన్సివింగ్ కాలేజీ, 1967లో జిల్లా ప్రధానాస్పత్రి, జిల్లా కోర్టు భవనాలు, 1973లో మహిళా డిగ్రీ కళాశాల, 1980లో కలెక్టరేట్, అంబేద్కర్ స్టేడియం, 1980లో ప్రస్తుత బస్టాండ్ నిర్మించారు. 1980 తర్వాత పురపాలక సంఘ భవనం, కళాభారతి నిర్మించారు. 1982లో ఎల్ఎండీ నిర్మాణం పూర్తయింది. 1994లో మానేరునదిపై కొత్త వంతెన నిర్మించారు. 2001లో ఉజ్వల పార్కు, 2004లో జింకల పార్కు నిర్మించారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులుపాత నగర స్వరూపంపాత పట్టణ ప్రాంతాలైన పాత జిర్రాబాయి పరిసరాలు, పాత బజార్, అహ్మద్‌పురా, బంజరుదొడ్డి, ఫతేపూరా, కుమ్మరి కాపువాడలు, మేదరివాడ, షా సాహెబ్ మొçహీల్లా, పద్మశాలి, బ్రహ్మణ వీధులు, బోయ, దోభీవాడ, సిక్కువాడ, ప్రకాశం గంజ్, పెద్ద గడియారం, అస్లాం మజీద్ రోడ్, జాఫ్రీరోడ్, తిలక్‌రోడ్ వాడలున్నాయి. ప్రస్తుత ఆంధ్రా బ్యాంక్ ప్రాంతం అజ్మత్‌పురా, గుర్రాలపై స్వారీ చేస్తూ విధులు నిర్వహించిన పోలీస్ జమేదార్లు నివసించే ప్రాంతం సవరన్ మొహాల్లాగా ఏర్పడింది. డాక్ బంగ్లా వెనుక ప్రాంతం ముకరంపురగా, మిషన్ హాస్పిటల్ ఎదుట క్రిస్టియన్‌కాలనీ, దాని వెనక కురుమవీధి ఏర్పడ్డాయి.మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు..1952లో 45వేల జనాభాతో కరీంనగర్ మూడోగ్రేడ్తో 24 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడింది. తొలి మున్సిపల్ చైర్మన్‌గా ఖాజాబషీరుదీ్దన్ ఉండగా ఆయన హయాంలోనే గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారింది. 1981–85 పాలకవర్గం కాలంలో గ్రేడ్–1, 1987లో కరీంనగర్ పరిధిలోని రాంపూర్, రాంనగర్ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిశాయి. 2005లో నగరపాలక సంస్థంగా అవతరించి, 66 డివిజన్లతో కొనసాగుతోంది. మొదటి మేయర్‌గా దేశివేని శంకర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రత్యేక పాలన సాగుతోంది. కరీంనగర్ ప్రస్తుతం అభివృద్ధి పథకంలో కొనసాగుతోంది. స్మార్ట్ సిటీగా నయాలుక్ సంతరించుకుంటోంది. శాతవాహన యునివర్సిటీ, రైల్వేస్టేషన్, కేబుల్‌బ్రిడ్జి, ఐటీ టవర్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పడ్డాయి. -
స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు
నాణ్యమైన విద్య దేశ అభివృద్ధికి బాటలు వేస్తుంది. "పఢేగా ఇండియా తభీ తో బడేగా ఇండియా" అన్నట్టు 136 కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో విద్య ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గతంలో అనేకమంది సంఘ సంస్కర్తలు, పాలకులు నాణ్యమైన విద్యకోసం సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాలయాల కోసం, గ్రామీణభారతంలో విద్యాభివృద్ధికోసం ఎన్నో గుప్త దానాలు చేశారు. తాజాగా రాజస్థాన్‌లోని శిశోద అనే గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వార్తల్లో నిలిచారు. గ్రామీణ పిల్లలకు తమ గ్రామంలో ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.రాజస్థాన్ సోదరుల దాతృత్వంరాజస్థాన్కు చెందిన సోదరులు మేఘరాజ్-అజిత్ నగరాలకు పరిమితమైన ఉత్తమ విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు కూడా అందాలని కలగన్నారు. ఈ లక్ష్యంతోనే తమ గ్రామంలోని స్కూలు అభివృద్ధికోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కంకుబాయి-సోహన్‌లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌ను అత్యాధునికంగా తయారు చేశారు. ఆధునిక ప్రయోగశాలలు , సకల హంగులతో తరగతి గదులు, భారతదేశంలోని టాప్ ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by startupsmedia (@startups_media)తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’ నినాదానికి అనుగుణంగా చక్కటి వాతావరణాన్ని సృష్టించారు. విద్య అనేది కేవలం ధనవంతులకే కాదు.. అందరికీ అని చాటి చెప్పారు. ప్రతి పిల్లవాడు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడని , రాజస్థాన్‌ను గర్వించదగిన రాష్ట్రంగా మలుస్తున్నారని వీరు నమ్ముతున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురి నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: చెఫ్‌ల వైట్ క్యాప్ వెనుక రహస్యం? వీటికీ ర్యాంకులుంటాయా?వీరి చొరవ కారణంగా రాజస్థాన్‌లోని శిషోడా గ్రామంలో ఉన్న కంకుబాయి-సోహన్‌లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ఇపుడు ఆధునిక మూడు అంతస్తుల క్యాంపస్‌లో 40 స్మార్ట్ తరగతి గదులతో అలరారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ టూల్స్‌తో పాటు, విశాలమైన ఆట స్థలంకూడా ఉంది. ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని మేఘరాజ్, అజిత్ తెలిపారు. తరగతి గదుల వెలుపల కూడా విద్యాబోధన జరిగేలా పుస్తకాలు, పచ్చదనంతో కూడిన చక్కటి లైబ్రరీతో తీర్చిదిద్దామని తెలిపారు.దీనిపై గ్రామస్తులు సంతోషాన్ని వెలిబుచ్చారు. "ఇప్పుడిక మా పిల్లలను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాఠశాల గురించి కలలో కూడా ఊహించలేదు." అంటూ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘరాజ్ - అజిత్ సోదరులు ఈ స్కూల్లోనే చదువుకున్నారు. అందుకే తమకు విద్యను ప్రసాదించిన గ్రామానికి ఏదైనా గొప్పగా ఇవ్వాలని భావించి, స్థానికి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశారు. -
Indian Economy ‘నాలుగు’లోకి వస్తున్నా..
ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ మరొక మైలురాయిని చేరుకోబోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.) ‘వరల్డ్ ఎకనా మిక్ అవుట్ లుక్ – 2025’ నివేదిక ప్రకారం 2025లో 4.187 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత్, 4.186 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2027 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకి చేరుకుంటుందనీ, 2028 నాటికి 5.58 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని కూడా అధిగ మించి అమెరికా, చైనాల తర్వాత మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనీ ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా మొదటి రెండు స్థానాలలో ఉన్న అమెరికా (30.5 ట్రిలియన్ డాలర్ల జీడీపీ), చైనా (19.2 ట్రిలియన్ డాలర్ల జీడీపీ)లకూ భారత్‌కూ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అనేక అంశాలలో భారత్ దయనీయమైన స్థానాల్లో ఉంది. ఉదాహరణకు తలసరి ఆదా యంలో ప్రపంచంలో 141వ ర్యాంకు, మానవాభివృద్ధి సూచికలో (హెచ్‌డీఐ) 134వ ర్యాంకు,ప్రపంచ ఆకలి సూచీలో 105వ ర్యాంకు, స్థూల సంతోష సూచీలో 118వ ర్యాంకుల్లో నిలిచింది. ప్రపంచంలో మొదటి పది పెద్ద ఆర్థిక వ్యవస్థలలో పదివేల డాల ర్లతో భారత్ మాత్రమే అతి తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. చైనా తలసరి ఆదాయం దరిదాపు 25 వేల డాలర్లు. భారత్ కంటే తక్కువ జీడీపీజపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇటలీ, కెనడా, బ్రెజిల్‌లాంటి ఆరు దేశాలలో మొత్తం జనాభా కేవలం 57 కోట్లుగా ఉంటే... ఆ దేశాల సంపద 18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఆరు దేశాల జనాభా కంటే భారత్ జనాభా రెండు రెట్లు ఎక్కువ.‘ఆక్స్‌ఫామ్ ఇండియా రిపోర్టు–2024’ ప్రకారం భారతదేశంలో సంపద అసమానతలు పెరిగిపోతున్నాయి. 40 శాతం జాతీయ సంపద ఒక్క శాతం ధనికుల చేతిలో కేంద్రీకృతమై ఉంటే, 77 శాతం జాతీయ సంపద 10 శాతం ధనికుల చేతులలో ఉంది. ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్– 2025’ ప్రకారం, భారత్‌లో 284 మంది బిలియనీర్లు ఉంటే వారి సంపద మొత్తం 98 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో మూడవ వంతు.కోవిడ్ లాంటి విపత్కర పరిణామాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు నెలకొనే ఛాయలు కనిపించినప్పటికీ, స్థిరమైన వృద్ధిరేటు సాధిస్తున్న దేశంగా భారత్ నిలదొక్కుకోవటానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటమే కారణమని ఐఎంఎఫ్ భావిస్తోంది. కాబట్టి రాబోయే దశాబ్దంలో భారత్ మరిన్ని అద్భుత ఆర్థిక విజయాలు సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. – డా. తిరునహరి శేషుఅసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం -
చెఫ్‌ల వైట్ క్యాప్ వెనుక రహస్యం? వీటికీ ర్యాంకులుంటాయా?
చెఫ్‌లు అనగానే తెల్లని యాప్రాన్, నెత్తిపైన పొడవాటి తెల్లటి టోపీ గుర్తు వస్తాయి. వంటవారు ధరించే అంచులు లేని తెల్లటి టోపీని ఏమంటారో తెలుసా? ప్రొఫెషనల్ కిచెన్ డ్రెస్ కోడ్ అంటే ఏమిటి? టోపీలో ఉండే మడతల గురించి తెలుసా? తెలుసుకోవాలని ఉందా? ఇవిగో వివరాలుప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ చెఫ్‌లు ధరించే ఒక ఐకానిక్ టోపీని టోక్ అని పిలుస్తారు. 'టోక్' అనేది అరబిక్ పదం టోక్ లేదా టోక్ బ్లాంచ్ లా "తెల్ల టోపీ" అని అర్థం. చెఫ్ టోపీ , చరిత్ర మూలాలు పురాతన కాలం నాటివి. పురాతన కాలం అస్సీరియన్ సామ్రాజ్యం సుమారుగా 25వ శతాబ్దం BC నుండి 7వ శతాబ్దం BC వరకు ఉనికిలో ఉంది.అస్సీరియన్ నాగరికత సమయంలో, వంటవారు లేదా ఆహార తయారీలో పాల్గొన్న వ్యక్తులు నిర్దిష్ట తల కప్పులను ధరించారు అనడానికి ఆధారాలు ఉన్నాయి.తొలినాళ్లలో, చెఫ్‌లు తమ జుట్టు ముఖాలకు అంటకుండా ఉండటానికి , వేడి నుండి తమ తలలను రక్షించుకోవడానికి సాధారణ వస్త్రంతో చేసిన స్కల్‌క్యాప్‌లు లేదా హెడ్స్కార్ఫ్లను ధరించేవారు. అయితే, పాక వృత్తి అభివృద్ధి చెంది, ప్రతిష్టను పొందే కొద్దీ, చెఫ్‌ల దుస్తులు కూడా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం మనకు తెలిసిన చెఫ్ టోపీ 16వ శతాబ్దంలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. కాలక్రమేణా వీరు ధరించే టోపీ ఎత్తు, టోపీపై ఉండే మడతలు (ఫోల్డింగ్స్) పాకశాస్త్రంలో, చెఫ్‌లుగా వారి నైపుణ్యం అధికారానికి చిహ్నంగామారిపోయాయి. టోపీ ఎత్తు ,నిర్మాణం చెఫ్ ర్యాంక్ నైపుణ్య స్థాయిని సూచిస్తుంది. టోపీకి ఎన్ని ఎక్కువ మడతలు ఉంటే, ఆ వంటవాడు అంత నిష్ణాతుడు , నైపుణ్యం కలిగినవాడు అని అర్థం.ప్రఖ్యాత ఫ్రెంచ్ చెఫ్, మేరీ-ఆంటోయిన్ కారెమ్, ఆధునిక చెఫ్ టోపీని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 18వ శతాబ్దం చివరిలో- 19వ శతాబ్దం ప్రారంభంలో పాకశాస్త్ర మార్గదర్శకురాలైన కారెమ్, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఐకానిక్ పొడవైన, మడతల డిజైన్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు.వేడిగా ఉండే వంటగది వాతావరణంలో చెఫ్ తల చల్లగా ఉండటానికి ఇవి తోడ్పడతాయి. వెడల్పు అంచు ఒక కవచంగా పనిచేసి, జుట్టు, చెమట ఆహారంలోకి పడకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు ఏదైనా మరకలు లేదా ధూళి వెంటనే కనిపిస్తుంది కాబట్టి, శుభ్రత , పరిశుభ్రతకు ప్రతీకగా ఉండేలా తెల్ల రంగు టోపీలను ఎంపికచేశారు. నేటి కాలంలో కొంతమంది చెఫ్‌లు వివిధ ఆచరణాత్మక లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇతర రకాల తల కవరింగ్‌లను ఎంచుకుంటున్నప్పటికీ, పొడవైన టోక్ , పొడవాటి చేతుల తెల్లటి జాకెట్ అనేది ఐకానిక్ యూనిఫాంగా స్థిరపడింది అనడంలో సందేహంలేదు. -
గ్రేట్ సీఎం సార్!.. మాటల్లేవ్ అంతే!
ఎంత పెద్ద హోదాలో ఉన్నా..ఆ దర్పం చూపించకుండా ప్రవర్తించడం కొందరికే చెల్లుతుంది. అలాంటి వాళ్లు కచ్చితంగా ప్రజల మన్ననలను అందుకుంటారు. బహుశా ఆ తీరే వారిని గొప్ప నాయకుడిగా ఎదిగేలా చేస్తుందనడానికి ఈ సీఎంనే ఉదాహారణవివరాల్లోకెళ్తే..మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మాకి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సంగ్మా జిరాంగ్ నియోజకవర్గంలోని నాంగ్స్పంగ్ గ్రామంలోని ఒక స్థానికి పాఠశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఒక విద్యార్థి గిటార్ ప్లే చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తారు. వెంటనే ఆ విద్యార్థి వద్దకు వచ్చి..కోప్పడకుండా ఓపికతో ఎలా ప్లే చేయాలో చెబుతున్నట్లు కనిపిస్తుంది వీడియోలో. ఆయన ఒక సాధారణ టీచర్ మాదిరిగా ఎలా గిటార్ పట్టుకుని ఆలపించాలో చాలా వివరణాత్మకంగా చెబుతూ విద్యార్థిని గైడ్ చేస్తారు. అందుకు సంబంధించిన వీడయోని నెటిజన్లతో పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు సంగ్మా. నాంగ్స్పంగ్ గ్రామంలోని ఒక స్కూల్‌ని సందర్శించి..ఆ విద్యార్థులతో కాసేపు మచ్చుటించారు. అక్కడ ఒక విద్యార్థికి గిటార్ ప్లే చేయడం పట్ల అపారమైన ఆసక్తి ఉంది కానీ వాయించడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతానికి ఆ విద్యార్థికి అందులో అంత ప్రావీణ్యం లేకపోయినా..అతని పాఠశాల కొత్త భవనం ప్రారంభోత్సవ వేళకు గిటార్లో మంచి పట్టు సాధిస్తాడని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం గ్రేట్ సీఎం, మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సంగీతాన్ని అమితంగా ఇష్టపడే మేఘాలయ సీఎం తరుచుగా మ్యూజిక్‌కి సంబంధించిన వీడియోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. View this post on Instagram A post shared by Conrad Sangma (@conrad_k_sangma) (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్ గుప్తా
మట్టిలో పుట్టిన మాణిక్యాలకు మన దేశంలో కొదువ లేదు. చిన్న వయసులోనే అత్యద్బుతమైన నైపుణ్యంతో అబ్బుర పరచడమే కాదు, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారు. అలాంటి రత్నం లాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా. మహా మహా నిపుణులే కనిపెట్టలేని బగ్‌ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన పొరుగువారి Wi-Fi ని హ్యాక్ చేసి దానితో ఆడుకునే ఆ పిల్లవాడు, నేడు NASA వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థ వెబ్‌సైట్‌ను సైబర్ దాడుల నుండి రక్షించాడు కాన్పూర్‌కు చెందిన యువరాజ్ గుప్తా (Yuvraj Gupta). తన సామర్థ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తానేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా NASA అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది.BREAKING NEWS 🚨 📢 14 year old Yuvraj Gupta, who lives in Kanpur, Uttar Pradesh, has done a great feat. Hesaved the website of American space agency NASA from hackers.NASA has included him in the 'Hall of Fame' and also given him a letter of recognition. pic.twitter.com/GzTbgFB8GN— News Arena India (@NewsArenaIndia) May 25, 2025 fy"> NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు రెండు వారాల పాటుప్రయత్నించిన , ఇక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను NASA సబ్ డొమైన్లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చేరవేసే బగ్‌ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గుర్తించింది. యువరాజ్‌ను ప్రశంసా పత్రం , 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పించి సత్కరించింది.కాన్పూర్‌లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో చదువుతున్నాడు . 10వ తరగతిలో 79.4 శాతం మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, అతను యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సాధించాడు. 6వ తరగతిలో ఉన్నప్పటినుంచీ సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టువదలకుండా ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం.యువరాజ్ గుప్తా తండ్రి జై నారాయణ్ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తల్లి కల్పనా గుప్తా గృహిణి. యువరాజ్ కు ల్యాప్ టాప్ ఇవ్వడానికి, అతని సోదరి స్కాలర్షిప్ , అతని తండ్రి పొదుపు మొత్తాన్ని కలిపి మొత్తం సిస్టంను సమకూర్చుకున్నాడట. దేశానికి డిజిటల్ భద్రతను అందించాలనే సంకల్పంతో ఉన్నామంటోంది యువరాజ్ కుటుంబం. -
44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..
ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటలకందనిది. ఏ దేవుడి ఇచ్చిన వరం అనే భావన కచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి.దక్షిణకొరియాకి చెందిన హాన్ టే మే 1975లో ఆరేళ్ల కూతురుని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యుంగ్-హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్లు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వేసిరిపోయినా ఆమె ..ఇక తన కూతురు కనిపించిదనుకుని ఆశలు వదులేసుకుంది. అయితే 2019లో అనూహ్యంగా కమ్రా అనే డీఎన్ఏ మ్యాచ్ ద్వారా తన కూతురుని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి డీఎన్ఏతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్పుగా పనిచేస్తున్న బెండర్తో హెన్ టే డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. గుర్తింపు నిర్థారించుకోవడానికి బెండర్, హాన్టే ఫోన్ కాల్లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్‌కి వెళ్లి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సభ్రమాశ్చర్యంగా ఉంది. నిజమేనా..? కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురే అని నిర్థారణ చేసుకుని ఆలింగనం చేసుకుంది. 30 ఏళ్లుగా హెయిర్ డ్రస్సర్‌గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డే అని నిర్థారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యుంగ్ మాట్లాడుతూ..ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ..తనను రైల్వేస్టేషన్‌కి తీసుకువెళ్లిపోయిట్లు తెలిపింది. అక్కడ పోలీసు అధికారులు తనను ఎత్తుకుని ఒక అనాథశ్రమంలో ఉంచారని, అక్కడ నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది. అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్తత తీసుకుందని చెప్పుకొచ్చారామె. ఇక హాన్ టే ఇన్నాళ్ల తన మనో వేదనకు గానూ..దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్తత కార్యక్రమాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వంపై దావా వేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరకయాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చిపట్టినదానిలో క్షోభను అనుభించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమేగాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునట్లు తేలింది. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
రంగులు మార్చుకునే ఎడారి..!
సోసుస్వ్లీ– ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నమీబియా ఎడారిలో ఉన్న మైదానం. దాని చుట్టూ ఎత్తయిన ఎర్రని ఇసుక, బంకమట్టితో కూడిన మట్టితిన్నెలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వేళను బట్టి, కాలాన్ని బట్టి ఇవి అద్భుతమైన రంగులను సంతరించుకుంటాయి. రంగురంగుల మట్టితిన్నెలతో కూడిన ఈ ప్రాంతం ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ డ్యూన్–45 అనే మట్టితిన్నె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సందర్శకులు దీని పైకెక్కి చుట్టుపక్కల విశాలమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన చోటు ఏంటంటే డెడ్వ్లీ అనే ప్రదేశం. ఇక్కడ వందల సంవత్సరాల నాటి చనిపోయిన కేమెల్ థోర్న్ చెట్లు తెల్లటి బంకమట్టి నేలపై నిటారుగా నిలబడి ఉంటాయి. అవి ఒక అద్భుతమైన దృశ్యాన్నిస్తాయి. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్‌గా టెక్ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్‌గా బెంగళూరులోని ట్రాఫిక్ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు. తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్‌తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్జీ కార్పొరేట్స్ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్‌ను అందించింది.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్జీ గ్రూప్ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు. ఇదీ చదవండి : కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తోఅంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం. -
ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
వర్షమే ఆ రెండు జంటలను కలిపింది..!
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్‌లో వివాహం చేసుకోవలసి ఉంది. ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు. ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్‌కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్ వైరల్
200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్ జెట్ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్‌ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్‌కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్‌లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్ల వరకు థ్రస్ట్‌ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్‌లో అధునాతన ఫీచర్స్, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! -
మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!
విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్‌లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!) -
అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..!
ఏ వ్యాపారంలోనైనా.. అమ్మడం అనే ట్రిక్ తెలిస్తే..విజయం సాధించేసినట్లే. ఏ బిజినెస్ సక్సెస్ మంత్రా అయినా..కస్టమర్ కొనేలా అమ్మడంలోనే ఉంది. అదే పాటిస్తున్నాడు ఇక్కడొక లండన్ విక్రేత. అది కూడా మన భారతీయ భాషలో విక్రయిస్తూ..అందర్నీ ఆక్టటుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో లండన్‌లో ఒక వ్యక్తి కొబ్బరిబోండాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అతడు కొబ్బరికాయ కొట్టివ్వడం, అమ్మే విధానం అంతా భారతీయ చిరువ్యాపారిలానే ఉంటుంది. ఒక్క క్షణం భారత్‌లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అతడు అమ్ముతున్న విధానం చూస్తే. "నారియల్ పానీ పీ లో" అని హిందీలో అరుస్తూ కనిపిస్తాడు. అచ్చం మన వద్ద ఉండే కొబ్బరిబొండాల విక్రేతలు తియ్యటి కొబ్బరి బొండాలు అంటూ అరుస్తారే అలానే ఈ లండన్ వ్యక్తి అరవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా మన హిందీ భాషలో చెప్పడం విశేషం. ఇది ఒకరకంగా మన భారతీయ చిరువ్యాపారులు తమ గొంతుతో కస్టమర్లను ఆకర్షించే విధానం హైలెట్ చేసింది కదూ..!. View this post on Instagram A post shared by UB1UB2: Southall, West London (@ub1ub2) (చదవండి: Mobile Tailoring: ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..) -
పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..! -
'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్
అసాధారణమైన అడ్డంకులును అవలీలగా జయించి విజయ ఢంకా మోగించి స్ఫూర్తిగా నిలుస్తారు కొందరు. అదికూడా యంగ్ ఏజ్‌లో కాకుండా వృద్ధాప్యంలో సాధించడం అంటే మాటలు కాదు. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలనుకున్న వారికే ఇదంతా సాధ్యం అని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందింది ఈ అమ్మమ్మ. ఈ అమ్మమ్మ అందుకున్న గెలుపు వింటే..సూపర్ బామ్మ అని అనుకుండా ఉండలేరు. ఆ ఏజ్‌లో చదవాలనుకోవడమే గొప్ప..కానీ ఈ బామ్మ తనున్న వైకల్యానికి చదవాలనే నిర్ణయమే అత్యంత సవాలు. పైగా అందరి అంచనాలను తలకిందులు చేసేలా విజయం అందుకోవడం మరింత విశేషం. ఆ అమ్మమ్మ ఎవరు ఏంటా కథ సవివరంగా తెలుసుకుందామా..!.అమెరికాలోని టేనస్స్ రాష్ట్రానికి చెందిన 47 ఏళ్ల అమండా జుయెట్టెన్కి ఉన్నత విద్యపూర్తి అయిన వెంటనే వివాహం అయిపోయింది. ఆ తర్వాత పిల్లల బాధ్యతలు, కుటుబ పోషణార్థం ఉద్యోగం చేయడం తదితరాలతో జీవితం గడిచిపోయింది. అమ్మమ్మగా మారే నాటికి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే పరిస్థితి కారణంగా కనుచూపు పోగొట్టుకుంది. కనీసం ఈ చరమాంకంలో అయినా ..ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామనుకుంటే..కంటి చూపే కరువైపోయింది అని విలవిలలాడింది. కనీకనబడకుండా ఉన్న ఆ కొద్దిపాటి కంటి చూపుతోనే ఏదైనా నేర్చుకోవాలని ఆరాటపడింది. ఆ క్రమంలోనే కొలరాడో సెంటర్ ఫర్ ది బ్లైండ్‌లో ఎనిమిది నెలల గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయ్యింది. 30 ఏళ్లక్రితం వదిలేసిన చదువుని తిరిగి బుర్రకు ఎక్కించుకోవడం..పట్టు సాధించడం తదితరాలను తన ఆత్మవిశ్వాసంతో ఎందుర్కొంది. తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్నా ఆమె ప్రగాఢమైన కోరిక ఆ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి అయ్యేలా చేసింది. తన సంరక్షకుడు, గైడ్ అయిన తన పెంపుడు కుక్కతో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. తాను అందురాలిగా ఆ స్కిల్ నేర్చుకోకుండా మిగిలిపోకూడదనుకున్నా అని సగర్వంగా చెబుతోంది. అంతేగాదు అంధులకు స్వరం కావాలి. అందుకోసం మంచి ఉన్నత చదువులు చదవాలి..అప్పుడే వారు తమ గళాన్ని వినిపించగలరు అంటుందామె. వారిలో స్ఫూర్తి నింపేందుకే తన ఎడ్యుకేషన్ జర్నీని ఆపనంటోంది. డాక్టరేట్ కూడా సాధించాలనుకుంటోంది. మరీ ఆ అమ్మమ్మకి ఆల్ ద బెస్ట్ చెప్పి..విజయం సాధించాలని మనసారా కోరుకుందాం..!.(చదవండి: భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు ) -
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఉరుకుల పరుగుల లైఫ్‌స్టైల్ అలవాటైపోయింది. ఉదయం లేచింది మొదలు కుటుంబం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇతర కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఇంటికి చేరుకోగానే కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా విశ్వాసానికి మారుపేరైన శునకాలను పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వాటితో కొంత సమయం వాకింగ్ చేయడం, ఆహారం పెట్టడం, పెంపుడు జంతువులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.లక్షలు వెచ్చించి మరీ నచ్చి ఇంపోర్టెడ్ బ్రీడ్లు, వీధి జాతి శునకాలను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక్కో బ్రీడ్‌లో ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల శునకాలు సైతంస్టేటస్గా ఫీలవుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్లు ఎంపికలు ఉంటున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల బ్రీడ్లు అందుబాటులో ఉంటున్నాయి. విందు, వినోదాలు, టూర్లు వెళ్లినప్పుడు వాటిని హేండ్ బ్యాగ్‌లో వేసుకుని వెళ్తున్నారు. మూగజీవులతో ఎంజాయ్ చేస్తున్నారు. శునకం, గుర్రం, గోవులను పెంచడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుందని పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్గ్రేట్ డేన్ : ప్రపంచంలో ఎత్తయిన శున జాతి ఇది. జర్మన్ బ్రీడ్. అత్యంత వేగంగా పరుగులు తీస్తాయి. అప్రమత్తమైన, ధైర్య సాహసాలతో కూడిన శునకం. మనుషులతో స్నేహపూర్వకంగానూ ఉంటుంది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. జర్మన్ రాజులు ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, ఇతర జంతువుల వేటకు ఉపయోగించేవారట. చివావా : చివావా అనేది మెక్సికన్ జాతి శునకం. చిన్న జాతి కుక్క. చెవులు నిటారుగానూ, కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. కేవలం రెండు కేజీల బరువు ఉంటుంది. దీన్ని సెలబ్రిటీలు, ఉన్నత శ్రేణి వర్గాల మహిళలు తమ హేండ్ బ్యాగులో వేసుకుని వెంట తీసుకెళ్తుంటారు. శుభకార్యాలు, టూర్లలోనూ ఇవి వెంట ఉంటాయి. లాబ్రడార్ : ఈ రకం శునకాలకు అనేక దేశాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటాయి. సహచరుడిగానూ ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ఎక్కువగా క్రీడలు, వేటకు వినియోగిస్తారు. వీధి కుక్కలను సైతం.. : నగరంలో వీధి కుక్కలను సైతం చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల చిన్నగా(పుట్టిన రోజుల వ్యవధిలోనే) ఉన్నప్పటి నుంచే ఇంటికి తీసుకెళ్లి ముద్దుగా చూసుకుంటున్నారు. దానితో ఇంట్లో అందరూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇవి స్నేహపూర్వకంగా, రక్షణగానూ ఉంటాయి. -
సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..
చిన్నప్పుడే విద్యుత్ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్ జీవితంపై స్పెషల్ స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ ‘సాక్షి’తో చెప్పాడు. స్ఫూర్తిగా నిలిచి.. విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్ మధు అనిపించుకున్నాడు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్ టాప్‌ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. చిరునవ్వుతో ముందడుగుమునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్ వచ్చి షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.నోటితో పెయింటింగ్..నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్ జామ్ షోకు హాజరై అక్కడ మెగాస్టార్ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్లు ప్రభాస్, వెంకటేష్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.ఐఏఎస్ అవ్వడమే లక్ష్యం..కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్ గ్రామం, మునిపల్లి మండలం -
గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే..
విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్‌క్రీం డిజర్ట్‌లలో గోల్డ్‌తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్ మ్యాన్‌లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నారంటే..ఇండోర్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్లో ఈ 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్‌తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. బహుశా అదే అతడి సేల్స్ ట్రిక్ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్ హోటల్‌కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్ గోల్డ్‌తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట. ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట. 'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్ అయిన ఈ గోల్డ్ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్ ఈ బజార్. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్ క్రమంగా విస్తరించిందట. చివరగా ఈ సరఫా బజార్లో ది గోల్డ్‌మ్యాన్ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్‌గా నిలిచిన డెజర్ట్. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్‌ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్ చేసింది.(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్‌కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!) -
పిల్లిలా మారిన ఓ పులి కథ ఇది!
పులి మనతో మాట్లాడగలదా? తన బాధను మనతో చెప్పుకోగలదా? ఈ ఫొటో చెప్పగలదు.. ఆ పులి కథనే కాదు.. అందులోని అంతులేని వ్యథనూ మనకు కళ్లకు కట్టినట్లు చూపించగలదుఓ గదిలో బంధించి కొడితే.. పిల్లి అయినా పులిలా మారుతుందట.. కానీ అదే గదిలో ఓ పులి పిల్లిలా మారిన కథ ఇది... ఆ పులి పేరు... సలమాస్..సలమాస్.. ఓ ఇండో చైనీస్ ఆడ పులి.. థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు బ్రీడింగ్ ఫార్మ్ దాని నివాసం. జీవిత ఖైదు వేసినా.. 14 ఏళ్ల తర్వాత విడుదలయ్యే చాన్స్ ఉంది.. సలమాస్ విషయంలో అది 20 ఏళ్లు.. చిన్నపాటి కాంక్రీట్ గదిలోనే అన్నేళ్లూ గడిపేసింది. తొలి సంధ్యను చూసింది లేదు.. తొలకరిలో తడిచింది లేదు.. జీవితాంతం పిల్లల్ని కనే యంత్రంగా పనిచేసింది. థాయ్‌లాండ్‌లోని టైగర్ టూరిజం, పులుల పళ్లు, గోర్లు, చర్మం, ఎముకలు, పంజా, మాంసం వంటి అక్రమ విక్రయాల వ్యాపారాల కోసం వరుసగా పిల్లల్ని కంటూనే ఉంది. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణించింది. చిక్కిశల్యమైంది. ఎముకల గూడులా మారింది. కానీ నిర్వాహకుల మనసు కరగలేదు. మరణమే మేలు అనుకునేలా తన బతుకును మార్చారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం. అయితే, అదృష్టవశాత్తూ 2023 డిసెంబర్లో వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ సలమాస్తో పాటు ఆ ఫాంలో ఉన్న మరికొన్ని పులులను రక్షించింది. వాటిని తమ అభయారణ్యానికి తరలించింది. ఇక్కడే సలమాస్ తన జీవితపు మలి సంధ్యలో తొలి సంధ్యను చూసింది. తొలకరిలో తడిచింది. తొమ్మిది నెలల అనంతరం అక్కడే తుది శ్వాస విడిచింది. సలమా అంటే అరబిక్‌లో శాంతి అని అర్థం అట. రెస్ట్ ఇన్ పీస్ అంటే మరణానంతరం శాంతి లభించుగాక అని అర్థం అట.. జీవితాంతం అశాంతితో బతికిన సలమాస్.. రెస్ట్ ఇన్ పీస్!బ్రీడింగ్ ఫార్మ్‌లో సలమాస్ దయనీయ స్థితిని తన ఫొటోతో చిత్రిక పట్టిన ఆమీ జోన్స్‌కు ఇటీవలి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రఫీ పోటీల్లో హ్యూమానిటీ వెర్సస్ నేచర్ విభాగంలో తొలి బహుమతి దక్కింది.– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
నో డుమ్మా.. రోజంతా పనే : బెంగుళూరు పనిమనుషుల రూటే వేరు!
నగరాల్లో ప్రస్తుతం భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగులైన మధ్యతరగతి కుటుంబాలను, వేధించే ప్రధానమైన సమస్య ల్లో ముందు వరుసలో ఉంటుంది హౌస్ మెయిడ్/పనిమనిషి అని చెప్పొచ్చు. ఒక్కరోజు పనిమనిషి రాదు అని తెలిస్తే గృహిణుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే...బెంగళూరు వాసులు పనిమనిషికి ఓ చక్కని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. అది ఏమిటో ఊహించగలరా? ప్రముఖ మీడియా సంస్థ బెంగుళూర్లోని కొన్ని కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారం ప్రకారం... ఆ నగరంలో పనిమనిషి స్థానం వేగంగా భర్తీ అవుతోంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా.. దాదాపుగా అన్ని పనుల్లోనూ పనిమనిషి అవసరాన్ని ఈ కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఇంటి పనులలో సహాయపడే రోబోట్లు. వీటిని వినియోగిస్తున్న కొన్ని కుటుంబాల గురించి చెప్పుకుందాం...బెంగుళూర్లోని హెబ్బాళ్ నివాసి అయిన 35 ఏళ్ల మనీషా రాయ్ ఏడు నెలల క్రితం తన వంటవాడి స్థానంలో వంటగది రోబోట్‌ను పెట్టుకుంది. ఇది తమకు సంబంధించినంత వరకూ సానుకూల మార్పు అని ఆమె చెప్పింది. ఆమె భర్త నవీన్ వారి చిన్న కుమార్తె నక్షత్రతో సహా ఆమె కుటుంబం ఇప్పుడు రోబోట్–వండిన పోహా, పావ్ భాజీ రాజ్మా రైస్ వంటి వెరైటీ వంటలను ఇష్టపడుతున్నారు. శుభ్రంగా తింటున్నారు. దశలవారీ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేసే మొబైల్ యాప్‌ని ఉపయోగించి మనీషా ఆ రోబోట్‌ను నియంత్రిస్తున్నారు. అయితే ఆమె కేవలం కలపవలసిన పదార్థాలను మాత్రమే చెబుతుంది. జోడిస్తుంది రోబోట్ యంత్రం ఆమె పర్యవేక్షణ లేకుండానే మిగతావన్నీ – కోయడం, వేయించడం, ఆవిరి చేయడం కూడా సర్వం తానై చేసేస్తుంది. అంతేకాదు సదరు రోబోట్ ఆమె ఇతర పనులను చేసుకోవడాన్ని రకరకాలుగా సులభతరం చేస్తుంది. వ్యయం పరంగా చూసినా, వంటవాడిని ఉంచడం కంటే ఇది మరింత సరసమైనదిగా మనీషా చెబుతున్నారు. తాను కొన్న రోబోట్ ధర 40,000 ఉన్నప్పటికీ, ఆదా అయే మొత్తంతో పోలిస్తే చాలా తక్కువేనన్నారామె.అదేవిధంగా, నగరంలో ఆర్కిటెక్ట్ అయిన మీరా వాసుదేవ్ 18 నెలలుగా పనిమనిషి లేకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆమె రోజువారీగా ఇల్లు శుభ్రపరచడానికి రోబోటిక్ వాక్యూమ్, మాపింగ్ పరికరాలను ఉపయోగిస్తుంది. పైగా ఈ యంత్రాలు మందపాటి కార్పెట్లు వంటివి శుభ్రపరిచే పనులకు బాగా ఉపకరిస్తాయని ఆమె అంటున్నారు. కోరమంగళ నుంచి బెంగుళూర్‌కు ఇటీవలే వచ్చిన రేణుకా గురునాథన్ వంటి ఇతర నివాసితులు డిష్వాషర్లు రోబోటిక్ స్వీపర్లను వినియోగిస్తున్నారు ఈ స్మార్ట్ పరికరాలు ఇంటిలో బాధ్యతలను ఇంటి యజమానులు నిర్వహించే పాత్రలను కూడా మారుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత పట్ల ఆసక్తి చూపే మగవాళ్లు వీటిని ఉపయోగించేందుకు ఉత్సాహం చూపుతూ ఇంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తన భర్త ఇప్పుడు రోబోతో వంట చేయించడాన్ని కూడా ఆనందిస్తున్నాడని మనీషా చెప్పడం గమనార్హం.తుషారా నయన్ వంటి గృహిణులు కూడా మారారు. పనిమనిషిని భర్తీ చేయడం గురించి ఆమె కుటుంబం మొదట్లో అంగీకరించలేదు. కానీ వారు ఇప్పుడు రోబోట్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సాంకేతికతలు రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, అవి మానవ సేవల్ని పూర్తిగా భర్తీ చేయలేవని కొందరు నమ్ముతారు. మరోవైపు సామాజిక కార్యకర్త గీతా మీనన్ మాట్లాడుతూ, గృహ కార్మికుల హక్కులను రక్షించడంపై స్టార్టప్‌లు దృష్టి పెట్టాలనీ, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేయడం కాదు. కార్మికులకు మద్దతు ఇచ్చే సాధనాలను వేతన కాలిక్యులేటర్లు లేదా డిజిటల్ పేస్లిప్లు వంటివి టెక్ తరం అన్వేషించాలని సూచిస్తున్నారు