breaking news
Hyderabad
-
బాలసదనాల్లో భారీగా ఖాళీలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటైన శిశు గృహాలు, బాలసదనాలు, జిల్లా స్థాయి శిశు సంరక్షణ యూనిట్లలో పలు కేటగిరీల్లో 267 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. నవజాత శిశువు మొదలు ఆరేళ్లలోపు ఉన్న చిన్నారుల సంరక్షణలో ఈ గృహాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 శిశు గృహాలు, బాలసదనాలున్నాయి. వీటితో పాటు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో శిశు విహార్ ఉంది. మంజూరైన పోస్టుల్లో దాదాపు 60 శాతానికి పైబడి ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.కీలక పోస్టులు ఖాళీ..శిశు గృహాలు, బాల సదనాల్లోని చిన్నారుల ఆలనా, పాలన చూసుకోవడంలో ఆయాలు కీలక భూమిక పోషిస్తుండగా.. వారికి వైద్య సేవలందించడంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ గృహాల్లో మొత్తం 32 మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 8 మంది మాత్రమే కొనసాగుతున్నారు. నర్సుల కేటగిరీలో 70 శాతం మేర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఇవికాకుండా సూపరింటెండెంట్, మ్యాట్రిన్, నైట్ వాచ్మెన్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా స్థాయి శిశు సంరక్షణ కేంద్రాల్లో చాలా కేటగిరీల్లో వేకెన్సీ ఉంది. శిశు గృహాల్లో మొత్తంగా 267 పోస్టులు ఖాళీగా ఉండగా జిల్లా స్థాయి శిశు సంరక్షణ కేంద్రాల్లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు గణాంకాలు వెల్లడించారు. వీటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
‘కాళేశ్వరం’ నివేదికపై తప్పుడు రాతలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పేరు మీద మీడియాలో ఇష్టమొచ్చినట్టు రాతలు రాయిస్తున్నారని, అవేవీ నిజాలు కావని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. అవన్నీ సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం నుంచి వస్తున్న తప్పుడు లీకులు మాత్రమేనని స్పష్టంచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేలా వార్తలు రాయవద్దని కోరారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.‘మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు. తప్పుడు వార్తలు రాసేవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. అయితే, నేను కేవలం మీడియా ముసుగులో ఉన్న తెలంగాణ వ్యతిరేక స్లాటర్ హౌస్ (వధశాల)ల గురించి మాట్లాడుతున్నా. ఈ రోత రాతలను అర్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం కమిషన్ రహస్య నివేదిక ఇస్తే అందులోని అంశాలు ఈ స్లాటర్ హౌస్‌లకు ఎలా తెలిశాయి? సొంత వ్యాఖ్యానాలు చేస్తామంటే కుదరదు’అని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని పేర్కొన్నారు.ఏ కమిషన్ అయినా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నివేదికలు ఇవ్వలేవు అన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ ప్రతీ క్షణం పరితపించారని, నాలుగేళ్లలోనే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితమిచ్చారని పేర్కొన్నారు. ‘పోలవరం పనులు ప్రారంభించి నాలుగు దశాబ్దాలైనా ఇంకా పూర్తి చేయలేక పోయారు. కేంద్రం పోలవరంపై ఇప్పటికే రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టింది. అందులో రూ.2 వేల కోట్లు వరదల్లో కొట్టుకుపోయిన వాటి బాగుకే వెచ్చించారు. ఇప్పటికే పోలవరం మూడు సార్లు కొట్టుకుపోయింది. అలాంటిది 500 సంవత్సరాల్లో ఎపుడూ రాని విధంగా దాదాపు 38 లక్షల క్యూసెక్కులు రావడంతోనే మేడిగడ్డ బరాజ్‌లో కొంతభాగం కుంగిపోయాయి. కానీ, మోదీ, చంద్రబాబు, రేవంత్ కలిసి కేసీఆర్‌పై దుర్మార్గమైన దాడి చేస్తున్నారు’ అని విమర్శించారు. రూ.50 వేల కోట్ల మూటల సంగతేంటి? దాదాపు రూ.50 వేల కోట్ల మూటలు ఢిల్లీకి సమర్పణ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పారీ్టకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని చేసిన విమర్శలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా పదేళ్ల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి వెళ్లలేదని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఢిల్లీ పర్యటనల్లో అర్థశతకం పూర్తి చేశారని ఎద్దేవా చేశారు.50 సార్లు వెళ్లినా రాష్ట్రానికి 50 పైసలు కూడా తేలేదని విమర్శించారు. ‘ఢిల్లీ వెళ్లేది సంచుల పంపిణికి మాత్రమే. నిన్న సీఎం, మంత్రులు ఢిల్లీ వాటాల గురించి మాట్లాడుకున్నారు’ అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గతంతో సోషల్ మీడియాను వాడుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే సోషల్ మీడియాను చూస్తే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ .భాస్కర్ రావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
ఒలింపిక్స్ పతకం లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్స్ నిర్వహించేందుకు మన వద్ద నిధులు, వేదికలు, అన్ని వనరులు, హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇంతా చేసి మనం ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేకపోతే మన ముఖం ప్రపంచానికి ఎలా చూపిస్తాం? అందుకే మున్ముందు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రీడా సదస్సు(స్పోర్ట్స్ కాంక్లేవ్) నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఒలింపిక్ పతక విజేతలు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, ప్రపంచ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ అంజూ బాబీ జార్జ్, మాజీ వాలీబాల్ ప్లేయర్ రవికాంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. పలువురు మాజీ క్రీడాకారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు ‘క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో కలిసి పని చేస్తాం. స్పోర్ట్ పాలసీ అమలుకు సంబంధించి పలువురు ప్రముఖులతో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై క్రీడల్లో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోరు. ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న, నిష్ణాతులైన వారిని ఏరికోరి భాగస్వాములను చేస్తున్నాం. వారంతా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తారని నమ్ముతున్నా..’అని సీఎం పేర్కొన్నారు. మున్ముందు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ ‘పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన చూసిన తర్వాతే నాకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చాలా కాలంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ అనేదే లేదు. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానం గురించి నిర్ణయం తీసుకున్నాం. విజన్ 2047లో క్రీడలకు ప్రత్యేక అధ్యాయం కేటాయించాం. మున్ముందు క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తాం. ఈ పాలసీ లైబ్రరీలో పడేసే కాగితం ముక్క కాదు. బంగారంతో గీసిన రేఖ లాంటిది..’అని రేవంత్ అన్నారు. హైదరాబాద్‌కు చాన్స్ ఇవ్వమని అడిగాం.. ‘1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టులో 9 మంది హైదరాబాదీలే ఉన్నారు. హైదరాబాద్‌లో గతంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ క్రీడలను సమర్థంగా నిర్వహించాం. అయితే గత ప్రభుత్వం పదేళ్లు క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్టేడియంలు ఫంక్షన్ హాళ్లుగా, సన్‌బర్న్‌లాంటి ఈవెంట్లకు వేదికలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. 2026లో ఖేలో ఇండియా నిర్వహణ హక్కులు మనకు కేటాయించాలని, 2036లో భారత్‌లో ఒలింపిక్స్ జరిగితే రెండు క్రీడాంశాలను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. కొరియా యూనివర్సిటీ నుంచి కోచ్‌లు ‘రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంతో యువత పెడదారి పడుతోంది. అటువంటివారిని సరైన మార్గంలోకి తెచ్చేందుకు క్రీడలే తగిన మార్గమని భావిస్తున్నాం. గత ఏడాది నేను కొరియా వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వచ్చిన విషయం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడే అదే యూనివర్సిటీతో జత కట్టి కోచ్‌లను తీసుకురానున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది..’అని రేవంత్ ప్రకటించారు. సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తిలాంటి ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 మందితో గవర్నింగ్ బోర్డు కొత్త స్పోర్ట్స్ పాలసీని సమర్థంగా నిర్వహించేందుకు 15 మందితో ప్రభుత్వం గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు మాజీ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, భైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, మాజీ అధికారులు పాపారావు, ఇంజేటి శ్రీనివాస్, వ్యాపారవేత్తలు సంజీవ్ గోయెంకా, ఉపాసన కామినేని, విటా దావి, కావ్య మారన్, సి.శశిధర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పలు సంస్థలతో ఎంఓయూలు ‘స్పోర్ట్ కాంక్లేవ్’లో భాగంగా వేర్వేరు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఫుట్‌బాల్ అకాడమీ కోసం ‘ఫిఫా’, ‘ఏఐఎఫ్ఎఫ్’లతో, ఒలింపిక్ వాల్యూస్ ప్రోగ్రామ్‌కు సంబంధించి అభినవ్ బింద్రాతో, షూటింగ్లో ప్రతిభాన్వేషణ, శిక్షణ కోసం ‘గన్ ఫర్ గ్లోరీ’అకాడమీతో, బాస్కెట్ బాల్ క్రీడలో ప్రతిభాన్వేషణ, అభివృద్ధి కోసం ‘స్పోర్ట్స్ ప్రిక్స్’సంస్థతో, క్రీడలతో పాటు చదువులో కూడా కెరీర్ మార్గనిర్దేశం చేసేలా ‘హర్ స్పోర్ట్స్ కీ చాంపియన్’సంస్థతో ఒప్పందాలు కుదిరాయి. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన ‘టెన్విక్’సంస్థ రాష్ట్రంలోని 50 పాఠశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఎంఓయూ కుదిరింది. -
బీసీలకు 32 శాతమే రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఆయా వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపాదిత 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీల మహాధర్నాలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, వాస్తవంగా 32 శాతం రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్నాయకులు అసత్య ప్రచారం చేస్తూ, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు. సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిసీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు సంబంధం లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో జంతర్ మంతర్ వద్ద నిరసన డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు చీవాట్లు పెట్టాక బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చారని అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయకుంటే సీఎం భరతం పడతంరిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డి భరతం పడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారని, బీసీల కళ్లలో మట్టి కొట్టిన బీఆర్ఎస్కు ఇప్పుడు ఆయా వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతూ..బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243– ఈ (6) ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. బీసీలకు మేలు చేయకూడదన్న ఎజెండాతోనే కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరిచ్చే 42 శాతం రిజర్వేషన్లను కోర్టులు ఆపుతున్నాయా..? ఢిల్లీ ఆపుతుందా..?’అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా.కాసం వెంకటేశ్వర్లు, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ వైఫల్యంలో బాధ్యులు వారే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. కేసీఆర్ రెండు విధాలుగా బాధ్యుడు! విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్ డైరెక్ట్‌గా, వైకారియస్గా బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. న్యాయ పరిభాషలో వైకారియస్ అంటే సేవకులు చేసే తప్పిదాలకు యజమాని (మాస్టర్) పరోక్ష బాధ్యత వహించడం. అంటే సహచర మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు చేసిన తప్పిదాలకు సీఎంగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఇక ప్రత్యక్షంగా కూడా కేసీఆర్ పలు అవకతవకలకు పాల్పడినట్టు తెలిపింది. ఈటల, హరీశ్‌లది బాధ్యతారాహిత్యం! నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలను గాలికి వదిలేశారని, కేఐపీసీఎల్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా పూర్తి బాధ్యతలను ఆ సంస్థకే వదిలేశారని కమిషన్ తప్పుబట్టింది. ఇక హరీశ్‌రావు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేశారని, పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేశారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిందని కమిషన్ పేర్కొంది. దీనికి గతంలో, ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్న వారందరూ బాధ్యులేనని స్పష్టం చేసింది. నేరపూరిత విశ్వాసఘాతం, నిధుల దురి్వనియోగానికి వీరంతా బాధ్యులని పేర్కొంది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది. ఇష్టారాజ్యంగా వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు! ‘మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తికాక ముందే దాదాపుగా పూర్తైందని నిర్థారిస్తూ 2019 సెప్టెంబర్ 9న బరాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్‌స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తైందని మళ్లీ 2021 మార్చి 15న మరో సర్టిఫికెట్ ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలు/లీకేజీలపై నిర్లక్ష్యం వహించి అవి సైతం పూర్తైనట్టు ఆయా బరాజ్‌ల క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సర్టిఫికెట్లు జారీ చేశారు..’ అని కమిషన్ పేర్కొంది. ఇక బరాజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనందుకు గాను మాజీ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్ర రావుతో పాటు డ్యామ్ సేఫ్టీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవాలను తొక్కిపెట్టిన మాజీ ఈఎన్సీలు బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి? లంప్సమ్ విధానంలో చేసుకోవాలా? టర్న్ కీ విధానంలోనా? అనే విషయంలో..మాజీ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్, మాజీ సీఈ బి.హరిరామ్ వాస్తవాలను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. నీటి లభ్యత విషయంలో నిపుణుల కమిటీ నివేదికను విస్మరించి కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) తప్పుదోవ పట్టించారని వెల్లడించింది. ఇక కమిషన్ ముందు హాజరై తప్పుడు సాక్ష్యం ఇచ్చిన సీడీఓ మాజీ సీఈ ఎ.నరేందర్ రెడ్డి, సీఈ టి.శ్రీనివాస్, కాళేశ్వరం బరాజ్ మాజీ ఈఈ ఓంకార్ సింగ్‌లను కమిషన్ తప్పుబట్టింది. నివేదిక తొక్కిపెట్టిన జోషి..బిజినెస్ రూల్స్ ఉల్లంఘించిన స్మిత మేడిగడ్డ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ సమర్పించిన కీలక నివేదికను ఎస్కే జోషీ తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. లేనిపక్షంలో బరాజ్ నిర్మాణం జరగక పోయేదని అభిప్రాయపడింది. ఇక స్మిత సభర్వాల్ బరాజ్‌ల నిర్ణయాలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను కేబినెట్ ముందుంచడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె బిబినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. ఎల్ అండ్ టీకి ఆ అర్హత లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తైందని నిర్ధారిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్‌ను పొందడానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అర్హత లేదని కమిషన్ పేర్కొంది. బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌ను తన సొంత ఖర్చుతో ఆ సంస్థ పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఏర్పడిన లోపాలను గుర్తించి సరిచేయడంలో విఫలమైనందుకు ఆ రెండు బరాజ్‌ల నిర్మాణ సంస్థలూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యులైన ఇంజనీర్లు వీరే.. మోడల్ స్టడీస్ నిర్వహించకుండానే డిజైన్ల తయారీ, నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం, థర్డ్ పార్టీతో డిజైన్లకు వెట్టింగ్ చేయించకపోవడం, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను నీటిపారుదల శాఖలోని పలు విభాగాల ఇంజనీర్లను కమిషన్ బాధ్యులుగా తేల్చింది. విభాగాల వారీగా వారి పేర్లను ప్రస్తావించింది.. – సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నాటి చీఫ్ ఇంజనీర్ – తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ చీఫ్ ఇంజనీర్ – కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ – సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు -
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందన
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం!
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.నగరంలోనూ అదే పోకడ.. గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది. -
గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణం: సీఎం రేవంత్
హైదరాబాద్: క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ప్రతేక పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి,. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంక్లేవ్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో సరైన పాలసీ లేకపోవడంతో యువత పెడదారి పట్టిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కొదవలేదని, క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, నజరానాలు ఇచ్చామన్నారు. గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐసీసీ(HICC)లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి , సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జాతీయ ,అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రముఖులు, క్రీడా సంస్థల నిర్వాహకులు హజరయ్యారు. -
కేటీఆర్ పరువు నష్టం కేసు.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేటీఆర్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది. -
‘సృష్టి’ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ నమ్రత.. పేద మహిళలను గుర్తించింది. పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి.. ఏజెంట్లు ట్రాప్‌లోకి లాగుతూ.. ఆర్థికంగా ఆశ చూపి పిల్లలను కన్న తర్వాత డబ్బులు ఇస్తామని ఎర వేసినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ నమ్రత బృందం.. నవజాత శిశువును తీసుకుని తల్లికి డబ్బులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా నవజాత శిశువులను తీసుకొచ్చి డాక్టర్ నమ్రత బ్యాచ్.. చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతోంది. సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ బాధిత దంపతులకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్‌గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయపడ్డాయి.సృష్టి సెంటర్ కేసులో ఏ3 కల్యాణి, A6 సంతోషి స్టేట్మెంట్లు విచారణలో కీలకంగా మారనున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత.. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. -
ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్ పోగొడితే?
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే.. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవడం కామనే! ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి.. చివరకు బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాక.. తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్ చెబితే? బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం.. అంతేకదా!?మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్ మహారాష్ట్ర పరెల్‌లోని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్‌లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. అన్ని ఈఎంఐలు కట్టేశాక, బ్యాంక్ నుంచి నో– డ్యూస్ సర్టిఫికెట్ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్ అందించాల్సిన సేల్‌డీడ్ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిసయ్యాయని వివరించింది. దీంతో ప్రదీప్ ‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్‌డీడ్ కాపీలు లేకపోవడంతో ఇంటిని విక్రయించలేకపోతున్నానని, పైగా ఈ ఘటనతో మానసిక వేదనకు గురయ్యాయని, విలువైన సమయం వృథా చేసినందుకు బ్యాంక్ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని’ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.పరిహారం సరిపోలేదు.. ప్రదీప్‌కు రూ.60 వేలు నష్ట పరిహారాన్ని బ్యాంకు చెల్లించాలని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగోట్టినందుకు, రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు, మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని వివరించింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్ షెట్టి.. మహారాష్ట్ర స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో స్టేట్ ఫోరం.. పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. 3 నెలల్లోపు కస్టమర్‌కు సర్టిఫైడ్ సేల్‌డీడ్ కాపీని అందించాలని, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఎవరైనా సరే ఇలా చేయండి కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్ శెట్టికే కాదు.. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్‌లు పోగోడితే.. కస్టమర్ పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్ సేల్‌డీడ్ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్‌లదే! ఇందుకోసం స్థానిక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను సంప్రదిస్తే చాలు! ఒకవేళ ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతర కారణాలతో మిస్ అయితే? దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ.. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సేల్ డీడ్ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ సేల్‌డీడ్ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్ రాసివ్వాలి.ఫామ్–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చేసి.. ప్రాపర్టీ జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రిక ప్రకటన జత చేసి సబ్ రిజిస్ట్రార్‌కు అందించాలి. నిర్ణయించబడిన ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. -
ఆటోల ధరలు ఖరారు.. ఎక్కువకు విక్రయించకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: ఆటో రిక్షా ధరలను రవాణాశాఖ ఖరారు చేసింది. ఎల్పీజీ ఆటో రిక్షా ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటో రిక్షా ధరను రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి అలాంటి బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా నియంత్రించింది.ఓఆర్ఆర్ పరిధిలో నడిపేందుకు వీలుగా సుమారు 65 వేల ఆటో పర్మిట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు కాగా, మరో 20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికే సీఎన్జీ లేదా ఎల్పీజీతో నడుస్తున్న సుమారు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు. 20 వేల ఆటోలకు ప్రొసీడింగ్‌లు.. అర్హులైన ఆటోడ్రైవర్లు దరఖాస్తు చేసుకొనేందుకు షోరూమ్‌లలోనే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను పరిశీలించి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రొసీడింగ్‌లు (అనుమతులను) ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఆటోరిక్షాలకు అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి కన్సల్టెంట్లు... ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ప్రొసీడింగ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు తెరలేపారు. షోరూమ్‌లలో ధరలను ఖరారు చేసినట్లుగా ఫైనాన్షియర్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆటోరిక్షా విక్రయాల్లో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. -
ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లి..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #SecunderabadA disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025 -
‘ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?’
హైదరాబాద్: బీసీల కళ్లలో మట్టికొట్టిన పార్టీ బీఆర్ఎస్ అని బీజేపీ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో బీసీ శాతం 23కు పడిపోయిందని, ఆ పార్టీకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 2) ఇండిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ఓబీసీ మహాధర్నాలో ఈటల మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అనేక అంశాలున్నాయి. స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. డిక్లరేషన్ల పేరిట అనేక హామీలిచ్చారు. రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయామనీ, మోస పోయామని ప్రజలు అనుకుంటున్నారు. రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారు. 20 నెలలు దాటిపోయింది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?, మోసం చేసిన కాంగ్రెస్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. పాత పద్ధతుల్లో ఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే సీఎం నీ భరతం పడతామని హెచ్చరికలు ఇస్తున్నాం..ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేసిన రేవంత్ రెడ్డి, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు చట్ట బద్దత ఉంటదా..?, రిజర్వేషన్లపై మొట్టమొదటి కమిషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు. చట్ట బద్దంగా 9th సెడ్యూల్ ల్లో చేర్చుకొని రిజర్వేషన్లను సాధించుకున్న తొలి రాష్ట్రం తమిళనాడు.డిల్లీకి వెళ్ళి రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు, బీజేపీపై నెపం వేసే కుట్రలు చేస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఆర్టికల్ 340, కమిషన్ ఎంక్వారి 1942 ప్రకారం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలి. బీసీలను మోసం చేసే కుట్రలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. రేవంత్‌కు ఆత్మశుద్ధి ఉంటే మంత్రి వర్గంలో బీసీలకు ఏం ఇచ్చారు..? ఏం శాఖలు ఇచ్చారో చెప్పాలి. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీ అధ్యక్షుడు కయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, భవిష్యత్‌లో కూడా చేస్తారనే నమ్మకం లేదు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి నీ భరతం పడతాం’ అని హెచ్చరించారు. -
సచివాలయ సందర్శకులకు క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: సచివాలయ సందర్శకులకు ఇకనుంచి ‘విజిటర్ ఈ–పాస్ మేనేజ్మెంట్ సిస్టం’ను అమల్లోకి తీసుకురానున్నారు. దీనికోసం క్యూఆర్ కోడ్ ఉన్న విజిటర్ పాస్‌ను రూపొందించారు. దీనిలో అర్జీదారు పూర్తి వివరాలు నమోదవుతాయి. అర్జీదారు వచ్చిన సమయం నుంచి.. వెళ్లే వరకు అన్ని వివరాలను నమోదు చేస్తారు. ఎంతమంది అర్జీదారులు సచివాలయానికి వస్తున్నారు?, వాళ్లు ఏయే మంత్రుల పేషీకి వెళ్తున్నారు?, ఏ నంబర్ గదికి వెళ్తున్నారు? తదితర వివరాలను తీసుకుంటారు. ఈ–పాస్‌లతో మంత్రులు, పేషీకి ఇచ్చిన అర్జీల్లో ఎంత మొత్తం పరిష్కారం అవుతున్నాయో కూడా చూస్తారని సమాచారం. మరోవైపు అర్జీదారు పాస్ తీసుకున్న చోటికే వెళ్లారా? లేక ఇతర అధికారుల దగ్గరకు వెళ్లారా? అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉంటుందని క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయనున్నారు. గతంలో డిప్యూటీ సీఎం చాంబర్ ముందు కొంతమంది ఆందోళన చేసిన నేపథ్యంలో.. ఈ విధానానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. -
కటకటాల్లోకి ‘కుబేరులు’!
సాక్షి, సిటీబ్యూరో: నాగార్జున, ధనుష్ ప్రధాన తారాగణంగా నటించిన కుబేర సినిమా విడుదల అయిన రోజే పైరసీ చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. సినిమా «థియేటర్లో ఈ చిత్రాన్ని రికార్డు చేసిన యువకుడితో పాటు సహకరించిన వారినీ అరెస్టు చేశారు. ఈ పైరసీ వెనుక అంతర్జాతీయ ముఠా పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబం«ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. జూన్ 20న కుబేర చిత్రం విడుదలైన కొన్ని గంటలకే దీని హెచ్డీ ప్రింట్ 1తమిళ్‌బ్లాస్టర్స్, 1తమిళ్ఎంవీ వెబ్సైట్లలోకి చేరింది. దీనిని తీవ్రంగా పరిగణించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) స్పందించింది. దీని అంతర్భాగమైన యాంటీ వీడియో పైరసీ సెల్ ఆయా వెబ్సైట్లలో ఉన్న సినిమాను అధ్యయనం చేసింది. గతంలో రీళ్ల ఆధారంగా సినిమాలు ప్రదర్శితం అయ్యేవి. అయితే ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్లో శాటిలైట్ లింకేజ్ ద్వారానే థియేటర్లలో స్క్రీన్ల పైకి వస్తున్నాయి. పైరసీని నిరోధించడానికి, దాని మూలాలను కనిపెట్టడానికి ఆయా సినిమాలకు ఓ వాటర్ మార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి థియేటర్లో, ప్రతి షోలో ప్రదర్శితమయ్యే సినిమాకు ఇది మారిపోతూ ఉంటుంది. సినిమా ప్రదర్శితం అయ్యేప్పుడు అకస్మాత్తుగా ఇది తెరపైకి వచ్చి వెళుతుంటుంది. దీన్ని సాధారణ ప్రేక్షకులు గుర్తించలేకపోయినా... ఎవరైనా ఆ సినిమాను రికార్డు చేస్తే ఇది కూడా రికార్డు అవుతుంది. పైరసీ వెబ్సైట్లలో ఉన్న సినిమాను అధ్యయనం చేసే యాంటీ వీడియో పైరసీ సెల్ ఆ వాటర్‌మార్క్ ద్వారా సదరు చిత్రాన్ని ఏ థియేటర్లో, ఏ షోలో రికార్డు చేశారో గుర్తిస్తుంది. కుబేర చిత్రాన్ని సినిమా విడుదలైన రోజే పీవీఆర్ సెంట్రల్ థియేటర్లోని స్క్రీన్–5లో రికార్డు చేసినట్లు తేలి్చంది. ఈ ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సబావత్ నరేష్ దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ రోజు ఆ థియేటర్, ఆ స్క్రీన్ వద్ద, హాలు లోపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సంగ్రహించి అధ్యయనం చేశారు. ఈ రికార్డింగ్స్‌ను జేబులో ఇమిడిపోయే హెచ్డీ కెమెరాలతో చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కుబేర చిత్రం రికార్డు అయిన తీరు ఆధారంగా ఏ సీటులో కూర్చుని రికార్డు చేశారనేది గుర్తించారు. ఆ ప్రాంతంలో సీట్లకు టిక్కెట్ బుక్ చేసుకున్న వారి వివరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఇతడికి సహకరించిన వ్యక్తినీ కటకటాల్లోకి పంపారు. వీరికి అంతర్జాతీయ లింకులు ఉన్నట్లు గుర్తించారు. విదేశాల్లో ఉన్న ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఈ సినిమా వీడియోను పంపగా... ప్రతిఫలంగా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు పొందినట్లు ఆధారాలు సేకరించారు. ఈ క్రిప్టో కరెన్సీని నిందితులు జెబ్ పే, కాయిన్ డీసీఎక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్స్ఛేంజ్ చేసుకున్నట్లు గుర్తించారు. కొన్ని పేమెంట్ గేట్వేస్లో గేమింగ్‌లకు సంబంధించిన లింకులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు విశ్వప్రసాద్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మంత్రి కారే అడ్డుగా ఉందంటావా ?
హైదరాబాద్: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్ సెన్స్ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్ మనోహర్‌తో పాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్ భవన్ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ సాయి ప్రకాశ్ డ్రైవర్‌కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్ చెప్పడంతో ట్రాఫిక్ సీఐకి డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు. కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్ డీసీపీ గోవర్ధన్‌ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ రామ్ మనోహర్‌ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తా, సస్పెండ్ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్‌సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్‌సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
గొర్రెల స్కామ్ రూ.1,000 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే గోల్మాల్ జరిగినట్టు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 200లకు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు కలిసి సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్టు ఈడీ వెల్లడించింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్, కొందరు వినియోగదా రులు, మరో మధ్యవర్తి ఇంట్లో ఈ సోదాలు చేసినట్టు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా 200 డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్ బుక్స్, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను స్వాధీనంచేసు కున్నట్టు తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు జరి గిన లావాదేవీల లింకులను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీ పథ కంలో కొల్లగొట్టిన కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకు బెట్టింగ్ యాప్స్‌ను ఉప యోగించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. రూ.2.1 కోట్లతో మొదలై.. రూ.వందల కోట్లకుగొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం (షీప్ రియరింగ్ డెవలప్మెంట్ స్కీం–ఎస్ఆర్డీఎస్) కేసు ఆది నుంచి కీలక మలుపులు తిరుగుతోంది. తమ వద్ద కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.1 కోట్ల డబ్బు తమకు ఇవ్వకుండా పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అక్రమంగా ఇతర అకౌంట్లకు మళ్లించారని కొందరు గొర్రెల విక్రేతలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. ఈ రెండు కేసుల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కల్యాణ్‌కుమార్ సహా ఫిష్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రాంచందర్‌నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, బ్రోకర్లు సహా మొత్తం17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్–2002) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో తొలుత రూ.2.1 కోట్ల మేర అవినీతి బహిర్గతమైంది. ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికతో రూ.253.93 కోట్లకు ఈ కుంభకోణం చేరింది. తాజాగా ఈడీ అధికారుల సోదాల్లో లభించిన ఆధారాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కలిపి మొత్తం రూ.వెయ్యికోట్లకుపైనే అవినీతి జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ చేయకుండానే..నిధులు పంచుకుతిన్నారు గొర్రెల పంపిణీ పథకంలో ‘నీకిది నాకది’(కిక్‌బ్యాక్) తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగ్లు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలను గుర్తించింది. గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారుల్లో చాలామంది ఈ పథకం ప్రారంభానికి ముందు గొర్రెల వ్యాపారంలో లేరని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఎటువంటి కొనుగోలు, అమ్మకాలు జరగలేదని గుర్తించారు. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు, నకిలీ వాహనాలు, లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధులను నకిలీ సరఫరాదారుల ఖాతాల్లోకి మళ్లించారని తేల్చారు. నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు, గొర్రెలను మళ్లీమళ్లీ చూపించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టి భారీ అక్రమాలకు తెర తీసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా వాహనాల బిల్లు, చెల్లింపుల రికార్డులు, ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజా సోదాల్లో కీలక ఆధారాలు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని జి.కల్యాణ్‌కుమార్ ఇంటితోపాటు రాంచందర్‌నాయక్, రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, లోలోనా ది లైవ్ కాంట్రాక్ట్ సంస్థ యజమానులు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇళ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన కల్యాణ్‌కుమార్ ఇంట్లో పలు కీలక ఆధారాలు ఈడీ అధికారులు గుర్తించారు. డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో కల్యాణ్కుమార్తోపాటు మరో ఇద్దరిని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. వారిని వేర్వేరుగా విచారించారు. కల్యాణ్‌కుమార్ అరెస్టుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. బెట్టింగ్‌యాప్ వ్యవహారంతో కొత్త మలుపు ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు..గొర్రెల పంపిణీ పేరిట లబ్ధిదారులకు చేరకుండానే నిధుల మళ్లింపునకు పరిమితమైన ఈ కుంభకోణంలో ఈడీ తాజా తనిఖీలతో బెట్టింగ్‌యాప్‌ల లింక్ బయటపడింది. గొర్రెల కొనుగోలు కుంభకోణం నిధుల మళ్లింపునకు వాడిన డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు ఓ ఆన్లైన్ బెట్టింగ్‌యాప్‌తో లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలు డబ్బును విదేశాలకు చేర్చేందుకు లేదంటే దారి మళ్లించేందుకు ఈ బెట్టింగ్ యాప్స్‌ను వాడుకున్నారా? అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కాళేశ్వరం నివేదికపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవినీతిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ సమర్పించిన నివేదికపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతిని కమిటీలో సభ్యులుగా నియమించింది. నివేదికను అధ్యయనం చేసి.. దాని సారాంశం (జిస్ట్) సిద్ధం చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నెల 4వ తేదీన ఈ నివేదికపై చర్చించడానికి సింగిల్ పాయింట్ ఎజెండాతో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆ సమావేశంలో నివేదికపై విస్తృతంగా చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఎం చేతికి నివేదికజూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను శుక్రవారం సీల్డ్ కవర్లలో అందజేశారు. నివేదికను అందుకున్న వెంటనే దానిపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. 4న జరిగే మంత్రివర్గ సమావేశంలోపు నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ అందించనుంది. కేబినెట్లో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నివేదిక అందించే సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సీఎం కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. ప్రణాళిక లోపమేనా?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయిన విషయం విదితమే. ఈ నిర్మాణ లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బరాజ్‌లకు సంబంధించి ప్రణాళిక, నమూనాలు, నాణ్యత, నిర్వహణ ప్రధాన లోపాలు కాగా, స్థల ఎంపిక కూడా ఇందుకు కారణమన్న అభిప్రాయాన్ని కమిషన్ తన నివేదికలో వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. ఈ బరాజ్‌ల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సహా దాదాపు 150 మందిని విచారించిన తరువాత ఈ నివేదికను నివేదిక రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతకలు చోటు చేసుకున్నట్లు కమిషన్ నివేదికలో వెల్లడించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై కమిషన్ స్పష్టతనిచ్చిందని అంటున్నారు. -
ఈ నెలలో వర్షాలు సాధారణమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలలో తీవ్ర లోటువర్షపాతం నమోదు కాగా... జూలైలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వర్షపాతం గణాంకాలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర సగటు గణాంకాలు లోటు దిశగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, 94 శాతం నుంచి 106 శాతం మధ్యలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతేనే రైతాంగానికి లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ చెబుతుండగా.. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలు... రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి పూట తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం... రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా ద్వితీయార్ధం ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా... ప్రస్తుతం అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, రాత్రిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సూచించింది. నైరుతి సీజన్లో ఆగస్టు 1 వరకు 36.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 34.24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
బాబును దత్తత మాత్రమే ఇచ్చాను.. సరోగసీ అని చెప్పలేదు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సృష్టి ఆస్పత్రి కేసు వ్యవహారంలో కీలకమైన ఏ1 ముద్దాయి డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. పిల్లలు లేరని తన దగ్గరకు వచి్చన మహిళకు తాను కేవలం బాబును దత్తత ఇప్పించానని పోలీసులకు ఇచి్చన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. అది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆమె నోరు విప్పకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు పోలీసులు విచారించేందుకు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ, ఏసీపీతో పాటు గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు వివిధ అంశాల గురించి ఆమెను గుచి్చగుచ్చి ప్రశ్నించినా ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తను ఎలాంటి తప్పూ చేయలేదని, తనకు బిడ్డ కావాలని, తన భర్త విదేశాల్లో ఉంటారని ఓ మహిళ తన దగ్గరకు రాగా దత్తత ఇప్పించానని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అంతకుమించి ఆమె నుంచి ఎటువంటి వివరాలూ పోలీసులు రాబట్టలేకపోయారు. ఆస్పత్రినుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించినా డాక్టర్ నమ్రత తనకు గుర్తు లేదని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా మాత్రమే జరగడంతో చాలా కేసులు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇంకా నాలుగు రోజులపాటు పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. పోలీసు కస్టడీకి మరో ఇద్దరు నిందితులు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. శుక్రవారం వైజాగ్‌కు చెందిన ఏ3–కల్పన, అమీర్‌పేట్‌కు చెందిన ఏ6 సంతోషిలను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శనివారం వారిని పోలీసులు విచారించనున్నారు. బాబును అసలైన తల్లిదండ్రుల నుంచి తీసుకుని వచ్చి రాజస్తాన్‌కు చెందిన దంపతులకు అందించడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. -
కష్టం మీది... అధికారం మాది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడా నికి కమ్యూనిస్టు ఉద్యమాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2004, 2023లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్టులు సహకారం అందించారని తెలిపారు. ఈ అధికారం ఇలాగే కొనసాగడానికి, మరోసారి తాము అధికారంలోకి రావడానికి కూడా కమ్యూనిస్టులు సహ కరించాలని కోరారు. కమ్యూనిస్టులు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడంకంటే, అధికారంలో ఉన్నోడిని దించేయటంలో ముందుంటారని చురకలంటించారు. భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్– కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ‘కృషి మీది.. అధికారం మాది.. సహకారం కొన సాగాలి’అని కమ్యూనిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో పత్రికల పాత్ర, జర్నలిస్టులుగా కొందరు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల్లాగే జర్నలిస్టుల విశ్వసనీయత తగ్గుతోందిప్రస్తుతం సమాజంలో మీడియా సంస్థలు విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది. అక్షరాలు రానివారు కూడా జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారు. ఒకప్పుడు జర్నలిస్టు అంటే నిబద్ధత ఉండేది. ఇప్పుడు ఆవారాగాళ్లు, తిట్లు వచ్చేవాళ్లు జర్నలిస్టు అనే ముసుగు తొడుక్కొని వస్తున్నారు. ప్రెస్మీట్లలో మూడు గంటల ముందే వచ్చి ముందు కూర్చుంటారు. ఇంకా నమస్కారం పెట్టడం లేదేంటని గుడ్లురుమి చూస్తారు. అలాంటి వాళ్లను కిందకు దిగి కొట్టాలనిపిస్తుంది. జర్నలిజంలో ఇవాళ వింత పోకడలు వచ్చాయి. వాటికి రాజకీయ పార్టీలు తోడయ్యాయి. రాజకీయ నాయకుల తరహాలోనే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంది. నిజమైన జర్నలిస్టులను, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని వేరు చేయాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.కమ్యూనిస్టులు ఉప్పులాంటివారు‘కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు.. ఉప్పు లేని వంట రుచి ఉండదుం. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కని పించినప్పుడే ఆ సమస్యల పరిష్కారం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అబద్ధాల ప్రాతిపదికన జరిగే నిర్మాణం కూలిపోతుందని నమ్మే వ్యక్తిని నేను. నిజం చెప్పకపోయినా, అబద్ధం మాత్రం చెప్పను.కమ్యూనిస్టులను నమ్మించి మోసం చేశారు ఇప్పటి వరకు. నాకు కమ్యూనిస్టుల పట్ల అపార గౌరవం ఉంది. ఎంపీగా గెలిచినప్పుడు పార్టీ కార్యాలయాన్ని మల్లు స్వరాజ్యంను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రారంభించాను. ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణ పత్రికకు ఇతర ప్రధాన పత్రికలతో సమానంగా ప్రాధాన్యతనిస్తాం. నవ తెలంగాణలో ప్రజా సమస్యలపై వచ్చే వార్తల పరిష్కారానికి కృషి చేస్తాం’అని సీఎం తెలిపారు. కమ్యూనిస్టుల ఆశయాలను కాంగ్రెస్ సాకారం చేస్తోంది: మంత్రి పొంగులేటికమ్యూనిస్టులు పేదల పక్షాన నిలిచి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తుంటారని, నిత్యం పేదలకు అండగా ఉంటారని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలలో నిజాయితీని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించేందుకు పని చేస్తోందని తెలిపారు. తాము పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని చెప్పారు. గులాబీ రంగు వేసుకున్న కొన్ని పత్రికలు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై అసంబద్ధంగా వార్తలను ప్రచురించినా సానుకూల దృక్పథంతోనే ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. అమెరికాకు భయపడి ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడడానికి భయపడుతున్న మోదీని వెనుకేసు కొచ్చే స్థితిలో దేశంలోని మీడియా ఉందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్. ప్రియాంక, పార్టీ నేతలు బి.వి. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ మౌనం వల్లే లోకేశ్ బరితెగింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉందనే ధైర్యంతో బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బరితెగించి మాట్లాడుతు న్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. హరీశ్‌రావు శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందునే ఏపీ సీఎం చంద్రబాబు ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ ప్రకటనపై సీఎం రేవంత్, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే చర్చకు వెళ్లబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటిస్తే, సీఎం రేవంత్ మాత్రం భేటీకి హాజరై కమిటీ ఏర్పాటుకు అంగీకరించార ని మండిపడ్డారు.బనకచర్లపై చంద్రబాబు అనుస రిస్తున్న బుల్డోజ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ మౌనమే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనా లను పక్కన పెట్టి చంద్రబాబు, బీజేపీ మెప్పుకోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తు న్నారని ధ్వజమెత్తారు. అధికారం, మందబలాన్ని చూసుకుని బనకచర్లపై లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.నీళ్లు తీసుకుపోతే ఊరుకుంటామా?గోదావరిలో మిగులు జలాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనకచర్లపై ఏపీ పంపిన డీపీఆర్‌ను ఎందుకు వెనక్కి తిప్పి పంపాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెప్తున్న నారా లోకేశ్.. ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తన తండ్రి చంద్ర బాబు కేంద్రానికి రాసిన 7 లేఖల గురించి తెలుసుకో వాలని హితవు పలికారు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడి గడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి తరలించుకు పోయే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. బనకచర్లను ఏపీ కట్టి తీరితే, తాము అడ్డుకుని తీరుతా మని స్పష్టంచేశారు. ‘గోదావరి నదిలో మా వాటాను అడిగితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నా మని లోకేశ్ అంటున్నారు. గతంలో బాబ్లీ, ఆల్మట్టిపై చంద్ర బాబు చేసిన పోరాటాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టేందుకేనా? సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులను కాపాడుతుంది. అనుమతు లు తెచ్చుకునే పద్ధ తి మీకు తెలిస్తే, ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. బనక చర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకు పోయే కుట్రను చంద్రబాబు బయట పెట్టారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం వెనుక ఈ కుట్ర దాగి ఉంది. లోక్‌సభలో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా బనకచర్లపై వాయిదా తీర్మాణం ఇచ్చి రాష్ట్ర హక్కు లను కాపాడటం లేదు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
సొంతవారు వెయిటింగ్.. బయటివారికి పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో జూన్‌లో భారీ సంఖ్యలో జరిగిన మున్సిపల్ కమిషనర్ల బదిలీలు కొత్త సమస్యను తెరమీదకు తెచ్చాయి. సాధారణ బదిలీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ బదిలీలు, పదోన్నతుల ద్వారా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీల్లో మున్సిపల్ శాఖకు చెందిన కమిషనర్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ‘ఆన్ డ్యూటీ’పై వచ్చిన వారికి కూడా పోస్టింగులు దక్కాయి. మరోవైపు మున్సిపల్ శాఖకు చెందిన 32 మంది కమిషనర్లకు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా ‘వెయిటింగ్’జాబితాలో పెట్టారు. కొన్ని మున్సిపాలిటీల్లో మేనేజర్లుగా ఉన్న వారికే మున్సిపల్ కమిషనర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పదోన్నతులు, ఆన్‌డ్యూటీపై వచ్చిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత దక్కడంతో సొంత శాఖకు చెందిన కమిషనర్లు పోస్టింగు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వెయిటింగ్లో ఉన్న 32 మంది కమిషనర్లలో 25 మంది స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ వన్ కమిషనర్ హోదాలో ఉన్న వారే కావడం గమనార్హం. వీరిలో కొందరికి ‘100 రోజుల ప్రణాళిక’ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించినా నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమకు భవిష్యత్తులో పోస్టింగు వచ్చినా వెయిటింగ్ పీరియడ్‌కు సంబంధించిన వేతనాలు తిరిగి పొందడంలో ఆర్థిక శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెయిటింగ్ జాబితాలో ఉన్న ఇద్దరు స్పెషల్ గ్రేడ్ కమిషనర్లు పదవీ విరమణ గడువుకు చేరువలో ఉన్నారు. పోస్టింగ్ లేకుండా రిటైర్ అయితే తమకు దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకుండా పోతాయనే ఆందోళనలో వారు ఉన్నారు. బయటి నుంచి వచ్చినవారిదే హవారాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్ 1, 2, 3తో పాటు స్పెష ల్ గ్రేడ్, సెలక్షన్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు. వీరి లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ద్వారా నేరుగా ఎంపికైన వారితోపాటు కొందరు మేనేజర్ల స్థాయి నుంచి, మరికొందరు సెక్రటేరియట్ సర్వీసుల నుంచి పదోన్నతులపై కమిషనర్లుగా వచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖ లకు చెందిన వారు కూడా ‘ఆన్‌డ్యూటీ’పేరిట తమ పర పతి ఉపయోగించి మున్సిపల్ కమిషనర్లుగా పోస్టింగులు దక్కించుకున్నారు. అయితే, పదోన్నతులు, ఆన్ డ్యూటీలు ఇవ్వడంలో మున్సిపల్ కమిషనర్ల ఖాళీలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సొంత శాఖకు చెందిన వారిని వెయిటింగ్ జాబితాలో చేర్చి, బయటి నుంచి వచ్చినవారికి పోస్టింగులు ఇచ్చారు. పోస్టింగుల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఒత్తిళ్లతో పాటు ఇతర అంశాలు కూడా కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహాలో పోస్టింగులు పొందిన వారు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కీలక మున్సి పాలిటీల్లో తిష్ట వేశారనే విమర్శలు ఉన్నాయి. పదోన్నతులు, ఆన్‌డ్యూటీ ద్వారా కమిషనర్లుగా పోస్టింగులు పొందిన వారికి పురపాలన, పట్టణాభివృద్ధిపై అనుభవం లేకపోవడం కూడా క్షేత్ర స్థాయిలో పలు సమస్యలకు దారితీస్తోంది. గత నెలలో జరిగిన బదిలీల్లో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు వెయిటింగ్ జాబితాలో ఉన్న కమిషనర్లకు పోస్టింగులు ఇచ్చే ప్రతిపాదనలు ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. -
‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్‌రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు. ‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025 -
పేరుకుపోతున్న ఘన, బయో, నిర్మాణ, ఈ–వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్‌తోపాటు ఘన, బయో, నిర్మాణ, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగవుతున్నాయి. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. మానవాళితోపాటు సకల జీవరాశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఏటేటా పరిశ్రమల నుంచి వ్యర్థాల విడుదల గణనీయంగా ఉందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, శుద్ధి చేయాల్సిన పీసీబీకి ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం గమనార్హం. 2014–15 సంవత్సరం నుంచి ప్రభుత్వం పీసీబీకి నిధులు, గ్రాంట్లను కేటాయించడం లేదు. కేవలం ఆపరేషన్, రెన్యూవల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి.పరిశ్రమల నుంచి కలుషిత జలాలు.. రాష్ట్రంలో పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్ కేటగిరీ అత్యంత హానికారక పరిశ్రమల కిందికి వస్తుంది. రాష్ట్రంలో 3,838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4,330 ఆరెంజ్, 1,332 గ్రీన్, 2,692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 2,193 పరిశ్రమలు రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయి. ఈ వ్యర్థాలు నీరు చెరువులు, కాలువలు, పంట పొలాలు, భూగర్భంలోకి ఇంకుతున్నాయి. 3,024 పరిశ్రమలు ఏటా 3.17 లక్షల టన్నుల ప్రమాదక వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో 94,131 టన్నులు పునర్వినియోగించదగిన వ్యర్థాలు కాగా.. 2,085 టన్నులు దహనం చేయగల వ్యర్థాలు, 1,10,930 టన్నులు కో–ప్రాసెసింగ్, 1,09,943 టన్నులు భూమిలో నింపే వ్యర్థాలు.ఘన వ్యర్థాలూ ఘనమే.. రోజుకు 11,522 టన్నుల ఘన వ్యర్థాలు (Solid Waste) విడుదలవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 7,206 టన్నులు కాగా.. 4,316 టన్నులు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి శుద్ధి చేయని బయో మెడికల్ వ్యర్థాలు విడుదల కావడం లేదు. ఇతర వ్యర్థాల మిశ్రమంతో బయో వేస్ట్ విడుదల అవుతున్నాయి. 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి రోజుకు 26,316 కిలోల బయో మెడికల్ వేస్ట్ విడుదల అవుతోంది. ఇందులో 17,184 కిలోలు దహించలేని బయో మెడికల్ వేస్ట్ కాగా.. 9,132 కిలోలు ఆటో క్లేవ్ వ్యర్థాలు.ఈ–వేస్ట్.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యర్థాలు కూడా గణనీయంగా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 74,339 టన్నుల ఈ–వేస్ట్ విడుదలవుతోంది. 31 ఈ–వేస్ట్ (e- waste) కేంద్రాల్లో ఏటా 1,83,668 టన్నుల ఈ–వేస్ట్ శుద్ధి అవుతోంది. రాష్ట్రంలో రోజుకు 2,255 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,763 టన్నులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో 492 టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.చదవండి: డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు జీడిమెట్ల, ఫతుల్‌గూడ, శామీర్‌పేట, శంషాబాద్‌లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఏటా వీటి సామర్థ్యం 2 వేల టన్నులు. రాష్ట్రంలో 251 ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు నమోదయ్యాయి. వీటి నుంచి రోజుకు 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల అవుతుండగా.. 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతోంది. -
Sheep Scam: గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం.200లకుపైగా బ్యాంక్ పాస్‌బుక్‌లు సీజ్ చేశాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని తెలిపింది. -
కళా బోనం!
బోనాల నృత్య రూపకం ఆహూతులను ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టింది. గురువారం రవీంద్ర భారతిలో శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురికి బోనాల పురస్కారాలను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ట్రస్ట్ చైర్మన్ కె.ప్రవీణ్‌కుమార్, అధ్యక్షుడు అరవింద్‌కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రీ -
చిరుత చిక్కింది
మణికొండ: కొద్దిరోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు మంచిరేవుల ట్రెక్‌పార్కులోనే బోనులో చిక్కింది. జూలై 7వ తేదీన మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్ వనమూళిక వనం నుంచి మొదలైన దాని ప్రస్థానం పోలీస్ గ్రేహౌండ్స్, ట్రెక్ పార్కు, రాందేవ్‌గూడ మిలిటరీ ఏరియా, తిరిగి ట్రెక్ పార్కుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక ఆకలితో మేకను తినేందుకు బోనులోకి దూరి బందీ అయ్యింది. ప్రతి రోజూ మాదిరిగానే ఉదయం సిబ్బంది బోనులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒకదాంట్లో చిరుత గాండ్రింపులు విని భయాందోళన చెందారు. అంతలోనే తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి బోను చుట్టూరా పరదాలను కట్టి నగరంలోని జూపార్కుకు తరలించారు. అక్కడ దాని గాయాలకు చికిత్సతో పాటు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, చిలుకూరు రేంజ్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. చిరుత మూతికి గాయం... బోనులో చిక్కుకున్న చిరుత అందులోనుంచి బయటికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దాని మూతి బోను ఇనుప చువ్వలకు తాకడంతో గాయమైంది. బోనులో చిక్కుకున్న భయంలో అది అందులో ఏర్పాటు చేసిన మేకను సైతం తినకుండా ఉండిపోయింది. చిరుత వయసు సుమారు 5 ఏళ్లు ఉంటాయని, యుక్త వయసులో ఉండటంతో పెద్దగా గాండ్రించటం, బెదిరించటం చేసిందని అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందనే విషయాన్ని తెలుసుకున్న మంచిరేవుల, గంధంగూడ, బైరాగిగూడ, నార్సింగి, కోకాపేట, రాందేవ్‌గూడ, ఇబ్రహీంబాగ్ తదితర గ్రామాల ప్రజలు దాన్ని చూసేందుకు ట్రెక్ పార్కు వద్దకు వచ్చారు. శుక్రవారం నుంచి యథావిధిగా ట్రెక్ పార్కును తెరుస్తామని, వాకింగ్ చేసేవారు రావచ్చని అధికారులు తెలిపారు. ట్రెక్ పార్కులోనే బోనులోకి వచ్చి.. ఉదయం గమనించిన సిబ్బంది తొలుత జూపార్క్‌కు తరలింపు అక్కడి నుంచి నల్లమల అడవుల్లోకి.. నేటి నుంచి తెరుచుకోనున్న ట్రెక్ పార్కు -
28 మంది పోలీసు అధికారుల ఉద్యోగ విరమణ
బంజారాహిల్స్: హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో గురువారం 28 మంది పోలీసు అధికారులు పదవీ విరమణ చేశారు. వీరిలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, నలుగురు ఎస్ఐలు, 21 మంది ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) పరిమళ హానా నూతన్ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, శేష జీవితం కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
జనహితయాత్రకు ఘన స్వాగతం
చేవెళ్ల/మొయినాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నుంచి ప్రారంభించే జనహిత పాదయాత్రకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పార్టీ శ్రేణులు మొయినాబాద్‌లో ఘన స్వాగతం పలికాయి. హిమాయత్‌నగర్ చౌరస్తాకు చేరుకోగానే పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అక్కడే ఉన్న అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాలకు మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్, శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మధుసూదన్‌రెడ్డి, దర్శన్, శ్రీకాంత్ పాల్గొన్నారు. చిలుకూరులో పూజలు చిలుకూరు బాలాజీ దేవాలయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు హన్మంతరావు, రాజయ్య తదితరులతో కలిసి ఆమె ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించు కున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్గపోరు మరోసారి బట్టబయలు పార్టీలో వర్గపోరు కొనసాగుతుందని మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీంభరత్ మద్య సయోధ్య లేకపోవటంతో ఇరు వర్గీయులు వేర్వేరుగా స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. -
భార్య స్కెచ్ వేసింది.. భర్త అమలు చేశాడు..
బంజారాహిల్స్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్‌యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఉదయం 6 గంటల సమయంలో సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు. అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది. పథకం ప్రకారమే.. కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్‌కుమార్‌యాదవ్ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగల దుకాణం ఉద్యోగి కిడ్నాప్ కేసులో యువతితో సహా నలుగురు అరెస్టు.. -
ఫార్మాసిటీలో మరోసారి సర్వే
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు నెలల క్రితం ఫార్మాసిటీ బౌండరీని సర్వే చేసి, ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. తాజాగా గురువారం బౌండరీ లోపల హద్దులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో సర్వే నంబర్ల వారీగా గుర్తించే పనులను మొదలుపెట్టారు. గ్రామంలోని పలు అసైన్డ్, పట్టా భూముల సర్వేనంబర్ల వారీగా ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు పరిహారం అందజేశామనే వివరాలతో కూడిన రికార్డుల ప్రకారం హద్దులు గుర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ భూముల వద్దకు రావద్దని అడ్డుకున్నారు. అభ్యంతరం చెప్పడం సరికాదు నిర్వాసితులకు పరిహారంతో పాటు తాజాగా మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ వెంచర్లో లాటరీ తీసి ప్లాట్ల కబ్జాలు ఇచ్చామని ఆర్డీఓ అనంత్‌రెడ్డి తెలిపారు. అయినా రైతులు అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. పరిహారం అందజేసిన, రికార్డులు మారిన భూములన్నీ ప్రభుత్వాని వేనని, ఆ భూముల్లోకి ఎవరూ రావొద్దని సూచించారు. కోర్టు కేసులున్న భూముల్లోకి వెళ్లమని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే చేస్తున్న భూముల వద్దకు రైతులెవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సర్వేనంబర్ల వారీగా భూమి గుర్తింపు అడ్డుకున్న నక్కర్తమేడిపల్లి రైతులు ఉద్రిక్త వాతావరణం భారీ పోలీసు బందోబస్తు బందోబస్తు మధ్య ఫార్మా ఫెన్సింగ్ కందుకూరు: ఫార్మాసిటీ కోసం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 123కు సంబంధించి గురువారం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్ పనులు చేపట్టారు. దీంతో సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న దెబ్బడగూడ రెవెన్యూ సర్వే నంబర్ 31లోని గిరిజన రైతులు పనులను అడ్డుకున్నారు. తమ భూమిలోకి జరిపి ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ నిలదీశారు. సర్వే చేసిన తర్వాతే ఫెన్సింగ్ వేసుకోవాలని పట్టుబట్టారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సీతారాం రైతులతో మాట్లాడారు. పది రోజుల్లో దెబ్బడగూడ సర్వే నంబర్ 31ని సర్వే చేయిస్తామని, అప్పటి వరకు ఫెన్సింగ్ పనులు ఆపొద్దని అన్నారు. భూమి మీకు వస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
55,378 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు ● హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగాసాక్షి,సిటీ బ్యూరో: ఎట్టకేలకు హైదరాబాద్‌లో కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. వరసగా మూడు రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారుల కుటుంబాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించి లబ్ధి కుటుంబాలకు అందజేయనున్నారు. తొలి విడతగా రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మూడు రోజుల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. రెండో విడతలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కొత్తగా 55,378 రేషన్‌కార్డులు హైదరాబాద్ జిల్లాలో సుమారు 55,378 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మొత్తం మీద సుమారు 2,26, 272 కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా ద్వారా పౌరసరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 89,919 దరఖాస్తులపైన మాత్రమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తికాగా, మిగిలిన 1,36,353 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 3,910 కుటుంబాలను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన అర్హత సాధించిన దరఖాస్తుల్లో 55,378 కుటుంబాలకు కార్డులు మంజూరు కాగా, ప్రస్తుం ఎసీఎస్‌ఓ లాగిన్‌లో 6,090, డీసీఎస్ఓ లాగిన్‌లో 24,541 దరఖాస్తులు ఆమోదానికి పెండింగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా గత ఆరు నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికి క్షేత్ర స్థాయి విచారణ మాత్రం నత్తలకే నడక నేర్పిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగడంతో కార్డుల వెరిఫికేషన్ వేగవంతమైనట్లు సమాచారం. నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షెడ్యూల్ ఇలా... తేది నియోజకవర్గం సమయం వేదిక ఆగస్టు 1 ఖైరతాబాద్ ఉదయం 10 గంటలు బంజారా భవన్ ,, కంటోన్మెంట్ మధ్యాహ్నం 12 గంటలు లే ప్యాలెస్ ,,, జూబ్లీహిల్స్ మధ్యాహ్నం 3 గంటలు రహమత్ నగర్ ఆగస్టు 2 అంబర్‌పేట ఉదయం 10గంటలు అంబర్‌పేట ,, ముషీరాబాద్ మధ్యాహ్నం 12 గంటలు ముషీరాబాద్ ,, సికింద్రాబాద్ 3.00 గంటలు సికింద్రాబాద్ ఆగస్టు 3 చార్మినార్ ఉదయం 10 గంటలు చార్మినార్ ,, కార్వాన్ మధ్యాహ్నం 12 గంటలు కార్వాన్ ,, చాంద్రాయణ గుట్ట మధ్యాహ్నం 3 గంటలు చాంద్రాయణ గుట్ట హైదరాబాద్ కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇలా నియోజక వర్గం మంజూరైన కార్డులు మలక్‌పేట 3,926 యాకుత్‌పురా 3,174 చార్మినార్ 4,738 చాంద్రాయణగుట్ట 6,461 బహద్దూర్‌పురా 5,287 గోషామహల్ 3,028 కార్వాన్ 5994 అంబర్‌పేట 3,358 ఖైరతాబాద్ 1,953 జూబ్లీహిల్స్ 5,284 నాంపల్లి 5,157 ముషీరాబాద్ 2,672 సనత్‌నగర్ 1,393 కంటోన్మెంట్ 1,150 సికింద్రాబాద్ 1,803 -
పన్నెండేళ్లకు పచ్చజెండా!
సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్– సికింద్రాబాద్‌లను కలిపే బేగంపేట్ రోడ్– రాణిగంజ్ క్రాస్‌రోడ్స్ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్పీ రోడ్ –నెక్లెస్ రోడ్‌ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్ఓబీ (ఫ్లై ఓవర్) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సమన్వయం, సహకారం లోపంతో.. ● ఇక్కడి ఆర్ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్, సెక్రటేరియట్ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్– ట్యాంక్‌బండ్– ప్యారడైజ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది. ● ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తయితే అటు ఎస్పీ రోడ్, ఇటు ఎంజీ రోడ్‌లోనూ ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా క్యారేజ్‌వేలతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు. ఫ్లైఓవర్ ఫ్లాష్‌బ్యాక్ ఇలా.. 2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వలేదు. హెచ్ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్ మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. బేగంపేట్‌లో తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు త్వరలో పాటిగడ్డ– నెక్లెస్ రోడ్డు ఆర్ఓబీ పనులు పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు -
శ్రద్ధతో శుద్ధి!
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ఓఆర్ఆర్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ, క్లినింగ్ కోసం జలమండలి డయల్–ఎ–సెప్టిక్ ట్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల క్లీనింగ్, డంపింగ్ కోసం సుమారు 50 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. నివాస, వాణిజ్య సముదాయాల్లోని సెప్టిక్ ట్యాంకులను క్లీనింగ్ చేసి వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉత్పన్నమయ్యే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను.. చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోస్తే ఇటు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపేది. దీనిని నివారించడానికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుభ్రపరిచే వాహనాలను అందుబాటులో తీసుకొని వచ్చింది. జీహెచ్ఎంసీ అవతల, ఓఆర్ఆర్ లోపలి 7 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలతో పాటు 18 గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంక్ మానవ వ్యర్థాలను శుద్ధి చేయనుంది. సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమర్చి పనితీరు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. వ్యర్థాల క్లీనింగ్‌పై శిక్షణ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల క్లీనింగ్ నిర్వహణపై వాహనాల ఆపరేటర్లకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శాసీ్త్రయ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. సెప్టిక్ ట్యాంక్‌ను క్లీనింగ్ చేసి వ్యర్థాలను ప్రతిపాదిత ఎస్టీపీలు, ఎఫ్ఎస్టీపీల్లో ఎస్టీపీల్లో డంపింగ్ చేసి, శుద్ధి చేసేలా జలమండలి చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం కోసం 155313/14420కు కాల్ చేయవచ్చు. శుద్ధి కేంద్రాలు ఇలా.. జలమండలి పరిధిలో అంబర్పేట్, నల్లచెరువు, నానక్ రామ్‌గూడ, ఖాజాగూడ ఎస్టీపీల వద్ద 40 కేఎల్డీ సామర్థ్యం గల కో–ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించింది. ఇప్పటి వరకు 84 మిలియన్ లీటర్ల సెఫ్టేజ్ కో– ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేశారు. డయల్– ఎ– సెప్టిక్ ట్యాంక్ తాజాగా ఓఆర్ఆర్ పరిధిలో సైతం.. అందుబాటులో 50 వాహనాలు టోల్‌ఫ్రీ నంబర్– 155313/14420 -
పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గచ్చిబౌలి: వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఉదయం వర్షాకాలం పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆయన మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కాలనీలలో పరిశుభ్రతా చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించాలన్నారు. అనంతరం పటాన్ చెరువును సందర్శించారు. క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య పనులను వేగంగా చేపట్టాలన్నారు. -
అమెరికన్ కాన్సులేట్‌లో వెయిటింగ్ ఏరియా ప్రారంభం
రాయదుర్గం: నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని అమెరికా కాన్సుల్ జనరల్ హైదరాబాద్ క్యాంపస్‌లో వెయిటింగ్ ఏరియాను గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ వెయిటింగ్ ఏరియాను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్మించింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అమెరికాతో భాగస్వామ్యం, కొత్త ఆవిష్కరణలు, పురోగతి ప్రజల సంక్షేమానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తూ రెండు ప్రాంతాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. జెన్నీఫర్ లార్సన్ మాట్లాడుతూ ఈ వెయిటింగ్ ఏరియా నిర్మాణంతో అమెరికా వీసాలను సమర్థవంతంగా పరీక్షించడానికి, ప్రాసెస్ చేయడానికి యూఎస్ ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. వేలాదిమంది వీసా దరఖాస్తుదారులకు, ప్రతిరోజు కాన్సులేట్‌ను సందర్శించే కుటుంబాలకు సౌకర్యం, సౌలభ్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, టీజీఐఐసీ సంస్థ ఉన్నతాధికారులు, అమెరికన్ కాన్సులేట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గోల్కొండ రోప్‌వేపై సాంకేతిక అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో గోల్కొండ టూంబ్స్ నుంచి కోట వరకు ప్రతిపాదించిన రోప్‌వేపై గురువారం హెచ్ఎండీఏలో ప్రీబిడ్డింగ్ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. సుమారు 1.5 కి.మీ మార్గంలో నిర్మించనున్న రోప్‌వే కోసం ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తిగల కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే గురువారం ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎఫ్పీ బిడ్డింగ్ కోసం కోసం దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడ్డింగ్ గడువును పెంచాలని పలువురు ప్రతినిధులు హెచ్ఎండీఏ అధికారులను కోరారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుపై మరింత అవగాహన అవసరమని, అందుకోసం బిడ్డింగ్ గడువును పెంచాలని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. నిత్యం వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే చారిత్రక గోల్కొండ కోటను, టూంబ్స్‌ను కలిపేలా నిర్మించనున్న రోప్‌వే ప్రాజెక్టును హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రూ.100 కోట్ల అంచనాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్‌వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తున్న హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలోని కుతుబ్‌షాహీల సమాధుల వరకు రోప్‌వే కోసం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్ఎఫ్పీ బిడ్డింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. రోప్వేకు అనుకూలమైన మార్గాన్ని నిర్ధారించడంతో పాటు, రక్షణశాఖ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమనే అంశంపైనా ఎంపికై న కన్సల్టెన్సీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో రోప్‌వేలు, కేబుల్ కార్ల నిర్వహణపైనా అధ్యయనం చేసి హెచ్ఎండీఏకు నివేదికను అందజేయాల్సి ఉంటుంది. కేబుల్ కారులో సందర్శన.. గోల్కొండ కోట నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో టూంబ్స్ వరకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇరుకై న రోడ్డు, వాహనాల రద్దీ దృష్ట్యా చాలామంది గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రోప్‌వే ద్వారా కేబుల్ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 10 వేల మందికిపైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3000 మంది వరకు విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్‌వేను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పర్యాటకులకు మెరుగైన సదుపాయం కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్ఎఫ్పీ కోసం ఈ నెల 6 వరకు బిడ్డింగ్ ప్రీ బిడ్డింగ్ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థలు రూ.100 కోట్లతో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు -
జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఓ నమూనా
హైడ్రా కృషిని అభినందించిన కేంద్ర బృందం సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) అధికారుల బృందం గురువారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతం చెరువులా రూపాంతరం చెందిన పాత చిత్రాలను చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిషనల్ చీఫ్ టౌన్ ప్లానర్ మోనీస్ ఖాన్ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు నీరు ఉబికి వచ్చే వీడియోలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాల్వలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. చెరువు ఔట్‌లెట్‌ను సైతం పరిశీలించారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్ టౌన్ ప్లానర్ సందీప్ రావుతో పాటు.. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, విమోస్ టెక్నో క్రాట్ ఎండీ పి.యూనస్, జీహెచ్ఎంసీ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, సిటీ ప్లానర్ ఉమాదేవి తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు.బతుకమ్మ కుంట వద్ద అధికారుల బృందం -
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి ఊరట లభించింది. ఆయనపై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. నాంపల్లి స్పెషల్ కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వాఖ్యలను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ క్వాష్ పిటిషన్ అనుమతిచ్చిన హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.కాగా, సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డికి ఊరట లభించింన సంగతి తెలిసిందే.. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం(గత నెల జులై 28) డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు -
‘ఎవరిని పెళ్లి చేసుకున్నా చంపేస్తా..’
సాక్షి, సనత్‌నగర్: ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తానంటూ ఓ యువతిని బెదిరించిన ఆమె మాజీ ప్రియుడి బెదిరించిన ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు అతడిపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్ ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో, పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే రవికుమార్ కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఇరువురూ మళ్లీ కలవబోమని అంగీకరించారు.ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్.. వరుడికి ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు. అంతేకాకుండా బాధితురాలికి ఫోన్ చేసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అతడిని చెంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ పబ్‌లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్‌యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్‌కుమార్‌యాదవ్ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు సంపుటాలు.. వేయి పేజీలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. మూడు సంపుటాల్లో నివేదికను సిద్ధం చేశారు. 650కిపైగా పేజీలతో ప్రధాన నివేదిక అందజేసినట్లు జస్టిస్ ఘోష్ పేర్కొనగా.. అనుబంధాలతో కలిపి మొత్తం మూడు సంపుటాలుగా ఇచ్చిన నివేదికలో వెయ్యికిపైగా పేజీలునున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘో‹Ùతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధ్యులు వారేనా? బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల స్థల ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్‌లు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన కమిషన్.. ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా ప్రశ్నలను సంధించింది. విచారణ చివర్లో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయాల ఆధారంగానే బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయని మాజీ మంత్రులిద్దరితోపాటు కేసీఆర్ కమిషన్ ఎదుట వాగ్మూలం ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనలను ఖండిస్తూ అసలు గత ప్రభుత్వంలోని జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరగలేదని తేలి్చంది. దీనికి సమర్థనగా గత ప్రభుత్వంలో జరిగిన కేబినెట్ సమావేశాలకు సంబంధించిన తీర్మానాల ప్రతులతో కమిషన్‌కు నివేదిక అందించింది. బరాజ్‌లకు సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారనే అంశాన్ని నిర్ధారించడానికి ఈ నివేదిక కీలకం కానుంది. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ స్థల మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారనే అంశంపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పలువురు సాక్షులను ప్రశ్నించింది. చాలా మంది సాక్షులు దీనికి సమాధానంగా ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌ల పేర్లను ఉటంకించారు. విచారణకు హాజరైన సాక్షుల్లోనే పలువురి పాత్రపై ఆధారాలను సేకరించిన కమిషన్.. వారినే బాధ్యులుగా నిర్ధారిస్తూ నివేదికలో పొందపరిచినట్లు సమాచారం. నేడు సీఎంకు నివేదిక.. జస్టిస్ ఘోష్ గురువారం సమర్పించిన నివేదిక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చేరగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆ నివేదికను అందచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం నివేదికను మీడియాకు బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు. అంశాలకు కట్టుబడే నివేదిక.. జస్టిస్ ఘోష్ ప్రభుత్వం కమిషన్‌కు నిర్దేశించిన అంశాలకే పరిమితమై నివేదికను సిద్ధం చేసినట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సిఫారసులు చేయలేదని మీడియాకు తెలియజేశారు. సర్కారుకు నివేదిక అందించడంతో తన బాధ్యత తీరిందన్నారు. ఇకపై కమిషన్ కార్యకలాపాల కోసం హైదరాబాద్‌కు రానన్నారు. సర్కారు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించగా అది తనకు తెలియదన్నారు. బాధ్యులెవరు? ప్రజాధన దుర్వినియోగం ఎంత? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరు/ఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది. అసమంజస రీతిలో ఒప్పందాల గడువు పొడిగింపు, పనులు పూర్తయినట్లు తప్పుడు సరి్టఫికేట్ల జారీ, గడువు పూర్తికాక ముందే బ్యాంక్ గ్యారెంటీల విడుదల, తదితర చర్యలతో నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించిన వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత అధికారులు/సంస్థలను బాధ్యులుగా నిర్ధారించాలని సూచించింది. అంశాలవారీగా బాధ్యులను గుర్తించడంతోపాటు దుర్వినియోగమైన నిధులను కమిషన్ నిర్ధారించి నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. -
కొత్త తరానికి చేరువవుదాం! : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది. టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం భేటీలో కీలక అంశాలపై చర్చించడంతోపాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చర్చించారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేటీఆర్‌ను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులను మధింపు చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించారు. బనకచర్లతో జరిగే నష్టంపై.. నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతోపాటు ప్రత్యేకించి గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టంపై యువత, విద్యార్థులకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 1న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ త్వరలో ఈ తరహా సమావేశాలు జరుగుతాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించే బాధ్యతను బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎర్రోల్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. జల వనరుల నిపుణులు వి.ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సదస్సుల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను విడమరిచి చెప్పాలని సూచించారు. దృష్టి మళ్లించేందుకే విచారణలు ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపై కేసీఆర్ లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు తదితరాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు తాను, హరీశ్ హాజరుకావడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలు పటాపంచలు అయినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని, బయటపడే మార్గం కోసం వెతుకుతూ మరింత లోతుగా కూరుకుపోతోందనే అభిప్రాయం కేసీఆర్ భేటీలో వ్యక్తమైంది. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. పార్టీ బీసీ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బండా ప్రకాశ్ శుక్రవారం కరీంనగర్‌కు వెళ్లి సభ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జీలు అదనపు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గాడి ప్రవీణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, సుద్దాల చలపతిరావు, గౌస్ మీరా మొహియుద్దీన్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు తొలిరోజు సీనియర్ న్యాయమూర్తులతో కలసి కేసుల విచారణలో పాల్గొన్నారు. వీరి నియామకంతో హైకోర్టులో జడ్జీల సంఖ్య 30కి పెరిగింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. ఈ నలుగురిని న్యాయవాదుల కోటాలో జడ్జీలుగా నియమిస్తూ గత నెల 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
3 నెలల్లో తేల్చండి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేం ఇప్పుడు ఏ ఆదేశాలూ జారీ చేయకపోతే.. ‘ఆపరేషన్ సక్సెస్–పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తు త వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుంది.. – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్‌కే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ మారి అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించిన రోజు నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సభాపతి కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. మరోవైపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏడు నెలలు.. 9 సార్లు విచారణ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, మోహిత్ రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. గత ఏప్రిల్ 3న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది. ఎంత సమయం కావాలని ముందే అడిగాం.. ‘2025 జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాత 16న తొలిసారిగా మేం కొందరికి నోటీసులు జారీ చేశాం. ఫిబ్రవరి 3న జరిగిన విచారణ సందర్భంగా.. ఫిబ్రవరి 4న మరికొందరికి నోటీసులు జారీ చేశాం. జనవరి 31న తొలుత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా మేము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించాం..’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’లా ఉండాలి ‘10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా పని చేస్తున్నప్పటికీ, ఆయన ఎటువంటి రాజ్యాంగపరమైన రక్షణ (కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ)ను పొందలేరు. నిజానికి ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌కు సూచించారు. అందుకు నాలుగు వారాల గడువిచ్చారు. అంతేకానీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదు. ఇకపై ఈ కేసు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’ లా ఉండాలి..’ అని సుప్రీంకోర్టు (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. విచారణను పొడిగించేందుకు అనుమతి వద్దు ‘అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి స్పీకర్ అనుమతించకూడదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అధికారాలు (కిహోటో హోల్లొహన్ (10వ షెడ్యూల్ సమర్థించిన) కేసులో తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ) ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు. స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చు. అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో తీర్పు ఉంది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిరీ్ణత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్‌కు జారీ అయిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది..’ అని న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఇచ్చాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ తగిన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. మనం దీనిని ఎదుర్కొనకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. వీటిని ఎదుర్కొనకపోతే మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. 10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ..ఆయన ఎటువంటి ‘‘రాజ్యాంగపరమైన రక్షణ’’ని పొందలేరు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పొడిగించుకుంటూ పోవడానికి వీల్లేదు..– సుప్రీంకోర్టు ధర్మాసనంబీఆర్ఎస్ నేతల అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి రాజ్యాంగ బెంచ్ తీర్పును ప్రస్తావించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది. ‘అయితే, ఫిరాయింపులు జరిగినప్పుడు అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు అప్పగించే యంత్రాంగం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా.. లేదా? అనే అంశాన్ని మాత్రం పార్లమెంట్ పరిశీలించాలి. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా? లేదా? అనే విషయం కూడా పార్లమెంటే తేల్చాలి..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యతను పార్లమెంట్ స్పీకర్‌కు అప్పగించినప్పుడు ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..ఇది పార్టీల నుంచి ఫిరాయింపులను నిరోధించడానికి రూపొందించింది. దీన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ, విలువలను కాపాడటం కోసం దీన్ని ఉద్దేశించారు. ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం..పార్టీ ఆదేశాలు చట్టసభల సభ్యులు పాటించాలి. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా పార్టీ నుంచి వైదొలిగినా చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఫిరాయింపుల అంశాల్లో కోర్టులకు అధికార పరిధి ఉండదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయమే అంతిమం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు. ఒకవేళ ఒక పార్టీ మరో పార్టీలో పూర్తిగా విలీనమైతే అనర్హత వర్తించదు. సభ్యుని అనర్హతపై ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు. -
కమిషన్ వేయాలా? వద్దా? తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతం, అక్రమాల ఆరోపణలపై విచారణ కమిషన్ వేయాలా? వద్దా? అనేది తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లో తీర్పు రిజర్వు చేసింది. ఈ సర్వే నంబర్లలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు భూములను అక్రమంగా తమ పేరిట నమోదు చేసుకున్నారని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని దాఖలైన మరో పిటిషన్‌లోని మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)లో తీర్పు వాయిదా వేసింది. భూకబ్జాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, దీనిపై విచారణ కమిషన్ వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్, పడమటి తండాకు చెందిన రాములు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మళ్లీ విచారణ చేపట్టారు. తెలియకుండా భూములు మార్చేశారు.. పిటిషనర్ తరఫున డాక్టర్ జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ‘194/ఐ, 195/ఐలో రాములు భూములున్నాయి. ప్రస్తుతం ఆ భూములు అతని అధీనంలోనే ఉన్నాయి. పాస్‌బుక్ అతని పేరిటే ఉన్నా.. భూభారతిలో మాత్రం జావేద్, ఆర్షియా సుల్తానా, అబ్దుల్ లతీఫ్ పేర్లు చూపిస్తోంది. తనకు తెలియకుండా ఆన్లైన్లో ఎలా మార్చారో చెప్పాలని తహసీల్దార్‌ను కోరినా వివరాలు ఇవ్వలేదు. కోర్టు ఆదేశించినా స్పందనలేదు. కమిషన్ వేస్తే గానీ వివరాలు బహిర్గతం కావని కోర్టును ఆశ్రయించాం’అని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘కమిషన్ వేస్తారు.. నివేదిక వస్తుంది, అది కూడా ఉన్నతాధికారులకు సమర్పించాల్సిందే, అప్పుడు కూడా ఆ నివేదికను అల్మారాలో పెట్టి వదిలేస్తే ఏం చేస్తారు’అని ప్రశ్నించారు. మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిందేనని న్యాయవాది బదులిచ్చారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం సాధ్యం కాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. -
గర్భిణులను గాలించి.. ఎరవేసి!
సాక్షి, హైదరాబాద్: సరోగసీ పేరుతో చిన్నారుల అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు నందిని, సంజయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇంకోవైపు నమ్రత నేర చరిత్రను పోలీసులు తిరగదోడుతున్నారు. గతంలో నమోదైన కేసుల పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. నమ్రతపై నగరంలోని గోపాలపురం ఠాణాలో 5, విశాఖపట్నంలో 5, గుంటూరులో ఒక కేసు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. శిశువు చనిపోయిందని నమ్మించి.. విజయనగరానికి చెందిన దంపతులు సంతాన లేమితో బాధపడుతూ 2019 ఫిబ్రవరిలో విశాఖ సెంటర్లో డాక్టర్ నమ్రతను కలిశారు. వారికి సరోగసీ సిఫార్సు చేసిన ఆమె రూ.13 లక్షలు వసూలు చేసింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి.భీమవరానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మి 2020 జనవరిలో చోడవరం పెద్దబజారులోని ఓ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్ నమ్రతకు ఏజెంట్‌గా వ్యవహరించిన నేమాల నూకరత్నం ఉచితంగా డెలివరీ చేయిస్తానంటూ ఆమెను నమ్మించింది. 2020 జనవరి 30న ఆమెను విశాఖలోని పద్మజ ఆస్పత్రిలో చేర్పించింది. ఈమెకు ఆ మర్నాడే ఆడపిల్ల పుట్టింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయిందని వెంకటలక్ష్మిని నమ్మించిన నూకరత్నం నమ్మించడంతో నమ్రత ఫిబ్రవరి 6న ఆ శిశువును విజయనగరం దంపతులకు అప్పగించింది. అయితే అప్పటికే సృష్టి సెంటర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విజయనగరం జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఉచిత డెలివరీ, డబ్బు ఆశ చూపించి.. ఇంకో కేసులో విశాఖ సమీపంలోని కానికారమాత కాలనీకి చెందిన సుందరమ్మ గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ విషయాన్ని నమ్రత ఏజెంట్‌గా ఉన్న ఆర్జి రామకృష్ణకు తెలిపారు. ముగ్గురూ కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, శిశువును ఇచ్చేస్తే కొంత డబ్బు ఇస్తామని ప్రలోభానికి గురిచేశారు. విశాఖలోని సృష్టి సెంటర్లో సుందరమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. నమ్రత ఆ చిన్నారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు అమ్మేసింది. సుందరమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్ సరోజిని ఆమెకు పోషకాహారం అందించేది. సుందరమ్మ డెలివరీ విషయం తెలుసుకుని ఆమె ఆరా తీయడం, సుందరమ్మ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో 2020 మార్చి 14న చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో శిశు విక్రయం బయటపడగా, అదే నెల 20న ఆ పసికందును వెనక్కి తీసుకువచ్చారు. కర్ణాటకకు పారిపోయిన నమ్రతను జూలైలో పోలీసులు దావణగిరిలో అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడలో సృష్టి సెంటర్ ఆక్రమాలపై 2015లో కృష్ణా జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 2018లో ఈ లైసెన్సు రద్దు అయింది. ఇలావుండగా డాక్టర్ నమ్రత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారని, అందులోనూ కొందరిని మోసం చేశారని పోలీసులు చెప్తున్నారు. నమ్రత నేరం అంగీకరించారు: పోలీసులు సృష్టి సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సరోగసీ చేయకపోయినా ఆ పేరుతో దంపతులను నమ్మించానని వెల్లడించినట్లు తెలిపారు. ఆమెను కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో ఈ వివరాలను పొందుపరిచారు. సృష్టి సెంటర్ చేసిన నేరాలు, వాటి మూలాలు, సహ నిందితులను గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. కాగా నమ్రతను పోలీసులు శుక్రవారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. -
నేరగాళ్ల చరిత్ర విప్పే నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఇక మీదట.. నేరాలు చేసి రైల్వే స్టేషన్లలోకి వెళ్లి తప్పించుకుంటామంటే కుదరదు. ‘ముఖ’చిత్రంతోపాటు.. నేర చిట్టాతో సహా అడ్డంగా దొరికిపోతారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిలో ఎక్కువమంది తప్పించుకునే క్రమంలో రైల్వే స్టేషన్లకు చేరుతున్నారు. తోచిన రైలెక్కి పారిపోతున్నారు. అలాంటి వారిని పట్టుకునేందుకు..కేంద్రం ఏఐ ఆధారిత, రియల్‌టైమ్‌లో పనిచేసే వినూత్న సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇవి రైల్వే స్టేషన్లలో నేరగాళ్ల ముఖాలను పసిగట్టి అప్పటికప్పుడు వారి నేరాల చిట్టాను విప్పుతాయి. ఆ వెంటనే పోలీసులు సులభంగా పట్టుకోగలుగుతారు.దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, ఇతర నేరాలు పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ రైల్వే స్టేషన్లలో గట్టి నిఘా అవసరమని గుర్తించింది. నేరాలకు పాల్పడేవారిలో ఎక్కువ మంది రైళ్లలోనే పారిపోతుండటమే దీనికి కారణం. దీంతో నేరగాళ్లను సులభంగా గుర్తించేందుకు రైల్వే స్టేషన్లలో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సీసీటీవీ కెమెరా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. నిర్భయ నిధి నుంచి ఇందుకు రూ.250 కోట్లు విడుదలకు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా, దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే 8 కీలక రైల్వే స్టేషన్లలో తొలుత వీటిని అందుబాటులోకి తేబోతోంది. ఇందులో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునరాభివృద్ధి జరుపుకొంటున్న ఈ స్టేషన్ వచ్చే ఏడాదిలో పూర్తి కొత్త రూపుతో, మినీ ఎయిర్‌పోర్టు తరహాలో అందుబాటులోకి రాబోతోంది. ఈలోపే ఈ కొత్త సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఆ 8 స్టేషన్లు ఇవే సికింద్రాబాద్ కాకుండా మరో ఏడు నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెరి్మనస్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు, చెన్నై, హౌరా, అహ్మదాబాద్, పుణేలోని స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ఏఐ ఆధారిత 4కే హెచ్డీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఎనిమిది స్టేషన్లలో కలిపి రోజుకు దాదాపు కోటి మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారు ఈ రద్దీలో కలిసిపోయి పారిపోతున్నారు. ఇలా పని చేస్తుందిఈ వ్యవస్థలో ఏర్పాటుచేసే సీసీటీవీ కెమెరాలు ప్రత్యేకమైనవి. ఇవి దృశ్యాలను అత్యంత స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ వ్యవస్థ భారతదేశ జాతీయ లైంగిక నేరస్థుల డేటాబేస్ (ఎన్డీపీఓ)తో అనుసంధానమై ఉంటుంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు పాల్పడిన వారి చిత్రాలు, నేర చరిత్ర, వేలిముద్రలు సహా ఇతర వివరాలు ఎన్డీపీఓలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇలా ప్రస్తుతం సుమారు 20.28 లక్షల రికార్డులు ఉన్నాయి. సరికొత్త సీసీటీవీ కెమెరాలు హై–డెఫినిషన్ క్లారిటీతో వ్యక్తుల ముఖాలను గుర్తిస్తాయి. ఎన్డీపీఓ రికార్డులతో రియల్‌టైమ్‌లో వాటిని సమీక్షించి, రికార్డులో నమోదైన నేరగాళ్లు ఉన్నట్టు తేలితే వెంటనే పూర్తి డేటాను అందిస్తుంది. పోలీసు వ్యవస్థను అలర్ట్ చేయగానే.. పోలీసు సిబ్బంది వారిని వీలైనంత తొందరలో పట్టుకోగలుగుతారన్నది ఈ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశం. వాహనాలనూ గుర్తుపట్టేలా.. ఫేషియల్ రికగి్నషన్‌తో పాటు ఈ స్టేషన్లలో అత్యవసర కాల్ బాక్స్‌లు, స్మార్ట్ లైటింగ్, డ్రోన్‌నిఘా, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలతో సహా విస్తృత సాంకేతికతలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో వివిధ నేరాల్లో పాలుపంచుకున్న వాహనాలు (నంబర్‌ప్లేట్ ఆధారంగా) కనిపించినా కెమెరాలు పట్టేస్తాయి. రైల్వే అనుబంధ సంస్థ సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ విభాగం దీని ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తోంది. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఎనిమిది రైల్వే స్టేషన్లలో, ఒక్కో స్టేషన్‌కు నిర్భయ నిధి నుంచి రూ.4.8 కోట్లు విడుదల చేశారు. గోప్యంగా సమాచారం ఈ కెమెరాలను వెయిటింగ్ హాళ్లు, రిజర్వేషన్ కౌంటర్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన ద్వారాలు, ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహా వ్యక్తుల కదలికలుండేకీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కంట్రోల్ రూమ్‌లలో వీడియో ఫీడ్ పర్యవేక్షిస్తారు. ఈ వ్యవస్థ సేకరించే సమాచారాన్నిగోప్యంగా ఉంచుతామని,అవసరమైనంత మేరకు తప్ప బహిర్గతం చేయబోమని రైల్వే అధికారులు తెలిపారు. ఇదీ నేపథ్యం మహిళలపై నేరాలకుసంబంధించి.. తక్కువ శిక్ష రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విమెన్ లాయర్స్ అసోసియేషన్ గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసింది. 2022లో 23.66 లక్షల పెండింగ్ కేసుల్లో 38,136 మందికి మాత్రమే శిక్ష పడిందనిపిటిషన్లో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలను తాజాగా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. వీలైనంత త్వరలో దీన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. ఏ ప్రాంతంలో ఎలాంటి కెమెరాలు? » స్టేషన్ భవనాల్లోని ప్రాంతాల్లో డోమ్ టైప్ కెమెరాలు » ప్లాట్‌ఫామ్స్ వద్ద బుల్లెట్ టైప్ కెమెరాలు » పార్కింగ్ ఏరియాలలో పాన్ టిల్ట్ జూమ్ టైప్ కెమెరాలు » కీలక ప్రాంతాల్లో 4కే హెచ్డీ అల్ట్రా కెమెరాలు -
మెడికల్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేట్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలతోపాటు అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 7 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు నీట్–యూజీ 2025లో అర్హత సాధించి ఉండాలి. జనరల్ కేటగిరికి చెందిన విద్యార్థులకు 50వ పర్సంటైల్‌లో కనీసం 144 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 40వ పర్సంటైల్‌లో 113 మార్కులు, ఓసీ పీడబ్ల్యూడీ వర్గానికి 45వ పర్సంటైల్‌లో 127 మార్కులు కనీస అర్హతగా వర్సిటీ పేర్కొంది. కన్వినర్ కోటా 50 శాతం పోగా మిగిలిన సీట్లలో... ప్రైవేటు నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కళాశాల్లో 50 శాతం కన్వీనర్ కోటా పోగా మిగిలిన సీట్లను మేనేజ్మెంట్ కోటాలో బీ కేటగిరీ కింద కేటాయిస్తారు. బీ కేటగిరి సీట్లలో కూడా 85 శాతం స్థానిక అభ్యర్థులకు రిజర్వు చేశారు. మిగిలిన 15 శాతం సీట్లు దేశవ్యాప్తంగా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. నీలిమా కళాశాలలో బీ కేటగిరిలో 25 శాతం మాత్రమే స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మైనారిటీ కాలేజీల్లో సీట్లు ముస్లిం అభ్యర్థులకే ఇవ్వనున్నారు. చివరి దశలో అర్హులు లేకపోతే 30 శాతం వరకు నాన్ మైనారిటీ అభ్యర్థులకు కేటాయించవచ్చు. గడువు తర్వాత తాత్కాలిక మెరిట్ జాబితా తయారు చేసి తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రవేశానికి సంబంధించి పూర్తి వివరాలనుknruhs.telangana.gov.in వెబ్సైట్ లో పొందుపరిచారు. కన్వినర్ కోటా కౌన్సెలింగ్ తరువాత మేనేజ్మెంట్ కోటాలో బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. -
కదం తొక్కుతున్న కృష్ణమ్మ
దోమలపెంట/నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో 2,73,659 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 1,79,316 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 25,205, సుంకేసుల నుంచి 69,138 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దీంతో ఎనిమిది గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 2,16,152 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,764 క్యూసెక్కులు.. మొత్తం 66,079 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.7 అడుగుల నీటిమట్టం వద్ద 202.9673 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 31,000 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్‌ఐకి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వస్తున్న నీటితో.. సాగర్ నుంచి 26 క్రస్ట్‌గేట్ల ద్వారా, విద్యుదుత్పాదనతో కలిపి మొత్తం 2,25,595 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585 అడుగులు (297.4350టీఎంసీలు) ఉంది. -
బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి రండి
వికారాబాద్, పరిగి: ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని.. అందుకే వారి కోసం పాదయాత్ర చేస్తున్నామని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర, రోడ్‌షోలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆమె గురువారం పాల్గొన్నారు. మండల పరిధిలోని రంగాపూర్ నుంచి పరిగి పట్టణం వరకు ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక కొడంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మీనాక్షి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రంతో పోరాడుతున్నామని, ప్రజలు సైతం ఇందులో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందని తెలిపారు. 65 వేల ఉద్యోగాలిచ్చాం.. పాదయాత్రలకు కాంగ్రెస్ పెట్టింది పేరు అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక 65 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ అధినాయకత్వం డిమాండ్ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖం చాటేస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేసి తీరుతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, బి.మనోహర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, పీసీసీ ప్ర«ధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ రామచల్ల సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా స్థలాల్ని స్వాదీనం చేసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణలకు గురైన తమ శాఖ భూముల్లో అంగుళం స్థలాన్ని కూడా వదలిపెట్టకుండా యుద్ధప్రాతిపదికన స్వాదీనం చేసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ. వందల కోట్ల విలువైన భూములు కబ్జాలకు గురయ్యాయని.. దీన్ని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్తులో ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ఆ భూముల చుట్టూ కంచెల ఏర్పాటుతోపాటు చట్టపరమైన చర్యలూ తీసుకుంటామని చెప్పారు. నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణపై సచివాలయంలో గురువారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, ఈఎన్సీ అడ్మిన్ రమేశ్ బాబు, భూసేకరణ కమిషనర్ శివకుమార్ నాయుడు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. కాల్వలకు ఇరువైపులా ఉన్న భూములతోపాటు ప్రాజెక్టుల స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కోర్టుల్లో వాదనలకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది.. హైదరాబాద్‌లోని గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్‌సాగర్, కిస్మత్పుర, వాలంతరి, ఇంజనీరింగ్ ల్యాబ్ (టీజీఈఆర్ఎల్)కు చెందిన 426.3 ఎకరాలకుగాను 131.31 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఐటీఐఆర్ అ«దీనంలోని 81.26 ఎకరాల స్థలంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా మిగిలిన 50.13 ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. వాటిపై జిల్లా కోర్టులో 20 కేసులు, హైకోర్టులో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. భూముల పరిరక్షణలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించాలని నిర్ణయించామన్నారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించామని చెప్పారు. నీటిపారుదల భూముల్ని గుర్తించండి.. నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు సంబంధించిన క్వార్టర్లలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి తక్షణమే సమగ్ర సమాచారం తన ముందు ఉంచాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలన్నారు. తమ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ఇటీవలి మంత్రివర్గ సమవేశంలో చర్చించామన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను నీటిపారుదల శాఖ స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. -
మోసం చేసినట్లు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత!
హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సరోగసీ పేరుతో పలువురిని మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారు. చేసిన తప్పులను ఒప్పుకున్న డాక్టర్ నమ్రత.. దంపతులను సరోగసీ విషయంలో మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించినట్లు తెలిపిన నమ్రత.. ఆ రాజస్థాన్ దంపతులు డీఎన్ఏ రిపోర్ట్ అడిగితే.. కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, అనస్థీషియన్ సదానందం డాక్టర్ నమ్రతకు సహకరించారని పోలీసులు తెలిపారు. సరోగసీ ద్వారా నమ్రత చాలా మోసం చేశారని పోలీసులు వెల్లడించారు. -
కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్.. లీగల్ ఒపీనియన్ వచ్చాకే అసెంబ్లీకి..!
హైదారాబాద్: ప్రభుత్వానికి చేరిన కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్‌ను లాకర్లో పెట్టారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చిన సీఎస్ రామకృష్ణారావు... ఈ తుది నివేదికను లాకర్లో పెట్టారు. ఈ తుది నివేదికపై ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్ రామకృష్ణారావులు కీలక అధికారులతో భేటీ అయ్యారు. కేబినెట్లో చర్చించే ముందు షీల్డ్ కవర్ ఓపెన్ చేయనుంది ప్రభుత్వం. ఈ నివేదికను కేబినెట్లో చర్చించిన తర్వాత లీగల్ ఒపీనియన్‌కు పంపనుంది ప్రభుత్వం. లీగల్ విషయాలపై అడ్వకేట్ జనరల్‌కి రిఫర్ చేయనుంది. దీనిపై లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కారు.కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశానికి సంబంధించి గురువారం బీఆర్కే భవన్‌కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. -
ధన్‌ఖడ్ ఏమన్నారో అందరికీ తెలుసు.. ‘సుప్రీం’ తీర్పుపై తెలంగాణ స్పీకర్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామని అన్నారాయన. ఈ క్రమంలో ధన్‌ఖడ్ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.‘‘సుప్రీంకోర్టు తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తా. మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఏం మాట్లాడారో అందరూ చూశారు. వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించాకే అన్ని వివరాలు త్వరలో చెప్తా’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. పార్టీ మారిన పది మందిపై తొలుత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో.. విచారణ షెడ్యూల్ కోసం సింగిల్ బెంచ్ జడ్జి తెలంగాణ స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విధించారు. అయితే డివిజనల్ బెంజ్ దానిని కొట్టేసింది. ఇక ఇవాళ్టి తీర్పులో ఫిరాయింపులపై చర్యల విషయంలో స్పీకర్‌కు సుప్రీం కోర్టు మూడు నెలల కాలపరిమితి విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉప రాష్ట్రపతి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన ధన్‌ఖడ్.. సుప్రీం కోర్టుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటే సుప్రీం అని. ఎన్నికైన ప్రజాప్రతినిధులే రాజ్యాంగ ప్రకారం అల్టిమేట్ మాస్టర్స్ అని అన్నారాయన. ‘‘సుప్రీం కోర్టు రాష్ట్రపతికి గడువు విధించడం తగదు. ఇప్పుడు జడ్జీలు శాసనాలు చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు, సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు’’ అని విమర్శించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణి ప్రయోగించకూడదు అని తీవ్ర వ్యాఖ్య చేశారాయన. అయితే.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషన్ విచారణ సమయంలో సుప్రీం కోర్టు పరోక్షంగా ధన్‌ఖడ్ వ్యాఖ్యలపై స్పందించింది. ఇప్పుడు మేమే కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అంటూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.సంబంధిత వార్త: ఆలస్యం చేసే ఎత్తుగడలు సరికావు.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ -
సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు.BRS welcomes the decision of the Honorable Supreme Court and we thank the Honorable CJI for ensuring that the democratic structure of this country isn't eroded by malicious methodsI hope @rahulgandhi who in his Panch Nyay advocated for stronger anti-defection laws and automatic…— KTR (@KTRBRS) July 31, 2025పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అన్నారు. -
1,000 పేజీలతో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తన తుది నివేదిక సమర్పించింది. గురువారం బీఆర్కే భవన్‌కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్‌కు అందజేస్తారని సమాచారం. -
సింగిల్ యూజ్.. ప్లాస్టిక్ బ్యాన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగాన్ని త్వరలో పూర్తిగా నిషేధించనున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో నగరంలో దీని నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్‌లను సంపూర్ణంగా నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పేరిట దీన్ని అమల్లోకి తేనున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు నిరీ్ణత మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆదిలో అట్టహాసమే తప్ప అమలులో అటకెక్కింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ప్లాస్టిక్ నిషేధం కోసం 2007 నుంచే ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసమని పెనాలీ్టలను రూ.5 వేల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు విధిస్తూ పలు సర్క్యులర్లు, జీవోలు జారీ అయినప్పటికీ, అమలులో మాత్రం నీరు గారింది. ఈ నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తాజాగా జీహెచ్ఎంసీ చట్ట సవరణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నారు. తద్వారా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగంలో లేని నగరంగా హైదరాబాద్ ఉండాలని భావిస్తున్నారు. టీసీయూర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్)వరకు దీన్ని అమలు చేసే ఆలోచనలున్నప్పటికీ.. తొలుత చట్ట సవరణ ద్వారా జీహెచ్ఎంసీ పరిధి వరకు కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చట్ట సవరణ చేయనున్నారు. గతంలో ఇలా.. ఎన్ని మైక్రాన్ల లోపు ఉంటే సింగిల్ యూజ్ ప్లాస్టికో క్రమేపీ మారుతోంది. 20 మైక్రాన్ల లోపు వాటిని ఒకప్పుడు సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌గా పరిగణించగా, ప్రస్తుతం ఇది 120 మైక్రాన్లకు చేరింది. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలోనే 2007 ఆగస్ట్ 8న జారీ అయిన సర్కులర్ మేరకు 20 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మినవారికి రూ.5వేలు, వినియోగించిన వారికి రూ.500 జరిమానాలు విధించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2011లో 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగరాదన్నారు. 2016లో మొదటిసారి రూ.10వేల జరిమానాతో పాటు మూడోసారి సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. 2017లో వెలువడిన జీవో మేరకు నిషేధం అమల్లో జీహెచ్ఎంసీ విఫలమైతే జీహెచ్ఎంసీకి పీసీబీ రూ.25వేల జరిమానా విధిస్తుందని పేర్కొన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం 2022లో డీలర్లు, డి్రస్టిబ్యూటర్లకు లక్ష రూపాయల జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్ వరకు చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వు జారీ చేశారు. ఒక టాస్‌్కఫోర్స్ సైతం ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. పర్యవసానంగా ఏ మార్కెట్‌కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీబ్యాగ్‌ల భారం అదనంగా పడుతోంది. గత పాలకమండలిలోనూ నగరంలో ప్టాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపిన సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక తిరిగి పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. నిషేధానికి చేయనున్న చట్ట సవరణలోనూ కొన్ని ప్రత్యేక అవసరాలకు మినహాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. నిషేధం అమల్లోకి వస్తే నగరంలో వివిధ సమస్యలు తగ్గుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాలాల్లో వ్యర్థాలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా వరద సమస్యలు తగ్గుతాయి. ఎగుమతి కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ ఉత్పత్తి చేసేవారికి, సీల్డు సరుకుల ప్యాకేజీలు, పాలు,పాల ఉత్పత్తుల ప్యాకింగ్స్, నర్సరీల అవసరాలకు అనుమతించే అవకాశం ఉంది. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా మినహాయింపులు ఉండనున్నాయి. -
HYD: ఎట్టకేలకు చిక్కిన చిరుత
సాక్షి, హైదరాబాద్: గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. మృగవని పార్క్ గ్రేహౌండ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేశారు అధికారుల. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్ ఎకోటిక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. -
అజ్జూ భాయ్‌కే జూబ్లీహిల్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ క్రమంగా వీడుతోంది. ఈ సీటు కోసం మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వైపే ఈసారి కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యరి్థని ఎంపిక చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకోవైపు బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు కూడా విన్పిస్తున్నా.. మైనార్టీ వర్గం వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రతి మంత్రి పరిధిలో కొందరు చైర్మన్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఏడాది అక్టోబర్‌లో ఉప ఎన్నిక జరగవచ్చనే అంచనాలో ఉన్న అధికార కాంగ్రెస్ ఇప్పటినుంచే గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌లకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. తాజాగా 25 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా రంగంలోకి దింపింది. ప్రతి మంత్రి పరిధిలో కొందరు చైర్మన్లు బూత్‌స్థాయిలో పనిచేసేలా కార్యాచరణ రూపొందించింది. కార్పొరేషన్ చైర్మన్లు కేస వేణు, పటేల్ రమేశ్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, మువ్వా విజయ్‌బాబు, మానాల మోహన్‌రెడ్డి, బండ్రు శోభారాణి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గుత్తా అమిత్‌రెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డి, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, తాహెర్ బిన్ అహ్మద్, లక్ష్మణ్ యాదవ్, రాయల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, ఈరవత్రి అనిల్, జంగా రాఘవరెడ్డి, రియాజ్, ఎన్.ప్రీతంలను ముగ్గురు మంత్రుల పరిధిలో పనిచేయాల్సిందిగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆదేశించారు. సోషల్ మీడియాకు మన్నె సతీశ్, సాంస్కృతిక బృందాలకు పుంజాల అలేఖ్య, వెన్నెల, వికలాంగ ఓటర్ల ప్రచారానికి ముత్తినేని వీరయ్య వర్మలు సారథ్యం వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కార్పొరేషన్ చైర్మన్లతో.. మంత్రి పొన్నంతో కలిసి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన నివాసంలో భేటీ అయ్యారు. పోలింగ్ బూత్ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యాచరణపై వారితో చర్చించారు. -
ఆ షేర్ల బదిలీ అక్రమం
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, క్లాసిక్ రియాల్టీలకున్న వాటాను తక్షణం పునరుద్ధరించాలని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు తల్లి విజయమ్మ ద్వారా తన సోదరి షర్మిల చేసుకున్న అక్రమ బదిలీని నిలిపివేయాలని ఆయన చేసిన వాదనతో బెంచ్ ఏకీభవించింది. వారి వాటాలను వారి పేరుపై మార్చి, వాటాదారులుగా పేర్కొంటూ సభ్యుల రిజిస్టర్‌ను సరిదిద్దాలని సరస్వతి పవర్ బోర్డుకు స్పష్టం చేసింది. ఆ విషయాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువరించిన బెంచ్... బుధవారం 45 పేజీల తీర్పు కాపీని వెలువరించింది. తీర్పులో ముఖ్యాంశాలివీ...∙పిటిషనర్లయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి, క్లాసిక్ రియాల్టీల నుంచి ప్రతివాదులు అక్రమ పద్ధతుల్లో షేర్లను బదిలీ చేసుకున్నారు. ఎందుకంటే పిటిషనర్లు తమ పేరిట ఉన్న షేర్లకు సంబంధించి ఎలాంటి షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలపైనా (ఎస్‌హెచ్–4) సంతకాలు చేయలేదు. చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో అంతిమంగా చెల్లెలికి చెందేలా తల్లిని ట్రస్టీగా పెట్టి పిటిషనర్లు తమ షేర్లను గిఫ్ట్ డీడ్ చేశారు. కానీ కోర్టుల్లో కేసులు తేలాకే ఇవ్వాలనే షరతు పెట్టుకున్నారు కనక దానికి తగ్గట్టుగా ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకున్నారు. » షేర్ బదిలీ ప్రక్రియ కోసం తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. ఎస్‌హెచ్–4 బదిలీ ఫారాన్ని షేర్ హోల్డర్ల సంతకాలతో, తగిన స్టాంప్ డ్యూటీ చెల్లించి సమర్పించాలి. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లూ ఉండాలి. కానీ ఇక్కడ ప్రతివాదులు అవేమీ పాటించలేదు. » ‘డాక్యుమెంట్లు పోయాయి’ అని ప్రతివాదులు చెప్పిన కారణం చట్టపరంగా సరైనది కాదు. ఒకవేళ అదే నిజమైతే పోయినట్లు పోలీస్ కంప్లయింట్ ఉండాలి. దాని ఆధారంగానే డూప్లికేట్ సర్టిఫికెట్లు పొందే ప్రయత్నం చేయాలి. దీనికి ఒరిజినల్ షేర్ హోల్డర్లూ సహకరించాలి. ఒరిజినల్ షేర్ హోల్డర్ల నుంచి అలాంటివేమీ లేకుండా... బోర్డు తీర్మానం ఆధారంగా షేర్లను పొందినట్లు చూపించడం న్యాయసమ్మతం కాదని బెంచ్ అభిప్రాయపడింది.» గిఫ్డ్ డీడ్లు, షేర్ల కొనుగోలు ఒప్పందాలు (ఎస్పీఏ) ఉన్నా... అవి అంతర్గతంగా చేసుకున్న వ్యక్తిగత ఒప్పందాలు మాత్రమేనని, వాటి ఆధారంగా కంపెనీ రిజిస్టరులో పేరు మార్పు జరగాలంటే కంపెనీల చట్టం నిర్దేశిస్తున్న ప్రక్రియను పాటించాలని స్పష్టంచేసింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 56 (1) ప్రకారం షేర్ ట్రాన్సఫర్ చట్టబద్ధంగా జరగాలంటే ఎస్‌హెచ్–4, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, స్టాంప్ డ్యూటీ చెల్లించిన రసీదు తప్పనిసరి అని... ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లకు ఎలాంటి మినహాయింపూ ఉండదని స్పష్టంచేసింది. » ప్రతివాదులు ఇండెమ్నిటీ బాండ్లు, అఫిడవిట్లు మాత్రమే సమర్పించారని, అవి సరిపోవని తేల్చిచెప్పింది. -
నేడు ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ కార్యాలయానికి రావాలని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాను కమిషన్ కోరింది. జస్టిస్ చంద్రఘోష్ ఆయనకు సీల్డ్ కవర్లో నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. 115 మంది సాక్షులను విచారించిన కమిషన్ తుది నివేదికను సిద్ధం చేసింది. -
పోరుబాటలో పార్టీ సైతం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణలో పాలుపంచుకోవాలని నిర్ణయించింది. మూడురోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఆగస్టు ఆరో తేదీన జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనేలా.. ప్రత్యేక రైలులో ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మందిని పంపనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.ప్రత్యేక రైలు ఈనెల ఆరో తేదీ ఉదయం కల్లా ఢిల్లీ చేరుకునేలా సమన్వయం చేయనుంది. ఢిల్లీలో పోరాటం నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర షెడ్యూల్‌ను కుదించారు. వాస్తవానికి ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆరు ఉమ్మడి జిల్లాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాల్సిన ఈ పాదయాత్రను వచ్చే నెల నాలుగో తేదీకి కుదించారు. నాలుగో తేదీ సాయంత్రం పాదయాత్ర ముగిసిన వెంటనే ముఖ్య నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో పాటు ముఖ్య నాయకత్వమంతా ఢిల్లీలోనే ఉండి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగస్వాములు కావాలని పీసీసీ పిలుపునిచ్చింది. త్వరలో కార్పొరేషన్ డైరెక్టర్లు, బోర్డు సభ్యుల ప్రకటన పార్టీ సంస్థాగత నిర్మాణం, పాదయాత్ర, ఢిల్లీ టూర్, నామినేటెడ్ పదవులపై చర్చించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశమయ్యారు. సీఎం నివాసంలో గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. నామినేటెడ్ పదవుల కోసం జిల్లా ఇన్చార్జుల నుంచి వచ్చిన జాబితాలను మీనాక్షి, మహేశ్‌గౌడ్‌లు ముఖ్యమంత్రికి అందజేశారు.ఆయన వీటిని పరిశీలించి తుది జాబితాను ఖరారు చేస్తారని, వారం, పది రోజుల్లో కార్పొరేషన్ డైరెక్టర్లు, బోర్డు సభ్యులను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బీసీ రిజర్వేషన్ల పోరాట ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఈ నెల ఐదో తేదీన పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశం చర్చకు వచ్చేలా వాయిదా తీర్మానం కోసం పార్టీ తరఫున పట్టు పట్టాలని, ఆరో తేదీన జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని, ఏడో తేదీన రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. -
ఉచితాల కోసం కొత్త డిస్కమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటు కానుంది. వ్యవసాయానికి, ఇళ్లకు 200 యూనిట్ల వరకు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇది రాష్ట్రం యూనిట్‌గా పని చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. డిస్కమ్‌ల స్థితిగతులు, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడాలంటే విధిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునేందుకు వీలుగా రీస్ట్రక్చరింగ్‌కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీలు హరీశ్, కృష్ణభాస్కర్.. డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, రెడ్కో ఎండీ అనిల తదితరులతో సీఎం సమీక్ష జరిపారు. అధిక వడ్డీ రుణాలతో డిస్కమ్‌లు డీలా.. విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న సదరన్, నార్తర్న్ డిస్కమ్‌లకు అదనంగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకు రావడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. డిస్కమ్‌ల పునర్వ్యవస్థీకరణతో వాటిపై ఉన్న రుణ భారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పది శాతం వడ్డీతో తీసుకున్న రుణాలతో డిస్కమ్‌లు డీలా పడ్డాయని అన్నారు. స్కూళ్లు, సర్కారు కార్యాలయాలకు సౌర విద్యుత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలన్నారు. రాష్ట్ర సచివాలయానికి కూడా సౌర విద్యుత్ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు లబ్ధి చేకూర్చాలి ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూడేళ్లలో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించాలని చెప్పారు. -
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది. -
Hyderabad: వాణిజ్య పన్నుల శాఖ దాడులు.. వెలుగులోకి భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో భారీ పన్ను మోసం వెలుగులోకి వచ్చింది. కేసులో హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థ ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ ప్రధాన పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పంపించగా.. డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించినట్లు అధికారలు నిర్థారించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది.సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు అధికారులు గుర్తించారు. ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయమని హైదరాబాద్ కేంద్రమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీకి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్‌కు చెందిన డీఎస్టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. -
హైదరాబాద్‌లో ఫ్లాట్ల కొనుగోళ్లకు భారీ తాకిడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. -
రాహుల్, ప్రియాంక వయనాడ్‌లో పుట్టి పెరిగారా?
కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రగడ మొదలైంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెంచడం.. స్థానికుడికే టికెట్ కేటాయించాలని నిర్ణయించడం.. గతంలో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్‌కే టికెట్ దాదాపు ఖాయమనే సంకేతాలు అందిస్తోంది. ఈ తరుణంలో మరో మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ వైపు అధిస్థానం మొగ్గు చూపుతున్న వేళ.. ఆ టికెట్ ఆశావహుడు ఫిరోజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు? అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అంటున్నారాయన. ‘‘సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?. వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులా?. స్థానికులకే ఇస్తామనడం సరికాదు’’... అని ఫిరోజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి అజారుద్దీన్‌తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నాంపల్లి(హైదరాబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు 39,360 ఓట్లు రాగా, ఫిరోజ్‌కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్‌లకు, డైలాగులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా మందలించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ కూడా టికెట్‌ను పార్టీ లోకల్ వ్యక్తికే ఇస్తుందని అన్నారు. ఈ తరుణంలో.. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, రేవంత్‌కు సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్‌ల పేర్లు కాంగ్రెస్ నుంచి చర్చల్లోకి వచ్చాయి. అయితే.. తాజాగా కాంగ్రెస్ మైనారిటీ ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలిశారు. కేబినెట్లో మైనారిటీలకు ఎలాగూ ప్రాతినిధ్యం లేదని.. కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్‌ని అయినా తమ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్ పేరును వాళ్లు బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు సీఎం రేవంత్‌తో చర్చిస్తున్నారు.బీఆర్ఎస్ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌లోపు ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలాన్ని చూపించేందుకు ఇది ఓ అవకాశంగా భావిస్తున్నారాయన.ఇదీ చదవండి: హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం -
మళ్లీ భాగ్యనగరంలో భూముల వేలం
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకంగా మారిన టీజీఐఐసీ మరోమారు అత్యంత విలువైన భూముల వేలానికి సిద్ధమైంది. రాయదుర్గ్, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లోని 66 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని భావిస్తోంది. వేలం విధివిధానాల్లో సహకరించేందుకు సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది.వచ్చే నెల 8 వరకు వేలం కోసం బిడ్లను స్వీకరించి 12న వేలం ప్రక్రియను పూర్తిచేసేలా టీజీఐఐసీ షెడ్యూల్ విడుదల చేసింది. 17 ప్లాట్ల వేలానికి సంబంధించిన అప్సెట్ ధర(మినిమం బేస్ ప్రైస్)ను టీజీఐఐసీ ప్లాట్లవారీగా నిర్ణయించింది. రాయదుర్గ్‌లోని 15ఏ/2, 14ఏ/1 ప్లాట్ల అప్సెట్ ధరను చదరపు గజానికి రూ.1,51,484గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరం ధర రూ.104 కోట్లుగా తేల్చింది. మిగతా ప్లాట్లలో అప్సెట్ ధరను కనిష్టంగా రూ.12.20 కోట్ల నుంచి రూ. 50.10 కోట్లుగా నిర్ణయించింది. ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!మొత్తం 66 ఎకరాలను టీజీఐఐసీ విక్రయించనుండగా వాటిలో 4 ప్లాట్లు రాయదుర్గంలో, మరో 13 ప్లాట్లు ఉస్మాన్‌నగర్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని 2014–23 మధ్య టీజీఐఐసీ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 21 వేల కోట్ల ఆదాయం సమకూర్చినట్లు సమాచారం. -
ఈడీ దూకుడు.. గొర్రెల స్కాంలో పలు చోట్ల సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గొర్రెల పంపిణీ, పెంపకం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పని చేసిన జి కళ్యాణ్‌ను ఈడీ ఆఫీస్‌కు తీసుకొచ్చి అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం నగరంలో ఈడీ సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. పశుసంవర్థకశాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ నివాసంతో పాటు మరో తొమ్మిది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఈక్రముద్దీన్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. గొర్రెల పెంపకం, పంపిణీ పేరుతో తెలంగాణలో భారీ స్కాం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరు మీద సుమారు రూ.750 కోట్ల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించుకుంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. -
రాజాసింగ్ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారా..?
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారు’అని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు, తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీకి మాత్రమే రాజీనామా చేశా.. ‘ఉప ఎన్నిక వస్తుందని కొంత మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్‌కు లేఖ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. గోషామహల్లో ఎలా వస్తుందో నాకు తెలియడంలేదు. మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ఉప ఎన్నిక ప్రసక్తే రాదు’అని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీలో మిత్రులతోపాటు శత్రువులు ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులిస్తూ, వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు. -
కుక్క కావాలా..
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల సమస్య పరిష్కారానికి బల్దియా చర్యలు చేపట్టనుంది. ఎంపిక చేసిన పెద్ద పార్కుల్లో వీధికుక్క పిల్లల ప్రదర్శన.. దత్తత కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. గతంలో ‘మా ఇంటి నేస్తం’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి మెరుగులు దిద్ది, కొత్త విధానంలో చేపట్టేందుకు రెడీ అవుతోంది. డా.బి.జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా ఉన్న సమయంలో ‘మా ఇంటి నేస్తం’ కింద కుక్క పిల్లలను పెంచుకోవాలని ముందుకొచ్చేవారికి వాటిని అందజేసేవారు.సదరు కార్యక్రమానికి మెరుగులు దిద్ది, వాటిని స్ట్రీట్ డాగ్స్‌లా చూడకుండా అందమైన పెట్డాగ్స్గా పెంచుకునేందుకు కుక్క పిల్లలకు వైద్య పరీక్షలు, టీకాలు తదితరాలు పూర్తయ్యాక పెంపకంపై తగిన అవగాహన వంటివి సైతం కల్పించి దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి అందజేయనున్నారు. ఎంపిక చేసిన పార్కుల్లో కెన్నెల్స్‌లో కుక్కపిల్లలను ఉంచి ప్రదర్శన ఏర్పాటు చేసి, అధికారులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి, నిబంధనలకనుగుణంగా నడచుకునేలా అవగాహన కలి్పంచి దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపే వారికి కుక్కపిల్లలను అందజేయనున్నారు.కుక్కకాట్లు తగ్గేందుకు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని పలు నగరాల్లో వీధి కుక్కల సమస్యలున్నాయి. వాటి బారిన పడి ఎందరో.. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కోర్టులు సైతం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఆయా మున్సిపల్ కార్పొరేషన్లను ప్రశి్నస్తున్నాయి. ఎంతగా శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, కుక్కల సంతతిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వీధికుక్కలుగా ఉంటే జనాన్ని కరుస్తుండటంతో వాటిని పెంపుడు జంతువులుగా మారిస్తే సమస్య తగ్గుతుందనే తలంపుతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. పార్కుల్లో ప్రదర్శనలు ఇందులో భాగంగా తొలుత బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో, తర్వాత కేబీఆర్ పార్కులో కెన్నెల్స్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తద్వారా డాగ్ లవర్స్ కుటుంబాలతో సహ వచ్చి ప్రదర్శనలోని కుక్కపిల్లల్లో నచ్చిన దానిని ఎంచుకునేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రదర్శనకు అవసరమైన కెన్నెల్స్ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో సమకూర్చుకోనున్నారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బందితో పాటు స్వచ్ఛంద సేవల సిబ్బంది దత్తత ఇచ్చేందుకు కుక్కపిల్లలకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యకరంగా ఉన్నవాటినే ప్రదర్శనలో ఉంచుతారు. తల్లిపాలు మరచిన, నులిపురుగులు వంటివి లేకుండా తగిన మందులతోపాటు అవసరమైన టీకాలు వేసిన రెండునెలల వయసు దాటిన కుక్కపిల్లలను ప్రదర్శనల్లో ఉంచుతారు. ప్రదర్శన సమయంలో కుక్కపిల్లల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి అక్కడే దరఖాస్తులు అందజేస్తారు. ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రజల సందేహాలకు సమాధానాలిస్తారు. ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు వీధికుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, ఎక్కువమంది ప్రజలు కుక్కల్ని దత్తత తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్యంపై వాకబు.. దత్తత తీసుకునేవారికి కుక్కల పెంపకంపై తగిన అవగాహనతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన అంశాల వంటివి వివరించనున్నారు. దత్తత ఇచి్చన కుక్కలకు అవసరమైన వైద్య పరీక్షలకు జీహెచ్ఎంసీ సహకరించనుంది. నిరీ్ణత వ్యవధిలో దత్తత తీసుకున్న ఇళ్లకు వెళ్లడం లేదా ఫోన్ ద్వారా సంప్రదించి దత్తత కుక్కల ఆరోగ్యాన్ని వాకబు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రజారోగ్యం, జంతు సంరక్షణల దృష్ట్యా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచి్చబౌలి/మణికొండ: కుమార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కొండముదుసుపాలెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్ వెళ్లగా వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు. కుమార్తెలను తీసుకొని శాలిని సోమవారం రాత్రి మణికొండకు వచ్చింది. భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష 9వ తరగతి, చిన్న కుమార్తె సహస్ర 4వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది. ఉదయం 8.45 గంటలకు స్కూటీపై తిరిగి వస్తుండగా మణికొండలోని సుందర్ గార్డెన్ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టింది. కిందపడిపోయిన శాలిని తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా ట్యాంకర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మృతురాలి సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాగా చంపి ఫేమస్ అయ్యేదా!
హైదరాబాద్: తన అక్క ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే కారణంతో ఆమెను హత్య చేసిన నిందితుడు.. పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన రుచిత (21)ను సోమవారం ఆమె తమ్ముడు రోహిత్ (18) గొంతు నులిమి చంపగా పోలీసులు అతన్ని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. స్వగ్రామానికి చెందిన యువకుడితో అక్క ఫోన్లో మాట్లాడుతుండటంతో స్నేహితుల వద్ద పరువు పోతోందని రోహిత్ భావించాడు. దీంతో ఆమెను చంపాలనుకున్నట్లు సమాచారం. అంతకుముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?’అనే సినీ డైలాగ్‌కు తాను చేసిన రీల్‌ను షేర్ చేశాడు. -
‘సరస్వతి’ షేర్ల బదిలీ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్ల బదిలీ వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఏకీభవించింది. తన పేరిట, వైఎస్ భారతి పేరిట సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, తమ అనుమతి లేకుండా, షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లపై తమ సంతకాలు లేకుండా చేసుకున్న ఆ బదిలీ చెల్లదని, దాన్ని నిలిపివేయాలని అభ్యర్థిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను బెంచ్ అనుమతించింది. ఆ షేర్ల ట్రాన్స్ఫర్ చెల్లదంటూ... షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి కంపెనీలోని తమ షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఎన్సీఎల్టీలో 2024, సెపె్టంబర్ 3న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తమ సంతకాలు లేకుండా, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు లేకుండా బదిలీ జరిగిందని చెప్పారు. దీన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను కోరారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల తరఫునా సుదీర్ఘ వాదనలు విన్న రాజీవ్ భరద్వాజ్ (జ్యుడిషియల్), సంజయ్ పూరి (టెక్నికల్) సభ్యుల ధర్మాసనం ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసి... మంగళవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. పూర్తి జడ్జిమెంట్ వివరాలను నేడు అప్లోడ్ చేసే అవకాశం ఉంది. -
డీఎస్సీ–2003 టీచర్లకు పాత పింఛన్
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. 2004, ఆగస్టు 31 వరకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమల్లో ఉన్నందున వారంతా అందుకు అర్హులని తేల్చిచెప్పింది. కొత్త కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్) 2004, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. అంతకుముందే వీరి నియామకం పూర్తయిందని స్పష్టం చేసింది.2004, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని తమకు వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి సహా మరో 1,738 మంది హైకోర్టులో 2019, 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘2003, నవంబర్ 13న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2004, జూన్ వరకల్లా వీరంతా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.కేవలం పరిపాలనాపరమైన ఆలస్యం కారణంగా 2005, నవంబర్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటప్పుడు సెప్టెంబర్‌లో వచ్చిన పింఛన్ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు. పిటిషనర్లంతా పాత పింఛన్‌కు అర్హులు’అని చెప్పారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషనర్లు పాత పింఛన్ పథకానికి అర్హులని, వారందరికీ ఆ ప్రయోజనాలందించాలని ఆదేశించారు. పాత పింఛన్ విధానంలో.. ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండా భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుంది. ఒకవేళ పెన్షన్‌దారుడు మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి కోత లేకుండా పూర్తి పింఛన్ వస్తుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయానికి చివరి నెల బేసిక్ వేతనంలో 50శాతాన్ని నెలసరి పింఛన్‌గా నిర్ధారిస్తారు. ఈ విధానంలో కరువు భత్యం(డీఏ), కరువు ఉపశమనం(డీఆర్), వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫార్సులుండేవి. కొత్త పింఛన్ విధానంలో... ఉద్యోగి వేతనంలోంచి నెలనెలా కొంత వెచ్చించాలి. చివరకు వచ్చే పింఛన్ చాలా తక్కువ. ఈ విధానంలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై 10 శాతం ఉద్యోగి, 10 శాతం ప్రభుత్వం నెలనెలా జమచేయాలి. ఈ మొత్తాన్ని ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసీ షేర్లలో పెడతారు. విరమణ పొందాక 60 శాతం ఒకేసారి ఇస్తారు. మిగతా 40 శాతాన్ని నెలవారీగా లెక్కగట్టి ఇస్తారు. -
ఆవాలు, నువ్వులు.. అక్కడక్కడే!
సాక్షి, హైదరాబా ద్: తెలంగాణలో ప్రధాన సంప్రదాయ పంటల సాగు తగ్గిపోతోంది. సోయాబీన్ మినహా పలు నూనె గింజల పంటల సాగు తగ్గుతుండగా కొన్ని దాదాపు కనుమరుగై పోతున్నాయి. వేరుశనగ, నువ్వులు, ఆముదం, ఆవాలు, సన్‌ఫ్లవర్, కుసుమ, వెర్రి నువ్వులు నామమాత్రంగానే సాగవుతున్నాయి. మరోవైపు పప్పు దినుసులదీ అదే పరిస్థితి కావడం గమనార్హం. రాష్టంలో ప్రతి ఏటా రైతులు కొన్ని పంటలనే సాగు చేస్తుండడం, సంప్రదాయ పంటలు కనుమరుగవుతుండడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పంటల మారి్పడి జరపాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. సులభంగా సాగు చేసే పంటల వైపే మొగ్గు చూపుతున్నారు.నువ్వులు, కుసుమ, ఆవాలు ఏవీ? సోయాబీన్ మినహా సంప్రదాయ వేరుశనగ, నువ్వులు, ఆముదం, ఆవాలు, సన్‌ఫ్లవర్ వంటి పంటలన్నీ కలిపినా 2 వేల ఎకరాల్లో కూడా లేకపోవడం రాష్ట్రంలో పంటల సాగు తీరును తేటతెల్లం చేస్తుంది. ఆవాలు, కుసుమ, వెర్రి నువ్వులు మొదలైన నూనె పంటలు ఏకంగా 1.12 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే కేవలం 57 ఎకరాల్లో మాత్రమే ఈ పంటలు సాగయ్యాయి.అంతంత మాత్రంగానే ఉలవలు, బొబ్బర్లురాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 7.92 లక్షల ఎకరాల్లో పప్పుదినుసు పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు సాగైంది కేవలం 4.86 లక్షల ఎకరాలే. అయితే అందులో కేవలం కంది, పెసర పంటలదే 60 శాతం వాటా. వాటి తరువాత స్థానంలో మినుములు ఉన్నాయి. అయితే ఈ పంటల విస్తీర్ణం తీసుకుంటే కంది పంట ఒక్కటే 4.21 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే దాదాపు 2.23 లక్షల ఎకరాలు లోటు సాగుగా చెప్పుకోవచ్చు. పెసర పంట 86 వేల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను కష్టంగా 50 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక మినుములు 15 వేల ఎకరాల్లో సాగవ్వగా, ఉలవలు 171 ఎకరాల్లో, బొబ్బర్లు, అనుములు 362 ఎకరాల్లో సాగయ్యాయి. తగ్గుతున్న వేరుశనగ వైభవం వేరుశనగ పంటకు పదేళ్ల క్రితం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రసిద్ధి. ఈ ప్రాంతంతో పాటు నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో ఈసారి ఇప్పటివరకు 1,227 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగవడం గమనార్హం. వేరుశనగతో పాటు నూనె గింజల పంటలు రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగయ్యాయి. నూనె పంటల కేటగిరీలో సోయాబీన్ ఒక్కటే రాష్ట్రంలో అత్యధికంగా 3.49 లక్షల ఎకరాల్లో సాగవుతోంది.సోయాబీన్ పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌లతో పాటు సంగారెడ్డి జిల్లాకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఇతర జిల్లాల్లో దాని ఆనవాళ్లు కూడా లేవు. రాష్ట్రం మొత్తం మీద నూనె గింజల పంటలు 3.51 లక్షల ఎకరాల్లో సాగువుతుంటే, అందులో సోయాబీన్ ఒక్కటే 3.49 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ వానాకాలం సీజన్లో నూనె పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.69 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అటు ఇటుగా అందులో సగం విస్తీర్ణంలో సోయాబీన్ పంట ఒక్కటే సాగవడం గమనార్హం. సంప్రదాయ పంటలను మింగేస్తున్న వరి, పత్తి దశాబ్ద కాలం క్రితం వరకు సంప్రదాయ పంటలకు నిలయమైన తెలంగాణ పల్లెలు ఇప్పుడు కేవలం వరి, పత్తి పంటలకే నిలయంగా మారాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో అత్యధికంగా వరి 60 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పటికే 20 లక్షల ఎకరాలు దాటింది. పత్తి ఈ సంవత్సరం 50 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే 43 లక్షల ఎకరాలు దాటింది.సాగునీటి సదుపాయం పెరగడంతో మిశ్రమ పంటలు సాగు చేసే ఉమ్మడి మహబూబ్‌నగర్ , మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు వరి సాగువైపు ఆకర్షితులయ్యారు. సాగునీటి సదుపాయం లేని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో లాభదాయకమనే ఉద్దేశంతో అధిక శాతం పత్తి పంటను సాగు చేస్తున్నారు. అలాగే డిమాండ్ ఎక్కువగా ఉండే సోయాబీన్, కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో పత్తి, వరితో పాటు మొక్కజొన్న, కంది పంటలు కలిపి ఏకంగా కోటి ఎకరాల్లో సాగవుతుండడంతో ప్రధాన సంప్రదాయ పంటలు తగ్గిపోతున్నాయి. -
ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ ‘బీసీ గర్జన’
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సభ ద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై త్వరలో బీఆర్ఎస్ బీసీ ప్రతినిధులం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు.తెలంగాణభవన్‌లో తలసాని అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్, బీజేపీ విధానాలపై చర్చించారు. అనంతరం మాజీమంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే, ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని తాము అసెంబ్లీ వేదికగా చెప్పామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఢిల్లీలో ధర్నాపేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలు పెట్టిందని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులకు బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు. ⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలవుతున్నదని మధుసూదనాచారి విమర్శించారు. బీసీలకు రక్షణ కవచంలా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ కుటిలనీతిని ఎండగడతామన్నారు. ⇒ ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రెండేసి అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మోసగించిందని గంగుల కమలాకర్ విమర్శించారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి మూడురోజుల పాటు ఢిల్లీలో ఉంటామని చెబుతున్న సీఎం, మంత్రులు ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఏం చేస్తారో చెప్పాలన్నారు. ⇒ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలను మోసగిస్తూ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో మొండిచేయి చూపుతోందని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ⇒ ప్రచారయావ మినహా బీసీ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. -
కాలుష్యరహితంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరానికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగరం నడిరోడ్డున (కోర్ సిటీ) ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం చెప్పారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పాటు నిర్మాణ రంగ వ్యర్థాలను ఇష్టారీతిన డంప్ చేయకుండా చూడాలని ఆదేశించారు.ఉద్దేశపూర్వకంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సది్వనియోగం చేసుకునేలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీవరేజీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలుగా వారసత్వ కట్టడాలు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న వారసత్వ కట్టడాలను సంరక్షించడంతో పాటు పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని సీఎం రేవంత్ సూచించారు. పాతబస్తీలో మెట్రో రైలు మార్గం పనులపైనా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్‌కు ప్రతీకగా గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, చారి్మనార్ తరహాలో ల్యాండ్ మార్క్‌ను నిర్మించాలని ఆదేశించారు. మీరాలం ట్యాంకు వద్ద అధునాతన హోటల్ నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్‌తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సూచించారు.సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు ఇలంబర్తి, టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిత్తల్, మెట్రో రైలు ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
శస్త్రచికిత్సలకు 3 నెలలపాటు ఎదురుచూపులు
హైదరాబాద్: అది ఆసియాలోనే పేరున్న ఆసుపత్రి.. నిష్ణాతులైన వైద్యులకు నిలయం.. శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి. కానీ, ఇటీవల వైద్యులు, ఫార్మసిస్టుల కొరత పీడిస్తోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం తీవ్రమైంది. శస్త్ర చికిత్సలకు కనీసం మూడు నెలలపాటు వేచి చూడాల్సిందే. ఇదీ కోఠి ఈఎన్టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రి పరిస్థితి. కొంతకాలంగా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, సిబ్బంది కొరత కారణంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నిష్ణాతులైన వైద్యులు ఇతర ఆసుపత్రులకు బదిలీ కావడంతో ఇక్కడ ప్రతినిత్యం జరిగే శస్త్రచికిత్సలకు తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రోజూ వెయ్యిమందికిపైగా ఓపీ రోగులుతెలంగాణ (Telangana) నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది రోగులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతారు. ఈ ఆసుపత్రికి ప్రతి రోజు వెయ్యి నుంచి 1300 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. 200 నుంచి 300 వరకు ఇన్ పేషంట్లు వివిధ యూనిట్లలో చికిత్సలు పొందుతుంటారు. ఇటీవల కాలంలో ఓపీ రోగులు పెరుగుతుండటంతో సరైన వైద్య సేవలు అందటంలేదు. బదిలీలు అయిన వైద్యుల స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడంతో ఈ ఆసుపత్రిలో వైద్యం అంతంత మాత్రమే ఉంది. తీవ్రంగా వైద్యుల కొరత.. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో మొత్తం ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను ఇద్దరు బదిలీకావడంతో ముగ్గురే సేవలందిస్తున్నారు. 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకుగాను నలుగురు మాత్రమే ఉన్నారు. వైద్యుల కొరత కారణంగా రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు సకాలంలో అందడంలేదు. నెలలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఫలితం శూన్యమని చెప్పవచ్చు. కేవలం ఒక ఫార్మసిస్టు మాత్రమే వందల మంది రోగులకు మందులు అందిస్తున్నారు. దీంతో ఆ ఫార్మసిస్టుపై పనిభారం ఎక్కువై ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్మసిస్టును వెంటనే భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. మందులతోనే సరి..వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఔట్ పేషెంటు రోగులకు పీజీ వైద్యులు కేవలం మందులు రాసి సరిపెడుతున్నారు. ఒక్కప్పుడు ఇదే ఆసుపత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరిగేవి. ఇప్పుడు శస్త్రచికిత్సలకు కనీసం మూడు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు సరైన సౌకర్యాలు సైతం లేకపోవడంతో ఆసుపత్రి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆసుపత్రికి సరైన వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బందిని సమకూర్చాలని పలువురు రోగులు కోరుతున్నారు.చదవండి: హైదరాబాద్‌లో చిరుత పులి.. పక్షం రోజులు దాటినా దొరకని జాడ -
నన్ను బీజేపీ ఎమ్మెల్యే అనొచ్చు: రాజాసింగ్
హైదరాబాద్: బీజేపీకి గుడ్‌బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదని.. కాబట్టి మూడేళ్లు ఎమ్మెల్యే తానేనని అంటున్నారాయన. మంగళవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడుతూ..నేను పార్టీకి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. గోషామహల్లో ఉప ఎన్నిక రాదు. కాబట్టి నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు అని అన్నారాయన. అలాగే.. పార్టీ పరిణామాలపైనా ఆయన స్పందించారు. మా పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారు. నా తప్పులు కూడా ఉన్నాయి.. అలాగే సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. మోదీ, అమిత్ షా ఫోన్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.అలాగే మీడియా లీకులు ఇస్తున్నారని మా వాళ్లే ఢిల్లీకి పిర్యాదు చేశారు. ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతో నా రాజీనామాకు ఆమోదం తెలిపారు. బీజేపీ నా ఇల్లు. రాజాసింగ్ రా అంటే మళ్లీ వెళ్తా’’ అని రాజాసింగ్ అన్నారు. అంతకుముందు.. తాను తిరిగి బీజేపీ చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ వచ్చిన ప్రచారాన్ని సోమవారం ఆయన ఖండించారు. నా రాజీనామా వెనుక ఏ కుట్రా లేదు. ఎవరితో పార్టీకి నష్టం జరిగిందో అధిష్ఠానానికి చెప్పాలనుకున్నా. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా నాకు ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ చేసేంత పెద్దవాడిని నేను కాదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాంటే ఒక ఫైటర్ కావాలి అని రాజాసింగ్ అన్నారు.బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ జూన్ 30వ తేదీన రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
‘మీరు నన్నెలా అరెస్ట్ చేస్తారు?’.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత
సాక్షి,హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో అయితే తెలంగాణ పోలీసులు తనని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిందితులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు డాక్టర్ అట్లూరి నమ్రత తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలనుండి ఒక్క ఫిర్యాదు కూడా లేదు. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణ పోలీసులు నాపై కేసులు ఎలా నమోదు చేసి.. అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో చిరుత పులి.. స్థావరాలను మారుస్తూ..
హైదరాబాద్ నగరవాసులను చిరుత పులి భయపెడుతోంది. అభయారణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చి.. దారి తెలియక అటూ ఇటూ స్థావరాలను మారుస్తూ శివారు ప్రాంతాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటి వరకు రాజేంద్రనగర్ పరిధిలోని అటవీ, పోలీసు శాఖల క్యాంపులలో ఉన్న చిరుతపులి సోమవారం ఏకంగా మిలిటరీ కేంద్రంలోకి దూరింది. దాన్ని పట్టుకునేందుకు పక్షం రోజులుగా అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు.మొయినాబాద్ మండలం, అజీజ్‌నగర్ గ్రామంలోకి వెళ్లే పాత రోడ్డులో ఉన్న మూలికావనంలో ఈ నెల 9వ తేదీన చిరుతపులి (Leopard) జాడ కనిపించింది. అక్కడి నుంచి ఈ నెల 20వ తేదీన పక్కనే ఉన్న గండిపేట మండలం, మంచిరేవులలోని పోలీస్ గ్రేహౌండ్స్‌లోకి వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ దాన్ని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి సీసీ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయం సమయంలో గ్రేహౌండ్స్‌లో ఓ రోడ్డు దాటుతూ సీసీ కెమరాలో చిక్కింది. ఆ మరుసటి రోజే గ్రే హౌండ్స్ వెనకాల ఉన్న ఓ విల్లా ప్రాజెక్ట్‌లో నివాసితులకు ఓ రాతి గుండుపై కూర్చుని కనిపించింది. ఈ నెల 24వ తేదీన తెల్లవారు జామున ఏకంగా ఔటర్‌రింగ్ రోడ్డు (Outer Ring Road) దాటి సర్వీసు రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన ట్రెక్ పార్క్‌లోకి చేరింది. దాంతో అక్కడా సీసీ కెమరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మరో మారు ప్రయాణం.. మొయినాబాద్ మండలంలోని మూలికా వనం నుంచి మొదలయిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారు జామున రాందేవ్‌గూడలోని మిలట్రీ ఏరియాలోని రోడ్డు దాటి శిక్షణా కేంద్రంలోకి వెల్లింది. అటుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న చిరుతను చూసి 100 నెంబర్‌కు ఫోన్ చేశాడు. దాంతో ఇప్పటి వరకు అటవీశాఖ ట్రెక్‌పార్కులో ఉందనుకున్న చిరుత సోమవారం రంగారెడ్డి జిల్లా పరిధి దాటి హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో మిలట్రీ వారు అలర్ట్ అయి దాన్ని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. చదవండి: హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్భయాందోళనలో ప్రజలు.. తమ గ్రామాలకు పక్కనే చిరుతపులి సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహింబాగ్, రాందేవ్‌గూడల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.తిరిగి రావాల్సిందే.. మొయినాబాద్ మండల పరిధిలో ఆనవాళ్లు కనిపించిన చిరుతను పట్టుకునేందుకు పక్షం రోజులుగా ప్రయత్నిస్తునే ఉన్నాం. చాలాచోట్ల సీసీ కెమరాలు, బోన్లు ఏర్పాటు చేశాం. సోమవారం తెల్లవారుజామున రాందేవ్‌గూడలోని మిలట్రీ ఏరియాలో రోడ్డు దాటి మిలట్రీ క్యాంప్‌లోకి వెళ్లినట్టు సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దానికి అక్కడ అనువైన ప్రాంతం లేదు. కాబట్టి అది తిరిగి ట్రెక్ పార్క్, గ్రేహౌండ్స్ వైపే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి. – లక్ష్మణ్, అటవీ రేంజ్ అధికారి, చిలుకూరు రేంజ్ -
పెళ్లి అయిన రెండు నెలలకే జీవితం తలకిందులు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నెల క్రితం సిగాచీ పరిశ్రమ పేలుడు దుర్ఘటనలో మరణించిన కారి్మకుల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కుటుంబాన్ని పోషించేవారిని కోల్పోయిన ఈ బాధితులకు ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా పరిహారం అందలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జూన్ 30న జరిగిన ఘోర ప్రమాదంలో 54 మంది మరణించారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు కూడా లభించలేదు. పేలుడు ధాటికి వారి శవాలు కాలిబూడిదైపోయి ఉంటాయని అధికారులు నిర్ధారించి, వారిని కూడా మృతుల జాబితాలో చేర్చారు. 46 మంది మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల్లో ఈ మొత్తాన్ని అందజేస్తామని సిగాచీ పరిశ్రమ యాజమాన్యం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నామమాత్రం పరిహారంతో సరి.. ఆచూకీ లభించని 8 మంది కుటుంబాలకు ఈ నెల 9న రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మరణించిన 46 మందిలో 15 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలినవారికి ఇంతవరకు పరిహారం అందించలేదు. ప్రమాదం జరిగి రేపటికి నెల అవుతుంది. ఇప్పటికీ మృతులకు పూర్తి స్థాయిలో మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేదు. మృతదేహాలు లభించిన 46 మందిలో 38 మందికే డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆచూకీ లభించకుండా పోయిన వారికి డెత్ సరి్టఫికేట్ జారీ చేయడంలో నిబంధనలు అడ్డు వస్తున్నాయి. మరోవైపు కొందరు బాధితులకు పోలీసు పంచనామా కాపీలు కూడా రాకపోవడంతో ఇన్సూరెన్స్ వంటివి క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలకే జీవితం తలకిందులు.. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాకు చెందిన ఈ మహిళ పేరు సంజూదేవి. ఈమె భర్త చోటేలాల్ సిగాచీ దుర్ఘటనలో మరణించాడు. రెండు నెలల క్రితమే పెళ్లి అయిన సంజూదేవి భర్తను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నెల రోజులైనా తనకు ఎక్స్‌గ్రేషియా డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొడుకు లేడు.. పరిహారం లేదు ఈ వ్యక్తి పేరు రాందాస్. ఆయన కుమారుడు జస్టిన్ సిగాచీ పేలుడు ఘటనలో కనిపించకుండా పోయా డు. జస్టిన్‌కు ఒక చెల్లి, ఒక అక్క ఉన్నారు. జస్టిన్ పనిచేస్తేనే ఈ కుటుంబానికి ఇల్లు గడిచేది. ఇప్పుడు జస్టిన్ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి తమను ఆదుకోవాలని రాందాస్ కన్నీరు మున్నీరవుతున్నాడు. ఉద్యోగమైనా ఇప్పించండి.. నా భార్య రుక్సానాఖతుం సిగాచీ పేలుడులో మృతి చెందింది. ఆర్థిక సహాయం రూ.పది లక్షల చెక్కును అందించారు. మిగతాది ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. వెంటనే పరిహారం చెల్లించాలి. ఉద్యోగ అవకాశమైనా కలి్పంచాలి. – మెనుద్దీన్‌ఖాన్, బిహార్ రెండురోజుల్లో మళ్లీ పరిహారం పంపిణీ చేస్తాం.. 15 కుటుంబాలకు ఇప్పటికే రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేశాం. మిగిలిన వారికి కూడా రెండు రోజుల్లో ఇస్తాం. ఈ వారంలోగా ఒక్కొక్కరికి మొత్తం రూ.25 లక్షల వరకు అందేలా చూస్తాం. 46 మందిలో 38 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చాం. ఎనిమిది మందికి పెండింగ్‌లో ఉన్నాయి. – బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, సంగారెడ్డి. -
తేజేశ్వర్ హత్య కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులైన ఏ–1 తిరుమలరావు, ఏ–2 ఐశ్వర్య అలియాస్ సహస్రను గద్వాల కోర్టు అనుమతితో ఈ నెల 26న రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. గడువు ముగియడంతో సోమవారం కోర్టులో తిరిగి హాజరుపరిచారు. దీంతో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల విచారణలో నిందితులు పొంతనలేని సమాధానాలతో కేసు దర్యాప్తును గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేశారని గద్వాల సీఐ శ్రీను పేర్కొన్నారు. అందువల్ల వారిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామన్నారు. -
అలిగిన మంత్రి కోమటిరెడ్డి.. ఉత్తమ్‌పై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఉదయం 10 గంటల వరకు రాలేదు. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్టుకు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో తన పర్యటన రద్దు చేసుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచే అలిగి వెళ్లిపోయారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్‌కు హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ వెళ్లిపోయారు. -
Hyderabad: అత్తను నరికి చంపిన అల్లుడు
మద్దూరు (హుస్నాబాద్): అల్లుడు వేట కొడవలితో అత్తను నరికి చంపాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ముర్మాముల గ్రామ శివారు బంజెరలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ (55)కు భర్త యాదగిరి, కుమార్తె భవాని ఉన్నారు. భవానిని ఎనిమిదేళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ, భర్త యాదగిరి, కుమార్తె భవాని, అల్లుడు మహేశ్‌తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వజ్రమ్మ, కూతురు, అల్లుడి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఈనెల 22న స్వగ్రామమైన బంజెరకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానిని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేశ్ తన తమ్ముడైన హరీశ్‌ను వెంటబెట్టుకుని బైక్‌పై మధ్యాహ్నం బంజెరకు వెళ్లారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేశ్, హరీశ్ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సీఐ కొండ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్, నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
తెరుచుకున్న సాగర్ గేట్లు.. క్రస్ట్ గేట్లు ఎత్తిన మంత్రులు
సాక్షి, నల్గొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇవాళ ఉదయం (మంగళవారం) మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాగార్జునసాగర్ గేట్లను పైఎత్తి వరద నీటిని విడుదల చేశారు.కాగా, సోమవారం శ్రీశైలం జలాశయానికి మొత్తం 2,31,612 క్యూసెక్కుల వరద వస్తుండగా రాత్రి 10 గంటలకు ఐదు గేట్లను ఒక్కోటీ 10 అడుగుల మేర పైకెత్తి మొత్తం 2,01,229 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.8 అడుగుల వద్ద 203.4290 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 584.41 అడుగులకు చేరుకుంది.అలాగే గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 295.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు విడుదల చేస్తుండగా.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 5,394 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటోంది. ఎడమ ప్రధాన కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల అవసరాలకు మరో 6,634 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
‘సరస్వతీ’ షేర్ల వ్యవహారం.. వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్
సాక్షి, హైదరాబాద్: సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) హైదరాబాద్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ కోరారాయన. జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘గిఫ్ట్’ పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించిందన్నారు. పిటిషన్లపై తుది తీర్పు వెలువడేవరకు బదలాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ తదితరులు కోరారు. వైఎస్ జగన్ పిటిషన్‌పై పది నెలలపాటు విచారణ జరిగింది. ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పురీ విచారణ జరిపి రెండు వారాల కిందట తీర్పు రిజర్వ్ చేశారు. చివరకు.. జగన్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ ఇవాళ తీర్పు వెల్లడించారు. -
జూబ్లీహిల్స్ టికెట్.. బయటివాళ్లకు ఇవ్వబోం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థులు ఎవరనేదానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్‌కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని మంగళవారం అన్నారు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ, జూబ్లీహిల్స్ టికెట్ స్థానికంగా పని చేసిన వాళ్లకే ఉంటుంది. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతేకాని బయటి నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగబోదు అని అన్నారాయన. జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆరు నెలల లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, 2025 డిసెంబర్‌లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్‌లో విడుదలై.. అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంతదాకా అభ్యర్థులను ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సతీమణి సునీత పేరు గతకొంతకాలంగా ప్రచారంలో వినిపిస్తోంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే.. పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అజహారుద్దీన్ పోటీ చేసి ఓడారు. అయితే ఈసారి తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారాయన. హస్తం పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్నందున స్వతంత్రంగా పోటీ చేయడమా? లేదంటే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందా? అనే దానిపై ఎంఐఎం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్లో దినేశ్‌తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు. -
ఆ ఆస్తులన్నీ నా కుమారుడివే..?
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావు.. ఏసీబీ కస్టడీలో పలు కీలక వివరాలు వెల్లడించారు. చాలావరకు ఆస్తులు తన కుమారుడి సంపాదనతోనే కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమార్జనపైనే ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీశారు. కోర్టు అనుమతితో ఈనెల 23 నుంచి ఏసీబీ అధికారులు మురళీధర్‌రావును కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారంతో ఆయన కస్టడీ ముగిసింది. కాగా, ఈనెల 15న ఏసీబీ అధికారులు మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం తెలిసిందే. ఏకకాలంలో హైదరాబాద్‌లోని మురళీధర్ రావు ఇంటితో పాటు.. కరీంనగర్, జహీరాబాద్ సహా మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. స్థిర, చరాస్తులతో పాటు పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన కీలకపత్రాలను ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. వీటితో పాటు బినామీల పేరుతో ఉన్న ఆస్తులను గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో మురళీధర్ రావు ఆస్తులపైనే ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. మొదట ఏసీబీ అధికారులకు సహకరించకపోయినా.. వరుసగా ఆస్తుల పత్రాలు, ఇతర కీలక పత్రాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఐదు రోజుల విచారణలో భాగంగా సేకరించిన సమాచారం ఆధారంగా.. కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
31 నుంచి మీనాక్షి పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున ఆరు రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 31వ తేదీన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండిల మీదుగా ఆగస్టు 5వ తేదీన వర్ధన్నపేట వరకు సాగనుంది. యాత్రలో భాగంగా ప్రతిరోజూ శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ద్విముఖ వ్యూహం మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్‌ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జైబాపూ, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జైబాపూ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్దేశించింది.ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఉదయాన్నే శ్రమదానం చేయడం, ఆ తర్వాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావడం, అనంతరం నడక ప్రారంభించి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి మాట్లాడనున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర: టీఆర్ఆర్ సోమవారం గాందీభవన్‌లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. జూలై 31 పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌లో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌లతో పాటు పీసీసీ నేతలు కేతూరి వెంకటేశ్, జూలూరు ధనలక్ష్మి, పులి అనిల్‌కుమార్‌లతో పాదయాత్ర సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ పీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు నేతలతో కీలక భేటీలు మీనాక్షి నటరాజన్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాల వారీగా టీపీసీసీ నియమించిన ఇన్‌చార్జ్‌లతో ఆమె సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రతి జిల్లా నాయకత్వంతో విడివిడిగా సమావేశం కానున్న మీనాక్షి.. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి జరుగుతున్న కసరత్తుపై చర్చిస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. -
బీసీ కోటాపై ఢిల్లీకి..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 6న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని, జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించింది.7న ముఖ్యమంత్రితో పాటు మంత్రు లు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున బీసీల రిజర్వేషన్ల బిల్లు ల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు ఆగస్టు 5న పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని తీర్మానించింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. బీసీ మంత్రుల విలేకరుల సమావేశం.. బీసీలకు స్థానిక సంస్థల్లో అలాగే విద్యా, ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రతిపాదించిన రెండు బిల్లులను గత మార్చి 17న రాష్ట్ర శాసనసభ, మార్చి 18న శాసనమండలి ఆమోదించాయి. ఈ రెండు బిల్లులను మార్చి 22న రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించగా, ఆయన మార్చి 30న రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే రాష్ట్రపతి వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు.మరోవైపు 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఇటీవల ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు.. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలంటూ గడువు విధించింది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులతో స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపడి ఉండడంతో వాటి సాధన కోసం ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెంచాలని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కాగా కేబినెట్ భేటీ తర్వాత..బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సహచర బీసీ మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి క్లుప్తంగా వివరాలు వెల్లడించారు. కేసీఆర్ తీరని ద్రోహం చేశారు ‘లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలతో పాటు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్తారు. తెలంగాణలోని బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు కూడా ఢిల్లీకి తరలిరావాలి. గతంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనను 2018లో తెచి్చన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచి బీసీలకు తీరని ద్రోహం చేశారు. ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసేందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని గత జూలై 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి, 14న గవర్నర్ ఆమోదం కోసం పంపించాం.ఆ ఆర్డినెన్స్ ఫైలును సైతం రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఆర్డినెన్స్‌ను తక్షణమే ఆమోదించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయటంతో పాటు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది..’అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.రవాణా శాఖ చెక్ పోస్టులు రద్దు రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఇలాంటివి మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. అయితే జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్ పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇకపై సిబ్బందితో కాకుండా వాహన్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. అన్నిచోట్లా మైక్రో బ్రూవరీస్ కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేతలు సహకరించాలి ‘బిల్లులు, ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదించేలా రాష్ట్రంలోని కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, అరవింద్, ఈటల రాజేందర్, కృష్ణయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయతి్నంచాలి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా బిల్లులకు ఆమోదముద్ర పడేలా సహకరించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇందిరా సాహ్నీ కేసులో ఇచి్చన తీర్పులోనే.. శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఆ పరిమితి దాటవచ్చని కూడా పేర్కొంది. పక్కాగా నిర్వహించిన సర్వే ఆధారంగానే మేము బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ కోటాతోనే 50 శాతం క్యాప్ పోయింది. ఇప్పుడు 64 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నాయకత్వం వహించి ఢిల్లీకి రావాలి. ఆయన ఈ విషయంలో మౌనం వీడాలి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే మంచిది. లేకుంటే సామ, భేద, దాన దండోపాయాలను ఉపయోగిస్తాం..’అని మంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే..!⇒ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో విస్తృత చర్చ ⇒ ఆగస్టు 7 వరకు పోరాటం.. ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ⇒ పట్టణ గృహ నిర్మాణ పాలసీపై కూడా చర్చించిన మంత్రిమండలి ⇒ నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని, ప్రతిపక్షాలు చేస్తున్న దు్రష్పచారాన్ని బీసీ వర్గాల ప్రజలు విశ్వసించడం లేదని అభిప్రాయపడింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, మంత్రిమండలి ఆమోదించిన ఆర్డినెన్స్ అమల్లోకి రావడానికి ఉన్న అవకాశాలపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది. హైకోర్టును మరింత గడువు కోరే యోచన జాతీయ స్థాయిలోని రాజకీయ పారీ్టల సహకారం తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించిన మంత్రివర్గం.. ఆగస్టు 7వ తేదీ తర్వాత మరింత స్పష్టంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచి్చన అనంతరం అవసరమైతే 10వ తేదీ తర్వాత మరోమారు మంత్రివర్గం సమావేశమై చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. కేంద్రం నుంచి వచ్చే స్పందనను బట్టి స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టును మరికొంత గడువు కోరాలనే చర్చ కూడా వచి్చనట్టు సమాచారం. హౌసింగ్ పాలసీ ఎలా? రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాల్సిన హౌసింగ్ పాలసీ గురించి కూడా మంత్రిమండలి చర్చించింది. ఈ విషయంలో ఎదురవుతున్న సమస్యల గురించి మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో జీ ప్లస్ 3 విధానం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా చర్చించిన కేబినెట్.. ఈ పాలసీ గురించి స్పష్టమైన నోట్ తయారు చేయాలని సంబంధిత ఆధికారులను ఆదేశించింది. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా కేబినెట్ చర్చించింది. బుగ్గమాదారం, ముక్తేశ్వరపురం లిఫ్టులతో పాటు మరి కొన్నింటికి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. -
త్వరలో ఒకటే స్టాంపు పేపర్!
సాక్షి, హైదరాబాద్: సరికొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లలో రూ.20, రూ.50 విలువగల పేపర్లను రద్దుచేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల (ఎన్‌జేఎస్) విధానంతోపాటు అనేక అంశాల్లో మార్పులు చేస్తూ కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కొత్త విధానంలో స్టాంపు డ్యూటీ విధింపు, మినహాయింపుల్లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, చర్చల అనంతరం దీనికి తుదిరూపు ఇస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. లాభం లేదు.. భారమే అధికం రాష్ట్రంలో ప్రస్తుతం రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన స్టాంపు వెండార్లతోపాటు రిజి్రస్టేషన్ల శాఖ వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. రూ.50 వేల విలువ వరకు జరిగే లావాదేవీలకు రూ.20.. రూ.లక్ష లోపు లావాదేవీలకు రూ.50.. రూ.లక్ష కంటే ఎక్కువ విలువ ఉండే లావాదేవీలకు రూ.200 చొప్పున (రూ.100 స్టాంపు పేపర్లు రెండు) స్టాంపు పేపర్లను ఉపయోగిస్తున్నారు. పలు రకాల అఫిడవిట్లు, డిక్లరేషన్లు, ఒప్పంద పత్రాలు, సేల్డీడ్లు, కంపెనీల మధ్య ఒప్పందాలు తదితర అనేక లావాదేవీల్లో వీటిని ఉపయోగిస్తుంటారు.ప్రస్తుతం భౌతికమైన స్టాంపు పేపర్లతోపాటు ఆన్లైన్ ఫార్మాట్ (ఫ్రాంకింగ్)లో ఈ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నాసిక్‌లోని ముద్రణాలయం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వీటి నిర్వహణ, సీలింగ్, పేపర్, రవాణా లాంటి ఖర్చులు కలిపితే రూ.20, రూ.50 స్టాంపులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి వాటి విలువ కంటే ఎక్కువ ఖర్చవుతోందని, స్టాంపు వెండార్లకు ఇచ్చే 5 శాతం కమీషన్ కలిపితే వీటి అమ్మకాల వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోందని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో రూ.20, రూ.50 స్టాంపు పేపర్లను రద్దు చేయాలని, రూ.100 విలువైన పేపర్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా స్టాంపు పేపర్ల సరఫరా నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుని ఫ్రాంకింగ్ విధానంలో మాత్రమే ముందుకెళ్లేలా కొత్త పాలసీలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతి లావాదేవీకి రూ.100 స్టాంపు పేపర్లు కొనుగోలు చేయడం విద్యార్థులు, రైతులు వంటి వర్గాలకు భారమవుతుందని భావించి.. ఆయా వర్గాలు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కార్యక్రమాల్లో ఇచ్చే అఫిడవిట్లు, డిక్లరేషన్లను మాత్రం ఉచితంగా ఇచ్చేలా పాలసీలో మార్పులు తేవాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు.కొందరికి మినహాయింపు: స్టాంపు డ్యూటీ విషయంలోనూ కొత్త పాలసీలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు లేదా ఆస్తులను మహిళల పేరిట రిజి్రస్టేషన్ చేస్తే స్టాంపు డ్యూటీలో 1 శాతం మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది. కాంట్రాక్టు పనులకు ప్రస్తుతం గరిష్టంగా రూ.200 స్టాంపు డ్యూటీ విధిస్తుండగా ఇకపై ‘బూట్’ పద్ధతిలో నిర్వహించే కాంట్రాక్టు పనులకు స్టాంపు డ్యూటీని విధించాలని, మొత్తం పని విలువలో 0.5 శాతాన్ని డ్యూటీ కింద వసూలు చేయాలని, ఈ మొత్తం గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఉండేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 3న వీరి పేర్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. దీంతో వీరు అదనపు న్యాయమూర్తులుగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కొత్త జడ్జీలుగా నియమితులైన నలుగురు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మతో కలసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం హైకోర్టులో 26 (సీజేతో కలిపి) మంది న్యాయమూర్తులున్నారు. ఈ నలుగురి ప్రమాణం స్వీకారం తర్వాత ఆ సంఖ్య 30కి చేరనుంది. ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉంటాయి. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. ఈ బదిలీలకు కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు. అలాగే తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. సుద్దాల చలపతిరావు.. చలపతిరావు 1971, జూన్ 25న జనగాంలో జన్మించారు. 1998, మార్చి 26న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్‌గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసులు వాదించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా 2022 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వాకిటి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి 1970, సెపె్టంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. బీకామ్ ఎల్ఎల్బీ పూర్తిచేసి 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది ఎ.అనంతసేన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ లా విభాగాల్లో సమర్థుడిగా పేరు పొందారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సిల్ విధులు నిర్వహిస్తున్నారు. గౌస్ మీరా మొహియుద్దీన్.. గౌస్ 1969, జూలై 15న జన్మించారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందినవారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్ఎంటీ మేనేజర్‌గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు. గాడి ప్రవీణ్‌కుమార్... ప్రవీణ్‌కుమార్ 1971, ఆగస్టు 28న జన్మించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్ఎం చదివారు. 1998, నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగం, సర్విస్ మ్యాటర్, లేబర్ లా, క్రిమినల్ లా.. వంటి పలు విభాగాల్లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
ఆగస్ట్ 6న ఢిల్లీకి సీఎం బృందం.. ‘బీసీ బిల్లు’పై ధర్నా!
హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) ఆరో తేదీన సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీకి పయనం కానుంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో తేల్చుకోవడానికి సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించేందుకు గాను బీసీ బిల్లును తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోద ముద్ర కావాలి. ఈ క్రమంలోనే ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ ధర్నా చేయాలని తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ రోజు(సోమవారం. జూలై 28) జరిగిన కేబినెట్ భేటీలో బీసీ బిల్లు అంశానికి సంబంధించి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ,ఎమ్మెల్యే లు ,ఎంపీలు ఢిల్లీ వెళ్లి బీసీ బిల్లుపై డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ ‘ ఈడబ్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం క్యాప్ ఎప్పుడో ఎత్తేసారు. ఆర్ కృష్ణయ్య మౌనం వీడాలి... మాతో కలసి రావాలి. ఇండీ కూటమి పార్టీలతో కలసి పోరాటం చేస్తాం. రిజర్వేషన్ల కోసం సామ ధాన దండన ఉపయోగిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లలో ఉన్న ముస్లింలను ఎందుకు తొలగించడం లేదు. అక్కడ తొలగించి మమ్మల్ని అడగాలి. బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వని బీజేపీకి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’ అని మండిపడ్డారు. -
నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌పై కేసు
సాక్షి,హైదరాబాద్: నిమ్స్ డిప్యూటీ సూపరిటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశారు. స్థలం పేరుతో నిమ్స్ డిప్యూటీ సూపరీడెంట్ రూ.50 లక్షలు కాజేశారు. కోర్టు సిఫారసుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ భాస్కర్‌పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలున్నాయి.తనకి గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడి ఉందని బాధితుడని లక్ష్మీ భాస్కర్ బెదిరింపులకు గురిచేశారు. ఈక్రమంలో లక్ష్మీ భాస్కర్‌తో పాటు ఆయనకు సహకరించిన మరికొందరి పైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు
సాక్షి, హైదరాబాద్: రైతుల, వ్యాపారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా, పండ్ల మార్కెట్ ఏర్పాటు అతీగతీలేదు. నాయకులు హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇంకా ప్రభుత్వ ఆమోదముద్రకు నోచుకోలేదు. ఇదీ కోహెడలో పండ్ల మార్కెట్ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని కోహెడ్‌లో పండ్ల మార్కెట్ నిర్మిస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి కంప్యూటర్ గ్రాఫిక్ చిత్రాల్లో మెరుస్తోందే తప్ప ఆచరణలో రూపుదిద్దుకోవడంలేదు. కనీసం భూమిపూజకు కూడా నోచుకోలేదు. డీపీఆర్‌లో మార్పుల కారణంగా ఈ వ్యవహారం గజిబిజిగా మారింది. తొలుత ఫ్రూట్ మార్కెట్ అని, ఆనక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పూలు, పండ్లు, కూరగాయల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని అధికారులు చెబుతూ వచ్చారు. తాజాగా గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌గా పేరు మార్చారు. రూ.399 కోట్ల నుంచి రూ.2,900 కోట్లకు.. గడ్డిఅన్నారం (Gaddi Annaram) పండ్ల మార్కెట్‌ను కొత్తపేట నుంచి కోహెడకు తరలించే ప్రతిపాదనల్లో నిర్మాణ విస్తీర్ణం, అంచనా వ్యయం ఏటేటా పెరుగుతున్నాయి. తొలుత రూ.399 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా ఈ మొత్తం రూ.2,,900 కోట్లకు చేరింది. తొలి దశలో (2021) ప్రతిపాదనలు సిద్ధం చేసినపుడు 178 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం సుమారుగా రూ.399 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్‌లో అనేక దఫాలు మార్పులు చేస్తూ భూసేకరణ 199 ఎకరాలకు చేరింది. నిర్మాణ వ్యయం అంచనా సుమారు రూ.2,900 కోట్లకు పెరిగింది.కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌ను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ)కి 167 ఎకరాలు రూ.2,044 కోట్లు, మరో 31 ఎకరాల్లో రూ.856 కోట్లతో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈపీసీలో వేలం హాళ్లు, షెడ్లు, విదేశీ ఫ్లాగ్షిప్ పెవిలియన్, రిటైల్ జోన్లు, మినీ డేటా సెంటర్లు, కార్మిక విశ్రాంతి గదులు, పార్కింగ్, అంతర్గత రహదారులు, టవర్ ఆఫ్ ఎక్సలెన్స్, శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్ సెంటర్లు, వంటివి నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది. దీనికి అధికారికంగా ప్రభుత్వ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అనంతరం టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి మరికొన్నేళ్లు వేచిచూడాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.ప్రత్యేక ఆకర్షణగా టవర్ ఆఫ్ ఎక్సలెన్స్.. కోహెడ మార్కెట్లో టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంద అడుగుల ఎత్తులో, సుమారు 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. హై స్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్‌లు, హెలీప్యాడ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు అంతస్తులు జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారని పేర్కొంటున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌలిక వసతులు అంతంతగానే ఉన్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కోహెడ మార్కెట్ (Koheda Market) నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్ -
‘సృష్టి’ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్
హైదరాబాద్: సృష్టి పెర్టిలిటీ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయ్యింది. సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీలో విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు.2016లో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్న మెడికల్ కౌన్సిల్ ఐదేళ్లు రద్దు చేయగా, 2021లో TGMC కి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారని డాక్టర్ నమ్రత. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటంతో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్న పునరుద్ధరించలేదన్నారు. అయితే అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్‌ను నడుపుతూ దొరికిపోవడంతో సదరు సెంటర్ పై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.కాగా, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్దారణలోతేలింది. eదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు.ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. అక్రమ బాగోతం ఎలా వెలుగుచూసిందంటే..!పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు
సాక్షి,హైదరాబాద్: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తాజాగా ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతోన్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తారామతి మీదుగా మూసీ నది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇటీవల మంచిరేవుల గ్రేహౌండ్స్‌లోనూ చిరుత ప్రత్యక్షమైంది. 4 బోన్లు, ట్రాప్ కెమెరాలు పెట్టిన చిరుత చిక్కలేదు.ఇక సిటీలోపలికి చిరుత రావడం భయాందోళనకు గురిచేస్తోంది. -
‘లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేస్తాం’
హైదరాబాద్: చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేసేది ప్రధాని నరేంద్ర మోదీనేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మోదీనేనని ఆయన తెలిపారు. ఈరోజు(సోమవారం, జూలై 28) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశారు.. కానీ నివేదిక బయటపెట్టలేదు, తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారు. కేసీఆర్ కూడా 52 శాతం మంది కంటే ఎక్కువగా ఉన్నారని అసెంబ్లీలో నోరుజారారు. కానీ ఆయన 38 శాతం ఉన్నారని చెప్పాలని చూసి దొరికిపోయారు. ఇక కాంగ్రెస్ కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు. ఎలా పూర్తి చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయటపెట్టలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాం. 42 శాతం పక్కాగా ఓన్లీ బీసీలకే ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’ అని రాంచందర్ రావు విమర్శించారు. -
‘డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. సీఎంపై సిట్‌కు ఫిర్యాదు చేశా’
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారాయన. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈరోజు సాక్షిగా వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను. డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లో సైతం ముఖ్యమంత్రి టాపింగ్ చేయిస్తున్నారు.గతంలో నా ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. అదే విషయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫోన్ టాపింగ్ పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ పాల్పడుతోంది అని ఆరోపించారాయన. -
ఫేక్ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. ఏకంగా 3 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల కుంభకోణం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్పురోహిత్లు ముగ్గురని అరెస్ట్ చేశారు. వీరంతా ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు తెలిపారు. యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్‌బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు. నిందితులను మీర్‌చౌక్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. యాపిల్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. -
Hyderabad: బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి యువకులు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఓ యువకుడు బ్యాండ్మింటన్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. నాగోల్ స్టేడియంలో బ్యాండ్మింటన్ ఆడుతున్న గుండ్ల రాకేష్ అనే యువకుడు(25).. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వ్యక్తులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతడు రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు. కాగా అతడు ప్రైవేట్ కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. -
మాజీ ప్రియుడి టార్చర్ భరించలేక..
బంజారాహిల్స్: యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణానగర్ బీ–బ్లాక్‌లో నివసించే రేణుక కొంతకాలం క్రితం చల్లా వినయ్‌కుమార్‌ను ప్రేమించింది. సదరు యువకుడు జులాయిగా తిరుగుతుండడంతో పాటు డ్రగ్స్‌కు బానిస కావడంతో యువతి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు ఈనెల 9న యువతి పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి తీవ్రంగా కొట్టి ఆమె ద్విచక్రవాహనంపైనే బలవంతంగా ఎక్కించుకుని మద్యం మత్తులో వస్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో వారు వాహనాన్ని సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన యువతిని ద్విచక్ర వాహనం ఏదని తల్లి ప్రశ్నించగా మెకానిక్కు ఇచ్చానని చెప్పింది. అయితే తల్లికి అబద్ధం చెప్పానన్న బాధను తట్టుకోలేక ఈనెల 10న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు వినయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వినయ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతి ద్విచక్రవాహనం కూడా తన బాబాయిది కావడంతో పాటు పోలీసులు సీజ్ చేయడం, డ్రంకన్ డ్రైవ్‌లో వినయ్‌కుమార్ దొరకడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. ఎంపీ స్టిక్కర్ వాహనం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, రేవ్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రేవ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా అశోక్ ఉన్నారు.వివరాల ప్రకారం.. ఆదివారం కొండాపూర్ SV సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బీ టీమ్ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.అయితే, వీకెండ్ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు తేల్చారు. రేవ్ పార్టీ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేసిన పోలీసులు.. అందులో ఒక ఫార్చ్యూనర్ కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ కారులో ఎవరు వచ్చారు?. ఆ ఎంపీ పేరేంటి?. ఆయనే వచ్చారా లేక ఆ కారులో ఆయన బంధువులెవరైనా వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నీటిలో మునిగి బీటెక్ విద్యార్థి గల్లంతు
రాజేంద్రనగర్: వాటర్ ఫాల్స్ చూసేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ప్రమాదవశాత్తు కాలు జారిపడి నీటిలో మునిగి గల్లంతైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన అక్షిత్‌రెడ్డి(24) బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితులైన రోహిత్, పవన్, అనీల్లతో కలిసి బైక్‌లపై ఉప్పర్‌పల్లి మొండితత్వ ప్రాంతానికి చెరుకున్నారు. అంతకుముందు వారు గూగుల్‌లో నగరానికి సమీపంలోని వాటర్ ఫాల్స్ కోసం సెర్చ్ చేయగా ఈ ప్రాంతాన్ని చూపించింది. అన్నింటికంటే దగ్గరగా ఉండటంతో నలుగురూ ఆదివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. ఫొటోలు దిగుతూ రీల్స్ చేస్తూ సందడి చేశారు. అనంతరం అక్షిత్ రెడ్డి వాటర్ ఫాల్స్ మీదుగా ముందుకు నడుస్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. మిత్రులు అతడిని కాపాడేందుకు ప్రయతి్నంచినా అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో వారు 100కు డయల్ చేసి సమాచారం అందించడంతో రాజేంద్రనగర్ పోలీసులు డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న డీఆర్ఎఫ్ బృందం సాయంత్రం వరకు గాలించినా అతని జాడ తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే ఇదే జలపాతంలో నలుగురు నీట మునిగి మృతి చెందడంతో కంచె ఏర్పాటు చేశారు. అయినా కంచెను తొలగించి నీటిలో ఈదడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే అక్షిత్ రెడ్డి మృతి చెందాడు. -
తుక్కు పాలసీ తుస్సు!
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తుక్కు పాలసీ తుస్సుమంటోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చే వాహనదారులకు రవాణాశాఖ సముచితమైన ప్రోత్సాహకాలను ప్రకటించినా వాహనదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఢిల్లీ వంటి నగరాల్లో కాలం చెల్లిన వాహనాలపై నిర్బంధంగా నిషేధం విధిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం ఒక నెల వ్యవధిలో కనీసం 25 వాహనాలు కూడా తుక్కు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. తుక్కు బండ్లు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ పొగలు చిమ్ముతున్నాయి. ప్రమాదకరమైన సల్ఫర్, కార్మన్మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాలతో ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. వ్యక్తిగత వాహనాలే టాప్... నగరంలో 15 ఏళ్లు దాటిన వాటిలో వ్యక్తిగత వా హనాలే టాప్‌లో ఉన్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం సుమారు 17 లక్షల బైక్‌లు, మరో 3.5 లక్షల కార్లు తిరుగుతున్నాయి. రవాణా వాహనా ల కేటగిరీలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు తదితర వాహనాలు సైతం కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా వినియోగంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరో లక్ష వరకు సరుకు రవాణా వాహనాలు ఉన్నట్లు అంచనా. గ్రేటర్లో 13 వేలకుపైగా స్కూల్ వాహనాలు ఉంటే వాటిలో 2500 వరకు డొక్కు బస్సులే. సుమారు 1.4 లక్షల ఆటోరిక్షాల్లో కనీసం 25 వేలకు పైగా కాలం చెల్లినవే. ఇవి కాకుండా వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులు, 4 వేల మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. ఇటు వ్యక్తిగత వాహనాలు, అటు రవాణా వాహనాలు అన్నీ కలిపి 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల్లో పీఎం స్థాయి 2.5 శాతం వరకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల కండీషన్ బాగా లేకపోవడం వల్ల, ఇంజన్ దెబ్బతినడం, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే సరి.. మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో 5 ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు సైతం రిజి్రస్టేషన్ పునరుద్ధరణ సదుపాయం ఉంది. ఈ వెసులుబాటుతో స్వచ్ఛంద స్క్రాపింగ్‌కు స్పందన రావడం లేదు. చాలామంది రెండో వాహనం ఉన్నప్పటికీ మొదటి వాహనాన్ని వదులుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఒక ఇంట్లో ఒక పాత కారు, ఒక కొత్త కారు తప్పనిసరి అవసరంగా వినియోగిస్తున్నారు. ద్విచక్ర వాహనాల విషయంలోనూ పాతవి, కొత్తవి ఉంటున్నాయి. కానీ పాతవాటిని మాత్రం వదులుకోవడం లేదు.ప్రోత్సాహకాలు ఇలా..కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చుకొనే వాహనదారులకు కొత్తవాటి కొనుగోళ్లలో ప్రభుత్వం సముచితమైన ప్రోత్సాహాన్ని అందజేస్తుంది కొత్త వాహనాల జీవితకాల పన్నులో రాయితీని ఇస్తున్నారు. రూ.5 లక్షల విలువైన వాహనాల కొనుగోలుపై రూ.10 వేల రాయితీ ఉంటుంది రూ.5– 10 లక్షల ఖరీదైన వాహనాలపై రూ.20,000 రూ.10–15 లక్షల ఖరీదు చేసేవాటిపై రూ.30,000 రూ.15– 20 లక్షల వరకు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తే రూ.40,000 చొప్పున రాయితీ ఇస్తారు. తమ పాత వాహనాల తుక్కు సరి్టఫికెట్లను ఆరీ్టఏలో అందజేస్తే ఈ రాయితీ లభిస్తుంది. -
Kondapur: రేవ్ పార్టీ భగ్నం
హైదరాబద్: వీకెండ్లో అమ్మాయిలతో డ్యాన్స్‌లు, గంజాయి, డ్రగ్స్, మందు తాగుతూ చిందేస్తుండగా..పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే... కొండాపూర్ జేవీహిల్స్ కాలనీలోని ఎస్వీ.నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో వీకెండ్లో ఏపీకి చెందిన కొందరు కొంతకాలంగా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కూడా అలాంటి పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారం అందగా దాడులు చేశారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బీ టీమ్ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ తెప్పించే కింగ్కెన్షేర్ రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ మన్నె అప్పికొట్ల అశోక్‌కుమార్, మరో ఆర్గనైజర్ సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతాతేజ ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల్లో టీడీపీ నాయకులకు చెందినవి ఉన్నట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన అశోక్ నాయుడు వాహనం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
చోరీకి వచ్చి.. ఆమ్లెట్ వేసుకొని
హైదరాబాద్: తాళం వేసిన ఇంట్లోకి చోరీకి వచ్చాడు.. ఆమ్లేట్ వేసుకొని తిన్నాడు.. డబ్బులు, బంగారం దొరకకపోవడంతో బట్టలన్నీ ఒకచోట వేసి తగులబెట్టాడో దొంగ. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్ నగర్‌లోని ఆఫీసర్స్‌కాలనీ చెందిన తిరుపతి గౌడ్ ఇంట్లోని పైఅంతస్తులో మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన ఆంజ నేయులు కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల ఆయన తండ్రి మరణించడంతో అందరూ సొంతూరుకి వెళ్లారు. మూడు రోజులుగా ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. ఇంట్లోకి చొరబడి ఆమ్లేట్ వేసుకొని తిన్నాడు. తర్వాత వెతికినా, డబ్బు, బంగారం దొరకలేదు. దీంతో ఇంట్లోని బట్టలన్నీ ఒకచోట వేసి వాటికి నిప్పంటించాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సుశీల తెలిపారు. -
ఐదు జిల్లాల్లో ఇంకా లోటే!
సాక్షి, హైదరాబాద్: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తాజా వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ప్రస్తుత గణాంకాలు సాధారణ స్థితిలో ఉన్నా, మరిన్ని వర్షాలు కురవాల్సిన అవసరముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి సీజన్ వర్షపాత గణాంకాలు పరిశీలిస్తే... జూలై 27వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 33.40 సెంటీమీటర్లు కాగా, నమోదైన వర్షపాతం 33.68 సెంటీమీటర్లు. నెలాఖరు నాటికి 35.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. రెండ్రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా, రేపట్నుంచి వర్షాలు మోస్తరుగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.అక్కడ ఇంకా లోటే...సీజన్ ప్రారంభం నుంచి దాదాపు ఆరువారాల వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో సగటు వర్షపాతం తీవ్ర లోటులో ఉంది. గతవారం రోజులుగా కురిసిన వర్షాలతో వర్షపాత గణాంకాలు అమాంతం పైకిలేచాయి. అయినా, ఐదు జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది.⇒ మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో 20శాతం పైబడి లోటులో ఉన్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. లోటు వర్షపాతం ఉన్న మండలాల్లోఅత్యధికం ఉత్తర ప్రాంత జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావాన్నే చూపునున్నాయి. ⇒ సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 20శాతం పైబడి వర్షాలు కురవడంతో ఆయా జిల్లాలు అధిక వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి.⇒ మిగిలిన 23 జిల్లాల్లో వర్షపాత గణాంకాలు సాధారణ స్థితిలో నమోదయ్యాయి.నేడు..రేపు తేలికపాటి వానలురాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి బికనీర్, కోట, వాయువ్య మధ్యప్రదేశ్ దాని పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. వర్షపాత గణాంకాలు ఇలా.... మండలాల సంఖ్య లోటు 132సాధారణం 339అధికం 131అత్యధికం 132 -
కనిపెట్టి.. కాపాడుదాం
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి కాలంలో పరీక్షల ఒత్తిడి, ఫెయిలవుతామన్న భయం, మార్కులు తగ్గితే అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అంతేకాకుండా వ్యవస్థల స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ... విద్యార్థుల బలవన్మరణాలకు కారణాలేంటి? ఏయే స్థాయుల్లో, ఎలా వాటిని గుర్తించి నివారించవచ్చు? ఇందులో సమాజంలోని వివిధ వర్గాల పాత్ర ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? విశాఖపట్నంలో ఓ కోచింగ్ సంస్థలో ‘నీట్’శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం దేశంలో 2022లో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యల కేసులు నమోదైతే అందులో 7 శాతం విద్యార్థుల మరణాలే’అని అత్యున్నత న్యాయస్థానం గణాంకాలనూ ఉటంకించింది. 100 మంది విద్యార్థులు ఉన్న విద్య, శిక్షణ సంస్థలు, హాస్టళ్లలో సైకాలజిస్ట్, అర్హతగల కౌన్సిలర్, సామాజిక కార్యకర్తను నియమించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తేలిగ్గా తీసుకొనే మాటలు కావవి.. ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థి తన కష్టాన్ని, బాధను ఏదో ఒక సందర్భంలో వ్యక్తపరుస్తారు. అది స్నేహితులు, బంధువులు, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా కావచ్చు. అలాంటప్పుడు వారి మాటలను తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు. ⇒ ‘పరిస్థితులు ఎప్పటికీ బాగుపడవు.. ఇక నేను ప్రయతి్నంచడంలో అర్థం లేదు’ ⇒ ‘నా సమస్యలకు ఎవరూ సహాయం చేయలేరు.. నాకు మార్గం కనిపించడం లేదు’ ⇒ ‘నేను పనికిరాను, నేను ఎవరికీ ముఖ్యం కాదు’ ⇒ ‘ఇతరులకు భారంగా ఉన్నాను, నా మీద నాకు సిగ్గుగా ఉంది’ ఇలాంటి మాటలు విద్యార్థుల నోటి నుంచి వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఆ ప్రవర్తనలే హెచ్చరికలు తల్లిదండ్రులు, బడులు లేదా విద్యాసంస్థల్లోని టీచర్లు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికగా భావించాలి. ⇒ ఇటీవలి కాలంలో చదువులో మీ పిల్లలు వరుసగా వెనుకబడుతుంటే ⇒ ప్రతి చిన్న విషయానికీ కోపం, అసహనం ఎక్కువవుతుంటే ⇒నలుగురితో కలవకుండా, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతుంటే ⇒ తన ఒళ్లు, ఆహారం, ఆరోగ్యం.. ఇలా దేనిమీదా శ్రద్ధ లేకుండా ఉంటే ⇒ తరగతిలో అజాగ్రత్తగా ఉండటం, మతిమరుపు ⇒ ఏదో తలచుకుని ఏడవడం ⇒ రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం ఇలా బయటపడొచ్చు ఒత్తిడిని జయించడానికి, నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి జనరేషన్–జడ్, జె¯న్–ఆల్ఫా ఏం చేస్తున్నారంటే.. గేమింగ్, ఈ–స్పోర్ట్స్: పోటీతత్వాన్ని నేర్పుతుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.మ్యూజిక్, పాడ్‌కాస్ట్: భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడి నుండి ఉపశమనం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ: సృజనాత్మకత, తన టాలెంట్‌ను నలుగురికీ తెలియజేయడం స్వచ్ఛంద సేవ, క్రియాశీలత: సంతృప్తి, సహానుభూతి, తన చుట్టుపక్కల వారితో అనుబంధం పెంచుకోవడానికి ఫిట్నెస్, యోగా: ఒత్తిడి నుంచి బయటపడేందుకు, సానుకూల దృక్పథం షాపింగ్ థెరపీ: ఒత్తిడి నుంచి ఉపశమనం సమయపాలన.. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం ఇదే. సమయాన్ని సది్వనియోగం చేసుకోలేక, ఏ పనికి ఎంత సమయం కేటాయంచాలో అంచనా వేయలేక విద్యార్థులు ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ⇒ ప్రాధాన్యతను బట్టి ఏ పనికి ఎక్కువ సమయం, ఏ పనికి తక్కువ సమయం అన్న స్పష్టమైన విభజన చేసుకోవాలి. అది చదువు / సబ్జెక్ట్, ఆటపాటలు, షికార్లు /ఎంజాయ్మెంట్, వ్యాయామం.. అన్నింటికీ వర్తిస్తుంది. ⇒ ఏకబిగిన చదవకుండా మధ్యమధ్యలో విరామాలు తీసుకోవాలి ⇒ మరునాడు చేయబోయే పనులకు సంబంధించి ముందురోజు రాత్రే టైమ్ టేబుల్ వేసుకోవాలి. అందులో ఎంత శాతం పూర్తిచేస్తున్నారో డైరీలో రాసుకోవాలి. 60, 70, 80, 90 శాతం వరకు వచ్చారంటే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరవాత అలా రాయాల్సిన అవసరమే ఉండదు. తల్లిదండ్రులూ.. పిల్లలు చెప్పేది వినండి పిల్లలు చెప్పేది వినడానికి చాలామంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. తాము కష్టపడి, డబ్బు పెట్టి చదివిస్తుంటే... ఏ కష్టం చదవడానికి అనుకుంటారు. ఈ ధోరణి మారాలి. వాళ్లు జీవితంలో ఏ అనుభవమూ లేకనే సమస్యలు మీకు చెబుతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమైనట్టే. పిల్లలూ.. స్క్రీన్ టైమ్ తగ్గించండి ఇటీవలి కాలంలో విద్యార్థులు చదువు కోసం కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. వీటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ⇒ కొందరు విద్యార్థులు చదువుకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ⇒ షార్ట్స్, రీల్స్, వీడియోలను ఒకటి తరవాత ఒకటి.. చూడటానికి మెదడు అలవాటు పడితే.. చదవాలన్న తలంపే రాకుండా పోతుంది. దానివల్ల పరీక్షల వంటి కీలక సమయాల్లో ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలూ.. సిగ్గు, మొహమాటం వద్దు ⇒ స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లు, బంధువులు.. వీరిలో మీ మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తులు కచ్చితంగా ఉంటారు. మీకు ఏ సమస్య వచి్చనా నిర్మొహమాటంగా వారితో పంచుకోండి. ⇒ చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు మీ అమ్మ లేదా నాన్న కూడా కావచ్చు. కఠిన గ్రేడింగ్ వ్యవస్థలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తే ఓదార్చేవారు లేకపోవడం, నిరంతర పోటీతత్వం విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ముప్పును ముందే గుర్తించి పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చే స్థాయిలో పాఠశాల, కళాశాల కౌన్సెలర్లకు శిక్షణ ఇవ్వాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా, ఒత్తిడిని జయించి, ఆత్మహత్యలను నివారించేలా విద్యాసంస్థలు మేమున్నామనే భరోసా ఇవ్వాలి – నెల్సన్ వినోద్ మోసెస్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
ఆర్టీసీలో అడియాసలు
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించిన తర్వాత 200 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. వీటి రూపంలో మహిళలకు రూ.6,680 కోట్లు ఆదా కాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేసింది. తద్వారా సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ నష్టాలతో మునిగిపోయే నావ కాదు.. లాభాల్లోకి వచ్చిన సంస్థ’.. ఉచిత ప్రయాణ పథకం కింద 200 కోట్ల ఉచిత టికెట్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో ఆరు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలివి. వారే స్వయంగా ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రకటించారు. అయినప్పటికీ.. సంస్థలో దశాబ్దాల పాటు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వేల మంది ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొని ఉండటం, పెన్షన్ లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం శోచనీయం. వేదన వర్ణనాతీతం రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోగా, కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పకపోవటంతో రిటైర్ అయిన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. పెన్షన్ లేని ఉద్యోగం కావటంతో.. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవారిని పక్కన పెడితే సెక్యూరిటీ, శ్రామిక్, డ్రైవర్,కండక్టర్ లాంటి తక్కువ జీతాలతో పనిచేసిన వారు పేదరికంలో మగ్గుతున్న తీరు, వారు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు 16 వేల కుటుంబాలు నానా అవస్థలకు గురవుతున్నాయి. తమ బాధలు చెప్పుకోవటానికి వెళ్తే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, నిస్సహాయ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రతి సోమవారం సంబంధిత డిపోల ముందు, ప్రతి నెలా రీజినల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉన్నతాధికారులతో పాటు కనిపించినవారికల్లా తమ గోడు చెప్పుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఎట్టకేలకు వేతన సవరణ జరిగినా.. ప్రతి నాలుగేళ్లకోమారు ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించాలి. కానీ ఉద్యోగులు పోరాటాలు చేస్తే తప్ప అది అమలుకు నోచుకోవటం లేదు. అలా 2017లో జరగాల్సిన వేతన సవరణ 2024లో అమలులోకి వచ్చింది. అంతవరకు 16 ఇంటెరిమ్ రిలీఫ్ (మధ్యంతర ఉపశమనం)లతో నెట్టుకొచ్చి, గత ఏడాది ఏప్రిల్‌లో 21 శాతం ఫిట్మెంట్తో ప్రభుత్వం వేతన సవరణ చేసింది. అదే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తెచ్చింది. పాత బకాయిలు పదవీ విరమణ సమయంలో ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అప్పటికే రిటైర్ అయిన వారి సంగతేంటో సంస్థ చెప్పలేదు. అదే వారి పాలిట శాపంగా మారింది. ఈ వేతన సవరణ కాలంలో సంస్థలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయినవారందరికీ ప్రయోజనం లభించాల్సి ఉంది. మొత్తం 16 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి కలగాల్సి ఉంది. ఎన్ని బకాయిలో.. ⇒ 2017 వేతన సవరణ, ఆ ఏడాది ఏప్రిల్ నుంచే అమలులోకి రావాల్సి ఉంటుంది. కానీ 2024 జూన్ నుంచి అమలులోకి వచ్చినందున.. ఆ ఏడాది మే వరకు రిటైర్ అయిన అందరికీ ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాలి. కండక్టర్, డ్రైవర్ లాంటి వారికి నెలకు సగటున రూ.5 వేల చొప్పున 2017 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఒక్కొక్కరికి లక్షల్లో ఉంటుందని అంచనా. ⇒ పనిచేసిన కాలంలో 300 వరకు పేరుకునే ఆర్జిత సెలవుల (దాదాపు 10 నెలలు) మొత్తాన్ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా బకాయి ఉంది. ఉదాహరణకు చూస్తే.. 2022 జూన్‌లో రిటైర్ అయిన డిపో మేనేజర్ స్థాయి అధికారికి ఆ బకాయి మొత్తం రూ.11 లక్షలుగా ఉంది. ఇక ఉద్యోగ స్థాయిని బట్టి కీ మొత్తం కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఉంటుంది. ⇒ 2017 వేతన సవరణతో జీతాలు పెరిగినందున, ఆర్జిత సెలవు బకాయిలు కూడా పెరుగుతాయి. రూ.10 లక్షల బకాయి ఉన్నవారికి మరో రూ.4 లక్షల వరకు ఈ వేతన సవరణ వల్ల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ 2019 జూలై నుంచి ఆర్టీసీలో డీఏల చెల్లింపు నిలిచిపోయింది. గతేడాది ఒకేసారి ఐదు పెండింగు డీఏలను చెల్లించారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయినవారికి ఆ లబ్ధి ఇవ్వలేదు. ఒక్కో పెండింగు డీఏ నికరంగా 2.5 శాతం నుంచి 3.2 శాతం మధ్య ఉంది. ఆ మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా లభించాల్సి ఉంది. అలాగే అప్పటివరకు జరిగిన జాప్యానికి బకాయిలు లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. అది కూడా పెండింగులోనే ఉంది. ⇒ అలాగే గ్రాట్యుటీపై 2017 వేతన సవరణ ప్రభావాన్ని లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. వేతన సవరణతో పెరిగే జీతం ప్రకారం పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన మొత్తాన్ని ఇవ్వలేదు. ⇒ ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో రిటైర్డ్ ఉద్యోగులు అధిక వడ్డీ ఆశతో దాచుకున్న మొత్తాలపై ప్రస్తుతం వడ్డీ చెల్లింపు నిలిచిపోయింది. చాలామందికి ఆ బకాయి కూడా పేరుకుపోయి ఉంది. లబ్ధి అందకుండానే కన్నుమూత! డ్రైవర్, శ్రామిక్, సెక్యూరిటీ.. లాంటి కష్టతరమైన ఉద్యోగాలు ఏళ్లపాటు చేయటంతో ఆరోగ్యాలు దెబ్బతిని చాలా మంది సగటు జీవిత కాలం కంటే ముందే చనిపోతున్నారు. ప్రతి నెలా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది అలా తమకు రావాల్సిన బకాయిలు రాకముందే చనిపోతున్నారని సంఘాల సంఘాలు నేతలు చెబుతున్నారు. -
కంప్యూటర్స్‌పై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరగడంతో రెండోదశ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఆ బ్రాంచిపై విద్యార్థుల ఆశలు పెరిగాయి. ఈసారి కంప్యూటర్ సీటు వస్తుందని భావిస్తున్నారు. తొలివిడతలో ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్లూ ఆప్షన్లు మార్చుకున్నారు. తొలి ప్రాధాన్యతగా సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులను ఎంచుకున్నారు. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారం ముగిసేనాటికి 95 వేల మంది 27 లక్షల ఆప్షన్లు ఇచ్చినట్టు ఎప్‌సెట్ క్యాంప్ కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 30న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. పెరిగిన సీట్లన్నీ ప్రైవేటు కాలేజీల్లోనే.. తొలిదశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద కంప్యూటర్ సైన్స్, ఇతర ఎమర్జింగ్ బ్రాంచీల్లో 58,742 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 57,042 సీట్లు కేటాయించారు. అయితే 44,798 మంది మాత్రమే రిపోర్టు చేశారు. దీంతో 13,944 సీట్లు మిగిలిపోయాయి. తాజాగా కన్వీనర్ కోటా కింద కంప్యూటర్ సైన్స్ సీట్లు 5,549 పెరిగాయి. దీంతో మొత్తం 19,493 కంప్యూటర్ సంబంధిత బ్రాంచీల సీట్లు రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వస్తాయి. పెరిగిన సీట్లన్నీ ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. టాప్ కాలేజీల్లో తొలి దశ కేటాయింపులో గరిష్టంగా 5 వేల ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. రెండోదశలో 6 వేలపైన ర్యాంకుకు కూడా సీటు రావచ్చని ఎప్‌సెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 25 వేల ర్యాంకు వరకూ టాప్ కాలేజీల్లో సీట్లు వస్తాయని చెబుతున్నారు. భారీగా కాలేజీలు, ఆప్షన్ల మార్పు సివిల్, ఈఈఈ, మెకానికల్ వంటి కోర్ గ్రూపుల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో కాలేజీల మార్పుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పుడు వచ్చిన కాలేజీ కన్నా, బెస్ట్ కాలేజీలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో 78 శాతం విద్యార్థులు బ్రాంచీ మార్పుకు ఆప్షన్లు ఇచ్చారు. సివిల్‌లో సీటు వచ్చిన విద్యార్థులు టాప్ 30 కాలేజీల్లోనైనా కంప్యూటర్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో సీటు వస్తుందేమోనన్న ఆశతో ఆప్షన్లు ఇచ్చారు. మరోవైపు టాప్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఆప్షన్లలో కాలేజీ మార్చుకున్నారు. అయితే ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌ల్లో కంప్యూటర్ సీట్లు వచ్చిన విద్యార్థులు మాత్రం ఆప్షన్లు పెద్దగా మార్చుకోలేదు. అయితే వర్సిటీల్లో సివిల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల్లో సీట్లు వచ్చిన చాలామంది ప్రైవేటు కాలేజీల్లో ఎమర్జింగ్ గ్రూపుల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చారు. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా కలిపి మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి 1,07,444 సీట్లు ఉంటే, రెండో విడత నాటికి కంప్యూటర్ బ్రాంచీలతో పాటు కోర్ గ్రూపుల్లో పెరిగిన 9,433 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్‌లో మొత్తం 1,16,877 సీట్లు ఉన్నట్టయింది. -
నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఒకటిరెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోగా, ఆయనకు విమానాశ్రయంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్, సీఈ విజయ్‌భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండగా, ఆలోపే ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు జస్టిస్ ఘోష్ ఏర్పాట్లు చేసుకున్నారు.నివేదికలోని అంశాలు బయటకి పొక్కకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 16 నెలలకు పైగా విచారణ నిర్వహించింది. -
ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ చెప్పారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళితే తప్పు ఏంటి? మమ్మల్ని ఈడీ, సీబీఐ పేరుతో భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని..మేం ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ మాతో చెప్పారు’ అని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నీ జీవితకాలంలో ఎక్కువ రోజులు.. చంద్రబాబు ఇంట్లో, ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలోనే ఉన్నావు. సీసీటీవీ ఫుటేజీ తీద్దాం పదా.. నువ్వు, నీ తమ్ముడు ఎన్ని రోజులు తుగ్లక్ రోడ్‌లోని నివాసంలో ఉన్నారో చూద్దాం’ అని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు.ఆదివారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడా రు. ‘రేవంత్‌రెడ్డి మాటలు వింటే గోబెల్స్ ఆత్మహత్య చేసుకుంటారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ గోబెల్స్‌ను మించిపోయారు. జైపాల్‌రెడ్డికి ఉన్న మంచిపేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి..నాడు నోట్ల కట్టలతో దొరికినట్టు..నేడు బనకచర్ల విషయంలో దొరికిపోయారు. రేవంత్‌రెడ్డి కుర్చీలో ఐదేళ్లు ఉండాలని మేము కోరుతున్నాం. కానీ, ఆయనన్ను ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఎవరెవరు రెచి్చపోతున్నారో వాళ్ల సంగతి మేం చూసుకుంటాం’అని జగదీశ్‌రెడ్డి అన్నారు.‘పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారు. బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ భావజాలం వేరు..బీజేపీ భావజాలం వేరు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు’అని జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడు తున్న రేవంత్‌రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిస్తున్న వారు రేవంత్‌రెడ్డి పరువు తీస్తున్నారు. సహచర మంత్రులంటే భయంతోనే సీఎం వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. అందుకే ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు’అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. -
హాఫ్ మారథాన్.. ఫుల్ జోష్..
చిన్నకోడూరు (సిద్దిపేట): ఉరిమే ఉత్సాహం.. నువ్వా నేనా అన్నట్లుగా పరుగు.. చిన్నా పెద్ద తేడా లేకుండా వందల మది పోటీ. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాక్షి మీడియా సపోర్టింగ్ స్పాన్సర్‌గా ఆదివారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై నిర్వహించిన హాఫ్ మారథాన్ దృశ్యాలివి. 5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఆసక్తిగా పాల్గొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. విజేతలకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ పోటీల్లో మూడు వేలమందికి పైగా పాల్గొన్నారు.గేమ్స్.. సాక్షి సెల్ఫీ పాయింట్రంగనాయక సాగర్‌కు వచ్చిన రన్నర్స్ అక్కడ సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాక్షి డాట్ గేమ్స్‌లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. డాట్ గేమ్‌లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన సాక్షి సెల్ఫీ పాయింట్లో ఫొటో దిగడానికి రన్నర్స్ ఆసక్తి చూపారు. సాక్షి మీడియా బృందంతో పాటు ఎంపీ రఘునందన్‌రావు, సినీ నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొని సెల్ఫీ పాయింట్లో సెల్ఫీ దిగారు. హాఫ్ మారథాన్ విజేతలు వీరే.. హాఫ్ మారథాన్‌లో మహిళలు, పురుషుల విభాగాల్లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. 21 కే పురుషుల విభాగంలో మొదటి స్థానంలో దివ్యాన్ష్ తోమర్, రెండో స్థానంలో రమావత్ రమేశ్ చంద్ర, మూడో స్థానంలో మంచికంటి లింగన్న నిలిచారు. మహిళల విభాగంలో మొదటి స్థానంలో ఎం ఉమ, రెండో స్థానంలో సునిమా దిలా, మూడో స్థానంలో జయశ్రీ వర్మ నిలిచారు.10 కేలో పురుషుల విభాగంలో హరీశ్, సురేందర్, విజయ్ వరుసగా మొదటి, రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు. మహిళల విభాగంలో స్వప్న, సమ్రీన్, ముషారఫ్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 5 కేలో మహిళల విభాగంలో అభినయశ్రీ, మధు ప్రియ, అఫ్రీన్, పురుషులు గగన్ కుమార్, టిక్లూ, శివరాజు మొదటి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారు. సాక్షి డాట్ గేమ్ విజేతలు.. సాక్షి డాట్ గేమ్‌లో ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కంకటి అశ్విత్‌గౌడ్ (చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామం), రెండో బహుమతి సుల్తానా (సుభాష్‌నగర్, సిరిసిల్ల), మూడో బహుమతి సురేందర్ (వెల్లటూరు గ్రామం, సిద్దిపేట అర్బన్ మండలం)లు గెలుచుకున్నారు. వీరిని సాక్షి మీడియా బృందం అభినందించింది.ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండినేషనల్ చాంపియన్ కావటమే లక్ష్యం.. సిద్దిపేటలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో మూడు సార్లు పాల్గొని విజేతగా నిలిచాను. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతూ అథ్లెటిక్స్‌లో కూడా పాల్గొంటు న్నాను. నేషనల్ చాంపియన్‌గా నిలవటమే నా లక్ష్యం. – ఉమ, నూతనకల్, సూర్యాపేట జిల్లా మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను..నేను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి వచ్చి హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నా. ఇక్కడికి రావడం మొదటి సారి. ఇతర రాష్ట్రాలలో చాలా సార్లు మారథాన్‌లో పాల్గొని విజేతగా నిలిచా. ఇక్కడ మొదటి సారిగా పాల్గొని 21 కేలో విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – దివ్యాన్షు తోమర్ -
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. రాష్ట్రంలో పంచా యతీ ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమా వేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న బిల్లు, గో సంరక్షణ విధివిధానాలపై సైతం చర్చించి మంత్రివర్గం ఆమోదించనుంది. కేంద్రం తీసుకున్న విధాన నిర్ణయం ఆధా రంగా ప్రైవేటు క్యాబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావ డం వంటి అంశాలపై సైతం మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉంది. -
ఆయన మంచి రైటర్.. ఇక్కడ మంచి ఫైటర్ కావాలి: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు హాట్ కామెంట్స్ చేశారు.‘‘రామచందర్ రావు మంచి రైటర్. కానీ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి ఫైటర్ కావాలి. నా రాజీనామా వెనక కుట్ర లేదు. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయంపై కేంద్ర పార్టీకి చెప్పాలని అనుకుంటున్నా. నా రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించడం వెనక కుట్ర జరిగింది. నా పార్టీలో చేరడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎం చేయాలో కేంద్ర పార్టీకి వివరించాలని ఉంది. హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పిదాలపై కేంద్రానికి లేఖ రాశా.. మెయిల్స్ చేశాను. వారి దృష్టికి వెళ్ళిందో లేదో.. తెలియదు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కలిసినప్పుడు అమిత్ షాకు కలుస్తానని చెప్పాను.. ఆ లోపే రాజీనామా చేశాను.తెలంగాణలో 2014, 2018, 2023 ఎన్నికల్లో బీజేపీకి ఎవరు మోసం చేశారో, ఎవరు వెనక నుంచి కత్తిపోట్లు పొడిచారో ఐబీ రిపోర్ట్ కేంద్ర పార్టీ తెప్పించుకోవాలి. కొంతమంది బీజేపీ మహిళానేతలకు దండం. వారికి సన్మానం చేస్తా. నా ఉద్దేశ్యం ఒక్కటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్ ఛానళ్లలో ఫేక్ వార్తలు పెట్టించి రాజీనామా ఆమోదించేలా చేశారు. ఫేక్ వార్తలు, మీడియాలో లీకులు ఇచ్చే అలవాటు నాకు లేదు.. అటువంటి చిన్న ఆలోచన నేను చేయను"అని అన్నారు. -
ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇవి ఉండాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు ఫ్లాట్‌ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆస్పత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడిబాట పడుతున్నారు. ప్రాజెక్ట్‌ల్లో ఫ్లాట్లే కాదు పాఠశాల, ఆస్పత్రి వంటివి కూడా నిర్మిస్తున్నారు. నగరంలో ఈ తరహా నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి.సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆస్పత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలు పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తోంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆస్పత్రి ఉందా? వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.శరవేగంగా అభివృద్ధి.. కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్‌లు ఉండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆస్పత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆస్పత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్ బూమ్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. -
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబం మమ్మల్ని కలిశారు. వెంటనే మేము సోదాలు చేశాము. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్‌లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు నమ్రత.హైద్రాబాద్‌లో ఉన్న ఒక మహిళకు రూ.89వేలు ఇచ్చి ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్ళీ హైదరాబాద్‌కు పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు నమ్రత. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులు కాన్సిల్ చేశాం.ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కథాకమామిషు ఏంటంటే?పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది. -
అఫర్డబుల్ ఇళ్లు.. అబ్బే లాభం లేదండీ..
సామాన్యుడి సొంతింటి కల మరింత దూరమవుతోంది. అందుబాటు గృహాల నిర్మాణాలు తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పాటు డెవలపర్లు విలాసవంతమైన ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు కూడా సామాన్య, మధ్యతరగతి కోసం వేర్వేరు పథకాల ద్వారా సొంతింటి కలను నెరవేర్చేవి. కేంద్రం ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఎంఐజీ విభాగంలో 1,800 చ.అ. విస్తీర్ణం వరకు ఈ పథకం అమలు చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందారు. ఇప్పుడిది ఎల్ఐజీ వరకే పరిమితమైంది. దీంతో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. - సాక్షి, సిటీబ్యూరోప్రైవేటీకరణ.. పట్టణాల్లో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో గృహ నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని కాలనీలను నిర్మించేవారు. అధిక ఆదాయం, మధ్య, తక్కువ ఆదాయ వర్గాలుగా హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీగా విభజించి ఇళ్లు, స్థలాలను విక్రయించే పరిస్థితి ఉండేది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా, కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడంలో హౌసింగ్ బోర్డులు వెనకబడటంతో ప్రైవేట్ రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్లవైపు వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని.. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని బిల్డర్లు అంటున్నారు.తగ్గిన కొనుగోలు శక్తి.. మధ్యతరగతి వర్గాల్లో అత్యధిక శాతం మంది గృహరుణం ద్వారానే ఇల్లు కొంటుంటారు. అధిక వడ్డీ రేట్లు, రుణ లభ్యత తగ్గిపోవడంతో సొంతింటి కల సవాల్‌గా మారింది. భూముల ధరలు పెరగడం.. ఆ మేరకు ఇంటి ధరలను పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గిపోయింది. బిల్డర్ ఎవరైనా ముందుకొచ్చి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని విక్రయించడం పెద్ద సవాల్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆయా వర్గాల్లో మేరకు కొనుగోలు శక్తి లేకపోవడమే దీనికి కారణం. అన్ని వనరులను సమీకరించుకుని కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో మరో స్పెర్మ్ క్లినిక్ నిర్వాకం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్బాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఇవాళ (ఆదివారం) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్‌తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశారు.అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వహిస్తూ.. వీర్య కణాలను, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరణ చేస్తున్నారు. స్పెర్మ్ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
‘సృష్టి’ కేసు.. డాక్టర్ నమ్రత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నిర్వహణ సాగిస్తుండగా, పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం.. బీహార్ నుంచి పూజారులను పిలిపించిన డాక్టర్ నమ్రత.. 9 రోజుల పాటు.. ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నంలోని పలు ఫెర్టిలిటి సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. మహారాణిపేట పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లోర్లలో అనధికారంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో లైసెన్సు ముగిసినప్పటికీ అనధికారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మోసం బయటపడింది ఇలా..నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు.తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం. -
వడ్డీతో కలిసి రూ.22 కోట్లు అప్పు చెల్లించినా.. చంపుతామంటున్నారు!
హైదరాబాద్: తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించినప్పటికీ తన భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి శనివారం మోకిల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మోకిలకు చెందిన ఫరీద్ కుటుంబ అవసరాల నిమిత్తం 2021లో తన భూమిని హైదరాబాద్‌కి చెందిన సునీల్ కుమార్‌అహుజా, అశీ అహుజాలకు రిజిస్ట్రేషన్(తాకట్టు) చేసి, రూ.17 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. 2022 డిసెంబర్లో వడ్డీతో కలిసి రూ.22 కోట్లు చెల్లించాడు. అనంతరం భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా కాలయాపన చేస్తూ వచ్చారు. కాగా మొదటి నుంచి ఫరీద్ భూమి కబ్జాలో ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సునీల్, అశీష్ భూమి వద్దకు చేరుకుని అతనితో గొడవ పడ్డారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరబాబు తెలిపారు. -
విధుల్లో ఉండగా విషాదం!
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): మెహిదీపట్నంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధినిర్వహణలో భాగంగా ఓ ఫంక్షన్ హాలు వద్దకు వెళ్లిన తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు (52) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఫంక్షన్ హాలు నిర్వాహకులు, అధికారుల మధ్య వివాదం నేపథ్యంలో తోపులాట జరగ్గా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నడికుడ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..ఖాజా ఇసాక్ఉద్దీన్ అనే వ్యక్తి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ నుంచి మెహిదీపట్నంలోని ఓ కమ్యూనిటీహాల్‌ను లీజుకు తీసుకొని ఎంపీ గార్డెన్ పేరిట ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నాడు. కాగా గత 8 సంవత్సరాల నుంచి ఈ ఫంక్షన్ హాల్‌కు సంబంధించి హౌసింగ్‌బోర్డు సొసైటీకి అద్దె చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ.1.22 కోట్లు పేరుకుపోయాయి. వీటిని చెల్లించాలని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఎంపీ ఫంక్షన్‌హాల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. కోర్టు ఆదేశాల మేరకు.. చివరకు హౌసింగ్‌బోర్డు అధికారులు అద్దె బకాయిల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచి్చంది. కోర్టు ఆదేశాల మేరకు హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి శనివారం ఉదయం 7 గంటలకు మెహిదీపట్నం ఫంక్షన్‌హాల్ వద్దకు వెళ్లి సంబంధిత యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం మూడు గేట్లు ఉండగా ఒక గేటుకు తాళం వేశారు. మిగతా రెండు గేట్లకు తాళాలు వేస్తుండగా ఫంక్షన్‌హాల్ నిర్వాహకులు బౌన్సర్లతో కూడిన గుంపుతో వచ్చి హౌసింగ్‌బోర్డు సిబ్బందిపై దాడి చేశారు. మిగతా గేట్లకు తాళం వేయకుండా కారును అడ్డంగా ఉంచడంతో అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి జగదీశ్వర్‌రావు కోర్టు ఆదేశాల మేరకు తాము విధులు నిర్వహిస్తున్నామని, తమకు సహకరించాలని, ఏమైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని చెబుతుండగానే అతనిపైకి బౌన్సర్ల గుంపు వచ్చి చాతిపై చెయ్యివేసి తోసివేశారు. కిందపడిపోయిన జగదీశ్వర్‌రావు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోవడంతో తోటి సిబ్బంది అతడిని నానల్‌నగర్‌లోని ఒలివ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు అధికారులు ఫంక్షన్ హాలును సీజ్ చేశారు. -
కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మరోసారి నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్‌లో ఓ విల్లాలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.కాగా, రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహించారు. నిర్వాకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఫెర్టి.. పిటీ..
సాక్షి, హైదరాబాద్: ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. రోజంతా ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని కూర్చోవడం.. వెరసీ.. దాదాపు 40 శాతం దంపతుల్లో సంతాన లేమి సమస్య తలెత్తుతోంది. చికిత్సల కోసం ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సంతానం కోసం తపించే దంపతుల బలహీనతను కొంతమంది వైద్యులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశం ఉండటంతో కనీస అనుభవం, అర్హత లేకపోయినా.. ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి గుట్టుగా చికిత్సలు చేస్తున్నారు. దంపతులకు అనుమానం రాకుండా ఇతరుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండాలను ల్యాబ్‌లో ఫలదీకరించి, అండాశయంలో ప్రవేశపెడుతున్నారు. తీరా బిడ్డ పుట్టిన తర్వాత రంగు, ముఖ కవళికలు, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్టులకు వెళ్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోనూ ఇదే తరహా సంఘటన వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్ల యువత నుంచి సేకరణ.. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన గ్రేటర్లో ఫెర్టిలిటీ సెంటర్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో సుమారు 50, రంగారెడ్డిలో 39, మేడ్చల్ జిల్లాలో 30 వరకు సెంటర్లు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఐయూఎఫ్, ఐవీఎఫ్ చికిత్సల పేరుతో ఒక్కో జంట నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. చికిత్సలు, మందులు వాడినా ఫలితం లేకపోవడంతో చివరకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్లలోనే శుక్రకణాలు, అండాల నిధిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వందశాతం సక్సెస్ రేటు కోసం 25 ఏళ్లలోపు యువతీ, యువకుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండా లను పిల్లల కోసం పరితపించే జంటలకు గుట్టుగా అంటగడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సెంటర్‌కు అనుసంధానంగా కొనసాగుతున్న మరికొన్ని సెంటర్లపై దాడులు చేపట్టింది. కొండాపూర్‌లోని ‘హెలే’ క్లినిక్‌లో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ ఓపీ సేవలు మినహా ఇతర చికిత్సలు లేనట్లు గుర్తించారు. ఈ ఆస్పత్రిలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం అప్రమత్తయ్యారు. ఆయా ప్రాంతాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలపై చర్యలకు సిఫార్సు చేస్తుండటంతో ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. రిజిస్ట్రీ నుంచి తొలగిస్తాం వైద్య సేవల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపడతాం. మెడికల్ నిర్లక్ష్యం ఉందని తేలితే మెడికల్ రిజిస్ట్రీ నుంచి వైద్యుల పేర్లను తొలగిస్తాం. సికింద్రాబాద్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. – డాక్టర్ శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు -
నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు..!
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా’అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల వేణుగోపాల్ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న అన్న, వదినలతో కలిసి రాజమహేంద్రవరానికి వెళ్లారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడగా, 25న ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, అనకాపల్లి: ‘దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీ యం తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచి్చంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి చేసిన దొంగతనం బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పనికిమాలిన కథలు చెబుతున్నారని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకునే లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారు. నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టును అనుకున్న వారికి కట్టబెట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రూ.10 వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకు సీఎం రమేశ్‌కు దక్కిన రిటర్న్ గిఫ్ట్ రూ.1660 కోట్లు. ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పసలేని చెత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ ఏ పారీ్టలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతీసారి కాంగ్రెస్, బీజేపీ విలీనం అంటూ తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే రూ.10 వేల కోట్ల హెచ్‌సీయూ భూముల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్డు కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధం’అని కేటీఆర్ ప్రకటించారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ అంతకుముందు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
రైతుకు 2 బస్తాలే..
సాక్షి, హైదరాబాద్: ఎంతో విరామం తర్వాత కురుస్తున్న వర్షాలను చూసి వ్యవసాయ పనులను వేగవంతం చేయాలని ఆశపడిన రైతులను యూరియా కొరత తీవ్ర నిరాశలోకి నెడుతోంది. యూరియాను రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)లలో అందుబాటులో ఉంచినప్పటికీ, రైతులకు రేషన్ విధానంలో సరఫరా చేస్తున్నారు. ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకాలను బట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సొంత జిల్లా ఖమ్మంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో లింకై ఉన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ పంపి నిర్ధారణ చేసుకొని మరీ యూరియా అందజేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చింది వచ్చినట్లు సరఫరా.. కేంద్ర ప్రభుత్వం వానాకాలం కోసం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. ఇందులో ఏప్రిల్ నుంచి జూలై వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉండగా, ఇప్పటివరకు 4.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. అంటే 36 శాతం లోటు ఉంది. ఈ నేపథ్యంలో గోదాములకు వచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు ఊడ్చినట్లు అయిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ స్టాక్ ప్రస్తుత నెల వరకు కష్టంగా సరిపోయే అవకాశం ఉంది. ఆగస్టులో అత్యధికంగా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ చెబుతోంది. జూలై కోటాలో లోటుగా ఉన్న 44 వేల మెట్రిక్ టన్నులతోపాటు ఆగస్టులో రావలసిన 1.20 లక్షల మెట్రిక్ టన్నులను వెంటనే విడుదల చేస్తే ఇప్పుడున్న స్టాక్‌తో బొటాబొటిగా సరిపుచ్చుకునే అవకాశం ఉంది. లేదంటే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కోసం శనివారం మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఎంత పొలం ఉన్నా రెండు బస్తాలే ఖమ్మం జిల్లాకు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉండగా 4,500 మెట్రిక్ టన్నులే అందించారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా రెండు బస్తాలే ఇస్తున్నారు. ఒక ఎకరం ఉంటే ఒక బస్తానే ఇస్తున్నారు. అది కూడా రైతు ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెపితేనే ఇస్తున్నారు. దీనికోసం రైతులు పొలాలు వదిలి క్యూ లైన్లో నిలబెడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. – బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకుడు యూరియా లభ్యతను బట్టి రైతులకు పంపిణీ సొసైటీకి వచ్చే యూరియా లోడ్‌ను బట్టి రైతులకు సరఫరా చేస్తున్నాం. ఆధార్ కార్డు ఆధారంగా ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున పంట కాలంలో మూడు సార్లు ఇస్తాం. రైతుకు రెండు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే ఉన్న స్టాక్ ఆధారంగా పంపిణీ చేస్తున్నాం. రైతులు అర్థం చేసుకుంటున్నారు. – జూపల్లి సందీప్‌రావు, పీఏసీఎస్ చైర్మన్, గర్రెపల్లి, పెద్దపల్లి జిల్లా -
భర్తవి కాకుండా ఇతరుల శుక్ర కణాలతో ‘సృష్టి’!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు.విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టా డు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టు లు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లోతుగా దర్యాప్తు: డీసీపీ రష్మీ పెరుమాళ్ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. లోతైన దర్యాప్తు కోసం పోలీసులతో పాటు మెడికల్, రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంత ర్రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం. విశాఖలో తాజాగా మేనేజర్ అరెస్టు ప్రస్తుత కేసుకు సంబంధించి హైదరాబాద్ గోపాలపురం పోలీసులు విశాఖ జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న సృష్టి బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఈ సెంటర్ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి ఐవీఎఫ్ చికిత్స అందించారన్న వివరాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఒక మహిళా మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
1,000 పాఠశాలల్లో ప్రీప్రైమరీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అమలుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ఇప్పటికే సూచించగా.. తాజాగా మరో 790 పాఠశాలలను గుర్తిస్తూ వాటిల్లో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.ఆయా పాఠశాలల జాబితాను కూడా వెల్లడించింది. ప్రీ ప్రైమరీ అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 కోట్లు కేటాయించింది. తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ)లో వినియోగించని నిధి నుంచి రూ.22.62 కోట్లు తీసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని సమగ్రశిక్ష నుంచి విడుదల చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. కాగా ప్రీ ప్రైమరీ నిర్వహణ మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు. ఆహ్లాదపరిచే గది.. పోషకాహారం.. మధ్యాహ్న భోజనంరాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. నిర్దేశించిన పాఠశాలలో ప్రీ ప్రైమరీ కోసం ప్రత్యేకంగా తరగతి గది కేటాయించాలి. ఇది చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా ఉండాలి. అంగన్వాడీల్లో అందించే పోషకాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించాలి.నాలుగేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ప్రవేశం కలి్పస్తారు. ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థి వివరాలను యూడైస్‌లో రికార్డు చేస్తారు.ఒక టీచర్.. ఒక ఆయా ⇒ తరగతి నిర్వహణకు ప్రత్యే కంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఒక టీచర్, ఒక ఆయాను పూర్తి తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి. నోటిఫికేషన్ ద్వారా నియామకం చేపట్టాలి. వయో పరిమితి సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి. టీచర్ కనీసం ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి. ఆయా కనీసం ఏడో తరగతి చదివి ఉండాలి. ప్రీ ప్రైమరీ కోర్సు చేసిన వారికి, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ తరగతి గదిలో ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సామగ్రి ఏర్పాటు చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆమోదంతో వసతులు కల్పించాలి. ⇒ ఎన్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)–20కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ⇒ రోజువారీ హాజరు స్వీకరించాలి. అంగన్వాడీల ద్వారా స్నాక్స్ పంపిణీ, మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. ⇒ జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ ఆమోదంతోనే సరుకులు, వస్తువులు కొనుగోలు చేయాలి ⇒ ఈ తరగతి నిర్వహణకు స్థానికులు, తల్లిదండ్రుల సలహాలను స్వీకరించాలి ⇒ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండాలి. రోజువారీ నిర్వహణ, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ తదితరాలకు హెచ్ఎం బాధ్యత వహించాలి. ⇒ ఈ తరగతుల నిర్వహణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేస్తారు. -
పంద్రాగస్టున సమర శంఖం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 15న సమర శంఖం పూరిస్తామని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించకపోవడంపై.. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లభించలేదని అన్నారు. శనివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం ఆదేశాలు అమలు కావడం లేదు.. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులకు సంబంధించి నెలకు రూ.700 కోట్లు చెల్లించాలి. కానీ గత నెలలో కేవలం రూ.183 కోట్ల మేర మెడికల్ బిల్లులు క్లియర్ చేశారు. ఈ నెలతో కలిపి రూ.1,217 కోట్లు చెల్లించాల్సి ఉండగా తాత్సారం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఉద్యోగుల గోడును విన్నవించినా...ఆయన పెడచెవిన పెట్టారు. ఈహెచ్ఎస్ పథకంలో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈహెచ్ఎస్ అమలుకు మోకాలడ్డుతున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా అధికారులు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీకి టీజీఈజేఏసీ ఇచ్చిన 57 డిమాండ్లకు సంబంధించిన నివేదికను బయటపెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కొన్ని శాఖల్లో ఉద్యోగుల ఖాళీలను తగ్గిస్తూ డౌన్సైజ్ చేయా లని చూడటం దుర్మార్గం. సీఎం, మంత్రి మండలి ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతి రేకంగా పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి ఆగస్టు 15వ తేదీలోగా తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే 15వ తేదీ నుంచి నిరసనలు చేపడతాం. పెన్షన్ విద్రోహదినంగా నిర్వహిస్తున్న సెపె్టంబర్ 1వ తేదీ తర్వాత జేఏసీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం..’అని జేఏసీ నేతలు వెల్లడించారు. జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవీ..⇒ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన నెలవారీ నిర్దేశిత బడ్జెట్ క్రమం తప్పకుండా విడుదల చేయాలి. ⇒ రెండు నెలలుగా చెల్లించాల్సిన రూ.1,217 కోట్లు ఈ నెలలోనే ఇవ్వాలి. ⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ( ఉఏ ) జూలై నెలాఖరులోపే పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేయాలి. ⇒ పెండింగ్‌లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి. ⇒ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ⇒ ఏకీకృత సర్విసు నిబంధనలను అమలు చేసేందుకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. ⇒ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి. ⇒ గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి. -
అన్ని పనులూ మేమే చేయాలా?
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్‌బోర్డు సొంత సిబ్బంది సంఖ్య 34 మంది.. ఆఫీసుల్లో వారే పనులు చేయాలి.. భూముల కబ్జాలను నిరోధించే డ్యూటీలూ వారివే.. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిష్టవేసే వారిని ఖాళీ చేయించే విధులూ వారివే.. లీజు బకాయిల వసూలు ‘బాధ్యతా’వారిదే.. ఈ పనులు చేయకుంటే క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సిందే.. ఇలా ఎన్నో పాత్రల్లో పనిచేయాల్సి రావటం ఇప్పుడు వారి ‘ప్రాణం’మీదకు తెస్తోంది.ముందురోజు రాత్రి పదింటి వరకు ఆఫీసులో డ్యూటీ చేసి, ఉదయం ఆరింటికే ఓ లీజు స్థలాన్ని స్వా«దీనం చేసుకోవటానికి వెళ్లిన బోర్డు సహాయ ఎస్టేట్ ఆఫీసర్.. అక్కడి వారితో జరిగిన వాదోపవాదాల మధ్య కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన హౌసింగ్‌బోర్డు సిబ్బంది పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకప్పుడు 800 మంది ఉద్యోగులతో కళకళలాడిన హౌసింగ్‌బోర్డు ఇప్పుడు 34 మంది సొంత సిబ్బంది, వారికి సహాయంగా ఉన్న కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బందితో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. లీజుదారుల ఆగడాలతోనే అసలు ఇబ్బంది ఇళ్లను నిర్మించి ఇచ్చే ప్రధాన భూమిక నుంచి హౌసింగ్‌బోర్డు ఎప్పుడో వైదొలిగి.. ఉన్న భూము లను వేలం రూపంలో అమ్ముకునేందుకు పరిమితమైన నేపథ్యంలో.. సిబ్బంది కొరత పెద్ద అడ్డుగా మారలేదు. కానీ, దాదాపు 100 ఎకరాల భూముల్లో ఉన్న లీజుదారుల ఆగడాలను ఎదుర్కొనే విషయంలో మాత్రం వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లీజుదారులు దాదాపు రూ.100 కోట్ల వరకు బోర్డుకు బకాయి ఉన్నారు. ఈ మొత్తం వసూలుతోపాటు, లీజు గడువు ముగిసిన వారి చెర నుంచి భూములను స్వాధీనం చేసుకునే విషయంలో మాత్రం సిబ్బంది దినదినగండంగా పనులు చేస్తు న్నారు. శనివారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో లీజు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన బృందంలోని సహాయ ఎస్టేట్ ఆఫీసర్ జగదీశ్వరరావు వాదోపవాదాలతో తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందటం బోర్డు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. లీజు స్థలాలను ఖాళీ చేయించటం, లీజుల వసూలు తదితరాలకు ప్ర త్యేక విభాగాన్ని ఏర్పాటు చేయటంతోపాటు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సిందేనన్న డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచుతున్నారు. ‘నాకు పెద్ద పోస్టుకు పదోన్నతి లభించిందన్న సంతోషం లేకుండాపోయింది. తీవ్ర ఒత్తిడి, భయాందోళనల మధ్య పని చేయాల్సి రావటం కష్టంగా మారింది. దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలన్న యోచనలో ఉన్నాను’బోర్డు ఇంజనీరింగ్ విభాగ ఉన్నతాధికారి ఒకరు సన్నిహితులతో అంటున్న మాట. మిగతావారు కూడా ఇలాంటి యోచనలోనే ఉన్నారు. ఏళ్లకేళ్లుగా నియామకాలు లేకనే.... గత ప్రభుత్వం హౌసింగ్బోర్డును దాదాపు మూసేసినంత పనిచేసింది. ఏళ్లుగా నియామకాలు లేవు. దీంతో కేవలం 34 మంది సిబ్బందే మిగిలారు. శనివారం మెహిదీపట్నంలో ఓ ఫంక్షన్ హాలును ఖాళీ చేయించే పని కోసం ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని పిలిపించి దాదాపు 25 మంది వెళ్లాల్సి వచ్చింది. లీజుదారుల వైపు నుంచి బౌన్సర్లు రంగంలో ఉండటంతో వారిని ఎదిరించి స్థలాల్లోని భవనాలను సీజ్ చేయటం, ఖాళీ చేయించటం తమ వల్ల కావటం లేదని కొంతకాలంగా ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. కానీ, వారికి రక్షణగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ అధికారి చనిపోవటంతో తదుపరి ఇలాంటి కార్యాచరణకు తాము రంగంలో దిగమని ప్రభుత్వానికి తేల్చి చెప్పాలని మిగతా ఉద్యోగులు ఓ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. తమ రక్షణ కోసం చర్యలపై కోరినా, ఇలాంటి సాహసోపేత పనుల విషయంలో కాస్త తటపటాయించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అభియోగాలు నమోదు చేస్తే వాటిని సకాలంలో తొలగించే చర్యలు ఉండటం లేదని, వీటివల్ల పదోన్నతులు కోల్పోతున్నామని, రిటైర్ అయినా కూడా అభియోగాలు అలాగే ఉంచి పెన్షన్ రాకుండా చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. -
డాక్టర్.. ఏఐ ఏం చెప్పిందంటే..
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. దీంతో చాలామంది తమ కు ఉన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కూడా ఏఐ ద్వారా తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వైద్యు ల సలహా మేరకు చేయించుకునే మెడికల్ టెస్టులు, ల్యాబ్ రిపోర్టులను వైద్యులకు చూపించటానికి ముందే ఏఐ చాట్బాట్ల ద్వారా విశ్లేషించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు నిజ మైన వైద్యులకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇంటర్నెట్లో శోధించి చిట్కాలు తెలుసుకునే వారి ని ‘గూగుల్ డాక్టర్లు’గా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఏఐ చాట్బాట్లతో గతంకంటే ఎక్కువ విషయాలే తెలుస్తుండటంతో కొందరు తమకు అంతా తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ ఆన్లైన్ పరిజ్ఞానం బయట పెడుతూ నిజమైన వైద్యుల బుర్రలు తింటున్నారు. రోగుల మితిమీరిన సందేహాలతో వారిని సంతృప్తి పర్చలేక తమ తల ప్రాణం తోకకు వస్తోందని వైద్యులు వాపోతున్నారు. మంచీ.. చెడు రెండూ ఉన్నాయి.. జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీలో లభించే సమా చారంతో తమ రిపోర్టుల గురించి చర్చించే కొందరు రోగుల వాదనా పటిమ ఆశ్చర్యపరుస్తోందని ఢిల్లీలోని పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్, ఎయిమ్స్ పల్మనాలజీ విభాగం మాజీ అధిపతి డా.జీసీ ఖిల్నానీ తెలిపారు. తమకు ఉన్న వైద్య సమస్యలపై డాక్టర్లను సంప్రదించడానికి ముందే కొందరు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అనియంత్రిత సమాచారం ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.దీనివల్ల చాలామంది ఎంతో ఆందోళనతో తన వద్దకు వచ్చారని, వారికి అర్థమయ్యేలా వివరించేందుకు చాలా సమయం పట్టి ందని పేర్కొన్నారు. ఊహించుకునే అవకాశాలు ఉన్నాయ ని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో డాక్టర్లు రోగులకు సరైన చికిత్స అందించేందుకు మొగ్గుచూపుతారని తెలిపా రు. ఏఐ చాట్బాట్లు ఆరోగ్య సంరక్షణపై ఆశాజనకమైన సమాచారం అందిస్తున్నా, ఆ సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి మానవ పర్యవేక్షణతోపాటు బాధ్యతాయుతమైన వ్యవస్థల ఆవశ్యకత ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
మేడిగడ్డకు 3.41 లక్షల క్యూసెక్కుల వరద
కాళేశ్వరం/కన్నాయిగూడెం/దోమలపెంట: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరద తాకిడితో గోదావరికి ప్రవాహం పెరుగుతోంది. శనివారం పుష్కరఘాట్లను తాకు తూ నీటిమట్టం దిగువకు ప్రవహించింది. దీంతో కాళేశ్వరం వద్ద 8.700 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కి వరదనీరు చేరి 3.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరద నీటిని ఔట్‌ఫ్లో రూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, మేడిగడ్డ బరాజ్ వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా ఇరిగేషన్‌శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్య లు తీసుకున్నారు. వరద తాకిడి పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి బరాజ్‌పై వంతెన ద్వారా రాకుండా గేటును వెల్డింగ్ చేశారు. సమ్మక్క సాగర్‌కు 5,28,450 క్యూసెక్కుల నీరు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బరాజ్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వాగులు, ఒర్రెలు, చెరువుల నుంచి గోదావరిలోకి వరదనీరు వస్తోంది. దీంతో మేడిగడ్డ, సరస్వతి బరాజ్ నుంచి వరదనీరు సమ్మక్క సాగర్ బరాజ్‌లోకి చేరుతోంది. శనివారం ఎగువ నుంచి 5,28,450 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో బరాజ్ వద్ద 59 గేట్లలో 44 గేట్లను ఎత్తి 5,65,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బరాజ్ వద్ద నీటి మట్టం 83 మీటర్లకు 80.05 మీటర్లు కొనసాగుతోంది. బరాజ్‌త సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు కొనసాగుతున్న ప్రవాహం జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటలకు జూరాల స్పిల్‌వే ద్వారా 35,820 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 34,286, సుంకేసుల నుంచి 31,928 మొత్తం 1,02,034 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,929 మొత్తం 66,244 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.4 అడుగుల నీటిమట్టం వద్ద 201.1205 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
తెలంగాణలో కొత్త నాయకత్వం
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: తెలంగాణలో చురుకైన కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కొత్త పంథాలో వెళ్తేనే సంస్థలకు మనుగడ ఉంటుందని, కాలానుగుణంగా తెలంగాణ జాగృతి కూడా తన పంథాను మార్చుకుంటుందని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘లీడర్’రాజకీయ శిక్షణ కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లీడర్ అంటే కేవలం సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవులు పొందడమే కాదన్నారు. లీడర్ ఆకాశం నుంచి ఊడిపడరని, ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరని కవిత పేర్కొన్నారు. నేర్చుకుంటూ, తనను తాను మార్చుకుంటూ ముందుకెళ్లేవారే నాయకులు అవుతారన్నారు. మూస పద్ధతిలో కొనసాగేవాడు ఎప్పుడూ నాయకుడు కాడని అన్నారు. తోటివారి గోప్యత, మర్యాదను కాపాడకుండా నోటికి వచి్చంది మాట్లాడటమే ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే జాగృతి లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు నుంచి అన్ని జిల్లాల్లో లీడర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ జాతికి ఉన్న అద్భుతమైన సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందన్నారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే జాగృతి ఊరుకోబోదని, తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కవిత స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామని కవిత ప్రకటించారు. -
జైపాల్‌రెడ్డి చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నాయకుడు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన చొరవే కారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన జైపాల్‌రెడ్డి దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హైయ్యర్ ఎడ్యుకేషన్, కేపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో.. రచయిత, ఆర్థిక నిపుణులు మోహన్ గురుస్వామికి ‘ఎస్.జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు’ను ప్రదానం చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. తెలంగాణలో పీవీ తర్వాత జైపాల్‌రెడ్డే.. జైపాల్‌రెడ్డి పాత్ర లేకపోతే ఇవాళ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదని రేవంత్‌రెడ్డి చెప్పారు. చర్చ లేకుండానే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా ఆయన ప్రత్యేక పాత్ర పోషించారని, జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియాగాంధీ కూడా ఒక సందర్భంలో తనతో చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప.. పదవుల కోసం ఆయన ఎన్నడూ పారీ్టలు మారలేదని చెప్పారు. పెట్రోలియం శాఖ మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని, సమాచార శాఖ మంత్రిగా ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారని గుర్తు చేశారు.పార్లమెంటులో రాణించిన వాజ్‌పేయి మొదలుకుని అనేకమంది మేధావుల్లో ఎవరితోనూ జైపాల్‌రెడ్డికి వ్యక్తిగత వైరం లేదని, చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో పీవీ నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్న నాయకుడు జైపాల్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక నిలువెత్తు శిఖరం అని, పీవీ, జైపాల్‌రెడ్డి లాంటి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలని చెప్పారు.ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్ పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపైనే జైపాల్‌రెడ్డి ఎక్కువ ఆలోచించేవారని, రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ప్రయత్నించారని రేవంత్ చెప్పారు. అయితే నాటి ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి ఇవాళ స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని, దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్మెంట్ పాలిటిక్స్ వచ్చాయని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని, యూనివర్సిటీల్లో విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు’అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు శస్మిత్ పాత్రా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ వీసీ ప్రొఫెసర్ ఎల్.ఎస్.గణేశ్, కేపిటల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను ప్రదానం చేశారు. -
కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులు పొందిన వారందరికీ ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించేందుకు వైద్య,ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డుల్లో పేరున్న వ్యక్తులందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్‌కార్డులు ఉండగా, వాటిలో సభ్యులుగా 2.81 కోట్ల మంది ఉన్నారు. వీరందరు ఆరోగ్యశ్రీ పోర్టల్‌తో అనుసంధానమై ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకు చికిత్సలకు అవకాశం ఉంటుంది. కొత్తగా 30 లక్షల మంది జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్తగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. కొత్తగా సుమారు 6 లక్ష లకు పైగా రేషన్‌కార్డులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 95,56,625కు పెరిగింది. వీటిల్లో 3.10 కోట్ల మంది లబి్ధదారులుగా నమోదయ్యారు. కొత్తగా కార్డుల్లో చేరిన 30 లక్షల మంది వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్‌లోకి ఎక్కి స్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కొత్త కార్డుదారుల వివరాలను కూడా ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో ఎక్కించాలని ఆదేశించటంతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు. 2023 నుంచి 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు: మంత్రి దామోదర రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్, 2023 నుంచి ఇప్పటివరకు 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించినట్లు మంత్రి దామోదర తెలిపారు. వైద్య సేవల బిల్లుల కింద ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.1,590 కోట్లకుపైగా చెల్లించింది. సగటున 22 శాతం మేర చికి త్స చార్జీలు పెరగడంతోపాటు ప్రతి నెలా ఆస్పత్రు లకు బిల్లుల కింద రూ.100 కోట్ల వర కు చెల్లిస్తుండడంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో చేరేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 461 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవ లు అందుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
మరో తెలంగాణ ఉద్యమం తప్పదు
సాక్షి, హైదరాబాద్/ ఉప్పల్ /కాప్రా: నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తామని..బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతామని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మల్లాపూర్‌లోని ఓ గార్టెన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ..తన శిష్యుడు రేవంత్‌రెడ్డితోపాటు...ఢిల్లీ కూడా తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నారని..రేవంత్, ఢిల్లీ ఒప్పుకున్నా తెలంగాణ సమాజం మాత్రం బనకచర్లకు ఒప్పుకోదని హెచ్చరించారు. తెలంగాణ సమాజం మరో ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు. అవసరమైతే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమానికి వేదికలై తెలంగాణ హక్కులు కాపాడుతాయని హెచ్చరించారు. బనకచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తలూపి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడని, తెలంగాణ రైతులు ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గోదావరి జలాలపై విద్యార్థులకు హరీశ్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ ద్రోహుల లిస్ట్ రాస్తే మొదటి పేరు చంద్రబాబు, రెండో పేరు రేవంత్ రెడ్డిదేనన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని, ఉద్యమ జ్ఞాపకాలను తూడిచే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌ను టీజీగా మార్చడమే అందుకు నిదర్శనమన్నారు. రేపటితరం నాయకులైన విద్యార్థులే తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటి దొంగలు తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారని చెప్పారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జై తెలంగాణ అనే నినాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధం కొనసాగిస్తుందని చెప్పారు. పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డే: కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద కోవర్ట్‌గా పనిచేస్తున్నాడని, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని గ్రహించి గులాబీ పార్టీ లేకుండా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బనకచర్ల పేరిట గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రలను ఆపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్వీ ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘కేసీఆర్‌తో పాటు నన్ను, పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కట్టుగా కుట్రలు, దాడి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి అన్ని లెక్కలు తేలుస్తాం ‘ఫోన్ ట్యాపింగ్ తాము కూడా చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పాడు. ఆరు గ్యారంటీలు 420 హామీల అమలు గురించి ప్రజలు అడగకుండా ఉండేందుకు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కల్పిత కథలను సృష్టించారు. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు గడ్డి తింటున్నారా. రేవంత్‌రెడ్డి కట్టు బానిసలు లాగా పనిచేస్తున్న కొందరు పోలీసులకు మెదడు ఉందా. అక్రమ కేసులు పెడుతూ, అధికార పార్టీ నేతల అండతో చెలరేగిపోతున్న పోలీసు అధికారుల పేర్లు రాసిపెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. మిత్తీతో సహా అన్ని లెక్కలు తే లుస్తాం. కేసులకు భయపడకుండా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల జాతర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆదాయ, వ్యయాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన నివేదికల ప్రకారం బహిరంగ మార్కెట్లో రుణాలను ఏపీనే అందరికంటే ఎక్కువగా తీసుకుంటోంది. అప్పుల్లో ఏపీ రూ. 37 వేల కోట్లతో మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ రూ. 26 వేల కోట్లే తీసుకోవడం గమనార్హం. కాగ్ ఇటీవల వెల్లడించిన నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడు నెలల (2025 ఏప్రిల్, మే, జూన్) కాలంలో రూ.37.093 కోట్ల అప్పులను సేకరించింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఒకింత తక్కువే అయినా రూ. 20 వేల కోట్ల అప్పుల చిట్టాను దాటిపోయింది. తెలంగాణతో కొంచెం అటూ ఇటుగా కేరళ, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలుండగా, మధ్యప్రదేశ్ మాత్రం తెలంగాణ కంటే ఎక్కువగానే అప్పులు తీసుకుంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ ఎవరికీ చిక్కనంత దూరంలో నిలిచింది. జాబితాలో ఏపీ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. సగానికి చేరువగా...! వాస్తవానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇంత మొత్తంలో రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ మేరకు వార్షిక బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించి అసెంబ్లీ ఆమోదం తీసుకుని ఏడాదిపాటు ఆ రుణాలను క్రమంగా తీసుకుంటాయి. కానీ ఏపీ మాత్రం కేవలం మూడు నెలల కాలంలోనే ఏడాది మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న అప్పుల్లో దాదాపు సగం అప్పుడే తీసేసుకున్నట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం రూ.79,926.89 కోట్లను 2025–26 ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు కింద సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, అందులో 46.40 శాతం అంటే రూ. 37,093.98 కోట్లను అప్పుడే తీసేసుకుంది. ఇక, తెలంగాణ రూ. 54,009.74 కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకుని తొలి మూడు నెలల కాలంలో 37.52 శాతం అంటే రూ. 20,266.09 కోట్లను సమకూర్చుకుంది. తెలంగాణలో కొంచెం అటూ ఇటుగా...తెలంగాణ ఖజానా గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ముందుకెళ్తోంది. గత వార్షిక బడ్జెట్ లక్ష్యంలో తొలి మూడు నెలల్లో 17.80 శాతం నిధులు సమకూరగా, ఈసారి కొంచెం ఎక్కువగా 20.19 శాతం అంటే రూ.57,449 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో గత ఏడాది లక్ష్యంతో పోలిస్తే తొలి మూడు నెలల్లో 16.10 శాతం రాగా, ఈ ఏడాది 35,721.80 కోట్లు (16.20%) వచ్చాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, పన్నేతర ఆదాయం...ఇలా అన్ని పద్దుల్లోనూ కొంచెం అటూ ఇటుగా 2024–25 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నిధులు సమకూరుతున్నాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అప్పులు మాత్రం ఈసారి ఒకింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది పెట్టుకున్న రుణలక్ష్యంలో తొలి మూడు నెలల్లో 26.74 శాతం సమకూర్చుకోగా, ఈసారి మాత్రం 37.52 శాతం రుణాలను తీసేసుకోవడం గమనార్హం. ఇక, ఆదాయ రాబడులు ఎలా ఉన్నాయో వ్యయ లెక్కలు కూడా అలాగే ఉన్నాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. అన్ని పద్దుల కింద కలిపి మొత్తం రూ. 57,499. 58 కోట్లు రాగా.. రూ.52,559.96 కోట్లు ఖర్చయ్యాయి. రూ.10,582.85 కోట్లు రెవెన్యూ లోటు నమోదు కాగా, రూ.20,266.09 కోట్ల ద్రవ్య లోటుతో తెలంగాణ ఖజానా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025 -
వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్, బీజేపీ దాడి చేస్తున్నాయంటూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని చూసి దేశం నివ్వెర పోయిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు స్వర్ణయుగం అని.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.కాళేశ్వరం నిర్మించి ప్రపంచంలో తెలంగాణను హిమాలయాలంత ఎత్తులో నిలిపారు కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనే అనుమానం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులకు మేలు చేసినందుకు మమ్మల్ని ఉరి తీయాలా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.తెలంగాణకు పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవని.. గులాబీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది.. నా చెంచాగాడు రేవంత్ ఉన్నాడని చంద్రబాబు అనుకుంటున్నాడు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోన్ ట్యాపింగ్‌లో పసలేదని పోలీసులే చెబుతున్నారు. మా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా?. మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా? అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అధికారి ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్వీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. కేసులకు భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవటానికి పార్టీ లీగల్ సెల్ ఉంది. గట్టిగా పోరాడే వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ జల హక్కులకు పిండం పెడుతుంటే మనం ఊరుకుందామా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.