breaking news
Vizianagaram
-
సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా సురేష్
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వె వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో పలువురిని నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలానికి చెందిన ఉపద్రష్ట సురేష్‌ను సోషల్‌మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను సూచించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సురేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ స్పందిస్తున్న తీరును వివరిస్తూ..సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని సురేష్ అన్నారు. -
ఆస్తిపై హక్కును రద్దు ఎలా చేస్తారు
పాలకొండ రూరల్: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పొందుపర్చిన వెసులుబాటులను ఆసరాగా చేసుకుని తనకు దఖలుపడిన ఆస్తిపై ఉన్న హక్కును తన ప్రమేయం లేకుండా ఎలా రద్దు చేస్తారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఎటువంటి నిబంధనలు ఉండవా? అడ్డగోలుగా వ్యవహరిస్తారా? అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించడంతో పాటు తనకు అన్యాయం చేయవద్దంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..అనకాపల్లి జిల్లా, అదే మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కట్టుమూరి సుమతి, అప్పారావు దంపతులు శుక్రవారం పాలకొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తిని కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ సందర్భంగా బాధితురాలు సుమతి మాట్లాడుతూ తన తల్లి ఓదిరి జయమేరి పసుపు కుంకుమ నిమిత్తం విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సర్వే నంబర్ 63/3 (డాబాగార్డెన్స్–కప్పరాడ గ్రామం) వద్ద డోర్ నంబర్ 57–28–16/7 అసెస్మెంట్ నంబర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్‌ను గిఫ్ట్ రూపంలో అందించారన్నారు. ఇందుకు సంబంధించి 2021లో ద్వారకానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 2757/2021 రిజిస్ట్రేషన్ చేసినట్లు వివరించారు. ఇటీవల తన ప్రమేయం లేకుండా సదరు గిఫ్ట్ దస్తావేజును పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025 జూన్ 25వ తేదీన ‘ఎనీవేర్’ పద్ధతిలో వేరొకరు రద్దు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. తన సోదరుడు ఓదిరి సతీష్, ఆయన భార్య విజేత ఈ చర్యలకు పాల్పడినట్లు వాపోయారు. నోటీసులు ఇవ్వకుండా చేశారు రిజిస్ట్రేషన్ సమయంలో పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు తనకు ఎటువంటి నోటీసులు, సమచారం ఇవ్వకుండా తన ఆస్తిపై హక్కును రద్దు రిజిస్ట్రేషన్ చేయించడం అన్యాయమని వాపోయారు. రిజిస్ట్రేషన్ విధానంలో గల ఎనీవేర్ పద్ధతిని అడ్డుపెట్టుకుని అధికారం, పలుకుబడి, నగదు చెల్లించి నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహరంపై లోతైన దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధిత దంపతులు సుమతి, అప్పారావు కోరారు. ఫిర్యాదును పరిశీలించిన పాలకొండ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ తన హయాంలో ఈ దస్తావేజు రద్దు జరగలేదన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రాలు రద్దు చేయాలంటే కచ్చితంగా సంబంఽధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. వారి సమక్షంలో రద్దు దస్తావేజీలు రూపొందించాల్సి ఉంటుంది. బాధితులు అందించిన ఫిర్యాదును ఉన్నతాఽధికారులకు అందిస్తామని చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కన్నీరుపెట్టుకున్న బాధితులు -
ఇదెక్కడి అన్యాయం బాబూ..!
వసాది గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి లక్ష్మీనారాయణ మే నెలలో చనిపోయారు. అతని భార్య ఎర్రయ్యమ్మ భాగస్వామి కోటా కింద వితంతుపింఛన్ కోసం దరఖాస్తు చేసింది. జూన్ నెలలో ఆమెకు కూడా పింఛన్ మంజూరైనట్టు సచివాలయ ఉద్యోగులు చెప్పారు. శుక్రవారం సచివాలయం ఉద్యోగులను ఆమె అడిగితే మా లాగిన్‌లో పింఛన్ రాలేదని చెప్పడంతో ఆమె కూడా అయోమయానికి గురయ్యారు. ఉద్యోగుల వద్దే ఆవేదన వ్యక్తంచేశారు. ‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి సారిక పోలయ్య ఈ ఏడాది మే నెలలో చనిపోయారు. ఇతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో అతని భార్య కళావతి భాగస్వామి (స్పౌజ్) కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ నెలలో పింఛన్ మంజూరైనట్టు సచివాలయం ఉద్యోగులు చెప్పారు. జూన్ 12వ తేదీన పింఛన్ డబ్బులు అందజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీని వాయిదా వేయడంతో ఆ నెలలో డబ్బులు అందలేదు. ఆగస్టు నెలలో భాగస్వామి పింఛన్‌దారులకు డబ్బులు అందజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీ కావడంతో కళావతి పింఛన్ డబ్బుల కోసం సచివాలయం ఉద్యోగులను శుక్రవారం కలిశారు. లాగిన్‌లో పేరు లేదని చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలైంది. జూన్నెలలో మంజూరైనట్టు చెప్పి ఇప్పుడు పేరులేదంటున్నారేమిటంటూ ఆమె గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది.’ గంట్యాడ: పింఛన్ డబ్బులు వస్తే ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయని నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఆగస్టు నెలలో పింఛన్ డబ్బులు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు నెలల కింద పింఛన్ మంజూరైందని చెప్పిన ఉద్యోగులే.. ఇప్పుడు మీ పేరు లాగిన్‌లో లేదని చెప్పడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదెక్కడి అన్యాయం బాబూ అంటూ ప్రశిస్తున్నారు. కూటమి నేతల ఒత్తిడితో కొంతమంది లబ్ధిదారులకు పింఛన్లు నిలిపివేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లేదంటే పింఛన్ ఐడీ వచ్చిన తర్వాత లాగిన్లోకి రాకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా కొత్తగా పింఛన్లు మంజూరు చేయని కూటమి సర్కారు.. భాగస్వామి కోటాలో భర్త చనిపోతే భార్యకు మంజూరు చేసే పింఛన్లలో కూడా కోతపెట్టి వితంతువులను ఆవేదనకు గిరిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా దృష్టికి వచ్చింది వసాది, పెదవేమలి గ్రామాల్లో జూన్ నెలలో పింఛన్ మంజూరైనట్టు ఐడీ వచ్చి ఇప్పడు మంజూరు కాని విషయం మా దృష్టికి వచ్చింది. మిగిలిన గ్రామాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా సేకరించి క్లారిఫికేషన్ కోసం డీఆర్డీఏ పీడీకి లేఖరాస్తాం. – ఆర్.వి.రమణమూర్తి, ఎంపీడీఓ, గంట్యాడ జూన్ నెలలో పింఛన్ మంజూరు ఆగస్టులో జాబితాలో పేరు తొలగింపు అయోమయంలో లబ్ధిదారులు -
● శ్రావణ శోభ
శ్రావణమాసం రెండో శుక్రవారం ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దచెరువు గట్టును ఆనుకుని ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి 60 కిలోల రాజమండ్రి రంగు పసుపు కొమ్ములతో అలంకరించగా, వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు బంగారు చీర, వజ్రకిరీటంలోను, చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి నిమ్మకాయలు, జామిలోని వాసవీమాత కరెన్సీ నోట్ల అలంకరణలో దర్శనమిచ్చారు. – విజయనగరం టౌన్/ చీపురుపల్లి/జామి -
వినూత్న సాగుతో ఆదర్శంగా..!
ఆయనొక రైతు. వ్యవసాయాన్ని నమ్ముకుని వారసత్వంగా వచ్చిన భూమిలో సరికొత్త పద్ధతిలో సాగుచేయడం ప్రారంభించారు. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విధానాలు అవలంబిస్తూ వ్యవసాయంలో పోటీపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని రైతులకు దీటుగా ఇక్కడ వ్యవసాయం చేస్తూ దిగుబడులు సాధిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరుగా ఏపీ సీడ్స్‌కే ప్రతి ఏడాది విత్తనాలు అందించే ఆ రైతు ఈ ఏడాది కూడా ఖరీఫ్సాగులో మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్‌లో సాగుచేసే వరి పంటలో ఉభయగోదావరి జిల్లాల రైతులుఅవలంబిస్తున్న విధానాన్ని ఇక్కడ తన పంట పొలాల్లో ప్రారంభించారు. ఆయన మరెవరో కాదు రేగిడి మండలంలో ఉణుకూరు గ్రామానికి చెందిన గేదెల వెంకటేశ్వర రావు. – రేగిడిలైన్సోయింగ్ పద్ధతిలో నాట్లు వేస్తున్న బెంగాల్ కూలీలు● ఖరీఫ్‌లో కొత్త తరహా నాట్లు ● లైన్ సోయింగ్ విధానంతో వరినారు ఆదా ● ఎకరాకు 8 కిలోల విత్తనాల వరినారుతో ఉడుపు ● పశ్చిమబెంగాల్ కూలీలతో వరి ఉభాలు ● రైతు గేదెల వెంకటేశ్వర రావు కృషిఇష్టంతోనే.. వ్యవసాయం కష్టంతో కాకుండా ఇష్టంతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. విత్తనాల దగ్గర నుంచి ఎరువులు వరకూ ప్రతి పెట్టుబడికి ఇతరులపై ఆధార పడకూడదు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే స్థితికి రావాలి. రసాయన ఎరువులు తగ్గించి సాగుచేసే విధానంవైపు రైతులు దృష్టిసారించాలి. మిగిలిన ప్రాంతాల్లోని రైతులతో పోటీపడే ఆలోచన రావాలి. అప్పుడే వ్యవసాయంలో లాభాలు కనిపిస్తాయి. ఈ ఏడాది లైన్‌సోయింగ్ విధానంలో వరినాట్లు వేశాం. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది. – గేదెల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు, ఉణుకూరుజిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు ఉణుకూరు గ్రామంలో 50 ఎకరాలకు పైగా పంటపొలాలు ఉన్న రైతు. ఇంత ఆస్తి ఉన్నా తాను ఆ భూమిని ఎవరికీ కౌలుకు ఇవ్వలేదు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కోసం అర్రులు చాచలేదు. తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూమినే నమ్ముకున్నారు. వ్యవసాయాన్నే ఉద్యోగంగా మార్చుకుని ఊహతెలిసినప్పటి నుంచి వినూత్న పద్ధతుల్లో పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల మోతాదు తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆది నుంచి ఆసక్తిగా వ్యవసాయం చేసే వెంకటేశ్వరరావుకు వ్యవసాయంలో వచ్చే కొత్త పద్ధతులు వేగంగా అందుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇందులో భాగంగానే ఈ ఏడాది లైన్ సోయింగ్ విధానాన్ని అందుకుని, ఇక్కడ తన పంటపొలాల్లో ఈ పద్ధతిని ప్రారంభించారు. 8 కిలోల విత్తనాలతో ఎకరాలో సాగు సాధారణంగా రైతులు ఎకరాసాగులో వరి ఉభాలకు 30 కిలోల వరకూ వరి విత్తనాలతో వరినారు తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నారు సరిపోని పరిస్థితి ఉంటుంది. వరి ఉభాలు చేసిన సమయంలో ఈ ప్రాంతంలో కనీసం పదిమొక్కలను కలిపి ఒకేచోట వేస్తుంటారు. ఇలా కాకుండా ఒకచోట ఒక వరి నారును మాత్రమే ఉభాలు చేసి, ఒక వరి మొక్కకు మరో మొక్కకు మధ్య కనీసం పది అంగుళాల ఖాళీ ఉంచి ఉభాలు చేయడాన్ని లైన్‌సోయింగ్ విధానం అంటారు. ఈ విధానాన్ని ఉభయగోదావరి జిల్లాలోని రైతులు అవలంబిస్తున్నారు. ఈ విధానంతో ఆయా ప్రాంతాల్లో వరి పంట అధికంగా దిగుబడి రావడంతో పాటు చీడపీడలు తట్టుకుంటుంది. ఒక వరి మొలక కాస్తా పెరగగానే 30వరకూ పిలకలు వేసి పెద్ద దుబ్బుగా మారుతుంది. పెద్దగింజల కంకి హారం కట్టి, ఎకరాకు 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విధానం నిమిత్తం వెంకటేశ్వర రావు ఎకరాకు 8కిలోలు చొప్పున విత్తనాలతో నారు పోసి పశ్చిమబెంగాల్ నుంచి కూలీలను తీసుకొచ్చి తనకున్న పొలాల్లో 40 ఎకరాల్లో ఈ విధానంలో వరినాట్లు వేయించారు. వారం రోజుల పాటు ఈ విధానంలో పంటపొలాల్లో వరినాట్లు వేయించారు. ప్రస్తుతం ఈ వరినాట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విధానాన్ని చూసిన మరో రైతు కూడా తనకున్న పది ఎకరాల్లో వరిసాగుచేస్తున్నారు. దిగుబడి సాధనలో దిట్ట గేదెల వెంకటేశ్వరరావుకు జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పేరుంది. వరి పంటలో స్థానిక రకాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుచేసే సన్నాలు, మసూరి పంటలను కూడా సాగుచేస్తుంటారు. ఆయన వద్ద ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వరితో పాటు మిరప, మొక్కజొన్న పంటల సాగులో కూడా మంచి దిగుబడి సాధించే సత్తా వెంకటేశ్వరరావుకు ఉంది. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సైతం ఆయన సాగుచేస్తున్న పంటను పరిశీలించేందుకు వస్తుంటారు. ఆయన సాగుచేస్తున్న వరిపంటలో నాణ్యత ఉండడంతో గత 20 సంవత్సరాలుగా ఏపీ సీడ్స్‌కు విత్తనాలు అందిస్తున్నారు. -
ఫలించిన రన్ మిషన్ కష్టం..
● పోలీస్ ఉద్యోగాలకు 14 మంది ఎంపికచీపురుపల్లి: రక్షణ దళంలో ఒకటైన ఎయిర్‌ఫోర్స్‌లో ఆయనొక ఉద్యోగి. అయితే అందరి ఉద్యోగుల్లాగా తన పని తాను చేసుకుంటూ కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఆయన ఉండలేదు. తన లాగానే మరెంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత పోలీస్, రక్షణ దళంలో చేరాలని అందుకు అవసరమైన సహకారాన్ని అందజేయాలని తపించారు. అందులో భాగంగానే పుట్టుకొచ్చింది రన్ మిషన్. ఆ రన్ మిషన్ ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధనకు వేదికై ంది. తాజాగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో రన్ మిషన్ నేతృత్వంలో శిక్షణ పొందిన 14 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో వారంతా రన్ మిషన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కంది హేమంత్ రన్ మిషన్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతీ, యువకులకు పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా శిక్షణ తీసుకున్న యువతలో తాజాగా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో ఐదుగురు, ఏపీఎస్పీ విభాగంలో 9 మంది ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. రన్‌మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తుండడంతో వ్యవస్థాపకుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి●
● ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష పార్వతీపురం: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.పావని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహర దీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన తరువాత పీజీ చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, జిల్లా కేంద్రాల్లో పీజీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని, కార్పొరేట్లను ప్రోత్సహించేలా విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఏఎన్ఎంలను నియమించకపోవడంతో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా యన్నారు. ఈ దీక్షలకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టి.అఖిల్, ఎం.సంధ్య, కె.డేవిడ్, ఎ.గంగారావు, ఎం.సురేష్, జి.సంజీవ్, సింహాచలం, రాజేష్, చంటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు కీలక మార్గదర్శకాలువిజయనగరం అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు కళాశాలల నిర్వహణకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీ మజ్జి ఆదినారాయణ విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాకు చెందిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మార్గదర్శకాలపై వివరించారు. కార్యనిర్వహణ, విద్యాప్రమాణాల బలోపేతానికి సంబంధించిన సూచనలు విధిగా పాటించాలని కోరారు. కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి హాజరు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్‌లో, భౌతిక హాజరు పుస్తకంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల దృష్ట్యా మొదటి సంవత్సరం విద్యార్థులను ఈ నెల 11వ తేదీ వరకు చేర్చుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల విజయశాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిభావంతుల కోసం పోటీ పరీక్ష శిక్షణ అందించాలన్న మార్గదర్శకాలు పాటించాలన్నారు. సమావేశంలో ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారువరకట్న వేధింపులపై కేసు నమోదుబాడంగి: కోరినంత బంగారం, కట్నం ఇవ్వలేదన్న కారణంగా నిశ్చితార్థం పూర్తయి పెళ్లివరకు వచ్చిన సంబంధం తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన కందుల చందనకు, బొబ్బిలికి చెందిన గ్రంధి సందీప్ గణేష్‌కు మేనెల 4వతేదీన నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు పెళ్లిమాటల్లో 20 తులాల బంగారం, లక్షన్నర కట్నం ఆడపెళ్లివారు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా నిశ్చితార్థం రోజున 10తులాల బంగారం, రూ.50 వేల నగదు అడ్వాన్స్‌గా పెల్లికుమారుడికి ఇచ్చారు. వారికి ఈనెల14వతేదీ పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికొడుకు తండ్రి గ్రంధి దుర్గాప్రసాద్ అదనపుకట్నంగా మరోఐదుతులాల బంగారం కావాలని కోరడంతో ఆడపిల్లవారు ససేమిరా అన్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ మేరకు పెళ్లికుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో పెళ్లికొడుకు, మామ దుర్గాప్రసాద్, అత్త జయలక్ష్మిల మీద వరకట్న వేధింపుల కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.పెళ్లికొడుకు తండ్రి బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో హెచ్‌డీటీగా పనిచేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.మేడపై నుంచి జారిపడి యువకుడి మృతిసాలూరు రూరల్: పట్టణ పరిధిలోని బొడ్డవలస గ్రామానికి చెందిన బండి మనోజ్ (25)తన ఇంటి మేడపై నుంచి జారి పడి మృతి చెందినట్లు పట్టణ సీఐ అప్పల నాయుడు తెలిపారు. ఇంటి మేడపై వడియాలు ఆరపెట్టేందుకు వెళ్లిన ఆయనకు గల శారీరక బలహీనత, అంగవైకల్యం కారణంగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.772 లీటర్ల సారా ధ్వంసంపార్వతీపురం రూరల్: ఇటీవల పట్టుబడిన 17 సారా కేసుల్లో స్వాధీనం చేసుకున్న 772 లీటర్ల సారాను పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్పీ అంకితా సురాన ఆధ్వర్యంలో పట్టణ శివారులో శుక్రవారం ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సంతోష్‌కుమార్, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై ఎం.గోవింద సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
వేపాడ: ఎంఈఓ–1 పోస్టులను కామన్ సర్వీస్ రూల్స్ ప్రాప్తికి నియమించాలంటూ పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సహాయకులతో పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లతో కామన్ సర్వీస్ రూల్స్ ప్రాప్తికి ఎంఈఓ పోస్టులు భర్తీచేయాలని కోరారు. ● విజయనగరం అర్బన్: ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ఎంఈఓ పోస్టులు భర్తీచేయాలని, కేవలం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వడం సరికాదని పీఆర్టీయూ, ఆపస్ పేర్కొన్నాయి. విధివిధానాలు పాటించాలని కోరుతూ డిప్యూటీ ఈఓ కేవీరమణకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డి.శ్రీనివాస్, బంకపల్లి శివప్రసాద్, కె.శ్రీనివాసరావు, బల్లా శ్రీనివాసరావు, చిట్టి రామునాయుడు, ఏజీ తాతారావు తదితరులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. -
తలగాం యువకుడి ప్రతిభ
వంగర: మండలంలోని తలగాం గ్రామానికి చెందిన పారిశర్ల అప్పలనాయుడు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో సత్తాచాటాడు. 167 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, జిల్లా స్థాయిలో మొద టి ర్యాంకు సాధించాడు. సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. యువకుడి తల్లిదండ్రులు సత్యంనాయు డు, హైమావతి వ్యవసాయ కూలీలు. డిగ్రీ విద్యను పూర్తిచేసిన కుమారుడు పోలీస్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. యువకుడిని మడ్డువలస కళాశాల ప్రిన్సిపాల్ రవిశంకర్, అధ్యాపకులు శుక్రవారం అభినందించారు. ఒకేసారి ఐదు ఉద్యోగాలకు ఎంపిక సంతకవిటి: మండలంలోని వాల్తేరు గ్రామానికి చెందిన వావిలపల్లి అనిల్‌కుమార్ ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తు తం తెలంగాణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన సివిల్, ఏపీఎస్పీ, నేవీ, సీఆర్పీఎఫ్, అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికై నట్టు తెలిపాడు. ముందుగా తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు వెలువడడంతో విధుల్లో చేరానని, ఏపీలో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరుతానని తెలిపాడు. కూలి కుటుంబంలో ఉద్యోగాల పంట లక్కవరపుకోట: మండలంలోని కొట్యాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ముమ్మన గోవింద, ప్రసాద్‌లు శుక్రవారం విడుదలైన పోలీస్ పరీక్ష ఫలితాల్లో ఏఆర్ కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు. డిగ్రీ పూర్తిచేసిన వీరిద్దరూ కొన్నినెలలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సాధన చేస్తున్నారు. ఇద్దరికీ ఒకే సారి ఉద్యోగాలు రావడంతో కూలీలైన తల్లిదండ్రులు ముమ్మన రమణ, సత్యవతి సంతోషం వ్యక్తంచేశారు. -
విద్యార్థుల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ ● సాక్షి కథనానికి స్పందనపార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించినా..ప్రత్యేక శ్రద్ధ చూపించకపోయినా ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ సంబంధిత అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాల్సిన బాధ్యత సంక్షేమ, వైద్యాధికారులపై ఉందని హెచ్చరించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘‘ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం’’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో శుక్రవారం ఈ మేరకు పీఓ డోకిశీల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు, స్థానిక వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమానంగా ఉంటే రక్తపరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు. -
దొంగతనానికి దారితీసిన జల్సాలు
● చోరీకేసును ఛేదించిన పోలీసులురాజాం సిటీ: జల్సాలకు అలవాటుపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ స్నేహితుల సహాయంతో దొంగతనానికి పాల్పడ్డాడు. జల్సాలు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు పాల్పడిన ఓ యువకుడు తనకు గతంలో పరిచయమున్న స్నేహితులను ఆశ్రయించి సొంత గ్రామంలో ఏకంగా 18 తులాల బంగారాన్ని చోరీ చేయడంలో సూత్రధారిగా నిలిచాడు. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడుకాగా మరో స్నేహితుడు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వంగర మండలం బాగెంపేట గ్రామంలో గత నెల 24న పశుమర్తి శంకరరావు ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 25న కేసు నమోదుచేసిన వంగర పోలీసులు ఈ దొంగతనానికి సూత్రధారిగా అదే గ్రామానికి చెదిన రెడ్డి గోపాలకృష్ణను గుర్తించి ఆరా తీశారు. ఆయన ఓ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌తోపాటు జల్సాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఈ ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించి గతంలో వాలీబాల్ క్రీడలో పరిచయమైన పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ బాలరాజు, టీకే రాజపురం గ్రామానికి చెందిన జాడ దుర్గారావులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు కుటుంబంతో సహా ఇంటికి తాళంవేసి హైదరాబాద్ వెళ్లారని, వారి ఇంట్లో బంగారం సులభంగా దొంగిలించవచ్చునని వారికి తెలియజేశాడు. 16 తులాలు రికవరీ ఇదే అదునుగా వారు ముగ్గురూ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మకానికి తీసుకువెళ్తున్న నిందితులను బూరాడ జంక్షన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకుని వారి నుంచి 18 తులాల బంగారానికి గాను 16 తులాలు రికవరీ చేయగా మిగిలిన రెండు తులాలు బాలరాజు పార్వతీపురంలోని సీఎస్బీ బ్యాంకులో తాకట్టుపెట్టాడని, అదికూడా త్వరలో రికవరీ చేస్తామని వెల్లడించారు. సీఐ కె.అశోక్‌కుమార్, వంగర ఎస్సై షేక్‌శంకర్ ఉన్నారు. -
గిరిజన రైతులపై దౌర్జన్యమా...
రామభద్రపురం: అధికార బలంతో గిరిజన రైతులపై దౌర్జన్యం చేయడం తగదు.. ఏళ్ల తరబడి మా సాగులో ఉన్న భూమిని లాక్కుంటే ఎలా అంటూ కాకర్లవలస గిరిజన రైతులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంఎస్ఎంఈ పార్కు పనులను శుక్రవారం అడ్డుకున్నారు. రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది. ఆ భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం రోడ్లు అభివృద్ధి చేస్తామంటూ పనులు ప్రారంభించడంతో గిరిజనులు ఆందోళనకు దిగారు. సీపీఎం నాయుకుడు బలస శ్రీనువాసరావు ఆధ్వర్యంలో పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న సీఐ కె.నారాయణరావు రామభద్రపురం, బాడంగి ఎస్ఐలు వి.ప్రసాదరావు, యోగేశ్వరావు, మరో 20 సిబ్బంది కాకర్లవలస చేరుకున్నారు. పనుల వద్దకు గిరిజనులు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్యవాగ్వాదం జరిగింది. జన్ని మరియమ్మ అనే గిరిజన మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఆమెను పైకిలేపి ఇంటికి పంపించేశారు. రైతులతో సీఐ చర్చలు జరిపారు. ప్రస్తుతానికి పనులు వాయిదావేస్తామని, సోమ, మంగళవారాల్లోపు భూ విషయం ప్రభుత్వానితో తేల్చుకోవాలని ఏపీఐఐసీ డీజీఎం చెప్పడంతో గిరిజన రైతులు ఆందోళన విరమించారు. కాకర్లవలస వద్ద ఎంఎస్ఎంఈ పార్కు పనులు అడ్డుకున్న గిరిజన రైతులు మా సాగులో ఉన్న భూమిని ఏపీఐఐసీకి ఎలా అమ్ముతారని ప్రశ్న జేసీబీకి అడ్డంగా కూర్చున్న మహిళా రైతులు గిరిజన రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం -
3,638
8,243మెంటాడ మండలం లోతుగెడ్డకు చెందిన బి.అప్పలరాజు, లక్ష్మీపార్వతి దంపతులు జూన్ నెలలో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు రైస్ కార్డు మంజూరు కాలేదు. ‘ గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి చెందిన టి.నారాయణమూర్తికి ఈ ఏడాది మార్చిలో ప్రియ అనే అమ్మాయితో వివాహం అయింది. జూన్ నెలలో కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రైస్ కార్డు వస్తే నిత్యావసర సరుకులు అందుతాయని, జీవన భరోసా దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.’ ● కొత్త రైస్ కార్డుల మంజూరు ఊసెత్తని కూటమి సర్కారు ● దరఖాస్తు చేసి నెలలు గడిచినా అందని కార్డులు జిల్లాలో రైస్ కార్డుల కోసం అందిన దరఖాస్తులు విజయనగరం ఫోర్ట్: రైస్ కార్డు.. పేదలకు గుర్తింపు కార్డు వంటిది. పిల్లల ఫీజుల రాయితీకి, ఆదాయ ధ్రువీకరణ పత్రం మంజూరుకు అదే ఆధారం. సంక్షేమ పథకాలు వర్తించాలన్నా రైస్ కార్డే ప్రధానం. ఇంతటి ప్రాధాన్యమున్న కార్డుల మంజూరులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం అర్హులకు శాపంగా మారింది. ఆవేదనకు గురిచేస్తోంది. జిల్లాలో కొత్త రైస్‌కార్డులు, స్పిల్టింగ్ (విభజన) కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి నిరాశే ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా ఇంత వరకు ఒక్కరికి కూడా కొత్త రైస్ కార్డు మంజూరు కాలేదు. కనీసం కార్డుల విభజనకు కూడా అవకాశం ఇవ్వలేదు. కార్డుల్లో పేర్ల తొలగింపు, ఆధార్ సీడింగ్, కార్డులో కొత్తగా చేర్పులు, అడ్రస్ మార్పులు జరగక వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ● ఆప్షన్‌తో సరిపెట్టేసింది..! కూటమి సర్కారు కొత్త రైస్ కార్డులు, స్పిల్టింగ్ కోసం ఆప్సన్తో సరిపెట్టేసింది. కొత్త రైస్ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 3,648 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్కరికి కూడా మంజూరుకాలేదు. స్పిల్టింగ్ కోసం 8,243 మంది దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. ఎవరైనా చనిపోతే వెంటనే పేరు తొలగించి సరుకులు నిలిపివేస్తున్న ప్రభుత్వం కొత్తకార్డుల జారీ, చేర్పులు, మార్పులకు అవకాశం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి ఆరునెలలుగా ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారిలో అర్హులకు కార్డులు మంజూరు చేసేదని, చేర్పులు, మార్పులకు నిరంతరం అవకాశం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవంటూ పలువురు వాపోతున్నారు. -
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి
● జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు మెరకముడిదాం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులంతా పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు సూచించారు. మండలంలోని గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవా రం ఆకస్మికంగా తనిఖీచేశారు. మధ్యాహ్న భోజన పథకం తీరుపై ఆరా తీశారు. మరుగుదొడ్ల నిర్వహణను నేరుగా పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి నుంచి జవాబులు రాబట్టారు. ప్రత్యేకంగా గణితంలో ప్రతి విద్యార్థికి నూటికి నూరు మార్కులు వచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ దర్శ శ్రీను, హెచ్ఎం సూర్యనారాయణ ఉన్నారు. అరకు–విశాఖ రోడ్డులో 145 కేజీల గంజాయి పట్టివేత ● ఇద్దరి అరెస్టు లక్కవరపుకోట: ఒడిశా నుంచి నుంచి కేరళ రాష్ట్రానికి అరకు–విశాఖ జాతీయ రహదారిలో బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సఫీ, ఒడిశాకు చెందిన దుంబిలను గొల్జాం కూడలి వద్ద పోలీస్‌లు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ నవీన్‌పడాల్ తెలిపారు. ఇద్దరినీ కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారన్నారు. తల్లిపాలు ఆరోగ్యకరం ● కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: తల్లిపాలు ఆరోగ్యకరం, అమృతంతో సమానమని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపే వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలని సూచించారు. తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ జి.చిన్మయిదేవి, పీడీ టి.విమలారాణి, సీడీపీఓలు ప్రసన్న, ఉమాభారతి, ఆరుద్ర, తదితరులు పాల్గొన్నారు. స్వీయ రక్షణ విద్యలో శిక్షణ విజయనగరం క్రైమ్: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు పీడీలు, పీఈటీలకు స్వీయరక్షణ విద్యపై జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో శిక్షణ సాగింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ అశోక్‌కుమార్ శిక్షణను పర్యవేక్షించారు. -
డిజిటల్ బోర్డుల పేరిట దోపిడీ
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు కానీ..ప్రజలను ఏదో రకంగా దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి డిజిటల్ బోర్డుల ఏర్పాటు పేరుతో చేస్తున్న కలెక్షన్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. –వీరఘట్టంఈ పొటో చూశారా? వీరఘట్టంలోని తెలగవీధిలో ఓఇంటికి 5–18 నంబర్ వేస్తూ బోర్డు అతికించారు.అయితే ఈ ఇంటి నంబర్ 6–68 అని పంచాయతీ రికార్డులో ఉంది.తప్పులు తప్పులుగా బోర్డులు అతికించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని వారు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ వారడిగిన రూ.50 ఇచ్చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. ● తప్పుల తడకగా ఇంటి నంబర్ల నమోదు ● ఒక్కో బోర్డుకు రూ.50 చొప్పున వసూలు ప్రతి ఇంటికి డిజిటల్ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి ఈ ఏడాది మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చినట్లు బోర్డులు అమర్చడానికి వచ్చినవారు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన జీవో కాపీ చూపిస్తున్నారు. అయితే ఈ డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.అభ్యంతరాలుంటే బోర్డులు బిగించవద్దని,.పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ జీవో కాపీలో ఉంది.అయితే అవేవీ కాకుండా ప్రతి ఇంటికి బోర్డు బిగించి డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.అయితే ఈ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారే తప్ప ఈ నిలువు దోపిడీని అడ్డుకోకపోవడంపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇంటింటికీ ఏర్పాటు చేస్తున్న ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నాయి. ఫోన్ కాల్స్ ఒత్తిడితో.. అమరావతి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఒత్తిడితో ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ ముఠా నేరుగా గ్రామాల్లో ఇంటి చిరునామా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.పేరుకు వీరు ఒక్కో ఇంటి నుంచి కలెక్షన్ చేస్తున్నది రూ.50 గా కనిపిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.2.25 కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. కొంత మంది మాత్రం ఈ బోర్డులు వద్దని తిరస్కరిస్తున్నప్పటికీ వారితో వాదిస్తూ ఈ బోర్డులు అందరి ఇళ్లకు వేయాలని మా వద్ద ఆర్డర్ కాపీ ఉందని బలవంతంగా ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ ఫొటో చూశారా? చిన్న ఇనుప రేకును తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన్యం జిల్లా, డిజిటల్ ఇంటి చిరునామా అనే అక్షరాలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి అతికిస్తున్నారు. ఇలా రేకు బోర్డు పెట్టినందుకు ప్రతి ఇంచి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. వీరఘట్టం మండలంలో ఇంతవరకు సుమారు 15 వేల ఇళ్లకు ఇటువంటి బోర్డులు పెట్టి గృహవాసుల నుంచి రూ.7.50 లక్షలను వసూలు చేశారు. ఇదే మాదిరి జిల్లాలో ఉన్న 4.50 లక్షల గృహాలకు ఇటువంటి బోర్డులు అమర్చి ఏకంగా రూ.2.25 కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. డిజిటల్ బోర్డు పేరుతో ఇంటికి అమర్చుతున్న ఈ రేకు కనీసం రూ.5 కూడా ఉండదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాకు సంబంధం లేదుజిల్లాలో చాలా చోట్ల ఇంటికి డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఆ బోర్డుల ఏర్పాటుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నచ్చకపోతే ఎవరూ ఆ బోర్డులు ఏర్పాటు చేసుకోవద్దు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, పంచాయతీ అంగీకారంతో పంచాయతీ రికార్డుల ప్రకారం ఇంటి నంబర్లు వేసి బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఇష్టం లేని వారు బోర్డులు వద్దని చెప్పండి. – పి.కొండలరావు, డీపీఓ, పార్వతీపురం మన్యం జిల్లా -
నాగుపాము అలజడి
● పట్టుకున్న స్నేక్ క్యాచర్ విజయనగరం గంటస్తంభం: స్థానిక బాబామెట్టలోని రెండవ లైన్లో ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ అయినంపూడి శ్రీనివాసరావు ఇంటి పరిసరాల్లో ఓ నాగుపాము రెండు రోజులుగా తిరుగుతూ భయాందోళన సృష్టిస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మళ్లీ ఆ పాము కనబడడంతో ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు కలెక్టరేట్ ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ సాయికుమార్ వచ్చి పామును పట్టుకుని ఓ డబ్బాలో వేసి మూతవేసి పాముకు గాలి ఆడడానికి డబ్బాకు రంధ్రాలు ఏర్పాటు చేశాడు. పట్టుకున్న పామును పూల్‌భాగ్ ఫారెస్టులో వదిలిపెట్టనున్నట్లు సాయికుమార్ తెలిపాడు. 3.33 కేజీల గంజాయి స్వాధీనంపాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో ఉన్న దుర్గ గుడి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి నుంచి 3.33 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట సురేష్ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అశిష్ పండిట్(23) ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి చైన్నెకి తరలిస్తుండగా పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నాయని గమనించి ఒడిశా నుంచి వస్తున్న వాహనం దిగిపోయి దుర్గగుడి వద్ద అనుమానాస్పదంగా ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా 3.33 కేజీల గంజాయి బయటపడడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని కురుపాం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీజీటీ(తెలుగు) ఉపాధ్యాయుడి పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బహుదూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండి, టెట్‌లో అర్హత సాధించినవారు ఈనెల 9లోగా హెచ్‌టీటీపీఎస్://ఈంఆర్ఎస్.ట్రైబల్.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 11న ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ 6200335685 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. నాలుగు క్లినిక్‌ల సీజ్భామిని: మండలంలోని సింగిడి, గురండిలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీలు, పీఎంపీలు నడుపుతున్న నాలుగు క్లినిక్‌లను సీజ్ చేసినట్లు బత్తిలి, భామిని వైద్యాధికారులు పసుపులేటి సోయల్, కొండపల్లి రవీంద్రలు గురువారం తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్ఓల ఆదేశాల మేరకు భామిని తహసీల్దార్ శివన్నారాయణ, బత్తిలి ఎస్సై జి.అప్పారావులతో కలిసి సింగిడి, గురండి గ్రామాల్లో దాడులు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న క్లినిక్‌లను సందర్శించి సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. క్లినిక్‌లలో వాడుతున్న మందులు, సర్జికల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బృందంలో డీటీ రమేష్ కుమార్, ఎంఆర్ఐ మణి ప్రభాకర్, వీఆర్ఓ ఉన్నారు. -
మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం రూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో మిగులు సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ ఎస్. రూపావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్‌తో తమకు కావాల్సిన ప్రాంతంలో ఆయా పాఠశాలలను, కళాశాలను నేరుగా వెళ్లి సంప్రదించాలని కోరారు. బాలురుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కొప్పెర్ల, బాడంగి, పాలకొండ, సాలూరు, జోగింపేటలో అదేవిధంగా బాలికలకు సంబంధించి చీపురుపల్లి, నెల్లిమర్ల, వేపాడ, వీఎంపేట, వంగర, గరుగుబిల్లి, కొమరాడ, భామిని పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సంబంధిత ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా కన్వీనర్ ఎస్ రూపావతి -
ముగిసిన హ్యాండ్‌బాల్ మీట్
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జవహర్నవోదయ విద్యాలయలో మూడురోజులుగా నిర్వహిస్తున్న హైదరాబాద్ రీజియన్‌స్థాయి హ్యాండ్‌బాల్ మీట్ 2025–26 గురువారం ముగిసింది. ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ మీట్‌కు దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్లు యానాం, అదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గిల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారంతా మూడు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఏపీ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో యానాం క్లస్టర్ అత్యుత్తమ ప్రదర్శనతో 26బహుమతులు సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది. గురువారం సాయంత్రం ముగింపు వేడుకల్లో ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను దిగ్విజయంగా పూర్తిచేసిన రిఫరీలు, కోచ్‌లు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడాకారులకు ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు. -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విశ్రాంత బ్యాంక్ మేనేజర్
లక్కవరపుకోట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఎస్ఎన్ రాజుకు ఆరుదైన కరెన్సీ నోట్లు సేకరించడం అలవాటు. అరుదైన కరెన్సీ నోట్లు సేకరించినందుకు గాను 2025వ సంవత్సరానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఆయన స్థానం సాధించారు. అంతేకాకుండా ఒకేసారి ఆయన మూడు లిమ్కా రికార్డులు సాధించడం విశేషం. ప్రతి కరెన్సీ నోటుపై ఒక రకమైన సిరీస్ నంబర్ కలిగిన నోట్లు సుమారు 12 వందలు సేకరించినందుకు ఒక రికార్డు, అలాగే కరెన్సీ ముద్ర సమయంలో పొరపాటు జరిగితే ఆ నోటుకు బదులు వేరే నోటు ముద్రిస్తారు.ఆ విధంగా ముద్రించిన నోట్‌పై స్టార్ గుర్తు పెడతారు. అలాంటి స్టార్ నోట్లు సుమారు 11వందల నోట్లు సేకరించి మరో రికార్డును నమోదు చేశారు. ఇంకా కరెన్సీ నోట్‌పై సీరియల్ నంబర్లు ఆరు డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఏడో డిజిట్ ఉన్న నోట్లు చాలా అరుదుగా వస్తాయి. అలా ఏడు డిజిట్స్ ఉన్న నోట్లను సేకరించి మూడో రికార్డు సాధించారు. మొత్తంగా ఒకే సారి మూడు లిమ్కా రికార్డులను సాధించిన ఆయనను పలువురు అభినందించారు. అరుదైన కరెన్సీ నోట్లు సేకరించి రికార్డు -
స్కూల్ ఆటో బోల్తా
● ఐదుగురు విద్యార్థులకు గాయాలు ● మద్యం మత్తులో ఆటో నడిపిన డ్రైవర్కొత్తవలస: మండలంలోని విజయనగరం–కొత్తవలస రోడ్డులో అర్ధాన్న పాలెం జంక్షన్ సమీపంలో గురువారం స్కూల్ ఆటో బోల్తాపడిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు మంగళపాలెం, రాజాథియేటర్ సమీపంలోని వారిని రోజూ ఆటోలో స్కూల్‌కు తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. అయితే గురువారం విద్యార్థులను యథావిధిగా స్కూల్ వద్ద డ్రైవర్ దింపేశాడు. మళ్లీ స్కూల్ వదిలే సమయంలో తిరిగి పిల్లలను ఆటో ఎక్కించుకుని వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు పి ల్లల్లో 7వ తరగతి చదువుతున్న కె.మహేంద్ర కాలికి తీవ్ర గాయమైంది. అలాగే 9వ తరగతి చదువుతున్న డి.నిరిషా నడుముకు గాయమైంది. స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను కొత్తవలసలో గల ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.కాగా ఆటో డ్రైవర్ పూటుగా మద్యం తాగి ఉన్నాడని, ఆటోపై ఫీట్లు చేశాడని అదే సమయంలో ఆటో బోల్తా పడిందని విద్యార్థులు తెలిపారు.ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా
● ఒకరి మృతి ● మరో ఆరుగురికి గాయాలుభామిని: మండలంలోని బండ్రసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురుపాం మండలం ఆవిరి గ్రామానికి చెందిన కొండగొర్రి ఎల్లంగో(60) ప్రమాద స్థలంలోనే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆవిరి గిరిజన గ్రామం నుంచి భామిని వారపు సంతకు పశువుల కొనుగోలుకు ఆటోలో వస్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. బండ్రసింగి ఘాట్ రోడ్డులో అతివేగంగా వస్తున్న ఆటో బోల్తా కొట్టి లోయలోకి పడిపోయి నుజ్జునుజ్జయింది. ఈ నేపథ్యంలో అటోలో ప్రయాణిస్తున్న కొండగొర్రి ఎల్లంగో(60)తో మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కొండగొర్రి గంగారావు, కొండగొర్రి నగేష్, కొండగొర్రి సుమంతోలు తీవ్ర గాయాల పాలు కావడంతో 108 అంబులెన్స్‌లో తరలించి భామిని పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం తరువాత సీతంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్ బిడ్డిక కోరాతో పాటు బిడ్డిక కర్ణలు గాయాల పాలయ్యారు. సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని పాలకొండ డీఎస్సీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలసుకుని కేసు నమోదు చేశారు. ఎల్లంగో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తివ్వాకొండల్లోని ఘాట్ రోడ్లలో రక్షణగా రాతి కట్టలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజనులు డీఎస్పీ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. -
రహదారి భద్రత నియమాలు పాటించాలి
● జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గాప్రసాద్ రెడ్డిపార్వతీపురం రూరల్: వాహన దారులు కచ్చితంగా రహదారి భద్రత నియమాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా సహాయ రవాణా శాఖాధికారులు బి.కాశీరాం నాయక్, స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గతో కలిసి మండలంలోని నర్సిపురం గ్రామం సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిమితికి మించి అధిక ప్రయాణికులతో వెళ్తూ భద్రత నియమాలను అతిక్రమించిన 11 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అలాగే మూడు వాహనాలను, 12 ఆటోలతో పాటు ఒక లైట్ గూడ్స్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రూ.30వేలు జరిమానాను వాహనాలకు విధించారు. అలాగే రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై వాహన దారులకు, పాదచారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ విధిగా ధరించాలని జిల్లా రవాణా శాఖాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి సూచించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయరాదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో రవాణాశాఖ కానిస్టేబుల్స్, హోం గార్డులు తదితర సిబ్బంది ఉన్నారు. -
ఆస్తికోసమే హత్య
శృంగవరపుకోట: మండలంలోని పల్లపుదుంగాడలో ఇటీవల సంభవించిన హత్య కేవలం ఆస్తి కోసమే జరిగినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి సీదిరి రాములును తన పెదనాన్న కొడుకై న నాగులు నాటుతుపాకీతో 28వ తేదీ సాయంత్రం కాల్చి చంపినట్లు హతుడి కుమార్తె పల్లపుదుంగాడకు చెందిన బడ్నాన నాగమణి ఈనెల 29న మధ్యాహ్నం ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్‌కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. మృతుడు సీదిరి రాములుకు నాగులుకు మధ్య ఆస్తి వివాదాలున్నాయి. రాములుకు మగపిల్లలు లేనందున చిట్టంపాడులో రెండెకరాల పొలం తనకు ఇచ్చేయాలని నాగులు కొంత కాలంగా పినతండ్రిని అడుగుతున్నాడు. అ భయంతో రాములు మూడేళ్లుగా పల్లపుదుంగాడలో కుమార్తె వద్ద ఉంటున్నాడు. 28న సాయంత్రం పల్లపుదుంగాడ పొలాల్లో రాములు పని చేస్తుండగా నాగులు తన వద్ద ఉన్న తపంచాతో పినతండ్రి రాములుపై కాల్పులు జరిపాడు. దీంతో రాములు పొలంలోనే చనిపోయాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు నాగులు కోసం గాలిస్తుండగా సీఐకి అందిన సమాచారంతో గురువారం ఉదయం ఐతన్నపాలెం జంక్షన్లో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తుండగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని విచారణ చేసి బొడ్డవర రైల్వేస్టేషన్ సమీపంలో తుప్పల్లో దాచిన తపంచా, దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్.కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్‌లను డీఎస్పీ అభినందించారు. డీఎస్పీ శ్రీనివాస రావు -
నేర నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్ సెర్చ్‘
విజయనగరం క్రైమ్: నేరాలను నియంత్రించి, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంలో భాగంగా ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లో గల గిరిజన గ్రామాల్లో ’కార్టన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ గురువారం నిర్వహించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి సారా, గంజాయి లభించలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి పంచాయతీ గిరిజన గ్రామాలైన మునుపురాయి, రాయపాలెం, చప్పనిగెడ్డ, పల్లపు దుంగాడ, రంగవలస, పాతశెనగపాడు, కొత్త సెనగపాడు, దబ్బగుంట గ్రామాల్లోను మూల బొడ్డవర పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, బొడ్డపాడు, చిలకపాడు, చిట్టెంపాడు, గుణపాడు గ్రామాల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారన్నారు. ఈ బృందాలకు ఎస్.కోట సీఐ వి.నారాయణ మూర్తి, కొత్తవలస సీఐ షణ్ముఖరావు, విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు నాయకత్వం వహించారన్నారు. ఈ ఆపరేషన్‌లో 16మంది ఎస్సైలు, 85 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, వారికి నిర్దేశించిన గిరిజన గ్రామానికి చేరుకుని, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలు ముందుగానే దిగ్బంధం చేసినట్లు చెప్పారు. -
బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించండి
పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు వంటివి అమలు చేయాలని ఆగస్టు 2న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైస్కూల్ ప్లస్‌లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలని కోరారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని కోరారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఈ సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో జనరల్ సెక్రటరీ ఎస్.చిరంజీవి, కో చైర్మన్లు కె.నరహరి, మనోజ్ కుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా దేవీమాధవి
విజయనగరం ఫోర్ట్: విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ దేవీమాధవి నియమితులయ్యారు. ఆమె వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డాక్టర్ కె.పద్మలీల గురువారం ఉద్యోగ విరమణ పొందారు. 2న రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం విజయనగరం ఫోర్ట్: అన్నదాత సుఖీభవ పథ కం లబ్ధి ఈ నెల 2న రైతుల బ్యాంకు ఖాతా లకు జమకానుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. పథకం కింద జిల్లాలో 2,19,503 మందికి లబ్ధిచేకూరనుందన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుభీభవలో రాష్ట్ర వాటా కింద రైతులకు రూ.5 వేలు చొప్పున రూ.109.75 కోట్లు, కేంద్రం వాటా పీఎం కిసాన్ కింద రూ.2వేలు చొప్పన 1.93 లక్షల మందికి రూ. 38.60 కోట్ల పెట్టుబడి సాయం అందనుందన్నారు. సమావేశంలో కేఆర్ఆర్సీ ప్రత్యేక కలెక్టర్ మురిళి, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ మేనేజర్ రమణమూర్తి, డ్వామా పీడీ శారద, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, సీపీఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. వైద్యసేవల వివరాలు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: పీహెచ్‌సీల్లో అందించే వివరాలు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు గురువారం సర్వేలెన్స్ వర్క్‌షాపు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికంగా ఎక్కడైనా వ్యాధులు వ్యాప్తిచెందితే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సర్వేలెన్స్ ఆఫీసర్ జాన్, తదితరులు పాల్గొన్నారు. జ్వరాల పంజా బొబ్బిలి: పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థినులుపై జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే పలువురు జ్వరాలతో బాధపడుతూ కోలుకోగా.. కొమరాడకు చెందిన కొండగొర్రి సౌజన్యను వైద్యపరీక్ష కోసం వార్డెన్ రాణి బొబ్బిలి సీహెచ్‌సీకి గురువారం తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాలికను ఇన్‌పేషేంట్‌గా చేర్చుకుని వైద్యసేవ లు అందిస్తున్నారు. బొబ్బిలిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవనాన్ని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహానికి కేటాయించారు. కొన్ని గదులను ఆశ్రమ పాఠశాల స్టోర్ రూం, సిక్ రూంలకు వినియోగిస్తున్నారు. మిగిలిన గదులను విద్యార్థినులకు వినియోగిస్తున్నారు. భవనం ఇరుకుగా మారిందని విద్యార్థినులు వాపోతున్నారు. వార్డెన్ కార్యాలయంలోనే వంట గదిని కూడా నిర్వహిస్తున్నారు. తాగునీటికి పాఠశాల బోరును వసతి గృహ నిర్వాహకులే వినియోగిస్తున్నారు. పట్టణానికి దూరంగా వసతి గృహం ఉండడంతో పట్టణంలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోకి వసతిగృహాన్ని మార్చాలని కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి జనసేన నాయకుడు
దత్తిరాజేరు: జనసేన విజయనగరం పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, గజపతినగరం నియోజకవర్గం నాయకుడు సామిరెడ్డి లక్ష్మణ్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో గురువారం చేరారు. ఆయన స్వగ్రా మం దత్తిరాజేరు మండలం పెదకాద నుంచి మరో 50 కుటుంబాల వారు వైఎస్సార్సీపీ తీర్థం తీసుకున్నారు. మాజీ ఉప సర్పంచ్ మత్స వెంకన్న, సామిరెడ్డి తవిటినాయుడు, కూర్మినాయుడు, వైకంఠం శ్రీరాం తదితరులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన ఇంటివద్ద పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్షణ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క వైఎస్సార్సీపీలోనే సాధ్యమని, బొత్స అప్పలనరస య్య నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రిఅప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, వైఎస్ ఎంపీపీలు బమ్మిడి అప్పలనాయు డు, మిత్తిరెడ్డి రమేష్, నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మండల శ్రీను, చుక్క మురళి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. పెదకాద నుంచి సామిరెడ్డి లక్ష్మణ్‌తో పాటు 50 కుటుంబాలు చేరిక పార్టీ కండువా వేసి ఆహ్వనించిన మాజీ ఎమ్మెల్యే బొత్స -
గిరిజన యూనివర్సిటీలో పరిశోధన విద్య
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ఇప్పటికే అందిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) పీజీ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి రీసెర్చ్ స్కాలర్ (పరిశోధన విద్య) కోర్సులను అందించనున్నామని యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం పాలసీలోని ప్రధాన అంశాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పటిష్ట పునాదులను ఆ ప్రభుత్వమే వేసింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో ఏర్పాటైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు ఓ వైపు సాగుతున్నాయి. స్థానిక ఆంధ్రయూనివర్సిటీ ఎక్స్టెంట్ పీజీ కేంద్రం ప్రాంగణలోని భవనాల్లో ప్రస్తుతం గిరిజన యూని వర్సిటీ తాత్కాలిక నిర్వహణలో ఉంది. గిరిజన వర్సిటీ అకడమిక్ పురోగతిని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే... నాలుగు అంశాలపై పరిశోధన యూనివర్సిటీలో ఇప్పటికే అందిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సు, పీజీ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి రీసెర్చ్ స్కాలర్ (పరిశోధన విద్య) కోర్సులను అందించనున్నాం. యూనివర్సిటీలో ప్రసుతం ఉన్న ఎనిమిది పీజీ కోర్సులతో పాటు మరో నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించిన సబ్జెక్టుల పరిశోధనా అంశాలపై కొత్త కోర్సులు నిర్వహిస్తాం. తొలిదశలో ప్రతి కోర్సులో రెండు సీట్లలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తాం. ఈ విద్యాసంవత్సరం నుంచి నిర్వహించే పరిశోధన కోర్సుల కోసం త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాం. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కోసం 21రోజుల గడువు ఇస్తాం. ఈ ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం ముగిసిన పీజీ ప్రవేశాలు మిగులు సీట్లకు ఈ నెల 8న ఓపెన్ కౌన్సెలింగ్ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ -
బాగుచేసేవారు లేక...
బాడంగి మండలంముగడ గ్రామానికి చెందిన తెంటువాని చెరువు ఆయకట్టుకు సాగునీరందించే ఫీల్డ్, ఫీడర్ చానల్స్ తుప్పలు, పూడికలతో నిండిపోయాయి. బాగుచేయాలంటూ అధికారులు, పాలకులకు రైతులు విన్నవించారు. అదును దాటిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధిహామీ పనులతో కాలువలు అభివృద్ధిచేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఆయకట్టు రైతులందరూ ఏకమై శ్రమదానంతో కాలువలు బాగుచేసేందుకు నడుంబిగించారు. చెరువు నీరు పొలాలకు మళ్లించేందుకు వీలుగా కాలువల్లోని పూడికలను గురువారం తొలగించారు. రైతు సమస్యలను పట్టించుకునే తీరిక కూటమి నేతలకు లేదంటూ పలువురు వాపోయారు. – బాడంగి -
రైతుబజారు స్థల రక్షణకు ప్రజా ఉద్యమం
విజయనగరం గంటస్తంభం: విజయనరం పాత ఆస్పత్రి వద్ద ఉన్న రైతు బజారు స్థలం రక్షణ కోసం ప్రజాఉద్యమం చేపడతామని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్టు సంఘ జిల్లా కార్యదర్మి రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ రైతుబజార్ భూమి 22ఏలో నుంచి తప్పించి రాజులకు అప్పగించిన అధికారుల తీరు అన్యాయమన్నారు. 1948లో జమిందారీ వ్యవస్థ రద్దుకావడంతో భూములన్నీ రైతువారీ పద్ధతిలోకి వచ్చాయన్నారు. 1968లో ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం, మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో భూములు ఉన్నాయే తప్ప రాజుల ఆధీనంలో ప్రత్యేకంగా ఏమీ లేవన్నారు. చీకటి జీఓలతో భూములను కాజేయాలని రాజులు చూస్తున్నారన్నారు. అందులో భాగంగా జీఓ 124 మేరకు రైతు బజార్ భూమి 1.48 ఎకరాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. చీకటి జీఓలు రద్దుచేసి ఆ భూమిని రైతులకు అప్పగించాలని అధికారులను డిమాండ్ చేశారు. జొన్నగుడ్డిలో పేదలకు పట్టాలిచ్చిన భూమిని ఎందుకు అప్పగించరని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్మి బి.రాంబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ ఎం.శ్రీనివాస్, ఎస్.రవికుమార్, వెంకటేష్, ఆనంద్, రమణ, జగన్మోహన్రావు, హరీష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి అన్యాయం?
రాజాం సిటీ: రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గా ఆలయానికి ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతున్న తనను తప్పించి వేరేవారిని నియమించడం ఎంతవరకు న్యాయమని ఫౌండర్ ట్రస్టీ వానపల్లి నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ధర్మకర్తను చైర్మన్ స్థానం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు ఆలయాల ట్రస్టుబోర్డుల నియామకాల్లో కనిపించడం శోచనీయమన్నారు. స్థానిక విలేరులతో ఆయన గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి వానపల్లి సూర్యనారాయణ (తమ్మయ్య గురువు) ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి తామే వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. దేవాలయాల ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంలో రాజికీయాలను ప్రోత్సహించడం దేవదాయ శాఖ అధికారులకు తగదన్నారు. ట్రస్టు బోర్డు మెంబరు ఉన్నచోట ఆయనే చైర్మన్‌గా వ్యవహరిస్తారని గతంలో దేవదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు స్పష్టంచేశారు. దేవదాయశాఖ ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు సవరించకుంటే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ పి.శ్యామలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌గా వానపల్లి నర్సింగరావే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై గతంలో జీఓ కూడా ఇచ్చారన్నారు. ఆయన ఆధ్వర్యంలో బోర్డు మెంబర్లు ఉంటారని పేర్కొన్నారు. -
వేధింపుల కత్తి!
ఉద్యోగుల మెడపై సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి నాయకుల అధికార బలంతో చేసిన వేధింపులకు ఓ దళిత అధికారి కన్నీళ్లు పెట్టుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్ చూస్తున్న విద్యాశాఖలోని.. ఓ మండల విద్యాశాఖాధికారికే ఈ దుస్థితి ఏర్పడింది. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ ఆ అధికారి.. సదరు ప్రజాప్రతినిధి కాళ్లు మీద పడినా... కనికరం చూపలేదు. ఆ ప్రజాప్రతినిధి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర కాగా.. ఆ అధికారి బలిజిపేట మండల ఎంఈఓ– 2 శ్రీనివాసరావు. ఎంఈఓ తన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందటే పార్వతీపురం తహసీల్దారుగా పని చేసిన జయలక్ష్మిని ఎమ్మెల్యే బెదిరించినట్టు ఓ ఫిర్యాదు కాపీ బయటకు వచ్చిన విషయం విదితమే.. ఇప్పుడు అదే తరహాలో మరో అధికారి బలి కావడం గమనార్హం. కోర్టు తీర్పును అమలుచేయొద్దంటూ.... బలిజిపేట మండలంలోని అరసాడ మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, వాచ్‌మన్‌ను ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర ప్రోత్సాహంతోనే తమను తొలగించారని ఉన్నతాధికారుల వద్ద బాధితులు మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీనిపై వారు కోర్టు తలుపుతట్టారు. న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పునూ అమలు చేయనీయకుండా.. ఆ స్థానంలో తమ వారిని నియమించుకునేలా అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితుల ఆరోపణ. అందుకు సంతకం చేయాలని ఎంఈఓ–2 శ్రీనివాసరావును కోరుతున్నారు. ఈ విషయంలో ఇది వరకే కోర్టు తనకు జరిమానా విధించిందని.. ఇకపై ఆ తప్పు చేయనని ఆయన తేల్చేయడం కూటమి నాయకుల ఆగ్రహానికి కారణమైంది. రెండు రోజుల కిందట కేజీబీవీ వసతిగృహం ప్రారంభోత్సవానికి మండలానికి వచ్చిన ఎమ్మెల్యే.. ప్రజలు, అధికారులందరి ముందే ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీతో ఏం మాట్లాడినా ఎర్రజెండా వారికి సమాచారం ఇస్తావు. నీపై చర్యలు తీసుకుంటే.. రేపటి నుంచి ఎర్రజెండా పట్టుకుని వారితోపాటే ఆ రోడ్ల మీద తిరగాల్సిందే..’ అంటూ హెచ్చరించారు. అక్కడ నుంచే డీఈఓతో మాట్లాడి.. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తనను ఇబ్బంది పెట్టవద్దని.. కాళ్లు పట్టుకుని బతిమలాడుతానని వయస్సులో పెద్ద వారైన ఎంఈఓ ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. జరిగిన పరిణామాలతో తీవ్ర భావోద్వేగానికి గురైన సదరు ఎంఈఓ.. తన సన్నిహితుల వద్ద ఈ విషయాలన్నీ వాపోతూ కన్నీటి పర్యంతమయ్యారు. డీఈఓ కూడా తన విషయంలో దుర్భాషలాడారని వాపోయారు. నేడో, రేపో తన మీద చర్యలు ఖాయమని.. తనను సస్పెండ్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూటమి ప్రభుత్వంలో అధికారులు ధైర్యంగా పని చేసే పరిస్థితి లేదని.. మండల అధికారులకే వేధింపులు ఉంటే, ఇంక చిరు ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులను తొలగించాలని, పథకాలు అందకుండా చేయాలని.. పనులు నిలిపివేయాలని.. తాము చెప్పిందే చేయాలంటూ కూటమి నేతలు ఆదేశాలిస్తున్నారు. వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. వారి మాటే శాసనం అంటున్నారు. కోర్టు ఉత్తర్వులను అమలుచేయొద్దంటూ భయపెడుతున్నారు. ఉద్యోగాలు పోతాయని కాళ్లుపట్టుకుని అధికారులు ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో వేధింపులే తప్ప క్షమించడాలు ఉండవంటూ స్పష్టంచేస్తున్నారు. ఫలితం.. అధికార, ఉద్యోగ వర్గాలు తమ బాధను సహోద్యోగుల వద్ద చెప్పుకుంటూ కన్నీరుపెడుతున్నారు. ఇన్నేళ్ల సర్వీసులో తమకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటూ నిట్టూర్చుతున్నారు. నిన్న తహసీల్దార్.. నేడు ఎంఈఓ దళిత విద్యాశాఖాధికారికి పార్వతీపురం ఎమ్మెల్యే బెదిరింపులు ఎర్రజెండా పట్టుకుని రోడ్డున పడతావంటూ హెచ్చరిక కన్నీళ్లు పెట్టుకున్న అధికారి ప్రజాప్రతినిధి వేధింపులపై సన్నిహితుల వద్ద వాపోయిన సదరు అధికారి -
ఊరికి ఉపకారి
చిత్రంలో రోడ్డుపై ఏర్పడిన గోతులను కాంక్రీట్‌తో పూడ్చుతున్న వ్యక్తిపేరు మద్దెల జనార్దన్. రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి. లగేజీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రామభద్రపురం మండల కేంద్రం నుంచి సోంపురం, ఇట్లామామిడిపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడవ్వడం, పెద్దపెద్ద గోతులతో దర్శనమివ్వడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కలత చెందాడు. కూలిచేసిన డబ్బుల్లో రూ.30వేలు వెచ్చించి సిమెంట్, ఇసుక, పిక్కను తన లగేజీ ఆటోపైనే తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా కాంక్రీటు మిక్స్‌చేసి రోడ్లపై ఏర్పడిన గోతులను గత రెండు రోజులుగా పూడ్చుతున్నాడు. ఆయన కృషి, చొరవను చూసిన ఈ ప్రాంతీయులు అభినందిస్తున్నారు. ఊరికి ఉపకారి అంటూ కితాబిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెపండగ పేరుతో రోడ్లు మరమ్మతులు చేస్తామంటూ హడావిడి చేసిందే తప్ప రోడ్లను బాగుచేసిన పరిస్థితి లేదంటూ విమర్శిస్తున్నారు. – రామభద్రపురం -
పోటా పోటీగా హ్యాండ్‌బాల్ పోటీలు
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్ –2025–26 పోటీలు రెండవ రోజు మంగళవారం హోరాహోరీగా సాగాయి. పోటీల్లో 195 మంది, బాలురు, 183 మంది బాలికలు అండర్–19, అండర్–17, అండర్–14 విభాగాల్లో తలపడుతున్నారు. పోటీలకు వచ్చిన దక్షిణ భారతదేశంలోని నవోదయ విద్యాలయాలైన యానాం, ఆదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గిల నుంచి వచ్చిన విద్యార్థులు పోటాపోటీగా తలపడుతున్నారు. గురువారం విజేతలను నిర్ణయించి బహుమతి ప్రదానం చేస్తామని, విజేతలు బీహార్‌లో నలందలో నిర్వహించనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు చెప్పారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పెద్ద పీట
సాలూరు: రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు రాజన్నదొరను పట్టణంలోని ఆయన స్వగృహంలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ,శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జ్ వీరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా, మండల స్థాయి అనుబంధ విభాగాల కమిటీల నియామకం ఇప్పటికే పూర్తయిందన్నారు. గ్రామ, వార్డు స్థాయి కమిటీల నియామకం త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా రానున్న జగన్మోహన్రెడ్డి పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి , వారే రాజు మంత్రి అనే విధంగా కార్యకర్తలను చూసుకుంటామని జగన్మోహన్రెడ్డి తెలిపిన విషయాలను ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై చర్చించారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
దత్తత తీసుకోవడం సామాజిక బాధ్యత
విజయనగరం అర్బన్: బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ఉద్యోగులకు స్వచ్ఛందమేనని, ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అదొక సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర మండల, డివిజన్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సమావేశంలో పీ–4, సీజనల్ వ్యాధు లు, వ్యవసాయం, పెన్షన్ల పంపిణీపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే 67,066 బంగారు కుటుంబాలను గుర్తించామని, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి, వారి వాస్తవ అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం నాటికి ఈ జాబితాను అందజేయాలని స్పష్టంచేశారు. దానికి అనుగుణంగా మార్గదర్శకులను గుర్తించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కాలువల్లో తాగునీటి వైపులైన్లు లేకుండా చూడాలని ఆదేశించారు. సాధారణ యూరియా కు బదులుగా నానో యూరి యా వినియోగాన్ని పెంచాలన్నారు. జిల్లాలో నానో యూరియా 12,000 బాటిళ్లు అందుబాటుల్లో ఉన్నట్టు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చాంబర్ నుంచి జేసీ ఎస్.సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ రామన్, డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, డీఎంహెచ్ఓ జీవనరాణి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు జ్వరమొచ్చింది..!
విజయనగరం ఫోర్ట్: జిల్లావ్యాప్తంగా అనేక మంది జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటోంది. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాధులను అదుపు చేయాలంటే సకాలంలో వాటిని గుర్తించగలగాలి. డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు సకాలంలో చికిత్స అందించగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. జ్వరపీడితులను త్వరగా గుర్తించాలంటే ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలి. కాని కూటమి ప్రభుత్వంలో పీవర్స్ సర్వే ఎక్కడా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరపీడితులను గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్తున్న జ్వరపీడితులు రెండు, మూడు రోజుల పాటు జ్వరం ఉన్నవారు ఏజ్వరమో తెలుసుకోవడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా మరి కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల్లో టైపాయిడ్, మలేరియా, డెంగీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంతమంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచానపడి మూలుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటింటా ఫీవర్ సర్వే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటా ఫీవర్ సర్వేను ముందుగానే చేపట్టేవారు. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు సర్వే చేసేవారు. వారికి వలంటీర్లు కూడా సహాయం చేసేవారు. ఇంటిలో ఎవరికై నా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయా అని రెండు మూడు విడతలుగా సర్వే చేసేవారు. దీని వల్ల జ్వరపీడితులందరినీ గుర్తించి చికిత్స అందించడానికి వీలుండేది. మలేరియా, డెంగీ వంటి లక్షణాలుంటే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించి, నిర్ధారణ చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించేవారు. జిల్లాలో ఆచూకీ లేని సర్వే గతంలో మాదిరి నేడు జిల్లాలో ఎక్కడా ఫీవర్ సర్వే జరగడం లేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ బాధితులను గుర్తించి సేవలు అందడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెండు లక్షలకు పైగా జనం జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం అధికంగా జ్వరపీడితులు చేరి చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఓపీలో చికిత్స తీసుకుంటుండగా, మరి కొంతమంది ఇన్‌పేషేంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. మంచాన పడిన జనం ఎక్కడా కానరాని ఫీవర్ సర్వే పట్టించుకోని అధికారులుఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు సింహాచలం. ఈమెది మెంటాడ మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధి జీడికవలస. జ్వరంతో మూడు రోజులుగా మంచంపైన ఉంటోంది. ఈమెతో పాటు మరి కొంత మంది లోతుగెడ్డ పంచాయతీ పరిధిలోని ఏడు గిరిజన గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.జ్వరాల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు జిల్లాలో ఫీవర్ సర్వే చేపట్టాం. అవసరమైతే మరోసారి సర్వే చేయిస్తాం. జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
చెరువులో పడి వ్యక్తి మృతి
గంట్యాడ: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ మండలంలోని రామవరం గ్రామానికి చెందిన కొల్లి సూరిదేముడు (41) బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో కాలకృత్యాల కోసం అయ్యన్నబంద చెరువుకు వెళ్లాడు. కాలు జారి చెరువులో పడిపోగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. అక్కడే ఉన్న రీసు అప్పన్న గ్రామంలోకి పరుగున వెళ్లి జనాలను తీసుకొచ్చి సూరిదేముడిని బయటకు తీయగా అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెరువులో పడి మరో వ్యక్తి..పార్వతీపురం రూరల్: మండలంలోని ఎమ్మార్‌నగరం గ్రామ శివారులో గల చిన్న రాయుడు చెరువులో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం మృతదేహం పైకి తేలి కనిపించడంతో స్థానికులు పార్వతీపురం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామంలోని బజారు వీధికి చెందిన సింగిరెడ్డి రమేష్ (35) పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ వ్యక్తి పశువులను శుభ్రం చేసేందుకు చెరువులో దిగి ఈత రాక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉంది. జరిగిన సంఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి..పూసపాటిరేగ: మండలంలోని కందివలస సంత సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. కందివలస సంత ఏరియాలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి మూర్ఛ వ్యాధితో ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పూసపాటిరేగ పోలీసులు కోరారు. ఈమేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగస్టు 3న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో ఆగస్టు 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆగస్టు 3న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తెలిపారు. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించే ఎంపికల్లో అండర్–14,16,18,20 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలు పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు రగ్గుల పంపిణీమక్కువ/పార్వతీపురం రూరల్: మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రగ్గులను పంపించారు. ఈ మేరకు బుధవారం ఆ 6 గిరిజన గ్రామాల్లో రగ్గుల పంపిణీ జరిగింది. మండలంలోని బాగుజోలలో 24, చిలక మెండంగి, బెండమెడంగి, తాడిపుట్టి, దోయ్ వర, సిరివర, గిరిజన గ్రామాల్లో 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ చేశారు. -
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి ˘
విజయనగరంఫోర్ట్: స్వచ్ఛభారత్ మిషన్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 147 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. తన చాంబర్లో మరుగుదొడ్ల నిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. మరో 74 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించామని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో వీటికి అనుమతి తెప్పిస్తామని తెలిపారు. 144 అంగన్వాడీ కేంద్రాలకు ఆగస్టు 20వ తేదీలోగా నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికి 31 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, తదితరులు పాల్గొన్నారు. సీ్త్రనిధి రుణ లక్ష్యం రూ.283 కోట్లు ● సీ్త్రనిధి ఏజీఎం చిట్టిబాబు రామభద్రపురం: జిల్లాలో మహిళా సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుకోసం సీ్త్రనిధి కింద రూ.283 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం వై.చిట్టిబాబు తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీఓఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు సద్వినియోగం చేసుకునేలా రుణాలు మంజూరు చేయాలని, వంద శాతం రికవరీ చేయాలని సూచించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల డ్వాక్రా సంఘాలున్నాయన్నారు. ఇప్పటి వరకు సీ్త్రనిధి కింద రూ.89 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తామన్నారు. నూటికి నెలకు 92 పైసలు వడ్డీ పడుతుందన్నారు. సకాలంలో చెల్లిస్తే అధిక వడ్డీభారం ఉండదన్నారు. మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీ్త్రనిధి ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ రమేష్, ఏపీఎం మోహన్, సీసీ సింగరాజు, తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఆటోమ్యుటేషన్ విజయనగరం: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులు (ఇల్లు, అపార్ట్మెంట్, ఖాళీ స్థలాలు) రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యుటేషన్ జరు గుతుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ టి.ఉపేంద్రరావు తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్, మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అనుసంధానంతో ప్రజల సౌకర్యార్థం తప్పులులేని డేటాతో ప్రజలే నేరుగా ఆస్తి వివరాలను నమోదు చేయడం, బాకీ పన్నులు, మ్యుటేషన్ రుసుములను నేరుగా ఆన్లైన్లోనే చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఆటో మ్యుటేషన్‌తో నకిలీ పత్రాలు, భూ వివాదాలకు చెక్ చెప్పవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సోషల్ మీడియా పోస్టులపై ఎస్పీ కన్నెర్ర
విజయనగరం క్రైమ్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టవద్దని ఎస్పీ వకుల్‌జిందల్ కోరారు. కుల, మత, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని బుధవారం ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ మతాలను, కులాలను, రాజకీయ పార్టీలను రెచ్చగొడుతూ ట్విట్టర్, ఫేస్బుక్, ఇనస్ట్రాగాం, యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి ద్వారా మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్నారు. ఇందుకుగాను ఒక పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కాగా జిల్లాలోని డెంకాడ మండలం టి.కళ్లాలు (చిన మోపాడ)లో ఓ ప్రార్థనా మందిరం ఆవరణలో ఉన్న విగ్రహంపై చెట్టు కొమ్మ పడి విగ్రహం పాడైపోతే, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి, అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వినియోగిస్తున్న ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. వాస్తవాలను తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టేటపుడు ఇతరుల మతాలు, కులాలు, మనోభావాలకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకుండా ఉండాలని హితవు పలికారు. అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు నెటిజెన్స్‌కు హెచ్చరిక -
పీ–4 కార్యక్రమం ఓ బూటకం
–8లోఅన్నదాత సుఖీభవలో కోత రైతన్నకు పెట్టుబడి సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కొర్రీలతో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెడుతోంది. రేగిడి: పేదరిక నిర్మూలనకోసం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ–4 కార్యక్రమం ఓ బూటకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ విమర్శించారు. రేగిడిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీ–4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, గ్రామస్థాయిలో పూర్తిగా అట్టర్‌ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. మార్గదర్శకులను గుర్తించకుండా బంగారు కుటుంబాలను గుర్తించాలని అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం మంచిది కాదన్నారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని వేధించడం తగదన్నారు. అట్టడుగున ఉన్న పేద ప్రజలను బాగుచేయాలనే మంచి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే కూటమి పార్టీల నాయకులే ఆ కుటుంబాలను దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు కాకపోవడం, ప్రజలు కూటమి నేతలను నిలదీస్తుండడంతో వారి దృష్టిని మరల్చడానికి పీ–4 కార్యక్రమం ముందుకు తెచ్చారన్నారు. గిన్నిస్‌బుక్ రికార్డు కోసం విశాఖలో ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డుల కోసం పీ–4 కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
దేశం కోసం మధ్యవర్తిత్వం
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం అనే ప్రక్రియ చాలా సులువైనది, ఖర్చు లేనిదని ప్రజల్లోకి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం. బబిత అన్నారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాలతో బుధవారం జిల్లా కోర్టు చాంబర్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం కోసం కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న న్యాయమూర్తులంతో భౌతిక సమావేశం, ఇతర ప్రాంతాల్లో ఉన్న న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా మనోవర్తి కేసులు ప్రమాద బీమా కేసులు గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన తగాదా కేసులను సులువుగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. విద్యార్థికి పాముకాటుపై విచారణసాలూరు రూరల్: మండలంలోని తోణాం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మంగళవారం పాముకాటుకు గురైన విషయమై ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం తోణాం ఆశ్రమ పాఠశాల వార్డెన్ లచ్చయ్యను విచారణ చేశారు. విద్యార్థి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలో పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానానికి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తోందని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్డెన్ తెలిపారు. డీఏ జుగా నిధులతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపడతామని విచారణ అనంతరం పీఓ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతనెల్లిమర్ల రూరల్: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను వీఆర్ఓ వెంకట్రావు బుధవారం పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పంప్ హౌస్ సమీపంలో తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడు తూ తవ్వకాలు జరుపుతున్న వ్యక్తికి జరిమానా విధిస్తామన్నారు. సొంత అవసరాలకు మా త్రమే ఎడ్ల బండ్లపై ఇసుకను తరలించే వీలుందని, భారీ వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీడీఏ పీఓ దృష్టికి తాగునీటి సమస్యపాచిపెంట: మండలంలోని కొత్తవలస గ్రామంలో తాగునీటి సమస్యను గ్రామస్తులు సబ్‌కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ్ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం కొత్తవలస గ్రామానికి వచ్చిన ఐటీడీఏ పీఓ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ క్రమంలో గతకొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని , ఎన్నిసార్లు అదికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలపగా పక్కనే ఉన్న ఎంపీడీఓతో ఆయన మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. గ్రామ సమీపంలో గల చెరువులో లార్వా దోమలపై డ్రోన్ ప్రయోగాన్ని, స్థానిక పత్తి పంటలో డ్రోన్ ద్వారా ఎరువుల పిచికారీని పరిశీలించారు.కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరారైన చిట్టీల నిర్వాహకురాలుపార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన చిట్టీల నిర్వాహకురాలు వారణాసి జయలక్ష్మి పరారైనట్లు ఆమె వద్ద చిట్టీ కట్టిన బాధితుల ద్వారా బయటపడింది. సుమారు రూ.రెండు కోట్ల వరకు ఆమె టోపీ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తుండగా 45మందికి రూ.90లక్షల మేర బాకీలు ఉన్నట్లు ఐపీ నోటీసులు పంపించడంతో ఒక్కసారిగా ఆమె పరారైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఆస్తి రూ.రెండు లక్షల వరకు ఉంటుందని, అది తప్ప తన వద్ద ఇంకేమీ లేవని ఐసీ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. చిట్టీల నిర్వహణలో ఆమెకు సహకరించిన బంధువులు కూడా ఇటీవల పరారీలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా ఆమె చిట్టీల నిర్వహిస్తోంది. అయితే అకస్మాత్తుగా పరారీ కావడంతో కాలనీవాసుల్లో ఆందోళన మొదలైంది. చిట్టీల బాధితులు ఎంతమంది? ఎంతమేరకు నష్టపోయారనేది తేలాల్సి ఉంది. -
హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌పై రైతుల అభ్యంతరం
లక్కవరపుకోట: ఇప్పటికే విలువైన పంట భూములను ఐఓసీఎల్ పైప్‌లైన్, హైపవర్ విద్యుత్ లైన్, గ్రీన్ ఫీల్డ్ హైవే తదితర ప్రాజెక్టుల కోసం లాక్కున్నారని పరిహారం మాత్రం తూతూ మంత్రంగా అందించారని మరో ప్రాజెక్టుకు భూములను ఇచ్ఛేందుకు సిద్ధంగా లేమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ కు చెందిన పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి శ్రీరాంపురం, కొట్యాడ, కూర్మవరం గ్రామాల రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విలువైన పంట భూముల్లో అడ్డుగా పైప్‌లైన్ వేస్తే భవిష్యత్ అవసరాలకు భూములను అమ్ముకోదలిస్తే కొనేందుకు ఎవరూ ముందుకు రారని వాపోయారు. పైప్‌లైన్ నిర్మాణానికి సేకరించిన భూమికి మార్కెట్ విలువలో కేవలం 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పైప్‌లైన్ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌పీసీల్ డిప్యూటీ మేనేజర్ ఎం.లక్ష్మణ్, తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, విశ్రాంత తహసీల్దార్ జి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత సుఖీభవలో కోత
విజయనగరం ఫోర్ట్: మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన దేవర పాదాలమ్మకు వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద సాయం అందింది. కూటమి ప్రభుత్వం సాయం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఆమె పేరు లేదు. ఆమెకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ● బొండపల్లి మండలం బిల్లల వలసకు చెందిన ఎన్. శ్రీనుకు గ్రామంలో 65 సెంట్ల పొలం ఉంది. వైఎస్సార్సీపీ హయంలో ఈ రైతుకు రైతు భరోసా సాయం అందింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఈ రైతు పేరు లేదు. ● దత్తిరాజేరు మండలం వి.కృష్ణాపురం గ్రామానికి చెందిన మార్పిన సురేష్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఆ రైతు పేరు లేదు. ఈ ముగ్గురు రైతులే కాదు. అనేక మంది రైతులకు ఎదురైన సమస్య ఇది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అందుకున్న వారికి కూడా కూటమి ప్రభుత్వంలో పథకం అందని పరిస్థితి నెలకొంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎంపిక చేసిన జాబితలో వేలాది మందికి కూటమి ప్రభుత్వం కోత పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందించింది. కానీ కూటమి సర్కార్ మొదటి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న ఆర్థిక సాయం అందించలేదు. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇంతవరకు అందించిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వకపోయినప్పటికీ రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం అని చెప్పి గుర్తించిన లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత విధించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఓట్లు వేస్తే ఈ విధంగా కోత పెట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పడు అర్హులమై ఇప్పడు ఏవిధంగా అనర్హులమ య్యామని రైతులు వాపోతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనే కుట్రతోనే కూటమి సర్కార్ ఈ విధంగా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 2.63 లక్షల మంది రైతులకు లబ్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2.63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.13,500 చొప్పన ఆర్ధిక సాయం అందించింది. కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకం కోసం 2.24,356 మంది అర్హులను గుర్తించింది. ఇందులో 2,23,117 మందికి ఈకేవైసీ పూర్తయింది. 1239 మందికి ఈకేవైసీ చేయాల్సి ఉంది. 40 వేలకు పైగా లబ్ధిదారులు గతంలో కంటే తగ్గిపోయారు. ఇంకా అందని సాగు సాయం అధికారంలోకి వస్తే రైతుల సాగు పెట్టుబడికి ఆర్థిక సాయం చేస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. గద్దె నెక్కిన మొదటి ఏడాదే రైతులకు ఇచ్చిన హామీని ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఇంతవరకు సాయం అందించలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే రైతులకు పంట పెట్టుబడికి డబ్బులు లేక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అప్పలు చేసి పంటల సాగుకు పెట్టుబడి పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కంటే తగ్గిన లబ్ధిదారులు కూటమి పాలనలో అర్హులుగా గుర్తించింది 2.24 లక్షల మంది తగ్గిన 40 వేల మందికి పైగా లబ్ధిదారులు -
పత్రానికో రూటు.. సంతకానికో రేటు!
రాజాం: రాజాం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పత్రానికో రూటు, రేటు ఉంటుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇక్కడకు వస్తే ముందుగా రైటర్లను సంప్రదించాలి. వీరి ధర వీరికి చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అన్నీ సక్రమంగా ఉన్నా ఏదో ఒక కొర్రీ అక్కడి అధికారులు నుంచి వస్తుంది. ఆ కొర్రీ నుంచి తప్పించుకుని రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ సబ్‌రిజిస్టార్‌తో సంబంధంలేని ఓ వ్యక్తి రంగంలోకి దిగి ధర నిర్ధారిస్తారు. ఆ పత్రాల ఆధారంగా రేటు నిర్ణయిస్తాడు. ఆ మేరకు అదనపు చెల్లింపులు జరిపితే పనవుతుంది. లేదంటే రిజిస్ట్రేషన్‌కు కొర్రీలు తప్పవు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతల అండదండలు తమకు ఉన్నాయంటూ కార్యాలయంలో ఉన్నవారు హూంకరించడం పరిపాటిగా మారిపోయిందంటూ పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సంతకం లెక్కన డబ్బుల వసూలు.. ఇక్కడ రైతు వారి పొలాలు దగ్గర నుంచి ఇంటి స్థలాలు, గ్రామ కంఠాలు, జిరాయితీ భూమి.. ఇలా ఏదైనా సరే ఆయా ధ్రువీకరణ పత్రాల్లోని సంతకాలు, సాక్షుల సంతకాలు ఆధారంగా రేటు నిర్ధారిస్తారు. గ్రామ కంఠాల్లోని ధ్రువీకరణ పత్రాలు ఆధారంగా రిజిస్ట్రేషన్లు కావాలంటే అందులో వీఆర్వో ఽధ్రువీకరణ పత్రం ఉంటే రూ.10 వేలు, తహసీల్దార్ ధ్రువీకరణ సంతకం ఉంటే రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చలానా కంటే అదనంగా చెల్లించాలి. ఇవి రైటర్‌తో సంబంధంలేనివి. రైటర్ వద్ద వీటికి మరో ప్రత్యేక ధర ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్లకు సాక్షులు వారే సిద్ధం చేస్తే ఒక ధర, లబ్ధిదారులు ఎవరినైనా తీసుకొస్తే ఇంకో ధర ఉంటుంది. ఇవి కాకుండా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తే ఒక ధర, రైటర్లే సిద్ధంచేస్తే వేరే ధర ఉంటుంది. వీటికి భయపడి నిజమైన హక్కుదారులు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ‘సంతకవిటి మండలంలో ఓ గ్రామానికి చెందిన స్థలం కోర్టు వివాదంలో ఉండగానే రాజాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ మార్టుగేజ్ రిజిస్ట్రేషన్‌కు రాజాంలోని ఓ పైవేట్ ఫైనాన్స్ కంపెనీ రూ.6 లక్షల రుణం ఇచ్చింది. ఇదెలా సాధ్యమైందని ఆరాతీస్తే రాజాం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రైటర్లు, కార్యాలయం ఉద్యోగుల ప్రమేయంతో తప్పుడు సర్వే నంబర్‌తో పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేశారు. అక్రమపద్ధతిలో రుణం పొందేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాల కోసం లబ్ధిదారుడు ఎక్కువ మొత్తం ముట్టజెప్పినట్టు తెలిసింది.’ సబ్ రిజిస్ట్రార్ ఏమన్నారంటే.. ఇక్కడ గతంలో ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. మేం వచ్చిన తరువాత వాటిని నిలువరిస్తున్నాం. పొజిషన్ సర్టిఫికెట్ల విషయంలో వీఆర్ఓలు, తహసీల్దార్లు ఇక్కడకు రావాల్సి ఉంటుంది. అలా లేని సమయంలో ప్రత్యామ్నాయంగా ధ్రువీకరణ పత్రాలపై ఎంకై ్వరీ చేస్తున్నాం. తప్పుడు సర్వే నంబర్లను గుర్తించలేకపోతున్నాం. ఎవరి వద్దా మేం నేరుగా డబ్బులు వసూలు చేయడం అనే ప్రసక్తిలేదు. గిట్టనివారు మాపై ప్రచారం చేస్తున్నారు. – కె.వేణు, సబ్‌రిజిస్ట్రార్, రాజాం షరా‘మామ్మూళ్లే’.. గత కొంతకాలంగా రాజాం సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సాగుతున్న అడ్డగోలు మామ్మూళ్ల వ్యవహారాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. రైటర్ల నుంచి కార్యాలయంలోని ప్రధాన ఉద్యోగి, సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరిపైనా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు విచ్చలవిడిగా రాజాంలో ఏర్పడి రుణాలు ఇస్తుండడంతో ఇంటి స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌కు డిమాండ్ పెరిగింది. లేని ఆస్తి, ఇళ్లు ఉన్నట్లు, కొత్త సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వీటికి రూ.15 వేలు నుంచి రూ.25వేలు వరకు అనధికార వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించి, అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు అక్రమ వసూళ్లు నిలువరించాలని పలువురు కోరుతున్నారు. రాజాం సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లలో అవినీతి దందా పైవేట్ ఫైనాన్స్‌లు, ఆస్తి హక్కుల కోసం అక్రమ రిజిస్ట్రేషన్లు! పుట్టుకొస్తున్న తప్పుడు సర్వేనంబర్ పత్రాలు -
మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం
విజయనగరం లీగల్: మానవ అక్రమ రవాణా హేయమైన చర్య అని ఇది వ్యవస్థీకృత నేరమని ఈ దోపిడీని అంతం చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళా ప్రాంగణంలో బుధవారం న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మహిళలు చిన్నపిల్లలను అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ రవాణా బాధితుల హక్కుల రక్షణ వారి భద్రతలే ప్రధాన అంశంగా పోలీస్ యంత్రాంగం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని అక్రమ రవాణా బాధితులకు రక్షణ నష్టపరిహారం, పునరావాసంతో పాటు వారికి తగిన న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థతో పాటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. పిల్లల అక్రమ రవాణాపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆర్.గోవిందరావు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి టి.విమల కుమారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్‌డీవీ ప్రసాద రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జి హిమబిందు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, పోలీస్ అధికారులు, యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ప్రసాద రావు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ -
పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికకు నోటిఫికేషన్
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికలు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు వచ్చేనెల 16న స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహిస్తామని ప్రస్తుత జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.మురళి, ఎ.సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నిక నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసి జిల్లా శాఖ కార్యాలయం నోటీస్ బోర్డులో ప్రదర్శనకు ఉంచినట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికలకు పరిశీలకులుగా విశాఖ జిల్లా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ఎంకేజీప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల అధికారిగా విజయనగరం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు టి.శ్రీధర్‌బాబు, సహాయ ఎన్నికల అధికారిగా విజయనగరం జిల్లా పట్టణ ఏపీఎన్జీఓ అసోసియేట్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నియమితులయ్యారని పేర్కొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్లలో ఉన్న ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని ఎన్నికల అధికారి శ్రీధర్ కోరారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, రమణమూర్తి, ఆంజనేయ వర్మ, పరిషత్ యూనిట్ అధ్యక్షులు కేఎస్శ్రీనివాసరావు, ఎల్వీ ప్రసాద్, వీవీరమణమూర్తి, ఎం.హేమలత, వనిత, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
సంపన్నులను వదిలి.. చిరుద్యోగుల వెంట!
సాక్షి, పార్వతీపురం మన్యం/ విజయనగరం అర్బన్: సంపద సృష్టిస్తామని, పేదరికాన్ని రూపుమాపుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘సామాజిక బాధ్యత’ అంటూ సంపన్నుల వెంటపడుతున్నారు. బంగారు కుటుంబాలను తీర్చిదిద్దాలని.. ఆ మేరకు పేద వర్గాలను దత్తత తీసుకోవాలని ప్రాథేయపడుతున్నారు. ఆ పిలుపునకు సంపన్న వర్గాలెవరూ ముందుకు రావడం లేదు. స్వయంగా ఆ పార్టీ నాయకులే స్పందించడం లేదు. జిల్లాకు చెందిన మంత్రి సంధ్యారాణి.. అప్పుడెప్పుడో పది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ప్రకటించగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 264 కుటుంబాలను దత్తతతీసుకుంటామని ప్రకటనలో తెలిపారంతే!. ఆ తర్వాత ఏ ప్రజాప్రతినిధి నుంచి గానీ.. ఉన్నతాధికారి నోటి వెంట గానీ దత్తత మాట రాలేదు. ప్రభుత్వం నుంచి నిర్దేశించిన ఆగస్టు గడువు సమీపిస్తుండటంతో కిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అంతా కలసి పడ్డారు. రెండేసి కుటుంబాలను దత్తత తీసుకోవాలని వెంటపడుతున్నారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల జీతంపై ఆధారపడే ఉపాధ్యాయులపై రెండు కుటుంబాల దత్తత భారం మోపడం భావ్యమా? అని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వాలని చూడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. ఇప్పుడు ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు జిల్లా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో అధికారుల మీద పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ చేస్తున్నా.. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 విధానం.. ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల కోసం ఎదురుచూస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 33,309 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉండగా.. ఇప్పటికి సుమారుగా 13 వేల కుటుంబాలే మ్యాపింగ్ అయ్యాయి. ఇంకా 20 వేల కుటుంబాల వరకు మార్గదర్శులను అనుసంధానం చేయాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో 60,067 బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. అధికారులు, ఉద్యోగుల మెడపై కత్తి.. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. పారిశ్రామిక సంస్థలు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్్ .. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయి లో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. మరోవైపు తమ పాఠశాలల్లో పని చేస్తున్న కింది స్థాయి సిబ్బందితో పాటు, విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని విభాగాల్లో ఉద్యోగుల నెత్తినా రుద్దుతున్నారు. దీంతో ఆయా వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.మార్గదర్శకులు ఏరీ..? బలవంతపు దాతృత్వమా? దాతృత్వం బలవంతం కాదు.. హృదయం నుంచి రావాలి. ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితిని గమనించకుండా, వారిపై సామాజిక ఒత్తిడి పెంచేలా చర్యలు చేపట్టడం న్యాయసమ్మతమైనది కాదు. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి చెందిన వేతన జీవులు. గృహ నిర్మాణ రుణాలు, పిల్లల చదువులు, ఖర్చులు, కుటుంబ సభ్యుల అనారోగ్య బాధ్యతలు, వివాహాలు వంటివన్నీ ఆ జీతం నుంచే భరించాలి. పీ–4 భారంతో బోధనకు దూరమయ్యే ప్రమాదం ఉంది. – నల్లా బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముందుకు రాని ‘శ్రీమంతులు’ అధికారులకు గుదిబండగా పీ–4 దత్తత తీసుకోవాలని ఉద్యోగులపై ఒత్తిడి వేతన జీవులకు ఎలా సాధ్యమంటున్న ఉపాధ్యాయ సంఘాలు ఒక ఉపాధ్యాయుడికి సాధ్యమయ్యేనా.. పీ–4 విధానం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలను బంగారు కుటంబాలుగా మార్చాలని నిర్ణయించడం ముదావహం. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, పెద్ద అధికారులు, సంపన్న వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేసి దత్తత తీసుకోవాలని చెబితే బాగుంటుంది. నెల జీతంపై ఆధారపడే ఉపాధ్యాయుడు ఏ విధంగా రెండు కుటుంబాలను దత్తత తీసుకోగలడు? – అమరపు సూర్యనారాయణ, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కార్పొరేట్లను వదిలి టీచర్లపై ఒత్తిడా? పీ–4 పథకం ద్వారా పేదవర్గాలను ధనిక వర్గాలు తీసుకోవాలి. ప్రభుత్వం కార్పొరేట్ వారిని విడిచిపెట్టి ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం తగదు. ప్రస్తుతం ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి టీచర్లనే ప్రభుత్వం దత్తత తీసుకుని ఆదుకోవాలి. పీ–4 పథకం దత్తత కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. – ఎస్.మురళీమోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పండి
చీపురుపల్లి: ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పగలగాలని, లేని పరిస్థితిలో పల్లెలకు వెళ్లడం దండగని కూటమి నేతల పాలనా తీరును వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎండగట్టారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలో మంగళవారం సాయంత్రం బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు గ్రామాల్లో తిరుగుతున్నారని, ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. తాము గ్రామాల్లోనికి వస్తే తమ ప్రభుత్వంలో చేసిన ఎంతో అభివృద్ధితోపాటు మరెన్నో సంక్షేమ పథకాల కోసం చెప్పగలమన్నారు. టీడీపీ నేతలు అలా చెప్పగలరా అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎన్నో హామీలు ఇచ్చారని, దాని కోసం బాండ్లు కూడా ఇచ్చి మోసం చేశారన్నారు. హామీలు అమలచేసేలా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, బెల్లాన త్రినాథరావు, దన్నాన జనార్దనరావు, సర్పంచ్ బాణాన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ బాణాన రామరత్నం, ఎంవీఎస్‌ఎస్‌ఎన్ రాజు, కొంచాడ శ్రీనివాస్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. కూటమి నేతలను ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
వైద్యుల పనితీరుపై విచారణ
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మెడికల్ అంకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ పి.విజయలక్ష్మిపై ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టింది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ సమయంలో విజయలక్ష్మి అందుబాటులో లేకుండా వేరేచోట ప్రాక్టీస్ చేస్తున్నారంటూ పాండ్రంకి వెంకటరమణ అనే వ్యక్తి ఆధారాలతో ఫిర్యాదుచేశారు. అలాగే, రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శివశ్రీధర్పై కూడా అదే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయన పనితీరుపై వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల విచారణ జరిపారు. డీఎస్డీఓ బాధ్యతల స్వీకరణ విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాల క్రీడాభివృద్ధి అధికారిగా కె.శ్రీధరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ డీఎస్‌డీఓగా ఉన్న వెంకటేశ్వరరావు విశాఖపట్నం బదిలీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధరరావుకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంధుల పాఠశాల సందర్శన విజయనగరం అర్బన్: పట్టణంలోని పూల్‌బాగ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.రవిప్రకాష్ రెడ్డి మంగళవారం సందర్శించారు. పాఠశాల ఆవరణ, గదులు, ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఆ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఆశయ్య, పాఠశాల ప్రధానాచార్యులు ఎం.మహేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రాణం తీసిన భూ వివాదం ● నాటు తుపాకీతో వ్యక్తి హత్య శృంగవరపుకోట: రెండు కుటుంబాల మధ్య భూ వివాదం హత్యకు దారితీసింది. సొంత పినతండ్రిని నాటుతుపాకీతో హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన పల్లపుదుంగాడలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ చిట్టంపాడు గ్రామానికి చెందిన సీదర రాము కొద్ది నెలలుగా పల్లపుదుంగాడ గ్రామంలో ఉన్న కుమార్తె బడ్నాయిన నాగమణి వద్ద ఉంటున్నాడు. సీదర రాము(60), తన అన్న కొడుకు సీదర నాగులు మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం సాగుతోంది. ఇదే విషయమై సోమవారం రాత్రి వాగ్వాదం జరగడంతో సీదరి నాగులు తన పినతండ్రి రాముపై నాటుతుపాకీతో కాల్పులు జరిపి హతమార్చాడు. అనంతరం పరారయ్యాడు. విషయం మంగళవారం ఉదయం తెలియడంతో ఎస్.కోట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుమార్తె నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
ఆందోళనకు దిగకముందే.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన దిశగా వెళ్లక ముందే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక రెవెన్యూ హోమ్‌లో మంగళవారం ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన జరిగిన ఏపీజేఏసీ అమరావతి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. డిమాండ్ల సాధనకు ఉద్యమాలు తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 16 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మరోవైపు ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపులపై కనీసం ఏ స్థాయిలోనూ చర్చలు జరపడం లేదని ఆరోపించారు. దాచుకున్న బకాయి సొమ్ము ఎంతెంత ఉందో ఆయా ఉద్యోగి, ఉపాధ్యాయునికి వివరంగా తెలియజేసే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటీవల అన్ని ఉమ్మడి జిల్లాలో పర్యటించామని, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసు కున్నామని, వచ్చేనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి సభలో సమీక్షించి డిమాండ్ల అజెండాను తయారుచేస్తామన్నారు. అనంతరం జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ కార్య వర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి వైస్ చైర్మన్ డాక్టర్ డి.జైధీర్, ఏపీ విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ లేబర్ శాఖ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ప్రభాకర్, ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రాజేష్, జిల్లా అధ్యక్షుడు తాడ్డి గోవింద, ప్రధాన కార్యదర్శి సూర్య, ఏపీజేఏసీ జిల్లా కమిటీకి చెందిన వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తహసీల్దార్లు, డివిజన్, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వానికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు హెచ్చరిక వచ్చేనెల 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర సభలను విజయవంతం చేయాలి -
జాతీయస్థాయి దివ్యాంగుల పోటీల్లో ‘తోషిని’కి కాంస్య పతకం
● ఈనెల 24 నుంచి 28వరకు బిలాస్పూర్లో జరిగిన పోటీలుతెర్లాం: జాతీయస్థాయిలో జరిగిన దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో తెర్లాం హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని అడ్డా తోషిని ‘బోసి గేమ్’ వ్యక్తిగత హయ్యర్ ఎబిలిటీ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఈఏడాది ఏప్రిల్ నెలలో నూజివీడులోని అగిరిపల్లి హిల్ పారడైజ్ స్కూల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్ భారత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధిండంతోపాటు, దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 జాతీయ స్థాయి పోటీలకు తోషిని ఎంపికై న విషయం తెలిసిందే. ఈనెల 24 నుంచి 28వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ యూనివర్సిటీ మైదానంలో జాతీయ స్థాయి దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొన్న తోషిని తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుని కాంస్య పతకాన్ని సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిన తోషినిని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా అధికారులు, హైస్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఆటో, బైక్ ఢీ: వృద్ధుడి మృతి
లక్కవరపుకోట: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో మంగళవారం కొత్తవలస నుంచి ప్రయాణికులతో ఆటో వస్తుండగా సోంపురం జంక్షన్ నుంచి మితిమీరిన వేగంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రంగరాయపురం జంక్షన్ సమీపంలో ఎత్తుబ్రిడ్జి వద్ద ఆటోను బలంగా ఢీకొట్డాడు. దీంతో ఆటో అదుపు తప్పి బొల్తా కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న కిత్తన్నపేట గ్రామానికి చెందిన యడ్ల సింహాచలం(64) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ బంగారయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పూర్తిగా మద్యం తాగి ఉన్నాడని ఎల్.కోట జంక్షన్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా వారిని చూసి సంబంధిత వ్యక్తి ఆగకుండా బండిపై వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 వాహనంలో ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ పాపారావు తెలిపారు. మరో నలుగురికి తీవ్రగాయాలు -
అంగన్వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన తన చాంబర్లో మంగళవారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యను ప్రోత్సహించేందుకు పూర్వ శ్రేణి పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం నిర్వహిస్తున్న పూర్వ శ్రేణి విద్యా దినోత్సవం బాలల మనసిక, శారీరక, భాష, సాంఘిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, నోడల్ అధికారి తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తులను సింగల్ డెస్క్ పాలసీ కింద 21 రోజుల్లో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మే నుంచి జూలై వరకు 1652 దరఖాస్తులు అందగా 1634 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని, మిగిలిన వాటిలో 11 దరఖాస్తులు కాలుష్య నియంత్రణ మండలి వద్ద, మిగిలినవి ఫైర్, గ్రౌండ్ వాటర్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజి శాఖల వద్ద పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని గడువు లోగా పరిష్కరించాలని, తిరస్కరిస్తే తగిన కారణాలతో తిరస్కరించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఎల్డీఎం రమణమూర్తి, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష్మణ రావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా ఫైర్ ఆఫీసర్ రామ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, ఫ్యాక్టరీస్, స్కిల్ డెవలప్మెంట్, శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
హోంగార్డ్స్ సంక్షేమానికి చర్యలు
● ఎస్పీని కలిసిన విశాఖ రేంజ్ కమాండెంట్ జోషివిజయనగరం క్రైమ్: విశాఖ రీజియన్ హెూంగార్డ్స్ కమాండెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.జోషి తొలిసారి జిల్లాకు వచ్చి, ఎస్పీ వకుల్ జిందల్‌ను మర్యాద పూర్వకంగా మంగళవారం కలిసి, పూల మొక్కను అందజేశారు. హెూంగార్డ్స్ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వకుల్ జిందల్ తో ఈ సందర్భంగా చర్చించారు. ఆపై వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని చెప్పారు. అనంతరం ఆయన హోంగార్డులతో సమావేశమై, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హోంగార్డు కుటుంబాలకు వర్తింపజేయాలని, విధి నిర్వహణలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రయాణించేందుకు బస్ పాస్ వంటి సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని హోం గార్డులు కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోంగార్ుడ్స నిర్వహించిన పరేడ్ ను కమాండెంట్ పరిశీలించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై ముబారక్ అలీ, హెూంగార్డ్స్ ఇన్చార్జ్ హెచ్‌సీలు రాజు, శ్రీనివాసరావు, హెూంగార్డులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా అమ్మవారికి నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు,కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.ఈవీఎం గొడౌన్ల తనిఖీనెల్లిమర్ల: నెలిల్లమర్లలో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు, లోపలి గదులకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుపక్కల, గొదాముల్లోని పరిస్థితులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి.కీర్తి, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు● ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించిన కలెక్టర్ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ను రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిసి పలు సమస్యలను వివరించారు. బొప్పరాజు మంగళవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వాటిపై కలెక్టర్ అంబేడ్కర్ సానుకూలంగా స్పందించి జిల్లా స్థాయి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొప్పరాజుతో పాటు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాడ్డి గోవింద, సూర్య ఇతర నాయకులు పాల్గొన్నారు. -
మృతదేహం వివరాలు లభ్యం
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామం సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు సోమవారం గమనించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టి మృతుడిని మార్లాపల్లి గ్రామానికి చెందిన లెక్కల ఈశ్వరరావు(51)గా గుర్తించారు. మృతుడు వేసుకున్న బట్టలను, మృతదేహాన్ని బంధువులు చూసి గుర్తుపట్టినట్లు ఎస్సై నవీన్‌పడాల్ తెలిపారు. ఈశ్వర రావుకు విపరీతంగా తాగుడు అలవాటు ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటి నుంచి వెళ్లేపోయాడు. ఎప్పటి మాదిరిగా తిరిగి వస్తాడనుకోగా ఎంతకీ రాలేదు. చందులూరు వైపు వెళ్లి రోడ్డు పక్కన తుప్పల్లో పడిపోవడంతో సాయం చేసిన వారు లేక మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య వరం, కూతురు, కొడుకు ఉన్నారు. ఈ మేరకు భార్య వరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నవోదయలో హ్యాండ్‌బాల్ మీట్
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్ 2025–26ను ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్ల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఆయా విద్యాలయాల కోచ్‌లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాం, అదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గి క్లస్టర్ల నుంచి క్రీడాకారులు వచ్చినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు ఏపీ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు నేతృత్వం వహిస్తారని చెప్పారు. కట్టా శ్రీను, ఎన్వీవీ కుమార్‌లు రిఫరీలుగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లు బీహార్ రాష్ట్రంలోని నలందలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో హైదరాబాద్ రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. క్రీడాకారుల కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు. -
ఆడపిల్లలకు స్వీయ రక్షణలో ప్రత్యేక శిక్షణ
విజయనగరం క్రైమ్: జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక మహిళా శిక్షకురాలిని నియమించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు.ఈ మేరకు నగరంలోని కంటోన్మెంట్ శార్వాణి పోలీసు వెల్ఫేర్ ఆంగ్ల పాఠశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులపై జరిగే దాడులు, ఈవ్‌టీజింగ్, ఆకతాయిల వేధింపులు, లైంగిక దాడులను ప్రతిఘటించి, వారి దాడులను తిప్పి కొట్టేందుకు శిక్షణ ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు తమను తాము రక్షించుకునేందుకు కొన్ని స్వీయ రక్షణ టెక్నిక్స్ ను నేర్పాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రాధ అనే మహిళా శిక్షకురాలిని జిల్లా పోలీసుశాఖ నియమించిందని చెప్పారు. ఈ శిక్షకురాలు పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను ముందుగా నేర్పించి, వారి సహకారంతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థినులకు వాటిని నేర్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ శిక్షణ కోసం ఉపాధ్యాయులు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, పాఠశాల హెచ్ఎం సంధ్య, ఆర్ఎస్సైలు ప్రసాదరావు, రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అధికార బలంతో.. అనధికార నియామకం!
విజయనగరం ఫోర్ట్: అధికార బలం ముందు నిబంధనలు చెత్తబుట్టలో కలిసిపోయాయి. అనధికార నియామకానికి అధికార యంత్రాంగం పచ్చజెండా ఊపేసింది. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గింది. నోటిఫికేషన్ లేకుండానే ఫీల్డు అసిస్టెంట్ పోస్టును భర్తీ చేసేసింది. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు కాదని.. గంట్యాడ మండలంలోని నరవ గ్రామం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది గ్రామస్తుల ఆరోపణ. నోటిఫికేషన్ ఇవ్వకుండానే అధికార పార్టీ నేతలు చెప్పారని ఏకపక్షంగా ఓ మేట్‌ను ఫీల్డు అసిస్టెంట్‌గా నియమించారంటూ గ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు అనే వ్యక్తి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఇన్చార్జి కలెక్టర్ సేతుమాధవన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తప్పుడు మస్తర్లు వేశారన్న ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ విచారణ చేసి తొలగించిన మహిళా మేట్‌ను ఇప్పుడు ఫీల్డు అసిస్టెంట్‌గా ఎలా నియమిస్తారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండానే.. ఏదైనా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఫోస్టు ఖాళీ అయితే సంబంధిత మండల ఎంపీడీఓ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలి. ఆ దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి వారి జాబితాను డ్వామా పీడీకి పంపించాలి. పీడీ పరిశీలించి అర్హులను ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమిస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరతగతి పాస్, లేదా ఫెయిల్ అయిన వారు అర్హులు. 25 రోజులు పాటు పనికి వెళ్లి ఉండాలి, మేట్‌గా పనిచేసి ఉండాలి. మేట్‌గా పనిచేసిన వారు లేక పోతే 25 రోజులు పనిచేసిన వారిని పరిగణలోకి తీసుకోవాలి. అయితే నరవ ఫీల్డు అసిస్టెంట్ పోస్టు భర్తీలో అధికారులు ఇవేవీ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు చెందిన బంధువు ఒకరు అధికారులపై ఒత్తిడితెచ్చి తమ మనిషిని మేట్‌గా వేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ మంత్రి కొండపల్లి ఇలాకాలో అధికారుల నిర్వాకం నియామకంపై ఎంపీడీఓ, డ్వామా పీడీది తలోమాట నరవ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై ఫిర్యాదు -
ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: ఒడిశాకు చెందిన విద్యార్థులకు ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకాకుళం బొల్లినేని మెడ్‌స్కిల్స్‌తో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నామని గజపతి జిల్లా డీఎస్డీఈవో సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తెలిపారు. ఎన్యూవీ ఒడిశా శిబిరంలో భాగంగా 240 మంది విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పేషెంట్ రిలేషన్ అసోసియేట్, ఎస్ఎస్సీ, ప్లస్ టూ, ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అసోసియేట్ స్టోర్ ఫార్మా కోర్సులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సదుపాయం, యూనిఫామ్ స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 7331118019, 7680945357, 7995013422 నంబర్లను గానీ, శ్రీకాకుళం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గానీ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బొల్లినేని మెడ్‌స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, గజపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. మీ హామీల అమలు ఎప్పుడు?
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి దారుణంగా ఉందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్సీ వేయడానికి కూడా ముందుకురావడం లేదని తప్పుబట్టారు. మంగళవారం విజయనగరంలోని రెవెన్యూ హోంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం రాగానే ఐఆర్, డీఏలు, మంచి పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, బకాయిల చెల్లింపు... ఇలా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల వీడియోలను ప్రదర్శించారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తమపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి సర్కారు వచ్చాక... గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసిందని తెలిపారు. ఏడాది దాటినా కొత్త కమిషన్ వేయకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. అసలు పీఆర్సీ వేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అని బొప్పరాజు ప్రశ్నించారు. ‘‘ఆర్థిక భారం లేని పీఆర్సీ కూడా వేయలేని ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏవిధంగా సంక్షేమం చేకూరుస్తుందని భావించాలి? కమిషన్ వేశాక పీఆర్సీ నివేదిక వచ్చేసరికి కనీసం రెండేళ్లు పడుతుంది. కూటమి ప్రభుత్వ ఉద్దేశం చూస్తుంటే ఉద్యోగులు పట్టించుకోరని భావిస్తున్నదా? ఇన్ని సంవత్సరాల జాప్యం కారణంగా ఒక్కో ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టపోతున్నారు. బకాయి ఉన్న మూడు విడతలు, తాజాగా నాలుగో విడత డీఏతో కలిపి దాదాపు 20 శాతం వేతన పెంపు జరగాల్సి ఉంది. డీఏలు, పీఎఫ్, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వివిధ బకాయిలు రూ.25 వేల కోట్లు ఉన్నాయి’’ అని వివరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రాజేష్, జిల్లా కమిటీ అధ్యక్షుడు తాడి గోవింద, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు నష్టం
విజయనగరం గంటస్తంభం: లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర రూ.15,000 తక్షణమే చెల్లించాలని కోరుతూ..విజయనగరం జిల్లా శ్రీ కనకదుర్గ ఆటో మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కో–కన్వీనర్ ఎ.జగన్మోహన్రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి, నగర కార్యదర్శి బి.రమణ, ఉపాధ్యక్షుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కరోనా తర్వాత ఆటో, టాటా ఏసీ మ్యాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడులో అనుభవాలను పరిశీలించి ఇక్కడ నష్టపోతున్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ చూపాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర రూ.15,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహన రెన్యువల్ ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఆర్టీవో అధికారులు చేయాలని, వేదాంత ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్‌ను రద్దు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చాలానా లు, పెట్టి కేసులు ఆపాలని, ఆటోల నిలుపుదలకు పార్కింగ్ స్ధలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో ప్రజల జీవన విధానంలో భాగంగా మారిందని అత్యవసర, నిత్యావసర సర్వీసులన్నీ అందిస్తున్నామని ఈ రంగాన్ని ఆదాయ వనరుగా భావించకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ఆటోల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బి.పాపారావు, జి.కూర్మారావు, రామారావు, భాస్కరరావు, ప్రసన్న, లక్ష్మణరావు, రాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ఇదే
పెదంకలాం ప్రాజెక్టును రూ.1.30 కోట్ల వ్యయంతో 8వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. కాలువల ఆధునికీకరణకు హుద్‌హుద్ తుఫాన్ సమయంలో జైకా నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో కాలువల ఆధునీకీకరణ పనులు నిర్వహించని కారణంగా కాలువల ద్వారా సాగునీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా సాగునీటి కోసం ఆందోళనే తప్పా సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదు. – సింహాద్రి నాయుడు, రైతు కూలీసంఘం జిల్లా నాయకుడు, పార్వతీపురం● -
జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
పార్వతీపురం రూరల్/ మక్కువ: జంట హత్యల నేరం కేసులో ముద్దాయి గిన్నిపల్లి సింహాద్రికి పా ర్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎస్.దా మోదరరావు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1000లు జరిమానా విధించినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని మక్కువ పోలీస్‌స్టేషన్‌లో 2018లో నమోదైన జంట హత్యల కేసులో పలికివలస గ్రామానికి చెందిన ఒమ్మి పైడిరాజు ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన గిన్నిపల్లి సింహాద్రి ముద్దాయిగా రుజువైందన్నారు. భూ వివాదంలో భాగంగా పైడిరాజు తల్లిదండ్రులు పొలంలో మేకలు మేపుతున్న సమయంలో సింహాద్రి హత్య చేయడంతో మృతుల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో రెండవ అదనపు జిల్లా జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు సిబ్బందికి ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురం: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె. హేమలత, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 122 మంది అర్జీ దారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించేలా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం పార్వతీపురం రూరల్: పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చేయడమే తమ శాఖ లక్ష్యమని ఎస్పీ ఎస్వీ. మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 8 అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 24 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 24 వినతులు వచ్చాయి. తుంబలి గ్రామానికి చెందిన కొండలరావు విద్యుత్ స్తంభాలు తమ గ్రామంలో వేయాలని కోరారు. కుంబిడి ఇచ్ఛాపురానికి చెందిన మండంగి బాలకృష్ణ ఫారెస్టు భూమి రీసర్వే చేయాలని విజ్ఞప్తి చేశాడు. సింగిడి గ్రామస్తుడు సూర్యవర్మ తమకు శాశ్వత ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్ టిల్లర్ మంజూరు చేయాలని పలువురు రైతులు వినతులు ఇచ్చారు. కోదుల వీరఘట్టంకు చెందిన త్రినాథరావు తమ ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రాలేదని ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ కుమార్, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, వ్యవసాయాధికారి వాహిని, ఏపీడీలు సన్యాసిరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాముఖ్యం ఇవ్వాలి
● ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఇన్చార్జ్ కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్స్ మరళి, వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారు సంతృప్తిచెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 44 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి 44 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్‌తో పాటు ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులను స్వీకరించారు, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
18.8 మెట్రిక్ టన్నుల ఎరువుల సీజ్
తెర్లాం: మండలంలొని తెర్లాం, సుందరాడ గ్రామాల్లో గల ఎరువుల దుకాణాల్లో అనుమతి పత్రాలులేకుండా నిల్వఉంచిన 18.8మెట్రిక్ టన్నుల ఎరువులను జిల్లా వ్యవసాయధికారి వి.తారకరామారావు సీజ్‌చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మండలంలోని తెర్లాం, సుందరాడగ్రామాలలో గల ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువు లను, స్టాక్ రికార్డులు, అనుమతిపత్రాలను పరిశీలించారు. సుందరాడ లోని సూర్యచంద్ర ట్రేడర్స్‌లో నిల్వ ఉన్న 8.5 మెట్రిక్ టన్నుల యూరియాకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్‌చేశారు. అలాగే తెర్లాంలోని శ్రీరామ ట్రేడర్స్‌లో నిల్వ ఉన్న 10.3మెట్రిక్ టన్నుల యూరియాకు ఎటువంటి ఆనుమతిపత్రాలు లేకపోవడంతో వాటిని కూడా సీజ్ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల ఎరువుల దుకాణాల్లో విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించిన ఆనుమతి పత్రాలు లేకపోతే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా లైసెన్సులు రద్దుచేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరతలేదని, రైతుసేవా కేంద్రాల్లో నిల్వలు ఉంచామని చెప్పారు. ఆయనతో పాటు ఏఓ బొత్స శ్రీనివాస రావు ఉన్నారు. తెర్లాం, సుందరాడలోఎరువుల దుకాణాల తనిఖీ -
కలెక్టరేట్ వద్ద హమాలీల ధర్నా
విజయనగరం గంటస్తంభం: హమాలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద హమాలీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముల్లు నర్సింహులు మాట్లాడుతూ..విజయనగరం జిల్లాలో గల 8 ఎంఎల్ఎస్ పాయింట్లలో సుమారు 200 మంది హమాలీలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ పని భారం పెరుగుతూనే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి కూలి రేట్లు పెంచుతున్నా వచ్చే కూలితో తమ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందని హమాలీలు వాపోయారు. మా పనిలో ప్రధానంగా చాలా సమస్యలున్నాయని, అందులో ముఖ్యంగా ప్రతినెలా స్టేజ్–2 బిల్లు 10వ తేదీలోపు ఇప్పించాలని, అన్లోడింగ్ బిల్లు కాంట్రాక్టర్ పేరుతో కాకుండా మా ఖాతాలోనే జమ చేసి, 15వ తేదీ లోపు ఇప్పించాలని కోరారు. అన్లోడింగ్ పనిని 30ఏళ్లుగా మేమే చేస్తున్నాం కాబట్టి మమ్మల్నే కొనసాగిస్తూ..మోత కూలి పెంచాలని డిమాండ్ చేశారు. హమాలీలకు చదువు లేనందున బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను తీర్చని యెడల ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పి.కామేశ్వరరావు, హమాలీ సంఘం కార్మికులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమైంది. ఈ మేరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోటీల్లో నలుగురు క్రీడాకారులు అంతర్ జిల్లాల పోటీలకు అర్హత సాధించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 78 మంది క్రీడాకారులు పాల్గొనగా..జిల్లా జట్టులో స్థానం దక్కించుకునేందుకు క్రీడాకారులు పోటీపడ్డారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో బాలుర విభాగంలో కాండ్రేగుల సోమనాధ్, వీర్రాజు వర్మలు ఉండగా..బాలికల విభాగంలో బోరా ప్రవల్లిక, సాయి జాహ్నవిశ్రీ ఉన్నారు. అదేవిధంగా బత్తుల జస్మిక, ఇషిక వర్మ తదితరులు కన్సొలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో కాకినాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్‌కు పంపించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ జ్వాలాముఖి తెలిపారు. ఈ పోటీలను సీనియర్ నేషనల్ ఆర్బిటర్ రానా, అర్చన, పద్మావతిలు పర్యవేక్షించారు. -
ప్రత్యేక హోదా ఏదీ?
● ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకహోదా అడగకుండా రాష్ట్రానికి చెందిన కూట మి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ ఆరోపించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్రజలను మోసంచేశారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని, పార్టీ బలోపేతం కోసం బూత్‌లెవల్ కమిటీల ను నియమించాలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. -
శ్మశాన వాటిక అభివృద్ధి నిధులను ఎలా మళ్లిస్తారు?
బొబ్బిలి: గత ప్రభుత్వం శ్మశాన వాటిక అభివృద్ధికోసం మంజూరు చేసిన రూ.10లక్షల నిధుల ను దారి మళ్లించడం ఎంతవరకు సబబని పలు ఎస్సీ కుటుంబాలు బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మిని నిలదీశారు. ఆ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని బొబ్బిలి పదో వార్డు గొల్లపల్లికి చెందిన తుట్ట తిరుపతి, రమ ణ, కూర్మారావు, రమేష్, డోల వెంకటరమణ తదితరులు కమిషనర్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వాసులు మాట్లాడుతూ శ్మశాన వాటిక లేదని అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్తే ఆయన స్థలాన్ని కేటాయించడంతోపాటు అభివృద్ధి కోసం రూ. 10లక్షలు మంజూరు చేయించారన్నారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, స్థానిక యువత, పెద్దలంతా కలిసి రూ.6 లక్షల సొంత నిధులతో కొంత అభివృద్ధి పనులు చేశామన్నా రు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇతర పనులకు కేటాయించిన విషయాన్ని తెలుసుకుని కమిషనర్‌కు వివరించామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలి డెంకాడ: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో లేకుండా మంజూరు చేయాల ని ఆ శాఖాధికారులకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్ సూచించారు. డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద రూ.2,08 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 78వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఏడాదిలో జిల్లాలో 6 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించామని చెప్పారు. మరో 3 నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి సోలార్ విద్యుత్ యూని ట్లు లక్ష్యం కాగా రాష్ట్రానికి 20 లక్షలు కేటాయించ డం గర్వకారణమని తెలిపారు. తీరగ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నపంపై మంత్రి స్పష్టంచేశారు. కార్యక్రమంలో తూర్పుప్రాంద విద్యుత్ సంస్థ సీఎండీ పృద్విరాజ్ రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవులు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరా వు, ఈఈ జి.సురేష్‌బాబు, ఆర్డీఓ డి.కీర్తి, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు. -
రైతుల పక్షానే ఉంటాం
శృంగవరపుకోట: వైఎస్సార్సీపీ పూర్తిగా రైతుల పక్షమని, సందేహాలకు తావులేదని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎస్.కోట లోని ఓ కల్యాణ మండపంలో పార్టీ నేతలతో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిందాల్ నిర్వాసిత రైతులకు అండగా ఉంటామని, వారి కుటుంబాల్లోని యువ తకు ఉపాధికల్పనే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కు కు గత ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. అయితే, నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ముట్టలేదని, సాగులో ఉన్నవారికి సొమ్ములు అందలేదని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అమలు కాలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, తాటిపూడి నీటి లభ్యతపై మరింత స్పష్టత కావాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తనతో పాటు అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తీసుకెళ్లారన్నా రు. ఈ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి రైతు లకు న్యాయం చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి బొత్స చెప్పడంతో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన వాయిదా వేసినట్టు తెలిపారు. జిందాల్ రైతాంగ సమస్యలపై మాజీ మంత్రి బొత్సను కలవగా భూములిచ్చిన గ్రామాల్లో బాధిత రైతుల వివరాలు సేకరించాలని చెప్పారని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామన్నారు. జిల్లా మంత్రి ఎంఎస్ఎంఈ పార్కు ఆలోచన లేనప్పుడు తాటిపూడి నీటి ప్రస్తావన ఎందుకంటారు.. ఎమ్మెల్యే, కలెక్టర్లు ఎంఎస్ఎంఈని అడ్డుకోవద్దంటారు... మరో డీసీఎంఎస్ చైర్మన్ ఎక్కడి నుంచో యువకులను తెచ్చి కంపెనీ లు కావాలని ఉద్యమాలు చేయిస్తారు... పోలీసులు రైతులపై కేసులు పెడుతూ, సెక్షన్ 30 పక్కనపెట్టి ఒక వర్గానికి మద్దతిస్తారు... ఇన్ని గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని నిలదీశారు. రైతులకు న్యాయం చేసేందుకు జిందాల్తోనైనా, ప్రభుత్వంతో అయి నా పోరాటానికి సిద్ధమన్నారు. మాజీ ఎమ్మెల్యే హైమావతి మాట్లాడుతూ నాడు భూములిప్పించి రైతుల్ని మోసం చేసిన నేతలే నేడు మళ్లీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల్ని రోడ్డున పడేసి మంత్రి ఒక మాట, ఎమ్మెల్యే మరొక మాట చెప్పడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం చేస్తే ఏ పోరాటానికై నా సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మోపాడ కుమార్, జెడ్పీటీసీ మమ్ములూరి వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, వాకాడ రాంబాబు, షేక్ రహ్మాన్, సర్పంచ్ తగరంపూడి రమణ, పదాల ధర్మారావు, కె.అప్పయ్య, కె.జయశంకర్, ఎం.శంకర్, మజ్జి శేఖర్, జె.భాస్కర్‌రావు, కె.రంగా, అప్పల ఈశ్వరరావు, షేక్ స్వామి, యలమంచిలి అప్పారావు, వాకాడ సతీష్, రమేష్, చక్రి, పెంట గణేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ● మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు -
విజయనగరం
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025పరిష్కరించండి బాబూ... ●మా సమస్యలివి.. ఇలా వదిలి.. అలా నిలిపేసి..! పెదంకలాం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసిన వెంటనే నిలిపివే యడంపై రైతులు మండిపడుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. –8లోవిజయనగరం కలెక్టరేట్ వివిధ వర్గాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో సోమవారం దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ వర్గాల ప్రజలు అధికారులను వేడుకున్నారు. గోడును వినిపించారు. ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేశారు. ●30 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు సొంతభవనం లేదు.. పిల్లలకు బోధించేందుకు ఇద్ద రు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాలకు సెలవు తప్పడం లేదు. గత ప్రభుత్వం నాడు–నేడు కింద మంజూరు నిధులను వేరే పాఠశాల పనులకు మళ్లించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అధికారులు స్పందించి మా బడికి భవనం నిర్మించాలంటూ మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామస్తులు, పిల్లలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ప్లకార్డులతో తమ నిరసన గళం వినిపించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము, సహాయ కార్యదర్మి ఆర్. శిరీషతో కలిసి ఇన్చార్జి కలెక్టర్ సేతమాధవన్కు వినతిపత్రం అందజేశారు. ●బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కాకర్లవలస, కారేడువలస గ్రామాల గిరిజనుల సాగు భూములు లాక్కుని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తే సహించబోమని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. ఆయా గ్రామాల గిరిజనులతో కలిసి ఆందోళన చేశారు. సాగు భూములు లాక్కోవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ●మున్సిపాలిటీల్లో ఆప్కాస్ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మరణించిన, రిటైర్ అయిన కార్మిక కుటుంబసభ్యులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. – విజయనగరం గంటస్తంభం న్యూస్‌రీల్ -
వ్యాధులు ఉద్ధృతం
పారిశుద్ధ్యం అధ్వానం.. విజయనగరం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మా రింది విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. నగరంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. పన్నుల వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్న యంత్రాంగం ప్రజలకు అవస రమై న సేవలందించడంలో విఫలమవుతోంది. గడిచిన ఏడాది పాలనలో కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టిసారించేవారే కరువయ్యారు. వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు, కాలువలు శుభ్రం చేయడంలో అలస త్వం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై చూపుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే తోటపాలెం, పూల్‌బాగ్‌కాలనీ, వీటి అగ్రహారం ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి విష జ్వర కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలంటూ అధికారులు చేస్తున్న హడావిడి కేవలం ప్రకటనలకే పరిమితమ వుతోంది. దోమల నివారణ చర్యలు ఆశించిన స్థా యిలో జరగడం లేదు. నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వారానికి ఒకసారి ఫాగింగ్ చేపడుతున్నా కొద్ది రోజుల వ్యవధిలోనే పరిస్థితి యథాస్థితికి చేరుకుంటోంది. పర్యవేక్షణ లోపం నగర పరిధిని 245 పోకెట్లుగా విభజించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. 300 నుంచి 350 ఇళ్లను ఒక పోకెట్గా తీసుకున్నారు. ఒక్కోదానిలో 2.5 కార్మికులు ఉండాల్సి ఉంది. ఇక్కడ 800 మంది వర కు కార్మికుల అవసరం కాగా, ప్రస్తుతం 611 మంది ఉన్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పారిశు ధ్య సిబ్బందిలో కొందరు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ బదిలీ కార్మికులను నియమించుకుని వేరే కార్యకలాపాలు చూసుకుంటున్నారు. వచ్చిన బదిలీ కార్మికుడు తనకు తగ్గట్టుగానే పనులు చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇదే విషయమై కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్లు ప్రస్తావిస్తున్నా సమస్యలకు పరిష్కా రం లభించకపోవడం గమనార్హం. తాజాగా 45 మందిని ఒప్పంద ప్రాతిపదికన కార్మికులను తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదించినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. సమస్య తలెత్తితేనే... నరగం విస్తరిస్తున్నా ఆ మేరకు సదుపాయాల కల్పనలో యంత్రాగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురిసి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తే తప్ప పూడికలు తొలగించాలన్న ధ్యాస కార్పొరేషన్ యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు కలగకపోవడం పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది సుమారు రూ.10 లక్షల ఖర్చుతో పలు ప్రధాన కాలువులను శుభ్రం చేసినట్టు అధికారులు చెబుతుండగా... మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కాలువల పరిస్థితి ఏమిటన్నది ప్రజల ప్రశ్న. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగడంలేదు. చిన్నపాటి వర్షానికి నగరంలో వరద నీరు పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రాంతం: విజయనగరం కార్పొరేషన్ విస్తీర్ణం : 51.62 చదరపు కిలోమీటర్లు మొత్తం డివిజన్లు : 50 సచివాలయాలు : 61 నివాసాలు : 90 వేలు జనాభా: 3.04 లక్షలు పారిశుద్ధ్య కార్మికుల లెక్కలు ఇలా... కార్మికుల మంజూరు : 837 ప్రస్తుతం ఉన్న వారు : 609 పారిశుద్ధ్యపనులు కాకుండా ఇతర విభాగాల్లో ఉన్న వారు : 100 బదిలీ వర్కర్లను పెట్టుకున్న వారు : 100కు పైగానే రోజూ శుభ్రం చేయాల్సిన రోడ్ల పరిధి : 399 కిలోమీటర్లు పూడికలు తీయాల్సిన కాలువల విస్తీర్ణం : 466 కిలోమీటర్లు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కాలువలను శుభ్రం చేయిస్తున్నాం. దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ సిద్ధం చేశాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశించాం. – పల్లి నల్లనయ్య, కమిషనర్, విజయనగరం -
కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశ సంపద
బొబ్బిలి: మతోన్మాదంతో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రెండు రోజుల సీపీఐ జిల్లా మహాసభల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు రైతులు, ఆదివాసీలను సంక్షేమ రంగంలో పయనించేలా బీజేపీ యేతర పాలన రావాలన్నారు. అద్వానీ రామ జన్మభూమి రధయాత్రలో కమలం గుర్తును ప్రచారం చేశారని గుర్తు చేశారు. మూడోసారి అధికారం కోసం ప్రచారంలో పవిత్ర గంగాజలం పేరుతో రూ.10, రూ.20లకు అమ్మకం చేసి రామశిలపై బొట్లు పెట్టి రాజకీయాలకు వాడుకున్నారన్నారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలన్నారు. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం 80 శాతం పక్కదారి పడుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. పన్నుల ధనాన్ని కూడా వృథా చేస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్ గతంలో చేగువేరానని, కమ్యూనిస్టుని అని చెప్పుకుని మతోన్మాద బీజేపీలో చేరాక హరిహర వీరమల్లు చిత్రం తీసి తన మతోన్మాదం చూపారన్నారు. సీపీఐ గొంతులేని వాళ్లకు గొంతు ఇస్తుందన్నారు. కార్మికులు రక్తతర్పణం చేసి సాధించుకున్న 44 చట్టాలను లేబర్‌కోడ్స్‌గా మార్పు చేసి కార్మికుల కడుపు కొట్టార్టరన్నారు. రాష్ట్రంలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రజలు ముందుకు రావాలన్నారు. ఓంకార్ థియేటర్ వద్ద ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, నియోజకవర్గ కార్యదర్శి కండాపు ప్రసాదరావు, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాసరావు, పలువురు కామ్రేడ్లు పాల్గొన్నారు. మతోన్మాద బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించండి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు చేగువేరానని చెప్పుకునే పవన్‌కల్యాణ్ బీజేపీలో చేరాకే హరిహర వీరమల్లు తీశారు ముగిసిన సీపీఐ జిల్లా మహాసభలు -
ఎరువుల విక్రయాల నిలిపివేత
● ఫారం ఓ లేకపోవడంతో నిలిపివేసిన అధికారులు ● తనిఖీల్లో బయటపడ్డ లోపాలు తెర్లాం: తెర్లాంలోని శ్రీరామ ట్రేడర్స్‌లో ఎరువుల విక్రయానికి సంబంధించి ఫారం–ఓ లేకపోవడంతో 23 టన్నుల ఎరువుల విక్రయాలను నిలిపివేయాలని సంబంధిత డీలర్‌కు నోటీసులు జారీ చేసినట్టు బొబ్బిలి ఏడీఏ ఎం.మధుసూధన్ తెలిపారు. తెర్లాంలోని ఎరువుల దుకాణాల్లో బొబ్బిలి ఏడీఏ, మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. స్థానిక శ్రీరామ ట్రేడర్స్‌లో లైసెన్స్‌కు ఫారం–ఓ లేకపోవడంతో ఎరువుల దుకాణంలో నిల్వ ఉన్న 23టన్నుల ఎరువులను విక్రయించకుండా డీలర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ డీలర్లు ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని సూచించారు. ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న, విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల ద్వారా విక్రయించే ఎరువులకు సంబంధించి బిల్లు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలు డీలర్లు ఉంచుకోవాలన్నారు. ఎరువుల దుకాణాల డీలర్లు రైతులకు ఏవిధంగా ఎరువులు విక్రయించాలో వివరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు, ఏఈవో వెంకటేష్ ఉన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025ఆరోగ్యశ్రీలో ప్రసవానికి.. పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..! అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. –8లోఆండ్ర రిజర్వాయర్ నుంచి నీటి విడుదల మెంటాడ: ఆండ్ర రిజర్వాయరు నుంచి సాగునీటిని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మ డి సంధ్యారాణి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడు తూ రిజర్వాయర్ మరమ్మతులకు రూ.2కోట్లు, ప్రాజెక్టు అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గుర్ల గెడ్డ, హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేయిస్తామన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామన్నారు. పథకాలు అమలు చేయడం లేదని గ్రామాల్లో తిరుగుతు న్న వైఎస్సార్సీపీ నాయకులను చొక్కాలు పట్టుకొని ప్రశ్నించండని రెచ్చగొట్టారు. నియోజకవర్గ పునర్విభజనలో మెంటాడ మండలం గజపతినగరంలోకి వస్తే పరవాలేదని, లేకుంటే పార్వతీపురం జిల్లాలో కలిపేలా చేస్తానన్నారు. ప్రాజెక్టు చైర్మన్ కోడి సతీష్, తహసీల్దార్ అరు ణకుమారి, ఎంపీడీవో భానుమూర్తి తదితరు లు పాల్గొన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తామని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికను ‘మీ కోసం కాల్ సెంటర్ నెంబర్ 1100’కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నా రు. అర్జీదారులు ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్ సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి రాజాం సిటీ: వెనుబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఎ.అజశర్మ అన్నారు. స్థానిక ఓ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక డివిజన్ స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో ‘ఉత్తరాంధ్ర వెనుకబాటు–శాసీ్త్రయ పరిశీలన’ అనే అంశంపై ఆయన మాట్లాడా రు. ఉత్తరాంధ్రలో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్వహణ లోపం, అటవీ సంపద సద్వినియోగలోపం, అక్షరాస్యతలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండడం, సముద్రతీర సంపదను కార్పొరేట్ శక్తులు చేతిలోకి వెళ్లిపోవడం, పర్యావరణ పరిరక్షణ లోపం, జమిందారీ వ్యవస్థ వంటి అనేక కారణాల వలన ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబాటు తనానికి గురైందని అన్నారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యపరిచి భాగస్వాములుగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి వైపు తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిపారు. జేవీవీ అధ్యక్షుడు ఎంవీఎన్ వెంకటరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 13, 14తేదీల్లో విజయనగరంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు జె. నీలయ్య, మక్క అప్పలనాయుడు, గట్టి పాపారావు పాల్గొన్నారు. విజయనగరం పట్టణానికి చెందిన సంధ్య అనే గర్భిణి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రసవం చేయించుకోవాలని కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన రెండు రోజుల ముందే అన్ని రకాల వైద్య పరీక్షలు, స్కాన్ తీయించుకున్నారు. అయినప్పటికీ నెట్వర్క్ ఆసుపత్రి వైద్యురాలు తమ ఆసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు, తాము సూచించిన స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించుకోవాలని చెప్పింది. అలా అయితేనే తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కాన్పు జరిపిస్తామని చెప్పడంతో గత్యంతరం లేక మళ్లీ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఇందుకోసం రూ.3 వేలు వరకు వెచ్చించారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనేక మంది గర్భిణులకు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ఉచితంగా ప్రసవం జరిపించుకోవ చ్చు అని గర్భిణులు భావిస్తారు. అయితే కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు పెట్టిన నిబంధనల వల్ల గర్భిణులకు చేతిచమురు వదులుతుంది. అందులోనూ రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. నిరుపేద గర్భిణుల కు ఇది అదనపు భారం అయినప్పటకీ తప్పని పరిస్థితి. అవస్థలు పడుతున్న గర్బిణులు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గర్భిణులు ప్రసవం జరిపించుకోవాలంటే 3వ నెల, 6వ నెల, 9వ నెలల్లో చేయించుకున్న మెడికల్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపో ర్టులు, టిఫా స్కాన్ రిపోర్టులు ఉండాలి. అయితే గర్భిణులు ఈ రిపోర్టులు అదే ఆసుపత్రుల్లో చేయించుకున్న రిపోర్టులై ఉండాలని వైద్యులు నిబంధన పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోగాని, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్య పరీక్షలు, స్కానింగ్ రిపోర్టులు ఉన్నా అవి పనికిరావని తెగేసే చెప్పేస్తున్నారు. అంతేకాకుండా నెట్వర్క్ ఆసుపత్రిలో ఒక టి రెండు రోజులు ముందు చేయించిన రిపోర్టులు కూడా పనికిరావని చెప్పడం గమనార్హం. అన్నింటి కంటే ముఖ్యంగా నెట్వర్క్ ఆసుపత్రి వారు చెప్పిన స్కానింగ్ సెంటర్‌కు సంబంధించిన రిపోర్టు ఉన్నప్పటకీ వారి లెటర్ హెడ్‌పై రాసిచ్చి మళ్లీ స్కానింగ్ తీయించుకోమంటున్నారు. ఇదంతా స్కానింగ్ కేంద్రాల వారు ఇచ్చే కమిషన్ల కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అభినవ్ ఆసుప త్రి, కొలపర్తి, సాయి పీవీఆర్, సాయి సూపర్ స్పె షాలిటీ, వెంకటరామ, ఆంధ్ర, మారుతి, పీజీ స్టా ర్,స్వామి ఐ ఆసుపత్రులు ఉన్నాయి. వీటితో పాటు నెప్రోఫ్లస్ ఆసుపత్రి, మిమ్స్, మువ్వ గోపాల, కాస్వి, క్వీన్స్ ఎన్ఆర్ఐ, గాయిత్రి, పుష్పగిరి, తిరుమల మెడికవర్, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, పిలిడోపియా ఆసుపత్రి, అమృత, సంజీవిని, శ్రీ బాపుజీ, సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సాయికృష్ణ, విజయ మల్టీ స్పెషాలిటీ, వెంకట పద్మ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్రసవాలు చేయించుకోవచ్చు. ఏడాదిలో 20 వేల వరకు ప్రసవాలు జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11 వేల వరకు జరగగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9 వేలు వరకు జరుగుతున్నాయి. అధిక శాతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ప్రసవాలు జరుగుతున్నాయి. న్యూస్‌రీల్ వైద్య పరీక్షలన్నీ చేసుకున్నా.. మళ్లీ చేసుకోవాలని నిబంధన పెడుతున్న నెట్వర్క్ ఆసుపత్రులు ఫలితంగా గర్భిణులకు చేతి చమురు వదులుతున్న వైనం వైద్య పరీక్షలు, స్కానింగ్ కోసం రూ.వేలల్లో ఖర్చు జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు జిల్లాలో 26 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సరికాదు.. వైద్య పరీక్షలు, స్కానింగ్ రిపోర్టులు ప్రసవం జరిగే నెలలోవే అయితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. మళ్లీ వైద్య పరీక్షలు, స్కానింగ్ చేయించుకోవాలని చెప్పడం సరికాదు. అటు వంటి ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆసుపత్రిపై ఫిర్యా దు చేస్తే వారు ప్రసవం జరిపిస్తారో.. లేదోనని.. భయం వద్దు. అదే ఆసుపత్రిలో ప్రసవం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కుప్పిలి సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
జిందాల్ తెచ్చిన తంటా..
శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితుల సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఎంపీడీవోకు సస్పెన్షన్ హెచ్చరికకు దారితీసింది. దీంతో చేసేది లేక సమావేశం మధ్యలోనే నిలిపేసి ప్రజా సంఘాల నేతలు కార్యాలయం విడిచి వెళ్లారు. తరువాత కార్యాలయం బయట నిరసన తెలిపారు. తాను దళితుడిని కావడం వల్లే పై అధికారులు చిన్నచూ పు చూస్తున్నారని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిందాల్ నిర్వాసితుల సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు రైతు సంఘాల నేతలు సిద్ధమయ్యారు. సమావేశ నిర్వహణకు ఎంపీడీవో అభ్యంతరం చెప్పడంతో ఎంపీపీ చాంబర్లో ఎంపీపీ సోమేశ్వరరావు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఎంపీడీవో సతీష్ వచ్చి ‘జిందాల్‌కు సంబంధించి చర్చలు, సమావేశాలు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం సరికాదంటున్నారు.. మీరు ఖాళీ చేసి వెళ్లకుంటే నన్ను సస్పెండ్ చేస్తానంటున్నారు.. సార్’ అంటూ ఎంపీపీకి తన గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఎంపీపీ మాట్లాడుతూ తాను ఇక్కడి వాడినని.. నిర్వాసితుల ప్రాంతం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీ అయ్యాను.. వాళ్ల సమస్యలపై నా చాంబర్లో మాట్లాడకూడదా... అంటూ అడిగారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. జిల్లా అధికారులు అంగీకరించ డం లేదు సార్.. అని చెప్పడంతో ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఎంపీపీ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. ఎంపీడీవో కార్యాలయం బయ ట ప్రజా సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడా... మాట్లాడనివ్వరు... సమస్య చెప్పనివ్వరు.. ఇదేమి నియంతృత్వ పాలన అంటూ నిరసన తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణ ఖాళీ చేయాలని బతిమలాడడంతో అంతా కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు, న్యాయవాది బి.రామకృష్ణ, వేదిక వ్యవస్థాపకుడు డి.సూర్యారావు, చల్లా జగన్, పదాల మణిబాబు, మద్ది కృష్ణ, వర్మరాజు తదితరులు మాట్లాడుతూ జిందాల్ తీరును, వెనకేసుకొస్తున్న అధికారుల తీరును తప్పుబట్టారు. నిర్వాసితుల పోరాటానికి తమ సంఘీభావం తెలిపారు. దళితుడిని కావడం వల్లే.. ఎంపీపీ సోమేశ్వరరావు విలేకరులతో మాట్లాడా రు. తాను దళితుడిని కావడం వల్లే నాకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కుల్లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ అన్న గౌరవం లేకుండా చేశారు. తన చాంబర్లో నా ప్రాంతానికి చెందిన నాయకులతో మాట్లాడకూడదా.. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వాళ్లతో కూర్చోకూడదట.. ఇదేమి అన్యాయం అంటూ ప్రశ్నించారు. తాను సమావేశం ఆపకపోతే ఎంపీడీవోని సస్పెండ్ చేస్తానంటూ కలెక్టర్ బెదిరించడం అన్యాయం కా దా.. ఇదేనా.. సామాజిక న్యాయం అంటూ ప్రశ్ని ంచారు. ఎంపీడీవోకు సస్పెన్షన్ హెచ్చరిక దళితుడిననే చిన్న చూపు : ఎంపీపీ -
సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన
● అర్థం కాక తలులు పట్టుకుంటున్న విద్యార్థులు ● బోధించలేమని చేతులెత్తేస్తున్న ఉపాధ్యాయులు ● విద్యార్థుల జీవితాలతో కూటమి అటలు!రామభద్రపురం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ యూపీ స్కూల్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు బదిలీలు చేపట్టిన ప్రభుత్వం యూపీ స్కూళ్లలో ఉన్న తెలుగు, హిందీ పండిట్లను ఎల్ఎఫ్ఎల్, ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీ చేసింది. యూపీ స్కూల్స్‌లో లాంగ్వేజ్ పండిట్లు లేకుండా చేసింది. పాఠశాలలో ఉన్న టీచర్లలో ఎవరో ఒకరు లాంగ్వేజ్‌లు బోధించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. అయితే టీచర్లు ఉపాధ్యాయ విద్య చదివినా లాంగ్వేజ్ బోధన నైపుణ్యాలపై వారికి అవగాహన ఉండడం లేదు.సోషల్ టీచర్‌ను హిందీ చెప్పమంటే ఏం చెప్పగలరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 158 యూపీ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించడంలో నిర్లక్ష్యం చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుతో కొత్త పిల్లలను జాయిన్ చేయడం మాట దేవుడెరుగు ఉన్న పిల్లలను ఎలా కాపాడుకోవాలా? అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. చదివేదొకటి..చెప్పేదొకటి.. ప్రభుత్వం తీరు వల్ల బీఈడీలో చదివేదొకటి, పాఠశాలల్లో చెప్పేదొకటి అన్నచందంగా ఉందని టీచర్లు అంటున్నారు.యూపీ పాఠశాలల్లో లాంగ్వేజ్ పండిట్లను పీస్ హెచ్ఎంలుగా బదిలీ చేయడంతో సోషల్, బయాలజీ, గణితం సబ్జెక్టు చెబుతున్న టీచర్లు తెలుగు, హిందీ లాంగ్వేజ్‌లు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా చేస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడడం దేవుడెరుగు. అసలు సంబంధం లేని పాఠాలను ఎలా బోధిస్తారనే జ్ఞానం ఉండదా? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత మూలంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండంతో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామభద్ర పురం మండలంలోని కోటశిర్లాం యూపీ పాఠశాలలో 6,7,8 తరగతులలో 28 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే మొత్తం ఆరు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇందులో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాగ్వేజ్లు ఒక్క టీచరే బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో 8 మంది తమకు సరిపడా టీచర్లు లేరని, సరైన విద్యాబోధన అందడం లేదన్న ఉద్దేశంతో టీసీలు తీసుకుని వేరే పాఠశాలలకు వెళ్లియారు. మిగిలిన వారు కూడా ఇలాగే పరిస్థితి ఉంటే తాము కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోతామంటున్నారు.లాంగ్వేజ్ టీచర్ల కొరత వాస్తవమే..యూపీ స్కూల్స్‌లో ఉన్న మిగులు ఉపాధ్యాయులను ఎల్ఎఫ్ఎల్, ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీచేశారు. దాంతో లాంగ్వేజ్ టీచర్ల కొరత ఉంది. ప్రస్తుత క్లస్టర్ స్కూల్స్‌లో ఉన్న ఎంటీఎస్‌లను వినియోగించుకోవాలి. డీఎస్సీ నియామకాలు చేపడితే కొత్త టీచర్లను నియమిస్తారు. కె.మోహనరావు, డిప్యూటీ డీఈవోసరిగ్గా అర్థం కావడం లేదు.. మా పాఠశాలలో తెలుగు, హిందీ లాంగ్వేజ్‌లను బయాలజీ, ఇంగ్లీషు టీచర్లు బోధిస్తున్నారు. మాకు సక్రమంగా అర్థం కావడం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందడం లేదు. ఇలా అయితే ప్రభుత్వ స్కూల్స్‌లో చదవలేం. తీరు మారకుంటే టీసీలు పట్టుకుని వేరే పాఠశాలకు వెళ్లిపోతాం. బి.మేఘన, 8వ తరగతి,యూపీ స్కూల్, ఇట్లా మామిడిపల్లి యూపీ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం..యూపీ స్కూల్స్‌లలో తెలుగు, హిందీ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్య అందడంలేదు. లాంగ్వేజ్ల బోధన లేక 6,7,8 తరగతుల విద్యార్థులు చేరడం లేదు. ప్రభుత్వ విద్యాసంస్కరణలతో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా ఉంది. భవిష్యత్‌లో యూపీ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ -
పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..!
● 6 ఏళ్ల లోపు పిల్లలు 67,381 ● బరువు తక్కువగా ఉన్న పిల్లలు 3,569 ● ఎత్తు తక్కువ ఉన్న పిల్లలు 7,316 ● పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు 2,410 విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. పౌష్టికాహార లోపంతో పాటు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు అధికంగా ఉన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. పౌష్టికాహార లోపం బారిన పడడం వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి మాతాశిశు ఆరోగ్యానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఫలితం ఇవ్వడం లేదు. పుట్టే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, పుట్టినట్లయితే సమస్యలు ఉండవు. పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. తల్లులు బలహీనంగా ఉండడం, గర్భస్థ సమయంలో అనారోగ్యానికి గురికావడం, తక్కువ వయస్సులో వివాహాలు చేయడం, మహిళల్లో రక్తహీనత తదితర కారణాల వల్ల పుట్టే పిల్లల్లో కొంతమంది పౌస్టికాహార లోపం, బరువు తక్కువగా పుడుతున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 292 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 67,381 మంది ఆరేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలు 7,316 మంది జిల్లాలో ఉన్న ఆరేళ్ల లోపు పిల్లల్లో 7,316 మంది ఎత్తు తక్కువగా ఉన్నారు. అదేవిధంగా బరువు తక్కువగా ఉన్న వారు 3,569 మంది ఉన్నారు. 2410 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. ఎత్తు, బరువు తూనిక: పిల్లల బరువు, ఎత్తు తెలుసుకునేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పరికరాల ద్వారా తూనిక వేస్తారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి ప్రత్యేక పౌష్టికాహారం 6 నెలల లోపు పిల్లలు బరువు తక్కువగా ఉన్నా, పౌష్టికాహార లోపం ఉన్నా తల్లిపాలు ఆరు నెలలు పాటు తాగించాలని అంగన్వాడీ కార్యకర్త పిల్లవాడి ఇంటికి వెళ్లి తల్లికి చెబుతారు. 6 నెలలు దాటిన పి ల్లలకు అయితే తల్లిపాలతో పాటు బాలామృతం, 100 ఎంఎల్ పాలు, గుడ్డు ఇస్తారు. ఇటువంటి వారికి ఆహారాన్ని రోజులో 8 సార్లు ఇస్తారు. ప్రత్యేక శ్రద్ధఅంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పౌష్టికాహార లోపం, బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించి వారికి ప్రత్యేకమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజులో మూడు సార్లు ఆహారంగా తీసుకుంటారు. కాని పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు రోజులో 8 సార్లు ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. టి.విమలారాణి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
రాధికారాణికి జాతీయ పురస్కారం
విజయనగరం టౌన్: నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ప్రతి ఏటా ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాల్లో భాగంగా విజయనగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ భేరి రాధికారాణిని జాతీయ పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు ఆదివారం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో తన నాట్య కౌశలం, అభినయం, నర్తనశాల అకాడమీ డైరెక్టర్‌గా నాట్యరంగానికి సుమారు మూడు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డును తనకు అందజేసినట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, మల్కాజ్గిరి కోర్టు న్యాయమూర్తి మధుసూదనరావుల చేతులమీదుగా పురస్కారం అందుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సాంస్కృతిక సస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎరువుల దుకాణాల తనిఖీ
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మన్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు ఆదివారం తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామారావు, సహాయ సంచాలకుడు నాగభూషణరావు, ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి నీలిమ తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, ఎరువుల భౌతిక నిల్వలు, కంపెనీ ఇన్వాయిస్ గోదాములను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 21.55 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువుల విలువ రూ.3,74,588 ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి తారకరామరావు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్మొత్తానికి 25,443 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతానికి 20, 629 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని అమ్మకాలు పోగా 5467మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎంఆర్పీకి మించి ఎరువులు ఎక్కడైనా విక్రయించినట్లయితే ఫోన్ 8331056279 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 21.55 మెట్రిక్ టన్నుల ఎరువుల సీజ్ -
11 మంది మందుబాబులపై కేసులు
విజయనగరం క్రైమ్ : జిల్లా వ్యాప్తంగా బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారమే జామి పోలీస్ స్టేషన్ పరిధి అలమండలో పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేయగా ఈ ఆదివారం పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధి సంత శివార్లలో బహిరంగ మద్యపానం చేస్తున్న 11మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారని ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. వారం వారం జరుగుతున్న సంతలలో మందుబాబుల ఆగడాలను అరికట్టేందుకే డ్రోన్స్ ను ఆయా సంతలలో వినియోగిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆకస్మికంగా డ్రోన్స్ తో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద మానాపురం ఎస్సై ఆర్.జయంతి ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారని ఎస్పీ తెలిపారు. దాడుల్లో పెద మానాపురం ఎస్ఐ తో పాటు డ్రోన్ పైలట్ వెంకటేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.పోలీసుల అదుపులో పందాల రాయుళ్లు● రెండు పొట్టేళ్లు స్వాధీనం గరుగుబిల్లి: పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న పందెం రాయుళ్లను అదుపులోకి తీసకుని రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం. రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని రావివలస గ్రామ పరిసరాల్లో పందానికి సిద్ధం చేసిన రెండు పొట్టేళ్లను, నలుగురు పందెం రాయుళ్లతోపాటు రూ. 620 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పందెం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా జూదం గాని, పొట్టేళ్లు, కోళ్ల పందాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. దాడుల్లో సిబ్బంది ఉమా మహేశ్వరరావు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులకు గాయాలురేగిడి: మండల పరిధిలోని అప్పాపురం గ్రామ సమీపంలో ఆదివారం బైక్ అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. పాలకొండ మండలం మంగళాపురం గ్రామానికి చెందిన మడపాల సాయి, సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కె.యోగేష్‌లు కె.వెంకటాపురంలోని తమ మిత్రుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా అప్పాపురం సమీపంలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వాహనంతో వచ్చిన 108 ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గర్భాపు నారాయణరావులు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. బాధితుల కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో మెరుగైన వైద్యంకోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మేతకు వెళ్లిన 18 గొర్రెల మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని బందలుప్పి గ్రామ సమీపంలో బందలుప్పి నుంచి తాళ్లబురిడి గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గంలో మధ్యలో ఉన్న నీలగిరి తోటల్లోకి మేతకు వెళ్లిన 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధిత గొర్రెల కాపరులు నీలబోను గోవింద, చందపు సింహాద్రి తెలిపిన వివరాల ప్రకారం..ఎప్పటిలాగానే తాము పెంచుకుంటున్న గొర్రెలు, మేకలను ఆదివారం సాయంత్రం శ్రీనివాసరావు అనే రైతు నీలగిరి తోటకు తరలించామని, ఆ తోటకు క్రిమిసంహారక మందులు, యూరియా పిచికారీ చేయడంతో ఈ విషయం గమనించకుండా పశుగ్రాసం కోసం మేకలు, గొర్రెలను విడిచిపెట్టామన్నారు. అవి తోటలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఒకసారిగా 18 గొర్రెలు మృత్యువాత పడడంతో గమనించి స్థానిక పశు వైద్యుడికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు పశువైద్యుడు రెడ్డి రమేష్ చేరుకుని గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గొర్రెల మృతి కారణంగా తీవ్రంగా నష్టపోవడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో 20 గొర్రెలకు అస్వస్థత -
రహదారి నిర్మాణం పూర్తి
పార్వతీపురం రూరల్: మండలంలోని బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు రహదారి పనులు పూర్తయినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రూ.2.50 కోట్ల వ్యయంతో ఈ రహదారి పనులు చేశామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా రఫ్ స్టోన్ ప్యాకింగ్, తారు రహదారిగా మార్చే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాలకు రహదారులు కల్పించే దిశగా గత ఏడాది డిసెంబర్ 20న మక్కువ మండలం బాగుజోలలో పలు రహదారులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు ద్విచక్ర వాహనాలు, అంబులెన్న్సులు, జీపులు, కార్లు వంటి వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. రెండు కోట్ల రూపాయల విలువ మేరకు పనులు జరిగాయని, ఇందులో రూ.56 లక్షలు చెల్లింపు జరిగిందని తెలియజేశారు. మిగిలిన మొత్తం చెల్లింపు చేయాల్సి ఉందన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో రూ.360 లక్షల వ్యయంతో పాములగీసడ నుంచి మంత్రజోల వరకు 3.60 కి.మీ మేర బీటీ రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. 8 కిలోమీటర్ల వరకు మట్టి రహదారి నిర్మాణం జరిగిందన్నారు. సాలూరు మండలం బాగుజోల నుంచి సిరివర వరకు 6.60 కిలో మీటర్ల మేర తారు రహదారి వేసేందుకు ప్రభుత్వం రూ.9 వందల లక్షలు మంజూరు చేసిందని, మట్టి రహదారి నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి రహదారి నిర్మాణం పూర్తవుతుందన్నారు. పాచిపెంట మండలం అల్లూరు నుంచి రిట్టపాడు వరకు గల రహదారి రూ.నాలుగు వందల లక్షలతో తారు రహదారిగా నిర్మించేందుకు మంజూరైందని, అటవీ అనుమతులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ -
ఎరుపెక్కిన బొబ్బిలి..
బొబ్బిలి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ మినిస్టర్ అమిత్‌షాలకు ఖరీదైన విమానాల్లో విదేశాల్లో తిరగడానికి ఉన్న శ్రద్ధ మనదేశంలో మణిపూర్‌లో దాడులకు గురైన మహిళలను పరామర్శించేందుకు లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాండ్ర పాపారాయ జంక్షన్లో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మణిపూర్ మహిళలపై దారుణంగా హింసలు చోటు చేసుకుంటుంటే హోం మంత్రి, ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారన్నారు. గతంలో ఇంటింటికీ రేషన్ అందితే ఇప్పుడు షాపుల వద్ద ప్రజలంతా గుమిగూడి లైన్లలో నిలబడి రేషన్ కోసం అవస్థలు పడుతున్నారన్నారు. ఆదివాసీ హక్కుల కోసం సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీపీఐకి అధికారమివ్వాలని పిలుపునిచ్చారు. కోట చుట్టూ ఉన్న దుకాణదారుల బతుకులు మారాలి.. బొబ్బిలి ఎమ్మెల్యే కోటలో ఉండడం గొప్ప కాదని.. ఆ కోట చుట్టూ ఉన్న దుకాణదారుల బతుకులు మారేలా పాలన సాగించాలని హితవు పలికారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని కోరితే ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే బేబీనాయన ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే పట్టణంలోని వెలమదొరలు వందలాది ఎకరాలు ఆక్రమిస్తుంటే వారిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బొబ్బిలి జూట్‌మిల్లు తెరిపిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే రోజులు వచ్చాయన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలపై వస్తున్న నిరసనలను అణిచివేసే క్రమంలో సుమారు 750 మంది రైతులు మృతి చెందారన్నారు. అటవీ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ సృష్టించి మావోలను, ఆదివాసీలను హతమార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆధ్వర్యంలో ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణమంతా ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. అనంతరం తాండ్రపాపారాయ జంక్షన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, జిల్లా నాయకుడు బుగత అశోక్, రాజాం కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠ యాదవ్, బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ కండాపు ప్రసాదరావు, మహిళా సమాఖ్య నాయకులు బాయి రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో తిరగడానికి ఉన్న శ్రద్ధ మణిపూర్ మహిళల పరామర్శకు లేదా? మోదీ నిర్ణయాలకు చంద్రబాబు, పవన్‌ల వత్తాసు పేదల బతుకులు మారాలి సీపీఐ జిల్లా మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు -
చిన్నారులంటే అంత అలుసా..
● అంగన్వాడీ చిన్నారులకు ఇంతవరకు పంపిణీ చేయని ప్రీ స్కూల్ కిట్లు ● అందని ఆటపాటలతో కూడిన విద్యవిజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపిస్తే ఆటపాటలతో కూడిన విద్య అందుతుందని తల్లిదండ్రుల నమ్మకం. అయితే ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు అవసరమైన వస్తువులతో కూడిన ప్రీ స్కూల్ కిట్లను ఇంతవరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేయలేదు. చిన్నారులంటే మరీ ఇంత అలుసా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. కాని పిల్లల చదువుకు అవసరమైన స్కూల్ కిట్లను మాత్రం ఇంతవరకు సరఫరా చేయలేదు. అసలే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య అంతంత మాత్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ కిట్లు అందివ్వకపోవడం.. ఆటపాటలతో కూడిన విద్య అందకపోతే కేంద్రాల మనుగడే ప్రశ్నార్థమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 ప్రాజెక్ట్‌లు.. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 11 ఉన్నాయి. వీటి పరిధిలో 2,499 అంగన్వాడీ కేంద్రాలుండగా..మెయిన్ కేంద్రాలు 2,206 కాగా 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఆయా కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 42,161 మంది.. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 21,543 మంది ఉన్నారు. సరఫరా మాటేమిటి..? అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ప్రీ స్కూల్ కిట్లు (ఆట వస్తువులతో కూడిన మెటీరియల్) అందించాలి. కార్యకర్తలు వీటతోనే చిన్నారులకు బోధన అందిస్తారు. కిట్‌లో బిల్డింగ్ బ్లాక్స్, బాల్స్, బ్యాట్, రింగ్స్, బొమ్మలు, అక్షరాలతో కూడిన కార్డులు, స్లేట్స్ ఉంటాయి. వీటిని చిన్నారులకు చూపిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో బోధన అందించాల్సి ఉంది. ఇంతటి ఉపయోగం ఉన్న కిట్లను కూటమి సర్కారు పంపిణీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా రాలేదు.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన ప్రీ స్కూల్ కిట్లు ఇంకా రాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వచ్చిన వెంటనే కేంద్రాలకు పంపిణీ చేస్తాం. – టి. విమలారాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
కాలువలో పడి వ్యక్తి మృతి
● ఐదు రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి..శవమై కనిపించాడు ● కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు తెర్లాం: మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఐదు రోజుల కిందట చోటు చేసుకుంది. ఎస్సై సాగర్‌బాబు శనివారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన గిడిజాల చందు (25) ఈ నెల 22వ తేదీ రాత్రి ఆమిటి నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనున్న కాలువలో పడిపోయాడు. ద్విచక్ర వాహనం కింద ఉండిపోవడం.. కాలువలో నీరు పారుతుండడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య స్వాతి, కుమార్తెలు ధన్యశ్రీ, మౌనిక, తల్లిదండ్రులు శ్రీను, విజయ ఉన్నారు. కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. తన భర్త రెండు రోజులుగా కనిపించడం లేదని చందు భార్య స్వాతి, అతని కుటుంబ సభ్యులు ఈ నెల 24న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే కనిపించకుండా పోయిన వ్యక్తి చివరకు శవమై కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆదుకోవాల్సిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దుర్వాసన రావడంతో... స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు విరామ సమయంలో రోడ్డు పక్కకు రాగా దుర్వాసన వచ్చింది. దీంతో కాలువలోకి చూడగా.. మోటార్ సైకిల్ కింద ఓ వ్యక్తి పడిపోయి ఉన్నట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సాగర్‌బాబు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా భావించినప్పటికీ, కునాయివలసకు చెందిన వ్యక్తి అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదు మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో చందు కుటుంబ సభ్యులు వచ్చి నిర్దారించడంతో శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. -
వంగర ఘాట్‌రోడ్డుకు గండి
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని కేదారిపురం మీదుగా వంగర వెళ్లే ఘాట్‌రోడ్డు కోతకు గురికావడంతో గండి పడింది. దీంతో వంగర మీదుగా కేసర వరకు నడిపే ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను సైతం నిలిపివేశారు. ఏడాది కిందట కూడా ఇదే ప్రాంతంలో గండి పడడంతో సీసీ రోడ్డు నిర్మించి, ఓ వైపు రక్షణ గోడ నిర్మించారు. అయినప్పటికీ మళ్లీ అదే ప్రాంతంలో గండి పడడంతో వంగర, కేసర, డోలుకోన, సంధిగూడ గ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకం విజయనగరం క్రైమ్ : పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసి అనంతరం మృతి చెందిన సీహెచ్ ఈశ్వరరావు కుమారుడు సీహెచ్ తేజను జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, డీపీఓ సూపరింటిండెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు నెల్లిమర్ల రూరల్: మండలంలోని బుచ్చన్నపేట గ్రామానికి చెందిన బొంతు భాస్కరరావు అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై గణేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండని ఓ బాలికను ప్రేమ పేరుతో శారీరకంగా వంచించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రుల సంరక్షణ నుంచి విజయవాడ తీసుకువెళ్లిపోయాడన్నారు. బాధితుల ఫిర్యాదు తో సదరు భాస్కరరావుపై పోక్సోతో పాటు కి డ్నాప్ కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. గోముఖి నదిలోకి నీరు విడుదల మక్కువ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని శంబర గ్రామ సమీపంలో ఉన్న గోముఖి రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరుతుండడంతో శనివారం సుమారు వంద క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్ నుంచి గోముఖి నదిలోకి విడిచి పెట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ జేఈ ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. వరదలు ఎక్కువైతే నదిలోకి మరింత నీరు విడిచిపెడతామని చెప్పారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: అరుకు – సిమిలిగూడ మధ్య గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఐదు అడుగుల ఆరంగుళాల పొడవుండి తెలుపు రంగు ఫుల్‌హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. షర్ట్‌పై ముదురు ఆకుపచ్చ జర్కిన్ ధరించాడని, దానిపై కోడ్ అనే ఇంగ్లిష్ అక్షరాలున్నాయని చెప్పారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే 94906 17089, 63013 65605 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఆయనతో పాటు కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు. -
దోపిడీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
● ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్‌కు తరలింపు ● పరారీలో మరొక నిందితుడు ● పట్టుబడిన నిందితుడిపై మరో ఎనిమిది కేసులువిజయనగరం: నగరంలోని చెల్లూరు – గొట్లాం వద్ద ఈ నెల 19న జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి విజయనగరం రూరల్ పోలీసులు నలుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు.. సాహుగర్ సంతోష్‌కుమార్ అనే వ్యక్తి సరుగుడు కర్రల లోడ్‌తో విశాఖ నుంచి రాయగడ వైపు లారీలో వెళ్తుండగా.. ఐదుగురు నిందితులు చెల్లూరు రోడ్డులో గల భాను దాబా వద్ద లారీని అడ్డగించి సంతోష్‌కుమార్‌పై దాడి చేశారు. అతని వద్ద గల 1200 రూపాయలను అపహరించి పోరిపోయారు. అనంతరం బాధితుడు చికిత్స కోసం సమీప ఆస్పత్రికి వెళ్లగా.. ఆస్పత్రి సిబ్బంది రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ లక్ష్మణరావు ఆదేశాల మేరకు ఎస్సై అశోక్‌కుమార్ తన బృందంతో గాలించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ముగ్గురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఒకరు పరారీలో ఉండగా.. ప్రధాన నిందితుడు చెన్న అఖిల్ పట్టుబడ్డారు. ఇదిలా ఉంటే ఇతనిపై గతంలో ఎనిమిది దొంగతనం కేసులున్నాయి. ఈ క్రమంలో నిందితుడి నుంచి నాలుగు స్కూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్, తదితరులను డీఎస్పీ అభినందించారు. -
తల్లి సంవత్సరీకానికి వెళ్తూ కుమార్తె మృతి
భామిని: తల్లి సంవత్సరీకంలో పాల్గొనేందుకు వెళ్తూ కుమార్తె మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొండేటి తవిటమ్మ భర్త జనార్దనరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఒడిశాలోని గుణుపూర్‌కు బయలుదేరింది. సరిగ్గా భామిని మండలం ఘనసర వద్దకు వచ్చేసరికి తవిటమ్మ చీర ద్విచక్ర వాహనంలో చిక్కుకుపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదంలో తవిటమ్మకు తీవ్రగాయాలు కాగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సీతంపేట ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అయితే అప్పటికే తవిటమ్మ (47) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బత్తిలి ఎస్సై జి.అప్పారావు ఆధ్వర్యంలో ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ద్విచక్ర వాహనంలో చీర చిక్కుకోవడంతో ప్రమాదం -
చోరీ చేసిన బైక్‌లపై తిరుగుతూ..
● పోలీసులకు చిక్కిన కేటుగాడు ● ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనంభోగాపురం: నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ద్విచక్ర వాహనాలే ఆ కేటుగాడి టార్గెట్.. ఏ బండైనా సరే కనురెప్ప పాటులో చోరీ చేయగలిగే టాలెంట్ వాడి సొంతం.. బైక్ నచ్చితే చాలు అది మాయమైనట్లే...ఏడాది కాలంగా దొంగతనాలు చేయడం..ఎంచక్కా దొంగలించిన బైకులపైనే చక్కెర్లు కొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు.. చివరకు పోలీసుల నిఘా నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.. దొంగలించిన ద్విచక్ర వాహనంపైనే భోగాపురం రోడ్లపై తిరుగుతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన రాపేటి సూర్యప్రకాష్ గతేడాది పోలిపల్లిలో ద్విచక్రవాహనం దొంగలించాడు. శనివారం అదే బైక్‌పై భోగాపురంలో తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి నంబర్‌ను తనిఖీ చేయగా దొంగలించిన బండిగా గుర్తించారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా ఏడాది కాలంలో చేసిన చోరీ వివరాలను చెప్పాడు. పోలిపల్లిలో–1, పూసపాటిరేగలో–1, బొండపల్లిలో–1, పద్మనాభంలో–2 చొప్పున ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్సైలు పాపారావు, సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం..
పార్వతీపురం టౌన్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఏపీఎన్జీఓ హోమ్‌లో ఎస్ఎఫ్ఐ 32వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి.అఖిల్ సంఘ లక్ష్యాలతో కూడిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం రామ్మోహన్, తదితరులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఈ మధ్యకాలంలో మరణించిన ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, తదితరులకు ప్లీనరీ ప్రతినిధులు సంతాపం తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సంధ్య, బి.అనిల్, సీహెచ్ సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్యా విధానం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు గతంలో కంటే నేడు మరో రూపంలో దాడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని ఆరోపించారు. అలాగే తల్లికివందనం పథకంలో లేనిపోని షరతులు పెట్టి ఎక్కువ మంది చిరుద్యోగులను దూరం చేశారన్నారు. సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించక పోవడం దారుణమని మండిపడ్డారు. పలు తీర్మానాలు ఆమోదం.. పార్వతీపురం, పాలకొండ, గమ్మలక్ష్మీపురం కేంద్రాల్లో పీజీ సెంటర్లో ఏర్పాటు చేయాలని.. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని.. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని.. గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని.. సంక్షేమ హాస్టళ్లలో రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమించాలని చేసిన తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బిడ్డిక అనిల్, కార్యదర్శిగా తిర్లంగి అఖిల్, కోశాధికారి కె.డేవిడ్, ఉపాధ్యక్షులుగా ఎ.గంగారం, సీహెచ్ సింహాచలం, సహయ కార్యదర్శులుగా సంధ్య, సూర్యతో పాటు మరో పది మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ -
హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు
రాజాం ఎస్సీ పోస్టు మెట్రిక్ బాలుర వసతిగృహంలో నేలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు నేలపైనే నిద్ర... ● కొన్ని వసతిగృహాల్లో నీరు తాగేందుకు గ్లాసులు కూడా లేవు. బొబ్బిలి పట్టణంలోని ఎస్సీ కళాశాల వసతిగృహంలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దానిని బాగుచేయకపోవడంతో మూలకు చేరింది. దీంతో అక్కడ చదువుతున్న 70 మంది విద్యార్థులకు తాగునీటి సమస్య వెంటాడుతోంది. మోటారు బావిలోని నీటినే తాగుతున్నారు. ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ట్యాంకులోని నీరే గతి. ఇక్కడి విద్యార్థులు ఆడుకునేందుకు పరికరాలు కూడా లేకపోవడంతో ఉల్లిపాయల సంచులను కోసి వాటిని నెట్‌గా మార్చి ప్లాస్టిక్ బాల్ (ముంతబాలు)తో ఆడుకుంటున్నారు. వార్డెన్ కూడా ఇటీవల కొంత కాలంగా ఇక్కడ లేకపోవడంతో కుక్, కమాటీ, వాచ్‌మన్‌లే వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. బొబ్బిలి డివిజన్లో ఉన్న 14 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లను ఖర్చు చేసినట్టు రికార్డులు చెబుతున్నా ఆ మరమ్మతులేవీ వసతి గృహాల్లో కనిపించడం లేదు. ● సంతకవిటి మండలంలోని హాస్టల్స్‌లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రమే. చాలామంది విద్యార్థులు భోజనం చేసి ఇంటికి వెళ్లిపోతున్నారు. రాత్రిపూట వార్డెన్ పర్యవేక్షణ ఉండడంలేదు. ● దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా, వీరు భోజనం చేసేందుకు వసతిసమస్య వెంటాడుతోంది. ● దత్తిరాజేరు బీసీ హాస్టల్‌కు ప్రహరీలేకపోవడంతో విద్యార్థులను విషసర్పాల భయం వెంటాడుతోంది. రాజాం/బొబ్బిలి/సంతకవిటి/దత్తిరాజేరు: వివిధ సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటూ చదువులు సాగిస్తున్న విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నాయి. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని వసతిగృహాల్లో మరుగుదొడ్లు, స్నానపుగదులు కూడా లేకపోవడంతో చెరువులు, కాలువలు, గెడ్డల వైపు వెళ్లాల్సిన పరిస్థితి. చక్కగా చదువుకుని భవితను బంగారుమయం చేసుకోవాలన్న ఆశతో తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● రాజాం పట్టణంలో ఐదు సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. మూడు బాలికలకు, రెండు బాలురకు సంబంధించినవి కాగా శ్రీకాకుళం రోడ్డులోని సాంఘిక సంక్షేమ పోష్టుమెట్రిక్ బాలుర వసతిగృహంలో విద్యార్థులు బయటనుంచి భోజనాలు, టిఫిన్స్ తెప్పించుకుంటున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సమస్య వెంటాడుతోంది. వార్డెన్‌తో పాటు సిబ్బంది ఉండకపోవడంతో విద్యార్థులకు పర్యవేక్షణలోపం వెంటాడుతోంది. విద్యార్థులకు మంచాలు లేకపోవడతో నేలపైనే నిద్రపోతున్నారు. వసతిగృహం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. సారథి రోడ్డులోని బాలికల పోస్టుమెట్రిక్ వసతిగృహంతో పాటు మాధవబజార్‌లోని అద్దె భవనంలో ఉంటున్న వసతిగృహంలో బాలికలకు మరుగుదొడ్లు, స్నానపు గదుల సమస్య వెంటాడుతోంది. జిల్లాలోని పలు వసతిగృహాల విద్యార్థులు అసౌకర్యాల నీడలో చదువులు సాగిస్తున్నారు. పరుపులు లేక నేలపైనే నిద్రపోతున్నారు. సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక ఇబ్బంది పడుతున్నారు. మెనూ అమలుకాక అనారోగ్యం బారిన పడుతున్నారు. కిటీలకు డోర్లు, ప్రహరీలు లేకపోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. ఇన్వెర్టర్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం సమయంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. కాస్మోటిక్, డైట్ చార్జీలు అందక ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నేలపైనే నిద్ర ప్రహరీలు లేకపోవడంతో చొరబడుతున్న విషసర్పాలు కిటికీలకు డోర్లులేని వైనం విద్యార్థుల సంక్షేమం గాలికి గ్లాసులూ కరువే.. -
మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
చీపురుపల్లి: ప్రజలను మోసం, దగా చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, నిమ్మలవలస గ్రామాల్లో శనివారం సాయంత్రం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమ్మలవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎన్నో హామీలిచ్చి ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. ఆడబిడ్డ నిధి పథ కాన్ని అమలు చేయాలంటే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ను అమ్మే యాలని చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో లంచాలు వ్యవస్థ పెరిగిపోయిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసాలను నమ్మరాదని చెప్పారు. అంతకుముందు దేవరపొదిలాం, నిమ్మలవలస గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల నాయకులు ఇంటింటికీ తిరిగి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనా యుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మేధావి వర్గం అధ్యక్షుడు ఎంవీఎస్ఎన్ రాజు, గవిడి సురేష్, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అధికార్ల శ్రీనుబాబు, చింతాడ లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ‘బెల్లాన’ -
ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన కల్పించాలి
విజయనగరం అర్బన్: ఇంటర్ విద్యలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు అవగాహన కల్పించాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్.తవిటినాయుడు అన్నారు. విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ విద్య నూతన సంస్కరణలపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సిలబస్, సబ్జెక్టుల కలయిక, ప్రశ్నపత్రంలో మార్పులను వివరించారు. గ్రూపు సబ్జెక్టులతో పాటు పార్ట్–1గా ఇంగ్లిష్, పార్ట్–2లో ద్వితీయ భాషగా తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, తమిళ్, కన్నడ, ఒడియా, పర్షియన్, ఫ్రెంచ్ లేదా ప్రధాన సబ్జెక్టులైన గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ లేదా మైనర్ సబ్జెక్టులైన జాగ్రఫీ, లాజిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఎంపీసీ విద్యార్థులు అడిషనల్‌గా ఆరవ సబ్జెక్టు ఆప్షన్‌గా బయాలజీ, బైపీసీ విద్యార్థులు అడిషనల్ సబ్జెక్టుగా గణితంను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. గణితం–ఏ,బీలను విలీనం చేసి ఒక సబ్జెక్టుగా, బోటనీ, బయా లజీ సబ్జెక్టులను విలీనం చేసి బయాలజీ సబ్జెక్టుగా ఈ ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేస్తారన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు -
సంతృప్తికర సేవలందించా..
విజయనగరం అర్బన్: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సిఫార్సులతో సంతృప్తికర సేవలందించినట్టు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. ఈ నెల 27వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జెడ్పీ అతిథిగృహంలో మీడియాతో శనివారం మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాజ్యాంగపరమైన బాధ్యతగల ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి అప్పగించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల పదవీ కాలంలో ఆదివాసీల వివిధ స్థాయిలోని సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేసినట్టు చెప్పారు. గిరిశిఖర గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నించామన్నారు. ఆదివాసీల నుంచి ఏ సమయంలో, ఏ రూపంలో వినతులు వచ్చినా స్వీకరించేవాడినని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న వెట్టిచాకిరీపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించి దానిని నిర్మూలించేందుకు కృషి చేశామన్నారు. మైదాన ప్రాంతంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కమిషన్ పనిచేసిందని వివరించారు. ఎస్టీ కమిషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన ముఖ్యమైన సిఫార్సులను ప్రకటించారు. ● నేటితో ముగియనున్న చైర్మన్ పదవీ కాలం●● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు -
‘మీ కోసం’ కాల్ సెంటర్ ఏర్పాటు
విజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్– 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. తమ అర్జీలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీల నమోదుకు ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకొని సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల మధ్య, మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.15 మధ్యన మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. సీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ సెంటర్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు పి.వి.నవజ్యోతి, ఎ.నాగలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కరరావు, డీఎస్పీ ఎం.వీరకుమార్, డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. జిందాల్ నిర్వాసితులకు సంఘీభావం శృంగవరపుకోట: భూములు కోల్పోయి నెలరోజులుగా పోరాటాలు చేస్తున్న జిందాల్ నిర్వాసిత రైతులకు మానవహక్కుల సంఘం చైర్మన్ డాక్టర్ సంపత్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఆయన బొడ్డవరలో నిర్వాసితులతో శనివారం సమావేశమయ్యారు. జిందాల్ నిర్వాసితులు 37 రోజులుగా చేస్తున్న పోరాటాలు గమనిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై హెచ్ఆర్సీ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, రైతు సంఘం నేత చల్లా జగన్, తదితరులు పాల్గొన్నారు. -
వీడని వరద కష్టాలు
అధికారులు స్పందించాలి ఏటా సాయన్నగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. పొలాలను వరదనీరు ముంచెత్తుతోంది. వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది రైతుల దీర్ఘకాలిక సమస్యగా మారింది. అధికారులు స్పందించాలి. సాయన్నగెడ్డలో పూడికలు తొలగించాలి. పొలాలను ముంచెత్తుతున్న వరదనీరు కిందకు మళ్లించేందుకు మదుములు నిర్మించాలి. – యెన్ని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, రామారాయపురం సంతకవిటి: ఆ గ్రామాల పొలాలకు ఓ వైపు నారాయణపురం కుడి ప్రధాన కాలువ, మరోవైపు సాయన్నగెడ్డ ఉంది. వర్షం కురిస్తే చాలు... ఈ రెండు కాలువలకు మధ్యన ఉన్న పొలాల్లో నీరు పోటెత్తుతోంది. వరద నీరు వెళ్లే మార్గం ఉండదు. ఎగువన ఉన్న నారాయణపురం కుడి ప్రధాన కాలువ నీరు సాయన్నగెడ్డలో కలిసే అవకాశం ఉండదు. గెడ్డ కింద నుంచి పొల్లాలోని వరదనీటిని నాగావళి నదికి మళ్లించేందుకు అనువుగా ఎలాంటి మదుములు లేవు. ఫలితం.. రెండు కాలువల మధ్యన ఉన్న సంతకవిటి మండలంలోని మల్లయ్యపేట, రామారాయపురం, హొంజరాం, బూరాడపేట, మల్లయ్యపేట, మంతిన, పనసపేట, గెడ్డబూరాడపేట గ్రామాల పరిధిలోని పంట పొలాలు నీటమునుగుతున్నాయి. ఏటా రైతన్నకు పంట నష్టాన్ని మిగుల్చుతున్నాయి. పంట సాగుచేయడమే తప్ప అది ఇంటికి వస్తుందన్న నమ్మకం ఉండడం లేదు. వరద కష్టాలు తీర్చాలంటూ రైతులు గోడు వినిపిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. రైతుకు నష్టాలు తప్పడంలేదు. ముంపునకు కారణం ఇదీ... రేగిడి మండలం సంకిలిహెడ్చానల్ నుంచి సంతకవిటి మండలం వాల్తేరు వరకు సాయన్నగెడ్డ విస్తరించి ఉంది. సంకిలి హెడ్చానల్ వద్ద షట్టర్లు పాడవ్వడంతో నాగావళి నదికి వరద పోటెత్తినప్పుడు సాయన్నగెడ్డ ఉగ్రరూపం దాల్చుతుంది. గెడ్డ నుంచి నీరు కిందకు వెళ్లేందుకు ఎక్కడా ఎలాంటి మదుములు లేకపోవడం, గెడ్డలో పూడికలు పేరుకుపోవడంతో వరదనీరు పొలాలను ముంచెత్తుతోంది. నెలల తరబడి నీరు నిల్వ ఉండడంతో సుమారు రెండు వేల ఎకరాల్లో పంటనష్టం జరుగుతోంది. ఇది అధికారులు, పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముంపునకు గురవుతున్న రెండు గెడ్డల మధ్య పొలాలు మదుములు లేకపోవడం, గెడ్డల్లో పూడికలే కారణం పట్టించుకోని అధికార యంత్రాంగం -
ఒక ఉపాధ్యాయుడు.. ఒక విద్యార్థి
చిత్రంలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ఉన్నది వేపాడ మండలం వావిలపాడు పంచాయతీ కడకొండ గిరిజన గ్రామ ప్రాథమిక పాఠశాల. 40 కుటుంబాలు, 175 మంది జనాభా కలిగిన గ్రామంలో బడిఈడు పిల్లలు లేరు. చాలా కుటుంబాలు వలస వెళ్లిపోవడం, గతేడాది ఐదో తరగతి చదివిన నలుగురు విద్యార్థులు ఈ ఏడాది ఆరో తరగతిలో చేరడంతో పాఠశాలను మూసివేయాల్సిన పరిస్థితి. అయితే, అంగన్వాడీ కేంద్రం నుంచి మోక్షజ్ఞ అనే చిన్నారి ఒకటో తరగతిలో చేరడంతో బోధన కోసం డిప్యూటేషన్‌పై సోంపురం క్లస్టర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కె.నవీన్‌ను ఈ నెల 07న నియమించారు. ఆ ఒక్క చిన్నారి చేరడంతో పాఠశాల మూతపడలేదని ఎంఈఓ బాలభాస్కరరావు తెలిపారు. – వేపాడ -
● రాములోరి చెంత ప్రకృతి పులకింత
విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపైకి ఎక్కేవారికి ప్రకృతి అందాలు మైమరిపిస్తాయి. ఓ వైపు దట్టమైన పొదలతో కూడిన కొండలు... మరోవైపు కనుచూపు మేర పచ్చని పొలాలు.. పుడమికి పచ్చబొట్టు పెట్టేలా ఉభాలకు సిద్ధంగా ఉన్న నారుమడులు.. పొలాల మధ్యగుండా సన్నని రేఖలా కనిపించే దారులు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆహ్లాదాన్ని, అనందాన్ని కలిగిస్తాయి. మనసును హత్తుకుంటాయి. రాములోరి సాక్షిగా కనిపించే ప్రకృతి సోయగాలకు శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి
విజయనగరం అర్బన్: రీ సర్వే ప్రక్రియను రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని రెవెన్యూ జిల్లా ప్రత్యేక అధికారి, ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ అదనపు సంచాలకుడు ఆర్.గోవిందరావు తెలిపారు. జిల్లాలో ఆయన క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఇళ్ల స్థలాలు రీ వెరిఫికేషన్, రెగ్యులరైజేషన్, పీజీఆర్ఎస్, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, కులాల వెరిఫికేషన్ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తిచేయాలన్నారు. ఆగస్టు 5వ తేదీనాటికి గ్రామ సరిహద్దులు గుర్తింపు, సెప్టెంబర్ 15 నాటికి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, నవంబర్ ఐదు నాటికి ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియలు పూర్తి చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అందజేసేందుకు వెరిఫికేషన్ పూర్తిచేసి నివేదిక అందజేయాలన్నారు. ఇన్చార్జి కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రీ సర్వే వివరాలను తెలియజేశారు. పీజీఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఐదు ప్రశ్నలతో అర్జీదారుల నుంచి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారులు దాట్ల కీర్తి, మోహనరావు, ఆశయ్య, సర్వే శాఖ సహాయ సంచాలకులు రమణమూర్తి, కలెక్టరేట్ ఏఓ గోవింద్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ జిల్లా ప్రత్యేక అధికారి గోవిందరావు -
డయేరియా బాధితులకు తక్షణ వైద్యం
విజయనగరం ఫోర్ట్: డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని, ఐదేళ్లలోపు వయస్సుగల పిల్లల్లో డయేరియా మరణాలు సంభఽవించకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ సేతుమాధవన్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 1 నుంచి జూలై 31 వరకు జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామాల్లో తాగునీటిని క్లోరినేషన్ చేయాలని, నీటి ట్యాంక్‌లను పరిశుభ్రం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వేడివేడి ఆహారాన్ని, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. అనంతరం డయేరియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ ఎన్.పి.పద్మశ్రీరాణి, డీఈఓ రెడ్డి అచ్చుతకుమారి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, రాజాం మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
160 మంది వ్యాధిగ్రస్తులు
రామభద్రపురం మండలం ఏనుబరువు గ్రామంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిస్క్రీనింగ్ పరీక్షల కోసం బ్లడ్ శ్యాంపిల్ తీస్తున్న వైద్య సిబ్బంది ● జిల్లాలో అందుబాటులో లేని సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధినిర్ధారణ పరీక్షలు ● ప్రభుత్వ వైద్యకళాశాల ఉన్నా అక్కరకురాని సేవలు ● అవస్థలు పడుతున్న బాధితులు ● జిల్లాలో 160 మంది సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు ● కొత్తగా మరో 3 కేసుల నమోదు ● మరో నలుగురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే.. సికిల్‌సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేజీహెచ్‌లోనే చేస్తారు. అక్కడే వ్యాధి నిర్ధారణ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. జిల్లాలో అందుబాటులో లేదు. స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే జిల్లాలో నిర్వహిస్తున్నాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి●విజయనగరం ఫోర్ట్: సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి జిల్లా ప్రజలను భయపెడుతోంది. వ్యాధి నిర్ధారణ సౌకర్యం జిల్లాలో అందుబాటులో లేక పోవడం రోగులకు శాపంగా మారింది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నం జిల్లాలోని కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యకళాశాల అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. వ్యాధి సోకిన వారికి తరచూ రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఆ సమయంలో రక్తం ఎక్కిస్తేనే ప్రాణాలు నిలబడతాయి. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధికి వైద్యపరీక్షలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 160 మంది సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయింది. మరో నలుగురికి వ్యాధి లక్షణాలు ఉండడంతో వారికి కేజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో అధికం సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతంలో అధికంగా ఉన్నారు. జిల్లాలో 40 ఏళ్లు లోపు వయసు కలిగిన గిరిజనులు 28 వేల మంది ఉన్నారు. వీరిలో వైద్య సిబ్బంది ఇప్పటి వరకు 24 వేల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంకా నాలుగువేల మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉంది. వైద్యసేవలు అందించడంలో కూటమి కినుక జిల్లాలో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందుబాటులో లేవు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో వ్యాధి నిర్ధారణ చేసుకోవాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారం. వ్యాధిగ్రస్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానున్నామని కూటమి సర్కారు గొప్పలు చెబుతోందే తప్ప మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా... రక్తహీనత, ఆయాసం, పొట్ట నొప్పి, ప్రతీ జాయింట్ దగ్గర పెయిన్స్, నీరసం, కాలు మీద పుండ్లు, రక్త ప్రసరణ ఆగిపోవడం జరుగుతుంది. సికిల్‌సెల్ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాలు రుగ్మత. ఇది తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తుంది. సామాన్యంగా సాధారణ ఆరోగ్యకరమైన ఎర్రరక్త కణాలు గుండ్రంగా ఉంటే , సికిల్‌సెల్ వ్యాధిలో కొడవలి వలే అర్ధ చంద్రాకారంలో ఉంటాయి. కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. శ్వాసతీసుకోవడం ఇబ్బంది. అలసట, తరచుగా వచ్చే అంటువ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ వైఫల్యం, పెరుగుదల లోపం వంటివి వ్యాధి లక్షణాలు. -
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
● అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి ● ఇన్చార్జి కలెక్టర్ సేతు మాధవన్ విజయనగరం అర్బన్: రానున్న 24 గంటల్లో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితుల్ని అంచనా వేయాలని, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. జలాశయాల్లో నీటినిల్వలపై కలెక్టరేట్ డి–సెక్షన్‌కు నివేదికలు అందజేయాలని జలవనరులశాఖ అధికారులకు సూచించారు. మంచి గుడ్లు సరఫరాకు ఆదేశం బొబ్బిలి: స్థానిక మున్సిపాలిటీ, బొబ్బిలి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో వడ్డించేందుకు కుళ్లిన గుడ్లు సరఫరా చేశారు. ఇదే అంశంపై ఈ నెల 24న ‘కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కుళ్లిన గుడ్లు స్థానంలో మంచి గుడ్లు సరఫరా చేసినట్టు ఎంఈఓ గొట్టాపు వాసు శుక్రవారం తెలిపారు. జయప్రకాష్ పాఠశాలలో కుళ్లిన 34 గుడ్లను రీప్లేస్ చేయించామన్నారు. కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చామన్నారు. పలు పాఠశాలల హెచ్ఎంలు, నిర్వాహకులు తెలిపిన సమాచారం మేరకు మంచి గుడ్లను అందించామన్నారు. -
హాస్టల్ విద్యార్థుల నిరసన
విజయనగరం టౌన్: విజయనగరం బీసీ కాలనీలో ఉన్న పోస్టుమెట్రిక్ బాయ్స్ ట్రైబల్ హాస్టల్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేశ్వరరావు మాట్లాడుతూ హాస్టల్ ప్రాంగణంలో నిల్వ ఉన్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. మంచినీటిని కిలోమీటరు దూరంలోని వాటర్‌ప్లాంట్ నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్ల తలుపులు బాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్ఓ సభ్యులు వినయ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణ శోభ
విజయనగరం టౌన్: శ్రావణమాసం తొలి శుక్రవారం భక్తులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. ఆలయాలను దర్శించారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పసుపుకుంకుమలు సమర్పించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. చదురుగుడి, వనంగుడిలో కొలువైన అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా పుష్పశోభితమైంది. వాసవీ కన్యకపరమేశ్వరి శాకంబరిగా దర్శనమిచ్చారు. మయూరీ కూడలి వద్దనున్న సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి విశిష్ట కుంకుమార్చనలు జరిపారు. శ్రీక్షేత్రంలో కొలువైన అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వెంకటేశ్వరస్వామిదేవాలయంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. -
విద్యుత్ సబ్ స్టేషన్ వాచ్‌మన్ అదృశ్యం
విజయనగరం క్రైమ్: దాసన్నపేట విద్యుత్ సబ్ స్టేషన్ లో వాచ్ మన్‌గా పని చేస్తున్న కె.రమణయ్య కనిపించడం లేదని ఆయన భార్య సత్యవతి శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రమణయ్య జీతం వచ్చినప్పుడు ఇంట్లో కాస్త ఇచ్చి ఊరెళ్తున్నానని భార్యకు చెప్పేవాడు. అయితే గడిచిన నాలుగు నెలల నుంచి భర్త ఇంటికి రాకపోవడంతో స్థానికులు, బంధువుల ఇళ్లకు వెళ్లి భార్య సంప్రదించింది. ఏపీ ట్రాన్స్ కో సిబ్బంది కూడా వాచ్‌మన్ రమణయ్య గురించి వాకబు చేసి..డ్యూటీకి రావడం లేదని భార్యకు చెప్పారు. దీంతో ఆమె తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కనకరాజు వివరించారు. -
గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం
బొబ్బిలి: నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కాకర్ల వలస, కారేడువలస గ్రామాల గిరిజనుల సాగు భూములు లాక్కుని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తే సహించబోమని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరుఅఉ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు బాధితులకు మద్దతుగా ఉంటామన్నారు. కారేడు వలస, కాకర్ల వలస గ్రామాల్లో నివాసముంటున్న గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేస్తున్నారని ఆ భూముల ఆధారంగా జీవనం పొందుతున్న గిరిజనుల నుంచి ప్రభుత్వం అన్యాయంగా భూమిని లాక్కోవడం సరికాదన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భూమిని లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గిరిజనులు వేసుకున్న మామిడి, జీడి మొక్కలను, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడం పద్ధతేనా అని ప్రశ్నించా రు. ఏళ్ల తరబడి జీవనోపాధి పొందుతున్న భూమికి పరిహారం ఇవ్వకుండా ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఖాళీగా ఉన్న భూముల జోలికి వెళ్లకుండా వాటి పక్కనే ఉన్న గిరిజనులకు చెందిన భూములను తీసుకుంటామనడం ఎంత వరకూ సబబని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ధ్వంసం చేసిన పంటకు పరిహారం ఇవ్వాలి గిరిజనుల భూములను వెంటనే వారికి వదిలేసి, ధ్వంసం చేసిన పంటలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూములను తీసుకుని వాటికి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మిర్తి వలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీపీఎం రామభద్రపురం మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, గిరిజనులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా -
గుర్రుమీదున్న గురువులు
● ఐఆర్, పీఆర్సీ పెండింగ్ డీఏలపై నోరుమెదపని సర్కారు ● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ గాలికి ● సమస్యలపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు ● నేడు కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నారామభద్రపురం: చంద్రబాబుతో జతకట్టిన పవన్ కల్యాణ్ సైతం సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు హామీల వర్షం కురిపించారు.ఆ వర్షంలో తడిసి ముద్దయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులూ ఉన్నారు. మాకు అధికారం ఇచ్చి చూడండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం. పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకేసారి చెల్లిస్తాం, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను అందించే ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల కోసం రాజకీయ నాయకుల చట్టూ తిరిగే పని లేకుండా చేస్తాం. ఉద్యోగుల పని భారం తగ్గిస్తాం అంటూ ఇలా ఎన్నో అలవిగాని హామీలతో చంద్రబాబు ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు.అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కూటమి సర్కారుపై కోపంగా ఉన్నారు. తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోతే ఉద్యమాలకు సిద్ధం అంటూ కూటమి సర్కారుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఎదురు చూపు.. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన ప్రతిసారి తమ సమస్యలపై ఏమైనా చర్చిస్తారేమోనని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదిగా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వస్తున్నారు.ఈ 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కనీసం ఆ ఊసేఎత్తలేదు. ఇప్పటికే ఉద్యోగులకు మూడు డీఏలు పెంగింగ్‌లో ఉండగా జూలైతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదీ లేదు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఇప్పటి వరకూ కొత్త కమిషన్‌ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఓపీఎస్‌పై నోరుమెదపని సర్కారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను తీసుకొస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు మాటిచ్చారు. ఏడాది కాలంలో ఏనాడూ ఈ అంశంపై నోరు మెదపలేదు. ఈ విషయంలోనూ కూటమి సర్కారు ఉద్యోగులకు వెన్నుపోటు పొడించింది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేసిన విషయాన్ని పలు ఉద్యోగ సంఘాల నాయుకులు గుర్తుచేసుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేనట్లేనా? తాము అధికారంలోకి రాగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మాటలు చెప్పేవాళ్లం కాదు. చేసి చూపిం చేవారిమని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని అంచనా. వారిలో 15 ఏళ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఉన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలో ఏనాడూ కూటమి ప్రభుత్వం వారికిచ్చిన హామీపై చర్చించిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా జనవరి 6న జీవో నంబర్–2 ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ప్రభుత్వ పథకాల్లో ఉండే ఉద్యోగులకు కూడా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడం జరగదని నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరు కూడా ఆందోళన బాట పట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఉద్యమ బాట తప్పదు..ఏటా జనవరి, జూలై మాసాల్లో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటిస్తోంది. దానిని అనుసరించి రాష్ట్రం డీఏలు ఇవ్వాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఈ జూలై మాసంతో పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే ఇవ్వకపోతే ఉద్యమబాట పట్టాల్సి వస్తుంది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై ఽశనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నాం. ప్రసన్నకుమార్, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194లింగ నిర్ధారణ వెల్లడిస్తే చర్యలు● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: లింగ నిర్ధారణ వెల్లడించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్బస్థ, పిండ పక్రియ 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి, ఉప జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోగ్రాం అధికారులు వారి పరిధిలో ఉన్న స్కానింగ్ సెంటర్స్‌ను పరిశీలించాలని ఆదేశించారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ రెడ్డి అచ్యుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పోలీసు వెల్ఫేర్ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ‘పోలీసు వెల్ఫేర్ డే’లో భాగంగా సిబ్బంది ఒక్కొక్కరిని ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్లోకి పిలిపించుకుని వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలురేగిడి: మండలంలోని ఉంగరాడమెట్ట సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితంలేని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనను చూసిన పోలీసులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గంగు జగన్నాథరావులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. పూర్తిగా బురద, రక్తంతో తడిచిపోయిన క్షతగాత్రుడిని పోలీసుల సహాయంతో శుభ్రం చేయడంతో పాటు కొత్త దుస్తులు వేసి రాజాం సామాజిక ఆస్పత్రికి మెరుగైన చికిత్సనిమిత్తం తరలించారు. మానవత్వంతో 108 సిబ్బంది అందించిన సేవలను పలువురు అభినందించారు. బాగెంపేటలో చోరీవంగర: మండల పరిధిలోని బాగెంపేట గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శంకరరావు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయం గమనించిన దొంగలు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను తెరిచారు. ఈ విషయం శుక్రవారం ఉదయం గమనించిన చుక్కపక్కల వారు ఇంటి యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్చార్జి ఎస్సై పి.నీలావతి, క్లూస్‌టీం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం బృందం పలుచోట్ల వేలిముద్రలు సేకరించింది. ఈ విషయంపై వంగర పోలీసులను సంప్రదించగా హైదరాబాద్ నుంచి ఇంటి యజమాని ఫ్లైట్‌లో వస్తున్నాడని, ఆయనను ఫోన్లో సంప్రదించగా సుమారు 20తులాల బంగారం పోయినట్లు తెలిపాడన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు వచ్చి పరిశీలించిన తరువాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేస్తామని ఎస్సై తెలిపారు. -
రామతీర్థానికి శ్రావణ శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి శ్రావణమాస శోభ సంతరించుకుంది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఉమా సదాశివాలయంలో ఉన్న కామాక్షి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. మహాలక్ష్మి అమ్మవారిని చందనంతోను, కామాక్షి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. తొలి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు.వైభవంగా పూర్ణాహుతి రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామిని ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన అనంతరం యాగశాలలో పూర్ణాహుతి చేపట్టారు. తరువాత వెండి మంటపంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు -
జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
బొబ్బిలి: సీపీఐ 14వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మిరమణ కోరారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహాసభల సభా ప్రాంగణం ఏర్పాట్లను ఆయన కార్యవర్గంతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్యలు హాజరవుతారన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ -
పాత పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు
విజయనగరం అర్బన్: వైఎస్ఆర్సీపీ హయాంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డులకు పంపిణీ చేసిన పట్టాదారుల పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన పుస్తకాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెండు విడతల్లో దాదాపు 360 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పలు గ్రామాల్లో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు రీసర్వే ప్రక్రియపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అపోహలు కల్పించిన కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే విధానాన్నే అవలంబిస్తున్న విషయాన్ని కప్పిపుచ్పుకోవడానికి ఇప్పటికే పూర్తయిన రీసర్వే గ్రామాల్లో కాలయాపన చేయడం కోసం మరోసారి రీసర్వే చేపట్టింది. గత ప్రభుత్వం పూర్తి చేసిన రీసర్వేలను సరిచూసుకోవడం మినహా కొత్త గ్రామాల రీసర్వే మూడో విడత పనులు జరగలేదు. ఆగస్టు 15న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ భూ హక్కుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందని, ఇటీవల సవరించిన రీసర్వే పనులు పూర్తయిన అన్ని గ్రామాలకు సంబంధించి భూహక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయని విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి శుక్రవారంతెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తొలి విడతగా విజయనగరం డివిజన్ పరిఽధిలోని 39 గ్రామలకు చెందిన భూహక్కుదారులకు వచ్చే నెల 15న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనునున్నామని, వాటికి సంబంధించి ఇప్పటికే రీసర్వే సవరణ ప్రక్రియ పూర్తయిందని, వెబ్‌ల్యాండ్‌లో సమాచారం ఆధారంగా సరిపోయిన వారికి పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విజయనగరం డివిజన్ పరిధిలో ఇళ్ల పథకం కింద 11 వేల మంది దరఖాస్తు చేసుకోగా వాటిని 30 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన పట్టాలపై మరో సారి సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇంటి స్థలం లేనివారు, లబ్ధిదారు కుటుంబంలో ఏ ఒక్కరూ గతంలో ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల ద్వారా లబ్ధిపొందని మహిళలు అర్హులవుతారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న గృహాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 175 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న కొత్త పుస్తకాల పంపిణీ -
డిసెంబర్ లోగా ఇళ్లనిర్మాణం పూర్తిచేయాలి
విజయనగరం టౌన్: ప్రభుత్వం ఇచ్చిన స్ధలాల్లో ఇళ్ల నిర్మాణాలను సగంలో ఆపేసిన వారంతా డిసెంబర్ నెల లోగా పూర్తిచేయాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (అడ్మిన్), విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రత్యేకాధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గుంకలాం జగనన్న లేఅవుట్‌ను ఆయన డీఈ రంగారావుతో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో త్వరితగతిన రూప్‌కాస్ట్ నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 2091 ఇళ్లు రూఫ్ లెవల్స్ వరకూ వచ్చాయని, నాలుగు వారాల్లో వాటిని పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. వాటిలో సుమారు 1161 మంది లబ్దిదారులకు అదనపు బెనిఫిట్స్ అందజేశామని తెలిపారు. బీసీలకు రూ.50వేలు, ఎస్సీలకు రూ.75వేలు, ప్రిమిటెవ్ ట్రయ్ గ్రూప్స్‌కు రూ.లక్ష అందజేశామని చెప్పారు. మిగతా వారెవరికై నా డబ్బులు రాలేదని ముందుకువస్తే హౌసింగ్ అధికారులతో కలిసి వారికి సాయమందిస్తామని చెప్పారు. 1500 వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడం టార్గెట్‌గా ఉంచామని, లబ్ధి డిసెంబరు నెలాఖరువరకే ఉందన్నారు. డిసెంబరు లోపు ఇళ్లు కట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అందవన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న కాంట్రాక్టర్లు కట్టిస్తున్న ఇళ్లపై ఆన్లైన్ వర్క్ చేసేందుకు ఎమినిటీస్ ఇక్కడికి రావడం లేదని. కచ్చితంగా వారు కనీసం వారానికి రెండుసార్లు అయినా వచ్చి ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెట్టాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇన్స్పైర్ మనక్ అవార్డు కోసం నామినేషన్ల ప్రక్రియ
పార్వతీపురం టౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మనక్ అవార్డు కోసం ప్రాజెక్ట్‌ల నామినేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మొదలైందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యా శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీలోగా అన్ని పాఠశాలల నుంచి ప్రాజెక్టు సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులను ఆదేశించామన్నారు. ప్రతి మండల పరిధిలో ఉండే అన్ని పాఠశాలల నుంచి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నామినేట్ అయ్యే విధంగా చూడాలని మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 6–12 తరగతులకు ఇన్స్పైర్ మనక్‌లో అవకాశం కల్పించారని తెలిపారు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్స్ హైస్కూల్ ప్లస్ నుంచి 7 ప్రాజెక్ట్స్ httpr://www.inspireawards&drt.gov.in అనే లింక్ ఓపెన్ చేసి ప్రాజెక్టు సబ్మిట్ చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ సబ్మిషన్, ఇతర సాంకేతిక సహకారానికి జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు ఫోన్ నంబర్ 8978077156ను సంప్రదించవచ్చని కోరారు. -
కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలి
విజయనగరం క్రైమ్: కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించాలని, అలాగే స్కూల్స్, కాలేజీల్లో శక్తి వారియర్ టీమ్స్ ను నియమించాలని డీఎస్పీలతో పాటు అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్స్‌ను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అడ్మిన్ ఏఎస్పీ సౌమ్యలతతో కలిసి పోలీస్ అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. శక్తి టీమ్స్ పనితీరు, రిపీటెడ్ నిందితులు, మహిళల అదృశ్యం, గంజాయి కేసులు, ఫైనాన్షియల్ దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారంట్ల ఎగ్జిక్యూషన్‌ను సమీక్షించారు.అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, సాంకేతికత వినియోగం గురించి దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే హిస్టరీ షీట్లు కలిగిన నిందితులపై గత కేసుల ప్రస్తుత స్థితి, కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. కేసుల మిస్టరీని ఛేదించాలి ఇక నాన్ బెయిలబుల్ వారంట్లు, పోయిన వాహనాలు, మిస్సింగ్ వ్యక్తులను గుర్తించేందుకు, సైబర్ క్రైం, గంజాయి కేసుల్లో లభించిన చిన్న చిన్న ఆధారాలతో సాంకేతికతను వినియోగించి కేసుల మిస్టరీని చేధించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఏడేళ్లకు పైబడి శిక్షలు విధించిన అన్ని కేసుల్లో రికార్డు చేసిన వీడియోలు, ఫొటోలను ఈ సాక్ష్య యాప్‌లో అప్లోడ్ చేయాలని ఈ సాక్ష్య యాప్‌ను ప్రతి దర్యాప్తు అధికారి వినియోగించాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చెయ్యాలని, పరారీలో ఉన్న ఎన్బీడబ్ల్యు వ్యక్తులకు ష్యూరిటీగా నిలిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శివారు ప్రాంతాలపై నిఘా అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉన్న పాత బిల్డింగులు, శివారు ప్రాంతాలను గుర్తించి నిఘా పెట్టాలని ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, సంబంధిత లయన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జూమ్ మీటింగులో డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, పలువురు సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్ -
సాగు భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారు..!
● తహసీల్దార్‌ను ప్రశ్నించిన కాకర్లవలస గిరిజన రైతులు ● పట్టా లేకుండా సాగు చేసే హక్కు లేదు.. ● వదిలి వెళ్లిపోవాలని తేల్చి చెప్పిన తహసీల్దార్ రామభద్రపురం: డి పట్టా భూమి అయిన.. దశాబ్దాల కాలంగా మా సాగులో ఉన్న భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారని కాకర్లవలస గిరిజన రైతులు తహసీల్దార్ అజురఫిజాన్ను ప్రశ్నించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది. అయితే ఆ భూమిలో ఏపీఐఐసీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో? ఎలా ఉందో, ఎవరు ఆక్రమించుకున్నారో.. కనీసం కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం కొంత భూమిని కేటాయిస్తూ ముందుగా రోడ్లు అభివృద్ధి కోసం రూ.7 కోట్లు నిధులు విడుదల చేయడంతో నెల రోజుల క్రితం మంత్రి కొడపల్లి శ్రీనివాపరావు, ఎమ్మెల్యే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శంకుస్థాపన కూడా చేసిన విషయం విదితమే. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పుడు రోడ్లు అభివృద్ధి కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి సంబంధించిన భూమే కదా అని ప్రస్తుతం సాగులో ఉంటూ పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడి తోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కనీసం నోటీసు ఇవ్వకుండా జేసీబీతో ధ్వంసం చేశారు. దాంతో తమ సాగులో ఉన్న భూములలో ఎలా రోడ్లు వేస్తారని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అజూరఫీజాన్ ఽఆధ్వర్యంలో ఏపీఐఐసీ జేఈ రాజేష్‌కుమార్, ఎస్ఐ వి.ప్రసాదరావు, మిర్తివలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీపీఎం నాయుకుడు బలస శ్రీనివాసరావు, గిరిజన రైతులు సమావేశమయ్యారు. సమావేశంలో భూ రికార్డులు పరిశీలించారు. తహసీల్దార్ మాట్లాడుతూ కాకర్లవలసలో ఉన్న మొత్తం సుమారు 462 ఎకరాల డి పట్టాతో పాటు, ఫారెస్టుకు సంబంధించిన భూమి ఉందని, అందులో గిరిజన రైతులకు 266 ఎకరాల భూమి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కింద ఇచ్చామన్నారు. అలాగే 187.8 ఎకరాలు రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించిందన్నారు. కొండ పక్కన ఉన్న ప్రాంతంలో మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తే ఏపీఐఐసీకి కేటాయించిన భూమిలో మీరు ఎలా సాగు చేస్తారని? ఇది డి పట్టా భూమి అని మీరు సాగు చేస్తే కుదరదని, వదిలి వెళ్లిపోవల్సిందేనని తేల్చి చెప్పేశారు. భూమి ఎక్కడ ఇచ్చారో అక్కడకు వెళ్లి సాగు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం గిరిజన రైతులు మాట్లాడుతూ సాగులో ఉన్న భూములను ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు అంటూ పెద్దల స్వార్ధం కోసం మా పేదల భూములు లాక్కోవడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. చావనైనా చస్తాం.. కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని గిరిజన రైతులు తేల్చి చేప్పేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సర్పంచ్ మజ్జి రాంబాబు మాట్లాడుతూ మిర్తివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్గాని, గ్రామ ప్రజల సంతకాలు లేకుండా కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నంత మాత్రాన ఆ సర్పంచ్ సంతకంతో తీర్మానం ఎలా చేస్తారు? నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి మద్దతుగా తాము నిలబడతామన్నారు. మండల సర్వేయర్ వి.సాయికుమార్, కొట్టక్కి వీఆర్వో మహేష్, వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈగల్ టీమ్‌కు చిక్కిన గంజాయి నిందితులు
విజయనగరం క్రైమ్ : మూడు కార్లలో 120 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఎనిమిది మందిని రాజాపులోవ జంక్షన్ వద్ద ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో పట్టుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. డీపీవోలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈగల్ టీమ్ సీఐ కల్యాణితో కలిసి వివరాలు వెల్లడించారు. ఈగల్ పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం నుంచి మూడు కార్లలో వస్తున్న ఎనిమిది మందిని రాజాపులోవ వద్ద అదుపులోకి తీసుకొని వారి నుంచి 47 ప్యాకెట్లలో ఉన్న 120 కేజీల గంజాయిని, తొమ్మిది సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. పట్టుబడిన ఎనిమిది మంది నిందితుల్లో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లంతాపూర్ బ్లాక్ బెల్ట్‌కు చెందిన కొర్రా కిరణ్(21), మనోజ్ బిసాయి(2), ఢిల్లీలోని పాత సీంపూర్కు చెందిన పాజిల్(30), యూపీలోని హాపూర్ జిల్లా లక్ష్మణపురకు చెందిన బిజేంద్ర(46), బుదాన్ జిల్లా సక్రి జంగిల్‌కు చెందిన ముఖ్తర్ అహ్మద్(43), అహిర్వారాకు చెందిన రామ్మోహన్(21), కాశగాని జిల్లా కుల్లికి చెందిన సోను (34), శిల్పి(30)గా విచారణలో గుర్తించామన్నారు. నిందితులు గంజాయిని ఉత్తరప్రదేశ్, ఢిల్లీకు రవాణా చేయాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రంకు చెందిన గంజాయి వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నారని తెలిపారు. మరో నిందితుడు అజిత దడక అలియాస్ ఒజి అలియాస్ మహేష్ దడక పరారయ్యాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరంతా ఒడిశాలోని గంజాయి వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి రైళ్లు, కార్లలో తరలించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కార్లలో విజయనగరం మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఈగల్ సీఐ టి.కల్యాణి, ఎస్ఐ పి.పాపారావు, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయనతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు పోలీసు అధికారులు ఉన్నారు. పట్టుబడిన వారిలో యూపీకి చెందిన దంపతులు -
రామతీర్థంలో పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు గురువారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మండపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి.. ఉత్సవ మూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, పవన్, రామగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు -
పీఎం జన్మన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో పీఎం జన్మన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులకు సూచించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కన్నయ్యగూడ, కురుపాం మండలంలోని తోటగూడ గ్రామాల్లోని పీఎం జన్మన్ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. బిల్లుల చెల్లింపులపై లబ్ధిదారులతో మాట్లాడారు. కన్నయ్యగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీ స్కూల్‌ను పరిశీలించారు. పాఠశాలకు అదనపు తరగతి గది మంజూరు చేస్తామన్నారు. అలాగే భద్రగిరి సీహెచ్‌సీని సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఆపై గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రగిరి ఏపీటీడబ్ల్యూఆర్ గర్ల్స్ స్కూల్‌ను సందర్శించి మార్గదర్శకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గుమ్మలక్ష్మీపురంలో విలేకర్లతో మాట్లాడుతూ పీఎం జన్మన్ కింద జిల్లాకు 5వేల గృహాలు మంజూరు కాగా, 1600 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, 130 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తికావాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించినట్టు చెప్పారు. భద్రగిరి సీహెచ్‌సీలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో బెడ్లు సరిపోవడం లేదని, నిర్మాణ దశలో ఉన్న కొత్త ఆసుపత్రి భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం వలన కలిగే తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్‌ల సహకారంతో ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు గ్రామ సచివాలయం ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూలతో వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మ చంద్రారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఐటీడీఏ డీడీ ఆర్.కృష్ణవేణి, గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో పి.త్రివిక్రమరావు, తహసీల్దార్ ఎన్.శేఖర్, ఎంఈవో బి.చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ ఎం.వెంకటరావు తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన శాసపు రమణ (59) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రమణ రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఉదయం 7.30గంటల సమయంలో విధులకు టీవీఎస్ ఎక్సెల్‌పై బయలుదేరాడు. పొగిరి పీహెచ్సీ ఎదురుగా వచ్చేసరికి కళ్లు తిరగడంతో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి 108 సహాయంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ పెద్దను కోల్పోయామని, తమకెవరు దిక్కని కుటుంబీకులు రోదించారు. మృతునికి భార్య సీతమ్మ, కుమారుడు చిరంజీవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుమారుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. కేరళలో కోన యువకుడు ఆత్మహత్య మక్కువ: మండలంలోని కోన గ్రామానికి చెందిన మడక గోవర్ధనరావు( 30) కేరళ రాష్ట్రంలో గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..గోవర్ధనరావు కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైందో తెలియదుగాని తాను అద్దెకుంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. గోవర్ధనరావు మృతి చెందాడన్న వార్త తెలిసిన తల్లిదండ్రులు రామకృష్ణ, చిన్నమ్మలు కన్నీరుమున్నీరయ్యారు. -
యథేచ్ఛగా పచ్చని జీడి చెట్ల నరికివేత
భామిని: మండలంలోని పచ్చని జీడి తోటలు నేలమట్టం అవుతున్నాయి. రైతులకు ఆదాయ వనరులు కల్పించే జీడిమామిడి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో కొందరు అక్రమార్కుల చేతిలో ఈ చెట్లు కలప దుంగలుగా మారుతున్నాయి. అనంతగిరి వద్ద జీడి తోటలను గురువారం నరికేసి అక్రమ రవాణా చేశారు. పచ్చని చెట్లు నరికివేతకు గురై వంట చెరకుగా తరలిపోతున్నాయి. వాల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. లారీలు, వ్యాన్లతో జీడి చెట్లను నరికివేసి కలప దుంగలుగా మార్చి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. మండలంలోని ఎక్కువగా బురుజోల, బిల్లుమడ గ్రామాల్లో జీడి తోటలు నేలమట్టం అవుతున్నాయి. శివాలయంలో చోరీ బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామంలో నగిరేశ్వర శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. భక్తులు కానుకలను సమర్పించే గుడిలోని హుండీని పగులగొట్టి సుమారు పదివేల రూపాయిల వరకు నగదు, ఇతర ఆభరణాలను దొంగలు కొల్లగొట్టినట్టు ఆలయ పూజారి కొండేటి చందు గురువారం గ్రామపెద్దలకు తెలియజేశారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికి ఇది మూడో సారి జరిగిన దొంగతనమని దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మరోమారు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు పోలీసులను కోరారు. సెల్ఫోన్ల దొంగ అరెస్టు విజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే పోలీసులు సెల్ఫోన్ల దొంగను గురువారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు మాట్లాడుతూ ఆర్పీఎఫ్ సిబ్బందితో రైల్వే ప్లాట్‌ఫాంలపై తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డారన్నారు. పట్టుకుని విచారిస్తే ఆ వ్యక్తి వద్ద నాలుగు సెల్ఫోన్లు ఉండటంతో తమదైన రీతిలో విచారించారు. దీంతో రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లను దొంగలించానని ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువ గల నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఘర్షణలో ఇద్దరికి గాయాలు
విజయనగరం క్రైమ్ : నగరంలోని పోలీసు కార్యాలయానికి సమీపంలో ఉన్న కంటోన్మెంట్ సమీపంలో ఉన్న ఓ బిర్యానీ పాయింట్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య గురువారం సాయంత్రం ఘర్షణ జరిగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. బిర్యానీ పాయింట్ వద్ద ఉమర్, నజీర్ అనే వ్యక్తుల మధ్య మసీదు అభివృద్ధి విషయమై వివాదం తలెత్తింది. అది కాస్త వారిద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. విషయం కంట్రోల్ రూమ్‌కు తెలియడంతో విజయనగరం వన్‌టౌన్ సీఐ ఆర్వీకే చౌదరి, ఎస్ఐలు రామ్‌గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వివాదం నేపథ్యంలో బిర్యానీ పాయింట్ వద్ద, మసీదు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
● కళ తప్పిన సచివాలయం
చిత్రంలో కనిపిస్తున్నది వేపాడ మండలంలోని నీలకంఠరాజపురం సచివాలయం. గతంలో ఇక్కడ 11 మంది సిబ్బంది విధులు నిర్వర్తించేవారు. వ్యవసాయ, సంక్షేమ, పశుసంవర్థక, రక్షక, సాంకేతిక, విద్యాసంబంధ, రెవెన్యూ, వైద్య తదితర సేవలు గ్రామస్తులకు అందేవి. ఇప్పుడు 11 పోస్టుల్లో ఆరు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రసూతి సెలవులో ఉండడంతో ముగ్గురు సిబ్బంది, ఒక పంచాయతీ కార్యదర్శి మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీఆర్ఏ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, రైతుసేవా కేంద్రంలో వీఏఏ, వీఈఏ, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శితో పాటు ఏఎన్ఎం, మహిళా పోలీస్, సర్వేయర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు పూనుకుందని, అందుకే సిబ్బంది సంఖ్యను తగ్గిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – వేపాడ -
● మూతపడిన మరో బడి
విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మూతపడగా, తాజాగా దత్తిరాజేరు మండలం వంగర పంచాయతీ మధుర గ్రామమైన ముద్దానపేట ప్రాథమిక పాఠశాలకు తాళంపడింది. సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో గతేడాది వరకు ఇద్దరు విద్యార్థులు (3వ తరగతి, ఒకటో తరగతి) చదివేవారు. వారు కూడా మూడురోజుల కిందట టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో పాఠవాలకు తాళం వేసినట్టు ఎంఈఓ–2 సుధాకర్ తెలిపారు. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడిని ఎమ్మార్సీకి పంపించామని, ఉపాధ్యాయులు సెలవు పెట్టిన చోట ఆయనను బోధనకు పంపిస్తామన్నారు. – దత్తిరాజేరు -
శ్రీరస్తు...శుభమస్తు..
విజయనగరం: శ్రావణ మాసం శుక్రవారం ఆరంభం కానుంది. మంచిరోజులు రావడంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగడంతో పాటు ఇతర శుభకార్యాలు జోరందుకోనున్నాయి. మే 24 నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు చేసుకునే వారు ఇప్పటివరకు నిరీక్షించారు. ఈ నెల 24తో ఆషాఢం ముగిసింది. 25 నుంచి శ్రావణం ప్రారంభం కానుండడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 4, 6, 10, 13, 15, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ మేరకు కల్యాణ మండపాలు, ఆలయాల ప్రాంగణాలను ముస్తాబు చేస్తున్నారు. అమ్మవారి వ్రతాలకు శుభసమయం పెళ్లిళ్లతో పాటు ఇళ్లలో నోములు, మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలకు శ్రావణమాసం శుభసమయం. ఇదే నెలలో అమ్మవార్లకు ఒడి బియ్యం సమర్పిస్తారు. మహిళలు అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధించే పూజల మాసమని దీనికి ప్రసిద్ధి. ఇంటినే దేవాలయంగా భావించి మామిడికొమ్మలతో అలంకరిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి వ్రతాలు ఆచరిస్తారు. చీరలు, నగలతో సుందరంగా అలంకరిస్తారు. అమ్మవార్లకు పసుపుకుంకుమలు సమర్పిస్తారు. వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉపవాసం చేస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వారికి మంచి కాలం ఇది... శ్రావణమాసం పలు వర్గాలకు సిరులు కురిపిస్తుంది. పెళ్లిళ్లకు అవసరమైన ఫంక్షన్ హాళ్లు, టెంట్లు, సౌండ్ సిస్టం, బ్యాండ్ పార్టీలు, పెళ్లిపందిళ్ల అలంకరణ వంటి వ్యాపారాలకు డిమాండ్ పెరుగనుంది. పత్రికలు, క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు డబ్బులు వచ్చేకాలం ఇది. ఆగస్టు 23 వరకు మంచి ముహూర్తాలు ఈ నెల 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం శుభకార్యాలు చేసుకునేందుకు యోగ్యమైనది. పెళ్లిళ్లు, కేశఖండనం, గృహ ప్రవేశాలు వంటివి జరుపుకోవచ్చు. ఈ మాసం శుభకరమైనది. – కామేశ్వరశర్మ, వేదపండితుడు – నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసం – నెలరోజుల పాటు పెళ్లిళ్లు, నోములు, వ్రతాలతో సందడే సందడి – పుంజుకోనున్న అనుబంధ వ్యాపారాలు -
అదును దాటుతున్నా.. అందని ఎరువు!
● బొండపల్లి మండలంలో 16 రైతు సేవా కేంద్రాలు ( రైతు భరోసా కేంద్రాలు) ఉన్నాయి. ఇందులో ఐదు రైతు సేవా కేంద్రాలకు ఎరువులు వచ్చాయి. మిగిలిన 11 ఆర్ఎస్కేలకు ఎరువులు సరఫరా కాలేదు. ● దత్తిరాజేరు మండలంలో 17 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్రాలకే ఎరువులు సరఫరా అయ్యాయి. మిగిలిన కేంద్రాలకు సరఫరాకాలేదు. రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. ● వంగర మండలంలో రైతు సేవా కేంద్రాలకు ఇంకా ఎరువులు చేకపోగా ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం దొరుకుతున్నాయి. ● మెంటాడ మండలంలో 19 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఏ రైతు సేవా కేంద్రానికి కూడా ఎరువులు రాలేదు. -
ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ...
రామభద్రపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయింది. ఇప్పటివరకు ఏ సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసిన దాఖాలా లేవు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు పథకాల అమలులో చేతులెత్తేస్తున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, అన్నదాతసుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాలు అటకెక్కగా.. భర్తలు కోల్పోయిన మహిళలను ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. పింఛన్ ఇస్తామని ఊరిస్తూ ఉసూరుమనిపిస్తోంది. దరఖాస్తు చేసి నెలలతరబడి ఎదురుచూస్తున్నా పింఛన్ డబ్బులు చేతికందని పరిస్థితి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్‌దారు మరణిస్తే వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీలో పింఛన్ మంజూరుకు అర్హులుగా నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా 3,419 మందికి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు మంజూరు చేశారు. వీరికి జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. అయితే, అనివార్యకాారణాలతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జూలై 1న పంపిణీ చేయాలని రూ.1,36,76,000 నిధులు విడుదలచేసినా లబ్ధిదారుల చేతికి అందలేదు. తిరగి ఆ నిధులను ప్రభుత్వం వెనుకకు తీసుకోవడంతో నిరాశ తప్పలేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అర్హత మేరకు ప్రతి ఆరునెలలకోసారి కొత్తపింఛన్లు మంజూరయ్యేవని, పింఛన్ డబ్బులు ఠంచన్‌గా అందేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకం అమలులోనూ కుతంత్రమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పింఛన్ డబ్బుల కోసం వితంతువుల ఎదురుచూపు జిల్లా వ్యాప్తంగా 3,419 మందికి మంజూరైన స్పౌజ్ పింఛన్లు జూలై నెలలో అందని డబ్బులు వచ్చేనెలా అందుతాయోలేదోనన్న బెంగ కూలికి వెళ్తున్నా.. భర్త మంగయ్య ఏడాదిన్నర కిందట చనిపోయాడు. పిల్లలు లేరు. ఒంటరిదాన్ని అయ్యాను. పింఛన్ ఇస్తామని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. ఆకలి తీర్చుకునేందుకు కూలికి వెళ్తున్నా. పింఛన్ వస్తే కాస్త ఆర్థిక భరోసా కలుగుతుంది. – పొగందర తవిటమ్మ, కొండకెంగువ త్వరలోనే పంపిణీ చేస్తాం.. స్పౌజ్ పింఛన్ల లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అనివార్య కారణాలతో మళ్లీ డేట్ ఇస్తామని పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఉన్నతాధికారుల ఆదేశానుశారం త్వరలోనే స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేస్తాం. – సీహెచ్ రత్నం, ఎంపీడీఓ, రామభద్రపురం -
మార్గదర్శుల కోసం బతిమలాట..!
● పేదోడి మెడకు ‘బంగారు’ ఉరితాడు ● పేదలను సంపన్నుల్ని చేయకుండానే..పీ 4 పేరుతో ‘సంక్షేమం’ కట్ ● సంక్షేమం ఇవ్వకుండా.. సంపన్నుల మోచేతి కింద పేదోడి బతుకులు ● ఇప్పటికే ప్రకటించిన 64 వేల కుటుంబాల గుర్తింపుపై మరో సర్వే ● మార్గదర్శులుగా చేరాలంటూ సంపన్నులపై జిల్లా యంత్రాంగం ఒత్తిళ్లు ● ముందుకొచ్చిన మార్గదర్శుల నమోదుపై అస్పష్టత విజయనగరం అర్బన్: పేదరికం లేని సమాజం నిర్మిస్తామనే హామీతో కూటమి ప్రభుత్వం రూపొందించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ (పీ 4) కార్యక్రమంలో మోసపూరిత ఆలోచనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల కోసం అట్టడుగున ఉన్న పేద కుటుంబాల గుర్తింపు సర్వే నుంచి వాళ్లను ఆదుకోవాల్సిన మార్గదర్శుల స్వచ్ఛంద నమోదు ప్రక్రియ వరకు జరుగుతున్న చర్యలన్నీ నాటకీయంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి.. గుర్తించిన కుటుంబాల ఎంపికలో పారదర్శకత లేదని మళ్లీ అందులో వడపోయాలని కాలయాపన కోసం తాజాగా నిర్ణయించింది. మరోవైపు పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శులు రావాలంటూ ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. కూటమి సర్కార్‌పై నమ్మకంలేని సంపన్నులు ముందుకు రావడం లేదు. నిజానికి ఉగాది నాటికే బంగారు కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చంద్రబాబు మాటలు పలికారు. ఉగాది వెళ్లి మూడు నెలలు గడిచినా అసలు బంగారు కుటుంబాల ఎంపికే పూర్తి కాలేదు. ● గుర్తించిన 64 వేల కుటుంబాలపై మరో సర్వే ఆదాయంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను అర్థికంగా వృద్ధి చెందిన 10 శాతం మంది (మార్గదర్శులు) ఆగస్టు 15 నాటికి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గడువు నాటికి బంగారు కుటుంబాలను గుర్తించేందుకు తొలిత జిల్లా వ్యాప్తంగా మార్చి 20 నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే చేశారు. సచివాలయ ఉద్యోగులు తమ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలను 27 అంశాల ప్రశ్నలు అడిగి సమాచారం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో 64,066 మందిని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను గుర్తించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని గుర్తించి తాజాగా మరోసారి క్షేత్ర స్థాయిలో సర్వే చేపడుతుంది. ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ఈ సర్వేలో నిరుపేదలుగా గుర్తించిన ఐదు అంశాలను ప్రమాణంగా తీసుకొని మరోసారి బంగారు కుటుంబాల జాబితాను విడుదల చేయనున్నారు. ● ముందుకొచ్చిన మార్గదర్శుల నమోదుపై అస్పష్టత జిల్లాలో చేపట్టిన సర్వే ద్వారా 20 శాతం నమోదైన 64,066 మంది బంగారు కుటుంబాలకు కనీసం 10 శాతం అంటే కనీసం 6,406 మంది మార్గదర్శకులు అవసరం ఉంటుంది. మార్గదర్శులను వెతకడం జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు కేవలం 2,321 మంది వరకే మార్గదర్శులుగా ముందుకు వచ్చినట్టు తాజా ఆన్లైన్ నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది పూర్తి అవగాహనతో నమోదు చేసుకోలేదని తెలుస్తుంది. మార్గదర్శులుగా ఎందుకు చేరాలో చేరిన తరువాత ఏం చేయాలో తెలియని వారున్నారని ఉద్యోగులే చెబుతున్నారు. ● ముందుకు రాని అధికార పార్టీ ప్రతినిధులు ఇప్పటికే 264 కుటుంబాలకు మంత్రి ప్రకటించిన విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గం పరిధిలో కేవలం 264 కుటుంబాలకే మంత్రి దత్తత తీసుకుంటే మిగిలిన కుటుంబాలు వ్యతిరేకత చూపవా అంటూ నియోజకవర్గ, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గదర్శకులుగా దత్తత తీసుకునే సామర్థ్యం ఉన్నా ముందుకు రావడానికి అధికార పార్టీ ప్రతినిధులు జంకుతున్నారని సమాచారం. దీంతో ఇంతవరకు నమోదైన మార్గదర్శులు జాబితాలో అధికార పార్టీ ప్రతినిధులు లేని పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు భాగస్వాముల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉందని కొందరు అధికారులే చెబుతున్నారు. సంపన్నులపై అధికారుల ఒత్తిళ్లు కూటమి ప్రభుత్వం అమలులోకి తెస్తున్న పీ–4 లక్ష్యాలు సాధించడంలో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల నుంచి వైద్యుల వరకు వివిధ వృత్తులు, వ్యాపార సంస్థల సంపన్న వర్గాలను మార్గదర్శులుగా నమోదు చేసుకోవాలని వాళ్లకు నేరుగా ఆదేశాలు పంపాలని కూటమి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. వాళ్ల చిరునామాలను సేకరించి ఇళ్లకు ఆదేశాలను జిల్లా యంత్రాంగం పంపుతుంది. ప్రభుత్వ వైఖరిపై నమ్మకం లేని సంపన్నులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే మార్గదర్శులుగా మారాలనే ఒత్తిడితో జిల్లా యంత్రాంగం సతమతమవుతుందని తెలుస్తుంది. -
ఏం అమ్మాలనుకుని ఎన్నికల్లో హామీలిచ్చారు..!
విజయనగరం: ఎన్నికలకు ముందు అధికార దాహంతో హమీలు గుప్పించిన కూటమి నేతలు నేడు వాటిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ వాఖ్యలు చేయటం సిగ్గుచేటని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అలాంటప్పుడు అమలుకు సాధ్యం కాని హమీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలను తప్పు పట్టారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఘోర వైఫల్యం చెందిందని వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ అరెస్టులు చేస్తోందని ధ్వజమెత్తారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. పాలన మరిచిన ప్రజాప్రతినిధులు రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరించి తన అనుకూల మీడియాతో అబద్దాన్ని నిజం చేసేలా విష ప్రచారం చేయించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమకు అనుకూలంగా లేని మీడియా ప్రసారాలను నిలిపివేసి అక్కసు వెల్లగక్కుతున్నారని దుమ్మెత్తిపోశారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై లిక్కర్ స్కామ్ పేరిట అక్రమంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యత గల అధికార పక్షంలో ఉన్న వారు పూర్తి ఆధారాలతో చర్యలు తీసుకోవాలే తప్పా తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేయటం సమంజసం కాదన్నారు. ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో చేపడుతున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలే వేదికగా నిలుస్తున్నాయని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలుపై ప్రశ్నిస్తే ప్రజలంతా తప్పు చేశామన్న భావనను వ్యక్తం చేస్తున్నారన్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు దిగ్విజయవంతంగా సాగుతున్నాయన్నారు. అధికార పక్షం చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొక్కుబడిగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు కనీసం రోడ్లపై కనిపించలేదని, ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఏడాదికే పోరుబాట పట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజల దృిష్టి మళ్లించేందుకు అక్రమ అరెస్టులు పాలన గాలికొదిలి రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపు చర్యలు జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరణ కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతాం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 నెలలు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛను మంజూరు చేయకపోవటంతో అర్హులైన లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదన్నారు. ఉన్న పాత పింఛన్లను సదరం రీ సర్వే పేరిట ఇబ్బందులు పెడుతున్నారని, 50 ఏళ్లకే పింఛను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉండే రైతన్న వెన్ను విరుస్తున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా అన్నదాత సుఖీభవ మంజూరు చేయకపోవటంతో రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో లేదని, దీనిపై ప్రజాప్రతినిధులు కనీసం సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పోరాటంతో అమలైన తల్లికి వందనం కార్యక్రమం కొందరికే జమ చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. రాజాంలో ఒక పాఠశాలలో 205 మంది విద్యార్థులుంటే వారిలో ఐదుగురికే ఆ పథకాన్ని వర్తింప జేయటంతో వారంతా అధికారులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. బాడంగి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వహిస్తూ వైద్యం కోసం వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదీ వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. పలు ఆసుపత్రుల్లో బెడ్లు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు నుంచి ముగ్గురు రోగులకు వైద్యం అందించే దీన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఒక్క ఏడాదిలో 9000 డ్రాపౌట్స్ ఉన్నాయంటే విద్యారంగం ఏ విధంగా నిర్వీర్యం అవుతుందో అవగతమవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, పార్టీ అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ పాల్గొన్నారు. -
బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: పేదరిక నిర్మూలనే పీ–4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి పారిశ్రామిక వేత్తలు మార్గదర్శులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పారిశ్రామిక వేత్తలు సీఎస్ఆర్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేశారని అన్నారు. ఇకనుంచి పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకొని, పేదరికం నుంచి వారు శాశ్వతంగా బయట పడే విధంగా చైతన్య పరచడం, అవసరమైన విద్య, ఇతరత్రా సహకారాన్ని అందించడం చేయాల్సి ఉంటుందన్నారు. బంగారు కుటుంబాల తుది జాబితాను తయారు చేసేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు మరోమారు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీపీవో పి.బాలాజీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కరుణాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరి
విజయనగరం అర్బన్: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా విద్యార్థులకు అవగాహన తప్పనిసరి అని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అన్నారు. స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘మీరు కార్పొరేట్‌కు సిద్ధంగా ఎలా మారగలరు..?’ అనే అంశంపై బుధవారం జరిగిన ఒక రోజు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలిత సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాల అందిపుచ్చుకోవడానికి లెర్నింగ్, అన్‌లెర్నింగ్, రీలెర్నింగ్ వంటి ధోరణి కీలకమని పేర్కొన్నారు. కార్పొరేట్ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఎంతో ముఖ్యమని, విద్యార్థులు తమ నైపుణ్యాలను కంపెనీల అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాలని సూచించారు. రీసోర్స్‌పర్సన్‌గా అసోసియేట్ డైరెక్టర్ (లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్) ఎ.సెంతిల్‌కుమార్ కార్పొరేట్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పరిచారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ నాగేష్.ఎం, అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన మూడవ సెమిస్టర్ ఎంబీఏ విద్యార్థి నానిబాబు మరియు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ మూడవ సెమిస్టర్ విద్యార్థిని సింధుప్రియ, యూజీసీ సెట్ అర్హత సాధించిన విద్యార్థులను అభినందించారు. -
కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం
బొబ్బిలి: పట్టణంలోని పలు మున్సిపల్ పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా కుళ్లిన కోడిగుడ్ల సరఫరా జరుగుతోంది. బుధవారం కూడా కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్లు లేకుండానే మధ్యాహ్న భోజనం పెట్టారు. దీంతో విద్యార్థులు నిరుత్సాహం చెందారు. పట్టణంలోని తాండ్ర పాపారాయ ప్రాధమిక పాఠశాల, జయప్రకాష్ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలకు సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయాయి. వారానికి నాలుగు రోజుల పాటు గుడ్లు సరఫరా చేయాల్సి ఉండగా ప్రతీసారి కలర్ కోడ్‌తో గుడ్లు ఇస్తుంటారు. అయితే గత నాలుగు రోజులుగా తాండ్ర పాపారాయ పాఠశాలలో 24 మంది విద్యార్థులకు కనీసం నాలుగుకు తగ్గకుండా గుడ్లు కుళ్లిపోతున్నాయని ఉపాధ్యాయురాలు కె.శాంతి తెలిపారు. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 79 మంది విద్యార్థులకు 64 మంది హాజరు కాగా అన్ని గుడ్లూ కుళ్లిపోయినట్టు హెచ్ఎం సీహెచ్ మోహనరావు, భోజన నిర్వాహకులు పెట్ల విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి తెలిపారు. కుళ్లిపోయి నల్లగా మారిన ఈ గుడ్లను విద్యార్థులకు పెట్టవద్దని పారబోయాలని హెచ్ఎం ఆదేశించడంతో విద్యార్థులకు పప్పన్నం, కొన్ని పాఠశాలల్లో ప్లెయిన్ బిర్యానీ పెట్టారు. మండలంలోని మెట్టవలసలో కూడా కోడి గుడ్లు కుళ్లిపోయినట్టు విద్యాశాఖాధికారులకు సమాచారం వచ్చింది. ఇలా నిత్యం విద్యార్థుల సంఖ్యను బట్టి పది నుంచి 50 వరకూ గుడ్ల వరకూ కుళ్లి పోతున్నాయని, ఫొటోలు అప్లోడ్ చేస్తున్నట్టు ఆయా పాఠశాలల సిబ్బంది చెప్పారు. ఈ సంఘటనపై ఎంఈవో గొట్టాపు వాసును వివరణ కోరగా కుళ్లిన గుడ్ల స్థానంలో మళ్లీ గుడ్లు ఇస్తారని తెలిపారు. మరి గుడ్లు మళ్లీ ఇచ్చాక విద్యార్థులకు పాత వాటితో కలిపి రెండేసి గుడ్లు ఇస్తారేమో చూడాలి! మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన అవస్థలు -
అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు
● జిల్లాలో 2499 కేంద్రాలు ● వాటిలో మినీ కేంద్రాలు 293 ● ఏడాదికి అద్దె రూపేణా రూ.6 కోట్ల చెల్లింపుత్వరగా పూర్తయ్యేలా చర్యలు అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత సీడీపీఓలను కూడా పర్యవేక్షించాలని చెప్పాం. త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. – టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రం భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. భవనాలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల అంగన్వాడీలకు సొంత గూడు కరువవుతోంది. దీంతో అద్దె భవనాల్లోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాల్సిన పరిస్థితి. వివిధ పథకాల కింద జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరైనప్పటికీ వాటి నిర్మాణం పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా అంగన్వాడీలకు తిప్పలు తప్పడం లేదు. వసతులు లేక, ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నిర్వహించాల్సిన దుస్థితి. దీనివల్ల కేంద్రాల్లో చదివే పిల్లలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 2499 కేంద్రాలు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 2206 మెయిన్ కేంద్రాలు , 293 మినీ కేంద్రాలు. వాటిలో సొంత భవనాల్లో నడుస్తున్న కేంద్రాలు 792 ఉన్నాయి. అద్దె రహిత భవనాల్లో 494 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో 1213 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె కేంద్రాలు కూడా ఇరుకుగా ఉండడంతో పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందడం లేదు. ఏడాదికి రూ.6 కోట్ల అద్దె చెల్లింపు జిల్లాలోని అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలకు ఏడాదికి కోట్లాది రుపాయలు అద్దె చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు అద్దె రూ.2 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు ఏడాదికి వాటికి సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అవుతోంది. సొంత భవనాలు మంజూరైనప్పటికీ అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ పథకాల కింద 919 కేంద్రాలకు భవనాలు జిల్లాలో వివిధ పథకాల కింద 919 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయి. వాటిలో 364 భవనాల నిర్మాణం పూర్తయింది. 262 భవనాలకు ఇంకా పునాది రాయి పడలేదు. 288 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఉపాధి హామీపథకం –1, 2 కింద భవనాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.7.50 లక్షలు, ఆర్డీఎఫ్ కింద ఒక్కో భవనానికి రూ.12 లక్షలు, ఆర్ఐడీఎఫ్–23 పథకం కింద ఒక్కో భవనానికి రూ.11.20 లక్షలు, ఆర్ఐడీఎఫ్–24 కింద ఒక్కో భవనానికి రూ.12 లక్షలు ఎంబీఎంబీ పథకం కింద ఒక్కో భవనానికి రూ. 16 లక్షలు చొప్పన మంజూరయ్యాయి. -
పోగొట్టుకున్న బ్యాగ్ లభ్యం
విజయనగరం క్రైమ్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్ పోయిందని వన్‌టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనతికాలంలోనే ట్రేస్ చేసి ఆ బ్యాగ్ ను బాధితురాలికి పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన పల్లెం లక్ష్మి తన కుమార్తెను చూసేందుకు బుధవారం విజయనగరం వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో ఎక్కి, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద దిగిపోయింది. తరువాత ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి, వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బంది ఆటోను ట్రేస్ చేసి ఆటోలో లభించిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో ఉన్న రెండున్నర తులాల నల్ల పూసల తాడు, రూ.1300 నగదుతో బాధితురాలు లక్ష్మికి సీఐ అప్పగించారు. బాధితురాలికి అందజేసిన పోలీసులు -
పెంచిన సినిమా టికెట్ ధరలు తగ్గించాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం హర హర వీరమల్లు సినిమా కోసం టికెట్ ధరలు పెంచుతూ తీసుకున్న ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సామాన్యులకు అన్నింటా అధిక ధరల పెంపుతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం చివరికి వినోదం కోసం సినిమా వీక్షించేందుకు థియేటర్లకు వెళ్లినా వదలడం లేదన్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు బెనిఫిట్ షో పేరుతో రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేయడం దారుణమన్నారు. బెనిఫిట్ షో పేరుతో ప్రేక్షకులను దోపిడీ చేసే విధానాన్ని అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న -
పిడుగుపాటుతో రైతు మృతి
రేగిడి: రేగిడి మండల పరిధిలోని జాడపేట గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన రైతు అల్లబోయిన శ్రీను (50) మృతిచెందాడు. తన పొలంలో తోటి రైతులతో కలిసి నారు తీస్తున్న సమయంలో ఆయన భార్య నీలవేణి పనులు చేస్తున్న రైతులకు భోజనాలు తీసుకువెళ్లింది. నారు తీసిన అల్లబోయిన శ్రీనుతోపాటు మిగిలిన రైతులు భోజనాలు చేసుకునేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపడింది. దీంతో సంఘటనా స్థలంలోనే శ్రీను మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. పక్కనే ఉన్న రైతులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పరిసరాల్లోని రైతులు ఘటనా స్థలానికి వచ్చి అస్వస్థతకు గురైనవారికి సపర్యలు చేశారు. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.నీలావతి విలేకరులకు తెలిపారు. మరో గ్రామంలో ఆవు.. గుర్ల: మండలంలోని కోటగండ్రేడులో బుధవారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో పాటు పాటు పిడుగులు పడడంతో అదే గ్రామానికి చెందిన ముద్దాడ అప్పలనాయుడి ఆవు మృతి చెందింది. పశువుల శాల పక్కన చెట్టు వద్ద ఉన్న ఆవుపై పిడుగు పడి మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. -
పీ 4 పేరుతో ‘సంక్షేమం’ కట్
పేదల్ని సంపన్నుల్ని చేస్తానంటే అమాయకులైన పేదలు నమ్మి ఐదేళ్లుగా సంక్షేమ పథకాలిచ్చి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపరిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాకుండా చంద్రబాబును గెలిపించారు. మహిళా లోకానికి ‘ఆడబిడ్డ నిధి’ని ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకూ నెలకు రూ.1,500 ఇస్తామనడం నుంచి 50 ఏళ్ల మహిళలకు పింఛన్, నిరుద్యోగ భృతి, పొదుపు సంఘాల ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలను ఈ పీ–4 కార్యక్రమానికి జోడించినట్టు చంద్రబాబు ప్రకటించారు. సంపన్నులను చేయడం అంటే ఉన్న సంక్షేమ పథకాలను కత్తిరించి సంపన్నుల మోచేతి కింద బతకడం అని నిరుపేదలకు స్పష్టత ఏర్పడింది. దీంతో ప్రజల నుంచి క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. -
తిరుపతిలో విజయనగరం కళాకారుల ఖ్యాతి
విజయనగరం టౌన్: అభినయ ఆర్ట్స్ అసోసియేషన్ తిరుపతిలో నిర్వహించిన 25వ వార్షిక జాతీయ పద్యనాటకంలో విజయనగరం జిల్లాకు చెందిన శ్రీ శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సత్యానందం నిర్వహణలో ఈపు విజయకుమార్ దర్శకత్వంలో 25 మంది నటీనటులు ఆదికవి నన్నయభట్టు పద్యనాట కాన్ని మహతి ఆడిటోరియంలో ప్రదర్శించి ఆహూతుల మన్ననలు పొందారు. నన్నయ్యగా కె.సూర్యనారాయణ, నారాయణ భట్టుగా సుబ్రహ్మణ్యం, సోమిదమ్మగా పద్మ, రాజరాజనరేంద్రుడిగా సత్యం మాస్టారు, డిండిమభట్టుగా నల్ల శివరాంనాయు డు, దుర్యోధనుడిగా తిరుపతినాయుడు, శకునిగా లింగరాజు, విదురుడుగా రమణారావు, దృతరాష్ట్రుడిగా కృష్ణ గణేష్, సేనాధిపతిగా ఆర్.సూర్యపాత్రో, సామంత రాజుగా ఎల్. వెంకటేశ్వర్లు, వార్తాహరుడిగా పైడినాయుడు, వేద వ్యాసుడిగా వీవీఎస్.ఎస్. గుప్త, భటుడిగా కోండ్రు కృష్ణారావు, సంగీతం త్రినాథ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టీమ్‌ను దుశ్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
30 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎంఆర్ లాడ్జి ఎదురుగా ముగ్గురు వ్యక్తులు 30 కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు వన్ టౌన్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22న వన్ టౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో రైల్వేస్టేషన్ రోడ్డులో మాటు వేసి ఉండగా, ముగ్గురు వ్యక్తులు రెండు ట్రాలీ సూట్ కేసులను తోసుకుంటూ ఎంఆర్ లాడ్జి ఎదురుగా వచ్చేసరికి, అనుమానంతో వన్ టౌన్ పోలీసులు సోదా చేశారన్నారు. ఒక ట్రాలీ సూట్ కేసులో 13కిలోలు, మరో సూట్ కేసులో 17కిలోల గంజాయి, నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు కీ ప్యాడ్ ఫోన్లు, రూ.4000 నగదు లభించినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులను (ఎ1) ఒడిశాలోని కలహండి జిల్లా ఉచ్చలకు చెందిన పితాంబర్ నాగ్ (42) (ఎ2) కలహండి జిల్లా బిరుమలకు చెందిన చంద్ర కరుణ్ (35) (ఎ3) చార్బహల్కు చెందిన ప్రదీప్ నాయక్ (40)లుగా గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామని తెలిపారు. -
ప్రాక్టికల్ శిక్షణకు పదిమంది ఎస్సైలు
పార్వతీపురం రూరల్: ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సివిల్ ఎస్సైలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు పది మందిని కేటాయించినట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న 49 మంది ఎస్సైలు ఐదు నెలల ప్రాక్టికల్ శిక్షణకు వెళ్లేముందు బుధవారం విశాఖలో డీఐజీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ వారితో మాట్లాడుతూ పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, సేవా తత్పరత అత్యంత ముఖ్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం సాధన, పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో విధులు, రికార్డులు, స్థానిక చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సహచర ఉద్యోగులు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు ఏర్పరిచినప్పుడు సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడితో పాటు ఏఎస్ఆర్, విజయనగరం జిల్లాల ఎస్పీలు మరికొందరు అధికారులు, ప్రొబేషనరీ ఎస్సైలు పాల్గొన్నారు. -
మా భూములు మాకివ్వండి
శృంగవరపుకోట: జిందాల్ కర్మాగారం అన్యాయం చేసిన రైతులను ఆదుకోవాలని కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ ఇ.మురళిని జిందాల్ నిర్వాసిత రైతులు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. దీంతో జిందాల్ నిర్వాసితులు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్ మురళిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు కంపెనీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలిస్తాం. ఉపాధి కల్పిస్తాం. పరిహారం ఇస్తాం. షేర్లు ఇస్తాం. కంపెనీలో వాటాలు ఇస్తామని నమ్మబలికి భూములు కాజేశారన్నారు. 18యేళ్లయినా కంపెనీ ఏర్పాటు చేయనందున మా భూములు మాకు ఇవ్వండని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మిషన్లు తెచ్చి, చెట్లు కూల్చేసి, పంటలు తీసేసి దౌర్జన్యంతో ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జిందాల్‌కు కాపలా కాస్తూ, మాపై కేసులు పెడుతున్నారని వాపోయారు. మా భూములు మాకు ఇచ్చి న్యాయం చేయండి అంటూ డిప్యూటీ కలెక్టర్ మురళికి వినతిపత్రం అందజేశారు. జిందాల్ నిర్వాసిత రైతుల డిమాండ్ -
ఆదర్శ పాఠశాలలో పురుగుల బియ్యం మార్పు
దత్తిరాజేరు: మండలంలోని షికారుగంజి ఆదర్శ పాఠశాలకు వచ్చిన పురుగుల బియ్యంపై బుధవారం సాక్షిలో వచ్చిన కథనంపై పౌర సరపరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శాంతి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మహేష్ వచ్చి బియ్యాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే బియ్యాన్ని వ్యాన్‌లోకి ఎక్కించి కొత్తగా 25 కేజీల బియ్యం ప్యాకెట్లను 32 బస్తాలను ప్రిన్స్‌పాల్ ఈశ్వరావుకు అందజేశారు. ఇలాంటి పొరప్లాట్లు ఇంకెక్కడా జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించనున్నట్లు ఆయన సాక్షితో అన్నారు.పత్రికలో వచ్చిన కథనంతో పురుగుల బియ్యం మార్చి మంచి బియ్యం పాఠశాలకు అందజేయడంతో విద్యార్థులు, తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వీఆర్ఏల వేతన యాతన
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమ వేతనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సి ఉన్నా ఇప్పటి దాకా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్థాయిలో అది విజయవంతం కావాలంటే దానికి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ)లే కీలకంగా ఉంటారు. కలెక్టర్ నుంచి గ్రామ స్ధాయి వీఆర్వో వరకు ఏ పని జరగాలన్నా దానికి కావాల్సింది వీఆర్ఏలే. రాత్రీపగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలు వేస్తే మారు మాట్లాడకుండా ఎంత దూరాభారమైనా వెళ్లి రావాల్సిందే తప్ప..ఇదేంటి అని అడిగే అధికారం ఉండదని వీఆర్ఏలు అంటున్నారు. టైం జాబ్‌గా ప్రారంభమై ఇప్పుడు సమయమే లేని ఉద్యోగంగా తయారైంది. ఎప్పుడు పిలిచినా రావాలి. ఏం చెప్పినా చేయాలనే చందాన అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రోజుకు రూ.370 భత్యంతో నెలకు రూ.10,000 నుంచి రూ.11,085 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.పేస్కేల్ అమలు చేసి ప్రతి నెలా రూ.18,000 జీతం ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సిబ్బంది తక్కువ పని ఎక్కువ.. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో వీఆర్ఏల కొరత తీవ్రంగా ఉంది. మండలానికి కనీసం 45 మంది వీఆర్ఏలు ఉండాల్సి ఉండగా కేవలం 20 నుంచి 35 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 415 మంది వీఆర్ఏలు ఉండగా సుమారు 100 రెవెన్యూ గ్రామాల్లో వీఆర్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రీ–సర్వే, రేషన్ కార్డుల సర్వే, రెవెన్యూ కార్యక్రమాలు ఇతర ఏరకమైన పనులు ఉన్నా వారితోనే చేయించడంతో తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. తమ పని తాము చేసుకోవడమే చాలా కష్టంగా ఉందని ఇప్పడు రీ–సర్వే పేరుతో ఇతర గ్రామాలకు కూడా పంపించి పని చేయిస్తున్నారని దానివల్ల మాకు కనీస ప్రతిఫలం లేదని వాపోతున్నారు. మంత్రి లోకేష్‌కు వినతి పత్రం ఇచ్చినా.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ఆనాటి కూటమి నాయకుల వాగ్దానాలు నమ్మి మోసపోయామని వీఆర్ఏలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు పెంచాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్ఏల సంఘం నాయకులు మంత్రి నారా లోకేష్‌ను ఒకసారి కలిసి తమ సమస్యలు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ప్రమోషన్లు ఇవ్వాలి కూటమి ప్రభుత్వంలో మాకు తగిన గుర్తింపు ఇవ్వాలి. వీఆర్ఏలుగా ఎన్నో ఏళ్ల సీనియారిటీ కలిగిన వారిని గుర్తించి ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలి. డీఏలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. చాలీచాలని జీతంతో కుటుంబం గడవాలంటే కష్టంగా ఉంది. ఇప్పటికై నా మా జీతాలు పెంచాలి. – జి.జగన్, వీఆర్ఏ, కంబర కూటమి వచ్చి ఏడాదైనా జీతాలు పెంచలేదని ఆవేదన -
ఆందోళనలో రైతులు
అర్ధన్నపాలెం, వీరభద్రపురం, చింతలపాలెం గ్రామాల్లో కొండపోరంబోకు భూములు ఉన్నాయి. ఆ భూములు ప్రస్తుతం రైతుల సాగులో ఉన్నాయి. పెదరావుపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 48 నుంచి 62 వరకు ఉన్న భూముల్లో సుమారు 60 మంది రైతులు తమ పూర్వీకులనుంచి మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఈ తోటలపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని 1986 సంవత్సరంలో రైతులు ఎస్.కోట కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా 1996లో తీర్పువచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2016లో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022లో గ్రామంలో సమగ్ర రీ సర్వే నిర్వహించి రైతులందరికీ డీ పట్టాలను అందజేసింది. రైతులకు శాశ్వత హక్కులను కల్పిస్తూ పట్టాదారు పుస్తకాలను కూడా జారీచేసింది. -
అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేయండి
● జేసీ సేతు మాధవన్ విజయగనరం అర్బన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. అగ్రిగోల్డు భూములకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ చాంబర్లో మంగళవారం జరిగింది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, విజయనగరం మండలాల్లో ఉన్న అగ్రిగోల్డు సంస్థ ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే, భౌతిక పరిశీలనపై ఆరా తీశారు. మర్కెట్ విలువను లెక్కించి ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్‌కు సూచించారు. బుధవారం సాయంత్రంలోగా వ్యవసాయ భూముల మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూముల మ్యుటేషన్ పూర్తయిన తరువాత వేలం వేస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీఐడీ డీఎస్పీ ఎం.ఎన్.భూపాల్, నాలుగు మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల ప్రతినిధులు, సీఐడీ ఇన్స్పెక్టర్లు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ సేవలను మరింత చేరువ చేస్తాం ● ఎస్పీ వకుల్ జిందల్ గంట్యాడ: పోలీస్ సేవలను మరింత చేరువచేసేందుకు పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటుచేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలీస్ అవుట్ పోస్టును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కల్పించడం కోసం అవుట్ పోస్టును ప్రారంభించామన్నారు. తాటిపూడి జలాశయం చూసేందుకు, బోటింగ్‌కు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఈ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జలాశయంలో బోటింగ్‌కు వెళ్లే సమయంలో టూరిస్టులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్‌ను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్ఐ డి.సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అంతిమ యాతన..! వేపాడ: మండలంలో వీలుపర్తి గ్రామంలో కొన్ని కులాలకు కేటాయించిన శ్మశానానికి వర్షాకాలంలో వెళ్లాలంటే నరకయాతన తప్పదు. గ్రామానికి చెందిన గుమ్మలగోవింద అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు. మృతదేహాన్ని తరలించేందుకు రోడ్డు మార్గంలేకపోవడంతో కనుమలచెరువులో నడుంలోతు నీటిలో దిగి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి శ్మశానానికి రోడ్డు సదుపాయం కల్పించాలని గుమ్మాల రమణ, లక్ష్మణ తదితరులు కోరారు.