breaking news
SPSR Nellore
-
వ్యవసాయం చేసే రైతులకే అన్నదాత సుఖీభవ
కోవూరు: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే సాయం అందిస్తున్నట్లు, జిల్లాలో 1,95,866 మందికి రూ.131.6 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం కోవూరులోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా కారణంగా లబ్ధి పొందని రైతులు ఆగస్టు 3 నుంచి నిర్వహించనున్న గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే లబ్ధి పొందవచ్చు అన్నారు. రెండు కారణాలతో లబ్ధి చేకూరని పరిస్థితి ఉందన్నారు. ఒకటి బ్యాంకు ఆధార్ లింకు లేకపోవడం, సరైన వివరాలు ఆన్లైన్లో దరఖాస్తు చేయకపోవడమే కారణమన్నారు. సాగు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్ కార్డులు) కలిగిన వారికి రబీ సీజన్లో తొలి విడతగా రూ.10 వేలు, ఖరీఫ్ సీజన్లో రూ.10 వేల చెల్లిస్తామని తెలిపారు. జిల్లాలో యాక్టివ్‌గా లేని అకౌంట్ ఉన్న వాళ్లు 4000 మంది, ఆధార్ లింకేజీ కాని వాళ్లు 2 వేల మంది ఉన్నారని, వీరంతా వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు మొదలైనవి అందజేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ మూడు నెలలుగా వ్యవసాయ అనుబంధ శాఖలు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. 27 వేల మంది చనిపోయిన రైతులు, రాంగ్ సీడింగ్ చేసిన రైతులు 18 వేల మంది ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ ఐ.మురళి, వ్యవసాయశాఖ ఏడీఏ అనిత, తహసీల్దార్ సీహెచ్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, ఏఓ రజని, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ వై.విజయ, అమరావతి, బుచ్చి మున్సిపల్ చైర్మన్ సుప్రజ, వివిధ రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 1,95,866 మందికే లబ్ధి కలెక్టర్ ఓ ఆనంద్ -
డీఎంహెచ్ఓ పేరిట మెసేజ్‌లు
సీహెచ్‌ఓలపై తీవ్ర ఒత్తిడి వైద్యులుపేదరికం నిర్మూలన పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్) ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించింది. సమాజంలోని ధనవంతులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా పరిపుష్టి చేసి బంగారు కుటుంబాలుగా మార్చాలన్నదే ఈ పీ4 ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని ముందుగా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అఽధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ పథకానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికార వర్గాల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో ప్రతి శాఖ అధికారికి టార్గెట్లు ఇచ్చి ప్రతి ఉద్యోగి రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఉద్యోగం కావాలంటే పీ4 చేయండి...● పీ4 పథకాన్ని అమలు చేయాలని తీవ్ర ఒత్తిడి ● ఒక్కొక్కరూ రెండేసి కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు ● డీఎంహెచ్ఓ పేరిట గ్రూపుల్లో మెసేజ్‌లు ● లేదంటే ఉద్యోగాలు కష్టమంటూ హెచ్చరికలు నెల్లూరు (అర్బన్): అధికారంలోకి రావడానికి కూటమి అధినేత చంద్రబాబు అలవికాని అమలు ఇచ్చారు. నిరుపేదలను ఆర్థికంగా సంపన్నులను చేస్తానంటూ ‘పూర్ టు రిచ్’ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ఈ ప్రణాళికను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల డబ్బులతో అమలు చేసే ఎత్తుగడ వేశారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ విధానంలో దాతల సొమ్ముతో ప్రభుత్వ ప్రచారానికి తెర తీశారు. వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, జేసీ, డీఆర్వో, డీఎంహెచ్ఓ, ఇతర జిల్లా స్థాయి అఽధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. అయితే వీరు ముఖం చాటేయడంతో నెల జీతంపై ఆధారపడి బతికే చిరు ఉద్యోగుల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరికి టార్గెట్ విధించి మెడపై కత్తి పెట్టారు. భారమంతా ఉద్యోగులపైనే వేస్తున్నారు. వైద్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో సీహెచ్‌ఓలుగా (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ లేదా ఎంహెల్హెచ్పీలు) పనిచేస్తున్న చిన్న ఉద్యోగులను ఆన్లైన్లో ముందుగా పీ4 రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వైద్యశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరును సీహెచ్‌ఓలు తీవ్రంగా నిరసిస్తున్నారు. డీఎంహెచ్ఓ శుక్రవారం నిర్వహించిన కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో మాత్రం పీ4 అనేది స్వచ్ఛందంగా జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలంటూ కూడా తెలిపారు. అయితే ఆచరణలో పెద్దలెవరూ పీ4కి ముందుకు రాలేదు. దీంతో వైద్యశాఖలోని చిన్న ఉద్యోగులపై బలవంతపు పీ4 రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఉండగా.. కూటమి పార్టీల్లో రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంపైగా ఊరూరా ఆ పార్టీల నేతలు ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం, పేకాట, కోళ్ల పందేలు, అక్రమ వ్యాపారాలతో రూ.కోట్ల సంపాదించారు. వీరందరిని వదిలేసి తమ వంటి చిరు ఉద్యోగులపై భారం పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో 496 సీహెచ్ఓ పోస్టులున్నాయి. వీటిలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో 476 మంది పని చేస్తున్నారు. వీరి జీతం కేవలం రూ.25 వేలు మాత్రమే. ఈ జీతంలోనే విలేజ్ హెల్త్ క్లినిక్‌కు ఉన్న ప్రాంతం నుంచి చార్జీలు భరించాలి. వైద్యశాఖ నుంచి మందులు, ఇతరత్రా సామగ్రి తరలించేందుకు జేబులో నుంచే రవాణా ఖర్చు భరించాలి. బీఎస్సీ నర్సింగ్ వంటి ఉన్నత కోర్సులు చదివి ఎన్నో ఆశలతో వైద్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వీరికి చివరకు నెలంతా కష్టపడితే ఖర్చులు పోను రూ.20 వేలు వరకు మాత్రమే మిగులుతోంది. అలాంటి చిన్న ఉద్యోగులను పీ4 కింద రిజిస్ట్రేషన్ చేయించుకుని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ రెండు రోజుల నుంచి మెడికల్ ఆఫీసర్లు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. డీఎంహెచ్ఓ పేరిట జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు వైద్యశాఖ గ్రూపులో సీహెచ్ఓలకు టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు వాట్సాప్ గ్రూపులో పంపారు. శనివారం సాయంత్రం లోపు ఒక్కో సీహెచ్ఓ రెండు కుటుంబాలను దత్తత తీసుకుంటూ ఆన్లైన్లో పీ4 రిజిస్ట్రేషన్ తీసుకోవాలని సూచించారు. ఇది డీఎంహెచ్ఓ ఆదేశాలంటూ పేర్కొన్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోని వారందరూ ఇబ్బంది పడుతారంటూ ఓరల్‌గా హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులను, ప్రభుత్వ తీరును తిట్టుకుంటూ ఇప్పటికే పలువురు తమ పేర్లను పీ4 కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్దలను వదిలేసి తమను బలి చేయడమేంటని సీహెచ్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చెడు వ్యసనాలకు యువత బానిస
● మత్తులో నెల్లూరులో హత్యలు మితిమీరుతున్నాయి ● రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం నెల్లూరు (వీఆర్సీసెంటర్): దేశంలో యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్‌ను, జీవితాన్ని కోల్పోతున్నారని కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఏఏ రహీం ఆందోళన వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ వద్దు–ఆరోగ్యం ముద్దు’, ‘డ్రగ్స్ అంతం డీవైఎఫ్ఐ పంతం’ నినాదాలతో శనివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత అయ్యప్పగుడి సెంటర్ నుంచి వేదాయపాళెం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ అంధ్రప్రదేశ్‌లో చెడు వ్యసనాలకు, డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న యువత ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో యువత మత్తులో ఉంటూ ఏమి చేస్తున్నారో కూడా అర్థంకాక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు నాయకులు యువతను ప్రధాన శక్తిగా వాడుకుంటూ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా జరిగే మద్యం అమ్మకాలను అరికట్టాలని, గంజాయి, డ్రగ్స్‌ను నివారించేందుకు అధికార యంత్రాగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నెల్లూరు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, శశి, సీపీఎం సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, కట్టా సతీష్ పాల్గొన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సు నెల్లూరు (లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే వాణి ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ న్యాయ సేవాధికార సంస్థ ప్రయోజనాలను, లక్ష్యాలను వివరించారు. వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న గండిపోయిన దివ్య తన ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తూ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అర్జీ పెట్టుకుంది. తన విద్యకు ల్యాప్‌టాప్ అవసరమని, తనకు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని పేర్కొంది. ఈ విషయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. ఆయన మానవతా దృక్పథంతో కావలి విశిష్ట కాలేజీ కరస్పాండెంట్ సుధాకర్ ద్వారా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయించి, న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ విద్యార్థినికి బహూకరించారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యప్ప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ ఆపకపోతే ప్రాణత్యాగానికై నా సిద్ధం
వరికుంటపాడు/ఉదయగిరి: వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన మైనింగ్ అనుమతులు ఆపకపోతే తాము ప్రాణత్యాగానికై నా సిద్ధమంటూ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు. మైనింగ్‌తో ఈ ప్రాంతానికి జరిగే అనర్థాలపై ప్రజల మద్దతు కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో వాల్‌పోస్టర్లు, ప్లకార్డులతో వరికుంటపాడు ప్రధాన రహదారిలో అవగాహనా ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీని ఎస్సీ కాలనీ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటలపాటు ఆందోళనకారులను కదలనీయకుండా పోలీసులు అటకాయించడంతో వాగ్వాదానికి దిగి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులు పోలీసులను నెట్టుకుంటూ ముందుకు పరుగులు తీసి గ్రామ ముఖద్వారం వరకు చేరుకుని జాతీయ రహదారిపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను జాతీయ రహదారిపైకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు,పోలీసుల మధ్య పలుమార్లు తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్తితి తీవ్రం కావడంతో పరిస్థితి ఎలా పరిణమిస్తుందోనన్న భయాందోళన స్థానికుల్లో కనిపించింది. పరిస్థితి అదుపుదాటుతుండటంతో ఉదయగిరి సీఐ కె.వెంకట్రావు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. జేఏసీ కన్వీనరు, గ్రామసర్పంచ్ దిలీప్‌కుమార్ ఘాటుగా స్పందిస్తూ శాంతియుత ర్యాలీని అడ్డుకునే హక్కు మీకు ఎవరు కల్పించారని పోలీసుల్ని నిలదీశారు. ప్రజలను చైతన్యం చేసేందుకు తాము చేస్తున్న పోరాటాన్ని పోలీసులు హింసాత్మక ఘటనగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మా ప్రాణాలు పోతున్నా మీకు పట్టవా.. ఎవరి ప్రయోజనాలు ఆశించి మమ్మల్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా తమ పోరాటం ఆగదని, మైనింగ్ రద్దు చేయకపోతే తమ శవాలపై నడిచి మైనింగ్ చేసుకోవాలని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తారన్న సమాచారంతో వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి ఎస్సైలు రఘునాథ్, ఆదిలక్ష్మి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను జాతీయ రహదారి ప్రధాన కూడళ్ల వద్ద పహారా పెట్టారు. అయినా ఆందోళనకారులు లెక్క చేయకుండా గ్రామంలో ర్యాలీ చేపట్టి అనంతరం జాతీయ రహదారి వద్దకు చేరుకునే ప్రయత్నంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అనంతరం జేఏసీ కన్వీ నర్ దిలీప్‌కుమార్, నాయకులు ఆండ్రా పరంధామిరెడ్డి, షేక్ పీరయ్య, సరాబు లక్ష్మీనారాయణ, సుంకర రాధాకృష్ణ, తదితరులను సీఐ వెంకట్రావు స్టేషన్‌కు పిలిపించి మరోసారి ఆందోళన కార్యక్రమాలు చేపడితే కేసులు పెడతామని తీవ్రంగా హెచ్చరించారు. అయితే దీనివెనుక టీడీపీకి చెందిన కొంత మంది నేతలు తెరవెనుక ఉండి ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు ఆందోళన చేస్తున్న గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు -
పొదలకూరు నిమ్మ ధరలు
పెద్దవి : రూ.24 సన్నవి : రూ.15 పండ్లు : రూ.5 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ : రూ.114 లేయర్ : రూ.112 బ్రాయిలర్ చికెన్ : రూ.210 స్కిన్లెస్ చికెన్ : రూ.234 లేయర్ చికెన్ : రూ.190 -
సిట్ అధికారుల రెండు రోజుల కస్టడీకి కాకాణి
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని గుంటూరు సీఐడీ పోలీస్ అధికారులు విచారణ నిమిత్తం 3, 4 తేదీల్లో రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నెల్లూరు 2వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శారదరెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గుంటూరు సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వి.లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కాకాణి పాత్ర ఉందని, విచారించడానికి ఏడు రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు, కాకాణి తరపు సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో కాకాణిని 14వ నిందితుడిగా పోలీసులు చేర్చారని, పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకోవాలని, 4వ తేదీ విచారణ అనంతరం సాయంత్రం 5 గంటలకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్తో కోర్టులో హాజరుపరచాలని, విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్‌రెడ్డిని సీఐడీ పోలీసులు విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘యాక్సిస్’ కుంభకోణంపై పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై దశల వారీగా పోరాటం చేస్తామని యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య స్పష్టం చేశారు. యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీలతో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై పోలీసులు నేటికీ విచారణ జరపలేదని, కారకులను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అమాయక గిరిజనుల పేరుతో ముత్తుకూరులోని బ్యాంక్‌లో రూ.కోట్లలో రుణాలు తీసుకోవడం దారుణమన్నారు. ఈ ఉదంతంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి దశలవారీగా న్యాయ, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద నిరసనను సోమవారం చేపట్టనున్నామని పేర్కొన్నారు. సమగ్ర విచారణకు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌కు పిర్యాదు చేస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామరాజు, ఏఆర్డీ చైర్మన్ బషీర్, రజక సంఘ నేతలు పద్మజ, పోలయ్య, రఘు, కోటయ్య, యానాదుల సంఘ నేతలు కృష్ణయ్య, రవీంద్రబాబు, ఉషా తదితరులు పాల్గొన్నారు.. -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ముత్తుకూరు (పొదలకూరు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్చార్జి ఎస్సై శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన కార్తీక్ (19), హర్షవర్ధన్ బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో ముత్తుకూరు సమీపంలోని మద్దిమాను వద్ద వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో కార్తీక్ (19) మృతి చెందగా, హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
నెల్లూరురూరల్: విద్యారంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, బదిలీలు జరిగి 50 రోజులవుతున్న నూతన స్థానాల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి దర్పణమని ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘం నేతలు దుయ్యబట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో కో చైర్మన్ మాసప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల భారాన్ని పెంచుతూ విద్యారంగం కునారిల్లేలా చేసిందన్నారు. ఫ్యాప్టో పరిశీలకులు ఎన్వీ రమణయ్య, రమేష్, పీవీ రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, కనీసం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, పెన్షన్, సరెండర్ లీవ్, డీఏ బకాయిలను చెల్లించకుండా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కొత్త పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ విడుదల చేసి బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో 12వ తేదీ రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ శేషు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేశారు. మరో డిప్యూటీ జనరల్ సెక్రటరీ హజరత్ మాట్లాడుతూ కామన్న్ సీనియారిటిని తుంగలో తొక్కి ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. వెంటనే కామనన్ సర్వీస్ రూల్స్‌ను తీసుకొచ్చి జెడ్పీ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులకూ న్యాయం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహం, మురళీకృష్ణ, భాస్కర్‌రెడ్డి, మణి, సుబ్బు, చలపతి శర్మ, దశరథరాములు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవ్ కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘం ధర్నా -
అధికారుల తీరుపై అసహనం
నెల్లూరు (పొగతోట): అంగన్వాడీ కేంద్రాలు, డీపీఆర్సీ భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, అధికారుల్లో స్పందన లేదని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. డీపీఆర్సీ భవనానికి అనుమతులను ఆర్నెల్ల క్రితం మంజూరు చేస్తే, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేదని చెప్పారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం చెప్తున్నా, ట్రాక్టర్‌కు రూ.నాలుగు వేలను చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన సినరైజ్ జెడ్పీకి రావడంలేదన్నారు. అయితే ఇసుక ఉచితం కావడంతో ఇది రాదని అధికారులు బదులిచ్చారు. రీచ్‌కు ఎలా అనుమతిచ్చారు..? కలువాయి మండలం రాజుపాళెంలో రీచ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ మైనింగ్ శాఖ అధికారులను జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. 500 మీటర్ల పరిధిలో బోర్లుంటే అనుమతులను ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. తెలుగురాయపురం రీచ్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు. పీ4 పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించాలన్నారు. నిధులు మంజూరు చేసినా.. పనులు ప్రారంభించరా..? ఇసుక ఫ్రీ అంటున్నా, అధిక ధరలకు విక్రయం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అస్తవ్యస్తంగా జలజీవన్ మిషన్ పనులు జలజీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తంగా మారాయని ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగ తగలి పశువులు మరణించి ఆర్నెల్లవుతున్నా, బీమా అందలేదని, దీనిపై కలెక్టర్‌కు సమాచారమిచ్చినా నేటికీ స్పందన లేదని పేర్కొన్నారు. బెంగళూరు, చైన్నె నుంచి చికెన్ వ్యర్థాలు జిల్లాకు అధిక మొత్తంలో వస్తున్నాయని, వీటిని అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. అనంతరం ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖలపై సమీక్షించారు. సీఈఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు గడ్డు పరిస్థితి
● కండలేరు పంపింగ్ స్కీమ్‌కు రిపేర్లు ● ప్యానల్ బోర్డు మార్చేందుకు యత్నం ● ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత కరువు ● నీటి విడుదల వాయిదా ప్యానల్ బోర్డు మార్చాలి కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ నుంచి ఎడమ గట్టు కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు అంతా సిద్ధం చేశాం. అయితే హెవీ మోటార్లకు సంబంధించిన ప్యానెల్ బోర్డు ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో బోర్డును తెప్పించే యత్నాల్లో ఉన్నాం. సాధ్యమైనంత త్వరగా నీటిని పంపింగ్ చేయనున్నాం. – విజయరామిరెడ్డి, తెలుగుగంగ డీఈ ●పొదలకూరు: కండలేరు పంపింగ్ స్కీమ్‌కు రిపేర్లు తలెత్తడంతో దాదాపు 20 వేల ఎకరాల్లో సాగుకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి కండలేరు ఎడమ గట్టు కాలువకు పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ తరుణంలో హెవీ మోటార్లకు విద్యుత్‌ను సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరమ్మతులు చేయించారు. ఈ నేపథ్యంలో కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు శనివారం యత్నించగా, ప్యానల్ బోర్డులో ఏర్పడిన సాంకేతిక కారణాలతో వీలుపడలేదు. దీంతో బోర్డును పూర్తి స్థాయిలో మార్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. లభ్యంకాని సామగ్రి ఒక్కో మోటార్ 2050 హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉంది. పంపింగ్ స్కీమ్‌కు ఉపయోగించే సామగ్రి ఈ ప్రాంతంలో లభ్యం కాదు. ఫలితంగా చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి ఉంది. కండలేరు ఎడమ గట్టు హైలెవల్ స్లూయిజ్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు కాలువను నిర్మించారు. అయితే స్లూయిజ్ ఎత్తులో ఉండటంతో కండలేరు జలాశయంలో 35 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంటేనే, గ్రావిటీ ద్వారా కాలువకు అందుతుంది. అయితే ప్రస్తుతం 26 టీఎంసీలే నిల్వ ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ నిర్మాణం గ్రావిటీ ద్వారా ఎడమ కాలువకు నీరు అందకపోతే మెట్ట ప్రాంత రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా లోలెవల్ స్లూయిజ్ వద్ద లిఫ్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సుమారు 6.5 కిలోమీటర్ల మేర రెండు పైప్లైన్లను నిర్మించి ఎడమ కాలువకు కలిపారు. గ్రావిటీ ద్వారా నీరందని సమయంలో లిఫ్ట్ సిస్టమ్ ద్వారా లోలెవల్ స్లూయిజ్ నుంచి కాలువకు అందిస్తారు. అయితే లిఫ్ట్ ప్రక్రియ తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో అవసరాలకు నీటిని పంపింగ్ చేయలేకపోతున్నారు. సామగ్రిని తెప్పించేందుకు తెలుగుగంగ ఇంజినీరింగ్ అధికారులు తంటాలు పడుతున్నారు. -
హామీలతో మోసం.. టార్గెట్లతో భారం
సీహెచ్‌ఓలు తమకు జీతాలు పెంచాలని, ఇన్సెంటివ్స్ చెల్లించాలని కోరుతూ నాలుగు నెలల క్రితం సమ్మె బాట పట్టారు. 46 రోజులు సమ్మె చేశారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా ఇన్సెంటివ్స్ మొత్తం ఒకేసారి చెల్లిస్తామని, సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీతాలు పెంచే విషయం కూడా పరిశీలిస్తామని చెప్పి సమ్మె విరమింప చేసింది. అయితే హామీలకు విరుద్ధంగా సమ్మె చేశారంటూ ఒక్కో నెలలో రూ.5 వేలు చొప్పున రెండు నెలలకు రూ.10 వేలు జీతాలు కట్ చేసి మిగతా మొత్తాన్ని సీహెచ్‌ఓల ఖాతాలో జమ చేశారు. ఇన్సెంటివ్స్ మొత్తం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం చేతిలో మోసపోయి తక్కువ జీతాలతో పని చేస్తున్న తమను ప్రభుత్వం మోసగించడమే కాకుండా పీ4 కింద పేద కుటుంబాలను దత్తత తీసుకోమని పేర్కొనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వర్ణశోభిత సంధ్యవేళ
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడు తన తాపంతో భూమిని దహించగా, సంధ్య వేళకు కోపం వదిలేసి కాంతుల కళలను ఆవిష్కృతం చేశారు. ఎర్రని పువ్వులెరుపుతో నింగిని రంగుల హరివిల్లు చేసి, ప్రకృతి అందాలతో మనసులు మురిపించాడు. బారాషహీద్ దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువు వద్ద వినీలాకాశం తనవైపు చూసే ప్రతి చూపును మంత్రముగ్దుల్ని చేసింది. నీలిగగనంలో కుంకుమ పువ్వుల వర్ణం చిమ్మినట్టుగా, నీటిపై ప్రతిబింబించిన ఆ కాంతులు స్వర్ణ శోభితంగా ఆవిర్భవించాయి. ప్రకృతి మాధుర్యాన్ని పెయింటింగ్ వేసినట్టుగా, రంగుల తోరణంగా శనివారం సాయంత్రం వర్ణశోభితంగా మారింది స్వర్ణాల చెరువు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
పదవులొచ్చాయి.. పరువు పోయింది
ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు.. ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉంటూ దేశంలోని పలుచోట్ల శ్రీవారి ఆలయాల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.. ఇంటా బయటా గౌరవం.. గుర్తింపుతో ఉండేవారు.నాడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక జంటిల్మెన్ అనే ట్యాగ్ లైన్‌తో ఉండేవారు.. వైఎస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు.. సభ్యులు.. సహచర ఎంపీలు.. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డికి ఎనలేని గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆయన టీడీపీలో చేరి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంట్లో భార్యాభర్తలకు రెండు పదవులు రావడం వరకూ సంతోషమే కానీ.. పదవులు రావడం.. వారికి ఇది వరకు సమాజంలో ఉన్న గౌరవం పోవడం ఒకేసారి జరిగిపోయింది.పదవులు వచ్చినంత త్వరగా గౌరవమర్యాదలు పోవడం మొదలైంది. సంపన్నులైన వేమిరెడ్డి దంపతులు ప్రజా జీవితంలో ఉంటే తమకు మంచి లాభం అని భావించిన టీడీపీ జనసేన నేతలు వారు గెలవగానే ఇప్పుడు నిజరూపం చూపిస్తున్నారు. ప్రశాంతి పేరు చెప్పి టీడీపీ జనసేన నేతలు కోవూరులో రౌడీయిజం చేయడం మొదలెట్టారు. ఎక్కడికక్కడ దందాలు.. సెటిల్మెంట్లు.. గూండాగిరితో సమాజాన్ని హడలెత్తిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్లకు వాళ్ళు సమర్థించుకున్నా కానీ వేమిరెడ్డి ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ చేసింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అంత మాత్రానికే ఇంటి మీదకు వెళ్లి రౌడీయిజం చేయడమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇసుక.. మద్యం.. గ్రావెల్ అంటూ ఆమె అనుచరులు దందా చేస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.దీంతోబాటు నెల్లూరులో క్వార్ట్జ్ ఖనిజం పేరిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీలు చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. దేశ విదేశాలకు లక్షల టన్నుల ఖనిజం ఎగుమతి చేయడం.. ఇందులో చాలావరకు అక్రమంగా తవ్వింది ఉందని తేటతెల్లం అవడంతో ఆయన సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభాకర్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలు అడ్డగోలుగా ఖనిజాలు తవ్వేస్తూ వనరులను కొల్లగొడుతున్నట్లు ప్రభుత్వం వద్ద కూడా రికార్డులు ఉన్నాయి. పైగా మైనింగ్ శాఖ కూడా లోలోన ఇదే రిపోర్ట్ పంపింది. మొత్తానికి డబ్బు.. పదవి వచ్చినంత వేగంగా వేమిరెడ్డి పరపతి దిగజారిపోయింది.ఇక జనంలో విమర్శలు.. వైఎస్సార్సీపీ నాయకుల పోరాటాలు చూసి వేమిరెడ్డి ఏమనుకున్నారో ఏమో ఇక తానూ మైనింగ్ వ్యాపారం నిలిపివేస్తాను అని ప్రకటించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ముందురోజే ఆయన మీడియాతో మాట్లాడుతూ తానింకా వ్యాపారం చేయలేనని అన్నారు. వ్యాపారాలు మూసేస్తున్నానని ప్రకటించారు. గౌరవం సైతం చిల్లుకుండలోని నీరులా రోజురోజుకూ తగ్గిపోతోంది.. గతంలో గౌరవంగా ఉండే వేమిరెడ్డి కుటుంబం ఇప్పుడు పరువు.. పరపతి కోల్పోయి అవమానకర పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగుతున్నారని నెల్లూరు జనం చెప్పుకుంటున్నారు..-సిమ్మాదిరప్పన్న. -
అవయవదానంతో 8 మందికి పునర్జన్మ
● జీవన్‌దాన్ ఏపీ చైర్మన్ రాంబాబు నెల్లూరు(అర్బన్): అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని జీవన్‌దాన్ ట్రస్ట్ ఏపీ చైర్మన్ డాక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరులో ఓ కన్వెన్షన్ హాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం అపోలో ఆస్పత్రిలో క్యాంప్ ఉంటుందన్నారు. బ్రెయిన్‌డెడ్ అంటే ఏంటి?, అవయవదానాన్ని చట్టబద్ధంగా ఎలా చేయాలి? అనే అంశాలను వివరిస్తామన్నారు. మూడో తేదీన నేషనల్ ఆర్గాన్ డొనేషన్డేను పురస్కరించుకుని వీఆర్సీ సెంటర్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్యక్రమం జరుగుతుందన్నారు. జీవన్‌దాన్ సంస్థలో ఇప్పటికే 4,733 మంది అవయవాల కోసం రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ ఆస్పత్రుల ప్రతినిధులు డాక్టర్ శ్రీరాంసతీష్, బాలరాజు, డాక్టర్ సతీష్, శేఖర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
● గిరిజన మహిళలకు బుర్రా భరోసా ఉలవపాడు: ‘మీరు ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా. ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటా’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గిరిజన మహిళలకు భరోసా ఇచ్చారు. రామకృష్ణాపురం గిరిజన మహిళలు బెయిల్‌పై విడుదల కావడంతో వారిని శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్షలో భాగంగా కేసులు నమోదయ్యాయి కాబట్టి, బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వలేదని ప్రభుత్వం పెట్టిన కేసని అర్థమైందన్నారు. మహిళల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదన్నారు. కానీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలా చేశారన్నారు. నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి కేసు గురించి తెలియజేశానన్నారు. జగనన్న రైతులకు అండగా ఉండాలని తెలియజేశారన్నారు. న్యాయవాదులతో మాట్లాడతానన్నారు. గిరిజన మహిళలు శిరీష, లలితమ్మ, సునీతలు తమను పోలీసులు అర్ధరాత్రి తీసుకుని వెళ్లి చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఎంత భయపెట్టినా తాము మాత్రం భూమలు ఇచ్చేది లేదన్నారు. కరేడు గ్రామ రైతులందరూ వచ్చి ధర్నా చేయడం వల్ల సెక్షన్ తగ్గించారని, అందువల్లే బెయిల్ వచ్చిందని వారు బుర్రాకు తెలిపారు. మాజీ సీఎం జగన్‌ను కరేడుకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నన్నం పోతురాజు, కరేడు గ్రామ కన్వీనర్ సీతారామిరెడ్డి పాల్గొన్నారు. -
సిండికేట్ వసూళ్లు ఇలా..
30 గనుల్లో లభించే మైకా క్వార్ట్ ్జను దిగుమతి చేసేందుకు చైనా, జపాన్ దేశాల్లో అనుమతి ఉంది. దీంతో ఆయా గనుల నుంచి వచ్చే ఖనిజాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ లభించే ఖనిజం రకాలను బట్టి రూ.20 వేల నుంచి రూ.85 వేల వరకు ధర పలుకుతోంది. టన్ను రూ.20 వేల చొప్పున అమ్మితే సిండికేట్‌కు రూ.4 వేలు కప్పం కట్టాలి. అదే టన్ను రూ.85 వేలకు అమ్మితే రూ.20 వేల పైన ఇవ్వాలి. దానికితోడు మరో ముఖ్యనేతలకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. అలాగే కొన్ని యార్డులకు కూడా అనుమతులను మంజూరు చేశారు. వాటికి కూడా ఆ వంతునే నగదును సిండికేట్‌కు చెల్లించాలి. ముఖ్యంగా సైదాపురం మండలంలో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా సిండికేట్ రాయుళ్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. కార్యాలయం కూడా సైదాపురం – ఊటుకూ రు మధ్యలో ఏర్పాటు చేయడం గమనార్హం. -
జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోండి
ఆత్మకూరు: జాబ్‌మేళాలను నిరుద్యోగ యువత స ద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డి సహకారంతో భారీ జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా, నేరుగా మొత్తం 2,347 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. 93 కంపెనీలు పాల్గొన్నట్లు చెప్పారు. కలెక్టర్ ఒ.ఆనంద్, టిడ్కో చైర్మన్ అజయ్‌కుమార్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేష్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాల విడుదల నెల్లూరు(క్రైమ్): కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికై న 158 మందితో కూడిన ఫైనల్ లిస్టును అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. వీరు త్వరలో తొమ్మిదినెలలపాటు శిక్షణకు వెళ్లనున్నారు. -
మైనింగ్ ఆపాలంటూ రాస్తారోకో
వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని జంగంరెడ్డిపల్లి పల్లతిప్పలో మైనింగ్ కార్యకలాపాలు వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానికులు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ ముక్తకంఠంతో మైనింగ్ రద్దు చేయాలని కోరామన్నారు. అయినా లీజు హక్కుదారులు తమ కార్యకలాపాలు ఆపలేదని, దీంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కలిసి తమ గోడు వినిపించామన్నారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనకు దిగినట్లుగా చెప్పారు. మైనింగ్ చేస్తే నాలుగు గ్రామాల ప్రజల జీవనాధారం కోల్పోవడమే కాకుండా జంగంరెడ్డిపల్లిని వేరే ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైనింగ్‌ను రద్దు చేయకపోతే న్యాయస్థానాల్లో న్యాయపోరాటానికి సిద్దమవుతామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఎస్సై రఘునాథ్ తన సిబ్బందితో వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ కార్మికులకు స్వల్ప గాయాలు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెంలో ఉన్న బుంగి పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు కెమికల్ నీరు కలిసిన ప్రాంతంలో నడవడంతో గాయపడ్డారు. సేకరించిన సమాచారం మేరకు వివరాలు.. శుక్రవారం ఫ్యాక్టరీని శుభ్రం చేసేందుకు నీటిలో కెమికల్ కలిపినట్టుగా తెలుస్తోంది. నలుగురు కార్మికులు ఆ నీటిపై నడవడంతో వారి కాళ్లకు బొబ్బలు రేగి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే యాజమాన్యం ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారికి చికిత్స చేయించింది. నలుగురికి ప్రమాదమేమీ లేదని, కోలుకుంటున్నట్టు తెలిసింది.కసుమూరు దర్గాలో భక్తుల నిలువు దోపిడీ ● హుండీలో కానుకలు వేయకుండా అడ్డుకున్న ముజావర్లు వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మండలంలోని కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో కొందరు ముజావర్ల కారణంగా భక్తులు నిలువు దోపిడీకి గురయ్యారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి దర్గాకు భక్తులు పోటెత్తారు. వారు తమకు తోచిన కానుకలు (నగదు) హుండీల్లో వెళ్తుండగా కొందరు ముజావర్లు తమ చేతికివ్వాలని డిమాండ్ చేశారు. పలువురు భక్తులు చేసేదేమీలేక కానుకలు సమ ర్పించి వెళ్లారు. కొందరు మాత్రం ఎదురు తిరిగి మీకెందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. హుండీల్లో కానుకలు వేసేందుకు ఒప్పుకోమని చేతికి ఇవ్వాల్సిందేనని ముజావర్లు పట్టుబట్టారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తితో దర్గాకు వస్తే బలవంతపు వసూళ్లకు పాల్పడతారా అంటూ భక్తులు మండిపడ్డారు. అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దర్గా కేర్ టేకర్ అస్లాం మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే ముజావర్లు వసూళ్లకు పాల్పడకుండా చేశామని తెలిపారు. మరోసారి ఇలా జరిగితే వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. అథ్లెటిక్స్ ఎంపికలు రేపు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 3వ తేదీన సౌత్‌జోన్ మీట్ కమ్ సెలక్షన్స్ జరగనున్నాయని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు 14, 16, 18, 20 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఉదయం 9 గంటలకు జరుగుతాయన్నారు. హాజరయ్యే వారు ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలన్నారు. ఆర్గనైజర్ విజయకుమార్‌ను 94418 75190కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. -
నిధుల గోల్మాల్
సీతారామపురం: మండలంలో విధులు నిర్వర్తిస్తూ దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ ఏకంగా రూ.11 లక్షలకుపైగా నిధులను స్వాహా చేశారనే చర్చ మండలంలో కొన్ని రోజులుగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్ 4న విధుల్లో చేరిన సదరు అధికారి.. ప్రభుత్వ నిధులకు సంబంధించి ఎలాంటి లెక్కల్లేకుండా తన అనుచరులతో డ్రా చేయించారని తెలుస్తోంది. స్థానిక కెనరా బ్యాంక్‌లో గల ఎంపీడీఓ పెన్షన్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని డ్రా చేయించారని సమాచారం. ఆయన విధుల్లో చేరాక పెన్షన్ అకౌంట్‌కు పలు విడతలుగా ట్రైనింగ్ డబ్బులు సుమారు రూ.1.6 లక్షలు.. 15వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనుల నుంచి మినహాయించిన రికవరీ మొత్తాలు సుమారు రూ.మూడు లక్షలను బదిలీ చేయించి.. చెల్లించకుండానే వాటిని స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గుండుపల్లి వద్ద నేషనల్ హైవే పనుల్లో భాగంగా పాఠశాల, పంచాయతీ భవనంతో పాటు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు కలెక్టర్ మంజూరు చేసిన నష్టపరిహారం రూ. 39,42,534 జమయ్యాయి. వీటిని ఉన్నతాధికారుల ఆదేశానుసారం వినియోగించాల్సి ఉన్నా, అందులో రూ.ఆరు లక్షలను బొక్కేశారని సమాచారం. కాగా ఈ విషయమై కార్యాలయ ఏఓను సంప్రదించగా, నగదు లావాదేవీలను ఎంపీడీఓ స్వయంగా చూసేవారని, సిబ్బంది ప్రమేయం లేదని బదులిచ్చారు.సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయం నేషనల్ హైవే నష్టపరిహారం, కాంట్రాక్ట్ పనుల రికవరీ సొమ్ము రూ.11 లక్షలకుపైగా స్వాహా దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ఎంపీడీఓపై ఆరోపణలు -
కుట్రలను ఛేదించి.. విజయవంతం చేశారు
మహిళలపైనా లాఠీచార్జి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా, ప్రజలు తిప్పికొట్టి విజయవంతం చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజిత తదితరులు విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. మాజీ సీఎం పర్యటనకు ప్రజలు రాకూడదనే దురుద్దేశంతో రోడ్లను తవ్వేయడం, జేసీబీలను అడ్డుపెట్టారని, ఇలాంటి పోకడలు దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా ప్రజలు వచ్చారని, జగనన్నకు ఉన్న ఆదరణ ఏ పాటిదో దీని ద్వారా తెలుస్తోందన్నారు. జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారు కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారని, పోలీసులిచ్చే నోటీసులను సంతోషంగా స్వీకరిస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమ కేసులను బనాయించి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని జైలుకు పంపారని.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని చెప్పారు. వీరికి అండగా నిలిచేందుకు జిల్లాకు జగన్మోహన్రెడ్డి వస్తుంటే, ఆయన్ను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని యత్నం లేదని విమర్శించారు. ఆయన పర్యటనపై జిల్లా వాసులే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారని తెలిపారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి ప్రసన్న నివాసం వరకు 7.7 కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారని వివరించారు. చెట్లు.. గుట్టలతో ఉన్న ప్రాంతంలో అనుమతిస్తే, ఐదు రోజులు శ్రమించి హెలిప్యాడ్‌కు స్థలాన్ని సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు. హెలిప్యాడ్, జైలు వద్ద పది మందికి మించి.. ప్రసన్న నివాసం వద్ద ఒక్కరూ ఉండకూడదని.. జగన్మోహన్రెడ్డితో పాటు మూడు వాహనాలకు మించి ఉండకూడదంటూ నిబంధన విధించారని, అయితే పోలీసులు మాత్రం 12 వాహనాల్లో వచ్చి ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. 35 రకాల కండీషన్లను పెట్టారని, ఎవరెవరు ఎక్కడెక్కడుంటారో జాబితా.. వాహనాల నంబర్లను ముందే ఇవ్వాలన్నారని, ఇదెక్కడి చోద్యమో అర్థం కావడంలేదని చెప్పారు. తమ పార్టీకి చెందిన మూడు వేల మంది నేతలకు నోటీసులిచ్చారని ధ్వజమెత్తారు. కార్యక్రమానికి ఎవర్నైనా తీసుకెళ్తే కేసు లు పెడతామని బెదిరించారని, పార్టీ మహిళా నేతల ఇళ్లకు మహిళా కానిస్టేబుళ్లు లేకుండా అర్ధరాత్రి వెళ్లి నోటీసులను ఇచ్చారని మండిపడ్డారు. కార్యకర్తలు రాకుండా రోడ్లను బారికేడ్లతో నిర్బంధించి దాదాపు మూడు వేల మంది పోలీసులను మోహరించారని, జగన్మోహన్రెడ్డికి రక్షణ కల్పించాల్సింది పోయి అడ్డుకునేందుకే ఆసక్తి చూపారని విమర్శించారు. కార్యకర్తలు వెనుకడుగేయలేదు జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానానికి నెల్లూరు పర్యటన ఓ ఉదాహరణ అని ఆనం విజయకుమార్‌రెడ్డి, మేరిగ మురళి పేర్కొన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీచార్జి చేసినా, తమ కార్యకర్తల మనోధైర్యం చెక్కుచెదరలేదని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతలు ఓర్వలేక మీడియా ద్వారా వారి అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.జగనన్న భరోసా ఎంతో ధైర్యాన్నిచ్చింది కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని కాకాణి పూజిత పేర్కొన్నారు. దీనిపై కొన్ని పత్రికలు వక్రీకరించాయని, వారిని ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని, అక్రమ కేసులతో జైల్లో నిర్బంధించారనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు మాజీ సీఎం జగన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ విలేకరులతో వైఎస్సార్సీపీ నేతలు తమ పార్టీ నేతలు, కార్యకర్తలను హోమ్ మంత్రి, డీజీపీ, ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో నిర్బంధించారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ఏడాది పాలనకే చంద్రబాబులో భయం మొదలైందని విమర్శించారు. పోలీసులు ఖాకీ చొక్కాలను తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తల తరహాలో వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఒంగోలుకు చెందిన ఓ పోలీస్ తనపై లాఠీతో దాడి చేసి, గోళ్లతో రక్కి.. తిరిగి తనపైనే రెండు కేసులు పెట్టారని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రెస్ మీట్‌ను అడ్డుకునేందుకు పార్టీ కార్యాలయంపైకి టీడీపీ గూండాలను పంపారని, అయినా తాము ఆగిపోలేదని చెప్పారు. -
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా
నాడునేడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నెల్లూరు(పొగతోట): కూటమి అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆశలను చిదిమేసింది. ఆరుగాలం పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ పథకంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేసి తొలి ఏడాదిలోనే హామీని తుంగులో తొక్కేశారు. తాజాగా పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలను మూడు విడతల్లో ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిబంధనల కొర్రీలు.. లబ్ధిదారుల సంఖ్యలో కోతలు అన్నదాతకు కూటమి ప్రభుత్వం గుండెకోత పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పథకంలో లబ్ధిదారులుగా ఉండి లబ్ధి పొందిన రైతుల్లో 28,299 మందిని తొలగించారు. ఈకేవైసీ, ఆధార్‌లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులను అనర్హులుగా ప్రకటించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2,14,667 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అందజేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యాప్తంగా 3.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 1,98,514 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు స్వయంగా జిల్లా వ్యవసాయ అధికారిణి గత నెల 23న పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాజాగా అధికారులు 1,86,368 మందిని అర్హులుగా తేల్చారు. కేవలం వారం రోజుల్లోనే ఫైనల్ చేసిన జాబితాల నుంచి 12,146 మంది లబ్ధిదారులను లేపేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం.. వైఎస్ జగన్ బ్రాండ్ చంద్రబాబు గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు అన్నదాతల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఆర్థికంగా ఆదుకున్నది లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి సారి రైతులను వంచనకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. 2004కు ముందు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయమే దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని నిలువునా మోసం చేశారు. తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవ పథకంగా మార్పు చేసి ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం వైఎస్ జగన్ బ్రాండ్‌గా చెప్పొచ్చు.సంవత్సరం మొత్తం ఆర్థిక సాయం రైతులు (రూ.కోట్లల్లో) 2019–20 2,02,306 273.11 2020–21 2,43,502 328.72 2021–22 2,43,911 329.27 2022–23 2,14,667 289.80 2023–24 2,14,667 289.80 నెల్లూరురూరల్: రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారని కలెక్టర్ ఓ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ మొత్తం 1,95,866 మంది అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. తొలివిడతలో 1,86,146 మందికి నిధులు విడుదల చేస్తున్నామని, మిగిలిన అర్హులైన లబ్ధి దారులు ధ్రువీకరణ పత్రానలు అందజేస్తే వారికి సైతం నిధులిస్తామని తెలిపారు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.రెండు వేల చొప్పున జమ చేయనున్నాయని చెప్పారు. -
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నెల్లూరు(టౌన్): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆపస్, పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ బాలాజీరావుకు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ – 1 పోస్టులను ఇవ్వరాదని కోరారు. బదిలీ చేసిన టీచర్లను వీలైనంత త్వరగా రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. హైస్కూళ్లలో రిటైర్మెంట్ కారణంగా ఏర్పడిన సబ్జెక్ట్ టీచర్ ఖాళీలను వెంటనే వర్క్ అడ్జస్ట్మెంట్ లేదా క్లస్టర్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని విన్నవించారు. ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
లారీని తప్పించబోయి..
● రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి కావలి(జలదంకి): రోడ్డు ప్రమాదంలో ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన కోదాటి రాజు (47) ట్రావెల్స్ బస్సు డ్రైవరుగా పని చేస్తున్నాడు. అతడికి భార్య సంధ్య, ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం 4:45 గంటలకు రాజు ఏలూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. రాత్రి 11:50 గంటల సమయంలో కావలి మండలం అడవిరాజుపాళెం దాటిన తర్వాత పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. దాని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో రాజు లారీని తప్పించేందుకు స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పాడు. ఆ సమయంలో మరో లారీ వెళ్తుండగా దానిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు స్టీరింగ్, సీటు మధ్యలో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు గురువారం తెలిపారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
సైదాపురం: మండలంలోని తోచాం గ్రామంలో పురాతన శ్రీకృష్ణుని ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఉడాయించాడు. ఊరి పొలిమేరల్లో అమ్మ వారి బొమ్మ వేసి పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఆలయానికి వెళ్లి పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసి విగ్రహాల వెనుకవైపు తవ్వకాలు చేశారు. కొద్దిరోజుల నుంచి సమీప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ పరిసర ప్రాంతలతోపాటు గ్రామంలో సంచరించినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
నెల్లూరు(పొగతోట): అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ సీడీపీఓలను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంత అవసరమో అవగాహన కల్పించాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో వారోత్సవాలను జరపాలన్నారు. శుక్రవారం కలెక్టర్ ఆనంద్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలియజేశారు. -
అనుమతులున్నా.. అడ్డుకొని
వెంకటాచలం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఆయన దిగే హెలిప్యాడ్ వద్దకు అనుమతులతో వెళ్లే వారిని సైతం అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. వాస్తవానికి హెలిప్యాడ్ వద్దకెళ్లేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజితకు పోలీసుల అనుమతి ఉంది. అయినా వీరి కార్లను జాతీయ రహదారిపైనే నిలిపేశారు. పూజిత కారులోని మహిళా సిబ్బందిని దింపేసి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. మహిళా సిబ్బందిని తమ వెంట తీసుకెళ్లనీయరానంటూ ఖాకీలను ఆమె ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదని ఆమె హితవు పలికారు. మీడియాపైనా ఆంక్షలు విధించి జాతీయ రహదారి వద్దే నిలిపేశారు. కార్లను నిలిపి తనిఖీ చేస్తుండగా.. ఫొటోలు, వీడియోలు తీసి న విలేకరులపై అసహనాన్ని ప్రదర్శించారు. నెల్లూరులో రెడ్‌బుక్ కర్ఫ్యూ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని ప్రతి సెంటర్లో పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్పించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల మొదలుకొని చిన్న వీధుల్లోనూ పోలీసులను మోహరించారు. ఉదయం ఐదు గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై ఇబ్బందులు సృష్టించడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. టూవీలర్స్‌ను కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, షాపులు మూయించేయడంతో నగరమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే వాహనాలను నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. స్కూళ్లు, డ్యూటీలు, పనులకు వెళ్లేందుకు స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. -
5,489 కొత్త పింఛన్ల మంజూరు
నెల్లూరు(పొగతోట): జిల్లాలో 5,489 కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి సాధారణ పింఛన్‌తోపాటు కొత్తవి పంపిణీ చేస్తామని తెలియజేశారు.పురాతన ఆలయ పరిశీలనసోమశిల: చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు పెన్నా నదిలో బయటపడిన నాగేశ్వరస్వామి ఆలయాన్ని గురువారం రాష్ట్ర దేవదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధులు, స్థల పరిస్థితులు, నిర్మాణ అవసరాలు, పురాతన శిల్పకళ ప్రాముఖ్యత, సంబంధించిన వాటిపై ఆధ్యయనం చేసి, తగిన ప్రతిపాదనలతో నివేదిక సిద్ధం చేశామన్నారు. ఆయన వెంట సహాయ స్థపతి సురేంద్ర, గుంటూరు జిల్లా డీఈఈ సీహెచ్ శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ఏఈఈ ఎ.మురళిమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబాల్లో బెల్టు షాపుల చిచ్చు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి పచ్చని సంసారాల్లో చిచ్చురేపి నాశనం చేస్తోందని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివమ్మ, మస్తాన్‌బీ అన్నారు. వారు గురువారం మండలంలోని కృష్ణారెడ్డిపల్లెలో జరిగిన ఉదయగిరి ప్రాంత ఐద్వా 3వ మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో మంచినీరు దొరకపోయినా పుష్కళంగా దొరుకుతోందన్నారు. బెల్టు షాపులతో మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు మిన్నకుండిపోవడం దారుణమన్నారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం 13 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బెల్టు షాపులు ఎత్తివేయాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎంపీటీసీ విజయమ్మ, నాయకులు కామాక్షమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పరిషత్‌లో పదోన్నతులు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ సహాయకులకు పదోన్నతులు కల్పించారు. ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ మోహన్‌రావు గురువారం అందించారు. వెంకటరమణయ్య, సీహెచ్ రామకృష్ణ, షేక్ ఇలియాజ్, ఎం.లీలామోహన్, ఎం.సుదర్శన, ప్రసన్నకుమార్ ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు. కారుణ్య నియామకాలు ఇద్దరు ఉద్యోగాలు మరణించగా వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 2024 ఏడాది నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న 120 మందికి పదోన్నతులు కల్పించామన్నారు. 81 మంది ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశాలు ఇచ్చామన్నారు. ఉద్యోగులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు లక్కాకుల పెంచలయ్య, వి.ప్రసన్న కుమార్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఖాకీల ఓవరాక్షన్.. ప్రజల అవస్థ
నెల్లూరు(బృందావనం): వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు అనుసరించిన తీరుతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. జాతీయ రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేయడంతో కావలి వైపు వెళ్లే మార్గంలో భారీ వాహనాల వారి అగచాట్లు వర్ణనాతీతమయ్యాయి. ఉదయం ఎనిమిది నుంచే విడతల వారీగా ట్రాఫిక్‌ను నియంత్రించారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖతయ్యాక సుజాతమ్మ కాలనీలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్నప్పుడూ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారిపై ఇదే పోకడను అవలంబించారు. ఫలితంగా ముండుటెండలో వాహనచోదకులు మగ్గాల్సి వచ్చింది. స్వామి భక్తిని చాటుకొని.. మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్సీలను సైతం పోలీసులు అడ్డుకొని తమ స్వామిభక్తిని చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు మున్సిపాల్టీ మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, మీరారెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ మేరిగ మురళి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజిత, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి ఇలా ప్రతి ఒక్కరి వాహనాలను నిలిపేశారు. అనుమతి పత్రాలను పరిశీలించి, ప్రతి ఒక్కరి పేరును చూసి.. సహాయకులెవర్నీ అనుమతించేది లేదంటూ నిర్దాక్షిణ్యంగా దించేశారు. డీఎస్పీ గిరిధర్, సీఐలు షముల్లా, సుధాకర్‌రెడ్డి తదితరులు తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో అనుమతులున్న వారే జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులనూ వేధించి.. జిల్లా కేంద్ర కారాగారానికి వెళ్లే మార్గంలోనే ఉన్న నారాయణ జూనియర్ కళాశాల వద్దకు విద్యార్థినులు, వారు పయనించే ఆటోలను అనుమతించలేదు. దీంతో జాతీయ రహదారి నుంచి కాలేజీకి విద్యార్థులు నడుచుకొని వెళ్లాల్సి వచ్చింది. -
నకిలీ ఏటీఎం కార్డులిచ్చి..
ఆత్మకూరు: నగదు తీసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళ్లే వారిని మోసం చేసి కార్డు, పిన్ నంబర్లను తెలుసుకుని నగదు దోచుకుంటున్న వ్యక్తిని కొందరు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, ఎస్సై జిలానీ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మట్టిపాడు గ్రామానికి చెందిన సురేంద్ర అనే యువకుడు ఏటీఎంల వద్ద ప్రజలను ఏమారుస్తుంటాడు. నగదు విత్‌డ్రా చేయాలని కోరుతూ కార్డులిచ్చే వారిని మోసం చేస్తుంటాడు. పిన్ నంబర్ తెలుసుకుని నకిలీ కార్డు చేతిలో పెడుతుంటాడు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద వృద్ధుడికి నగదు తీసుకోవడంలో సహాయం చేస్తానని నమ్మించాడు. ఆయన కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని నగదు డ్రా చేసి నకిలీ కార్డు ఇచ్చాడు. కొద్దిసేపటి అనంతరం మరో యువకుడికి ఇలానే చేయబోగా సురేంద్ర మోసాన్ని పసిగట్టి సమీపంలోని వారి సహకారంతో పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పరిశీలించగా సురేంద్ర వద్ద పలు నకిలీ ఏటీఎం కార్డులు లభించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇప్పటికే కేసులు నమోదైనట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అసలు వాటితో నగదు కొల్లగొడుతున్న వ్యక్తి పోలీసులకు అప్పగించిన స్థానికులు -
బెదరని..
అడ్డంకులు అధిగమించి.. కంచెలు ఛేదించి ప్రసన్న కుటుంబీకులకు ఆత్మీయ పలకరింపు ● ముళ్ల పొదల్లోనూ కాలినడకన జైలు వద్దకు రాక ● అడుగడుగునా జయహో జగన్ నినాదాలు ● 8 కిలోమీటర్లు.. 2.14 గంటల ప్రయాణం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జననేత జగన్మోహన్రెడ్డి పర్యటనను విఫలం చేసేందుకు కూటమి నేతలు కుతంత్రాలు పన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ఆంక్షల ఛట్రాన్ని బిగించారు. హెలిప్యాడ్ నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ఎవరూ లేకుండా చేయాలనే దురుద్దేశంతో బారికేడ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అయితే వీరి కుట్రలు, పన్నాగాలు జన ప్రభంజనం ముందు చిన్నబోయాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల జై జగన్, జైజై జగనన్న నినాదాలతో నెల్లూరు హోరెత్తింది. అడుగడుగునా జనాభిమానం చెముడుగుంటలోని హెలిప్యాడ్‌కు గురువారం ఉదయం 10.30కు చేరుకున్న జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జిల్లా కేంద్ర కారాగారానికి 10.58కు చేరుకున్నారు. అక్రమ కేసులతో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖతయ్యారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి 11.26కు బయల్దేరి సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి మధ్యాహ్నం 1.40కు చేరుకున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ మూకలు సాగించిన విధ్వంసకాండపై వారిని ఆరాతీశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మధ్యాహ్నం 2.48కు అక్కడి నుంచి బయల్దేరి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. బెంగళూరుకు హెలికాప్టర్లో 3.15కు పయనమయ్యారు. కూటమిలో కలవరం జాతీయ రహదారి వెంబడి వాహనాలు బారులుదీరాయి. జగనన్నా అంటూ బస్సులు, లారీలు, కార్ల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. ఆయన్ను చూసేందుకు వృద్ధులు, మహిళలు రోడ్లపైకొచ్చారు. చంద్రబాబు పాలన అత్యంత దారుణంగా ఉందని, తిరిగి మీరే సీఎం కావాలని నినాదాలు చేశారు. తల్లులు తమ పిల్లలకు ఆశీర్వాదం ఇప్పించారు. అశేష జనవాహినికి అభివాదం చేస్తూ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగారు. మొత్తమ్మీద జననేత పర్యటన కూటమి నేతల్లో కలవరాన్ని రేకెత్తిస్తోంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ మంత్రులు నారాయణస్వామి, అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బుర్రా మదుసూధన్యాదవ్, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కొండూరు అనిల్‌బాబు, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, కాకాణి పూజిత, అనిల్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అణువణువూ నిఘా జిల్లా జైలు ప్రాంతం నుంచి ప్రసన్న ఇంటి వరకు దారిపొడవునా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. జగన్మోహన్రెడ్డి భద్రత కంటే.. జనాన్ని కట్టడి చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి రాకతో సింహపురి జన ఝరిగా మారింది. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది. జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్‌పోస్ట్‌లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు.జగన్మోహన్రెడ్డి పర్యటనతో నెల్లూరు నగరం జనసంద్రమైంది. ఆంక్షలు, అడుగడుగునా అవాంతరాలను పోలీసులు సృష్టించినా, పార్టీ శ్రేణు లు, అభిమానులు ఏ మాత్రం లెక్క చేయలేదు. రెండుసార్లు లాఠీచార్జి చేసినా బెదరలేదు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకునేందుకే దాదాపు రెండు గంటలకుపైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో అభిమానులు తరలివచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఎండను సైతం లెక్కచేయకుండా ఉప్పెనలా తరలివచ్చారు. కాన్వాయ్ వెంబడి జై జగన్, జయహో జగన్.. సీఎం.. సీఎం అని నినదిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్‌కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు. -
నెల్లూరులో హైటెన్షన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఆఫీస్‌పై దాడికి యత్నం
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆఫీస్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణలు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతల ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్ కార్యాలయంపైకి మహిళలను పంపించారు. పోలీసులు రావడంతో ప్రశాంతిరెడ్డి అనుచరులు పారిపోయారు.కూటమిలో కలవరం నిన్న(గురువారం) వైఎస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది.జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్‌పోస్ట్‌లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.ప్రసన్న ఇంటికి సమీపంలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న పార్టీ శేణ్రులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ప్రసన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు ఆయనపై మొదటి కేసు నమోదుగా కాగా.. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెచ్‌సీ మాలకొండయ్య కిందపడడంతో ఆయన చేయి విరిగిందని.. ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌యాదవ్, మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ కొందరు యువకులపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వస్తారని తెలియడంతో వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయకుండా వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షిస్తున్నారు.ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు తన ఇంటికి వంద మీటర్ల దూరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకుంటూ.. అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటుకు వెళ్లారు. అదే సమయంలో దర్గామిట్ట సీఐ రోశయ్య, కొందరు పొలీస్ సిబ్బంది అకారణంగా ప్రసన్నతోపాటు పార్టీ కేడర్‌పై లాఠీచార్జ్ చేసి నెట్టేశారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు నెట్టేయడంతో ఆయన కిందపడబోయారు. కార్యకర్తలు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.పోలీసుల తీరుతో ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మా అధినేత వైఎస్ జగన్ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అరెస్ట్ చేస్తారా.. చేయండి’ అంటూ రోడ్డుపై బైఠాయించారు. మధ్యాహ్నం 1.15 గంటల (వైఎస్ జగన్ అక్కడికి చేరుకునే వరకు) వరకు మండుటెండలో నడిరోడ్డుపైనే కూర్చున్నారు. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్ తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. -
పాలనలో విఫలం.. బాబులో భయం: వైఎస్ జగన్
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు. -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది. ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గొంతు నొక్కేందుకే రెడ్‌బుక్ ⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. ⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం.వైఎస్సార్సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ వీటికేం చెబుతారు? ⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ ⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్‌గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్‌లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి. ⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు. మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది.. ⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు. వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు ⇒ నా పక్కనే గోవర్ధన్‌రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు. ⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్షీట్లోకి వెళ్లి, గోవర్ధన్‌రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్‌రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?⇒ గోవర్ధన్‌రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ నాయకులపై కేసుల పర్వం ⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్‌ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్‌ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధైర్యంగా ఉండండి..సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు. మీకు మరో కొడుకుగా నేనున్నా.. ‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. -
అడ్డుకోలేని ఆంక్షలు.. ఇనుప కంచెలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనలో పార్టీ శ్రేణులను, అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఊరూరా ఆంక్షలు, పెద్ద సంఖ్యలో చెక్‌పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ముళ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు తుదకు రహదారులను తవ్వి.. ధ్వంసం చేసినా ప్రభుత్వ పెద్దల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇవేవీ కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకోలేకపోయాయి. జగన్‌ను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొందరు నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి ప్రభుత్వ పెద్దలను మెప్పించే ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా ఊహించని స్థాయిలో జనం రావడంతో నెల్లూరు నగరం జన సునామీగా మారింది. వైఎస్ జగన్ గురువారం నాటి పర్యటనకు 110 మందికి మించి పాల్గొన కూడదంటూ ఆంక్షలు విధించిన ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి 2వేల∙మందికిపైగా పోలీసులను మోహరించారు. పర్యటనకు ఎవరూ రాకూడదంటూ, వస్తే కేసులు నమోదు చేస్తామంటూ నిర్బంధాలకు తెర లేపారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడాలేకుండా వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సైతం హెచ్చరికలు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సరిహద్దుల్లో పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, బయట ప్రాంతాల నుంచి ఎవరూ నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా వెనక్కి పంపారు. ఇనుప కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులను తవ్వేశారు. చెముడుగుంటలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డీటీసీకి వెళ్లే రహదారిలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆ ప్రాంతం వారు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిర్బంధించారు. కర్ఫ్యూ వాతావరణంకేంద్ర కారాగారం చుట్టూ బారికేడ్లు పెట్టారు. దానికి ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అనుకూల మీడియా మినహా ఇతరులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వెళుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరుల పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లూరు నగరం అంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. విధుల్లో ఉన్న పోలీసులంతా వైఎస్ జగన్ భద్రత కోసం కాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు జగన్ వద్దకు వెళ్లకుండా నిలువరించడానికే పని చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి భయానక వాతావరణం కల్పించారు. నెల్లూరు నగరంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిఖ్, 42వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మస్తాన్, కుక్కలగుంటకు చెందిన ఆవుల నాగేంద్రను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.పలువురికి సెక్షన్ 170 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తుదకు వైఎస్ జగన్ కేంద్ర కారాగారానికి వచ్చే సమయానికి వేల మంది అభిమానులు అక్కడికి చేరుకుని జై జగన్... అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి జగన్ పర్యటన ముగిసే వరకు కనుచూపు మేర జనం పోటెత్తారు. ఆంక్షలను లెక్క చేయక జగన్ పర్యటనలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. -
బాబు విషబీజాలు.. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: వైఎస్ జగన్
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని.. పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.. సాక్షి, నెల్లూరు: రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి?.. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా.. అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు?. ఇవాళ వేల మంది పోలీసులు.. లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం ఉన్నారు. సూపర్‌సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారు. నాడు నేడు ఆగిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది. అన్ని పథకాలు ఆపేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ప్రసన్న ఇంటిపైకి 80 మందిని పంపి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి.. మనుషుల్ని చంపాలని చూడడమేంటి?. మనిషి నచ్చకపోతే చంపేస్తారా?.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు. మా పార్టీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటారు.. కాకాణి గోవర్ధన్‌పై 14 కేసులు పెట్టారు. కావలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే.. దానిని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా?. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు?. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని జగన్ అన్నారు.టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాణిపై కేసు పెడతారా?. మాగుంట శ్రీనివాసులు ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణిపై కేసు పెడతారా?. టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా?. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెడతారా?. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా?.. అని జగన్ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాకు డాన్ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. సిలికా, క్వార్ట్జ్ను విచ్చలవిడిగా దోచేస్తున్నారు. మైన్స్ కమీషన్లు చంద్రబాబు, లోకేష్‌కే చేరుతున్నాయి. పరిశ్రమలు నడుపుకోవాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలు.నందిగం సురేష్‌ను జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీని చిత్రహింసలు పెట్టారు. కాలేజీ రోజుల నాటి గొడవ.. పెద్దిరెడ్డితో కోపంతోనే మిథున్‌రెడ్డిపై చంద్రబాబు లిక్కర్ కేసు పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే చంద్రబాబు కేసు పెట్టించాడు. కొడాలి నాని, పేర్ని నాని.. పేర్ని నాని భార్యను, అనిల్ కుమార్ యాదవ్‌ను వేధిస్తున్నారు. ఇలా ఎంతో మంది(పేర్లు చదివి వినిపించారు) అన్యాయాలను ప్రశ్నిస్తున్నవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు అని జగన్ అన్నారు.చంద్రబాబూ.. మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా అది గుర్తించండి.. అని జగన్ మరోసారి హెచ్చరించారు. -
నెల్లూరు: పోలీసుల అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్నకుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తోసివేయడంతో ఆయన చేతికి గాయమైంది. మహిళలను కూడా పోలీసులు చితకబాదారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షల వలయంలో నెల్లూరు నగరాన్ని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. గుంటూరు రేంజ్, తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. చెవుడు గుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడుగడుగునా భారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వైఎస్ జగన్ రానున్నారు. మెయిన్ రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందులో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు.రోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం మండిపడ్డారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు.తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారంటూ ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జనం రాకుండా రోడ్లు తవ్వేశారు. వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు’’ అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందన్న అంబటి.. రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా? అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్‌ని చూసేందుకు వస్తారు. జగన్ పర్యటనపై పోలీసులు, కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై ఉండే అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్ట దిగ్బంధనం చేసారు. చుట్టుపక్కల ఉన్న పల్లెలను పోలీసులతో చుట్టుముట్టారు. అయినా అభిమానులు, కార్యకర్తలు వస్తారని దారులను జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా గుంతలు తవ్వడం ద్వారా ప్రజలకు అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుంది...నెల్లూరు లో ప్రధాన రహదారులు, దారులలో ముళ్ల కంచెలు వేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తరంగాలు చూస్తే మంచి హాస్య నాటకం పోలీసులతో వేయిస్తున్నట్లు ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వస్తుంటే ఇన్నీ ఆంక్షలా.. అందరికీ నోటీసులు ఇచ్చి, అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు. ఎక్కడ ప్రజలు జగన్ కోసం వస్తారోనని ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులు, నిబంధనలు పెట్టిన జగన్ చూడటానికి సునామీలా వస్తారని బంగారుపాళ్యంలో రుజువైయింది. కూటమీ ప్రభుత్వం గుంతలు తవ్విన, ముళ్ల కంచెలు వేసిన జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం. ఆపడం ఎవరితరం కాదు’’ అని భూమన అన్నారు.రోడ్లను తవ్వడం దారుణం: అప్పలరాజురాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రోడ్లను తవ్వడం దారుణమన్నారు.వైఎస్ జగన్ అంటే భయమెందుకు?: అనంత వెంకటరామిరెడ్డివైఎస్ జగన్ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. సింహాన్ని చూసి భయపడినట్లు ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రులు... జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.సునామీని ఆపగలిగే శక్తి ఉందా?: ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషావైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. ప్రజలను, సునామీని ఆపగలిగే శక్తి ఉందా? అన్న ఇస్సాక్ భాషా.. ముందే నీ ఓటమిని ఒప్పుకుంటున్నవా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే వైఎస్ జగన్ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు. ప్రజలను రాకుండా మీరు చేస్తున్న పనులు హేయమైనవి, దుర్మార్గమంటూ ఆయన విమర్శించారు. మీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడం’’ అని ఇస్సాక్ భాషా తేల్చి చెప్పారు.ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు: వైఎస్ అవినాష్రెడ్డివైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కార్యకర్తలను అడ్డుకుంటుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం పెరిగిపోతోందన్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలను రాకుండా లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. మా ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డుకున్నామా..?. చంద్రబాబు స్వేచ్ఛగా తిరిగి ఎన్నెన్నో విమర్శలు చేశారు. ఏ హోదా లేని పవన్ కళ్యాణ్‌కి కూడా అన్నాడు మేము భద్రత ఇచ్చాం. వీళ్ళని మేము ఎక్కడా అడ్డుకున్నది లేదు. కానీ ఇప్పుడు జగన్‌ను అడ్డుకోవాలని చూడటం దారుణం.ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరు రాకూడదని 5 వేల మంది పోలీసులను వినియోగించారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. గుంటూరు, సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాళ్యం.. ఇలా రోజు రోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం ఎక్కువవుతోంది. మీరు ఎంత అపాలనుకున్నా.. వైఎస్ జగన్ కోసం వచ్చే జనాన్ని మీరు ఆపలేరు. జగన్ భద్రతపై ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆందోళన ఉంది. భద్రతపై కేంద్రాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. -
రెడ్‌బుక్ అరాచకం ఖాకీల క్రౌర్యం
జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ముష్కర మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాష్టీకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. అధికారం చేజిక్కిన రోజు నుంచి ప్రభుత్వ భవనాల శిలాఫలకాల ధ్వంసాలతో ప్రారంభమైన ఆటవిక హింసను పదమూడు నెలలుగా కొనసాగిస్తున్నారు. వీరి చర్యలను అడ్డుకునేందుకు సాహసించలేక సామాన్య ప్రజలు మౌనంగా రోధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో నెలల కాలంగా జైల్లో ఉండేలా చేస్తున్నారు. మరో వైపు రాజకీయ విమర్శల నేపథ్యంలో పచ్చమూకలు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో పోలీసుల సాక్షిగా విధ్వంసం సాగించినా ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరిని పరామర్శించేందుకు వచ్చే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలకు తెరతీశారు. సాక్షిప్రతినిధి, నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు ‘నారా’ ఆటవిక కుట్రలకు తెర తీశారు. రెడ్‌బుక్ అరాచకానికి.. ఖాకీల పైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పర్యటన ఆగదని స్పష్టం కావడంతో పోలీస్ యంత్రాంగం పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆంక్షలు, బెదిరింపులతో భయానక వాతావరణం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఎవరూ వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు జరిగిన జగన్ పర్యటనల కంటే మిన్నగా నెల్లూరుకు ఉప్పెనలా జన ప్రభంజనం పోటెత్తే అవకాశం ఉందని చెప్పడంతో కొత్త కుట్రలకు తెర తీశారు. జిల్లా జైల్లో ఉన్న ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులిచ్చిన పోలీసులు తాజాగా కాకాణిని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం నారా కుట్రలకు అద్దం పడుతోంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కే యత్నం ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కూటమి సర్కార్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితి సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి హత్యాయత్నాలు, దాడులతో భయానక వాతావరణం నెలకొల్పడమే కాకండా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ వికట్టహాసం చేస్తోంది. ప్రభుత్వం చేతిలో కీలు»ొమ్మలుగా మారిన ఖాకీలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపడమే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో పాత నేరస్తులు, రౌడీïÙటర్లు, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతుండటంతో ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారు. పోలీస్ శాఖ పూర్తిగా కూటమి ప్రజాప్రతినిధిల కనుసన్నల్లో పనిచేస్తుండడంతో జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. హత్యలు, అత్యాచారాలతో రౌడీ మూకలు పేట్రేగి పోతున్నా పట్టించుకోని ఖాకీలు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అదుపు తప్పిన శాంతిభద్రతలు జిల్లాలోని కొందరు పోలీసు అ«ధికారులు రెడ్‌బుక్ అమల్లో కనబరుస్తున్న శ్రద్ధ నేరాల అదుపులో చూపడం లేదు. దీంతో శాంతిభద్రతలు క్షీణదశకు చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుశాఖలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. పోస్టింగ్‌లన్నీ దాదాపు అధికా ర పార్టీ నేతలను ప్రసన్నం చేసిన వారికే దక్కాయి. దీంతో సదరు పోలీసు అధికారులు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడువుగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమపై దాడు లు, దౌర్జన్యాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు పోలీసులకు చేస్తోన్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నా యి. అందుకు శంకరనగరంలో జరిగిన దౌర్జన్యకాండే నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరంలో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఆమెపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్‌రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్‌రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. జైలునుంచి బయట కు వచ్చినా వారిపై దౌర్జన్యాలు అధికమవడంతో అనేకమంది ఊరు విడిచి వెళ్లిపోయారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు వెలిశాయి. గంజాయి, మద్యం 24 గంటలూ అందుబాటులో ఉండడంతో మత్తులో నేరాలు జరుగుతున్నాయి. గచడిన ఏడాదికాలంలో జిల్లాలో 42కుపైగా హత్యలు, 165కుపైగా హత్యాయత్నాలు, 33కుపైగా బాలికలపై లైంగికదాడులు, దాడియత్నాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే గడిచిన ఏడునెలల్లో 13కుపైగా హత్యలు జరగడం శాంతిభద్రతలు ఏస్థాయిలో క్షీణదశకు చేరాయో ఇట్టే అవగతమవుతోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి పెద్దల పైశాచిక చర్యలపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లపరెడ్డి ఇంట్లో విధ్వంసం చేసినా దిక్కులేదు జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కూటమి నేతలు నీచ సంస్కృతికి తెరలేపారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతో వందలాది మంది టీడీపీ ముష్కర మూకలు సాగించిన విధ్వంసంపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 7న రాత్రి వేళ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో కూడా విధ్వంసకారులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విధ్వంసం జరిగిన తీరు, చేసిన వ్యక్తులకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రసన్నకుమార్‌రెడ్డి దర్గామిట్ట పోలీసులకు అందజేíశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు కేసు నమోదులో తీవ్ర జాప్యం చేశారు. ఆరు రోజుల అనంతరం నామమాత్రపు సెక్షన్లతో గుర్తులేని వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆగమేఘాల మీద నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, మరో ముగ్గురిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలపై తమ పచ్చభక్తిని చాటుకున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసకర చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించినా పోలీసులు ఎఫ్ఐఆర్తో సరిపట్టారు. కాకాణిపై రుస్తుం కేసుతో.. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమల్లో అసమర్థత, అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ వచ్చారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు. దీనిని జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 13 అక్రమ కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులపై కేసులు బనాయించి హక్కులను కాలరాస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ, అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఎక్సైజ్ శాఖలో చార్జిషిట్ వేసిన కేసుల్లో సైతం పునరి్వచారణ పేరుతో కాకాణిని నిందితుడిగా చేర్చుతూ కేసుల పరంపర కొనసాగిస్తూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. ఆయన జైలు నుంచి బయటకు వస్తే మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావించి సంబంధం లేని కేసుల్లో ఆయన పేరును ఇరికించి 67 రోజులుగా వేధిస్తోంది. ఆయా కేసుల్లో బెయిల్ రాకుండా పోలీస్ కస్టడీ విచారణ పేరుతో అడ్డుకుంటోంది. సీడీ ఫైల్స్ లేకుండానే పోలీసులు కస్టడీ వేస్తూ కాకాణిపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే కేసులోనే మాజీ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌ను ఇరికించినట్లు తెలుస్తోంది. -
Updates: నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
జగన్ నెల్లూరు పర్యటన.. ఎప్పటికప్పటి అప్డేట్స్నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటనఅక్రమ కేసుల్లో అరెస్టై నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి జగన్ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులంటూ ఫైర్ 👉నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి నేను వెళ్ళకూడదా? - వైఎస్ జగన్ నా వెనుక జనం రాకుండా , నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..?జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ?బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే... ఎందుకు ఇంత భయపడుతుంది..?తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడువిద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారుఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి , రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదుఅన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందిమా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారురోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారుమా పార్టీ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడులు చేశారుతప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారుఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ?రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారుపోలీసుల ద్వారా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు👉ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుకాకాణిపై ఏకంగా 14 తప్పుడు కేసులు పెట్టారుప్రెస్మీట్లోని తన క్లిప్పింగ్‌లను వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసు పెట్టారురాజకీయ నాయకుడు ప్రెస్‌మీట్ పెడితే దాన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా? 👉ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారుఏ ఉచితంగా ఇసుక ఎక్కడ ఇస్తున్నారుఇసుక పేరుతో అడ్డంగా దోపిడీకి తెరతీశారు👉నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్ అంటూ వెన్నుపోటురాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందిచంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేవారిని గొంతు నొక్కేస్తున్నారు.జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారునాడు నేడు ఆగిపోయింది.. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందిరైతన్న పంటకు గిట్టుబాటు ధర లేదుచంద్రబాబు రాజ్యంలో రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం👉ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి: వైఎస్జగన్రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందినా పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు?జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు👉ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్టీడీపీ గుండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్రెడ్డిఇంటిని, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన పచ్చ మూక.. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబ సభ్యులుప్రసన్న కుమార్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఇంటిని పరిశీలిస్తున్న వైఎస్ జగన్👉నెల్లూరులో జన ప్రభంజనంవైఎస్ జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలుదారి పొడవునా వైఎస్ జగన్‌కు ఉప్పొంగిన జనాభిమానంజనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులునెల్లూరులో ఎక్కడ చూసినా జన ప్రవాహంపోలీసుల ఆంక్షలను లెక్క చేయని ప్రజలు 👉ఆంక్షల ఆటంకాలను దాటుకుని తరలివస్తున్న కార్యకర్తలుజగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న గవర్నమెంట్ ఆస్పత్రి సెంటర్రోడ్ల పైకి వస్తున్న వాహనాలను, వైసీపీ కార్యకర్తలను వీడియో రికార్డ్ చేస్తున్న పోలీసులుపోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, భయబ్రాంతులకు గురి చేసిన వైఎస్ జగన్‌ని కలుస్తామంటున్న కార్యకర్తలు👉జైల్లో మాజీ మంత్రి కాకాణిని పరామర్శించిన వైఎస్ జగన్ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి బయల్దేరిన వైఎస్ జగన్👉ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల అరాచకంవైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేసిన పోలీసులునిరసనగా రోడ్డుపై బైఠాయించిన ప్రసన్నకుమార్రెడ్డిపోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలుపోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలుమా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారు: ప్రసన్నకుమార్రెడ్డిస్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారుప్రజలపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారుజనం రాకుండా రోడ్లు తవ్వేశారువైఎస్జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు 👉నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణికి వైఎస్ జగన్ పరామర్శవైఎస్ జగన్ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుఅనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్న వైఎస్ జగన్ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు👉నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్హెలిప్యాడ్ వద్ద పోలీసుల ఓవరాక్షన్హెలిప్యాడ్ దగ్గర జనాన్ని తరిమేస్తున్న పోలీసులుపొలాల గట్ల మీద నుంచి తరలివచ్చిన కార్యకర్తలుహెలిప్యాడ్ దగ్గర అనుమతి లేదంటూ తరిమేసిన పోలీసులుఅక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉నెల్లూరు నగరం అష్ట దిగ్బంధం.. అణువణువునా ఆంక్షల వలయంగుంటూరు రేంజ్ తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలుచెవుడుగుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలుఅడుగడుగునా బారీకేడ్లు, ముళ్లకంచెలుఅయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి రానున్న వైఎస్ జగన్మెయిన్రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందుల్లో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటుపోలీసుల తీరుపై నగరవాసుల అసహనంరోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం ఆగ్రహంనల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తతతన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆగ్రహంఅక్కడే నిలబడి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి👉మరికాసేపట్లో నెల్లూరుకు వైఎస్ జగన్‌మరికాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్న వైఎస్ జగన్అక్రమ కేసులలో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి సర్కార్ ఆంక్షలుమూడు వేలమందికి పైగా పోలీసుల మోహరింపుప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లు తవ్వేసిన అధికారులు ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లునెల్లూరు జైలు వద్దకు జగన్‌తో పాటు కేవలం 10 మందికే అనుమతికోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి వద్ద 100 మందికి మించి ఉండకూడదని ఆంక్షలు113 మందికి మించి ఉంచితే కేసులు పెడతామని వార్నింగ్👉 నెల్లూరులో మీడియాపై పోలీసుల దౌర్జన్యంమీడియాపైనా పోలీసుల ఆంక్షలుమీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు కవరేజ్‌కు అనుమతి లేదంటూ రిపోర్టర్లను నెట్టేస్తున్న పోలీసులు👉రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: సీదిరి అప్పలరాజురోడ్లను తవ్వడం దారుణంరాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది👉 నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు ఓవరాక్షన్వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులునెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మీడియాపైనా ఆంక్షలురోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసిన పోలీసులుస్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులు👉 నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం: అంబటి రాంబాబుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదుప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందిరోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా?ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది👉నెల్లూరు బయలుదేరిన వైఎస్ జగన్‌కాసేపట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించనున్న జగన్అనంతరం టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్న జగన్👉వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలుజగన్ ప్రయాణించే రూట్స్ లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను గుర్తించడమే టార్గెట్సీసీ కెమెరా రికార్డు అయిన వ్యక్తులపై కేసులు నమోదుకు ప్రయత్నాలువైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలునడక దారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులుబైకులు, నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులుఇనుప కంచెలు, బారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు👉వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు.. చంద్రబాబు సర్కార్ కుట్రలువైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు సర్కార్ ప్రధాన ఏజెండానగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటుచెన్నై-కోల్ కతా హైవేలో సైతం తనిఖీలువైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను సైతం నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులుఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులిచ్చిన పోలీస్ శాఖవార్డు లీడర్స్ దగ్గర నుండి మాజీ మంత్రుల వరకూ నోటీసులుజగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదు అంటూ హెచ్చరికలునిబంధన ఉల్లంఘిస్తే కేసులు తప్పవంటూ బెదిరింపులుపోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కుట్రలకు దిగుతున్న చంద్రబాబు సర్కార్👉మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా నిర్భంధనలుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, అభిమానులను అడ్డుకోవడానికి వ్యూహంభారీగా పోలిసుల మోహరింపు, పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుప్రధాన కూడళ్ల దగ్గర నుండి చిన్న సర్కిల్స్ వరకూ అన్నింటా చెక్ పోస్టులుపోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని కుట్రలకు పూనుకున్న చంద్రబాబు సర్కార్👉నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. అక్రమ కేసులతో జిల్లా కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అక్కడి నుంచి సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు బయలు దేరుతారు10.40 గంటలకు జిల్లా డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు11 గంటలకు జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్11.30 గంటలకు రోడ్డుమార్గాన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు11.50 గంటలకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారుమధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు1.25 గంటలకు హెలిప్యాడ్ నుంచి బెంగళూరు బయలు దేరుతారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.వైఎస్ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. -
అంగీకరించింది కొందరే.. అందరూ కాదు
● మభ్యపెడుతున్న ప్రభుత్వంఉలవపాడు: కరేడు గ్రామంలో కొంతమంది అధికార పార్టీకి చెందిన రైతుల్ని కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించి, అందరూ భూసేకరణకు అంగీకరించారని ప్రకటించడం బాధాకరమని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు, రైతులు స్పష్టం చేశారు. భూసేకరణ కొలిక్కి వచ్చిందని బుధవారం ఓ పత్రికలో (సాక్షి కాదు) ప్రచురించిన వార్తపై తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు మిరియం శ్రీనివాసులు, బత్తుల రమణారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆర్.మోహన్ మాట్లాడారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పత్రికలకు అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఇండోసోల్ కంపెనీ అంగీకరించిందని, 100 ఎకరాలను ఇచ్చేందుకు కొందరు అంగీకారపత్రాలపై సంతకాలు చేశారని మైండ్‌గేమ్ ఆడటం సిగ్గు చేటన్నారు. వారంతా అధికార పార్టీకి చెందిన వ్యక్తులని, ఉద్యమంలో ఉన్న రైతులు కాదని తెలిపారు. గతంలో టెంకాయచెట్లపాళెంలో మీ భూముల జోలికిరామని ఎమ్మెల్యే తెలియజేశారని, ఇప్పుడు మత్స్యకారులను ఆఫీసుకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతులెవరూ భూసేకరణకు ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేతలు జీవీబీ కుమార్, నాయకులు నాంచార్లు, రైతులు మాలకొండారెడ్డి, అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు : కలెక్టర్
నెల్లూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన రహదారులు, బ్రిడ్జి నిర్మాణాలు, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ, భూసేకరణ, జల్‌జీవన్ మిషన్ పనులపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించి వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి సాగునీటి కాలువల మరమ్మతులు, ఇతర పనులు వేగవంతం చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం కూడా త్వరగా చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీహెచ్సీ భవనాలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాల భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సమీక్షిస్తానని, సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. సమావేశంలో సోమశిల, తెలుగుగంగ, ఇరిగేషన్, ఆర్అండ్బీ ఎస్ఈలు వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, దేశ్‌నాయక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని అడిగేదెవరు!
స్థలాన్ని ఆక్రమించి వేసిన లేఅవుట్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): కూటమి నేతలు యథేచ్ఛగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. మమ్మల్ని అడిగేదెవరంటూ దర్జాగా లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇరిగేషన్, ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి లేఅవుట్ వేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలున్నాయి. ఎక్కడంటే.. గాంధీ గిరిజన కాలనీలో రైల్వే ట్రాక్ పక్కన ఇరిగేషన్ స్థలం, దాని పక్కన ప్రభుత్వ స్థలాలున్నాయి. ఆ ప్రాంతంలో మురుగునీరు ప్రవహించేందుకు భూగర్భ డ్రెయినేజీని ఏర్పాటు చేశారు. అయితే కొందరు అక్రమార్కుల దృష్టి ఆ స్థలాలపై పడింది. కాలువను సైతం పూడ్చేసి దానితోపాటు పక్కనే ఉన్న ప్రభుత్వ, ఇరిగేషన్ శాఖలకు చెందిన రూ.కోట్ల విలువైన ఐదెకరాల భూమిని ఆక్రమించారు. సదరు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. భూమిని చదునుచేసి అక్రమంగా లేఅవుట్ వేశారు. 80 ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ఇరిగేషన్, ప్రభుత్వ స్థలం ఆక్రమణ రూ.కోట్ల విలువైన ఐదెకరాల భూమిలో లేఅవుట్ పొర్లుకట్టను కొల్లగొట్టి లేఅవుట్లో రోడ్లు పట్టించుకోని అధికారులు పొర్లుకట్టను తవ్వేసి.. పెన్నానది వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు గతంలో ఏర్పాటు చేసిన పొర్లుకట్టను సైతం అక్రమార్కులు తవ్వేసి గ్రావెల్‌ను లేఅవుట్లో రోడ్లు వేసేందుకు వినియోగించారు. ఇప్పటికే కొందరు లేఅవుట్లో ప్లాట్లను విక్రయించారు. వారంతా నష్టపోయే అవకాశముంది. ఇరిగేషన్, కార్పొరేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. -
‘అపోలో’లో ఎండ్–ఓ చెక్ సేవలు
నెల్లూరు(అర్బన్): మహిళలకు ఎక్కువగా సోకుతున్న గర్భాశయ ముఖద్వారా కేన్సర్లను ముందుగానే గుర్తించి చికిత్స ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు ఎండ్–ఓ చెక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామని అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ స ర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. నెల్లూరు హరనాథపురంలోని అపోలో ఆస్పత్రిలో సర్జికల్ అంకాలజిస్ట్ జీవీవీ ప్రసాద్‌రెడ్డి, సీనియర్ ఆంకాలజిస్ట్ హరిత, యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి ఎండ్–ఓ చెక్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ మహిళలకు ప్రధానంగా సోకుతున్న ఐదు రకాల కేన్సర్లలో అండాశయ, గర్భాశయ కేన్సర్లు మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు ఈ కేన్సర్లు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఎండ్–ఓ చెక్ కార్యక్రమం ద్వారా గర్భాశయ ముఖద్వారా కేన్సర్లపై మహిళలకు అవగాహన కల్పించడం, స్క్రీనింగ్ పరీక్షలను ప్రోత్సహించడం, సరైన చికిత్స అందించడమే అపోలో సంస్థ లక్ష్యమని తెలిపారు. మామపై కోడలి దాడి● కేసు నమోదు దగదర్తి: కుటుంబ వివాదాల నేపథ్యంలో మామ మందలించాడని కోడలు దాడి చేసిన ఘటనపై దగదర్తి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. వారి కథనం మేరకు.. మండలంలోని దామవరం ఎస్సీ కాలనీ చెందిన చిన వెంకయ్య, కోడలు సంపూర్ణమ్మల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈనెల 25వ తేదీన రాత్రి ఇంట్లో వెంకయ్య నిద్రిస్తుండగా రోకలి బండతో కోడలు దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన వెంకయ్యను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కండలేరులో 26.608 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 26.608 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,760, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
అర్జీలపై అధికారుల విచారణ
ఉలవపాడు: కరేడు గ్రామంలో ఈనెల 4వ తేదీన జరిగిన గ్రామసభలో రైతులు అందించిన అర్జీలపై బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, తహసీల్దార్ శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు. వారు ప్రత్యుత్తరంగా మరో అర్జీని చేసి అందించారు. 18వ తేదీ వరకు తమకు సమయం ఉంది కాబట్టి, ఆ గడువులోపు అభ్యంతరాలు తెలియజేస్తామన్నారు. మొత్తం 632 మంది రైతులు ఇదే విధంగా అర్జీని తయారుచేసి అందించారు. కరేడు రైతులు భారీగా తరలివస్తారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
వృద్ధురాలిని బెదిరించి బంగారం దోపిడీ
మనుబోలు: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని దొంగలు బెదిరించి బంగారు గొలుసు, చేతిగాజులు దోపిడీ చేసిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మనుబోలు కోదండరామపురంలోని సాయిబాబా మందిరం ఎదురుగా మాధవగిరి ప్రభావతమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం అర్ధరాత్రి దొంగలు గోడ దూకి ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి ప్రభావతమ్మ ఇంట్లోకి ప్రవేశించారు. నగలు ఇవ్వకుంటే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ప్రభావతమ్మ మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు, నాలుగు సవర్ల గాజులు, ఉంగరం లాక్కొని బయట గడియపెట్టి పరారయ్యారు. ఆమె ఈ విషయంపై కుమారుడు హనుమాచార్యులకు సమాచారం అందించింది. అతను స్థానికులతో కలిసి అమ్మ ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై శివరాకేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బుధవారం కేసు నమోదు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ల దొంగ అరెస్్ట
నెల్లూరు(క్రైమ్): బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు బుధవారం నిందితుని వివరాలను వెల్లడించారు. ఇటీవల తమ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు బైక్ దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితుడు బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన పీట్ల వంశీగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారించగా బైక్‌లను దొంగలించినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.2.50 లక్షలు విలువచేసే రెండు బైక్‌లను స్వాధీ నం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు విజయకుమార్, నవీన్, పీఎస్సై యు.సాయికల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
దర్జాగా భూకబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. కలువాయి మండలంలోని తెలుగురాయపురంలో భూకబ్జా వ్యవహారం బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. ఆ గ్రామంలోని 582, 586, 590, 593, 576, 577, 578 తదితర సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిపై కూటమి నేతల కన్ను పడింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 25వ తేదీన సాక్షిలో ‘బాబోయ్.. భూచోళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ భూముల్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరిగి మే 7వ తేదీన బోర్డులను తొలగించి భూమిని చదును చేసేందుకు తమ్ముళ్లు రంగం సిద్ధం చేశారు. ప్రజలు తహసీల్దార్‌కు సమాచారం అందించాలని చూశారు. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెబుతున్నారు. పక్కరోజు చదును చేస్తున్న భూముల వద్దకు సర్పంచ్ రమణమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బి.నారాయణరెడ్డితోపాటు మరికొందరు వెళ్లారు. హిటాచీ ఆపరేటర్ ప్రజల్ని చూసి వెళ్లిపోయాడు. తాజాగా తెలుగురాయపురం, తోపుగుంట అగ్రహారానికి చెందిన నేతలు దర్జాగా పదెకరాల భూమిని చదును చేసుకుని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.124 లేయర్ రూ.112 బ్రాయిలర్ చికెన్: రూ.224 స్కిన్లెస్ చికెన్: రూ.248 లేయర్ చికెన్: రూ.190 నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.24 సన్నవి : రూ.15 పండ్లు : రూ.5 -
తండ్రిని చూసి వస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున నెల్లూరు ప్రశాంతినగర్ వద్ద చోటుచేసుకుంది. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. నవాబుపేట పోలీసు క్వార్టర్స్‌లో జి.శివకుమార్ (43), స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. శివకుమార్ నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు విడవలూరు మండలం ముదివర్తిలో ఉంటున్నారు. మంగళవారం శివకుమార్ తన తండ్రిని చూసి వస్తానని భార్యతో చెప్పి ముదివర్తికి వెళ్లాడు. అక్కడి నుంచి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై నెల్లూరుకు బయలుదేరాడు. ప్రశాంతినగర్ జంక్షన్ దాటి కొద్దిదూరం వచ్చేసరికి బైక్ మరమ్మతులకు గురైంది. దీంతో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం శివకుమార్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్, నవాబుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్వరూప నార్త్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. శివకుమార్ మృతికి ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీహరి సంతాపం తెలిపారు. -
అధికారులకు వర్క్‌షాప్
నెల్లూరు రూరల్: అగ్రిస్టాక్, ఏఐ ద్వారా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే మార్పులపై నెల్లూరులోని కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో బుధవారం అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒ.ఆనంద్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, జిల్లా కో–పరేటివ్ అధికారి గుర్రప్ప, మార్కెటింగ్ ఏడీ అనిత తదితరులు పాల్గొన్నారు. 8 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ దగ్ధం● సుమారు రూ.కోటి నష్టం కావలి(జలదంకి): కావలి రూరల్ మండలం తుమ్మలపెంట 33 కేవీ సబ్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో 8 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది. సిబ్బంది అప్రమత్తమై కావలి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో గురువారం సాయంత్రం వరకు విద్యుత్ నిలిచిపోయింది. ఈ ఘటనపై రూరల్ ట్రాన్స్‌కో ఏఈ చేజర్ల శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎక్కువగా మోటార్లు బిగించి ఉన్నారని, దీంతో బ్రేకర్లు పడిపోయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందన్నారు. దీని విలువ రూ.కోటి ఉంటుందన్నారు. జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు రేపునెల్లూరు(బృందావనం): నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా బాస్కెట్‌బాల్ బాలబాలికల జూనియర్ జట్ల ఎంపికలు జరుగనున్నాయని ఆ అసోసియేషన్ కార్యదర్శి గాధం వాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 14 నుంచి 17వ తేదీ వరకు పిఠాపురంలోని ఓబీఎస్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జరిగే 10వ ఆంధ్రప్రదేశ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఎంపికకు హాజరయ్యే వారు 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించినవారై ఉండాలన్నారు. అందుకు సంబంధించిన వయసు ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలన్నారు. తమపేర్లను వ్యాయామ విద్య ఉపాధ్యాయులు డి.కృష్ణమోహన్, వి.చైతన్యల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 94408 79884 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని తెలియజేశారు. యువకుడి ఆత్మహత్య సింగరాయకొండ: అనారోగ్య కారణాలతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాళెం పంచాయతీ అంబేడ్కర్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన నాగరాజు తన తల్లితో కలిసి ఊళ్లపాళెంలోని అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఏడో తరగతి చదివిన నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో బహిర్బూమికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఊరి శివారులో వేపచెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై బి.మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అభిమాన కెరటాన్ని ఆపలేరు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. జగననన్న పర్యటనకు వచ్చే అభిమాన కెరటాన్ని అడ్డుకోవాలనుకుంటే ఎవరైనా జనసంద్రంలో కొట్టుకుపోతారన్నారు. పొదలకూరురోడ్డులోని సుజాతమ్మ కాలనీలోని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో బుధవారం అనిల్‌కుమార్‌యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఓ మాజీ మంత్రి అక్రమ అరెస్ట్‌లు, మరో మాజీ మంత్రి ఇంట్లో విధ్వంసాలు జరిగితే పరామర్శించేందుకు వస్తున్న జగనన్నను చూస్తే అధికారంలో ఉన్న వారికి ఎందుకింత భయమో అర్థం కావడం లేదన్నారు. నెల్లూరు జిల్లా మొదటి నుంచి వైఎస్సార్సీపీకి కంచుకోట. బాబు అబద్ధాలను, మోసాలను సంవత్సరంలోపే ప్రజలు గుర్తించడంతో జగనన్న ఎక్కడకు వచ్చినా విపరీతంగా అభిమానులు వస్తున్నారన్నారు. అభిమానుల రాకను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం పోలీసులతో ఎప్పు డూ లేని విధంగా చేస్తుందన్నారు. 46 మండలాల్లో ఎస్సైలతో ప్రెస్మీట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మీటింగ్‌లకు వస్తే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇచ్చారంటే ఎంత కుట్రో ప్రజల కు అర్థమైందన్నారు. ఈ నోటీసులు ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడిని చూసేందుకు వస్తున్నారని తెలిపారు. జిల్లాలో తడ నుంచి సీతారామపురం, కందుకూరు వరకు ప్రతి మారుమూల ప్రాంతం నుంచి అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంక్షలు విధించే కొద్ది అభిమానులు జగన్మోహన్రెడ్డిని చూసేందుకు విపరీతంగా వస్తున్నారని, వారిని ఎవరూ ఆపలేరన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా ఎవరూ భయపడడం లేదని తెలిపారు. రాజకీయాలు కొంత మందికి కొత్త అని, రాజకీయాల్లో శాశ్వతం ఉండదని, గతంలో తాము అధికారంలో ఉన్నామని, ఇప్పుడు మోసపూరి త హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. పాలన వదిలేసి పోలీసులతో భయపెట్టి ఎంత మందిని ఆపగలరన్నారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానంటే తనకు భయమేమి లేదని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరిపై కేసులు పెడితే ఉన్న జైలు చాలవని, ప్రభుత్వం కొత్త జైలును కట్టించుకోవాల్సి వస్తుందన్నారు. 4వ తేదీన తనను అరెస్ట్ చేస్తారని చాలా మంది రాజకీయ ఊహాగానాలు చేస్తున్నారన్నారు. అక్రమ అరెస్ట్‌లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభు త్వం చేసిన అరాచకాలను, వాటికి గురైన బాధితులను పరామర్శించేందుకు వస్తున్న తమ అధినేత జగన్మోహన్రెడ్డి పర్యటనలో జిల్లా ప్రజలు తమ సత్తా చాటాలని, ఈ దెబ్బకు కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్రెడ్డి, ఆయన కార్యకర్తలు, అభిమానులు అంటే ఏమిటో తెలిసి వస్తుందని తెలిపారు. ఏ బెదిరింపులకు భయపడకుండా ప్రతి ఒక్కరూ జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగనన్న పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు కుట్రలు జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోట కేసులకు భయపడే వాళ్లు ఎవరూ లేరు నెల్లూరు జనసంద్రంగా మారుతోంది మాజీ మంత్రి పొలుబోయిన అనిల్‌కుమార్ -
కాకాణిపై రుస్తుం కేసుతో..
నల్లపరెడ్డి ఇంట్లో విధ్వంసం చేసినా దిక్కులేదు ఏయ్ పోలీస్.. జగన్ పర్యటకు జనాలు ఒక్కరూ రాకుండా అరెస్ట్ చేయ్ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో టీడీపీ గూండాల విధ్వంసంసాక్షిప్రతినిధి, నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు ‘నారా’ ఆటవిక కుట్రలకు తెర తీశారు. రెడ్‌బుక్ అరాచకానికి.. ఖాకీల పైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పర్యటన ఆగదని స్పష్టం కావడంతో పోలీస్ యంత్రాంగం పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆంక్షలు, బెదిరింపులతో భయానక వాతావరణం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఎవరూ వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు జరిగిన జగన్ పర్యటనల కంటే మిన్నగా నెల్లూరుకు ఉప్పెనలా జన ప్రభంజనం పోటెత్తే అవకాశం ఉందని చెప్పడంతో కొత్త కుట్రలకు తెర తీశారు. జిల్లా జైల్లో ఉన్న ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులిచ్చిన పోలీసులు తాజాగా కాకాణిని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం నారా కుట్రలకు అద్దం పడుతోంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కే యత్నం ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కూటమి సర్కార్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితి సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి హత్యాయత్నాలు, దాడులతో భయానక వాతావరణం నెలకొల్పడమే కాకండా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ వికట్టహాసం చేస్తోంది. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిన ఖాకీలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపడమే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతుండటంతో ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారు. పోలీస్ శాఖ పూర్తిగా కూటమి ప్రజాప్రతినిధిల కనుసన్నల్లో పనిచేస్తుండడంతో జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. హత్యలు, అత్యాచారాలతో రౌడీ మూకలు పేట్రేగి పోతున్నా పట్టించుకోని ఖాకీలు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అదుపు తప్పిన శాంతిభద్రతలు జిల్లాలోని కొందరు పోలీసు అఽధికారులు రెడ్‌బుక్ అమల్లో కనబరుస్తున్న శ్రద్ధ నేరాల అదుపులో చూపడం లేదు. దీంతో శాంతిభద్రతలు క్షీణదశకు చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుశాఖలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. పోస్టింగ్‌లన్నీ దాదాపు అధికా ర పార్టీ నేతలను ప్రసన్నం చేసిన వారికే దక్కాయి. దీంతో సదరు పోలీసు అధికారులు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడువుగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమపై దాడు లు, దౌర్జన్యాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు పోలీసులకు చేస్తోన్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నా యి. అందుకు శంకరనగరంలో జరిగిన దౌర్జన్యకాండే నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరంలో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఆమైపె దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్‌రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్‌రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. జైలునుంచి బయట కు వచ్చినా వారిపై దౌర్జన్యాలు అధికమవడంతో అనేకమంది ఊరు విడిచి వెళ్లిపోయారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు వెలిశాయి. గంజాయి, మద్యం 24 గంటలూ అందుబాటులో ఉండడంతో మత్తులో నేరాలు జరుగుతున్నాయి. గచడిన ఏడాదికాలంలో జిల్లాలో 42కుపైగా హత్యలు, 165కుపైగా హత్యాయత్నాలు, 33కుపైగా బాలికలపై లైంగికదాడులు, దాడియత్నాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే గడిచిన ఏడునెలల్లో 13కుపైగా హత్యలు జరగడం శాంతిభద్రతలు ఏస్థాయిలో క్షీణదశకు చేరాయో ఇట్టే అవగతమవుతోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి పెద్దల పైశాచిక చర్యలపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు వైఎస్ జగన్ పర్యటన నెల్లూరు (క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. అక్రమ కేసులతో జిల్లా కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అక్కడి నుంచి సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు బయలు దేరుతారు. – 10.40 గంటలకు జిల్లా డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11 గంటలకు జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్. 11.30 గంటలకు రోడ్డుమార్గాన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు. 11.50 గంటలకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు 1.25 గంటలకు హెలిప్యాడ్ నుంచి బెంగళూరు బయలు దేరుతారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ముష్కర మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాష్టీకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. అధికారం చేజిక్కిన రోజు నుంచి ప్రభుత్వ భవనాల శిలాఫలకాల ధ్వంసాలతో ప్రారంభమైన ఆటవిక హింసను పదమూడు నెలలుగా కొనసాగిస్తున్నారు. వీరి చర్యలను అడ్డుకునేందుకు సాహసించలేక సామాన్య ప్రజలు మౌనంగా రోధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో నెలల కాలంగా జైల్లో ఉండేలా చేస్తున్నారు. మరో వైపు రాజకీయ విమర్శల నేపథ్యంలో పచ్చమూకలు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో పోలీసుల సాక్షిగా విధ్వంసం సాగించినా ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరిని పరామర్శించేందుకు వచ్చే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలకు తెరతీశారు. పేట్రేగిపోతున్న టీడీపీ ముష్కర మూకలు వైఎస్సార్సీపీ వర్గీయులపై భౌతిక దాడులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసాలు కాకాణిపై కొనసాగుతోన్న అక్రమ కేసులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ఇంట్లో బీభత్సంపై చర్యలు శూన్యం నేటి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ఉప్పెనలా జన ప్రభంజనం ఇంటెలిజెన్స్ నివేదికలతో కుట్రలకు పదును పెట్టిన పోలీసులు కాకాణిని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కూటమి నేతలు నీచ సంస్కృతికి తెరలేపారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతో వందలాది మంది టీడీపీ ముష్కర మూకలు సాగించిన విధ్వంసంపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 7న రాత్రి వేళ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో కూడా విధ్వంసకారులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విధ్వంసం జరిగిన తీరు, చేసిన వ్యక్తులకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రసన్నకుమార్‌రెడ్డి దర్గామిట్ట పోలీసులకు అందజేిశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు కేసు నమోదులో తీవ్ర జాప్యం చేశారు. ఆరు రోజుల అనంతరం నామమాత్రపు సెక్షన్లతో గుర్తులేని వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆగమేఘాల మీద నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, మరో ముగ్గురిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలపై తమ పచ్చభక్తిని చాటుకున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసకర చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించినా పోలీసులు ఎఫ్ఐఆర్తో సరిపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమల్లో అసమర్థత, అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ వచ్చారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు. దీనిని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 13 అక్రమ కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులపై కేసులు బనాయించి హక్కులను కాలరాస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ, అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఎకై ్సజ్ శాఖలో చార్జిషీట్ వేసిన కేసుల్లో సైతం పునర్విచారణ పేరుతో కాకాణిని నిందితుడిగా చేర్చుతూ కేసుల పరంపర కొనసాగిస్తూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. ఆయన జైలు నుంచి బయటకు వస్తే మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావించి సంబంధం లేని కేసుల్లో ఆయన పేరును ఇరికించి 67 రోజులుగా వేధిస్తోంది. ఆయా కేసుల్లో బెయిల్ రాకుండా పోలీస్ కస్టడీ విచారణ పేరుతో అడ్డుకుంటోంది. సీడీ ఫైల్స్ లేకుండానే పోలీసులు కస్టడీ వేస్తూ కాకాణిపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే కేసులోనే మాజీ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌ను ఇరికించినట్లు తెలుస్తోంది. -
నగరం దిగ్బంధం
జగన్ పర్యటనపై నిఘా నేత్రం ● 891 మందితో పోలీసుల బందోబస్తు ● జగన్ భద్రత కోసమా.. అభిమానుల కట్టడి కోసమా? నెల్లూరు (క్రైమ్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు. 891 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు అడుగడుగునా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందుకు తగిన విధంగా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకే అనేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సత్యసాయి జిల్లా రాప్తాడు నుంచి, ప్రకాశం జిల్లా పొదిలి, గుంటూరు మిర్చియార్డు, పల్నాడు జిల్లా రెంటళ్లపాడు, చిత్తూరు జిల్లా పూతలపట్టులోని బంగారుపాళ్యంలో పరిస్థితులు అందుకు అద్దాం పట్టాయి. జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు పటిష్ట భద్రత కల్పించామని చెప్పినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. కేవలం ప్రజలను, వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునే పనుల్లోనే పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో నెల్లూరులోనూ పోలీసు అధికారులు వ్యవహరించనున్నారనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని, ప్రజలు గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జనసమీకరణ చేసినా, ప్రదర్శనలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికిపైగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు అందజేశారు. ఆంక్షలను దాటి వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకునేందుకు ఈ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు (బృందావనం): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి బుజబుజనెల్లూరు మీదుగా నెల్లూరు నగరంలో సుజాతమ్మకాలనీలో ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వరకు సీసీ కెమెరాల ఏర్పాటు వెనుక ప్రభుత్వం, పోలీసుల కుట్రలు ఉన్నాయని స్పష్టవుతోంది. ఇదంతా వైఎస్ జగన్ భద్రత పర్యవేక్షణ కోసం అనుకుంటే పొరపాటే. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున కుట్రలు చేసిన ప్రభుత్వం పోలీసులతో ఆంక్షలు, అడ్డంకులతో కుతంత్రానికి తెరతీసింది. ఆయన పర్యటనకు ఎవరూ రావొద్దంటూ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు నోటీసులు జారీ చేశారు. ఆంక్షలు అతిక్రమించి వస్తే అక్రమ కేసుల నమోదు చేయడానికే నిఘా కెమెరాలు ఏర్పా టు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్ నగర్ నుంచి బుజబుజనెల్లూరు వైపు నుంచి కేంద్ర కారాగారానికి దారి తీసే మార్గంలో వాహనాలు, ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు కేంద్ర కారాగారానికి సుమారు 500 మీటర్ల దూరంలో బారికేడ్లు సిద్ధం చేశారు. -
అడుగడుగునా బారికేడ్లు, చెక్‌పోస్టులు
నెల్లూరు (క్రైమ్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రహదారుల దిగ్బంధం వైఎస్ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. కారాగారం చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం హెలిప్యాడ్ నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ట్రయల్ కాన్వాయ్ జరిగింది. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ములాఖాత్ అనంతరం చెముడుగుంట, బుజబుజనెల్లూరు జాతీయ రహదారి, అయ్యప్పగుడి మీదుగా జగన్ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళతారు. దీంతో ఆయా ప్రాంతాలను పోలీసు అధికారులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటించే ప్రాంతంలో 10 డ్రోన్లు, 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇదంతా ఆంక్షల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నగరంలో ఏర్పాట్లు చూస్తున్న ప్రజలు.. వైఎస్ జగన్ వస్తుంటే ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్‌ను నిలువరించలేరు: ఎస్వీ సతీష్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఇప్పటికే జిల్లాలో రెండు వేల మందికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.మహిళా నేతల ఇంటికి అర్థరాత్రి సమయాల్లో వెళ్ళి నోటీసుల పేరుతో వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పర్యటనకు ఎవరూ వెళ్ళకూడదంటూ ప్రభుత్వమే అడ్డుకోవడం చూస్తుంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలనుకునే అవివేకమే కనిపిస్తోందని అన్నారు. ఇంకా వారేమన్నారంటే..ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఎస్పీ సెలవుపై వెళ్లిపోయారు: సతీష్రెడ్డివైఎస్ జగన్ గురువారం నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమ కేసుల్లో జైలుపాలైన మా పార్టీ నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించడానికి రావాలని నిర్ణయించుకుంటే పోలీసుల ఆంక్షల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. హెలిప్యాడ్‌కి స్థలం కేటాయింపు దగ్గర నుంచి నాయకులను అడ్డుకోవడం వరకు అడుగడుగునా వైఎస్ జగన్‌ని రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరులో 2 వేల మందికి పైగా నోటీసులిచ్చారు.పట్టాభిరామిరెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడికి కూడా నోటీసులిచ్చారు. అర్ధరాత్రి 1.26 గంటలకు టూటౌన్ ఎస్సై ఒక మహిళ కార్పొరేటర్‌ను నిద్రలేపి నోటీసులిచ్చి వెళ్లారు. వారితో కనీసం ఒక మహిళా కానిస్టేబుల్‌ను కూడా తీసుకురాలేదు. జగన్ కార్యక్రమానికి వెళితే మీ వాహనాలను సీజ్ చేస్తామని కిరాయి వాహనాల యజమానులకు నోటీసులిచ్చారు.ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చూడలేక, వాటిలో భాగంకాలేక, అధికార పార్టీ పెట్టే ఒత్తిడిని తట్టుకోలే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి వైయస్ జగన్ పర్యటను ఆపలేరు. వైయస్ జగన్ కోసం వచ్చే జన ప్రభంజనాన్ని అడ్డుకోలేరు. వైయస్ పర్యటనలకు జనాన్ని రాకుండా అడ్డుకోవడమంటే అరచేతితో సూర్యకిరణాలను ఆపాలనుకోవడమే అవుతుంది.ప్రశాంతమైన నెల్లూరులో ప్రతీకార రాజకీయాలకు తెరదీశారు:దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలకు తెరదీస్తున్నారు. సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడి చేసి ఫర్నీచర్ పగలగొట్టి కారు మీద పెట్రోల్ పోసి తగలబెడితే, ఇంటిని ధ్వంసం చేస్తే నిందితుల మీద పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. మరీ విచిత్రంగా దాడి జరిగిన సమయంలో పోలీసులే అక్కడే ఉండి కూడా గూండాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామయంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.ప్రజా సమస్యల మీద వైయస్ జగన్ బయటకొచ్చి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. గుంటూరు, పొదిలి, సత్తెనపల్లి, బంగారుపాళ్యెం పర్యటనలకు వెళితే అక్కడి నాయకులను అక్రమంగా నిర్బంధించారు. పర్యటన తర్వాత వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని కూడా వైఎస్ జగన్ మీదకి నెట్టి క్షుద్ర రాజకీయం చేశారు.ప్రజా సమస్యలను వినిపిస్తున్న సాక్షి ఛానెల్ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎంతసేపటికీ వైయస్ జగన్‌ని అడ్డుకోవాలని, వైఎస్సార్సీపీని లేకుండా చేయాలనే ఆరాటం తప్ప, ఓటేసిన ప్రజలకు న్యాయం చేద్దామని, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామన్న ఆలోచన చంద్రబాబుకి, లోకేష్‌కి ఉన్నట్టు కనిపించడం లేదని ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డిగత వారం పది రోజులుగా నెల్లూరులో నెలకొన్న పరిస్ధితులు చూస్తే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది రాక్షస పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. నెల్లూరులో జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి నాయకులు చేయని ప్రయత్నం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కార్యక్రమానికి రాకుండా చేయాలని చూస్తున్నారు. హెలిప్యాడ్‌కి అనుమతుల విషయంలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్‌ను కలవనివ్వకండా జనాన్ని ఆంక్షల పేరుతో కట్టడి చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారనేందుకు గతంలో జరిగిన పర్యటనలే నిదర్శనం. ప్రశాంతంగా జరిగే పర్యటనలను కావాలనే రెచ్చగొట్టి, కార్యకర్తలను, అభిమానులు ఇబ్బందిపెట్టి విఫలం చేయాలని పోలీసులను పావులుగా చంద్రబాబు, లోకేష్‌లు వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. -
రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. అక్కడ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి, అనంతరం కాకాణి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అక్కడినుంచి నెల్లూరు సుజాతమ్మ కాలనీకి చేరుకుని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
Jagan Tour: మునుపెన్నడూ చూడని ఆంక్షల చెర ఇది!
సాక్షి, నెల్లూరు: నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆయన ఆ పని స్వేచ్ఛగానే చేశారు. ఏనాడూ.. ఏ పర్యటనకు ఆటంకాలు ఎదురైంది లేదు.. ఆంక్షలు విధించింది లేదు. అలాంటిది జగన్ జనాల్లోకి వస్తున్నారంటే మాత్రం.. సింగపూర్ పర్యటనలో ఉన్నాసరే చంద్రబాబు ఎందుకనో వణికిపోతున్నారు!. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షల విధింపు కనిపిస్తోంది. జగన్ పర్యటన హైలైట్ కావొద్దని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులతో బెదిరింపులు చేయించింది. జనసమీకరణ జరగొద్దని మైకులతో ప్రచారం చేయిస్తోంది. పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది.ఇప్పటికే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నేతలకూ పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జగన్ పర్యటనకు రాకూడదంటూ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో.. కేసులు పెడతామంటూ కార్యకర్త స్థాయి వాళ్లకూ పోలీసు బెదిరింపులు వెళ్తుండడం గమనార్హం. మాజీ మంత్రి కాకాణితో ములాఖత్‌తో పాటు టీడీపీ గుండాల చేతిలో తృటిలో దాడి నుంచి తప్పించుకున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సి ఉంది. సాధారణంగానే.. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా తరలి వస్తారు. అందునా కూటమి ప్రభుత్వ వ్యతిరేకత అనేది జగన్ పర్యటన రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పర్యటనలకు జనాన్ని దూరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా.. జగన్ నెల్లూరు పర్యటనకి 113 మందికి మించకూడదని వింత ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీ, రోడ్ షోకి అనుమతి లేదంట. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే అనుమతి ఉందట. అంతకు మించి గుమిగూడితే.. కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే.. జగన్ పర్యటన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తాత్సారం చేసిన పోలీసులు చివరాఖరికి 10 మందికే అనుమతి ఉందంటూ చెప్పడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా షరతులు పెడుతున్న ఏపీ పోలీసులపై, వాళ్ల బెదిరింపులపై, నోటీసుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. -
ప్రియుడిని ఇంటికి పిలిచి ..?
నెల్లూరు జిల్లా: వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ వివాహేతర సంబంధలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది. ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ హత్య చేసింది ప్రియురాలు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్‌కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ప్రవళిక సంచలన ఆరోపణలుఅయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్‌ని ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. మార్చురీ వద్ద ప్రవళ్లిక మీడియాతో మాట్లాడుతూ తరుణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అతడిని స్నేహితురాలే హత్య చేసి కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పదే పదే జగన్ పర్యటనకు అడ్డంకులు.. ఇప్పుడు తాజాగా
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్కడ పర్యటిస్తున్నా.. కూటమి సర్కార్ (Kutami Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల చిత్తూరు బంగారుపాళ్యంలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. నెల్లూరులోనూ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌తో గురువారం(జులై 31) వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇందుకు వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో ఈ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.నెల్లూరు వ్యాప్తంగా జగన్ పర్యటన సందర్భంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది కూటమి సర్కార్. ఈ నెల మొదట్లోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. హెలిప్యాడ్ అనుమతులను నిరాకరించింది. ఇప్పుడేమో.. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు.కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పోలీసు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడ చూసినా చెక్‌పోస్టులు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనకు జనసమీకరణ చేసినా.. స్వచ్ఛందంగా జనం గుంపుగా వచ్చినా చర్యలు తప్పవంటూ అనౌన్స్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిసతే కఠిన చర్యలు, కేసులు తప్పవంటూ బెదిరిస్తున్నారు.జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసుల తీరుపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు.. కర్ఫ్యూను తలపించే ఆంక్షలతో అటు ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం
● ఆటో బోల్తా ● ముగ్గురికి గాయాలు సోమశిల: చేజర్ల మండల పరిధిలోని పడమటికండ్రిక వద్ద ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. బుజబుజనెల్లూరుకు చెందిన ఓ కుటుంబం దాచూరులోని నాగార్పమ్మ ఆలయానికి ఆటోలో బయలుదేరింది. పడమటికండ్రిక గ్రామానికి సమీపంలో రోడ్డు కుంగిపోవడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రోడ్డు కుంగిపోవడంతో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఆహా.. కట్టుకథలు చూడండి
ఉలవపాడు: కూటమి ప్రభుత్వంలో పోలీసులు పాలకులు చెప్పినట్లుగా తలూపుతూ జీ హుజూర్ అంటున్నారు. ఈనెల 25వ తేదీ అర్ధరాత్రి గిరిజన మహిళలను అరెస్ట్ చేసి తీసుకొచ్చారని వందలాది మంది స్టేషన్ ముందు ధర్నా చేస్తే.. పోలీసులు మాత్రం తాపీగా 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో చూపించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అర్ధరాత్రి అరెస్ట్‌లు దారుణమని ఖండించిన తర్వాత కూడా సమయం మార్చి చూపించడమంటే కోర్టును తప్పుదోవపట్టించడమే కదా అనే అనుమానం కలగక మానదు.రిమాండ్ రిపోర్టులో ఇలా..ఈనెల 25వ తేదీ కరేడు పంచాయతీ రామకృష్ణాపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు, రైతు ఉద్యమ నాయకుడు మిరియం శ్రీను, ఉపాధ్యాయు డు కేశవరపు జాలిరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇండోసోల్ ప్రాజెక్ట్ భూములకు వ్యతిరేకంగా వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శేషమ్మ అనే మహిళ వెళ్లలేదు. ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి సిద్ధంగా ఉందని రిపోర్టులో రాశారు. నేతల సమావేశం పూర్తై వెళ్లిన తర్వాత శేషమ్మ గ్రామంలోని కల్పన కూల్‌డ్రింక్ షాపు వద్ద ఉన్న సమయంలో ముగ్గురు మహిళలు వెళ్లి గొడవ చేసి గాయపరిచినట్లు పొందుపరిచారు. ఈ విషయమై శేషమ్మ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదేరోజు రాత్రి 10 గంటలకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం వైద్యాధికారికి ఫిర్యాదును పంపించారు. ఎస్సై అంకమ్మ అదేరోజు రాత్రి రామకృష్ణాపురంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి చేశారని చెబుతున్న గిరిజన మహిళలకు నోటీసులు అందించి స్టేషన్‌కు తిరిగొచ్చారు. సదరు మహిళలు స్టేషన్‌కు వచ్చారు. అయితే వారు ఎన్ని గంటలకు వచ్చారనే సమయాన్ని రిపోర్టులో చేర్చలే దు. 26వ తేదీన వైద్యాధికారి శేషమ్మకు గా యాలు అధికంగా ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో మెమో దాఖలు చేశారు. సదరు మహిళల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే మరికొందరిపై దాడి చేసే పరిస్థితి ఉందని రిపోర్టులో వెల్లడించారు. ముగ్గురు గిరిజన మహిళల్ని ఏ1, ఏ2, ఏ3గా పెట్టి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్ వద్దే అరెస్ట్ చేసినట్లు చూపించారు. మహిళా పోలీసుల సమక్షంలో 13.15 నిమిషాలకు కోర్టుకు హాజరుపరుస్తూ పూర్తి విచారణ చేసేందుకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని ఎస్సై అంకమ్మ కోర్టుకు విన్నవించినట్లు రిపోర్టులో ఉంది. దీనిపై ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
తండ్రిని వెతుక్కుంటూ..
మనుబోలు: ఉపాధి కోసం ఇతర ప్రాంతానికి బయలుదేరి తప్పిపోయిన తన తండ్రిని వెతుక్కుంటూ కుమార్తె తన భర్తతో కలిసి రాష్ట్రాలు దాటి మంగళవారం మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. అసోం రాష్ట్రానికి చెందిన దింభేశ్వరి స్విర్గియారి అనే 50 ఏళ్ల వయసున్న వ్యక్తి రైల్లో బెంగళూరుకు బయలుదేరాడు. 23వ తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో దిగాడు. అయితే తిరిగి రైలు ఎక్కలేకపోయాడు. దీంతో అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయలుదేరాడు. మనుబోలు వద్ద వేకువజామున కాలకృత్యాల కోసం బస్సు ఆపగా దిగాడు. తిరిగి ఎక్కకపోవడంతో సిబ్బంది అతడి బ్యాగు, అందులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమార్తె సోనియా, అల్లుడు సుబ్బు మనుబోలుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..● వ్యక్తి మృతి దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథ నం మేరకు.. మారు పూడి భాస్కర్ (45) దగదర్తి వాసి. సోమ వారం రాత్రి నెల్లూరు నుంచి తన స్వగ్రామమైన దగదర్తికి బైక్‌పై వస్తున్నాడు. సున్నపుబట్టి జామాయిల్ చెట్ల వద్దకు రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. భారీ వాహనాలు శరీరంపై దూసుకెళ్లడంతో ఛిద్రంగా మారింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భాస్కర్ బోగోలు మండలం నాగులవరం సచివాలయ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ సస్పెండ్ అయ్యాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ మంగళవారం తెలిపారు. కేసుల పేరుతో భయపెట్టి రూ.15 లక్షల దోపిడీనెల్లూరు(క్రైమ్): సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని కేసుల పేరుతో బెదిరించి నగదు దోచుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నెల్లూరు నగరానికి చెందిన ఆంజనేయులు గాంధీబొమ్మ వద్ద దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 26వ తేదీన గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు గౌరవ సారథి అని, బెంగళూరు పోలీస్ శాఖ నుంచి మాట్లాడుతున్నాని చెప్పాడు. మీపై మహిళలను వేధిస్తున్న కేసు, సీఐడీలో మరో కేసు నమోదైందన్నాడు. ఈ రెండు కేసులను నిలుపుదల చేయాలంటే రూ.15 లక్షలు తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు పంపాలని సారథి సూచించాడు. దీంతో దుకాణదారుడు ఆ ఖాతాకు రూ.15 లక్షలు పంపించగా మరికొంత నగదు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దుకాణదారుడు మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎకరాకు రూ.5 లక్షల పరిహారమివ్వాలిసైదాపురం: స్థానిక పంచాయతీలోని కమ్మవారిపల్లెలో నిమ్మతోటల రైతులకు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.సుబ్బరాయుడు పేర్కొన్నారు. తొలగించిన నిమ్మతోటలను రైతు కూలీ సంఘం ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులు తురకా మస్తాన్, శశికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నిమ్మచెట్లను జేసీబీలతో తొలగించడం దారుణమన్నారు. 8 నెలలుగా మైనింగ్ మాఫియాతో ప్రభుత్వం కుమ్మకై ్క ఎస్సీ, ఎస్టీ, బీసీలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.కండలేరులో 26.792 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 26.792 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,873, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘బూడిద కమ్మిన మార్గం’
చైన్నె, కోల్‌కతా జాతీయ రహదారిలో నెల్లూరు నగర పరిధిలోని కనుపర్తిపాడు జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు బూడిద తోలారు. ఇది వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. ఈదురు గాలులకు ఈ బూడిద ఎగసి లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారి కళ్లల్లో పడుతుండటంతో ఇబ్బందులతోపాటు ప్రమాదాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. నగర పరిధిలోని వారే కాక ఈ మార్గంలో వెంకటాచలం, గూడూరు తదితర ప్రాంతాలకు బైక్‌ల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే తిరుపతి వైపు నుంచి వాహనదారులు వస్తుంటారు. గాలికి బూడిద కళ్లల్లో పడుతుండటంతో వారంతా అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం సంస్థ పనులను వేగవంతం చేయడంతోపాటు దుమ్ము నియంత్రణకు చొరవ చూపాల్సిన వారు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు లారీ వెళ్లే సమయంలో ఇలా.. -
అగ్నికి ఆహుతైన గానుగ మిల్లు
సంగం: గానుగ మిల్లు మంటల్లో కాలిపోవడంతో రూ.10 లక్షల నష్టం వాట్లింది. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఇలా చేశారని మిల్లు యజమాని వెంకటరమణయ్య మంగళవారం సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. మండలంలోని పడమటిపాళెం పల్లిపాళేనికి చెందిన ఇండ్ల వెంకటరమణయ్య గ్రామ మాజీ సర్పంచ్. వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడికి రాజగోపాల్ అనే కుమారుడు ఉన్నాడు. గ్రామ సమీపంలోనే నాలుగేళ్ల క్రితం వేరుశనగ ఆడించే మిల్లును సుమారు రూ.7 లక్షలతో పెట్టారు. తండ్రీకొడుకులు సోమవారం రాత్రి మిల్లును చూసి ఇంటికెళ్లారు. అర్ధరాత్రికి మిల్లు మంటల్లో కాలిపోతుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు వివాహానికి వెళ్లొస్తూ గమనించి వెంటనే బాధితులకు తెలియజేశాడు. వారు మరో 10 మందితో వచ్చి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మిల్లు పైనున్న రేకును తొలగించి పెట్రోల్ పోసి తగులబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నాడు. లోపల రెండు డ్రమ్ముల్లో ఉన్న 300 కిలోల నూనె, 20 బస్తాలు వేరుశనక్కాయలు, వేరుశనగ చెక్కు, గానుగ మెషినరీ కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల మే ఆస్తినష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. సంగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.10 లక్షల ఆస్తి నష్టం అక్కసుతో పెట్రోలు పోసి తగులబెట్టారు పోలీసులకు బాధితుల ఫిర్యాదు -
ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు
● వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెంకటాచలం: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఆంక్షలతో కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెల 31న వైఎస్ జగన్ నెల్లూరుకు రానున్న నేపథ్యంలో మండలంలోని చెముడుగుంట వద్దనున్న సెంట్రల్ జైలు సమీపంలో జరుగుతున్న హెలిప్యాడ్ పనులను జిల్లాలోని ముఖ్య నేతలతో కలిసి కారుమూరి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటను విజయవంతం కాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆంక్షలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. ఇదే విధమైన ఆంక్షలు విధించి ఉంటే చంద్రబాబు, లోకేశ్ గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల్లో తిరిగే వారా అని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలే గానీ, ప్రతి పక్ష నాయకుల పర్యటనలను అడ్డుకునే కుట్రలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలు అడ్డుకుంటున్న అధికారులను కూడా ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తామని చెప్పారు. పోలీసులు కుట్రలు దారుణం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని విమర్శించారు. జైల్లో ఉన్న కాకాణిని ములాఖత్ ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించాలని అనుకుంటే పలు దఫాలు అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారని విమర్శించారు. తాజాగా పర్యటన ఖరారైతే హెలిప్యాడ్, జైలు వద్దకు మూడు కార్లు, పది మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడి నుంచి మాజీ మంత్రి ప్రసన్నకుమారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించే సమయంలో కూడా ఆంక్షలు విఽధించడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కుట్రపూరితమైన ఆంక్షలు విధించడం, వీటిని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని, ఆంక్షలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తొలగించలేరని స్పష్టం చేశారు. తాము బస్సులు, ఇతర వాహనాలు పెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు తరలించడం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పలు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు. -
ఆశ చూపి.. నగదు దోచేసి..
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి చాలామంది తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఆశపడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఆన్లైన్ ట్రేడింగ్‌లో నగదు పెట్టొద్దని పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కానీ అనేకమంది మోసపోతూనే ఉన్నారు. కొన్ని ఘటనలు ● నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్లో లిఖితాశ్రీ అనే మహిళ పరిచయమైంది. ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. దీంతో ఆ వ్యక్తి పలు దఫాలుగా రూ.10.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొన్నిరోజులకు లాభాలు రాలేదు. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ట్యాక్స్ కింద రూ.లక్ష కడిస్తే మొత్తం డబ్బులు పొందవచ్చని చెప్పడంతో మోసపోయానని గ్రహి ంచిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ● నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళకు ఇన్‌స్ట్రాగామ్‌లో మెసేజ్ ద్వారా లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేయగా తన వాట్సప్ నంబర్‌కు నిషాబసు అనే మహిళ చాటింగ్ ప్రారంభించింది. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన దానినని ఆన్లైన్ మార్కెటింగ్‌లో సలహాలు ఇచ్చి లాభాలు వచ్చేలా చూస్తామని నమ్మించింది. తొలుత మహిళ వద్ద నుంచి కొంత మొత్తం పెట్టుబడి పెట్టించి రెట్టింపు లాభం వచ్చేలా నమ్మించింది. దీంతో మహిళ పలు దఫాలుగా రూ.2.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. నిందితులు ఆమె ఖాతాలో రూ.4.02 కోట్లు ఉన్నట్లు చూపించారు. విత్‌డ్రా చేసేందుకు యత్ని ంచగా రాలేదు. లార్జ్ ట్రాన్సాక్షన్ కోసం మరో కొంత నగదు చెల్లించాలని నిందితులు సూచించారు. దీంతో మోసపోయానిని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ● నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఆన్‌లైనింగ్ ట్రేడింగ్ పేరిట నమ్మించి రూ.1.01 లక్షలు పెట్టుబడి పెట్టించారు. రూ.3.50 లక్షలు లాభం వచ్చిందని సైబర్ నేరగాళ్లు చెప్పారు. ఆ మొత్తం తీసుకోవాలంటే తమ కమీషన్ రూ.60 వేలు పంపాలన్నారు. కమీషన్ ఎందుకు పంపాలని అతను నిలదీయడంతో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ● ట్రేడింగ్ పేరిట మోసాలు ● లాభాలొస్తాయని పెట్టుబడి పెట్టిస్తున్న కేటుగాళ్లు ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు ● సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త నెల్లూరు(క్రైమ్): జిల్లాలో సైబర్ మోసాలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఏటా బాధితులు పెరుగుతున్నారు. రూ.కోట్లలో తమ నగదును కోల్పోతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సోషల్ మీడియా వేదికగా చైతన్యవంతుల్ని చేస్తున్నా.. ఏదో ఒక విధంగా మోసానికి గురవుతూనే ఉన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. ఉచ్చులో చిక్కి.. టెక్నాలజీ ఎంత పెరిగిందో ఆన్లైన్ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. రకరకాలుగా ప్రజలను మోసగించి పెద్ద మొత్తంలో నగదు దోచేస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగులు, గృహిణులు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. నగదు పోగొట్టుకున్న విషయం ఎవరికీ చెప్పుకోలేక, పోయిన డబ్బులు వస్తాయో? రావో? తెలియక సతమతవమవుతున్నారు. ఎలా అంటే.. ట్రేడింగ్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ నేరగాళ్లు వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. తమ సలహాలు, సూచనలు పాటిస్తే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ మొత్తంలో లాభాలు పొందవచ్చని నమ్మిస్తారు. అనధికారిక అప్లికేషన్ లింక్‌లను పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో కొంత లభాలు వస్తున్నట్లు చూపుతూ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. లాభాలు వచ్చినట్లు చూపించి తిరిగి నగదు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలని, అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. -
జగన్ పర్యటనకు పటిష్ట బందోబస్తు
నెల్లూరు (క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31న నెల్లూరు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నెల్లూరు నగరంలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న దృష్ట్యా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిషేధమని చెప్పారు. మంగళవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు వెల్లడించారు. జగన్మోహన్రెడ్డి గురువారం ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్ అవుతారన్నారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉందని, జైలు నిబంధనల మేరకు ములాఖాత్‌కు ముగ్గురు మాత్రమే వెళుతారన్నారు. వీరు మినహా మిగిలిన వారికి ఎవరికి జైలు వద్దకు అనుమతుల్లేవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ రావొద్దని వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ములాఖాత్ అనంతరం రోడ్డు మార్గాన సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతారన్నారు. అక్కడికి 100 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. పోలీసు ఆంక్షలను దాటుకుని ఎవరైనా వస్తే చర్యలు తప్పవన్నారు. రోడ్‌షోలు, వాహన ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. రెచ్చగొట్టేఽ విధంగా ఫ్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించినా, నినాదాలు చేసిన చర్యలు తప్పవన్నారు. ఆరు డ్రోన్లు, 40 సీసీ కెమెరాలతో పర్యటన మొత్తం రికార్డు చేస్తామని, కమాండ్ కంట్రోల్ నుంచి లైవ్ పర్యవేక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ, నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు ఎ. శ్రీనివాసరావు, పి. సిందుప్రియ, ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమల్లో 30 పోలీసు యాక్ట్ హెలిప్యాడ్ వద్దకు 10 మందికే అనుమతి ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ -
కాకాణికి బెయిల్ మంజూరు
నెల్లూరు (లీగల్): పొదలకూరు మండలం విరువూరులో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డిని పొదలకూరు ఎకై ్సజ్ అధికారులు నమోదు చేసిన అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం గూడూరు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బీవీ సులోచనరాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.లక్ష ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దార్లు పూచీకత్తు, రూ.లక్ష వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదే శాలు జారీ చేశారు. గోవర్ధన్‌రెడ్డి ఎకై ్సజ్ అధికారుల విచారణకు సహకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని 9వ నిందితుడిగా కేసు నమోదు చేసి జూలై 14న పీటీ వారెంట్‌పై గూడూరు కోర్టులో హాజరు పరచడంతో జూలై 28 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన విష యం విదితమే. ఈ క్రమంలో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రాజారెడ్డి పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసి కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో కేసును బనాయించారని వాదనలు వినిపించారు. ఎకై ్సజ్ అధికారుల తరఫున స్పెషల్ పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నెల్లూరు అష్టదిగ్బంధం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో నగరాన్ని అష్టదిగ్బంధం చేస్తూ సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ వద్దకు 10 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ప్రకటించారు. ఆయన కాన్వాయ్‌లో కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్ జగన్ సహా కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నేపథ్యంలో అడుగడుగునా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ప్రజలు వచి్చనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంపైనా జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తుంటే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకని చర్చించుకుంటున్నారు. ఆంక్షలు మరింత కఠినతరం ఈనెల 31న గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు రానుండటంతో పోలీసులు ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. జనసమీకరణ చేయరాదని, రోడ్డుషోలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు సైతం ఎలాంటి అనుమతులు లేవని, వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు నగరంలోకి వచ్చే అన్నీ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. పోలీసుల చర్యలపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జననేతను కనీసం చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కూటమి సర్కారు తీరుపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్దకు 10 మందికే అనుమతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31న ఉదయం 10–10.30 గంటల మధ్య హెలికాప్టర్లో చెముడుగుంట డీటీసీ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్రమ కేసుల నేపథ్యంలో జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో వారిని అడ్డుకునేందుకు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మంది వైఎస్సార్సీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ములాఖత్‌కు కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతించారు. జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌లో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ములాఖత్ అనంతరం జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో సుజాతమ్మ కాలనీలోని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడ 100 మందికి అనుమతించారు. ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా అటువైపు వెళ్లే అన్నీ రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద నుంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. భద్రత పేరిట ఆంక్షలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రోప్ పార్టీలు, క్యూఆర్ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న పోలీసులు వైఎస్ జగన్‌కి భద్రత కల్పించకుండా.. కేవలం ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా అడ్డుకునే పనిలో నిమగ్నమయ్యారు. నగరం నలువైపులా అష్ట దిగ్బంధం చేయాలని నిర్ణయించారు. నేషనల్ హైవేపైనా వాహనాల తనిఖీకి చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఇన్చార్జి ఎస్పీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం వెల్లడించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు, ముందస్తు అనుమతులు, ఆంక్షలను మీడియాకు వెల్లడించారు. హెలిప్యాడ్ వద్ద 10 మందిని, ములాఖత్‌కు ముగ్గురిని, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. నగరంలో సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న దృష్ట్యా ఊరేగింపులు, సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. -
నేడు జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగం
తిరుమల/శ్రీకాళహస్తి/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్‌ను ప్రవేశపెట్టనున్నారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో ఇస్రో–నాసా కలిసి మరిన్ని ప్రయోగాలు.. ఇస్రో, నాసా బంధం బలపడి రాబోయే కాలంలో మరో మూడు ప్రయోగాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ పేర్కొన్నారు. అలాగే, చంద్రయాన్–4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి గగన్‌యాన్–1 పేరుతో ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్ నమూనాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని, సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ ఎప్16 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. -
ఆంక్షలతో జననేత జగన్‌ను అడ్డుకోలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్‌ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు. పీ-4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని.. పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ భూమన దుయ్యబట్టారు.పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు భయపడంనెల్లూరు జిల్లా: ఆంక్షలతో జననేత వైఎస్ జగన్‌ను అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ పర్యటనలో పాల్గొనకూడదు అంటున్నారు. 31న నెల్లూరు పర్యటన విజయవంతం చేసి తీరుతాం’ అని చంద్రశేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. -
కన్నవారిపై కనికరం లేకుండా..
● తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న సంతానం ● పోలీసులకు వృద్ధుల ఫిర్యాదులునెల్లూరు(క్రైమ్): ‘కడుపున పుట్టిన వారు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. మా బాగోగులు పట్టించుకోకుండా హింసిస్తున్నారు’ ఇదీ పలువురి తల్లిదండ్రుల ఆవేదన. ప్రతి సోమవారం నెల్లూరులో పోలీస్ ఉన్నతాధికారులు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు వచ్చి సంతానం పెడుతున్న ఇబ్బందులపై కన్నీటిపర్యంతమై వినతులు అందిస్తున్నారు. ఈ సోమవారం కూడా పలువురు వచ్చారు. తన కుమారుడు మద్యం మత్తులో చిత్రహింసలు పెడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కోరాడు. నా భర్తకు పక్షవాతం. నా కాలుకు ఆపరేషన్ జరిగింది. ఇద్దరు కుమారులు మా బాగోగులు పట్టించుకోవడం లేదు. పూటగడ వని దయనీయ స్థితిలో ఉన్నాం. విచారించి న్యాయం చేయాలని కొడవలూరుకు చెందిన ఓ వృద్ధురాలు కోరారు. 105 వినతులు నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 105 మంది విచ్చేసి ఏఎస్పీ సీహెచ్ సౌజన్య దృష్టికి ఫిర్యాదులను తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ చెంచు రామారావు, లీగల్ అడ్వైజర్ టి.శ్రీనివాసులురెడ్డి, డీటీసీ, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎం.నాగేశ్వరమ్మ, బి.శ్రీనివాసరెడ్డి, పి.భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● భర్త, అత్తింటివారు అదనపుకట్నం కోసం, ఆడపిల్ల పుట్టిందని అవమానిస్తూ ఇంటి నుంచి గెంటేశారని నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ● కుటుంబ సమస్యల నేపథ్యంలో భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని అనంతసాగరానికి చెందిన ఓ మహిళ కోరారు. ● బిట్రగుంటకు చెందిన చైతన్య కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.80 లక్షల నగదు తీసుకుని మోసగించాడని జలదంకి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● ఉదయగిరి ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని పెళ్లికి నిరాకరించాడని ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి వినతిపత్రమిచ్చారు. ● గుంటూరు జిల్లా గురజాలకు చెందిన జానీబాషా బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని ఇంటి కాగితాలు, రూ.3 లక్షలు తీసుకున్నాడు. లోన్ ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని నవాబుపేటకు చెందిన మహిళ అర్జీ ఇచ్చారు. ● గతేడాది మార్చి 24వ తేదీ నుంచి నా కుమారుడు కనిపించడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి సరిపెట్టుకున్నారు. విచారించి ఆచూకీ తెలియజేయాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. -
మా బాధలు వినండయ్యా..
నెల్లూరు రూరల్: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కె.కార్తీక్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి వినతిపత్రాలను స్వీకరించారు. మొత్తం 450 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ శాఖవి 160, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్వి 52, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్వి 32, పంచాయతీరాజ్‌వి 36, స్కూల్ ఎడ్యుకేషన్వి 25, పోలీస్ శాఖవి 43 తదితర శాఖలవి వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ వినతులు పరిష్కరించే విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవినీతి బయటపెట్టానని వేధింపులు వెలుగు సీసీ, ఏపీఎంల అవినీతి బయట పెట్టినందుకు ఉద్యోగం చేయకుండా అడ్డుకుంటున్నారని రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వీఓఏ నాగమణి వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ మండలంలో గిరిజన ఉన్నతి నిధులు సుమారు రూ.కోటి వరకు దోచుకున్న సంగతి బయట పెట్టానన్నారు. ప్రస్తుత ఏపీఎం చంద్రశేఖర్ ద్వారా తనను విధులకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే లెటర్ తెస్తేనే ఆఫీసులోకి అడుగుపెట్టాలని అంటున్నారని తెలిపారు. ఇతర శాఖలోని అధికారుల చేత విచారణ చేయించాలని కోరారు. తప్పుడు కేసు పెట్టించారు కారు ట్రావెల్స్ బిజినెస్‌లో మా అన్నయ్యను మోసం చేసి తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల గ్రామానికి చెందిన మౌనిష్ శర్మ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అన్నను మోసగించిన కోటగుంట శ్రీకాంత్, షబ్బీర్ అనే వ్యక్తులు షేక్ కాలేషా అనేవారు టీడీపీ మైనార్టీ లీడర్‌తో కలిసి అక్రమ కేసులు బనాయించారన్నారు. తన అన్నయ్య ఆత్మహత్యాయత్నం చేశాడని, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆత్మహత్య శరణ్యమన్నారు. పొలం ఆక్రమించేందుకు యత్నం కలువాయి మండలం తోపుగుంట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 461లోని 1.60 ఎకరాల భూమిని టీడీపీ నేతలు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేయలేదని కక్షగట్టి ఇండ్ల చెంచయ్య ద్వారా తన భూమిని ఆక్రమించుకోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని వాపోయారు. పొలాన్ని దున్ని నిమ్మ మొక్కలను నాటారని, అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదన్నారు. సంక్షేమ నిధిని పునఃప్రారంభించాలంటూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ప్రారంభించాలని ఏపీ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ ముక్తియార్, గౌరవాధ్యక్షుడు కె.ఆంజనేయులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రసూతి, అనారోగ్యం, అంగవైకల్యం, మరణాలకు సంబంధించిన 40 వేలకు పైగా క్లెయిమ్స్ చెల్లింపు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో రూ.5 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సివిల్ సప్లయ్స్ ద్వారా కొనుగోలు చేయించాలని టీడీపీ రైతు విభాగం ప్రధాన వెంకటేశ్వర్లు కోరారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఉన్నతాధికారులు, రైతు సంఘం, రైస్‌మిల్ అసోసియేషన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 450 వినతులు వీఆర్ఏల ధర్నాపోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్మెన్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలంటూ కలెక్టర్ ఎదుట ధర్నా జరిగింది. ఇందులో వీఆర్ఏలు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. వీఆర్ఏలపై పనిభారం ఎక్కువైందన్నారు. దీనిని తగ్గించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ వాచ్మెన్, ఇసుక డ్యూటీలు రద్దు చేయాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. నేతలు వి.లచ్చయ్య, జి.ఓబులేశు తదితరులు పాల్గొన్నారు. -
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం
సోమశిల: అనంతసాగరం మండలంలోని పడమటికంభంపాడు గ్రామంలో ట్రాక్టర్ తొక్కించడంతో మాణికల నాగరాజు (7) అనే బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం తహసీల్దార్ జయరాజవర్దన్, సోమశిల ఎస్సై అనూష వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గ్రామంలో విచారించిన అనంతరం మృతదేహాన్ని గుర్తించేందుకు బాలుడి కుటుంబ సభ్యులతో పెన్నానది వద్దకు వెళ్లారు. పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించారు. అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు ఖదీర్ పోస్టుమార్టం నిర్వహించారు.హత్య చేసి.. ఆత్మహత్యగా ప్రచారం● భర్త మృతిపై భార్య అనుమానాలు నెల్లూరు(క్రైమ్): తన భర్త తరుణ్‌తేజ మృతిపై పలు అనుమానాలున్నాయని భార్య ప్రవళ్లిక వాపోయారు. తరుణ్ మృతదేహానికి జీజీహెచ్ వైద్యులు సోమవారం శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చురీ వద్ద ప్రవళ్లిక మీడియాతో మాట్లాడుతూ తరుణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అతడిని స్నేహితురాలే హత్య చేసి కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.ఆర్ఐఈ భవనాలకు భూమి పూజ నేడునెల్లూరు(టౌన్): రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) సంస్థ భవనాలకు మంగళవారం భూమిపూజ నిర్వహించనున్నారు. గతంలో వెంకటాచలం మండలం చౌటపాళెం గ్రామంలో ఆర్ఐఈ సంస్థను నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చౌటపాళెంలో 50 ఎకరాల్లో రూ.900 కోట్లతో భవన సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణాలు రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. తొలుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా భూమిపూజ చేయాలని నిర్ణయించినప్పటికీ అనివార్య కారణాలతో ఆ కార్యక్రమం రద్దయింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఓఎస్డీ, ప్రొఫెసర్లు తదితరులు పూజలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆర్ఐఈ సంస్థకు సంబంధించి తరగతులను వీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.కండలేరులో 27.010 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 27.010 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,975, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
సోదరికి మాత్రలు తీసుకెళ్తుండగా..
● ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కావలి(జలదంకి): విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్వీకేబీటీ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కావలి మండలం చెంచుగానిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కావలి మండలం ముసునూరు అరుంధతీయ కాలనీలో పోతిపోక రవి (38) ఉంటున్నాడు. బీటెక్ వరకు చదివాడు. ఓవైపు పోటీ పరీక్షలు రాస్తున్నాడు. మరోవైపు కుటుంబ జీవనం కోసం సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు. అతని సోదరి బుజ్జమ్మ గౌరవరంలో నివాసం ఉంటోంది. బుజ్జమ్మకు ఆరోగ్యం బాగోలేదు. మాత్రలు, కొబ్బరినీరు తెమ్మని రవికి ఫోన్ చేసి చెప్పింది. అతను అవి తీసుకుని మోటార్‌బైక్‌పై గౌరవరానికి బయలుదేరాడు. ఈ క్రమంలో బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రవి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేశారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత
నెల్లూరు (క్రైమ్): పారిశుధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమ కడుపులు కొట్టొదంటూ గడిచిన 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం ఉద్రిక్తంగా మారింది. నిప్పో, అయ్యప్పగుడి ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులతో అధికారులు పారిశుధ్య పనులు చేయిస్తున్నారన్న సమాచారం అందుకున్న మున్సిపల్ కార్మికులు అక్కడికి చేరుకుని తమ పనులను ఇతరులతో చేయిస్తే సహించమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు అధికారులను కోరారు. తామెదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ సహకరించాలని ప్రైవేట్ వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న వేదాయపాళెం పోలీసులు కార్మికులతో దురుసుగా ప్రవర్తించారు. మహిళలను మగ పోలీసులు ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆడ పోలీసులు లేకుండా ఎలా ఈడ్చుకెళ్తారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహావేశాలతో పోలీసులు జీపుల్లో ఎత్తిపడేసి వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీరితోపాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రూరల్ అధ్యక్షుడు దేశమూర్తితోపాటు పలువురిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికులు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు పరిస్థితి జఠిలం కావడంతో ఆందోళ కారులపై లాఠీచార్జి చేయడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కొందరు మహిళ కార్మికులను స్టేషన్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. మరి కొన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్న కార్మికులు స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, మరికొందరు నేతలు, కార్మికులతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారు వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావుతో చర్చించారు. స్టేషన్లో ఉన్న కార్మికులందరిని సొంత పూచీకత్తుపై బయటకు తీసుకువచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ఇన్స్పెక్టర్ దురుసుగా వ్యవహరిస్తూ లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికలందరూ దళితులు, గిరిజనులని వారిపై ఇలా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి నిర్భందాలు పెట్టడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ప్రైవేట్ వ్యక్తులతో పనిచేయిస్తుండగా అడ్డుకున్న రెగ్యులర్ కార్మికులు వారిపై పోలీసుల దురుసు ప్రవర్తన మర్యాదగా మాట్లాడాలనడంతో ఆగ్రహంతో లాఠీచార్జి పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్లో నిర్బంధం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన కార్మికులు -
న్యాయశాఖ ఉద్యోగాల సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు (లీగల్): జిల్లా న్యాయశాఖ ఉద్యోగాల సంఘ ఎన్నికలు సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయశాఖ ఉద్యోగుల కార్యలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పీవీ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటసునీల్, ట్రెజరర్ ఎస్కే షఫీ, అసోసియేట్ ప్రెసిడెంట్ వి.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.దీపక్, గౌరవ అధ్యక్షుడిగా బి.శివయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్.శివయ్య, సీహెచ్ బాలయ్య, శివప్రసాద్ బాబు, సీహెచ్ వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా బి.సురేంద్రబాబుతో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. నేడు పీఎంశ్రీ స్కూల్ వర్చువల్‌గా ప్రారంభం నెల్లూరు(టౌన్): జాతీయ విద్యా విధానంలో భాగంగా జిల్లాలో పీఎంశ్రీకు ఎంపికై న కలిగిరిలోని ఏపీ మోడల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అధునాతన వసతులను మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 46 పాఠశాలలు పీఎంశ్రీకి ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం అధునాతన ల్యాబ్, డిజిటల్ తరగతులు, క్రీడామైదానం తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలిగిరి ఏపీ మోడల్ స్కూల్లో ఈ వసతులు ఏర్పాటు చేయడంతో ఆ స్కూల్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ● ఆగస్టు 12న పోలింగ్, 14న కౌంటింగ్ ప్రక్రియ విడవలూరు: విడవలూరు బిట్–2 ఎంపీటీసీగా, ఎంపీపీగా ఉన్న భవానమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఖాళీ అయిన ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను విడదల చేసింది. ఈ ఎన్నికలకు కోవూరు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.మోహన్‌రావును రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు రిటర్నింగ్ అధికా రులుగా కొడవలూరు ఎంపీడీఓ నగేష్ కుమారి, తహసీల్దారు చంద్రశేఖర్‌ను నియమించారు. షెడ్యూల్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడానికి గడువు. 2వ తేదీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అదే రోజు తిరస్కరించిన నామినేషన్లపై ఆర్డీఓ ఎదుట సాయంత్రం 5 గంటల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం. 4వ తేదీ అప్పిలేట్ అథారిటీ అప్పీల్ పరిష్కారం. 5వ తేదీ నామినేషన్లు 3 గంటల లోపు ఉపసంహరణ, అదే రోజు పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ. ఆగస్టు 12వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. 13వ తేదీ అవసరమైతే రీ పోలింగ్ నిర్వహించాలని, 14వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. -
కోర్టు ఆదేశాలున్నా సరే.. కూల్చేస్తాం
పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలో అధికార పార్టీ నేతల కుట్రలు, కుతంత్రాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికార యంత్రాంగం సైతం ఎమ్మెల్యేలు చెప్పారంటూ వెనుకా ముందు చూడకుండా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసానికి బరితెగిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన రోజే ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ దళిత నేత, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వీరి చలపతికి చెందిన ఆస్తుల ధ్వంసానికి డెడ్‌లైన్ విధించారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక అనుచరుడు కావడంతో ఆయన్ను టార్గెట్ చేశారు. ఆస్తులు ధ్వంసం చేయడమేకాకుండా పలు అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీలో దళితుడైన కీలక నేత, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావును టీడీపీ టార్గెట్ చేసింది. మాజీమంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి కీలక అనుచరుడు కావడంతో ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న వీరి చలపతిరావు స్వగ్రామం నార్తురాజుపాళెంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న 50–2 సర్వే నంబరులో ఉన్న 25 అంకణాల స్థలాన్ని 2006లో యానాదమ్మ భర్త సాల్మన్ నుంచి రూ.2.50 లక్షలకు కొనుగోలు చేశారు. 2010లో పంచాయతీ అప్రూవల్తో ఆ స్థలంలో దుకాణాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కూడా పంచాయతీకి కట్టాల్సిన పన్నులు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2016లో అప్పటి తహసీల్దార్ ఇది ఆక్రమణ స్థలంగా పేర్కొంటూ తొలగించాలంటూ నోటీసు జారీ చేశారు. దీనిపై చలపతిరావు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2018లో తన పేరిట ఉన్న స్థిరాస్తిని చలపతిరావు భార్య వీరి కళైవాణి పేరిట మార్పు చేశారు. అప్పటి నుంచి ఆమె కూడా ఆ ఆస్తికి సంబంధించిన పన్నులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో వైన్స్ షాపు నిర్వహించింది. అందుకు సంబంధించిన అద్దెను కూడా కళైవాణి ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని.. ఈ ఏడాది జనవరిలో అందులో ఖాళీగా ఉన్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకునేందుకు పంచాయతీకి 14 శాతం ఫీజు చెల్లించి అనుమతులు పొందారు. అయితే వీరి చలపతిరావును టార్గెట్ చేసిన స్థానిక టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే మెప్పు కోసం కుట్రలకు తెరతీశారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 21న నార్తురాజుపాళెం చెందిన టీడీపీ నేత కరకటి మల్లికార్జున ఆ స్థలం ఆక్రమణ అంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 27న తహసీల్దార్ ఈ స్థలాన్ని పరిశీలించాలని స్థానిక ఇరిగేషన్ ఏఈని లేఖ ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న ఇరిగేషన్ ఏఈ ఆ స్థలం ఆక్రమణ అంటూ తొలగించాలని తహసీల్దార్‌కు నివేదిక అందజేశారు. ఇరిగేషన్ ఏఈ, సర్వేయర్లు ఈ నెల 10న ఆ స్థలానికి చేరుకుని దుకాణాలు నిర్మాణం జరుగుతుండడాన్ని కొలతలు తీశారు. దీంతో స్థల యజమాని వీరి కళైవాణి ఈ నెల 14న హైకోర్టును ఆశ్రయించారు. పత్రాలు పరిశీలించిన హైకోర్టు నిర్మాణానికి ఎలాంటి అవాంతరాలు కల్పించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆ ఉత్తర్వులు తనకు ఇంకా చేరలేదని తహసీల్దార్ చెప్పడంతో తన న్యాయవాది ద్వారా తెలియజేసినప్పటికీ ఇవేమీ పట్టని అధికారులు ఆ స్థలం ఆక్రమణలో ఉన్నందున ఈ నెల 31లోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని ఈ నెల 18న షోకాజ్ నోటీసును కళైవాణి భర్త వీరి చలపతిరావుకు అందజేశారు. వివాదంతో ఊపందుకొన్న చర్యలు కోవూరు నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీ నుంచి విభిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. తనను విమర్శించారన్న నెపంతో మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక అనుచరుడిగా ఉన్న చలపతిపై కన్నెర్ర చేశారు. ఈ స్థలంపై టీడీపీ నేత మల్లికార్జున మే నెలలో ఫిర్యాదు చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 7 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫిర్యాదుపై తాజా చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెల 16న షోకాజ్ నోటీసులు జారీ చేయడం, 18న చలపతిరావుకు అందజేయడం జరిగింది. ఈ నెల 31లోగా నిర్మాణాలు తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. పట్టించుకోకుండా చర్యలకు ఉపక్రమించడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి ఉందన్న ప్రచారం ఊపందుకొంది. రాజుపాళెంలో దళిత నేత వీరి చలపతి షాపులు కూల్చేందుకు కుట్రలు వాటి జోలికి వెళ్లొద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా పట్టించుకోని అధికారులు వైఎస్ జగన్ పర్యటన రోజే కూల్చివేతకు తుది గడువుగా నోటీసులు ఇప్పటికే ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేందుకు కుతంత్రం అధికార పార్టీ నేతల తీరుపై మండిపడుతున్న ప్రజలు నిబంధనల మేరకే చర్యలు నార్తురాజుపాళెంలోని కళైవాణికి చెందిన స్థలం విషయంలో నిబంధనల ప్రకారమే ముందుకు పోతున్నాం. కోర్టు ఉత్తర్వుల్లో స్టేటస్కో మంజూరు చేసినట్లు లేదు. నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు సూచించడం జరిగింది. ఆ విధంగానే నడుచుకొంటున్నాం. ఈ నెల 31వ తేదీ లోగా స్వచ్ఛందంగా ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించాలని నోటీసు ఇవ్వడం జరిగింది. అప్పటికీ తొలగించకపోతే తదుపరి చర్యలు తీసుకొంటాం. – కె.స్ఫూర్తిరెడ్డి, తహసీల్దార్, కొడవలూరు -
ప్రజాస్వామ్యంలో చీకటి పాలన
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలనకు పాతరేసి చీకటి పాలన సాగిస్తోందని, రాచరిక పాలనతో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, దేశ చరిత్రలో ఇలాంటి పాలన ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ రీజనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కాకాణి కుమార్తె పూజితతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కారు మూరి మాట్లాడుతూ ఈ నెల 31న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైన నేపథ్యంలో పోలీసులు అర్థం లేని ఆంక్షలు పెట్టడం చూస్తే ప్రజాస్వా మ్య దేశంలో ఉన్నామా? లేక నియంతృత్వ పాలన సాగించే దేశంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసు లు, అరెస్ట్‌లతో అరాచకాలకు పాల్పడుతోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఒకటి తర్వాత మరొకటి అక్రమ కేసులు పెట్టి దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉంచారన్నారు. ఫ్యాక్షన్ కక్షలతో రగిలిపోయే రాయలసీమలోనే జరగని విధంగా రాజకీయంగా చేసిన విమర్శలపై ప్రతివిమర్శలు చేశారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని టీడీపీ కిరాయి రౌడీమూకలతో ఇంటి గోడలు మినహా అణువణవు ధ్వంసం చేశారని, ఇంట్లో ఉండి ఉంటే ప్రసన్నను సైతం హతమార్చేవారన్నా రు. జిల్లాలో ఎప్పుడూ జరగని అక్రమ కేసులకు గురైన కాకాణినితో జైల్లో ములాఖత్ కావడానికి, దౌర్జన్య కాండకు దెబ్బతిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తున్న తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకపై అత్యధిక ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. ప్రజాభిమాన్ని తట్టుకోలేక కుతంత్రాలు రెడ్‌బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్ట్‌లు, దౌర్జన్య కాండలు సాగిస్తూ ప్రభుత్వం చేస్తున్న పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్‌తో ప్రజలను అభివృద్ధి చేస్తామని అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజా స్వామ్యాన్ని రాచరికపు పాలనగా మార్చారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి పాలన అందించాలే కాని రాచరిక పాలనను ప్రజలు ఒప్పుకోరన్నారు. రైతులను, ప్రజలను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో నాయకులను ఇబ్బందులు పెడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు వస్తుంటే వారి పర్యటనకు ఆంక్షలు పెట్టడం కూడా భావ్యం కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వచ్చినా ప్రజలు విపరీతంగా రావడాన్ని తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలను పెడుతుందన్నారు. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటనకు వైఎస్సార్సీపీ నాయకులే కాదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరూ వస్తారన్నారు. అరచేతితో సూర్య కాంతిని ఎలా ఆపలేరో.. ఈ ప్రజాభిమానాన్ని కూడా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మాజీ సీఎం పర్యటనకు ఇన్ని ఆంక్షలా? జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పెట్టిన ఆంక్షలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయన్నారు. ఈ నెల 3న పర్యటన ఖరారైన సమయంలోనూ ప్రభుత్వం, పోలీసులు కనీసం హెలిప్యాడ్‌కు స్థలం కేటాయించకుండా అడ్డుపడ్డారన్నారు. చివరి నిమిషంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతివ్వడంతో పర్యటన రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే ఈ దఫా ఎవరెన్ని ఆంక్షలు పెట్టిన వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు కఠిన ఆంక్షలు విధించడం చాలా దారుణమన్నారు. ఈ పర్యటనకు సంబంధించి మొదటి ఇచ్చిన నోటీసులో హెలిప్యాడ్ వద్దకు మూడు వాహనాలే అని, ములాఖత్‌కు ముగ్గురు మాత్రమే అని, అసలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్దకు ఒక్కరికీ కూడా అనుమతి లేదంటూ ఇచ్చిన నోటీసును తీసుకునేందుకు తాను నిరాకరించానని తెలిపారు. ఆ తర్వాత రెండో నోటీసులో జగన్మోహన్రెడ్డి పర్యటనకు మూడు వాహనాలకు బదులు 15 వాహనాలను, హెలిప్యాడ్ వద్దకు, జైలు వద్దకు 10 మందికి అనుమతిస్తామని, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి మాత్రం ఒక్కరికీకి అనుమతి లేదంటూ ఇచ్చారన్నారు. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తే రాప్తాడు, పొదిలి, పల్నాడు తదితర ప్రాంతాల్లో విపరీతమైన జనాలు రావడంతో కూటమి ప్రభుత్వానికి దడ పుడుతుందన్నారు. అందుకు నెల్లూరు పర్యటనలో 25 మందికి వలంటీర్‌ను నియమించాలని, కారు నంబర్లు, డ్రైవర్ల ఆధార్ కార్డులు ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను తట్టుకోలేక జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారని, వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. కూటమి ప్రభుత్వం మాదిరిగా బస్సులు, ట్రాక్టర్లతో ప్రజలను తరలించమని, స్వచ్ఛందంగానే ప్రజలు వస్తున్నారని, జగన్మోహన్రెడ్డిపై వారికున్న అభిమానానికి నిదర్శనమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలేంటి రాచరిక పాలనతో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు ప్రజాభిమానాన్ని ఆపడం ఎవరి తరం కాదు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక అక్రమ కేసులు, అరెస్ట్‌లు అబద్ధపుహామీలతో కూటమి ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా పోటెత్తుతున్న ప్రజలు అది జీర్ణించుకోలేకే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెలిప్యాడ్ పనుల పరిశీలన వెంకటాచలం: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న జిల్లా పర్యటనకు రానుండడంతో మండలంలోని చెముడుగుంట వద్దనున్న సెంట్రల్ జైలు సమీపంలో హెలిప్యాడ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను వైఎస్సార్సీపీ రీజన ల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వర రా వు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఆ మేరకు హెలిప్యాడ్ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నారు. -
31న నల్లపరెడ్డి నివాసానికి వైఎస్ జగన్ రాక
● భద్రతా ఏర్పాట్లపై చర్చించిన డీఎస్పీలు నెల్లూరు (క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31న నెల్లూరు నగరంలోని సుజాతమ్మకాలనీలో ఉన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి రానున్నారు. ప్రసన్న ఇంటిని టీడీపీ రౌడీమూకలు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో నల్లపరెడ్డితోపాటు ఆయ న కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు పి.సింధుప్రియ, ఘట్టమనేని శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి సోమవారం ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చారు. పర్యటన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలపై వారు ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి చర్చించారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన..10 మందికే అనుమతి!
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వైఎస్ జగన్ ఏ పర్యటన చేపట్టినా జనం ప్రభంజనంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన (గురువారం) వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించింది. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు. వైఎస్ జగన్ హెలీప్యాడ్ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేత కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇక్కడకు కూడా జనం రాకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్‌లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. అప్పుడు హెలీప్యాడ్‌కు అనుమతి లేదంటూ..జులై 3న వైఎస్ జగన్ చేపట్టాల్సిన నెల్లూరు పర్యటనకు సైతం అడ్డంకులు సృష్టించింది కూటమి సర్కారు. హెలీప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది. గత నెల 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్గించారు. ఇప్పుడు పది మంది మాత్రమే రావాలంటూ ఆంక్షల పర్వాన్ని తెరపైకి తెస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం వైఎస్ జగన్ పర్యటనను ఏదో రకంగా అడ్డుకోవాలని చూడటమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
మేకపాటికి చెక్‌పెట్టే యోచనతో బీజేపీకి..
నెల్లూరు జిల్లా: ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీలోనే కాకుండా కూటమిలో భాగస్వామి అయిన బీజేపీలోనూ కుంపటి రాజేస్తోంది. ఆ పదవి తన సతీమణి మేకపాటి శాంతకుమారికి దక్కే లా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఇప్పటికే పావులు కదిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మేకపాటిని రాజకీయంగా దూరంగా చేయాలని తాజా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుతంత్రాలకు తెరతీశారు.ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ మహిళకు కేటాయించడంతో పార్టీ అధిష్టానం వద్ద ఉన్న పరపతితో వింజమూరుకు చెందిన టీడీపీ నేత గణపం సుదర్శర్‌రెడ్డి సతీమణి హరిత పేరును ఎమ్మెల్యే సిఫార్సు చేశారు. ఈ క్రమంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసి ఉదయగిరి ఏఎంసీ పదవి తన సతీమణికి ఇవ్వాలని నివేదించినట్లు సమాచారం. ఉదయగిరి అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను తమ కుటుంబ కలహాల నేపథ్యంలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరాను. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా భేషరతుగా టీడీపీ విజయం కోసం పని చేశాను. తమ కుటుంబం నుంచి తన సోదరుడు పోటీ చేిసినా, టీడీపీ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం శ్రమించాను. ప్రస్తుతం ఈ అవకాశం తన సతీమణికి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల కుట్రలకు తెరతీసినట్లు సమాచారం. మేకపాటి శాంతకుమారికి చైర్మన్ పదవి ఇస్తే ఉదయగిరిలో గ్రూపు రాజకీయాలు పెరుగుతాయని, ఈ పరిణామాలు భవిష్యత్‌లో టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ ద్వారా మేకపాటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తాను సూచించిన వారికి ఇచ్చినా ఇబ్బందులు వస్తాయని, గణపం కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తూ సరికొత్త వ్యూహానికి తెర తీశారు.మేకపాటికి చెక్‌పెట్టే యోచనతో బీజేపీకి..మేకపాటి చంద్రశేఖరరెడ్డికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నుంచి పార్టీ అధిష్టానం వరకు డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు మేరకు ఎమ్మెల్యే కాకర్ల ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవి బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి మండల పార్టీ అధ్యక్షురాలు పాలగుల్ల విజయలక్ష్మి పేరు సిఫార్సు చేశా రు. ఉదయగిరి బీజేపీ నేతలను సంప్రదించకుండా ఆమె పేరు సూచిండంపై కూడా ఆ పార్టీలో దుమా రం చెలరేగింది. పలువురు ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ, బీజేపీ మంత్రి సత్యకుమార్ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో రాష్ట్ర అధినాయకత్వం ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుంటామని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది.రగిలిపోతున్న మేకపాటిఉదయగిరిలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరుసార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల అనంతరం ఆయన సతీమణి శాంతకుమారి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో మేకపాటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శాంతకుమారిని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ చేయాలని భావించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్సీపీని వదిలి బేషరతుగా టీడీపీ గూటికి చేరారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కాకర్ల సురేష్ విజయం కోసం కృషి చేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ బోర్డు మెంబరు లేదా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ అవకాశం తన సతీమణి శాంతమ్మకు కల్పించాలని చంద్రబాబును కోరారు. టీడీటీ బోర్డుకు అవకాశం ఇవ్వకపోవడంతో కనీసం ఏఎంసీ చైర్మన్ అయినా ఇస్తార ని భావించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ఆశలకు చెక్ పెడుతూ ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో మేకపాటి లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. చంద్రబాబు తనను మోసం చేశారని అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రశేఖరరెడ్డి రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తమ్ముళ్ల గ్రావెల్ దందా
కావలి (జలదంకి): కావలిలో టీడీపీ నేతల దందా పరాకాష్టకు చేరింది. కావలి మండలంలోని చెరువుల్లో నీరు అడుగంటడంతో కొద్ది రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాలు పెట్టి ట్రాక్టర్లలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. రుద్రకోట, కొత్తపల్లి, ఆముదాలదిన్నె తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేప డుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆముదాలదిన్నె చెరువులో మూడు జేసీబీలు పెట్టి దాదాపు 70 ట్రాక్టర్లతో గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. ఇటీవల కొత్తపల్లి చెరువులో గ్రావెల్ అక్రమ తరలింపుపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత అధికారులు గ్రావెల్ అక్రమ దందాను అడ్డుకోలేదు. గ్రావెల్ అక్రమ రవాణాపై అధికారుల చర్యలు లేకపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా గ్రావెల్ అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగిస్తూ తెలుగు తమ్ముళ్లు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ హరీష్‌ను వివరణ కోరగా గ్రావెల్ తరలింపునకు అనుమతులు ఇచ్చామన్నారు. 70 ట్రాక్టర్లతోపాటు మూడు జేసీబీలతో గ్రావెల్ తరలింపునకు ఎలా అనుమతి ఇస్తారని అడుగగా ఫోన్ కట్ చేశారు. -
చాపల్లేవ్.. దుప్పట్లు ఇవ్వలే..
ప్రభుత్వ హాస్టళ్లు నెల్లూరు: బందెల దొడ్డిలా.. చిన్న గదిలో పది మందికిపైగా విద్యార్థులను కుక్కిన నెల్లూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంనెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు నరకప్రాయంగా మారాయి. పేద వర్గాల విద్యార్థుల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని, వీరంతా బాగా చదువుకోవాలని సర్కారు నిర్వహించే సంక్షేమ వసతి గృహాల ఉద్దేశం పాలకు ల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి. నరక కూపానికి నకళ్లుగా కనిపించే హాస్టళ్లల్లో విద్యార్థుల భవిష్యత్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై ప్రభుత్వం చేసే ప్రచారానికి భిన్నంగా ఉన్నాయి. హాస్టళ్ల భవనాలు పలుచోట్ల మరమ్మతులకు గురికావడంతో వాటిని మూసేశారు. ప్రైవేట్ భవనాల్లో హాస్టళ్లు ఉండడంతో మరమ్మతులకు నోచుకోవడంలేదు. హాస్టళ్లకు ఉపయోగపడని వంట పాత్రలను కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పించారు. వీటిని ఉపయోగించలేక ఎస్సీ హాస్టల్ వార్డెన్లు మూలనడేశారు. బాధ్యతలో నిర్లక్ష్యం జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతిగృహాలు 162 ఉండగా, ఇందులో 11,864 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంవత్సరంలో హాస్టళ్లు ప్రారంభమై నెల దాటిపోయినా అంతంత మాత్రం ఏర్పాట్లతో హాస్టళ్లను నిర్వహించాల్సి వస్తోంది. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఎంతో వారికి నెల వారీగా ఇచ్చే మెనూ బిల్లులు, కాస్మోటిక్ చార్జీల చెల్లింపుల్లోనే కనబడుతోంది. హాస్టళ్లను మరమ్మతులు చేశాం. బాగా చేర్పించండి అని ప్రచారం చేస్తున్నా.. కానీ హాస్టళ్లలో ఈ సంవత్సరం అంతగా విద్యార్థులు చేరడం లేదు. దానికి కారణం హాస్టళ్లలో దారుణమైన దుర్భరమైన పరిస్థితులే. జిల్లా వ్యాప్తంగా హాస్టళ్ల భవనాలు పలు మరమ్మతులకు రావడంతో పలు చోట్ల హాస్టళ్లను మూసివేశారు. కొన్ని చోట్ల హాస్టళ్లను మార్చారు. మరుగుదొడ్లు, స్నానపు గదుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. అసౌకర్యాల వసతులు జిల్లాలో ఉన్న 162 హాస్టళ్లల్లో 98 శాతం బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. పెచ్చులూడిపోయి ఎప్పుడు కూలిపోదామని ఎదురు చూస్తున్న కనిపించే భవనాల శ్లాబులు, కనీసం సున్నానికి కూడా నోచుకోని, వర్షానికి కారిన నీటి చారికలతో పాచిపట్టిన గదుల గోడల మధ్యనే చదువు, నిద్రతో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇక విద్యార్థులు స్నానం చేసేందుకు ప్రత్యేక గదుల సంగతి అటు ఉంచితే.. కనీసం మరుగుదొడ్లు దుర్భరానికి కేరాఫ్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని మరుగుదొడ్లకు డోర్లు ఉండవు, ఉన్నా.. అవి ఊడిపోయి ఉంటాయి. దొడ్లుల్లో కనీసం ఒకటి.. రెండు కాలకృత్యాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బక్కెట్లతో పట్టుకెళ్తున్న పరిస్థితి ఉంది. కొన్ని మరుగుదొడ్లపై శ్లాబులు కానీ, రేకులు కూడా లేని దుస్థితి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు ఉపయోగపడని వంట పాత్రలను కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పించారు. అంత పెద్ద వంట పాత్రలను ఉపయోగించలేక ఎస్సీ హాస్టల్ వార్డెన్లు మూలన పెట్టేశారు. మూతపడిన పలు హాస్టళ్లు జిల్లాలో అనేక హాస్టళ్లను ఈ విద్యా సంవత్సరంలో మూసివేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండేందుకు ఇష్టపడని విద్యార్థులు అడ్మిషన్లు రద్దు చేసుకుని వెళ్లిపోవడంతో మరమ్మతులు చేయించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో మూతవేయక తప్పలేదు. ప్రైవేట్ భవనాలు దొరికితే అందులో కొనసాగిస్తామంటూ చెబుతూ కాలయాపన చేస్తున్నారు. పలు ప్రభుత్వ భవనాల్లో ఉన్న హాస్టళ్లకు వేసవి సెలవుల్లో మరమ్మతులు చేయించారు. అవి విద్యార్థులు ఉండేందుకు కంటే కాంట్రాక్టర్లు లాభపడేందుకే పనికొస్తున్నాయి. హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో ఉండడం, వాటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. సంఖ్య విద్యార్థులు ఎస్సీ 69 4,972 బీసీ 79 3,994 ఎస్టీ 14 2,898 జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇవ్వాల్సిన చాపలు, దుప్పట్లు కూడా ఇంత వరకు ఇవ్వలేదు. ఇక వారికి ఏటా అందించే పెట్టెలు కూడా అందించకపోవడంతో తుప్పు పట్టిన పాత పెట్టెలను వాడుకుంటూ విద్యార్థులు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో అయితే విద్యార్థులకు ఇవ్వాల్సిన ట్రంకుపెట్టెలు గదుల్లో మూలన పడేసి ఉండడం గమనార్హం. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లో పడుకోవడానికి మంచాలు లేవు. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు పెట్టెలు, దుప్పట్లు, చాపలు అన్ని వారే తెచ్చుకోవాలి. ప్రీమెట్రిక్ హాస్టల్లో దుప్పట్లు, పెట్టెలు ఇస్తారు. కానీ ఈ ఏడాది ఇంత వరకు సగం హాస్టళ్లలో కూడా ఇవ్వలేదు. -
ఉరితాళ్లతో మున్సిపల్ కార్మికుల నిరసన
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆదివారం బాలాజీనగర్ సీపీఎం ఆఫీస్ సెంటర్ నుంచి పూలేబొమ్మ వరకు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని మా కడుపులు కొట్టొద్దు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించొద్దు అంటూ నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నెల్లూరు నగర నాయకులు కాయంబు శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి. కామాక్షమ్మ, నాయకులు సలోమి మాట్లాడారు. 13 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే నిమ్మకు నీరెత్తిన్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా కార్మికుల జీవితాలు, ప్రజల ఆరోగ్యాలు ఇబ్బందుల్లో పడుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లకు కార్పొరేట్ కంపెనీలకు కార్మికుల కష్టాన్ని, ప్రభుత్వ సంపదను దోచిపెట్టే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. సంవత్సరాల తరబడి కార్మికులుగా ఉన్న వారిని కాంట్రాక్టర్ కింద బానిసలుగా మార్చడం బ్రిటిష్ పాలనలోకి తీసుకు వెళ్లడమేనని విమర్శించారు. తక్షణమే పిలిచిన టెండర్లను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు కాపాడుకునేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ,కేవీ రమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యమ్మ, కొండమ్మ, చంద్రమ్మ, షబ్బీర్, మనోజ్, రమేష్, రాంబాబు, ముని మోహన్‌బాబు, బాలు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
31న వైఎస్ జగన్ నెల్లూరు రాక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఈ నెల 31వ తేదీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనట్లు ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. 31వ తేదీ గురువారం ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చెముడుగుంట జిల్లా సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ముఖాఖత్ అయి పరామర్శిస్తారన్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లికి బయలుదేరుతారని తెలిపారు. హెలిప్యాడ్ పరిశీలన వెంకటాచలం: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, తలశిల రఘురాం ఆదివారం వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా సెంట్రల్ జైలు సమీపంలోని హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నెల్లూరులోని మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ వెళ్లనుండడంతో ఏర్పాట్లపై చర్చించారు. వీరి వెంట పార్టీ ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు. సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సభ్యుడిగా పర్వతరెడ్డి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి జాయింట్ కమిటీలో 2025–26 సంవత్సరంలో సబార్డినేట్ లెజిస్లేటివ్ సభ్యుడిగా వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కమిటీ సెక్రటరి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఘనంగా కృష్ణచైతన్య సక్సెస్ మీట్
నెల్లూరు(టౌన్): కృష్ణచైతన్య విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్, యూజీసీ అటానమస్ సాధించడంతో నెల్లూ రులోని అనిత ఆడిటోరియంలో ఆదివారం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ కృష్ణచైతన్య విద్యాసంస్థలు క్రమశిక్షణ కలిగిన విద్యావిధానానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ట్లు చెప్పారు. అనంతరం అక్రిడిటేషన్, యూజీసీ అటానమస్ సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులు, అ ధ్యాపకేతర సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డీన్ రామాంజనేయులురెడ్డి, డిగ్రీ కళాశాలల డీన్ సుధారాణి, పీజీ కళాశాలల డీన్ జ్యోతి, ప్రిన్సిపల్ నాగయ్య, హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
నిద్రలోనే అనంతలోకాలకు..
● ట్రాక్టర్ తొక్కడంతో బాలుడి మృతి ● వాహన యజమాని టీడీపీ నాయకుడు ● కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నం సోమశిల: నిద్రపోతున్న బాలుడిని ట్రాక్టర్ తొక్కడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన అనంతసాగరం మండలం పడమటికంభంపాడు గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి సమీపంలోనీ ఉత్తరకాలువ పక్కనుండే షెల్టర్‌లో మానికల శీనయ్య, చెంచమ్మ అనే గిరిజన కుటుంబం నివాసం ఉంటోంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడైన నాగరాజు (7) శనివారం రాత్రి షెల్టర్ వెనుక భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో తండ్రితోపాటు నిద్రించాడు. ఆదివా రం తెల్లవారుజామున ఓ వ్యక్తి ట్రాక్టర్‌ను కమ్మవారిపల్లి నుంచి తీసుకెళ్తూ నిద్రపోతున్న నాగరాజును తొక్కించడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాన్ని పీకే పాడు పెన్నానదిలో పూడ్చి పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న సోమశిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● కాగా వాహన యజమాని టీడీపీకి చెందినవాడు. కేసు లేకుండా చేసేందుకు అతను తమ నేతల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
పెద్దాస్పత్రిలో ఉచిత పరీక్షలు, వైద్యం
నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో పెద్ద సంఖ్యలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. ముందస్తుగా ఎవరైనా వచ్చి హెపటైటిస్ వైరల్ పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరికై నా పాజిటివ్ వస్తే వారికి మళ్లీ వైరల్ లోడ్ పరీక్షలు చేస్తాం. ఖరీదైన మందులు ఉచితంగా అందజేస్తాం. మందులు వాడటం ద్వారా వ్యాధి ముదరకుండా నియంత్రణ చేయొచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి. – డాక్టర్ కొండేటి మాధవి, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
పెద్దాస్పత్రిలో పరిశీలిస్తే..
నెల్లూరు(అర్బన్): హెపటైటిస్ వైరస్ గురించి చాలామందికి తెలియదు. కామెర్లు (పసిరికలు) అంటే అర్థమవుతుంది. హెపటైటిస్ వైరస్లు శరీరంలోని అతి పెద్ద గ్రంధి అయిన లివర్ (కాలేయం)పై పెనుప్రభావాన్ని చూపుతాయి. ప్రధానంగా ఐదు రకాలున్నా వాటిలో పైకి కామెర్లు రూపంలో కనిపించే ఏ రకం వైరస్ అంత ప్రమాదకరం కాదు. వైద్యుల సలహాలు తీసుకుని మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా రక్తంలోనే జీవితాంతం ఉండే హెపటైటిస్ బీ, సీ వైరస్‌తోనే ముప్పు ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రస్తుతం ఇవి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి ఈ వ్యాధిని అంతం చేయాలని పిలుపునిచ్చింది. ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీని ప్రపంచ వైరల్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న కేసులు జిల్లాలో హెపటైటిస్ బీ, సీ రకం కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సీనియర్ డాక్టర్ల అంచనా మేరకు 25 వేల మందికి పైగా రోగులున్నట్టు తెలుస్తోంది. బీ, సీ వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉన్నవారి వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అలాగే రక్త మార్పిడి, ఒకే నీడిల్ కలిగి ఉన్న సిరంజ్‌తో మత్తు ఇంజెక్షన్లు వినియోగించే యువతలో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. అతిగా మద్యం సేవించే వారిలో ఆల్కాహాలిక్ హెపటైటిస్ బారిన పడుతున్నారు. మురికివాడలు, డయాలసిస్ కేసులు, హెచ్ఐవీతో బాధపడే వారిలో ఎక్కువగా బీ, సీ వైరస్ కనిపిస్తోంది. కొంతమందిలో తల్లి నుంచి బిడ్డకు సోకుతోంది. స్క్రీనింగ్ పరీక్షలెక్కడ? ఈ జబ్బు గురించి వైద్యశాఖలో లెక్కల్లేవు. జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా, నెల్లూరు నగరంలో ప్రభుత్వ పెద్దాస్పత్రి ఉన్నాయి. సర్వజన ఆస్పత్రిలో అరకొరా మినహా ఇక ఎక్కడా స్క్రీనింగ్ పరీక్షలు చేయడం లేదు. ఆపరేషన్ సందర్భాలతోపాటు డయాలసిస్, హెచ్ఐవీ రోగులు, ఖైదీలు జీజీహెచ్‌కు వచ్చినప్పుడు పరీక్షలు చేస్తున్నారు. ఇంకా ప్రజలు స్వచ్ఛందంగా కోరితే సరే. ఆస్పత్రిలో హెపటైటిస్‌కు వైరల్ లోడ్ పెరగకుండా చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఉచితంగా ఇక్కడ సేవలు పొందవచ్చు.పెద్దాస్పత్రిలో హెపటైటిస్ – బీకి సంబంధించి 2022లో 14,684 మందికి పరీక్షలు చేస్తే వారిలో 205 మందికి, 2023లో 21,837 మందికి గానూ 404కి మందికి పాజిటివ్ వచ్చింది. 2024 జనవరి నుంచి జూలై వరకు 13,405 మందికి పరీక్షలు చేయగా 262 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. అలాగే సీ – వైరస్‌కు సంబంధించి 2022 నుంచి 2024 జూలై వరకు 31 వేల మందికి స్క్రీనింగ్ చేయగా 73 మందికి పాజిటివ్ వచ్చింది. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి 2023, 2024లో 93 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 13 మందికి సీ వైరస్ ఉన్నట్టు తేలింది. మరో ముగ్గురికి బీ వైరస్ సోకింది. 7,961 మంది ఏఆర్టీ రోగులకు పరీక్షలు చేయగా 224 మందికి హెపటైటిస్ బీ సోకింది. 2024లో 388 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా వారిలో నలుగురికి బీ వైరస్ ఉన్నట్టు తేలింది. -
వైద్యశాలకు వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో అధ్యాపకురాలి మృతి కందుకూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు గాయపడిన ఘటన మండలంలోని ఓగూరు సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కందుకూరు కోవూరు రోడ్డులోని యర్రగుంటపాళేనికి చెందిన పఠాన్ షాజిదా బేగం (55) తన కుమారుడు తబీన్తో కలిసి ఒంగోలులోని వైద్యశాలకు వెళ్తున్నారు. అది వారి సొంత కారు. తబీన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఓగూరు సమీపంలోని రవి గార్డెన్ వద్ద డీసీఎం లారీ వేగంగా వెళ్తోంది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు దానిని ఢీకొట్టింది. షాజిదా బేగం తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను 108 అంబులెన్స్‌లో ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు. తబీన్కు స్వల్ప గాయాలయ్యాయి. షాజిదా బేగం దొనకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. విచారణ చేస్తున్నట్లు కందుకూరు రూరల్ పోలీసులు తెలిపారు. -
విద్యతోనే సమాజంలో గౌరవం
● ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు నెల్లూరు(బృందావనం): విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్న విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తిరగాబత్తిన శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోసూరు రాజశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని పురమందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత పారిశ్రామికుల సంఘం జిల్లా అధ్యక్షుడు తోట ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ దివంగత కోసూరు గోవిందయ్య ట్రస్ట్ తరఫున విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహక నగదుతోపాటు విద్యాసామగ్రి అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 193 మందికి ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో గౌడ సంఘ నేతలు రావుల దశరథరామయ్యగౌడ్, నాయుడు రామ్ప్రసాద్గౌడ్, డాక్టర్ బడుగు కృష్ణమూర్తి గౌడ్, డాక్టర్ బి.మాధవులు, డాక్టర్ వెంకటాచలపతిగౌడ్, ప్రొఫెసర్ రావుల లావణ్యగౌడ్, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రామారావుగౌడ్, సీఐ జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
కరేడు చుట్టూ పోలీస్ ఆంక్షలు
ఉలవపాడు: కరేడు, ఉలవపాడులో పోలీస్ ఆంక్షలు అమలవుతున్నాయి. శనివారం గిరిజనుల అరెస్ట్, ఆపై పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆదివారం గ్రామాల్లో భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఉలవపాడు నుంచి కరేడు గ్రామానికి వెళ్లే అలగాయపాళెం రోడ్డు, దర్గా సెంటర్, హైవేలోని కరేడు ర్యాంపు వద్ద పికెట్ పెట్టారు. కరేడుకు కొత్త వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా తనిఖీలు చేస్తున్నారు. గ్రామంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో పోలీసుల్ని పెట్టారు. ధర్నా నిర్వహించిన తర్వాత ఆయా గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని, గ్రామస్తులతో మాట్లాడాలని కొన్ని ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిర్ణయించారు. అయితే వారెవరూ గ్రామాల్లోకి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆపేస్తున్న పోలీసులు సీపీఎం నాయకుడు కుమార్ కరేడు వెళ్తారనే సమాచారంతో ఆదివారం ఉదయం కందుకూరులోనే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి సాయంత్రం పంపించారు. స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ, కందుకూరు నుంచి నాయకులు రాకుండా ఆపేస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యమం పెరుగుతుందనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈనెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. కందుకూరు సబ్ డివిజన్ పరిధి మొత్తం అమలులో ఉంటుందని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలియచేశారు. కరేడు ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, బయట వ్యక్తుల జోక్యంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నలుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్సైలతోపాటు సుమారు 200 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. వెంకటాచలంలో అడ్డగింత వెంకటాచలం: కరేడుకు వెళ్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను వెంకటాచలం పోలీసులు ఆదివారం ఉదయం టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. ఆ గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఉందని, అనుమతించేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొంతసేపు వాదనలు జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఒప్పుకోకపోవడంతో రామచంద్ర యాదవ్ వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ కరేడు రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. సభలు, సమావేశాలు పెట్టొద్దని ఆదేశాలు నాయకులు వెళ్లకుండా చర్యలు -
కొరవడిన నిఘా
నెల్లూరు సిటీ: నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్లలో నిఘా కొరవడింది. ప్రయాణికుల రద్దీ ఉండే చోట సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా జేబుదొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొన్ని కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. మరికొన్నింటిని దుకాణాల వైపు తిప్పి పెట్టారు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమైంది. కొన్ని మాత్రమే.. నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో 12 సీసీ కెమెరాలుండగా అందులో 8 పనిచేస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండ్‌లో 9 కెమెరాలుండగా 6 పనిచేస్తున్నాయి. ఈ రెండు డిపోల పరిధిలో నిత్యం 20 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు గ్రామాల నుంచి వందల సంఖ్యలో నెల్లూరుకు వస్తుంటారు. వారి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. తూతూమంత్రంగా.. వేల సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే బస్టాండుల్లో స్థానిక పోలీసుల పర్యవేక్షణ 24 గంటలూ ఉండాలి. అయితే ఒకరిద్దరు సిబ్బందిని కేటాయించినా వారు విధుల్లో తూతూమంత్రంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. వస్తువులు, పర్సులు పోగొట్టుకున్న ప్రయాణికులు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆరోపణలున్నాయి. పోలీసులు నిఘాను పెంచాల్సి ఉంది. పోలీసుల పర్యవేక్షణ లోపం పనిచేయని సీసీ కెమెరాలు ప్రయాణికులకు భద్రత కరువు ఇదీ బస్టాండ్లలో పరిస్థితి -
అవగాహనతోనే చెక్
సీ వైరస్‌కు కొత్తగా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పరీక్షలు చేయించుకుని మూడునెలలు మందులు వాడాలి. బీ వైరస్‌ను నయం చేయలేం. అయితే వైరల్ లోడ్ పెరగకుండా మూడు నుంచి నాలుగేళ్లు డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రజల్లో అవగాహన పెరగాలి. ముందస్తుగా రక్తపరీక్షలు చేయించుకుని వ్యాధి ఉందో? లేదో? తెలుసుకోవాలి. లేనివారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. గర్భిణికి వైరస్ ఉంటే బిడ్డ పుట్టిన రోజే ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ వేయించాలి. – డాక్టర్ సునీల్‌కుమార్, హెపటైటిస్ జిల్లా నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
నిసార్ హు‘షార్’
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30వ తేదీ సాయంత్రం 5.40 గంటలకు 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. జియో సింక్రనస్ లాంఛింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. మూడు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేసి ప్రయోగవేదికకు తరలించి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించనున్నారు. వారు లాంచ్ రిహార్సల్ నిర్వహించిన తరువాత ప్రయోగం, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తి చేసేలా రూపొందించారు. షార్ నుంచి 102వ ప్రయో గం, జీఎస్ఎల్వీ మార్క్2 సిరీస్‌లో 18 ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. ఇవీ దశలు » 51.70 మీటర్లు పొడవున్న జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ భూమి నుంచి నింగికెగసే సమయంలో 420.5 టన్నులు బరువు కలిగి ఉంటుంది. » నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు సాయంతో మొదటిదశ ప్రారంభమవుతుంది. » ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 40 టన్నుల ద్రవ ఇంధనం నింపుతారు. నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో కలిపి 160 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్ దశలో 139 ఘన ఇంధనంతో మొదటి దశను, ఘన, ద్రవ ఇంధనాలను మిళితం చేసి 151.2 సెకెండ్లలో మొదటిదశ పూర్తి చేసే విధంగా రూపొందించారు. » 420.5 టన్నుల బరువును భూమినుంచి తీసుకెళ్లాలి కాబట్టి మొదటిదశలో నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్ అలోన్ దశతో కలిపి 299 టన్నుల ద్రవ, ఘన ఇంధనంతో కలగలిపి మొదటిదశను పూర్తి చేస్తారు. » రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహానికి అమర్చిన హీట్‌షీల్డ్స్ 171.20 సెకెండ్లకు మొదటి దశ రెండోదశకు మధ్యలోనే విడిపోతాయి. » 40 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 293.08 సెకెండ్లకు పూర్తి అవుతుంది. » ఆ తరువాత అత్యంత కీలక దశ అయిన క్రయోజనిక్ దశలో 15 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1106.60 సెకెండ్లకు మూడోదశను కటాఫ్ చేస్తారు. » జీఎస్ఎల్వీ ఎఫ్16 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 2,392 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లి 1115.60 సెకెండ్లకు (19 నిమిషాలకు) 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. » అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తమ ఆ«దీనంలోకి తీసుకుని పనితీరును పర్యవేక్షిస్తుంది. -
ఎంత కావాలి.. ఎక్కడికి పంపాలి?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి పార్టీల నేతల తీరు చూస్తుంటే దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. క్వార్ట్ ్జ, ఇతర మైన్స్, ఇసుక, మద్యం.. ఇలా ఏది తీసుకున్నా ప్రతి అక్రమ వ్యవహారంలో వారే అసలు దోపిడీ దారులుగా కనిపిస్తున్నారు. నింద మాత్రం వైఎస్సార్సీపీ నేతలపై వేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కీలక అనుచరుడు రూప్‌కుమార్ యాదవ్ చెన్నైలోని వీఎన్ఎస్ కంపెనీ డీలర్‌తో సాగించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి లీక్ అయిన ఆడియోనే ఇందుకు నిదర్శనం. దీంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రుస్తుం మైన్ చుట్టూ తిరుగుతున్న అక్రమ మైనింగ్ భేతాళ కథలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని తేలిపోయింది. ‘నేను టీడీపీ లీడర్ రూప్‌కుమార్‌ను మాట్లాడుతున్నా.. మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.. జిల్లాలో ఏ ఏరియా నుంచి అయినా మైకా క్వార్ట్జ్ మెటీరియల్‌ను సరఫరా చేస్తా.. క్వాలిటీ మెటీరియల్ పంపిస్తా.. మీకు ఎలా పంపాలో చెప్పండి.. రోడ్డు, రైలు మార్గం ఏదైనా సరే.. ఎంత క్వాంటిటీ అయినా సరఫరా చేస్తా..’ అంటూ డీల్ చేసుకున్న ఆడియో వెలుగు చూడటంతో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలైంది.క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఇలా..నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే క్వార్ట్జ్ ఫల్స్‌పర్, వర్ముఖ్లైట్ ఖనిజానికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. ఒక్క సైదాపురంలోనే మూత పడిన గనులు 26 ఉండగా, అధికారికంగా 40 ఓపెన్ క్వారీలు ఉన్నాయి. వీటిలో మరో వందేళ్ల వరకు తరగని మైకా క్వార్ట్ ్జ నిల్వలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఎంపీ వేమిరెడ్డి, ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. గనుల యజమానులను బెదిరించి తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. చైనాతో వ్యాపారం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎనిమిది నెలల పాటు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఆపై యజమానులతో నయాన, భయనా డీల్ కుదుర్చుకున్నారు. గనుల్లో నుంచి వచ్చే ప్రతి టన్ను క్వార్ట్జ్ మెటీరియల్ తాము చెప్పిన ధరకే ఇవ్వాలనే డిమాండ్‌తో అనుమతులు ఇప్పించి వ్యాపారం చేసుకుంటున్నారు.ఏడాదికి 5 లక్షల టన్నులు ఈ ప్రాంతంలో నెలకు 30 వేల నుంచి 50 వేల టన్నుల మైకా క్వార్ట్ ్జ ఖనిజాన్ని తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సైదాపురం ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ మండలం నుంచే రోజూ వెయ్యి టన్నులు, ఇతర ప్రాంతాల నుంచి మరో 500 టన్నుల వంతున నెలకు 45 వేల టన్నులు తరలిస్తున్నారు. అంటే ఏటా 5 లక్షల టన్నుల పైనే అన్నమాట. నాణ్యత గ్రేడ్లను బట్టి టన్ను రూ.25 వేల నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. నెలకు దాదాపు రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖనిజాన్ని అనధికారికంగా సొంతం చేసుకున్న ఎంపీ వేమిరెడ్డి.. ప్రభుత్వ కీలక నేతకు నెలకు రూ.30 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో దొరికే క్వార్ట్ ్జను నేరుగా చెన్నై నౌకాశ్రయం ద్వారా చైనాకు ఎగుమతులు చేస్తున్నట్లు తెలుస్తోంది.రుస్తుం మైన్ పేరుతో భేతాళ కుట్రలుఅక్రమ మైనింగ్ దందాను మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పోలుపోయిన అనిల్‌కుమార్ యాదవ్ తరచూ ప్రశ్నిస్తుండడంతో టీడీపీ పెద్దలు కుట్రలకు తెరలేపారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్‌లో అక్రమ తవ్వకాలు చేశారంటూ భేతాళ కుట్రలు పన్ని వారిని కేసుల్లో ఇరికించారు. ఇప్పటికే కాకాణిపై పలు అక్రమ కేసులు బనాయించి రెండు నెలలుగా జైల్లో ఉంచారు. ఇంకా అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది.తాజాగా అనిల్ కుమార్ యాదవ్‌నూ అదే కేసులో ఇరికించారు. కాకాణి అనంతరం అక్రమ కేసుల వంతు బీసీ నేత అనిల్‌కుమార్ యాదవ్‌పై పడింది. రుస్తుం మైన్‌తో సంబంధం లేని వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అనిల్ కుమార్ యాదవ్ పేరు బలవంతంగా చెప్పించి.. తప్పుడు వాంగ్మూలం తీసుకుని జైలుకు పంపారు. ఇప్పటికే ఆయన వ్యక్తిగత సహాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. వీరి పాత్ర ఉన్నట్లుగా అభూత కల్పనలు అల్లుతున్నారు. ఎల్లో మీడియాలో కట్టుకథలు రాయిస్తున్నారు. చివరకు అనిల్ కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేసే వరకు ఎల్లో మీడియాలో పుంఖాను పుంఖానులుగా కథనాలు రాయిస్తున్నారు. -
సర్వేపల్లి కాలువలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని పూలేబొ మ్మ సమీపంలో కారు స్టాండ్ వెనుక సర్వేపల్లి కాలువలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని వీఆర్వో సుబ్బలక్ష్మమ్మ తెలియజేశారు. ఆమె బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయసు 48 నుంచి 50 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గులాబీ రంగు చొక్కా, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. బహిర్బూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? మరే ఇతర కారణం ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. -
కోర్టులు.. జైళ్లు సరిపోవు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని ప్రతి విషయానికి కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాళ్లు, జైళ్లు సరిపోవని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్‌రెడ్డిపై నమోదైన కేసులో శుక్రవారం నెల్లూరురూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన్ను విచారించారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరోపణలపై స్పందించానే తప్ప తానెక్కడా ఆమైపె వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నా రు. నా వ్యాఖ్యలకు ద్వందార్థాలు తీశారని, అపార్థం చేసుకుని కేసులు పెట్టడం జరిగిందన్నారు. సమావేశంలో నాతోపాటు వేదిక మీద ఉన్న ఐదుగురు నవ్వారని, చప్పట్లు కొట్టారని వారిపైనా కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలను ఇటీవల న్యాయమూర్తులు ఖండించారని గుర్తు చేశారు. నా ఇంటి మీద దాడి చేసిన వారి పేర్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారం తర్వాత ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. జిల్లా చరిత్రలో ఇళ్ల మీద దాడులు చేయడం ఇదే తొలిసారి అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారన్నారు. అందరి మీద కేసులు పెడుతాం, జైళ్లలో పెట్టిస్తాం అనుకుంటే.. రేపనేది ఒకటి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎల్లకాలం వీరు అధికారంలో ఉండరని, మళ్లీ మేము అఽధికారంలోకి వస్తాం. మాకు రెడ్‌బుక్ రాజ్యాంగం అవసరం లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్త నుంచి అధినాయకుడి వరకు మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారందరి సంగతి మేము అప్పుడు చూస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. మూడు గంటలు.. 40 ప్రశ్నలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతో కోవూరు పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో శుక్రవారం కోవూరు సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈ నెల 21వ తేదీన కోవూరు సీఐ వి. సుధాకర్‌రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి 35 (3) బీఎన్ఎస్ఎస్ కింద నోటీసు జారీ చేశారు. కొన్ని కారణాలతో విచారణ స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి మార్చారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి పలువురు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఉదయం 10 గంటలకు మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన న్యాయవాదులను మాత్రమే పోలీసులు కార్యాలయంలోకి అనుమతిచ్చారు. రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోవూరు సీఐ వి. సుధాకర్‌రెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని విచారించారు. పోలీసులు అడిగిన 40 ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడు గంటలపాటు విచారణ సాగింది. అప్పటికే కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివచ్చి ప్రసన్నకుమార్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. నవ్వారని, చప్పట్లు కొట్టారని కేసులు పెట్టడం హాస్యాస్పదం దమ్ముంటే రాజకీయంగానే ఎదుర్కొవాలే గానీ.. తప్పుడు కేసులు సరికాదు మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి -
అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్
● మాజీ మంత్రి కారుమూరి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి, పార్టీ పార్లమెంట్ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, కాకాణి పూజితతో కలిసి విలేకరులతో కారుమూరి శుక్రవారం మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా తనకు బాధ్యతలను పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకొని, జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీలకతీతంగా నాయకులు కలిసిమెలిసి ఉండేవారని, అయితే ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా మారిందని చెప్పారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం బనాయిస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మోపిన అక్రమ కేసుతోనే ఈ విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గమని.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అంతమాత్రాన ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఈ విధమైన దాడులు సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ పథక రచనలో భాగంగానే మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు నోటీసులిచ్చారని చెప్పారు. లిక్కర్ కేసనే అభియోగాన్ని ఎంపీ మిథున్‌రెడ్డిపై మోపి అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి రూ.27 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసి.. లిక్కర్‌కు ప్రజలు బానిసలయ్యేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి.. డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని యత్నిస్తే, వేల గొంతుకలు ప్రశ్నిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీడీపీకి హితవు పలికారు. ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే మూడు లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి.. జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో ఈ సంస్కృతి ఎన్నడూ లేదు జిల్లాలో తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో ఈ తరహా దుష్ట సంస్కృతిని ఎన్నడూ చూడలేదన్నారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెడుతూ పీటీ వారెంట్లు జారీ చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రసన్న ఇంటిపై 200 మంది టీడీపీ గూండాలు దాడి చేస్తే.. గుర్తుతెలియని వ్యక్తుల దాడంటూ పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తే దాడిలో పాల్గొంది ఎవరనేది స్పష్టంగా అర్థమవుతుందని, అన్ని ఆధారాలను అందజేసినా చర్యలు శూన్యమని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి పోలీసులు, ఇంటెలిజెన్స్ వంతపాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా పార్టీ అండగా నిలిచి.. చట్టపరంగా పోరాటం చేస్తు ముందుకెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పందింటి కామరాజు, పోతరాజు చంద్రశేఖర్, సిద్ధిఖ్, దివ్యాంగ విభాగ జిల్లా అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): చెత్త తరలించే వాహనాల బ్యాటరీలను దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సంతపేట పోలీసుస్టేషన్లో శుక్రవారం ఇన్స్పెక్టర్ జి.దశరథరామారావు వివరాలు వెల్లడించారు. పాత మున్సిపల్ కార్యాలయంలో చెత్త తరలించే వాహనాలను పార్క్ చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తేదీన గుర్తుతెలియని దుండగులు 17 వాహనాల బ్యాటరీలను అపహరించారు. ఇంజినీరింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు రంగనాయకులపేట రిక్షా కాలనీ ఆనకట్ట రోడ్డుకు చెందిన షేక్ షఫీ, నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం టిడ్కో ఇళ్లలో ఉండే దాసరి అప్పారావుగా గుర్తించారు. గురువారం రాత్రి పుత్తా ఎస్టేట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు. రూ.81 వేల విలువ చేసే 17 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్‌లో ప్రతిభ చూపిన దశరథరామారావు, ఎస్సై సుల్తాన్‌బాషా, సిబ్బంది సుబ్బారావు, లావణ్యకుమార్, గోపీ, సురేంద్ర, అల్లాభక్షును ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అభినందించారు. మోకాళ్లపై కూర్చొని కార్మికుల నిరసననెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థలో కా ర్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పజెబుతూ టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ చేస్తున్న సమ్మె పదో రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులు శుక్రవారం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో మోకాళ్లపై కూర్చొని ‘మా కడుపులు కొట్టొద్దు.. పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పొద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు రూరల్ ఉపాధ్యక్షుడు కొండా ప్రసాద్ మాట్లాడారు. మంత్రి నారాయణ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా కార్మికుల పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం ప్రభుత్వ విధానమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన విధానంతో తాను చేసేది ఏమీ లేదని చెప్పారన్నారు. కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపే విధానాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కామాక్షమ్మ, సుజాతమ్మ, చంద్రమ్మ, భాగ్యమ్మ, కొండమ్మ, వజ్రమ్మ, భారతి, లోకేశ్, మనోజ్, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులను కాపాడి..● గుండెపోటుతో స్టీరింగ్‌పై కుప్పకూలి డ్రైవర్ మృతి రాయచోటి టౌన్/కావలి(జలదంకి): బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను ప్రమాదం నుంచి తప్పించి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రసూల్ సాహెబ్ (52)ది నెల్లూరు జిల్లాలోని కావలి. స్థానిక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నడుపుకొంటూ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయానికి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే సమయంలో మార్గమధ్యలో మదనపల్లె రోడ్డు సమీపంలో అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడం ఆరంభమైంది. అప్రమత్తమైన రసూల్.. వెంటనే రాయచోటి పట్టణం సమీపంలోని ఓ డివైడర్‌కు బస్సు తగిలించి ఆపేశాడు. అనంతరం స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో కండక్టర్, మరో నలుగురికి ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్థానికుల సహకారంతో పోలీసులకు తెలియజేయడంతో ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి తన సిబ్బందితో వచ్చి డ్రైవర్ సీట్లో ఉన్న మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
ధిక్కారంతో ముందుకెళ్తే దిక్కు లేకుండా చేస్తాం
ఉలవపాడు: ‘కూటమి ప్రభుత్వం ధిక్కారంతో ముందుకెళ్తే కరేడు భూ సేకరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. దిక్కు లేకుండా చేస్తాం’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. శుక్రవారం కరేడు పంచాయతీలో భూములతోపాటు గృహాలు కూడా కోల్పోతున్న రామకృష్ణాపురం, ఉప్పరపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పుట్టిన గడ్డకు ప్రజలకు ఉండే సంబంధం వెలకట్టలేనిది. డబ్బులతో విడదీయాలనుకుంటే కుదరదన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించడం ఏంటని ప్రశ్నించారు. జగనన్న కరేడు రైతులకు అండగా ఉంటారని, ఆయన ఆదేశాల మేరకు తానిక్కడకు వచ్చినట్లు తెలిపారు. మీ ప్రభుత్వాన్ని బుల్డోజర్తో తప్పిస్తారు మీరు పోలీసులను పెట్టి బలవంతంగా బుల్డోజర్తో ఆక్రమించాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని అదే బుల్డోజర్తో తప్పిస్తారని జూపూడి హెచ్చరించారు. అమరావతిలో లక్షల ఎకరాలు భూసేకరణ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, ఖాళీ, బీడు భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు కుప్పంలో ప్రతి ఇంటి మీద సోలార్ బిగిస్తున్నాడు. అలాంటి చోట ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంటలు పండే భూములను, గ్రామాలను పరిశ్రమలకు సేకరించడం వ్యతిరేకమన్నారు. గ్రామాలను తీసుకోకూడదని జగన్ చెప్పారన్నారు. రాష్ట్రం మొత్తం కరేడు వైపు చూస్తోందన్నారు. ఉద్యమంలోకి గాలోడు పాత్రలతో కొందరు విచ్ఛిన్నం చేయడానికి వస్తారని వారిని గమనించాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరి పక్షమో తేల్చుకోవాలన్నారు. కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు నన్నం పోతురాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ధనకోటేశ్వరరావు, కరేడు గ్రామ అధ్యక్షులు సీతారామిరెడ్డి, కరేడు రైతు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు కృష్ణారావు, సుబ్బారావు, నియోజకవర్గ ఉద్యోగ, పెన్షన్ వింగ్ అధ్యక్షుడు ఆదాం, వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యనమల మాధవి, మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, పాకల వైఎస్సార్ సీపీ పార్టీ అధ్యక్షుడు కేశవరపు కృష్ణారెడ్డితోపాటు కరేడు గ్రామ రైతులు పాల్గొన్నారు. నమ్మి ఓట్లు వేస్తే గ్రామాలే లేకుండా చేస్తారా పరిశ్రమలు రావాలే కానీ పచ్చని గ్రామాలు, పొలాల్లో కాదు కరేడు రైతులకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి కరేడు పంచాయతీ రామకృష్ణాపురం, ఉప్పరపాళెం గ్రామాల్లో పర్యటన -
కావలి మనీ స్కామ్ తుట్టె కదిలింది
కావలి (జలదంకి): కావలి మనీ స్కామ్‌పై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో అక్రమార్కుల తుట్టె కదలింది. ఆయన ఆరోపించిన 24 గంటల్లోనే బాధితుల నుంచి స్పందన వచ్చింది. బాధితులకు అండగా ఉంటానని ఆయన ఇచ్చిన భరోసాతోపాటు 9704831113 సెల్ నంబరుతో హెల్ప్ డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. శుక్రవారం కావలి పట్టణం వెంగళరావునగర్ 25వ వార్డుకు చెందిన పసుపులేటి బాలయ్య తన బంధువులు 13 మంది కలిసి రూ.91 లక్షలు మనీస్కామ్ సూత్రధారి సుభానీకి కట్టి మోసపోయామని ప్రతాప్‌కుమార్‌రెడ్డికి వినతి అందించాడు. బాధితుడు బాలయ్య మాట్లాడుతూ తనతో పాటు బంధువులు 13 మంది అందరం ఆశతో స్థలం అమ్ముకుని, బంగారు కుదువ పెట్టి ఒకేసారి రూ. 91 లక్షలు కట్టామన్నారు. మేము కట్టిన రెండు నెలలకే మనీ ట్రేడింగ్ సంస్థను మూసివేశారన్నారు. గతంలో కావలి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. మాకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం, సీఎంకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. కావలి ఎమ్మెల్యే వద్దకు పలుమార్లు వెళ్లి తమ గోడు తెలిపామన్నారు. అయినా అతీగతీ లేదన్నారు. దీంతో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నారు. మీరు ఇచ్చిన భరోసాతో న్యాయం జరుగుతుందని భావించి వచ్చామన్నారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడుతా: ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ మనీస్కాంలో ఎంతో మంది పేదలు, ఉద్యోగులు మోసపోయారని, వారికి న్యాయం చేయడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మనీస్కామ్‌లో ఎమ్మెల్యేతోపాటు పోలీసులు ముడుపులు తీసుకుని కేసును నీరుగార్చిన విషయం అర్ధమవుతుందన్నారు. మనీస్కామ్‌లో నగదు కట్టి మోసపోయిన ప్రతి ఒక్కరికీ నగదు అందించేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యాలయంలో బాధితులు వినతులు ఇచ్చేందుకు కౌంటర్లు, ప్రత్యేక హెల్స్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. బాధితులు ఎవరికీ భయపడకుండా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, రూరల్ అధ్యక్షుడు వాయిల తిరుపతి, నాయకులు నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య, దామిశెట్టి సుధీర్‌నాయుడు, ఏగూరి పుల్లయ్య, కొండూరు శ్రీనివాసులు, పరుసు మాల్యాద్రి, దయాకర్‌రెడ్డి, పార్థు, ఆర్కే కృష్ణారెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి భరోసాతో కదలిక ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు రూ. 91 లక్షలు కట్టి మోసపోయానని మాజీ ఎమ్మెల్యేకు ఓ బాధితుడి ఫిర్యాదు హెల్ప్ డెస్క్ నంబరు 97048 31113, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు -
జిల్లాలో ఇలా..
అందుబాటులో ఉంచాం రైతుల అవసరాల నిమిత్తం సొసైటీలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా యూరియాను సరఫరా చేశాం. మోతాదుకు మించి వినియోగించకూడదు. ఐఏబీ తీర్మానం ప్రకారం 3.60 లక్షలు, మరో 40 వేల ఎకరాలకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాం. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. అధిక ధరలకు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటాం. రైతులు ముందుకొచ్చి సమస్యలపై ఫిర్యాదు చేయాలి. – సత్యవాణి, జిల్లా వ్యవసాయశాఖాధికారిణి ● అనంతసాగరం మండలానికి చెందిన రమణయ్య అనే రైతు 8 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. యూరియా కోసం పడరాని పాట్లు పడ్డారు. సొసైటీలో దొరక్కపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీల వద్ద బస్తా రూ.350కు కొనుగోలు చేశారు.● సంగం మండలం అన్నారెడ్డిపాళేనికి చెందిన శ్రీనివాసులు అనే రైతు ఆరున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. యూరియా కోసం బుచ్చిరెడ్డిపాళెం, సంగం, దువ్వూరు తదితర ప్రాంతాల్లో తిరిగి అలిసిపోయి ప్రైవేట్ ఏజెన్సీల వద్ద బస్తా రూ.380 పెట్టి కొన్నారు.నెల్లూరు(పొగతోట): జిల్లాలో వరిపంట సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు వైఎస్సార్సీపీ హయాంలో యూరియాను రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో అందించారు. కానీ కూటమి ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక లేదనే విమర్శలున్నాయి. సరిపడా నిల్వ చేయడంలో వైఫల్యం చెందింది. అధికారుల కాకిలెక్కల పుణ్యమా అంటూ రైతులు రోడ్డెక్కిన నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితులున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటల కింద అనధికారికంగా మరో లక్ష ఎకరాల్లో పంట సాగవుతోంది. ఐఏబీ సమావేశంలో 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖాధికారులు యూరియా, ఇతర ఎరువులను నిల్వ చేయాలి. కానీ నేడు యూరియా అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. సొసైటీలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా యూరియా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఐదు బస్తాలు కావాలంటే లిక్విడ్ యూరియాను తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన పెట్టారు. అయితే దానిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వ్యతిరేకిస్తున్నారు. సరఫరా చేశామని చెబుతున్నా.. సొసైటీల్లో ఎమ్మార్పీ ధరలకే యూరియాను విక్రయిస్తున్నారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో స్టాక్ లేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం లేదు. దీంతో ప్రైవేట్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా అధిక ధర వసూలు చేస్తున్నాయి. దీని గురించి వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత నేపథ్యంలో రవాణా చార్జీలు తదితరాలను సాకుగా చూపి ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కొందరు రైతులు అవసరానికి మించి నిల్వ చేసుకుంటున్నారని, అందువల్లే కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్న మాట. కాగా బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలే జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. అధిక ధరలకు అమ్ముతున్నా అధికారులు ఏం చేస్తున్నారని అడిగారు. మొదటిసారి రెండో పంటకు యూరియా కొరత వచ్చిందన్నారు. యూరియాను పూర్తిస్థాయిలో రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. అవసరానికి అనుగుణంగా సరఫరా చేస్తున్నామని కాకిలెక్కలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.డిమాండ్ ఎంతంటే.. : 47,588 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సరఫరా చేసింది : 36,994.34 మెట్రిక్ టన్నులు అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. కొరత లేదని ఓవైపు అధికారులు చెబుతుంటే మరోవైపు సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే పలుచోట్ల యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి.అవస్థలు పడుతున్న రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వైనం 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగు అనధికారికంగా మరో లక్ష ఎకరాల్లో.. అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు -
చెలరేగిపోతున్న తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్లు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. కొండలు, గుట్టలను కరిగిస్తూ యథేచ్ఛగా అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ సమీపంలో ఉన్న గొల్లకందుకూరు తిప్పను కరిగిస్తున్నారు. రెండు రోజులుగా రేయింబవళ్లు యంత్రాలతో కొండను తవ్వేస్తూ నెల్లూరుకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గతంలో పొదలకూరు లేఅవుట్లకు తరలించిన అక్రమార్కులు కొంతకాలం నిలిపివేశారు. తిరిగి నెల్లూరుకు గ్రావెల్ తరలింపు చేపట్టారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు అటు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా నెల్లూరు శివారు ప్రాంతాల్లో వేసే లేఅవుట్ల యజమానులతో మాట్లాడుకున్నారు. గ్రావెల్ తవ్వి టిప్పర్లకు లోడ్ చేసినందుకు ట్రిప్పునకు రూ.4 వేలు వంతున కమీషన్‌ను తమ్ముళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇదే పంచాయతీలో ఇటీవల నెలరోజులపాటు అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్నారు. గ్రావెల్ తవ్వకాలు తరలిపోతున్న గ్రావెల్ కరుగుతున్న గొల్లకందుకూరు తిప్ప -
5 కేజీల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. టాటానగర్ – ఎర్నా కుళం జంక్షన్ వెళ్లే రైలు నుంచి దిగి ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వి.మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత ని బ్యాగ్‌లోని 5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రైల్వే ఎస్సై ఎన్.హరిచందన కేసు నమోదు చేశారు. సమావేశంలో నెల్లూరు సీఐ ఎ.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలని డిమాండ్
● నెల్లూరులో న్యాయవాదుల నిరసన నెల్లూరు(లీగల్): ‘జూనియర్ లాయర్లకు రూ.10 వేలు, సంక్షేమనిధికి రూ.100 కోట్లు, న్యాయవాదులకు ఇంటి స్థలం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అవి హామీలుగానే మిగిలిపోయాయి. తక్షణమే వాటిని నెరవేర్చాలి’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆరిగెల నాగేంద్రసాయి డిమాండ్ చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేలు స్టై ఫండ్, న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.25 కోట్లు ఇచ్చిందన్నారు. జిల్లా శాఖ జనరల్ సెక్రటరీ బ్రహ్మం మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి తేవాలన్నారు. హైకోర్టు బెంచ్‌ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర బార్ కమిటీ న్యాయవాదులకు ఇస్తున్న డెత్ బెనిఫిట్ మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, జాయింట్ సెక్రటరీ జేఎల్ నారాయణ, షేక్ యస్దానీ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తల్లికి వందనం పడలేదయ్యా !
ఉలవపాడు: తల్లికి వందనం పడలేదయ్యా.. అంటూ మహిళలు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారం పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథికి ఏకరువు పెట్టారు. శుక్రవారం మండలంలోని భీమవరంలో సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం పడలేదని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పలువురు మహిళలు మంత్రిని అడిగారు. సాంకేతిక సమస్యలను సరిచేసి అందరికి ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డులు కావాలని, అంబేడ్కర్‌నగర్‌లోని పాఠశాలను బాగు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలో అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు హామీలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని నిరసన
● బాధితుడిని లాక్కెళ్లిన పోలీసులు సీతారామపురం: పరిహారం చెల్లించకుండానే దౌర్జన్యంగా తన భూమిలో రోడ్డు పనులు చేపట్టారని మండలంలోని గుండుపల్లికి చెందిన మామిడి భాస్కర్ అనే వ్యక్తి వాపోయాడు. అతను శుక్రవారం గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపి మాట్లాడుతూ తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో 50 సెంట్లు హైవేకు పోతుందన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బలగాలను దింపి నేషనల్ హైవే పనులను చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ అతని దాయాదులు కోర్టును ఆశ్రయించడంతో నష్టపరిహారం చెల్లించేందుకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణ పనులు చేయించడం జరిగిందన్నారు. కాగా ఒకానొక దశలో పరిస్థితి చేయి దాటిపోవడంతో భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ప్రసన్నకు విష్ణు పరామర్శ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం పరామర్శించారు. ప్రసన్న ఇంటిపై టీడీపీ మూకలు సాగించిన దాడి నేపథ్యంలో నెల్లూరులోని ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, కక్ష పూరితంగా వ్యవహరించడం సరి కాదన్నారు. రాజకీయంగా విమర్శలకు ప్రతి విమర్శల రూపం ఉండాలే కానీ, ఇళ్లపై పడి ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పంద్రాగస్టు వేడుకలకు నిధుల విడుదల నెల్లూరు (టౌన్): జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో ఆగస్టు 15 సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 46 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలల్లో వేడుకలకు రూ.25 వేలు నిధులను విడుదల చేశారు. జెండా ఆవిష్కరణ, సౌండ్ సిస్టంకు రూ.2 వేలు, పాఠశాల స్థాయిలో ఆటల పోటీల నిర్వహణకు రూ.5 వేలు, స్కిట్స్ హిస్టారికల్ ఈవెంట్స్, బ్యానర్స్, లైటింగ్‌కు రూ.3 వేలు, ఎస్ఏ రైటింగ్, క్విజ్ కాంపిటేషన్ బహుమతుల కోసం రూ.5 వేలు, పెయిటింగ్, పోస్టర్ మేకింగ్, స్నాక్స్‌కు రూ.10 వేలు ఖర్చు చేయాలని సూచించారు. జిల్లాలో 46 పాఠశాలలకు కలిపి మొత్తం రూ.11.50 లక్షలు నిధులు విడుదల అయ్యాయి. ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్– అక్షరాంధ్ర ● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ఉల్లాస్–అక్షర ఆఽంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వయోజన, విద్య, రెవెన్యూ, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో 100 శాతం వయోజన ప్రాథమిక అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అక్షర ఆంధ్ర అనే ప్రత్యేక కార్యక్రమం రూపొందించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 19,178 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. 2025–26 సంవత్సరానికి 1,08,680 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు బోధనా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. మొదట కోవూరు నియోజకవర్గంలో నిరక్షరాస్యులును అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. 15 నుంచి 59 సంవత్సరాల్లోపు మహిళలు, పురుషులు, కూలీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ లక్ష్య సాధనలో ఇతర శాఖలకు చెందిన అధికారులందరూ పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. స్వచ్ఛందంగా బోధించేందుకు ముందుకు వచ్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 7న అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభమై ఫిబ్రవరి 2026న బోధనా తరగతులు ముగించాలని కోరారు. మార్చిలో అక్షరాస్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వయోజన విద్యాశాఖ నోడల్ అధికారి మస్తాన్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, మెప్మా పీడీ లీలారాణి, డ్వామా పీడీ గంగాభవాని, డీఈఓ బాలాజీరావు, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, కోవూరు నియోజకవర్గ మండలా అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. -
నవ్వినా.. చప్పట్లు కొట్టినా కేసులు పెట్టడం హాస్యాస్పదం
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవని వైఎస్సార్సీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విమర్శించారన్న కేసులో నోటీసులు అందుకున్న ఆయన.. పోలీసు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవు. ఈ కేసుకు సంబందించి 40 ప్రశ్నలు అడిగారు.. దానికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు.. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతాం అనేది మంచి సంప్రదాయం కాదు అని ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. మూడుగంటలపాటు ఆయన విచారణ జరిగింది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుకు షూరిటీస్ను తన న్యాయవాది ద్వారా సమర్పించారు. -
బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం
నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఓ వ్యక్తి బుధవారం రాత్రి మినీబైపాస్‌లోని మిలీనియం సబ్‌స్టేషన్ వద్ద ఉన్నాడు. ఆత్మకూరు బస్టాండ్ వైపు నుంచి వచ్చిన బస్సు యూటర్న్ తీసుకునే క్రమంలో అతడిని ఢీకొనడంతో కిందపడ్డాడు. వెనుక చక్రం నడుముపైకి ఎక్కడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు సమాచారం తెలియజేయాలని కోరారు. సమ్మె విరమించాలని బెదిరింపులు●● మహిళను దూషించిన నలుగురు వ్యక్తులు ● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): సమ్మె విరమించాలని పబ్లిక్ హెల్త్ వర్కర్‌ను బెదిరించి, కులంపేరుతో దూషించి దాడిచేసిన వారిపై నెల్లూరు చిన్నబజారు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కోటమిట్టలో ఎం.మయూరి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 22వ తేదీన ఆమె తన ఇంటి నుంచి కార్మికుల సమ్మెలో పాల్గొనేందుకు బయలుదేరారు. పుత్తా ఎస్టేట్ ఆర్చి సమీపంలో ఆమెను గోపీ, నవీన్, భాస్కర్, రాజేష్ అడ్డుకుని సమ్మె విరమించాలని బెదిరింపు చర్యలకు దిగారు. ఆమె వినకపోవడంతో కోపోద్రిక్తులైన వారు కులంపేరుతో దూషించి దాడి చేశారు. అంతటితో ఆగకుండా సమ్మెలో కనిపిస్తే అక్రమ కేసులు పెట్టి పనులు లేకుండా చేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై గురువారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.బస్సు అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): బస్సు అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ పాయింట్లో ఉన్న ఆత్మకూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును బుధవారం తెల్లవారుజామున విడవలూరు మండలం కంచరపాళేనికి చెందిన బిట్రగుంట కృష్ణ అపహరించాడు. ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశవ యాదవ్ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా నిందితుడికి మతిస్థిమితం బాగోలేనట్లు వెల్లడించారు.నిమ్మ చెట్లు తొలగించి భూమి ఆక్రమణ ● నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన కలువాయి(సైదాపురం): గిరిజనుల భూముల్లోని నిమ్మ చెట్లను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. నిమ్మ చెట్ల తొలగింపును నిరసిస్తూ గురువారం కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులతో కలిసి ఆందోళన చేశారు. పెంచలయ్య మాట్లాడుతూ మండలంలోని బాలాజీరావుపేటకు చెందిన ఇండ్ల పెద వెంకయ్యతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన డీ–పట్టా భూమిలో సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను అదే గ్రామానికి చెందిన సిద్ధి వెంకటేశ్వర్లు కొందరితో తొలగించి పక్కనే ఉన్న బావిలో పడేశారని, బోరును సైతం ధ్వంసం చేసి భూమిని ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్యామ్సుందర్కు వినతిపత్రం ఇచ్చారు. -
జిల్లాలో ఇలా..
కోర్సు సీట్లు భర్తీ అయినవి సీఎస్ఈ 3972 2672 ఈసీఈ 1632 1132 ఏఐఎం / ఏఐఎమ్మెల్ 1296 985 సీసీ / ఏఐడీ 768 607 ఏఐ / సీఏఐ 715 581 సివిల్ 228 98 సీఎస్డీ 216 32 సీసీ / ఏఐడీ 768 607 ట్రిపుల్ ఈ 372 177 ఐఎన్నెఫ్ / డీఎస్ / సీఎస్ఓ 192 12 మెకానికల్ 276 113 ఈవీటీ 48 00 నెల్లూరుఇంజినీరింగ్ కళాశాలలు 13● కళాశాలల యాజమాన్యాల ఆశలు ఆవిరి ● ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్ ● జిల్లాలో ఈ ఏడాది 66 శాతం సీట్లే భర్తీ ● గతేడాదితో పోలిస్తే 11 శాతం పతనం ● పొరుగు రాష్ట్రాలవైపే మొగ్గు ● ఆశలన్నీ రెండో విడతపైనే నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీట్ల భర్తీ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆశించిన స్థాయిలో భర్తీ కాకపోవడం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కాలేజీలే మూతపడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో గతంలో 24 ఇంజినీరింగ్ కళాశాలలుండగా, ప్రస్తుతం ఇది 13కే పరిమితమైంది. నూరు శాతం భర్తీ.. మిథ్యే గత విద్యా సంవత్సరంలో 77 శాతం సీట్లు భర్తీ కాగా, ఈ ఏడాది 11 శాతం పతనమైంది. జిల్లాలోని ఏ కాలేజీలోనూ నూరు శాతం భర్తీ కాలేదు. రెండు కళాశాలల్లో పది శాతంలోపు, మరో మూడు చోట్ల 39 శాతంలోపే భర్తీ కావడంతో ఏమి చేయాలో పాలుపోక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని మూతపడే ప్రమాదం పొంచి ఉంది. మారిన పరిస్థితి బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ కళాశాలలో సీటు దొరికితే చాలనే భావన గతంలో ఉండేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. తొలి విడత కౌన్సెలింగ్ బుధవారంతో ముగియగా, ఈ విషయాలు స్పష్టమయ్యాయి. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ బ్రాంచ్‌లలో 9715 సీట్లుండగా, 6409 మాత్రమే భర్తీ అయ్యాయి. ఎక్కడా నూరు శాతం భర్తీ కాకపోవడం గమనార్హం. భర్తీ అయింది ఇలా.. నారాయణ (నెల్లూరు)లో 98.68.. నారాయణ (గూడూరు)లో 97.98.. ఏఈసీఎన్లో 94.91.. ఎన్బీకేఆర్లో 92.93.. జీటీఎన్నెన్లో 88.15.. ఏఎస్ఈటీలో 71.71.. ఆరెస్సార్ఎన్లో 70.51.. విశ్వోదయలో 67.39.. ఎస్వీసీఎన్లో 38.64.. డీఎస్సైటీలో 28.09.. జీకేసీఎస్లో 26.85.. పీఐఎన్నెన్లో 6.25.. పీఆర్ఐకేలో 4.69 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. కొన్ని కోర్సులకే డిమాండ్ ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏఐఎమ్మెల్, సీఎస్డీ, సీఎస్సీ, ఈసీఏ, ట్రిపుల్ ఈ, ఏఐ, ఐఎన్నెఫ్ తదితర కోర్సులున్నాయి. అయితే సీఎస్ఈ, ఈసీఈ, ఏఐఎమ్మెల్ కోర్సులకే డిమాండ్ ఎక్కువగా ఉంది.పక్క రాష్ట్రాలకే సై.. ఇంజినీరింగ్‌ను అభ్యసించేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాలవైపు జిల్లా విద్యార్థులు అడుగులేస్తున్నారు. జిల్లాలోని కాలేజీల్లో వసతుల లేమి.. క్వాలిఫైడ్ అధ్యాపకుల్లేకపోవడం.. నాణ్యమైన బోధన అందకపోవడం.. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం సైతం దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. మరోవైపు ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉద్యోగాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. నాణ్యత గల కళాశాలల నుంచి వచ్చిన వారికే కంపెనీలు అవకాశమిస్తుండటం సైతం దీనికి కేంద్రబిందువవుతోంది. ఇంజినీరింగ్.. ఈ కోర్సు అంటేనే క్రేజ్. దీన్ని అభ్యసించి సాఫ్ట్వేర్ రంగంలో కొలువుదీరి.. ఇతర దేశాల్లో స్థిరపడాలనే కోరిక గతంలో బలంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ఊపు లేకపోవడం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పరిస్థితి అయోమయంగా మారింది. ఫలితంగా కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం యాజమాన్యాలు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీలు గతంలో 24 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 13కు పతనమైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత విద్యా సంవత్సరంలో 77 శాతం సీట్లు భర్తీ కాగా, ఈ ఏడాది 11 శాతం క్షీణించి 66 శాతానికే పరిమితమైంది. -
రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు సిటీ: రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ వీరపాండ్యన్ గురువారం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరులోని ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, రిజిస్ట్రార్లు విజయరాణి, సింహాద్రినాయుడు, స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్ సుమలతారెడ్డి, బుజబుజనెల్లూరు సబ రిజి స్ట్రార్ ప్రవీణదేవీ, ఇందుకూరుపేట సబ్ రిజిస్ట్రార్ భానుమతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐజీ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి ప్రభుత్వం అర్బన్ ఆటో మ్యూటేషన్ విధానాన్ని ప్రారంభంకానున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో భూ యజమానులు అసెస్మెంట్ నంబర్ కోసం మున్సిపల్ ఆఫీసుల్లో ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే ప్రక్రియ జరుగనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలకు రావాల్సిన పన్నులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆటోమేటిక్ విధానం ద్వారా జరుగుతాయన్నారు. సబ్ రిజి స్ట్రార్లు తమ ప్రాంతాల్లో త్వరితగతిన అసెస్మెంట్ చేయాలని ఆదేశించారు. -
మనీస్కామ్ కేసును నీరుగార్చారు
కావలి(జలదంకి): కావలి ముసునూరులో అనంతపద్మనాభ అసోసియేషన్ పేరిట మనీస్కామ్ సూత్రధారి సుభానీ పన్నిన వలలో వేలాది మంది ఉద్యోగులతోపాటు పేదలు మోసపోయారని, కేసును పోలీస్ యంత్రాంగం నీరుగార్చి అన్యాయం చేసిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఈ స్కామ్‌లో కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, డీఎస్పీ, రూరల్ సీఐలు రూ.100 కోట్ల మేర వాటాలు పంచుకున్నారనే విషయం తెలిసిందన్నారు. దగదర్తిలో రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో మనీస్కామ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.800 కోట్ల మేర జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే పాత్రను ప్రస్తావించానని చెప్పారు. అనంతరం తాను బెంగళూరు వెళ్లానని, అయితే తాను పారిపోయానని, దాక్కున్నానని, మద్యం కేసులో అరెస్ట్ అంటూ ఎమ్మెల్యే అనుచర మీడియా ట్రోల్స్ చేశారని విమర్శించారు. కావలిలో ఎమ్మెల్యే ద్వారా ఉద్యోగం తెచ్చుకున్న రాధాకృష్ణ అనే కానిస్టేబుల్‌తోపాటు 17 మంది డైరెక్టర్లుగా ఏర్పడి వారు మరికొందరికి ట్రైనింగ్ ఇచ్చి రూ.లక్షకు రోజుకు ఆరు శాతం నగదు ఇస్తామంటూ భారీగా కట్టించుకున్నారని ఆరోపించారు. రూ.35 కోట్లేనా? మొదట్లో అలాగే నగదు అందించడంతో పోలీస్, రెవెన్యూ, విద్యుత్ తదితర ఉద్యోగులతోపాటు కింది స్థాయి ఉద్యోగులు, అలాగే ఏజెంట్ల మాటలు నమ్మి ఎంతోమంది పేదలు ఆస్తులు, బంగారాన్ని తాకట్టు పెట్టి కట్టారని వివరించారు. కావలి నియోజకవర్గంలోనే దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర నగదును చెల్లించారని వివిధ పత్రికలు, చానళ్లలో వార్తలొచ్చాయని తెలిపారు. పేదలందరికీ న్యాయం చేస్తానంటూ ఆ సమయంలో ఎమ్మెల్యే ఊదరగొట్టారని చెప్పారు. సుభానీని పదిరోజులపాటు తూతూమంత్రంగా విచారించి తెలంగాణలోనూ స్కామ్ జరిగిందంటూ అక్కడికి తరలించారన్నారు. తాము నష్టపోయామని బాధితులు తెలిపేందుకు యత్నిస్తే కావలి డీఎస్పీ, సీఐలు వారిని భయపెట్టి విషయాన్ని బయటకు రానీయకుండా చేశారని ఆరోపించారు. రూ.35 కోట్ల మేర స్కామ్ జరిగిందని, అందులో రూ.15 కోట్లను రికవరీ చేశామంటూ కేసును తప్పుదోవ పట్టించి ఎంతోమంది పేదలకు అన్యాయం చేశారన్నారు. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే 71 మంది రూ.కోట్లు కట్టి మోసపోయి బయటకు చెప్పకుండా బాధను అనుభవిస్తున్నారన్నారు. కానిస్టేబుల్ రమేష్ రూ.లక్షలు కట్టి ఏమీ చేయలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. తనపై, నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బయపడేది లేదని, అవినీతిని ఎండగడతామని స్పష్టం చేశారు. దగదర్తిలో మనీస్కామ్పై మాట్లాడిన తనను సీఐ రాజేశ్వరరావు బెదిరించారని, వీటికి భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్కామ్‌పై సీబీఐతో విచారణ జరపాలన్నారు. బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను త్వరలో ఏర్పాటు చేసి వారు నష్టపోయిన వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. కావలి, కావలి రూరల్, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, వాయిల తిరుపతి, మద్దిబోయిన వీరరఘు, బీద రమేష్‌బాబు, వెలినేని మహేష్‌నాయుడు, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, నేతలు కనమర్లపూడి వెంకటనారాయణ, పందింటి కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు రూ.90 కోట్లు, డీఎస్పీ, సీఐకు రూ.5 కోట్ల చొప్పున ముడుపులు పేదలకు న్యాయం చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి -
పరిశ్రమల ఏర్పాటుతో జిల్లా అభివృద్ధి
నెల్లూరు(అర్బన్): పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి.. జిల్లా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన పరిశ్రమలు – ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 1700 దరఖాస్తులు రాగా, 1616ను ఆమోదించగా, 20 అప్లికేషన్లను తిరస్కరించామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లీగల్ మెట్రాలజీ అధికారులు తమ శాఖ పరిధిలోని అంశాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల ద్వారా 13,599 మందికి, పెద్ద పరిశ్రమల ద్వారా 7,557 మందికి ఉద్యోగాలను కల్పించామని వెల్లడించారు. జాన్సన్ ఇన్ఫ్రా, ఉత్కర్ష అల్యూమినియం, క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ, విశ్వసముద్ర బయో ఎనర్జీ తదితర కంపెనీలు త్వరగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జేసీ కార్తీక్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, ఆర్డీఓలు పావని, అనూష, వంశీకృష్ణ, పరిశ్రమలు – ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యుడు భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. ప్రధాని 15 సూత్రాల అమలుపై సమీక్ష ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు 15 శాతానికి తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమ అమలుపై కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ నిర్మాణ, ఉపాధి హామీ, విద్య, సామాజిక పింఛన్లు, వైద్యం, మత్స్య సంపద యోజన, రుణాల మంజూరు తదితరాలను మైనార్టీలకు చేరువ చేయాలని సూచించారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని అక్కచెరువుపాడులో ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను పూర్తి చేయాలని కోరారు. ముస్లిం మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి హైఫా, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఈఓ బాలాజీరావు, డ్వామా పీడీ గంగాభవాని, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఏడీఎంహెచ్ఓ ఖాదర్‌వలీ, పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సోమశిలకు కృష్ణమ్మ పరుగులు
● 8928 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయానికి కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం సాయంత్రానికి 545 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, గురువారం ఉదయానికి ఇది 8928 క్యూసెక్కులకు పెరిగింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆరో క్రస్ట్ గేట్ నుంచి డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలిపామని, వాహనాలు శివాలయం మీదుగా వెళ్లొచ్చన్నారు. జలాశయంలో 27.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నార్ డెల్టాకు 1600, ఉత్తర కాలువకు 320 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని జలాశయ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు 9వ డివిజన్లో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం కార్మికులు భారీ ర్యాలీ చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ఇది జరిగింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సి పల్ కార్మికులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారా యణ నియోజకవర్గంలో టెండర్లు పిలవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు నాగభూషణం, జ్యోతిబసు, కత్తి శ్రీనివాసులు, కొండా ప్రసాద్, కె.పెంచలనరసయ్య, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదు
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులను మోపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే, పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజిత గురువా రం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవుల్లో పనిచేసి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులను మోపి అరెస్ట్ చేయడంతో జిల్లా ప్రజలు విస్తుపోయారని చెప్పారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మద్యం కేసంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని తాజాగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేతలను లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ కేసులో పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ను బెదిరించి బలవంతపు స్టేట్మెంట్ తీసుకొని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేరును చేర్చారని ధ్వజమెత్తారు. కూటమి నేతలిచ్చిన స్క్రిప్టును అమలు చేస్తూ.. ప్రేక్షకపాత్రకే పోలీసులు పరిమితమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయి.. వ్యాపారాలు సాగక ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పీ4 విధానమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తోందని ఎద్దేవా చేశారు. 2014, 2019లో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని జైలుకు పంపేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్రెడ్డిని అడ్డుకోలేక ఇలాంటి కుటిల రాజకీయాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలను తగ్గించాలనే లక్ష్యంతో మెరుగైన మద్యం పాలసీని తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారని వివరించారు. ఇందులో అక్రమాలు జరిగాయంటూ తమ పార్టీకి చెందిన 38 మంది నేతలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులు బనాయించిన వారికి పార్టీ అండగా ఉంటూ.. చట్టపరంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. అరాచక పాలన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనను సాగిస్తోందని కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. డిస్టిలరీలను ఏర్పాటు చేసి.. మద్యం బ్రాండ్లు తీసుకొచ్చింది చంద్రబాబు కాదానని ప్రశ్నించారు. హామీలను అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని విమర్శించారు. గుర్తుతెలియని వ్యక్తుల దాడి కారణంగానే మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసం ధ్వంసమైందంటూ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పరిపాలనను గాలికొదిలారు.. పరిపాలనను టీడీపీ గాలికొదిలిందని ఆనం విజయకుమార్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి విచారణ పేరిట పిలిచి వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కాకాణిపై కేసులు పెట్టి వేధించడం దారుణమని చెప్పారు. అసలు ఏమి సాధించాలని టీడీపీ ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదని తెలిపారు. -
సిబ్బంది లేక ఇబ్బంది
● మంత్రి ఇలాకాలో వైద్యశాలకు తాళాలు అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని ప్రభుత్వ వైద్యశాలలో తగినంతమంది సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 24 గంటలు వైద్యసేవలు అందించాల్సి ఉండగా ఆ పరిస్థితి లేదు. ఇద్దరు వైద్యులున్నా సాయంత్రం 4 గంటల తర్వాత వారి గ్రామాలకు వెళ్లిపోతారు. వాచ్మెన్ తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు తిరిగి ప్రారంభిస్తారు. గతంలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండగా వివిధ కారణాలతో వారిని ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఒక స్టాఫ్ నర్సు పగలు విధులు నిర్వహిస్తోంది. ఇక్కడి దర్గాకు ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఆరోగ్యం బాగాలేకుంటే ఈ వైద్యశాలను ఆశ్రయిస్తుంటారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత తాళాలు వేస్తుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దారుణ పరిస్థితులున్నాయి. -
కాకాణికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
నెల్లూరు (లీగల్): ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్ట్ ఏడు వరకు విధిస్తూ న్యాయమూర్తి శారదరెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషి యల్ రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌పై వర్చువల్ విధానం ద్వారా నెల్లూరు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో గుంటూరు సీఐడీ పోలీసులు ప్రవేశపెట్టారు. సీఐడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ.. కాకాణి పక్షాన సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపించారు. కేసులో ప్రాథమిక ఆధారాల్లేవని.. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి ఆగస్ట్ ఏడు వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఉత్తర్వులిచ్చారు. బెయిల్ పిటిషన్ దాఖలు మాజీ మంత్రి కాకాణిని విడుదల చేయాలని కోరుతూ బెయిల్ పిటిషన్‌ను న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి గురువారం దాఖలు చేశారు. బెల్టుషాపులున్న మాట వాస్తవమే ● ఎకై ్సజ్ శాఖ డీసీ శంకరయ్య ● మద్యం షాపుల్లో తనిఖీలు ఆత్మకూరు: ప్రధాన మద్యం దుకాణాలకు సమీపంలో, గ్రామాల్లో బెల్టు దుకాణాలున్న మాట వాస్తవమేనని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య అంగీకరించారు. ప ట్టణ పరిధిలోని మద్యం దుకాణాలను ఎకై ్సజ్ శాఖ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఆరు వైన్ షాపులను పరిశీలించి వాటిలోని సరుకు, బిల్లులను సరిచూశారు. ఇతర రాష్ట్రాల మద్యం ఉందాననే అంశాన్ని పరిశీలించారు. లైసెన్స్లిచ్చిన ప్రాంతంలోనే దుకాణాలను ఏర్పాటు చేశారాననే అంశాన్ని ఆరాతీశారు. రెండు దుకాణాల్లో శాంపిళ్లను తనిఖీ చేశారు. అనంతరం ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బెల్టు దుకాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు పరిధిలో 32 బెల్టు దుకాణాలను గుర్తించి 32 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు దుకాణాలపై దాడులు చేసేందుకు తగినంత మంది సిబ్బంది లేరని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టడి చేస్తున్నామని వెల్లడించారు. ఏసీ దయాసాగర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్ రమేష్, ఆత్మకూరు సీఐ వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. వయోజన విద్య నోడల్ ఆఫీసర్‌గా మస్తాన్‌రెడ్డి నెల్లూరు (టౌన్): వయోజన విద్య జిల్లా నోడల్ ఆఫీసర్‌గా మల్లు మస్తాన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అడల్ట్ ఎడ్యుకేషన్ జేడీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా ఆయన గురువారం కలిసి మొక్కను అందజేశారు. న్యాయవాదుల నిరసన నేడు నెల్లూరు(లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో నిరసనను శుక్రవారం ఉదయం చేపట్టనున్నామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) శాఖ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అరిగెల నాగేంద్రసాయి, జిల్లా అధ్యక్షుడు అబ్బాయిరెడ్డి, జనరల్ సెక్రటరీ బ్రహ్మం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
మాజీ మంత్రి అనిల్‌కు పోలీసుల నోటీసులు
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టారు. ఇక, తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, కొవ్వూరులో వైఎస్సార్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు గానూ.. ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు.. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాగా, ఎల్లుండి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ప్రజలు విస్తుపోతున్నారు. -
పంచాయతీలో రూ.12 లక్షల నిధుల గోల్మాల్
● అవినీతిపై నేడు విచారణ జలదంకి: మండలంలోని రామవరప్పాడు పంచాయతీలో రూ.12 లక్షల నిధులు గోల్‌మాల్‌పై గురువారం కావలి డివిజనల్ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నారు. సర్పంచ్‌గా ఉన్నం సరస్వతి, పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఇద్దరు కుమ్మకై ్క గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా, పంచాయతీ తీర్మానాలు లేకుండా పలుమార్లు సర్పంచ్ భర్త ఉన్నం రవి బ్యాంకు అకౌంట్లోకి నగదును మళ్లించారు. ఉన్నం రవి స్థానికంగా టీడీపీ నాయకుడిగా ఉంటున్నాడు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయకుండా నిధులు డ్రా చేసుకున్నారనే సమాచారం గ్రామస్తులకు తెలిసింది. దీంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కావలి డీఎల్పీఓ వెంకటరమణను వివరణ కోరగా కలెక్టక్ ఆదేశాల మేరకు పంచాయతీ నిధుల అవినీతిపై గురువారం విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): జిల్లా సైన్స్ అధికారి పోస్టుకు జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లోని సర్‌ప్లస్‌గా ఉన్న (క్లస్టర్ ఉపాధ్యాయులు) స్కూల్ అసిస్టెంట్లు (సైన్స్) ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు ఈ నెల 26వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. చిన్న రథంపై మూలస్థానేశ్వరుడి విహారం నెల్లూరు(బృందావనం): ఆషాఢ మాస శివరాత్రిని పురస్కరించుకొని మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలను బుధవారం నిర్వహించారు. చిన్న రథంపై స్వామివారు విహరించారు. ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. -
తవ్వితే పెద్ద స్కామే
● రాష్ట్రంలో అనేక చోట్ల ఆఫీసులు తెరిచి, ఏజెంట్లను పెట్టి రూ.కోట్లల్లో కాజేసిన కేటుగాళ్లు ● కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు ● రూ.వందల కోట్లు దాటుతున్న అక్రమాలు ● రుణగ్రహీతలను కలవకుండానే బ్యాంకు అధికారులు రుణాలు ● ఈ వ్యవహారం వెనుక బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ● ఆందోళన ఉధృతం చేస్తామన్న గిరిజన సంఘాలు నగరంలోని వనంతోపు సెంటర్లో ఇంటింటా పాచి పనిచేసుకునే చెంబేటి లక్ష్మి నిరక్షరాస్యులు. ఆమెను తమ ఆఫీసుకు తీసుకువెళ్లి ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆమెతో కొన్ని కాగితాలపై ఇంగ్లిష్‌లో సంతకం పెట్టించారు. ఆమె పేరుతో రూ.20 లక్షలు రుణాన్ని మంజూరు చేయించి తమ జేబుల్లో వేసుకున్నారు. ఒక్క రూపాయి ఆమెకు ఇవ్వలేదు. ‘కుబేరా’ సినిమాను మించిన స్థాయిలో సాగిన యాక్సిస్ బ్యాంక్‌లో రుణాల కుంభకోణం రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. టీడీపీ సానుభూతిపరుడైన జర్నలిస్టు జాలి వాసుదేవనాయుడు, ఆ పార్టీ మైనార్టీ విభాగం నేత అల్లాభక్షుతో శివ, వెంకట్ కలిసి చేపట్టిన మోసం తొలుత రూ.20 కోట్ల వరకు ఉంటుందని భావిస్తే.. ఈ మోసం వెలుగులోకి రావడంతో ఒక్కొక్కరుగా వస్తున్న బాధితులను బట్టి మరుసటి రోజుకు రూ.50 కోట్ల పైమాటగా ఉంటుందని అంచనా వేశారు. తాజాగా వివిధ జిల్లాల్లో ఉన్న వీరి బాధితులు బయటకు రావడంతో రూ.వందల కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది. మోసగాళ్లు, బ్యాంక్ అధికారులు కలిసి సాగించిన ఈ కుంభకోణం తవ్వితే పెద్ద స్కామే అవుతుందని పోలీస్ వర్గాల్లో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి.భక్తవత్సలనగర్‌కు చెందిన సుమతి వీరి వద్దకు వచ్చి రూ.5 లక్షలు బ్యాంక్ అప్పు అడిగారు. ఆమె వద్ద సంతకాలు, ఆధార్, బ్యాంక్ బుక్స్ తీసుకొని రూ. 5 లక్షలు అప్పుగా ఇచ్చారు. వడ్డీ, అసలు కలిపి ప్రతినెలా వసూలు చేశారు. ఆమె రికార్డులు యాక్సిస్ బ్యాంక్‌లో పెట్టి రూ.15 లక్షలు కొట్టేశారు. సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ స్కామ్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం బాధితులు బ్యాంకు వద్దకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. వీరి ప్రశ్నలకు సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో వారి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై బాధితులు ఏడు నెలల క్రితమే ఫిర్యాదు అందినా స్పందించని పోలీస్ యంత్రాంగం కదిలింది. తొలుత జిల్లాకే పరిమితమనుకున్న ఈ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్యాంక్‌లు మోసపోయిన జాబితాలో ఉన్నట్లు వెలుగులోకి వస్తుండంతో పోలీసులే గుడ్లు తేలేస్తున్నారు. పెద్ద ఎత్తున బాధితులు బయటకు వస్తున్నా.. ఈ కేసు నమోదు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికార పార్టీ పెద్దల ఒత్తిడే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసులు తెరిచి.. ఏజెంట్లను పెట్టి.. కేటుగాళ్లు జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు నాలుగు ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలను సృష్టించి నిరక్షరాస్యులైన గిరిజనులను ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి నెల్లూరు, ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకుల్లో రూ.20 కోట్ల మేర లూటీ చేశారు. ఇది లాభసాటిగా ఉండడంతో రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాల్లో ఆఫీసులు తెరిచి, రుణాలిప్పిస్తామని వారి నుంచి ఆధార్, పాన్‌కార్డులు తీసుకుని బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిచి పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు వీరి వద్దనే ఉంచుకుంటున్నారు. ఒక్కొక్కరి పేరుతో రూ.లక్షల్లో, రూ.కోట్లల్లో రుణాలు మంజూరు చేయించి ఈ మొత్తాన్ని తమ ఖాతాల్లోకి వేసుకుంటున్నారు. అసలైన రుణ గ్రహీతలకు రూ.1.50లకే రూ.లక్ష.. రెండు లక్షలిచ్చి వారి నుంచి నెల నెలా రికవరీ చేసుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రుణాల రికవరీ ఏజెంట్లను పెట్టుకుని దందా సాగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రుణగ్రహీలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు ఉన్నట్లు కూడా వారికే తెలియదు. ఏడేళ్లుగా ఒక వ్యవస్థనే సృష్టించారు బాధితులు చెబుతున్న సమాచారం మేరకు.. దాదాపు ఏడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తునట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జాలే వాసుదేవనాయుడు ఆయన బృందం ఒక పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఇందు కోసం ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్, బొల్లినేని ఆస్పత్రి సమీపంలో కార్యాలయాలు ప్రారంభించారు. ఇక్కడ సిబ్బందిని నియమించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక అవసరాలున్న వ్యక్తులు, అమాయకులను గుర్తించడానికి ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. ఈ ఏజెంట్ల నెట్వర్క్ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో ఉన్నట్లు భావిస్తున్నారు. లూటీ సొమ్ముతో జల్సాలు అమాయకులు, నిరక్షరాస్యుల పేరుతో రూ.కోట్లల్లో రుణాలు తీసుకుని ఆ డబ్బులతో నిందితులు జల్సాలు చేస్తున్నారు. విలాసవంతమై కార్లలో తిరుగుతూ, హోటళ్లల్లో బస చేస్తూ అధికార పార్టీ నేతలతో దగ్గరగా పరిచయాలు పెంచుకుని వారిని అడ్డం పెట్టుకున్నారు. ఇప్పటికే వీరే డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఒకటి.. రెండు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. దుమారంతో కేసు విచారణ వేగవంతం బ్యాంకుల నుంచి గిరిజనులకు నోటీసులు అందడంతో వారు ఖంగుతిని బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఎనిమిది నెలల కిందట ముత్తుకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి బాధితులు బ్యాంకు, పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా వారికి న్యాయం జరగలేదు. బ్యాంకు, పోలీసు అధికారులు వారిని పట్టించుకోలేదు. బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో కొందరు ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. కొందరు బాధితులు ఇటీవల యానాదుల సంక్షేమ సంఘం ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారమే రేపింది. దీంతో పోలీసు అధికారులు హుటాహుటిన కేసులో విచారణ వేగవంతం చేశారు. బ్యాంకు మేనేజర్‌ను ఇప్పటికే అధికారులు విచారించి ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు, పత్రాలను సేకరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బ్యాంకు మేనేజర్ ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదులో వాసుదేవనాయుడు పేరే కీలకంగా ఉంది. దీంతో నిందితులకు, బ్యాంకు సిబ్బందికి మధ్య ఏదైనా వివాదం వచ్చో, లేదా భవిష్యత్‌లో ఎప్పటికై నా ఈ వ్యవహారం వెలుగులోకి రాకతప్పదనో ఫిర్యాదు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిసాన్‌నగర్‌కు చెందిన సీహెచ్ శ్రీనివాసులు ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్నారు. ఆయన భార్య హైమవతి పేరుతో వారిని అప్పు అడిగారు. రికార్డులన్నీ తీసుకొని రూ.3 లక్షలు బ్యాంక్ నుంచి ఇస్తున్నామని చెప్పారు. ఆ రికార్డు బ్యాంక్ లో పెట్టి రూ.9.60 లక్షలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయట కొస్తున్నాయి. -
రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు నిర్వహించే యజమానులు తప్పనిసరిగా ఏపీ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధకారిణి సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకుని 5 ఏళ్లు పూర్తికాబోతున్న వారు ఒక నెల ముందే రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్స్‌లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యశాఖకు చెందిన మెడికల్ ఆఫీసర్లు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను సేకరించి ఆ జాబితాను ఆరోగ్యశాఖ కార్యాలయంలో వారం లోపు సమర్పించాలని సూచించారు. రిజిస్ట్రేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు 7 ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేశామన్నారు. 1,98,514 మందికే అన్నదాత సుఖీభవ నెల్లూరు (పొగతోట): అన్నదాత సుఖీభవన పథకానికి సంబంధించి జిల్లాలో అర్హులైన రైతులు 1,98,514 మందే ఉన్నారన్నాని జిల్లా వ్యవసాయశాఖాధికారి సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఆధార్‌కు, ఈకేవైసీ పూర్తయి, బ్యాంక్‌కు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) లింక్ అయి 2,525 మంది ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారన్నారు. బ్యాంకు అకౌంట్‌కు మ్యాపింగ్ కాని 4,389 మంది ఉన్నారన్నారు. వీరందరూ ఆధార్ లింక్, బ్యాంక్ లింక్ చేయించుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారన్నారు. రైతులు వారి పొలాలతోపాటు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఈకేవైసీ పూర్తయిందన్న విషయాన్ని విచారించుకోవడానికి అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటామన్నారు. మన మిత్ర వాట్సాప్ 955230009 నంబర్లో చెక్ చేసుకోవాలన్నారు. మరణించిన వారి వారసులు ముటేషన్ చేయించుకున్న తర్వాతనే అర్హులవుతారన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులుగా ఉన్న వారు దాన్ని సరి చేసుకునేంత వరకు ఈప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ విషయంపై రైతులు ఆందోళన చెంద వద్దని తెలిపారు. బస్సు అపహరణపై కేసు నమోదు నెల్లూరు (క్రైమ్): ఆర్టీసీ బస్సు చోరీ ఘటనపై నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆత్మకూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని దుండగుడు అపహరించుకుని వెళ్లా డు. అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బస్సు ఆత్మకూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించి నెల్లూరుపాళెం వద్ద అధికారులు బస్సును అడ్డుకున్నారు. బస్సు నడుపుతున్న విడవలూరు మండలానికి చెందిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నెల్లూరు నవాబుపేట పోలీసులకు అప్పగించారు. ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశవ్‌యాదవ్ ఫిర్యాదు మేరకు చోరీ ఘటనపై నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో నెల్లూరు నగరంలోని ఓ విద్యాసంస్థల బస్సు డ్రైవర్‌గా పని చేశాడని, కొద్దిరోజలుగా మతి స్థిమితం లేనట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు. 26న విచారణకు రావాలని అనిల్‌కు నోటీసులు ● ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు అంటించిన పోలీసులు నెల్లూరు (క్రైమ్): ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీమంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు కోవూరు సీఐ వి.సుధాకర్‌రెడ్డి బుధవారం రాత్రి నోటీసు జారీ చేశారు. ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు కోవూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు కోవూరు సర్కిల్ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసు ప్రతిని అందించేందుకు కోవూరు ఎస్సై రంగనాథ్గౌడ్ నెల్లూరు ఇస్కాన్ సిటీలోని అనిల్ కమార్ ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసును అతికించారు. -
ఖాళీ బిందెలతో నిరసన
రాపూరు: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాపూరు సమీపంలోని ఆంజనేయపురం గిరిజనవాడలో రెండు వారాల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, దీనిపై పలుసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యుత్ లేకపోవడంతో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సుదూరంలోని బోరు వద్దకు వెళ్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ఖాళీ బిందెలతో సబ్‌స్టేషన్‌కు చేరుకుని, నిరసన చేపట్టామన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ట్రాన్స్‌కో ఏఈ కార్తీక్ హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. భగత్‌సింగ్ కాలనీకి చెందిన పూడి వంశీకృష్ణ (26), కిసాన్ నగర్‌కు చెందిన మల్లు సుధీర్ స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసై నిత్యం మద్యం తాగుతుండేవారు. ఇటీవల వారి మధ్య విభేదాలు నెలకొన్నాయి. సుధీర్ ఇంట్లో లేని సమయంలో వంశీకృష్ణ వెళ్లి వస్తువులను ధ్వంసం చేశాడు. కక్ష పెంచుకున్న సుధీర్ ఎలాగైనా స్నేహితుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి వంశీ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుని వెళ్లాడు. అతను నిద్రపోతుండగా సుధీర్ నీళ్ల మోటార్‌తో ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా మంగళవారం సాయంత్రం ప్రశాంతినగర్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును త్వరితగతిన చేధించి నిందితుడిని అరెస్ట్ చేసిన వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు రెహమాన్, శివయ్య, సిబ్బంది ఎస్.ప్రసాద్, ఆర్వీ రత్నయ్య, ఎం.వేణు, జి.మస్తానయ్య, షేక్ గౌస్‌బాషాను ఏఎస్పీ సౌజన్య అభినందించారు. -
సమస్యల్ని విన్నవిస్తామయ్యా..
● రైతులకు అనుమతి నిరాకరణ నెల్లూరు(పొగతోట): బలవంతపు భూసేకరణ ఆపాలని ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జీఓ నంబర్ 43ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఆర్సీ సమావేశంలో మంత్రులను కలిసేందుకు రైతులను పోలీసులు అనుమతించలేదు. సమస్యను విన్నవించుకుంటామని ప్రాధేయపడినా కనికరించలేదు. సుమారు 4 గంటలపాటు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా కరేడు భూ సేకరణ వ్యతిరేక కమిటీ నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ పరిశ్రమల కోసం జిల్లా వ్యాప్తంగా 52 వేల ఎకరాలను భూసేకరణ చేయడం జరిగిందన్నారు. వాటిలో పదివేల ఎకరాల్లో పరిశ్రమ స్థాపించారని తెలిపారు. మిగిలిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కరేడు రైతులకు అన్యాయం జరిగేలా భూ సేకరణ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ అధ్యక్షుడు సునీల్, కరేడు గ్రామ రైతులు బొమ్మిరెడ్డి పవన్‌రెడ్డి, సీతారామ్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూములు తీసుకోవద్దుసైదాపురం: పేదలు సాగు చేసుకుంటున్న భూములు తీసుకోవద్దని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య అన్నారు. ఆ సంఘం నేతలు గిరిజనులతో కలిసి బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన తహసీల్దార్ గిరిజనుల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా తాము కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లడంతో విరమించారని గుర్తుచేశారు. మళ్లీ ఆ భూములను స్వాధీనం చేసుకునే చర్యలు ఆపాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెంచు మల్లికార్జున, మహిళా విభాగం అధ్యక్షురాలు చెంబేటి ఉష, నేతలు మల్లి, నాగరాజు, కోలా రమేష్, ఏకోలు శ్రీనివాసులు, అనంతయ్య, వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఏకోలు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కార్మికుల పోరాటం
● ఎన్ఎంసీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయింపు ● డీఆర్సీ సమావేశానికి హాజరైన మంత్రులను కలిసే ప్రయత్నం ● కొందరు నాయకులు, కార్మికులను అడ్డుకున్న పోలీసులు నెల్లూరు(బారకాసు): పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను ఉపసంహరించుకోవాలంటూ బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున నగరంలోని దర్గామిట్ట ప్రాంతంలోని బారాషహీద్ దర్గా వద్దకు కార్మికులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కమిషనర్ నందన్‌ను అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు, కార్మికులు నిలదీశారు. దీంతో కమిషనర్ తన పరిధిలో లేదని చెప్పగా అయితే వెళ్లనిచ్చేది లేదన్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఆఫీస్‌లో డీఆర్సీకి హాజరైన మంత్రులను కలిసేందుకు కార్మికులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య, కొందరు నాయకులు, కార్మికులను వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వారిని విడుదల చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని కార్మికులు డీఆర్సీ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆపి పదిమందిని లోపలికి పంపించడం జరిగింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఇదే సమావేశానికి హాజరైన మంత్రి నారాయణను కలిసి వినతిపత్రం అందించారు. నారాయణ మాట్లాడుతూ ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ కాబట్టి సీఎంతో మాట్లాడి చెబుతామన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రక్రియను వెంటనే ఆపాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొండా ప్రసాద్, కత్తి శ్రీనివాసులు, సుజాతమ్మ, మాలకొండయ్య, జి.నాగేశ్వరరావు, సూర్యనారాయణ, సుధాకర్, వజ్రమ్మ, కామాక్షమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి బాదుడు చంద్రబాబూ..
● స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచింది. ఇదెక్కడి బాదుడు చంద్రబాబూ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఆ పార్టీ నేతలు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని 54వ డివిజన్ వెంకటేశ్వపురం జనార్దనరెడ్డి కాలనీ వద్ద ఉన్న సబ్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, గృహాలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారన్నారు. అనేకచోట్ల విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. అనంతరం స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, మూలం ప్రసాద్, రషీద్, పద్మ, గడ్డం శ్రీనివాసులరెడ్డి, జాఫర్, వెంకటరత్నం, రామ్మోహన్, అల్లాభక్షు, ఆర్టీసీ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం.. ఎమ్మెల్సీ తూమాటిపై దాడికి యత్నం
నెల్లూరు (పొగతోట): రామాయపట్నం పోర్టు పరిధిలో కూటమి ప్రభుత్వం బలవంతంగా చేపడుతున్న భూ సేకరణపై జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ(డీడీఆర్సీ) సమావేశంలో నిలదీసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ వేలు చూపిస్తూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక దశలో దాడి చేసే యత్నం చేశారు. ఈ ఘటన ముగ్గురు మంత్రులు మహ్మద్ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలోనే బుధవారం ఈ ఘటన జరిగింది. భూసేకరణపై వివరణ ఇవ్వండి: ఎమ్మెల్సీ తూమాటి వ్యవసాయశాఖపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ మాధవరావు భూ సేకరణపై చర్చకు పట్టుబట్టారు. జూలై 13న రామాయపట్నం పోర్టుకు 20 వేల ఎకరాల భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామంటూ ప్రభుత్వం జీఓ ఇచి్చందని, 20 వేలు ఎకరాలు ఏ ప్రాంతంలో సేకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కరేడులో భూ సేకరణను ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. 5 వేల ఎకరాలు సరిపడే పరిశ్రమకు 8,300 ఎకరాలకు పైగా సేకరిస్తున్నారని, దీనివల్ల 5 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. వాగ్వాదానికి దిగిన కందుకూరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తూమాటి మాట్లాడుతుంటే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సభా మర్యాదను పాటించకుండానే వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచి్చన జీఓకు వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దగమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీపైకి దూసుకువచ్చారు. సభావేదికపై ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఎమ్మెల్సీని తప్పుబట్టారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ‘‘ఇది అసెంబ్లీ కాదు. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చించండి. నీ రాజకీయ అనుభవం నాలుగేళ్లు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. మాట్లాడకుండా కూర్చోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్సీ తూమాటి వాకౌట్ చేసి బయటకు వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఒక పరిశ్రమ పేరు చెప్పి బీపీసీఎల్‌కు భూములు కేటాయించేందుకు యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాగళం వినిపిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనను ప్రసారం చేయొద్దంటూ మీడియాను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బెదిరించారు. -
నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ
నెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్‌పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరి నైట్ హాల్ట్‌గా నెల్లూరు బస్టాండ్‌కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్‌పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్ బస్టాండ్‌లోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జామున బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలేచిన కండక్టరు, డ్రైవర్ బస్టాండ్‌లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్ అయినట్లు ఫాస్ట్‌ట్యాగ్ మెసేజ్ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. నెల్లూరుపాళెం సెంటర్ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు. -
నువ్వు ఒక్కడివే.. నీకు ఛాన్స్ లేదు.. బయటికి పోండి
సాక్షి, నెల్లూరు: జిల్లా సమీక్ష మండలి సమావేశం(డీఆర్సీ) సమావేశం రాజకీయ రగడకు దారి తీసింది. కరేడు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడే ప్రయత్నం చేయగా.. మంత్రులు ఆనం, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆయన్ని అడ్డుకుని అవమానకర రీతిలో మాట్లాడారు. కరేడు రైతుల సమస్యపై బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కరేడులో భూ సేకరణపై వివరణ ఇవ్వాలని, ఎంత భూములు సేకరిస్తున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్నించారు. అయితే మాధవరావును మాట్లాడనీయకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మీడియాపై చిందులేస్తూ బయటకు వెళ్లిపొమ్మంటూ ఊగిపోయారు.ఆ సమయంలో మంత్రి ఆనం కలుగజేసుకున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా.. ఎమ్మెల్సీకి అవకాశం లేదని, అవసరమైతే బయటకు వెళ్లిపోవాలని కటువుగా సూచించారు. ఆ సమయంలో మరో మంత్రి నారాయణ కూడా వేదిక మీదే ఉన్నారు. దీంతో మాధవరావు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.‘‘సమస్యలపై గళమెత్తడానికి రాజకీయ అనుభవం అవసరం లేదు. శాసనమండలి సభ్యుడుగా సమస్యలపై గళమెత్తడానికి నాకు హక్కు ఉంది. మంత్రి రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు అర్హత లేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇండో సోల్ కంపెనీకి గతంలో మేము 5,000 ఎకరాల కేటాయించాము. ఈ ప్రభుత్వం 8,000 ఎకరాలు కావాలంటుంది. ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలిఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గ్రామాలకు గ్రామాలను పరిశ్రమల పేరుతో ఖాళీ చేయించడం ఘోరం. 3000 కుటుంబాలను పరిశ్రమల పేరుతో రోడ్డుకి ఈడ్చడం సబబు కాదు. ‘కరేడు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది’’ అని అన్నారాయన. -
నగదు తీసివ్వాలని సాయం కోరితే..
పొదలకూరు: ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం తెలియక ఓ రైతు అక్కడే ఉన్న యువకుడిని సాయం కోరగా అతను రూ.40 వేలు తస్కరించాడు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. చేజర్ల మండలం నూతకివారికండ్రిక గ్రామానికి చెందిన యనమల పెంచలకృష్ణారెడ్డి సోమవారం పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే ఉన్న ఏటీఎంలో రూ.5 వేలు డ్రా చేసేందుకు వెళ్లాడు. అయితే ఆయనకు ఏటీఎం ఆపరేటింగ్ తెలియదు. దీంతో అక్కడే ఉన్న గుర్తుతెలియని ఓ యువకుడిని నగదు విత్‌డ్రా చేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అతను పెంచలకృష్ణారెడ్డి ఏటీఎం తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని ఆపరేట్ చేస్తున్నట్టు నటించి ఎందువల్లనో నగదు రావడం లేదన్నాడు. అయితే మోసగాడు బాధిత రైతు ఏటీఎం ఇవ్వకుండా తన కార్డు ఇచ్చాడు. పెంచలకృష్ణారెడ్డి గమనించకుండా మార్చి ఇచ్చిన కార్డు తీసుకుని తమ ఊరి పక్కనే ఉన్న ఏటూరు బ్యాంకులో నగదు తీసుకునేందుకు వెళ్లాడు. ఈలోగా యువకుడు మూడుసార్లు పెంచలకృష్ణారెడ్డి ఏటీఎం నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేశాడు. బాధితుడి ఫోన్‌కు మెసేజ్‌లు వెళ్లినా తెలుసుకోలేకపోయాడు. బ్యాంక్ వద్దకు వెళ్లి అకౌంట్లో నగదు పరిశీలించగా రూ.లక్షకు బదులు రూ.60 వేలే ఉంది. వెంటనే అప్రమత్తమై ఉన్న రూ.60 వేలను బాధిత రైతు డ్రా చేశాడు. మంగళవారం గ్రామపెద్దలతో మాట్లాడి పొదలకూరు ఎస్బీఐ సిబ్బంది వద్దకు వెళ్లి జరిగిన మోసాన్ని వివరించాడు. సీసీ టీవీ ఫుటేజీని తీసుకుని పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రూ.40 వేలు తస్కరించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతు -
భూసేకరణను ఆపాలని డిమాండ్
ఉలవపాడు: బలవంతపు భూసేకరణను నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో వారి బృందం పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రావూరు, చేవూరు గ్రామాల రైతులు న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించారన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజలను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ భూములను ధ్వంసం చేయొద్దన్నారు. పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీల అవసరాల కోసం రైతులతో ఆటలాడొద్దన్నారు. ప్రజల మాటలను గౌరవించి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ గతంలో కృష్ణపట్నం పోర్టు సమీపంలో రిలయన్స్‌కు 2,800 ఎకరాలు, కిసాన్ సెజ్ కోసం 2,500 ఎకరాలు సేకరించారన్నారు. వారు పరిశ్రమలు కట్టకుండా ఈ భూములపై లోన్లు తీసుకుని వారు వ్యాపారాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులతో బెదిరించి ప్రజలను ఖాళీ చేయించాలని చూస్తే భూసేకరణకు వ్యతిరేకంగా వచ్చే అన్ని పార్టీలతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు కుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూలి వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యుడు తాళ్లూరు మాల్యాద్రి, ఇంకా పోట్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లుల ‘షాక్’
కావలి మండలం మద్దూరుపాడులోని ఇందిరా సీడ్స్ యజమాని దేవరపల్లి గిరిధర్‌రెడ్డికి కొన్ని సంవత్సరాలుగా ప్రతినెలా రూ.8 వేల్లోపే విద్యుత్ బిల్లు వచ్చేది. కొత్తగా స్మార్ట్ మీటరు అమర్చిన తర్వాత వచ్చిన మొదటి నెల బిల్లు రూ.లక్ష పైనే. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు.కావలి(జలదంకి): కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతున్నాయి. ఒక్కసారిగా బిల్లులు అధికంగా వస్తుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క కావలి పట్టణంలోనే సుమారు 12 వేల వరకు స్మార్ట్ మీటర్లు బిగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గృహాలకు కూడా బిగించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే విద్యుత్ పంపిణీ సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితోపాటు మీటర్ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పేయే అవకాశాలున్నాయి. కాగా స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత వస్తున్న బిల్లులు చూసి వినియోగదారులకు షాక్ అవుతున్నారు. ప్రతినెలా రూ.6 వేల నుంచి రూ.8 వేలు వచ్చే బిల్లులు నేడు రూ.లక్షల్లో వస్తుండటంతో వ్యాపారుస్తులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి రూ.లక్ష పైన బిల్లు ఎందుకు వస్తుందని వారు విద్యుత్ సిబ్బందిని అడిగితే ఈసారికి నగదు కట్టండి తర్వాత సరిచేస్తామని చెబుతున్నారు. దోచుకోవడమే.. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నెల్లూరులో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొత్తగా విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయంపై ఆయా శాఖాధికారులు చర్యలు చేపట్టాలని అన్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కావలిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అధికంగా వస్తున్న బిల్లులు ప్రజలపై ‘కూటమి’ భారం -
మోటార్‌బైక్‌పై వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం అల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన అల్లూరు గోదాముల వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అల్లూరు పురిణి మందిరం గ్రామానికి చెందిన నొంగులూరు శ్రీహరి (28) ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను బైక్‌పై మోపూర్ నుంచి అల్లూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో గోదాముల నుంచి ప్రధాన రహదారి అల్లూ రు వైపునకు తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఇంకా ఎదురుగా నెల్లూరు వైపు వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొని శ్రీహరి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మద్యం దుకాణంలో చోరీ రాపూరు: కోటూరుపాడు మార్గంలో ఉన్న మద్యం దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం రాత్రి నిర్వాహకులు దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం షాపు తెరిచేందుకు రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికెళ్లి పరిశీలించి 4 కేసుల 29 మద్యం బాటిళ్లు, రూ.11,800 నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యుదాఘాతానికి గురై..
● వ్యక్తి మృత్యువాత విడవలూరు: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ముదివర్తి గాంధీనగర్ గ్రామానికి చెందిన సిద్ధపరెడ్డి చిన్నయ్య (37) అనే వ్యక్తి కొంతకాలంగా అన్నారెడ్డిపాళెంలో నివాసముంటూ పొలం పనులు చేస్తున్నాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన బండ్ల శంకరయ్య అనే వ్యక్తి పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లాడు. శంకరయ్య పొలం నుంచి బడ్ల రమణయ్య పొలంలోకి స్వరీస్ వైరు కిందకు లాగి ఉంది. వైరుకు చిన్నయ్య తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య బుజ్జమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు. -
వీఎస్‌యూలో అడ్మిషన్ల గడువు పొడిగింపు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం అడ్మిషన్ల గడువును ఈనెల 31 తేదీ వరకు పొడిగించినట్లు డీఓఏ డైరెక్టర్ డాక్టర్ ఎం.హనుమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ నాలుగు సంవత్సరాల హానర్స్, నాలుగు సంవత్సరాల హానర్స్ విత్ రీసెర్చ్ పాసైన విద్యార్థులు పీజీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం వీఎస్‌యూలోని డీఓఏ కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.రైలు కింద పడి.. ● వృద్ధుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ రైలు కింద పడి గుర్తుతెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి నెల్లూరు – వేదాయపాళెం మధ్యలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 65 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పసుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, పసుపు రంగు పంచె, కాషాయ రంగు టవల్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అక్రమంగా జామాయిల్ నరికివేత దుత్తలూరు: మండలంలోని భైరవరం పంచాయతీ మజరా గ్రామమైన తురకపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు వల్లెం మల్లారెడ్డికి చెందిన పొలంలో టీడీపీ నాయకులు అక్రమంగా జామాయిల్ నరికి అమ్మే ప్రయత్నం చేశారు. భైరవరం రెవెన్యూ సర్వే నంబర్ 367లో 2.50 ఎకరాల భూమిలో మల్లారెడ్డి పదేళ్ల క్రితం జామాయిల్ సాగు చేపట్టారు. అయితే ఇదే సర్వే నంబర్లో కొంత భూమి కలిగి ఉన్న టీడీపీ నేత బోగిరెడ్డి ఓబుల్‌రెడ్డి మంగళవారం జామాయిల్ కర్ర కొట్టించారు. లారీకి లోడు చేయించి తరలిస్తుండగా బాధితుడు తహసీల్దార్ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందిని పంపించి లారీని స్వాధీనం చేసుకుని దుత్తలూరు పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆ భూమి వివాదాస్పదంలో ఉన్నందున ఎవరూ ప్రవేశించరాదని బోర్డు పెట్టడం జరిగిందన్నారు. నిబంధనలు అతిక్రమించి ప్రవేశించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
సైదాపురం ఎంపీడీఓ సస్పెన్షన్
నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో సైదాపురం ఎంపీడీఓ పి.శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలపై జరిపిన విచారణలో నిజాలు నిగ్గుతేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కోట మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివకుమార్‌కు సైదాపురం ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి కృషి ● రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోవూరు: కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. మండలంలోని పోతిరెడ్డిపాళెంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి మంగళవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చక్కెర కర్మాగారం రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. వీలైనంత త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని రామాయపట్నంలో బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటవుతుందని, దీంతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు చక్కెర కర్మాగారం సమస్యను త్వరగా పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ మంచి పరిపాలన అందించడమే లక్ష్యంగా తామంతా పని చేస్తున్నామని చెప్పారు. తొలుత కోవూరు చక్కర కర్మాగారాన్ని ఎమ్మెల్యేతో కలిసి మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. -
2న స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు వచ్చే నెల 2న జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు జరుగుతాయన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన 7 స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (వీఆర్సీ సెంటర్): కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా బీడీ కార్మికులకు అందజేసే ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం పలుకుతోందని బీడీ కార్మిక సంక్షేమ ఆస్పత్రి నెల్లూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేవీ భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి పీజీ కోర్సులు అభ్యసించే బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రీ మెట్రిక్ కేటగిరీలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31వ తేదీ చివరి తేదీ కాగా, పోస్ట్ మెట్రిక్ కేటగిరీలో ఇంటర్ నుంచి ఆ పైబడిన కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ఇతర వివరాలకు స్కాలర్ షిప్ పోర్టల్ www. scholarships. gov. in లాగిన్‌ను సంప్రదించాలని కోరారు. నేడు జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నెల్లూరురూరల్: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా అభివృద్ధి సమీక్ష (డీడీఆర్సీ) కమిటీ సమావేశం జరగనుందని డీఐపీఆర్ఓ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొని చర్చించనున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యలో ఆధునికీకరణలు అవసరం ● మంచు లక్ష్మి ● డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ప్రారంభం ముత్తుకూరు(పొదలకూరు) : పాఠశాల స్థాయి నుంచే విద్యలో ఆధునికీకరణలు జరగాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సినీనటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి అన్నారు. ఆమె స్థాపించిన ‘టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ’ సహకారంతో ముత్తుకూరు ఈదూరు ఈశ్వరమ్మ జెడ్పీ హైస్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ను మంగళవారం నెల్లూరు నగరం కోటమిట్ట కృష్ణమందిరం మున్సిపల్ హైస్కూల్ నుంచి మంచు లక్ష్మి ప్రారంభించారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 12 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్క క్లాస్ రూమ్‌కు రూ.2 లక్షలు వెచ్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నర్సింగ్ కోర్సుపై ఆస క్తి ఉన్న గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో నర్సింగ్ కోర్సుల్లో ప్రావీణ్యం పొంది వైద్యసేవా రంగంలో జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో 75 మందికి జర్మన్ లాంగ్వేజ్, 9 నుంచి 10 నెలల పాటు నర్సింగ్‌లో డిగ్రీ చదివిన గిరిజన యువతులకు ఉచిత వసతితో కూడిన శిక్షణకు గిరిజన సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. బీఎస్సీ నర్సింగ్‌లో రెండేళ్ల క్లినికల్ అనుభవం జీఎన్ఎంలో 3 ఏళ్ల అనుభవం కలిగిన 35 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులన్నారు. ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలన్నారు. జర్మన్ ల్యాంగ్లో 8 నుంచి 10 నెలల శిక్షణ, బీ2 స్థాయి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ఐటీడీఏ కార్యాలయ సెంటర్ మేనేజర్ ఎం బాలాజీని 81878 99877, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం 95026 77311 నంబర్లలో సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. -
సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు (లీగల్): సెప్టెంబర్ 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ శ్రీనివాస్ కోరారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులతో మంగళవారం జిల్లా కోర్టులోని జడ్జి చాంబర్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వాణి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి తేజోవతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైఓ నందన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, రవాణాశాఖాధికారి మొహమ్మద్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ శ్రీనివాసరావు, ఎకై ్స జ్ శాఖ, ఫైర్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ ఈఈ, ఆర్టీసీ, ఇన్స్యూరెన్స్, చిట్ ఫండ్స్ సంస్థల అధికారులు, పలు కోర్టుల న్యాయమూర్తులు, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో అత్యంత గౌరవ భావంతో వ్యవహరించాను. ఏ రోజు నా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టమని పురమాయించనూ లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, ధైర్యం లేక నేను వారి అవినీతిని ప్రస్తావించడాన్ని తట్టుకోలేక, నన్ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ సహకారంతో నాపై మోపుతున్న అనేక అక్రమ కేసులు పరంపరలో భాగంగానే ఇది మరో అక్రమ కేసు. అంతే తప్ప ఈ కేసులో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎకై ్సజ్ శాఖ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధామిచ్చారు. పొదలకూరు మండలం ఇరువూరులో మద్యం అక్రమ నిల్వల కేసులో కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి కాకాణిని రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. పోలీస్ శిక్షణా కేంద్రంలో రెండో రోజు మంగళవారం ఎకై ్స జ్ అధికారులు విచారణ చేపట్టారు. రెండో రోజు 25 ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు కాకాణి ప్రశ్నలకు నీళ్లు నమలాల్సి వచ్చిందని కాకాణి న్యాయవాది చంద్రశేఖర్ తెలిపారు. వాంగ్మూలాలతో తప్పుడు కేసులా? వాంగ్మూలాలు ఏ పాటి విలువ ఉంటుందో మీకు తెలుసు. గిట్టని వాడు చేసే ఆరోపణలు, ఇచ్చే వాంగ్మూలాలు పక్కన పెట్టి నేను పదే పదే కోరినట్లు ఈ కేసులో నా పాత్ర ఉన్నట్లు మీరు నిర్ధారించి, ఆధారాలు చూపిస్తే నేరుగా న్యాయమూర్తి దగ్గర తప్పు ఒప్పుకొని న్యాయస్థానం విధించే శిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయకుండా మోసగించడంతో మోస పూరిత పోకడలను నేను పదే పదే ప్రశ్నించడంతో వాస్తవాలు ప్రజలకు తెలిసి పోతున్నాయని మా నోళ్లు మూయించేందుకు అక్రమ కేసు బనాయించి నిర్బంఽధించాలన్న కుట్రలో భాగమే ఈ అక్రమ కేసు తప్ప మరొకటి కాదు. నేను 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించాను. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేశా. ఎన్నడూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు సాగించడం, అక్రమ మార్గాలు అనుసరించడం ఎన్నడూ చేయలేదు. మీరు నిందితులను ముఖాముఖి తీసుకుని వస్తే అసలు ఫిర్యాదుదారు నాకు పరిచయం ఉన్నాడా? లేదా? అనే విషయం స్పష్టమవుతుంది. అవన్నీ వదిలేసి అడ్డదారులెందుకని ఎకై ్సజ్ అధికారుల పరంపరలో కాకాణి చెప్పినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. మంత్రిగా అధికారులతో అత్యంత గౌరవం ప్రదర్శించాను కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు మీరు ఒక్క ఆధారమూ చూపించలేదు రెండో రోజూ ఎకై ్సజ్ అధికారులు విచారణలో మాజీమంత్రి కాకాణి -
‘పచ్చ’ పైత్యం
● మినరల్ వాటర్ ప్లాంట్‌కు పసుపు రంగు కొండాపురం (ఉదయగిరి): కొండాపురం మండలం మన్నంవారిపల్లిలో అధికార పార్టీ నేతలు పచ్చపైత్యాన్ని ప్రదర్శించారు. గ్రామంలో 2011–12 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ఎంపీ గ్రాంట్ ద్వారా రూ.5 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్మించారు. ఈ నిధులతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్లాంట్‌ను నిర్మించింది. అప్పటి ప్రజాప్రతినిధులు ప్లాంట్ ప్రారంభించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు అఽధికారులు, పంచాయతీ అనుమతి లేకుండా ప్లాంట్‌కు పసుపు రంగు వేసి తమ పచ్చ పైత్యాన్ని చాటుకున్నారు. ఎంపీ గ్రాంట్‌తో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌కు టీడీపీ పసుపు రంగు వేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వివాదాలకు దారితీసే ఈ చర్యపై సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.