breaking news
YS Jagan Mohan Reddy
-
జీవితాంతం YS జగన్ కు రుణపడి ఉంటా
-
వైఎస్ జగన్‌ను కలిసాక CPI ఈశ్వరయ్య రియాక్షన్
-
వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు
తాడేపల్లి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రముఖ సీపీఐ నేతలు కలిశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 24వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌తో సీపీఐ ప్రముఖ నేతలు సమావేశమయ్యారు. వీరికి వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌తో సమావేశమైన వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డిలు ఉన్నారు.ప్రజా సంబంధిత అంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్సీపీని ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందించారు.సమావేశం అనంతరం ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీన రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని, దానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించినట్లు ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ప్రజా పోరాటాలకు వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేశారని, ఎస్ఎల్ఆర్ గురించి సైతం ఆయన మద్దతు కోరినట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించారన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, సమాధానం చెప్పలేక దాడులు చేయడం సరికాదన్నారు ఈశ్వరయ్య.ఇదీ చదవండి: బాబు కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: వైఎస్ జగన్ -
రౌడీ షీట్లకు బ్రేక్.. బాబు యూ టర్న్
-
పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో YS జగన్ సమావేశం
-
బాబు కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన, మంచి అభ్యర్థులను వేగంగా గుర్తించాలని పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి.. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోలీసుల బలంతో, అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు . ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు సహా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్థంగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను గుర్తించాలి. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థుల జాబితాను తయారు చేయండి. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలి.రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను ప్రజలకు వివరించాలి. ప్రతి గడప వద్దకూ వెళ్లి, మన పాలనలో మంచి జరిగిన విషయాలను చెప్పాలి. అలాగే, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వెన్నుపోటు, దారుణాలను వివరించాలి. ఈ రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను సమగ్రంగా చెప్పాలి. పోలీసు బలంతో, అడ్డదారుల్లో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలి’ అని సూచించారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ రాజశేఖర్ మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
కాకుమాను రాజశేఖర్ మృతి YS జగన్ ఎమోషనల్ రియాక్షన్
-
వైఎస్సార్సీపీ రాజశేఖర్ మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.కాగా, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజశేఖర్ వైఎస్సార్సీపీకి అంకితభావంతో పనిచేశారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు.మా పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లేని లోటు పార్టీకి, వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ పూడ్చలేనిది. రాజశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ… pic.twitter.com/WU401YZvz0— YS Jagan Mohan Reddy (@ysjagan) September 24, 2026 రాజశేఖర్ ఆకస్మిక మరణం బాధాకరమని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అయితే, గతంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్, ప్రస్తుతం పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ఏపీలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం -
ఇదిగో సాక్ష్యం.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. పక్కా ఆధారాలతో గవర్నర్ వద్దకు జగన్
-
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే రౌడీషీట్ తెరుస్తారా?... చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
‘స్థానికం’గా గట్టిగా నిలబడదాం
ఎన్నికల హామీలతో వెన్నుపోటు పార్టీ నేతలు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫొటోలు, సంతకాలతో బాండ్లు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీల వర్షం కురిపించారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి కుటుంబ సభ్యుడికీ విడివిడిగా లెక్కలు చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ బాండ్ల విలువ ఏమిటి? రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా గురించి ఇంటింటా చర్చించుకుంటున్నారు. డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఎల్లో మీడియా వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తోంది. హామీలన్నీ అమలై పోయాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. మన ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. ప్రజలకు మంచి చేయాలని తపన పడ్డాం. తాపత్రయంతో పని చేశాం. బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో సంక్షేమ సొమ్ము జమ చేశాం. కోవిడ్ సమయంలోనూ సాకులు చెప్పకుండా ప్రజలకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి, మొత్తం పోలీసులపై ఆధారపడుతున్నారు. మన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, గ్రామ స్థాయి పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలి. ఇదే సమయంలో ఈ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలు, భూముల కేటాయింపులు, డీఎస్సీ నియామకాలు, తాగునీటి సమస్య, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరును కూడా తెలియజెప్పాలి. - వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలంతా మన వైపే ఉన్నారని.. స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడి పోరాడాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనంతా అరాచక పర్వమని.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయని, వాటన్నింటినీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలని సూచించారు. విశాఖలో చంద్రబాబు వచ్చాకే సమస్యలు మొదలయ్యాయని.. నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయని.. పోలీసులు గతి తప్పి వ్యవహరిస్తున్నారని, దారుణంగా వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ డైరీతో అన్ని లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా వారు పద్ధతి మార్చుకోవాలని.. లేని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గ్రేటర్ విశాఖ పరిధిలోని పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను.. నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రతి ఇంట్లో అదే చర్చ మన ఐదేళ్ల పాలనకు, ప్రస్తుతం రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ఈరోజు ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన హయాంలో ప్రజలకు అందిన పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య వ్యత్యాసం ప్రతి కుటుంబానికీ స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎన్నడూ జరగని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను మార్చాలన్న చిత్తశుద్ధితో పని చేశాం. రాజకీయాల్లో నాయకుడి మీద, పార్టీ మీద విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేశాం. గతంలో మేనిఫెస్టో అంటే ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేయడం అనే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని మార్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తీసుకొచ్చాం. దాన్ని ఒక భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి 99 శాతం హామీలను అమలు చేశాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అంతటి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం మనది.విద్య, వైద్య–ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులునాడు మనం కేవలం మేనిఫెస్టో అమలుతోనే సరిపెట్టుకోలేదు. గతంలో సాధ్యం కావనుకున్న ఎన్నో కార్యక్రమాలను సాధ్యం చేసి చూపించాం. విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడగలవా.. అనే సందేహం గతంలో ఉండేది. మన ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. నాడు–నేడు (మనబడి) కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. మూడో తరగతి నుంచే టోఫెల్‌ను ఒక పీరియడ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక పేజీ ఇంగ్లిష్, మరో పేజీ తెలుగు ఉండేలా ద్విభాషా (బైలింగ్వువల్) పాఠ్య పుస్తకాలను అందించాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాం. పిల్లలు ఏం తింటున్నారు, వారికి ఎలాంటి పౌష్టికాహారం అందుతోంది అనే విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈ మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఖాళీ లేవని బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లగలిగాం. ఒక వ్యవస్థలో చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతటి మార్పులైనా తీసుకురావొచ్చని మన ప్రభుత్వం నిరూపించింది. వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం. మన ప్రభుత్వం రాక ముందు ఆరోగ్యశ్రీ కేవలం 1,000 ప్రొసీజర్లకే పరిమితమై ఉండేది. దాన్ని 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం. ఈ పథకంలో పేద వారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చాం. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతం ఉంటే, మన ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ కొరతను కేవలం నాలుగు శాతానికి పరిమితం చేయగలిగాం. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. మందులు దొరకని పరిస్థితిని మార్చేసి.. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేశాం. గ్రామ స్థాయి వరకు విలేజ్ క్లినిక్‌లను తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వ్యవస్థను రూపొందించాం. మండలానికి నలుగురు వైద్యులు, రెండు 104 వాహనాలను అందుబాటులో ఉంచాం. ఒక వైద్యుడు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే, మరో వైద్యుడు 104 వాహనంలో తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేలా చేశాం. దీంతో ప్రజలకు గ్రామ స్థాయిలోనే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడమే కాకుండా, ముందుగానే గుర్తించి నివారించే ప్రివెంటివ్ కేర్లోనూ కీలక మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమవుతాయా అని గతంలో ఎవరైనా అడిగితే సాధ్యం కావనే సమాధానం వచ్చేది. కానీ వాటిని సాధ్యం చేసి చూపించింది మన ప్రభుత్వం.గ్రామ స్వరాజ్యం గ్రామ స్థాయిలోనే పరిపాలనను ప్రజలకు చేరువ చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే చేర్చాం. లంచం లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పేదవారికి సేవలు అందించగలమని నిరూపించాం. సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి ఇంటికీ ప్రభుత్వ సాయం అందేలా వ్యవస్థను రూపొందించాం. కుల ధ్రువీకరణ పత్రం వంటి సేవలను కూడా వలంటీర్లు ప్రజల ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితి కల్పించాం.వ్యవసాయం పండగ గ్రామ స్థాయిలో రైతులకు అండగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చాం. వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ నమోదు చేసి, ఉచిత పంటల బీమా అమలు చేశాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలోనే రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకేలో ఒక వ్యవసాయ గ్రాడ్యుయేట్‌ను నియమించాం. ప్రతి పంటకు ప్రకటించిన గిట్టుబాటు ధరలను రైతులకు తెలిసేలా ఆర్బీకేల్లో ప్రదర్శించాం. ఎక్కడైనా రైతులకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంటే, ఆర్బీకే సిబ్బంది సీఎం యాప్ ద్వారా వివరాలను నమోదు చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశాం.వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని తీసుకొచ్చాం. అవసరమైన చోట జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ అధికారులు జోక్యం చేసుకొని కొనుగోళ్లకు చర్యలు చేపట్టేలా చేశాం. రైతులకు సరైన ధర దక్కేలా కొనుగోలు వ్యవస్థలో పోటీని పెంచేందుకు కృషి చేశాం. మన ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లపాటు కోవిడ్ పరిస్థితులు ఎదురైనా, ఏనాడూ సాకులు చెప్పలేదు. కోవిడ్ కారణంగా హామీలు అమలు చేయలేకపోతున్నామని చేతులెత్తేయలేదు. ఒకవైపు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, మరోవైపు వ్యవస్థల్లో గతంలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం.ఇప్పుడు అంతా రివర్స్ మన హయాంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసు అందుబాటులో ఉండేవారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌ను తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేసినా, ఫోన్‌ను షేక్ చేసినా పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశాం. కానీ, ఇప్పుడు పరిస్థితులన్నీ రివర్స్ గేర్‌లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, విశాఖపట్నంలో మాత్రం చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 99 పైసలకే భూములు ఇస్తున్నారు. ఒకవైపు భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. మరో వైపు గ్రామాలు, పట్టణాల్లో గంజాయి, మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. గుడి పక్కన, బడి పక్కన, వీధి చివర ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయి అందుబాటులోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు ఉండటంతో ఇలాంటి ఘటనలపై వెంటనే సమాచారం అందేది. వాటిని అరికట్టేందుకు ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, అక్రమ కార్యకలాపాలకు మరింత అవకాశం ఇస్తున్నారు. గతంలో సచివాలయానికి వెళ్తే లంచం లేకుండా పనులు జరిగేవి. వలంటీర్లు ఇంటికి వచ్చి ప్రజలకు అవసరమైన సేవలు అందించేవారు. ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రం కావాలన్నా, జనన ధ్రువీకరణ పత్రం కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు.హామీలతో ప్రతి కుటుంబానికి మోసం ఎన్నికల హామీలతో ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫొటోలు, సంతకాలతో బాండ్లు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీల వర్షం కురిపించారు. జగన్ ఇచ్చే పథకాలన్నీ కొనసాగించడమే కాకుండా, వాటికి మూడింతలు అదనంగా ఇస్తామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పారు. 2024 జూన్ నుంచే తమ హామీల అమలు ప్రారంభమవుతుందని ప్రచారం చేశారు. అమ్మ ఒడి కింద జగన్ ఒక కుటుంబానికి రూ.15 వేలు ఇస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తలా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికీ, నలుగురు పిల్లలుంటే నలుగురికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో మహిళ కనిపిస్తే నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంత మంది అర్హులైన మహిళలు ఉంటే అంత మందికీ ఈ సాయం అందుతుందని ప్రచారం చేశారు. నిరుద్యోగ యువకుడు కనిపిస్తే నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు నిరుద్యోగులు ఉన్నా, అందరికీ ఈ సాయం అందుతుందని హామీ ఇచ్చారు. రైతుల దగ్గరకు వెళ్లి, జగన్ రైతు భరోసా కింద పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తుంటే, తాము అన్నదాత సుఖీభవ పేరుతో పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. మన ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద మహిళలకు రూ.18,750 చొప్పున సాయం అందిస్తే, చంద్రబాబు మాత్రం 50 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.48 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి కుటుంబ సభ్యుడికీ విడివిడిగా లెక్కలు చెప్పి హామీలు ఇచ్చారు. వాటిపై బాండ్లు రాసిచ్చారు. సంతకాలు పెట్టారు. ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ఆ బాండ్లకు విలువ ఏమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలకు విలువ ఏమిటి? రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.డీఎస్సీలో అక్రమాలు.. ప్రశ్నిస్తే వేధింపులు డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నాయి. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, బాండ్ల పేరుతో ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా ప్రచారం చేస్తున్నారు. హామీలన్నీ అమలై పోయాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధికి మన ప్రభుత్వం చేసిన కృషి అందరికీ తెలిసిందే. దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హయాంలో ఏం చేశామో మీరే ప్రజలకు వివరించగలరు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూలపేట పోర్టు వరకు, అదానీ డేటా సెంటర్ నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల వరకు ఉత్తరాంధ్రలో మన ప్రభుత్వం చేపట్టిన పనులు కనిపిస్తాయి. విశాఖపట్నంలో ఏకంగా 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశాం. కేజీహెచ్ అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను మెరుగు పరిచేందుకు నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేశాం. ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంత ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చాం. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో హీర మండలం నుంచి గ్రావిటీ ద్వారా ఉద్దానం వరకు నీరు తీసుకొచ్చాం. ఇందుకోసం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఇంకా గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, వైద్య కళాశాలలు వంటి విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశాం. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైద్య కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు.. ఇలా ఏ రంగాన్ని చూసినా మన ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తాయి. అందుకే మన హయాంలో చేసిన మంచి మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. దేవుడి దయ, ఆశీస్సులు ఎప్పుడూ మనకు అండగా ఉంటాయి.సక్రమంగా ఎన్నికల నిర్వహణ అనుమానమే విశాఖపట్నంలో మేయర్, కార్పొరేషన్ వ్యవహారాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలను తమ అ«దీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదు. అయితే ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే తాత్కాలికంగా ఏదైనా ప్రయోజనం కలగవచ్చేమో కానీ, అది శాశ్వతంగా నిలబడదు. 2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికను గుర్తు చేసుకోండి. నా పాదయాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆ ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అందరం చూశాం. ఆ ఉప ఎన్నికలో మన పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నంద్యాలలో 36 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగం, పోలీసుల సహాయంతో దౌర్జన్యాలు చేయడం ద్వారా తాత్కాలిక ఫలితాలు సాధించవచ్చేమో కానీ, ప్రజల తీర్పును శాశ్వతంగా అడ్డుకోలేరు.విశాఖను దోచి పెడుతున్నారు 55 ఎకరాల భూమిని గీతం వర్సిటీ వారు కబ్జా చేశారు. దాని విలువ కనీసం రూ.5 వేల కోట్లు. దాన్ని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేశ్ తోడల్లుడికి ఇచ్చేశారు. ఆ స్థాయిలో బరి తెగించారు. విశాఖపట్నంలో 99 పైసలకే భూములు కేటాయించడం, గీతం భూముల వ్యవహారం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంత అవినీతి ప్రభుత్వం ఇది. అయితే ఇవన్నీ ఊరకే పోవు. తప్పకుండా చుట్టుకుంటాయి. చేసిన పాపాలు, అక్రమాలు ఎక్కడికీ పోవు. కచ్చితంగా అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.విశాఖలో నీటి ఎద్దడి ప్రభుత్వ వైఫల్యమే విశాఖపట్నంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులకు ఒకసారి నీరు సరఫరా అయ్యే పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తే అదనంగా 75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ నీటిని గ్రావిటీ ద్వారా విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అందించే వెసులుబాటు కలుగుతుంది. కానీ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే నిర్ణయంతో ఆ 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అలా ఒకవైపు పోలవరంలో అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతుంటే, మరోవైపు విశాఖపట్నంలో ప్రజలకు మూడు రోజులకోసారి తాగునీరు అందించే పరిస్థితి నెలకొంది.కార్యకర్తలకు పార్టీ అండస్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. వైఎస్సార్సీపీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ అగ్ర నాయకత్వం వరకు.. నా వరకు ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు తోడుగా ఉంటాం. ఎన్నికల సమయంలో ఎవరైనా అన్యాయానికి పాల్పడితే, ఆ ఘటనల వివరాలను వెంటనే నమోదు చేయండి. ఏ అధికారి, ఏ పోలీసు అధికారి ఏ విధంగా వ్యవహరించారు? ఎలాంటి అన్యాయం జరిగింది? అనే వివరాలను మర్చిపోకముందే డిజిటల్ డైరీలో నమోదు చేయండి. భవిష్యత్తులో వాటిని పరిశీలించి చట్ట ప్రకారం బాధ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటాం. పోలీసు అధికారులకు ముందుగా విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా ఇచ్చేలా సహకరించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు తమ ధర్మాన్ని నిర్వర్తించాలి. వారి టోపీపై ఉన్న సింహాలకు మాత్రమే తలవంచాలి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయం చేయకూడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఎవరైనా అన్యాయానికి పాల్పడితే, వారి చర్యలను డిజిటల్ డైరీలో నమోదు చేయాలి. మన ప్రభుత్వం వచ్చాక ఆ డిజిటల్ డైరీలో నమోదైన అంశాలను పరిశీలించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జగన్ 2.0లో కార్యకర్తకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తల ప్రయోజనాలకు అండగా పార్టీ నిలుస్తుంది.మనం చేసిన మంచిని ప్రజలకు వివరించాలిమన ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. పోలీసులను ఉపయోగించుకోలేదు. పోలీసుల మీద ఆధారపడి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రజలకు మంచి చేయడంపైనే ఆధారపడ్డాం. బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో సంక్షేమ సొమ్ము జమ చేశాం. కోవిడ్ సమయంలోనూ సాకులు చెప్పకుండా ప్రజలకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి, మొత్తం పోలీసులపై ఆధారపడుతున్నారు. మన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, గ్రామ స్థాయి పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మనం లేవనెత్తుతున్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఎన్నికల హామీల అమలు, భూముల కేటాయింపులు, డీఎస్సీ నియామకాలు, తాగునీటి సమస్య, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు వంటి అంశాలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఆ దిశలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలందరూ సమన్వయంతో పని చేయాలి. పార్టీలో ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు అందరూ అండగా ఉంటారు. అలాగే కార్యకర్తల ప్రయోజనాలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, గొల్ల బాబూరావు, అదీప్‌రాజు, పి.నాగిరెడ్డి, మల్లా విజయ్‌ప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్, బొత్స అనూష, మాజీ మేయర్ జి.హరివెంకటకుమారి పాల్గొన్నారు. -
రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల దుర్మరణం
టెక్కలి/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో నౌపడ–గుణుపూర్ రైలు మార్గంలో బుధవారం రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన జన్నీ దిలీప్‌కుమార్ (17), గంగువాడ విశాఖరావు (17), భీంపురం గ్రామానికి చెందిన జన్నీ శరత్‌కుమార్ (17), మెళియాపుట్టికి చెందిన సవర శివ (17)తో పాటు డమర గ్రామానికి చెందిన గంగువాడ సాల్మన్‌రాజు టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. తుపాను నేపథ్యంలో బుధవారం కళాశాలకు సెలవు ప్రకటించడంతోఅందరూ బయటకు వెళ్లారు. రావివలస సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా నౌపడ నుంచి గుణుపూర్ వైపు వస్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్‌కుమార్, శరత్‌కుమార్, విశాఖరావు, శివ అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఉన్న మరో విద్యార్థి సాల్మన్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన వారంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారే. టెక్కలిలో గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్ రాంబాబు, సీఐ విజయకుమార్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన సాల్మన్ రాజును టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతినలుగురు విద్యార్థుల మృతి అత్యంత విషాదకరంశ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావివలస సమీపంలో రైలు ఢీకొనడంతో గిరిజన విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్, శివ, శరత్‌కుమార్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి సాల్మన్‌రాజుకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అతను త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయం అందించాలని కోరారు. -
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 స్కామ్‌పై సీబీఐతో విచారించాలని, ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు, ర్యాలీలు చేసే హక్కు లేదా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే.. రౌడీషీట్లు తెరుస్తారా? శాంతియుతంగా ర్యాలీలు చేస్తే అక్రమ కేసులు పెడతారా?’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన శాప్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించిన వారిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్సీ–2025 పేరిట జరిగిన స్కామ్ గురించి సాక్ష్యాలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయిందో వివరించారు. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవ స్థపై ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. డీఎస్సీ కుంభకోణం, టీడీపీ నేతల గూండాగిరీ, దౌర్జన్యాల గురించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వివరిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది దేశ చరిత్రలో ఎన్నడూ జరగని స్కామ్ ‘ఇప్పటికే డీఎస్సీ–2025 అక్రమాలకు సంబంధించి పార్ట్–1, పార్ట్–2 అంటూ ప్రెస్మీట్లు పెట్టి.. జరిగిన ప్రతి తప్పును సాక్ష్యాలు, ఆధారాలతో ఇప్పటికే ప్రజల ముందు పెట్టాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, నాలుగు పాయింట్ల ఆధారంగా డీఎస్సీ–2025లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 1.ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించడంతో ఈ స్కామ్ ప్రారంభమైంది. 2. ఈ ప్రక్రియ మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అవుట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. అతని పేరు తొలుత మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత తొలగించారు. అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేశారు. కాల్ లెటర్ కూడా పంప లేదు. దీంతో అతడు ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాకుండా, కోర్టుకు కూడా వెళ్లాడు. అంటే ఒక స్కామ్‌ను కప్పిపుచ్చేందుకు (కవరప్) ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అగచాట్లు పడిందో తేట తెల్లమైంది. లీకేజీ వ్యవహారం బట్టబయలైంది. 3. స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీవోలు ఇవ్వడం చూశాం. గతంలో ఉన్న జీవోలు రద్దు చేసి కొత్తగా జీవో నంబర్ 4, 47 అని చెప్పి రెండు కొత్త జీవోలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా 372 ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తి కాగానే జీవో నంబర్ 23, 25, 56 అంటూ మరో 3 జీవోలు తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి పరీక్ష రాయకుండా 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. 4. ఫేక్ సర్టిఫికెట్లు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ ఏరకంగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్ జరిగినట్లు చూపారు. ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడైన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో సెక్రటరీలకు, వారి భార్యలకు, కుటుంబ సభ్యులకు ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విషయాన్ని కూడా చెప్పాం. అసలు జరగని క్రీడా పోటీలకు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? పోటీలు జరగలేదని సంబంధిత క్రీడా సంఘాలే చెప్పినప్పుడు శాప్ వాటిని ఎలా ఆమోదించింది? ఆ నకిలీ, అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? టెట్ అర్హత లేని వారికి టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? ఒక కేటగిరీలో పొందిన టెట్ మార్కులను మరో కేటగిరీ నియామకానికి ఎలా ఉపయోగించారు? గతంలో వేరే సామాజికవర్గంలో నమోదు చేసుకున్నవారికి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? ప్రభుత్వం ‘ఏడుసార్లు వెరిఫికేషన్ చేశాం’ అంటుంటే, ఇన్ని తీవ్రమైన అక్రమాలు ఏడు దశల్లోనూ ఎలా కనిపించలేదు? అసెంబ్లీలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బేరసారాలపై ఆడియో, వీడియో బయటకు వచ్చింది. ఈ ఫోన్ సంభాషణపై పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో చూశాం. అందులో స్పష్టంగా (క్లియర్‌గా) ఫోన్ నెంబర్ కనిపిస్తున్నా, ఆ వ్యక్తి గురించి ఎఫ్ఐఆర్లో రాయలేదు. కేవలం అనుమానాస్పదం (సస్పెక్ట్) అని మాత్రమే రాశారు. అరెస్టు కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయినా సీఎం చంద్రబాబు మాత్రం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాం.. రిమాండ్‌కు పంపించాం.. అంటూ అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చూశాం. శాప్ ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల దాడి డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ సెప్టెంబర్ 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముందుగానే సమాచారం ఇచ్చారు. అనుమతి కోరుతూ కమిషనర్‌కు లెటర్ కూడా రాశాడు. కానీ, ఆరోజు ఏం జరిగింది? అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎలా కుట్ర చేశారో చూశాం. టీచర్లు కాని టీచర్లను పిలిపించి, శాంతియుత ర్యాలీకి సమాంతరంగా ధర్నా చేయించారు. నిజానికి వారు చదువు చెప్పే గురువులు కాదు. దొంగ సర్టిఫికెట్లతో, ఏ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు పొందిన ఈ టీచర్లు కానీ టీచర్లను పిలిపించి, శాప్ కార్యాలయం ఎదుట కావాలనే గొడవ చేయించారు. అంతే కాకుండా టీడీపీ గూండాలను అక్కడికి రప్పించారు. వారంతా కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై దారుణంగా దాడి చేశారు. అసలు వారంతా ఎవరో చూడండి. వీరు గతంలో సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వారే. (ఫొటోలు మీడియాకు చూపారు). దాడి చేసిన వారిని వదిలేసి రివర్స్ కేసులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై టీడీపీ గూండాలు దారుణంగా దాడి చేసినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. వారిపై కేసులు నమోదు చేయలేదు. అందుకు పూర్తి భిన్నంగా, రివర్స్‌లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై కేసు పెట్టారు. ఎంత దారుణంగా ఆ కేసులు పెట్టారంటే.. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఇప్పటికే 350 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ జాబితా ఇంకా పెరుగుతోందని చెప్పారు. ఇలా కేసులు పెట్టడం, రాత్రి పూట వారి ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేయడం.. ఆపై రాత్రి వేళల్లో అరెస్టులు చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు.. కోర్టులు వాటిని తప్పు పడుతున్నాయి. మేజిస్ట్రేట్.. వీళ్లు చేస్తున్న అన్యాయాలను తిట్టి ఇలా చేయడం ధర్మం కాదంటూ వాళ్లకు బెయిల్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో మనిషి అనే వాడు బతకగలిగే అవకాశం కోర్టుల పుణ్యమాని కలుగుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమనేది ఏ స్థాయిలో అమలవుతుందో.. ఏ రకంగా విధ్వంసం జరుగుతున్నదో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. గవర్నర్‌ను కలిసిన అనంతరం లోక్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్లు తెరిచి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తారా? శాప్ కార్యాలయం ఎదుటæ శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. వాటిపైనా కోర్టులు స్పందించాయి. శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే, రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశాయి. ప్రశ్నిస్తే రౌడీషీట్లు ఓపెన్‌చేసి వాళ్ల భవిష్యత్ (కెరియర్)ను నాశనం చేస్తారా? తప్పు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు చేసే హక్కు లేదా? ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తారా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? మా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాల్సిందే. తప్పు ఒప్పుకొని విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో పిల్లలకు, నిరుద్యోగులకు పరీక్షల మీద విశ్వాసం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో మా డిమాండ్ కొనసాగుతోంది. ఈ యుద్ధం కచ్చితంగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉషశ్రీ చరణ్, పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తాటిపర్తి చంద్రశేఖర్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాజగొల్ల్ల రమేష్ యాదవ్, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, కొరముట్ల శ్రీనివాసులు, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ గవర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్ గురించి వివరించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటివని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. డీఎస్సీ స్కామ్‌పై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ రకంగా చంద్రబాబు ప్రభుత్వం పిల్లలను వాడుకుంటూ, వారితో గంజాయి అమ్మిస్తూ, వారితో చట్ట విరుద్ధమైన పనులు చేయించిందో.. ఇందులో పోలీసులు ఎలా పని చేశారు.. ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగం చేస్తోంది అనే దానికి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిదర్శనం. ఈ కేసులో బుధవారం సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా మందలిస్తూ.. సీపీ, డీజీపీ పేర్లను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని నిలదీయడం చూస్తుంటే.. ఇది నిజంగా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. వీళ్లే ఆ పిల్లాడిని అరెస్టు చేసి తీసుకొస్తారు. వీళ్లే కొట్టి చంపేస్తారు. చివరకు శవం కూడా మాయం చేస్తారు. మాయం చేయడమే కాకుండా ఆ పిల్లాడ్ని రౌడీగా చిత్రీకరిస్తూ బ్రాండింగ్ చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో ఈ ఘటన ద్వారా తేటతెల్లం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో నగరం నడి»ొడ్డున ఏ విధంగా దారుణాలు జరుగుతున్నాయో స్పష్టం అవుతోంది’ అని వైఎస్ జగన్ అన్నారు. -
దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందించాం: వైఎస్ జగన్
తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాము ఏ అంశాలపై ఫిర్యాదు చేసిందీ వివరించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశానని తెలిపారు.‘‘శాప్ కార్యాలయం వద్ద జరిగిన దాడి వివరాలను గవర్నర్‌కు అందించాం. శాంతియుతంగా నిరసన చేపట్టిన మా పార్టీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలను కూడా అందించాం. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, భారీ స్కాం గురించి గవర్నర్‌కు వివరించాం. మా పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు, అక్రమ అరెస్టులు.. చట్టపరంగా నిలబడలేని కేసుల నమోదు అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ పోలీసు చర్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. డీఎస్సీ స్కాంపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని కోరాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాము’’ అని వైఎస్ జగన్ తెలిపారు. Today, along with senior YSRCP leaders, I met Hon’ble Governor Justice S. Abdul Nazeer Ji at Lok Bhavan. We submitted a detailed representation, along with evidence, regarding the attack on our party leaders, workers, and unemployed youth during the peaceful protest at the SAAP… pic.twitter.com/CRQyLs8aLr— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2026 -
లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం
-
ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..
-
చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం
-
అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: డీఎస్సీ అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడికి సంబంధించి ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్ లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ స్కామ్‌లో ఇవీ నాలుగు పాయింట్లు:ఇప్పుడే గవర్నర్గారిని కలవడం జరిగింది. గవర్నర్‌కు వివరంగా.. సెప్టెంబరు 21న జరిగిన ఘటనపైనే కాకుండా, ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయింది అనేది వివరించాము. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవస్థ మీద ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై కచ్చితంగా సీబీఐ విచారణ జరగాలి. విద్యా శాఖ మంత్రి రాజీనామా కూడా చేయాలి. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, నాలుగు పాయింట్ల ఆధారంగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి.1). మొట్టమొదట రెండు ఫంక్షన్లు ఒకే వ్యక్తి చేతికి అప్పగించడం. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించారు. దీంతో స్కామ్ ప్రారంభం అయింది.2). రెండోది మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అలా పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన పేరు తొలి మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత లిస్ట్‌లో పేరు తొలగించారు. అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేశారు. కాల్ లెటర్ కూడా పంపలేదు. దీంతో అతడు ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా, కోర్టుకు కూడా వెళ్లాడు. అంటే ఒక స్కామ్‌ను కవర్ చేయడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నారు. అనేది తెలియడంతో పాటు, లీకేజీ వ్యవహారం బట్టబయలైంది.3). స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీఓలు ఇచ్చారు. గతంలో ఉన్న జీఓలు రద్దు చేసి కొత్తగా.. జీఓ నెం: 4, 47 అని చెప్పి, రెండు కొత్త జీఓలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత 372 ఉద్యోగాలు ఆ జీఓల పేరుతో ఇచ్చారు. ఆ రిక్రూట్మెంట్ పూర్తి కాగానే మళ్లీ మూడు జీఓలు తెచ్చారు. జీఓ నెం: 23, 25, 56 తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి ఇక్కడ 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి సమాధానం లేదు.4). ఫేక్ సర్టిఫికెట్లు. ఏరకంగా నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్ జరిగినట్లు చూపారు. అలాగే ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్యే కూన రవికుమార్.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి, సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. ఇంకాసాఫ్ట్బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలో సెక్రటరీలకు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు అనేవి కూడా చెప్పాం.బేరసారాల ఆడియో. వీడియో:డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బేరసారాలపై ఆడియో, వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో క్లియర్‌గా ఫోన్ నెంబర్ కనిపిస్తున్నా, ఆ వ్యక్తి గురించి ఎఫ్ఐఆర్లో రాయలేదు. కేవలం సస్పెక్ట్ అని మాత్రమే రాశారు. అరెస్టు కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయినా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు.శాప్ ఆఫీస్ వద్ద టీడీపీ గుండాల దాడి:సెప్టెంబరు 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముందుగానే సమాచారం ఇచ్చారు. అనుమతి కోరుతూ లెటర్ కూడా రాశాడు. కానీ, ఆరోజు ఏం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా కుట్ర చేశారో చూశాం. టీచర్లు కాని టీచర్లను పిలిపించి, ప్యారలల్‌గా ధర్నా చేయించాడు. నిజానికి వారు చదువు చెప్పే గురువులు కాదు. దొంగ సర్టిఫికెట్లతో, ఏ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు పొందిన వారు. అందుకే వారు టీచర్లు కానీ టీచర్లు. వారిని పిలిపించి, కావాలని శాప్ ఆఫీస్ వద్ద గొడవ చేయించారు. అంతే కాకుండా టీడీపీ గుండాలను కూడా అక్కడికి రప్పించారు. వారంతా కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై దారుణంగా దాడి చేశారు. అసలు వారంతా ఎవరో చూడండి. వీరు గతంలో సాక్షి ఆఫీస్‌పై దాడి చేసింది కూడా వీరే.(అంటూ, ఆ ఫోటోలు మీడియాకు చూపారు)పైగా రివర్స్ కేసులు:శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై ఆ విధంగా టీడీపీ గుండాలు అంత దారుణంగా దాడి చేసినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. వారిపై కేసులు నమోదు చేయలేదు. అందుకు పూర్తి భిన్నంగా, రివర్స్‌లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై కేసు పెట్టారు.ఎంత దారుణంగా ఆ కేసులు పెట్టారంటే.. హత్యాయత్నం కేసులు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఇప్పటికే 350 మందిపై కేసులు పెట్టారు. ఆ జాబితా ఇంకా పెరుగుతోంది. ఇంకా రాత్రి వేళల్లో ఇళ్లపై బడి అరెస్టులు చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ.. కోర్టులు వాటిని తప్పు పడుతున్నాయి. దీని వల్ల సామాన్యులు బ్రతుకుతున్నారు. మరోవైపు మొన్నటి శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. వాటిపైనా కోర్టులు స్పందించాయి.శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే, రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశాయి. మా పోరాటం కొనసాగుతుంది:తప్పు చేసింది మీరు. ప్రశ్నించే హక్కు లేదా? దాన్ని కూడా కాల రాస్తారా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఉండదేమో.. మా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో పిల్లలకు, నిరుద్యోగులకు పరీక్షల మీద విశ్వాసం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతుంది. ఆ దిశలో మా డిమాండ్ కొనసాగుతోంది.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సుప్రీంకోర్టు ఆదేశం ప్రభుత్వానికి చెంపదెబ్బ:విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించిన కేసు చూస్తే.. ఏ రకంగా చంద్రబాబు ప్రభుత్వం పిల్లలను వాడుకుంటూ, వారితో గంజాయి అమ్మిస్తూ, వారితో చట్టవిరుద్ధమైన పనులు చేయించారు?. ఇందులో పోలీసులు ఎలా పని చేశారు? ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగం చేస్తోంది అనేదానికి నిదర్శనం.సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన ఆదేశాలు. అవి నిజంగా ఒక చెంపదెబ్బ చంద్రబాబు ప్రభుత్వం మీద. సుప్రీంకోర్టు గట్టిగా మందలిస్తూ.. సీపీ, డీజీపీని కూడా ఎందుకు అక్యూజ్డ్ లిస్టులో చేర్చలేదని నిలదీయడం.. నిజంగా ప్రభుత్వానికి చెంపదెబ్బ. ఒక పిల్లాడిని అరెస్టు చేసి తీసుకొస్తారు. కొట్టి చంపారు. చివరకు శవం కూడా మాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో, రెడ్‌బుక్ రాజ్యాంగంలో నగరం మధ్యలో ఏ విధంగా దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పడంతో పాటు, పోలీసుల అరాచకాలకు ఇవన్నీ నిదర్శనంలా నిలుస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. -
టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ ప్రమాదంలో విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్, శివ, శరత్‌కుమార్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థి సాల్మన్‌రాజ్‌కు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి : రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి -
LIVE : గవర్నర్ తో జగన్ భేటీ
-
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ (బుధవారం) విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై దాడి గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ–2025లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్ కోరారు.కాగా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. డీఎస్సీ–2025 నియామక వ్యవహారంపై వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.అది యువగళం టీమ్ కాదని, రౌడీ దళమని మండిపడ్డారు. డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు అడ్డంగా దొరికిపోయారన్న వైఎస్ జగన్.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. స్కామ్‌లను బయట పెడుతుంటే దాడులకు దిగుతున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ విశాఖ నేతలతో అత్యవసర మీటింగ్ పెట్టడానికి కారణం
-
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం! ఆ ప్రశ్నిస్తే అక్రమ కేసులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన బొత్స అనూష
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌తో అనూష భేటీ అయ్యారు. కాగా, ఇటీవల వైఎస్ జగన్.. అనూషకు భీమిలి నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తానని అనూష చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: జనసేనలో మీ ఆధిపత్య పోరేంటి? -
చంద్రబాబు వచ్చాకే తాగునీటి సమస్య: వైఎస్ జగన్
తాడేపల్లి : గ్రేటర్ విశాఖపట్నం నేతలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు బొత్స, కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, స్థానిక సమస్యలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చిందని, ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా విశాఖలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు ఇచ్చే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. పోలవరం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉంటే విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వగలమన్నారు. ఒకవైపు పోలవరంలో ఎత్తు తగ్గించి, 75 టీఎంసీల వరకు అదనపు నిల్వ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మరోవైపు విశాఖలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని జగన్ పేర్కొన్నారు. విశాఖ భూముల విషయమై మాట్లాడుతూ రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, విశాఖపట్నంలో మాత్రం 99 పైసలకు చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు భూములు ఇస్తున్నారు. రూ.5వేల కోట్ల విలువైన భూములను గీతం పేరుతో కబ్జా చేస్తున్నారు. విశాఖలో అత్యంత విలువైన భూములను తమకు నచ్చినవారికి ఇచ్చేసే స్థాయికి ఈ ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. విశాఖ అభివృద్ధికి ఎంతో చేశాంతమ హయాంలో విశాఖ అభివృద్ది గురించి జగన్ మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో లక్షా 30 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశాం. కేజీహెచ్‌ను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూలపేట పోర్టు వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాదులు వేశాం. గూగుల్, అదానీ డేటా సెంటర్ వరకు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చేలా ముందుకు తీసుకెళ్లాం. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా మా ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కనిపించిందన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చాం. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్‌ను తీసుకొచ్చామన్నారు. రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసి ఉద్దానం వరకు నీళ్లు తీసుకొచ్చామని, ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడు పనులతో ఉత్తరాంధ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని అన్నారు. గంజాయి, మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు..ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గంజాయితో పాటు మద్యం అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి వీధి చివర, గుడి పక్కన, బడి పక్కన కూడా గంజాయి, మద్యం అందుబాటులోకి వచ్చాయి. మా హయాంలో గ్రామస్థాయిలో మహిళా పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి వ్యవహారాలు కనిపిస్తే వెంటనే రిపోర్టింగ్ జరిగే వ్యవస్థను ఏర్పాటు చేశాం. గంజాయి, మద్యం వంటి వాటిని అరికట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు వాటిని ప్రోత్సహించే స్థాయికి తీసుకెళ్లారన్నారు. మా హయాంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మహిళా పోలీస్‌ను అందుబాటులో ఉంచాం. దిశ యాప్‌ను తీసుకొచ్చాం. మహిళకు సమస్య వస్తే ఫోన్ చేసినా, ఫోన్ షేక్ చేసినా వెంటనే పోలీసులు అందుబాటులోకి వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం రివర్స్ గేర్‌లోకి వెళ్లిపోయిందని జగన్ పేర్కొన్నారు. పోలీసులు.. రాజకీయ వేధింపులుఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాన్ని నడుపుతున్నారు. మా హయాంలో మేము ఏ రోజు పోలీసుల మీద ఆధారపడి రాజకీయాలు చేయలేదు. ఎన్నికలు గెలవడానికి పోలీసులను ఉపయోగించలేదు. మేము ఆధారపడింది ప్రజలకు చేసిన మంచిపైనే.మేము ధైర్యంగా బటన్లు నొక్కి ప్రజలకు మంచి చేశాం. ఇప్పుడు చంద్రబాబు డిపెండెన్స్ మొత్తం పోలీసుల మీదనే ఉందని జగన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులను ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని, పోలీసులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.. అన్యాయం చేయొద్దు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఆ తీర్పును స్వేచ్ఛగా ఇచ్చేలా మీరు సహకరించండి. మీ ధర్మం మీరు చేయండి. మీ టోపీ మీద ఉన్న సింహాలకు మాత్రమే తలవంచండి. చంద్రబాబుకు తలవంచొద్దు అని వైఎస్ జగన్ అన్నారు. డిజిటల్ డైరీలో నమోదు నమోదు చేయండిమా కార్యకర్తలపై ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే డిజిటల్ డైరీలో నమోదు చేయండని జగన్ కోరారు.ఏ పోలీసు అన్యాయం చేశాడు? ఏ అధికారి అన్యాయం చేశాడు? వాళ్లు చేసిన పని ఏంటి? అన్నది వెంటనే నమోదు చేయండి. జరిగిన అన్యాయాన్ని మర్చిపోకముందే పూర్తి వివరాలతో డిజిటల్ డైరీలో ఎక్కించండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిజిటల్ డైరీని ఓపెన్ చేస్తాం. ఎవరు ఏమేం అన్యాయం చేశారో లెక్కలు తీస్తాం. చట్టం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం.మా పాలన – ప్రస్తుత పాలన..మా ఐదేళ్ల పాలనకు, ఇప్పుడు జరుగుతున్న పాలనకు మధ్య తేడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని, మా ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత తీసుకొచ్చేందుకు పని చేశామని, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామన్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకునే రాజకీయాలను తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు.ప్రభుత్వ బడులను మెరుగ్గా తీర్చిదిద్దాంప్రభుత్వ బడులను ప్రైవేటు బడులకంటే మెరుగ్గా తీర్చిదిద్దామని, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్‌ను తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్‌బుక్స్ ఇచ్చాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను తీసుకొచ్చామన్నారు. ఎనిమిదో తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చామని, ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అవసరమయ్యే స్థాయికి ప్రభుత్వ విద్యపై నమ్మకం తీసుకొచ్చామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చాంఆరోగ్యశ్రీని సుమారు 1,000 ప్రొసీజర్ల నుంచి 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం. పేదవాడికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని విస్తరించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లను అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను 4 శాతం స్థాయికి తీసుకొచ్చామని వైఎస జగన్పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలు ఉన్న మందులను అందుబాటులో ఉంచామని, గ్రామస్థాయికి విలేజ్ క్లినిక్స్‌ను తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను గ్రామస్థాయికి తీసుకెళ్లామన్నారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 104 వాహనాల ద్వారా డాక్టర్లు గ్రామాలకు వెళ్లి వైద్యం అందించే వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు.ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందించాంగ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. లంచం లేకుండా, వివక్ష లేకుండా పేదవాడికి మంచి చేశాం. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు జమ చేశాం. కుల ధ్రువీకరణ పత్రం సహా ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికే అందించాం. ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం కావాలన్నా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని జగన్ పేర్కొన్నారు.ఉచిత పంటల బీమా అమలు చేశాంప్రతి ఎకరాను ఈ-క్రాప్ చేశామని, ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేశామని, ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను అందుబాటులో ఉంచామని, ప్రతి పంటకు గిట్టుబాటు ధరను ఆర్బీకేలో ప్రదర్శించామని జగన్ పేర్కొన్నారు. రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే సీఎం యాప్‌ను యాక్టివేట్ చేసి ధరలను, పంట కొనుగోళ్లను మానిటర్ చేశాం. అవసరమైనప్పుడు ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి పంట కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ?ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలు, సంతకాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. జగన్ ఇచ్చేదానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పారు. మహిళలకు, యువతకు, రైతులకు భారీ మొత్తాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు, ఆ బాండ్ల విలువ ఏంటి అన్నది ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అంటే ఏమిటన్నది ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారని వైఎస జగన్ అన్నారు.డీఎస్సీలో అవకతవకలుడీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నారు. స్పోర్ట్స్ కోటాను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు ఉద్యోగాలు ఇస్తున్నారు. డీఎస్సీ వ్యవహారమే అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి ఒక నిదర్శనమని జగన్ పేర్కొన్నారు.ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం..ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసే వ్యవస్థను నడుపుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, బాండ్లతో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయేలా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నీ అయిపోయాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను పక్కనపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలిమనం చేసిన మంచి మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు జగన్ పిలుపునిచ్చారు. మన ఐదేళ్ల పాలనలో చేసిన మంచిని గట్టిగా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అంశాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. విశాఖలో మేయర్‌ను, కార్పొరేషన్‌ను హైజాక్ చేసిన తీరును ప్రజలకు చెప్పాలి. ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చిరు. ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని జగన్ పేర్కొన్నారు. విశాఖ తాగునీటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విశాఖ భూముల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ అన్నారు. గంజాయి, మద్యం సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, పోలీసుల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనం చేసిన అభివృద్ధిని, ఇప్పుడు జరుగుతున్న పాలనను ప్రజల ముందు పెట్టాలి. గట్టిగా ప్రజలకు తోడుగా నిలబడాలని వైఎస్సార్సీపీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ నేతలపై రౌడీషీట్లు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్షసాధింపు పతాక స్థాయికి చేరిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ప్రభుత్వాన్ని, డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తున్నారని విమర్శించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించింది. ప్లాన్ ప్రకారం రౌడీషీట్లు తెరుస్తున్నారని మండిపడింది.కాగా, డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన వారిపై రౌడీషీట్లు తెరిచారని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ సహా పలువురిపై రౌడీషీట్లు తెరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ అరాచకాలు, డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను వైఎస్ జగన్ కోరనున్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ బాగోతం భయానికే అక్రమ అరెస్ట్‌లు: పొన్నవోలు -
విశాఖ YSRCP నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
-
నేడు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
-
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
DSC స్కామ్ పై పోరాటం ఆగదని స్పష్టీకరణ
-
అది యువగళం టీమ్ కాదు.. రౌడీ దళం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక వ్యవహారంపై వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అది యువగళం టీమ్ కాదని, రౌడీ దళమని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా.. తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్న తీరును నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని, దాడులపై గవర్నర్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు అడ్డంగా దొరికిపోయారన్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. స్కామ్‌లను బయట పెడుతుంటే దాడులకు దిగుతున్నారన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీతో డీఎస్సీ స్కామ్‌పై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిందని, ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు దాడులు చేయించారని చెప్పారు. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భయపెట్టే రాజకీయాలకు తెరతీశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రౌడీ దళాన్ని దించి దాడులు ‘అది యువగళం టీం కాదు.. రౌడీ దళం. చంద్రబాబు అవినీతి, స్కామ్‌లు, అరాచకాలను ప్రశ్నించే ప్రతి చోటా ఈ రౌడీ దళాన్ని దించుతున్నారు. వారితో దాడులు చేయించి, భయపెట్టి, బెదిరించి.. ప్రశ్నించే గొంతులను మూయించాలని చూస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో అలజడి సృష్టించారు. పోలీసుల వద్ద ఉన్న లాఠీలు లాక్కొని, రాళ్లతో దాడులు చేశారు. ఇలాంటి ఘటనలకు కొంత మంది పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారు.గాయాలపాలైనా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చాలా సంయమనం పాటించారు. కానీ దాడులు చేసిన రౌడీ దళంపై కేసులు పెట్టకుండా, మా వాళ్లపైనే కేసులు పెడుతున్నారు. మా వాళ్లపై దాడులు చేసిన వారిని స్వేచ్ఛగా వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయం? దాడులు చేయడం, ఆ తర్వాత బాధితులపైనే కేసులు పెట్టడం, మళ్లీ అదే ఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం ఒక పద్ధతిగా మారిపోయింది. గతంలో వైఎస్సార్సీపీ మీద చేసిన అనేక దాడుల్లో ఈ రౌడీదళం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ కన్నా ఘోరంగా తయారు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మీ బెదిరింపులకు భయపడి డీఎస్సీ స్కామ్‌పై పోరాటం ఆగదు. మీ దుర్మార్గాలకు భయపడి వెనకడుగు వేసేదే లేదు. ప్రజల తరఫున పోరాటాల విషయంలో తగ్గేదే లేదు. నిజాయితీపరులైన డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి, వాస్తవాలను ప్రజల ముందుంచే వరకు మేం నిలదీస్తూనే ఉంటాం. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.కుప్పం నుంచే దాడులకు కుట్ర చేశారా?నిన్నటి దాడులకు కుప్పంలోనే చంద్రబాబు కుట్ర పన్నారని మాకు అనుమానం ఉంది. కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు చేసిన బెదిరింపులే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రౌడీ దళాలను ప్రోత్సహిస్తూ.. అవినీతి, స్కామ్‌లపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి వీళ్లను పంపుతున్నారు. గతంలో వైఎస్సార్సీపీపై జరిగిన అనేక దాడుల్లోనూ ఇదే తరహా వ్యక్తులు కనిపించారు. కళ్లముందు సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. నిన్నటి దాడుల వ్యవహారంపై గవర్నర్‌ను కలుస్తాం. మా వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులపై కచి్చతంగా చర్యలు తీసుకోవాలి. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలి. రౌడీ దళాన్ని రంగంలోకి దించిన చంద్రబాబు, లోకేశ్‌ల పాత్రపై కూడా విచారణ జరపాలి. పోలీసుల వ్యవహారశైలి పైనా గవర్నర్‌కు పూర్తి వివరాలు, ఆధారాలు అందిస్తాం. -
నేడు గ్రేటర్ విశాఖ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజాసమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతోపాటు స్థానిక రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
‘శ్రీ చరణి ఒక అద్భుతం.. భారత జట్టుకు అభినందనలు’
ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందించారు. ఈ మేరకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘ఆసియా గేమ్స్-2026 లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి గర్వకారణం. ఈ అద్భుత విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి అభినందనలు. జట్టు విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి పోషించిన పాత్రను గుర్తించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె విజయ ప్రస్థానం మన రాష్ట్రంలోని యువతులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను.’’ అని చెప్పుకొచ్చారు.మహిళల క్రికెట్ పోటీల విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. My heartiest congratulations to the Indian women’s cricket team on winning the gold medal at the #AsianGames2026. The team’s dominant performance throughout has made the entire nation proud. Congratulations to captain Harmanpreet Kaur and every player of the team for this… pic.twitter.com/FSjiOZjNs7— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2026ఇదీ చదవండి: వరుస విజయాలు.. దుమ్ములేపుతున్న భారత హాకీ జట్లు -
రేపు గ్రేటర్ విశాఖ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (23.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖపట్నంకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
రేపు గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
-
రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై దాడి ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని వైఎస్ జగన్ కోరనున్నారు.పార్టీ నాయకులతో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. నిన్నటి వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడిపై చర్చించారు. చంద్రబాబు, లోకేష్‌ల పథకానికి కొంతమంది పోలీసులు కొమ్ముకాశారని పార్టీ నాయకులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఈ దాడి ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందన్న వైఎస్ జగన్.. ఈ వ్యవహారాన్ని గవర్నర్‌కు కలిసి వివరించాలని నిర్ణయించారు.డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికారని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. స్కామ్‌లను బయటపెడుతుంటే దాడులు చేస్తున్నారు. నిన్న(సోమవారం) వైఎస్సార్సీపీ చేసిన ర్యాలీ కార్యక్రమంతో డీఎస్సీ స్కాంపై మరోసారి చర్చ జరిగింది.. దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు, లోకేష్‌లు గూండాలను దింపారని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు -
తాడేపల్లిలో YSRCP నేతలతో వైఎస్ జగన్ అత్యవసర మీటింగ్
-
రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు
సాక్షి, తాడేపల్లి: శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడి వ్యవహారంపై వైఎస్సార్సీపీ అత్యవసర సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. నిన్న జరిగిన పరిణామాలను నేతలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడులపై గవర్నర్‌ను కలిసి వివరించాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్ణయించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుండటంతో సహించలేకపోతున్నారని.. అందుకే తమ పార్టీ ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే దాడులు చేస్తున్నారని, నిన్నటి ర్యాలీతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చిందని అన్నారు.డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరగడంతో వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తోంది. అయితే సోమవారం విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమాల సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. ‘రౌడీ దళాన్ని దించారు’చంద్రబాబు, లోకేశ్ తమపై దాడులకు కొందరిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ‘యువగళం టీం కాదు.. రౌడీ దళం’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలోకి రౌడీలను పంపి అలజడి సృష్టించారని, పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కుని రాళ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. దాడుల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు గాయపడినా సంయమనం పాటించారని జగన్ చెప్పారు. తమవారిపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. గతంలోనూ తమ పార్టీపై జరిగిన పలు దాడుల్లో ఇదే తరహా వ్యక్తులు ఉన్నారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.పోలీసుల తీరుపైనా ఆగ్రహంశాంతియుత నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ కన్నా దారుణంగా మార్చారని చెప్పారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని పక్కన పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అప్పటిదాకా పోరాటం ఆగదుడీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. చంద్రబాబు, లోకేశ్‌ల బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల తరఫున పోరాటాల్లో వైఎస్సార్సీపీ తగ్గేది లేదని, నిజాయితీగా పరీక్షలు రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
పార్టీ మారితే జగన్ కు వచ్చే నష్టం ఏమీ లేదు .. వెంటనే ఇంకొకడిని పెట్టె సత్తా ఉన్న పార్టీ
-
మీకు మీరే సర్టీఫికెట్ ఇచ్చుకుంటారా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు ఎందుకంత భయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉన్నా.. పారదర్శకంగా జరిగాయంటూ మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాములు చేసిన వాళ్లే తమకు తాముగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే వాటికి విలువ ఏముంటుంది చంద్రబాబూ? అని నిలదీశారు. మరొకవైపు డీఎస్సీ అక్రమాలపై మా పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీ గూండాలను ఊసిగొల్పి మరీ దాడులు చేయిస్తారా? ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా చంద్రబాబూ..? అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘అసలు సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మీకు మీరుగానే సర్టీఫికెట్ ఇచ్చుకుంటారా? స్కామ్‌లు చేసిన వాళ్లే.. తమకు తాముగా ఇచ్చుకునే సర్టీఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి..’ అని నిలదీశారు. ఈ మేరకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహార శైలిని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ సోమవారం ఎండగట్టారు. గతంలో ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలను మరోసారి గుర్తు చేస్తూ వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీ దిగజారుడుతనానికి నిదర్శనం.. ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు. టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని బట్టలిప్పి కడిగేస్తున్నారు. కాబట్టే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం టీచర్ పోస్టుల కోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేశ్ చేసిన స్కామ్‌ల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది. మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జీలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐతో జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు. బాధితులకు న్యాయం జరగాలి.. పోలీసులను అడ్డుపెట్టుకుని స్కామ్‌ను దాచేయలేరు. ప్రతిపక్షం గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి.. ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది.విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు..? ఏదో ఒక స్కామ్ చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత! మేం అడుగుతున్నది ఏమిటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనపడుతున్నప్పుడు! -
చంద్రబాబూ.. దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి: వైఎస్ జగన్
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు ఎందుకంత భయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉన్నా పారదర్శకంగా జరిగాయంటూ మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా?, స్కాములు చేసిన వాళ్లే తమకు తాముగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే వాటికి విలువ ఏముంటుంది చంద్రబాబూ? అని నిలదీశారు.డీఎస్సీ అక్రమాలపై మరొకవైపు తమ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీ గూండాలను అందులోకి ఉసిగొల్సి మరీ దాడులు చేయిస్తారా?, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? చంద్రబాబూ అని సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం.. ఎందుకంత ఉక్రోషం? అని నిలదీశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన శైలిని వైఎస్ జగన్ ఎండగట్టారు.ఇది మీ దిగజారుడుతనానికి నిదర్శనం.. ‘ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు.విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు..?ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత. మేం అడుగుతున్నది ఏంటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు. టీచర్ పోస్టులకోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు.నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గంలక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేష్ చేసిన స్కాంల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది. మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదుపోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరు. ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు..@ncbn గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది?… pic.twitter.com/oOWsewQMA3— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2026ఇదీ చదవండి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బరితెగింపు -
మహాకవి గురజాడకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ‘కన్యాశుల్కం వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. తన రచనలు, కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కన్యాశుల్కం’ వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. తన రచనలు, కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/Qfr0b0j0TI— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2026 -
ఏపీలో కరువు మంటలు.. చంద్రబాబుకు జగన్ హెచ్చరిక
-
భీమిలిలో 2029లో పార్టీ జెండా ఎగరేస్తా..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలిలో విపక్ష నేత, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటివరకు సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడిన నేపథ్యంలో భీమిలి బాధ్యతలను అనూషకు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతలను ఆమె భుజానకెత్తుకోవడంతో క్షేత్రస్థాయి కేడర్‌లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. క్రియాశీల రాజకీయాల్లోకి.. బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఈ నియామకంతో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్రకు సిద్ధమవుతున్న అనూషకు భీమిలి బాధ్యతలు కీలకమైనవిగా మారాయి. 2024 ఎన్నికల అనంతరం తండ్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో ఆమె మమేకమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పుడు భీమిలి బాధ్యతలు చేపట్టడంతో ఆ అనుభవాన్ని కొత్త నియోజకవర్గంలో వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఆమె ముందున్న తక్షణ బాధ్యతలుగా మారాయి. వైద్య సేవ నుంచి ప్రజా క్షేత్రంలోకి.. డాక్టర్ అనూష కేవలం రాజకీయ వారసురాలు మాత్రమే కాదు.. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నిబద్ధత గల యువ నేత. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల డైరెక్టర్‌గా అందించిన వైద్య, సామాజిక సేవలు ప్రజల్లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఉన్నత విద్య, వైద్య నేపథ్యం, ప్రజల సమస్యలపై స్పష్టమైన పట్టు, ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్న యువ నాయకురాలు భీమిలి బాధ్యతలు స్వీకరించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.భీమిలిలో 2029లో పార్టీ జెండా ఎగరేస్తా.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు అనూష ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. తనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని అనూష ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు అనూష కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ/గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కరువు మండలాలను ప్రకటించాలని జగన్ డిమాండ్ చేసిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన సీఎం.. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించనున్నట్లు శనివారం స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల సమస్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై వైఎస్ జగన్ ఈ నెల 17న పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కరువు మండలాలను ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.వైఎస్ జగన్ ఫైర్రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై జగన్ సమీక్షించారు. కరువు కాలంలో రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ఎల్‌నినో కంటే ‘ఎల్లో నినో’తోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూన్ నుంచి వర్షపాతం లోటు కొనసాగుతున్నప్పటికీ కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు ప్రకటనఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. సెప్టెంబర్ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సూచించారు.రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పంటల పరిస్థితి, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.హైరిస్క్ కేటగిరీలో 1,357 ఆర్ఎస్కేలురాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం రిస్క్ ఆధారిత అంచనాలు చేపట్టింది. 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో పంటలను హైరిస్క్ కేటగిరీలో గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌లో వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పంటల పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తాగునీటి సమస్యపైనా సమీక్షఇదిలా ఉండగా.. సాగుతో పాటు తాగు నీటి విషయంలోనూ జగన్ వార్నింగ్ పని చేసింది. విశాఖపట్నంలో తాగునీటి సమస్యపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు తాగునీరు, సాగునీటి లభ్యతపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.ఇదీ చదవండి: బొత్స కూతురికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ -
బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిజం రుజువైంది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె అన్నారు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం మరోసారి నిర్ధారణ అయిందని రోజా పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నం చేసిన వారు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని అన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం కూడా ఇకనైనా ఆపాలని ఆమె అంటున్నారు.శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేల నిజం నిర్ధారణ. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన కళంకితులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలి. పచ్చి పాలు లాంటి మనసు… pic.twitter.com/TLc3MprUnB— Roja Selvamani (@RojaSelvamaniRK) September 19, 2026‘‘పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదు. అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైంది’’ అని ఆర్.కే. రోజా తన పోస్టులో పేర్కొన్నారు.ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్లో రోజా ప్రశ్నించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు @ncbn గారూ? ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా?#NoAnimalFatInTTDLaddu… pic.twitter.com/i4Z1JjtQOd— Roja Selvamani (@RojaSelvamaniRK) September 19, 2026 -
వైఎస్సార్సీపీలోకి ప్రముఖ వ్యాపారవేత్త
ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. పుట్టినరోజు నాడు పార్టీలో చేరిన రామచంద్రరావుకు కొడాలి నాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవి, పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: భీమిలి సమన్వయకర్తగా బొత్స అనూష -
ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ కు YS జగన్
-
వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి/బనశంకరి: మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి కుమారుడు ఇషాన్ వివాహ ఎంగేజ్మెంట్ వేడుక శుక్రవారం బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు హాజరయ్యారు.నూతన వధూవరులు నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించి.. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. -
40 ఏళ్ల కల తీర్చిన వైఎస్ జగన్.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
-
ఏపీలో ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
"ఎల్ నినో కాదు... 'ఎల్లో నినో ఎఫెక్ట్'.”
-
‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు
రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనుందని ఈ ఏడాది ఫిబ్రవరి 4న సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది గమనిస్తే కనిపించేది పెద్ద సున్నా. ఈ మనిషి కార్యాచరణకు వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా.. సున్నా! అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు’!– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నది ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’ అని.. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదని, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే మరింత తీవ్రత పెరిగిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే వెల్లడించిన సీఎం చంద్రబాబు.. వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడంలో మాత్రం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదంటూ ఆక్షేపించారు. వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడం మాత్రమే చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు తీవ్ర కరువు పరిస్థితుల్లో నిండా మునిగారని, ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు అన్నీ కష్టాలేనని.. ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీళ్లు ఇవ్వలేదని.. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారని.. పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ ఎడాపెడా లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టినా చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్, జూలై, ఆగస్టులో వరుసగా మూడు నెలలు వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదంటూ వైఎస్ జగన్ తప్పుబట్టారు. కరువు మండలాలు ఇంకా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కర్ణాటక చాలా ముందుగానే ఆ పని చేసిందని గుర్తు చేశారు. కరువు ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదని, పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదని, కనీసం ఉపాధి హామీ అదనపు పనిదినాలు కూడా కోరలేదంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేని పరిస్థితిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..అన్ని జిల్లాలు... 628 మండలాల్లో ‘లోటు’రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు గమనిస్తే ఖరీఫ్ ప్రారంభం నుంచి ఇవాళ్టి (సెప్టెంబర్ 16) వరకు దాదాపు 51 శాతం పైచిలుకు లోటు వర్షపాతం కనిపిస్తోంది. 28 జిల్లాలకు గాను 28 జిల్లాలూ ఈరోజు వర్షపాతం లోటులోనే ఉన్నాయి. 688 మండలాలకు గాను దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటే, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు సుమారు 332 మండలాల్లో కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం 51 శాతం పైచిలుకు వర్షపాతం లోటు ఉన్న పరిస్థితి. అన్నమయ్య జిల్లా–75%, సత్యసాయి జిల్లా–66%, ప్రకాశం జిల్లా–65%, చిత్తూరు జిల్లా–58.5%, వైఎస్సార్ కడప జిల్లా–57%, తూర్పు గోదావరి జిల్లా –57%, మార్కాపురం జిల్లా –56%, నంద్యాల జిల్లా–56%, విశాఖపట్నం జిల్లా–54%, అనంతపురం జిల్లా–51%, కర్నూలు జిల్లాలో 50% పైచిలుకు. ఇంత తీవ్రమైన లోటు వర్షపాతం రాష్ట్రం అంతటా కనిపిస్తోంది.ముందే తెలిసినా కార్యాచరణ సున్నాఅందుకే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు..ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా తెలియనిది కాదు. రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది గమనిస్తే కనిపించేది పెద్ద సున్నా. ఈ మనిషి కార్యాచరణకు వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా.. సున్నా. అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు’. ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ల మాటలు నమ్మి రైతులు నష్టపోతున్నారుమామూలుగా వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ 15, 16 దాకా ఉంటుంది. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 4వ తేదీనే ప్రకటించారు. ఇక జూన్‌లో–25% వర్షపాతం స్పష్టంగా కనిపించినా ఈ పెద్దమనిషి జూలై 11న ఏం చేశారు? ఆయన, ఆయన మంత్రి ఏం చేశారు? స్విచ్ నొక్కుతారు.. పూజ చేస్తారు.. ఫొటోలకు పోజులిచ్చి గేట్లు ఎత్తుతారు. నీళ్లు ఇస్తున్నాం.. సాగు చేసుకోండి అని చెబుతారు. వీళ్ల మాటలు నమ్మిన రైతులు అడుగు ముందుకేశారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఈరోజు నష్టపోతున్నారు. చంద్రబాబు పుణ్యాన రాష్ట్రంలో సాగు కూడా తగ్గింది. మామూలుగా ఖరీఫ్‌లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది. ప్రివెంటివ్ సోయింగ్ అని చెప్పి వీరికి ఉచిత పంటల బీమా కనుక అందుబాటులో ఉంటే ఎకరాకు కనీసం రూ.15 వేలు చేతికి వచ్చేవి. అదే ఉచిత పంటల బీమా ఉండి ఉంటే...పోనీ.. సాగు జరిగిన ఆ 56.4 లక్షల ఎకరాల పరిస్థితి ఏమిటి? అని చూస్తే అక్కడ కూడా పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. సాగు చేసిన ప్రతి రైతు పంటను బట్టి ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోయిన పరిస్థితి. అదే ఉచిత పంటల బీమా కనుక ఉండి ఉంటే ఈ రైతులకు అందరికీ కూడా, ఎకరా సాగు చేయని ప్రతి రైతుకు ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రివెంటివ్ సోయింగ్ కింద ఇన్సూరెన్స్ వచ్చేది. అదే రకంగా సాగు చేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం (ఇన్సూరెన్స్ క్లెయిమ్) అందేది. ఇది ‘ఎల్లో నినో ఎఫెక్ట్’..చంద్రబాబు పుణ్యాన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి మాత్రమే కాకుండా అన్ని చోట్ల పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ కాదు.. ఇది ఎల్లో నినో ఎఫెక్ట్. చంద్రబాబు పార్టీ ఎల్లో నినో ఎఫెక్ట్! ఈరోజు శ్రీశైలంలో నీళ్లు 862 అడుగులకు పడిపోయిన పరిస్థితి. ఆరోజు నేను మీడియాతో మాట్లాడినప్పుడు శ్రీశైలంలో దాదాపు 880 అడుగుల మేర 185 టీఎంసీల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం శ్రీశైలంలో 880 అడుగుల నీరున్నప్పుడే సాధ్యం. అప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వగలిగితేనే తెలుగు గంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, ఆయకట్టులో ఉన్న రిజర్వాయర్లు కానీ నింపగలుగుతాం. అదే శ్రీశైలంలో నీరు 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 6 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకన్నా తగ్గితే నీరు తీసుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఇప్పుడు శ్రీశైలంలో 862 అడుగుల నీరుంది. అటు చూస్తే రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లోకి వచ్చేశాయి. అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు వాడేస్తోంది. తెలంగాణలో లిఫ్ట్‌ల నిర్మాణం..కళ్లు మూసుకున్న కూటమి ప్రభుత్వం..పులిచింతల సామర్థ్యం 45 టీఎంసీలు. అక్కడ ఎగువ, దిగువన రెండు చోట్ల తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్‌లు కడుతోంది. అలా దాదాపు 11 టీఎంసీల నీరు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై గత ప్రెస్మీట్లో ఫోటోలు కూడా చూపించా. కళ్ల ముందే ఇంత దారుణం కనిపిస్తున్నా ఇక్కడ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుంది. కనీసం నోరు కూడా మెదపడం లేదు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్రానికి తీరని నష్టం..అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పుణ్యమా అని పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో కడితే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఆమోదం తెలపడం వల్ల అందులో నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం. అంత నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా దాన్ని వదిలేశారు. అలా కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన రూ.60 వేల కోట్లలో దాదాపు రూ.30 వేల కోట్లు వదిలేసుకుంటున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితిని కూడా కావాలని వదిలేసుకుంటున్నారు.కరువు మండలాలు ఎందుకు ప్రకటించలేదు?జూన్‌లో–25%, జూలైలో–66%, ఆగస్టులో–55 శాతం వర్షపాతం లోటు అని తెలుసు. మరి వరుసగా ఇన్ని డెఫిసిట్లు కనిపిస్తున్నప్పుడు నువ్వు కరువు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? నిజానికి కరువు మండలాల ప్రకటనకు సంబంధించిన మాన్యువల్ చాలా స్పష్టంగా ఉంది. అందులో ఒక పారాగ్రాఫ్ క్లియర్‌గా ఉంది. అదే కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరువు ప్రాంతాలు ప్రకటించింది. డ్రౌట్ మండలాల కింద డిక్లేర్ చేయడం వల్ల జరిగే ప్రధాన ప్రయోజనం ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటగా రుణాలన్నీ రీ షెడ్యూల్ అవుతాయి. క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తాయి. మన దగ్గర చంద్రబాబు పుణ్యమా అని ఆ అవకాశం లేకుండా పోయింది. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల నష్టమే జరిగింది. ఇంకా ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు కరువు మండలాలు ప్రకటించడం లేదు. ఈ విషయంలో పక్కన కర్ణాటక చూపించిన చొరవ ఆయన చూపించలేకపోతున్నారు. 56 లక్షల ఎకరాలకు లెక్క వేస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే మొత్తం రూ.6 వేల కోట్లు అవుతుంది. ఆ మొత్తం ఇవ్వాల్సి వస్తుందనే భయమో లేక అది కూడా ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా కరువు మండలాలు ప్రకటించడం లేదు.పార్టీ రిజినల్ కో–ఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు చర్యలు నిల్..కరువు ముంచుకొస్తోందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్లాన్ లేదు. ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేయలేదు. ఇప్పటికే ప్రత్యామ్నాయ విత్తనాలు, పశుగ్రాసం అన్ని జిల్లాలకు అంది ఉండాలి. వచ్చే ఏడాది మార్చి వరకు మరో 150 రోజులు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించేలా ప్రభుత్వం ఏమాత్రం డిమాండ్ చేయడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రొటీన్‌గా 100 రోజులు ఉపాధి హామీ పనులు వస్తాయి. కానీ, ఈ ఆరు నెలలు కూడా అవి వచ్చి ఉంటే చాలా మేలు జరిగేది.⇒ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్య రావిురెడ్డి, గుడివాడ అమర్నాథ్తో పాటు పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం తదితరులు హాజరయ్యారు.ప్రభుత్వంపై ఒత్తిడికి కార్యాచరణరైతుల సమస్యలపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తాం. పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందిస్తాం. వారికి మరింత తోడుగా నిలుస్తాం. ఇవే కాకుండా స్థానిక డిమాండ్లను కూడా ప్రస్తావిస్తాం. ఆలోపు పార్టీ జిల్లా అధ్యక్షులంతా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గట్టిగా గళం విప్పాలి. క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచాలి. రైతులకు తోడుగా ఉంటూ వారి సమస్యలు ఎలుగెత్తి చాటే కార్యక్రమం చేయాలి. అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, మెడలు వంచే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుంది. సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా తొలుత మండలం, తర్వాత నియోజకవర్గం, ఆ తదుపరి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. రైతుల సమస్యలపై ప్రజల్లోనూ అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా అవసరాన్ని బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటా.పుష్కర లిఫ్ట్, పురుషోత్త్తపట్నం లిఫ్ట్ రెండూ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటితో ఇటీవల చంద్రబాబు డ్రామా చేశారు. వాటి ద్వారా నీరు లిఫ్ట్ చేసి విశాఖ జిల్లాకు గోదావరి జలాలు తరలించామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అవేవో కొత్త లిఫ్ట్‌లు అయినట్లు బిల్డప్ ఇచ్చారు. పోలవరంలో 75 టీఎంసీల నీటి నిల్వ, కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు కూడా వదులుకుని ఈ డ్రామా ఆడడం దారుణం. ఈరోజు విశాఖపట్నానికి తాగునీరు లేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే చంద్రబాబుదే! - వైఎస్ జగన్‌పోలవరం 45.72 మీటర్ల ఎత్తుతో కడితే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఆమోదం తెలపడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం.మామూలుగా ఖరీఫ్‌లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది.చంద్రబాబు పుణ్యాన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి మాత్రమే కాకుండా అన్ని చోట్ల పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ఇది ఎల్లో నినో ఎఫెక్ట్. చంద్రబాబు పార్టీ ఎల్లో నినో ఎఫెక్ట్! కరువు ముంచుకొస్తోందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా గురించి పట్టించుకోలేదు.జూన్‌లో 25%, జూలైలో 66%, ఆగస్టులో 55 శాతం వర్షపాతం లోటు అని తెలుసు. మరి వరుసగా ఇన్ని డెఫిసిట్లు కనిపిస్తున్నప్పుడు నువ్వు కరువు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? అదే కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరవు ప్రాంతాలు ప్రకటించింది.రైతులకు మేలు చేసే ప్రణాళికే లేదు..⇒ ఈ ప్రభుత్వానికి ఎక్కడా ప్రణాళిక లేదు. రైతుకు మేలు చేయాలన్న ఆలోచన లేదు. ⇒ అన్నదాతా సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు బాకీ. కనీసం ఈ టైమ్‌లో అయినా ఆ మొత్తం రైతులకు ఇవ్వగలిగితే వారికి మేలు జరుగుతుంది. రైతులకు భరోసా ఇవ్వడానికి నీకు మనసు రావడం లేదు.⇒ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. మోంథా తుపాన్‌కు సంబంధించి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ⇒ సున్నా వడ్డీ పూర్తిగా రద్దు చేశారు. మన ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2,050 కోట్లు సున్నా వడ్డీ కింద ఇస్తే ఇవాళ ఆ పథకం కనపడకుండా పోయిన పరిస్థితి. ⇒ మరోవైపు ఇన్సూరెన్స్ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. 2022–23లో ఖరీఫ్ సీజన్లో ఉచిత పంటల బీమా ఆంధ్రప్రదేశ్‌లో 1.18 కోట్ల దరఖాస్తులకు వర్తిస్తే ఈ ఏడాది 2026–27 ఖరీఫ్‌లో దరఖాస్తుల సంఖ్య కేవలం 40 లక్షలకు పరిమితమైందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ⇒ అదే ఇప్పుడు ఉచిత పంటల బీమా ఉండి ఉంటే ప్రతి రైతుకు ఈ–క్రాప్ ద్వారా ఆటోమేటిక్‌గా ప్రతి ఎకరా ఉచిత పంటల బీమా పరిధిలోకి వచ్చేది. కానీ ఈ పెద్దమనిషి చేసిన నిర్వాకం ఏమిటి? ఆయన అధికారంలోకి వసూ్తనే 2024 జూన్‌లో కనుక 2023 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియమ్గా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన రూ.1,400 కోట్లు చెల్లించి ఉంటే రైతులకు దాదాపు రూ.3 వేల కోట్ల మేలు జరిగి ఉండేది. కానీ అది కట్టలేదు. అలా కట్టి ఉంటే, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా వచ్చేది. దాని వల్ల పంటలన్నీ బీమా పరిధిలోకి వచ్చి రైతులకు మేలు జరిగేది.అన్నదాతకు తోడుగా నిలిచేందుకే...తీవ్ర కరువు పరిస్థితుల్లో చాలా నష్టపోయిన రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ డిమాండ్లపై లోతుగా చర్చించేందుకే ఈ సమీక్ష చేస్తున్నాం. ఆ మేరకు పార్టీ తరఫున ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. ఇవీ ఆ డిమాండ్లు..⇒ ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి.⇒ రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. ఇప్పటికే కొందరు రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియంను తిరిగి ఇవ్వాలి.⇒ రైతులకు గతంలో ఎగ్గొట్టిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ⇒ గతంలో ఉచిత పంటల బీమా ఉండేది. దాని వల్ల ప్రతి రైతుకు సాగు చేయకపోయినా కూడా ప్రివెంటివ్ సోయింగ్ కింద ప్రతి ఎకరాకు రూ.15 వేల పరిహారం అందేది. చంద్రబాబు ఉచిత పంటల బీమా తీసేసినందువల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఇవ్వాలి.⇒ పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలి. ⇒ అన్నదాతా సుఖీభవ కింద మిగిలిన రూ.41 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.⇒ అన్నదాతా సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపచేయాలి. వారికి మూడేళ్లకు కలిపి ఒక్కో రైతుకు రూ.60 వేల చొప్పున ఇవ్వాలి.⇒ మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే రూ.846 కోట్లు విడుదల చేయాలి. ⇒ కరువు వల్ల నష్టపోయిన రైతులు సాగు చేసిన 56 లక్షల ఎకరాలకు మొత్తం లెక్క వేస్తే దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుంది. కాబట్టి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.6 వేల కోట్లు చెల్లించాలి.⇒ ఇతర పద్ధతులు, వేరే నెంబర్లు ఏమైనా ఉంటే వాటిని చూపించాలి. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా సీజన్ ముగిసేలోగా పరిహారం ఇవ్వాలి.⇒ మన ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఈ మూడేళ్లకు సంబంధించి రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపచేయాలి.⇒ కరువు తీవ్రత దృష్ట్యా రైతన్నలు పశుగ్రాసం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉచితంగా అందచేయాలి. అది ఇప్పటికే ఆలస్యమైంది.⇒ కరువు వల్ల వ్యవసాయ పనులు లేక కూలీల వలసలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలల పీరియడ్‌లో మరో 150 రోజులు ఉపాధి హామీ పనులు క్రియేట్ చేసి తోడుగా నిలవాలి.⇒ విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులైన పిల్లలు రైతుల బిడ్డలే. ఆ రెండు కలిపి మొత్తం బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు. డబ్బులు కట్టలేక పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేసి ఆ రైతులకు, వారి పిల్లలకు తోడుగా నిలబడాలి. ⇒ తాగునీటి ఎద్దడి లేకుండా ఉచిత ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేయాలి.⇒ ఇబ్బందులు ఉన్న చోట వైఎస్సార్సీపీ తరఫున మనం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి తోడు, సహాయం అందలేదు. అది వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.⇒ ఎక్కడ చూసినా కరెంట్ కోతలే. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 దాకా గ్రామాలలో తీవ్రమైన కరెంట్ కోతలు. రైతులకు9 గంటలు ఉచిత విద్యుత్ కాదు కదా 6 గంటలు, 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బోర్ల కింద ఉన్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నందున కచ్చితంగా ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సప్లై చేయాలి.⇒ ప్రతికూల పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందాలి. మన ప్రభుత్వంలో రూ.7 లక్షల చొప్పున సాయం చేశాం. ఇప్పుడు కూడా బాధిత కుటుంబాలకు అలాగే ఇచ్చే కార్యక్రమం కచ్చితంగా జరగాలి. ⇒ ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు 80% సబ్సిడీతో నీటి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాలి. -
‘గ్రూప్స్’ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని కేవలం రెండేళ్లు మాత్రమే సడలించడం వల్ల అనేక మంది అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతోందని చెప్పారు. రెగ్యులర్‌గా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వయోపరిమితిని దాటిపోయారని వివరించారు. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకే పెంచారని.. దీనిని 47 ఏళ్లకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినప్పుడు.. పోటీ పరీక్షల అభ్యర్థుల వయోపరిమితిని కూడా 47 ఏళ్లకు పెంచాలని టీడీపీ నేతలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేసిన విషయా న్ని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వయోపరిమితి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్‌ను కోరారు. జగన్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి అవసరమైన విధంగా ప్రస్తావిస్తామని భరోసా ఇచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు ఆర్.శ్రీనివాసరావు, కిరణ్‌కుమారి, కె.రాజ్‌కోటి తదితరులున్నారు. -
వ్యవ‘సాయం’ పడకేసిందన్నా..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్నా.. రైతులు, పశుపక్షాదులు విలవిల్లాడుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం పూర్తిగా పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యవసాయం అన్నా, రైతులు అన్నా ఇష్టం ఉండదని.. అందువల్లే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని వైఎస్ జగన్‌కు వివరించారు. ‘ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాభావంతో వేరుశనగ, కంది సహా పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులతో పంటల బీమా ప్రీమియం కట్టించుకుని, పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించాలి. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లా గోరకల్లు రిజర్వాయర్‌లో నీరు ఉన్నా రైతుల పంటలకు నీరు విడుదల చేయడం లేదు. సర్కారు నిర్వాకం వల్ల నెల్లూరు జిల్లాలో రైతులకు రూ.1,500 కోట్ల నష్టం వాటిల్లింది. తిరుపతి వంటి ప్రధాన నగరానికి తాగునీరు అందించే పాపవినాశనం జలాశయంలోనూ నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తాగునీటి భద్రతపై ఆందోళన పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లాలో దారుణ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి కూడా నీరు కరువైంది’ అని ఆయా జిల్లాల అధ్యక్షుడు ఉషాశ్రీచరణ్, అనంత వెంకట్రామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. లక్షలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి‘కృష్ణా డెల్టాలో సుమారు 6 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం దాదాపు 50–55 వేల ఎకరాల్లో ఇప్పటికీ సాగు ప్రారంభం కాలేదు. పులిచింతలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు అందడం లేదు. గుంటూరు జిల్లాలో కేవలం 20 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే కరువు తప్పదు. గోదావరి జిల్లాల్లో ఆక్వా, పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత, విద్యుత్ కోత పెరిగింది. పొరుగు రాష్ట్రం నుంచి ఎరువులు కొనుక్కోవాల్సి వస్తోంది. విశాఖలో తాగునీరు కూడా కరువైంది’ అని ఆయా జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, దేవినేని అవినాశ్, ధర్మాన కృష్ణదాసు, బెల్లాన చంద్రశేఖర్, కె.కె. రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, బొడ్డేడ ప్రసాద్, పరీక్షిత్ రాజులు వైఎస్ జగన్‌కు వివరించారు. అన్ని జిల్లాల సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించి పార్టీ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని విజయవంతంగా అమలు చేస్తామని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల పూర్తి ప్రసంగాలు epaper.sakshi.com లో -
YS జగన్ ను కలిసిన నిరుద్యోగ యువత
-
వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు
సాక్షి, తాడేపల్లి: గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ఫేజ్-2 జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల వయో సడలింపు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వయోపరిమితి దాటిపోయి లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని వన్‌టైమ్ సడలింపు కింద 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలు, విజ్ఞప్తులపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
-
‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్ విషెస్
-
ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ వర్షపాతం లోటులోనే ఉన్నాయన్నారు. ‘‘688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. దాదాపు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలో 75 శాతం వర్షపాతం లోటు. సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం వర్షపాతం లోటు...చిత్తూరులో 58.5 శాతం, వైఎస్సార్ కడపలో 57 శాతం వర్షపాతం లోటు. తూర్పుగోదావరిలో 57 శాతం, మార్కాపురం–నంద్యాలలో 56 శాతం చొప్పున వర్షపాతం లోటు. విశాఖపట్నంలో 54 శాతం, అనంతపురంలో 51 శాతం వర్షపాతం లోటు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యాచరణ చేపట్టలేదు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకుపైగా నష్టపోయారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటను బట్టి రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి సహా అనేక పంటలు దెబ్బతిన్నాయిపండ్ల తోటలు కూడా కరువు దెబ్బకు ఎండిపోతున్నాయి. శ్రీశైలం నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సింది. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్‌లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం పూర్తి సామర్థ్యంపై ప్రభుత్వం రాజీపడుతోంది. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ల పేరుతో ప్రచారం కాకుండా శాశ్వత సాగునీటి పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.‘‘వరుస వర్షపాతం లోటు కనిపిస్తున్నా కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదు?. కరువు ప్రభావిత మండలాలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలి. కరువు ప్రభావిత రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని తిరిగి చెల్లించాలి. గతంలో రైతులకు రావాల్సిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం ఇవ్వాలి. పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘ఉచిత పంటల బీమా కొనసాగి ఉంటే రైతులకు Prevented Sowing సహా బీమా రక్షణ ఉండేది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించాలి. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ. 19 వేలే. బకాయి పడ్డ రూ. 41 వేలు కూడా రైతులకు ఇవ్వాలి. కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులైన రైతులకు మూడేళ్లలో ఎగ్గొట్టిన రూ. 60వేలు ఇవ్వాలి. తుఫాన్ల వల్ల రైతులకు పెండింగ్‌లో ఉన్న పంటల బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ప్రకటించాలి...ఇన్పుట్ సబ్సిడీ కింద సుమారు రూ. 6 వేల కోట్లు రైతులకు అందించాలి. సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేయాలి. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన సున్నా వడ్డీ బకాయిలన్నీ రైతులకు చెల్లించాలి. పశుగ్రాసాన్ని ముందుగానే సమీకరించి కరువు జిల్లా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలి. కరువు కారణంగా వ్యవసాయ కూలీలు వలస వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అదనంగా 150 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం కేంద్రాన్ని వెంటనే అదనపు పనిదినాలు కోరాలి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలి...ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల రైతు, పేద కుటుంబాలపై అదనపు భారం పడకూడదు. విద్యా దీవెన–వసతి దీవెన కింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.9 వేల కోట్లను విడుదల చేయాలి. కరువు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఉచిత ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి. గ్రామాల్లో విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. రైతులకు ప్రకటించిన ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను కోతలు లేకుండా అందించాలి. బోర్ల కింద ఉన్న పంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి...ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలి. పండ్ల తోటలకు నీటి ట్యాంకర్ల ఖర్చుపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి. ముఖ్యంగా చీనీ సహా శాశ్వత పండ్ల తోటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.పరిస్థితి తీవ్రతను బట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానన్న వైఎస్ జగన్.. రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుందన్నారు. ‘‘ప్రతి జిల్లాలో కరువు పరిస్థితులపై పార్టీ నాయకులు అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జిల్లాల వారీగా రైతుల ప్రత్యేక డిమాండ్లను కూడా ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుల సమస్యలపై వైయస్సార్సీపీ నాయకులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు ఇవ్వాలి. కరువు సమస్యలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ చేపట్టాలి. దీనికి ముందు మండల స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రైతులతో సమావేశాలు నిర్వహించాలి. రైతులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!‘‘ఎల్‌నినో ప్రభావం వస్తుందని ఫిబ్రవరి 4నే చంద్రబాబు చెప్పారు. తెలిసినా ఆ తర్వాత చేసిన కార్యాచరణ మాత్రం సున్నా. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల తీవ్రత పెరిగింది. వర్షపాతం లోటు కనిపిస్తున్నా స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడమే చేశారు. మీ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేలకుపైగా నష్టపోయారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నది ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు... ‘ఎల్లో నినో ఎఫెక్ట్’. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగిన సమయంలో ఇవ్వకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారు...పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్టులు కడుతున్నా చంద్రబాబు కనీసం నోరు మెదపడం లేదు. రైతుల కోసం చంద్రబాబు మనసు పెట్టి పనిచేస్తున్నారనే భావన ఎక్కడా కనిపించడం లేదు. పోలవరం పూర్తి స్థాయి నీటిమట్టంపై రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటున్నారు. గతంలోనే ఉన్న పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్టులను ఆపరేట్ చేసి కొత్తగా తానే నీళ్లు తెచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు...ఒకవైపు పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటూ, మరోవైపు లిఫ్టుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు వరుసగా వర్షపాతం లోటు కనిపిస్తున్నప్పుడు కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు?. కర్ణాటక ముందుగానే కరువు ప్రకటించింది; చంద్రబాబు ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోయింది. కరువు వస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదు; పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదు; ఉపాధి హామీ అదనపు పనిదినాల కోసం డిమాండ్ కూడా పెట్టలేదు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.ఇదీ చదవండి: సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్ -
కరువు పరిస్థితులపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
-
భగవాన్ విశ్వకర్మకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విరాట్ విశ్వకర్మ భగవాన్, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు ఎస్.ఎం. పవిత్ర, తోలేటి శ్రీకాంత్, విశ్వబ్రాహ్మణ నాయకులు ఎస్.డి. మురళీకృష్ణ, కె. గురవాచారి, ఉదయ్‌కుమార్, శేఖర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. -
వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.జూమ్ ద్వారా జరిగిన ఈ మీటింగ్‌లో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కరువు పరిస్థితులు, పలు ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై నేతల నుంచి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు ఎదురవుతున్న ఇతర సమస్యలు, ఆయా జిల్లాల్లోని తాజా పరిస్థితులపైనా పార్టీ నేతలతో ఆయన చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కొండ పైనా క్రెడిట్ చోరీనా? -
ప్రదాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘భగవంతుడు మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో పాటు.. దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు.Wishing Hon’ble PM Shri @narendramodi ji a very happy birthday. May God bless him with good health, long life and the strength to serve the nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2026ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్.. కూటమి సర్కార్ అరాచకం -
కొండపైనా క్రెడిట్ కొట్టేశారు!
తిరుమల: తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం చేపట్టి, అధిక భాగం పూర్తి చేసిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారం మొత్తం చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడంపట్ల భక్తులు, ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మ్యూజియం పనులకు అప్పుడే శ్రీకారం శ్రీవారి ఆలయ చరిత్ర, కళా సంపదను భక్తులకు పరిచయం చేసేలా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. 2023లోనే టీటీడీ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. మ్యూజియం ఆధునీకరణకు టీసీఎస్ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ రూ.20 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చాయి. మొత్తం రూ.145 కోట్ల ప్రాజెక్టులో 19 గ్యాలరీలను అభివృద్ధి చేయనున్నట్లు అప్పట్లోనే టీటీడీ వెల్లడించింది. అన్నమయ్య రాగి రేకులు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి తదితర చారిత్రక వస్తువులను ప్రదర్శించేలా గ్యాలరీలను రూపొందించే పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమై, 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం పనులకు ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్ల సమయం పట్టింది. దీనిని విస్మరించి, మ్యూజియం అభివృద్ధి మొత్తం బాబు ప్రభుత్వంలోనే జరిగినట్లుగా చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్యోగుల ఇళ్ల స్థలాలపైనా అదే చర్చ టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2022లోనే వడమాలపేట మండలంలోని పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 300.22 ఎకరాల భూమిని ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందుకోసం రూ.61.63 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు టీటీడీ అప్పట్లోనే వెల్లడించింది. 2023 ఆగస్టులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి భూమిని కూడా పరిశీలించారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులకు 35/55 అడుగుల చొప్పున స్థలాలు కేటాయించే ప్రణాళికను అప్పట్లోనే ప్రకటించారు. లేఅవుట్, కచ్చా రోడ్లు, టౌన్ ప్లానింగ్ అనుమతుల కోసం కూడా చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లుగా ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లతో మౌలిక వసతులు కలి్పస్తామని చంద్రబాబు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
అంతర్జాతీయ స్థాయికి చేరిన రెడ్ బుక్ పాలన.. వైరల్ అవుతున్న YS జగన్ ట్వీట్
-
నా కొడుకుని చంపేశారన్నా... నువ్వే న్యాయం చేయాలి
-
నేడు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉండేలా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలపై ఆయన మాట్లాడనున్నారు. -
ఎఫ్‌బీఐ పేరుతో ‘పోలీసింగ్’!
సాక్షి,అమరావతి: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును వాడి ఏపీ పోలీసులు తప్పుడు ఫిర్యాదులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బుధవారం పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సైతం ఆయన ట్యాగ్ చేశారు. ఆ పోస్టులో ఇంకా జగన్ ఏమన్నారంటే.. దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య ‘‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ... మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య. ఆ మెయిల్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ఈ –మెయిల్ చిరునామా నుంచే వచి్చందని ‘ఎక్స్’ ధృవీకరించింది. ఆ మెయిల్ పంపిన సంబంధిత అధికారి తాను ‘ఎఫ్‌బీఐ’ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారు. అసలు ఆ అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? అక్కడ ‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు, ‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా? మీ రాజకీయ సెన్సార్íÙప్ను అమలు చేయడానికా పోలీసు యూనిఫాం? పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్íÙప్ను అమలు చేయడానికి కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పోస్టుల తొలగింపు చర్యలో ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్‌కు అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తింది. సోషల్ మీడియా యుగంలో వాస్తవాలను దాచి పెట్టలేరు.. అమలు చేయని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులు.. ఇదీ మీ పరిపాలన.. విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువు పరిస్థితుల్లో మొత్తం నష్టపోయిన రెతులను ఆదుకోండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. చాలా వేగంగా వ్యాప్తి చెందిన ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. మీ పనితీరుపై మీ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే, ప్రజలకు అంతా బాగా చేశామని అనుకుంటే.. అది మీ పనితీరులో చూపాలి. ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్íÙప్, వేధింపులతో కాదు’’ అని వైఎస్ జగన్ ఎక్స్‌లో తెలిపారు. -
రేపు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 17, 2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత కరువు పరిస్థితులు, తీవ్రమైన నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షించనున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని స్థానిక పరిణామాలు, సమస్యలపై సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అండగా ఉండేలా పార్టీ కార్యక్రమాలపై ఆయన నాయకులతో మాట్లాడనున్నారు. -
చంద్రబాబూ.. మీ పాలనలో పోలీసింగ్ అంటే ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరును వాడటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. చంద్రబాబు పాలనలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు.‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ఎఫ్బిఐ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ.. మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య.ఆ మెయిల్స్ అన్నీ ఏపీ పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచే వచ్చాయని ‘ఎక్స్’ ధృవీకరించింది.ఆ మెయిల్ పంపిన ఇన్స్పెక్టర్ తాను ‘ఎఫ్‌బీఐ’ అధికారినని ఎలా చెప్పుకున్నారు?.అసలు ఆ మెయిల్ పంపాలని ఆదేశించింది ఎవరు?‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు?. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు..‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా?అమలు చేయని సూపర్ సిక్స్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై పోస్టులు పెడితే ఎందుకు తొలగిస్తున్నారు?. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదు.రాజకీయ ప్రయోజనాల ఏకంగా ఎఫ్‌బీఐ పేరును వాడటం ఏపీకి అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తిన్నది.విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని,గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువుతో నష్టపోయిన రెతులను ఆదుకోవటానికి వాడండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. అలా నిజమైన అభివృద్ధి చేసి చూపండి. ఇకనైనా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. ప్రజలకు మంచి చేసే విషయంలో మీ పనితీరును చూపండి.ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్షిప్, వేధింపులతో కాదు’’అని వైఎస్ జగన్ ఎక్స్‌లో తెలిపారు. .@ncbn గారి పాలనలో రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.చంద్రబాబు గారూ, మీ పాలనలో ఇదేనా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2026 ఇదీ చదవండి : చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలు -
ఆళ్లనాని మృతిపై వైఎస్ జగన్ సంతాపం
-
డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా? లేదా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా.. లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియ మీద విశ్వసనీయత పోతే నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘లక్షల మంది అభ్యర్థులు న్యాయమైన అవకాశం కోసం తమ జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ఈ పరీక్షల కోసం వెచ్చిస్తారు. కష్టపడి చదివి నిజాయితీగా ఉద్యోగం పొందడం కోసం వారి కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా వెచ్చిస్తారు. కానీ, వ్యవస్థ విఫలమై దానిని నిరాశ పరిచినప్పుడు, దాని ప్రభావం కేవలం ఫలితాలపైనే కాదు.. మొత్తం నియామక ప్రక్రియపైనే అభ్యర్థులకు ఉండే నమ్మకం పోతుంది. చివరకు వారు తీవ్ర నిరాశకు గురవుతారు. చంద్రబాబూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం ఇవ్వడం అన్నది మీ ఇష్టాయిష్టాలు కావు. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్లు పడిన కష్టానికి న్యాయం చేయాలన్న బాధ్యత, జవాబుదారీతనం అవసరమని మీకు అనిపించడం లేదా? ప్రస్తుతం బయట పడిన డీఎస్సీ కుంభకోణానికి మీరు బాధ్యత వహిస్తారా.. లేదా?’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డు వినీత్ కుటుంబసభ్యులు
కృష్ణా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్‌పోర్టులో పోరంకి మహిళలు మంగళవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. విషయంలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొడ్డు వినీత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే వినీత్ మృతి కేసును అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తమకు అండగా ఉండాలని వైఎస్ జగన్‌కు వినీత్ తల్లి సునీల, ఆమె కుటుంబసభ్యులు వినతిపత్రం అందించారు. దీనిని పరిశీలించిన వైఎస్ జగన్ వినీత్ కుటుంబసభ్యులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. -
ఆళ్ల నాని మృతి పట్ల YS జగన్ దిగ్భ్రాంతి
-
ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) మంగళవారం విశాఖ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత వైఎస్సార్సీపీ సర్కారులో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
DSCఅక్రమాలపై మరోసారి బాబుపై జగన్ ప్రశ్నల వర్షం
-
జగన్ పర్యటనలో ఆ జనాన్ని చూస్తే నాకు.. సాకే శైలజానాథ్ రియాక్షన్
-
దేశ భవిష్యత్తును నిర్మించేది ఇంజనీర్లే: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజనీరింగ్ అంటే కేవలం భవనాలు, రహదారులు, వంతెనలు నిర్మించడం మాత్రమే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడమని అన్నారాయన.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అసాధారణ ప్రతిభను స్ఫూర్తిగా పేర్కొంటూ.. దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్రను గుర్తు చేశారు. ఇంజనీరింగ్ రంగం అభివృద్ధి, ఆవిష్కరణలకే పరిమితం కాకుండా.. సమాజ పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కీలకంగా నిలుస్తోందని జగన్ పేర్కొన్నారు.‘‘ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం’’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభతో భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. దేశ మౌలిక వసతుల అభివృద్ధి నుంచి ఆధునిక సాంకేతికత వరకు ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని జగన్ అన్నారు. దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ప్రతి ఇంజనీర్‌కు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.… pic.twitter.com/7X4XOlDVbT— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2026మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ రంగంలో విశేష సేవలందించారు. నీటి పారుదల, జలవనరుల నిర్వహణ, వరద నియంత్రణ వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి విశేష గుర్తింపు పొందింది. మైసూరు దివాన్‌గా పనిచేసిన సమయంలో పారిశ్రామిక, విద్యా, ఆర్థిక రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఏటా ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఈ డీఎస్సీ వార్ ఆగదు -
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
-
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026 -
ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
-
పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు
-
జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్ అబ్బయ్య చౌదరి అదిరిపోయే కౌంటర్
-
క్రికెట్, ఆర్చరీ, హాకీ క్రీడాకారులకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైనదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. హృదయపూర్వక అభినందనలుఈ సందర్భంగా.. అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదే విధంగా.. రికర్వ్ ఆర్చరీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన ఏపీకి చెందిన ధీరజ్ బొమ్మదేవరను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక AHF జూనియర్ ఆసియా కప్ 2026 టైటిళ్లను గెలుచుకుని దేశ కీర్తిని చాటిన భారత జూనియర్ పురుష, మహిళల హాకీ జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ‘మన క్రీడాకారుల పట్టుదల, కఠోర శ్రమ, అంకితభావం కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి. భవిష్యత్తులోనూ మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలి. భారతదేశ కీర్తిపతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.ఆసియా కప్ మనదేకాగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల ఆసియా టీ20 కప్-2026 ఫైనల్లో భారత జట్టు.. శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఇక అంతకుముందు చైనా వేదికగా సాయంత్రం జరిగిన జూనియర్ హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు చైనాపై.. పురుషుల జట్టు సౌత్ కొరియాపై గెలిచి చాంపియన్‌గా హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. మరోవైపు.. ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం సాధించాడు. -
Surekha : వైఎస్ జగన్ పై అభిమానంతో రాజీనామా చేశా
-
వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్‌ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్‌ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్‌ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్‌పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైరల్ అవుతున్న YS జగన్ ట్వీట్
-
తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
-
విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#GaneshChaturthi— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026అంతకు ముందు.. ఓ సందేశంలో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని చుట్టేసిన వినాయకుడు -
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
ఒక టీచర్ పోస్టు.. ఆరు మలుపులు!
సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన అభ్యర్థికి 65 టెట్ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్ జగన్ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్ 77 మార్కులు తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదో మలుపు: ఎస్జీటీ పోస్టుకు ‘రాంగ్ పేపర్’? 77 మార్కులు పేపర్ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్ కాగా, ఎస్ జీటీ పోస్టుకు పేపర్–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్ ఎందుకు? ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
పిడుగుపాటుతో నలుగురి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాల్లో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తనను కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: రేపు(సోమవారం, సెప్టెంబర్ 14వ తేదీ) వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్
-
ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం చంద్రబాబు చేసిన స్కామ్‌లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్‌ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
జగన్ వెంట లక్షలాది సైనికులు.. YSRCPని ఎవరూ కదిలించలేరు
-
7 దశల్లో వెరిఫికేషన్ చేసి ఏం సాధించారు? DSCలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పై జగన్ ఫైర్
-
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
ఇప్పుడు సమాధానం చెప్పు లోకేష్
-
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు. ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు? » డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు? » అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా? » నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా? -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
జగన్ పాదయాత్రపై చింతమనేని నోటి దూల
-
బాబుకు బిగ్ షాక్.. అడ్డంగా దొరికిన కొడుకు.. పక్కా ఆధారాలతో ఏకిపారేసిన జగన్
-
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్‌లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్‌లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్‌గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్‌కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్‌కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్‌ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్‌గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్‌కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్‌బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్‌కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్‌కు టెట్‌లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్‌లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్‌మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్‌లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
అబద్ధాలు.. డ్రామాలు.. డైవర్షన్లు
అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా.మా హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో చెక్ చేసుకోండి... ఎక్కడా తేడా చూడలేదు.మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు.సాక్షి, అమరావతి: ‘డైవర్షన్..డ్రామాలు..అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బతుకు.. అధికారులను బెదిరించి.. భయపెట్టి..ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను కొట్టేయించుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పైగా తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. తమ అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు బయటపడిన ప్రతీసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు ఆడడం చంద్రబాబుకే చెల్లింది‘ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు చేస్తూ.. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలిస్తుండటంపై సాక్ష్యాధారాలతో ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారు. ఇలా అయితే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలి. డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంది.’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..పరీక్ష రాయకుండానే ఉద్యోగాలిస్తే ప్రశ్నించకూడదా? నువ్వు పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. నీకు నచ్చిన వారికి డబ్బులు తీసుకొని స్కామ్‌లు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నావు. అర్హత ఉండాలి కదా? ఎలాంటి అర్హత లేకుండా నీకు నచ్చాడని, నీకు డబ్బులు ఇచ్చాడని నీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎలా? ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు పారదర్శకంగా ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. అలా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చే సమయంలో ఒకటి రెండు తప్పిదాలు జరిగితే పొరపాటు చేశావ్ లే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనే పెద్ద మోసం చేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పరీక్ష రాయకుండానే 372 పోస్టులు ఇచ్చేందుకు స్కెచ్ వేశావు. ఉద్యోగాలకు పరీక్షలు రాయనవసరం లేదని ఏకంగా నువ్వు జీవోలు ఇచ్చావు. ఇదే రీతిలో మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవాలనుకున్నావ్. ఇది తప్పు కాదా? పైగా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా? డైవర్షన్.. డ్రామాలు.. అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బ్రతుకు చంద్రబాబు అనే వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు..డైవర్షన్ మీద డైవర్షన్..ఒక డ్రామా చేస్తాడు. డీఎస్సీ స్కామ్–1 కానీ, డీఎస్సీ స్కామ్–2 కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపించాను. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో సమాధానాలు చెప్పాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు. పైగా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్పించారు.. ఏడుసార్లు వెరిఫికేషన్ తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఆధారాలతో బయటపెడుతున్నాం.. కాబట్టి దిక్కుతోచని, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పులను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ జీవితాలతో చెలగాటాలా? డీఎస్సీ కుంభకోణంపై పోరాటం ఇంత పెద్దది కాకపోతే..జగన్ అనే వ్యక్తి ప్రశ్నించకపోతే డీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు వర్తింపచేసేవారు. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్మేసుకోవాలని చూశారు. అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4నే ఇక్కడ వర్తింపచేయాలని చూశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేశారు. ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపివేశారు. లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షల కోసం జీవితాలను ఫణంగా పెట్టి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. ఇంత కష్టపడితే చివరకు స్కామ్‌లతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని నియామకాలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతూ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా. పాలకులుగా ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం. పరిపాలన అంటే ఇదేనా?ఎలాంటి ఆరోపణ లేకుండా లక్షల ఉద్యోగాలిచ్చాం.. మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్ద పీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. చెక్ చేసుకోండి..సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడా తేడా చూడలేదు. ప్రభుత్వం అనేది ఉద్యోగార్థుల్లో నమ్మకం కల్గించేలా ఉండాలి. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకునే విధానాన్ని ఒప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద వారికి నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. మా డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వేదికలపైనా పోరాటాలు కొనసాగిస్తాం. నిజంగా సిగ్గుతో వాళ్లు తలదించుకోవాలి.. డీఎస్సీ స్కామ్‌పై మీరు లేవనెత్తిన అంశాలపై బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ ప్రశ్నను మీరు వాళ్లను అడగాలి. డీఎస్సీ స్కామ్ విషయంలో జగన్ ఏమైనా విషయాలు తప్పుగా చెబుతున్నారా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా ? జగన్ చెప్పే విషయాలు లాజికల్‌గా లేవా ? అని వాళ్లను ప్రశ్నించాలి. జగన్ చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని అనిపిస్తా ఉన్నప్పుడు నోరు మెదపాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా రావాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పక్కాగా దొరికిపోయిన తర్వాత కూడా జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించకుండా ఇలాంటి చంద్రబాబును సపోర్టు చేస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తున్నందుకు వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ.. చంద్రబాబు తనపై నమోదైన కేసులు కొట్టేయించుకుంటూ తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను మూయించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం తన చేతుల్లో ఉంది. అధికారులందరూ ఆయన కింద పని చేస్తున్నవారే. తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. డీఎస్సీ పై నమోదైన కేసులను కూడా ఇదే రీతిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వంలో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు.. చంద్రబాబు నాయుడే. అందుకే తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయించుకుంటూ తనకు క్లీన్ చిట్ వచ్చిందని తనకు తానుగా చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. -
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
జగన్ దెబ్బకు బాబుకు బీపీ హై వెలుగులోకి కీలక ఆధారాలు
-
7 స్టెప్స్ వెరిఫికేషన్.. ఇది వీళ్ల బండారం..జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రాజీనామా చేసే వరకు వదిలిపెట్టను జగన్ మాస్ వార్నింగ్
-
అసలు సూత్రదారులు వీళ్లే..! ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
ఎవరికీ పోస్టు ఇవ్వాలో మంగళగిరి నుంచి ఫోన్.. లైవ్ వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
-
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్‌లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్
-
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్‌జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్‌గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్‌కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
DSC స్కాంలో కీలక పాత్ర ఎంపీ భరత్ ది.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
DSC స్కాం పార్ట్ 2.. వెలుగులోకి కీలక ఆధారాలు
-
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్‌జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్‌లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
DSC స్కాంలో తవ్వేకొద్ది అక్రమాలు.. ఒక్కొక్కటి బయటపడుతుంటే బాబుకు బీపీ పెరుగుతోంది
-
డీఎస్సీ స్కామ్‌తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. మెగా డీఎస్సీ కుంభకోణం గురించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్2025 మెగా డీఎస్పీలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి.డీఎస్సీ అక్రమాలు బయటికొచ్చే కొద్దీ బాబులో బీపీ పెరుగుతోంది.నా ప్రశ్నలకు బాబు, లోకేష్ సమాధానం చెప్పలేదుప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నాపత్రం తయారీ2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టారు.మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. బుల్డోజ్ చేస్తారుఫస్ట్ ర్యాంకర్‌ను వెరికేషన్‌కు ఎందుకు పిలవలేదు?డీఎస్సీపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించాంపర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?ఎస్ఈఆర్టీలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్ పేరును ఎందుకు మార్చారు?ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?కోర్టుకు ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు.జీవో నంబర్ 4, 47తో గేట్లు తెరిచారు.ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చాయి.డిఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు.ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్లు పుట్టుకొస్తున్నాయి.బాబు స్కామ్‌ల హిస్టరీలో ఇదొక ఆణిముత్యంతప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు.నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కుమ్మక్కయ్యారుకొడుకును కాపాడాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు.2013 జూడో సీనియర్ పోటీలో ఖమ్మంలో జరిగినట్లుగా ఏపీ జూడో అసోసియేషన్ సర్టిఫికెట్లు ఇచ్చింది.ఖమ్మంలో అసలు సీనియర్ పోటీలు జరగలేదని తెలంగాణ అసోసియేషన్ తేల్చి చెప్పింది.విశాఖలో అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేశారు.దొంగ సర్టిఫికెట్లు చూపినట్లు ఆధారాలున్నాయి.ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు.. లోకేష్ తోడల్లుడు భరత్.డీఎస్సీ-2025, మెగా డీఎస్సీ కాదు, నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేసిన డీఎస్సీ అని చాలా రోజులుగా చెప్తున్నాం.గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నారు.ఇవిచూసిన తర్వాత ఎవరైనా ఈస్కాం నుంచి తప్పించుకోగలుగుతారా? ఎందుకంటే అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ కుంభకోణాన్ని తవ్వేకొద్దీ, ఈ స్కాం తాలూకు రూపాలు చాలా కనిపిస్తున్నాయి.మరోవైపు సోషల్‌మీడియాలో కూడా నిలదీయకూడదంటూ అక్కౌంట్లను బ్లాక్ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. ఈ డీఎస్సీ స్కాం ఎలా జరిగిందో అనేక సార్లు ఇదే వేదికపై నుంచి నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించాను.నేను అడిగే ప్రశ్నలు చాలా సింపుల్. ఇందులో అర్థంకాకపోవడానికి కూడా ఏమీ లేదు.గతంలోనైనా, ఎప్పుడైనా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండింటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? ఎందుకు పారదర్శకతకు పాతర వేశారు? అని అడిగా? ఇది స్కాంకు ద్వారాలు తెరిచినట్టుకాదా? అని అడిగా? కాని చంద్రబాబు నోరు విప్పలేదు.డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలనుకూడా అమ్ముకున్నారని ఇటీవలే కొంతమంది అభ్యర్థులు చెప్పడం, మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి మరింత బలాన్ని ఇవ్వడంలేదా?స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి, అదివరకే ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షే లేకుండా, డైరెక్ట్‌గా జీవో 4,47లతో గేట్లు ఎత్తారు.పని అయిపోయాక, మళ్లీ జీవో నంబర్ 23, 25, జీవో నంబర్ 56 లతో, గేట్లు మూసేశారు. ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? ఎందుకు పని అయిపోయిన తర్వాత, ఆ జీవోలను ఉపసంహరించారు? కారణం ఏంటి?టీచర్ పోస్టులకోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినా, దీనిపై విచారణ ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదయ్యింది మొదలు, స్టేషనల్ బెయిల్ ఇచ్చి పంపడం వరకూ, ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు? పైగా రిమాండ్‌కు పంపాం అంటూ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇవే బేసిక్‌గా మెగా డీఎస్సీ స్కాంకు సంబంధించి పునాదులు.ఇప్పుడు బయటకు వస్తున్న కేస్‌స్టడీస్ అన్నీకూడా, వీటికి సంబంధించిన కోణాలే. తవ్వుతున్న కొద్దీ ఒక్కో అక్రమం, ఒక అక్రమాన్ని తవ్వుతుంటే ఇంకో అక్రమం బయటకు వస్తోంది.బాబుగారి స్కాంల హిస్టరీలో మరో ఆణిముత్యం ఇది. నిరుద్యోగ యువకులను నట్టేటా ముంచి స్కాం ఇది.స్పోర్ట్స్‌కోటా పేరుతో వీళ్లు చేసిన అక్రమాలు చూస్తే, వీడు మనవాడా? ఇతను దగ్గరనుంచి డబ్బులు ముట్టాయా… అయితే ఇచ్చేయ్ టీచర్ పోస్టు.. అన్న పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ చేశారు.జరగని పోటీలు జరిగినట్టుగా, ఆ పోటీల్లో వీళ్లు అద్భుతంగా ఆడినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లతో సైతం పోస్టులు ఇచ్చేశారు.పై స్థాయి నుంచి ఆదేశాలతో, కింది స్థాయి వరకూ కుమ్మక్కై, ఒక మోడస్ ఆపరండీ ప్రకారం ఈ పోస్టులన్నింటినీ భర్తీచేశారు.సీబీఐ విచారణ జరగాల్సిన అవసరాన్ని ప్రతి కేస్ స్టడీకూడా చెప్తోంది.స్పోర్ట్స్‌లో కోటా భర్తీచేసిన వాళ్ల జాబితా చూస్తే ‘జూడో ఆట’తో మొత్తం 39 మందికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారు.సాఫ్ట్‌బాల్ పేరిట, 38 మందికి ఇలానే పరీక్ష రాయకుండానే, టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.మరికొన్ని కేసుల్లో అయితే, శాపే చక్రంతిప్పింది.విశాఖపట్నంలో ఏ ఎగ్జామ్ రాయకుండానే ‘యోగేశ్వర్రావు’ అనే అభ్యర్థికి స్పోర్ట్స్ కేటగిరీలో ఎస్జీటీ టీచర్ పోస్టు ఇచ్చారు.ఈయన చెల్లెలికి కూడా ఇలానే స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టు ఇచ్చారు.కాని వీళ్లు విజేతల జాబితాలో లేరని తెలంగాణ ఖో – ఖో అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్తూ, ఆరోజు పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను విడుదలచేశారు.అంటే, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో కనుక్కుని. ఆమేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని అర్థం అవుతోంది.కాని ఏడుసార్లు వెరిఫికేషన్ చేయించామని చంద్రబాబు అధికారులతో చెప్పిస్తున్నారు.కొన్ని కేసుల్లో, అభ్యర్థులు టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారు.ఒక కేటగిరీలో టెట్ అర్హత ఉంటే, మరో సబ్జెక్ట్‌కు సంబంధించి టీచర్ పోస్టు ఇచ్చారు.ఇంకొన్ని కేసుల్లో అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో పోస్టు ఇచ్చారు.కర్నూలు జిల్లాలో ‘ఈడిగ ప్రభాకర్’ అనే అభ్యర్థికి, ఏ పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు.తన రిజర్వేషన్ కేటగిరి ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లోలో 75 మార్కుల రావాలి.కాని, 65 మార్కులు వచ్చినా, స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్ట్ ఇచ్చారు.ఈ విషయాన్ని కర్నూలు డీఈఓ కూడా ఒప్పుకున్నారు. మరి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఇచ్చారు?ఈడిగ ప్రభాకర్‌కు టెట్‌లో 77 మార్కులు 2018లో వచ్చాయని ఈ కేసును ఇక్కడ కప్పిపుచ్చే ప్రయత్నంచేశారు.కాని వీరు చూపిన హాల్ టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి, టెట్ డేటా చూస్తే,ఈ 77 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2B కేటగిరీకి సంబంధించిన మార్కులు.మరి ఇతనికి టెట్ 1ఏ-లో ఉన్న, ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?ఈడబ్యుఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్టు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి.ఇతర కులాలకు చెందిన వాళ్లకు ఈడబ్యుఎస్ కింద పోస్టులు ఇచ్చారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి.కడప జిల్లాలో రసూల్ అనే వ్యక్తి బీసీ-ఈ కేటగిరీ అయితే, 2009, 2012, 2018లో బీసీ-ఈ కిందే డీఎస్సీ పరీక్షలకోసం అప్లై చేస్తే, ఇప్పుడు మాత్రం అతనికి ఓసీ- ఈడబ్ల్యూఎస్ కింద పోస్టు ఇచ్చారు.1:1 రేష్యోలో అధికారుల వెరిఫికేషన్ ఏశాక, దాన్ని దాటి పోస్టులు ఎలా ఇవ్వగలిగారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7సార్లు వెరిఫైచేశామని చెప్తున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎందుకు జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా, పోస్ట్‌లు ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఈ పనిచేశారు?నిరుద్యోగ యువతకోసం న్యాయస్థానాల్లోనూ పోరాడుతున్నాం.అర్హత లేనివారికి ఎవరు చెబితే పోస్ట్ ఇచ్చారు?అసలు ఏ పరీక్షా లేకుండానే పోస్ట్‌లు ఇవ్వడం పెద్ద స్కాం.నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు- వైఎస్ జనన్చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేయగలరా?ఏ పరీక్షా లేకుండా గర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కాంమరి అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న తర్వాత, చంద్రబాబుగారి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, ఆయన కింద పనిచేసే అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా?చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, ఆయన కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా?అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం.మరి కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడుకూడా కాక్రోచ్ అవుతాడు.మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే, టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు, ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు.అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే. అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీఓ నంబర్-4నే మీరు వాడుకున్నారు.డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రికక్రూట్మెంట్ను మధ్యలో ఆపేశారు.ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపేశారు.లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.ఇంత కష్టపడితే చివరకు స్కాంలతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని పోస్టులు ఇస్తున్నారు.ప్రభుత్వంమీద, వ్యవస్థలమీద మరి నమ్మకం ఎవరికైనా ఎలా ఉంటుంది? -
కురుక్షేత్రానికి సిద్ధం కండి.. క్యాడర్ కు జగన్ బిగ్ టాస్క్
-
చంద్రబాబు హామీలు.. మోసాలు.. ఇంటింటా ఇదే చర్చ
వచ్చే సెప్టెంబర్‌లో పాదయాత్ర చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన్‌రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..కార్యకర్తలు గర్వపడేలా మన పాలనమన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్‌ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది.వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు.. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్‌బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్‌లు పెట్టింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్‌కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్‌కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్‌ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్‌గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.చంద్రబాబు పచ్చి దగామనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరుఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’జరగబోయేది కురుక్షేత్రంఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్రఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదుచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్‌బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.సాఫీగా జరిగితే మనదే విజయంఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. -
బీసీల ఉద్ధారకుడు వైఎస్ జగనే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీటవిభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు.మొత్తం 44 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి 25 లోక్‌సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్లో బీసీ మంత్రులెందరు? తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది? రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్‌ను కూడా నిర్మించలేదన్నారు. జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు. బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు. అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసిందిఅంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు. ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారుమళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. -
కళ్లార్పకుండా ‘కహానీలు’
సాక్షి, అమరావతి : తాను చేయని పనిని చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఎక్కడలేని ‘తెలివితేటలు’ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వే, 22–ఏ భూములకు విముక్తి, పట్టాదారు పాసుపుస్తకాల ఘనత తనదేనని నోటికొచ్చినట్లు అలవోకగా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. తాను వ్యతిరేకించిన కార్యక్రమాన్ని తానే ప్రారంభించినట్లు, తాను 22–ఏలో పెట్టిన భూములకు తానే విముక్తి కల్పించినట్లు నిస్సిగ్గుగా అవాస్తవాలు మాట్లాడుతూ కళ్లార్పకుండా కహానీలు చెబుతుండడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ బాబు తెచ్చారా?.. రాష్ట్రంలో భూముల రీసర్వే మొదలైంది 2020 డిసెంబర్ 21న. అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారిగా 14 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. 3,240 జీఎన్ఎస్ఎస్ రోవర్లు, వందలాది డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, రెండు విమానాలు, 70 కార్స్ స్టేషన్ల నెట్‌వర్క్‌తో అనేక వ్యయ ప్రయాసలతో ఏర్పాటుచేశారు. మొత్తం 2.47 కోట్ల సర్వే నంబర్లలోని భూమిని కొలిచి కొత్తగా 86,80,246 ఎల్పీఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నంబర్లు జారీ చేశారు. 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పీఎం నెంబర్లు వచ్చింది అప్పుడే. 30 లక్షల మంది రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన భూహక్కు పత్రాలు ఇచ్చారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్, ప్రతి భూమికీ జియో హద్దులు, ప్రతి పార్సిల్కూ ఐడీ నంబరు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్.. ఇలా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్న ప్రతిదీ అప్పటిదే. 2022 సెపె్టంబర్లో జారీ అయిన పాస్ పుస్తకాలపై ఆ క్యూఆర్ కోడ్ ఇప్పటికీ ఉంది. రైతుల చేతుల్లో ఆ సాక్ష్యం ఉండగా చంద్రబాబు కళ్లార్పకుండా చెబుతున్న అబద్ధాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.రీ సర్వే ఆపేస్తానని.. క్రెడిట్ దోపిడీ..రీసర్వే వల్ల రైతులకు నష్టమని, మీ భూములు ఎక్కడున్నాయో తెలుసుకుని ఆక్రమించడానికే ఈ సర్వే అని.. ఇక మీ భూములు మీవి కావని, తాము అధికారంలోకి రాగానే రీసర్వేను ఆపేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ఊరూవాడా హోరెత్తించారు. అయితే, అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు రీసర్వేను నిజంగానే నిలిపివేశారు. ఆ తర్వాత అదే చంద్రబాబు రాష్ట్రంలో రీసర్వే అద్భుతంగా జరిగిందని కేంద్రానికి లేఖ రాసి రూ.500 కోట్ల రాయితీని సిగ్గులేకుండా తెచ్చుకున్నారు. ఆ డబ్బు వచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పనికి. ఇలా ఢిల్లీలో గొప్పలకు పోవడం.. రాష్ట్రంలో బురదజల్లడం చంద్రబాబుకే చెల్లింది. నిజానికి.. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తికాలేదు.రాజముద్ర వేసి తానే చేశానంటే సరా?.. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. పుస్తకంలో రైతుకు ఉపయోగపడేది బొమ్మ కాదు, క్యూఆర్ కోడ్, జియో హద్దులు, ఎల్పీఎం నంబరు. ఆ మూడూ ఎక్కడివో బాబుకు బాగా తెలుసు. లోగో మార్చడం సంస్కరణ కాదు. అలాగే, స్టిక్కర్ మార్చి చరిత్ర సృష్టించినట్లు డప్పు కొట్టుకోవడం ఆయన అవివేకం. జగన్ హయాంలో పాతిన సర్వే రాళ్లపై నవరత్నాల లోగో ఉందని, సీఎం ఫొటో ఉందని ఆయన ఇప్పటికీ విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అది వాటర్‌మార్క్ లోగో మాత్రమే. సర్వే ఎప్పుడు జరిగిందో, ఏ ప్రామాణికతతో జరిగిందో శాశ్వతంగా గుర్తుండేందుకు వేసిన ముద్ర. అది తప్పయితే ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్ల నుంచి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ చంద్రబాబు ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు?.22–ఏ నుంచి 16 లక్షలు ఎకరాలు తీసేశారా? మరోవైపు.. 16 లక్షల ఎకరాలను 22–ఏ జాబితా నుంచి తొలగించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు అసలు వాటిని అందులో పెట్టింది తానేననే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే.. 2024లో అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో 20 లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టింది సాక్షాత్తు చంద్రబాబే. అందులో 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఉన్నాయి. అనేక విచారణల తర్వాత ఆ భూములన్నీ సక్రమమేనని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో.. తప్పు ఒప్పుకోవడం మానేసి, ఇప్పుడు వాటిని తొలగిస్తూ తానే విముక్తి కల్పించానని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక జగన్ హయాంలో ఏకకాలంలో వేల గ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడం లేదు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్వే బృందాలను కుదించి, రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు. పైగా.. ఇప్పుడు ఆటో మ్యుటేషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా అది రీ సర్వేలో భాగంగానే గతంలోనే మొదలైందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. మార్చిలోగా అన్ని భూ సమస్యలకు పరిష్కారమా? ఇదిలా ఉంటే.. మార్చిలోపు రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేస్తానని చంద్రబాబు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. గడచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క భూ సమస్యను పరిష్కరించలేక ప్రతీ సమావేశంలోనూ అధికారులపై నిందలు వేస్తున్నారు. పీజీఆర్ఎస్లో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలు వస్తే 6.20 లక్షలు పరిష్కరించేసినట్లు ప్రకటించుకున్నారు. అందులో ఒక్క శాతం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోయినా అయినట్లు మెసేజ్‌లు పంపారు. అయితే, మార్చికల్లా చంద్రబాబు చూపే పరిష్కారం కూడా ఇలాగే ఉంటుందని జనం ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఇలా ప్రతీనెలా ‘మీ భూమి–మీ హక్కు’ పేరుతో ఓ సభ.. అదే అబద్ధాల ప్రసంగం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. కానీ, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పైగా.. ఒక్కటీ పరిష్కారం కావడంలేదు. అయినా చంద్రబాబు మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్
-
సెప్టెంబర్‌లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం
-
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
-
2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం
-
YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్
-
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.బుధవారం పర్చూర్ నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్‌కు పాదయాత్రలు కొత్త కాదు. 2017లో ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్సీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 341 రోజులపాటు సాగిన ఆ యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆనాడు మొత్తం 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా..పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాలతో జగన్ నేరుగా మమేకమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూనే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. యాత్ర ముగిసే సమయానికి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమైనట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. 2019లో అధికారంలోకి..ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన కొద్ది నెలలకే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ
-
కాకినాడ నిరుద్యోగులపై కేసులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్లో ఇంకా ఏమన్నారంటే... నిరుద్యోగ యువతపై కేసులా? మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో నేరంగా మారిందా?. అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ’ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్ జగన్. ‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.Cases were…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. -
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్’ రాజకీయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? -
ఉమ్మడి జిల్లాకు పనిచేయడం అదృష్టం
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్‌గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్ అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మీరు నిజమైన రైతులేనా! -
చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు


