ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

6 Maoists Killed In Encounter With Security Personnel In Chhattisgarh - Sakshi

డిప్యూటీ కమాండర్‌ సహా ఆరుగురు మావోల మృతి

పట్టుబడిన ఒక మావోయిస్టు

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్‌ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆరీ్మ(పీఎల్‌జీఏ) ప్లాటూన్‌–10 డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి. సుందర్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్‌పీఎఫ్‌ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్‌జీ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.  

హోరాహోరీగా కాల్పులు
కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్‌ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్‌–10 డిప్యూటీ కమాండర్‌ పూనెం             నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్‌తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్‌ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top