IPL 2024: గుజరాత్‌ కొత్త కెప్టెన్‌ ఎవరనుకుంటున్నారు..?

Who May Be Gujarat Titans New Captain For IPL 2024 Season, After Hardik Traded To Mumbai - Sakshi

2024 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ట్రేడింగ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌కు వలస వెళ్లాడు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ కొత్త కెప్టెన్‌ ఎవరనే అంశంపై క్రికెట్‌ అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గుజరాత్‌ నయా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అని కొందరంటుంటే, మరికొందరేమో కేన్‌ విలియమ్సన్‌ పేరును సూచిస్తున్నారు. డేవిడ్‌ మిల్లర్‌, మొహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి.

ఇన్ని ఆప్షన్స్‌ మధ్య టైటాన్స్‌ యాజమాన్యం కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్‌ గిల్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే కేన్‌ విలియమ్సన్‌ లాంటి విజయవంతమైన సారధిని జట్టులో ఉంచుకుని టైటాన్స్‌ యాజమాన్యం గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెబుతుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

వీరిద్దరిని కాదని షమీ లేదా రషీద్‌ ఖాన్‌కు పగ్గాలు అప్పచెబుతారా అంటే పలు సున్నితమైన అంశాలు అడ్డురావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు, విశ్లేషకులు ఎన్ని అనుకున్నా టైటాన్స్‌ యాజమాన్యానికి కెప్టెన్సీ అంశంపై పూర్తి క్లారిటీ ఉండవచ్చు. వారి నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. గుజరాత్‌ కొత్త కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం కామెంట్‌ ద్వారా తెలపండి.  

కాగా, 2024 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ (నిలుపుకోవడం), రిలీజ్‌ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్‌ 26) ముగిసిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాయి. దుబాయ్‌ వేదికగా ఈ ఏడాది డిసెంబర్‌ 19న జరిగే వేలం తర్వాత అన్ని ఫ్రాంచైజీలకు తుది రూపం వస్తుంది.

ప్రస్తుతానికి గుజరాత్‌ ఫ్రాంచైజీ పరిస్థితి ఇలా ఉంది..

ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2).

రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

యశ్‌ దయాల్‌
కేఎస్‌ భరత్‌
శివమ్‌ మావి
ఉర్విల్‌ పటేల్‌
ప్రదీప్‌ సాంగ్వాన్‌
ఓడియన్‌ స్మిత్‌
అల్జరీ జోసఫ్‌
దసున్‌ షనక

నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..

డేవిడ్‌ మిల్లర్‌
శుభ్‌మన్‌ గిల్‌
మాథ్యూ వేడ్‌
వృద్ధిమాన్‌ సాహా
కేన్‌ విలియమ్సన్‌
అభినవ్‌ మనోహర్‌
సాయి సుదర్శన్‌
దర్శన్‌ నల్కండే
విజయ్‌ శంకర్‌
జయంత్‌ యాదవ్‌
రాహుల్‌ తెవాటియా
మొహమ్మద్‌ షమీ
నూర్‌ అహ్మద్‌
సాయికిషోర్‌
రషీద్‌ ఖాన్‌
జాషువ లిటిల్‌
మోహిత్‌ శర్మ  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top