నాలుగో రోజూ లాభాలు

Markets extend winning run to 4th day as auto, IT shares  - Sakshi

ఐటీ, ఆటో షేర్లకు డిమాండ్‌

22,000 పైకి నిఫ్టీ 

సెన్సెక్స్‌ లాభం 376 పాయింట్లు

ముంబై: ఐటీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్‌ సూచీలు నాలుగో రోజూ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు సెంటిమెంట్‌ను మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్‌ 376 పాయింట్లు లాభపడి 72,427 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 22 వేల స్థాయిపై 22,041 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి.

భారత వాణిజ్య లోటు 9 నెలల కనిష్టానికి దిగిరావడంతో క్యాపిటల్‌ గూడ్స్, మెటల్, పారిశ్రామిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇటీవల ర్యాలీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 72,218 వద్ద కనిష్టాన్ని, 72,545 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,969 – 22,069 శ్రేణిలో ట్రేడైంది. బీఎస్‌ఈలో స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.68%, 0.78 % చొప్పున రాణించాయి.  

► ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ లిస్టింగ్‌ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.1,258)తో పోలిస్తే 1% డిస్కౌంట్‌తో రూ.1245 వద్ద లిస్టయ్యింది. 9.22 % నష్టపోయి రూ.1142 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.50% క్షీణించి రూ.1149 వద్ద ముగిసింది.
► వరుస పతనాల నుంచి పేటీఎం షేరు కోలు కుంది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈలో 5% ఎగసి రూ. 341.50 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top