తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌ : ఈ బాలీవుడ్‌ నటిని గుర్తు పట్టారా?

Bollywood Actress became IPS officer cracked UPSC exam in first attempt - Sakshi

డాక్టర్‌  కాబోయి యాక్టర్‌  అయిన చాలామంది నటులను చూశాం. అలాగే అటునటులుగా, ఇటు డాక్టర్లుగా కొనసాగిన వారి గురించీ విన్నాం. కానీ యాక్టర్‌ నుంచి పోలీసు అధికారి కావడం గురించి విన్నారా? 2010 బ్యాచ్‌కి చెందిన  ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను పరిచయం చేసుకుందాం.. రండి..! 

ఆకర్షణీయమైన ఎంటర్‌ టైన్‌మెంట్‌ రంగంనుంచి  ఐపీఎస్ అధికారిగా మారింది  ప్రముఖ బాలీవుడ్ నటి   సిమల ప్రసాద్‌. సంకల్పం, పట్టుదల ఉంటే చాలా నిరూపించారు. ఐఏఎస్‌ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కుమార్తె సిమల ప్రసాద్‌. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్‌లో నటిగా అడుగు పెట్టిన తర్వాత కూడా తన మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు.  (రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!)

భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌ చదువు,  ఆ  తరువాత కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు చూడలేదు. నటనపై ఆసక్తితో  “అలిఫ్”, “నక్కష్” మూవీల్లో అవకాశాలను దక్కించుకున్నారు.  ఈ క్రమంలో  “అలీఫ్” సినిమాలో షమ్మీ పాత్రకు గాను  విమర్శకులు ప్రశంసలు దక్కాయి.  అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను  కొనసాగిస్తూనే  భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ  చేశారామె. 

(గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!)

తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. అంతేకాదు తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్‌ లేకుండానే  పరీక్షలో విజయం సాధించి ఐపిఎస్ అధికారిణి  కావడం విశేషం. 

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top