సన్‌ రైజర్స్‌ విజయోత్సాహం: దటీజ్‌ కావ్య మారన్‌, వైరల్‌ వీడియో

IPL2024 Kavya Maran happy moments SRH record breaking victory against MI - Sakshi

పురుషులకే సొంతమనుకున్న క్రికెట్‌లో మహిళలు  తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్‌ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్‌ జట్టు ఓనర్‌గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా  ఇప్పటికే స్పెటల్‌ ఎట్రాక్షన్‌. తాజాగా కావ్య మారన్‌ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు.  ఈ సక్సెస్‌ కిడ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌  చేస్తోంది.

ఐపీఎల్‌ 2024లో బాగంగా బుధవారం హైదరాబాద్‌  ఉప్పల్‌ స్టూడియంలో జరిగిన మ్యాచ్‌  క్రికెట్‌ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది.  ముంబై ఇండియన్స్‌- సన్‌రైజర్స్ హైదరాబాద్  మధ్య  హోరీ హోరీగా సాగిన ఈ పోటీ ఆద్యంతం అభిమానులను అలరించింది. తొలి పది ఓవర్లలోనే 100 పరుగులు,  మొత్తం మ్యాచ్లో పరుగుల వరద, రికార్డులు వర్షం కురిసింది.

ముఖ్యంగా ఎంఐపై  జట్టు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్  యజమాని కావ్య మారన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆకర్షణీయమైన ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌లో ఉత్సాహంగా గెంతులు వేసింది.  తన జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో  చక్కర్లు కొడుతున్నాయి. 

నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్  ఐపీఎల్ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సౌజన్యంతో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం లభించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ సీఈవో  ఈ ప్రపంచంలోనే ఇంతకుమించిన ఆనందం లేదన్నట్టుగా ఉద్వేగానికి లోనైంది. ముఖ్యంగా హెన్రిచ్  క్లాసెన్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె ఆనందం చూసి తీరాల్సిందే. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఏడు సిక్సర్లతో  80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేనా  64 పరుగులతో ముంబై విజయాన్నివ్వడం ఖాయం అనుకుంటున్న తరుణంలో  తిలక్ ఔటవ్వడంతో సన్‌రైజర్స్ అభిమానులే కాదు కావ్య కూడా ఊపిరి పీల్చుకుంది.  తిలక్ మైదానాన్ని వీడుతుంటే ఆమె దండం పెట్టడం వైరల్‌గా మారింది. 

అద్భుతమైన బ్యాటింగ్‌తో SRH టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో31 పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఐపీఎల్‌ 2013లో పూణే వారియర్స్‌పై ముంబై ఇండియన్స్‌ 263/5  రికార్డును బద్దలు కొట్టింది.SRH కెప్టెన్ కమ్మిన్స్ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

👉: సన్‌రైజర్స్‌ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top