కేరళ సీఎం విజయన్ కూతురిపై ఈడీ కేసు

Ed Filed Case Under Pmla Against Kerala Cm Pinarayi Vijayan  Daughter Veena Vijayan - Sakshi

న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశాయి.   

వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.   

రూ.1.72 కోట్ల చెల్లింపులు
కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి, వాణి విజయన్‌ సంస్థ ఎక్సాలాజిక్‌ సొల్యూషన్‌ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017- 2018 మధ్య కాలంలో సీఎంఆర్‌ఎల్‌.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపింది.  

ఐటీ అధికారుల సోదాలతో వెలుగులోకి 
అయితే ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు (Interim Board) సీఎంఆర్‌ఎల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదావీలకు సంబంధించిన పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా  ఎస్‌ఎఫ్‌ఐఓ వాణి విజయన్‌ కంపెనీ ఎక్సాలాజిక్‌ సొల్యూషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విచారణకు వ్యతికేకంగా ఎక్సాలాజిక్‌ సొల్యూషన్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం ఎక్సాలాజిక్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. తాజాగా ఎస్‌ఎఫ్‌ఐఓ ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది.   

ఆరోపణలు అవాస్తవం
ఇదే అంశంపై ఈ ఏడాది జనవరి అసెంబ్లీ సమావేశాల్లో కేరళ సీఎం పనిరయి విజయన్‌ స్పందించారు. తన భార్య పదవీ విరమణ నిధులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top