Lok sabha elections 2024: 88 స్థానాలకు నేడు నోటిఫికేషన్‌

Lok sabha elections 2024: Nominations for Phase 2 of Lok Sabha polls to begin on 28 march 2024 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్‌ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం  గురువారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

జమ్మూకశీ్మర్‌ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 5న జరుగనుంది. జమ్మూ కశ్మీర్‌లో మాత్రం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 6న జరుగుతుంది. రెండో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశీ్మర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top