ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను.. టీడీపీకి కొడాలి నాని సవాల్‌

Kodali Nani Challenge To TDp In House Patta distribution Gudivada - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్‌ విసిరారు. అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గుడివాడలో కనీసం ఒక్క ఎకరా కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు.

ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు,  ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన  చరిత్ర సీఎం జగన్‌ది అని పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి, పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు

‘సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది. సీఎం జగన్ ది. జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డు. స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని తెలిపారు.
చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్‌

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top