రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. భీమవరంలో ఆయన్ను ఆదివారం సమైక్యాంధ్ర పరిరక్షణ విద్యార్థి ఐకాసా సభ్యులు అడ్డుకున్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 1 లోగా విభజన ఉపసంహరణ ప్రకటన వెలువడకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తానన్నారు. మరుసటి రోజు గవర్నర్‌ను కలిసి మంత్రి పదవిని వదులు కుంటానన్నారు. ఇప్పటికే పదవులకు రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ప్రకటన వస్తుందని, అప్పటి వరకూ వేచి చూడాలని గట్టిగా చెబుతున్నారని విశ్వరూప్ అన్నారు.