మూడు కెమెరాలతో ఎల్జీ జీ5 వచ్చేసింది...
డబుల్ కెమెరాల స్మార్ట్ ఫోన్లకు బైబై చెబుతూ ఎల్ జీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ తో మార్కెట్లో అడుగు పెట్టింది. మొత్తం మూడు కెమెరాలతో ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ ఈ ఫ్లాగ్ షిప్ ను బుధవారం ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్7, ఐఫోన్ 6ఎస్ లకు పోటీగా ప్రత్యేకమైన ఫీచర్లతో ఎల్ జీ జీ5 ఫ్లాగ్ షిప్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.52,990గా కంపెనీ నిర్ణయించింది. హెచ్ టీసీ 10, గెలాక్సీ ఎస్7లకు సమానమైన ధరతో దీన్ని ఆవిష్కరించడంతో, భారత్ లో కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ లిస్టులో ఈ ఫోన్ కూడా చేరింది. మోడ్యులర్ డిజైన్ తో ఈ ఫోన్ రూపొందించడం దీని ప్రత్యేకత. ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనుంది.
ఎల్ జీ జీ5 ప్రత్యేకతలు...
5.3 అంగుళాల క్వాడ్ హెచ్ డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
4జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
మైక్రోఎస్ డీ తో 2టీబీ వరకు మెమరీ విస్తరణ
రెండు(16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ ) వెనుక కెమెరాలు
8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
2800 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ సపోర్టు, బరువు 159 గ్రాములు
సిల్వర్, టైటాన్, పింక్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం