అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచకపర్వం | Assistant Professor Molests Student in Quthbullapur | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచకపర్వం

Published Wed, Dec 25 2019 9:37 AM | Last Updated on Wed, Dec 25 2019 12:01 PM

Assistant Professor Molests Student in Quthbullapur - Sakshi

సాక్షి, కుత్బుల్లాపూర్‌: నగర శివారులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్‌ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కరీంనగర్‌లో ఉన్న తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement