ఉద్యమ సాహిత్య బాటసారి | tribute to writer aluru bhujangarao | Sakshi
Sakshi News home page

ఉద్యమ సాహిత్య బాటసారి

Published Sat, Jun 20 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

ఉద్యమ సాహిత్య బాటసారి

ఉద్యమ సాహిత్య బాటసారి

చెన్నపట్నం నుంచి బతుకుదారిలో 1937న ‘ఆంధ్రా ప్యారిస్’గా పేరొందిన తెనాలిలో కాలుపెట్టిన తమిళ యువకు డు నటరాజన్... శారద అనే కలం పేరు తో సాహిత్యబాటసారిగా తెలుగు సమా జంలో దాదాపు 18 ఏళ్లపాటు జీవించా డు. ఆ బతుకు రహదారిలో శారదకు తార సపడిన మిత్రుడే ఆలూరి భుజంగరావు.

శారద బతికేదారుల వెంట బాటసారిలా తిరిగితే, బతుకుతెరువుకు లోటులేని స్థితి లో ఉద్యమదారుల వెంట తానే కాదు.. తన కుటుంబా న్నంతా వెంటబెట్టుకుని తిరిగినవారు భుజంగరావు. వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోగల అవకాశాలనే కాదు.. సొంత ఆస్తులను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యారు. శారద వంటి తొలినాటి మిత్రుల సాం గత్యం అనంతరం భుజంగరావుపై స్థిరమైన ముద్ర వేసింది నక్సల్బరీ రాజకీయాలే. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలంటూ నక్సల్బరీ ఇచ్చిన పిలుపును జీవితానికి అన్వయించుకున్న కొద్దిమంది బుద్ధిజీవుల్లో ఆయన ఒకరు.

ఉద్యమ ఆచరణతో ఏమాత్రం సంబంధం లేని సమాజంలో నిలబడి చూస్తే ఆయన ఆదర్శం, ఆశయ జీవితం మొత్తంగా ఒక పలవరింతగా అనిపించవచ్చు. కానీ హిందీ నుంచి తెలుగులోకి అనువాదాలు చేసే ఒక మామూలు హోటల్ కూలీ, ఒక బతకలేని బడిపంతు లు సమాజాన్ని జ్వరపీడనానికి గురిచేశారంటే నమ్మగ లమా? కానీ ఇది నిజం. శక్తివంతమైన పాట, సమ్మో హనశీలమైన నాటకం, ఉపన్యాస కళ చేయగలిగిన పనిని భుజంగరావు అనువాద రచనలు చేశాయి. యశ్ పాల్ సింహావలోకనంకి భుజంగరావు చేసిన తెలుగు అనువాదం చదివి ఒక తరమంతా పోరోటోన్ముఖమ యింది.

క్రమంగా సాహిత్య, అనువాద, పత్రికావ సరాలు తీర్చడంలో భాగంగా విస్తరిస్తున్న ఉద్యమంతో పాటు తానూ కొనసాగారు. ఈ నేపథ్యంలో సహచరి లలిత సహా కుటుంబమంతా ఆయన వెంట కరిగిపో యింది. హిందీనుంచి ప్రసిద్ధ అనువాదాలకు అద నంగా ఆయన రాసిన ‘గమనాగమనం’, ‘గమ్యం దిశగా గమనం’ రచనలు... ‘కొండవా గు’, ‘ప్రజలు అజేయులు’, ‘నైనా’, ‘అమరత్వం’, ‘ఎరుపు’ వంటి నవలలు విప్లవోద్యమాచరణకు వెల లేని జ్ఞాపికల య్యాయి. భుజంగరావు జీవితం నక్స ల్బరీ సంకల్పంతో సార్థకమైంది.

ఆలూరి భుజంగరావు సుప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి, రచయిత రాహుల్ సాంకృత్యాయన్, యశ్‌పాల్ రచనల అనువాదకుడిగా తెలుగు సాహిత్య లోకానికి చిరపరి చితులే. భారతీయ విప్లవోద్యమంపై చెరగని విశ్వాసం, విప్లవ సాహిత్యంపై చెదరని అంకిత భావం కలిగిన ఆయన జాతీయ విప్లవకారుడు యశ్ పాల్ రచించిన ‘సింహావలోకనం’ని తెలుగులోకి అను వదించారు. ఆ పుస్తకం తెలుగు సమాజంలో ఒక తరం విప్లవకారులపై విశేష ప్రభావం చూపింది. అలాగే రాహుల్ సాంకృత్యాయన్ ప్రత్యేక రచనలను హిందీ నుంచి అనువదించడానికి విశేష కృషి సల్పారు. రాహు ల్ సుప్రసిద్ధ గ్రంథం ‘దర్శన్ దిగ్దర్శన్’ గ్రంథాన్ని గతంలోనే అనువదించిన ఆయన 2003లో ‘వైజ్ఞానిక భౌతికవాదం’ గ్రంథంలో మతాల సారాంశం దాకా అనువాదం చేశారు.

మెదడుకు సంబంధించిన అనారో గ్యంతో మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేకపోయారు. ఏడేళ్ల తర్వాత తన సలహా మేరకు ఆయన కుమార్తె కవిని ఆలూరి మిగతా భాగాన్ని అనువదించారు. ఇది ఆయన ఆఖరి అనువాద గ్రంథం. ఆయన కన్నుమూ శాక 2015 జనవరిలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ (విశాలాంధ్ర) ఈ గ్రంథాన్ని ప్రచురించారు. ప్రాచీన భారతీయ, గ్రీకు దార్శనికులు ప్రతిపాదించిన పలు విషయాలను ఈ గ్రంథం విశదపరచింది. సామాన్యు లకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథంలో గతి తర్కాన్ని ప్రకటించారు రాహుల్‌జీ. వ్యవస్థ మార్పును కోరే ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయ వలసి ఉంది.

(నేడు ఆలూరి భుజంగరావు రెండవ వర్ధంతి)
కవిని ఆలూరి సహకారంతో రివేరా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement