ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్పై కాల్పులు | US singer and 'The Voice' star Christina Grimmie dies after being shot following concert in Orlando | Sakshi
Sakshi News home page

ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్పై కాల్పులు

Published Sat, Jun 11 2016 1:08 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్పై కాల్పులు - Sakshi

ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్పై కాల్పులు

ఆర్లాండో: అమెరికాలోని ఆర్లాండోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్, 'ది వాయిస్' స్టార్ క్రిస్టినా గ్రిమ్మీపై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గ్రిమ్మీ అక్కడికక్కడే మృతి చెందారని ఆర్లాండో పోలీసులు వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆర్లాండోలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆమె బ్యాండ్ 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక  ప్రేక్షకులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

సుమారు 60 మంది వరకు పాల్గొన్న కార్యక్రమంలో గ్రిమ్మీని లక్ష్యంగా చేసుకొనే కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి గ్రిమ్మీకి తెలిసిన వ్యక్తేనా లేక సోషల్ మీడియాలో ఆమెను అభిమానించే క్రేజీ ఫాలోవరా అనే విషయం దృవీకరించాల్సి ఉందని ఆర్లాండో పోలీసు అధికారి వాండా మిగ్లియో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement