సీనియర్ కమెడియన్ కన్నుమూత
ముంబై: బాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు రజాక్ ఖాన్ కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆయన మరణించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రజాక్ ఖాన్ 90పైగా సినిమాల్లో ఆయన నటించారు. బాద్ షా' సినిమాలో పోషించిన మాణిక్చంద్ పాత్రతో ఆయన పాపులర్ అయ్యారు. హలో బ్రదర్, హంగామా, హేరాపేరి, రూప్ కీ రాణి చోరన్ కా రాజా, హసీనా, రాజా హిందూస్తానీ తదితర సినిమాల్లో నటించారు. సాబ్ టీవీ సిరీస్ 'ఆర్కే లక్ష్మణ్ కి దునియా'లోనూ ఆయన కనిపించారు.