హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో | Aishwarya Rai lying on Ranbir Kapoor's lap: stunning photo | Sakshi
Sakshi News home page

హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో

Published Sat, Oct 15 2016 12:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

ప్రస్తుతం సోషల్ మీడియలో సంచలనం రేపుతోన్న ఫొటోలోనూ ఐశ్వర్యరాయ్ రెచ్చిపోయి..

అదిరిపోయే రొమాంటిక్ సీన్లలో అద్భుతమైన కెమెస్ట్రీని పండించిన ఐశ్వర్యరాయ్, రణ్ బీర్ సింగ్ లు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా అంచనాలను అమాంతం పెంచేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాగ్స్, ట్రైలర్స్ లో ఐశ్వర్య రెచ్చిపోయి నటించగా.. ప్రస్తుతం సోషల్ మీడియలో సంచలనం రేపుతోన్న ఫొటోలోనూ అందేస్థాయిలో కనిపించారు. ఐశ్వర్య, రణ్ బీర్ లపై ఇటీవల ఓ ఫొటో షూట్ కు చెందిందంటూ ప్రచారంలో ఉన్న ఫొటో ఇది. ఇవి 'ఏ దిల్ హై ముష్కిల్'కు సంబంధించినవా లేక మరేదైనా యాడ్ కు సంబంధించినవా అనేది తెలియాల్సిఉంది. (చూడండి: రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..)

ఇదిలా ఉంటే, పాకిస్థానీ నటులున్న సినిమాలు విడుదల చేయరాదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఐశ్వర్య, రణ్ బీర్, అనుష్క శర్మలతోపాటు పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' అక్టోబర్ 28న విడుదల కావల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement