తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విధివిధానాలు కొనసాగుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్ సోమవారం వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విధివిధానాలు కొనసాగుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్ సోమవారం వెల్లడించారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోదు అని భక్తచరణ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విదేశాల నుంచి రాగానే హోంశాఖ తయారు చేసిన కేబినేట్ నోట్ కు రాజకీయ అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటామని ఆదివారం హోంశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఆందోళనలు సోమవారానికి 41 రోజుకు చేరుకుంది.