శశికళకు మరో ఎదురుదెబ్బ
చెన్నై: సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను మరో ఎదురుదెబ్బ తగ్గిలింది. అన్నాడీఎంకే ఎంపీలు బి. సెంగొట్టువన్, జె. జెయసింగ్, ఆర్పీ మారుతరాజా ‘చిన్నమ్మ’ ను కాదని పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వం నివాసానికి చేరుకుని ఆయనతో చేతులు కలిపారు. ఎంపీలు టీఆర్ సుందరం, అశోక్ కుమార్, సత్యభామ, వనరోజా ఇప్పటికే సెల్వం పక్షానా చేరారు. దీంతో సెల్వంకు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య ఏడుకు చేరింది.
రాష్ట్ర మంత్రి పాండియరాజన్, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ కూడా శశికళను వ్యతిరేకించి పన్నీర్ సెల్వంకు అండగా నిలిచారు. శశికళ శిబిరం నుంచి ఐదుగురు మంత్రులు మాయం కావడం కలకలం రేపింది. వీరంతా ఈరోజు పన్నీర్ సెల్వంను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక నాయకుడు పొన్నయ్యన్ కూడా సెల్వంకు అండగా నిలిచారు.
సంబంధిత కథనాలు చదవండి
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
నేడు శశికళ భారీ స్కెచ్?
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!
చెన్నైలో హై టెన్షన్
ఇక పోరాటమే!