junior ntr
-
దేవర విలన్ కు ఎన్టీఆర్ పరామర్శ
-
‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’
గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పనిగట్టుకుని కొందరు ఆ చిత్రంపై పోస్టులు చేయడం గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు. ఏమైంది?.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. .. నేను కూడా ఆ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. అరచేతిని అడ్డుపెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం’అని అంబటి అన్నారు. -
జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు.. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.‘‘పెద్ద ఎన్టీఆర్‌ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్‌ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసేయాలంటూ బాలకృష్ణ హుకుం
-
‘వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. -
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. 👉: తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు) -
జూ.ఎన్టీఆర్ X టీడీపీ
సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన రెండు సభలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు. అధికారమిస్తే ఆరుపథకాలు తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన విజన్ కారణంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు. తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్చార్జి శావల దేవదత్ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. -
చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తిరువూరులో... కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ -
చంద్రబాబు సభలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. దెబ్బ అదుర్స్! -
నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం
చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై సినీ పరిశ్రమలో TDP నేతలు మినహా మిగతా ఎవరూ స్పందించకపోవడం పట్ల బావయ్య బాలకృష్ణకు చాలా కోపంగా ఉంది. ఎవరినో అనుకుని ఏం లాభం తమ కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీయార్ కూడా బాబు అరెస్ట్ ను ఖండించకపోవడం బాలయ్యక జీర్ణం కావడం లేదు. లోప కుత కుత లాడిపోతున్నారు. కానీ పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ ఐ డోంట్ కేర్ అంటున్నారు. బాబును అరెస్ట్ చేస్తే మొత్తం సినీ పరిశ్రమలోని కళాకారులంతా షూటింగులు ఆపేసి వీధుల్లోకి వచ్చేసి జనజీవనాన్ని స్తంభింపజేస్తారని బాలయ్య అనుకున్నట్లు ఉంది. అలా జరక్క పోవడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రూ.371 కోట్లు లూటీ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చేసి ఎనభైలలో ఎన్టీయార్ ను గద్దె దింపినపుడు ప్రజాఉద్యమం చేసిన తరహాలో ఉద్యమాలు చేస్తారని టీడీపీ నేతలు అనుకున్నారు. అయితే జనం మాట దేవుడెరుగు టీడీపీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే బట్టబయలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. ✍️ఇక సామాన్య ప్రజలతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అయితే బాబు అరెస్ట్ ప్రకంపనలు సృష్టించేస్తుందని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు అనుకున్నారు. నందమూరి బాలయ్య కూడా అదే ఆశించారు. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా సినీ పరిశ్రమలో టిడిపి కార్యకర్తలయిన ముగ్గురు నలుగురు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. బాబు అరెస్ట్ ను ఖండించలేదు. టీడీపీ నేత అశ్వనీ దత్, మురళీ మోహన్, టీడీపీ హయాంలో ప్రభుత్వ పదవి అనుభవించిన కె.రాఘవేంద్రరావు, నిర్మాత కె.ఎస్.రామారావు తప్ప ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోలేదు. ✍️ఇక నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ వరుస షాక్ లు నందమూరి బాలకృష్ణకు బాగా కోపాన్ని తెప్పించినట్లున్నాయి. అందుకే సినీ పరిశ్రమలో ఎవ్వరూ బాబు అరెస్ట్ కు స్పందించకపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య. అదే విధంగా జూనియర్ ఎన్టీయార్ పేరు ప్రస్తావిస్తూ ఆయన స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అనేశారు. ✍️టాలీవుడ్ లో ఎవరూ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఎందుకు ఖండించలేదు? అని నందమూరి నారా కుటుంబ సభ్యులు చిర్రు బుర్రు లాడుతున్నారు. అయితే చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే మేమెందుకు స్పందించాలి? అని మెజారిటీ సినీ ప్రముఖులు చాలా క్లారిటీతో ప్రశ్నిస్తున్నారు. ✍️ఇక చంద్రబాబు జైలుకెళ్లిన మర్నాడే టిడిపి ఆఫీసులో చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారు బాలయ్య. అది చంద్రబాబు నాయుడికి తెలిసి కోప్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత బాలయ్యకు అచ్చెంనాయుడి కుర్చీ పక్కన కుర్చీ వేయించారట. అంటే నీ స్థానం అక్కడే తప్ప అధ్యక్ష స్థానంలో కాదని చెప్పకనే చెప్పారని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ✍️చంద్రబాబు జైల్లో ఉంటే నారా లోకేష్ 20రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇపుడాయన సిఐడీ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏపీలో పార్టీ వ్యవహారాల్లో తలదూరిస్తే పార్టీకి నష్టం అనుకున్నారో ఏమో కానీ ఆయన్ను తెలంగాణా వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్య మాట్లాడుతూ తెలంగాణాలో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోరాడతామని అన్నారు. బహుశా తెలంగాణాలో పార్టీ ఎలాగూ లేదు కాబట్టి బాలయ్య ఎలాంటి వేషాలు వేసినా పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కాబట్టి బాలయ్యను తెలంగాణా చూసుకోమని చంద్రబాబే సంకేతాలు ఇచ్చారేమో అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన బావయ్య అరెస్ట్ అయితే ఎవరూ పట్టించుకోరా? అని అగ్గిమీద ఫైర్ అయిపోతున్నారు. :::CNS యాజులు సీనియర్ జర్నలిస్టు -
పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. పాదయాత్ర చేసుకుంటూ పోతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం.. జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, తమకు బలం ఉందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా ఏమిటో తేలిపోయింది. అభ్యర్థులు లేకపోవడం, ఉన్న వారి మధ్య గొడవలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సినిమా డైలాగ్‌లను వల్లె వేస్తున్నా టీడీపీలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులే లేకపోవడమే అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉన్న నేతలు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. లోకేశ్‌నైతే అసలు పట్టించుకోవడమే లేదు. ఆ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు యువగళం యాత్రను బహిష్కరించడమే ఇందుకు ఉదాహరణ. లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదవండి: బేల ‘గళం’.. అభ్యర్థులు లేక హైవే రూటు! -
డామిట్!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్‌గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి? ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు. చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్‌ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది. -
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన జూ.ఎన్టీఆర్
-
దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గతవారం దుబాయ్ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!) అయితే ఫ్యామిలీతో దుబాయ్ వేకేషన్ వెళ్లిన తారక్ శనివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో తన కుమారులతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచాపరం. ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!) -
ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్ ట్రిప్ వీడియో వైరల్
-
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ నివాళి
-
చంద్రబాబు మాకొద్దు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కనిపించని బాబు ఫొటో
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయపడ్డా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి అయితే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విగ్రహావిష్కరణకు వచ్చిన ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు. -
శతజయంతి వేడుకలకు దూరం అసలు కారణం..!
-
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం
-
ఎన్టీఆర్,సమంతను తిడుతు ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్లు
-
కొరటాల,ఎన్టీఆర్ దెబ్బ అదుర్స్ సెన్సేషన్ సృషిటిస్తున NTR30
-
చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను ఈడ్చిపడేయాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆసాంతం ఊకదంపుడు ఉపన్యాసాలు.. పరనిందగానే సాగింది. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో సైతం జనం లేక వెలవెలబోయింది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ కృష్ణా జిల్లాలో సాగింది. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ సైతం వెలవెలబోయింది. చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్ -
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
జూ.ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం..కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం.
సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్‌కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి. -
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
'జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?'
సాక్షి, విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించాలన్నారు. మార్పు రాష్ట్రంలో కాదు టీడీపీలో రావాలని చురకలు అంటించారు. 'ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు ఘోరంగా అవమానించలేదా? హరికృష్ణపై తాగుబోతు, తిరుగుబోతు అని ఈనాడులో ప్రచారం చేయించాడు. హరికృష్ణకి పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకుని వదిలేశారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని రమ్మంటున్నాడు’’ అని కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడం ఏంటి?. టీడీపీలో మహానాడు పెట్టి ఎన్టీఆర్, లోకేష్‌లకు వారసుడు కోసం ఓటింగ్ పెట్టండి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది.' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చదవండి: చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..!
2002లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా మీకు గుర్తుందా? రాయమసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నునుగు మీసాలతో చిన్నపిల్లాడిలా కనిపించాడు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ కీర్తి చావ్లా మీకు గుర్తుందా? ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన కీర్తి అ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఆది సినిమాతో ఆరంగేట్రం చేసిన కీర్తి చావ్లా మన్మధుడు, కాశీ, శ్రావణమాసం, సాధ్యం, బ్రోకర్ చిత్రాల్లో కనిపించింది. కీర్తి చావ్లా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. కీర్తి చావ్లాకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చివరి సారిగా 2016లో నమిత లీడ్ రోల్లో నటించిన ఇలమై ఊంజల్ అనే తమిళ్ సినిమా తర్వాత కీర్తి చావ్లా మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. -
చాలా మంది అలా చేసేవారు.. కానీ నేను మాత్రం: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్
సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం లేకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది భామ. అంతకుముందే బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది సమీర. ఆ తర్వాత చిరంజీవి సరసన జై చిరంజీవ, ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమీర పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది సమీరా రెడ్డి. అప్పట్లో చిత్ర పరిశ్రమలో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గ్లామర్ కోసం శస్త్రచికిత్సలు చేసుకునేవారని తెలిపింది. కానీ నేను మాత్రం అలాంటి వాటికి జోలికి వెళ్లలేదని అన్నారు. నేను ఇండస్ట్రీలో ప్రవేశించాక దాదాపు 10 ఏళ్ల క్రితం ముక్కుతో పాటు చెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారని పేర్కొంది. తనను కూడా చేయించుకోవాలని సలహా ఇచ్చారని.. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఇదంతా వారి వ్యక్తిగత నిర్ణయమని.. వారికి ఇష్టంతోనే చేసేవారని వెల్లడించింది. సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది భామ. -
ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి క్లారిటీ ఇదే..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్‌లోనూ విడుదలైంది. జపాన్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇటీవల చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. 'నా చిత్రాలకు మా నాన్నే రచయిత. మేమిద్దరం ఆర్ఆర్ఆర్-2 పై చర్చించాం. కథ రూపొందించే పనిలో మా నాన్న నిమగ్నమై ఉన్నారు.' అని అన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
న్యూ లుక్‌లో యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా ఆ క్రేజే వేరు. తాజాగా న్యూ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు యంగ్ టైగర్. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ కొత్త స్టైల్ అంతా తదుపరి చిత్రం 'ఎన్టీఆర్30' కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేస్తూ..' ఏ న్యూ డే.. ఏ న్యూ వైబ్' అలీమ్హకీంతో మరోసారి అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్‌తో పాటు హెయిల్ స్టైలిస్ట్ అలీమ్ హకీం కూడా వెనకవైపు ఉన్నారు. దీనిపై జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్30 సినిమాలో లుక్ ఇదేనంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) కాగా.. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన పోస్టర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించి మేకర్స్ ట్వీట్ చేశారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ తెగ వైరలవుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ కలిసి చర్చిస్తున్నట్లుగా ఫోటోలు ట్విటర్లో షేర్ చేశారు. ఈ నెలలోనే సినిమాను లాంచ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్' తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో నటించలేదు. తాజాగా ఆయన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. కొరటాల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ సైతం మార్చుకున్నారు. అయితే గతంలో కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వైరలైంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్లే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు టాక్. #NTR30 pre production in full swing 💥 Director #KoratalaSiva, @RathnaveluDop and @sabucyril putting in their best to create a spectacular cinematic experience ❤️🔥@tarak9999 @anirudhofficial @sreekar_prasad @NANDAMURIKALYAN @YuvasudhaArts pic.twitter.com/ysBe45WEiK — NTR Arts (@NTRArtsOfficial) November 6, 2022 -
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం జపాన్‌లోనూ విడుదలైంది. అక్టోబర్‌లో జపనీస్ భాషలోనూ రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమా ప్రమోషన్లు కూడా భారీస్థాయిలో నిర్వహించారు. తాజాగా ఈ చిత్ర జపాన్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్లలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబాలతో కలిసి సందడి చేశారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోలు వైరల్) అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మొదటి వారంలో జపాన్ కరెన్సీలో 73 మిలియన్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం జపాన్‌లోని 44 నగరాల్లోని 209 స్క్రీన్లతో పాటు 31 ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేశారు. ఇది జపాన్‌లో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక థియేటర్లలో ప్రదర్శించిన సినిమాగా నిలిచింది. ఓ నివేదిక ప్రకారం విదేశీ చిత్రాల్లో జపనీస్ బాక్సాఫీస్ వద్ద ది బాడ్ గైస్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్, డొమినియన్ వంటి చిత్రాల కంటే ఆర్ఆర్ఆర్ ముందు వరుసలో నిలిచింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన భారతీయ చిత్రంగా నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు.. జపాన్ బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్లతో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో నిలిచింది. 300 మిలియన్ల కలెక్షన్లతో రాజమౌళి చిత్రం బాహుబలి- 2 రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ మూవీ 3 ఇడియట్స్ 170 మిలియన్ల వసూళ్లతో మూడవ స్థానంలో సాధించింది. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిదిపోయే గుడ్ న్యూస్. తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన ఈ పోస్టర్లో జూనియర్ సముద్రంలో నిలబడి ఆయుధాలు పట్టుకుని కనిపించగా అది నెట్టింట్లో వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్) ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 12న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
Viral Video: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి వెక్కివెక్కి ఏడ్చిన మహిళా అభిమాని
జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఎన్టీఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్లగా జపానీయులు ఎన్టీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ అడగ్గా.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను చూసిన ఓ మహిళ అభిమాని భావోద్వేగానికి గురైంది. జూనియర్‌ను చూసిన ఆనందంలో చిన్న పిల్లలా బోరున ఏడ్చేసింది. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. (చదవండి:జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్) దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీస్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. అందుకోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్లు సైతం ప్రారంభించింది. ఇందుకోసం కుటుంబ సమేతంగా జపాన్‌కు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి. ఇవాళ జపాన్ రాజధాని టోక్యోలో 'ఆర్ఆర్ఆర్' ప్రీమియం షో ప్రదర్శించనున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బాబుకు నిరసన సెగ
-
చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం..
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న జెండాలు ప్రదర్శించారు. అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలోకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రలోనూ మా నాయకుడిని ఎందుకు విమర్శిస్తున్నారనే నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ అభిమానుల వ్యవహారం చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పూర్తి అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. -
జపాన్ వెళ్లనున్న రాజమౌళి.. వారిద్దరూ కూడా.. ఎందుకంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ సంపాందించింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజమౌళి వెల్లడించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం జపాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: RRR Box Office Collections: ఆగని 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?) గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా జపనీస్ ప్రజలను ఆర్ఆర్ఆర్ అలరించబోతోంది. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్లో కూడా రూ. 300 కోట్లను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది. ㊗️みなさま、お待たせしましたーーっ‼️‼️ ━━✨映画『RRR』来日決定✨━━ ラージャマウリ監督 NTR Jr. &ラーム・チャラン 🌊🌊━━━━━━━━━━━━🔥🔥 ラージャマウリ監督は4年ぶり、 主演2人にとっては初の来日が決定致しました🎉 監督からのメッセージも到着🙌 pic.twitter.com/J2MaKXVh45 — 映画『RRR』公式 (@RRR_twinmovie) September 28, 2022 -
పవన్, ఎన్టీఆర్ లకు సమానమైన గౌరవం ఇస్తాం - విష్ణువర్థన్ రెడ్డి
-
అమిత్ షాతో భేటీకానున్న జానియర్ ఎన్టీఆర్
-
ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్
‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్) ఒక ఐడియాగా చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్‌మెంట్ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్. మా తాతగారు(ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గోల్డెన్ టెంపుల్లో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. ప్రత్యేక పూజలు
Rajamouli Ram Charan Jr Ntr Visit Amritsar Golden Temple For RRR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. మార్చి 20న గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా సోమవారం (మార్చి 21) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది ఈ చిత్రబృందం. అమృత్‌సర్‌లో పర్యటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడి గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కోరుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం ప్రకటించింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. The tRRRio visited the divine Golden Temple in Amritsar to seek blessings for our #RRRMovie#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/LfZcbHnOLM — RRR Movie (@RRRMovie) March 21, 2022 -
ఆర్ఆర్ఆర్ రిలీజ్.. వసూళ్ల జాతరకు టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డెరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓ జీవో విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం.. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు లక్కీ ఛాన్స్.. రూ.1కే సినిమా టికెట్!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు. ఇంకా, మరో విషయం ఏమిటంటే మీరు పేటీఎమ్ జెనీకి పంపిన ₹1ని కూడా తిరిగి మీ ఖాతాలో రీఫండ్ చేయనున్నట్లు తెలిపింది. అంటే, ఉచితంగా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Send ₹1 to 9711656565 and get a chance to win free #RRRMovie vouchers!🎬🍿#FreePaytmRRRMovieVouchers@ssrajamouli @ajaydevgn @aliaa08 @tarak9999 @OliviaMorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/HxiuEZMgcu — Paytm (@Paytm) March 16, 2022 (చదవండి: దిగొస్తున్న బంగారం ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే?) -
'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ సాంగ్.. పూర్తి పాట వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. సినిమా విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను పెంచేసింది జక్కన్న టీం. ఇందులో భాగంగానే ఇటీవల 'ఎత్తర జెండా' అనే సెలబ్రేషన్ యాంథమ్ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది. పూర్తి పాటను సోమవారం (మార్చి 14) విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సాంగ్ రిలీజ్‌ను తొలుత వాయిదా వేస్తున్నట్లు చెప్పి సోమవారమే విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ 'పరాయి పాలనపై.. కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరుల్ని తలచుకుంటూ' అంటూ జక్కన్న చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. తర్వాత 'నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా' అంటూ తారక్, చెర్రీ, ఆలియా కలర్ఫుల్గా కనిపించారు. ఈ మూవీ నుంచి ఇదివరకూ రిలీజైన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, టీజర్, ట్రైలర్, పాటలు రికార్డ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సాంగ్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రౌద్రం.. రణం.. రుధిరం' సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. -
అమెరికాలో తారక్ అభిమాని అరాచకం.. అన్ని టికెట్స్ కొనేశాడు
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ ఇప్పుడు థియేరట్స్‌లో సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో భాగంగా మోస్ట్ అవైటెడ్ సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్ విడుదల అవుతుండగా, మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఒకే నెలలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఊహించినట్లుగానే గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా అమెరికా డల్లాస్ నగరంలోని గెలాక్సీ థియేటర్లోఎన్టీఆర్ అభిమాని ఒకరు ఏకంగా 75టికెట్లను కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. USA🇺🇸 premier show tickets in Dallas Galaxy spaces theatre 12:30 show on 24th Ntr fan bought 75 tickets#ManOfMassesNTR #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/GWCY7Rw8EJ — Filmy Tweets (@praveen_5654) March 5, 2022 -
'ఆర్ఆర్ఆర్' దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల
RRR Movie Will Showing In London Biggest Imax Screen: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను భారీగానే ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా బ్రిటన్‌లో సుమారు వెయ్యి థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన 'ఒడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్'లోనూ విడుదల కానుంది. అయితే లండన్‌లో ఇదే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. లండన్ వాటర్లూలో ఈ ఐమ్యాక్స్‌ను నిర్మించారు. థియేటర్ పరిసరాల్లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ థియేటర్లో సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ హాలీవుడ్ పెద్ద చిత్రాలైన 'బ్యాట్ మ్యాన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి సినిమాలను ప్రదర్శించారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడంతో ఈ గౌరవం దక్కించున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కింది. -
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. రోలింగ్ లేనప్పుడు స్క్రోలింగ్
RRR Movie Latest Photo NTR Ram Charan Released By Makers: ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ పెంచేసింది జక్కన్న టీం. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా ఆర్ఆర్ఆర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ లేనప్పుడు రామ్-భీమ్‌లు ఇద్దరూ ఎలా ఉంటారనేది చెబుతూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో పచ్చటి గడ్డిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మ్యాట్లు వేసుకుని పడుకుని ఉన్నారు. అంతేకాకుండా వారు తమ మొబైల్స్ చేతిలో పట్టుకొని ఏదో స్క్రోలింగ్ చేస్తూ దర్శనిమిచ్చారు. ఈ పోస్టర్‌కు 'కెమెరా రోలింగ్లో లేనప్పుడు స్క్రోలింగ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే సినిమాల్లో నవరసాలు పండించే ఈ హీరోలు షూటింగ్ లేనప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ కాగా ఫ్యాన్స్ వారి హీరోలను చూస్తూ మురిసిపోతున్నారు. Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/Rh9xYKhVGL — RRR Movie (@RRRMovie) March 1, 2022 -
ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్ మేనియా.. ఖాతాలో మరో రికార్డు
Natu Natu Song From RRR Movie Got 200 Million Views ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం అనేక వాయిదాలు పడటంతో సినీ ప్రేక్షక లోకం ఎంతో నిరాశకు గురైంది. ఆ నిరాశ నుంచి సాంత్వన కలిగించేందుకు సినిమా టీజర్స్, మేకింగ్ వీడియోస్, పోస్టర్లతో అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నాటు నాటు' సాంగ్. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్లో కవర్ సాంగ్స్, రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఇక యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వీక్షణలు దక్కించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. 'నాటు నాటు' సాంగ్ అన్ని భాషల్లోనూ కలుపుకొని ఏకంగా 200 మిలియన్ క్లబ్‌లోకి చేరుకుంది. ఈ వ్యూస్‌తో తన మేనియా ఇంక తగ్గలేదని దుమ్ములేపుతోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ వెండితెరపై ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి. -
అరబిక్ కుత్తు ఎన్టీఆర్ వర్షన్
-
ఆర్ఆర్ఆర్ నుంచి సూపర్ అప్డేట్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
RRR Movie Racing Towards New Poster Goes Viral: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)'. అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అనేక వాయిదాల తర్వాత ఇదే ఫైనల్ రిలీజ్ డేట్ అంటూ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే వాయిదాలతో అభిమానులు, ప్రేక్షకులను నిరాశ పరిచిన జక్కన్న టీమ్, పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, సాంగ్స్, ట్రైలర్స్‌తో ఉత్సాహపరిచింది. ఫిబ్రవరి 3న ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో గుఱ్ఱపు స్వారీ చేస్తూ రామరాజు, బుల్లెట్‌పై కొమురం భీమ్ ఆకట్టుకోనున్నారు. అలాగే 'ఇంకో 50 రోజుల్లో ఈ చిత్రం రానుందని' క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వారిని చూసి మురిసిపోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Racing towards Cinemas... Coming in 50 Days!! #RRRMovie 🔥🌊 March 25th, we will see you. 🐎 🏍 🤘🏻#RRRonMarch25th pic.twitter.com/aumWWnCh45 — RRR Movie (@RRRMovie) February 3, 2022 -
ఇదే ఫైనల్ రిలీజ్ డేట్.. క్లారిటీ ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
RRR Movie Officially Final Release Date Out By Makers: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగకుండా కరోనా, ఒమిక్రాన్, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏదో ఒక తేదినే రిలీజ్ చేస్తారని అది మార్చి 18 అని ఒక రూమర్, కాదు కాదు ఏప్రిల్ 28నే అని మరొక పుకారు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పుకార్లన్నింటికి చెక్ పెడుతూ తాజాగా ఏ తేదిన విడుదల చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా ఆ రెండు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. ప్రకటించిన రిలీజ్ డేట్స్ జూలై 30. 2020 జనవరి 8 2021 అక్టోబర్ 13 2021 జనవరి 7, 2022 #RRRonMarch25th, 2022... FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS — RRR Movie (@RRRMovie) January 31, 2022 -
గుడ్ న్యూస్.. ఎట్టి పరిస్థితుల్లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అప్పుడే!
దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్డౌన్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్‌పోన్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల తేది ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకులను ఇంకా వీడలేదు. ఎప్పుడూ రిలీజ్ చేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. (చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ) ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రేక్షకులకు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్ 18న విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఇన్నేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడినట్లు ఉంది. ఈ ప్రకటనతో ఆర్ఆర్ఆర్ సుమారు 14 భాషల్లో విడుదలకానుంది. ఈ ఒక్క న్యూస్‌తో అభిమానులు పండుగ చేసుకోనున్నారు. (చదవండి: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ స్పూఫ్.. అదరగొట్టేశారుగా..!) Breaking : #RRRMovie on March 18th 2022 or April 28th 2022. @tarak9999 @AlwaysRamCharan @ssrajamoulipic.twitter.com/clTcqxAVfD — Suresh Kondi (@SureshKondi_) January 21, 2022 -
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్.. సంక్రాంతి కానుకగా
RRR Movie Special Poster On The Sankranti Eve: దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్డౌన్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్‌పోన్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సమర్ధించారు. సినిమా విడుదల సంగతి దర్శకనిర్మాతలు చూసుకుంటారు అని తేల్చి చెప్పాడు. సినిమా వాయిదా పడింది అని అసహనంతో ఉన్న ప్రేక్షకులను మెప్పించేందుకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజాలపై కర్ర పట్టుకుని, రామ్ చరణ్ స్టైలిష్‌గా నడుస్తూ కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కొమురం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు. Wishing everyone a very #HappyPongal, #Bhogi, #Lohri, #MakarSankranti ❤️🔥🔥 See you soon in cinemas. pic.twitter.com/Gwt1INGbir — DVV Entertainment (@DVVMovies) January 14, 2022 Pose like our RAM & BHEEM with your dearest ones :) #RRRMovie pic.twitter.com/N2Hw7RVkMp — RRR Movie (@RRRMovie) January 14, 2022 ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ -
ఫ్రిజ్‌లో ఈగలు దాచిన రాజమౌళి.. ఎందుకంటే..?
Interesting Facts About Eega Movie Directed By Rajamouli: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్ఆర్ఆర్) విడుదల వాయిదా పడింది. దీంతో సినీ ప్రేక్షక జనం తీవ్ర నిరాశకు గురైంది. అయితే మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పెద్ద హీరోలను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రాజమౌళి ఏ సినిమా చేసిన ఎంతో పరిశోధన చేసి, తాను అనుకున్నట్లుగా ఔట్పుట్ వచ్చేవరకు నిద్రపోడు. తాను సంతృప్తి చెందేవరకూ సన్నివేశాన్ని చెక్కుతూనే ఉంటాడు. అందుకే అతన్ని 'జక్కన్న' అని ముద్దుగా పిలుస్తారు. తాను అనుకున్నట్లుగా సన్నివేశం వస్తుందో లేదో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటానని రాజమౌళి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తీసే ప్రతి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తారు. అందుకు ఎంత పరిశోధన అయినా చేస్తారు అని చెప్పేందుకు 'ఈగ' సినిమానే ఒక ఉదాహరణ. ఈగ సినిమా కోసం రాజమౌళి ఏం చేశారో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇటీవల బయటపెట్టారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ఈగ' సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఈగ చిత్రం కోసం పనిచేసేప్పుడు రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్‌లో ఉంచాడట. ఆ ఫ్రిజ్‌లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని తారక్ చెప్పినట్లు సమాచారం. ఈగల సుప్తావస్థ (హైబర్నేషన్) గురించి తెలుసుకునేందుకే జక్కన్న అలా చేశారని రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో వాటి మనుగడ ఎలా ఉంటుందో పరిశీలించేవారని చరణ్ పేర్కొన్నాడట. చిత్రబృందంతో కలిసి ఈగల ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించేవారట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక సినిమా కోసం జక్కన్న ఎంత కష్టపడతారో అని. 2012లో విడుదలైన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత, నేచురల్ స్టార్ నాని జంటగా నటించారు. కన్నడ హీరో సుదీప్ విలనిజం ఎంతగానో ఆకట్టుకోగా 'ఈగ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2 నేషనల్, 3 సైమా, 5 సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను వరించింది. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ -
ఎన్టీఆర్ ఈవెంట్‌కు 10 ప్రత్యేక రైళ్లు.. అభిమానుల కోసం
Junior NTR Reveals 10 Special Trains For Andhrawala Audio Launch: జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థియేటర్ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు తారక్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్‌కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అందుకు ఎన్టీఆర్ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్‌కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. 'నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.' అని తారక్ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. About #Andhrawala Audio launch 🔥#NTR @RRRMovie @tarak9999 pic.twitter.com/x9sYS7dIZK — NTR ARMY (@NTRARMYOFFICIAL) January 2, 2022 ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియోలు
RRR Movie Making Videos: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమురమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రం (RRR Movie) సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై బడ్జెట్‌కు మించి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలాయి. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర ప్రమోషన్స్‌ను కూడా భారీగా చెస్తున్నారు. ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు. అంతకుముందు అలియా భట్ సీతగా మారిన మేకింగ్ వీడియోను షేర్ చేసిన చిత్ర బృందం తాజాగా కొమురమ్ భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల చిత్రీకరణను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. కొమురం భీం, అల్లూరి సీతరామరాజులు చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోలను తారక్, చెర్రీ తమ ఇన్‌స్టా గ్రామ్ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. అల్లూరి సీతరామరాజు మేకింగ్ వీడియోలో చెర్రీ ఓ వైపు నవ్వుతూ మరోవైపు పాత్రలోకి పరాకయ ప్రవేశం చేశాడు. క్యాజువల్ జీన్స్, షర్ట్‌తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వెంటనే పోలీసు యూనిఫామ్ వేసుకొని నిలుచున్న విజువల్స్‌తో ప్రారంభమవుతుంది వీడియో. అందులో చరణ్ రిహాసల్స్, సీన్లో ఎమోషన్స్, బాక్సింగ్ ప్రాక్టీస్ అబ్బురపరిచాయి. అలియా భట్‌తో సీన్ గురించి నవ్వకుంటూ చర్చించుకోవడం కూడా వీడియోలో మనం చూడవచ్చు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) ఇక కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియోలో ఎన్టీఆర్‌ను భీంగా తయారు చేయడం చూపించారు. యాక్షన్ సన్నివేశాలు, బైక్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం కనులవిందుగా ఉంది వీడియో. అక్కడక్కడ తారక్ నవ్వడం, మైక్‌లో ఏవో సూచనలు ఇవ్వడం, డైలాగ్‌లు ప్రాక్టీస్ చేయడం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. వీడియో చివర్లో ఎన్టీఆర్ గర్జిస్తూ అడవిలో పరిగెత్తడం చూపించారు. ఈ వీడియోలను 'వీ ఆర్ ఇన్ ది మేకింగ్' అంటూ ఎండ్ చేశారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
ఆర్ఆర్ఆర్ అభిమానులకు చేదువార్త.. అక్కడ నో టెలికాస్ట్
RRR Movie Pre Release Event Has No Telecast In Mumbai: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషనల్లో ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 భాషల్లో తెరకెక్కుతున్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం' (RRR). పాటలు, వీడియోలతో ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు చిత్రబృందం చేస్తున్న ప్రమోషన్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రబృందం హైదరాబాద్, ముంబై, బెంగళూరులో సందడి చేసి ఆకట్టుకున్నారు. అలాగే ఈ నెల 19న ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం (డిసెంబర్ 19) ముంబైలో జరిగే ఈ 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయట్లేదని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌ను మరో రోజు టెలికాస్ట్ చేస్తామని తెలిపింది. అలాగే మరికొన్ని నగరాల్లో #RoarofRRR ఈవెంట్స్ ఉన్నాయని, వాటిని లైవ్ ఇస్తామని పేర్కొంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ట్విటర్లో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదీ చదవండి: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్ NO LIVE TELECAST Of #RoarOfRRRInMumbai Event today. It will be telecasted on a later date. We have a few more #RoarofRRR events in other cities which will be telecasted live. Details soon. https://t.co/Z8xMQ4VPD2 — RRR Movie (@RRRMovie) December 19, 2021 💥💥 #RoarOfRRRInMumbai pic.twitter.com/YfdAVSUiHV — RRR Movie (@RRRMovie) December 19, 2021 ఇదీ చదవండి: పెళ్లిళ్లు అయ్యాయి.. అయినా అదేపని.. తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్, గట్టిగా గిల్లిన ఎన్టీఆర్ -
అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్
Alia Bhatt To Seetha Making Video From RRR Movie: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'పై సినిమాకు బడ్జెట్‌కు (సుమారు రూ. 450 కోట్లు) మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. రేపు (డిసెంబర్ 9) ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లు, వీడియోలు, పాటలు విడుదల చేశారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోను రీలీజ్ చేసింది చిత్రబృందం. ఈ తాజా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. అందులో అలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్‌ను చూపించారు. వీడియోలోని బిహైండ్ సీన్స్‌లో అలియా భట్ క్యూట్ క్యూట్‌గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. అలియాది.. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు, భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
అదిరిపోయిన ఎన్టీఆర్, రామ్ పోస్టర్లు.. అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' రికార్డు !
Ntr And Ram Charan New Look Posters Out From RRR: దర్శకధీరుడు రాజమౌళి చిత్రం అంటేనే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే. ఆ సినిమాకు అంచనాలు అంతకుమించి అన్నట్లుగా ఉంటాయి. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'పై సినిమాకు బడ్జెట్‌కు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. ఈ నెల 9న ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. ఈ సినిమా విడుదల కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క అమెరికాలోనే వెయ్యికిపైగా మల్టీ ప్లెక్సులు బ్లాక్ చేశారని సమాచారం. అగ్రరాజ్యంలో ఓ భారతీయ సినిమా ఈ స్థాయిలో ఎప్పుడూ విడుదల కాలేదని, ఆ రకంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం రికార్డు క్రియేట్ చేయబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అభిమానుల్లో జోష్ నిపండానికి సోమవారం (డిసెంబర్ 6) రెండు సర్ప్రైజ్లు ఉందించింది చిత్రబృందం. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఇద్దరు హీరోలు చాలా పవర్ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ సినిమా సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. That’s BHEEM for you… #RRRTrailerin3Days #RRRMovie #RRRTrailer pic.twitter.com/bs9DI5gR5F — Jr NTR (@tarak9999) December 6, 2021 That’s RAM for you… #RRRTrailer #RRRMovie #RRRTrailerin3Days pic.twitter.com/qlf1OsG8wc — Ram Charan (@AlwaysRamCharan) December 6, 2021 ఇదీ చదవండి: చెల్లెలితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన రామ్‌చరణ్ -
ఇంత బతుకూ బతికి...
అవును మరి! ఎక్కడి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ! ఎక్కడి నందమూరి తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్!! తొమ్మిదినెలల కాలంలోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఊచకోత కోసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జననేత ఎన్టీరామారావు. 1994లో రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరేలా టీడీపీ ఎమ్మెల్యేలను ఉసగొల్పి ఆయన సీఎం పోస్టుకే ఎసరు పెట్టిన చంద్రబాబు చరిత్ర జగద్విదితమే. ఆ తర్వాత చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలు 2004 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించారు. వైఎస్సార్ అయిదేళ్ల పాలనతో సంక్షేమం, అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరిగెత్తించడంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతామేమో అనే భయం పట్టుకుంది బాబుకు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హిట్ మీద హిట్ తో అగ్రహీరోగా రాణిస్తున్నారు. చంద్రబాబు మరోసారి గతాన్ని పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ కరిష్మాను పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. తన తండ్రికి, తమ కుటుంబానికి చంద్రబాబు చేసిన నమ్మకద్రోహాన్ని విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిపెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీకి అధికారం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గ్లామరస్ హీరో ముందు తన కొడుకు లోకేశ్ నాయుడు వెలవెలబోతాడని అతి స్వల్పకాలంలోనే గ్రహించిన చంద్రబాబు క్రమక్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టసాగారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పొత్తు ప్రభావంతో వైసిపి కన్నా కేవలం ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అమరావతి అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి రాజధాని నిర్మాణం పేరుతో రాబోయే పాతికేళ్లు తనదే అధికారం అనే ఊహా లోకంలో తేలియాడారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు కనీవినీ ఎరుగని విధంగా కుదేలైంది తెలుగుదేశం. అటు లోకేశ్‌ను చూస్తే మూడేళ్లు మంత్రిగా పనిచేసి, తన కలల రాజధాని ప్రాంతంలోనే ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవమే. (చదవండి: అబద్ధాలకు చెక్... అభివృద్ధితోనే!) చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని కిందిస్థాయి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబుముందే జూనియర్ రావాలి అంటూ నినాదాలు చెయ్యడమే కాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చెయ్యడంతో ఆయన కంగుతిన్నారు. ఆ తరువాత కుప్పం మునిసిపాలిటీల్లో టీడీపీ జెండా ఊడిపోయింది. బాబును 7 సార్లు అసెంబ్లీకి పంపిన కుప్పంలో మొదటిసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది. చంద్రబాబుకు డెబ్బై ఏళ్ళు దాటాయి. లోకేష్ ఏమాత్రం ప్రతిభ చూపకపోవడంతో పార్టీలో చాలామందికి ఆయన నాయకత్వంమీద నమ్మకం పోయింది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు చేబట్టాలని స్వరాలు వినిపిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్యలాంటి సీనియర్ నాయకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ గొంతులు విప్పుతున్నారు. ఇదే చంద్రబాబుకు కంటగింపుగా ఉంది. (చదవండి: తెలుగుదేశం విలాపం) తన సతీమణికి అవమానం జరిగిందన్న చంద్రబాబు రోదన ఆయన మనసెరిగినవారికి కలిసొచ్చింది. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫలితమే జూనియర్ మీద విమర్శలు ప్రారంభించారు. మేనత్తకు అవమానం జరిగితే జూనియర్లో ఫైర్ ఎక్కడ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాతగారు పెట్టిన పార్టీ పట్ల జూనియర్‌కు బాధ్యత లేదా అంటూ నిలదీస్తున్నారు! ఆ ఘట్టం ముగిసిన మూడు రోజులదాకా లోకేశ్ అసలు పెదవి విప్పిన దాఖాలానే లేదు. లోకేశ్లోనే లేని ఫైర్ జూనియర్‌కు ఎలా వస్తుందో అర్థం కాదు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చెరపట్టడంలో చంద్రబాబుకు సహకరించిన ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు.. ఆ తరువాత చంద్రబాబు పాల్పడిన నమ్మకద్రోహానికి ఎలా బలయ్యారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు సహకరించిన తన తండ్రి హరికృష్ణకు, ఆ తర్వాత తన మామ చంద్రబాబు స్వయానా పొడిచిన వెన్నుపోటును జూనియర్ మర్చిపోవడం సాధ్యమేనా? - ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వాయిదా.. ఎందుకో తెలుసా ?
RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (డిసెంబర్ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్ చరణ్ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చదవండి: ఐటెం సాంగ్ అడిగిన నెటిజన్‌కు 'ఆర్ఆర్ఆర్' టీం రిప్లై.. -
Kuppam: టీడీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కుప్పం(చిత్తూరు జిల్లా): ‘మీ రాజకీయాల్లోకి మా అభిమాన నేతను లాగి నానా యాగీ చేయడం బాగోలేదు. ఎన్టీఆర్ మాటల్లో పస లేదు.. దమ్ము లేదు.. కోపం లేదంటూ మీ ఇష్టాను సారం నోరు పారేసుకుంటారా.. ఇలా మీ అంతకు మీరే మాట్లాడుతున్నారా.. లేక ఇలా మాట్లాడాలని మీకు ఎవరైనా చెప్పారా.. ఇంకో సారిలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాబులకే బాబు మా తారక్ బాబు’ అని టీడీపీ నేతలపై సీనీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు చిత్తూరు జిల్లా కుప్పంలో నిప్పులు చెరిగారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై వారు ఆదివారం నిరసన తెలిపారు. చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశిస్తూ దుర్భాషలాడారంటూ.. బాబు, టీడీపీ నేతలు నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్లో పసలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు జూనియర్ ఎన్టీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఎం సినిమా థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్ఆర్ఎం థియేటర్ ఎదుట జూనియర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివకుమార్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడిపై కుట్ర పూరితంగా చేస్తున్న విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. -
'టక్కరి దొంగ' మహేశ్ బాబు గెలుచుకుంది ఎంత ?
Mahesh Babu In Evaru Meelo Koteeshwarudu: యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'ఎవరు మీలో కోటీశ్వరులు (EMK)'. ఈ రియాలిటీ షోలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. తనదైన జోష్‌తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్‌కు తోడుగా ప్రొగ్రామ్‌కు తన రాకతో మరింత గ్లామర్ యాడ్ చేశారు మహేశ్. ఇటీవల రిలీజైన ప్రొమో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. ఆ ప్రోమోలు ఎన్టీఆర్, మహేశ్ ఇద్దరూ కలిసి ఎలా సందడి చేశారో చూశాం. ఇక మహేశ్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రామ్‌లో 'టక్కరి దొంగ' ఎంత గెలుచుకున్నాడో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి, నవ్వులు పంచి, తనదైనా డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం కేటాయించి తన మంచి మనసు చాటుకున్నాడట ఈ శ్రీమంతుడు. అయితే మహేశ్ బాబు ఎంత గెలుచుకున్నాడు ? ఎన్టీఆర్ అడిగినా ప్రశ్నలేంటి ? వాటికి 'పోకిరి' ఎలా సమాధానమిచ్చాడు ? అనేది ఈ గ్లామరస్ ఎపిసోడ్ ప్రసారం అయితే గానీ చెప్పలేం. ఇదీ చదవండి: మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్‌గా.. -
RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది..
Janani Song Out From RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన 'నాటు నాటు', 'దోస్తీ' పాటలు సినీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతాగానో అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి జనని సాంగ్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. దేశభక్తిని చాటేవిధంగా రూపొందింది ఈ పాట. 'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారని పేర్కొన్నారు. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అని అన్నారు. -
మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్‌గా.. 'ఎవరు మీలో కోటీశ్వరులు'
Mahesh Babu In Evaru Meelo Koteeshwarulu: బిగ్‌బాస్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాలిటీ షోలలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఒకటి. దీనికి హోస్ట్‌గా చేస్తున్న యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఎన్టీఆర్‌కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. తాజాగా వీరిద్దరూ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేశారు. మహేశ్ బాబు అతిథిగా వచ్చిన ఈ పోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోను షో మేకర్స్ విడుదల చేశారు. ఈ ఇద్దరు హీరోలను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రోమోలో 'వెల్కమ్ మహేశ్ అన్న' అంటూ తారక్ ఇన్వైట్ చేస్తే.. 'అదిరిపోయింది' అని సూపర్ స్టార్ బదులిచ్చాడు. తర్వాత 'నా రాజా..' అంటూ ఎన్టీఆర్ తనదైన మ్యానరిజంతో జోష్ నింపారు. 'కరెక్ట్ ఆన్సర్‌నే అటూ, ఇటూ ఎందుకు తిప్పుతారు' అని మహేశ్ అడిగినా ప్రశ్నకు 'సరదా కోసం' అని ఎన్టీఆర్ సమాధానమిస్తారు. దీంతో కంప్యూటర్ను 'దీనికన్నా గురువు గారే బెటర్‌గా ఉన్నారు' అన్న మహేశ్ మాటకు షోలో నవ్వులు విరబూసాయి. ఇంతకుముందు ఈ షోకు రామ్ చరణ్, సమంత వచ్చి సందడి చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత అలరించనున్నారు. -
నాటు నాటు.. సోషల్ మీడియాలో అదిరిపోయేట్టు..
Natu Natu Song Gose Viral With Covers And Editing Songs: జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆర్ఆర్ఆర్'. ఇంతకుముందు ఈ సినిమాలోని అల్లూరి సీతరామరాజు, కుమురం భీం పాత్రలపై విడుదల చేసిన టీజర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల వచ్చిన నాటు 'నాటు పాట' ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి అందించిన మ్యూజిక్కు ఎన్టీఆర్, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో ఏ విధంగా డ్యాన్స్ చేశారో చూసి ఆనందించాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న యువత కవర్ సాంగ్స్‌తో, ఎడిటర్స్ తమ అభిమాన హీరోల ఓల్డ్ సాంగ్స్‌తో 'నాటు' పాటను రీక్రియేట్ చేశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకసారి ఆ కవర్ సాంగ్స్, ఎడిటింగ్ పాటలు ఎలా ఉన్నాయో చూద్దామా. Jai NTR ✊🏻✊🏻✊🏻@tarak9999 #21MagicalYearsOfNTR #NaatuNaatu pic.twitter.com/WInHjqR2h9 — Vivace Ajay (@TarakSpace) November 16, 2021 #NaatuNaatu tRRRance 🥳@RRRMovie @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/Xipu0DkNRs — . 🌊 (@venkydaya09) November 9, 2021 Two Types of NTR fans#NaatuNaatu @tarak9999 pic.twitter.com/UzGILQX394 — . 🌊 (@venkydaya09) November 9, 2021 Here is the Mutual Edit of @tarak9999 & @AlwaysRamCharan from #NaatuNaatu Song Hope You all Like it @RRRMovie pic.twitter.com/oRzKx44G0m — UPENDRA TARAK ISM 🌊 💥 (@upendratarak99) November 9, 2021 The baap of all versions 🔥#NaatuNaatu pic.twitter.com/0eveAyFvvP — Troll Mega comedians (@TMCOffl) November 9, 2021 #NaatuNaatu Hope u like ❤️#SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/ibvXjh2MFZ — Uday 🔔 (@theMBfan) November 10, 2021 Nepali Dance for #NachoNacho #NaatuNaatu Reaching bigger and wider @RRRMovie pic.twitter.com/pGgZ0IJRly — aRRRavind (@KadapaKing9999) November 14, 2021 This is What We Want. We Want this Beats @RRRMovie 🥁🕺#NaatuNaatu #RRRSecondSinglePromo @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/lYIahwOf6A — RRRamcharan ERA™ (@RamCharanERA) November 9, 2021 Going with the Trend 😅🌊🔥🥁 Response mamuluga ledu ga 🔥#NaatuNaatu @RRRMovie pic.twitter.com/8DiynGIjpC — V.Lithin 👑🏇 (@NTRLithin7) November 9, 2021 Ground Level Reach of #RRRMassAnthem Across Nation👌👌#NaatuNaatu #NaachoNaacho @RRRMovie @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/yAOkZ7Wndf — RRRamcharan ERA™ (@RamCharanERA) November 13, 2021 #NaatuNaatu mania 💃@RRRMovie pic.twitter.com/sQbm3wpldS — Rohini tarak (@rohini4tarak) November 12, 2021 single take lo chesina step adi malli @alluarjun 🙏#NaatuNaatu pic.twitter.com/iq8jphBbXl — StoneR..💥 (@StonerSuryAA) November 11, 2021 Me From Last 1hr🕺🕺🕺@tarak9999 @RRRMovie @AlwaysRamCharan #NaatuNaatu pic.twitter.com/a6WfRHvohb — KICK Tollywood 🌊🔥 (@KickTwood) November 9, 2021 Even Haters got #Naatufied 🥁🕺@tarak9999 @AlwaysRamCharan @RRRMovie #NaatuNaatu pic.twitter.com/yCVoHZ4TqO — KICK Tollywood 🌊🔥 (@KickTwood) November 9, 2021 From Germany #NaatuNaatu Mom & Daughter 👌@RRRMovie pic.twitter.com/VyAeuumOfe — aRRRavind (@KadapaKing9999) November 12, 2021 Trending Now #NaatuNaatu 🔥🌊@RRRMovie 😍 #NaatuNaatuPromo pic.twitter.com/zR4aPQSWcu — Milagro Movies (@MilagroMovies) November 9, 2021 చదవండి: బామ్మ స్టెప్పులకు ఆర్ఆర్ఆర్ టీం ఫిదా చదవండి: నాటు సాంగ్ దెబ్బ...అప్పుడే ఆల్ టైం రికార్డ్ -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేఖ కలకలం
సాక్షి,తిరుపతి: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయవద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సామాజిక మాథ్యమాల్లో లేఖ పోస్ట్ చేశారన్న విషయం పట్టణంలో కలకలం రేపింది. ఎక్కడ చూసినా ఈ లేఖపైనే విస్తృత చర్చలు జరిగాయి. ‘కుప్పం గడ్డపై అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈ రోజు టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా రెండుసార్లు మనపై దాడి చేయించాడు. ఇప్పుడు గాయపడిన ప్రతి జూనియర్ అభిమానికి సమయం వచ్చింది. చదవండి: టీడీపీకి ఓటు వేయనన్నందుకు దళితుడిపై దాడి మన దెబ్బకు లోకేష్ పర్యటించిన అన్ని వార్డుల్లోనూ టీడీపీని ఓడించి మన ప్రతీకారం రుచి చూపిద్దాం. ఎన్టీఆర్ అభిమాని అనేవాడు దెబ్బతినడమే కాదు, తన సమయం వస్తే కోలుకోలేని దెబ్బ కొట్టగలడు. అని చూపిద్దాం.’ అంటూ లేఖలో పేర్కొన్న విషయంపై ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు టీడీపీకి ఓటు వేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేఖ విడుదల చేశారన్న సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో దుమారం రేపింది. పరిస్థితి తమ కొంప ముంచే ప్రమాదం ఉందని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఏ మాథ్యమాల్లో అయితే లేఖ వైరల్ అవుతోందని ప్రచారం జరుగుతోందో అక్కడే అందులోని సమాచారం అవాస్తవమని సమర్థించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేఖ వాస్తవమా.. అవాస్తవమా అనే విషయం పక్కన పెడితే ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. -
చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు యాంకర్స్‌గా మారిన స్టార్ హీరోలు
ఇంత కాలం కేవలం సినిమా హీరోలుగానే ఉన్న మన స్టార్స్ ఈ మధ్య కాలంలో టీవీ చానల్ యాంకర్స్‌గా మారిపోయి తమ సత్తా చూపిస్తున్నారు. టెలివిజన్‌లో కూడా తమ అభిమానులను అలరిస్తూ వారి మనసులు గెలుచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న సినిమా హీరోల వరకు అందరూ ఇప్పుడు హోస్ట్ అవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పైగా సినిమాలకు ఏ స్థాయి రెమ్యునిరేషన్ తీసుకుంటారో అంతే పారితోషికం తీసుకుని యాంకరింగ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే చాలా మంది హీరోలు టీవీ చానల్ హోస్టులు అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా నటరత్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో చేరాడు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్‌స్టాపబుల్ NBK అనే టాక్ షోను బాలకృష్ణ చేయబోతున్నారు. అయితే మరి ఈయన కంటే ముందు హోస్టులుగా మారిన హీరోలెవరో ఓ సారి చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్‌కు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ (స్టార్ మా), మీలో ఎవరు కోటీశ్వరుడు (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 (స్టార్ మా), ఎవరు మీలో కోటీశ్వరులు (జెమినీ)తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. సాయికుమార్ వావ్, మనం (ఈటీవీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు. -
జూనియర్ ఎన్టీఆర్‌కు 9 సెంటిమెంట్ నిజమేనా?
సాధారణంగా మన సినిమా తారలు కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. అందులోనూ స్టార్ హీరోలు ఈ వరుసలో ముందుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కార్లపై ఇంట్రస్ట్ అందరికంటే ఎక్కువగా ఉన్న హీరో చిరంజీవి. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వాళ్ళ కంపౌండ్‌లోకి తెచ్చుకుంటారు మన మెగాస్టార్. ఇక ఈ జనరేషన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ లిస్ట్‌లో ఒకరు. ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్‌లో పదికి పైగా కార్లు ఉండగా.. ఇటీవల అత్యంత విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారును మొన్నటికి మొన్న రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే తారక్ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అదేంటి అన్ని కార్లకి ఒకే నంబర్ అనుకుంటున్నారా? దీనికి సమాధానంగా తన సన్నిహితులు కొందరు తారక్‌కి ఆ నంబర్ అంటే సెంటిమెంట్ అని అంటుంటారు. కానీ నిజానికి ఎన్టీఆర్‌కు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవట. మరెందుకు ఒకే నంబర్‌ను తన అన్ని కార్లకు వాడుతున్నాడనేగా మీ సందేహం..? దానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్‌కు 9 అనే అంకె అంటే ఇష్టమట. అలాగే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కారు నెంబర్ 9999 అనీ.. ఆ తర్వాత తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నంబర్‌ను వాడారని అందుకే తనకు ఆ నంబర్ అంటే ఇష్టమని ఇటీవల ఓ సందర్బంలో ఎన్టీఆర్ చెప్పాడు. అందువల్ల మరో ఆలోచన లేకుండా తన ప్రతి కారుకు అదే నంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు తారక్. తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాని అది సెంటిమెంట్ కాదని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన తన తాత నందమూరి తారక రామారావు, తన తండ్రి హరికృష్ట ఇద్దరూ ఆ నెంబర్ వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. ఇక తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. -
లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jr NTR Comments On Wife Laxmi Pranathi జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో తన పెళ్లి నాటి ముచ్చట్లను తన అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు ఎన్టీఆర్. కంటెస్టెంట్ పెళ్లి చూపులు సమయంలో కనీసం మీరు బాగా మాట్లాడారమ్మా కానీ మా పెళ్లి చూపుల్లో అయితే మా ఆవిడ అసలు మాట్లాడలేదు అంటూ సరదాగా నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూడగానే ఎన్టీఆర్ ఓకే అని చెప్పి వెళ్లిపోయాడట. అయతే లక్ష్మీ ప్రణతి మాత్రం ఎన్టీఆర్‌కు ఎస్ చెప్పలేదు. అలా అని నో చెప్పలేదు. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిని అడిగారట అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక పెళ్లికి నిశ్చితార్థానికి మధ్య దాదాపు 8 నెలల గ్యాప్ వచ్చింది. అయితే ఆ సమయంలో కూడా ఆమె ఎన్టీఆర్‌కు ఎస్ అని చెప్పలేదు. ఇక దీనితో ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం ఎంత కష్టమో అపుడే తనకు అర్ధమైందన్నారు ఎన్టీఆర్. ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు ప్రపంచంలో దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం తనకు ఆ తర్వాత బోధ పడిందంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహాం జరిగి పది సంవత్సరాలు పూర్తైయింది. వీరికి అభయ్‌రామ్, బార్గవ రామ్ ఇద్దరు కుమారులు. కాగ ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. -
మళ్లీ సన్నగా, స్టయిలిష్‌గా కనిపించబోతున్న ఎన్టీఆర్!
Jr NTR: బరువు పెరగడం... తగ్గడం... ఇలా పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మేకోవర్ కావడానికి రెడీ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం కాస్త బరువు పెరిగారు. తర్వాత చేయనున్న చిత్రం కోసం బరువు తగ్గనున్నారని సమాచారం. అయితే రెగ్యులర్‌గా కన్నా కూడా కాస్త సన్నబడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే ఈ మేకోవర్ అని భోగట్టా. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ఉక్రెయిన్ వెళ్లారు. ఆ పాటతో సినిమా పూర్తవుతుందట. దాంతో ఇండియా చేరుకున్న వెంటనే ప్రత్యేక డైట్, స్పెషల్ వర్కవుట్స్‌తో తగ్గే పని మీద ఉంటారని తెలిసింది. కొరటాల దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ స్టయిలిష్‌గా కనిపించారు. తాజా చిత్రంలోనూ అలా స్టయిలిష్‌గా కనిపించనున్నారని టాక్. -
టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా!
సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను ఆదివారం అభిమానులు ఆవిష్కరించారు. ఈ పరిణామం టీడీపీలో కలకలం రేపింది. ఇక్కడ నుంచి జూనియర్ పోటీ చేయాలంటూ పోస్టర్లు, ఫెక్సీలు వెలుస్తుండడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబుకు కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌ను బరిలో దించాలని శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించింది. దీంతో దిక్కుతోచని చంద్రబాబు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి అభిమానులు వినూత్నంగా తమ డిమాండ్‌ను జెండా రూపంలో ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం టీడీపీవి డైవర్షన్ పాలిటిక్స్ -
కుప్పంలో జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
-
RRR Movie: ఫైట్ సీన్‌కి కన్నీళ్లొస్తాయి!
‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని పోరాట సన్నివేశా లను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని అంటున్నారు ఈ చిత్రరచయిత కె.వి.విజయేంద్రప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రవిశేషాల గురించి ఇటీవల ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ను చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. ఫస్ట్ టైమ్ ఫైట్ సీక్వెన్సెస్‌కి ఎమోషన్ అవుతారు ప్రేక్షకులు’’ అన్నారు. -
మహేష్‌బాబు భావోద్వేగం
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హాఠాన్మరణం యావత్ టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న ఆయనతో అనుబంధాన్ని పలువురు సెలబ్రిటీలు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఆయన స్పెషల్ బాండింగ్ కొనసాగించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మహేష్‌బాబు సోషల్ మీడియాలో ఎమోషన్ అయ్యాడు. ‘‘బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్‌మ్యాన్. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు పోస్ట్ చేశాడు. ఇక బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్‌కి గురయ్యానంటూ జూనియర్ ఎన్జీఆర్ ట్వీట్ చేశాడు. పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పసేవలు ఆయన అందించాడని, రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దర్శకులు సంపత్ నంది, మెహర్ రమేష్‌లు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, రైటర్ గోపీ మోహన్, దర్శకనిర్మాత మధురా శ్రీధర్ తదితరులు సోషల్ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Not able to process the sudden demise of BA Raju garu. I've known him since my childhood. We travelled together for many years and I worked with him very closely. pic.twitter.com/N6gbW8DPxv — Mahesh Babu (@urstrulyMahesh) May 21, 2021 The sudden demise of BA Raju Garu has left me in shock. As one of the most senior film journalists & PRO,he has contributed greatly to the Film Industry. I've known him since my earliest days in TFI. It is a huge loss.Praying for strength to his family. Rest in Peace Raju Garu 🙏🏻 pic.twitter.com/B5lytChlqW — Jr NTR (@tarak9999) May 22, 2021 -
కొమురం భీమ్.. నాకో సవాల్!
చేతిలో బల్లెం పట్టుకుని మహోగ్రరూపం దాల్చిన కొమురం భీమ్‌గా ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని జూనియర్ ఎన్టీఆర్ కొత్త పోస్టర్ విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. గురువారం (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని ఎన్టీఆర్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మంచి మనసు ఉన్న తిరుగుబాటుదారుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నందుకు, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నా కొత్త పోస్టర్‌ను మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాత్ర పోషించడం నాకో సవాల్‌లా అనిపిస్తోంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎన్టీఆర్. ‘‘మా భీమ్ది బంగారంలాంటి మనసు. కానీ తిరగబడితే దేనికైనా బలంగా, ధైర్యంగా నిలబడతాడు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. ఇదిలా ఉంటే.. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తున్న వేళ పుట్టినరోజు వేడుకలకు ఇది సమయం కాదని, దేశం కరోనాను జయించిన రోజున అందరం వేడుక చేసుకుందామని, తన బర్త్ డే వేడుకలను నిర్వహించవద్దని ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్‌తో... ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకతంలో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘‘ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా చేస్తారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. -
నారా లోకేష్‌పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ సోషల్ మీడియాలో ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిల్లుస్తుంటారు. రాజకీయ నాయకులైన, సినీ ప్రముఖలపై సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతారు. కాగా ఈసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై ట్విటర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే వైరస్ పట్టిందన్నారు. ఈ వైరస్‌కు విరుగుడిగా జూనీయర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా జూనీయర్ ఎన్టీఆర్ వ్యాక్సిన్‌ను వెంటనే పార్టీకి వేయించాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. లేకపోతే మీ పని అంతే! అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. Telugu Desham party is fatally infected with the dangerous micro organism called @naralokesh virus, and one and only vaccine avilable for its cure is @tarak9999 ..My advise to all TDP cadres ..Get smart and Get vaccinated super fast with @tarak9999 or U WILL DIE — Ram Gopal Varma (@RGVzoomin) April 20, 2021 చదవండి: ఎన్టీఆర్, అఖిల్‌ల వీడియోపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్ -
జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా?
తమకు నచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు ఉంటారు. తమ హీరోలకు సంబందించిన ప్రతి అప్ డేట్స్ గురుంచి అందరికంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ ఏమి చేసినా కూడా అభిమానుల ప్రతి క్షణం అనుసరిస్తూ ఉంటారు. గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు రూ.25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. అలాగే, దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో ఎన్టీఆర్ వేసుకున్న మాస్క్ గురించి ఆరా తీసి మరి అది యుఏ స్పోర్ట్స్ మాస్క్ అని అభిమానులు తెలిపారు. దాని ధర సుమారు రూ.2,340. ఎన్టీఆర్ ధరించిన మాస్క్ బ్రాండ్ కు సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన బ్లేజర్‌పై ఫ్యాన్స్ కన్ను పడింది. జెమిని టీవీలో వచ్చే "ఎవరో మీలో కోటీశ్వరులు" కార్యక్రమం కోసం ప్రోమోలో వేసుకున్న బ్లేజర్ గురుంచి చర్చ జరుగుతుంది. ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మనీష్ మల్హోత్రానే క్యాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో -
మేకప్ మాయ.. కొత్త లుక్‌లో సినీ తారలు
ముఖం మీద ముడతలు కావాలా? ఉందిగా మేకప్. తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కనబడాలా? మేకప్ ఉందిగా. వయసులో ఉన్నవాళ్లు వృద్ధులుగా కనబడాలా? మేకప్‌తో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం కొందరు తారలు వెరైటీగా కనబడే ప్రయత్నంలో ఉన్నారు. మేకప్ సహాయంతో నల్లబడుతున్నారు. ముసలివాళ్లవుతున్నారు. అంతా మేకప్ మాయ. అప్.. అప్.. మేకప్ అంటూ కొత్త లుక్‌లో కనపడబోతున్న తారల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలో కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘అసురన్’కి రీమేక్‌గా రూపొందుతోంది ‘నారప్ప’. ఇందులో రైతు పాత్రలో కనిపించనున్నారు. మామూలు రైతు కాదు.. అన్యాయాన్ని సహించలేని రైతు. కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి, అక్రమార్కులను అంతం చేసే రైతు. ఈ పాత్రలో వెంకీ రఫ్‌గా కనిపిస్తారు. పైగా రైతు అంటే ఎండల్లో కష్టపడక తప్పదు కదా.. దానికి మ్యాచ్ అయ్యేట్లు ఆయన స్కిన్ టోన్‌ని కాస్త డల్ చేశారు. వెంకీ రైతు అయితే అల్లు అర్జున్ లారీ క్లీనర్. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అనే లారీ క్లీనర్‌గా కమిలిపోయిన చర్మంతో కనబడతారు. సరిగ్గా దువ్వని జుట్టు, ట్యాన్ అయిన స్కిన్, ఆయిల్ మరకలతో బట్టలు.. అల్లు అర్జునేనా? అన్నంతగా మారిపోయారు. ఇక బాబాయ్ వెంకటేశ్లానే అబ్బాయ్ రానా కూడా ట్యాన్ అయ్యారు. ఒక్క సినిమా కోసం కాదు.. రెండు సినిమాలకు. ఒకటి ‘అరణ్య’, ఇంకోటి ‘విరాటపర్వం’. 25ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలతో సాగే ఈ సినిమాలో అడవిలో నివసించేవాళ్లు ఎలా ఉంటారో అలా కనబడతారు రానా. అలాగే నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘విరాటపర్వం’లో రానా మాత్రమే కాదు కథానాయిక సాయిపల్లవి, కీలక పాత్రలు చేస్తున్న ప్రియమణి, నందితా దాస్ కూడా డల్ మేకప్‌లోనే కనబడతారు. అందరూ నిజమైన నక్సలైట్లను తలపించేలా మౌల్డ్ అయిపోయారు. ఇప్పటివరకూ మోడ్రన్ గాళ్లా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్ అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ సరసన ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం బిగుతైన జడ, లంగా, ఓణీ, తక్కువ మేకప్‌తో విలేజ్ గాళ్లా మారిపోయారు రకుల్. సవాల్ అనిపించే పాత్రలు వస్తే సై అంటారు నటీనటులు. వీళ్లందరికీ అలాంటి పాత్రలు వచ్చాయి. వెరైటీ క్యారెక్టర్స్‌లో కనిపించాలనే ఆకలితో ఉన్న వీళ్లందరూ లుక్‌ని మార్చుకోవడమే కాదు.. నటనపరంగా కూడా విజృంభిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్‌లో కనిపించనున్న తారలు ఇంకా చాలామందే ఉన్నారు. దర్శకుడితో జోడీ ‘మహానటి’తో తనలో ఉత్తమ నటి ఉందని నిరూపించుకున్నారు కీర్తీ సురేశ్. తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో ఆమె నటన వేరే లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ‘7/జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా మారారు. సెల్వ, కీర్తీ జంటగా తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా ఫస్ట్ పోస్టర్లో సెల్వ, కీర్తిల లుక్ చూసి క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వృద్ధుని గానూ... ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్ చిన్న వయసులోనే మరణించారు. ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్‌కి ఓల్డ్ గెటప్ కూడా పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రోస్థెటిక్ మేకప్ వాడుతున్నారని టాక్. 90 ఏళ్ల వృద్ధునిగా వెరైటీ గెటప్పులు వేయడంలో కమల్‌హాసన్‌కి సాటి ఎవరూ రారంటే అతిశయోక్తి కాదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ ‘భారతీయుడు’ (1996). అందులో యువకుడిగానే కాదు.. వృద్ధునిగానూ కమల్ కనిపించారు. తాజాగా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. ఇందులో 90 ఏళ్ల వృద్ధునిగా కమల్ కనిపిస్తారని తెలిసింది. హెవీ ప్రోస్థెటిక్ మేకప్‌తో కమల్ వృద్ధునిగా కనిపించనున్నారు. ఈ వృద్ధునికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె 85 ఏళ్ల వృద్ధురాలిగా కనబడతారని టాక్. -
చలి చంపుతుంటే...!
‘చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది’... ‘క్షణక్షణం’లో వెంకటేశ్, శ్రీదేవి పాడుకున్న పాట ఇది. ఇప్పుడు ఈ పాటను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోసం మార్చి పాడాలంటే.. ‘చలి చంపుతున్న చమక్కులో హీటరొచ్చింది’ అనాలి. కరోనా వల్ల ఏడు నెలల లాక్డౌన్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఈ టీమ్ ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు. పైగా నైట్ షూట్. అసలే చలికాలం. అందుకే లొకేషన్లో పెద్ద పెద్ద హీటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ‘‘ఇవి లేకుండా (హీటర్లు) చలిగాలి నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అంటూ షాట్ గ్యాప్‌లో చలికి రక్షణగా హీటర్ దగ్గర నిలబడిన వీడియోను చిత్రబృందం పంచుకుంది. కెమెరామేన్ సెంథిల్‌కుమార్, రాజమౌళి.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీటర్ దగ్గరికొచ్చిన ఆ వీడియో వైరల్ అయింది. గత వారం చిత్రీకరణ జరిపినప్పుడు తీసిన వీడియో ఇది. వీడియోలో రామ్‌చరణ్ కనిపించలేదు కాబట్టి ఆ రోజు ఎన్టీఆర్, ఇతర తారాగణంపై సన్నివేశాలు తీసి ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ దుబాయ్‌లో ఉన్నారు. ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. -
వైరల్: జూనియర్ ఎన్టీఆర్ పాటకు స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి నాయకానాయికలుగా నటించిన చిత్రం అశోక్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు. 2006లో వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అయితే, జపాన్‌లోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జంట అశోక్ సినిమాలోని ‘గోలాగోలా రంగోలా గుండెల్లోనా రాగాలా.. గోదారేదో పొంగే వేళ’పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. క్యాస్ట్యూమ్స్ కూడా హీరోహీరోయిన్లను పోలినట్టుగా ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. అచ్చం జూనియర్ ఎన్టీఆర్, సమీరాలాగానే స్టెప్పులేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక తెలుగు సినిమాల్లోని పాపులర్ పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల టిక్‌టాక్ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటలకు వార్నర్ దంపతులు డ్యాన్సుల వైరల్ అయ్యాయి. (చదవండి: యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!) -
యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మరో సినిమాకు ముహూర్తం కుదిరింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. 2020 సమ్మర్లో చిత్రీకరణ మొదలు పెట్టనున్న ఈ సినిమా 2021 సమ్మర్ సీజన్లో విడుదల కానుంది. ఇప్పటికే త్రివిక్రమ్-తారక్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను సాధించి పెట్టింది. ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే తారక్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. చదవండి : ‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ మా బుట్టబొమ్మలా.. వాటే బ్యూటీ ఉంది -
ఆర్ఆర్ఆర్ షూటింగ్ వీడియో వైరల్
పాడేరు: దర్శకధీరుడు రాజమౌళి సినిమాల షూటింగ్‌లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్ ఎనీ్టఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పాడేరు ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమ్మవారి పాదాల గుడికి దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ప్రాంతానికి సినీ అభిమానులను, మీడియాను కూడా చిత్రం యూనిట్ రానివ్వడం లేదు. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ అడవిలో జరిగిన షూటింగ్లో పాల్గొని,రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ఈ జూనియర్ ఎనీ్టఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన పలు సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన బయటకు వచ్చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాతో పాటు పలు టీవీ చానళ్లలో హల్చల్ చేసింది. బుధవారం జరిగిన షూటింగ్లో మాత్రం జూనియర్ ఎనీ్టఆర్ పాల్గొనలేదు. మిగిలిన నటులతో యుద్ధ సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరించారు. వీడియో క్లిప్ వైరల్‌పై దర్శకుడు రాజమౌళి గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్టీఆర్ లుక్‌ను బుధవారం రివీల్ చేసేశారు. -
నన్ను సస్పెండ్ చేసేంత సీన్ లేదు!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు తనను సస్పెండ్ చేసేంత సీను లేదని, దమ్ముంటే బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆ రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకున్నందుకు మోదీ, అమిత్‌షా ఇంటి వద్ద చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీకి రాజీనామా చేశాక నన్ను సస్పెండ్ చేయడమేంటి?. వయసు మీద పడడంతో చంద్రబాబు మతి చలించి మాట్లాడుతున్నాడు. కొడుకుని గెలిపించుకోలేకపోయాడు. లోకేష్ ముద్ద పప్పు.. అతన్ని మాపై రుద్దాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్ పెద్ద గుదిబండ, స్పీడ్ బ్రేకర్ అని, అతని వల్ల పార్టీ ముందుకు వెళ్లలేదని వంశీ విమర్శించారు. తాను బయటికెళ్తే టీడీపీకి నష్టం లేదని, లోకేష్ పార్టీలో ఉంటేనే పెద్ద నష్టమని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని, ఆ కుటుంబాన్ని అవసరానికి వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘తన రెండెకరాల పొలంతోనే చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారా? వ్యవసాయం చేసి పార్టీ ఫండ్ ఏమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్‌లు తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. లోకేష్ చచ్చు దద్దమ్మ కాబట్టే మంగళగిరిలో ఓడిపోయాడని, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని లోకేష్ బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయమని.. ఎన్ని జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ అంతటివాడు కాలేడన్నారు. ముఖ్యమంత్రి కావాలని లోకేష్, ప్రధాని కావాలని చంద్రబాబు పళ్లు రాలగొట్టుకున్నారని విమర్శించారు. తనను ఎవరూ ప్రభావితం చేయలేరని, మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటానన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేసింది కాబట్టి అభినందించానని, తన నియోజకవర్గం కోసం వైఎస్సార్సీపీలో చేరుతున్నానని తెలిపారు. టీడీపీ వెబ్సైట్ నుంచే నాపై దు్రష్పచారం అమ్మాయిల మారి్ఫంగ్ ఫొటోలను జతచేసి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఓ వెబ్సైట్ నుంచి ఈ దు్రష్పచారం జరుగుతోందని, తన కుటుంబాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
యాపీ ఫిజ్ బంపర్ ఆఫర్..
పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్లో బాగంగా నాలుగు శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్ఫోన్లను గ్రాండ్ప్రైజ్గా అందివ్వనుంది. నవంబరు 7 నుంచి 22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. పోటీలో పాల్గొనాలంటే.. దేశ వ్యాప్తంగా ఆ పోటీ అందుబాటులో ఉంది. ఫీల్ ద ఫిజ్ అధికారిక ఇన్స్టగ్రామ్ను పేజీని ఫాలో కావాలి. యాపీ ఫిజ్‌తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సహా జతచేయాలి. పోటీలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. తద్వారా మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. ప్రతి వారం లక్కీ విజేతలు ఆర్టోఫ్ ఫిజ్ మర్చండైజ్ గెలుచుకోవడానికి అర్హులు. అలాగే 4 మంది అదృష్ట విజేతలను ప్రకటిస్తుంది. వీరు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్‌ను గెలుచుకోవచ్చు. కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాలో ఈ కాంటెస్ట్ గురించి పోస్ట్ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్ ఫ్యాన్స్, ఇటు యంగ్‌టైగర్ ఫ్యాన్స్ ట్విటర్లో ఇమేజ్‌లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి. What is your favourite food that you'd like to pair with @iamappyfizz ? Let your friends on Twitter know and win cool stuff. Follow @iamappyfizz for more details #ArtofFizz pic.twitter.com/5zMxzS1Uae — Jr NTR (@tarak9999) November 12, 2019 My Caption : #FEELTHEFIZZ #ARTOFFIZZ To have good health we need to take proper meal @iamappyfizz To have good health and Energetic we need to take Proper meal and Fizz drinks.Satisfied meal cannot be satisfied without Appy Fizz.Keep cool and always chill with Appy fizz drink pic.twitter.com/X5vaeL1s4H — Anusuresh (@Anusure40893798) November 11, 2019 -
కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్ ట్వీట్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ‘మత్తు వదలరా’సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా పరిచయమవుతుండగా.. ఆయన పెద్ద కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. క్లాప్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించింది. ‘సమయం అమాంతం గడిచిపోతోంది. నా తమ్ముళ్లు పెరిగిపెద్దవారయ్యారు. సింహా కోడూరి హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మొదటి సినిమాతోనే వీరు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్‌కు గుడ్‌లక్" అంటూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పలు పేపర్ కటింగ్స్ మీద శ్రీ సింహా కోడూరి పడుకొని ఉన్నాడు. అతని టీష్టర్ మీద చిత్ర యూనిట్ వివరాలు ఉన్నాయి. ‘మత్తు వదలరా’ చిత్రం ప్రీ లుక్ కొన్నిరోజుల కిందట విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తోపాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ ఉంది. నూతన దర్శకుడు రితేష్ రానా డైరెక్టర్లో వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
ఓటమి తెలిసే సుహాసినికి సీటు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ కుమారుడు, తన బావమరిది నందమూరి హరికృష్ణను తన రాజకీయ వ్యూహంలో పావుగా వాడుకుని బలి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుమార్తె సుహాసినిని అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించి బలి చేశారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబంలో తన పట్ల వ్యతిరేకతతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్ పెట్టాలని బాబు వ్యూహం రూపొందించారని, తద్వారా హరికృష్ణ ఇంట్లోనూ విభేదాలను రాజేశారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూకట్పల్లి స్థానం నుంచి హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు కల్యాణ్‌రామ్‌ను పోటీ చేయించాలని తొలుత బాబు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ద్వారా కల్యాణ్‌రామ్‌పై ఒత్తిడి తెచ్చారు. కల్యాణ్‌రామ్ ఒప్పుకోకపోవడంతో అనూహ్యంగా ఆయన సోదరి సుహాసినిని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకునే క్రమంలో చంద్రబాబు అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెట్టారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. కూకట్పల్లి నుంచి గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా తన రాజకీయాల కోసం బాబు ఆమెను పోటీ చేయించి ఘోర పరాజయంతో మరింత కుంగదీశారని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హరికృష్ణ ఆసక్తి చూపారని, పెనమలూరు సీటు అడిగినా చంద్రబాబు ఇవ్వలేదని, ఆయన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత రెండోసారి అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని టీడీపీ నేత చెప్పారు. హరికృష్ణ కుటుంబానికి మేలు చేయాలంటే ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక స్థానం ఇచ్చే ఆలోచన చేయకుండా, తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయే చోట ఆయన కుమార్తెను బరిలోకి దించడం కచ్చితంగా బాబు చేసిన మోసమేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు వలకు చిక్కని కల్యాణ్‌రామ్ కొద్దిరోజుల క్రితం నందమూరి హరికృష్ణ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు చంద్రబాబు పట్ల అయిష్టత కనబరిచారు. అయినా పట్టువీడకుండా కల్యాణ్‌రామ్‌ను టీడీపీ పొలిట్‌బ్యూరోలో చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కల్యాణ్‌రామ్ ఆయన వలలో పడలేదు. తననూ వాడుకుని వదిలేస్తారనే అభిప్రాయంతో ఆయన చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుహాసినిని ఎన్నికల రంగంలోకి దించారు. సుహాసిని పోటీ చేయడం ఆమె కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని టీడీపీ నేతలు తెలిపారు. హరికృష్ణ రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నానని చెప్పుకునేందుకు, హరికృష్ణపై ఉన్న సానుభూతిని వాడుకోవడానికే చంద్రబాబు ఆమెను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించారని గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. వీటన్నింటికీ మించి హరికృష్ణ కుటుంబం తన చేయి దాటిపోకుండా ఉండేందుకు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్ పెట్టేందుకు బాబు పన్నాగం పన్నినట్లు చెబుతున్నారు. బాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తమ సోదరికి మద్దతుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టలేదు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కారణంగా హరికృష్ణ కుమార్తె ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆక్ పాక్ కరివేపాక్
-
‘అరవింద’ సక్సెస్ మీట్: బాలయ్య రాక వెనుక ఆంతర్యమిదే!
ఎవరినైనా సరే...అవసరానికి వాడుకోవడంలో టీడీపీ పెద్దలకు ఎవరూ సాటిరారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక కూరలో కరివేపాకులా ఏరి పారేయడంలో వారికి వారే సాటి. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ను శుభ్రంగా వాడేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత జూనియర్ ఎవరో కూడా తెలినయట్లుగా పక్కన పెట్టేశారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో రేపన్న రోజున జూనియర్ ను మళ్లీ వాడుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. అబ్బాయి సినిమా సక్సెస్ మీట్ కి బాబాయ్‌ని చంద్రబాబే పంపించారని అమరావతి కోళ్లు డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో అదే పనిగా కూస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా నచ్చిన ఫిలాసఫీ ఒకటుంది. అదే..యూజ్ అండ్ త్రో. అవసరానికి వాడుకో..అవసరం తీరిన వెంటనే అవతలికి విసిరేయ్. ఈ పాలసీని చంద్రబాబు నాయుడు తన రాజకీయ కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అమలు చేస్తూనే ఉన్నారని ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు అంటూ ఉంటారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి ఎదురీత తప్పదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా చంద్రబాబు నిర్వహించుకున్న సర్వేలతోపాటు.. ప్రైవేటు సంస్థల సర్వేల్లోనూ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని తేలడంతో చంద్రబాబు నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలన్న ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఈ క్రమంలో భాగంగా..పదేళ్ల క్రితం తాము వాడుకుని పక్కన పారేసిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ బుట్టలో వేసుకోవాలన్న వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఉన్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే కావచ్చు... జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా అరవింద సమేత వీరరాఘవ సక్సెస్ మీట్ సభకు బాబాయ్ బాలకృష్ణ వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎందుకంటే 2009 ఎన్నికల తర్వాత...జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కార్యక్రమంలోనూ బాలకృష్ణ కనిపించలేదు. ఇపుడు అమాంతం జూనియర్ సినిమా సక్సెస్ మీట్ కి రావడం...జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ టిడిపి ప్రచారం కోసం ఆకట్టుకోవడానికేనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. అంతకన్నా కొసమెరుపు ఏంటంటే.. ఇంచుమించు రెండేళ్ల క్రితం బాలకృష్ణ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జూనియర్ ఎన్టీఆర్ తో తమకి సంబంధాలే లేవన్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. అంతగా సంబంధాలు లేని జూనియర్ సినిమా కార్యక్రమానికి ఇపుడు బాలయ్య అమాంతం ఎందుకొచ్చినట్లు? వచ్చారు సరే... అరవింద సమేత వీరరాఘవ సినిమాలో హీరోయిన్ తో పాటు ప్రతీ ఒక్కరినీ పొగిడిన బాలయ్య... జూనియర్ ఎన్టీఆర్ గురించి నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు. అందరినీ పొగిడిన బాలయ్య అసలు ఈ సినిమా చూడనే లేదట. సినిమా చూడకుండానే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడేశారు. అసలు సినిమా కూడా చూడకుండా.. మొక్కుబడిగా బాలయ్య ఈ మీట్ కి ఎందుకొచ్చారంటే జూనియర్ ఎన్టీఆర్‌ను ట్రాప్ చేయడానికే అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబే వ్యూహం ప్రకారం తన బావమరిది అయిన బాలయ్యను జూనియర్ ను మంచి చేసుకునే పనిలో ఉండమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్‌ను మంచి చేసుకోవలసిన అవసరం ఏముంది? బాబాయ్ గా రమ్మని పిలిస్తే జూనియర్ వస్తాడు కదా అంటారా? ఆ సీన్ లేదిపుడు. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్‌ని, ఆయనలోని అనితర సాధ్యమైన వక్తృత్వపు ప్రతిభను వీలైనంతగా వాడేసుకుని ఎన్నికల్లో లాభపడాలన్న వ్యూహంతో 2009లో చంద్రబాబు నాయుడే దగ్గరుండి జూనియర్‌ను పార్టీ వేదికలపైకి ఆహ్వానించారు. అప్పట్లో చంద్రం మావయ్య చూపించేది ఆప్యాయతే కాబోలు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన రమ్మనమనడమే ఆలస్యం అన్నట్లు.. ఎన్నికల ప్రచారం బరిలోకి దూకేశారు. తన అద్భుత ప్రసంగ పాటవాలతో ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. ఎంతగా ప్రచారం చేశారంటే.. ప్రాణాలకు సైతం తెగించి తెలుగుదేశానికి అంకితమై రాత్రింబవళ్లూ శ్రమించారు జూనియర్ ఎన్టీఆర్. ఆ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురై తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కూడా. తీవ్ర గాయాలపాలై కట్లుకట్టుకుని ఆసుపత్రి మంచంపై ఉండి కూడా టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు జూనియర్. సరే... 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని యుక్తులు పన్నిన్నా.. అందరితో కలిసి మహాకూటమి పెట్టినా.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మా ముందు కూటమి తేలిపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్నికలు అయిపోగానే... నెమ్మది నెమ్మదిగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. తన తనయుడు లోకేష్‌ను పార్టీలో తన వారసుడిగా నిలబెట్టేందుకు.. పార్టీలో అసలు జూనియర్ ఎన్టీఆర్ నీడ కూడా లేకుండా జాగ్రత్తలు పడ్డారు చంద్రబాబు. జూనియర్‌ను పక్కన పెట్టడమే కాదు.. జూనియర్ తండ్రి హరికష్ణకూ, ఆయనకు అత్యంత విధేయులైన పార్టీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. ఆ కారణంగానే హరికృష్ణకు నమ్మకస్తుడైన పార్టీ సీనియర్ నేత కొడాలి నాని టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హరికృష్ణనీ, ఆయన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ నీ, హరికష్ణ అనుచరులైన పార్టీ నేతలను పార్టీలో డమ్మీలుగా మార్చేశారు చంద్రబాబు. జూనియర్ సినిమా దమ్ము విడుదలైన సందర్భంలో అయితే ఆ సినిమాని ఎవరూ చూడవద్దని టీడీపీ నేతలే ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి థియేటర్లు దొరక్కుండా టీడీపీ పెద్దలే అడ్డుకున్నారన్న ఆరోపణలు వినపడ్డాయి. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, నరేంద్ర మోదీ ప్రభంజనాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాలుగున్నరేళ్లు గడిచే సరికి చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకుని.. పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు. మరోవైపు బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎవరో ఒకరి అండ.. జనాకర్షణ గల నేతల ప్రచారం లేనిదే ఎన్నికల ఏరు దాటలేని చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ వేదికలపైకి రప్పించి పార్టీ తరపున ప్రచారం చేయించుకుంటే బాగుంటుందని చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రిత జూనియర్ ఎన్టీఆర్‌పై కక్షగట్టేసినట్లు ఆయన సినిమాలకు థియేటర్లు దొరక్కుండా, ఆయన సినిమాలు ఎవరూ చూడకూడదంటూ ప్రచారం చేసిన వారే ఇపుడు మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జూనియర్‌ను మంచి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఒకసారి వాడుకుని పక్కన పెట్టేసిన జూనియర్ ఎన్టీఆర్ అంత ఈజీగా టీడీపీ వైపు రారేమోనన్న అనుమానంతోనే.. బాబాయ్ బాలయ్యను ఎన్టీఆర్ సినిమా సక్సెస్ మీట్ కి పంపారు. తద్వారా.. జూనియర్‌ను టీడీపీ వైపు రప్పించుకోడానికి చంద్రబాబు పథక రచన చేశారని అంటున్నారు. చంద్రబాబు వైఖరి, విధానాలు నచ్చకనే నందమూరి హరికృష్ణ కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల హరికష్ణ దుర్మరణం చెందిన సందర్భంలో ఆయన పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద కాసేపు ఉంచుదామని చంద్రబాబు అనుకున్నారు. అయితే హరికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం దానికి నో అనేశారని సమాచారం. పార్టీ తనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని హరికృష్ణ తన కుటుంబ సభ్యులతోనూ, అనుచరులతోనూ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ నేపథ్యంలోనే కుటుంబసభ్యులతోపాటు అనుచరులు కూడా టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు హరికృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయలేదంటారు. ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో జూనియర్‌ను ఎలాగైనా మచ్చిక చేసుకుని ఆయన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట. జూనియర్ అభిమానులైతే.. టీడీపీ ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వెళ్లరాదని సోషల్ మీడియాలో ఇప్పుడే డిమాండ్ చేస్తున్నారు. జూనియర్‌ను మరోసారి వాడుకుని వదిలేస్తారని కూడా ట్వీట్లు పెట్టారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది చూడాలి. - సీఎన్ఎస్ యాజులు -
కొన్నాళ్లక్రితం.. నటి ప్రణీతకు తప్పిన ముప్పు..
తాళ్లగడ్డ (సూర్యాపేట) : సరిగ్గా తొమ్మిది సంవత్సరాల ఐదునెలల క్రితం ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26వ తేదీ అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలైన విషయం విధితమే. వీరికి సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా అతివేగం, అజా గ్రత్తగా వాహనం నడిపి పలువురికి గాయాలు కావడానికి కారణమయ్యారని మోతె పోలీసులు నిర్ధారించారు. వాహనంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రమౌళి ప్రసాద్, బాబావలి, రాజీవ్‌కనకాల ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రికి సుమారు ఆరు వాహనాల్లో 15మంది వరకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం మోతె మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో వెళ్లి అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఆ మూలమలుపు వద్ద పెద్ద బావి ఉంది. కానీ కొద్దితేడాతో కారు ఆగిపోవడంతో ప్రాణనష్టం నుంచి తప్పినట్లయింది. నాడు జూనియర్ ఎన్టీఆర్ సొంత డ్రైవింగ్.. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని అర్ధరాత్రి బయలుదేరారు. తన స్నేహితులతో కలిసి సఫారీ కారును సొంతంగా జూనియర్ ఎన్టీఆరే డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. మోతె సమీపంలోకి రాగానే.. అతివేగంగా నడుపుతున్న కారుఅదుపు చేయలేకపోవడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాదకర మలుపు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారుబోల్తా పడిన స్థలం వద్ద ఇప్పటికీ ఎన్నోమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒకసారి బస్సుబోల్తా కొట్టింది. కాకినాడ మున్సిపల్ కమిషనర్ వాహనం కూడా ఇదే మలుపు వద్ద బోల్తా పడింది. 2008లో బస్సును ఆటో ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి నెల రోజుల క్రితం లారీ బావిలోపడి ఇద్దరు మృతిచెందారు. నటి ప్రణీతకు తప్పిన ముప్పు.. మోతె మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదానికి కూతవేటు దూరంలోని మూ లమలుపు వద్దనే నటి ప్రణీత ప్రయాణిస్తున్న కారు 2016 ఫిబ్రవరి 14 పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ వెంకటేశ్వరరావు, మేకప్ అసిస్టెంట్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ నటి ప్రణీతకు మాత్రం ఎలాంటి గాయం కూడా కాకుండా బయటపడింది. -
ఇష్టమైన డ్రైవింగే.. విషాదం నింపింది!
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడు అని పేరు ఉంది. ఈ క్రమంలోనే నెల్లారు జిల్లా కావలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున స్వయంగా వాహనం నడుపుతూ బయలుదేరి వెళ్లారు. ఇంతలో జరిగిన తాజా విషాదం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. నందమూరి అభిమానులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఎంతో ఇష్టమైన డ్రైవింగే.. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, 2009లో నల్లగొండ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుప్రమాదంలో గాయాలపాలై.. అదృష్టవశాత్తు బయటపడ్డారని, నాలుగేళ్ల కిందట హరికృష్ణ తనయుడు జానకీరామ్ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హరికృష్ణ సైతం రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారని అభిమానులు అంటున్నారు. -
ప్రతి మొబైల్‌పై బహుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సెలెక్ట్ ఫౌండర్ వై.గురు శుక్రవారమిక్కడ తెలిపారు. కంపెనీ డైరెక్టర్ మురళి రేతినేనితో కలసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జూలై 20న తెలంగాణలో 30 స్టోర్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ‘2019 జూలై నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 200 ఔట్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాతి రెండేళ్లలో మరో 500ల కేంద్రాలు తెరుస్తాం. మొత్తం 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. మూడేళ్లలో టర్నోవర్ రూ.2,500 కోట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు కంపెనీ రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వ్యయం చేస్తోంది. ఎక్స్‌పీరియెన్స్ జోన్లో.. వర్చువల్ సేల్స్ అసిస్టెన్స్‌తో కూడిన ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్ జోన్ సెలెక్ట్ స్టోర్లలో ఆకర్షణగా నిలుస్తోంది. ఒకేసారి ఎనమిది స్మార్ట్ఫోన్ల ఫీచర్లను జోన్లో ఉన్న భారీ టచ్ స్క్రీన్‌పై పోల్చుకోవచ్చు. డిస్ప్లేలో ఉన్న మొబైల్స్ నుంచి తీసిన ఫోటోలు ఒక్క స్వైప్‌తో టచ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భారత్‌లో తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీని అమలు చేయడమే కంపెనీ విజయంగా భావిస్తున్నట్టు మురళి రేతినేని తెలిపారు. ఆన్లైన్ కస్టమర్లనూ ఆఫ్‌లైన్ వైపు వచ్చేలా చేస్తోందన్నారు. 1,000 చదరపు అడుగులపైగా విస్తీర్ణం ఉన్న స్టోర్లలోనే దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఎక్స్‌పీరియెన్స్ జోన్ తననూ ఆకట్టుకుందని తారక్ వ్యాఖ్యానించారు. తగ్గిన ఆన్లైన్ సేల్స్.. దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ సేల్స్ తగ్గుతున్నాయి. వ్యవస్థీకృత రిటైల్ చైన్లు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని గురు తెలిపారు. ‘మొబైల్స్ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రంగం వాటా 13 శాతమే. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఏకంగా 50 శాతముంది. దక్షిణాది 25 శాతం కైవసం చేసుకుంది’ అని పేర్కొన్నారు. ఇక పాపులర్ గ్యాడ్జెట్స్ విక్రయంపైనా ఫోకస్ చేస్తున్నా మని గురు తెలిపారు. ప్రతి మొబైల్‌పై ఖచ్చితమైన బహుమతి అందిస్తున్నట్టు చెప్పారు. ‘ధర విషయంలో ఆన్‌లైన్‌కు పోటీ ఇస్తున్నాం. రూ.3,000ల ఫోన్‌కూ ఈఎంఐ ఆఫర్ చేస్తున్నాం. విక్రయాల్లో ఈ ఎంఐ వాటా 50 శాతం ఉంది’ అని వివరించారు. -
రామ్ చరణ్, అల్లు అర్జున్ క్లబ్‌లోకి ఎన్టీఆర్
మొబైల్ రిటైల్ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ప్రముఖ మొబైల్ సంస్థ సెలెక్ట్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్‌ను నియమించుకుంది. ప్రముఖ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ఈ కంపెనీ చెప్పింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని జూలై 13న మూడు గంటలకు హైటెక్ సిటీలోని ఐటీసీ కోహెనుర్లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను, సన్నిహిత వర్గాలను సెలెక్ట్ మొబైల్స్ ఆహ్వానిస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ ఈ బ్రాండ్ కోసం షూట్ కూడా చేయనున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌ను సెలెక్ట్ మొబైల్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంతో, రామ్ చరణ్, అల్లు అర్జున్ క్లబ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్‌కు, అల్లు అర్జున్ లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతి, హైదరాబాద్‌లో స్టోర్లను ఏర్పాటు చేసిన సెలెక్ట్ మొబైల్స్ తన కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలుత దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో 500 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే చెప్పింది. ఆ అనంతరం ఉత్తర భారత్‌పై ఫోకస్ చేయనున్నట్టు పేర్కొంది. ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లను ఫిజికల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని ఈ కంపెనీ చెబుతోంది. -
ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి కామెంట్స్..
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. ఆమె ఇటీవల సినీ ప్రముఖులపై విమర్శలు చేసి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. ‘ టు దిస్ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ కింగ్ ఆఫ్ ఎ టాలీవుడ్. బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ సింహం’ అని పోస్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి గతంలో కూడా ప్రశంసలు కురిపించారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను బిగ్‌బాస్ షోలో అందరూ మిస్ అవుతున్నారు. ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ రిప్లేస్ చేయలేరు. అతని రాకతో ప్రజలు నిరాశలో ఉన్నారు. సాహో యంగ్ టైగర్’ అని తన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇటీవల హీరో నానిని కూడా శ్రీరెడ్డి విమర్శించిన విషయం విదితమే. అంతేకాక నాని తనను బిగ్‌బాస్‌లో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. దీనిపై నాని శ్రీరెడ్డికి లీగల్ నోటిసులు పంపారు. అయితే ఈ విషయంపై న్యాయస్థానంలోనే తేల్చుకుందామని శ్రీరెడ్డి సవాలు విసిరారు. ప్రస్తుతం నాని బిగ్‌బాస్ సీజన్2 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
అండగా నిలిచారు, బిగ్ థ్యాంక్స్: ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్: నా కష్టసుఖాల్లో శాశ్వతంగా తోడున్నది ప్రేమ, మీ ఆదరణే అంటూ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుస ట్వీట్లు చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘నా 35 ఏళ్ల జీవితంలో 18 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నాను. ఇన్నేళ్ల నా కెరీర్లో కష్టసుఖాల్లో నాకు శాశ్వతంగా తోడున్నది, అండగా నిలిచింది ప్రేక్షకుల ప్రేమ, అదరణే. మీ రుణం తీర్చుకోగలుగుతానని భావించడం లేదు. అభిమానులకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘‘అరవింద సమేత.. వీర రాఘవ’ ఫస్ట్‌లుక్‌ను ఆధరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీ ట్వీట్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. నా కొలిగ్స్కి, నా శ్రేయోభిలాషులు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ బిగ్ థ్యాంక్స్’అని మరో ట్వీట్లో రాసుకొచ్చారు తారక్. కాగా, నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘అరవింద సమేత..’ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. నిన్న సిక్స్ ప్యాక్‌లో మాస్ లుక్‌ను విడుదల చేసిన మూవీ యూనిట్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆదివారం క్లాస్ లుక్‌లో పూజా హెగ్డేతో ఉన్న లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. In my life of 35 years, I’ve spent almost 18 years as an actor. And during every high & every low in these years, the one constant thing in my life has been the love & support given by you, my dear FANS. I don’t think I can every repay you. Thank you from the bottom of my heart🙏 — Jr NTR (@tarak9999) 20 May 2018 Thank you everyone for the overwhelming love shown towards #AravindhaSamethaFirstLook . It feels great to read all your tweets. Couldn’t have asked for more. Big Thanks to all my colleagues, well wishers and members of the Film Industry for the warm birthday wishes. — Jr NTR (@tarak9999) 20 May 2018 -
బిగ్‌బాస్ 2.. ఇంకొంచెం మసాలా కన్ఫామ్!
తెలుగు బిగ్‌బాస్ సెలబ్రిటీ షో రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారింగా ఓ పోస్టర్‌తో కన్ఫామ్ చేశారు నాని. బిగ్‌బాస్ 2లోగోతో పాటు నాని లుక్‌ను ఇందులో చూడవచ్చు. ‘బాబాయ్.. ఈసారి ఇంకొంచం మసాలా.. బిగ్బాస్తెలుగు2’ అని నాని ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది. నాని ట్వీట్‌పై స్టార్ మా స్పందిస్తూ.. ‘స్టార్ మా నానికి ఆహ్వానం పలుకుతోంది. వ్యాఖ్యాతగా నాని సక్సెస్ అవ్వాలని అకాంక్షిస్తూ’ నాని ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్చేస్తున్నారు నిర్వాహకులు. ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తొలి సీజన్ 70 రోజులు నిర్వహించగా, బిగ్‌బాస్-2 100 రోజులపాటు జరగనుంది. జూన్ 10 నుంచి రెండో సీజన్ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించనున్నారు. ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా చేయనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. Babai .. Eesari Inkkoncham Masala 😉#BiggBossTelugu2 👁 pic.twitter.com/RJuTT2O9pZ — Nani (@NameisNani) 18 May 2018 -
సావిత్రి గారే బహుశా అలా చేయించారేమో..
తొలితరం హీరోయిన్ సావిత్రి అద్భుత పాత్రలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు, ప్రేక్షకులు చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద ‘మహానటి’ మంచిగా రాణిస్తోందని ప్రముఖలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేరిపోయారు. ఈ చిత్రంపై తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అంతేకాక చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘మహానటి ఓ అనుభవం. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. అలనాటి నటి సావిత్రి గారికి ఈ చిత్రం రూపంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఘన నివాళి ఇచ్చారు.’ ‘ఈ చిత్రానికి జీవం పోసినందుకు ప్రియాంక, స్వప్న, దత్ గారికి థ్యాంక్స్. ఈ ‘మహానటి’లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, చిత్రం యూనిట్ చాలా కష్టపడి అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ మ్యూజిక్ సమకూర్చారు. ‘మహానటి’ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని జూనియర్ ఎన్టీఆర్ వరుస ట్వీట్లు చేశారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతుంది. -
ఎన్టీఆర్‌తో గొడవలు లేవు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా వంశీ పరిచయం అయ్యాడు. వక్కంతం వంశీ ‘కిక్’, ‘టెంపర్’, ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ కంటే ముందు వంశీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్‌గా మారాలనుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కోసం కథ కూడా సిద్ధం చేశాడు వక్కంతం వంశీ. కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. గతంలో ఎన్టీఆర్, వంశీల మధ్య విబేధాలు వచ్చాయినే వార్తలు హల్చల్ చేశాయి. వంశీ ప్రస్తుతం ఆ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఏ విధమైన వివాదాలు లేవని, ఆయనతో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. ‘ ఎన్టీఆర్‌తో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్ నిజం కాదు. డైరెక్టర్‌గా చేయమని ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించాడు. నా మొదటి చిత్రం ఆయనతోనే చేయాలని అనుకున్నాను. స్టోరి కూడా రెడీ చేశాను. కానీ ఆ ప్రాజెక్టును ఆపేశాం. ఆ సమయంలో బన్నీ కోసం ఓ కథ ఉంటే చెప్పమని బుజ్జి గారు అడిగారు. అప్పుడు ‘నా పేరు సూర్య’ కథ సిద్ధం చేశాను’ అని వక్కంతం వంశీ తెలిపాడు. -
భరత్‌కు రాంచరణ్ సూపర్ రివ్యూ
మహేశ్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రాజకీయ నేపథ్యంతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ మౌత్‌టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాను ఇటు ప్రేక్షకులే కాదు.. అటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రశంసించారు. సామాజిక సందేశాన్ని కమర్షియల్ అంశాలతో జోడించి కొరటాల శివ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడని, మహేశ్‌బాబు అద్భుతంగా నటించాడని ఎన్టీఆర్ కొనియాడారు. తాజాగా మెగా హీరో రాంచరణ్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమాకు చక్కటి రివ్యూ ఇచ్చారు. ‘క్లాసిక్ సినిమా అని చెప్పడానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ ఈ సినిమా. ఇందులో మహేశ్‌బాబు సటిల్‌గా కనిపిస్తూనే.. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబర్చారు. అందంగా రాసి.. అద్భుతంగా తెరకెక్కించారు శివగారు. దేవీ నువ్వు సూపర్.. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరును బాగా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన అరంగేట్రం చేసిన కియారాకు, మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు’ అంటూ రాంచరణ్ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తాజాగా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్!
తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది. తెలుగు టాప్ హీరోల సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లోనూ పెద్ద మొత్తాలను రాబడుతున్నాయి. టాలీవుడ్లో స్టార్ వారసులదే హవా అని చెప్పాలి. ప్రస్తుతం అగ్రనటులుగా కొనసాగుతున్నవారిలో ఎక్కువమంది వారసులే. ఇక, తమిళ సినిమాతో పోల్చుకుంటే టాలీవుడ్లో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తమిళ సినిమాలు గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నా.. నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇందుకు కారణం తమిళ హీరోల రెమ్యూనరేషనేనని సినీ విమర్శకులు అంటున్నారు. హీరోలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుండటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదని అంటున్నారు. ఈ విషయమై స్టూడియో గ్రీన్ ఫేమ్ అధినేత, నిర్మాత జ్ఞానవేల్ రాజ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలుగు పెద్ద హీరోలు వందకోట్ల బిజినెస్ చేస్తున్నప్పటికీ వేతనంగా రూ. 15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. సహేతుకమైన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారు. అదే కోలీవుడ్‌లో అయితే, టాలీవుడ్ హీరోల స్టేటస్ ఉన్న నటులు రూ. 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మన హీరోలకు స్వప్రయోజనాలపైనే ధ్యాస ఎక్కువ. టాలీవుడ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని జ్ఞానవేల్ రాజా అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాను తమిళంలో సినిమాలు తీయబోనని, తెలుగులోనే సినిమాలు నిర్మిస్తానని ఆయన హెచ్చరించారు. ఇటీవల జరిగిన కోలీవుడ్ సమ్మె.. మొదట డిజిటల్ సర్వీస్ ప్రోవైడర్లకు వ్యతిరేకంగా ప్రారంభమవ్వగా.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని అనేక అంతర్గత విషయాలు తెరమీదకు వచ్చాయి. ఇందులో హీరోలు భారీగా రెమ్యూనరేషన్లు పెంచడంపైనా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్నది చర్చనీయాంశమైంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తెలుగు హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలివి.. మహేశ్‌బాబు బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయి.. తండ్రి బాటలోనే హీరో అయ్యాడు మహేశ్‌బాబు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తన రెండు సినిమాలు (బ్రహ్మోత్సవం, స్పైడర్) పరాజయం పాలవ్వడం నిరాశ కలిగించిందని ఆయన ఓపెన్‌గానే చెప్పారు. ఆయన తాజా సినిమా ‘భరత్ అనే నేను’ మొదటిరోజు నుంచి సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయన సినిమాకు రూ. 18 కోట్ల వరకు తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గడిచిన కొన్నాళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వరుసగా సూపర్‌హిట్ అవుతున్నాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలు ఆయనకు విజయాలు అందించాయి. ఇవి కమర్షియల్ సినిమాలు అయినప్పటికీ సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారాయన. గడిచిన కొన్నాళ్లుగా రూ. 18 నుంచి 20 కోట్ల వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళితో సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వచ్చి దాదాపు 22 ఏళ్లు అవుతోంది. 23 సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2017లో ఆయన సినిమా ఒక్కటే విడుదలైంది. ఈ సినిమాకు రూ. 18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్‌ను ముంచేసింది. ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్.. టాలీవుడ్లో డార్లింగ్ అని ముద్దుగా పిల్చుకునే ప్రభాస్ ఇమేజ్ బాహుబలి సిరీస్‌తో అమాంతం ఆకాశానికి ఎగబాకింది. బాహుబలి-2కు ప్రభాస్ రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. మహేశ్, పవన్‌ను మించి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఉంటుందని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాతో సూపర్హిట్తోపాటు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వాచెడ్ మూవీగా నిలిచింది. తాజాగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా భారీ వసూళ్లతో సూపర్‌హిట్ అయింది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న బన్నీ.. ఒక్కో సినిమాకు రూ. 14 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ తాజా మూవీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ వచ్చే నెల 4న విడుదల కానుంది. రాంచరణ్ చెర్రీ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం అవుతోంది. ఇప్పటివరకు పది సినిమాలు చేశాడు. ఇందులో తొమ్మిది సినిమాలు హిట్టు. ఇటీవల తండ్రి చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని చెర్రీ స్వయంగా నిర్మించాడు. సినిమాకు రూ. 10 నుంచి 14 కోట్ల వరకు చెర్రీ వసూలు చేస్తున్నాడు. తాజా సినిమా ‘రంగస్థలం’ సూపర్‌హిట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో రెమ్యూనరేషన్ మరింత పెంచే అవకాశముంది. రవితేజ టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజకు మంచి కమర్షియల్ ఇమేజ్ ఉంది. కొన్ని పరాజయాల అనంతరం ‘రాజా, దీ గ్రేట్’ సినిమాతో రవితేజ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘టచ్ చేసి చూడు’ నిరాశ పరిచింది. ఒక్కో సినిమాకు రవితేజ రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
‘భరత్’ సభలో సందడి వాతావరణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్’ బహిరంగ సభ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ, నటి కైరా అద్వాణీ, నటుడు ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లు హాజరయ్యారు. వీరందరూ ఒకే వరుసలో కూర్చొవడంతో సభలో సందడి వాతావరణం నెలకుంది. మహేశ్ అభిమానులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. నటి కైరా అద్వాణీ తెలుగులో నమస్కారం చెప్పారు. అంతేకాక హైదరాబాద్‌కి థ్యాంక్స్ అని అన్నారు. ఎన్నో మాట్లాడాలకుని ఇక్కడికి వచ్చాను. కానీ, ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు అని ఆమె అన్నారు. అంతేకాక షూటింగ్లో చేసిన ప్రయాణం చాలా స్పెషల్ అని నటి తెలిపారు. కాగా, సాధారణంగా తన సినిమాలకు చీఫ్ గెస్ట్‌లంటూ ప్రాధాన్యం ఇవ్వని మహేష్.. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్‌తో స్టేజీని షేర్ చేసుకోవడం విశేషం. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన భరత్ అనే నేనుకు దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. -
క్రికెట్ నరనరాల్లో జీర్ణించుకుపోయింది
-
ఆస్తులు పంచినట్టు క్రికెట్ ప్రేమను పంచారు : జూ.ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లకు తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ మంగళవారం పార్క్‌హయత్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు సరిహద్దులు లేవన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా క్రీడల్లోనే మాట్లాడుకోవచ్చని తెలిపారు. ఇక క్రికెట్ అయితే మన రక్తంలో చేరి నరనరాల్లో జీర్ణీంచుకుపోయిందన్నారు. పెద్ద వాళ్లు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను కూడా పంచారన్నారు. చిన్నప్పుడు తన తండ్రితో క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడినని, తన తండ్రి ద్వారానే తనకు క్రికెట్‌పై ఇష్టం పెరిగిందన్నారు. ఈ ప్రేమను తాను తన కుమారుడికి సైతం పంచుతానని చెప్పారు. ప్రచారకర్తగా తనకు అవకాశం కల్పించిన స్టార్ యాజమాన్యానికి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోలో ఎన్టీఆర్ తెలుగు ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటో వివరించారు. ఆ బయోపిక్‌లు నావల్ల కాదు పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సచిన్ తన అభిమాన క్రికెటర్ అని, క్రికెటర్ల జీవితాలపై సినిమాలు రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే క్రికెటర్ల బయోపిక్స్ చేయడానికి తాను సాహసించనని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తనకు ఏ ప్రాంచైజీని కొనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆస్తులు పంచినట్టు క్రికెట్ ప్రేమను పంచారు
-
ద మాసివ్ మల్టీస్టారర్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్.. ఈ ముగ్గురు ఎవరికి వారు సూపర్స్టార్లు. వీరి సినిమాలు సోలోగానే బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించాయి. మరి ఈ ముగ్గురు ఒకే గొడుగు కిందకు వచ్చి.. ఒకే సినిమాతో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమైతే.. అదే ద మాసివ్ మల్టీస్టారర్.. ట్రిపుల్ ఆర్.. టాలీవుడ్ టైటన్స్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. ఆర్ త్రయం హ్యాష్‌ట్యాగ్‌ను విడుదల చేసింది రాజమౌళి టీం. ప్రస్తుత తరానికి టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ.. యావత్ భారతదేశంలోనూ అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ఇదేనేమో అంటూ.. ఈ చిత్రం గురించి ఇలా అధికారిక ప్రకటన వెలువడగానే.. అలా సోషల్ మీడియా పోటెత్తింది. ట్విట్టర్ ఊగిపోతోంది. ట్రిపుల్ ఆర్ యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారతదేశమే కాదు యావత్ ప్రపంచం టాలీవుడ్ వైపు తలతిప్పి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... భారతీయ చిత్రసీమ గర్వపడేలా చేసింది. యావత్ ప్రపంచం అబ్బురపడింది. సినీ జనాలు కొన్నాళ్లపాటు ‘బాహుబలి’ మానియాతో ఊగిపోయారు. ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని టాలీవుడ్ నుంచి వచ్చిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టింది. దేశంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల జాబితాలో ముందువరుసలో నిలిచింది. ఒక అద్భుతమైన సినిమాగా, ఒక దృశ్యకావ్యంగా నిలిచిపోయిన ‘బాహుబలి’ తర్వాత.. దర్శకుడు రాజమౌళి ఏ సినిమా తీస్తాడన్నది సర్వత్రా ఆసక్తి రేపింది. అటు జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో మంచి ఊపు మీదు ఉన్నాడు. టెంపర్ సినిమా నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ.. అన్ని విభిన్నమైన సినిమాలే. జైలవకుశలో త్రిపాత్రాభినయంతో తారక్ అదరగొట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ కూడా మంచి ఊపుమీద ఉన్నాడు. చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాలో చరణ్ తన యాక్టింగ్‌తో మెప్పించాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్, పాటలు విశేష ఆదరణను పొందాయి. ఇలా ముగ్గురికి ముగ్గురు హై సక్సెస్ఫుల్ ట్రాక్‌లో ఉన్న సమయంలో రాజమౌళి.. తారక్, చరణ్‌తో భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. దీని గురించి అధికారిక ప్రకటనలేవీ లేకపోయినా.. టాలీవుడ్లో క్రమంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ఈ సినిమా కోసం తారక్, చరణ్ అమెరికా వెళ్లి ఫొటోషూట్‌లో పాల్గొనడం.. అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఈ కథనాలు నిజం చేస్తూ.. ఆర్ త్రయం కాంబినేషన్లో మాసివ్ మల్టీస్టారర్ మూవీ రానుందని, డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. అటు నందమూరి, మెగా అభిమానులు.. ఇటు రాజమౌళి ఫ్యాన్స్‌లో ఈ అనౌన్స్‌మెంట్‌తో ఉత్సాహం పెల్లుబుక్కుతోంది. సినిమా ఎలా ఉండబోతోంది? రాజమౌళి ఏ మాయాజాలాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు? ఈ మల్టీ స్టారర్లో మా హీరోకు తగినంత ప్రాధాన్యం ఉంటుందా? తరహాలో మెగా, నందమూరి అభిమానుల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రిపుల్ ఆర్ యాష్‌ట్యాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. The mother of all announcements is here .. Young Tiger @tarak9999, Mega Powerstar Ram Charan and the one and only S S R A J A M O U L I @ssrajamouli come together for @RRRMovie .. officially announced #RRR https://t.co/CBREhs2qJj — Mahesh S Koneru (@smkoneru) March 22, 2018 Can't wait 😍😍😍 arey oo box office get ready to get blast🤩🤩🤩💪💪💪 @ssrajamouli @tarak9999 #ramcharan 🔥🔥🔥💃💃💃💃💃💃💃💃💃 #RRR https://t.co/valPAr5o4p — #NoLeapInKKB 🙏 (@pavani171) March 22, 2018 Records badhalu avvalsinde 💪 #RRR pic.twitter.com/sGNRpb88mA — SamosaTimes (@samosa_times) March 22, 2018 #RRR 1st multistarer in current top heroes#RamaRao #RamCharan Curious to see how it gonna be.. After #Baahubali from #Rajamouli N another kickass role for @tarak9999 😘😍 — BhaviK GouD G (@bhavikgoud28) March 22, 2018 Well, I thought my story would have become the first one which will have these stars.. but here we are, @ssrajamouli making it possible way ahead of me... All the best @ssrajamouli , @tarak9999 and Ramcharan..#ramarao #RRR — Fairoz (@Fairoz2573) March 22, 2018 #RRR mass feast😍 pic.twitter.com/HuIrvf74HV — Dis Page Vll Entertain U (@dpveuu) March 22, 2018 #RRR #RamCharan @tarak9999 @ssrajamouli pic.twitter.com/sXM9jPeDtF — So Called Cinema (@vrsocc) March 22, 2018 -
యంగ్‌టైగర్ కొత్త సినిమాకు రంగం సిద్ధం
సాక్షి, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్‌కు ముహూర్తం కుదిరింది. వరుస విజయాలతో ఊపుమీదున్న యంగ్ టైగర్, జై లవ కుశ వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 12న మొదలవనుంది. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా.. త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా స్క్రిప్ట్ సిద్దం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇదివరకే చిత్ర వర్గాలు తెలిపాయి. వీలైనంత తొందరగా ఈ సినిమా పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌కు ఎన్టీఆర్ సూచించారు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేలా షెడ్యూలును తయారు చేస్తున్నట్టు సమాచారం. బహుశా రాజమౌళితో నెక్ట్స్ సినిమా ఉన్నందున ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. -
తారక్ సీరియస్ వర్కౌట్స్‌పై రణ్వీర్ క్రేజీ కామెంట్!
ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు, కొత్త లుక్‌లో కనిపించేందుకు తపించే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. ‘టెంపర్’ నుంచి ప్రతి చిత్రంలో సరికొత్త స్టైలిష్ లుక్‌తో ఎన్టీఆర్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ట్రెండీగా కనిపించిన తారక్.. ఆ తర్వాత ‘జనతాగ్యారేజ్’ యంగ్స్టైలిష్ లుక్‌తో అలరించాడు. ఆ తర్వాత వచ్చిన ‘జై లవకుశ’లో మూడు విభిన్నమైన పాత్రల్లో తనదైన వైవిధ్యాన్ని చాటి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు జూనియర్ సన్నద్ధమవుతున్నాడు. ఈ కేజ్రీ కాంబినేషన్‌పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్‌తో కలిసి తారక్ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల నేపథ్యంలో తారక్ ప్రముఖ బాడీబిల్డింగ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. లాయిడ్ పర్యవేక్షణలో తీవ్రమైన కసరత్తులు చేస్తూ.. కండలు తిరిగిన దేహాదారుఢ్యం కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. (ఎన్టీఆర్ ఫొటోపై రణ్వీర్ కామెంట్..) ఈ క్రమంలో అమెరికాకు వెళ్లిన తారక్ అక్కడ గాయపడ్డాడంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో ఫేక్ కథనాలు హల్చల్ చేశాయి. ఎన్టీఆర్ బాగున్నారని, ఆయకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, హైదరాబాద్‌కు తిరిగివచ్చారని ఆయన పీఆర్ మహేశ్ కోనేరు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కండలు తిరిగిన ఎన్టీఆర్ తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్న ఫొటోను లాయిడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఎన్టీఆర్ వర్కౌట్స్ మరింత తీవ్రమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తికరంగా ఈ ఫొటోపై ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్వీర్ కపూర్ కామెంట్ చేశారు. బీస్ట్‌ఇన్ అని రణ్వీర్ కామెంట్ చేయగా.. మీకు తెలుసు బ్రదర్ అంటూ లాయిడ్ బదులు ఇచ్చారు. Things are getting serious ... #jrntr - #ntr28 #beast #transformation #fitness #trainhard #trainsmart #exercise #nutrition #consistency #persistance #menshealth #mensfitness #gym #bodygoals #beastmode #personaltrainer #noexcuses #getitdone A post shared by Lloyd Stevens (@lloydstevenspt) on Mar 13, 2018 at 3:19am PDT -
జై 2017.. మన హీరోలు దుమ్మురేపారు!
కొందరు సిక్సులు బాదారు.. మరికొందరు ఫోర్లు కొట్టారు.. ఇంకొందరు యావరేజ్‌గా ఆడినా మొత్తానికి టాలీవుడ్‌ని 2017లో గెలిపించారు. సంవత్సరం ప్రారంభంలోనే అదిరిపోయే హిట్స్ వచ్చాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. టాలీవుడ్ ఇండియన్ రికార్డ్సు కూడా బద్దలుకొట్టింది. దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. హీరోలు కథలను ఎంచుకోవడంలో మార్పు కనిపించింది. పాతతరం హీరోలు సైతం తమ స్టామినాను చాటుకున్నారు. యువ హీరోలకు సవాల్ విసిరారు. ఈ ఏడాది హీరోయిజానికి కాకుండా కథలకు వెండితెర పట్టంకట్టింది. ఈ పరిణామం మంచిదే. అయితే కొన్నిసక్సెస్ అవ్వొచ్చు, మరికొన్ని కాకపోవచ్చు. 2017 వెళ్లిపోతున్న ఈ తరుణంలో ఈ ఏడాది అదరగొట్టిన టాలీవుడ్ హీరోలపై ఓ లుక్కేద్దాం.. మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ.. దాదాపు 9 ఏళ్ల నిరీక్షణ అనంతరం మెగా అభిమానుల కల నిజమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150 ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. రీ ఎంట్రీతో తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి చూపించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో 151వ సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగిన బాలయ్యకు ఈ ఏడాది కలిసొచ్చింది. గౌతమీపుత్ర శాతకర్ణిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు క్రిష్. ఆయన కథను నడిపించిన విధానం, యుద్ధ సన్నివేశాలు, బాలకృష్ణ నటన అన్నీ కలిసి ఈ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. ప్రతీ ఫ్రేమ్‌లో క్రిష్ పనితనం కనిపిస్తుంది. బాలయ్య తన మార్క్ కనిపించేలా డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. పూరీ డైరెక్షన్లో వచ్చిన 'పైసావసూల్' కూడా ఈ సంవత్సరమే విడుదలైంది. ప్రభాస్ ఈ సంవత్సరం ప్రభాస్‌కు బాగా కలిసొచ్చింది. బాహుబలితో జాతీయ స్థాయి హీరోగా ఎదిగారు. దాదాపు ఐదు సంత్సరాలు కష్టపడి తీసిన బాహుబలికి ప్రపంచస్థాయిలో సంచలన విజయం సాధించింది. ప్రభాస్‌కు టాలీవుడ్‌లోని హీరోలందరికంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా బాబహుబలి-2 రికార్డుకెక్కింది. ఈ క్రేజ్‌ని ప్రభాస్ నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి. రానా దగ్గుబాటి రానా ముందు నుంచీ విలక్షణ పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవే. బాహుబలిలో ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయారు. సబ్‌మెరైన్ కథతో తెరకెక్కిన ఘాజీ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా పాత్రకు ప్రాణం పోశారు. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. రానాతో తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రాజకీయ నాయకుడిగా రానా నట విశ్వరూపాన్ని చూపించారు. మొత్తానికి రానాకు ఈ సంవత్సరం అన్నీ హిట్లతో ఆనందంగా గడిచింది. విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో అందరినీ ఆశ్చర్యానికీ గురి చేశాడు విజయ్ దేవరకొండ. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు అవార్డు లభించింది. ఈ ఏడాది 'అర్జున్ రెడ్డి'గా వచ్చి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. వివాదాల మధ్యలో ఈ సినిమా విడుదలైనా పెద్ద విజయాన్ని సాధించింది. రాత్రికి రాత్రి విజయ్ సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. తన వయసుకు తగ్గ కథ, ఆ పాత్రలో తను లీనమైన తీరు, నటనలో పరిణతి ఈ సినిమాను మరోమెట్టు ఎక్కించాయి. విజయ్ తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నంతగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేయగలిగే ఎన్టీఆర్.. ఈ ఏడాది త్రిపాత్రాభినయంతో అదరగొట్టారు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఆయన ఈ ఏడాది 'జైలవకుశ'గా మన ముందుకు వచ్చారు. ప్రతినాయకుడి ఛాయలున్న 'జై' పాత్రతో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపాన్ని చూపారు. మహేశ్‌బాబు తమిళ డైరెక్టర్ మురుగదాస్, మహేశ్ బాబు కలయికలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా స్పైడర్.. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. మహేశ్ నటనకు విశ్లేషకుల ప్రశంసలు దక్కాయి. శ్రీమంతుడు లాంటి భారీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివతో 'భరత్ అను నేను' సినిమాను మహేశ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే కసితో ప్రిన్స్ ఉన్నాడని ఈ చిత్రం విశేషాలను బట్టి తెలుస్తోంది. నాని టాలీవుడ్లో అదృష్టం ఎవరికైనా ఉందంటే అది నానికే. ఈ ఏడాది విడుదలైన మూడు సినిమాలు విజయవంతమయ్యాయి. నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ ఇలా వరుస హిట్స్‌తో నాని అదరగొట్టారు. నటన విషయంలో నాని ఒక్కో సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. నాచురల్ స్టార్‌గా తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శర్వానంద్ టాలీవుడ్లో యువ హీరోల హవా కొనసాగుతోంది. ఈ ఏడాది యువ హీరోలందరూ విజయాలతో దూసుకెళ్లారు. శతమానం భవతి, రాధ, మహానుభావుడు వంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్. శతమానం భవతి సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. రాధ పర్వాలేదనిపించినా.. మహానుభావుడుతో హిట్ కొట్టారు. అతి శుభ్రం అనే వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రలో శర్వానంద్ నటించి మెప్పించారు. మారుతి తనదైన శైలిలో వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. అల్లు అర్జున్ మెగా కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. వరుస హిట్స్‌తో రాకెట్లా దూసుకుపోతున్నారు. రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి హిట్లతో ఉన్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం 'డీజే దువ్వాడ జగన్నాథం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా విజయవంతమైంది. అదే ఊపులో కథా రచయిత వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లుఅర్జున్ నటిస్తున్నారు. -
జక్కన్న పోస్టుపై వర్మ కామెంట్స్..!
సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాకు ఉత్తమ డైరెక్టర్‌గా నంది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. జక్కన్న తన ఫేస్బుక్లో ఒక ఫొటో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో మధ్యలో రాజమౌళి ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌లు కూర్చొన్నారు. ఈ పోస్టుపై విమర్శాత్మక డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైన రీతిలో కామెంట్స్ చేశాడు. వర్మ తన ఫేస్బుక్లో ‘ ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా .. పైగా ముగ్గురు కూడా పెళ్లైన వాళ్లు.. అల్లా ఏం జరుగుతుంది ? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందించారు. ఒక అభిమాని అయితే ‘ ఓ జంతువూ.. నువ్వు గేలా ఉండి అందరిని అంటావేంటిరా’ అని వర్మపై విరుచుకుపడ్డాడు. మరో అభిమాని‘ పచ్చ కామెర్లు వ్యాధి ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అనే సామెత’ వర్మకి సరిపోతుందని కామెంట్ చేశాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో మల్టీ స్టార్ మూవీ 2018లో మొదలవుతుంది.. టాలీవుడ్ రికార్డులని బద్దలయ్యే క్షణం.. అని ఓ అభిమాని పోస్టు చేశాడు. బాహుబలి 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. -
డిటెక్టివ్?
లాంగ్ కోట్, తలకు హ్యాట్, మెలితిరిగిన మీసాలు... జనరల్‌గా డిటెక్టివ్ అంటే ఈ లుక్‌లోనే ఊహించుకుంటాం. ఓసారి ఎన్టీఆర్‌ని ఈ లుక్‌లో ఊహించి చూడండి. గెటప్ అదిరింది కదూ! ఏ సినిమాలో ఎన్టీఆర్ ఈ లుక్‌లో కనిపించనున్నారంటే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో అని ఫిల్మ్‌నగర్ టాక్. 1980లలో వచ్చిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ ఆ నవల హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేయనున్నారనే వార్త వచ్చింది. అయితే, త్రివిక్రమ్ రైట్స్ తీసుకున్న నవల డిటెక్టివ్ బేస్డ్ అట. అందుకని, ఎన్టీఆర్ చేయబోతున్నది డిటెక్టివ్ పాత్ర అని చాలామంది ఫిక్సయ్యారు. ఎన్టీఆర్ కోసమే త్రివిక్రమ్ ఆ నవల తీసుకున్నారా? లేక వేరే సినిమాకా? అనేది త్వరలోనే తెలుస్తుంది. అన్నట్లు... త్రివిక్రమ్ గత చిత్రం ‘అ ఆ’ కూడా ఓ నవల ఆధారంగా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జైలవకుశ'.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన జూనియర్‌కూ మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమాను ఎన్టీఆర్ చేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే.. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ... ఈ టాప్ డైరెక్టర్లే ఎన్టీఆర్ 'జైలవకుశ' చేయడానికి కారణం. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేయడంతో కోన వెంకట్ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. నిజానికి ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. ఎస్ఎస్ రాజమౌళి, వీ వినాయక్‌లు తనకు సన్నిహితులు అని ఎన్టీఆర్ చెప్తుంటారు. 'జైలవకుశ' ఎన్టీఆర్ చేయడం వెనుక ఆ ఇద్దరు ఉండి ఉండొచ్చునని భావించారు. కానీ వినాయక్ ప్లేస్‌లో కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్‌కు 'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయాన్ని అందించిన కొరటాల శివతోనూ ఎన్టీఆర్ మంచి స్నేహబంధం కలిగి ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. S.S.R & Koratala Shiva https://t.co/mxenAEjDs6 — kona venkat (@konavenkat99) 28 October 2017 -
మిలటరీ కాదు... ఫ్యామిలీ కథే!
హృదయాలను హత్తుకునే అనుబంధాల హరివిల్లులకు, నవ్వులకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో లోటుండదు. కానీ, ఎన్టీఆర్‌తో తీయబోయే సిన్మాతో త్రివిక్రమ్ రూటు మార్చబోతున్నారనే వార్తలొచ్చాయి. మిలటరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. తాజా ఖబర్ ఏంటంటే... రెగ్యులర్‌గా వెళ్లే రూటులోనే, తనకు బాగా అలవాటైన దారిలోనే ఎన్టీఆర్‌తో కలసి త్రివిక్రమ్ జర్నీ చేయబోతున్నారట! అంటే... ఎన్టీఆర్‌తో తీయబోయేది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఫిక్స్. యాక్చువల్లీ... ఎన్టీఆర్–త్రివిక్రమ్ డిస్కషన్స్ టైమ్‌లో మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథనూ అనుకున్న మాట నిజమే. అయితే... ప్రస్తుతం ఫ్యామిలీ నేపథ్యంలోని కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారని సమాచారమ్. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ స్వరకర్త. -
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో?
వరుస సూపర్ హిట్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరుమీద ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేసిన 'జైలవకుశ' ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లతో ఎన్టీఆర్ స్టామినాను చాటింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. ప్రస్తుతం 'జైలవకుశ' విజయాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తు మొదలుపెట్టే అవకాశముంది. కాగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఎన్టీఆర్‌కు ఓ పాయింట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాయింట్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 'ఇష్క్', 'మనం' వంటి చిత్రాలను రూపొందించి విక్రమ్ ప్రస్తుతం అఖిల్‌తో 'హాలో' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తివ్రికమ్తో ప్రొసీడ్ అవుతాడా? లేక విక్రమ్ కే కుమార్ చాన్స్ ఇస్తాడా?.. లేదా మరో కొత్త డైరెక్టర్ తెరపైకి వస్తాడా చూడాలి. -
హాట్ టాపిక్‌గా తారక్ కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: 'జై లవ కుశ' విజయోత్సవంలో వేడి రాజుకుంది. సినీ విమర్శకులు వ్యవహరిస్తున్న తీరుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మండిపడ్డాడు. కష్టపడి తెరకెక్కిస్తున్న చిత్రాలకు కొందరు విమర్శకులు నెగిటివ్ సమీక్షలు ఇస్తున్నారని చెప్పాడు. తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ' చిత్రంలో జూనియర్ మూడు పాత్రల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర బంపర్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రానికి క్రిటిక్స్ బిలో యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టారు. ఇలా నెగిటీవ్ రివ్యూలు ఇవ్వడంతో తారక్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. 'జై లవ కుశ' విజయోత్సవంలో తారక్ మాట్లాడుతూ.. 'హాస్పటల్లో మన కుటుంబసభ్యులెవరైనా క్రిటికల్ కండిషన్‌తో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’ అంటుంటారు. భయంలో ఉన్న మనకు ధైర్యాన్ని ఇవ్వకపోగా... చావు బతుకుల మధ్య ఉన్నోణ్ణి చంపేయడం, వాడి మీద ఆశలు పెట్టుకున్నోణ్ణి ఇంకా చంపేసేయడం... ఇటీవల ఇలాంటి ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. విడుదలైన సిన్మా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. పేషెంట్ బతుకుతాడా? లేదా? అనుకునే చుట్టాలు మేము (సిన్మా టీమ్). ప్రేక్షకులు డాక్టర్లు. విశ్లేషకులు దారినపోయే దానయ్యలు. పేషెంట్ చచ్చిపోయాడని వాళ్లు (ప్రేక్షకులు) చెబితే ఓకే. ఆశలు వదిలేసి, ఒప్పేసుకుంటాం. కానీ, ఆ క్లారిటీ రాకుండా... ముందే పోయాడనో! అదనో! ఇదనో! ఎందుకు? డాక్టర్లను చెప్పనివ్వండి. ఎమర్జెన్సీ వార్డుకి ఇంకొకణ్ణి తెచ్చుకుంటాం. మాకే కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దయచేసి... ఒక సిన్మా వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్కోర్స్... 101 శాతం మనందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ, మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశను ఎంత దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పులుంటే క్షమించండి! అర్థం లేకుంటే వదిలేయండి. నా బాధను మీ అందరికీ ఒక్కసారి వెల్లడిద్దామనుకున్నా’’ అంటూ ఎన్టీఆర్ ఆవేదనగా పేర్కొన్నాడు. ‘‘ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన మా పేషెంట్ ‘జై లవకుశ’ హెల్త్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఆయన ముగించాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ఎందుకింత ఎమోషనల్‌గా స్పందించారు? ఆయనను బాధపరిచిన నెగిటివ్ రివ్యూలేమిటి? అన్నది చర్చనీయాంశమైంది. -
హాట్ టాపిక్‌గా తారక్ కామెంట్స్!
-
నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది : ఎస్ఎస్ రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్ వస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబర్చాడని, ముఖ్యంగా 'జై' పాత్రలో ఎన్టీఆర్ చక్కని వైవిధ్యాన్ని చూపించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'జైలవకుశ' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'తారక్.. నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. మాటలు రావడం లేదు. జై.. జై.. జైలవకుశ' అంటూ జక్కన్న ట్వీట్ చేశారు. Tarak.. my heart is swelling with immense pride..words are just not enough..jai JAI.. -
'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్ రివ్యూ!
జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే ఈ సినిమా సూపర్‌హిట్ ఖాయమని ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ఓవర్సీస్లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ మౌత్‌టాక్‌తో, పాజిటివ్ రివ్యూలతో 'జైలవకుశ' సినిమా ప్రారంభం కావడం చిత్రయూనిట్లో సంతోషం నింపుతోంది. 'జైలవకుశ' ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ. ఇందులో జై, లవ, కుశగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలాంటి డూప్ లేకుండా నటించాడు. చిన్నతనంలో కలిసి పెరిగిన ముగ్గురు అన్నదమ్ములు కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అందులో లవ బ్యాంక్ మేనేజర్ అయితే, కుశ అల్లరిగా పెరిగి దొంగగా మారతాడు. ఇక సినిమాకు అత్యంత కీలకమైన 'జై' చిన్నప్పుడు తన సోదరుల నుంచే వేరు అయి.. ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన రౌడీగా మారతాడు. ఈ ముగ్గురు తిరిగి ఎలా కలిశారు? రావణాసురుడిని ఇష్టపడే 'జై' ప్రతినాయకుడి స్వభావం నుంచి మారిపోతాడా? సోదరుల కోసం 'జై' చేసిన త్యాగమేమిటి? అన్నది తెరపై చూడాలంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాకు ఉదయం నుంచే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ, రకుల్‌ప్రీత్‌సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు 'జైలవకుశ' సూపర్‌హిట్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్ నటన అద్భుతం.. సూపర్‌హిట్ ఖాయమంటూ ట్వీట్లు పెట్టారు.Wishing d entire team of #JaiLavaKusa all d best 4 tom 😀 my lovely @RaashiKhanna @i_nivethathomas n the most terrific actor @tarak9999 👍🏻— Rakul Preet (@Rakulpreet) 20 September 2017 ఇక నెటిజన్ల నుంచి 'జైలవకుశ'పై పాజిటివ్ రివ్యూలే పోటెత్తాయి. సినిమా బాగుందనే ట్వీట్లు ఉదయం నుంచి వస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ ఉంటే.. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ బాగాపడిందని, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పర్ఫెర్మెన్స్ ఇచ్చారని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఓవర్సీస్ నుంచి ఈ సినిమాపై టెర్రిఫిక్ రిపోర్టులు అందుతున్నాయని, జైలవకుశ పెద్ద విజయాన్ని సాధించబోతున్నదని సినీ మార్కెటింగ్ నిపుణుడు మహేశ్ ఎస్ కోనేరు ట్వీట్ చేశారు.#JaiLavaKusa review rendu mukkalo : @tarak9999 NATAVISWAROOPAMHats of @tarak9999 Sir— yashwanth choudary (@yash_choudary) 21 September 2017Excellent reports from the Overseas & early morning shows in India. #JaiLavaKusa pic.twitter.com/vJTSH2eXhO— Vamsi Kaka (@vamsikaka) 21 September 2017Tarak @tarak9999 master class in acting .. what an emotional high the climax gives ! Don’t miss #JaiLavaKusa . Complete family entertainer— Mahesh S Koneru (@smkoneru) 21 September 2017#JaiLavaKusa review 3.5 /5 : Climax - Emotional high.. Touching & tear jerker... Jr. #NTR with 3 diff body languages rocked the show pic.twitter.com/VOMwsFdA2c— j (@JEYMJKRISHNA) 21 September 2017 -
తొలిరివ్యూ: రావణుడిగా ఎన్టీఆర్ దుమ్మురేపాడా!
'జై లవకుశ' ఫీవర్.. టాలీవుడ్‌ను, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఊపేస్తోంది. తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరపై దుమ్మురేపడానికి సిద్ధమవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో సోదరుడు కల్యాణ్ రాం తెరకెక్కించిన ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ అలరించబోతున్నాడు. ఈ సినిమా కథ ఏమిటనేది ట్రైలర్ ద్వారా.. ఎన్టీఆర్ తాను ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా చూచాయగా చెప్పేశారు. రామలక్ష్మణుల్లా పెరగాల్సిన ముగ్గురు అన్నదమ్ములు రావణ, రామ-లక్ష్మణులుగా మారడమే ఇందులోని కథ. ఇందులో జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడిని అభిమానించే 'జై' పాత్రపై ఇప్పటికే విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతినాయకుడిగా తొలిసారి నటించిన ఎన్టీఆర్.. 'జై' పాత్రలో వీరోచితమైన అభినయాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. 'జై' పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కు, 'జైలవకుశ' ట్రైలర్‌కు ఆన్లైన్లో విశేషమైన స్పందన లభించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 'జై రావణ' పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో 'జైలవకుశ' ఎలా ఉండబోతుంది? అసలు కథలో ట్విస్టేమిటి? జై పాత్ర అంచనాలను అందుకుంటుందా? మరికాసేట్లో తేలనుంది. ఇప్పటికే తారస్థాయి అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. 'జైలవకుశ' సినిమాను డైరెక్టర్ బాబీ అద్భుతంగా తెరకెక్కించారని, యంగ్‌టైగర్ ఎన్టీర్ మైండ్‌బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడని దేవీ ట్వీట్ చేశాడు. రావణా అంటూ 'జై' పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టినట్టు హింట్ ఇచ్చారు. Get ready guys 4 JLK tmorow.. Brilliant Making by @dirbobby and Mindblowing Performance by Young Tiger Dear @tarak9999 !! RAAVANAAA !!😁🎹🕺🕶 — DEVI SRI PRASAD (@ThisIsDSP) 20 September 2017 #JaiLavaKusa has Potential to break All Non Baahubali Records ! Full on Mass Masala Entertainer with #JrNTR Star Power & Racy Screenplay ! 👏 pic.twitter.com/Ab5WSRPrky — Umair Sandhu (@sandhumerry) 20 September 2017 #JrNTR gave Career Best Performance ever in #JaiLavaKusa. Best Tollywood Male Performance of the Year by so far ! Hatsoff to him 👍👏 3.5*/5* pic.twitter.com/ZVDhlUrcqj — Umair Sandhu (@sandhumerry) 20 September 2017 My Review of #JrNTR #JaiLavaKusa is Trending all over the World ! Thank you Telugu Media ! SUPERHIT #OverseasTopCritic #UmairSandhu 🙏😊 pic.twitter.com/pudNmhVfcz — Umair Sandhu (@sandhumerry) 20 September 2017 ఇక, ఏసియన్ మూవీస్ మార్కెటింగ్ నిపుణుడైన ఉమైర్ సంధు 'జైలవకుశ' మీద తొలిరివ్యూను ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కితాబిచ్చాడు. 'బాహుబలి' యేతర రికార్డులన్నీ ఈ సినిమా బద్దలుకొట్టవచ్చునని విశ్లేషించాడు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని పేర్కొంటూ.. 3.5/5 రేటింగ్ ఇచ్చాడు. ఈ రివ్యూతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏదిఏమైనా 'జైలవకుశ' సినిమా ఎలా ఉందో తెలియాలంటే రేపటివరకు ప్రేక్షకులు ఆగాల్సిందే. -
తీన్ తారక్
స్టీరియోఫోనిక్లో అయితే రెండు వినపడతాయి ఇది 2డీలో 3డీ.. అంటే... కళ్లజోడు పెట్టుకోకుండానే ఎన్టీఆర్ మూడు డైమన్షన్స్‌లో కనపడతాడు చూసి ‘జై’ కొట్టాల్సిందే... చూసినంతసేపు లవ్ చేయాల్సిందే చూశాక ఖుష్ అవ్వాల్సిందే. జై లవకుశ... తీన్ తారక్... ఎన్టీఆర్. ‘జై లవకుశ’ల కహానీ ఏంటి? ఎన్టీఆర్‌లాంటి ఎనర్జిటిక్ హీరో సింగిల్ రోల్లో కనిపించినా సూపరే. ఇక, డబుల్ రోల్లో ‘అదుర్స్’. ఏకంగా ట్రిపుల్ రోల్స్ అంటే దుమ్ము దుమారమే. అందుకే ‘జై లవకుశ’పై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ వీర లెవల్లో రెచ్చిపోతారని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇంతకీ, ఈ ‘జై లవకుశ’ కథేంటి? సినిమా రిలీజ్‌కు ముందే ఫుల్ స్టోరీ చెప్పేస్తే ఎలా? జస్ట్ లైన్ తెలుసుకుందాం. ఇది ముగ్గురు అన్నదమ్ముల (జై, లవ, కుశ) కథ. విధి వీళ్ల పట్ల చిన్న చూపు చూడటంతో విడిపోతారు. ఫైనల్‌గా ఎలా కలుసుకున్నారు?... అనేది కథ అట. బోలెడన్ని ట్విస్టులతో ఈ లైన్‌ని ఓ స్టోరీగా రాసుకున్నారట. ఒక ట్విస్ట్ ఏంటంటే.. సెకండాఫ్‌లో మూడు పాత్రలూ ఒక పాత్రలా మారి, కన్ఫ్యూజ్ చేసే సీన్స్ ఉన్నాయట. ఈ సీన్స్ ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తాయట. అన్నదమ్ముల కాంబినేషన్లో ఫస్ట్ సినిమా చిత్రదర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) గతేడాది అక్టోబర్‌లో ఎన్టీఆర్–కల్యాణ్‌రామ్‌లకు ఈ స్టోరీ లైన్ చెప్పారు. లైన్ నచ్చడంతో డెవలప్ చేయమన్నారు. డిసెంబర్‌కి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. కథ విన్నాక అన్నదమ్ములు... అంటే కల్యాణ్‌రామ్–ఎన్టీఆర్‌లు ‘నందమూరి తారక రామారావు ఆర్ట్స్’ బేనర్‌పై ఈ సినిమా నిర్మించాలనుకున్నారు. అన్నయ్య ప్రొడ్యూసర్. తమ్ముడు హీరో. అన్నదమ్ములిద్దరి కాంబినేషన్లో ఇది ఫస్ట్ సినిమా. అది కూడా అన్నదమ్ముల నేపథ్యం ఉన్న సినిమా కావడం విశేషం. గెటప్, మేకప్, కాస్ట్యూమ్స్, షెడ్యూల్స్, ఇలా రెండు నెలల పాటు పక్కా ప్లాన్ చేసుకుని, మార్చిలో షూటింగ్ మొదలుపెట్టేశారు. షూటింగ్‌కి దాదాపు 150 రోజులు పట్టిందని టాక్. ఎన్టీఆర్ ట్రిపుల్కి 150 కాస్ట్యూమ్స్ జనరల్‌గా సింగిల్ రోల్ అంటే హీరోకి 40 నుంచి 50 కాస్ట్యూమ్స్ తయారు చేయిస్తారు. ఇక, ట్రిపుల్ రోల్ అంటే మాటలా? ఎన్టీఆర్ చేసిన మూడు క్యారెక్టర్స్‌కి 130 నుంచి 150 కాస్ట్యూమ్స్ కుట్టించారు. కాస్ట్యూమ్స్ అన్నింటినీ డిజైనర్ అశ్విన్ మాల్వే తయారు చేశారు. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే... ‘జై లవకుశ’లు ఒకే రకం డ్రెస్సులో కనిపించే సీన్స్ కొన్ని ఉన్నాయట. ఆ సీన్స్ ఐ–ఫీస్ట్ అంటున్నారు. ‘జై లవకుశ’ల స్కిన్ టోన్ డిఫరెంట్! జనరల్‌గా హీరో ఒకటికన్నా ఎక్కువ క్యారెక్టర్స్‌ని చేసినప్పుడు ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ, ఇక్కడ ‘జై–లవ–కుశ’ల రంగు కూడా డిఫరెంట్. ‘జై’ కొంచెం నల్లగా, ‘లవ’ తెల్లగా, ‘కుశ’ మధ్యస్తంగా కనిపిస్తారట. ఈ తేడా చూపించడం కోసం హాలీవుడ్ నుంచి వాన్స్ హార్ట్‌వెల్‌ని ఇండియాకి రప్పించారు. హాలీవుడ్ మూవీస్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ఐరన్ మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ తదితర చిత్రాల్లో ఆర్టిస్టులకు ఈయన ప్రొస్థెటిక్ మేకప్ చేశారు. వాన్స్ హార్ట్వెల్ ‘జై లవకుశ’కు మేకప్ సూపర్వైజర్గా వ్యవహరించారు. 14 షాట్స్... 42 కాస్ట్యూమ్స్ జై లవకుశ... ఈ మూడు పాత్రలకు సంబంధించిన సీన్స్‌ని ఒకే రోజున తీసినప్పుడు ఎన్టీఆర్‌కి తంటాలే. ఉదయం 6 గంటలకు మొదలుపెడితే రాత్రి 2 గంటల వరకూ మూడు పాత్రల చిత్రీకరణకు పట్టేదట. ఒకరోజు మూడు పాత్రల మీద 14 షాట్స్ తీస్తే 14 ఇంటూ 3 కాస్ట్యూమ్స్... మొత్తం 42 డ్రెస్సులు మార్చుకున్నారట ఎన్టీఆర్. నిజంగా చాలా ఓపిక కావాలండీ బాబూ. అలాగే మూడు పాత్రల హెయిర్ స్టైల్ వేరు కావడంతో స్టైలింగ్‌కి కూడా బాగా టైమ్ పట్టేదట. ఒక్కో క్యారెక్టర్ హెయిర్ స్టైల్‌కి గంట పట్టేదట. ఎన్టీఆర్ వెరైటీ హెయిర్‌స్టైల్‌తో హ్యాండ్సమ్గా కనిపించిన ‘నాన్నకు ప్రేమతో..’కి స్టైలిస్ట్‌గా చేసిన హకీమ్ అలీయే ఈ చిత్రానికీ హెయిర్ స్టైలిస్ట్. డ్రామా కంపెనీలో ‘జై లవకుశ’లు సినిమాలో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అందులో డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఒకటని భోగట్టా! ఈ నాటకాల కంపెనీతో జై, లవకుశలకు ఓ లింక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలనుందా? వెయిట్ అండ్ సీ. అవుటాఫ్ కంట్రీలో ఆడియో వర్క్ మామూలుగా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే సమ్ టైమ్స్ నెల పైనే పడుతుంది. ఈ సినిమాకి పట్టింది జస్ట్ వారం రోజులు మాత్రమే. ఎన్టీఆర్–బాబీ–మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆడియో ఫైనలైజ్ చేయడం కోసం అవుటాఫ్ కంట్రీ వెళ్లారు. అక్కడ వారం రోజులు ఉన్నారని సమాచారం. అక్కడే నాలుగు ట్యూన్స్ ఫైనలైజ్ చేసుకుని, ఇండియా వచ్చారు. ఇక్కడికొచ్చాక దేవి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేశారు. ఈ పాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కనువిందు చేస్తారు. ఈ పాట కోసం భారీ సెట్ వేశారు. ఈ పాటలో తమన్నా చిందేసింది జైతోనే అని సమాచారం. హీరోయిన్లను ఎలా సెలక్ట్ చేశారంటే? ఈ సినిమాలో 20, 30 సినిమాలు చేసిన కథానాయిక లను కాకుండా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న, వీలైతే ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసిన నాయికలను తీసుకోవాలను కున్నారట. ఎవరైతే బాగుంటుందా? అనుకుంటున్న టైమ్ లో నాని ‘జెంటిల్మన్’ రిలీజైంది. అందులో మలయాళ భామ నివేథా థామస్ యాక్టింగ్ సూపర్బ్. ఈ చిత్రంలో మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న కథానాయిక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అలాగే, పర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్... రెంటికీ స్కోప్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ కోసం పలు పేర్లను పరిశీలించారు. సరిగ్గా అప్పుడే బొద్దుగుమ్మ రాశీఖన్నా స్లిమ్‌గా మారి, ఫొటోషూట్ చేయించుకున్న ఫొటోలు బయటికొచ్చాయట. అంతే... రాశీ ఖన్నాను ఫిక్స్ చేశారు. నందితను ఓ నాయికగా తీసుకున్నారు. నాన్‌స్టాప్ టు నత్తి... ఏదైనా! నందమూరి కుటుంబం అంటే పవర్ఫుల్ డైలాగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్‌కి నాన్‌స్టాప్‌గా డైలాగులు పలికే కెపాసిటీ ఉంది. అలాంటిది ఆయన్ను నత్తిగా నత్తిగా మాట్లాడమంటే? కొంచెం కాదు... చాలా కష్టం. కానీ, సిన్మా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న నటుడు ఎన్టీఆర్. అందుకే నత్తిగా మాట్లాడటం ప్రాక్టీస్ చేశారు. దీనికోసం ఎవరి హెల్పూ తీసుకోలేదట. తనంతట తాను ప్రాక్టీస్ చేసి, వాయిస్ రికార్డ్ చేసేవారు. ఫైనల్లీ... వాటిలో ‘ది బెస్ట్’ అనిపించినది సెలక్ట్ చేసుకుని, యూనిట్ సభ్యులకు వినిపిస్తే అందరూ ఆశ్చర్యపోయారట. ‘ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’ అంటూ ‘జై’ పాత్ర కోసం ఎన్టీఆర్ నత్తి నత్తిగా మాట్లాడిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ‘జై’ టీజర్: జూలై 6న రిలీజైంది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో సుమారు కోటీ 75 లక్షలమంది చూశారు. ‘లవ’ టీజర్: ఆగస్టు 24న విడుదలైంది. యూట్యూబ్‌లో అరవై ఆరు లక్షలమందికి పైగా చూశారు. ‘కుశ’ టీజర్: మూడు రోజుల క్రితం (సెప్టెంబర్ 7న) విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ లిస్టులో ట్రెండ్ అవుతోంది. శనివారం రాత్రి 7 గంటల వరకు సుమారు 27 లక్షల మంది చూశారు. క్వారీలో రిస్క్ ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ నాలుగైదు ఉన్నాయి. వాటిలో క్వారీ ఫైట్ ఒకటి. ఈ ఫైట్ ఎన్టీఆర్ ఒళ్లు హూనం చేసింది. కాళ్లకు అక్కడక్కడా దెబ్బలు తగిలాయి. అయినా నో రెస్ట్. పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఫైట్ లాగించేశారట. ఈ ఫైట్‌తో పాటు మిగతా ఫైట్స్ థ్రిల్‌కి గురి చేస్తాయట. ఎన్టీఆర్ కెరీర్లో హై బడ్జెట్ మూవీ ఇప్పటివరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటì కన్నా ఇది బడ్జెట్ ఎక్కువ. తమ్ముడి మీద ప్రేమతో అన్న ఖర్చుపెట్టారేమో అనుకోవద్దు. కథ అంత డిమాండ్ చేసిందట. ఎంత అంటే? 80 కోట్ల రూపాయలని భోగట్టా. థియేట్రికల్, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ అందుకు తగ్గట్టుగానే సేల్ అయ్యాయని టాక్. శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 15 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకుందట. థియేట్రికల్ రైట్స్ 86 కోట్లకు సేల్ అయ్యాయని టాక్. హిందీ డబ్బింగ్ రైట్స్ 12 కోట్ల రూపాయలని సమాచారం. మొత్తంగా 113 కోట్లు. అంటే.. రిలీజ్‌కు ముందే దగ్గర దగ్గర 30 కోట్లు లాభం అని టాక్. రిలీజయ్యాక కలెక్షన్స్ రేంజ్ రికార్డ్ స్థాయిలో ఉంటుందని అంచనా. ఒక్క ఎన్టీఆర్ స్క్రీన్ మీద ముగ్గురిలా ఎలా కనిపిస్తాడు? ఏముంది? ఒకరు ఒరిజినల్... మిగతా రెండు పాత్రలనూ డూప్‌తో షూట్ చేసి ఉంటారనుకుంటున్నారా? అఫ్కోర్స్, అలా కూడా చేయొచ్చు. కానీ, ఒరిజినల్ ఎన్టీఆర్ స్థాయిలో డూప్స్ యాక్ట్ చేయగలుగుతారా? అందుకే ‘జై లవకుశ’లో డూప్ షాట్స్ చాలా చాలా తక్కువ. మరి.. ఒకే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకేసారి స్క్రీన్‌పై ఎలా కనిపించారు? ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఛోటా కె. నాయుడు ఆ టెక్నిక్ గురించి చెప్పారు. ఈ సినిమా గురించి ఆయన మాటల్లో... ‘‘ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘అదుర్స్’ మూవీకి నేనే కెమెరామేన్. ఆ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్‌లు కనిపించే సీన్స్ తక్కువ. కానీ, ‘జై లవకుశ’ సినిమా సెకండాఫ్‌లో ఒకేసారి మూడు పాత్రలు కనిపించే సీన్స్ ఎక్కువ. లవ, కుశ పాత్రలు ఓకే కానీ, ‘జై’ క్యారెక్టర్ షూట్ మాత్రం టెన్షన్‌గా అనిపించేది. రావణాసురుడి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న లవ, కుశ కూడా అందుకు తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంటారు. డైలాగ్స్ కూడా ఉంటాయి. డూప్స్‌తో వర్కవుట్ అవ్వదు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అందుకే ముందు ఒక క్యారెక్టర్ని లైవ్‌లో షూట్ చేసి, మిగతా రెండు క్యారెక్టర్స్‌ని గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసేవాళ్లం. ఆ తర్వాత సీజీ వర్క్‌లో లైవ్‌లో షూట్ చేసిన క్యారెక్టర్‌తో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసిన క్యారెక్టర్స్‌ని మ్యాచ్ చేసేవాళ్లు. సో.. ఎక్కువ క్రెడిట్ సీజీ వర్క్‌కే ఇస్తా. హరి (కల్యాణ్‌రామ్ బంధువు)కి సొంత సీజీ స్టూడియో ఉంది. అక్కడ అనిల్ ఆధ్వర్యంలో జరిగిన సీజీ వర్క్ ఫెంటాస్టిక్. నిజానికి టెక్నికల్‌గా ఏం చేశాం? అనేది మాటల్లో చెప్పడం కష్టం. విజువల్‌గా చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకి కొత్త కెమేరాలు వాడలేదు. అయితే ఆస్ట్రేలియా, ముంబై నుంచి ‘మోషన్ కంట్రోల్ కెమెరా’ని తెప్పించాం. అది ఎందుకంటే, జనరల్‌గా షూటింగ్లో క్యారెక్టర్స్ మూవ్ అవుతాయి. కానీ, కెమెరా ఒకేచోట ఉంటుంది. కానీ, ఈ సినిమాకి కెమెరానే ఎక్కువగా మూవ్ అయింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కెమెరా. రెంటే ఐదు కోట్లు. టోటల్లీ ఈ మూవీ అందరికీ ఓ ఛాలెంజ్. ఎన్టీఆర్‌కి పెద్ద సవాల్. ఒకే రోజున మూడు పాత్రలు చేసినప్పుడు ఇన్‌డోర్‌లో మేం లైట్ సెట్ చేసుకుంటాం కానీ, అవుట్డోర్ అప్పుడు ఇబ్బందిపడే వాళ్లం. ఎన్టీఆర్ లవ, కుశ పాత్రలు చేశాక, సరిగ్గా ‘జై’ షూట్ మొదలుపెట్టేటప్పటికి సన్ లైట్ డ్రాప్ అయ్యేది. మళ్లీ ఆ లైట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాలి. మాకంటే ఓకే. కానీ, ఓ ఆర్టిస్ట్ అంతసేపు ఆ క్యారెక్టర్ మూడ్‌లో ఉండటం మామూలు విషయం కాదు. చాలా ఓపిక కావాలి. అందుకే ఎన్టీఆర్‌కు హ్యాట్సాఫ్. ఈ సిన్మాలో ఎన్టీఆర్ ‘బెస్ట్ పర్ఫార్మెన్స్’ని చూస్తారు. – డి.జి. భవాని -
‘షల్ వీ బిగిన్’కు రూ.16.75 కోట్లు!
జూనియర్ ఎన్టీఆర్ నటిం చిన అదుర్స్ సినిమా... అందులో చారి పాత్రలో విలన్ ఇంట్లో చేరిన ఎన్టీఆర్ మాట్లాడే మూడు ముక్కలు గుర్తున్నాయా..! ‘ఏమో గుర్తులేదు.. తెలీదు.. మర్చిపోయా’ అం టూ లక్షల రూపాయలు తీసుకుం టాడు. సరిగ్గా అలాంటి సన్నివేశమే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్లో జరిగింది. అందులో ఓ నటి మూడే మూడు ముక్కలు ‘షల్ వీ బిగిన్’ అని పలికి 2.6 మిలియన్ డాలర్లు (రూ. 16.75 కోట్లు) రెమ్యునరేషన్ తన ఖాతాలో వేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరియల్. ఈ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటివరకు ఆరు సిరీసుల్లో వచ్చిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్ వసూళ్లు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఇందులో నటించే వారి పారితోషికాలు చూస్తే మాత్రం సగటు అభిమాని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇందులో ఎమిలియా క్లార్క్, కిట్ హరింటన్, లేనా హెడీ, పీటర్ డింక్లేజ్, నికోలస్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరూ సుమారు రెండు మిలియన్ డాలర్లు పుచ్చుకున్నారు. వారు మాట్లాడిన మాటలను బట్టి రేటు పెరుగుతుంది. ఒక్కొక్కరూ ఎపిసోడ్‌కు 2.6 మిలియన్ డాలర్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కిట్ హరింటన్ మాట్లాడిన పదాలు 560. అంటే ఒక్కొక్క పదానికి సుమారు 4,642 డాలర్లు తీసుకున్నారు. లీనా హెడీ పలికిన పదాలకి 6,565 డాలర్లు, నికోలస్ కోస్టర్ పదాలకి 7,647 డాలర్లు తీసుకోగా, ఎమిలియా క్లార్క్ మాత్రం ఎపిసోడ్లో మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియన్ డాలర్లు తీసుకుంది. అది కూడా ‘షల్ వీ బిగిన్’ అని చిలుక పలుకులు మాత్రమే పలికి! -
ఎన్టీఆర్ బయోపిక్‌పై తారక్ కామెంటు
హైదరాబాద్: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితచరిత్రపై సినిమా అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, బాలకృష్ణ ఎన్టీఆర్ జీవితంపై (వేర్వేరుగా?) సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ఆసక్తిరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తాత బయోపిక్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. హైదరాబాద్ మదాపూర్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన బిగ్‌బాస్ ప్రీ లాంచ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా విషయమై తారక్ అభిప్రాయాన్ని కోరాగా.. ఆయన స్పందిస్తూ ‘నందమూరి తారక రామారావు గారు ఏ ఒక్క కుటుంబానికి చెందిన వారో కాదు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు ప్రజల సొత్తు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. తన జీవితానికి ఎన్టీఆరే స్ఫూర్తి అని, ఎందరో అభిమానులకు ఆయన దైవంతో సమానమని పేర్కొన్నారు. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌పై సినిమా చేయడంపై స్పందిస్తూ.. ఇది బ్రహ్మాండమైన విషయమన్నారు. ఎన్టీఆర్ జీవితచరిత్రపై సినిమా రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద అంశాలను కూడా తెరపై చూపిస్తానన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పుడే ఎందుకు సినిమా రూపొందే సమయంలో వాటి గురించి ఆలోచిద్దాం. అప్పటివరకు వేచి చూద్దాం అంటూ దాటవేశారు. -
సీనియర్ ఎన్టీఆర్‌గా జూనియర్?
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘మహానటి’ సినిమా నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో న్యూస్ బయటికొస్తోంది. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో పెద్ద ఎన్టీఆర్ పాత్రకూ ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ఆ పాత్రలో వేరెవరో కంటే చిన్న ఎన్టీఆర్ అయితే బెస్ట్ అని ‘మహానటి’ బృందం ఆలోచనట. అందుకే ఎలాగైనా జూనియర్ని ఒప్పించాలనుకుంటున్నారట. మరి తాత పాత్రలో మనవడు నటిస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ. -
శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు రెడీ
చెన్నై చిన్నది సమంత శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఒక పక్క సినిమాలు, మరో పక్కపెళ్లి కార్యక్రమాలతో యమ బిజీగా ఉన్నారు నటి సమంత. ఈ బ్యూటీ టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి నాగచైతన్య అక్టోబర్ 6 అంటూ ముహూర్తం కూడా వెల్ల డించేశారు. కాగా ఇటీవల విజయ్‌కు జంటగా ఆయన 61వ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్న సమంత మరో పక్క తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో నటిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్‌తో మరో తమిళ చిత్రం చేసేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును వారి తొలి కాంబినేషన్లో చిత్రం ఈ నెల 16న ప్రారంభం కానుందన్న తాజా సమాచారం. వరుస విజయాలతో జోరు మీదున్న శివకార్తికేయన్ ప్రస్తుతం వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం మరో పది రోజుల ప్యాచ్‌వర్క్‌తో పూర్తి అవుతుంది. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అంతకుముందు పొన్రాం దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన పొన్రాం మూడోసారి ఆయనతో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అదే విధంగా రెమో, వేలైక్కారన్ చిత్రాలను నిర్మించిన ఆర్డీ.రాజానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నారు. డి.ఇమాన్ ఇప్పటికే పాటలకు బాణీలు కట్టే పనిలో బిజీగా ఉన్నారట. సమంత పెళ్లికి ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారట. -
బిగ్‌బాస్ కమింగ్ సూన్!
‘హాయ్.. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్‌బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పీఏడిఎమ్ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్‌కి ఎస్సెమ్మెస్ చేయండి.. ప్లీజ్ ఓట్ ఫర్ మీ!’ గుర్తుందా.. దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఓట్ల కోసం పడిన పాట్లు! ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న తెలుగు బిగ్‌బాస్‌లో బ్రహ్మానందం రియల్‌గానే పార్టిసిపేట్ చేస్తారేమో! ఇంకా ఎందరు ప్రముఖులు బిగ్‌బాస్‌లో పార్ట్ తీసుకుంటారేమో! బిగ్ బాస్ త్వరలో తెలుగులో... మధ్యతరగతి ఇళ్లల్లో సీసీ కెమెరా పెడితే ఎలా ఉంటుంది? కలర్స్ చానల్లో ప్రసారమైన బిగ్‌బాస్ రియాలిటీ షోలా ఉంటుంది! ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి ఎందుకు డిస్కషన్ అనే డౌట్ వచ్చింది కదా? ఒక ప్రముఖ తెలుగు చానల్ ఆ షోను ‘బిగ్‌బాస్’ పేరుతోనే త్వరలో ప్రసారం చేయబోతోంది. హిందీలో సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేసిన ఈ షోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చేయనున్నారు. అదీ బిగ్ న్యూస్. హిందీ బిగ్ బాస్ ... థీమ్ వివిధ రంగాలకు చెందిన పద్నాలుగు మంది ప్రముఖులు ఈ షోలో పాల్గొంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇంటిని నిర్మిస్తారు. దాన్ని ‘బిగ్ బాస్ హౌజ్’ అని వ్యవహరిస్తుంటారు. అంగుళం అంగుళం సీసీ కెమెరా లెన్స్‌లో బందీ అయి ఉంటుందీ ఈ ఇల్లు. అంతేకాదు బయటి ప్రపంచం ఊసు తెలియకుండా ఏకాంత ప్రదేశంలో ఉంటుంది. పద్నాలుగు మంది సభ్యులు మూడు నెలలు ఈ ఇంట్లో ఉండాలి. అంటే ఈ షో దాదాపు మూడు నెలలు కొనసాగుతుందన్నమాట. ప్రతి వారం ఈ ఇంట్లోని పద్నాలుగు మంది సభ్యులు తమ తోటి సభ్యులిద్దరిని నామినేట్ చేస్తుండాలి. ఎవరైతే ఎక్కువ మంది నామినేషన్ పొందుతారో వాళ్లు పబ్లిక్ వోటింగ్ అంటే ప్రేక్షకుల వోటింగ్‌కి వెళతారు. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతుంటారు. చివరకు ముగ్గురు మిగులుతారు. ఈ ముగ్గురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన సభ్యుడు లేదా సభ్యురాలు విజేతగా నిలిచి నిర్దేశించిన ప్రైజ్ మనీని గెలుచుకుంటారు. బిగ్ బాస్ రూల్స్ చాలా సింపుల్. హిందీ బిగ్‌బాస్‌లో అయితే పాల్గొనే పద్నాలుగు మంది సభ్యుల మాతృభాష ఏదైనా సరే బిగ్ హౌజ్‌లో మాత్రం కేవలం హిందీలోనే మాట్లాడాలి. అత్యవసర పరిస్థితి వస్తే తప్ప మూడు నెలలు ఈ ఇంటిని వదిలి వెళ్లకూడదు. అలాగే తాము నామినేట్ చేయబోయే వ్యక్తుల గురించి సభ్యులు ఇతర సభ్యులతో చర్చించకూడదు. బిగ్‌బాస్ (హోస్ట్) వీళ్లకు కనపడకుండా కేవలం గొంతు మాత్రం వినిపిస్తుంటాడు. తాము నామినేట్ చేయబోయే సభ్యుల గురించి కూడా ఓ ప్రత్యేక కాబిన్లాంటి గదిలోకి వెళ్లి మైక్‌లో వినిపిస్తున్న బిగ్ బాస్‌తో మాత్రమే చెప్పాలి. అలాగే పగటిపూట అంటే డే టైమ్‌లో ఈ సభ్యులెవరూ నిద్రపోకూడదు. ఈ పద్నాలుగు మంది గాక అప్పుడప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రత్యేక అతిథులు ఈ హౌజ్‌కి వస్తుంటారు. నైన్టీన్ ఎయిటీ ఫోర్ బిగ్ బాస్‌కు మూలం నెదర్లాండ్స్‌లో ప్రసారం అయిన ‘బిగ్ బ్రదర్’ రియాలిటీ షో. ఇది ప్రసారం అయిన కొన్నిరోజుల్లోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. ఎంతలా అంటే 40 దేశాలు తమ తమ భాషల్లో.. ఈ షోని రీమేక్ చేసుకునేంతగా. 1949లో జార్జ్ ఆర్వెల్ అనే రచయిత ‘నైన్టీన్ ఎయిటీఫోర్’పేరుతో ఓ నవల రాశాడు. ఒక నియంత తన దేశంలోని ప్రతి పౌరుడి కదలికల మీద నిఘా పెట్టి వాళ్ల వ్యక్తిగత జీవితాలనూ కట్టడి చేస్తుంటాడు. ఈ కథాంశంతో వెలువడ్డ ‘నైన్టీన్ ఎయిటీఫోర్’ నవల ఘనవిజయం సాధించింది. ఈ నవల పబ్లిష్ అయిన దాదాపు 50 ఏళ్లకు అంటే 1999లో ‘బిగ్ బ్రదర్’ రియాలిటీ షో బిగిన్ అయింది. ఆ బిగ్ బ్రదర్ నుంచి మనం ‘బిగ్ బాస్’ను తెచ్చుకున్నాం. తొలి హోస్ట్ అర్షద్ వార్సీ ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ మొదలైంది 2006లో. అప్పటి నుంచి పదో సీజన్ (2017 జనవరి) వరకూ పది సీజన్స్ టెలికాస్ట్ అయ్యాయి. నటుడు అర్షద్ వార్సీతో ఫస్ట్ సీజన్ మొదలైంది. ఫోర్త్ సీజన్‌కి కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఎంటర్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. 96 రోజుల పాటు సాగిన ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ 5.15. అంతకుముందు రేటింగ్‌తో పోల్చితే దాదాపు డబుల్ అయింది. విశేషం ఏంటంటే.. ఆరో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకూ సల్మాన్ ఖానే హోస్ట్. సల్మాన్ హోస్టింగ్ ‘సూపర్’ అనిపించుకుంది. మళ్లీ తొమ్మిది, పది సీజన్లకు ఆయనే హోస్ట్. 2.90, 3.54 టీఆర్పీ రేటింగ్. ఇప్పుడు పదకొండో సీజన్‌కి అంతా రెడీ అవుతోంది. ఈ షోలో పాల్గొనేవాళ్లు మే నుంచి జూన్ చివరి లోపు నిబంధనలకు అనుగుణంగా తమ వివరాలను పంపించాలి. అక్టోబర్‌లో షో మొదలవుతుంది. ఇప్పటికి ఆరు ‘బిగ్ బాస్’ సీజన్స్‌ని సూపర్‌గా నిర్వహించిన సల్మాన్ ఖాన్ లెవెన్త్ సీజన్‌కి హోస్ట్‌గా ఉంటారా? లేదా? కలర్స్ ఛానల్ ‘దస్ కా ధమ్’ షోకు మళ్లీ ఆయన్ను తీసుకోవాలనుకుంటోందట. మరి.. ఈ షో ఒప్పుకుంటే సల్మాన్ ‘బిగ్ బాస్’ చేయగలుగుతారా? అనే ఉత్కంఠ అటు సినిమా ఇండస్ట్రీలోనూ నెలకొంది. హౌస్ ఫుల్‌గా సెలబ్రిటీలు, చుట్టూ కెమెరాలు, ఆ సెలబ్రిటీల మధ్య స్నేహాలు, ప్రేమలు, ఫైటింగ్‌లు, ద్వేషాలు, నమ్మక ద్రోహాలు, డ్రామా.. భారతీయ టీవీ వీక్షకుల కన్నులకు ఇంతకు మించిన పండుగ ఏముంటుంది? ఒక్కమాటలో.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అనేది.. రోజులు, నెలల పాటు సాగే బాలీవుడ్ మూవీ అనుకోండి. ఇప్పటి వరకు 10 సీజన్లుగా ‘బిగ్ బాస్’ టీవీలో ప్రసారం అయింది. ఈ పదేళ్ల విశేషాలలో కొన్ని ఆసక్తికరమైన సంగతులు... ►బిగ్ బాస్ హిస్టరీలో అత్యధికంగా ఎవిక్షన్ ఓట్లు పడిన పార్టిసిపెంట్ పూజా మిశ్రా. బిగ్ 5లో ఎనిమిది వారాల పాటు ఆమె షోలో ఉన్నారు. ►వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ షో లోకి ప్రవేశించిన వారిలో ఒక్కరు కూడా ఇంతవరకు విజేత కాలేదు. అజాజ్ ఖాన్ అవుతాడనుకున్నారు. కాలేదు. ►కొన్నిసార్లు కంటెస్టెంట్లకు తిండిక్కూడా కరువొస్తుంటుంది. సోనాలీ రావత్ అయితే చాలాసార్లు ఉప్పు లేని పప్పు, మసాలాలతో సరిపెట్టుకున్నారట. ►ఒక్క ఎవిక్షన్ ఓటు కూడా లేకుండా ఎక్కువ రోజులు హౌస్‌లో నిలబడిన రికార్డు మాత్రం నవ్‌జోత్‌సింగ్ సిద్ధూదే. ►బిగ్ బాస్ షో లో లిక్కర్ అడిగిన వారికి జ్యూస్ బాక్సులో లిక్కర్ పోసి ఇస్తారని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ► బిగ్ బాస్‌లో కనిపించిన తొలి అంతర్జాతీయ కంటెస్టెంట్ జేడ్ గూడీ. మధ్యలో క్యాన్సర్ బయట పడడంతో గూడీ షో నుంచి విరమించుకున్నారు. 2009తో ఆమె చనిపోయారు. ► బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ బిగ్ బాస్ చరిత్రలోనే ఎక్కువసార్లు బిగ్ ఎవిక్షన్ (తొలగింపు) కు గురయ్యారు. ► యంగెస్ట్ విజేత గౌతమ్ గులాటీ. బిగ్ బాస్ 8లో విన్ అయ్యే నాటికి అతడి వయసు 27. ప్రస్తుతం 29. ఇతడూ టీవీ యాక్టరే. ► బిగ్ బాస్ షో లో 3వ సీజన్ అన్ని సీజన్ల కన్నా అతి తక్కువగా 84 రోజులు మాత్రమే నడిచింది. ఇప్పటివరకు 105 రోజులే హయ్యస్ట్. ► బిగ్ బాస్ షో లో పగటిపూట నిద్రపోకూడదు. ఎవరికైనా నిద్ర వస్తే కెమెరా కంట పడకుండా టేబుల్ కిందో, సోఫాల వెనకో పడుకునేవారు. ►షోకి ఓ సీజన్లో గెస్టుగా వచ్చిన అంతర్జాతీయ నటి పమేలా ఆండర్సన్.. మూడు రోజులు హౌస్‌లో ఉన్నందుకు రూ.2 కోట్ల 50 లక్షలు చార్జి చేశారు. ►బిగ్ బాస్‌లో ఇప్పటివరకు ఓల్డెస్ట్ విజేత.. విందు దారాసింగ్. బిగ్ బాస్ 3 లో గెలిచే నాటికి ఈ టీవీ నటుడి వయసు 41 ఏళ్లు. ప్రస్తుతం 53 ఏళ్లు. ► సారాఖాన్, అలీ మర్చంట్ల పెళ్లి బిగ్ బాస్ రియాలిటీ షో లోనే జరిగింది. అయితే రెండు నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు! ►సీజన్ 7 తొలిసారిగా 105 రోజులు నడిచింది. ఆ తర్వాత 8, 9, 10 సీజన్లు 105 రోజులు నడిచాయి. వీటన్నిటికీ సల్మాన్ ఖానే హోస్ట్. ►షోలో ఉన్న కంటెస్టెంట్లకు కొన్నిసార్లు బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి. అప్పుడు ఒకరివి ఒకరు వేసుకుని కనిపిస్తారు! ►రేడియో జాకీ ప్రీతమ్ తన కూతురుకు నడక రావడాన్ని తొలిసారి బిగ్ బాస్ షో లోనే చూశాడు. ఎత్తుకుని మురిసిపోయాడు. ‘బిగ్‌బాస్’ లాంటి టాప్ షో ద్వారా ఎన్టీఆర్ బుల్లితెరకు పరిచయం కానుండడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉందని ప్రముఖ టీవీ యాంకర్ సుమ తెలిపారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం టీవీ చాలా అభివృద్ధి దశలో పయనిస్తోంది. దీనికి ఉదాహరణే... మొన్న నాగార్జున గారు, నిన్న చిరంజీవి గారు, నేడు తారక్ హోస్ట్‌లుగా వచ్చారు. ఈ కోవలోకి ఇంకా ఎంతమంది వస్తారో వేచి చూడాలి. తారక్ విషయానికి వస్తే అతని స్క్రీన్ ప్రెజెన్స్, వాగ్ధాటి సూపర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చిన్నితెరపై ఎలా ఉంటుందో మీ అందరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. టెలివిజన్ పరిశ్రమ పెద్దగా ఫీలయ్యే క్షణాలివి’’ అన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర మీద ప్రత్యక్షం కానున్నారు. సోనీ చానల్లో బహుళ ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ‘ స్టార్ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. హిందీలో ఈ బిగ్ బాస్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షోకు ఎన్టీఆర్ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు కూడా. ఇక ఇప్పటికే తమిళంలో అగ్రనటుడు కమల్ హాసన్ ...‘బిగ్ బాస్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. -
రూట్ మార్చిన చెన్నై చిన్నది
చెన్నై చిన్నది సమంత రూట్ మార్చారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన జనతాగ్యారేజ్ చిత్రం తరువాత నటుడు నాగచైతన్యతో ప్రేమ, నిశ్చితార్థం అంటూ నటనకు చిన్న గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా మళ్లీ బిజీ అయ్యారు. తమిళంలో విజయ్ 61వ చిత్రంతో పాటు, విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, అనీతి కతైగళ్ అనే మరో చిత్రం, అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న మహానది చిత్రం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీ అయ్యిపోయారు. ఆ మధ్య సూర్యకు జంటగా నటించిన అంజాన్ చిత్రంలో టూ పీస్ దుస్తులతో నటించి పెద్ద దుమారానికి తెర తీసిన సమంత తరువాత నటనకు అవకాశం ఉన్న చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకూ హాస్యానికి ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించని ఈ ముద్దుగుమ్మ తాజాగా విశాల్‌కు జంటగా నటిస్తున్న ఇరుంబుతిరై చిత్రంలో తొలిసారిగా కడుపుబ్బ నవ్వించే పాత్రలో నటిస్తున్నారట. ఇందులో రోబో శంకర్‌తో కలిసి సమంత పండించే హాస్యానికి చిత్ర యూనిట్ తెగ నవ్వేస్తున్నారట. ఇకపై నటిగా తన రూట్ మార్చుకోవాలన్న సమంత తన పాత్రల్లో వినోదానికి పెద్ద పీట వేసేలా చూసుకుంటుందట. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఇరుంబుతిరై చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి. -
షార్ట్ అండ్ స్వీట్!
క్యూట్ క్యూట్‌గా మాట్లాడే కాజల్ అగర్వాల్ దగ్గర ‘షార్ట్ అండ్ స్వీట్’గా ఆన్సర్ చెప్పమంటే ‘ఓ యస్’ అంటారు. ఈ బ్యూటీని ఆమె అభిమానులు కొంతమంది సెలబ్రిటీల గురించి అడిగారు. ఆ స్టార్స్ గురించి కాజల్ ఏం చెప్పారంటే... ♦ పవన్‌కల్యాణ్ గురించి ఒక్క మాటలో? క్రియేటివ్ ...అండ్ వెరీ ప్రొఫెషనల్ ♦ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి... అందగాడు. ♦ జూనియర్ ఎన్టీఆర్... అత్యంత ప్రతిభావంతుడు. ♦ ప్రభాస్ గురించి 1 వర్డ్.. బాహుబలి ♦ రామ్‌చరణ్... బహుముఖ ప్రజ్ఞాశాలి. ♦ త్రీ ఫేవరెట్ విలన్ రోల్స్? ‘బాహుబలి’లో రానా, ‘ధృవ’లో అరవింద్ స్వామి. ‘పడయప్పా’లో రమ్యకృష్ణ. ♦ డ్రీమ్ డైరెక్టర్? మణిరత్నం. ♦ సమంత గురించి ఒక్కమాటలో.. కష్టపడే తత్వం. ♦ ప్రియాంకా చోప్రా.. ఇన్స్పిరేషన్. ♦ మీ చెల్లెలు నిషా గురించి.. నా సోల్‌మేట్. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రిటర్న్స్ సార్... మీరు లేకపోతే లేకపోయారు. మా నీలాంబరినైనా సమాధానం చెప్పమనండి. ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు ప్రాక్టీస్ మానేసి! ఇంచుమించు 1800 డేస్. నా లవ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరకడం లేదు. ఓ అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తున్నాను సార్. మీరు మానేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయిని ఫాలో అవుతున్నాను. రోజూ ట్రై చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. నిద్రలేదు. ఆకలి లేదు. చదువు లేదు. మీకు దండం పెడతాను. ఏం చెయ్యమంటారో నీలాంబరితోనైనా చెప్పించండి డాక్టర్... ప్లీజ్. – సురేశ్, చిత్తూరు కిటికీలోంచి బయటికి చూస్తోంది నర్సు నీలాంబరి... లవ్ ప్రాబ్లమ్‌లు పట్టనట్టు, నన్ను పట్టించుకోనట్టు. ‘సో మెనీ డేస్... వేర్ డిడ్ యు గో’ అన్నట్టు. ఈ సమ్మర్ టైమ్‌లో వీధిలో చూడ్డానికి ఏముంటుందని! నాజూగ్గా... గాలి రాకుండా నాకు అడ్డం నిలబడడం తప్ప. ఉక్కబోస్తోంది. నా అనుమానం ఏంటంటే ఈ ఉత్తరం అసలు ఒక లవర్ దగ్గరి నుంచి కాకుండా... నీలాంబరి రాసి పోస్ట్ చేసి ఉంటుందని! నన్ను ఎలాగైనా వెనక్కి రప్పించేసి, ఈ లవ్ ప్రాబ్లమ్లలో నన్ను కుక్కేసి, ఆమె లవ్ నర్స్‌గా ఎక్కేయాలని చేసిన సర్జికల్ స్ట్రయిక్‌గా అనిపించింది. ‘‘హలో... నీలాంబరీ... ఒక అరటిపండు ఉందా?’’ అని అడిగా. ‘‘ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది ఉంది. తింటారా?’’ అంది!‘‘ఆ ఉత్తరం రాసినవాడి ప్రేమలాగే ఉంటుంది. కుళ్లిపోయి, ఎండిపోయి, కంపుకొడుతూ. ఏదో జూనియర్ ఎన్టీఆర్ అంటే అనుకోవచ్చు. ఫాలో... ఫాలో... ఫాలో... ఫాలో... ఫాలో... అని నాలుగైదుసార్లు అంటే హీరోయినే కాదు, ఆడియన్స్ కూడా ఫాలో అవుతారు. ఫైవ్ ఇయర్స్... ఈ లవ్ ప్రాబ్లమ్స్ భరించలేక అరటితోట సాగు చేసుకుంటున్నా. కరవొచ్చి, నీళ్లు లేక, సేద్యానికి సర్వమంగళం పాడి, ఇక లాభం లేదు... నాలుగు సమాధానాలు వెనకేసుకుందామని వెనక్కి వచ్చేశా. నువ్వు బెట్టు చెయ్యకుండా ఒక్క ఫ్రెష్ అరటిపండు ఇవ్వు నీలాంబరీ. అదే చేత్తో ఆ లవర్ బాయ్‌కి కూడా ఒక అరటిగెల పంపించు. అరటిపండును ప్రేమించడం మొదలుపెడితే పండు లాంటి కెరియర్ మీద శ్రద్ధ పెరుగుతుంది. అమ్మాయిల మీద ధ్యాస తగ్గుతుంది. ఏమంటావు నీలాంబరీ’’ అన్నాను. ‘‘అరటితోట వర్కవుట్ కాక, మీరు అరటిపండు దగ్గరికి వచ్చారు. అలాగే లవర్ బాయ్‌కి లవ్వు వర్కవుట్ కాలేదు కాబట్టి అరటిగెల పంపిస్తున్నారు’’ అంటూ ఫక్కున నవ్వింది నీలాంబరి. ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ పనిచేయనున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్, షట్టర్ ఐలాండ్ వంటి చిత్రాలకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన వాన్స్ హార్ట్వెల్ ఎన్టీఆర్‌కు మేకప్ మేన్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. లాస్ఏంజెల్స్ నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ శనివారం చెన్నైలో జూనియర్ ఎన్టీఆర్‌తో గంటసేపు చర్చలు జరిపారు. బాబీ దర్శకుడిగా ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులో ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొంటారని, మార్చిలో మేకప్ ఆర్టిస్ట్ హార్ట్వెల్ వస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి. మూడు రకాల గెటప్‌తో ఎన్టీఆర్ ఈ సినిమాలో పూర్తి వెరైటీ లుక్‌తో ఉంటారని చెబుతున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్గా కాగా మరో హీరోయిన్ నూ ఇంకా నిర్ణయించాల్సి ఉందని సమాచారం. -
బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు?
బాలకృష్ణ నూరో చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై పలువురు అగ్రహీరోలు, దర్శకులు అంతా స్పందించారు. బాలకృష్ణ అన్న కొడుకులు నందమూరి తారక రామారావు, కళ్యాణ్‌రాం కూడా దీనిపై తమ స్పందన ఏంటో తెలిపారు. తారక్ ముందుగానే ఈ సినిమాకు తన శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్‌తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలని, దర్శకుడు క్రిష్‌కు కూడా ఆల్ ద బెస్ట్ అని సినిమా విడుదలకు ముందే ట్వీట్ చేశాడు. ఇక హరికృష్ణ మరో కొడుకు నందమూరి కళ్యాణ్‌రామ్ అయితే సినిమా విడుదలైన తర్వాత స్పందించాడు. జీపీపెస్కే స్టన్నింగ్‌గా ఉందని అన్నాడు. 2017 ప్రారంభం అదిరిపోయిందని చెప్పాడు. దాంతోపాటు ఖైదీ నెంబర్ 150 హీరో చిరంజీవికి అభినందనలు తెలిపాడు. ఇంకా విడుదల కావాల్సి ఉన్న శతమానం భవతి, కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలకు గుడ్‌లక్ చెప్పాడు. Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100 — tarakaram n (@tarak9999) 11 January 2017 #GPSK is stunning.Great start to 2017.Congratulations Chiranjeevi garu for Khaidi150. Good luck Shatamanam &Constable Venkatramayya teams — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 12 January 2017 -
జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన నటుడు
కోలీవుడ్‌లో కమర్షియల్ చిత్రాలకు చిరునామా దర్శకుడు హరి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సామి, తామిరభరణి, ఆరు, సింగం, పూజై, సింగం-2 ఇలా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ పూర్తిగా మాస్ మసాలా చిత్రాలే. వాటిలోనూ రమ్యమైన ప్రేమ, వినోదభరిత సన్నివేశాలంటూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా జాగ్రత్త పడడం హరి స్పెషాలిటి. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదం అయి అక్కడి ప్రేక్షకులను అలరించడం మరో విశేషం. తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్‌హిట్ చిత్రం లక్ష్మినరసంహా తమిళంలో హరి దర్శకత్వం వహించిన సామి చిత్రానికి రీమేక్అన్నది గమనార్హం. కాగా తాజాగా సూర్య హీరోగా ఎస్-3 పేరుతో సింగంకు మూడో భాగాన్ని తెరకెక్కించారు. అనుష్క, శ్రుతీహసన్ లాంటి ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సింగం, సింగం-2ల కంటే మరింత అదుర్స్‌గా ఉంటుందని అంటున్న దర్శకుడు హరితో సాక్షి చిట్‌చాట్ ప్ర. ఎస్-3 చిత్రం ఎలా ఉండబోతుంది? జ. నా చిత్రాలు కమర్షియల్ ఫార్ములాలోనే ఉంటాయన్నది తెలిసిందే. సింగం, సింగం-2 చిత్రాల కంటే ఎస్-3 మరింత భారీ హంగులతో ఉంటుంది. కాక్కక్కాక, సింగం, సింగం-2 చిత్రాల తరువాత సూర్యను నాలుగో సారి పోలీస్ అధికారిగా చూపించడం అంటే అంత ఈజీ కాదు. అయినా ఆయన్ని చాలా కొత్తగా చూపించాను. ప్ర. ఎస్-3 చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏమి చెప్పనున్నారు? జ. ఇందులో అంతర్జాతీయ సమస్యను చూపబోతున్నాం. దేశ సమైక్యతను, గొప్పతనాన్ని చెప్పనున్నాం. నా చిత్రాలు కమర్షియల్‌గా ఉంటాయంటారు. అందువల్ల ఈ సారి కమర్షియల్ అంశాలతో పాటూ కుటుంబ సమేతంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలన్న లక్ష్యంగా ఎస్-3ని తరకెక్కించాను. ప్ర. చిత్ర భారీతనం గురించి? జ. ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల కంటే అత్యధిక రోజులు చిత్రీకరించిన చిత్రం ఎస్-3. ఈ చిత్రాన్ని 125 రోజులు చిత్రీకరించాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు రొమేనియా, ఆస్ట్రేలియా, మలేషియా, వంటి విదేశాల్లోనూ షూటింగ్ నిర్వహించాం. ప్ర. సూర్యను గత చిత్రాలకు భిన్నంగా చూపించడానికి తీసుకున్న జాగ్రత్తల గురించి? జ. సూర్య ఇందులో పోలీస్ యూనిఫాం లేకుండా కొంత భాగం, యూనిఫాంతో కొంత భాగం కనిపిస్తారు. ఆయన డ్రస్సింగ్ స్టయిల్, యాక్టింగ్ అన్నీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. ప్ర. హీరోయిన్లు, అనుష్క, శ్రుతీహాసన్‌ల గురించి? జ. అనుష్క చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చిత్రానికి చాలా కీలకంగా ఉంటుంది. ఇక శుత్రీహాసన్ది చాలా డేరింగ్ పాత్ర. అదే సమయంలో గ్లామర్‌కు కొరత ఉండదు. ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడో విషయం చెప్పాలి. ఎస్-3 చిత్ర ప్రారంభానికి ముందే అనుష్కను కలిసి ఈ చిత్రంలో మీ పాత్ర ఎంత ఉంటుందో చెప్పలేను. మీరు నటిస్తారా? అని అడగ్గా సింగం చిత్ర కుటుంబంలో నేను ప్రధాన వ్యక్తినని, అందువల్ల ఒక గంట అయినా నేనీ చిత్రంలో నటించడానికి రెడీ అని అనుష్క అన్నారు. ప్ర. చిత్రంలో హైలైట్స్ గురించి? జ. హైలైట్స్ గురించి చెప్పాలంటే 8 ఎయిర్‌పోర్టులలో చిత్రాన్ని చిత్రీకరించాం. ఇక పోరాట సన్నివేశాలు, చేజింగ్స అంటూ చిత్రం వేగంగా సాగుతుంది. ఐటమ్ సాంగ్‌లో నటి నీతుచంద్రా నటించారు. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ప్ర. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని అన్నారట? జ; అవునా? అలా ప్రచారం జరుగుతోందా? నిజం చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నటించిన టెంపర్ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. నాలుగైదు సార్లు ఎన్టీఆర్‌ను కలిశాను కూడా. ఇంకా చెప్పాలంటే ఆయనతో చిత్రం చేయాలన్నది నా కోరిక. ఆయనకు కథ కూడా చెప్పాను. అయితే అది సెట్ కాలేదు. ప్ర. తెలుగులో చిత్రం చేస్తారా? జ. చేయాలని ఆశగా ఉంది. అందుకే తెలుగు భాషను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్ర. టాలీవుడ్లో మీకు ఇష్టమైన దర్శకుడు? జ : అలా చెప్పడం చాలా కష్టం. చాలా దర్శకులంటే ఇష్టం. లెజెండ్ చిత్రాన్ని బోయపాటి శ్రీను, టెంపర్ దర్శకుడు పూరి జగన్నాధ్, శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇలా చాలా మంది దర్శకులు అద్భుతంగా చేస్తున్నారు. -
అలాంటి పాత్రలు రావడం కష్టమే
దక్షిణాదిలో హీరోయిన్లకు అర్ధవంతమైన పాత్రలు చేసే అవకాశం రావడం చాలా కష్టమేనని చెన్నై చంద్రం సమంత వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేయకుండా చాలా రిలాక్స్‌గా ఉన్నారు. ఈ మధ్య సమంత తెలుగు, తమిళ భాషల్లో నటించిన చిత్రాలన్నీ విశేష ప్రేక్షకాదరణను పొందాయన్నది గమనార్హం. ఇటీవల తన జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన జనతాగ్యారేజ్ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. పలు అవకాశాలు వస్తున్నా అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమంతపై పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఈ అమ్మడి వీర ప్రేమగాథ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇక పీపీపీ..డుండుండుంమే తరువాయి అన్న ప్రసారం జోరుగా సాగుతోంది. అందుకే కొత్త చిత్రాలను సమంత అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే సమంత వివరణ వేరేలా ఉంది. తాను క్షణం తీరిక లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నానని, అందుకే కాస్త విశ్రాంతి అవసరం అనిపించి చిత్రాలను అంగీకరించడం లేదనీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. తాజాగా దక్షిణాదిలో హీరోయిన్లకు అర్థవంతమైన పాత్రలు లభించడం కష్టమనే విషయం అర్థమైందన్నారు. అలాంటి పాత్రలు రాకపోవడంతోనే అంగీకరించడం లేదని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సమంతతో వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని శనివారం చెన్నైకి వచ్చిన నాగచైతన్య మీడియాతో వెల్లడించారు. ఇక సమంత విషయానికి వస్తే తమిళంలో శివకార్తికేయన్ సరసన ఒక చిత్రం చేయడానికి అంగీకరించారు. పొన్రామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. -
ఈ గ్యారేజ్‌కి స్పృహ ఎక్కువ
కొత్త సినిమా గురూ! పర్యావరణ పరిరక్షణకి భంగం కలిగితే ఉద్యమించే ఒక కథానాయకుణ్ణి రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమాలో ఊహించగలమా? ధర్మం కోసం కన్న కొడుకునైనా కడ తేర్చే తండ్రిని దాదాపు హీరో తర్వాత హీరో అంతటి పాత్రలో చూడగలమా? సిద్ధాంతం కోసం ప్రేమని వదులుకొనే హీరో, ప్రేమించిన మనిషి మానసిక ఘర్షణని అర్థం చేసుకొని అతణ్ణే వదులుకొనే హీరోయిన్ - ఇలా ఎన్నో ఊహకందని పాత్రల సమాహారం - ‘జనతా గ్యారేజ్’. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, జనతా గ్యారేజ్ అనే ఆటోమొబైల్ రిపేర్ షాపును పెట్టి నడుపుతుంటాడు సత్యం (మోహన్‌లాల్). గ్యారేజ్‌లోని మిగతా మెకానిక్‌లతో కలసి, కష్టం చెప్పుకున్నవాళ్ళకు అండగా నిలిచి, అన్యాయాన్ని అడ్డుకుంటూ వాళ్ళను కాపాడుతుంటాడు. ఆ క్రమంలో ఆఖరికి సొంత తమ్ముణ్ణీ, అతని భార్యను ప్రత్యర్థులు హతమారుస్తారు. పసిగుడ్డయిన ఆ తమ్ముడి బిడ్డ ఆనంద్ (జూనియర్ ఎన్టీఆర్) ఆ సంగతులేవీ తెలియకుండా, ఆ కుటుంబానికి దూరంగా ముంబయ్‌లో మేనమామ (సురేశ్) దగ్గర పెరుగుతాడు. పర్యావరణ పరిశోధక విద్యార్థి అయిన హీరోకి మొక్కలంటే ప్రేమ. ప్లాస్టిక్ బ్యాగ్‌ల దుర్వినియోగం సహా అన్నింటిపై ధ్వజమెత్తే రకం. మేనమామ కూతురు (సమంత)తో అతనిదో ప్రేమ ప్రయాణం. పని మీద హీరో హైదరా బాద్ వెళతాడు. అక్కడ సత్యం కొడుకు రాఘవ(ఉన్ని ముకుందన్), వ్యాపారవేత్త ముఖేశ్ రాణా (మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్)కి అల్లుడై, కన్నతండ్రికే ఎదురుతిరిగి, పర్యావరణానికి చేటు చేస్తుంటాడు. హీరో అక్కడ కూడా పర్యావరణ పరిరక్షణ ఎజెండాతో గొడవకు దిగుతాడు. హత్యాయత్నంతో వెనక్కు తగ్గిన వయసు మీరిన సత్యం పక్షాన జనతా గ్యారేజ్‌కి వారసుడవుతాడు. ఆయనే తన పెద నాన్న అని తెలుసుకుంటాడు. తర్వాత సమాజానికి వారేం చేశారన్నది మిగతా సిన్మా. శరీరాకృతిలో భారీ మార్పులతో సంబంధం లేకుండా చిన్న ఎన్టీఆర్‌లో డ్యాన్సింగ్ ట్యాలెంట్ అలాగే ఉందని ఈ సినిమాలో పాటలు మరోసారి గుర్తు చేస్తాయి. సినిమా అంతా కనిపించే ఉబ్బిన కళ్ళ సాక్షిగానే అయినా, ఉబికి వచ్చే కన్నీళ్ళతో సెకండాఫ్‌లో హీరో చేసిన సెంటిమెంటల్ సీన్, ప్రభుత్వాఫీస్ సీన్ సూపర్. హీరోయిన్లిద్దరూ కథ సగంలో వచ్చి, కథనం మధ్యలోనే కనుమరుగై పోతారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ది ఫస్టాఫ్‌లో యాక్టివ్‌గా, సెకండాఫ్‌లో కేవలం విగ్రహపుష్టితో సాగే పాత్ర. ఆ పరిధిలో ఆయన, దీటుగా హీరో నటించారు. నటనకు అవకాశమెలా ఉన్నా, తెర నిండా ఆర్టిస్టులకు అవకాశమిచ్చిన కథ ఇది. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ప్రకృతి గీతం ‘ప్రణామం’ మాత్రం కొద్దిరోజుల పాటు పదే పదే వినిపిస్తుంది. హీరోయిన్లతో హీరో చేసే నేచర్టూర్ పాటలో, ప్రకృతిని తెరకెక్కించే షాట్స్‌లో తిరు కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ తరహాలో సామాజిక స్పృహ చాలా ఎక్కువే ఉన్న ఈ సినిమా సుదీర్ఘంగా, వీలైనంత తాపీగా నడుస్తుంటుంది. కథ అక్కడక్కడే తిరుగుతుంటుంది. సమాజంలోని ప్రతి విలన్‌కీ రిపేర్ చేయాలనుకోవడం, రకరకాల ఘటనలతో విలన్ ట్రాక్ ఎఫెక్టివ్‌గా అనిపించదు. తమ్ముడి కుటుంబాన్ని చంపినవారిపై మోహన్‌లాల్ కానీ, చివరకు వారి పిల్లాడైన హీరో కానీ ఆఖరి దాకా ప్రతీకారం తీర్చుకోకపోవడం, ఊళ్ళో అందరితోనే గడిపేయడం కూడా రెగ్యులర్ సిన్మాకు భిన్నమైన రూటనుకోవాలి. మొత్తానికి ‘ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ అని వచ్చిన ‘జనతా గ్యారేజ్’లోనూ చాలా రిపేర్లకి ఛాన్స ఉంది. అదే క్షణంలో ప్రకృతికీ, ప్రజలకీ మధ్య బ్యారేజ్‌గా ఈ గ్యారేజ్ కథకి చిన్న గుర్తింపూ మిగులుతుంది. చిత్రం: ‘జనతా గ్యారేజ్’, తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమేరా: ఎస్. తిరునావుక్కరసు, యాక్షన్: అనల్ అరసు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్, రచన, దర్శకత్వం: కొరటాల శివ - రెంటాల జయదేవ -
జనతా గ్యారేజ్.. కాంబో ప్యాకేజ్ !
థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్ విక్రయాలు విజయవాడలో మల్టీప్లెక్స్‌ల మాయాజాలం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అ‘ధనం’ తప్పనిసరి స్నాక్స్ పేరిట అడ్డగోలు దోపిడీ విజయవాడ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా టికెట్లు బ్లాకులో హల్చల్ చేస్తున్నాయి. గురువారం విడుదల కానున్న ఈ చిత్రం టికెట్లకు బ్లాక్‌లో డిమాండ్ పెరిగింది. విజయవాడలో ఒక్కో టికెట్ ధర రూ. రెండున్నర వేలు పలుకుతోంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే వంద థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరుసటి రోజు నుంచి 25 థియేటర్లలో ఆడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విజయవాడలో మల్టీప్లెక్స్ థియేటర్లలో బుధవారం నుంచే ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, అభిమానులు, పార్టీ నాయకులు ఇలా ఆన్లైన్లో ముందస్తు అమ్మకాలు సాగించారు. అడ్వాన్స్ బుకింగ్లోనూ అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాక్ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక ధరనిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. కాంబో ప్యాక్ పేరుతో రకరకాల తినుబండారాలు అంటగట్టేవిధంగా ప్యాకేజీ నిర్ణయించి అధిక ధరలు గుంజారు. అన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకూ అదనంగా మరో రూ. 130 వసూలు చేశారు. కాంబో ప్యాక్ ధర చెల్లిస్తేనే ఆన్లైన్ టికెట్లు ఇస్తామని బుకింగ్‌లలో సిబ్బంది తెగేసి చెప్పేశారు. కొత్త సినిమా చూడాలన్న తాపత్రయంతో ఉన్న ప్రేక్షకులు అధిక ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. ఇక సాధారణ థియేటర్ల వద్ద కూడా బ్లాకులో విక్రయాలు సాగించారు. థియేటర్ల వద్ద కోలాహలం .. : జనతా గ్యారేజీ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడ నగరంతోపాటు, జిల్లాలోని పలు థియేటర్ల వద్ద బుధవారం నుంచే సందడి నెలకొంది. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, ప్రాంతాలలోని థియేటర్ల వద్ద టికెట్ల అమ్మకాల కోలాహలం కనిపించింది. కొన్ని థియేటర్ల వద్ద ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతుండగా, మరికొన్ని థియేటర్లలో బుకింగ్‌ల ద్వారా టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అభిమాన సంఘాల పేరుతో పార్టీ నాయకులు టికెట్లు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదలను పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
‘గ్యారేజ్’పై రాజకీయం!
- గతంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకూ ఇలానే అడ్డంకులు - బాలకృష్ణ, లోకేశ్ తీరుపై జూనియర్ అభిమానుల ఫైర్ - కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరికలు - సీఎం వద్ద పంచాయితీ.. ఎట్టకేలకు అనుమతి సాక్షి, అమరావతి: జూనియర్ ఎన్టీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాకు థియేటర్ల కోసం జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఆటంకాలు కల్పించడం అప్పట్లో దుమారానికి దారితీసింది. తాజాగా సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోకు అడ్డంకులు కల్పించేలా తెరవెనుక రాజకీయం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరికలతో ఆ వ్యూహం ఫలించలేదు. నందమూరి తారక రామారావు సొంత జిల్లాలోనే జూ.ఎన్టీఆర్ సినిమాకు బ్రేకులు వేయాలని చూడటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తే మచిలీపట్నం కలెక్టరేట్, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాకు దిగుతామంటూ జూనియర్ అభిమానులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులను కలిసి హెచ్చరించారు. ఇది మరో వివాదంగా టీడీపీ మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఎట్టకేలకు మంగళవారం రాత్రి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల 31 అర్ధరాత్రి దాటిన తరువాత జిల్లా వ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా 34 బెనిఫిట్ షోలు ప్రదర్శనకు అనుమతించాలని మూడు రోజుల క్రితమే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను డిస్ట్రిబ్యూటర్లు రాతపూర్వకంగా కోరారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతిలేదంటూ కృష్ణా జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూటర్లకు మంగళవారం ఉదయం మౌఖికంగా చెప్పడంతో వివాదానికి దారితీసింది. సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి వద్దకు తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. సినిమా బెనిఫిట్ షో అనుమతి నిరాకరణ వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉండటంతో మంత్రులు సైతం మౌనముద్ర దాల్చినట్టు సమాచారం. చివరకు చంద్రబాబు వద్దకే ఈ పంచాయితీ వెళ్లింది. జూనియర్ సినిమాను అడ్డుకుంటే బాలకృష్ణ, లోకేశ్ ఇలా చేశారని ప్రజలు విశ్వసిస్తారని, ఇది మంచిది కాదని సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు చెప్పినట్లు సమాచారం. -
'ఎన్టీఆర్, మోహన్‌లాల్.. మ్యాజిక్ చేశారు'
రెండంటే రెండే సినిమాలు తీసి.. వాటితోనే తారాపథంలోకి వెళ్లిపోయిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్, మహేశ్ బాబులతో మిర్చి, శ్రీమంతుడు తీసి రెండింటినీ బంపర్ హిట్ చేసిన శివ.. ఇప్పుడు ఎన్టీఆర్, మోహన్‌లాల్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి 'జనతా గ్యారేజ్' చే శాడు. నిజానికి ఇంత పెద్ద స్టార్లను ఒకే ఫ్రేములో చూపించడం, వాళ్లతో కలిసి పనిచేయడం తనకు చాలా అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, వాళ్లు మ్యాజిక్ చేశారని అన్నాడు. వాళ్లిద్దరితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి అనిపిస్తుందని, కేవలం ఆ ఇద్దరు కలిసి ఉండటంతోనే జనతా గ్యారేజి సినిమాకు ఎక్కడలేని హైప్ వచ్చేసిందని చెప్పాడు. పెర్ఫామెన్సు విషయానికి వస్తే, ఇద్దరు పెద్ద నటులు ఒకే సినిమాలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవచ్చో ఇందులో చక్కగా చూపించారని అన్నాడు. గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా కథను కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే రాశానని కొరటాల శివ తెలిపాడు. కథ గురించిన ఐడియా వచ్చిన సమయంలోనే.. దీనికి కేవలం ఎన్టీఆర్ అయితేనే సరిపోతాడని తాను అనుకున్నానన్నాడు. స్క్రిప్టు విన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుతో ఇక పూర్తిగా ఫిక్సయిపోయానని తెలిపాడు. ఒక నటుడు ప్రాజెక్టును గురించి ఎంతగా ఎగ్జైట్ అవుతాడన్నది దర్శకుడికి చాలా ముఖ్యమని, ఇక తనను ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా ఎన్టీఆర్‌కు చాలా బాగా తెలుసని అన్నాడు. హీరోలు ప్రతి ఒక్కరికీ విభిన్నమైన శైలి ఉంటుందని, ఎన్టీఆర్ శైలిని ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో చూపిస్తున్నానని ధీమా వ్యక్తం చేశాడు. తెలుగులో చాలామంది పెద్ద నటులున్నా, వారిని కాదని మోహన్‌లాల్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న చాలామంది నుంచి వచ్చిందని, కానీ ఆ పాత్రకు ఆ స్థాయి నటుడైతేనే సరిపోతుందని శివ చెప్పాడు. వాళ్లిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని తాను భావించానని, అలాగే ఉందని అన్నాడు. మోహన్‌లాల్ కూడా కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారన్నారు. ఇంతకుముందు సాధించిన విజయాల నేపథ్యంలో ఈ సినిమా ఎంత హిట్టవుతుందనే ఆలోచన కంటే, ప్రేక్షకులు దీన్ని ఎలా తీసుకుంటారోననే తనకు ఆసక్తిగా ఉందని కొరటాల అన్నారు. పరీక్ష రాసిన పిల్లాడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లే తనకూ ఉందన్నాడు. సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా చేస్తున్న విషయం తెలిసిందే. -
జూనియర్ ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం!
కొంతమంది హీరోలకు కొందరు దర్శకులపై గురి కుదురుతుంది. వాళ్ల పనితీరు, సినిమా విషయంలో వాళ్ల నిబద్ధత, స్టోరీ చెప్పే విధానం.. టేకింగ్ అన్నీ చూస్తే సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంటుంది. అందుకే సినిమా ఇంకా విడుదల కాకముందే మరో సినిమా చేయడానికి ముందుకొస్తారు. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాతో టీమప్ అయిన ఎన్టీఆర్ - కొరటాల శివలది ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది. ఆ సినిమా తీస్తున్న తీరుతో బాగా ఇంప్రెస్ అయిన తారక్.. వచ్చే ఏడాది మళ్లీ కొరటాల శివతోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబులకు మిర్చి, శ్రీమంతుడు లాంటి బంపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శివ.. ఇప్పుడు జనతా గ్యారేజ్ రూపొందిస్తున్న తీరు చూస్తే ఇది కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఎన్టీఆర్ అంటున్నాడట. అందుకే వచ్చే ఏడాది శివ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయాలని వీళ్లిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఈలోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్లీ శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు జూనియర్ సిద్ధం అయిపోతున్నట్లు తెలుస్తోంది. మళయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఆగస్టు నెలలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్ గ్యారేజి ఓనర్ కాగా, ఎన్టీఆర్ ఆయన మేనల్లుడిగా నటిస్తున్నాడు. మళయాళ నటులు ఉన్ని ముకుందన్, రహమాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
త్రివిక్రమ్ - దిల్ రాజు సినిమాకు హీరో ఎవరు?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి హీరో ఎవరు? దిల్ రాజు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందే సినిమాలో నటించే గోల్డెన్ చాన్స్ ఎవరికి దక్కుతుంది? ప్రస్తుతం ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. 'అ.. ఆ' సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌ను హీరోగా తీసుకోవచ్చన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేశ్ బాబులతో రెండేసి సార్లు పనిచేసిన ఈ స్టార్ డైరెక్టర్.. ఈసారి వాళ్లు కాక మరో కొత్త హీరోతో చేయాలని భావిస్తున్నాడట. అందుకే తాను ఇప్పటివరకు పనిచేయని చెర్రీ లేదా తారక్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రామ్‌చరణ్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్ 'ధ్రువ'లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేస్తున్నాడు. త్రివిక్రమ్ తన కొత్త సినిమా కథ చెప్పగానే ఎన్టీఆర్ బాగా థ్రిల్లైపోయి.. వెంటనే సరేనన్నాడని కూడా వినిపిస్తోంది. కొన్ని వారాల్లోనే హీరో ఎవరన్నది ఫైనలైజ్ అవుతుందని, ఇక వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
మేము సైతం రహదారి భద్రత ఉద్యమంలో..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏకు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రవాణా శాఖ చేపట్టే రహదారి భద్రతా ఉద్యమంలో తాము కూడా పాల్గొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వారు విడివిడిగా శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. మొదట అక్కినేని అఖిల్ తన నూతన కారు మెర్సిడెస్ బెంజ్ (రూ. 1.94 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. తనకు నచ్చిన నంబర్ ‘టీఎస్ 09 ఈఎల్ 9669’ కోసం ఇటీవల వేలంలో రూ. 46,500 చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఏ అధికారులతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ‘డ్రంకన్‌డ్రైవ్’పై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరించారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల్లోనూ తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం తన కొత్త వాహనం బీఎండబ్ల్యూ (రూ. 1.21 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కారు కోసం ఆయన ఇటీవలే ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ నంబర్ కోసం వేలంలో రూ. 10.5 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆల్‌నైన్ నంబర్ కోసం ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి. వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘ఆర్టీఏ చేపట్టే రోడ్డు భద్రతా ఉద్యమంలో పాల్గొనాలని’ జేటీసీ రఘునాథ్ ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఆర్టీవో జీపీఎన్ ప్రసాద్, ఇతర అధికారులు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. -
ఫ్యాన్సీ నంబర్.. స్టేటస్ సింబల్..
వాహనదారుల్లో తీవ్ర పోటీ ఆర్టీఏకు కనకవర్షం ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ ఆర్టీఏ నిర్ణయించిన ఫీజు రూ.50 వేలు. వేలంలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన మొత్తం రూ.10.50 లక్షలు. ‘టీఎస్07 ఈఎక్స్ 9999’ నంబర్‌కు గచ్చిబౌలికి చెందిన ఓ ఖరీదైన వాహన యజమాని చెల్లించిన మొత్తం రూ.5.77 లక్షలు. గురువారం మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో ‘టీఎఫ్ 11 ఈఎఫ్ 9999’ నంబర్ కోసం ఓ కాంట్రాక్టర్ చెల్లించింది రూ.4.80 లక్షలు. కారు ఉంటే హోదా రాదు.. ఎంత ఖరీదైన కారు కొన్నావన్నది కాదు.. దానికి ఫ్యాన్సీ నంబర్ ఉందా.. లేదా..! అన్నదే ముఖ్యం. అందుకే ‘9,1,999,9999, 786,6, 666,1111’ వంటి నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్సీ నంబర్ క్రేజ్ ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. తమకు నచ్చిన నంబర్ల కోసం వాహనదారులు లక్షలు వెచ్చించేందుకు వెనుకాడ్డం లేదు. ఇదే ఆర్టీఏకు కనకవర్షం కురిపిస్తోంది. సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ నెలకొంటోంది. వాహనదారులు పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బెక్ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. నచ్చిన నంబర్లకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించిన వేలం పాటల్లో ఇలాంటి నంబర్లపై రూ.20.25 కోట్ల ఆదాయం లభించింది. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’తో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభించడం విశేషం. హోదా కోసమే ఎక్కువ.. అదృష్ట సంఖ్యలుగా భావించే నంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే సామాజిక హోదా కోసం, పేరు కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు వంటి భిన్న రంగాలకు చెందినవారు ‘లక్కీ’ నంబర్ల కోసం ఎగబడుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల కోసం వేలాది మంది పోటీపడుతున్నారు. నచ్చిన నంబర్ లభించనివారు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. సెంటిమెంట్‌తో మరికొందరు.. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నంబర్లతో అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రే జీకి కారణమే. జ్యోతిషం ప్రకారం తమ స్వభావానికి తగిన నంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంత స్వభావానాకి, గురుగ్రహ ప్రభావం కోసం ‘3’, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఇలా 1 నుంచి 9 వరకు నమ్మకాలున్నాయి. ఇక ఎక్కువ మంది కోరుకునే ‘9’ కుజ గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో తిరుగులేని నాయకులుగా ఎదగాలంటే ఈ నెంబ ర్ ఉండాలని భావిస్తారు. ఈ క్రేజ్ ఎనిమిదో దశాబ్దం నుంచే.. ప్రస్తుతం ఖరీదైన వాహనాలతో పాటే నగరంలో ఫ్యాన్సీ నంబర్లకు సైతం క్రేజ్ పెరిగింది. కానీ 1980 నుంచే ఈ నంబర్ల పట్ల వాహనదారుల్లో మక్కువ ఉంది. ‘9999’ వంటి నెంబర్లు అప్పట్లో రూ. 500 కే లభించేవి. ఎలాంటి పోటీ ఉండేది కాదు. అప్పట్లో ఎన్టీ రామారావు ‘27’, 999’, ‘9999’ వంటి నంబర్లకు ప్రాధాన్యతనిచ్చేవారు. పైగా ప్రముఖులు నివసించే ప్రాంతం కావడంతో ఖైరతాబాద్‌లో ఈ నెంబర్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఆదాయం పెరిగింది గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నంబర్లపై అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్యాలయంలో గతంలో రూ. 2 కోట్ల ఆదాయం ఇప్పుడు రూ.15 కోట్లకు పెరిగింది. లగ్జరీ వాహనాల వినియోగం పెరగడం, ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా ఈ నంబర్ల కోసం గట్టి పోటీ ఉంటోంది. - టి.రఘునాథ్, హైదరాబాద్ జేటీసీ నంబర్‌ను గిఫ్టుగా ఇస్తున్నారు.. ఇటీవల వినియోగదారులు తమ కుటుంబ సభ్యులకు బహుమానంగా వాహనాలతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ‘1313’ (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘5121’ నంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. ‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లలకు ఎంతో క్రేజీ ఉంది. - జీపీఎన్ ప్రసాద్, ప్రాంతీయ రవాణా అధికారి, ఖైరతాబాద్ -
చంద్రబాబూ మీకా అర్హత లేదు..
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం ♦ ఎన్టీఆర్ సిద్ధాంతాలకు సమాధి కట్టారు ♦ మీ కొడుకు ఎదగకుండా పోతాడని జూనియర్ ఎన్టీఆర్‌ను తరిమేశారు సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొనడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి.. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనే హక్కు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రోజా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తన సొంత రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఆయనకు ఏవిధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసిందే..’ అని రోజా అన్నారు. ‘అధికారంలోకి వచ్చేందుకు ఎన్టీఆర్ పేరును, ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు వాడుకుంటారు. అధికారంలోకి వచ్చాక వదిలేస్తారు. పురందేశ్వరి, బాలకృష్ణ, హరికృష్ణను ఏవిధంగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారో తెలిసిందే. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, ఆశయాలకు చంద్రబాబు సమాధి కట్టారని రోజా విమర్శించారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే తమ పదవులకు ముందే రాజీనామా చేసి రావాలని పార్టీ మొదటి మహానాడు (1982)లోనే ఎన్టీఆర్ తీర్మానం చేశారని రోజా తెలిపారు. ఇప్పుడదే పార్టీని నడుపుతూ సిగ్గులేకుండా, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకపోయినా సంతలో పశువులను కొన్నట్టు వారిని కొంటున్న చంద్రబాబుకు ఈరోజు టీడీపీ జెండా ఎగురవేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కొడుకు కోసం జూ.ఎన్టీఆర్‌ను తరిమేశారు జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కుమారుడు పప్పుసుద్దగా మిగిలిపోతాడని, ఎదగకుండా పోతాడనే భయంతో జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోంచి తరిమివేశారని, ఆయన సినిమాలు విడుదల కాకుండా చూస్తున్నారని రోజా విమర్శించారు. ఈరోజు ఉన్నది టీడీపీ కాదని, తెలుగు దొంగల పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నిన్నటివరకు ఎదురుచూసినా ప్రివిలేజ్ కమిటీ నుంచి పిలుపు రానందుకే సుప్రీంకోర్టుకు వచ్చానని రోజా తెలిపారు. సుప్రీంకోర్టులో రోజా పిటిషన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యేలా అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై.. డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని, ఇందుకు అనుమతించాలని రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయమూర్తి తమకు అనుకూలంగా 22 పేజీలతో కూడిన ఉత్తర్వులు వెలువరించారని, ఏడాదిపాటు సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వ్యాఖ్యానించారని పిటిషన్లో వివరించారు. దీనిపై శుక్రవారం (ఏప్రిల్ 1న) విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. -
'జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు'
ఎన్టీఆర్‌ను గానీ, ఆ పేరును గానీ ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా ఆమె కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన పప్పుసుద్ద కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. ఎన్టీఆర్‌ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, ఈయన మాత్రం కాంగ్రెస్‌తో జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు సమాధి కట్టేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీద బాబుకు ఎంత కక్ష ఉందో స్పష్టంగా తెలుస్తుందంటూ పలు విషయాలు వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మంచినీళ్లను చవగ్గా అందిస్తామన్నారని, కానీ అవి రాష్ట్రంలో నాలుగైదు చోట్ల కూడా లేవని చెప్పారు. అన్న క్యాంటీన్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్కటీ పెట్టలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మార్చారని.. కానీ గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్ల బకాయిలతో ఆ పథకానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌ను ప్రజలు గుర్తుపెట్టుకోవడం బాబుకు ఇష్టంలేదని, ఆయన పేరు చూస్తేనే బాబుకు కక్ష అని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాలను గుర్తించి ఇక ముందు కూడా ఈ చంద్రబాబు పార్టీలో కొనసాగుతారా.. లేదా ఆయన్ను తరిమేసి ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతారో చూడాలని అన్నారు. ఇప్పుడున్నది తెలుగుదేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ అని విమర్శించారు. ఈ గ్యాంగు తనను తొక్కేయాలని చూస్తోందన్నారు. చంద్రబాబు అడ్డదిడ్డంగా తన నాయకులను కాపాడుకోవడం కోసం కాల్‌మనీలో మహిళలు అన్యాయమైపోతున్నా పట్టించుకోవట్లేదని, ఇది 3 కోట్ల మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపై చర్చించాలని ప్రొటెస్ట్ చేశాం తప్ప ఎవరిమీదా తనకు వ్యక్తిగత ద్వేషం లేదని రోజా తెలిపారు. ఆరోజు అందరూ నిరసన వ్యక్తం చేస్తే.. ఒక్క తనమీద మాత్రమే చర్య తీసుకున్నారని గుర్తుచేశారు. తాను కామ సీఎం అనడం వల్ల సస్పెండ్ చేసినట్లు యనమల రామకృష్ణుడు చెప్పారని, కానీ నిజానికి ఐదు రోజుల పాటు పేపర్లన్నింటిలో ఇదే విషయం వచ్చిందని, దానిమీదే తాను వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు ఒత్తిడి చేశానని చెప్పారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళల సంక్షేమం కోసం కట్టుబడ్డానని, రిషితేశ్వరి, వనజాక్షి, అంగన్వాడీల విషయాన్ని లేవనెత్తాను కాబట్టి అణిచేస్తున్నారని అన్నారు. చివరకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా రాక్షసంగా అడ్డుకున్నారని చెప్పారు. తమకు నచ్చిన చానల్‌కే రికార్డింగ్ హక్కులు ఇచ్చి, తమకు నచ్చిన అంశాలనే ప్రసారం చేయిస్తున్నారంటే వాళ్ల దిగజారుడు రాజకీయాలు గమనించాలని అన్నారు. 18వ తేదీనాటి విషయం గురించి ఐదు రోజుల తర్వాత అనితను ఏడ్పించి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు .డివిజన్ బెంచి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేస్తున్నానని, తీర్పు కాపీ అందడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు రాలేకపోయానని అన్నారు. తనకు మరో అవకాశం ఇస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పారే గానీ ఇంతవరకు ప్రివిలేజ్ కమిటీ నన్ను పిలిచిన పాపన పోలేదని ఆమె తెలిపారు. సోమవారం వరకు ఎదురుచూసినా ఆ కమిటీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చానని చెప్పారు. మహిళలను వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. -
ఎన్టీఆర్, సూర్యలతో రాజమౌళి చిత్రం?
జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కలసి ఒక చిత్రం చేస్తే?ద్విభాషా చిత్రంగా అది భారీ అంచనాలతో కూడిన చిత్రంగా ఉంటుంది.ఇక ఆ చిత్రానికి బ్రహ్మాండ చిత్రాలను చెక్కే రాజమౌళి దర్శకుడైతే ఇక ఆ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయాలకు చిరునామాగా అద్భుత చిత్రాలు ఆనవాలుగా మారిన రాజమౌళి, మాస్‌ను ఇరగ దీసే జూనియర్ ఎన్టీఆర్, వైవిధ్యానికి తపించే సూర్యల కలయికలో అసలు చిత్రాన్ని ఊహించుకోవచ్చా? ఏమో అయితే అలాంటి ప్రచారానికి నెటిజన్లు తెర దీశారు. ఇప్పుడీ వార్త సినీ వర్గాల్లో మిక్కిలి ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాహుబలితో బ్రహ్మాండం రుచిని భారతీయ సినిమా చూపించిన రాజమౌళి ఇప్పుడు దానిని మించే అద్భుతాన్ని బాహుబలి-2లో ఆవిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ చిత్రం పూర్తి కాకుండానే ఆయన తదుపరి చిత్రం గురించి ఊహాగానాలు మొదలవడం గమనార్హం. అయితే నిప్పులేనిదే పొగ రాదన్న సామెతగా జూనియర్ ఎన్టీఆర్, సూర్యలతో చిత్రం చేయాలనే ఆలోచన రాజమౌళికి వచ్చి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ నటులిద్దరూ ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్వెళ్లూరుతున్నారని చెప్పవచ్చు. బాహుబలి చిత్రం ఆడియో ఆవిష్కరణ వేదికపైనే ఒక్క చాన్స్ అంటూ సూర్య దర్శకుడు రాజమౌళిని కోరడం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆయన దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ వంటి సంచలన విజయాల చిత్రాల్లో నటించారు. ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రం రూపొందినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇదే కనుక తెర రూపం దాల్చితే మరో టాలీవుడ్ స్టార్ హీరోను కోలీవుడ్‌లో త్వరలోనే చూడవచ్చు. ఇప్పటికే తోళా చిత్రంతో నాగార్జున మరోసారి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌ల రాక ఖరారైన విషయం తెలిసిందే. -
సమ్మర్ స్పెషల్ సమంతా
సమ్మర్(వేసవికాలం)కు సినిమాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పవచ్చు. పరీక్షలు రాసిన విద్యార్థులకు సెలవులు, వేసవి తాపానించి కాస్త స్వేద తీరాలని కోరుకునే సగటు ప్రేక్షకుడికి తొలి ఆప్షన్ సినిమానే.అందుకే సమ్మర్లో పలు చిత్రాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తుంటారు. అలాంటి వారిని నటి సమంత చిత్రాలు అలరించనున్నాయి. అలా ఈ సమ్మర్ సమంత స్పెషల్ కానుంది.దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్లలో సమంత ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలతో నటిస్తున్న లక్కీ హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. వాటిలో సూర్యకు జంటగా నటించిన 24,విజయ్ సరసన చేసిన తెరి, టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబు జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం బ్రహ్మోత్సవం చిత్రంలో పాటు నితిన్‌తో రొమాన్స్ చేస్తున్న అఆ చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్, మే నెలల్లో వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక పోతే ఈ ఏడాది ధనుష్‌తో వడచెన్నై, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్, కృష్ణవంశీ దర్శకత్వంలో రుద్రాక్ష వంటి భారీ చిత్రాలలో నటించనున్నారు. ఈ ఏడాదినే సమంత ఏడాది అనవచ్చునేమో.పైన పేర్కొన్న చిత్రాలన్నీ మంచి అంచనాలు ఏర్పరచుకున్న చిత్రాలే అన్నది గమనార్హం. -
'యంగ్ టైగర్‌కు జోడీగా నిత్య, సమంత'
చెన్నై: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమంత, నిత్యమీనన్‌తో ఆడిపాడనున్నారు. మిర్చి, శ్రీమంతుడులాంటి హిట్ చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, సమంత, నిత్యమీనన్ లు నటించనున్నారు . ఈ సినిమా వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకోసం తొలుత పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు సమంత, నిత్యమీనన్‌ల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఎన్టీఆర్‌కు అంకుల్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక దేవయాని, ఉన్ని ముకుందన్లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రధాన పాత్రల చుట్టే కథ తిరిగే ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించనున్నారు. -
ఓటెత్తిన సెలబ్రిటీ
ఓటు హక్కు ముఖ్యమైనది.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రధానమైనది. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విజయనిర్మలతో కలిసి నేను ఓటు వేశాను. ఏ ఎన్నికలు జరిగినా విధిగా ఓటు వేస్తా. ఇది నా బాధ్యతగా భావిస్తాను. మన నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేందుకు ఓటేయాలి. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - సినీనటుడు, కృష్ణ ఓటేసేవారికే ప్రశ్నించే హక్కు.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నేను భావిస్తా. దీని ద్వారా ప్రశ్నించే హక్కు వస్తుంది. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో ఓటు వేశాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్‌పై అవగాహన బాగా పెరిగింది. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలన్నదే నా అభిమతం. లేటైనా పర్వాలేదు.. కానీ ఓటు వేయడం మాత్రం మరిచిపోవద్దు. ప్రాథమిక హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - జూనియర్ ఎన్టీఆర్ ఇది అందరి బాధ్యత.. నాకున్న ఓటు హక్కును వినియోగించుకోవడం నా బాధ్యత. ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశాను. అవగాహన ఉన్నవారు.. చదువుకున్నవారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. - సినీనటుడు నరేష్ -
ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
-
ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 20వ వర్ధంతి పురస్కరించుకుని సోమవారం ఆయనకు ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబీకులు, తెలుగుదేశం పార్టీ నేతలు వేర్వేరుగా వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ఉండడంతో ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. ఎన్టీఆర్ కుమారులు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రామకృష్ణ, మాజీ ఎంపీ హరికృష్ణ ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి వేర్వేరుగా వచ్చి ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిలు కూడా సమాధి వద్ద నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎల్. రమణ, మాగంటి గోపీనాథ్, సాయిబాబ, కోటేశ్వర్రావు, ప్రదీప్ చౌదరి తదితరులు కూడా సమాధి వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ, బాలకృష్ణలు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు. కాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్‌లో ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయలేదని పార్టీ నేతలు, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.