RTC strike
-
బస్సు డ్రైవర్ కొడుకును.. వారి సమస్యలు తెలుసు: హీరో
సాక్షి, బెంగళూరు: డిమాండ్లను సర్కారు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగులు తీర్మానించడంతో బస్సుల సంచారంలేక ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. సమ్మెలో పాల్గొంటున్న రవాణా శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. గురువారం నాటికి సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రవాణాశాఖ ఉద్యోగులు కొవ్వొత్తులతో ధర్నాకు దిగారు. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం జీతాలను పెంచాలని స్పష్టం చేశారు. 2,237 మందికి తాఖీదులు.. ఎస్మా తప్పదన్న ప్రభుత్వం ఆ చట్టం ప్రయోగానికి వెనుకాడుతోంది. ప్రతిరోజు కొందరు ఉద్యోగులకు నోటీస్‌లు జారీ చేస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు రావాలని బీఎంటీసీ 2,237 మంది ఉద్యోగులకు ఆదేశాలు పంపింది. అయితే స్పందన లేదు. దీంతో వారందరూ సంజాయిషి ఇవ్వాలని మళ్లీ తాఖీదులు పంపారు. ఉద్యోగుల దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 బస్సులు ధ్వంసం అయ్యాయి. రవాణాశాఖ ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదిలేదని శుక్రవారం నుంచి వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. బెంగళూరు బస్టాండ్లలో బుధవారంతో పోలిస్తే గురువారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పండుగకు ఊరికివెళ్లి రైళ్లలో బెంగళూరుకు చేరుకున్న ప్రజలకు ఇళ్లకు వెళ్లేందుకు బీఎంటీసీ బస్సులు లేక ఉసూరన్నారు. ప్రైవేటు బస్సులే గమ్యం చేర్చాయి. అయితే నగరంలోని అనేక ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. మెజస్టిక్ రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్లలో రద్దీ కనిపించింది. రూ.170 కోట్ల నష్టం: డీసీఎం సమ్మె వల్ల ఇప్పటికి సుమారు రూ.170 కోట్లు నష్టం వచ్చిందని, వెంటనే విధులకు హాజరుకావాలని రవాణా మంత్రి, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం 4,500 రవాణాబస్సులు సంచరించాయన్నారు. ఇప్పటివరకు సమ్మెతో రూ.170 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. బస్సులపై రాళ్ల దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం 24 వేల ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి హీరో యశ్ మద్దతు బనశంకరి: ఒక బస్సు డ్రైవర్ కుమారునిగా తనకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసని ప్రముఖ నటుడు యశ్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో బుధవారం కన్నడ హీరో రాకింగ్‌స్టార్ యశ్ రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవదికి లేఖ రాసి, గురువారం స్వయంగా కలిసి మాట్లాడారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో ఆర్టీసీ కార్మికుల కష్టాలను పంచుకున్నారు. తన తండ్రి కూడా ఎన్నోసార్లు ఖాళీ కడుపుతో విధులకు వెళ్లిన సందర్భాలు తనకు గుర్తు ఉన్నాయని, ఇంతటి పని ఒత్తిడి ఉంటుందని వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవది కూడా స్పందించినట్లు చెప్పారు. సీఎంతో మాట్లాడి డిమాండ్లు చర్చిస్తామని చెప్పినట్లు ఆయన పోస్టు చేశారు. చదవండి: పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు 🙏 pic.twitter.com/VXdZfdf1xx — Yash (@TheNameIsYash) April 15, 2021 -
పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: అర్జంటుగా ఎన్నో పనులు. ఊరికి వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు బస్సుల్లో డబుల్ చార్జీలు. అవి కూడా దూరప్రాంతాలకు వెళ్లడం లేదు. కార్లు, క్యాబ్‌లను భరించే స్థోమత లేదు.. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలు ఎన్నో. రవాణా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలుచేయాలని ఉద్యోగులు, చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పాయి. ఇరు పక్షాలూ మెట్టు దిగకపోవడంతో పాతిక వేల బస్సులు బస్టాండ్లకే పరిమితం అయ్యాయి. యథా ప్రకారం లక్షలాది ప్రజలకు రవాణా సౌలభ్యం కనాకష్టమైంది. కండక్టర్ ఆత్మహత్య.. విధులకు రావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో బెళగావి జిల్లా సవదత్తిలో శివకుమార్ నీలగార (40) అనే కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవాణా ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయని ఉద్యోగులు శుక్రవారం సైతం సమ్మెను కొనసాగించారు. నోటీస్‌లను జారీచేయగా పట్టించుకోలేదు. కాగా, ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరారని బళ్లారిలో ఇద్దరు రవాణా సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు బస్టాండ్లు వెలవెల.. మూడోరోజు సమ్మె కొనసాగుతుండటంతో బెంగళూరు మరింతగా బోసిపోయింది. ఆర్టీసీ సమ్మెతో బస్టాండ్లు వెలవెలబోయాయి. మెజెస్టిక్‌లో బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఆటోలను ఆశ్రయించారు. ప్రభుత్వం సూచించిన రూట్‌మ్యాప్ ప్రకారం ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయి. ప్రైవేటు బస్సులకు.. పండుగ.. మూడురోజుల్లో ఉగాది పండుగ వస్తుండడంతో బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల నుంచి ఊళ్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు ఎక్కుతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవులు, సోమవారం ఒకరోజు సెలవు పెడితే మంగళవారం ఉగాది పండుగ కావడంతో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఊళ్ల బాట పట్టారు. ప్రైవేటు బస్సుల్లో అడిగినంత డబ్బు ఇచ్చి సొంత ఊళ్లకు వెళ్లక తప్పడం లేదని పలువురు వాపోయారు. అయితే బెంగళూరు నుంచి బళ్లారి, హుబ్లీ, రాయచూరు, కలబురిగి, బీదర్, బాగల్కోటె, విజయపుర, బెళగావి తదితర ఉత్తర కర్ణాటక నగరాలకు ప్రైవేటు బస్సులు వెళ్లడం లేదు. రైళ్లలో వెళదామనుకున్నా టికెట్లు సులభంగా దొరకడం లేదు. దీంతో ఊళ్లకు చేరేదెలా అని టెన్షన్ నెలకొంది. సమ్మె కొనసాగిస్తాం: కోడిహళ్లి సాక్షి బెంగళూరు: తెలంగాణలో మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేస్తామంటే చేసుకోండి. అది కూడా చూస్తాం అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ సవాలుచేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తున్నట్లు, సామాన్య ప్రజలు మరికొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. త్వరలో బెళగావిలో, కలబుర్గిలో రవాణా ఉద్యోగుల సమావేశాలను నిర్వహిస్తామన్నారు. విధులకు వస్తేనే చర్చలు: సీఎం బనశంకరి: ఆర్టీసీ ఉద్యోగులు పట్టువీడి విధులకు రావాలి, ఎవరి మాటలో విని బలిపశువులు కావద్దు అని ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సమ్మె విరమించి విధులకు హాజరయ్యే వరకూ ఆర్టీసీ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రవాణా ఉద్యోగులు పట్టువీడకపోవడం సరికాదన్నారు. మూడురోజుల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని, ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం సాధ్యం కాదని మరోసారి స్పష్టంచేశారు. బంద్ వల్ల ఆర్టీసీ మరింత నష్టపోతోందన్నారు. చదవండి: ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం -
ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం
సాక్షి, బెంగళూరు/బనశంకరి: ప్రజల సంచారానికి జీవనాడిగా పేరుపొందిన ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రజలకు రవాణా వసతి బంద్ అయ్యింది. అదే మాదిరి ప్రభుత్వ ఆదాయం కూడా. ఇటీవల కోవిడ్ లాక్డౌన్, డిసెంబరులో ఆర్టీసీ సమ్మె వల్ల రూ. 16 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేఎస్ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం బుధవారం నుంచి ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ సిబ్బంది వేతనాలకు నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక బస్సుల డీజిల్, నిర్వహణ కోసం రూ.300 నుంచి 400 కోట్లు ఖర్చుఅవుతుందని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. కానీ నెలవారీ ఆదాయం అంతమొత్తంలో లేదని ప్రభుత్వ వర్గాల కథనం. ఉద్యోగులు కోరుతున్నట్లు 6 వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తే ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. కోవిడ్ వల్ల రద్దీ తగ్గడం, సమ్మె మూలంగా రోజుకు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వస్తోందని అంచనా. కొనసాగుతున్న సమ్మె వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచాలనే డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకోగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం పట్టుదలతో శిక్షణలో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడపడానికి గురువారం ప్రయత్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రయాణ వసతి కరువై విలవిలలాడారు. బెంగళూరు సహా అనేక నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు వాహనాలే రవాణా అవసరాలను తీర్చాయి. లగేజ్, చిన్నపిల్లలను ఎత్తుకుని ప్రజలు బస్సులకోసం పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. బెంగళూరు మెజస్టిక్, శాటిలైట్, యశవంతపురతో పాటు ప్రముఖ బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. చాలాచోట్ల ప్రైవేటు బస్సులు కూడా తక్కువగా సంచరించాయి. ప్రైవేటు బస్సుల దొరుకుతాయనే ఆశతో వచ్చిన ప్రయాణికులు, ప్రజలు బస్సులు సకాలంలో దొరక్కపోవడంతో నిరాశచెందారు. ఉత్తర కర్ణాటక నగరాల్లో ప్రైవేటు బస్సులు సైతం అరకొరగా సంచరిస్తున్నాయి. ట్రైనీలతో నడిపించే యత్నం.. సమ్మె నేపథ్యంలో శిక్షణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు గురువారం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బీఎంటీసీ ఆదేశించింది. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని విధాలా భద్రత కల్పిస్తామని కేఎస్ఆర్టీసీ డైరెక్టర్ శివయోగి కళసద్ తెలిపారు. నేడు కూడా సమ్మె డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే శుక్రవారం కూడా సమ్మె కొనసాగిస్తామని రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ సిబ్బందికి అత్యంత తక్కువ వేతనం వస్తోందని అన్నారు. ఈ తారతమ్య ధోరణి సరికాదన్నారు. విధులకు హాజరుకాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని రవాణాశాఖ సిబ్బంది ఇళ్లకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదన్నారు. 10 శాతం జీతం పెంచుతాం.. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచలేం, 8 శాతానికి బదులు 10 శాతం జీతం పెంచుతామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి అంజుంపర్వేజ్ తెలిపారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు. సమ్మె వీడకపోతే రెండేళ్ల లోపు పదవీవిరమణ చేసిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించి బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. విధులకు రాకుంటే చర్యలు: సీఎం రవాణాశాఖ ఉద్యోగులు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. అయినా సమ్మె చేయడం సరికాదు. తక్షణం విధులకు హాజరుకావాలి, లేని పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప గురువారం హెచ్చరించారు. ఆయన బెళగావిలో మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట సమయంలోనూ 8 శాతం వేతనం పెంచాలని తీర్మానించామన్నారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని విధుల్లో చేరాలన్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు! -
చర్చలకు రండి.. లేదంటే తీవ్ర పరిణామాలు: సీఎం
సాక్షి, బెంగళూరు: ఆరవ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. 24 వేల బస్సుల సంచారం బందై బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు గమ్యస్థానం చేరడం ఎలా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లుల బాధలు వర్ణనాతీతం. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు గమ్యం చేరలేక నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం జరగాల్సిన బెంగళూరు, తుమకూరు, మంగళూరు, రాణిచెన్నమ్మ విశ్వవిద్యాలయ పరీక్షలను వాయిదా వేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో రవాణా బస్సులు సంచారం పూర్తిగా స్తంభించిపోయింది. కాగా, ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు బస్సులు, టెంపోలకు అనుమతి ఇచ్చింది. బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండు, కెంపేగౌడ బస్టాండు, శాటిలైట్, యశవంతపుర బస్టాండ్లులో ప్రైవేటు మినీబస్సుల సంచారం అధికమైంది. ఆటో, ట్యాక్సీ, ప్రైవేటు బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు తప్పలేదు. దీనివల్ల కరోనా రెండో దాడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన ఏర్పడింది. ప్రైవేటు వాహనాల్లో అధిక టికెట్ ధరలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బస్టాండ్లలోకి ప్రైవేటు బస్సులు.. బెంగళూరు నగరంలో ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు బీఎంటీసీ రూట్లలో తిరిగాయి. అయితే టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు చేసినట్లు ప్రయాణికులు వాపోయారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఇక ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు ఇదే అదనుగా విపరీతంగా చార్జీలు వసూలు చేశారు. మొత్తం మీద బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులు సంచారం తీవ్రతరమైంది. సాధారణంగా మెజెస్టిక్, కెంపేగౌడబస్టాండులోకి ప్రైవేటు బస్సులకు అనుమతిలేదు. కానీ బుధవారం అన్ని బస్టాండ్లలోకి స్వేచ్ఛగా ప్రైవేటు బస్సులు ప్రవేశించాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలకు బస్సులు కరువయ్యాయి. సమ్మె వల్ల ఐటీ సిటీలో మెట్రోరైలు సర్వీసులను పెంచారు. మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. మెట్రో టోకెన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడ్డారు. సమ్మె ముగిసే వరకు టోకెన్ వ్యవస్థను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రయాణికులకు కటకట.. ప్రభుత్వం, రవాణా శాఖ ఉద్యోగులు పట్టువీడకపోవడంతో ప్రజలు నలిగిపోవాల్సి వచ్చింది. ఎంతో వెచ్చించి నెల పాస్ తీసుకుంటే ప్రైవేటు బస్సులు టెంపోలు, ఆటోల్లో డబ్బు పెట్టి ప్రయాణించాలా? అని పలువురు మండిపడ్డారు. మంగళవారం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్‌కు వెళ్లి తిరిగివచ్చే కర్ణాటక ఉద్యోగులకు బస్సులు దొరకలేదు. మైసూరునగర, గ్రామీణ బస్టాండ్లు వెలవెలబోయాయి. కరోనా వైరస్ ఉండటంతో ధర్నా చేపట్టరాదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. దీంతో ఉద్యోగులు ధర్నాలకు దిగలేదు. చర్చిద్దాం రండి: సీఎం సాక్షి, బళ్లారి: కేఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె మానుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని సీఎం యడియూరప్ప కోరారు. బుధవారం బెళగావిలో ఉప ఎన్నికల ప్రచారంలో విలేకరులతో మాట్లాడుతూ చర్చల్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు రాకుండా, సమ్మె మానకపోతే ఎస్మా ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కరోనా కష్ట సమయంలోను, విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున బంద్ పాటించడం తగదన్నారు. జీతాలకు కష్టమవుతుంది: డీసీఎం బనశంకరి: ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే జీతాలివ్వడం కష్టమని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది హెచ్చరించారు. బీదర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖ నష్టాల్లో ఉందని ప్రతిరోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందన్నారు. సమ్మె చేయడం వల్ల నష్టం మీకేనన్నారు. ప్రయాణికులను ఇబ్బందులు పెడుతూ సమ్మెకు దిగడం న్యాయమా అని ప్రశ్నించారు. రవాణాశాఖ ఉద్యోగులు పెట్టిన 9 డిమాండ్లలో 8 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సమ్మె వల్ల రోజూ 30 లక్షల మంది ప్రయాణికులు కష్టాల పాలవుతారన్నారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: ఒకవైపు కరోనా వైరస్‌తో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలమీద ఆర్టీసీ సమ్మె పిడుగు పడింది. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మె చేపట్టారు. దీంతో కర్ణాటకలో బస్సులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు విశ్వవిద్యాలయాలు నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. ఇక జీతాలు చెల్లించడంలేదంటూ బస్సు డ్రైవర్ల నిరవధిక సమ్మెకు దిగడంతో, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు, కేఎస్ఆర్టీసీ ప్రైవేటు బస్సులకు తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో యడ్డీ సర్కారు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని మంగళవారం తేల్చిచెప్పింది. రవాణా శాఖ ఉద్యోగులతో చర్చలు లేదా రాజీ ప్రశ్నేలేదని, సమ్మెను విరమించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసంచేస్తే అలాంటి వారిపై ఎస్మా చట్ట ప్రయోగం తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు, ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణాలో సీఎం యడియూరప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్‌రెడ్డి, డైరెక్టర్లు శిఖా, శివయోగికళసద్, రవాణాశాఖ కమిషనర్ శివకుమార్, వాయువ్య, ఈశాన్యతో సహా 4 ఆర్టీసీ మండళ్ల డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. 6వ వేతన సిఫార్సులు అసాధ్యం: సీఎస్ ఇక మంగళవారం నాటి భేటీ అనంతరం సీఎస్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాశాఖ ఉద్యోగులకు 6వ వేతన కమిషన్ సిఫార్సులను అమలుచేయడం సాధ్యం కాదు. ఉద్యోగులు తక్షణం ధర్నాను విరమించి విధులకు హాజరుకావాలి. గైర్హాజరైతే వారి వేతనంలో కోత విధిస్తాం. రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట నేతలతో కానీ ఇతరులతో చర్చలు జరిపేది లేదు. రాజీచర్చలు ముగిసిన అధ్యాయం. విధ్వంసానికి దిగితే కఠిన చర్యలుంటాయి. రవాణా ఉద్యోగుల వేతనాన్ని 8 శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఇందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. అక్కడ నుంచి అనుమతి లభిస్తే వేతన అంశం పరిష్కారమవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి హామీ ఇవ్వడం సాధ్యం కాదు’’ అని ఆయన తెలిపారు. ప్రతిరోజు 60 లక్షలమంది ప్రయాణికులు సంచరిస్తున్నారని, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 30 లక్షలకు తగ్గిందని తమకు ప్రతి రోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందని సీఎస్ చెప్పారు. ఇది రవాణాశాఖ ఉద్యోగులకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. పదేపదే ధర్నాలకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆందోళనల వల్ల కోవిడ్ విస్తరిస్తుందని చెప్పారు. ధర్నా చేయొద్దు: డీసీఎం లక్ష్మణ్ రవాణాశాఖ ఉద్యోగుల వేతనం పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తక్షణం సమ్మెను విరమించి విధులకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేతనం పెంచాలని తీర్మానించామని తెలిపారు. ఎంతమేర అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మొదట ఉద్యోగులు ధర్నా విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మెకు ఉపక్రమించారు. చదవండి: ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్ -
ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్
యశవంతపుర/కర్ణాటక: ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునివ్వటంతో కార్మికుల డిమాండ్లపై చర్చించటానికి సీఎం యడియూరప్ప, డీసీఎం లక్ష్మీణ సవది సోమవారం సమావేశమై చర్చించారు. ఆరవ వేతన కమిషన్ ప్రకారం జీతాలను పెంచాలని ఏప్రిల్ 7న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. వేతన సిఫార్సులను అమలు చేయటం సాధ్యంకాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. పట్టుబట్టి సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. పునరాలోచన చేయండి -ఐఏఎస్ శరత్ బదిలీపై క్యాట్ తీర్పు మైసూరు: తన బదిలీపై ఐఏఎస్ అధికారి శరత్ వేసిన పిటిషన్‌పై క్యాట్ తీర్పు వెలువరించింది. శరత్ బదిలీపై ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2020 సెప్టెంబర్‌లో మైసూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శరత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే బదిలీ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పు రిజర్వులో ఉంచడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం క్యాట్ తన తీర్పును వెలువరించింది. -
సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..! సమ్మెపై సాయంత్రానికి స్పష్టత తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో బుధవారం అఖిలపక్షం నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిశారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పు, ప్రభుత్వ అఫిడవిట్, సునీల్ శర్మ అఫిడవిట్, ఐఏఎస్ అధికారుల కోడ్ ఆఫ్ కండక్ట్ కాపీలను గవర్నర్‌కి సమర్పించారు. అనంతరం బీజేపీ నాయకుడు మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరామని తెలిపారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. విలీనంపై కార్మికులు వెనక్కితగ్గినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తటస్థంగా ఉండాల్సిన ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్‌పై గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని వివరించారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కనికరం లేదని విమర్శించారు. గవర్నర్ అయినా అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ, కేసీఆర్ మాత్రం ఇవ్వరని ఎద్దేవా చేశారు.ప్రయాణీకుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌ని కోరామని పేర్కొన్నారు. మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌తో మొరపెట్టుకున్నామని తెలిపారు. సమ్మెను చట్ట వ్యతిరేకంగా చూడకుండా కార్మికులు ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు టీఎస్‌ఆరీ్టసీ ఇన్చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్ అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు. డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదు.. యూనియన్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్ ఆ డిమాం డ్‌ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు. యూనియన్ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్ ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. -
సకలం అస్తవ్యస్తం!
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కాలేజీలో 550 మంది విద్యార్థులున్నారు. మండల పరిధిలోని గ్రామాలతో పాటు షాబాద్, మహేశ్వరం ప్రాంతాలకు చెందిన విద్యార్థులే వీరంతా. ఈ కాలేజీలో 90 శాతంపైగా ఉన్న హాజరు, ఆర్టీసీ సమ్మెతో 40 శాతానికి పడిపోయింది. రోజుకు సగటున 150 మందే హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హాజరు శాతం భారీగా తగ్గింది. విద్యాసంస్థలకు కాలినడకన వచ్చే వారు మినహాయిస్తే గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సుల్లేక రోజుల తరబడి చదువులకు దూరం అవుతున్నారు. సగటు జీవి రోజువారీ జీవన విధానంలో ప్రగతి రథం ఒక భాగం. స్కూలు విద్యార్థి మొదలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలు, రైతులు... ఇలా అన్ని వర్గాల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీకి సమ్మె పోటు తగిలింది. చాలా రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండగా, యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను రోడ్డెక్కిస్తోంది. కానీ అవి పరిమిత రూట్లలో, ప్రధాన రహదారుల్లో మాత్రమే సేవలందిస్తుండడంతో మెజార్టీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఆర్టీసీలో నెలకు వెయ్యి రూపాయలయ్యే ప్రయాణం ప్రైవేట్ పుణ్యమా అని ఇప్పుడు నాలుగు వేలకు చేరిందని లబోదిబోమంటున్నారు. ఆర్టీసీలో 10 వేల బస్సుల ద్వా రా రోజుకు సగటున కోటి మందికి సేవలందుతున్నాయి. సమ్మె నేపథ్యంలో 60 శాతం బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుపుతున్నా ప్రధాన రహదారులకే పరిమితమవుతున్నాయి. జిల్లా, తాలూకా కేంద్రాలు, హై దరాబాద్‌కు వచ్చే రూట్లలో ఇవి నడుస్తున్నా యి. గ్రామాలు, మారుమూల పల్లెలకు చాలా రోజులుగా బస్సు వెళ్లకపోవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ఇబ్బడిముబ్బడిగా వసూళ్లకు తెగబడుతున్నారు. మరో వైపు సరుకు రవాణా కు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న రైతులు, ఆ ప్రభావాన్ని దిగుబడుల విక్రయాలపై చూపుతూ ధరలు పెంచేస్తున్నారు. నిత్యం ఆలస్యమే... ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులుంటారు. బస్సులు లేకపోవడంతో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లడం లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో దొరకకపోవడంతో సమయపాలన గాడితప్పుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కనీసం అరగంట ఆలస్యంగా రావడంతో పాటు ముందుగా వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా పాఠశాలల్లో కూడా టీచర్లు ఆలస్యంగా వస్తున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖాధికారులకు వస్తున్నాయి. కార్తీకమాసం శుభకార్యాలకు ప్రసిద్ధి కావడంతో ప్రయాణాలు సైతం అధికమే. ఈ సమయంలో దూరప్రయాణాలకు వెళ్లే వారు సమ్మె కారణంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దందా ఆగమైంది... సమ్మెతో గిరాకీ దెబ్బతిన్నది. బస్టాండ్‌కు వచ్చే వారంతా మా హోటల్లో ఏదో ఒకటి తినేవారు. సమ్మె ప్రభావంతో బస్సుల సంఖ్య తగ్గడం, గ్రామాలకు వెళ్లే వారంతా బస్టాండ్‌కు రాకపోవడంతో గిరాకీ డౌన్ అయ్యింది. సమ్మెకు ముందు రోజుకు సగటున 24వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు 8వేల నుంచి 9వేల వరకు మాత్రమే బేరమవుతుంది. – శ్రీకాంత్, హోటల్ నిర్వాహకుడు, సంగారెడ్డి కొత్త బస్టాండ్ కాంప్లెక్స్ గిట్టుబాటు అయితలేదు కూరగాయ దిగుబడులను బస్ ద్వారా రైతు బజార్‌కు తరలించేవాళ్లం. ఇప్పుడు బస్సులు రాకపోవడంతో ఆటో ట్రాలీని కట్టుకుని తీసుకెళ్తున్నాం. నలుగురైదుగురు రైతులం కలిసి ఆటోలో వెళ్లడంతో ఒక్కొక్కరికి కనీసం రూ.300 వరకు ఖర్చు వస్తున్నది. బస్సులో వెళ్తే గరిష్టంగా రూ.100 లోపు ఉండేది. దీంతో రైతుబజార్‌కు వెళ్లి పంట దిగుబడులు అమ్మితే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. రోజుకు రూ.300 పెట్టాలంటే ఆచ్చే ఆదాయం ఏముంటుంది. – పి.నర్సింలు, రైతు, ఆలూరు, చేవెళ్ల ఆటో ఖర్చు నెలకు రూ.వెయ్యి మా ఊరి నుంచి స్కూల్ 8 కిలోమీటర్లు. సాధార ణ రోజుల్లో నెలకు రూ. 125 చెల్లించి బస్‌పాస్ ద్వారా ప్రయాణించేవాడిని. ఇప్పుడు బస్సులు బంద్ కావడంతో నిత్యం ఆటోలో వెళ్తున్నా. పదో తరగతి కావడంతో ఒక్క క్లాస్ కూడా మిస్ కావొద్దని అమ్మానాన్నలు రోజువారీ ఆటో చార్జీలు ఎంతో కష్టపడి ఇస్తున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఒక నెల రోజుల్లోనే ఆటోలో ప్రయాణానికి దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేశా. –ప్రవీణ్, పదో తరగతి, ఏట్ల ఎర్రవల్లి గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా -
ఎంపీ,ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
-
ఆర్ధిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు
-
ఆర్టీసీ కార్మికులకు లండన్‌లో ఎన్ఆర్ఐల మద్దతు
లండన్ : ఆర్టీసీ కార్మికులకు యూకే (లండన్) తెలంగాణా ఐక్య వేదిక అఖిలపక్షం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. లండన్‌లోని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలంగాణ జనసమితి, టీడీపీ, జనసేన అభిమానులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు కోదండ రాం, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వారి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చారు. లండన్ తరహాలో అన్ని దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్ఆర్ఐల మద్దతు స్ఫూర్తితో మిగిలిన దేశాల్లో నివసిస్తున్నవారు మద్దతు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్ఆర్ఐలు తెలంగాణలో కష్ట కాలంలో మౌనం వహించడం తప్పన్నారు. సామాజిక బాధ్యతతో ఎన్ఆర్ఐలు తమ అభిప్రాయాలను చెప్పి ప్రభుత్వం పరిష్కారం తీసుకునేలా చొరవ తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని కోరారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. లండన్ తరహాలో అమెరికాలో కూడా ఎన్ఆర్ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, ఉద్యమ అణచివేతలు, మరో సమస్యకి దారితీస్తాయని తెలిపారు.హైకోర్టుని కూడా తప్పు దోవ పట్టించే అవసరం లేదని, ముఖ్యమంత్రి మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ముఖ్యమంత్రి పెద్ద మనుసు చేసుకొని కార్మికుల సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయాలనీ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. పట్టు విడుపుల సమయం కాదని బలిదానాలు పెరగకుండా చర్యలు చేపట్టాలని, అణిచివేత ధోరణితో సమస్య పరిష్కారం కాదని అన్నారు. థేమ్స్ నది ఒడ్డున లండన్‌లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్నారైలు, ఆర్టీసీ కార్మికుల పక్షాన మద్దతు తెలపడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. తమ సమస్యకి విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో పాల్గొన్న గంప వేణుగోపాల్, పసునూరి కిరణ్, రంగు వెంకటేశ్వర్లు, శ్రీధర్ నీలల ఆధ్వర్యంలో 6 ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు ఐక్య వేదికగా ఏర్పడి ఈ సమావేశ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరపున గంప వేణుగోపాల్, గంగసాని ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ నీలా, శ్రీనివాస్ దేవులపల్లి, నర్సింహా రెడ్డి తిరుపరి, మేరీ, జవహార్ రెడ్డి, జయంత్ వద్దిరాజులు, బీజేపీ పార్టీ తరపున పసునూరి కిరణ్, ప్రవీణ్ బిట్లలు, తెలంగాణ జన సమితి పార్టీ తరపున రంగు వెంకటేశ్వర్లు, స్వామి ఆకుల, రాజు గౌడ్లు, టీడీపీ పార్టీ తరపున కోటి, చైతన్యలు, జనసేన పార్టీ తరపున అయ్యప్ప, హనీఫ్, అబ్దుల్ లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శివా రెడ్డి, గణేష్ రెడ్డిలు, యూకే తెలంగాణ మేధావి వర్గం నుండి ఓరుగంటి కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, డాక్టర్ విశ్వనాథ్ కొక్కొండలు పాల్గొన్నారు. -
సర్కారీ స్కూళ్లపై సమ్మె ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, టీచర్లపైనా పడుతోంది. దీంతో హాజరు తగ్గుతోంది. గత నెలలో నిర్వహించిన సమ్మేటివ్ అసేస్‌మెంట్–1 (ఎస్ఏ) పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్ల హాజరు, ఈనెలలో ఇప్పటివరకు వారి హాజరు తీరుపై విద్యాశాఖ లెక్కలు తేలి్చంది. దీంతో 10 శాతం వరకు విద్యార్థుల హాజరులో, 8 శాతం వరకు టీచర్ల హాజరులో తేడా ఉన్నట్లుగా గుర్తించింది. ఆర్టీసీ సమ్మె కారణంగానే విద్యార్థులు, టీచర్ల హాజరు తగ్గినట్లు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ ఇటీవల విద్యార్థులు, టీచర్ల హాజరును ఆన్లైన్లో సేకరించేందుకు టీ–హాజరు పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచి్చంది. దానికి విద్యార్థులు, టీచర్లకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగిన యూ–డైస్ డాటాను అనుసంధానం చేసింది. పాఠశాలల హెడ్మాస్టర్లు/హాజరు బాధ్యత చూసేందుకు విద్యాశాఖ ఎంపిక చేసిన ఉపాధ్యాయులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని బయోమెట్రిక్ ఆధారితంగా టీచర్లు విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. మొదట్లో చాలా పాఠశాలలు ఈ యాప్ ద్వారా హాజరును నమోదు చేయలేదు. ఆ తర్వాత విద్యాశాఖ స్పçష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని 28,791 ప్రభుత్వ పాఠశాలు ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసు కొని హాజరు నమోదును ఆన్లైన్లో పంపిస్తున్నాయి. 20 లక్షలకు పైగా విద్యార్థులు, లక్షకు పైగా టీచర్ల హాజరు శాతా న్ని సేకరించి పోల్చి చూసింది. గత నెల 25 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన ఎస్ఏ–1 పరీక్షల సమయంలో టీచర్లు విద్యార్థుల హాజరును పరిశీలించింది. ఈనెల 2 నుంచి గురువారం వరకు విద్యార్థులు, టీచర్ల హాజరును పరిశీలించింది. దీంతో పరీక్షల సమయంలో హాజరు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తగ్గిపోయినట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తిం చింది. సమ్మె ప్రభావంతో పరీక్షల సమయంలో హాజరైన విద్యార్థుల సంఖ్య కంటే ఆ తర్వాత హాజరైన వారి సంఖ్యలో 10% వరకు తగ్గుదలను అధికారులు గుర్తించారు. పరీక్షలకు హాజరు కావాలి కాబట్టి విద్యార్థులు, టీచర్లు ఏదో ఒక రవాణా సదుపాయాన్ని చూసుకొని పరీక్షలకు హాజరయ్యారని, ఆ తర్వాత మళ్లీ తగ్గారని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో విద్యార్థుల హాజరు 87% నుంచి 77 శాతానికి తగ్గగా, టీచర్ల హాజరు 88 % నుంచి 80 శాతానికి తగ్గినట్లు తేలింది. -
సీపీ వ్యాఖ్యలు బాధించాయి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీ అంజనీకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ...‘మావోయిస్టలు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారంటూ పోలీస్ కమిషనర్ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. సీపీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మహిళా కండక్టర్ల పాత్ర కీలకం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శిరసు వంచి వందనాలు చెబుతున్నాం. అలాగే చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాం. సమ్మె విజయవంతం అయ్యేవరకూ మహిళా సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. పోలీసుల దమనకాండకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో రేపు (ఆదివారం) బస్సు డిపోల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతాం.’ అని తెలిపారు. కాగా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు...పోలీసులపై రాళ్లు విసిరారని, ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: చాలామంది పోలీసులు గాయపడ్డారు.. -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 11న కోర్టులో వాదనలు ఉన్నందున అనసరించాల్సిన తీరుపై సీఎం మళ్లీ సమీక్ష జరుపుతున్నారు. తదుపరి విచారణలో వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 36వ రోజు కూడా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చి బారికేడ్లను తొలగించారు. చదవండి: పోలీసులపై ఆందోళనకారుల రాళ్లదాడి -
‘ఛలో ట్యాంక్‌బండ్’లో పాల్గొనండి: ఉత్తమ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కూమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ మనసు కరగకపోవడం దారుణమని మండిపడ్డారు. -
సాహస ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో సిటీ బస్సుల సర్వీసుల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. ఉదయం ఎన్నో ప్రయాసలకోర్చి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు తిరిగి ఇళ్లకు చేరేందుకు సరైన రవాణా సదుపాయం అందుబాటులో ఉండడంలేదు.తిరుగుతున్న అరకొర బస్సుల్లో చోటు దొరక్క విద్యార్థినులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుంటే.. విద్యార్థులు బస్సు వెనుక వేలాడుతూప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.ఈ సంఘటన మంగళవారం సాయంత్రం దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వెళుతున్న బస్సులో కనిపించింది. -
ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయినప్పటికీ తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడంలేదు. దాదాపు 300 మంది మినహా మిగిలినవారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అందజేశారు. ఆ వివరా లన్నీ పూర్తిగా క్రోడీకరించాల్సి ఉన్నందున, మంగళవారం అర్ధరాత్రి 12 వరకు ఎంతమంది కార్మికులు లేఖలు ఇచ్చారన్న విషయంలో స్పష్టత రాలేదు. దీంతో రాత్రి వరకు ఆర్టీసీ అధికారికంగా ఆ సంఖ్యను ప్రకటించలేదు. సాయంత్రం 6 గంటల వరకు 150 మంది, రాత్రి తొమ్మిది వరకు 240 మంది, 10 వరకు ఆ సంఖ్య 300కి కాస్త అటూ ఇటూగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపారు. కనీసం వేయి మందికిపైగా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినా.. అది సాధ్యం కాలేదు. కార్మిక నేతలు రంగంలోకి దిగి.. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతావారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పటంతో తొలుత కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విష యంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసి కార్మిక సంఘాల నేతలు వెంటనే రంగం లోకి దిగారు. సంఘాలుగా విడివిడిగా జిల్లా స్థాయి నేతలను నగరానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇన్ని వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేనందున అది చెల్లుబాటు కాదని, బేషరతుగా చేరాలన్న మెలికపెట్టడంతో భవిష్యత్తులో జీతాలు పొందడం సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయని, ఇన్ని రోజులు పోరాటం చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే సంస్థను కాపాడు కోలేమని చెప్పారు. ఇదంతా కార్మికులందరికీ చేరేలా చర్యలు చేసుకున్నారు. దీంతో కార్మికుల్లో చాలామంది విధుల్లో చేర కుండా ఆగిపోయారు. జేఏసీలో భాగంగా ఉన్న సూపర్వైజరీ అసోసియేషన్ పరిధిలో ఉండే ఉద్యోగులు మాత్రం తిరిగి విధుల్లో చేరేందుకే ఆసక్తి కనపడింది. వారిలో కొందరు మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో లేఖలు అందజేశారు. అఖిలపక్ష నేతలతో జేఏసీ భేటీ... ముఖ్యమంత్రి విధించిన గడువు చివరి రోజైన మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువ సేపు చర్చించారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట, అసలు ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున, దాన్ని మూసివేయాలంటే కచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు డిపోల ముందు కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చే కార్మికులను అడ్డుకునేందుకు వారు కాపలా తరహాలో దీక్షలు నిర్వహించారు. అన్ని డిపోల వద్ద వంటావార్పు ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడే చేసేలా చూశారు. జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు వందమంది హైదరాబాద్బస్భవన్లో లేఖలివ్వటం విశేషం. కార్మికులు భయపడొద్దు: అశ్వత్థామరెడ్డి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాజకీయ పక్షాలతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి భయాందోళనకు గురికావద్దని కార్మికులకు సూచించారు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటాన్ని బలహీన పరచడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలనే సంగతి గ్రహించాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈనెల 7న నిర్వహించే సడక్‌బంద్‌లో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగులు పెన్‌డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 9న నిర్వహించే ఛలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోసారి సీఎం సమీక్ష? ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఎంతమంది విధుల్లో చేరారన్న లెక్కలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను మంగళవారం రాత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అధికారులు అందజేశారు. వాటిని ఆయన సీఎంకు తెలియజేశారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 7న హైకోర్టులో వాదనలు ఉన్నందున, మరోసారి ముఖ్యమంత్రి సమీక్షిస్తారని చెబుతున్నారు. కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే విషయంలో కీలక ప్రకటన ఉండనుందని చెబుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 1937 అద్దె బస్సులను కలుపుకొని మొత్తం 6,484 బస్సులు నడిచాయని తెలిపింది. -
కార్మికులు చేరకుంటే ఆర్టీసీ ఉండదు
-
గడువు దాటితే వేటే!
సాక్షి, హైదరాబాద్: గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది. గడువులోగా చేరని కార్మి కులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్ల యిందని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? విని యోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేటు వాహ నాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని మరో సారి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయాన్ని సీఎం కార్యా లయం ఓ ప్రకటనలో వెల్లడిం చింది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆది వారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో సమీక్షించారు. సమ్మె విష యంలో, కోర్టు విచారణ సంద ర్భంగా అనుసరించాల్సిన వైఖ రిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. కార్మికులు ఎవరినీ బద్నాం చేయలేరు.. ‘ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు, వారి కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఉద్యోగాలు కాపాడుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉంది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. విధుల్లో చేరడానికి 3 రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు. ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది కార్మికుల ఇష్టం. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు’అని సీఎం, మంత్రులు, అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సీఎంఓ తెలిపింది. సుప్రీంకు వెళ్తే అంతే.. ‘హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నేతలు కార్మికులను మభ్యపెడుతున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలిచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే, విచారణ మరింత ఆలస్యమవుతుంది. అది అంతంలేని పోరాటం అవుతుంది. కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు’అని అభిప్రాయం వ్యక్తమైంది. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్కే జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణరావు, సునీల్ శర్మ, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, లోకేశ్ కుమార్, అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, అడిషనల్ ఏజీ రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా..
గచ్చిబౌలి: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని సైబరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే తాము పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చారు. విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో చేరే వారిని ఎవరైనా ఉద్ధేశపూర్వకంగా అడ్డగించినా ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. డయల్ 100, వాట్సాప్ నెంబర్ 949061744లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.– కమిషనర్ వీ.సీ.సజ్జనార్ భయపెడితే క్రిమినల్ కేసులు నేరేడ్మెట్: విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులకు పోలీసు భద్రత కల్పిస్తామని రాచకొండ కమిషనర్ æమహేష్ భగవత్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపు నేపథ్యంలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఎవరైనా నిర్భయంగా విధుల్లో చేరవచ్చన్నారు. విధుల్లో చేరే కార్మికులను ఎవరైనా భయపెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిచారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్టప్రకారం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని సీపీ పేర్కొన్నారు.–రాచకొండ సీపీ, మహేష్‌భగవత్ అన్ని డిపోల వద్ద బందోబస్తు.. ముఖ్యమంత్రి పిలుపు మేరకు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి అవసరమైన పూర్తి భద్ర త కల్పిస్తాం. అది మా బాధ్యతగా భావిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి డిపో వద్ద అవసరమైన బందోబస్తు ఉంటుంది. విధులను అడ్డుకోవడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్తులకు నష్టం కలిగించినా, ఉద్యోగులను అడ్డుకున్నా అరెస్టు చేస్తాం. –అంజనీకుమార్,నగర పోలీసు కమిషనర్ -
మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
-
మాది చట్టబద్ధమైన ఉద్యమం
-
విధుల్లో చేరం.. సమ్మె ఆపం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్‌లైన్‌ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్‌లైన్ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చలకు సిద్ధమై, వాటికి పరిష్కార మార్గాలు చూపనంతవరకు సమ్మెను ఆపబోమని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులను బిడ్డలుగా భావిస్తున్నానని అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామని, కానీ ఆయన ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. మేం అన్ని డిమాండ్లపై పట్టుపట్టి కూర్చోమని, చర్చల్లో పట్టువిడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తమది సీఎం చెబుతున్నట్లుగా చట్ట విరుద్ధ సమ్మె కాదని, చట్టబద్ధమైందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాటమార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. 23 వేల మందికి కూర్చోబెట్టి జీతాలిస్తారా?.. కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరిపోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరిపోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్ రోస్టర్ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. అప్పుడు రిజర్వేషన్ల పద్ధతికే విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ల నుంచి కార్మికులను దూరం చేసేలా ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. ఆర్టీసీలో రూ.650 కోట్ల డిప్రిసియేషన్ ఫండ్ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలు కేంద్రం భరించే అవకాశం ఉండదన్నారు. జీతాలివ్వకుంటే పరిస్థితేంటి?... కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలంటున్నారని, రేపు జీతాలకు డబ్బులేదు ఇవ్వలేమంటే అప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తామని సీఎం అన్నారని, కానీ నష్టాలొచ్చే రూట్లు తీసుకునేందుకు వారు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. అందుకే కార్మికులు వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కారమయ్యేవరకు సమ్మెలో ఉండాలని, ఆత్మద్రోహం చేసుకుని పిరికివారిలా పారిపోవద్దని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి ఇలాగే డెడ్లైన్లు విధించారని, ఎవరూ చలించలేదని, ఇప్పుడు కూడా ఒకటి రెండు శాతం మంది విధుల్లో చేరినా మిగతావారు సమ్మెలోనే ఉంటారన్నారు. చాలా ప్రాంతాల నుంచి కార్మికులు తమకు ఫోన్ చేసి సమ్మెను కొనసాగించాలని పేర్కొంటున్నారని, ఆపితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు దిగ్బంధం వాయిదా ఐదో తేదీన రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. -
28వ రోజుకు చేరుకున్న అర్టీసీ సమ్మె
-
సకల జనభేరి
-
ఆర్టీసీలో ‘ప్రైవేట్’ పరుగులు!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాలో సింహభాగంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్లో సమూలమార్పులు చోటుచేసుకోనున్నాయా? ఆర్టీసీ ముఖచిత్రం మారనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఇప్పటికే అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రైవేట్ బస్సుల అనుమతులపైనా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఆర్టీసీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగి ఆర్టీసీ బస్సుల సంఖ్య చాలా వరకు తగ్గిపోనుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 50 శాతం ఆర్టీసీ బస్సులు ఉంటే మిగతా 30 శాతం అద్దె బస్సులు, మరో 20 శాతం ప్రైవేట్ బస్సులు ప్రజారవాణా రంగంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఆర్టీసీలో కొత్త బస్సులు కొనలేని స్థితి. చాలా వరకు డొక్కు బస్సులే ఉన్నాయి. దశలవారీగా ఈ డొక్కు బస్సులను తొలగిస్తే ఆర్టీసీలో 1000 బస్సులు కూడా మిగలకపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 3,550 బస్సులతో ప్రతి రోజు 32 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ చాలా వరకు తగ్గనుంది. అద్దె బస్సులకు ఆహ్వానం.. నగరంలో ప్రస్తుతం 375 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ఆర్టీసీలో భాగంగానే కొనసాగుతున్నాయి. కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లిస్తూ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ అద్దె బస్సులను వినియోగిస్తోంది. వీటి సంఖ్యను 375 నుంచి 1133కు పెంచేందుకు కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 60 బస్సులకు దరఖాస్తులు వచ్చాయి. నిర్దేశించిన 1133 అద్దె బస్సులను క్రమంగా భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దీంతో ప్రస్తుతం కొన్ని రూట్లకే పరిమితమైన అద్దె బస్సులు నగరంలోని మరిన్ని రూట్లకు విస్తరించనున్నాయి. ఈ బస్సుల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ పరిధిలోనే ఉంటుంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి యజమానులు ఏర్పాటు చేస్తే కండక్టర్లను మాత్రం ఆర్టీసీయే ఏర్పాటు చేస్తుంది. శివార్లకు ప్రైవేట్ సేవలు... నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఆర్టీసీ సొంత బస్సులతో పాటు, అద్దె బస్సులను నడుపుతూ నగర శివారుల్లోని కాలనీలు, గ్రామాలకు మాత్రం ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. 20 శాతం చొప్పున 752 ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఒకవైపు కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రైవేట్ బస్సుల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టింది. ప్రైవేట్ బస్సులు తప్పనిసరైతే ప్రస్తుతం ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్న 32 లక్షల మంది ప్రయాణికుల్లో సుమారు 10 లక్షల మందికి పైగా ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. ఆర్టీసీలోని అన్ని రకాల బస్‌పాస్‌లన ు ప్రైవేట్ బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎలాంటి విధానాలు అమలవుతాయో తెలియదు. మరికొంత కాలంవేచి చూడాల్సిందే. -
అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో
ప్రజారవాణాలో అతి ముఖ్యమైన ఆర్టీసీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నిజాం రైల్వేస్‌లో భాగంగా ‘రోడ్ ట్రాన్స్‌పోర్టు డివిజన్’ (ఆర్టీడీ) పేరుతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1932లో ప్రగతి చక్రం ప్రస్థానం ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో తొలుత పరుగులు పెట్టింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో సమ్మెకు దిగిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి చేస్తున్న సమ్మె... ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదిగా మారనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కార్మికులు 27 రోజులు సమ్మె చేయగా... ఇప్పుడు చేపట్టిన సమ్మెకు ఇప్పటికే 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ...ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ప్రజా రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఆర్టీసీలో కార్మికులు చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఇరువై ఐదు రోజులు గడిచినప్పటికీ అనిశ్చితి తొలగిపోవడంలేదు. దీంతో ఇప్పటి వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో ఇదే అతిపెద్ద సమ్మెగా మారుతోంది. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలంలో రోడ్డు రవాణా విభాగం (ఆర్టీడీ)గా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగా మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. నిజానికి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలోనే రైల్వే రంగానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఉస్మాన్ అలీఖాన్ సమయంలో రవాణా రంగం బాగా విస్తరించుకుంది. రైల్వే, ఆర్టీసీ, విమానయాన సేవలతో నిజాం రవాణా వ్యవస్థ సుసంపన్నమైంది. గౌలిగూడ బస్‌స్టేషన్ ఇదే అతి పెద్ద సమ్మె... ♦ ఆర్టీసీలో తరచుగా సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చివరి అస్త్రంగా సమ్మెను సంధిస్తున్నాయి. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ బకాయిల చెల్లింపు, ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టడం, రన్నింగ్ టైమ్ పెంచడం వంటి డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఇప్పటి వరకు అనేక సార్లు సమ్మెకు దిగారు. ♦ సమస్యల పరిష్కారం కోసం 2000 సంవత్సరంలో కార్మికులు 14 రోజుల పాటు సమ్మె చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయి. అప్పట్లో సమ్మె జనజీవితంపైన ప్రభావం చూపింది. ప్రైవేట్ రవాణా సదుపాయాలు తక్కువగా ఉండడం, ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీపైనే ఆధారపడడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ మోటారు వాహన పన్ను రద్దుతో పాటు, ఆర్టీసీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, తదితర డిమాండ్లతో 2003లో మరోసారి కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మె ఉధృతంగా సాగింది. 24 రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ♦ ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో సకల జనుల సమ్మెలో భాగంగా 2011 అక్టోబర్ నెలలో కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ముందంజలో నిలిచారు. సర్వీసులన్నీ స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ కానీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో మాత్రం ప్రస్తుతంకొనసాగుతున్నదే అతి పెద్ద సమ్మెగా నిలిచింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ఇప్పటికే 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన ఈ సమ్మెకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ♦ ఈ సమ్మెతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పాక్షికంగా బస్సులు నడుపుతునప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ సైతం కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూస్తోంది. సాధారణ రోజుల్లో 3750 బస్సులతో, 42 వేల ట్రిప్పులు నడిచే సిటీ బస్సుల్లో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం 1000 నుంచి 1500 బస్సులు మాత్రం రోడ్డెక్కుతున్నాయి. నిజాం కాలం నాటి బస్ టికెట్ ఇదీ చరిత్ర...... బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ స్టేట్‌లో రవాణా సదుపాయాలు విస్తరించుకున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగరంలో అప్పటి వరకు కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన మోటారు వాహన సదుపాయం క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాల మధ్య రవాణా సదుపాయాలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇదే ప్రధానమైన మార్గం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హుస్సేన్‌సాగర్ చెరువు కట్ట మీదుగా ఆబిడ్స్, కోఠీ మార్గంలో బస్సులు తిరిగేవి. 1879లో ఆవిర్భవించిన నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సంస్థ తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే సేవలను ప్రారంభించింది. ఈ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగానే 1932లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ’నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డివిజన్’ను ఏర్పాటు చేశారు.ఇలా హైదరాబాద్ రాజ్యంలో రోడ్డు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది.ఈ బస్సులను స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ అల్బైనో తయారు చేసింది. అప్పటి వరకు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో ఈ బస్సులను రూపొందించారు. 1932లో తొలిసారి బస్సుల ప్రారంభం... అమ్మ ప్రేమకు గుర్తుగా... నిజాం కాలంలో బస్సు నంబర్ ప్లేట్‌పై హైదరాబాద్ స్టేట్‌ను సూచించేలా హెచ్‌వై తరువాత ’జడ్’ ఉండేది. ఉదాహరణకు ’హెచ్‌వై జడ్ 223.’ అనే నెంబర్‌తో బస్సులు కనిపించేవి. ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి మీద ప్రేమతో ఆర్టీసీ బస్సల నెంబర్ప్లేట్లపైన ’జడ్’ అనే అక్షరాన్ని చేర్చారు. మొదట ఆయన తన తల్లి అమాత్ జహరున్నీసా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రులు సూచించడంతో బస్సు నెంబర్లలో తన తల్లిపేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ’జడ్’ (జహరున్నీసా) అనే అల్ఫాబెటిక్ను చేర్చారు. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభమైన 1958 నుంచి కూడా బస్సుల రిజిస్ట్రేషన్లపై ’జడ్’ అనే అక్షరం వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో ఆర్టీసీ విభజన తర్వాత కూడా ఈ సంప్రదాయం స్థిరంగా ఉంది. ఆర్టీఏలో పోలీసు వాహనాలకు ’ పీ’ సిరీస్‌తో, రవాణా వాహనాలకు ’టీ’ సీరిస్ నెంబర్లతో, ఆర్టీసీ బస్సులకు ’జడ్’ సిరీస్‌తో నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. -
నేడు సకల జనుల సమరభేరి
-
కలెక్టరేట్ల ముట్టడి.. ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోన్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా పేదలు కష్టాలు పడాల్సి వస్తోందని, దీనికి నిరసనగా నవంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని పార్టీ శ్రేణులను కోరింది. ఈ మేరకు మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 11న గాందీభవన్ నుంచి పాదయాత్రగా వెళ్లి హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కోర్ కమిటీలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్టీసీ సమ్మె, మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ఆ బాధ్యత నాదే.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఉత్తమ్ తెలిపారు. టీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ప్రలోభాలకు గురిచేసినప్పటికీ పార్టీకి 70 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అయినా ఓటమిని సమీక్షించుకుని ముందుకెళ్దామని చెప్పారు. త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభమైందని, ఈ కసరత్తును ముమ్మరం చేయాలని కోర్‌కమిటీ పార్టీ కేడర్‌ను కోరింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు, స్థానిక పట్టణ కమిటీలు అన్ని విధాలా ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించింది. దీంతో పాటు రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూకేటాయిం పుల్లో భాగంగా జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు, కలెక్టర్లతో సమన్వయం చేసుకునే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. గతంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు స్థలం విషయంలో న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ స్థలం నుం చి పార్టీ పరంగా వైదొలగాలని, పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం హైదరాబాద్‌లో తమకు స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ఇక ఆర్టీసీ కారి్మకులకు అండగా నేడు జరగనున్న సకల జనుల సభకు మద్దతివ్వడంతో పాటు పార్టీ నేతలు పాల్గొనాలని కోర్ కమిటీ నిర్ణయించింది. కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సలీం అహ్మద్, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
50 ప్రైవేటు కాలేజీలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. దసరా సెలవుల్లో నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీగా జరిమానా విధించింది. రోజుకు రూ.లక్ష చొప్పున కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహించిన ఆ 50 కాలేజీల్లో 2, 3 మినహా మిగతావన్నీ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీలు జరిమానా చెల్లించేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా యాజమాన్యాలు జరిమానా చెల్లించకపోతే ఆ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని, ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. బోర్డుకు ఫిర్యాదులు.. రాష్ట్రంలో గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 20 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆ నిబంధనలను కొన్ని కాలేజీలు అమలు చేసినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అమలు చేయలేదు. వాటిపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు బోర్డుకు ఫిర్యాదు చేశాయి. దీంతో బోర్డు అధికారులు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు నోటీసులు జారీ చేసినా కార్పొరేట్ యాజమాన్యాలు స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుని ఆయా కాలేజీలకు జరిమానా విధించింది. -
నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. తొలుత ఈ సభను సరూర్‌నగర్ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా.. హైకోర్టు సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. స్టేడియం సామర్థ్యం ఐదు వేలే... సభను 3 లక్షల మందితో భారీగా నిర్వహించాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేసింది. సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుండటంతో, జనసమీకరణకు ఆయా పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. సరూర్‌నగర్ మైదానంలో సభకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో మంగళవారం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఫలితంగా వేదికను ఇండోర్ స్టేడియంలోకి మార్చాల్సి వచి్చంది. స్టేడియం సామర్థ్యం కేవలం 5 వేలే కావడంతో జనసమీకరణ కసరత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉధృతంగా నిరసనలు.. హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో గత రెండు రోజులుగా వారు నిరసనల హోరు పెంచారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, విపక్షాల కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్‌లో కార్మికులు, అఖిలపక్ష నేతలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండు వద్ద కార్మికులు మోకాళ్లపై మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట సహాయ నిధికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన రూ.25 వేలు, కామారెడ్డి కోర్టు సిబ్బంది రూ.5 వేలు అందజేశారు. సమ్మె మొదలయ్యాక మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు బాన్సువాడ, జగిత్యాల, మెట్పల్లి, గోదావరిఖని, హుస్నాబాద్ డిపోల వద్ద నివాళులరి్పంచారు. మంథని వద్ద గోదావరి నదిలో బీజేపీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. నల్లగొండలో కార్మికుల నిరసనలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. కండక్టర్ నీరజ ఆత్మహత్య నేపథ్యంలో సత్తుపల్లిలో బంద్‌కు పిలుపినివ్వటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సీఐటీయూ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు, కార్మికులు ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో కార్మికుల దీక్షా శిబిరం వద్ద సీపీఐ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్మికులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది వీరోచిత పోరాటమని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కొనియాడింది. వారి పోరాటానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం బస్సులను తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ‘కోర్టుకు తప్పుడు వివరాలిస్తోంది’ ప్రభుత్వం కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తోం దని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించింది. మంగళవారం సాయంత్రం జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు తదితరులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో 2014 వరకు రూ.1,099 కోట్లు, ఆ తర్వాత 2019 వరకు రూ.1,375 కోట్లు రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్ఎంసీ నుంచి రూ.1,496 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. షరతులతో హైకోర్టు అనుమతి ఆర్టీసీ జేఏసీ బుధవారం తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దీని ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 24న పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ టి.వినోద్‌కుమార్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య సభ నిర్వహించి, 7 గంటల కల్లా ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు. -
ఎంతమందిని అడ్డుకుంటారు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు నిమ్స్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సాంబశివరావును పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేర్చి రెండురోజులవుతున్న ఇప్పటివరకు సాంబశివరావు హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదని సీపీఐ నేతలు మండిపడ్డారు. వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును పోలీసులు పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇది కోరి కోట్లాడీ సాధించుకున్న తెలంగాణ అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... నిరసన తెలిపితే పోలీసులు ఉద్యమాన్ని అడ్డుకుంటాం అంటే మరింత ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నిరసన చేసినా అక్కడ అడ్డుకుంటామని పోలీసులు అనుకుంటే ఎంతమందిని అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. -
ఆర్టీసీ సమ్మె విచారణ రేపటికి వాయిదా
-
మహిళా కండక్టర్ ఆత్మహత్య
-
ఖమ్మంలో మహిళా కండక్టర్ ఆత్మహత్య
సాక్షి, సత్తుపల్లి : మరో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ ఆత్మహత్య చేసుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఖమ్మంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా నిజామాబాద్–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్, ముషీరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్(37) గుండెపోటుతో మృతి చెందగా, ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే నార్కెట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజు కూడా కొనసాగుతోంది. చదవండి: డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత ‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’ -
గంట లేటుగా వచ్చామనడం అబద్ధం..
సాక్షి, హైదరాబాద్: సమ్మె వల్ల ఆర్టీసీ కుటుంబాలు పండుగలు జరుపుకోకపోవడం బాధాకరమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఇవాళ్టికి టీఎంయూ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. యూనియన్ను బలోపేతం చేయడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. సమ్మెలో పుట్టిన టీఎంయూ యూనియన్ మళ్లీ సమ్మెలోనే ఎనిమిదో ఆవిర్భావాన్ని పూర్తి చేసుకోవడం దురదృష్టకరం. టీఎంయూ జెండా రంగు కూడా మార్చాం. నిన్న చర్చలు నిర్బంధ కాండ మధ్య జరిగాయి. మేము గంట ఆలస్యంగా వచ్చామనడంలో వాస్తవం లేదు. ముందే చెప్పాం....మధ్యాహ్నం 2.15 గంటలకు వస్తామని. సీనియర్ ఐఏఎస్ అధికారులే ఆలస్యంగా వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. 29న బహిరంగ సభ కోసం సన్నాహాలు చేస్తున్నాం. 30న జరిగే సకలజనుల సమరభేరీ విజయవంతం అవుతుంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. సమ్మెకు మద్దతుగా ఎన్నారైల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తాం.’ అని తెలిపారు. కాగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజు కూడా కొనసాగుతోంది. చదవండి: లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం.. -
ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్టీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ కూకట్పల్లి పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లికి డిపోకి చెందిన డ్రైవర్ రాజు తన ఫిర్యాదులో అనేక విషయాలు పేర్కొన్నాడు. అశ్వత్థామరెడ్డి విలీనం అనే విషాన్ని కార్మికుల్లో నింపారని, 22 రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని రాజు తెలిపాడు. కాగా, ఆర్టీసీ డ్రైవర్ రాజు రాసిన లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది. ' అయ్యా ! నా పేరు రాజు. నేను కూకట్పల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. సార్ మా యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి కార్మికుల మనసులో విలీనం అనే విషాన్ని నింపారు. ఆయన మాటలు నమ్మి 22 రోజులుగా జరుగతున్న ఆర్టీసీ సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డే ప్రధాన కారకుడు. ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే అశ్వత్థామరెడ్డి పై ఫిర్యాదు చేశాను. అంతేగాక ఒకప్పుడు ఆర్టీసీకి పెద్దన్నలా వ్యవహరించిన హరీష్ రావును కొందరు పనికిమాలిన వాళ్లు ' మీరు మౌనంగా ఉండొద్దు, నోరు విప్పాలి అంటూ' ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు సమ్మె విషయం హరీష్ రావుతో చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు చేస్తున్న సమ్మె వల్ల పోలీసుల సహాయం లేకుండా బస్సులు రోడ్డు మీదకు వెళ్లడం లేదు. మా చేతులతో మేమే ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నాం. గురువారం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె మాట పక్కనబెట్టి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా మనకు గొప్ప అవకాశం. మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దు. అశ్వత్థామరెడ్డి మీరు ఒక్కరే పీఎం, రాష్ట్రపతి వద్దకు వెళ్లి మా సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ మా కార్మికుల పొట్ట గొట్టద్దు’ అని ఆ ఫిర్యాదులో వెల్లడించాడు. -
సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం
-
అలా అయితే ఇప్పుడే ఆర్టీసీ సమ్మె విరమిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా ఖండించారు. టీఎంయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..‘సీఎం ప్రెస్మీట్లో వెటకారం మాటలు, అహంకార పూరిత వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవు. ఆర్టీసీపై కేసీఆర్ ఎన్నో ఆరోపణలు చేశారు. సంఘాలు కార్మికుల హక్కుల కోసం ఉంటాయి. కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్న సమ్మె ఇది. సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పక్క రాష్టాన్ని కూడా చులకన చేసి మాట్లాడటం సరికాదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. చదవండి: ఆర్టీసీ మూసివేతే ముగింపు రాజకీయ పార్టీలకు అయిదేళ్లకు ఓసారి ఎన్నికలు ఎలా వస్తాయో... ప్రతి రెండేళ్లకు ఒకసారి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతాయి. కార్మిక చట్టాన్ని కేసీఆర్ ఒకసారి చదివి అవగాహన చేసుకోవాలి. ప్రయివేట్ బస్సులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పితే తెలుస్తుంది. దూరప్రాంత ఆర్టీసీ బస్సులు కూడా లాభాల్లో ఉన్నాయి. సమ్మెను రాజకీయ కోణంలో కాకుండా కార్మికుల కోణంలో చూడాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మిక సంఘాలే ఉండవు. కరీంనగర్లో చెప్పిన మాటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉండాలి. సమ్మె విరమించి కార్మికులు విధులకు హాజరు కావాలని కేసీఆర్ నిన్న చెప్పినా...ఇప్పటివరకూ ఎవరూ విధుల్లో చేరలేదు. మా స్వార్థం కోసం పెట్టిన ఒక్క డిమాండ్ అయినా ఉంటే...ఇప్పడే సమ్మె విరమిస్తాం. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే మా డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం: రాజిరెడ్డి ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. అద్దె బస్సులు లాభాల్లో నడిస్తే ఏడాది చివరికి ఎందుకు నష్టాలు చూపిస్తున్నాయి. కార్మికులకు రూ.50వేల జీతం వస్తుందని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజారవాణా సంరక్షణ కోసమే కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ఉంటే సమ్మె కొనసాగుతుంది. సీఎం తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడొద్దు. ప్రయివేట్ ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు మా పోరాటానికి సంబంధం లేదని అన్నారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. సమ్మె విషయంలో ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినవన్నీ అబద్ధాలేనని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 60శాతం మాత్రమే ఐఆర్ ఇచ్చారన్నారు. ఉన్న నష్టాలకు సంబంధం లేకుండా సీఎం భారీగా చూపించారని, 3వేల కోట్లు అప్పులు ఉంటే వేలకోట్లు ఉన్నాయి అని ఎలా మాట్లాడతారని సూటిగా ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా ఈక్విటీ రూపంలో ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, అప్పులపై యాజమాన్యంతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల మధ్య ప్రభుత్వం విభేదాలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది తమ ఉద్యోగాలు తీయించడానికేనా అని ప్రశ్నలు సంధించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజు కూడా కొనసాగుతోంది. -
ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె
సాక్షి, నల్లగొండ : ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌కు గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. గత 20 రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఆయన నల్లగొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే మానసిక ఒత్తిడికి లోనై ఆయన చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. 11 గంటలకు ఆల్ పార్టీ నేతలతో ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ రోజు భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్ : సమ్మె చేసున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై రెండు నివేదికలు సిద్ధం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపై సమగ్ర వివరాలను రూపొందించి ఒక నివేదికను కోర్టుకు అందించనున్నారు. ప్రతి అంశానికి సంబంధించి రెండు రకాల సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. ఆర్టీసీకి అద్దె బస్సుల అవసరంపై కూడా అధికారులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌ను కలిసి ఈడీల కమిటీ అందజేయనుంది. -
మాది న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: ‘మాది న్యాయపోరాటం.. ఆర్టీసీని పరిరక్షించు కోవటమే ధ్యేయంగా సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా సీఎం స్పందించి చర్చలకు ఆహ్వానించాలి. మీరైనా ఆయనకు చెప్పండి’అంటూ ఆర్టీసీ కార్మికులు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులనూ కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 19వ రోజైన బుధవారం మండల స్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఎంపీ వరకు అందరినీ కలిసి విన్నవించు కున్నారు. వారికి వినతిపత్రాలు సమర్పించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలసి ఆయనకు వినతిపత్రం ఇచ్చి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలసి వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని, కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు పోయేలా చేశాయని మంత్రి ఆరోపించారు. ఆదిలాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అటు వైపు వచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్న కారు ఆపి వినతి పత్రం ఇచ్చారు. వారి వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఎంపీ బండ ప్రకాశ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, రాజయ్యలకు కూడా వినతి పత్రాలు అందించారు. మంచిర్యాల బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన జేఏసీ శిబిరాన్ని పోలీసులు తొలగించటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సాయంత్రం తర్వాత పోలీసులు తిరిగి శిబిరం ఏర్పాటుకు సమ్మతించటంతో శాంతించారు. కరీంనగర్లో మంత్రి ఈటల ఇంటి ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. వినతిపత్రం తీసుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో ఇంటి గోడకు అతికించారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ఎదుట కూడా ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించి పీఏకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జెడ్పీ సమావేశం జరుగుతున్న సమయంలో సమావేశ మందిరం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. సమావేశంలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. సూర్యాపేటలో ఆర్టీసీ నిరసనల్లో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం డిపో ఎదుట దివంగత డ్రైవర్ శ్రీనివాసరెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఖమ్మం జెడ్పీ చైర్మన్ కమలరాజ్, మేయర్ పాపలాల్ను కలసి వినతి పత్రాలు అందించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో కలసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఆందోళన.. జనగామ డిపో నుంచి మరిగడి మోడల్ స్కూల్ వెళ్లే బస్సు రావట్లేదని, దీంతో ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జనగామ డిపోను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించి అధికారులతో చర్చించారు. సిద్దిపేట నుంచి హన్మకొండకు వస్తున్న బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన చేశారు. హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కండక్టర్‌ను ఇన్స్పెక్టర్ మందలించారు. గుండెపోటుతో డ్రైవర్ మృతి.. ముషీరాబాద్ డిపో డ్రైవర్ రమేశ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాల గ్రామానికి చెందిన డ్రైవర్ గఫూర్ గుండెపోటుతో మృతి చెందారు. జహీరాబాద్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సోఫియా ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ధర్నాలో ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు పాల్గొన్నారు. 5,912 బస్సులు నడిపిన అధికారులు మంగళవారంతో పోలిస్తే బుధవారం ఎక్కువ బస్సులు రోడ్డెక్కాయి. 4,231 ఆర్టీసీ బస్సులు, 1,681 అద్దె బస్సులు కలిపి 5,912 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. బుధవారం 4,231 మంది తాత్కాలిక డ్రైవర్లు, 5912 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నారని పేర్కొంది. 3,815 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలు వాడారని, 1,478 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు వెల్లడించారు. ప్రజాభిప్రాయసేకరణ చేయండి: ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న తమ తొలి డిమాండు విషయంలో వెనక్కి తగ్గలేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆ డిమాండును తాము వదులుకున్నామన్న సీఎం మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. బుధవారం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్ వద్ద భారీ సభ జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే, అందులో తాము గతంలో ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లపై చర్చించాల్సిందేనని పేర్కొంటామని వెల్లడించారు. తమది న్యాయపోరాటమని, కావాలంటే ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ పోరాటం న్యాయసమ్మతం కాదని చెబితే తాము వెంటనే సమ్మె వదిలేసి విధుల్లో చేరేందుకు సిద్ధమన్నారు. ఈ సభలో తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, వీహెచ్, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి బస్సులకు నేడు నోటిఫికేషన్ సీఎం ఆదేశంతో కొత్తగా మరో వెయ్యి బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మూడు రోజుల కిందే.. వెయ్యి బస్సులకు అధికారులు టెండర్లు తెరిచారు. అందులో జిల్లాల్లో 275 బస్సులకు 9,700 టెండర్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో 725 బస్సులకు 18 మాత్రమే దాఖలయ్యాయి. ఇప్పుడు మరో వెయ్యి బస్సులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించటంతో వాటికి సంబంధించి టెండర్లు దాఖలు చేయాలని కోరుతూ గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అధికారుల కమిటీ కసరత్తు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి కోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశంతో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఆర్టీసీ అధికారుల కమిటీ బుధవారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈడీలు టి.వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్రావు, వినోద్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఫైనాన్స్ అడ్వైజర్ రమేశ్‌లు ఇందులో పాల్గొన్నారు. కార్మికుల కీలక డిమాండ్ డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించారు. గురువారం మరోసారి భేటీ కానున్నారు. గురువారం రాత్రి కానీ, శుక్రవారం కానీ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు నివేదిక సమర్పించనున్నారు. దానిపై సీఎం సమీక్షించనున్నారు. అందులో సమ్మె విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అవే వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు. -
ఆర్టీసీ సమ్మె: బస్సుపై రాళ్ల దాడి
ఆసిఫాబాద్: ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉదృతమవుతోంది. ఆసిఫాబాద్‌లోని హనుమాన్ విగ్రహం వద్ద రెండు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి ద్వంసం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న బస్సుపై దుండగులు రాళ్లు విసరడంతో ధ్వంసమైంది. దాంతోపాటు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న మరో బస్సుపై కూడా ఇదే తరహా దాడి జరిగింది. దీంతో బస్సు స్వల్పంగా ధ్వంసమైంది. ఊహించని ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. దాడులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
మరో రికార్డు బద్దలు కొట్టిన మెట్రో
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో మరో రికార్డు సృష్టించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు పోటెత్తడంతో సోమవారం నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు మెట్రోరైళ్లలో 3.75 లక్షలమంది జర్నీ చేయడమే ఇప్పటివరకు నమోదైన రికార్డు కాగా..సోమవారం రికార్డుతో పాత రికార్డు బద్దలైంది. పలు ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో లక్షలాదిమంది మెట్రోరైళ్లను ఆశ్రయించారు. దీంతో 4 అదనపు రైళ్లు..120 అదనపు ట్రిప్పులను నడిపారు. మొత్తంగా సోమవారం 830 ట్రిప్పుల మేర మెట్రో సర్వీసులను నడపడం విశేషం. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పీక్ అవర్స్‌లో ప్రతి 3.5 నిమిషాలకు..ఇతర సమయాల్లో ప్రతి ఏడు నిమిషాలకో రైలును నడిపినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. స్టేషన్లలో అధిక రద్దీ నేపథ్యంలో....ట్రిప్పులను అదనంగా నడిపామన్నారు. ప్రధానంగా ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ఎల్భీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిక్కిరిశాయి. స్టేషన్లలోకి చేరుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు బారులు తీరారు. అన్ని మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లలో వేలాది మంది మెట్రో రైళ్లకోసం నిరీక్షించడం కనిపించింది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్లో ప్రయాణికుల రద్దీ బేగంపేట్ మెట్రోస్టేషన్‌కు తాళం.. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసు అంటించడం విశేషం. అయితే స్టేషన్ మూసివేత కారణంగా ఈ స్టేషన్లో దిగాల్సిన ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సి రావడంతో ఇబ్బందులు పడ్డారు. -
ఆర్టీసీ సమ్మెః ఎక్కువ బస్సులు నడపండి
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 18వ రోజుకు చేరుకుంది. రెండొంతుల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్వైజర్లు, తదితర కేటగిరీలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి డిపోలు, బస్స్టేషన్ల వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, బస్‌భవన్ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. సెప్టెంబర్ నెల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి చేపట్టడం, మరోవైపు కార్మికులు తమ కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగడంతో బస్‌డిపోలు, ప్రయాణ ప్రాంగణాల వద్ద, బస్‌భవన్ వద్ద పోలీసులు గట్టిభద్రతను ఏర్పాటు చేశారు. ఇక కార్మికులు 30వ తేదీన సకలజనుల సమరభేరి నిర్వహించనున్నారు. అంతంత మాత్రంగా ఆర్టీసీ బస్సులు.... కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బంది సహాయంతో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ డ్రైవర్ల కొరత కారణంగా ప్రయాణికులు, విద్యార్థుల రద్దీకి తగిన విధంగా బస్సులు నడపలేకపోయారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. విద్యార్థులు సకాలంలో కాలేజీలకు చేరుకోలేకపోయారు. ఎక్కువ బస్సులు నడపండి: మేడ్చల్ కలెక్టర్ నేరేడ్మెట్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఎక్కువ బస్సులు నడపాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నేరేడ్మెట్ వాయుపురిలోని మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆయన తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా డిపోలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరాలు తీర్చాలని కోరారు. -
ఆర్టీసీ సమ్మె: సొంత విధుల్లోకి ప్రైవేట్ డ్రైవర్లు
సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకుబయలుదేరిన విద్యార్థులు తొలిరోజే చుక్కలు చూశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి స్టాపుల్లో నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఒకట్రెండు బస్సులు వస్తే అందులో కిక్కిరిసి ప్రమాదరక స్థితిలో ప్రయాణించారు. ప్రధానంగా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులుఅవస్థలు పడ్డారు. అదనపు సర్వీసులు నడపాలని గ్రేటర్ ఆర్టీసీ భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా రోజులతో పోలిస్తే సర్వీసుల సంఖ్య మరింత తగ్గింది. తాత్కాలిక సిబ్బందితో ఇప్పటి వరకు 1300 బస్సులు నడపగా... అదికాస్త 1087కుపడిపోయింది. టెంపరరీ డ్రైవర్లు సొంత విధుల్లోకి వెళ్లడంతోఈ పరిస్థితి తలెత్తింది. విద్యాసంస్థల పునఃప్రారంభం సందర్భంగా‘సాక్షి’ సోమవారం విజిట్ నిర్వహించింది. సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె కష్టాలు సోమవారం విద్యార్థులను చుట్టుముట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తగినన్ని బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ ప్రయాణికులు సైతం గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాశారు. శివార్లలోని ఇంజినీరింగ్, ఒకేషనల్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చేసేది లేక ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. చాలా మంది బైకులపై త్రిబుల్ రైడింగ్ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు వాహనాలు దొరక్క నరకం చూశారు. తిరిగిన ఒకటి, రెండు బస్సుల్లోనూ కిక్కిరిసి వెళ్లారు. దసరా సెలవుల్లో సమ్మె ప్రారంభం కావడంతో ప్రభుత్వం వారం రోజుల పాటు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనువుగా ఈ సెలవులను పొడిగించారు. కానీ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన సోమవారం నాటికి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 1087 బస్సులను మాత్రమే రోడ్డెక్కించగలిగింది. మరో 375 అద్దె బస్సులు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. అవి ఏ రూట్లో తిరిగాయి.. ప్రయాణికులకు ఎలాంటి సేవలందజేశారనే అంశంపై స్పష్టత లేదు. నగరంలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా కనీసం 2000 బస్సులను నడిపాలి. ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినప్పటికీ ఆ స్థాయిలో నడపలేకపోయారు. తాత్కాలిక డ్రైవర్లలో చాలామంది తిరిగి తమ సొంత విధుల్లోకి వెళ్లిపోయారు. బస్సులు నడిపేవారు లేక ఘట్కేసర్, బోగారం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, కీసర, బాచుపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, గండిమైసమ్మ, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయాణ గండం తప్పలేదు. మెట్రో బస్సులు నడపలేరు ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లు కేవలం అశోక్ లేలాండ్‌కు చెందిన ఆర్డినరీ బస్సులను మాత్రమే నడుపగలుగుతున్నారు. ఆర్టీసీలో ఉన్న 160 మార్కోపోలో లోఫ్లోర్ నాన్ ఏసీ, మరో 90 వోల్వో ఏసీ, మరో 6 మల్టి యాక్సిల్ బస్సులు, 40 రాజధాని ఏసీ బస్సులు, 246 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపాలంటే ప్రత్యేక శిక్షణ పొందినవారు అవసరం. ఆర్టీసీలో అనుభవం ఉన్నవారికే ఈ బస్సులను అప్పగిస్తారు. ప్రస్తుతం తాత్కాలికంగా విధుల్లో చేరుతున్న వాళ్లంతా లారీలు, ట్రాక్టర్లు నడిపిన వాళ్లే కావడంతో ఈ బస్సులను వారికి అప్పగించడం లేదు. వెంటాడుతున్న డ్రైవర్ల కొరత ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మొత్తం 3,775 బస్సులు తిరుగుతుంటాయి. 19,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో 7.5 వేల మంది డ్రైవర్లు, మరో 7 వేల మంది కండక్టర్లు ఉన్నారు. 17 రోజులుగా సిబ్బంది మొత్తం సమ్మెలో ఉండడంతో కేవలం డిపోమేనేజర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుస్తున్నాయి. కండక్టర్లుగా పని చేసేందుకు చాలా మంది సుముఖంగా ఉన్నప్పటికీ డ్రైవర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్లే ఇప్పటి దాకా బస్సులు నడిపారు. కానీ విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో వారంతా తిరిగి తమ విధులకు వెళ్లారు. దీంతో ప్రైవేట్ సిబ్బంది సహాయంతో నడిపే బస్సుల సంఖ్య 1300 నుంచి 1087కు పడిపోయింది. నో టిమ్స్..టికెట్ ప్రైవేట్ సిబ్బంది దోపిడీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రింటెడ్ టిక్కెట్ల జారీని ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. అలాగే టిమ్స్ యంత్రాల ద్వారా టిక్కెట్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ సదుపాయం రాలేదు. మరోవైపు సొంత ప్రింటింగ్‌ప్రెస్ లేకపోవడం వల్ల ప్రింటెడ్ టిక్కెట్ల కోసం ఇతర ముద్రణ సంస్థలపై ఆధార పడాల్సి వస్తుంది. మియాపూర్ బస్‌బాడీ యూనిట్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను గతంలోనే మూసేశారు. దీంతో ఆర్టీసీలో టిక్కెట్ల జారీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై అనిశ్చితి నెలకొంది. -
ఆర్టీసీ సమ్మెపై మంత్రి పువ్వాడ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల సెలవులు ముగిసి తిరిగి ప్రారంభం కాబోతున్న సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. త్వరలో 100 శాతం బస్సులు రోడ్ల మీద నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో కండక్టర్లకు టిమ్ మిషన్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణీకులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేసేలా, వారి బస్ పాసులు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసరానికి అనుగుణంగా బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎలక్ట్రీషీయన్లు అవసరమైతే నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి సూచించారు. గంటపాటు కొనసాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీవోలు, జేటీసీలు, ఈడీలు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్
సాక్షి, మహబూబ్ నగర్ : ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే సకల జనుల సమ్మెగా మారుతున్న ఆర్టీసీ సమ్మెలో కేసీఆర్ కొట్టుకుపోతాడని డీకే అరుణ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదని, సెల్ఫ్ డిస్మిస్ అనే పదం కేసీఆర్‌కే వర్తిస్తుంది కానీ కార్మికులకు కాదన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించ లేదో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ అవినీతి బయటపడి జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆర్టీసీని పరిరక్షించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో పెట్టి చోద్యం చూస్తోందని విమర్శించారు. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్నారు. -
గూటిలోనే గులాబీ!
సాక్షి, పరిగి: వెనక చూస్తే గొయ్యి.. ముందు చూస్తే నుయ్యి.. అనేలా మారింది టీఆర్ఎస్ ఎమ్మె ల్యేల పరిస్థితి. ఎన్నికై 10 నెలలు గడుస్తున్నా.. వీరికి ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో శాసన సభ్యుడికి ఏటా రూ.3 కోట్లు కేటాయిస్తారు. కానీ ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేలు గుళ్లు, గోపురాలు తిరగడం, ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడానికే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు నిధులు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వీరికి మరింత సంకటంగా మారింది. ఎమ్మెల్యేలే కాకుండా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులెవరూ బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేల్లో.. ముగ్గురు టీఆర్ఎస్ నుంచి.. ఒకరు కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. అయితే హస్తం పార్టీ నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే సైతం గులాబీ గూటికే చేరడంతో.. జిల్లాలో కార్మికులకు మద్దతుగా తిరిగే ఎమ్మెల్యే లేకుండాపోయాడు. సోషల్ మీడియా వేదికగా.. హోటళ్లు, టీ కొట్లు, పాన్‌షాపులు, టిఫిన్ సెంటర్లు.. ఇలా నలుగురు గుమిగూడే ప్రతి చోటా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే సయంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ సమ్మె సంగతులు ఊపందుకున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి.. అనే కోణంలో అధికార పార్టీ కార్యకర్తలు ఎవరైనా పోస్టు చేస్తే చాలు మిగతా పార్టీలు, సంఘాల నేతలు వారిపై విరుచుకుపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తూ వారికి అనుకూల పోస్టులు పెడుతున్నారు. అన్నివైపులా ఒత్తిడి.. ప్రజాప్రతినిధులుగా తమను ఎన్నుకున్న ప్రజలు, ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలవాలో... అటు ప్రభుత్వమే తమది కావడంతో సర్కారు గొంతుక వినిపించాలో తెలియక ఎమ్మెల్యేలు కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఒక్కటై ప్రభుత్వంతో పాటు అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. తమ డిమాండ్ల సాధనకోసం సమ్మె బాటపట్టిన ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
-
ఆర్టీసీ సమ్మె: సోషల్ మీడియా పోస్టులతో ఆందోళన వద్దు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో ఆదివారం 3.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో రద్దీ 3 లక్షలుండగా, నిత్యం 50 వేల మంది అధికంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి 3–5 నిమిషాలకో రైలు నడిపినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీతో ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఆయా స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనూ స్థలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమీర్‌పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లో నాగోలు, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రద్దీ పెరగడంతో హెచ్ఎంఆర్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచినట్లు తెలిపారు. సోమవారం సుమారు 4లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్ల భద్రతపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులతో ప్రయాణికులు ఆందోళన చెందవద్దన్నారు. నగరంలోని మెట్రో రైళ్లు, స్టేషన్లు అత్యంత సురక్షితమైనవని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ నగరం.. విశ్వనగరం’ దిశగా మెట్రో అడుగులు వేస్తున్నామన్నారు. -
ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం పొడిగించిన దసరా సెలవులు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడం, మరోవైపు తరగతుల మూడో రోజు నుంచే పరీక్షలు ప్రారంభమవుతుండడంతో బస్సు సేవలపై ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు అరకొరనే తిరుగుతుండడంతో శివారు ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లేది ఎలా? అని స్టూడెంట్స్ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 10వేల వరకు ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 15 లక్షల మంది చదువుకుంటున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... సమ్మె నేపథ్యంలో సెలవులను 19 వరకుపొడిగించిన విషయం విదితమే. సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతుండగా... 23 నుంచి 30 వరకు సమ్మెటీవ్–1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖప్రకటించింది. ఈ నేపథ్యంలో సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోపాఠశాలలకు ఎలా చేరుకోవాలని విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పాసులు 3.50 లక్షలు గ్రేటర్లో 890 ఇంటర్మీడియెట్ కాలేజీలుఉండగా... వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఇతర కాలేజీలు మరో 900 వరకు ఉండగా... వాటిలో 6లక్షల మంది విద్యార్థులున్నారు. సాంకేతిక వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన కాలేజీల్లో చాలా వరకు దేశ్‌ముఖ్, ఇబ్రహీంపట్నం, చెంగిచర్ల, నారపల్లి, ఘట్కేసర్, భువనగిరి, సూరారం, బాచుపల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం,మొయినాబాద్, షాద్‌నగర్, శంషాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 4.50 లక్షల బస్సు పాసులు ఉండగా... వీటిలో 3.50 లక్షల పాసులు విద్యార్థులవే. ఆయా కాలేజీల విద్యార్థుల రవాణాకు ఆర్టీసీ బస్సులే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.శివార్లలోని నల్లగొండ, భువనగిరి, మేడల్చ్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, చేవేళ్ల జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో చాలా మంది నగరంలోనే ఉంటున్నారు. వీరంతా రోజూ ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు. వీరూ సోమవారం నుంచి ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. -
సమరభేరి దిశగా ఆర్టీసీ సమ్మె
-
నియంతలా వ్యవహరిస్తే పతనమే..!
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ వ్యవహరిస్తున తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌నేత వీహెచ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం!
సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై చొరవ చూపాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడంలేదు. కార్మిక సంఘాలను ఎలాంటి చర్చలకు ఆహ్వానించపోగా.. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో బీజేపీ చివరి వరకు ఉంటుంది. శనివారం రోజున ఆర్టీసీ కార్మికుల బంద్‌లో పాల్గొన్న బీజేపీ నాయకులు లక్ష్మణ్‌తో పాటు చాలామంది ని అరెస్ట్ చేశారు. కార్మికుల పక్షాన పోరాటం చేసే వాళ్లను ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదని, కావాలంటే టీఆర్ఎస్ నాయకులు విచారించుకోవచ్చని' అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావించగా బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నట్లు' ధీమా వ్యక్తం చేశారు. -
‘48 వేల కుటుంబాలను బజారుపాలు చేశారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బంద్‌లో పాల్గొన్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు గాయానికి కారణమైనవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పినా చర్చలకు పిలవకుండా 48 వేల ఆర్టీసీ కుటుంబాలను బజారుపాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న కార్యాచరణకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. జేఏసీ నిర్ణయించిన అన్ని అంశాలను లెఫ్ట్ పార్టీలు ఆమోదిస్తున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ బంద్ 100 శాతం విజయవంతంగా జరిగిందన్నారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఘాటుగా విమర్శించారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఇంతవరకూ సీఎం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి వీడి కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల కార్యాచరణ.. 21న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతోపాటు వామపక్ష పార్టీల కుటుంబాల డిపోల ముందు నిరసన 22న తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి రావద్దని విజ్ఞప్తి 23న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమ్మెకు మద్దతు కోసం విజ్ఞప్తి 24న మహిళా కండక్టర్ల దీక్షలు. వారితో పాటు సాధారణ మహిళల్ని కూడా నిరననల్లో భాగం చేస్తాం 25న మిలిటెంట్ కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల దిగ్భంధం 26న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష. వారితోపాటు వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల పిల్లలు కూడా దీక్షల్లో భాగం చేస్తాం 27న వామపక్ష పార్టీ నాయకుల ఇళ్లకు ఆర్టీసీ కార్మికులకు ఆహ్వానం -
నియంతృత్వ వైఖరి వీడాలి
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం(రామనర్సయ్య విజ్ఞానకేంద్రం)లో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఎండీ.జావీద్, తెలంగాణ జన సమితి నాయకులు బత్తుల సోమయ్య, జెఏసీ నాయకులు కేవీ.కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి మొండి వైఖరి అవలంబిస్తున్నారన్నారు. హైకోర్టు గడువు ఇచ్చి ఆ లోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ నేటి వరకు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే వారికి ప్రజలు, అఖిలపక్ష పార్టీలు పూర్తి మద్దతునిస్తే వారిపై పోలీసులచే దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు హైదరాబాద్‌లో ఆందోళనలో పాల్గొంటే పోలీసులు దౌర్జన్యంగా వ్యాన్‌లో ఎక్కించి డోర్ వేస్తే రంగారావు బోటన వేలు తెగిపోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో జిల్లాకు కేసీఆర్ వస్తే నాడు అండగా ఉండి ఆదుకున్నది పోటు రంగారావు, న్యూడెమోక్రసీ పార్టీ కీలకపాత్ర పోషించగా మిగిలిన పార్టీలు, ప్రజలు, ఇతర సంఘాలు సహకరించాయన్నారు. ఆ విషయాన్ని మరిచి కేసీఆర్ వ్యవహరిస్తున్నారా..? నాడు ఉద్యమ సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ అలాగే అడ్డుకుంటే నేడు రాష్ట్రం ఏర్పడేదా...? అని ప్రశ్నించారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని గుర్తించాలన్నారు. పోటు రంగారావు బొటన వేలు తెగిపోయిన సంఘటననను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 20(నేటి)నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, టీడీపీ నాయకులు తోటకూరి శివయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుమలరావు, టిజెఏసి నాయకులు చిర్రా రవి తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ చుట్టూ.. రాజకీయం!
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు టీఆర్ఎస్, ఎంఐఎం తప్పా మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. కార్మికులతో కలిసి పోరుబాట పట్టాయి. ఎక్కడికక్కడ ప్రతిరోజూ డిపోల వద్ద ధర్నాలు.. రాస్తారోకోలు.. వినూత్న నిరసనలు.. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల అందజేతలో చురుగ్గా పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కార్మికుల సమ్మెపై స్పందించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. వారం రోజులుగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొనడంతో సమ్మె ఉధృతంగా మారింది. ఇప్పటికే పట్టణాలు, మండలాల్లో నిర్వహిస్తున్న ఆందోళనల్లో ఆయా పార్టీల నేతలు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు.. కార్యక్రమాలపై స్పందించే అఖిలపక్ష నేతలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కలిసొచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంత పెద్దస్థాయిలో ఉధృతంగా ఈ ఉద్యమం కొనసాగుతుండటం.. అన్ని వర్గాలు, సంఘాలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడటంతో రాజకీయ పార్టీలు సైతం తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు ఐదు వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఈ సమ్మెలో పాల్గొనడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నాయి. ఈ పార్టీల మద్దతును చూసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని చేపట్టాయి. బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీపీఐ తరఫున పార్టీ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్, సీఐటీయూ నాయకుడు కె.చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఆయా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో డోకూరి పవన్‌కుమార్ (బీజేపీ), జి.మధుసూధన్‌రెడ్డి (కాంగ్రెస్), సీహెచ్ రాంచందర్ (సీపీఐఎంఎల్–న్యూడెమోక్రసీ), వేణుగోపాల్ (సీపీఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో బాలవర్ధన్‌గౌడ్ (కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకుడు), రాంమోహన్ (బీజేపీ), దీప్లానాయక్ (సీపీఎం), జగన్ (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఆయా పార్టీ కార్యకర్తలు కార్మికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి.రాములు, బిజేపి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎంఏ జబ్బార్, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రయ్య, బిఎస్పీ రాష్ట్ర నాయకులు సత్యంసాగర్ల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్మికులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జోగుళాంబ గద్వాల నియోజకవర్గ పరిధిలో డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, గడ్డం కృష్ణారెడ్డి (బీజేపీ), గంజిపేట రాములు (టీడీపీ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గ పరిధిలో సదానందమూర్తి (కాంగ్రెస్), తుమ్మల రవికుమార్ (బీజేపీ), రాజు, రేపల్లి దాసు (సీపీఎం), పెద్దబాబు (సీపీఐ) ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆందోళన చేపడుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రమేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల నర్సింహ, వెంకట్రాములు (కాంగ్రెస్), శ్యాంప్రసాద్‌రెడ్డి (టీజేఎస్) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఆనంద్‌కుమార్ (కాంగ్రెస్), రాఘవేందర్ (బీజేపీ), ఆంజనేయులు (సీపీఎం), పరశురాం (సీపీఐ), కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీపీసీసీ కార్యదర్శులు జగన్మోహన్రెడ్డి, జగదీశ్వరుడు; శేఖర్‌గౌడ్ (బీజేపీ), రామస్వామియాదవ్ (టీడీపీ), ఫయాజ్అహ్మద్ (సీపీఐ), శివశర్మ (సీపీఎం), అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో డాక్టర్ వంశీకృష్ణ (కాంగ్రెస్), మండిగారి బాలాజీ, మంగ్యానాయక్ (బీజేపీ), మోపతయ్య (టీడీపీ), ఎల్.దాస్యానాయక్ (సీపీఎం) ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. నారాయణపేట నియోజకవర్గ పరిధిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామోజీ, బండి వేణుగోపాల్ (కాంగ్రెస్), వెంకట్రాంరెడ్డి (సీపీఎం), బి.రాము (సీపీఐ), ఓంప్రకాశ్ (టీడీపీ) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మక్తల్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ కొండయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి, కొండన్న (సీసీఐ), భగవత్ (సీపీఎం) ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: సీఎస్, ఆర్టీసీ ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుపై జాతీయ బీసీ కమిషన్ శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆర్టీసీలోని 20 వేలకు పైగా బీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిందని, దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టీసీ జేఏసీ ....జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, సంబంధిత ఫైళ్లు, కేస్ డైరీలు సహా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. చదవండి: ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ -
దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన
సాక్షి, బాన్సువాడ : బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 14వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద కార్మికులు కోలాటం ఆడి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల నాయమైన డిమాండ్లను పరిష్కారించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 14 రోజులు కావస్తున్న సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అందుకే దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశామన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఖలీల్, సుదీర్, సంగమేశ్వర్, హన్మండ్లు, రాజాసింగ్, అశ్వీన్, సోను, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గిరిధర్, కో కన్వీనర్లు మల్లయ్య, బసంత్, శంకర్, లక్ష్మణ్, నాగరాజ్, జీఎస్. గౌడ్, యాదుల్లా, మూర్తి, కౌ సర్, సాయిలు, చంద్రకాంత్, ప్రశాంత్‌రెడ్డి, రా ధ, సవిత, విమల, లక్ష్మీ, శ్యామల ఉన్నారు. శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గిరిధర్ అన్నారు. శుక్రవారం బాన్సువాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్తులకు బంద్‌కు సహకరించాలని విన్నవించారు. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి
సాక్షి, బోథ్(మంచిర్యాల) : ఆర్టీసీ కార్మికుల సమస్యను పరష్కరించకుండా జాప్యం చేస్తూ మధ్య తరగతి, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, తుడుం దెబ్బ, బీజేపీ, కాంగ్రెస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడల స్వామి మాట్లాడారు. ఆర్టీసీలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను సీఎం సెల్ఫ్ డిస్మిస్ చేస్తామని ప్రకటించడం ఆయన దొరతనానికి నిదర్శనమన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మాట్లాడుతూ.. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడే మానాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బుర్గుల మల్లేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మాదిగ స్డూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ మాట్లాడుతూ సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు మద్దతు తెలిపి ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు బుచ్చి బాబు మాట్లాడుతూ ఆర్టీసీ అప్పులకు ప్రభుత్వమే కారణమన్నారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు అత్రం మహేందర్, గెడం నగేందర్, బీజేపీ నాయకులు కదం బాబారావు, మాదవ్ అమ్టె, మచ్చనారయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు దుబాక సూభాష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాథోడ్ ప్రకాశ్, శ్యామ్, జ్ఞానోబా, గంగాధర్, ఆర్టీసీ కార్మికులు గణపతి, భూమారెడ్డి, బాబాన్న, హైదర్, మోహన్‌రెడ్డి, కళ, పద్మ, ఫాయిమ్, దేవన్న, పాండురంగ్, స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని డిమాండ్లపై చర్చలకు సిద్ధమే
-
తెలంగాణ బంద్: ప్రతి 3నిమిషాలకు మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకుమద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ కారణంగా నగరంలో ప్రజారవాణా స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ సిబ్బంది సహాయంతోఅరకొరగా నడుస్తున్న సిటీ బస్సులూ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ ‘తెలంగాణ బంద్’కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు కూడా నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలన్నీ ఆర్టీసీ మద్దతు తెలిపాయి. 14 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె, తెలంగాణ బంద్, సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన, ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవడం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రవాణా అధికారులు బస్సుల నిర్వహణపై సీరియస్‌గా దృష్టిసారించారు. ‘ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకాలను ముమ్మరం చేశాం. చర్చలు సఫలమై కార్మికులు విధుల్లో చేరితే మంచిదే.. లేని పక్షంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణం కష్టమే... గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 3,750 బస్సులు 32 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. సమ్మె కారణంగా 14 రోజులుగా 1200–1400 బస్సులు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. ఈ బస్సులను సైతం కేవలం పగటిపూట మాత్రమే నడుపుతున్నారు. శనివారం నిర్వహించనున్న బంద్ దృష్ట్యా ఇవి కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. మరోవైపు నగరం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. దూరప్రాంతాల బస్సులు నిలిచిపోతే మరో లక్ష మంది వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. నగరంలో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరుకావడం కష్టమే. బీజేపీ, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్‌పల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్మికులు ఆటోలకు బ్రేక్... గ్రేటర్లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా ఆటోరిక్షాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బంద్ వల్ల వీటికీ బ్రేక్ పడనుంది.ఆటో డ్రైవర్లు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ప్రత్యేకించి అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సినవారు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు తదితరులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే సమ్మె కారణంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన ఆసుపత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బంద్ కారణంగా తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులకు అసౌకర్యం కలగనుంది. అలాగే పాలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలగనుంది. క్యాబ్‌లు బంద్... నగరంలో 50వేలకు పైగా ఉబర్, ఓలా తదితర క్యాబ్‌లు బంద్‌లో పాల్గొనున్న నేపథ్యంలో మరో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం స్తంభించనుంది. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 5వేలకు పైగా క్యాబ్‌లు కూడా నిలిచిపోనుండడంతో డోమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. వైద్య సేవలు యథాతథం బంద్ నేపథ్యంలో శనివారం వైద్యసేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 108 అత్యవసర సర్వీసులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. రైళ్లు.. రయ్ రయ్ బంద్ నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో సుమారు 4లక్షల మంది మెట్రో సేవలు వినియోగించుకునే అవకాశముంది. అలాగే ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మార్గాల్లో 121ఎంఎటీఎస్ సర్వీసులు యథావిధిగానడుస్తాయి. 1.5 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–బొల్లారం మధ్య నడిచే డెమూ రైలునుశనివారం మేడ్చల్ వరకు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ మధ్య మరో రెండు జన సాధారణ రైళ్లుఅదనంగా నడవనున్నాయి. -
నేడు తెలంగాణ బంద్
-
ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇన్చార్జి)ను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ), ఆర్టీసీ తెలం గాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా సమ్మె పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత సూచనలు... ఆపై ఉత్తర్వులు ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్. సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు మరో మూడు రిట్లను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. మధ్యాహ్నం 2:15 గంటల నుంచి కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా అరగంటపాటు 4:45 గంటల వరకూ వాదనలు జరిగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్లో వాదనల సమయంలో ప్రభుత్వానికి సూచనలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు ధర్మాసనం ఆర్టీసీ ఎండీ (ఇన్చార్జి) చర్చలకు శ్రీకారం చుట్టాలని ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వానిది తండ్రి పాత్ర...ఈ అంశంపై తొలుత ఆర్టీసీ యాజమాన్యం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదించేందుకు నిలబడగానే ధర్మాసనం కల్పించుకొని ఆర్టీసీకి ఎండీని నియమించారా అని ప్రశ్నించింది. దీనికి ఏఏజీ బదులిస్తూ ఇంకా లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వ్యక్తిని ఎండీగా నియమిస్తే సమస్యల్ని అవగాహన చేసుకోవడం కష్టమవుతుందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఎండీని నియమిస్తే కార్మికులకు నమ్మకం ఏర్పడుతుందని, ఎండీ నియామకంతో జీతభత్యాలేమీ మీ జేబులోంచి ఇవ్వరు కదా? అని వ్యాఖ్యానించింది. కొత్త ఎండీని నియమిస్తే ఇప్పుడున్న ఇన్చార్జి ఎండీ సహకరించవచ్చు కదా, ప్రభుత్వానికి అధికారాలు ఉండేకొద్దీ మరింత వినయంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానిది తండ్రి లాంటి పాత్ర అని, ఉద్యోగులు పిల్లలని, ఒక కుటుంబంలో సభ్యులు ఏమైనా డిమాండ్లు లేదా సమస్యల్ని తీసుకొస్తే కుటుంబ పెద్ద చర్చించి పరిష్కరించాలని, ఆర్టీసీ సమ్మె విషయంలో అదే చేయాలని హితవు పలికింది. ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన పాత్ర కూడా ఉందని, అధికారాలతోపాటు బాధ్యతలను కూడా నెరవేర్చేది ప్రభుత్వమేనని వ్యాఖ్యానించింది. కొత్త సిబ్బంది నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఉందా? ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో బస్సుల్లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడంతో విద్యార్థులు సమస్యల్లో ఉన్నారని ధర్మాసనం పేర్కొనగా ఏఏజీ కల్పించుకొని ఇప్పటికే 87 శాతం బస్సులు తిరుగుతున్నాయన్నారు. సోమవారం (21వ తేదీ) నుంచి విద్యాసంస్థలన్నీ ప్రారంభమవుతాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘నిజమే.. ఆర్టీసీలో 100 కాదు 110 శాతం మంది సిబ్బందిని తీసుకొని సమ్మె ప్రభావం లేదని తేల్చినా రేపు ఈ సిబ్బంది నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఏముంది?’’అని ప్రశ్నించింది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఏఏజీ పేర్కొనగా ప్రభుత్వ నిధుల దుబారాపై ఇదే హైకోర్టుకు కేసులు వచ్చాయని గుర్తుచేసింది. అయితే తాను చెబుతున్న ఆర్థిక గడ్డు పరిస్థితి ఆర్టీసీ గురించి అని, తాను ప్రభుత్వం తరఫున వాదించడం లేదని, ఆర్టీసీ యాజమాన్యం తరఫున వాదిస్తున్నానని ఏఏజీ వివరణ ఇచ్చారు. ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించగా చర్చలు విఫలమైనట్లుగా 5వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందిందని, చట్ట ప్రకారం చర్చలు విఫలమయ్యాక తిరిగి చర్చలకు వీల్లేదని ఏఏజీ బదులిచ్చారు. సమస్యను కార్మిక వివాదాల పరిష్కార అధీకృత అధికారి వద్దే పరిష్కరించుకోవాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘రేపు లేబర్ కోర్టు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని తేలిస్తే ప్రభుత్వం లేదా కార్పొరేషన్ ఏం చేస్తుంది? శనివారం తెలంగాణ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. క్యాబ్ డ్రైవర్లు, టీఎన్జీవో సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి’’అని గుర్తుచేసింది. అయితే సమ్మెపై రాజకీయాలు మొదలు పెట్టారని ఏఏజీ వ్యాఖ్యానించగా ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుంటూ ‘‘ఇప్పటికే అగ్గి మొదలైంది. అది రాజుకోకుండా చూడాలి. నియంత్రణ చర్యలు చేపట్టాలని పదేపదే హితవు చెబుతున్నాం. రాష్ట్రం చూడదని ఏఏజీ చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె వంటి చిన్న సమస్య మొదలై రెండు వారాలైంది. ప్రజాగ్రహం రాష్ట్రవ్యాప్తమైతే ఏం చేస్తారు? పౌర సమాజం గొంతు విప్పితే ఎవ్వరూ ఆపలేరు. ఫిలిపిన్స్‌లో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనం. ప్రజాఉద్యమం ప్రజాగ్రహంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. హైకోర్టు ఉద్దేశం కూడా అదే. అందుకే ఆచితూచి స్పందిస్తున్నాం’’అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించాలని ధర్మాసనం సూచించగా ఏఏజీ కల్పించుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ డిమాండ్ సంగతి తేలిస్తేనే ఇతర డిమాండ్లలోకి వెళ్తామని షరతు విధించాయన్నారు. సగం డిమాండ్లు పరిష్కరించేవే.. ఈ సందర్భంగా ధర్మాసనం ఐదు నిమిషాలకుపైగా కార్మికుల డిమాండ్లను చదివింది. ఒక్కో డిమాండ్ చదివి ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని పరిష్కరించేందుకు ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని ఏఏజీని కోరింది. కొన్నింటిని ఆర్టీసీ యాజమాన్యమే పరిష్కరించాలని, యూనియన్లు డిమాండ్లుగా పేర్కొనాల్సినవే కాదని అభిప్రాయపడింది. 42 డిమాండ్లల్లో సగానికిపైగా అలాంటివేనని, పైగా వాటికి ఆర్థిక అంశాలతో సంబంధం లేదని వివరించింది. కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు ఈడీల నియామకం, ఉద్యోగ భద్రత మార్గదర్శకాల రూపకల్పన, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల లభ్యత, వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్, రిటైర్డు కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు, ఆసరా పింఛన్లు, అనారోగ్యం వచ్చినప్పుడు పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యం, డిపోల్లో విడిభాగాల లభ్యత, వోల్వా బస్సుల ద్వారా శిక్షణ, సిబ్బంది పిల్లలకు ఐటీఐలో శిక్షణ వంటి సగానికిపైగా డిమాండ్లు సులువుగా పరిష్కరించదగ్గవేనని ధర్మాసనం అభిప్రాయపడింది. విడిభాగాలు కావాలంటే ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసమే కదా, శిక్షణ కోరుతున్నది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు కోసమే కదా, ఈడీ వంటి పోస్టుల భర్తీ వల్ల సంస్థకే మేలు కదా, వైద్య, ఆరోగ్య రంగానికి కేరాఫ్‌గా ఉన్న తెలంగాణలో రిటైర్డు ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే మేలే కదా.. అని ధర్మాసనం పేర్కొంది. భావితరాల వాళ్లు ఎలా ఉండాలో టాటా స్టీల్ సిటీ జంషెడ్‌పూర్‌లో ఇస్తున్న శిక్షణను పరిశీలిస్తే మనమేం చేయాలో అర్థం అవుతుందని, అక్కడ వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్లుపై నిలవదని, మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలని కోరుతుంటే ఆలోచన ఎందుకుని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనిపై ఏఏజీ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఇతర డిమాండ్లపై చర్చించబోమని యూనియన్లు మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీలో విలీనం డిమాండ్ పాతదే: యూనియన్లు యూనియన్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌కు ఇతర అంశాలను ముడిపెట్టలేదన్నారు. విలీనం డిమాండ్ చేస్తూనే ఇతర విషయాలపై చర్చలకు యూనియన్లు సిద్ధంగానే ఉన్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం ఇప్పటిది కాదని, 2013లో నాటి ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనానికి కమిటీ వేసిందన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ యూనియన్లు, ఆర్టీసీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 19న బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, 21 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభమైతే సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, మద్రాస్ హైకోర్టు గతంలో ఆ మేరకు తీర్పు చెప్పిందన్నారు. దీనిపై ప్రకాశ్‌రెడ్డి కల్పించుకొని యూనియన్లు, యాజమాన్యం ఒకటేనని పిటిషనర్ ఆరోపించడాన్ని ఖండించారు. గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశించాక చర్చలకు యూనియన్ సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌లకు ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకపోయిందని వివరించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఏమైందో అందరికీ తెలుసునని, సమస్య జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అమలుకాని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. యూనియన్, జేఏసీ ప్రతినిధులను ఆర్టీసీ ఎండీ (ఇన్చార్జి) పిలిచి చర్చలు జరిపి సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యేలా చూడాలంటూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీసీ సమ్మెకు రిటైర్డ్ టీచర్ రూ. 25వేల సాయం
సాక్షి, ఖమ్మం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెలో పాల్గొన్న కార్మికులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సమ్మె మరింత ఉదృతం అయ్యింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాల నుంచి, ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికుల్ని వేధిస్తుంటే.. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా లెక్కచేయకుండా సహాయం చేయడానికి ముందుకొచ్చారు 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగ విరమణ చేసిన రేగులగడ్డ విజయ కుమారి. గత 14 రోజులుగా అపూర్వ ఐక్యతతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వారి పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రూ. 25 వేలు ఖమ్మం డిపో జేఏసీకి అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు విజయ కుమారి చేసిన సాయానికి ఆర్టీసీ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. -
కేసీఆర్ నిజ స్వరూపం బయటపడింది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దొంగ దీక్ష గురించి తనకు ఆరోజే తెలిసినా తెలంగాణ కోసం మాట్లాడలేదని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. దీక్ష చేస్తూ 700 కిలో క్యాలరీల ద్రవాహారాన్ని కేసీఆర్ తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటిoగ్‌లకే పరిమితమై, ప్రపంచ నియంతలలో మొదటి స్థానాన్ని సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ఆర్టీసీ నుంచి ప్రభుత్వం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మంచి సలహాలు కూడా స్వీకరించని కేసీఆర్ రాక్షస, దోపిడీ పాలనకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
అక్రమ ఆస్తులుంటే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధం..
సాక్షి, హైదరాబాద్ : తన ఆస్తులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలితే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో సమ్మెలు ఉండవు ...మంచిగా బతకొచ్చని కేసీఆర్ అన్నారు. కానీ మా సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ సమాజం మూగపోయింది. కానీ ఆర్టీసీ గొంతు మూగపోలేదు. మంత్రి హరీశ్‌రావు మౌనం మంచిది కాదు. పదవులు శాశ్వతం కాదు. కార్మికులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. అవసరం అయితే మళ్లీ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కార్మికుల ఆత్మహత్యలు మమ్మల్ని ఇంకా కృశింప చేస్తున్నాయి. పోరాటం చేయాలి కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్టీల ఒత్తిడికి నాయకులు తలొగ్గారు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడికి ఆర్టీసీ నాయకులు తలొగ్గలేదు. గతంలో తెలంగాణ కోసం ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా సభలు పెట్టింది నేనే. అప్పుడు రాజకీయ నాయకుల ఉచ్చులో పడ్డావని అప్పటి ప్రభుత్వం అంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేమాట అంటోంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. కొత్త బస్సులు కొనకపోతే కొండగట్టులాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాల్లో ఎన్ని బస్సులు ఉన్నాయ్..మన రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు...నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు ఉంది. 2015లో కరీంనగర్లో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమే. నేను చెప్పిన విషయాల్లో తప్పులు ఉంటే ముక్కు నేలకు రాసి...క్షమాపణలు చెప్పి రేపే విధుల్లో చేరతాం. గమ్యం చేరేవరకూ వెనక్కి తగ్గేది లేదు. పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ఖమ్మంలో తప్ప ఎక్కడా అరెస్ట్ చేయలేదు. కానీ ఈ సమ్మెలో నన్ను రోజు అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. ఆర్టీసీలో 4వేలమంది కార్మికులకు సకల జనుల సమ్మె నాటి జీతం ఇంకా ఇవ్వలేదు. ఇది సిగ్గుచేటు విషయం. మా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారు. ఒకే వ్యక్తికి 44 పెట్రోల్ బంక్‌లు ఇవ్వడంపై గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే. పసునూరి దయాకర్ పేరుతో కొందరు ఆర్టీసీ ఆస్తులను లీజ్‌కు తీసుకున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కూడా కొనసాగుతోంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకూ ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులను వీఎస్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్థామరెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేసి బలవంతంగా తీసుకెళ్లారు. -
‘కేసీఆర్ దిగిరా.. లేదంటే తడాఖా చూపిస్తాం’
సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన ఆర్టీసీ విలీనం హామీనే ఇప్పుడు కార్మికులు అడుగుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తూ ఆయన మట్లాడారు. ఈ క్రమంలో గత 14 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది.. చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి ప్రజాస్వామ్యబద్దంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. కార్మికులు అడుగుతున్న కోర్కెలు అన్ని న్యాయమైనవని, ఉద్యోగ భద్రతతో పాటు సంస్థని కాపాడండని కార్మికులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం ఈ సమ్మె జరుగుతుందని.. రేపు జరగబోయే రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ బంద్‌లో యావత్ సమాజం పాల్గోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ దిగిరా లేదంటే ఎర్రజెండా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటు వామపక్ష విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతుని ప్రకటించాయని తెలిపారు. ఈ నెల 19 తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించి.. ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మారుస్తామని తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. -
‘నీ ఉద్యమం లాగే.. భారీ ఉద్యమానికి నాంది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్‌లోని లింగంపల్లి చౌరస్తా నుంచి బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీని శుక్రవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోందని.. రాష్ట్రంలో కార్యకలాపాలన్ని స్తంభించాయని అన్నారు. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎదురుతిరిగాయని పేర్కొన్నారు. అలాగే ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు, ఉద్యోగులు కూడా నిరవధిక సమ్మెకు మద్దతు పలుకుతూ గురువారం నుంచి క్యాబ్‌లను నిలిపివేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రవాణా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రవాణా శాఖ మంత్రి స్పందిచకపోవడం బాధాకరం అన్నారు. ‘మళ్లీ నీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్యమానికి బీజేపీ నాంది పలుకుతుంది’ అని సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. (చదవండి: ఆర్టీసీ సమ్మె; రేపు బంద్.. ఉత్కంఠ) -
ఉధృతంగా ఆర్టీసీ సమ్మె
-
క్యాబ్ ఆవాజ్: డ్రైవర్ల సమ్మె బాట
నగరంలో క్యాబ్ సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీకార్మికులు సమ్మె చేస్తుండగా... క్యాబ్ డ్రైవర్లూ ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకుతెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ నాయకులు గురువారం ప్రకటించారు. కిలోమీటర్‌కు రూ.22 చెల్లించాలని, డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో సమ్మె అనివార్యమన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు సైతం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 19నుంచి క్యాబ్ బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ షేక్ సలావుద్దీన్, కన్వీనర్ కె.ఈశ్వర్రావు, కో–చైర్మెన్ బి.వెంకటేశం తెలిపారు. దీంతో 19నుంచి ఉబెర్, ఓలా తదితర క్యాబ్‌లతో పాటు, ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చెల్లించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు పెద్ద ఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలామంది అప్పులపాలయ్యారు. ఫైనాన్షియర్ల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. డ్రైవర్ల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రతి డ్రైవర్‌కు కనీసం బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలని, ఇందుకనుగుణంగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని జేఏసీ చైర్మెన్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి జీవో 61, 66లకు అమలు చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు.19వ తేదీ వరకు తమ డిమాండ్లపైన స్పష్టమైన హామీ లభించకపోతే సమ్మెను నిరవధికంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. నిలిచిపోనున్న 50 వేల క్యాబ్‌లు క్యాబ్ బంద్ కారణంగా నగరంలో సుమారు 50 వేలకు పైగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ల సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేలకు పైగా క్యాబ్‌లకు కూడా బ్రేక్ పడనుంది. అలాగే హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా రాత్రి పూట సిటీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యాబ్ సేవలను వినియోగించుకుంటున్నారు. కానీ క్యాబ్‌లు కూడా సమ్మెలో పాల్గొంటే ప్రజా రవాణాకు మరింత ఆటంకం కలగనుంది. క్యాబ్ డ్రైవర్ల సమ్మె వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. -
సమ్మెకు సకలజనుల మద్దతు
సాక్షి, ఆదిలాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు రోజురోజుకు సబ్బండ వర్ణాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించగా, తాజాగా ఉద్యోగ జేఏసీ నాయకులు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాటలతో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. వంటావార్పు, ర్యాలీలు, మానవహారం, సీఎం దిష్టిబొమ్మ దహనం, తదితర కార్యక్రమాలతో జోరు పెంచారు. ఈ నెల 5న ప్రారంభమైన సమ్మె గురువారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలుచేపడుతూ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. మోటార్‌సైకిల్ ర్యాలీలు కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదిలాబాద్ పట్టణంలోని పలు వీధుల గుండా మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం సుందరయ్య భవన్లో కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు ఒకటేనన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.2600 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉందన్నారు. డీజిల్‌పై పన్ను విధించడంతో ఆర్టీసీపై భారం పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి రూ.50వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. సమ్మె చేపడుతున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరిట 48వేల మంది ఉద్యోగులను తొలగించామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగులను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. యూనియన్లు వద్దంటే పార్టీలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతుందని భావించి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్‌కుమార్, మహేందర్, రాష్ట్ర కార్యదర్శి తిరుమల్‌రెడ్డి, గోపి, మోహన్, సుధాకర్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్, అశోక్‌గౌడ్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సబ్దార్అలీ, వాసిఖ్, అటవీ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, వార్డెన్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చందర్‌గౌడ్, వివిధ శాఖల ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవీంద్ర, వృకోధర్, వెంకట్, శ్రీనివాస్, నరేందర్, గిరి, తదితరులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం.. సమ్మెలో భాగంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణంలోని తెలంగాణచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటావార్పు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా సుందరయ్యభవన్ ఎదుట వంటావార్పు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాల కోరని విమర్శించారు. కార్మికులు చనిపోతున్నా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకూ వారికి అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. నాయకులు సంజీవ్‌రెడ్డి, యాసం నర్సింగ్, అంబకంటి అశోక్, రూపేశ్‌రెడ్డి, జైపాల్, పొచ్చన్న, సులోచన, సరిత తదితరులు పాల్గొన్నారు. గ్రామీణులకు ఇక్కట్లు మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో 63 ఆర్టీసీ బస్సులు, 33 ప్రైవేట్ అద్దె బస్సులు, 15 సీసీ బస్సులు, 52 మ్యాక్సీ క్యాబ్‌లు, మొత్తం 173 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు
-
ఆర్టీసీ చర్చలపై సర్కారు తర్జనభర్జన
-
ప్రైవేటీకరణపై దండెత్తుదాం
సాక్షి, హైదరాబాద్: సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తాము చర్చలకు సిద్ధమని మరోసారి తేల్చి చెప్పింది. చర్చలు ఎవరితో జరపాలన్న విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయకపోవటాన్ని తప్పుపట్టింది. హైకోర్టు స్పందన నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులు బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ లేమని ప్రభుత్వం కోర్టుకు కూడా చెప్పడంతో.. ఈ విషయంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ విషయంలో పట్టుపట్టకుండా, ఆర్టీసీ పరిరక్షణ కోణంలో డిమాండ్ చేయాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ, అద్దె బస్సుల సంఖ్య పెంపు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనం అంశం విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించి, ప్రైవేటీకరణ యోచనపై గట్టిగా వాదించాలని నిర్ణయించారు. అనంతరం మద్దతు కూడగట్టుకునేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజకీయ జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. చర్చలకు ఆహ్వానించాలి.. కోర్టు సూచనల మేరకు చర్చలకు ఆహ్వానించి ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. అనంతరం మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విడుద చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 19న జరిగే ఆర్టీసీ కార్మికుల బంద్‌ను విజయవంతం చేయా లని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. -
ఆర్టీసీ సమ్మె: జీతాలెప్పుడు ఇస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు సెప్టెంబర్‌లో పని చేసిన కాలానికి జీతాలు ఎందుకు నిలుపుదల చేశారో.. ఎప్పటిలోగా జీతాలు చెల్లిస్తారో తెలియజేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగుల సెప్టెంబర్ జీతాలు చెల్లించకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారించారు. ఆర్టీసీ యాజమాన్య వివరణపై ఈ నెల 21న తదుపరి విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. జీతాల మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రీ వద్ద ఆర్టీసీ యాజమాన్యం డిపాజిట్ చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. రెండ్రోజుల్లో జీతాలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని, జీతాల చెల్లింపు కోసం సిబ్బంది అవసరమైతే కార్మిక యూనియన్‌కు చెందిన 100 మంది పనిచేసేందుకు వస్తారని తెలిపారు. ఇప్పటికే ఏడుగురు కార్మికులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, అప్పు చెల్లించలేక ఒక కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడం చట్ట వ్యతిరేకమని, ఈ విధంగా చేయడాన్ని సుప్రీం కోర్టు కూడా పలు కేసుల్లో తప్పుపట్టిందని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫు న్యాయవాది వాదిస్తూ.. జీతభత్యాలు చెల్లించే ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారని, అందుకే చెల్లింపులు ఆగిపోయాయని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మె: సీఎం కేసీఆర్ తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. చర్చల ప్రసక్తే లేదని సీఎం కరాఖండిగా చెప్పడం, ఆ తర్వాత చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించడంతో ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటలకు పైగా చర్చించారు. ఆర్టీసీ నేతలతో ఇప్పటికే ముగ్గురు అధికారులతో కూడిన బృందం తొలి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక జేఏసీ, రాష్ట్ర ప్రభు త్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చర్చలు జరపాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ ఎండీ పోస్టును సైతం తక్షణమే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అందుకోసం సమర్థులైన అధికారిని నియమించేందుకు సమావేశంలో కసరత్తు చేశారు. సీనియర్ ఐపీఎస్‌లైన అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శివధర్‌రెడ్డి పేర్లను ఆ పోస్టు కోసం పరిశీలించినట్లు సమాచారం. శుక్రవారం కొత్త ఎండీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కొత్త ఎండీ ఆధ్వర్యంలో చర్చలు జరపాలా.. లేదా మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించాలా అన్న దానిపై చర్చ జరిగింది. అయితే చివరికి మంత్రుల కమిటీకే ప్రభుత్వం మొగ్గి చూపినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశిస్తే చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా పరిస్థితిని సీఎం సమీక్షించారు. బస్సులను నూటికి నూరు శాతం తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు హాజరయ్యారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అబీబా బేగం(45) ఇంటినుంచి మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు నందిపేటనుంచి నిజామాబాద్ వైపు వస్తోంది. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వెనుకనుంచి అబీబా బేగంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. బస్సు డ్రైవర్ కర్షక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగా అనుభవం లేని డ్రైవర్ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: ‘డేంజర్’ డ్రైవర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని గందరగోళంనెలకొంది. పలుచోట్ల డ్రైవర్లు బస్సులను సక్రమంగా నడపలేకపోతుండడంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో డ్రైవర్లను, కండక్టర్లను డిపోలకు తరలిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉంటే చాలు. పెద్దగా అనుభవం, నైపుణ్యం లేకపోయినా సరే బస్సులను అప్పగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ డిపోల్లో సుమారు 1500 మంది తాత్కాలిక డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం లారీలు, ట్రాక్టర్లు, తదితర సరుకు రవాణా వాహనాలను నడిపిన వారే ఉన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిటీ బస్సులు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమని, అలాంటి శిక్షణ కొరవడిన వ్యక్తులు బస్సులు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మద్యం సేవించి బస్సులు నడపడం, అదుపు తప్పి డివైడర్లకు ఢీకొట్టడం లేదా ముందు బస్సులను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హయత్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగిన ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓల్వోలు ఎలా అప్పగించాలి... ఈ క్రమంలో సమ్మె మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే నాన్ ఏసీ లోఫ్లోర్, ఏసీ మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంపై ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి సర్వీసులను నిలిపివేశారు. ఒకవేళ తప్పనిసరిగా పూర్తిస్థాయిలో అన్ని బస్సులను నడపవలసి వస్తే ఎలా అనేది ఇప్పుడు ఆర్టీసీ అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. 11వ రోజుకు చేరిన సమ్మె.. ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బస్‌భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ష్టేషన్లు, డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి పూట బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. -
ఆర్టీసీని విలీనం చేసేది లేదు
-
21న ప్రగతిభవన్ ముట్టడిస్తాం
సాక్షి, హైదరాబాద్: 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 21న ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం గాంధీభవన్‌లో రేవంత్, మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, షబ్బీర్‌అలీ విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బంద్‌లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పాల్గొంటాయన్నారు. కార్మికులను తొలగిస్తున్నామని, కొత్త వారిని నియమిస్తామని సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, సెల్ఫ్ డిస్మిస్ అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దామోదర మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేంద్రం స్పందించాలని కోరారు. గవర్నర్ తమిళిసై కేంద్ర పెద్దలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, సీఎం సెల్ఫ్ డిస్మిస్ అని, మంత్రులు ఉద్యోగాల్లో చేరాలని చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే డబుల్ గేమ్ అని అనుమానంగా ఉందన్నారు. -
సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేజారకముందే సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి సోమవారం లేఖ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె. కేశవరావు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కార్మికుల పక్షపాతి అని చెప్పుకున్న కేశవరావు.. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేజారుతున్నాయనే అనుమానంతో లేఖ విడుదల చేశానన్నారు. ‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని నేను అనలేదు. మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా చర్చలకు దిగుతా. నాతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు’’అని కేశవరావు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. -
11వ రోజూ ఉధృతంగా సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గ కుండా సమ్మె ఉధృతంగా కొనసాగిస్తున్నారు. 11 రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కార్మికుల సంతాప సభలు కొన్ని ప్రాంతాల్లో మంగళవారం కొనసాగాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం ఉందన్న మాటలు.. కోర్టు జోక్యంతో అందుకు అనుకూల పరిస్థితి ఉంటుందన్న సంకే తాలతో సమ్మె ఆగిపోయే పరిస్థితి ఉంటుందం టూ కాస్త ఊహాగానాలు వినిపించినా మంగళవారం రాత్రి వరకు ఆ సూచనలు అందకపోవ టంతో కార్మికులు యథావిధిగా సమ్మె కొనసాగించారు. టీఎన్జీవో, టీజీవోలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించటంతో ఆర్టీసీ కార్మికుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించి మద్దతు కూడగట్టుకోగలిగారు. సకలజనుల సమ్మె తరహాలో ఉధృతం చేద్దామంటూ నేతలు వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపటంతో ఉత్సాహం రెట్టింపైంది. బుధవారం మరింత ఉధృతంగా సమ్మె నిర్వహించాలన్న ఆదేశాలూ అందాయి. 62 శాతం బస్సులు తిప్పాం: ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 62.13 శాతం బస్సు సర్వీసులు తిప్పినట్లు సంస్థ తెలిపింది. 4,192 ఆర్టీసీ, 1,952 అద్దె బస్సులు కలిపి 6,144 బస్సులు తిప్పినట్లు పేర్కొంది. ఇక కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఇబ్ర హీంపట్నం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బూడిద జంగయ్య.. ఆర్టీసీ సమ్మె వార్తలు విని మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. -
ఆర్టీసీ సమ్మె: మీరేమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం అవునో కాదో పక్కనబెడితే.. దసరా పండుగకు ముందు సమ్మె ప్రారంభించి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నెల 5 నుంచి సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరేమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నారా.. మీ ఇద్దరి మధ్య ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఆట జరుగుతోందా అంటూ ధర్మాసనం ఇరు పక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్మా ప్రయోగించినా, సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించినా పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలని హైకోర్టు పరోక్షంగా ఆర్టీసీ జేఏసీని హెచ్చరించింది. సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారని, వెంటనే సమ్మె విరమించేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యల సాధనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా ఇరుపక్షాలకు పలు సూచనలు చేసింది. ఇబ్బంది లేదని ఎలా చెబుతారు..? ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్‌ను ప్రభుత్వం అమలు చేయబోదని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇతర ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఇదే డిమాండ్‌తో ముందుకు వస్తాయన్నారు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై లేదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో.. ఇంకా 4 వేల బస్సులు నడపట్లేదని, మిగిలిన 6 వేల బస్సులు నడుస్తున్నాయని పేర్కొనడాన్ని హైకోర్టు ఎత్తి చూపింది. 4 వేల బస్సులు నడపకుండానే ప్రయాణికులు ఇబ్బందులు పడట్లేదంటే ఎలా అని ప్రశ్నించింది. మరి ఇబ్బందులు లేనప్పుడు విద్యాసంస్థలకు దసరా సెలవులు ఎందుకు పొడిగించారని ప్రశ్నించింది. కండక్టర్లు, డ్రైవర్ల భర్తీ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, కార్మికులు తమ సమస్యలను ఎవరి ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టీసీకి ఎండీని నియమించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని అదనపు ఏజీ చెప్పడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భుత్వంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు ఉంటారని, వారిలో ఒకరిని ఆర్టీసీ ఎండీగా నియమించేందుకు వ్యవధి కావాలనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం చేయకపోవడం వల్లే లోకాయుక్తను నియమించాలని, శిశు సంక్షేమ జిల్లా కమిటీలను నియమించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఆర్టీసీ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. గత్యంతరం లేకే సమ్మె.. సమ్మె చేసిన కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడాన్ని ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్మికుల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చాక చర్చలు జరుపుతామని చెప్పి అర్ధాంతరంగా సమావేశాన్ని వాయిదా వేశారని, గత్యంతరం లేకే సమ్మె నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడే సమ్మె చేస్తారని, ప్రభుత్వం చర్చలు జరకుండా ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసికి చెందిన రూ.545 కోట్లను ప్రభుత్వం మళ్లించిందని, పీఎఫ్ సొమ్ము, ఇతర సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డి చెప్పారు. ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ నియమించి, అర్ధంతరంగా రద్దు చేసిందని, ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదన్నారు. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ.. సమ్మె విరమించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం సమర్థుడైన అధికారి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, సమస్య జఠిలం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీతం ఇవ్వాలని రిట్ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మరో పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చింది. దీన్ని హైకోర్టు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని, వాటిని నిలుపుదల చేసే అధికారం ఆర్టీసీ యాజమాన్యానికి లేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆర్టీసీ సమ్మెపై ధర్మాసనం విచారణ జరుగుతోందని, కాబట్టి ఈ రిట్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. సెలవుల పొడిగింపుపై రిట్.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం దసరా సెలవుల్ని పొడిగిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలైంది. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన రిట్లో వెంటనే విద్యాసంస్థలు తెరిచేలా ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
ఆర్టీసీ సమ్మె: చర్చలు జరిపేందుకు నేనెవరిని?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కేసీఆర్ చర్చల ప్రసక్తే లేదంటూ ప్రకటిస్తే.. ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చర్చలకు సిద్ధంకండంటూ పత్రికా ప్రకటన విడుదల చేసి సంచలనం సృష్టించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తాజాగా కేకే మాట మార్చారు. కార్మికులతో చర్చలు జరపడానికి తనకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఇది ప్రభుత్వ సమస్య అని... పార్టీ సమస్య కాదని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులు చేజారుతున్నాయని.. ప్రభుత్వం, కార్మికులు పరస్పరం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాత్రమే తాను సూచించానన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అయితే మంచి జరుగుతుందనుకుంటే.. మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. కార్మికులు తనతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉండటం మంచి పరిణామంగా పేర్కొన్నారు కేశవరావు. (చదవండి: ‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’) అయితే ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతి రాలేదని కేకే స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అయితే సీఎం ఇంకా తనకు అందుబాటులోకి రాలేదన్నారు. తాను సోషలిస్టునని.. రాజ్యం వైపు కాక కార్మికుల వైపే ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలసికట్టుగా ఉండాలని కేకే సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే తనకేమి అభ్యంతరం లేదన్నారు. అయితే ఆర్టీసీ విలీనం సాధ్యపడకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కేకే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది తనకు తెలియదని.. ఒకవేళ తెలిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేదన్నారు కేశవరావు. -
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడు
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్‌లు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ చేయడం కాదు.. ప్రజలే కేసీఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. హుజూర్నగర్ ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదన్నారు. టీఆర్ఎస్ మెడలు వంచే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కార్మికుల జీతాలు ఆపిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు ఆపాడా అని ప్రశ్నించారు. సమ్మెను బూచిగా చూపి.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మంత్రులు సమ్మె గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ వారికి అండగా ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
ఆర్టీసీ సమ్మె : క్యాబ్ దోపిడీ తారాస్థాయికి
క్యాబ్ సంస్థలు ఆర్టీసీ కార్మికుల సమ్మెను సొమ్ము చేసుకుంటున్నాయి. పీక్ అవర్స్ పేరుతో అధిక చార్జీలు వసూలుచేస్తున్నాయి. మరోవైపు నిబంధనలకువిరుద్ధంగా సర్‌చార్జీలు కూడా విధిస్తున్నాయి. దీంతో క్యాబ్ చార్జీలు దాదాపు రెండింతలయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లతో అరకొరగా నడుస్తున్న సిటీ బస్సులు సాయంత్రం 7గంటల లోపే డిపోలకుచేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ సంస్థలు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో క్యాబ్ దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. ఉబెర్, ఓలా, తదితర క్యాబ్ సంస్థలు ఆర్టీసీ సమ్మెను పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. సమ్మెను దృష్టిలో ఉంచుకొని సర్‌చార్జీలు విధించకూడదని, పీక్ అవర్స్ (రద్దీ వేళలు) నెపంతో చార్జీలు పెంచడానికి వీల్లేదని రవాణాశాఖ స్పష్టం చేసినా క్యాబ్‌ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండకపోగా, సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపే బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. అంతేగాక ఆర్టీసీ సైతం నైట్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో క్యాబ్‌లు, ఆటోలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. క్యాబ్‌లలో అన్ని వేళల్లోనూ పీక్ అవర్స్ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అంతేగాక ప్రయాణికులు కోరుకున్న ప్రాంతం నుంచి క్యాబ్‌లు అందుబాటులో లేవనే సాకుతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. దీంతో క్యాబ్ చార్జీలు రెండింతలయ్యాయి. దీంతో నగరంలో ప్రయాణం భారంగా మారింది. సాధారణ రోజుల్లోనే ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోవాలాలు సమ్మె పేరుతో మరింత అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సాయంత్రం బస్సులు లేకపోవడంతో ఈ దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కొరవడిన నియంత్రణ... క్యాబ్‌లు, ఆటోలపై రవాణాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేదు. గ్రేటర్ పరిధిలో 1.4 లక్షల ఆటోలు తిరుగుతుండగా 85 శాతం ఆటోల్లో మీటర్లను వినియోగించడం లేదు. ఆటోవాలాలు డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. ఇక క్యాబ్‌లలో బుకింగ్ సమయంలోనే చార్జీల భారం తెలిసిపోతుంది. పీక్అవర్స్ను సాకుగా చూపుతూ అమాంతంగా పెంచేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు క్యాబ్‌లను ఆశ్రయించవలసి వస్తుంది. దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణ రోజుల్లో క్యాబ్ చార్జీలు రూ.225 వరకు ఉండగా, గత పది రోజులుగా ఈ రూట్లో చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు పెరిగింది. తార్నాక నుంచి లాలాపేట్ వరకు సాధారణంగా రూ.350 వరకు చార్జీ అవుతుంది, ఇప్పుడు ఏకంగా రూ.650 కి పైగా నమోదవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘మణికొండ నుంచి లింగంపల్లి వరకు ఉబెర్ క్యాబ్‌లో మొదట రూ.120 చార్జీ నమోదైంది. ఫరవాలేదనుకొని బయలుదేరాను. తీరా దిగే సమయంలో అది రూ.220 అయింది.’’ అని సాయి అనే ప్రయాణికుడు తెలిపారు. పీక్ అవర్ నెపంతో అడ్డగోలుగా విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో ఓలా, ఉబెర్ క్యాబ్లే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కొత్త క్యాబ్ సంస్థలు వచ్చినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో ఓలా, ఉబెర్‌లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఐటీ ఉద్యోగులకు కష్టాలు... నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, తదితర ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే లక్షలాది మంది ఉద్యోగులు బస్సుల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఆయా మార్గాల్లో సుమారు 1500 ట్రిప్పులు తిరుగుతాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోగా, రాత్రి పూట పూర్తిగా సర్వీసులు నిలిచిపోవడంతో క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. విధులు ముగించుకొని ఆలస్యం గా ఇళ్లకు బయలుదేరేవారు పెద్ద మొత్తంలోనే సమర్పించుకోవలసి వస్తుంది. 10వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె... ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 10వ రోజుకు చేరుకుంది. నగరంలోని మహాత్మాగా>ంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, రాణీగంజ్, కంటోన్మెంట్, పికెట్, హెచ్‌సీయూ, తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు కుటుంబాలతో సహా బైఠాయించి నిరసన తెలిపారు. రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్‌గౌడ్ ఆత్మహత్య ఉదంతం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగానే మరోవైపు హెచ్‌సీయూ డిపో వద్ద మరో కార్మికుడు బ్లేడ్‌తో గాయపర్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అలాగే ప్రైవేట్ డ్రైవర్ల చేతిలో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదివారం హయత్‌నగర్ వద్ద ఓ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను, బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సోమవారం కూకట్పల్లి వద్ద ఒక బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ముందు బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు సమ్మెపై అనిశ్చితి కొనసాగుతున్న దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది నియామకాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం 1200 మంది డ్రైవర్లు, 1200 కండక్టర్లు తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్నారు. అశోక్లీలాండ్, టాటా ఐశ్చర్, తదితర కంపెనీలకు చెందిన సుమారు 20 మెకానిక్ బృందాలను డిపోల్లో ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, తదితర సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో 1133 అద్దె బస్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. అలాగే మరో 752 ప్రైవేట్ బస్సులను నడపాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నగర శివార్లలోని గ్రామాలకు తిరుగుతున్న ఆర్టీసీ మఫిషియల్ సర్వీసుల స్థానంలో ఈ ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. క్యాబ్‌లకు మీటర్లు బిగించాలి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్ధతునిస్తున్నాం. క్యాబ్‌లలో దోపిడీని అరికట్టేందుకు మీటర్ల విధానాన్ని అమలు చేయాలి. స్లాక్ అవర్స్, పీక్ అవర్స్‌తో నిమిత్తం లేకుండా కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చార్జీ విధించాలి. అప్పుడే ప్రయాణికులు, డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది. –షేక్ సలా ఉద్దీన్,( చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ ) -
అధైర్యపడొద్దు.. మేం అండగా ఉన్నాం
సాక్షి, జనగాం : ప్రభుత్వ చర్యలతో ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రం లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న రిలే నిరవధిక దీక్షలు సోమవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పొన్నాల కార్మికులకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. పొన్నాల లక్ష్మయ్య ఆర్టీసీ డిపోకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి సుమారు రూ. 60 వేల కోట్ల ఆస్తులను ఏళ్ల పాటు తన అనుయాయులకు లీజుకు కట్టబెట్టేందుకు కేసీఆర్ కట్రలో భాగంగానే సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డదారిలో తొలగిస్తున్నాడన్నారు. ప్రపంచ నియంతల చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానంలో నిలుస్తున్నాడని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని కొట్లాడితే కేవలం తన కుటుంబంతో పాటు అనుయాయులకు మేలు చేసుకునే విధంగా రాజ్యాంగ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలన కంటే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఆర్టీసీని దివాలా తీయించారన్నారు. దీనిపై కార్మికులు గర్జిస్తుంటే సమ్మెను తప్పుదారి పట్టించేందుకు అనేక కుట్రలు పన్నుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను 144 సెక్షన్‌తో తొక్కిపడేస్తూ ప్రైవేట్‌పరం చేసేందుకు లోలోపల అంతా సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజల ప్రతిస్పందన చూడబోతున్నావ్... నియంత పాలనతో విసుగుపుట్టిన ప్రజలు తమ ప్రతి స్పందన చూపించబోతున్నారని పొన్నాల అన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులను పస్తులుంచిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని చెప్పారు. హన్మకొండ హంటర్ రోడ్డు ఆర్టీసీ పరిధిలోని రీ ట్రేడింగ్ సెంటర్‌ను కరీంనగర్‌కు బదిలీ చేసి. రూ.100 కోట్ల విలువైన భూమిని కేసీఆర్ తన అనుయాయులకు అప్పగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించాలి రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల్లో జరుగుతున్న అనేక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారి సమస్యలను పరిష్కరించకుంటే పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 48 వేల ఆర్టీసీ కుటుంబాలను » జారున పడేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు లింగాజీ, రంగరాజు ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజమౌళి, లక్కార్సు శ్రీనివాస్, అల్వాల ఎల్లయ్య, ధర్మపురి శ్రీనివాస్, వరలక్ష్మి, అజహరొద్దీన్, ఖాదర షరీఫ్, జమాల్‌షరీఫ్, కొమ్ము నర్సింగారావు, ఎండీ.అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, మోర్తాల ప్రభాకర్, జక్కుల వేణుమాధవ్, దిలీప్‌రెడ్డి, క్రాంతి, రంగు రవి, చెంచారపు బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఆర్టీసీ సమ్మె: ఏపీఎస్ఆర్టీసీ సంపూర్ణ మద్దతు
సాక్షి, విజయవాడ: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదరరావు వెల్లడించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. సమ్మెపై ఈ నెల 19న ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని.. అవసరమైతే.. దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగం కార్మికులను అందరిని ఉద్యమానికి సన్నద్ధం చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ సుందరయ్య, వరహాల్ నాయుడు హాజరయ్యారు. -
ఆర్టీసీ సమ్మె : మెట్రో సరికొత్త రికార్డు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సోమవారం అత్యధికంగా 3.80 లక్షల మంది ప్రయాణికులతో తాజా రికార్డును బద్దలుకొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు నెలకొల్పగా..సోమవారం రద్దీ 3.80 లక్షలకు చేరుకోవడం విశేషం. ఆర్టీసీ సమ్మె నేపథ్యలో మెజార్టీ సిటీజనులతో పాటు..దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణీకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్ రూట్లోని ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టూగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ప్రయాణీకుల సంఖ్య సోమవారం రెట్టింపుగా ఉందని తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆయా స్టేషన్లలో ప్రత్యేక టిక్కెట్‌కౌంటర్లు,అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశామన్నారు. రద్దీ రూట్లలో ప్రతీ మూడు నుంచి ఐదు నిమిషాలకోరైలును నడుపుతున్నామన్నారు. రద్దీ పెరగడంతో రైళ్లలో ఏసీ సదుపాయం అంతగా లేదని..స్టేషన్లలో టాయిలెట్స్‌వద్ద ,టిక్కెట్ కౌంటర్ల రద్దీతో ఇబ్బందులపాలయినట్లు ప్రయాణీకులు వాపోయారు. సాధారణ రోజుల్లో రద్దీ 2.780 లక్షలకు మించదు..సెలవు రోజుల్లో రద్దీ సుమారు 3 లక్షల మేర ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. -
ఆర్టీసీ ఆస్తులు కాజేయడానికి కుట్ర
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ పూరిత ఆలోచనతో ఆర్టీసీని నిర్వీర్యం చేసి, దాని ఆస్తులు కాజేయడానికి కుట్రపన్నుతోందని పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ ఆరోపించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఎంత జీతాలు పొందుతున్నారో కూడా తెలియని సీఎం ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రతీ రోజూ కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఉద్యోగులను తొలగిస్తామనడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే వారి బలిదానాలకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం చెల్లించే బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీకి నష్టాలే లేవని అన్నారు. రూ.1052 కోట్లు వాహనాల టాక్స్ కింద వసూలు చేసి ఆర్టీíసీకి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు దిండిగాల మధు, తాజ్, బొబ్బిలి విక్టర్, నవాబ్, గణపతి, రమేశ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
'సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయొద్దు'
సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణ, పోలీసు శాఖ అధికారులతో సమ్మె ప్రభావంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుందని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అసవరమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకు 50 శాతం బస్సులు నడుస్తున్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి డిపోకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, అద్దె బస్సులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 100 శాతం బస్సులు నడిచేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇదే క్రమంలో అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు బస్సులు నడిపించడంతో పాటు అధిక చార్జీలు వసూలు చేయకుండా అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా రవాణశాఖ అధికారులు కిష్టయ్య, వివేకానంద రెడ్డి, ఆర్టీసీ డీఎం మల్లేష్, రామగుండం అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల డీసీపీ గౌస్‌బాబ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చర్చల దిశగా ఆర్టీసీ సమ్మె
-
టీఆర్ఎస్కు మద్దతు వెనక్కి..
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రకటిం చిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీని సంప్రదించి రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయించింది. సోమ వారం మఖ్దూం భవన్లో పార్టీ సీనియర్ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ సమక్షంలో తొలుత రాష్ట్ర కార్యదర్శి వర్గం, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపసంహరణ నిర్ణయంపై సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని మొదట తీసుకున్న నిర్ణయం వల్లే పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సురవరం అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య నేపథ్యంలో మద్దతు ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. సమ్మె హక్కును నిరాకరించి, కార్మిక సంఘాలతో చర్చించకుండా 48 వేల మందిని డిస్మిస్ చేసి, సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూనుకుని, కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి ఘర్షణ వాతావరణం కల్పించడాన్ని మానుకోవాలని సీపీఐ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు దిగుతున్నా, పరిష్కారానికి బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తుండటంతో కార్మిక, శ్రామికవర్గ పార్టీగా టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించినట్టు తెలిపారు. -
చర్చల దారిలో..సర్కారు సంకేతాలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజున టీఆర్ఎస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన ప్రకటన కీలక మలుపు తిప్పనుందా? చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ కేకే ప్రకటన విడుదల చేయడం. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం వంటి పరిణామాలు సోమవారం ఆసక్తి రేకెత్తించాయి. కార్మికులు సమ్మె విషయంలో మొండివైఖరి విడనాడాలని, విలీనం మినహా ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలంటూ కేకే ప్రకటన చేశారు. ఈ ప్రకటన విడుదల చేసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కేకే... రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన దరిమిలా మంగళవారం చర్చలకు సానుకూల వాతావరణం ఉందని అధికార పార్టీ నేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మరోవైపు సమ్మె పదో రోజున కార్మికులు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన తెలియజేశారు. జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రం సమర్పించారు. -
కండక్టర్ ఆత్మహత్యాయత్నం..
-
బ్లేడ్‌తో కోసుకున్న కండక్టర్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. పదో రోజు కూడా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగ భద్రతపై ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా హెచ్‌సీయూ డిపో వద్ద సందీప్ అనే కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో సందీప్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. బ్లేడ్‌తో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు అతడిని కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు సోమవారం ఖమ్మంలో నిర్వహించారు. -
‘కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానించాలి’
-
‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితిపై సోమవారం గవర్నర్ తమిళిసైకు వినతి పత్రం అందించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ...మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ‘ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉద్యోగ సంఘాలతో నిన్న భేటీ కావాలని అనుకున్నాం. అయితే డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మరణంతో కలవడం కుదరలేదు’ అని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజీ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కార్మికులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతేగాక కేకే రాసిన లేఖపై తాము ఓపెన్‌గా ఉన్నామని అన్నారు. -
తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు..
-
సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లపై మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సీఎం, మంత్రులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడి కార్మికుడి ఆత్మహత్యకు కారణమైన సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శోభ డిమాండ్ చేశారు. 24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే పీఎస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరించారు. -
‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’
సాక్షి, ఖమ్మం: ‘ఆయనను కళ్లలో పెట్టుకుని చూసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసి బయటికి వెళ్లారు. అంతే ఆ తర్వాత అసలేం జరిగిందో తెలియదు. ఆయన నాకు మళ్లీ కావాలి. మాలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు’ అంటూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి భార్య విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఏనాడు ఇంట్లో నుంచి బయటికి రానిదాన్ని ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంతో పాటు 48 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీళ్లతో విఙ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసి కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖమ్మంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తొంబై శాతం గాయాలతో ఆస్పత్రి పాలైన ఆయన మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక 28 ఏళ్లుగా ఆర్టీసీలో సేవలు అందించిన శ్రీనివాసరెడ్డి రిటైర్మెంట్కు దగ్గరవుతున్న క్రమంలో ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యకు పాల్పడటంతో కేసీఆర్ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత) తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు.. ‘నేను అందరికీ ముఖ్యంగా ఆర్టీసీ వాళ్లకు చెబుతున్నది ఒకటే. ప్లీజ్.. దయచేసి ఇంకెవరూ ఇలాంటి పనిచేయొద్దు. మాలాగా పిచ్చోళ్లు, అనాథలు అయిపోతారు. ఒక్కసారి మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీరు లేకుంటే కుటుంబాలు నాశనమైపోతాయి. జరిగేదేదో జరుగుతుంది. న్యాయం చేకూరుతుంది. మా తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు. వాడింకా షాక్‌లోనే ఉన్నాడు. తన మఖం కూడా కాలిపోయింది’ అంటూ శ్రీనివాసరెడ్డి పెద్ద కొడుకు ఆర్టీసీ కార్మికులకు విఙ్ఞప్తి చేశాడు. -
బస్టాండ్ సమీపంలో వంటవార్పు
-
సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు ఉద్రిక్తత
-
ఆర్టీసీలో మరో కార్మికుడి బలవన్మరణం
-
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు అండగా నిలుద్దాం
సాక్షి, విజయనగరం అర్బన్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుద్దామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరై మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమ్మె 9వ రోజుకు చేరినా అక్కడి ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న కాలంలో జేఏసీ రాష్ట్ర కమిటీ ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చినా సిద్ధంగా కార్మికులు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి పి.భానుమూర్తి, డిపో అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎం రాజు, చవక శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఏ.చంద్రయ్య పాల్గొన్నారు. -
ఖమ్మంలో కొనసాగుతున్న బంద్
-
సమ్మె చట్టబద్దమా?చట్ట విరుద్దమా?
-
ప్రతిపక్షాల వలలో ఆర్టీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్:ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రతిపక్షాల వలలో పడ్డారని, సంస్థను నాశనం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. ‘పండగ సమయంలో యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఆర్టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మా మేని ఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. యూనియన్ నేత లు ప్రతిపక్షాల వలలో పడ్డారు. ఇదో రాజకీయ కుట్రగా అనిపిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్మికు లకు, వారు కూడా ఊహించనంతగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ నేతల కుట్రలను ఆర్టీసీ కార్మి కులు అర్ధం చేసుకోవాలి. సంస్థకి గత ఐదేళ్లలో రూ. 3,303 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో కేటాయించింది రూ. 1,600 కోట్లే. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదు. ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడంలేదు? దమ్ముంటే బీజేపీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రధానితో ప్రకటన ఇప్పించగలరా? ఆర్టీసీ కార్మికులకు నచ్చ చెప్పాల్సింది పోయి బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు. ఆర్టీ సీని నాశనం చేయాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రయత్నాలను సఫలం కానివ్వం’ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. -
ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం
-
ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం
సాక్షి, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం కొద్దిసేపటి క్రితం ఖమ్మంకు చేరుకుంది. శనివారం రోజున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని డీఆర్డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహానికి అదే ఆస్పత్రిలో వైద్యులు పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం భారీ భద్రత నడుమ శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించడానికి పలువురు రాజకీయ నాయకులు ఖమ్మం చేరుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుటు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మం డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి నివాళుర్పించడానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన నివాసానికి చేరుకున్నారు. తోటి కార్మికుడి ఆత్మహత్యతో ఆందోళన మరింత ఉధృతం చేయడానికి కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అడ్డుకున్న కార్మికులు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని భారీ భద్రత మధ్య ఖమ్మం తరలిస్తుండగా సూర్యాపేట వద్ద ఆర్టీసీ కార్మికులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు నల్గొండ హైవే పై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?
-
దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కోరారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మరణం చాలా బాధాకరమని, అతడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబట్టే శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు పూర్తి బాధ్యత తెలంగాణ ద్రోహులైన మంత్రులదే. సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయకుండా రెచ్చగొడుతున్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు...‘పోరాటాల ద్వారా సాదించుకుందాం. సకల జనుల సమ్మెకు ఆర్టీసీ సమాయత్తం చేయాలి .అందుకు రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలి. శాంతియుతంగా ఆర్టీసి కార్మికులు సమ్మెను కొనసాగించాలి. ఆనాడు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏమయితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడో ఇప్పుడు కేసీఆర్ కూడా అవే మాట్లాడుతున్నారు. పోలీసు బలగాలను అడ్డు పెట్టుకొని సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కనీసం సెప్టెంబర్ మాసం జీతాలు కూడా కార్మికులకు ఇవ్వకుండా వారి కడుపు కొట్టారు ముఖ్యమంత్రి. దసరా పండగ రోజున 50 వేల మంది కార్మిక సోదరులు పస్తులు ఉన్న పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు అంటే తెలంగాణ బిడ్డలు కాదా?. చర్చలు జరిపేదే లేదు...మాట్లాడేదే లేదు అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేవలం కేసీఆర్ అనుచరులకు కట్టబెట్టేందుకు మాత్రమే ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఏమైనా భర్తీ చేసారా?. ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్‌ను కూడా దోచుకున్నారు. కేసీఆర్ ఉద్యోగుల మధ్య విభజన సృష్టించారు. సమ్మెలో విద్యార్థులు భాగస్వాములు అవుతారనే ముఖ్యమంత్రి సెలవులు పొడిగించారు. దసరా సెలవులు 22రోజులు ఇస్తారా?. విద్యార్థులు చదువుకోవాలా? వద్దా?. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ ప్రయివేటీకరణ చేయడానికి అభ్యంతరం లేదు. అయితే సంస్థ లాభాలకు మాత్రమే ప్రయివేటీకరణ చేయాలి. ఇక వరంగల్‌లో ఆర్టీసీకి చెందిన మూడున్నర ఎకరాలు ఎవరికి ఇచ్చారు’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. -
ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ కంటతడి
-
శ్రీనివాస్‌రెడ్డి ఆర్ధికంగా బలహీనుడు కాదు..
సాక్షి, హైదరాబాద్ : రెండు రోజులు డిపోకు రాలేదని ఉద్యోగులను తీసేస్తే మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలి? పీడీ యాక్ట్ పెట్టాలా అని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా నిలదీశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు ఆర్. కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో చనిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఆర్ధికంగా బలహీనుడు కాదని, ఉద్యోగ భద్రత గురించి ఆందోళనే అతని మృతికి కారణమని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖం చెల్లక ముఖ్యమంత్రి ప్రెస్నోట్లు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సమ్మె చట్టబద్ధంగా జరుగుతుంటే ఆట మధ్యలో గేమ్ రూలు మారుస్తామంటే కుదరదని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు సమ్మెను విఫలం చేస్తే భవిష్యత్తులో టీచర్లను కూడా పాలెగాళ్లుగా చూసే పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డిహెచ్చరించారు. తెలంగాణ వద్దన్నవాళ్లను మంత్రులుగా నియమించి, సమాజంలో గౌరవం ఉన్నోళ్లను కేసీఆర్ దూరం పెట్టారని ఆరోపించారు. చుక్కా రామయ్య, వరవరరావు, కోదండరాం వంటి వాళ్లను అణచివేతకు గురిచేస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. పెన్నుమీద మన్ను కప్పితే గన్నులై పేలుతయ్ అంటూ వాగ్బాణాలు సంధించారు. ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీల వైపు చూడొద్దని, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా మీ బాధ్యత సక్రమంగా నెరవేర్చండని రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. ఆరు నెలలు కొడుకు, అల్లుడికి మంత్రి పదవి లేకపోతే తట్టుకోలేకపోయారని మరి నిరుద్యోగులు ఎంతకాలం వేచి చూడాలని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, పోలీసు సంఘాలు 19 న జరిగే బంద్‌కు సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులది ఆకలి పోరాటం కాదని..ఆత్మగౌరవ పోరాటం అని పేర్కొన్నారు. అధికారం ఉందని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరూ మోసపోయారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తమ వంతుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచి సమ్మెని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రభుత్వ హత్యే.. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్యేనని న్యూ డెమోక్రసి నేత గోవర్ధన్ విమర్శించారు. 48 వేల ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీనివాసరెడ్డి బలిదానం అయ్యారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై మంత్రులు లేకుండా అధికారుల కమిటీ వేశారని ధ్వజమెత్తారు. కార్మికులు వేతనాల కోసం కాకుండా సంస్థ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం సీఎం వైఎస్ జగన్ అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం కనిపెట్టారన్నారు. తనను ప్రశ్నించారనే కారణంతో కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు నివ్వాలని కోరారు. టీఎన్జీవో, టీజీవో నేతలు ముఖ్యమంత్రి పెట్టిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రగతిభవన్‌కు గులాంగిరి చేయడానికి వెళ్ళారని విమర్శించారు. కేసీఆర్ హిట్లర్ తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పార్థివదేహన్ని చూడనివ్వకుండా కార్మిక సంఘం నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి వెంటనే ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ చైర్మన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. పలు తీర్మానాలు ప్రతిపాదిస్తూ ఉద్యోగ, రిటైర్డ్ సెల్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో ఉన్న పెన్షనర్స్ అందరూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాలని మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులు ఒంటరి పోరాటం చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆర్టీసీ సమ్మె చేయాలని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం టీఎన్జీవో నేతలను కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ..‘మమ్మల్ని సంప్రదించకుండా సమ్మెకు వెళ్లారు. సమ్మెకు వెళుతున్నట్లు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. మాపై కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీ సర్వీస్ రూల్స్ వేరు... మా సర్వీస్ రూల్స్ వేరు. ఆర్టీసీ సమస్యలకు ఉద్యోగ సంఘాలకు సంబంధం లేదు. సీఎంను ఉద్యోగ సంఘాలుగా మేం కలిస్తే తప్పేంటి?. 16 అంశాలతో కూడిన నివేదికతో సీఎంను కలిశాం. మాపై ఆరోపణలు చేసే నైతికత వాళ్లకు లేదు. సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసినవారే ఆర్టీసీ జేఏసీ వెనకున్నారు. టీఎన్జీవోలపై అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా పోరాటం చేయాలి. సమ్మె కొన్ని రాజకీయ శక్తుల చేతిలోకి వెళ్లింది. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి. ఆర్టీసీ జేఏసీ మాతో మాట్లాడితే మేము వాళ్లకు మద్దతుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు. ఆత్మహత్యకు పాల్పడొద్దు’ అని కోరారు. సీఎంను కలిసిన టీఎన్జీవో నేతలు (ఫైల్ ఫోటో) టీఎన్జీవో కార్యదర్శి మమత మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగాల సంఘాల పై దుష్ప్రచారం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మేము భేటీ అయ్యాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ని కలిశాం. సీఎం ని కలిస్తే తప్పేంటి? నేరం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం పిలుస్తే ఉద్యోగ సంఘాల నేతలుగా వెళ్లాం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో భాగమే. ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమం అనంతరం ఆర్టీసీ నేతలు మాతో ఎప్పుడూ కలవలేదు. ఉద్యమ జేఏసీలో ఆర్టీసీ నేతలు, నాయకులు సభ్యులుగా లేరు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పోకుండా నాయకత్వంపై ఒత్తిడి తేవాలి. రాజకీయ నేతలు ఉద్యోగ సంఘాల ఆరోపణలు చేయడం సరికాదు. ఆర్టీసీ జేఏసీ నేతలు మాతో కలుస్తే సీఎం దృష్టికి తీసుకువెళతాం’ అని అన్నారు. -
కేసీఆర్.. క్షమాపణ చెప్పు లేదంటే..
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. రేపటి ఖమ్మం జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బలిదానాలు జరగడం దారుణమన్నారు. ఉద్యోగాల కోసం రాష్ట్రం తెచ్చుకుంటే ఇప్పుడు ఆ ఉద్యోగాలనే తీసేస్తానని బెదిరించడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను సీఎం కేసీఆర్ కుక్క తోకతో పోల్చడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మఫ్టిలో వచ్చి కార్మికులపై అక్రమంగా దాడి చేసిన సీఐ రమాకాంత్‌ను వెంటనే సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లాఠీలతో ముందుకు వస్తే.. ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారన్నారు. ఆర్టీసీ కార్మీకులకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పి వెంటనే వారందరిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం మాదిరే ఆర్టీసీ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే ప్రారంభిస్తామని హెచ్చరించారు. -
‘శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు కారణం కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని బీజేపీ ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జీహెచ్ఎంసీ యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సొంత కుటుంబం కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో డబ్బు వ్యామోహం బాగా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని పరిస్థితి ఉందని.. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయినా బాధపడే వారెవరూ లేరని’ అరవింద్ వ్యాఖ్యానించారు. అహంకారపూరిత ధోరణి వలన నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు కవితకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఆయన నిప్పులు చెరిగారు. -
ఆర్టీసీ సమ్మె.. గంగుల ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మృతితో కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రి వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ థామస్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గోశామహల్ స్టేషన్‌కు తరలించారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. (చదవండి : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేస్తారా?) మంత్రి గంగుల ఇంటి వద్ద ధర్నా.. ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యతో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. బస్‌స్టేషన్ నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వరకు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గంగుల ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఓ వ్యక్తి మంత్రి ఇంటిపై రాయి విసిరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు చైతన్యను పోలీసులు అదుపులోని తీసుకున్నారు. (చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత) -
టెంట్ కనపడితే చాలు ఉడుముల్లాగా చేరిపోతున్నారు!
సాక్షి, కరీంనగర్ : బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎక్కడ టెంట్ కనపడితే అక్కడ ఉడుముల్లాగా చేరి.. ఆర్టీసీ కార్మికులను తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఆదివారం జిల్లాలో మంత్రి కమలాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల కోసం చేపట్టిన ఆర్టీసీ సమ్మెను కొంతమంది సీఎం కేసీఆర్‌పై తమకున్న ఈర్ష్యను తీర్చుకునేందుకు ప్రయత్రిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల్లో అంతర్మథనం మొదలైందని, యూనియన్ నాయకుల వెనుక ఒక్కో రాజకీయ పార్టీ ఉందని పేర్కొన్నారు. కార్మికుల 26 డిమాండ్లలో యూనియన్ నాయకులు కేవలం విలీనంపైనే ఎందుకు పట్టుబట్టి కూర్చున్నారని నిలదీశారు. ఏ రోజూ స్టీరింగ్ పట్టని యూనియన్ నేతలు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల అభిప్రాయ పడ్డారు. ఆర్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్ మెనిఫెస్టోలో పెట్టలేదని గంగుల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీతో పోల్చడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. మొదట తమ ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయాలని, ఆ తరువాత తెలంగాణ గురించి మాట్లాడలని తెలిపారు. తమ దగ్గరికి వచ్చే రాజకీయ నాయకులను కార్మికులు ఈ విషయంలో నిలదీయాలని అన్నారు. ఏయిరిండియా, రైల్వే, బీఎస్ఎన్ఎల్ ప్రవేటీకరణకు చేస్తున్న కుట్రల సంగతేంటని, దీనిపై ముందు పార్లమెంటులో నిలదీయాలని ద్వజమెత్తారు. నాయకుల స్వలాభం కోసం కార్మికులను బలి చేస్తున్నారని, అశ్వత్థామ రెడ్డి వెనక ఏ పార్టీ ఉందో తెలుసుకోవాలని గంగుల కమలాకర్ కార్మికులను కోరారు. అదే విధంగా ఐఆర్ ఫిట్మెంట్ రూంలో ఇప్పటికే 60 శాతం సీఎం కేసీఆర్ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. కార్మికులను అడ్డుపెట్టుకొని రాజకీయంగా లబ్థిపొందాలనే నేతల కుట్రలు గమనించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా రవాణాను సీఎం నడిపిస్తే, పండగను అడ్డు పెట్టుకొని నాయకులు బ్లాక్మెయిల్ చేయాలని చూశారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్యామత్నానికి రాజకీయ నేతలు రెచ్చగొట్టడమే కారణమని విమర్శించారు. సీఎంపై అక్కసుతోనే ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా వాడుకుంటున్నారని, సమ్మెకు ప్రజల మద్దతు లేదని, సమ్మె వెంటనే విరమించాలని తెలిపారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోమని 2016 జూన్ 17న కార్మికులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ జీవితాలను పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్న నేతల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని గంగుల సూచించారు. -
‘డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే’
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెందిన ఆయన శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి వద్దకు చేరుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. (చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత) ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కార్మికులు ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్కుతగులుతుంది. శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే’అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యo చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆర్టీసీ సమ్మెకు ముందు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కొన్ని షరతులతో మద్దతు తెలిపిన మాట నిజమే. రేపు సీపీఐ పార్టీ అత్యవసర సమావేశంలో మద్దతు ఉపసంహరణపై చర్చిస్తాం’అన్నారు. (చదవండి : గూండాగిరీ నడవదు.. కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు) -
డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. (చదవండి : గూండాగిరీ నడవదు.. కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు) కాగా, కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆస్పత్రి వద్దకు చేరుకుని శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. (చదవండి : ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం) -
డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత
-
‘ఆర్టీసీ సమ్మె.. సర్కారుకు వ్యతిరేకంగా కుట్ర’
సాక్షి, హైదరాబాద్ : సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్న ఆర్టీసీ కార్మికుల ప్రకటనలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తామెప్పుడూ హామీ ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రతిపక్షాల వలలో పడ్డారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని సీఎం ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. కార్మికులను రెచ్చగొటిట్టన వారే తలెత్తే పరిణామలకు బాధ్యత వహించాలని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. -
ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత
-
ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు యత్నించడంతో ఆర్టీసీ సంఘాలు ఆదివారం బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, మణుగూరు సహా ఆరు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. హైదరాబాద్‌లో.. హైదరాబాద్ పాతబస్తీలో డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఫలక్‌నుమ, ఫారూఖ్‌నగర్ డిపోల ముందు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు బీజేపీ, సీఐటీయూలు తమ మద్దతు తెలిపాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హక్కింపేట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆయన ధర్నా చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు లాభాల బాటలో నడిపించేందుకు కృషిచేయాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగులున తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పడేయడం దుర్మార్గమన్నారు. ఇబ్రహీంపట్నం డిపో వద్ద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో కార్మికులు.. ఆందోళన కొనసాగిస్తున్నారు. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. డిపో ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హన్మకొండలో మౌనదీక్ష తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగారు. తమ డిమాండ్లు న్యాయమైనవని... తమ పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జనగామ ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకపోతే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని భూపాలపల్లిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేశారు. ప్రభుత్వం పంతం వీడి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్‌లో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదిలేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాడ్జీలతో మౌనప్రదర్శన తమ డిమాండ్ల నెరవేర్చాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. పట్టనంలో భారీ ర్యాలీ చేశారు. అఖిలపక్షం నాయకులు కార్మికులకు మద్దతుగా మద్దతుగా నిలిచారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండెక్టర్లతో బస్సులను నడిపిస్తుంటే... ప్రజలు క్షేమం గాల్లో దీపంలా ఉందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే... ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు.. నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలపక్షం నేతలు కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల బతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. -
ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించేది లేదు
-
గూండాగిరీ నడవదు.. కేసీఆర్ తీవ్ర హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉధృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గూండాగిరీ నడవదు. ఇప్పటివరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులపై శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని, నిఘా పోలీసులను ఉపయోగించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టిస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని సమావేశం నుంచే డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఆదేశించారు. ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు.. ‘యూనియన్ నేతల పిచ్చి మాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నేతలు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్ జీతం వెంటనే విడుదల చేస్తాం’అని సీఎం వివరించారు. నాదాష్ దుష్మన్లా పరిస్థితి.. ‘అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతివ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనేలా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయట్లేదు’అని సీఎం పేర్కొన్నారు. అక్కడ అలా.. ఇక్కడ ఇలాగా? ‘బీజేపీ నేతలు బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రైల్వే వ్యవస్థను, రైళ్లను ప్రైవేటీకరిస్తోంది. ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను కూడా ప్రైవేటీకరించింది. వివిధ ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని మండిపడ్డారు. వెంటనే నియామకాలు.. ‘మూడు రోజుల్లో వంద శాతం బస్సులు పునరుద్ధరించాలి. ఇందుకు అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి’అని సీఎం ఆదేశించారు. ‘ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బదిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి. మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20 శాతం (2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా పర్మిషన్లు ఇవ్వాలి’అని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునీల్ శర్మ, నర్సింగ్‌రావు, సందీప్ సుల్తానియా, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్లు పాండురంగనాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డీటీసీలు ప్రవీణ్ రావు, పాపారావు, ఆర్టీసీ ఈడీలు టీవీ రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. -
‘కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుంది’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కేసీఆరే బాధ్యత వహించాలని.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని..వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని.. పోరాడి సాధించుకుందామని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ మొండి వైఖరి వీడి.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కార్మికుల ఆకలిబాధలు కనిపించడం లేదా..? ఆర్టీసీ కార్మికులు ఆకలి బాధలు కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘దసరా పండుగ నాడు ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారని.. కేసీఆర్ మాత్రం కుటుంబంతో సంతోషంగా పండుగ చేసుకున్నారని’ ధ్వజమెత్తారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..అన్ని వర్గాలు సంతోషంగా ఉండటానికి అని..ఆత్మహత్యల కోసం కాదన్నారు. ఆత్మహత్యలు ఆగాలనే సోనియా తెలంగాణ ఇచ్చారని.. కానీ కేసీఆర్ అసమర్థ పాలనతో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. -
కార్మికుల ఆందోళనలు.. కేసీఆర్ కీలక ఆదేశాలు
-
కార్మికుల ఆందోళనలు.. కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సమ్మెను ఉధృతం చేస్తామన్న ఆర్టీసీ కార్మికుల ప్రకటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె పేరుతో బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గూండాగిరి నడవదని, ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉందని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తలెత్తిన పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న కార్మికులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మూడు రోజుల్లోగా వందశాతం బస్సులు నడిపి తీరాల్సిందేనని అధికారులను ఆదేశించారు. (చదవండి : ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ లీడర్లుగా చెప్పుకునే కొందరు ప్రకటిస్తున్నారని, సమ్మెను ఉధృతం చేసినా ప్రభుత్వం చలించదని.. బెదిరింపులకు భయపడేది లేదని కేసీఆర్ అన్నారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బస్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరైనా బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని, మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఆదేశించారు. అవసరమైతే ఇంటెలిజెన్స్ పోలీసులనూ ఉపయోగించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే మరో డ్రైవర్ బోయిన వెంకటేశ్వరాచారి పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకోగా తోటి కార్మికులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. ఈ పరిణామాలతో ఖమ్మం బస్ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పలేదు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసి భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, సంస్థను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. ఆర్టీసీపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ సహా..అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రతీ అంశంపైనా విపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని.. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కొందరు అత్యుత్సాహంతో సమ్మెకు దిగారని తలసాని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేస్తే... చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ఏకంగా ఆర్టీసీని రద్దు చేసిందన్నారు. రైల్వేతో పాటు ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌కు తలసాని సవాలు విసిరారు. ప్రజా రవాణా వ్యవస్తను ప్రభుత్వం మెరుగు పరుస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. -
ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం
-
ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
-
బస్సులపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులు
సాక్షి, ఖమ్మం: ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికులు ...ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బస్సులపై కార్మికులు దాడి చేయడంతో నాలుగు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వారికి జీతాలు కూడా చెల్లించేది లేదంటూ ప్రభుత్వం ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురై మియాపూర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ లక్ష్మయ్య నిన్న (శుక్రవారం) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే సమ్మె నేపథ్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు కార్మికులు కూడా ఆస్పత్రి పాలైయ్యారు. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సమ్మెలో ఉన్నవారికి జీతాలు చెల్లించేది లేదని, విధుల్లో ఉన్నవారికి మాత్రమే జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
వారికి మాత్రమే జీతాలు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగడం లేదు. కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుంటే.. యూనియన్లతో చర్చలు జరిపేదే లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. సమ్మె చేస్తున్న వారితో ఎలాంటి చర్చల్లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనిరవారం ఆయన ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నయ ఏర్పాటు, కొత్త నియామకాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. సమ్మెలో ఉన్నవారికి జీతాలు ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రజల్ని, ఆర్టీసీకి నష్టం కలిగించిన కార్మికులను క్షమించేది లేదన్నారు. చట్ట విరుద్ద సమ్మెను ప్రభుత్వం గుర్తించదని, విధుల్లో ఉన్నవారికి మాత్రమే జీతాలు చెల్లిస్తామన్నారు. విధుల్లో చేరనివారిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. యూనియన్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అలాగే ఆర్టీసీ సమ్మెకారణంగా విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడగించారు. ఈ నెల 19వ తేదీ వరకూ సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు... ప్రభుత్వం బెదిరింపులను పట్టించుకోకుండా తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 13న వంటావార్పు, 14న డిపోల ముందు భైఠాయింపు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, 17న ధూందాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. -
తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకూ సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్లో మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సెలవుల పెంపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సు సర్వీసులను వంద శాతం పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘మూడు నాలుగు రోజుల్లోనే వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తున్నం. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలి. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలి. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దు. కాబట్టి బస్ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. -
19న తెలంగాణ బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు పట్టు వీడటం లేదు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం, 14న ఆర్టీసీ డిపోల ఎదుట బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని ఐకాస నిర్ణయించింది. -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. బస్ భవన్ వద్ద కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. చదవండి: ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలేదు: పువ్వాడ -
ఆర్టీసీ సమ్మె: తీవ్ర ఉద్రిక్తత, లక్ష్మణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి.. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై స్పందించకపోతే.. కేసీఆర్ పాలనను స్తంభింపచేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
ప్రైవేట్ కండక్టర్ల చేతికి టికెట్ మెషిన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలు చార్జీలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఎక్కడికక్కడ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దోపిడీకి పాల్పడుతుండడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రవాణాశాఖ అప్రమత్తమైంది. ఆర్టీఏ అధికారులు నగరంలో పలు చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఆర్టీసీ గ్రేటర్ జోన్ సైతం చర్యలు తీసుకుంటోంది. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మరో రెండు రోజుల్లో విద్యార్థులకు సెలవులు ముగియనున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. శివార్లలోని ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కానీ ఈలోగా సమ్మె ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న బస్సులన్నింటిలో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్)ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి వినియోగంపై ప్రైవేట్ కండక్టర్లకు శిక్షణనిచ్చి రెగ్యులర్ సిబ్బంది తరహాలో వారి సేవలు వినియోగించుకోనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణనివ్వాలని అధికారులు భావిస్తున్నారు. ‘టిమ్స్’తో సేవలు పారదర్శకం... ప్రస్తుతం టికెట్ల జారీ విధానం లేకుండా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రూట్లో ఏ కండక్టర్ నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే విషయంపై అధికారులకు అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రైవేట్ కండక్టర్లు కచ్చితంగా టికెట్ మెషిన్లను వినియోగించే విధంగా తర్ఫీదు ఇవ్వడమే మంచిదని అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. టికెట్ల జారీతో దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో ఆయా రూట్లలో ఎన్ని టికెట్లు జారీ అయ్యాయి? ఎంత ఆదాయం వచ్చిందనే అంశంపై కూడా స్పష్టత వస్తుంది. అలాగే సిటీ బస్సుల నిర్వహణపై డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది కండక్టర్లు, డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. శుక్రవారం నాటికి 1300 బస్సులను రోడ్డెక్కించినట్లు అధికారులు తెలిపారు. మరో 2,300లకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అధికారుల హెచ్చరిక... ప్రయాణికుల నుంచి చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం ప్రాంతీయ రవాణా అధికారి సీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శీతల్ చౌహాన్ బృందం అక్కడి బస్టాప్ వద్ద తనిఖీలు నిర్వహించింది. మెహిదీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లను సీరియస్‌గా హెచ్చరించింది. ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు తీసుకుంటే డ్యూటీలోకి తీసుకోబోమని, నేరుగా ఇంటికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కండక్టర్ల వద్దనున్న టికెట్ చార్ట్‌లను పరిశీలించారు. చార్ట్ ప్రకారమే డబ్బులివ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. -
ఆర్టీసీ సమ్మెకు సింగరేణి కార్మికుల మద్దతు
సాక్షి, మందమర్రిరూరల్(చెన్నూర్) : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సింగరేణి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. జేఏసీ నాయకులు శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కార్మికులను అణచివేస్తు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల్లో ఐక్యతను దెబ్బతీసే విధంగా సింగరేణి మెకానిక్ కార్మికులను ఆర్టీసీలో విధుల నిర్వహణ కోసం పురమాయించడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వెంకన్న, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాద్యక్షుడు సమ్మయ్య, సీఐటీ యూ నాయకులు వెంకటస్వామి, హెచ్ఎంఎస్ నాయకులు సుదర్శన్, ఐఎఫ్టీయూ నాయకులు జాఫర్, టీఎస్‌యూఎస్ నాయకులు రాజిరె డ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: బస్‌భవన్ ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాలో కార్మికులు యధావిధిగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కార్మికులు డిపోల ఎదుట మౌన దీక్ష చేయనున్నారు. అదే విధంగా బీజేపీ అధ్వర్యంలో బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఖమ్మం మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి.. మున్సిపల్ కార్యాలయం నుంచి డిపో వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మద్దతు పలుకుతుందని జీ దామోదర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు బర్తరఫ్ అయినట్లుగా ప్రకటించి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో 672 బస్సులు, 2890 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొన్నడం వల్ల ఇప్పటి వరకు రూ. 7 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌కు దాస్‌నగర్ గ్రామశివారులో ఫిట్స్ రావడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. శుక్రవారం కోరుట్ల డిపోకు చెందిన (టీఎస్ 02 జెడ్ 0283) బస్సు సాయంత్రం 7.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరింది. ఇందులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్దకు రాగానే బస్‌డ్రైవర్ ప్రసాద్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పొలాల్లో బస్సు నిలిచిపోయింది. డ్రైవర్ ప్రసాద్‌కు కొద్దిపాటి గాయాలు అయ్యాయి. బస్సు పొలాల్లోకి వెళ్లగానే ప్రయాణికులు ఆందోళన చెంది కేకలు వేశారు. ఓవైపు చీకటి పడింది. అత్యవసర డోర్ ద్వారా 25 మంది బస్సునుంచి బయటకు వచ్చారు. మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించి వారిని మరో బస్సు కోరుట్లకు తరలించారు. డ్రైవర్‌ను జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌గా ప్రసాద్ కోరుట్ల డిపోలో ఐదు రోజుల చేరాడు. ఆర్టీసీ అధికారులు హడావుడిగా అనుభవం, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా తాత్కాలిక డ్రైవర్లను నియమించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పార్టీల అండ
-
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. వరుసగా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు తావులేకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు.. సమ్మెపై ఎక్కడా తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరింత వాడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావించిన జేఏసీ.. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జేఏసీ నేతలు.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారని, ఈ మేరకు పీసీసీ తరఫున పిలుపునిస్తామని చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని పలువురు ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిశారు. లక్ష్మణ్ స్పందిస్తూ ఆర్టీసీ సమ్మెను తమ భుజాలపై ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్సు డిపోల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిని పంపుతామని లక్ష్మణ్ తెలిపారు. నేడు మౌనదీక్షలు.. ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్ర తరం చేయనున్నారు. ప్రతిరోజు ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. శనివారం గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టనున్నారు. తాలూకా కేంద్రాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు సమర్పించనుంది. శుక్రవారం కరీంనగర్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలసిన పలువురు వినతులు ఇచ్చే క్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీల జోరు.. నినాదాల హోరు! ఆర్టీసీ కార్మికుల 7వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, జిల్లా కేంద్రా ల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. జేఏసీ నేతలు తమ డిమాండ్లను పేర్కొంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాచోట్ల రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మెజార్టీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రయాణికుల తాకిడికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నా అనుభవజ్ఞులైన డ్రైవర్లు దొరకట్లేదు. -
ఆర్టీసీలో కొత్త కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె చేస్తున్న కార్మికుల సెల్ఫ్ డిస్మిస్‌తో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి యాజమాన్యం చర్యలు వేగిరం చేస్తోంది. పక్షం రోజుల్లోగా ఆర్టీసీని పూర్వ స్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. 7 రోజులుగా సమ్మె కొనసాగుతుండగా.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు చేరని వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ గణాంకాలను ప్రాతిపదికన తీసుకున్న ఆర్టీసీ అధికారులు.. ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్ డిపోల పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు తదితర కేటగిరీల లెక్కలు తేల్చిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఆర్టీసీలో మూడు పద్ధతుల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిబ్బంది అవసరం ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచనాలు తయారు చేసిన అధికారులు ఏ విధంగా నియామకాలు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్తవిధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు ఇతర సిబ్బంది కలుపుకొంటే దాదాపు 25 వేల మంది వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన ఆర్టీసీ.. సీఎం కేసీఆర్‌కు సమర్పించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం కల్లా సీఎంవోలో సమర్పించాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తెలిసింది. టిమ్స్ ద్వారా టికెట్లు.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి టిమ్స్ ద్వారా టికెట్లు జారీ చేసే ప్రక్రియపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని, ప్రజా రవాణా సేవల్ని మరింత మెరుగు పరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విజిలెన్స్ స్ట్రెంత్‌ను పెంచడంతో పాటు బస్ సర్వీసులలో టిమ్స్ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ త్వరితంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ అధికారులకు ఆదేశించారు. ఆయా పాయింట్ల వద్ద సర్వీసులు చెక్ చేసేందుకు ఆర్టీవో అధికారుల సహకారం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం 5788 బస్సులు నడిపినట్లు తెలిపారు. ఇందులో 3,766 ఆర్టీసీ, 2,022 అద్దె బస్సులున్నాయన్నారు. 6 వేల ప్రైవేట్ వాహనాలను కూడా తిప్పినట్లు చెప్పారు.